AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

These AP 9th Biology Important Questions and Answers 1st Lesson కణ నిర్మాణం – విధులు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 1st Lesson Important Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాల ఆకారం?
జవాబు:
ఉల్లిపొరలో కణాల ఆకారం దీర్ఘచతురస్రాకారం.

ప్రశ్న 2.
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం?
జవాబు:
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం గుండ్రం.

ప్రశ్న 3.
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని?
జవాబు:
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని.

ప్రశ్న 4.
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం?
జవాబు:
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం హరితరేణువు.

ప్రశ్న 5.
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర?
జవాబు:
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర కణకవచము.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 6.
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు?
జవాబు:
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు పత్రాలు, లేత కాండాలు.

ప్రశ్న 7.
ప్లాస్మాపొర దేనితో నిర్మితమయినది?
జవాబు:
ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమయినది.

ప్రశ్న 8.
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది?
జవాబు:
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది ప్లాస్మాపొర.

ప్రశ్న 9.
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది?
జవాబు:
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది ప్లాస్నాపొర లేదా కణత్వచం.

ప్రశ్న 10.
ప్లాస్మాపొర యొక్క ప్రత్యేక లక్షణం?
జవాబు:
అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయకపోవడం.

ప్రశ్న 11.
ప్లాస్మాపొరని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారు?
జవాబు:
కొన్ని ప్రత్యేకమైన పదార్థాల వినిమయం మాత్రమే ప్లాస్మాపొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు.

ప్రశ్న 12.
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం?
జవాబు:
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం కణకవచం.

ప్రశ్న 13.
కణకవచం ఏ పదార్థంతో తయారవుతుంది?
జవాబు:
కణకవచం సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతుంది.

ప్రశ్న 14.
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది?
జవాబు:
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది కణకవచం.

ప్రశ్న 15.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలుగచేస్తుంది.

ప్రశ్న 16.
కేంద్రకాన్ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
జవాబు:
కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు.

ప్రశ్న 17.
కేంద్రకమునకు గల మరియొక పేరు?
జవాబు:
కేంద్రకమునకు గల మరియొక పేరు కణనియంత్రణ గది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 18.
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం?
జవాబు:
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం కేంద్రకం.

ప్రశ్న 19.
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ఫ్రీడన్ కేంద్రకమును ఏమని పిలిచాడు?
జవాబు:
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ప్లీడన్ కేంద్రకమును సైటోబ్లాస్ట్ అని పిలిచాడు.

ప్రశ్న 20.
కణంలో కేంద్రకం ఉందని జీవులు?
జవాబు:
కణంలో కేంద్రకం ఉండని జీవులు క్షీరదాల ఎర్రరక్త కణాలు మరియు పోషక కణజాలంలోని చాలనీ నాళాలు.

ప్రశ్న 21.
కేంద్రకం నిర్వహించు విధులు?
జవాబు:
కణ విధులన్నింటిని నియంత్రించడం, జన్యు సమాచారం కలిగి, జీవుల లక్షణాలను నిర్ధారించడం, కణవిభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 22.
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు?
జవాబు:
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు కేంద్రక త్వచం.

ప్రశ్న 23.
కేంద్రక త్వచం ఆధారంగా కణములు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కేంద్రక త్వచం ఆధారంగా కణాలు రెండు రకాలు. అవి – కేంద్రకపూర్వకణం మరియు నిజకేంద్రక కణం.

ప్రశ్న 24.
కేంద్రక పూర్వకణాలు అనగానేమి?
జవాబు:
కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వకణాలు అంటారు.
ఉదా : బాక్టీరియా, సయానోబాక్టీరియా

ప్రశ్న 25.
కణద్రవ్యము అనగానేమి?
జవాబు:
కణద్రవ్యము అనగా ప్లాస్మా పొరచే ఆవరించియున్న జిగురు పదార్థము.

ప్రశ్న 26.
కేంద్రకంలోని పదార్ధమును ఏమంటారు?
జవాబు:
కేంద్రకంలోని పదార్ధమును కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అంటారు.

ప్రశ్న 27.
కణంలోని ముఖ్యమైన కణాంగాలేవి?
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు :
అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టి సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు మరియు రిక్తికలు కణంలోని ముఖ్య కణాంగాలు.

ప్రశ్న 28.
అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగమేమి?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలము ద్వారా కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి ప్రోటీన్లు మరియు కొన్ని పదార్థాల రవాణా జరుగుతుంది మరియు కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 29.
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను రైబోజోములు అంటారు.

ప్రశ్న 30.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలంను గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు.

ప్రశ్న 31.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము.

ప్రశ్న 32.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగం?
జవాబు:
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 38.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగం?
జవాబు:
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల సంశ్లేషణ చేస్తుంది.

ప్రశ్న 34.
సకశేరుక కాలేయ కణాలలోని నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
జవాబు:
అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 35.
1898 వ సంవత్సరంలో కణము నందు గాల్టి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు?
జవాబు:
1898 వ సంవత్సరంలో కణము నందు గాలి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు కామిల్లో గాల్లి.

ప్రశ్న 36.
గాల్జిసంక్లిష్టం విధి ఏమిటి?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకొని కొంత మార్పు చెందిస్తాయి.

ప్రశ్న 37.
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలు.

ప్రశ్న 38.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులు అని ఎందుకు అంటారు?
జవాబు:
వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్స్ కు రవాణా చేయబడతాయి. లైసోజోమ్స్ పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై వాటిని నాశనం చేస్తాయి. అందువలన లైసోజోమ్ లను స్వయం విచ్చిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 39.
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుదు కనబడే కణాంగం?
జవాబు:
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుడు కనబడే కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 40.
మైటోకాండ్రియా పొడవు, వ్యాసం ఎంత ఉంటాయి?
జవాబు:
మైటోకాండ్రియా పొడవు 2-8 మైక్రాన్లు మరియు 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి.

ప్రశ్న 41.
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం?
జవాబు:
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం మైటోకాండ్రియా.

ప్రశ్న 42.
ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియాల సంఖ్య?
జవాబు:
ప్రతి కణంలో 100-150 మైటోకాండ్రియాలు ఉంటాయి.

ప్రశ్న 43.
క్రిస్టే అనగానేమి?
జవాబు:
మైటోకాండ్రియా అంతరత్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను క్రిస్టే అంటారు.

ప్రశ్న 44.
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు?
జవాబు:
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు.

ప్రశ్న 45.
మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
కణానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ‘కణ శక్త్యాగారాలు’ అంటారు.

ప్రశ్న 46.
హరితరేణువులు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
పత్రహరితం ఉండుట వలన హరితరేణువులు ఆకుపచ్చగా ఉంటాయి.

ప్రశ్న 47.
ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ప్లాస్టిడ్లు రెండు రకాలు. అవి : 1. క్రోమోప్లాన్లు మరియు 2. ల్యూకోప్లాస్టు

ప్రశ్న 48.
మొక్కలలో హరితరేణువుల వ్యాసం ఎంత?
జవాబు:
మొక్కలలో హరితరేణువుల వ్యాసం 4-10 మైక్రాన్లు.

ప్రశ్న 49.
క్లోరోప్లాస్ట్ ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా క్లోరోప్లాస్ట్ మార్చుతుంది.

ప్రశ్న 50.
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాన్ల సంఖ్య?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట సంఖ్య 50-200.

ప్రశ్న 51.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
జవాబు:
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాధియస్ జాకబ్ ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్.

ప్రశ్న 52.
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు?
జవాబు:
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు రోడాల్ఫ్ విర్కో

ప్రశ్న 53.
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు?
జవాబు:
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు :
1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
2. కణాలన్నీ ముందుతరం కణాల నుండి ఏర్పడతాయి.

ప్రశ్న 54.
కణవ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు?
జవాబు:
జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైనది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.

ప్రశ్న 55.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థీకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది?
జవాబు:
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 56.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి. కనుక అతిపెద్ద జీవి సక్రమముగా విధులను నిర్వహించుటకు కారణము ఆ జీవిలోని అతిచిన్న కణములు సక్రమముగా విధులు నిర్వహించడమే.

ప్రశ్న 57.
మొక్క కణము నందు ఉండే హరితరేణువు యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువు లేకపోతే మొక్క ఆకులలో ఆహారము తయారు కాదు. తద్వారా సమస్త జీవులకు ఆహారం లభ్యమయ్యేది కాదు.

ప్రశ్న 58.
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న భావననను నీకు ఏ విధంగా అన్వయించుకుంటావు?
జవాబు:
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడడం వలనే పెరుగుదల, అభివృద్ధి జరుగుతుంది.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 59.
రంగు రంగుల పండ్లు, పూలకు కారణము ఏమిటి?
జవాబు:
రంగు రంగుల పండ్లు, పూలకు మొక్కలలో మాత్రమే ఉండు క్రోమోప్లాస్టులు కారణం.

ప్రశ్న 60.
కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే ఏమి జరుగును?
జవాబు:
వ్యర్థ పదార్థములు కణమునందు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే తద్వారా కణము తన విధిని సక్రమముగా నిర్వహించలేదు.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
టమాటాలో కింది రంగు మారడానికి కారణము ఏమనుకుంటున్నారు?
పచ్చని రంగు – తెలుపు – పసుపు – ఎరుపు
జవాబు:

  1. టమాటా నందు రంగు మారటానికి ప్లాస్టిడ్లు కారణం.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకాలు. అవి : 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగు గల క్రోమోప్లాస్టులు.
  4. క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు ఒక రంగు నుండి మరియొక రంగునకు మారగల శక్తి కలిగి ఉంటాయి.
  5. లేత టమాటా పరిపక్వం చెందే క్రమంలో మనము ఆకుపచ్చ, తెలుపు, పసుపుపచ్చ మరియు ఎరుపురంగు గల టమాటాలను చూస్తాము.

ప్రశ్న 2.
సూక్ష్మదర్శిని సహాయముతో కింద ఇవ్వబడిన సైడులను పరిశీలించి బొమ్మలు గీయండి. వాటిలో గల వివిధ కణాంగములను రాయండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1
A) పారమీసియమ్ నందుగల కణాంగములు :
పూర్వ మరియు పర సంకోచ రిక్తికలు, సూక్ష్మ కేంద్రకము, స్థూలకేంద్రకము, సైటోసోమ్, సైటో పైజ్, ఆహారరిక్తిక మొదలగునవి.

B) అమీబాలోని కణాంగములు :
కేంద్రకము, సంకోచరిక్తికలు, ఆహారరిక్తికలు.

C) యూగ్లీనాలోని కణాంగములు :
కేంద్రకము, క్లోరోప్లాస్టులు, సంకోచరిక్తికలు, రిజర్వాయర్, పారప్లాజెల్లార్ దేహము, ఎండోసోమ్ మొదలగునవి.

ప్రశ్న 3.
నమూనా వృక్ష కణం పటము గీచి, భాగములను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

ప్రశ్న 4.
రైబోజోమ్స్ గురించి రాయండి.
జవాబు:

  1. కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అంటారు.
  2. ఇవి ఆర్.ఎన్.ఎ. మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి.
  3. ఇవి రెండు రకాలు. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి.
  4. రైబోజోములలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కణజీవశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తల చిత్రములను సేకరించుము. వారిని గురించి సంక్షిప్తముగా వివరింపుము.
జవాబు:
1) ఆ వాన్ లీవెన్‌హక్ 2) రాబర్ట్ హుక్ 3) రాబర్ట్ బ్రౌన్ 4) రుడాల్ఫ్ విర్కొన్ 5) బ్లేడన్ 6) ష్వాన్ 7) ఎర్నెస్ట్ రుస్కా 8) వాట్సన్ మరియు క్రిక్ 9) లిన్ మారులిస్ 10) ఆల్బర్ట్ క్లాడె
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

  1. 1632-1723. ఆస్టవాన్ లీవెన్‌హక్ సాధారణ సూక్ష్మదర్శినిని నిర్మించి దాని సహాయముతో నీటిలో ఉండే ప్రోటోజోవా, వర్టిసెల్లా మరియు నోటిలో ఉండే బాక్టీరియా బొమ్మలను గీచెను.
  2. 1665-ప్రాథమిక సంయుక్త సూక్ష్మదర్శినిని ఉపయోగించి బెండు ముక్కనందు సజీవ మొక్క కణజాలమునందలి కణములను కనుగొనెను.
  3. 1831-రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును కనుగొనెను.
  4. 1838-39-థియొడర్ ష్వాన్ మరియు M.J. ఫ్రీడన్ కణసిద్ధాంతమును ప్రతిపాదించిరి.
  5. 1885 రుడాల్స్ విర్కొవ్ కణవిభజనను కనుగొనెను.
  6. 1931-ఎర్నెస్ రుస్కా మొట్టమొదటి ఎలక్ట్రాను మైక్రోస్కోపును నిర్మించెను.
  7. 1953-వాట్సన్ మరియు క్రిస్టు DNA ద్వికుండలి నిర్మాణమును ప్రకటించెను.
  8. 1974-కణజీవశాస్త్ర పితామహుడైన ఆల్బర్ట్ క్లాడెనకు శరీర ధర్మశాస్త్రము (మెడిసిన్) నందు నోబెల్ బహుమతి వచ్చినది.
  9. 1981- కణపరిణామము నందు ఎండోసింబయాటిక్ సిద్ధాంతమును లిన్ మారులిస్ ప్రచురించెను.

ప్రశ్న 2.
ప్లాస్టిడ్ల గురించి రాయండి.
జవాబు:

  1. ప్లాస్టిడ్లు మొక్క కణములలో మాత్రమే ఉంటాయి.
  2. ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకములు. 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) మరియు 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
  3. హరిత రేణువులు (క్లోరోప్లాస్టులు) ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు.
  4. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా మార్చడమే క్లోరోప్లాస్టుల ముఖ్య విధి
  5. క్రోమోప్లాస్టులు రకరకాల పూలు మరియు పండ్ల రంగులకు కారణము.
  6. ల్యూకోప్లాస్టులు పిండిపదార్థాలను, నూనెలను మరియు ప్రోటీనులను నిల్వ చేస్తాయి.

ప్రశ్న 3.
అంతర్జీవ ద్రవ్యజాలము గురించి వివరించండి.
జవాబు:

  1. కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణము అంతర్జీవ ద్రవ్యజాలము.
  2. దీని ద్వారా కణములో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది.
  3. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకములు.
    1) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం 2) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం.
  4. రైబోజోములు కలిగిన గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీనుల సంశ్లేషణకు సహాయపడుతుంది.
  5. రైబోజోములు లేని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది.
  6. కణంలో జరిగే కొన్ని జీవ రసాయన చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది.

ప్రశ్న 4.
ప్లాస్మాపొరకు, కణత్వచమునకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:

ప్లాస్మా పొరకణత్వచము
1. ప్రోటీనులు మరియు లిపితో తయారయినది.1. సెల్యులోజ్ తో తయారయినది.
2. సజీవమైనది.2. నిర్జీవమైనది.
3. మొక్క మరియు జంతు కణములలో ఉండును.3. కేవలం మొక్క కణములలో ఉంటుంది.
4. విచక్షణ త్వచంగా పనిచేస్తుంది.4. విచక్షణ త్వచంగా పనిచేయదు.

5. ఈ క్రింది పటములు గీచి, భాగములను గుర్తించండి.
1) కేంద్రకం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
2) అంతర్జీవ ద్రవ్యజాలం :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
3) మైటోకాండ్రియా :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
4) హరితరేణువు :
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Important Questions and Answers

ప్రశ్న 1.
నిజకేంద్రక కణాలలో మైటోకాండ్రియా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కణంలో జరిగే జీవక్రియలకు కావలసిన శక్తి విడుదల జరగదు. అందువల్ల జీవక్రియలు ఆగిపోతాయి కణం మరణిస్తుంది.

ప్రశ్న 2.
జీవపదార్థం, కణ ద్రవ్యముల మధ్య భేదం ఏమిటి?
జవాబు:
చాలాకాలం వరకు కణంలో ఉండే ద్రవ్యం జీవాన్ని కలిగి ఉంటుందని నమ్మేవారు తరువాత జీవపదార్థం అనేది ఒక మాధ్యమం అని దానిలో కణాంగాలు, రేణువులు ఉంటాయని కనుగొన్నారు.

కేంద్రకత్వచం బయట ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యం అని, కేంద్రకంలోని జీవపదార్థాన్ని కేంద్రక రసం లేక ద్రవ్యమని అంటున్నారు.

ప్రశ్న 3.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
ఎ) పై పటంను గుర్తించి భాగమలు రాయుము.
బి) పై పటంను గురించి క్లుప్తంగా వివరించుము.
జవాబు:
ఎ) 1) మాత్రిక,
2) క్రిస్టే,
3) లోపలిపొర,
4) బయటి పొర

బి) 1) పై పటం చూపబడిన కణాంగము మైటోకాండ్రియా
2) ఇది కణశ్వాసక్రియలోను నిర్వహించి శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
3) వీటిని కణశక్యాగారాలు అంటారు.
4) ఇది వెలుపలి త్వచం మరియు లోపలి త్వచయులచే కప్పబడి ఉంటుంది. లోపల అనేక ముడుతలతో కూడిన నిర్మాణం ఉంటుంది. దీనిని మాత్రిక అంటారు. మాత్రికలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రిస్టే అంటారు.

ప్రశ్న 4.
కింది కణాంగాలు నిర్వహించే విధులు రాయండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10
జవాబు:

  1. మైటోకాండ్రియా – కణ శ్వాసక్రియలో పాల్గొంటుంది. శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
  2. హరితరేణువు – సూర్యకాంతిని గ్రహించి కిరణజన్యసంయోగక్రియ జరిపి మొక్కలలో ఆహారాన్ని తయారుచేస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. కణములను ప్రథమముగా దీనితో పరిశీలిస్తారు.
A) ఆప్టికల్ మైక్రోస్కోపు
B) సంయుక్త సూక్ష్మదర్శిని
C) ఎలక్ట్రాను మైక్రోస్కోపు
D) ఏదీకాదు
జవాబు:
A) ఆప్టికల్ మైక్రోస్కోపు

2. జంతుకణము వెలుపల ఉన్న పొర
A) కణకవచము
B) కణత్వచం
C) కేంద్రకత్వచము
D) కేంద్రకాంశత్వచము
జవాబు:
B) కణత్వచం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

3. ప్లాస్మాపొర లేదా కణత్వచం దేనితో నిర్మితమైంది?
A) లిపిడ్లు
B) ప్రోటీనులు
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు
D) సెల్యులోజ్
జవాబు:
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు

4. విచక్షణ త్వచంను గుర్తించండి.
A) కణకవచము
B) కణత్వచము
C) టోనోప్లాస్ట్
D) కేంద్రక త్వచము
జవాబు:
B) కణత్వచము

5. కణకవచము వీటిలో ఉంటుంది.
A) జంతువులు
B) మనుష్యులు
C) మొక్కలు
D) జంతుప్లవకాలు
జవాబు:
C) మొక్కలు

6. న్యూక్లియసను కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కొవ్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

7. కణము నియంత్రణ గదిగా పనిచేయునది
A) కణత్వచము
B) కేంద్రకము
C) మైటోకాండ్రియా
D) కేంద్రకాంశము
జవాబు:
B) కేంద్రకము

8. కణములో ఈ భాగము జన్యుసమాచారము కలిగి ఉంటుంది.
A) కేంద్రకము
B) కేంద్రకాంశము
C) రైబోజోములు
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) కేంద్రకము

9. కేంద్రక పూర్వ కణమును గుర్తించుము.
A) బాక్టీరియమ్
B) సయానో బాక్టీరియా
C) పారమీసియమ్
D) బాక్టీరియమ్ మరియు సయానో బాక్టీరియా
జవాబు:
A) బాక్టీరియమ్

10. కణాంతర రవాణాలో పాల్గొనునది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టము
D) రైబోజోములు
జవాబు:
A) అంతర్జీవ ద్రవ్యజాలం

11. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) లిపిడ్లు
C) పిండిపదార్థములు
D) విటమినులు
జవాబు:
B) లిపిడ్లు

12. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) పిండిపదార్థాలు
C) లిపిడ్లు
D) విటమినులు
జవాబు:
C) లిపిడ్లు

13. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగము
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
B) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము
C) లైసోజోములు
D) రిక్తికలు
జవాబు:
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము

14. స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు.
A) లైసోజోములు
B) రైబోజోములు
C) న్యూక్లియోజోమ్
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) లైసోజోములు

15. ప్రతి కణమునందు ఉండు మైటోకాండ్రియాల సంఖ్య
A) 100 – 200
B) 150 – 300
C) 100 – 150
D) 100 – 300
జవాబు:
C) 100 – 150

16. కణ శక్త్యాగారాలు అని వీటిని అంటారు.
A) లెసోజోములు
B) మెటోకాండియా
C) రైబోజోములు
D) రిక్తికలు
జవాబు:
B) మెటోకాండియా

17. క్లోరోప్లాస్టులు పాల్గొను జీవక్రియ
A) శ్వాసక్రియ
B) కిరణజన్య సంయోగక్రియ
C) పోషణ
D) రవాణా
జవాబు:
B) కిరణజన్య సంయోగక్రియ

18. కణసిద్ధాంతమును ప్రతిపాదించినవారు
A) ప్లీడన్
B) ష్వాన్
C) ప్లీడన్ మరియు ష్వాన్
D) రుడాల్ఫ్ విర్కొవ్
జవాబు:
C) ప్లీడన్ మరియు ష్వాన్

19. కణవిభజనను మొదటగా గుర్తించినవాడు
A) రుడాల్ఫ్ విర్కొవ్
B) రాబర్ట్ హుక్
C) హూగో డివైస్
D) రాబర్ట్ బ్రౌన్
జవాబు:
A) రుడాల్ఫ్ విర్కొవ్

20. కేంద్రకము లోపల ఉన్న ద్రవపదార్ధము
A) కేంద్రకాంశ పదార్థము
B) కణద్రవ్యము
C) జీవపదార్ధము
D) జర్మ్ ప్లాన్స్
జవాబు:
A) కేంద్రకాంశ పదార్థము

21. జంతు కణంలో కనిపించే కణాంగం
A) హరితరేణువులు
B) రిక్తికలు
C) కణకవచం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

22. కణం యొక్క సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహించునది
A) కణకవచం
B) ప్లాస్మాపొర
C) కణద్రవ్యం
D) కేంద్రకం
జవాబు:
B) ప్లాస్మాపొర

23. ప్లాస్మాపొర ద్వారా
A) అన్ని పదార్థాల ప్రసరణ జరుగుతుంది.
B) ద్రవ పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
D) గ్లూకోజ్ ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
జవాబు:
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.

24. ప్లాస్మాపొర ………..
A) ఒక విచక్షణా త్వచం
B) భేదక పారగమ్య త్వచం
C) పారగమ్య త్వచం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

25. కణకవచం కల్గించే పీడనం
A) బాహ్యపీడనం
B) అంతరపీడనం
C) స్ఫీతపీడనం
D) పైవేవీ కావు
జవాబు:
B) అంతరపీడనం

26. కేంద్రకాన్ని కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) ప్లీడన్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్

27. ప్లీషన్ కేంద్రకానికి ఈ విధంగా పేరు పెట్టాడు.
A) సైటోబ్లాస్ట్
B) ఫైటోబ్లాస్ట్
C) క్లోరోప్లాస్ట్
D) న్యూక్లియోబ్లాస్ట్
జవాబు:
A) సైటోబ్లాస్ట్

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

28. అభివృద్ధి చెందిన ఈ కణాలలో కేంద్రకం ఉండదు.
A) చాలనీకణాలు
B) చాలనీనాళాలు
C) సహకణాలు
D) తంతువులు
జవాబు:
B) చాలనీనాళాలు

29. క్షీరదాలలో ఈ కణాలలో కేంద్రకం కనిపించదు.
A) కండరకణం
B) నాడీకణం
C) తెల్లరక్త కణం
D) ఎర్రరక్త కణం
జవాబు:
D) ఎర్రరక్త కణం

30. కణాలను దేనిని ఆధారం చేసుకుని విభజించారు?
A) కణకవచం
B) కణత్వచం
C) కేంద్రకత్వచం
D) మైటోకాండ్రియా
జవాబు:
C) కేంద్రకత్వచం

31. ఈ క్రింది వానిలో కేంద్రక పూర్వ కణం
A) రక్తకణం
B) బాక్టీరియాకణం
C) సయానోబాక్టీరియా
D) B & C
జవాబు:
D) B & C

32. కేంద్రక పూర్వ కణంలో
A) కేంద్రకం ఉండదు
B) కేంద్రకత్వచం ఉండదు
C) త్వచం కల్గిన కణాంగాలుండవు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. రైబోజోమ్ లు ఎక్కడ ఉంటాయి?
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) మైటోకాండ్రియా
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం

34. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లను సంశ్లేషణం చేస్తుంది.
C) అంతర్జీవ ద్రవ్యజాలం రవాణా మార్గంగా పనిచేస్తుంది.
D) సకశేరుకాల కాలేయ కణాల నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.

35. ఈ క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టానికి సంబంధించిన అసత్య వాక్యం
A) 1898వ సం||లో కెమిల్లో గాల్టీ గాల్టీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు.
B) ఈ కణాంగాలు త్వచాలతో నిర్మితమవుతాయి.
C) పదార్థాలను రవాణా చేసేముందు తమలో నిల్వ చేసుకుంటాయి.
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
జవాబు:
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

36. ఈ క్రింది వానిలో రెండు త్వచాలు కల్గిన కణాంగం
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) మైటోకాండ్రియా
D) లైసోజోమ్ లు
జవాబు:
C) మైటోకాండ్రియా

37. ఈ క్రింది వానిలో త్వచం లేని కణాంగం
A) రైబోజోమ్ లు
B) లైసోజోమ్ లు
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) గాల్జీ సంక్లిష్టం
జవాబు:
A) రైబోజోమ్ లు

38. ఈ క్రింది వానిలో DNAను కల్గి ఉండునది
A) కేంద్రకం
B) హరితరేణువులు
C) మైటోకాండ్రియా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

39. ఈ క్రింది వానిలో ఒకే త్వచం కల్గిన కణాంగం
A) లైసోజోమ్ లు
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

40. మైటోకాండ్రియాలో మధ్యగల ఖాళీ ప్రదేశాన్నేమంటారు?
A) కణాంతర ప్రదేశం
B) కణ మధ్య ప్రదేశం
C) క్రిస్టే
D) మాత్రిక
జవాబు:
D) మాత్రిక

41. రైబోజోములు వీటితో నిర్మించబడతాయి.
A) RNA మరియు ప్రోటీన్లు
B) DNA మరియు ప్రోటీన్లు
C) RNA మరియు DNA
D) ప్రోటీన్లు మరియు లిపిడ్లు
జవాబు:
A) RNA మరియు ప్రోటీన్లు

42. పూలల్లో ఇవి ఉంటాయి.
A) క్లోరోప్లాస్టు
B) ల్యూకోప్లాస్టు
C) క్రోమోప్లాన్లు
D) అల్యూరో ప్లాస్టు
జవాబు:
C) క్రోమోప్లాన్లు

49. ఈ క్రింది వానిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చేది
A) మైటోకాండ్రియా
B) హరితరేణువు
C) గాల్టీ సంక్లిష్టం
D) రైబోజోమ్ లు
జవాబు:
B) హరితరేణువు

44. కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో క్లోరోప్లాస్ట్‌ల సంఖ్య సుమారు
A) 50 – 100
B) 50 – 150
C) 50 – 200
D) 50 – 250
జవాబు:
C) 50 – 200

45. కణంలో కుడ్యపీడనాన్ని నియంత్రించి వ్యర్థాలను బయటకు పంపే నిర్మాణాలు
A) ప్లాస్టిడ్లు
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టం
D) రిక్తిక
జవాబు:
D) రిక్తిక

46. టోనోప్లాస్ట్ దీనిని కప్పి ఉంచే పొర.
A) కేంద్రకం
B) రైబోజోమ్ లు
C) రిక్తిక
D) మైటోకాండ్రియా
జవాబు:
C) రిక్తిక

47. కణాన్ని మొట్ట మొదటిసారిగా పరిశీలించినది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కోవ్
D) మార్సెల్లో మాల్ఫీజి
జవాబు:
A) రాబర్ట్ హుక్

48. దీనిని జీవుల యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణమంటారు.
A) కణజాలం
B) కణం
C) కండరం
D) ఎముక
జవాబు:
B) కణం

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

49. ఈ క్రింది ప్రవచనాలను చదవండి.
a) ప్లాస్టిర్లు వృక్షములలో మాత్రమే ఉంటాయి.
b) లైసోజోమ్స్ లో వినాశకరంకాని ఎంజైమ్స్ ఉంటాయి.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు b లు రెండూ అసత్యమే
జవాబు:
A) a మరియు b లు రెండూ సత్యమే

50. క్రింది ప్రవచనాలను చదవండి.
a) గరుకుతలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.
b) రాబర్ట్ బ్రౌన్ 1835లో కేంద్రకాన్ని కనుగొన్నాడు.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు bలు రెండూ అసత్యమే
జవాబు:
B) a సత్యము మరియు b అసత్యము

51. సరిగా జతపరచబడిన జతను కనుగొనండి.
a) పత్రరంధ్రాలు – వాయువుల మార్పిడి
b) ల్యూకోప్లాస్టు – పిండి పదార్థాల నిల్వ
c) గాల్జీ సంక్లిష్ట పదార్థం – ప్రొటీన్ల నిల్వ
A) a మరియు b
B) b మరియు c
C) a మాత్రమే
D) b మాత్రమే
జవాబు:
D) b మాత్రమే

52. క్రింది ప్రవచనాలను చదవండి.
a) కణ కవచము సెల్యులోజ్ తో నిర్మితమై, నిష్క్రియాత్మకంగా ఉంటుంది.
b) ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమై యుండి, క్రియాత్మకంగా ఉంటుంది.
A) a, bలు రెండూ సత్యమే
B) a, b లు రెండూ అసత్యము
C) a అసత్యము b సత్యము
D) b అసత్యము a సత్యము
జవాబు:
C) a అసత్యము b సత్యము

53. క్లోరోప్లాస్లు ఎక్కువగా కలిగిన మొక్కలు
A) ఆల్గే
B) ఫంగి
C) బాక్టీరియా
D) ఏదీకాదు
జవాబు:
A) ఆల్గే

54. రియోపత్రంలోని కణాల అమరిక
A) వృత్తాకారంగా
B) వరుసలలో
C) క్రమరహితంగా
D) లంబాకారంగా
జవాబు:
A) వృత్తాకారంగా

55. బుగ్గ కణాల మధ్య భాగంలో కనబడే భాగం
A) మైటోకాండ్రియా
B) గాల్టీ
C) కేంద్రకం
D) రైబోజోములు
జవాబు:
C) కేంద్రకం

56. బుగ్గ కణాలలో కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉపయోగించే రంజకము
A) సాఫనిన్
B) మిథైల్ బ్లూ
C) నల్ల రంజకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

57. మైటోకాండ్రియాను, సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించునపుడు ఉపయోగించే ద్రావణం
A) జానస్ గ్రీన్-బి
B) సాఫ్రనిన్
C) గ్లిజరిన్
D) మిథైల్ బ్లూ
జవాబు:
A) జానస్ గ్రీన్-బి

58. కేంద్రకాన్ని పరిశీలించడానికి మీ తరగతి గదిలో వాడేరంజకము
A) ఫినాఫ్తలీన్
B) మిథైల్ బ్లూ
C) ఆల్కహాల్
D) గ్లిజరిన్
జవాబు:
B) మిథైల్ బ్లూ

59. ఎర్ర రక్తకణాల జీవిత కాలం తక్కువగా ఉండటానికి గల కారణం
A) హిమోగ్లోబిన్ ఉండటం వలన
B) కేంద్రకం ఉండటం వలన
C) కేంద్రకం లేకపోవటం వలన
D) కేంద్రకాంశం ఉండటం వలన
D) పైవేవీ కావు
జవాబు:
C) కేంద్రకం లేకపోవటం వలన

60. వివిధ రకాల పదార్థాలు కణం యొక్క ఈ భాగంలో నిల్వ ఉంటాయి.
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) గాల్జీ సంక్లిష్టం
D) ప్లాస్టిట్లు
జవాబు:
C) గాల్జీ సంక్లిష్టం

61. శక్తిని ఉత్పత్తి చేసి, నిల్వచేసే కణాంగము
A) గాల్టీ సంక్లిష్టం
B) మైటోకాండ్రియా
C) కేంద్రకం
D) ప్లాస్టిడ్లు
జవాబు:
B) మైటోకాండ్రియా

62. టమోటాలలో రంగు మార్పులకు (ఆకుపచ్చ – తెలుపు – పసుపు – ఎరుపు) కారణమైనది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) ప్లాస్టిడ్లు
C) కేంద్రకము
D) కణత్వచము
జవాబు:
B) ప్లాస్టిడ్లు

63. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
a) మాథియస్ జాకబ్ ప్లీడన్
b) థియోడర్ ష్వాన్
c) రూడాల్ఫ్ విర్కోవ్
A) a మరియు b
B) b మరియు c
C) a మరియు c
D) a, b మరియు c
జవాబు:
A) a మరియు b

64. పటంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 11
A) హరితరేణువు
B) రంధ్రము
C) కేంద్రకము
D) రక్షక కణం
జవాబు:
D) రక్షక కణం

65. ఇచ్చిన చిత్రం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 12
A) జంతు కణం
B) వృక్ష కణం
C) హరితరేణువు
D) అంతర్జీవ ద్రవ్యజాలం
జవాబు:
A) జంతు కణం

66. పటంలో సూచించిన కణాంగము పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 13
A) మైటోకాండ్రియా
B) కేంద్రకం
C) గాల్టీ
D) హరితరేణువు
జవాబు:
D) హరితరేణువు

67. చిత్రంలో గుర్తించిన భాగం
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 14
A) కేంద్రకం
B) కేంద్రకాంశం
C) DNA
D) RNA
జవాబు:
B) కేంద్రకాంశం

68. పటంలో సూచించిన కణాంగం పేరు
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 15
A) హరితరేణువు
B) గాల్జీ సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

69. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 16
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
A) గాల్జీ సంక్లిష్టం

70. ఈ కణాంగాన్ని గుర్తించండి.
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 17
A) గాలీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
B) అంతర్జీవ ద్రవ్యజాలం

71. సరియైన క్రమంలో అమర్చండి.
A) కణజాలం – జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణములు
B) జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణజాలం – కణములు
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు
D) పైవేవీ కావు
జవాబు:
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

72. జీవులలో కణం ఒక
A) క్రియాత్మక ప్రమాణం
B) నిర్మాణాత్మక ప్రమాణం
C) స్వతంత్రంగా పనిచేసే నిర్మాణం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

73. నేను పత్రరంధ్రాలను అభినందిస్తాను. ఎందుకంటే అవి ఈ క్రియకు సహాయపడతాయి.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) బాష్పోత్సేకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

74. వృక్షాలలో కణకవచం యొక్క విధి
A) క్రియాత్మకంగా ఉంటుంది
B) రక్షిస్తుంది
C) పీడనాన్ని కలిగిస్తుంది.
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

75. శక్తిని విడుదల చేయు కణాంగం
A) లైసోజోమ్ లు
B) గాల్జి సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలకం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా

76. మైక్రోస్కోప్ ని ఉపయోగించి వృక్ష కణంలో రిక్తికను పరిశీలించాలంటే నీవు చేసే పనులు క్రమాన్ని గుర్తించండి.
1) గాజు స్లెడ్ పై వుంచుట
2) రసభరితమైన మొక్క కాండమును సేకరించుట
3) సజల సాఫ్టనిస్ ద్రావణంతో రంజనం చేయుట
4) సన్నని పొరలుగా చేయుట
A) 2, 4, 3, 1
B) 1, 2, 3, 4
C) 2, 3, 4, 1
D) 4, 3, 1, 2
జవాబు:
A) 2, 4, 3, 1

77. కింది వాటిలో ఏ కణాంగంపై, జీవులన్నీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆహారం కొరకు ఆధారపడుతాయి.
A) లైసోజోమ్స్
B) మైటోకాండ్రియా
C) రైబోజోమ్స్
D) హరితరేణువులు
జవాబు:
D) హరితరేణువులు

78. క్రింది వానిలో తప్పును గుర్తించండి.
i) ప్రతికణం అదే కణం నుంచి ఏర్పడును.
ii) రిక్తికలు కణశక్త్యాగారాలు
iii) కేంద్రక పూర్వక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది.
A) i, ii
B) ii, iii
C) i, ii, iii
D) i, iii
జవాబు:
B) ii, iii

79. స్వయంపోషకాల విషయంలో సరియైనది
A) సూర్యకాంతిని ఉపయోగించి యాంత్రిక శక్తిని పొందుతాయి
B) ఇతర జీవులలోని గ్లెకోజనను పోషకంగా తీసుకుంటాయి
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి
D) అన్నీ సరైనవే
జవాబు:
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి

AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు

80. మైటోకాండ్రియా పరిశీలనకు వాడే రంజకం పేరు
A) సఫ్రానిన్
B) జానస్ గ్రీన్-బి
C) జానస్ గ్రీన్-ఎ
D) క్రిస్టల్ వైలెట్
జవాబు:
B) జానస్ గ్రీన్-బి

మీకు తెలుసా?

కణాలలో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో 50-200 క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి.

పునరాలోచన
AP 9th Class Biology Important Questions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

These AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 10th lesson Important Questions and Answers సహజ వనరులు

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
మృత్తికక్షయాన్ని అరికట్టుటకు మీరు ఇచ్చే ఏవైనా రెండు సలహాలను రాయండి.
జవాబు:

  1. అడవులను పెంచటం
  2. చెక్ డ్యామ్ లు నిర్మించటం
  3. ఖాళీ నేలలో గడ్డి పెంచటం మొదలైన వాటి వలన క్రమక్షయం నివారించవచ్చు.

ప్రశ్న 2.
మీ ప్రాంతములో “నీటి సంరక్షణ” పై చైతన్యము కల్గించడానికి ఏ నినాదమును సూచిస్తావు?
జవాబు:

  1. నీటిని పొదుపుగా వాడాలి
  2. నీటిని వృథా చేయవద్దు
  3. జలమే జీవం

ప్రశ్న 3.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1గుర్తు దేనిని సూచిస్తుంది? దాని అర్థం ఏమిటి?
జవాబు:
పటంలోని గుర్తు పునఃవినియోగాన్ని సూచిస్తుంది. ఇది వాడిన వస్తువులను తిరిగి వాడటం గురించి తెలుపుతుంది.

ప్రశ్న 4.
అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. వన్యజీవుల ఆవాసాల విధ్వంసం జరుగును.
  2. నేల క్రమక్షయం జరుగును.
  3. గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదల చేత భూతాపము పెరుగుతుంది.
  4. అడవులపై ఆధారపడి నివసించేవారు జీవనోపాధి కోల్పోతారు.
  5. అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే వర్షపాతం తగ్గుతుంది.

ప్రశ్న 5.
విద్యుత్ పొదుపుకు మీరు చేస్తున్న రెండు పనులను రాయండి.
జవాబు:

  1. విద్యుత్ దీపాలు, పరికరాలు, ఫ్యాన్స్ వాడనప్పుడు స్వి ను ఆపివేయవలెను.
  2. విద్యుత్ను ఆదా చేసే పరికరాలైన LEDS మరియు CFL బలను ఉపయోగించవలెను.
  3. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి మరియు పవనశక్తిని ఉపయోగించాలి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 6.
సహజవనరులను పునరుద్ధరించడానికి మీరు ఏఏ చర్యలు తీసుకొంటారు?
జవాబు:

  1. ప్రజలు నీటిని సంరక్షించుకునే విధంగా ప్రేరేపించాలి.
  2. నీటిని వీలైనంత వరకు సృధా చేయకూడదు.
  3. ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలి
  4. నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.
  5. వీలైనంత వరకు నీటిని పునర్వినియోగించుకునేటట్లు చేయూలి.

ప్రశ్న 7.
తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన ఏవైనా రెండు విధానాలు రాయుము.
జవాబు:

  1. ఇంకుడు గుంతలు త్రవ్వుట,
  2. బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్స్ తో సూక్ష్మ నీటిపారుదల పద్ధతి.

ప్రశ్న 8.
మన రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన “వనం-మనం” అను కార్యక్రమమును ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఏవైనా రెండు నినాదాలు తయారుచేయండి.
(లేదా)
మీ పాఠశాల ర్యాలిలో ప్రదర్శించడానికి “వనం-మనం” కార్యక్రమం గురించి కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. మొక్కలు నాటుదాము – స్వచ్ఛమైన గాలిని పొందుదాము.
  2. మొక్కలు పెంచు – కాలుష్యం తగ్గించు.
  3. మొక్కలు పెంచుదాము – భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిద్దాము.
  4. చెట్లను నరికితే – జీవుల ప్రాణం తీసినట్లే.
  5. వృక్షోరక్షతి రక్షితః
  6. చెట్లను పెంచుదాం దండిగా – పరిసరాలను ఉంచుదాం పచ్చగా.

ప్రశ్న 9.
“పునరుద్దరింపబడని వనరుల సంరక్షణ” పై రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. జీవ ఇంధనాలను వాడదాం – శిలాజ ఇంధనాలను తగ్గిదాం.
  2. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడదాం – పర్యావరణాన్ని కాపాడదాం.

ప్రశ్న 10.
అడవులను ఎందుకు సంరక్షించుకోవాలో రెండు కారణాలు తెల్పండి.
జవాబు:
అడవులను సంరక్షించుకోవటానికి గల కారణాలు :

  1. అడవులు వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సెడ్ ను గ్రహించి భౌగోళిక వెచ్చదనాన్ని తగ్గిస్తాయి.
  2. అడవుల నుండి విలువైన వనరులు అనగా ఔషధాలు, కలప, లక్క తేనె మొదలైన వాటిని పొందుతున్నాము.
  3. అడవులు వర్షాలుపడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 11.
పునరుద్దరింపలేని వనరులకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
1. బొగ్గు 2. పెట్రోల్ 3. సహజ వాయువు 4. ఆయిల్ (నూనె)

ప్రశ్న 12.
శిలాజ ఇంధనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి?
జవాబు:
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల క్రిందట భూగర్భంలో పాతుకుపోయిన వృక్ష, జంతు కళేబరాల నుండి ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 13.
వనరులు అనగానేమి?
జవాబు:
అధిక మోతాదులో లభిస్తూ, భవిష్యత్ లో వాడకానికి వీలుగా ఉన్న పదార్థాలను “వనరులు” అంటారు.

ప్రశ్న 14.
సహజ వనరులు అనగానేమి?
జవాబు:
సహజ వనరులు :
పకృతిలో సహజంగా లభించే వనరులను సహజ వనరులు అంటారు.
ఉదా : గాలి, నీరు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 15.
సహజ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సహజ వనరులు రెండు రకాలు

  1. పునరుద్ధరింపబడేవి
  2. పునరుద్ధరింపబడనివి.

ప్రశ్న 16.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాల అవసరాలు తీర్చుతుంది?
జవాబు:
కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లావాసుల అవసరాలను శ్రీరాం సాగర్ ప్రాజెక్టు తీర్చుతుంది.

ప్రశ్న 17.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎంత?
జవాబు:
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.66. టి.ఎమ్.సి.లు.

ప్రశ్న 18.
ఇంకుడు చెరువు అనగానేమి?
జవాబు:
ఇంకుడు చెరువు :
నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను “ఇంకుడు చెరువులు” (Percolation tanks) అంటారు.

ప్రశ్న 19.
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఎక్కడ ఉంది?
జవాబు:
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని సికింద్రాబాద్ లో ఉంది.

ప్రశ్న 20.
మైక్రో ఇరిగేషన్ అనగానేమి?
జవాబు:
మైక్రో ఇరిగేషన్ :
డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో, తక్కువ నీటితో వ్యవసాయం చేసే పద్ధతిని “మైక్రో ఇరిగేషన్” అంటారు.

ప్రశ్న 21.
నేల వనరు సద్వినియోగానికి ఉపయోగపడే రైతు ఆధారిత విధానాలు ఏమిటి?
జవాబు:
వెడల్పు చాళ్లు తియ్యడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలు పెంచడం, కాంటూర్ సేద్యం చేయటం వంటి పద్ధతుల ద్వారా నేలను సద్వినియోగం చేయవచ్చు.

ప్రశ్న 22.
నేలలో నైట్రోజన్ నిల్వలు ఎలా పెంచవచ్చు?
జవాబు:
గట్ల మీద గెరిసీడియా మొక్కలను, లెగ్యుమినేసి పంటలను పండించటం వలన నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచవచ్చు.

ప్రశ్న 23.
‘సుస్థిరాభివృద్ధి’ అనగానేమి?
జవాబు:
సుస్థిరాభివృద్ధి :
అభివృద్ధికి, సంరక్షణకు రెండింటికి ప్రాధాన్యమిస్తూ భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా పర్యావరణాన్ని ఉపయోగించుకోవడాన్ని “సుస్థిరాభివృద్ధి” అంటారు.

ప్రశ్న 24.
సుస్థిర అటవీ పద్ధతులు కొన్ని తెలపండి.
జవాబు:
చెట్లు తక్కువగా నరకటం, చెట్లు తిరిగి ఎదగడానికి అవకాశం ఇవ్వటం, ఎత్తైన చెట్లను, పెద్దచెట్లను నరకకుండా చూడటం వలన అటవీ వనరులను కాపాడుకోవచ్చు. వీటినే “సుస్థిర అటవీ పద్దతులు” అంటారు.

ప్రశ్న 25.
కాంటూర్ పట్టీ పంటలు అనగానేమి?
జవాబు:
కాంటూర్ పట్టీ పంటలు: ఏటవాలు ప్రాంతాలలో నేల వాలుకు అడ్డంగా గాలి వీచే దిశకు అడ్డంగా నేలను దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క పంటను పండించే పద్ధతిని “కాంటూర్ పట్టి పంటలు” అంటారు.

ప్రశ్న 26.
జీవవైవిధ్య వినాశనానికి దారితీసే ప్రక్రియలు ఏమిటి?
జవాబు:
వేటాడడం, కాలుష్యం, ఆవాసాలు విధ్వంసం వంటి కార్యకలాపాలు జీవవైవిధ్య వినాశనానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 27.
శిలాజ ఇంధనాలు అనగానేమి?
జవాబు:
శిలాజ ఇంధనాలు :
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలు వేల సంవత్సరాల క్రిందట భూగర్భంలో పాతుకు పోయిన వృక్ష జంతు కళేబరాల నుండి ఉత్పత్తి అవుతాయి. వీటిని “శిలాజ ఇంధనాలు” అంటారు.

ప్రశ్న 28.
జీవ ఇంధనాలు అనగానేమి?
జవాబు:
జీవ ఇంధనాలు :
శక్తిని ఇచ్చే జీవ ద్రవ్యరాశిని “జీవ ఇంధనాలు” అంటారు.
ఉదా : బయోడీజిల్.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 29.
బయోడీజిల్ ఉత్పత్తికి అనువైన మొక్కలు ఏమిటి?
జవాబు:
జట్రోపా (అడవి ఆముదం) కర్కాస్ మొక్కలు విత్తనాల నుండి బయోడీజిల్ తయారుచేస్తారు.

ప్రశ్న 30.
4R సూత్రం అనగానేమి?
జవాబు:
పర్యావరణ పరిరక్షణకు, వనరుల సద్వినియోగానికి 4R సూత్రం పాటించాలి. అవి:

  1. Reduce:తగ్గించటం
  2. Reuse :తిరిగివాడటం
  3. Recycle: పునఃచక్రీయం
  4. Recover : తిరిగి ఏర్పరచడం

ప్రశ్న 31.
ఈ క్రింది పటం దేనిని సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1
జవాబు:
ఇది పునఃచక్రీయానికి గుర్తు.

ప్రశ్న 32.
IUCN అనగా నేమి?
జవాబు:
‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ నేచర్’ ను సంక్షిప్తంగా IUCN అంటారు. 1980లో ఇది ప్రపంచ సంరక్షణ విధానాన్ని ప్రతిపాదించింది.

ప్రశ్న 33.
తరగని వనరులు తరిగిపోయే వనరులుగా మారే అవకాశం ఉందా?
జవాబు:
విచక్షణారహిత వినియోగం వలన తరగని వనరులు తరిగిపోయే వనరులుగా మారే ప్రమాదం ఉంది.

ప్రశ్న 34.
భూగర్భజలాలు తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఋతుపవనాల రాకడలో మార్పులు, లోతైన గొట్టపు బావులు, భూగర్భ జల వినియోగంలో విచక్షణా రాహిత్యం మొదలయిన వాటి వలన భూగర్భజలాలు తగ్గుతున్నాయి.

ప్రశ్న 35.
ICRISAT పూర్తి పేరు ఏమిటి?
జవాబు:
“ఇంటర్ నేషనల్ క్రాప్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి-ఎండ్ ట్రాపిక్స్” ను ఇక్రిసాట్ అంటారు. ఇది సికింద్రాబాదులో ఉంది.

10th Class Biology 10th lesson సహజ వనరులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు” – దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
జవాబు:
“అడవి ఒక ప్రధాన పునరుద్దరింపదగిన ప్రధాన వనరు.” దీనిని నేను సమర్థిస్తాను.
ఉదాహరణలు:

  1. చెట్లను నరికివేస్తే తిరిగి పెరుగుతాయి. వాటంతట అవే పెరుగుతాయి.
  2. అటవీ పదార్థాలు వాడిన కొద్ది తిరిగి ఏర్పడుతాయి.
  3. మొక్కలు పెంచటం, సామాజిక అడవుల అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా అడవులు పునరుద్ధరించబడతాయి.

ప్రశ్న 2.
శిలాజ ఇంధనాలు పొదుపుగా ఎందుకు వాడాలి?
జవాబు:

  1. శిలాజ ఇంధనాలు తరిగిపోయే ఇంధనాలు.
  2. ఇవి తిరిగి ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది.
  3. విచక్షణా రహితంగా వీటిని వాడినట్లయితే మనకు ఇంధన కొరత వస్తుంది.
  4. భవిష్యత్ అవసరాలకు ఇంధన పరిరక్షణ కొరకు వీటిని పొదుపుగా వాడాలి.

ప్రశ్న 3.
భూగర్భ జలాల సంరక్షణ గురించి అవగాహన కలిగించుటకు మీరిచ్చే రెండు సలహాలను రాయండి.
జవాబు:
భూగర్భ జలాల సంరక్షణ :

  1. ఇంకుడు గుంతలు త్రవ్వడం, చెక్ డ్యాం నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడం.
  2. ర్యాలీలు నిర్వహించడం, కరపత్రాలు, గోడ పత్రికల ద్వారా ప్రచారం చేయడం ద్వారా భూగర్భ జల సంరక్షణపై అవగాహన కల్పించడం.
  3. తక్కువ నీటితో వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం మొదలగునవి.

ప్రశ్న 4.
భూమి వేడెక్కుటలో గ్రీన్‌హౌస్ వాయువుల పాత్రను వివరించుము.
జవాబు:

  1. CO2, CFC’s, NO2, హైడ్రోకార్బన్లు మరియు మిథేన్ వంటి వాయువులను గ్రీన్‌హౌస్ వాయువులంటారు. ఇవి భూమిని వెచ్చగా ఉంచుతాయి.
  2. గ్రీన్‌హౌస్ వాయువుల గాఢత పెరుగుట వలన భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.
  3. గ్రీన్‌హౌస్ వాయువులు భూమి నుండి ఉద్గారమయ్యే వేడిమిని గ్రహించి భౌగోళిక వెచ్చదనానికి కారణమవుతున్నాయి.

ప్రశ్న 5.
సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు. దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు?
జవాబు:

  1. ఒక దేశపు సహజ వనరులు ఆ దేశం యొక్క ఆర్థిక, సామాజిక పురోభివృద్ధిని నిర్ణయిస్తాయి.
  2. సహజ వనరులు ప్రకృతిలో సహజంగా లభిస్తూ మానవ కార్యకలాపాలకు, మనుగడకు ఉపయోగపడతాయి.
  3. సహజ వనరులు తయారుకావడానికి చాలాకాలం పడుతుంది.
  4. వీటిని విచక్షణారహితంగా వాడినపుడు పూర్తిగా అంతరించిపోతాయి.
  5. కావున సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండే విధంగా సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 6.
శిలాజ ఇంధనాలను సంరక్షించుటకు మీరు పాటించే నాలుగు పద్ధతులు రాయండి.
జవాబు:

  1. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలి.
  2. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి.
  3. కార్లవంటి సొంత వాహనాలలో కాకుండా బస్సులు, రైళ్ళ వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలి.
  4. వీలైనప్పుడు నడవడం, సైకిలను ఉపయోగించాలి.
  5. విద్యుత్ ఆదా చేసే పరికరాలను ఉపయోగించాలి.

ప్రశ్న 7.
మానవులమైన మనము ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాము. ఫలితంగా ప్రకృతి వనరులు చాలా వేగంగా తరిగిపోతున్నాయి. దీనివల్ల భవిష్యత్ లో జరుగబోవు పరిణామాలను ఊహించి వ్రాయుము. జ. సహజ వనరులను విచక్షణారహితంగా వాడటం వలన ఈ క్రింది దుష్పరిణామాలు సంభవిస్తాయి.
జవాబు:

  1. వర్షపాతంలో తగ్గుదల.
  2. కరువు సంభవించుట.
  3. వాతావరణ ఉష్ణోగ్రతలలో పెరుగుదల.
  4. అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదం గలదు.

ప్రశ్న 8.
సంవత్సరం నుండి మరో సంవత్సరానికి వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా ! ఇలానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే జరిగే పరిణామాలను ఊహించి వ్రాయండి.
జవాబు:

  1. ఉష్ణోగ్రతలు పెరిగే కొలది ధృవప్రాంతాలలో మంచు కరిగి, సముద్రాలలో నీటిమట్టం పెరుగుతుంది.
  2. సముద్రాలలో నీటిమట్టం పెరుగుట వల్ల చిన్న చిన్న దీవులు మునిగిపోతాయి.
  3. ఉష్ణోగ్రతలు పెరుగుట వల్ల వర్షాలు తగ్గి కరువులు ఏర్పడతాయి.
  4. ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగినప్పుడు కొన్ని జీవజాతులు అంతరించవచ్చు.

ప్రశ్న 9.
స్వచ్ఛ భారత్ సాధనలో 4R’s ప్రాముఖ్యతను తెలియచేయండి.
జవాబు:

  1. చెత్తను ఉత్పత్తి చేయటాన్ని తగ్గించటము. .
  2. చెత్తను తిరిగి వాడుటము ద్వారా ఎరువులను, కరెంట్ ను ఉత్పత్తి చేయవచ్చును.
  3. చెత్తను పారవేసేముందు తడిచెత్త, పొడి చెత్తలను వేరు చేయటము ద్వారా పునఃచక్రీయం చేయవచ్చు.
  4. చెట్లను నరికివేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో చోట చెట్లను పెంచడం.

ప్రశ్న 10.
ఇంకుడు చెరువులు అనగానేమి? వీటిని ఎలా నిర్మిస్తావు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 2
నీటి ప్రవాహాలకు అడ్డంగా ‘ రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువులు (Percolation tanks) అంటారు. బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాళ్లు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా పొరలపొరలుగా చెరువు నేలను, అంచుల వెంబడి కప్పుతారు. తరువాత దీనిని గట్టిగా కుదురుకునేలా చేస్తారు. వ్యవసాయం కోసం నీటిని సరఫరా చేయడానికి మట్టికట్టకు తూము ఏర్పాటు చేస్తారు. పూర్తి నీటి నిల్వ మట్టానికి, అడుగు మట్టానికి మధ్య నాలుగోవంతు ఎత్తులో తూమును ఏర్పాటు చేస్తారు. అందువల్ల తగినంత నీటిని విడుదల చేసుకోవడానికి వీలుకలుగుతుంది.

ప్రశ్న 11.
కేడీ నిర్వహించిన వనపర్తి, వట్టిచెర్ల గ్రామాల మధ్యగల పోలికలు ఏమిటి?
జవాబు:
వృత్తులు, పంట విధానాలు, భౌగోళిక స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, సామాజిక సేవలు వంటి అంశాల దృష్ట్యా వనపర్తి, వడ్డిచెర్ల గ్రామాలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు గ్రామాలలో చిన్న రైతులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సరాసరి కుటుంబ ఆదాయం వనపర్తిలో ఎక్కువ. ఈ రెండు గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారం. బావులే నీటిపారుదలకు మూలం. కుటుంబ ఆదాయం, భూగర్భజలం యొక్క స్థాయిపైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ ఆదాయాన్ని ప్రభావితం చేసే పంటల క్రమం ఈ గ్రామాల్లో వేరు వేరుగా ఉంది.

ప్రశ్న 12.
భూగర్భజలం ఇటీవలి కాలంలో తగ్గటానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
గత కొన్ని సంవత్సరాల నుండి ఋతుపవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన, భూగర్భజలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది. డ్రిల్లింగ్, లోతైన గొట్టపుబావులు, బోరుబావులను తవ్వడం వంటి చర్యల వలన, విచక్షణారహితంగా రాష్ట్రంలోని భూగర్భజలాన్ని వాడడం వలన ఈ వనరు బాగా తరిగిపోతున్నది. మన రాష్ట్రంలో 1998-2002 మధ్యకాలంలో సరాసరిగా నీటి స్థాయి 3 మీటర్ల దాక తగ్గింది.

ప్రశ్న 13.
భూగర్భ జల సంరక్షణకు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ చేపట్టిన చర్యలు ఏమిటి?
జవాబు:
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సికింద్రాబాదు, ఆంధ్రప్రదేశ్), గ్రామాలలో ఎండిపోతున్న బావులలో నీరు చేరుకునేలా, భూగర్భజలాలపై సుస్థిరత్వంపై దృష్టి కేంద్రీకరించింది. రైతులందరూ సమష్టిగా నీటిని పంచుకొని వాడుకునే విధంగా ప్రోత్సహించారు. ఒకే నీటి వనరును ఉపయోగించుకునే విధంగా, రైతులు చిన్న, పెద్ద గ్రూపులుగా ఏర్పడ్డారు. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన్) పద్ధతులను అనుసరించేలా రైతులు స్ఫూర్తిని పొందారు. వర్షపు నీటి సంరక్షణకై ఇంకుడు గుంటలు తవ్వారు.

ప్రశ్న 14.
నీటిని విచక్షణాయుతంగా వాడవలసిన అవసరం ఏమిటి?
జవాబు:
భూమిపై ఉన్న మొత్తం నీటిలో సముద్రాలు, మహాసముద్రాలు, భూగర్భ జలాలలో ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. 2.5-2.75% మాత్రమే మంచినీరు. దీనిలో 1.75-2% (మూడింట రెండు వంతులు) నీరు గ్లేషియర్లు, మంచు, హిమపాతం రూపంలో గడ్డకట్టి ఉంటుంది. 0.7-0.8% మంచినీరు భూగర్భజలంగా, నేలలో నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. 0.01%’ కంటే తక్కువ పరిమాణంలో మంచినీరు ఉపరితల జలం రూపంలో సరస్సులు, నదులలో ఉంటుంది. మంచినీరు చాలా తక్కువ ఉన్నప్పటికీ విచక్షణతో ఉపయోగించాలి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 15.
పూర్వకాలంలో గ్రామ సరిహద్దులను ఎలా నిర్ణయించేవారు?
జవాబు:
పూర్వం వాటర్ షెడ్ (రెండు నదులు లేదా కాలువల మధ్యగల భూ ప్రాంతం) ఆధారంగా, నిపుణులైన రైతులు గ్రామ సరిహద్దులను నిర్ణయించేవారు. రెండు గ్రామాల మధ్యగల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఆధారంగా ఈ హద్దులు నిర్ణయించబడేవి. వ్యవస్థలోని సభ్యులందరూ వీటిని సామాజికంగా అంగీకరించేవారు.

ప్రశ్న 16.
సర్వే నిర్వహణకు ముందు కొత్తపల్లి గ్రామ ప్రజల పరిస్థితులు ఏమిటి?
జవాబు:
కొత్తపల్లి గ్రామంలో సర్వేకు పూర్వపరిస్థితులు:
1. సాగుభూమి కన్నా బీడు భూములు విస్తృతంగా ఉండేవి; 2. తక్కువ అక్షరాస్యత ; 3. శ్రామికులు తక్కువగా ఉండేవారు; 4. చిన్న కమతాలలో లేదా పొలాలలో క్రిమిసంహారకాలు లేదా ఎరువులు ఎక్కువగా వాడేవారు ; 5. పంట దిగుబడి తక్కువగా ఉండేది ; 6. గ్రామంలో నీటి సంరక్షణ నిర్మాణం ఒక్కటి కూడా లేదు. ఉత్పాదకత, ఆదాయాన్ని పెంపొందించే విధానాలు లేవు.

ప్రశ్న 17.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 3
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు, తెలంగాణా ప్రాంతంలో అధిక భాగానికి ఇది జీవనాధారం. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లా వాసుల అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. గోదావరి నదిపై, ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన, ఎక్కువ శాతం నీరు ఆంధ్రప్రదేశ్ కు చేరకుండానే పై రాష్ట్రాలలో నిలువ చేయబడుతోంది. ఆగస్టు 2013 గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేయబడిన నీటి నిలువ సామర్థ్యం 80, 66 టి.ఎం.సి.లు.

ప్రశ్న 18.
బీడు భూములను ఎలా అభివృద్ధి పర్చవచ్చు?
జవాబు:
రోడ్ల వెంబడి, పొలాలు, కాలువల గట్ల వెంబడి ఉపయోగకరమైన జాతుల మొక్కలను పెంచడం ద్వారా బీడు భూములు అభివృద్ధి చేయవచ్చు. ఇందుకుగాను రైతులు అనేకచోట్ల 0.3 మీటర్ల ఎత్తు కట్టలను కట్టి, 10 మీటర్ల దూరానికి ఒకటి చొప్పున కాంటూర్ కందకాలను ఏర్పాటు చేశారు. సీతాఫలం మొక్కలతో పాటు అనేక ఉపయోగకరమైన జాతుల మొక్కలను, గెరిసీడియా మొక్కలను వారు పెంచడం మొదలు పెట్టారు. 2500 పండ్ల చెట్లు, టేకు చెట్లను నాటారు. ఇదే విధంగా బీడు భూములను అభివృద్ధి చేయవచ్చు.

ప్రశ్న 19.
పునరుద్దరించదగిన వనరులు (Reneuuable resources) అనగానేమి?
జవాబు:
మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారం, నీరు, గాలి, నివాసం అన్నీ సహజ వనరుల నుండి లభిస్తాయి. కొన్ని సహజ వనరులు ఉపయోగించిన తరువాత, తిరిగి ఉత్పత్తి చేయబడుతాయి. వీటిని పునరుద్ధరింపదగిన వనరులు (Renewable resources) అంటారు.

ప్రశ్న 20.
పునరుద్దరింపలేని వనరులు (Non-reneuable resources) అనగానేమి?
జవాబు:
శిలాజ ఇంధనాలు వంటి వనరులను పునరుద్దరింపలేము. ఒకసారి వీటిని పూర్తిగా వాడుకున్నట్లయితే, అవి ఎప్పటికీ తరిగిపోయినట్లే. అతి తక్కువ కాలం ఇవి వినియోగించబడతాయి. కానీ, ఇవి తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది. వీటినే పునరుద్ధరింపలేని వనరులు (Non-renewable resources) అంటారు.

ప్రశ్న 21.
అదవులు చాలా ప్రాముఖ్యత గలవని అనుకోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
అడవులు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే అంటార్కిటికా తప్ప మిగిలిన ఖండాలన్నింటిలోనూ అడవులు ఉన్నాయి. మొక్కలకు, జంతువులకు ఒక గొప్ప ఆవాసంగా ఉన్నాయి. ప్రపంచానికి అడవులు ఊపిరితిత్తులు వంటివి మరియు కొత్త జీవితానికి పోషకాలనందించే ప్రముఖ స్థానం వంటివి లెక్కలేనన్ని ఉత్పత్తులు అడవుల నుండి లభిస్తున్నాయి.

ప్రశ్న 22.
అడవుల సంరక్షణలో రాజస్థానీయులు చూపిన చొరవ తెలపంది.
జవాబు:
రాజస్థాన్లో వైష్ణోయిలు చేసిన కార్యక్రమం మనకు మార్గదర్శకం. అమృతాదేవి, ఆమె కుమార్తెలు, వారి గ్రామస్తులందరూ కలిసి గ్రామ సమీపంలో ఉండే అడవుల్లోని వృక్షాలను కొట్టివేయకుండా కాపాడుకొన్నారు. ఇలాంటి అద్భుతమైన ఉద్యమాలు మనకు పర్యావరణాన్ని కాపాడుకోవడంలో స్ఫూర్తినిస్తాయి. అడవిని నరికి కలప సేకరించి రాజభవనం కట్టుకోవాలన్న రాజుగారికి వ్యతిరేకంగా పోరాటం చేసి అడవితో ప్రశాంతమైన సహసంబంధాన్ని గడపడానికి ప్రతిన పూనారు. ప్రకృతిని కాపాడేందుకు 29 నియమాలతో స్వయంచట్టం చేసుకున్నారు.

ప్రశ్న 23.
నేల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
ఆహారోత్పత్తికి నేల చాలా ముఖ్యమైనది. మనకు అవసరమైన పంటలు పండించాలంటే బాగా సారవంతమైన నేల ఉండాలి. వన్యజాతి మొక్కలు పెరగాలన్నా నేల అవసరం. మొక్కలు, జంతువులు మరియు ఇతర వనరులను సంరక్షించుకోవడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలు నేల సంరక్షణ పైనే ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న 24.
నేలకు నష్టాలు కలిగిస్తున్న కారకాలు తెలపండి.
జవాబు:
ఒక పొలంలో ఒకే రకం పంటను పలుమార్లు పండించడం వంటి లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు నేలలోని పోషకాలను తొలగిస్తాయి. కొండ ప్రాంతాలను దున్నడం వలన నీరు, గాలి ద్వారా నేలకోత చాలా ఎక్కువవుతుంది.

ప్రశ్న 25.
జీవవైవిధ్యం అనగానేమి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవవైవిధ్యం. ప్రకృతి నుండి మనకు లభించే ఉత్పత్తులు మరియు లాభాలన్నీ జీవవైవిధ్యం నుండి పొందుతున్నవే. ఆహార పదార్థాలు, వాటి నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు, ఔషధాలు లభించాలన్నా మరియు పరిశుభ్రమైన, ఉపయోగకరమైన నేల ఉండాలన్నా జీవవైవిధ్యం ఎంతో అవసరం.

ఆహార వనరులు వైవిధ్యంగా, సమృద్ధిగా ఉండే విధంగా మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఆహారం కన్నా జీవవైవిధ్యం గొప్పది. ఉదాహరణకు ప్రపంచంలో మొత్తంలో 50,000 నుండి 70,000 వృక్ష జాతులను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 26.
శిలాజ ఇంధనాల వినియోగం ఎలా తగ్గించవచ్చు?
జవాబు:
శిలాజ ఇంధనాలను జాగ్రత్తగా వినియోగిస్తూ, ప్రతి ఒక్కరూ వాటిని సంరక్షించాలి. విద్యుత్ దీపాలను, పరికరాలను వాడనప్పుడు స్వి ను ఆపివేయండి. విద్యుత్ను ఆదాచేసే పరికరాలను మాత్రమే కొనండి. వీలైనపుడు నడవడం, సైకిలను ఉపయోగించడం చేయాలి.

కార్ల వంటి సొంత వాహనాలలో కాకుండా బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణిస్తే లాభదాయకం. ఈ విధంగా చేస్తే సమాజానికి ఎంతో ఉపయోగం.

ప్రశ్న 27.
ఖనిజాల వినియోగం వలన భవిష్యత్ లో వచ్చే సమస్యలు ఏమిటి?
జవాబు:
భూమిలో ఖనిజ వనరులు తగ్గిపోతాయి. కనుగొనబడిన, గుర్తించబడిన చాలా ఖనిజాలు తరిగిపోతాయి. అల్యూమినియం, ఇనుము యొక్క ఖనిజ నిలువలు లేదా ఖనిజ నిక్షేపాలు కనుమరుగైపోతుండడం వలన వాటి ధరలు చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ మూలకాలతో తయారుచేసే పరికరాలు, యంత్రాల యొక్క ధరలు పెరిగి, వాటిని కొనడం మరియు వినియోగించడం కష్టమైపోతుంది.

10th Class Biology 10th lesson సహజ వనరులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అడవి ఒక పునరుద్దరింపదగిన వనరు. కాని ప్రతి సంవత్సరం భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు నరికివేయబడుతున్న నేపథ్యంలో అవి పునరుద్ధరింపబడని వనరులుగా మారకుండుటకు నీవు ఎటువంటి సూచనలు చేస్తావు?
జవాబు:
ప్రపంచానికి అడవులు ఊపిరితిత్తులు వంటివి. అవి పునరుద్ధరింపబడని వనరుగా మారకుండా ఉండుటకు నేనిచ్చే సూచనలు :

  1. సుస్థిర అటవీ విధానాల ద్వారా భవిష్యత్ తరాలవారికి అందచేయగలం.
  2. చాలా తక్కువగా చెట్లను నరకడం.
  3. సహజంగా చెట్లు, తిరిగి ఎదగటానికి అవకాశం కల్గించే పద్ధతులు పాటించాలి.
  4. ఎత్తైన చెట్లు, పెద్ద చెట్లను నరికివేసే విధానాలను నిషేధించాలి.
  5. పునఃచక్రీయ పద్ధతులు అవలంబించడం.
  6. కలపకు బదులుగా ప్రత్యామ్నాయ వనరులను ఉపయోగించటం.
  7. అడవులను దహించకుండా చేయడం.

ప్రశ్న 2.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 4
పై పట్టికను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) రెండు గ్రామములలో చిన్న రైతులు పండించడానికి అనుకూలమైన పంట ఏది?
జవాబు:
మొక్కజొన్న, వరి.

2) నీవు ఒకవేళ పెద్ద రైతువైతే ఏ పంట పండిస్తావు ?
జవాబు:
మిర్చి, వరి

3) A మరియు B గ్రామముల మధ్య ఏమైన పోలికలను గమనించావా?
జవాబు:
A మరియు B గ్రామాలలో చిన్న పెద్ద రైతు ఒకే రకమైన పంటలు పండిస్తున్నారు. A మరియు B గ్రామాలలో చిన్నకారు రైతు కంటే పెద్దకారు రైతు ఎకరాకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది. రెండు గ్రామాలలో పెద్ద రైతు ఎక్కువ ఆదాయాన్ని వరి, మిర్చి, మొక్కజొన్న పంటలలో పొందుతున్నారు.

4) పై పట్టికలో తక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట ఏది?
జవాబు:
పత్తి

5) పంటకు, ఆదాయంనకు ఏమైన సంబంధం ఉన్నదా? వివరించండి.
జవాబు:
ఉంది. పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. (లేదా)
ఉండకపోవచ్చు. మార్కెటు అవసరాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. వాణిజ్య పంటలకు ఎక్కువ ఆదాయం వస్తుంది.

ప్రశ్న 3.
AR లు అనగానేమి? ఇవి పర్యావరణ సంరక్షణకు ఎలా ఉపయోగపడతాయి?
(లేదా)
పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే 4R సూత్రం వివరించండి.
జవాబు:
పర్యావరణ సంరక్షణకు నాలుగు నియమాలు పాటించాలి. అవి :

తగ్గించడం (Reduce) :
వనరులను తక్కువగా -వృథా చేయకుండా వినియోగించడం, కారుతున్న నల్లాలను, పంపులను సరిచేయడం, స్నానాల గదిలో షవర్ల వాడకం తగ్గించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. అవసరం లేని సమయాల్లో విద్యుద్దీపాలను, ఫ్యాన్లను ఆపివేయడం వలన విద్యుచ్ఛక్తిని పొదుపు చేయవచ్చు.

తిరిగి వాడడం (Reuse) :
పారేయకుండా తిరిగి ఉపయోగించుకోవడం. కాగితాన్ని తిరిగి వాడడం వలన మొక్కలను కాపాడడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించినవారమవుతాము.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 5
పునఃచక్రీయం (Recycle) :
ఇది అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు ప్లాస్టికను పునఃచక్రీయం చేయడమనేది చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. ప్లాస్టిక్కు గల సంక్లిష్టత వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ప్లాస్టిక్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాల నష్టాలూ ఉన్నాయి. ఒక రకమైన ప్లాస్టికను అదే రకం నుండి పునఃచక్రీయం చేయాలి. కావున, వివిధ రకాల ప్లాస్టిక్ లను పునఃచక్రీయం చేయడానికి పునఃచక్రీయం ముందు వేరుచేయాలి. ఒక్కొక్క దానిని ఒక్కొక్క రకంగా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది.

తిరిగి ఏర్పాటుచేయటం (Recover) :
మనం వాడుకొన్న వనరులను, తిరిగి నెలకొల్పటాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అంటారు.
ఉదా : కర్మాగారాలు, రోడ్ల నిర్మాణం కోసం చెట్లను కొట్టివేసినపుడు, అడవులను నరికివేసినపుడు ప్రత్యామ్నాయంగా మరొకచోట చెట్లను పెంచటం అవసరం.

ప్రశ్న 4.
ఈ క్రింది పై (Ple) చార్టును విశ్లేషించి, దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 6
జవాబు:
i) వీటిలో శిలాజ ఇంధనాలను గుర్తించి రాయండి.
జవాబు:
బొగ్గు, సహజవాయువు, నూనెలు.

ii) వ్యర్థాలను ప్రధాన ఇంధన వనరులుగా భవిష్యత్తులో ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి?
జవాబు:
భవిష్యత్ లో శిలాజ ఇంధనాలు తరిగిపోవచ్చు కనుక ప్రత్యామ్నాయ ఇంధనముగా వ్యర్థాలను భవిష్యత్తులో ఉపయోగించవచ్చును.

iii) శిలాజ ఇంధనాలపై దీర్ఘకాలం మనం ఎందుకు ఆధారపడలేము?
జవాబు:
శిలాజ ఇంధనాలు పునరుద్దరింపదగని వనరులు కనుక.

iv) శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల ఇంధన వనరులు ఏవి?
జవాబు:
సౌరశక్తి, పవనశక్తి, తరంగశక్తి, అణుశక్తి, వ్యర్థాలు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 5.
నీటి యాజమాన్యం కొరకు పాటించవలసిన సముదాయ ఆధారిత విధానాలు, రైతు ఆధారిత విధానాలను మరియు వాటి ప్రాధాన్యతను వివరించండి.
జవాబు:
సముదాయ ఆధారిత విధానాలు :
14 నీటిని నిలువ చేసే నిర్మాణాలు, 60 చిన్న ఇంకుడు గుంతలు, డైక్లు, 38 హెక్టార్ల పొలంగట్ల ద్వారా 28 ఎండిన బావులలోకి నీరు చేరేలా చేయడం జరిగింది. వర్షపు నీటిని నీటి వినియోగదారుల సంఘంగా ఏర్పడి సంరక్షించుకోగలిగారు. ఈ నిర్మాణాలలో నిలువ చేయబడిన నీరు భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంచుటకు ఉపయోగించబడింది.

రైతు ఆధారిత విధానాలు :
వెడల్పు చాళ్ళు తీయడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలను పెంచడం, కాంటూరు సేద్యం చేయడం, గట్ల మీద గెరిసిడియా చెట్లను పెంచడం, సూక్ష్మ సేద్య పద్ధతులు వంటివి వ్యక్తిగతంగా రైతులు వారి వారి పొలాలలో చేయడం జరిగింది. వీటి వలన నేల, వర్షపు నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కలుపు నివారణా పద్ధతులు పాటించడం, నైట్రోజన్ నిలువలను పెంచడం జరుగుతుంది.

ప్రశ్న 6.
రైతు ఆధారిత విధానాల గూర్చి రాయండి.
జవాబు:

  1. రైతు ఆధారిత విధానాల ద్వారా నేల, నీటి సంరక్షణ కార్యక్రమాలను అమలు చేశారు. వెడల్పు చాళ్లు తియ్యడం, తక్కువ ఎత్తు పెరిగే పంటలు పెంచడం, కాంటూర్ సేద్యం చేయడం మొదలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నేల, నీరు, పోషకాలు దుర్వినియోగం కాకుండా కాపాడుతారు.
  2. కలుపు నివారణ పద్ధతులు పాటించడంతోబాటు 38 హెక్టార్ల పొలాల చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో గట్ట కట్టడం, వాలులకు అడ్డంగా కాంటూర్ కందకాలు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని సంరక్షించవచ్చు.
  3. గట్లు బలంగా ఉండేందుకు. నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు గట్టమీద గ్లైరిసీడియా (లెగ్యూమ్ మొక్క) లను పెంచుతారు. రైతులు ఉమ్మడిగా నీటిని వినియోగించుకోడం, సూక్ష్మ సేద్యం పద్దతులు చేస్తారు.
  4. వెడల్పు చాళ్లు తీయడం, సూక్ష్మసేద్య పద్ధతులు పాటించడం వలన హెక్టారుకు 250 కిలోల పైగా జొన్నలు, 50 కిలోల పైగా మొక్కజొన్నలు అధిక దిగుబడి సాధించవచ్చు.
  5. బిందు సేద్యం అమలు చేయడం వలన 70% నీటిని పొదుపు చేయవచ్చు.

ప్రశ్న 7.
అడవుల నరికివేత వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:

  1. కలప లేదా వ్యవసాయం లేదా అభివృద్ధి పేరిట ప్రజలు అడవులను నరుకుతున్నారు.
  2. ప్రతి సంవత్సరం భూమిపై 36 మిలియన్ల ఎకరాల అడవులు (ఆంధ్రప్రదేశ్ లోని సగభాగం కన్నా ఎక్కువ భాగం) నరికివేయబడుతున్నాయి.
  3. అడవులను నరికివేయడం వలన వన్యజాతుల ఆవాసాలు నాశనమవుతాయి. నేలకోత ఎక్కువవుతుంది.
  4. హరిత గృహ వాయువులు (Green house gases) విడుదలై, భౌగోళిక వెచ్చదనానికి (Global warming) దారితీస్తాయి
  5. ప్రపంచంలో విడుదలయ్యే హరిత గృహ వాయువుల మొత్తంలో 15% వాయువులు అడవులను నరకడం వలననే విడుదలవుతున్నాయి.
  6. అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం, వంటచెరకుకు మరియు జీవనోపాధి కోసం, మనుగడ కోసం అడవులపై ఆధారపడి జీవించే ప్రజలు అడవులు నరకడం వలన చాలా నష్టపోతున్నారు.

ప్రశ్న 8.
అడవుల సంరక్షణకు పాటించవలసిన సుస్థిర పద్ధతులు తెలపండి.
జవాబు:
అడవులను కాపాడుకోడానికి సుస్థిర అటవీ పద్దతులు కొన్ని పాటించాలి. ఉదాహరణకు చాలా తక్కువగా చెట్లు నరకడం, సహజంగా చెట్లు తిరిగి ఎదగడానికి అవకాశం కలిగించే పద్ధతులను పాటించడం, ఎత్తయిన చెట్లు, పెద్ద పెద్ద చెట్లను పెద్ద ఎత్తున నరికివేసే విధానాలను నిషేధించడం మొదలైనవి.

పునఃచక్రీయ వలన చెట్లను సంరక్షించవచ్చును. ఉదాహరణకు చైనా మరియు మెక్సికో దేశాల ప్రజలు రాయడానికి మరియు ఇతర అవసరాలకు వాడే కాగితాన్ని, కార్డుబోర్డును తిరిగి వాడడం ద్వారా అడవులను సంరక్షిస్తున్నారు. ప్రపంచంలోని కాగితంలో సగభాగం తిరిగి వాడడం జరిగితే, ప్రపంచంలోని కొత్త కాగితానికి ఉన్న అవసరం తీరడమే కాకుండా భూమి పైనున్న చెట్లను కాపాడినట్లవుతుంది. కొన్ని కలప వస్తువులకు బదులుగా వెదురు వాడవచ్చు.

ప్రశ్న 9.
నేల సంరక్షణ విధానాలు తెలపండి.
జవాబు:

  1. నేలల సంరక్షణా విధానాలలో కాంటూర్ పట్టి పంటల (Contour strip cropping) పద్ధతి ఒకటి. ఈ విధానంలో నేలవాలుకు అడ్డంగా, గాలివీచే దిశకు అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క రకం పంటను వేస్తారు. ఉదాహరణకు ఒక వరుసలో మొక్కజొన్న, మరొక వరుసలో గోధుమ, ఇంకొక వరుసలో క్లోవర్ (పులిచింత) పంటలు పండించడం.
  2. వేరువేరు పంట మొక్కలు వేరువేరు రకాల వేరు వ్యవస్థలను, భిన్న పరిమాణంలో ఆకులను కలిగి ఉంటాయి. కాబట్టి నేలక్రమక్షయం జరగకుండా కాపాడుతాయి.
  3. అలాగే పంటకోసేటపుడు కూడా ఒక్కొక్క మొక్కను లేదా చిన్న గుంపును తీసివేయడం వంటి ఎంపిక వంట పద్దతులు (Selective harvesting) పాటించడం వల్ల మిగిలిన మొక్కలు నేల కొట్టుకుపోకుండా పట్టి ఉంచుతాయి.

ప్రశ్న 10.
వనరుల సంరక్షణకు అంతర్జాతీయ సంస్థలు చూపుతున్న శ్రద్ధను తెలపండి.
జవాబు:
ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వనరుల సంరక్షణ పట్ల శ్రద్ధ చూపుతున్నాయి. వర్షారణ్యాలను కాపాడడం, జంతువులు అంతరించిపోకుండా సంరక్షించడం మరియు గాలిని శుభ్రపరచడం వంటి కార్యకలాపాలను సంస్థ సభ్యులు బలపరుస్తున్నారు. 1948లో ప్రభుత్వ, ప్రైవేటు సమూహాల సమ్మేళనం ‘ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్ఫర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN)’ ఏర్పడింది.

1980లో ఇది ప్రపంచ సంరక్షణా విధానాన్ని ప్రతిపాదించింది. ఎన్నో దేశాల ప్రభుత్వాలు వాటి సంరక్షణా పథకాలను అభివృద్ధి చేసుకోవడంలో IUCN విధానాలనే అనుసరించాయి. అంతేకాకుండా IUCN అనే సంస్థ ప్రమాదం అంచున ఉన్న వన్యజాతులను, జాతీయ ఉద్యానవనాలు, సంరక్షణా కేంద్రాలు, పర్యావరణానికి సంబంధించిన అంశాల స్థాయిని పరిశీలిస్తుంది.

ప్రశ్న 11.
మీ గ్రామంలో బావులు, చెరువులు ఎండిపోయాయి. భూగర్భజలాలు తగ్గిపోయాయి. ఇందుకు గల కారణాలను గుర్తించండి. మీ గ్రామంలోని రైతులందరూ కలిసి పనిచేస్తే నీటి కరవు తీరుతుందా?
జవాబు:
భూగర్భజలాలు తగ్గిపోవడానికి కారణాలు :

  1. ఈ మధ్యకాలములో ఋతుపవనములు సకాలములో రాకపోవడము, వచ్చినా సరిపోయిన మొత్తములో వర్షములు ఇవ్వకపోవడం ప్రధాన కారణంగా భావించవచ్చు.
  2. తక్కువ మొత్తంలో బోరుబావులు తవ్వి సాగునీటి అవసరాల కోసం విచక్షణారహితంగా వినియోగించడం. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో నీటిని ఉపయోగించటం వలన భూగర్భజల మట్టాలు పడిపోవడం జరిగినది.
  3. ఆహార పంటలు ఎక్కువగా పండించుట వలన కూడా నీటి వినియోగం ఎక్కువ కావటం భూగర్భజలమట్టాలు పడిపోవడం జరుగుతుంది.
  4. మా గ్రామంలోని రైతులందరూ ఉమ్మడిగా నీటిని వినియోగిస్తే పంటలకు నీటికొరత ఉండదు. మా ఊరిలో ఉన్న రైతులను నీటి సద్వినియోగం కొరకు ఉమ్మడిగా మరియు సూక్ష్మనీటిపారుదల పద్ధతులను అవలంబించవలసినదిగా సూచించడమైనది.
  5. సూక్ష్మసాగునీటి పద్ధతులయిన బిందుసేద్యం, స్ప్రింక్లర్లు మొదలైనవి వినియోగించడం వలన నీటిని పొదుపుగా వాడటమే కాకుండా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగింది.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

ప్రశ్న 12.
మీ గ్రామంలో తాగునీటికి, సాగునీటికి తీవ్రమైన కొరత ఉంది అనుకుందాం. దానిని నివారించడానికి నీవు ఇచ్చే సలహాలు ఏమిటి?
జవాబు:

  1. నీటిని పొదుపుగా వాడుకోవలసిన అవసరాన్ని, సంరక్షించుకోవలసిన విధానాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాను.
  2. నీటి వాడకంలో వృథాను అరికట్టే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తాను.
  3. భూగర్భ జలమట్టాలను పెంచడానికి రీఛార్జి గుంటలను ఇళ్ళు మరియు పాఠశాల ఆవరణలో నిర్మించే విధంగా ప్రోత్సహిస్తాను.
  4. బీడు భూముల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
  5. రైతులు సూక్ష్మ నీటి సాగు పద్ధతులైన బిందుసేద్యం, స్ప్రింక్లర్స్ విధానాలను ఆచరించే విధంగా ప్రోత్సహిస్తాను.
  6. అందుబాటులో ఉన్న నీటి వనరులను సామూహికంగా వినియోగించుకునే విధంగా రైతులను ప్రోత్సహిస్తాను.
  7. ఇంకుడు గుంతలు మరియు చెరువులను తవ్వి వృథాగా పోయే వర్షపునీటిని పరిరక్షించి భూగర్భజలమట్టాలను పెంచడానికి ప్రయత్నిస్తాను.
  8. వాటర్ షెడ్ పథకాల అమలును పర్యవేక్షిస్తాను.

ప్రశ్న 13.
సహజ వనరుల సద్వినియోగం దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తుందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు, జంతువులు భూమిపై ఉండే సహజ వనరులు.
  2. వర్తమానంలో మరియు భవిష్యత్తులో జీవులన్నీ లాభం పొందాలంటే సహజ వనరులు సంరక్షించబడాలి.
  3. ప్రజలు చాలా వరకు పునరుద్దరింపదగిన మరియు పునరుద్ధరింపలేని వనరులను నాశనం చేస్తుంటారు. మనుగడ కొనసాగించడమనేది, సహజ వనరులను విచక్షణతో ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది.
  4. జంతువులు ఇతర ఆవాసాలకు తరలిపోయేలా వాటికి నష్టం చేకూరుస్తూ భవిష్యత్తులో ఉపయోగపడవలసిన వనరులను తరిగిపోయేలా చేస్తూ, నేడు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ నాశనం చేస్తూ మనం అభివృద్ధి యొక్క ప్రయోజనాలను లెక్కిస్తున్నాం.
  5. అభివృద్ధి, సంరక్షణ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ మనుగడ సాగించవచ్చును.
  6. భావితరాలకు అవసరమయ్యే సహజవనరులను అందుబాటులో ఉండేవిధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది.
  7. సుస్థిరంగా జీవించాలంటే మనం ఎన్నో రకాల వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ సంరక్షించుకోవాలి.

ప్రశ్న 14.
రైతులకు వ్యవసాయం ఎంపిక విధానంపై అవగాహన కల్పించటానికి నీవు చేపట్టే కార్యక్రమాలేవి?
జవాబు:

  1. వ్యవసాయ సంబంధ మరియు అనుబంధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తాను.
  2. రసాయనిక ఎరువులు కలిగించే నషాన్ని రైతులకు వివరించి ఆరానిక్ ఎరువులను వాడే విధంగా ప్రోత్సహిసాను.
  3. మృత్తిక యొక్క సహజ స్వరూపాన్ని కాపాడవలసిన అవసరతను రైతులకు వివరిస్తాను. తద్వారా దిగుబడి ఎక్కువ సాధించుటకు రైతులను ప్రోత్సహిస్తాను.
  4. దిగుబడులను పెంచడానికి రైతులు అధిక దిగుబడినిచ్చే వంగడాలను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తాను.
  5. మొక్కల సంఖ్యను అధికం చేయడానికి కణజాలవర్గన పద్ధతులను అవలంబించే విధంగా రైతులకు అవగాహన కలిగిస్తాను.
  6. నీటిని పొదుపుగా వాడటానికి సూక్ష్మ సేద్య సాగునీటి పద్దతులైన బిందుసేద్యం మరియు స్ప్రింక్లర్ విధానమును అవలంబించే విధంగా రైతులకు సూచనలిస్తాను.
  7. రెతులు సామూహికంగా నీటిని వినియోగించుకునే విధంగా ప్రణాళికలను రూపొందిస్తాను. తద్వారా పంట సాగుకు అతి తక్కువ మొత్తంలో నీరు వాడే విధంగా చూస్తాను.
  8. వర్షపు నీటిని ఆదాచేయడానికి ఇంకుడు గుంతలు, చెరువులు నిర్మించే విధంగా రైతులను ప్రోత్సహిస్తాను.

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

ఉదాహరణలు ఇవ్వండి

1. బిందు సేద్యం అనేది ఒక రకమైన సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్ప్రింక్లర్

2. భూగర్భ జలాలు లేదా ఎండిన బోర్లను బాగా రీఛార్జ్ చేయడానికి పెర్కొలేషన్ ట్యాంక్ ఉపయోగించబదుతుంది. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఇంకుడు గుంటలు

3. రైతు ఆధారిత సేద్యానికి బ్రాడ్ బెడ్ ఫర్రో ల్యాండ్ ఫామ్ ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆకృతి నాటడం

4. పొడి ప్రాంతాల్లో పెరగడానికి అనువుగా ఉండే లెగ్యుమినస్ మొక్కకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గ్లైరిసిడియా

5. శిలాజ ఇంధనాలకు పెట్రోలియం మరియు సహజ వాయువు ఉదాహరణలు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొగ్గు

6. గోండు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన గిరిజనులు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెంచు

7. జపాన్ ఆటోమొబైల్స్ తయారీలో రీసైకిల్ ముడి పదార్థాలను వాడుతున్న దేశం. ఇటువంటి దేశానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

8. సూర్యకాంతి విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వనరు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పవన శక్తి

9. అడవి అంటే మనం నిర్వహించాల్సిన మరియు పరిరక్షించాల్సిన వనరు. ఇటువంటి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నేల / నీరు

10. గ్లైరిసిడియా మొక్కల నేలను సారవంతం చేయటానికి ఉపయోగిస్తారు. ఇటువంటి మొక్కలకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాఫల మొక్కలు

11. కాంటూర్ సేద్యం అనేది నేల సంరక్షణకు ఒక పద్ధతి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పంట మార్పిడి.

విస్తరించుము

12. ICRISAT ని విస్తరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ – అరిడ్ ట్రాపిక్స్

13. T.M.Cని విస్తరించండి.
జవాబు:
వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు

14. B.B.F ని విస్తరించండి.
జవాబు:
బ్రాడ్ బెడ్ ఫర్రో

15. MTRని విస్తరించండి.
జవాబు:
మౌంటైన్ టాప్ రిమూవల్

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

16. 4Rని విస్తరించండి.
జవాబు:
తగ్గించటం (Reduce), పునర్వినియోగం (Re-use), పునఃచక్రీయము (Recycle), తిరిగి పొందటం (Recover).

17. I.U.C.Nని విస్తరించండి.
జవాబు:
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్

18. O.N.G.Cని విస్తరించండి.
జవాబు:
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్

19. U.N.D.P ని విస్తరించండి.
జవాబు:
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం

20. FAOని విస్తరించండి.
జవాబు:
ఆహార మరియు వ్యవసాయ సంస్థ

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

21. ఉపరితల నీటి పారుదల పద్దతి నీటి వినియోగాన్ని 70% తగ్గిస్తుంది.
జవాబు:
బిందు సేద్యం పద్దతి నీటి వినియోగాన్ని 70% తగ్గిస్తుంది.

22. ప్రతి సంవత్సరం భూమి అటవీ నిర్మూలనకు సుమారు 63 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతుంది.
జవాబు:
ప్రతి సంవత్సరం భూమి అటవీ నిర్మూలనకు సుమారు 36 మిలియన్ ఎకరాల అడవిని కోల్పోతుంది.

23. పులులను రక్షించడానికి చిప్కో ఉద్యమం ముడిపడి ఉంది.
జవాబు:
చెట్లు రక్షించడానికి చిప్కో ఉద్యమం ముడిపడి ఉంది.

24. నదీ జలాల pH 7 పైన ఉంటే నదీ జలాలు ఆమ్ల వ్యర్థాలతో కలుషితమవుతాయని చెబుతారు.
జవాబు:
నదీ జలాల pH 7 పైన ఉంటే నదీ జలాలు క్షార వ్యర్థాలతో కలుషితమవుతాయని చెబుతారు.

ఖాళీలను పూరించండి

25. ఫ్లో చార్టులో ఖాళీని పూరించండి.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 7
జవాబు:
గాలి, సూర్యరశ్మి

26. అటవీ నిర్మూలన వలన ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలలో ……….. వెలువడుతుంది.
జవాబు:
15%

27. భూమిపై మంచినీటి శాతం …………
జవాబు:
2.5 – 2.75%

నేను ఎవరు?

28. మేము రాజస్థాన్లో గిరిజనులం. ప్రకృతిని పరిరక్షించదానికి మాకు 29 నియమాల సమితి ఉంది. మేము ఎవరు?
జవాబు:
బిష్ణోలు

29. నా కుమార్తె, మా గ్రామస్తులు మరియు నేను అటవీ స్థలం కోసం రాజు సైనికుడిచే చెట్లను నరికివేయకుండా కాపాడాము. నేను ఎవరు?
జవాబు:
అమృతా దేవి

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

30. నేను హిమాలయ లోయలలో అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. మరియు అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా నా ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అంటారు. నేను ఎవరు?
జవాబు:
సుందర్‌లాల్ బహుగుణ

31. నేను పర్యావరణవేత్తని. నేను నర్మదా నదికి అడ్డంగా అనేక ఆనకట్టలను నిర్మిస్తున్నాను. నేను ఎవరు?
జవాబు:
మేధా పాట్కర్

32. నేను ఒక మొక్కను. నా విత్తనాలను బయోడీజిల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. నేను ఎవరు?
జవాబు:
జట్రోపా కర్కస్ (అడవి ఆముదం)

33. మీరు గది నుండి బయలుదేరినప్పుడు లైట్ మరియు ఫ్యాన్ ఆపివేయండి. ఇది ఏ రకమైన R?
జవాబు:
తగ్గింపు

జతపరచుట

34. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
షవర్ బాత్ మానటం – తగ్గింపు
స్నేహితులతో పుస్తకాలను పంచుకోండి – రీసైకిల్ చేయడం
లీకైన కుళాయిలను రిపేర్ చేయండి – పునర్వినియోగం
జవాబు:
షవర్ బాత్ మానటం – తగ్గింపు

35. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
వస్త్ర సంచులను వాడండి – పునర్వినియోగం
పునర్వినియోగపరచదగిన బ్యాటరీలను
ఉపయోగించండి – తగ్గించడం
పెన్ను రీఫిల్ చేయండి – రీసైకిల్ చేయడం
జవాబు:
పునర్వినియోగపరచదగిన బ్యాటరీలను ఉపయోగించండి – తగ్గించడం

36. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
జట్రోపా – శిలాజ ఇంధనం
గ్లిరిసిడియా – లెగ్యుమినస్ మొక్క
కస్టర్డ్ ఆపిల్ – జీవ ఇంధన కర్మాగారం
జవాబు:
గ్లిరిసిడియా – లెగ్యుమినస్. మొక్క

37. సరిగ్గా సరిపోలనిదాన్ని గుర్తించండి.
బ్రాడ్ బెడ్ ఫర్రో – రైతు ఆధారిత సేద్యం
వర్షాధార ఆనకట్ట – సమాజ ఆధారిత సేద్యం
పునరుత్పాదక వనరు – బొగ్గు
జవాబు:
పునరుత్పాదక వనరు – బొగ్గు

నినాదాలు

38. ర్యాలీ నిర్వహించడానికి మీ పాఠశాలలో ఈ క్రింది నినాదాలు తయారుచేయబడ్డాయి. ఏ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు?
చెట్టును కత్తిరించవద్దు – జీవితాన్ని కత్తిరించవద్దు
చెట్టును పెంచండి – వరదకు దూరంగా ఉండండి.
జవాబు:
జూన్-6 – ప్రపంచ పర్యావరణ దినం.

39. ఈ క్రింది నినాదాల యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
నీరు జీవితాధారం.
ప్రతి నీటి చుక్కను లెక్కింపు చేద్దాం.
ఒక చుక్కను దాచండి – భవిష్యత్తును కాపాడండి.
జవాబు:
నీటి పొదుపు

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

40. కింది నినాదాల యొక్క ప్రాథమిక భావన ఏమిటి?
నూనె కంటే నేల విలువైనది.
రోజుకు ఒక చెట్టును నాటండి మరియు నేల కోతను దూరంగా ఉంచండి.
జవాబు:
నేల పరిరక్షణ

41. ఓజోన్ యొక్క ప్రాముఖ్యత ఈ క్రింది నినాదాలలో ప్రస్తావించబడింది. ఇది ఏ రకమైన కిరణాల నుండి మనలను రక్షిస్తుంది?
ఓజోన్ లేదు, డెడ్ జోన్ మాత్రమే
ఓజోన్ ప్రకృతి స్వంత సన్
జవాబు:
అతినీలలోహిత కిరణాలు

బొమ్మలపై ప్రశ్నలు

42.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 8
ఈ లోగో దేనిని సూచిస్తుంది?
జవాబు:
సమగ్రాభివృద్ధి

43.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1
ఈ లోగో దేనిని సూచిస్తుంది?
జవాబు:
పునఃచక్రీయము

44.
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 9
ఈ చిత్రం ఏ 4R ను సూచిస్తుంది?
జవాబు:
తిరిగి వాడడం

10th Class Biology 10th lesson సహజ వనరులు 1 Mark Important Questions and Answers

1. భూగర్భ జలాలు తగ్గటానికి కారణం ………..
A) వర్షం పడకపోవడం
B) అడవుల నరికివేత
C) బోర్ బావుల సంఖ్య ఎక్కువైపోవుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం
i) స్వల్పకాలిక పంటలు పండించడం.
ii) వ్యాపార పంటలు పండించడం.
iii) బిందు సేద్యం చేయడం.
iv) పంట విరామం ప్రకటించడం.
A) (i), (ii)
B) (i), (ii), (iii)
C) (i), (iv)
D) (iii), (iv)
జవాబు:
B) (i), (ii), (iii)

3. ఒక రైతు తన పంటపొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక …..
A) పర్యావరణ నైతికత పద్ధతి
B) జైవిక నియంత్రణ పద్ధతి
C) జైవిక వ్యవస్థాపనం
D) జైవిక వృద్ధీకరణము
జవాబు:
B) జైవిక నియంత్రణ పద్ధతి

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

4. క్రింది వానిలో పునరుద్ధరింపలేని వనరు
A) నీరు
B) సౌరశక్తి
C) బొగ్గు
D) మృత్తిక
జవాబు:
C) బొగ్గు

5. అడవులను అధికంగా నిర్మూలిస్తే జరిగే పరిణామాన్ని
A) అగ్నిపర్వతాలు బ్రద్దలగుట
B) భూకంపాలు వస్తాయి.
C) భౌగోళిక వెచ్చదనం కలుగును
D) సునామీలు వస్తాయి.
జవాబు:
C) భౌగోళిక వెచ్చదనం కలుగును

6. ఇంధనాన్ని ఆదా చేసే మార్గం ఇది కాదు.
A) సైకిలను ఉపయోగించడం
B) కారుకు బదులు రైలులో ప్రయాణించడం
C) సెల్‌ఫోన్‌ను వాడడం
D) బావి నుండి నీటిని తోడుకోవడం
జవాబు:
C) సెల్‌ఫోన్‌ను వాడడం

7. గాలిని కలుషితం చేసే రేణురూప కలుషితం
A) CO2
B) బూడిద
C) SO2
D) CO
జవాబు:
B) బూడిద

8. క్రింది వృత్త రేఖాచిత్రంలో “నీటి పారుదల సౌకర్యాలు – విస్తీర్ణం” వివరాలు చూపబడ్డాయి. అందు భూగర్భ జల వనరుల శాతం ……………..
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 8
A) 40%
B) 45%
C) 43%
D) 48%
జవాబు:
C) 43%

9. IUCN యొక్క ప్రధాన విధి
A) వన్య ప్రాణుల ఆవాసాల పరిరక్షణ
B) మెట్ట పంటల అధ్యయనం
C) వైరల్ వ్యాధుల అధ్యయనం
D) నీటి పంటలు (wet land) వ్యవసాయ అధ్యయనం
జవాబు:
A) వన్య ప్రాణుల ఆవాసాల పరిరక్షణ

10. ఇంకుడు గుంట వలన ఉపయోగము ……..
A) వర్షాకాలంలో వచ్చే వరదలను అరికట్టడము
B) వ్యవసాయానికి నీరు అందించుట
C) వర్షపు నీటిని నిల్వచేయడము ,
D) భూగర్భజల మట్టాలను పెంచడము
జవాబు:
C or D

11. AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 1 ఈ లోగో దీనిని సూచిస్తుంది ……. ఊహించండి.
A) రియూజ్
B) రెడ్యూస్
C) రీసైకిల్
D) అన్నీ
జవాబు:
C) రీసైకిల్

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

12. తరిగిపోని ఇంధన వనరుకు ఉదాహరణ
A) సహజవాయువు
B) పెట్రోలు
C) సౌరశక్తి
D) వంటచెరకు
జవాబు:
C) సౌరశక్తి

13. భూగర్భ జల మట్టాలను పెంచాలంటే …………
A) బావులు తవ్వాలి
B) కాలువలు తవ్వాలి
C) రోడ్లను తవ్వాలి
D) ఇంకుడు గుంతలు తవ్వాలి
జవాబు:
D) ఇంకుడు గుంతలు తవ్వాలి

14. నేల సంరక్షణా పదతి
A) కాంటూర్ పద్ధతి
B) గడ్డి మొక్కల పెంపకం
C) పంటమార్పిడి పద్ధతి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

15. ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు …………………
A) కార్బన్ డై ఆక్సెడ్
B) ఆక్సిజన్
C) క్లోరోఫ్లోరోకార్బన్స్
D) నైట్రోజన్ డై ఆక్సెడ్
జవాబు:
C) క్లోరోఫ్లోరోకార్బన్స్

16. UNDP అనగా……………….
A) United Nations Development Plan
B) United Nations Development Programme
C) United Nations Drought Programme
D) United Nations Dropout Programme
జవాబు:
B) United Nations Development Programme

17. ICRISAT ఉన్న ప్రదేశం
A) బెంగళూరు
B) హైదరాబాద్
C) చెన్నై
D) పుణె
జవాబు:
B) హైదరాబాద్

18. ఈ గుర్తు దేనిని సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 8
A) UNDP
B) ఇంకుడు గుంతలు
C) సుస్థిర అభివృద్ధి
D) పునః చక్రీయం లోగో
జవాబు:
C) సుస్థిర అభివృద్ధి

19. క్రింది వాక్యా లలో సరియైనది.
a) అభివృద్ధి అవసరం
b) అభివృద్ధి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉండాలి.
A) a సరియైనది, b తప్పు
B) a తప్పు, b సరియైనది.
C) a, b రెండూ తప్పు
D) a, b రెండూ సరియైనవి.
జవాబు:
D) a, b రెండూ సరియైనవి.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

20. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం
1) స్వల్పకాలిక పంటలు పండించడం
2) వ్యాపార పంటలు పండించడం
3) బిందు సేద్యం చేయడం
4) పంట విరామం ప్రకటించడం
A) 1, 3
B) 2, 3
C) 1, 4
D) 3, 4
జవాబు:
A) 1, 3

21. దోమల జనాభా పెరుగుటకు కారణం
A) సముద్రపు నీరు
B) నదులలో ప్రవహించే నీరు
C) కాలువలలో ప్రవహించే నీరు
D) నిలకడగా ఉండే నీరు
జవాబు:
D) నిలకడగా ఉండే నీరు

22. సరి అయిన వాక్యాన్ని గుర్తించండి.
A) గ్యాసన్ను ఆదా చేయటానికి ప్రెషర్ కుక్కర్ వాడాలి.
B) ఉడికించటానికి ఎక్కువ నీరు వాడాలి.
C) వండే ముందు పదార్థాలను నానబెట్టకూడదు.
D) అన్ని అమర్చుకోకుండా స్టవ్ వెలిగించాలి.
జవాబు:
A) గ్యాసన్ను ఆదా చేయటానికి ప్రెషర్ కుక్కర్ వాడాలి.

23. అడవులు లేని ఖండం
A) ఆర్కిటిక్
B) ఆసియా
C) ఆస్ట్రేలియా
D) అంటార్కిటికా
జవాబు:
D) అంటార్కిటికా

24. మన ఇంట్లో గ్యాస్ పొదుపు చేసే మార్గం.
A) వంటలో ఎక్కువ నీరు వాడాలి.
B) వండే ముందు పదార్థాలు నానబెట్టాలి.
C) వండే ముందు పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
D) గ్యాస్పోయ్యికి పెద్ద బర్నర్ వాడాలి
జవాబు:
B) వండే ముందు పదార్థాలు నానబెట్టాలి.

25. ఈ మధ్య జరిపిన పరిశోధనలలో పొద్దుతిరుగుడు పంట దిగుబడి తగ్గడానికి కారణం ఏమని తెలిసింది?
A) పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం
B) రసాయన ఎరువుల వాడకం వల్ల
C) కరువు పరిస్థితులు
D) పైవేవీ కాదు
జవాబు:
A) పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం

26. భూగర్భ జలాలు పెంచుటకు చేయవలసినది
A) ఎక్కువ బోరుబావులు తవ్వడం
B) అడవుల నిర్మూలన
C) పట్టణీకరణ
D) ఇంకుడు గుంతల ఏర్పాటు
జవాబు:
D) ఇంకుడు గుంతల ఏర్పాటు

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు

27. రైతులు గెరిసిడియా పెంచుటకు కారణం
A) కాలుష్యం తగ్గించుటకు
B) నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు
C) కలుపు మొక్కల నియంత్రణకు
D) పశుగ్రాసం కొరకు
జవాబు:
B) నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు

మీకు తెలుసా?

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 2
* నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్ళ, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసే నీటి నిల్వలను ఇంకుడు చెరువులు, (Percolation tanks) అంటారు. బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాళ్ళు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా పొరలు పొరలుగా చెరువు నేలను, అంచుల వెంబడి కప్పుతారు. తరువాత దీనిని గట్టిగా కుదురుకునేలా చేస్తారు. వ్యవసాయం కోసం నీటిని సరఫరా చేయడానికి మట్టికట్టకు తూము ఏర్పాటు చేస్తారు. పూర్తి నీటి నిల్వ మట్టానికి అడుగు మట్టానికి మధ్య నాలుగోవంతు ఎత్తులో తూమును ఇంకుడు చెరువు ఏర్పాటు చేస్తారు. అందువల్ల తగినంత నీటిని విడుదల చేసుకోడానికి వీలు కలుగుతుంది.

* గత కొన్ని సంవత్సరాల నుండి ఋతుపవనాల రాకడలో మార్పులు సంభవించడం వలన, భూగర్భజలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది. డ్రిల్లింగ్, లోతైన గొట్టపు బావులు, బోరు బావులను తవ్వడం వంటి చర్యల వలన విచక్షణారహితంగా రాష్ట్రంలోని భూగర్భజలాన్ని వాడడం వలన, ఈ వనరు బాగా తరిగిపోతున్నది. మన రాష్ట్రంలో 1998-2002 మధ్య కాలంలో సరాసరిగా నీటి స్థాయి 3 మీటర్ల దాక తగ్గింది.

* పూర్వం వాటర్‌షెడ్ (రెండు నదులు లేదా కాలువల మధ్య గల భూ ప్రాంతం) ఆధారంగా, నిపుణులైన రైతుల గ్రామ సరిహద్దులను నిర్ణయించేవారు. రెండు గ్రామాల మధ్య గల మురుగు నీటి పారుదల వ్యవస్థ ఆధారంగా, ఈ హద్దులు నిర్ణయించబడేవి. వ్యవస్థలోని సభ్యులందరూ వీటిని సామాజికంగా అంగీకరించేవారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 3
* శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. ఇది గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టు, తెలంగాణా ప్రాంతంలోని అధిక భాగానికి ఇది జీవనాధారం. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లావాసుల అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. గోదావరి నదిపై ఇతర రాష్ట్రంలో ఆనకట్ట నిర్మించడం వలన, ఎక్కువ శాతం నీరు ఆంధ్రప్రదేశ్ కు చేరకుండానే పై రాష్ట్రాలలో నిలువ చేయబడుతోంది. ఆగస్టు 2013 గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేయబడిన నీటి నిలువ సామర్థ్యం 80.66 టి.ఎం.సి.లు.

* ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నీటి వినియోగంపై నిషేధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కరవు వల్ల సంభవించిన తీవ్రమైన నీటి కొరత వలన తోటలకు నీళ్ళు పెట్టడం, వాహనాలు కడగడం, ఈత కొలను నీటితో నింపడం వంటి కార్యకలాపాలు నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల ప్రజలలో నీటి వినియోగంపై అవగాహన కలిగింది. వృథాను అరికట్టగలిగారు.

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 10
* బయో డీజిల్ ఉత్పత్తికి జట్రోపా కర్కాస్ యొక్క విత్తనాలు వాడడం అనేది శక్తి సుస్లిరత్వాన్ని సాధించడంలో భారతదేశం యొక్క ప్రణాళికలో ముఖ్యమైన ఘట్టం. జట్రోపా మొక్కల పెంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రిలయన్స్ కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. జట్రోపా మొక్కలను పెంచి నాణ్యమైన బయో డీజిల్ ను ఉత్పత్తి చేయడానికి ఈ కంపెనీ కాకినాడ వద్ద 200 ఎకరాల స్థలాన్ని సేకరించింది. జీవ ఇంధనాలను తయారుచేసే పద్దతిని బయో ఎస్టరిఫికేషన్ అంటారు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 10th lesson సహజ వనరులు 11

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 8

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 9

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

These AP 10th Class Biology Most Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 9th lesson Important Questions and Answers మన పర్యావరణం – మన బాధ్యత

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే ఏమవుతుంది?
జవాబు:
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే జీవరసాయన వలయాలు భర్తీ కావు. జీవులలోని సేంద్రియ పదార్థాలు నిరీంద్రియ పదార్థాలుగా మారవు.

ప్రశ్న 2.
క్రింది వానిని పరిశీలించి సంఖ్యా పిరమిడ్ చిత్రం గీయండి.
గడ్డి – మేక – మానవుడు,
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1

ప్రశ్న 3.
పిచ్చుకలు లేని ప్రపంచాన్ని ఊహించలేం. వాటి సంరక్షణ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి?
జవాబు:

  1. క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించాలి.
  2. సెల్ టవర్ రేడియేషన్ తగ్గించాలి.
  3. జైవిక నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  4. పక్షుల సంరక్షణ కేంద్రాలను నెలకొల్పాలి.

ప్రశ్న 4.
మీ పరిసరాలలో మీరు గమనించిన ఒక ఆహారపు గొలుసును గుర్తించి, దానిలోని ఉత్పత్తిదారుల మరియు వివిధ స్థాయిలలో గల వినియోగదారుల పేర్లు వ్రాయండి.
జవాబు:
గడ్డి → కీటకాలు → కప్ప → పాము
ఉత్పత్తిదారులు – గడ్డి
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – కప్ప
తృతీయ వినియోగదారులు – పాము

నీటిమొక్కలు → కీటకాలు → చేప → కొంగ
ఉత్పత్తిదారులు – నీటిమొక్కలు
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – చేప
తృతీయ వినియోగదారులు – కొంగ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఆహారపు గొలుసులోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదార్ల పేర్లను రాయండి.
జవాబు:
ఉత్పత్తిదారులు – మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు
వినియోగదారులు – అన్ని రకాల జంతువులు

ప్రశ్న 6.
“కీటకాలు, పక్షులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము.” వాటిని సంరక్షించుటకు మీరు పాటించే రెండు పద్ధతులను తెలుపండి.
జవాబు:

  1. క్రిమి సంహారక మందులను అతిగా వాడకూడదు.
  2. కీటకాల మరియు పక్షుల సహజ ఆవాసాలను కాపాడాలి.
  3. పార్కులను మరియు పక్షుల సాంక్చ్యురీలను అభివృద్ధి చేయాలి.
  4. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ సూత్రాలను పాటించే విధంగా చైతన్య పరచాలి.

ప్రశ్న 7.
క్రింది ఆహార పిరమిడను గమనించండి. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
i) ఏ పోషక స్థాయిలో అధిక శక్తి ఉంటుంది?
ii) T4 పోషక స్థాయికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
i) T1 (లేదా) ఆకుపచ్చ మొక్కలు (లేదా) ప్రాథమిక ఉత్పత్తిదారులు. –
ii) సింహము, పులి, డేగ మొ||నవి.

ప్రశ్న 8.
పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాలపై అవగాహన కల్పించుటకు ఏవైనా రెండు నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. పచ్చదనాన్ని పెంచు – భూగోళాన్ని శుభ్రంగా ఉంచు.
  2. ప్రకృతిని నీవు నాశనం చేస్తే – ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది.
  3. కాలుష్య నివారణకు ఉత్తమ మార్గం – మొక్కల పెంపకం.
  4. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్యాన్ని తగ్గిద్దాం.

ప్రశ్న 9.
హరితహారంలో భాగంగా మీ పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షించటానికి మీరు ఏ చర్యలు తీసుకొంటారు?
జవాబు:

  1. మొక్కలకు నీటిని సరఫరాచేయటం,
  2. కంచె వేయటము (లేదా) మొక్కల సంరక్షణ,
  3. మొక్కలను దత్తత తీసుకోవటం,
  4. సహజ ఎరువులను సరఫరా చేయటము.

ప్రశ్న 10.
జీవావరణం అనగానేమి?
జవాబు:
భూమి మీద జీవులు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం అంతా ‘కలిపి ‘జీవావరణం’ అంటారు. ఇది అనేక ఆవరణ వ్యవస్థల సమూహం. అతి పెద్ద ఆవాసంగా కూడా జీవావరణాన్ని పరిగణించవచ్చు.

ప్రశ్న 11.
పోషకస్థాయి అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద లభించే పోషక విలువను పోషకస్థాయి అంటారు. సాధారణంగా ఆహార గొలుసులో పోషకస్థాయి వద్ద 10 నుండి 20 శాతం శక్తి బదిలీ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 12.
పర్యావరణం అనగానేమి?
జవాబు:
పర్యావరణం:
జీవజాలం మీద ప్రభావం చూపే జీవభౌతిక కారకాలతో పాటు, రసాయనిక కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” (Environment) అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 13.
పర్యావరణంలోని నిర్జీవ కారకాలు ఏమిటి?
జవాబు:
నిర్జీవ కారకాలు :
పర్యావరణంలో గాలి, నీరు, నేల, కాంతి మొదలైన నిర్జీవ కారకాలను “భౌతిక కారకాలు” అంటారు.

ప్రశ్న 14.
పర్యావరణంలోని జీవకారకాలు ఏమిటి?
జవాబు:
జీవకారకాలు :
పర్యావరణంలోని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను కలిపి “జీవకారకాలు’ అంటారు.

ప్రశ్న 15.
ఆహార గొలుసు అనగానేమి?
జవాబు:
ఆహార గొలుసు:
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధ వరుస క్రమాన్ని ఆహార గొలుసు అంటారు.

ప్రశ్న 16.
ఆహార జాలకం అనగానేమి?
జవాబు:
ఆహార జాలకం :
అనేక ఆహారపు గొలుసుల కలయికను ఆహార జాలకం అంటారు. ఇది ఆహార గొలుసుల మధ్యగల సంబంధాన్ని చూపుతుంది.

ప్రశ్న 17.
ఆహారపు గొలుసులోని స్థాయిలను తెలపండి.
జవాబు:
ఆహారపు గొలుసులో కింది స్లాయిలు ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4

ప్రశ్న 18.
ఆహార గొలుసుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
2. గడ్డి → కుందేలు → నక్క → తోడేలు
3. గడ్డి → మేక → మానవుడు

ప్రశ్న 19.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు జరిగే నష్టమెంత?
జవాబు:
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు 80 నుండి 90% శక్తి వృథా అవుతుంది. ఇది శ్వాసక్రియలోనూ, ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణరూపంలో నష్టపోవటం జరుగును.

ప్రశ్న 20.
భౌమ ఆవరణ వ్యవస్థలోని వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి?
జవాబు:
భూమధ్యరేఖకు, ధృవాలకు మధ్యగల శీతోష్ణస్థితిలోని వ్యత్యాసాలే భౌమ్యావరణ వ్యవస్థలను నిర్ధారిస్తాయి.

ప్రశ్న 21.
కొల్లేరు సరస్సులోనికి ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు ఎలా చేరుతున్నాయి?
జవాబు:
కొల్లేరు పరీవాహక ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. రసాయనిక ఎరువులు కలిగిన ఈ నీరు సరస్సులోనికి చేరి కలుషితం చేస్తుంది.

ప్రశ్న 22.
నిచ్ (Niche) అనగానేమి?
జవాబు:
నిచ్ : ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాహం ‘ లేదా ‘నిచ్’ అంటారు.

ప్రశ్న 23.
జీవావరణ పిరమిడ్ అనగానేమి?
జవాబు:
జీవావరణ పిరమిడ్ :
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించటానికి, ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ అనే భావనను ఉపయోగించారు. వివిధ పోషకస్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ‘పిరమిడ్’ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని “జీవావరణ పిరమిడ్” (Ecological pyramid) అంటారు.

ప్రశ్న 24.
ఆవరణశాస్త్ర పిరమిడ్ లోని రకాలు తెలపంది.
జవాబు:
ఆవరణ శాస్త్ర పిరమిడ్లు మూడురకాలు :

  1. సంఖ్యాపిరమిడ్లు
  2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు
  3. శక్తి పిరమిడ్లు

ప్రశ్న 25.
సంఖ్యాపిరమిడ్ అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులోని జీవులను సంఖ్యాత్మకంగా చూపించే పిరమిడను “సంఖ్యాపిరమిడ్” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 26.
జీవద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని “జీవద్రవ్యరాశి” అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తికోసం వినియోగిస్తే అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

ప్రశ్న 27.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు ఎలా ఉంటాయి?
జవాబు:
జీవద్రవ్యరాశి పిరమిడ్లు :
భౌమ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్లు నిటారుగా ఉంటాయి. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషకస్థాయిలలో ఉన్న జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్ అధోముఖంగా ఉంటుంది.

ప్రశ్న 28.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ శాతం ఎంత?
జవాబు:
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి 10 నుండి 20% వరకు, జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 29.
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏమిటి?
జవాబు:
జలావరణ వ్యవస్థలో నీటి మొక్కలు, నాచు, వృక్షప్లవకాలు ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 30.
శక్తి పిరమిడ్ అనగానేమి?
జవాబు:
శక్తి పిరమిడ్ :
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణను, పరిమాణాన్ని చూపించే రేఖా పటాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.

ప్రశ్న 31.
శక్తి పిరమిడ్ లోని శక్తి క్షీణతను దిమ్మెల చిత్రంలో చూపించండి. వృక్ష ఫ్లవకాలు జంతుప్లవకాలు
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 32.
BOD అనగానేమి?
జవాబు:
“బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్”ను సంక్షిప్తంగా BOD అంటారు. ఇది ఆవాసంలోని ఆక్సిజన్ మోతాదును తెలియజేస్తుంది. ఆక్సిజన్ మోతాదు కంటే తగ్గినపుడు జీవులు మరణించే ప్రమాదం ఉంది.

ప్రశ్న 33.
యూట్రిఫికేషన్ అనగానేమి?
జవాబు:
యూట్రిఫికేషన్ :
నీటిలోనికి పోషక కలుషితాలు అధికంగా వచ్చి చేరటం వలన కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి జలావాసాన్ని పాడుచేస్తాయి. ఈ పరిస్థితిని “యూట్రిఫికేషన్” అంటారు. దీని వలన జలచర జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి.

ప్రశ్న 34.
నీటిని కలుషితం చేసే భారలోహాలు ఏమిటి?
జవాబు:
నీటిని కలుషితం చేసే భారలోహాలు :
సీసం (Pb), కాడ్మియం (Cd), క్రోమియం (Cr), మాంగనీస్(Mn), నికెల్ (Ni) మరియు ఐరన్(Fe) వంటి భారలోహాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 35.
జైవిక వ్యవస్థాపనం అనగానేమి?
జవాబు:
జైవిక వ్యవస్థాపనం :
ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని “జైవిక వ్యవస్థాపనం” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 36.
జైవిక వృద్ధీకరణం అనగానేమి?
జవాబు:
జైవిక వృద్దీకరణం : ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని “జైవిక వృద్ధీకరణం” అంటారు.

ప్రశ్న 37.
ఏదులాబాద్ రిజర్వాయర్ లో పెంచే చేపల పేరు ఏమిటి?
జవాబు:
సిప్రినస్ కార్షికో అనే పొలుసు చేపను ఏదులాబాద్ రిజర్వాయర్లో పెంచుతారు.

ప్రశ్న 38.
పంట మార్పిడి పద్ధతి అనగానేమి?
జవాబు:
పంట మార్పిడి పద్దతి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించే పద్ధతిని “పంటమార్పిడి” పద్ధతి అంటారు.

ప్రశ్న 39.
వంధ్యత్వం కలిగించే పద్ధతి అనగానేమి?
జవాబు:
వంధ్యత్వం కలిగించే పద్ధతి : తెగుళ్లు కలిగించే క్రిమి కీటకాల పురుషజీవులు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేసే ప్రక్రియను “వంధ్యత్వం కలిగించే పద్ధతి” అంటారు.

ప్రశ్న 40.
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుందా? ఎందుకు?
జవాబు:
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఎందుకంటే ఆహారపు గొలుసులో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ అయ్యేటప్పుడు క్షీణత అధికంగా ఉంటుంది. అందువలన ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలదీ ప్రవహించే శక్తి విలువ తక్కువగా ఉండి శక్తి పిథమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.

ప్రశ్న 41.
ఆవరణ వ్యవస్థలో ఆహారానికి మూలం మొక్కలే అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మనం తినే ఆహారాన్ని పరిశీలిస్తే, పెరుగు పాల నుండి వస్తుంది. పాలు ఆవు నుండి లభిస్తాయి. ఆవు గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారం ఏరకమైనా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలే.

ప్రశ్న 42.
మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సు ఎక్కడ విస్తరించి ఉంది?
జవాబు:
మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇది ఒక పెద్ద మంచి నీటి సరస్సు. దాదాపు 6121 చ.కి.మీ. విస్తరించి ఉంది.

ప్రశ్న 43.
కొల్లేరు సరస్సు యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1999 నవంబరులో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడ 193 రకాల పక్షి జాతులు, వివిధ రకాల జంతు వృక్షజాలానికి ఆవాసంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల మందు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్, మార్చి నెలల మధ్యకాలంలో ప్రతి ఏటా దాదాపు, 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. సరస్సుపై ఆధారపడి దాదాపు 20 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు.

ప్రశ్న 44.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది.
  5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈ క్రింది ఫ్లోచార్టును వివరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 3
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా. నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన సంఖ్యా పిరమిడను పరిశీలించి, ప్రశ్నలకు జవాబిమ్ము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
i) పోషక స్థాయిలలోని జీవుల సంఖ్య ప్రకారం అతి ఎక్కువగా, అతి తక్కువగా గల జీవులు ఏవి?
ii) ఒకవేళ ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే ఏం జరుగుతుంది?
జవాబు:
i) పోషక స్థాయిలోని జీవుల సంఖ్య ప్రకారం ఎక్కువగా గల జీవులను ‘ఉత్పత్తిదారులు’ అని, తక్కువగా గల జీవులను ‘తృతీయ వినియోగదారులు’ అని అంటారు.
ii) ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే తృతీయ వినియోగదారులకు ఆహారం లభించక వాటి సంఖ్య తగ్గిపోతుంది. ప్రథమ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది.

ప్రశ్న 3.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) పై పటం నుండి ఏవైనా రెండు ఆహార గొలుసులు తెలపండి.
ii) నీవు వ్రాసిన ఆహారపు గొలుసులోని ద్వితీయ వినియోగదారులు ఏమిటి?
జవాబు:
i) a) మొక్క → మేక → పులి
b) మొక్క → కుందేలు → తోడేలు / నక్క

ii) పులి, తోడేలు / నక్క
(లేదా)

i) a) వృక్షప్లవకాలు → క్రస్టేషియన్లు → చేపలు
b) మొక్కలు → ఎలుకలు → గ్రద్ద

ii) చేపలు, గ్రద్ద

ప్రశ్న 4.
గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
పై ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగిస్తే ఏమి జరుగుతుంది? వివరించుము.
జవాబు:

  1. ఇవ్వబడిన ఆహారపు గొలుసులో కప్ప ద్వితీయ వినియోగదారు.
  2. ఈ ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగించినట్లయితే మిడతల సంఖ్య పెరుగును. మరోవైపు కప్పల మీద ఆధారపడిన పాముల సంఖ్య తగ్గుతుంది.
  3. దీని వలన జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

ప్రశ్న 5.
పర్యావరణం అనగానేమి? అందలి అంశాలు ఏమిటి?
జవాబు:
పర్యావరణం :
జీవుల మీద ప్రభావం చూపే జీవ, భౌతిక కారకాలతో పాటు, రసాయన కారకాలన్నింటిలో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” అంటారు.

పర్యావరణంలోని అంశాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

1. నిర్జీవ అంశాలు :
గాలి, నేల, నీరు, కాంతి మొదలైన భౌతిక కారకాల ఎ “నిర్జీవ అంశాలు” అంటారు.

2. జీవకారకాలు :
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, క్రిములు, కీటకాలు అన్నింటిని “జీవకారకాలు” అంటారు.

ప్రశ్న 6.
ఆహారపు గొలుసు, ఆహారజాలకాన్ని నిర్వచించండి.
జవాబు:
ఆహారపు గొలుసు :
ఆవాసంలో జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని చూపించే రేఖీయ చిత్రాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇది సాధారణంగా ఉత్పత్తిదారులతో ప్రారంభమై అగ్రశ్రేణి వినియోగదారులతో ముగుస్తుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 8

ఆహారజాలం :
ఆవరణ వ్యవస్థలోని అన్ని ఆహారపు గొలుసులను కలిపి ఆహారజాలం అంటారు. ఇది సంక్లిష్ట నిర్మాణం. ఇది ఒక జీవి ఎన్ని రకాలుగా ఆహారం పొందుతుందో వివరిస్తుంది.

ప్రశ్న 7.
ఆవరణ వ్యవస్థను నిర్ణయించే కారకాలు తెలపండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలో గాలి, నీరు, నేల, ఉష్ణోగ్రత, లవణాలు, కాంతి వంటి నిర్జీవ కారకాలు ఆవరణ వ్యవస్థను నిర్ణయిస్తుంటాయి. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగానూ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలు అటవీ ఆవాసంగానూ, జలవనరులు ఉన్న ప్రాంతాలు జల ఆవాసాలుగానూ మారతాయి.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 8.
నిచ్ అనగానేమి? ఇది ఆవాసం కంటే ఎలా భిన్నమైనది?
జవాబు:
ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాసం’ లేదా ‘నిచ్’ (Niche) అని వర్ణిస్తారు. ఉదాహరణకు, ఆకుల నుండి రసాలను పీల్చే ఎఫిడ్లు అనే కీటకాలకు ఒక స్థానం ఉంటే ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసే లేదా కొరికే దవడలున్న గొంగళి పురుగులకు మరొక స్థానం ఉంటుంది.

‘నిచ్’ అనే పదం, ఆహార జాలకంలో జంతువు యొక్క ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్నే కాకుండా, దాని జీవన విధానాన్ని తెలుపుతుంది. ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలమైనట్లే ‘నీచ్’ దాని బ్రతుకుదెరువును అంటే ఆ జీవి చేసే పనిని, సంచరించే ప్రదేశాలను ఆహారం పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది.

ప్రశ్న 9.
ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ (Pyramid) అనే భావనను ఉపయోగిస్తారు. వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ‘జీవావరణ పిరమిడ్’ (Ecological pyramid) అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త ‘చార్లెస్ ఎల్టన్’ 1927లో ఆవరణశాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టాడు. పిరమిడ్ పీఠభాగంలో ఉత్పత్తిదారులు (ప్రథమ పోషకస్థాయి), వాటిపై క్రమంగా ఇతర పోషకస్థాయిలు (ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు) ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటాయి.

ఆవరణశాస్త్ర పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి: 1. సంఖ్యాపిరమిడ్లు . 2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు – 3. శక్తి పిరమిడ్లు.

ప్రశ్న 10.
సంఖ్యా పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ అనే రేఖాపటం ద్వారా చూపవచ్చును. పిరమిడ్ లోని ప్రతిభాగం ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయి (Trophic level) లో గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. ప్రథమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారుల వరకు, ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయిలో సాధారణంగా జీవుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కానీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది.

ప్రశ్న 11.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
చెట్లు, గుల్మాలు, పంటలు, గడ్డి, శైవలాలు, నీటి మొక్కలు, వ్యవసాయ మరియు అరణ్య సంబంధ అవక్షేపాలు, మొక్కల, జంతువుల విసర్జితాలన్నీ జీవద్రవ్యరాశులే. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి (Biomass) అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే, అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

జీవద్రవ్యరాశి పిరమిడ్ ప్రతి పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని, వివిధ పోషకస్థాయిలలో ఉన్న రాశుల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది. భౌమ్యావరణ వ్యవస్థలలో, ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల జీవద్రవ్యరాశి పిరమిడ్ల నిర్మాణం నిటారుగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలలో ఉన్న జీవుల జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 12.
జలావరణ వ్యవస్థలోని జీవద్రవ్యరాశి పిరమిడను వర్ణించండి.
జవాబు:
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కల జీవద్రవ్యరాశి, వీటిని ఆహారంగా తీసుకొనే క్రస్టేషియన్లు మరియు శాకాహార చేపల జీవద్రవ్యరాశి కన్నా చాలా తక్కువ. చిన్న చేపలు తినే పెద్ద, మాంసాహార చేపల జీవ ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధమైన పిరమిడ్ నిర్మాణం తలకిందులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి 10 నుండి .20% వరకు జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 13.
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని క్రింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని కింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకనగా, జీవద్రవ్యరాశి అనేది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారానికి కొలమానం. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు, దానిలోని కొంతభాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి ఆహారమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడడం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించబడకపోవడం జరుగుతుంది.

ప్రశ్న 14.
జీవద్రవ్యరాశి పిరమిడ్లో శక్తి తగ్గుదలను వివరించండి.
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 15.
కొల్లేరు సరస్సు విస్తీర్ణం తగ్గుదలకు గల కారణాలు ఏమిటి?
జవాబు:
80వ దశకం నుండి కొల్లేరు ప్రాంతంలో రొయ్యలు, చేపల పెంపకం (Acqua culture) అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా విస్తరించింది. అందువల్ల అనేక మంది పెట్టుబడిదారుల దృష్టి దీని పైబడి సరస్సు ఆక్రమణలకు గురైంది. 1996 నాటికి చాలా ప్రాంతాలలో కట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని మళ్ళించి సరస్సును సాగుభూమిగా మార్చారు. ఇది సరస్సు సహజ ప్రవాహ దిశను మార్చివేసింది. అందువల్ల సరస్సులో నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.

ప్రశ్న 16.
విచక్షణారహితంగా పెస్టిసైడ్లు వాడటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
పెస్టిసైడ్లు విచక్షణారహితంగా ప్రభావాన్ని చూపుతూ, ఎక్కువ సంఖ్యలో ఇతర జంతువులను నాశనం చేస్తాయి. వీటిలో ఈ క్రిములను ఆహారంగా తీసుకొనే జంతువులు మరియు ఇతరులకు ఆహారమయ్యే జంతువులూ ఉంటాయి. ఫలితంగా పెస్టిసైడ్లు ఆహారపు గొలుసులలో అనూహ్యమైన మార్పులకు దారితీస్తూ, ఆవరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి నేలలో కలిసిపోయినపుడు అవి కలిగించే ప్రభావం ఇంకా అపాయకరంగా ఉంటుంది.

ప్రశ్న 17.
జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణం పదాలను నిర్వచించంది.
జవాబు:
పాదరసం, ఆర్సెనిక్, సీసం కలిగియున్న పెస్టిసైడ్లు విచ్ఛిన్నం చెందవు. విచ్ఛిన్నం కాని పెస్టిసైడ్లు చాలా అపాయకరమైనవి. ఇవి ఒక్కొక్క పోషకస్థాయిలో కేంద్రీకృతమవుతూ పిరమిడ్ శిఖర భాగంలో ఉండే జంతువుల శరీరాలలోనికి చేరి అపాయకరమైన స్థాయిలో పేరుకుంటాయి. ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని ‘జైవిక వ్యవస్థాపనం’ (Bio accumulation) అంటారు. ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరవాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని జైవిక వృద్ధీకరణం (Bio magnification) అంటారు.

ప్రశ్న 18.
చేపలను లోహ కాలుష్య సూచికలుగా పరిగణిస్తున్నారు. ఎందుకు?
జవాబు:
పట్టణ, పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానాలు, మానవుల నిత్యకృత్యాల కారణంగా భారమూలకాలు దగ్గరలోని నీటివనరులలో కలుస్తున్నాయి. దీని వలన జీవజాలం ఈ కలుషిత నీటిలోనే జీవనం కొనసాగించవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో జీవించే చేపలు లోహ కాలుష్య వాతావరణానికి తీవ్రంగా ప్రతిస్పందించడాన్ని గమనించారు. అందువల్ల ఈ మధ్యకాలంలో చేపలను లోహకాలుష్యాలకు జీవసూచికలుగా భావిస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 19.
ఏదులాబాదు రిజర్వాయర్ లోని చేపలలో గుర్తించిన కలుషితాలు ఏమిటి?
జవాబు:
ఏదులాబాదు చేపల్లో భారమూలకాల పరిమాణం దేశ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అలాగే భారమూలకాల సంచయనాన్ని పరిశీలిస్తే అన్నింటికన్నా ఎక్కువ ఇనుము ఉండగా సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూలకాలు ఆహార జాలకం ద్వారా చేపల కణాల్లో చేరి అక్కడ నుండి మానవులలోకి చేరుతున్నాయి. చేపల కాలేయం, మొప్పలు, మూత్రపిండాలలో కాడ్మియం అత్యధికంగా చేరుతోంది. అతి తక్కువ గాఢతలలో కూడా చేపలు కాడ్మియం లోహానికి సున్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఇది చేపల కణజాలంలోకి సులభంగా చేరుతోందని గుర్తించారు. క్రోమియం, ఇనుము, నికెల్, సీసం తరువాతి స్థానాలలో ఉన్నాయి.

ప్రశ్న 20.
మానవ కార్యకలాపాలు సహజ ఆవరణవ్యవస్థలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
నదులపై ఆనకట్టలు నిర్మిస్తూ, చిత్తడి నేలలను, సముద్రతీరాలను ఆక్రమిస్తూ, అడవులను నరుకుతూ, భూమిని దున్ని పంటలను పండిస్తూ, కాలువలు, రహదారులు, పట్టణాలు మరియు నగరాలను నిర్మిస్తూ మానవుడు సహజ ఆవరణ వ్యవస్థలను ఎన్నో మార్పులకు గురిచేశాడు. ఈ మార్పులు సహజ ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న వృక్ష, జంతుసముదాయాలను చాలా వరకు మార్చివేశాయి.

ప్రశ్న 21.
ఒక పట్టణ అభివృద్ధిలో ఏ ఏ మార్పులు, జీవజాలంలో చోటు చేసుకుంటాయి?
జవాబు:

  1. కొన్ని వృక్షజంతు జాతులు చనిపోతాయి.
  2. కొన్ని మారిన, కొత్త పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని తక్కువ సంఖ్యలో మనుగడ కొనసాగిస్తాయి.
  3. కొన్ని మారిన, కొత్త పరిస్థితుల నుండి లాభాన్ని పొందుతూ, వాటి సంఖ్యను పెంచుకుంటాయి.

ప్రశ్న 22.
మినిమేటా వ్యాధి గురించి రాయండి.
జవాబు:
మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమయోటో ప్రిఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్ర (Shiranui sea), మినమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్లపాటు కొనసాగాయి.

ప్రశ్న 23.
పిచ్చుకల ప్రయోజనాన్ని శాస్త్రవేత్తలు ఎలా తెలియజేశారు?
జవాబు:
చనిపోయిన పిచ్చుకల జీర్ణవ్యవస్థలోని పదార్థాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. దానిలో మూడు వంతులు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు ఉండగా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగం కలిగించే పక్షులని వారు తమ పరిశోధనల ద్వారా నిర్ధారణకు వచ్చారు. పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వలన పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గిపోయింది.

ప్రశ్న 24.
పిచ్చుకల నిర్మూలన వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
మిడతలను తినే పిచ్చుకలు లేకపోవడంతో పంటలపై మిడతల దాడి ఎక్కువయింది. దానితో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అతి పెద్ద కరవుకు దారితీశాయి. మిడతలను చంపడానికి కీటకనాశనులను పెద్దమొత్తంలో వినియోగించడం ప్రారంభించడంతో నేల నాణ్యత క్షీణించిపోయింది. పొలాలలో పనిచేయాల్సిన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకపోడంతో వేల సంఖ్యలో గ్రామాలను వదిలి పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 25.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది. 5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
క్రిమి కీటకాల బారి నుండి పంటలను, ఆహార పదార్థాలను నివారించే క్రిమి సంహారకాలను ఉపయోగించాలా? లేదా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలా ? ఆ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను రాయండి.
జవాబు:

  1. క్రిమి సంహారకాలను ఉపయోగించరాదు. వీనికి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలి.
  2. విచక్షణ కాని క్రిమి సంహారకాల వినియోగం వివిధ రకాల కాలుష్యాలకు కారణమవుతుంది.
  3. హానికారక క్రిమిసంహారకాలు ఆవరణ వ్యవస్థలోనికి చేరి జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణంలకు కారణమైన పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నది.
  4. క్రిమిసంహారకాలకు ప్రత్యామ్నాయంగా జైవిక నియంత్రణ, వంధ్యత్వం, జన్యు ఉత్పరివర్తన రకాల అభివృద్ధి మరియు తెగుళ్ళకు సంబంధించిన మూలకారణాల అన్వేషణ విధానాలను అనుసరించాలి.

ప్రశ్న 2.
క్రిమి సంహారకాల వినియోగాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి అనువైన ఏవైనా 4 పర్యావరణహిత పద్ధతులను వివరించండి.
(లేదా)
పంటలకు హాని కలిగించే చీడ పీడలను నివారించేందుకు అనుసరించాల్సిన ఏవేని నాలుగు జైవిక నియమాలను రాయండి.
జవాబు:
పంటలను నాశనం చేసే చీడలను తొలగించడానికి వాడే, రసాయనిక క్రిమి సంహారకాల పర్యావరణాన్ని నాశనం చేయడమే కాక నేలను కూడా కాలుష్యం చేస్తాయి. నేల కాలుష్యాన్ని నివారించడానికి ఈ క్రింది పద్ధతులు ఆచరణ యోగ్యం అయినవి.

1) పంట మార్పిడి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరు వేరు పంటలను పండించే పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల తెగుళ్ళను, వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.

2) తెగుళ్ళకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవడం :
ఏ తెగులు ఎలా వ్యాపిస్తుంది, దీనికి మూల కారణాలేంటి, అనే విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం వలన పంట నష్టాన్ని నివారించవచ్చు.

3) జైవిక నియంత్రణ :
తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను, నిశాచర మాంస భక్షకులను ప్రవేశపెట్టడం ద్వారా తెగుళ్ళను నివారించవచ్చు.

4) వంధ్యత్వం :
తెగుళ్ళు కలిగించే క్రిమి కీటకాల పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంధ్యత్వం చేయడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.

5) జన్యు ఉత్పరివర్తన రకాలు :
వివిధ రకాల తెగుళ్ళను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాలను అభివృద్ధి చేయడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చు.

6) పర్యావరణ నైతికత కల్గి ఉండడం :
పర్యావరణం పట్ల నైతికత కల్గి ఉండాలి. పర్యావరణ సంబంధ చట్టాలను తెలుసుకోవడమే కాక పర్యావరణపరంగా ఏది సరి అయినది ఏది సరికానిదో తెలుసుకొని ప్రవర్తించాలి.

ప్రశ్న 3.
ఈ దిగువనీయబడిన పటములోని సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) మీకివ్వబడిన ఆహార జాలకంలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏవి?
ii) పటము నుండి ఏదైనా ఒక ఆహారపు గొలుసును తయారు చేయండి.
iii) పై ఆహారజాలకంలో తృతీయ వినియోగదారులేవి?
iv) ఏవేని రెండు శాకాహార జంతువుల పేర్లను తెలపండి.
జవాబు:
i) మొక్కలు, గడ్డి, వృక్షప్లవకాలు, చెట్లు మొదలైనవి.
ii) గడ్డి → కుందేలు → నక్క → పులి
iii) పులి, రాబందు, కొంగ, గుడ్లగూబ, నెమలి మొదలైనవి.
iv) కుందేలు, జింక, మేక, ఆవు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 4.
ప్రక్కన చూపిన జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 9
a) ఈ పిరమిడ్ లో పైకి వెళ్ళే కొద్దీ ద్రవ్యరాశి తగ్గిపోతుంది కదా ! ఎందుకు?
జవాబు:
ఈ పిరమిడ్ నందు ఉత్పత్తిదారుల నుండి పై పోషకస్థాయికి పోయేకొలది జీవ ద్రవ్యరాశి 10% మాత్రమే బదిలి జరుగుతుంది. అందువలన ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

b) ఉత్పత్తిదారులకు, ప్రాథమిక వినియోగదారులకు కొన్ని ఉదాహరణలిమ్ము..
జవాబు:
ఉత్పత్తిదారులు : ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు, వృక్ష ప్లవకాలు
ప్రాథమిక వినియోగదారులు : శాకాహార జంతువులు (లేదా) కుందేలు, ఆవు, మేక మొ॥

c) ఉత్పత్తిదారులకు శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు శక్తి సూర్యుని నుండి లేదా సూర్యరశ్మి నుండి లభిస్తుంది.

d) ప్రతీ పోషకస్థాయిలో ఎంత ద్రవ్యరాశి నష్టపోతున్నది?
జవాబు:
ప్రతీ పోషకస్థాయిలో 90% ద్రవ్యరాశి నష్టపోతుంది.

ప్రశ్న 5.
శక్తి పిరమిడ్ ను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 10

  1. ఆవరణ వ్యవస్థలో ఆహారం ద్వారా జీవులలో శక్తి ప్రసరణ జరుగుతుంది. ఆహారపు గొలుసులో కేలరీలు శక్తిప్రసరణను పిరమిడ్ ఆకారంలో రేఖాత్మకంగా సూచించడాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.
  2. ఆహారగొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం జరుగుతుంది. ప్రతి పోషక స్తాయిలో 20% ఆహారం నష్టపోవడం జరుగుతుంది.
  3. కావున ఆహారపు గొలుసులో పైకి ప్రయాణిస్తున్నది కొలది శక్తి విలువ తగ్గుతుంది, అందువలన శక్తిపిరమిడ్ ఎల్లప్పుడూ శీర్షాభిముఖంగానే ఉంటుంది.
  4. ఈ పిరమిడ్ లో అడుగుభాగాన ఉత్పత్తిదారులు అధిక శక్తిని కలిగి ఉండగా, ప్రతి పోషక స్థాయిలో సుమారు 10% శక్తి బదిలీ అవుతూ ఉంటుంది.

ప్రశ్న 6.
నీటిలో అధిక పోషకాలు కలిగిన వ్యర్థాలు చేరటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, చేపల చెరువుల వ్యర్థాలు, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు, మున్సిపల్ వ్యర్థాలు మొదలైనవన్నీ సరస్సులో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు (Anthropogenic pollutants) కలుపు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి.

ఫలితంగా సరస్సులో నీరు క్షారస్వభావంతో, మురికిగా, పోషక పదార్థాలతో కూడి ఉండడం వల్ల నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం (DO) తగ్గిపోయింది. జైవిక ఆక్సిజన్ డిమాండ్ (BOD) ఎక్కువ కావడం వలన జలచరాలపై తీవ్ర ప్రభావం కలిగింది. ఇక్కడి ప్రజలకు జలకాలుష్యంపై అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్ మొదలైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. వీటితో పాటు దోమలు వంటి వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా ప్రబలాయి. రొయ్యలు, చేప వంటి జలచరాలు కూడా కాలుష్యానికి గురయ్యాయి. పొలాలు వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయాయి. దిగుబడి తగ్గిపోయింది.

ప్రశ్న 7.
చైనా ప్రభుత్వం పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది?
జవాబు:
చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉతృతిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపుదిద్దుకొనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటిదాకా చైనా వ్యవయసాయాధారిత సమాజమే. ఈ ఉద్యమంలో భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అన్నది ఒక ముఖ్యాంశం. దీనివల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది.

ఈ మొదటి విజయంతో తరువాతి సంవత్సరానికి మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. కానీ వాతావరణం అందుకు సహకరించలేదు. కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలను సాధించలేకపోయామనే భయంతో ప్రభుత్వ వ్యవసాయాధికారులు దిగుబడిని ఎక్కువగా లెక్కగట్టారు. ఈ తప్పుడు లెక్కలు ప్రజల అవసరాలకు ఆహార సరఫరాలకు మధ్యగల సమతుల్యత పై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనినుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైకి నెట్టారు. గిడ్డంగుల నుండి సంవత్సర కాలంలో ఒక పిచ్చుక సుమారుగా 1.8 కిలోల ధాన్యపు గింజలు తిన్నదని అందువల్ల ఆహార కొరత ఏర్పడిందని ప్రకటించారు. పిచ్చుకలపై నేరాన్ని మోపారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందరినీ పిచ్చుకలపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.

ప్రశ్న 8.
మీ ఇంట్లో ఏయే పనులకు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారు? వాటిని సంరక్షించడానికి నీవు చేపట్టే చర్యలు ఏవి?
జవాబు:
మా ఇంట్లో LPGని వంటకు, వేడి చేయడానికి మరియు మండించే ప్రక్రియలందు శిలాజ ఇంధనాలను వినియోగిస్తాము. పెట్రోలు మరియు డీజిలను రవాణాకు మరియు జనరేటర్లు, నీటిపంపులు పనిచేయడానికి వినియోగిస్తాము.

శిలాజ ఇంధనాలను సంరక్షించడానికి చేపట్టే చర్యలు :

  1. వంట చేయడానికి అవసరమయిన పదార్ధములు మరియు పాత్రలు సిద్ధం చేసుకున్న తర్వాతే వంట చేయడం మొదలు పెడతాను.
  2. అన్నంను రైస్ కుక్కర్ నందు వండుట వలన 20% మరియు మాంసంను వండుట ద్వారా 41.5% సహజ వాయువును ఆదా అయ్యే విధంగా చూస్తాను.
  3. ప్రెజర్ కుక్కర్ నందు మరిగే ప్రక్రియ – ప్రారంభం అయిన వెంటనే పొయ్యి మంట పరిమాణాన్ని తగ్గిస్తాను. దీని ద్వారా నాకు 35% ఇంధనం ఆదా అవుతుంది.
  4. ఆహార పదార్థాలను వండడానికి ముందు కొంచెం సేపు నానబెట్టుట వలన 22% ఇంధనం ఆదా చేయగలుగుతాను.
  5. వెడల్పు మరియు తక్కువ లోతుగల పాత్రలలో ఆహార పదార్థాలను వండుతాను. తద్వారా ఇంధనమును ఆదా చేస్తాను.
  6. వండే పాత్రలపై మూతను ఉంచుట ద్వారా ఆహార పదార్ధములు త్వరగా ఉడుకునట్లు చూస్తాను.
  7. పాఠశాలకు నడకద్వారా ప్రతిరోజు వచ్చి వెళతాను. దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభుత్వ రవాణా సాధనములను ఉపయోగిస్తాను.
  8. శిలాజ ఇంధనాలకు బదులుగా నీటిని వేడిచేయడానికి, బల్బులను వెలిగించడానికి సోలార్ శక్తిని వినియోగిస్తాను.
  9. పెట్రోలు మరియు డీజిల్ తో నడిచే జనరేటర్లు, నీటి పంపులను సోలార్ పవర్ తో నడిచే విధంగా చూస్తాను.

ప్రశ్న 9.
సాధారణంగా ఆవరణ వ్యవస్థలలో ఉత్పత్తిదారుల నుండి అగ్రభాగాన ఉండే మాంసాహారులకు చేరేసరికి జీవుల సంఖ్య, జీవద్రవ్యరాశి తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొలది శక్తి ప్రసరణ తగ్గుతుంది. సరిపడిన శక్తి కొరకు వినియోగదారులు అధిక సంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఆహార కొరత ఏర్పడి, అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కావున ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల కంటే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు దానిలోని కొంత భాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి అవసరమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడటం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించకపోవడం జరుగుతుంది. జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో నిక్షిప్తమైన . స్థితిశక్తి పై పోషకస్థాయిలకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 10.
మీ గ్రామములో కుటుంబ నియంత్రణ, ఆరోగ్య పరిశుభ్రత, పచ్చదనం, పోలియో, ఎయిడ్స్ వంటి కార్యక్రమాలు అమలుపరచడానికి ఎప్పుడు, ఏయే సందర్భాలలో, ఎటువంటి కార్యక్రమాలు చేపడతావో పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

వ్యాధి పేరు/ కార్యక్రమం పేరుఅమలు పరిచే కార్యక్రమాలు
1. పోలియోపల్స్ పోలియో కార్యక్రమము నందు అందరు పిల్లలకు వ్యాక్సిన్ వేయటం.
ఇంటింటి ప్రచారం – పోలియో రహిత సమాజం కోసం ప్రచారం.
కరపత్రముల ద్వారా పోలియో వ్యాధి నివారణ చర్యలు ప్రచారం చేయటం.
డాక్టర్లచే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
2. AIDSఆశ వర్కర్ల సహాయంతో HIV వైరస్ పట్ల ఇంటింటికి తిరిగి అవగాహన కల్గించడం.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులచే ప్రచారం చేయించటం కరపత్రాలు మరియు గోడపత్రికలు విడుదల చేయడం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (డిసెంబర్ 1) జరపటం
సామూహిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం
నిపుణులైన వైద్యులచే సమావేశాలు నిర్వహించడం
3. కుటుంబ నియంత్రణప్రజలలో అవగాహన కల్పించడం సామూహిక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సా శిబిరాలను ఏర్పాటు చేయడం.
4. ఆరోగ్యం – పరిశుభ్రతఆరోగ్యంగా ఉండవలసిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించుట.
పరిశుభ్రత పై నిపుణులచే సలహాలు ఇప్పించుట
ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాల నిర్వహణ
5. పచ్చదనంపచ్చదనం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం సామూహిక చెట్లు నాటే కార్యక్రమాలు వనమహోత్సవాల నిర్వహణ

ప్రశ్న 11.
పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలు మీ పాఠశాలలో ఏమేమి నిర్వహిస్తారో రాయండి.
జవాబు:

  1. పర్యావరణ క్లబ్బులను పాఠశాలలో ఏర్పడే విధంగా చూస్తాము. క్లబ్బు సభ్యులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వాటిలో గ్రామ ప్రజల భాగస్వామ్యము ఉండే విధంగా చూస్తాము.
  2. పాఠశాల యందు అందమైన తోటను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. ఇందులో పూల, పండ్ల మరియు కూరగాయల మొక్కలు ఉండే విధంగా చూస్తాము.
  3. పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కరెంటు సరఫరాను నిలుపుదల చేయు అలవాటును విద్యార్థులలో కల్పిస్తాను. దీనిద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు.
  4. పాఠశాలలో పోగయిన చెత్తను కాల్చకుండా చూస్తాము. క్రుళ్ళిపోయే పదార్థాలను గుర్తించి వాటిని కంపోస్టు ఎరువు తయారీలో వినియోగిస్తాము. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూస్తాము.
  5. పాఠశాల ఒక మూలయందు కంపోస్టు ఎరువును తయారు చేయుటకు గుంటను త్రవ్వి అందులో మధ్యాహ్న భోజన సమయంలో తయారగు వ్యర్థాలు అన్నింటిని వేసి కంపోస్టు తయారీని చేపడతాము. దానిని పాఠశాలలో పెరిగే మొక్కలకు ఎరువుగా వినియోగిస్తాం.
  6. బాల బాలికలు పాలిథీన్ కవర్లు కాకుండా గుడ్డ సంచులను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తాము.
  7. ఘన వ్యర్థాలను సేకరించి వాటిని సక్రమ నిర్వహణ ద్వారా వినియోగించి నేల కాలుష్యము కాకుండా చూస్తాము.
  8. విద్యార్థిని విద్యార్థులు ‘4R’ ల పద్ధతిని పాటించే విధంగా కృషి చేస్తాము. తగ్గించడం, తిరిగి వినియోగించడం మరియు పునఃచక్రీయం పద్ధతులను అవలంబించే విధంగా కృషి చేస్తాము.

ప్రశ్న 12.
జీవ ద్రవ్యరాశి అనగానేమి? కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడు గీయండి.
ఎ) గడ్డి బి) శాకాహారులు సి) మాంసాహారులు డి) గద్ద లేదా రాబందు
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. వివిధ ఆహారపు గొలుసుల జీవ ద్రవ్యరాశి పిరమిడ్లను నిర్మిస్తే అవి ఆహారపు గొలుసులోని జీవుల పరిమాణాన్ని సూచిస్తాయి.
గడ్డి → కీటకం → పాము → గద్ద
ఉత్పత్తి శాకాహారి → మాంసాహారి → అగ్రశ్రేణి మాంసాహారి

పై ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడను నిర్మిస్తే అది అధోముఖంగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలది జీవుల యొక్క జీవ ద్రవ్యరాశి పెరుగుతుండుట వలన పిరమిడ్ తలక్రిందులుగా ఏర్పడింది. కానీ సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉంటాయి.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత ½ Mark Important Questions and Answers

విస్తరింపుము

1. EBWRని విస్తరించండి.
జవాబు:
ఎడులాబాద్ వాటర్ రిజర్వాయర్

2. MOEF ని విస్తరించండి.
జవాబు:
పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ

3. BODని విస్తరించండి.
జవాబు:
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్

4. DO ని విస్తరించండి.
జవాబు:
కరిగిన ఆక్సిజన్

దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

5. పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవేతర కారకాలు అంటారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవ కారకాలు అంటారు.

6. జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.
జవాబు:
నిర్జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.

7. పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

8. పోషకస్థాయి ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.
జవాబు:
నిచ్ ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.

9. ఈజిప్ట్ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.

10. పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ విచ్ఛిన్నకారుల చేత ఆక్రమించబడుతుంది.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ ఉత్పత్తిదారుల చేత ఆక్రమించబడుతుంది.

11. ఆహార గొలుసులో ప్రతి దశలో సుమారు 10% ఆహారం పోతుంది.
జవాబు:
ఆహారగొలుసులో ప్రతి దశలో సుమారు 90% ఆహారం పోతుంది.

12. ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశపెట్టే ప్రక్రియను బయో మాగ్నిఫికేషన్ అంటారు.
జవాబు:
ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశ పెట్టే ప్రక్రియను జైవీకరణ అంటారు.

13. కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషకస్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవీకరణ అంటారు.
జవాబు:
కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవిక వృద్ధీకరణ అంటారు.

నేను ఎవరు?

14. నేను ఒక వ్యా ధిని. నేను మొట్టమొదట 1956లో జపాన్లో కనుగొనబడ్డాను. నా కారణంగా పిల్లి, కుక్క పంది మరియు మానవుల మరణాలు 36 ఏళ్ళు కొనసాగాయి. నేను ఎవరు?
జవాబు:
మినిమేటా

15. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచినీటి సరస్సును. నేను 20 మిలియన్ల నివాసితులకు ఆవాసంగా ఉన్నాను. 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది.
జవాబు:
కొల్లేరు సరస్సు

16. నేను బ్రిటిష్ పర్యావరణవేత్తను. పర్యావరణ పిరమిడ్ అనే పదాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తిని నేను.
జవాబు:
చార్లెస్ ఎల్టన్

17. ఆహార గొలుసు మరియు ఆహార జాలకం గురించి తప్పుగా పేర్కొన్న వ్యత్యాసాన్ని కనుగొనండి.
1. ఇది జీవుల యొక్క సరళ ప్రముల.
2. ఇది బహుళ ఆహార గొలుసుల సముదాయం
3. ఆహార గొలుసు బహుళమార్గాన్ని అనుసరిస్తుంది.
4. ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.
జవాబు:
4 – ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.

జతపరచుట

18. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
సంఖ్యా పిరమిడ్ – జీవి యొక్క బరువు
జీవ ద్రవ్యరాశి పిరమిడ్- జీవుల సంఖ్య
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం
జవాబు:
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం

19. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
ఉత్పత్తిదారి – ఎలుక
ప్రాథమిక వినియోగదారుడు – మొక్క
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి
జవాబు:
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి

20. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు
పులి – ప్రాథమిక వినియోగదారులు
జింక – అగ్ర మాంసాహారి
జవాబు:
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

21. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
జైవిక వృద్ధీకరణ – ఆహార గొలుసులోకి కాలుష్య కారకాల ప్రవేశం
జైవీకరణ – కాలుష్య కారకాల సాంద్రత
పోషకస్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి
జవాబు:
పోషక స్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి

ఉదాహరణ ఇవ్వండి

22. జంతువులు జీర్ణించుకోని మొక్కల పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సెల్యులోజ్, లిగ్నిన్

23. కీటకాల బాహ్య అస్థిపంజరం, మరియు ఈకలు జీర్ణం కాని జంతువుల భాగాలు. వీటికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రోమాలు

24. మెర్క్యురీ మరియు ఆర్సెనిక్ నీటిలో ఉంటే లోహపు వ్యరాలుగా ఉంటాయి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెడ్

25. ఎదులాబాద్లో నీటి కాలుష్యం యొక్క జీవ సూచికగా పనిచేసే చేపలు ఏమిటి?
జవాబు:
సైప్రినస్ కార్పియో

26. EBWR లో లోహపు నిష్పత్తి యొక్క సరైన క్రమాన్ని వ్రాయండి.
Fe > Pb > Cr > Ni > Cd
జవాబు:
Fe< Pb< Cr < Ni < Cd

27. EBWR లో చేపలలో లోహాలు చేరడం లేదు. తన క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
Cd < Cr < Fe< Ni « Pb

28. పిచ్చుక ప్రచారం తరువాత పంట దిగుబడి చైనాలో గణనీయంగా తగ్గింది. ఈ గొప్ప చైనీస్ కరవుకు గల కారణం ఏమిటి?
జవాబు:
మిడుత జనాభా

29.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 11
ఈ చిత్రం ఏ రకమైన తెగులు నియంత్రణ పద్ధతిని సూచిస్తుంది?
జవాబు:
జీవ నియంత్రణ పద్ధతి

30. భూ సంబంధ పర్యావరణ వ్యవస్థలో నేల మరియు నేల రకాలు జీవేతర కారకాలు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉష్ణోగ్రత / నీరు

31. జల పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారకాలకు లో ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
శిలీంధ్రాలు / బాక్టీరియా

ఫ్లో చార్టులు

32.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 12
జవాబు:
ఉష్ణోగ్రత

33. ఆహార గొలుసును పూరించండి.
ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారి → ద్వితీయ వినియోగదారి → అగ్రశ్రేణి వినియోగదారి
జవాబు:
ద్వితీయ వినియోగదారి

34.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 13
జవాబు:
సముద్ర ఆవరణ వ్యవస్థ

35. గడ్డి → కుందేలు → నక్క → సింహం
పై ఆహార గొలుసులో ద్వితీయ వినియోగదారి ఏది?
జవాబు:
నక్క

36. గడ్డి → కీటకం → కప్ప → పాము → గ్రద్ద
పై ఆహార గొలుసులో అగ్ర వినియోగదారి ఏది?
జవాబు:
గ్రద్ద

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 14
జవాబు:
రసాయనిక

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 15
జవాబు:
సంఖ్యా పిరమిడ్

38. నీటి మొక్క → కీటకాలు → [ ] → కొంగ
జవాబు:
చేప

39. క్రింది వానిలో ఏది జలావరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

40. జీవ ద్రవ్యరాశి పిరమిడను పూరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 17
జవాబు:
50 kgs

41. క్రింది వానిలో ఏది పరాన్నజీవుల సంఖ్యా పిరమిడ్ ను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Bits Questions and Answers

1. ఈ క్రింది ఆహారపు గొలుసులలో సరైన క్రమము
A) గద్ద → ఎలుక → పాము → ధాన్యం
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద
C) పాము → గద్ద → ఎలుక → ధాన్యం
D) ఎలుక → పాము → ధాన్యం → గద్ద
జవాబు:
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద

2. చార్లెస్ ఎల్టన్ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం ………….
A) మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటాయి
B) పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడును
C) పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

3. ఆహారపు గొలుసు దేనితో మొదలౌతుంది?
A) మాంసాహారి
B) ఉత్పత్తిదారు
C) శాకాహారి
D) ఏదీకాదు
జవాబు:
B) ఉత్పత్తిదారు

4. మొక్క → కీటకము – కప్ప → [ ]
A) పాము
B) గుడ్డు
C) పుష్పం
D) ఏదీకాదు
జవాబు:
A) పాము

5. క్రిందివానిలో ప్రాథమిక వినియోగదారులు
A) కుందేలు
B) పులి
C) కప్ప
D) పాము
జవాబు:
A) కుందేలు

6. ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → తృతీయ వినియోగదారులు
ఈ ఆహారపు గొలుసులో 2లో ఈ జీవి ఉంటుంది.
A) పాము
B) మొక్క
C) మిడుత
D) కప్ప
జవాబు:
C) మిడుత

7. క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే …………..
A) పురుగుమందుల వాడకంపై పూర్తి నియంత్రణ
B) పురుగుమందుల నిషేధం
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం
D) జీవ రసాయన పరిశ్రమలు మూసివేయడం
జవాబు:
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం

8.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 19
ఖాళీని పూరించడానికి సరియైన దానిని ఎన్నుకోండి.
A)మిడత
B) పాము
C)కప్ప
D) గద్ద
జవాబు:
B) పాము

9. క్రింది పట్టికలో (?) స్థానంలో వుండవలసినది

పిరమిడ్ రకంఆధారం
సంఖ్యా పిరమిడ్జీవుల సంఖ్య
?శక్తి పరిమాణం

A) భౌగోళిక పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

10. క్రింది పట్టికను పూరింపుము.

పిరమిడ్ రకంఆధారం
సంఖ్యా పిరమిడ్జీవుల సంఖ్య
……… ? …….శక్తి ప్రవాహం

A) ఆవరణ పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

11. 1958లో చైనా ఏ పక్షులపై దండయాత్ర ప్రకటించింది?
A) చిలుకలు
B) పిచ్చుకలు
C) కాకులు
D) రాబందులు
జవాబు:
B) పిచ్చుకలు

12. నేలలో నత్రజనిని వృద్ధి చేసే మొక్క ఏది?
A) బంతి
B) తుమ్మ
C) గైరిసిడియా
D) కాక్టస్
జవాబు:
C) గైరిసిడియా

13. కింది వానిలో జలావరణ వ్యవస్థ నందు నిటారుగా ఉండని పిరమిడ్
A) సంఖ్యా పిరమిడ్
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
C) శక్తి పిరమిడ్
D) ఉష్ణ, పిరమిడ్
జవాబు:
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

14. కింది వానిలో గ్రీన్‌హౌస్ వాయువు కానిది ………
A) కార్బన్ డయాక్సెడ్
B) మీథేన్
C) ఓజోన్
D) క్లోరోఫ్లోరో కార్బన్స్
జవాబు:
C) ఓజోన్

15. గీత ఎల్లప్పుడూ మన్నిక గల వస్తువులనే వాడుతుంది, ఎందుకంటే …….
A) వ్యర్థాలను తగ్గించటానికి
B) పునః వినియోగం తగ్గించటానికి
C) పునః చక్రీయం తగ్గించటానికి
D) పునః స్థాపన పెంచటానికి
జవాబు:
A) వ్యర్థాలను తగ్గించటానికి

16. రేణురూప పదార్థాలు గాలిలో చేరుట వల్ల
A) మూత్రపిండాల వ్యాధులు కల్గుతాయి
B) ఆర్గెటీస్ కలుగుతుంది
C) కీళ్ళనొప్పులు కలుగుతాయి.
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.
జవాబు:
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.

17. భౌగోళిక వెచ్చదనంను తగ్గించుటకు నీవు పాటించే పద్ధతి
A) ప్లాస్టిక్ ను కాల్చివేయడం
B) విస్తారంగా పశువులు మేపడం
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట
D) ఎ.సి. ల వాడకాన్ని పెంచడం
జవాబు:
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట

18. కింది వాక్యాలలో సరియైనది.
i) పిరమిడ్ ఆధార భాగంలో ఎల్లప్పుడు ఉత్పత్తిదారులే ఉంటారు.
ii) జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఎల్లప్పుడు నిటారుగా ఉంటుంది.
A) (i), (ii) సరియైనవి.
B) (i) మాత్రమే సరియైనది.
C) (ii) మాత్రమే సరియైనది.
D) (i), (ii) లు సరియైనవి కావు.
జవాబు:
B) (i) మాత్రమే సరియైనది.

19. దేనికోసం మొక్కలు పోటీ పడతాయి?
(i) నీరు (ii) ఆహారం (iii) స్థలం
A) (i) మరియు (ii)
B) (ii) మరియు (iii)
C) (i) మరియు (iii)
D) (i), (ii) మరియు (iii)
జవాబు:
C) (i) మరియు (iii)

20. పంటలు పండించడానికి సరియైన పద్దతి కానిది
A) పంట మార్పిడి
B) జైవిక నియంత్రణ
C) మిశ్రమ పంటలు పండించడం
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం
జవాబు:
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం

21. ఎల్లప్పుడు ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది?
A) శాకాహారులు
B) మాంసాహారులు
C) ఉత్పత్తిదారులు
D) ఏదీకాదు
జవాబు:
C) ఉత్పత్తిదారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

22. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరయిన వాక్యం
A) సంఖ్యా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా ఉత్పత్తి దారులు పై భాగంలో ఉంటాయి.
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.
C) సాధారణంగా సంఖ్యా పిరమిడ్ లాగే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఉంటుంది.
D)ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయి జీవులకు శక్తి పూర్తిగా చేరుతుంది.
జవాబు:
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.

మీకు తెలుసా?

• పిరమిడ్ నిర్మాణం జ్యామితీయ ఆకృతిలో ఉంటుంది. బయటి ఉపరితలాలు త్రిభుజాకారంలో ఉండి వాటి చివరలు పై కొనలో కలుస్తాయి. పిరమిడ్ అడుగుభాగం త్రిముఖీయంగా లేదా చతుర్ముఖీయంగా లేదా బహుముఖీయ ఆకారంలో ఉంటుంది. చతురస్రాకార పిరమిడ్ల చతురస్రాకారంగా ఉండి బయటి ఉపరితలాలు మాత్రం త్రిభుజాకారంలో ఉంటాయి. సాధారణంగా పిరమిడ్ లో ఈ ఆకృతిలోనే ఉంటాయి.

• శిలాజ ఇంధనాలపై (భూమిలో మృత కళేబరాల అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలు) మనం ఆధారపడటాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, జీవ ద్రవ్యరాశిని కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చును. జీవ ద్రవ్యరాశిని ఇంధనంగా వాడినపుడు కూడా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ, అది జీవ ద్రవ్యరాశి ఏర్పడటానికి, తిరిగి గాలి నుండి గ్రహించబడుతుంది.

• మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్‌లోని కుమమోటో ఎఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే, మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్రం (Shiranui sea) మినిమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్ళుగా కొనసాగాయి.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 18

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

These AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 8th lesson Important Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఫ్లోచార్టును పరిశీలించి, క్రింది ప్రశ్నకు సమాధానము ఇవ్వండి. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసేది తల్లా? తండ్రా? ఏ విధంగానో వివరించండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1
జవాబు:

  1. శిశువు యొక్క లింగ నిర్ధారణ చేసే తండ్రి.
  2. తల్లిలో XX క్రోమోజోములు ఉంటాయి.
  3. తండ్రిలో XY క్రోమోజోములు ఉంటాయి
  4. Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తండ్రి లింగ నిర్ధారణ కారణం.

ప్రశ్న 2.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, దృశ్యరూప, జన్యురూప నిష్పత్తిని వ్రాయండి.
(లేదా)
మెండల్ తన సంకరణ ప్రయోగాలలో విషమయుగ్మజ పసుపురంగు (YY) విత్తనాలు గల బఠాణీ మొక్కను, అదే రకపు మొక్కతో సంకరణం జరిపినపుడు వచ్చిన ఫలితాలను దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులలో తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
దృశ్యరూపం – 3 : 1; జన్యురూపం – 1 : 2 : 1

ప్రశ్న 3.
దృశ్యరూపం, జన్యురూపంలను నిర్వచించండి. .
జవాబు:
దృశ్యరూపం :
కంటికి కనిపించే జీవుల యొక్క బాహ్య లక్షణాలను దృశ్యరూపం అంటారు. ఉదా : పొడవు, పొట్టి

జన్యురూపం :
దృశ్యరూపాన్ని నిర్ణయించే జన్యుస్థితిని జన్యురూపం అంటారు.
ఉదా : TT, tt

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 4.
నీవు సేకరించిన సమాచారం ఆధారంగా కార్బన్ డేటింగ్ పద్దతి గురించి వివరింపుము.
జవాబు:

  1. శిలాజాలు, ఖనిజ లవణాలు మరియు రాళ్ళ యొక్క వయస్సును నిర్ణయించుటకు కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు.
  2. ఇందుకు రేడియో ధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం, పొటాషియం యొక్క ఐసోటోపులను ఉపయోగిస్తారు.
  3. పురాజీవ శాస్త్రవేత్తలు C14 విచ్చిన్నాన్ని ఉపయోగించి శిలాజాల మరియు శిలల వయస్సును నిర్ధారిస్తారు.
  4. భూ వాతావరణంలో C12 మరియు C14 ఐసోటోపులు ఉంటాయి.
  5. ఒక జీవి జీవించి ఉన్నప్పుడు దానిలో C14 మరియు C12 లు స్థిర నిష్పత్తిలో ఉంటాయి.
  6. కాని, జీవి మరణించినప్పుడు దానిలో గల C14 విచ్చిన్నం చెందడం ప్రారంభమై దాని పరిమాణం ఒక స్థిరరేటుతో తగ్గుతుంది.
  7. C14 సగభాగం విచ్చిన్నమవటానికి పట్టే కాలాన్ని అర్థ జీవిత కాలం అంటారు. ఇది 5730 సంవత్సరాలు.
  8. C14 డేటింగ్ ద్వారా ఒక నమూనా శిలాజిం లేదా రాయి వయస్సు కనుగొనుటకు ఈ క్రింది సూత్రమును ఉపయోగిస్తారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 3

ప్రశ్న 5.
మీ అమ్మమ్మ తాతయ్యల నుండి, మీ అమ్మా నాన్నల నుండి లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయి?
జవాబు:
జన్యువుల ద్వారా

ప్రశ్న 6.
లామార్క్ వాదం తప్పు అని నిరూపించుటకు అవసరమైన ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:

  1. ఆగస్టస్ వీస్మాన్ లామార్క్ “ఆర్జిత గుణాల అనువంశికత” సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగించాడు.
  2. అతడు 22 తరాల వరకు ఎలుకల తోకలను తొలగించుకుంటూ ప్రయోగాలు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి.
  3. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించబడవని లామార్క్ వాదం తప్పు అని నిర్ధారించాడు.

ప్రశ్న 7.
మానవులలో లింగ నిర్ధారణ చేసే క్రోమోసోములేవి?
జవాబు:
అల్లోజోములు (లేదా) లైంగిక క్రోమోజోములు. అవి XX (బాలికలు), Xy (బాలురు).

ప్రశ్న 8.
మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు. ఎందుకు ?
జవాబు:
మానవునిలో దాదాపు 180 వరకు అవశేషావయవాలు ఉన్నాయి. కావున మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు.

ప్రశ్న 9.
ఉండుకమును అవశేషావయవం అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. మానవ జీర్ణవ్యవస్థలో ఉండే ఉండుకము జీర్ణక్రియలో ఏవిధంగానూ తోడ్పడదు.
  2. పరిణామ క్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్షీణించి పోకుండా నిరుపయోగంగా మిగిలిపోతాయి.

ప్రశ్న 10.
ఏ ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అధిక అవకాశం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో వైవిధ్యాలకు అవకాశం అధికం. ఈ ప్రక్రియలో స్త్రీ, పురుష సంయోగ బీజాలు కలిసిపోతాయి వాటిలోని జన్యుపదార్థం మధ్య వినిమయం జరగటం వలన సంతతిలో కొత్త లక్షణాలు (వైవిధ్యాలు) ఏర్పడతాలు.

ప్రశ్న 11.
వైవిధ్యాల ప్రాముఖ్యత ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ఇవి జీవులను గుర్తించటానికి, మనుగడకు, ప్రకృతి వరణానికి తోడ్పడతాయి.

ప్రశ్న 12.
జనక మొక్కలు తమ లక్షణాంశాలను విత్తనాలకు ఏ విధంగా పంపిస్తాయి?
జవాబు:
జనక మొక్కలలోని లక్షణాంశాలు కణ విభజన వలన సంయోగబీజాలలో చేరతాయి. సంయోగబీజాలు కలిసి విత్తనాలు ఏర్పడతాయి. కావున జనక మొక్కల లక్షణాంశాలు సంయోగబీజాల ద్వారా విత్తనాలలోనికి చేరతాయి.

ప్రశ్న 13.
పొడవైన మొక్కలు ఎల్లప్పుడు పొడవు మొక్కలనే ఉత్పత్తి చేస్తాయా?
జవాబు:
సాధారణంగా పొడవు మొక్కల నుండి పొడవు మొక్కలే ఏర్పడతాయి. కానీ పొట్టి మొక్కతో పరపరాగ సంపర్కం వలన పొట్టి మొక్కలు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రశ్న 14.
అనువంశికత అనగానేమి?
జవాబు:
అనువంశికత :
జనకుల లక్షణాలు తరువాత తరానికి అందించే ప్రక్రియను “అనువంశికత” అంటారు.

ప్రశ్న 15.
వైవిధ్యాలు అనగానేమి?
జవాబు:
వైవిధ్యాలు :
జీవుల మధ్య ఉండే భేదాలను “వైవిధ్యాలు” అంటారు.

ప్రశ్న 16.
పరిణామం అనగానేమి?
జవాబు:
పరిణామం : మార్పుచెందే ప్రక్రియను “పరిణామం” అంటారు.

ప్రశ్న 17.
అనుకూలనాలు అనగానేమి?
జవాబు:
అనుకూలనాలు:
జీవి మనుగడ సాగించటానికి ఉపయోగపడే లక్షణాలను “అనుకూలనాలు” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 18.
మెండల్ తన ప్రయోగానికి ఎన్నుకున్న మొక్క ఏమిటీ?
జవాబు:
మెండల్ తన ప్రయోగానికి బరానీ మొక్క (ఫైసమ్ సటైవమ్) ను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 19.
మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న వ్యతిరేక లక్షణాల సంఖ్య ఎంత?
జవాబు:
మెండల్ బఠానీ మొక్కలో 7 జతల వ్యతిరేక లక్షణాలను ఎన్నుకున్నాడు.

ప్రశ్న 20.
లక్షణాంశాలు అనగానేమి?
జవాబు:
లక్షణాంశాలు :
జీవి లక్షణాలను నిర్ణయించే కారకాలను లక్షణాంశాలు (Traits) అంటారు . వీటినే నేడు జన్యువులు (Genes) అని అంటాం.

ప్రశ్న 21.
ప్రతి లక్షణానికి ఎన్ని లక్షణాంశాలు ఉంటాయి?
జవాబు:
ప్రతి లక్షణానికి ఒక జత లక్షణాంశాలు ఉంటాయి.

ప్రశ్న 22.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
ప్రతి లక్షణానికి కారణమైన లేదా నియంత్రించే ఒక జత కారకాలుంటాయని మెండల్ భావించాడు. ప్రస్తుతం ఆ కారకాలనే మనం జన్యువులు (Genes) అంటాం.

ప్రశ్న 23.
యుగ్మ వికల్పకాలు అనగానేమి?
జవాబు:
ముగ్మవికల్పకాలు :
ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను “యుగ్మవికల్పకాలు” (Allele) అంటారు.

ప్రశ్న 24.
సమయుగ్మజం అనగానేమి?
జవాబు:
సమయుగ్మజం :
ఒక లక్షణానికి రెండూ ఒకేరకమైన కారకాలుంటే దానిని “సమయుగ్మజం” (Homozygous) అంటారు.

ప్రశ్న 25.
విషమయుగ్మజం అనగానేమి?
జవాబు:
విషమయుగ్మజం :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” (Heterozygous) అని అంటారు.

ప్రశ్న 26.
మెండల్ ప్రయోగాలలో జనకతరం యొక్క స్థితి ఏమిటీ?
జవాబు:
మెండల్ (శుద్ధ జాతులను) సమయుగ్మజ స్థితిలో ఉన్న మొక్కలను ప్రయోగానికి ఎన్నుకున్నాడు.

ప్రశ్న 27.
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని ఏమంటారు?
జవాబు:
జనకతరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతిని F1 తరం అంటారు.

ప్రశ్న 28.
F1 తరపు మొక్కల జన్యుస్థితి ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలు విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 29.
F1 తరపు మొక్కల సామాన్య లక్షణం ఏమిటి?
జవాబు:
F1 తరపు మొక్కలన్నీ ఒకే దృశ్యరూపం మరియు జన్యురూపం కలిగి ఉంటాయి. ఇవి విషమయుగ్మజ స్థితిలో ఉండి, బహిర్గత లక్షణాలను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 30.
F2 తరం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
F2 తరం మొక్కలలో ఆత్మపరాగసంపర్కం జరపగా F2 తరం ఏర్పడుతుంది.

ప్రశ్న 31.
ఏక సంకరణ ప్రయోగంలో F1 తరం యొక్క దృశ్య, జన్యురూప నిష్పత్తులు ఏమిటి?
జవాబు:
F2 తరం యొక్క దృశ్యరూప నిష్పత్తి : 3 : 1
F2 తరం యొక్క జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 32.
బహిర్గత సూత్రంను తెలపండి.
జవాబు:
బహిర్గత సూత్రం :
విషమయుగ్మజ స్థితిలో ఏదో ఒక లక్షణం మాత్రమే బహిర్గతమౌవుతుంది. దీనినే “బహిర్గత సూత్రం” అంటారు.

ప్రశ్న 33.
పృథక్కరణ సూత్రం తెలపండి.
జవాబు:
పృథక్కరణ సూత్రం :
జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా సంతతికి అందించబడుతుంది. దీనినే ‘పృథక్కరణ’ లేదా ‘అలీనత సూత్రం’ అంటారు.

ప్రశ్న 34.
అనువంశిక లక్షణాలు అనగానేమి?
జవాబు:
అనువంశిక లక్షణాలు :
తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే లక్షణాలను “అనువంశిక లక్షణాలు” అంటారు.

ప్రశ్న 35.
‘వంశపారంపర్యం’ అనగానేమి?
జవాబు:
వంశపారంపర్యం:
అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్ని “వంశపారంపర్యం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 36.
జన్యువు అనగానేమి?
జవాబు:
జన్యువు :
లక్షణాలు నిర్ణయించే కారకాలను జన్యువులు అంటారు. జన్యువు అనేది న్యూక్లియిక్ ఆమ్లం. అంటే DNA యొక్క కొంత భాగం.

ప్రశ్న 37.
DNA అనగా నేమి? దాని ఆకారం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లాన్ని సంక్షిప్తంగా DNA అంటారు. ఇది సర్పిలాకారంగా ఉండే మెట్ల మాదిరిగా (మెలితిరిగిన నిచ్చెన) ఉంటుంది. ఈ ఆకారాన్నే ద్వంద్వకుండలి (Double helix) అని కూడా అంటారు.

ప్రశ్న 38.
‘న్యూక్లియోటైడ్’ అనగానేమి?
జవాబు:
న్యూక్లియోటైడ్
DNA అణువులోని ఒక పోచను న్యూక్లియోటైడ్ అంటారు. రెండు న్యూక్లియోటైడ్స్ కలయిక వలన DNA ఏర్పడుతుంది.

ప్రశ్న 39.
న్యూక్లియోటైడ్ లోని అణువులు ఏమిటి?
జవాబు:
న్యూక్లియోటైడ్ లో చక్కెర అణువు, ఫాస్ఫేట్ అణువు మరియు నత్రజని క్షారము ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4

ప్రశ్న 40.
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి?
జవాబు:
DNA లో నాలుగు రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవి:
1. అడినిన్ – (A) 2. గ్వా నిన్ – (G) – 3. థైమిన్ – (T) 4. సైటోసిన్ – (C).

ప్రశ్న 41.
ఆటోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఆటోసోమ్స్ :
శారీరక లక్షణాలను నిర్ణయించే క్రోమోజోమ్స్ ను ‘శారీరక క్రోమోజోమ్స్’ లేదా ‘ఆటోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య 22 జతలు.

ప్రశ్న 42.
ఎల్లోసోమ్స్ అనగానేమి?
జవాబు:
ఎల్లోసోమ్స్ :
లైంగికతను నిర్ణయించే క్రోమోజోమ్ లను ‘లైంగిక క్రోమోజోమ్ లు లేదా ఎల్లోసోమ్స్’ అంటారు. మానవునిలో వీటి సంఖ్య ఒక జత.

ప్రశ్న 43.
ప్రకృతి వరణం అనగా నేమి?
జవాబు:
ప్రకృతి వరణం :
అనుకూలతలు కలిగిన జీవులు మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి తదుపరి తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. మిగిలిన జీవులు నశిస్తాయి. ప్రకృతి చేసే ఈ ఎంపికను “ప్రకృతి వరణం” అంటారు.

ప్రశ్న 44.
జన్యువిస్థాపనం (Genetic drift) అనగానేమి?
జవాబు:
జన్యువిస్థాపనం :
జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల వలన జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు వస్తాయి. దీనినే “జన్యువిస్థాపనం” అంటారు.

ప్రశ్న 45.
ఆర్జిత గుణాలు అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాలు :
జీవి తన మనుగడ కోసం, అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను “ఆర్జిత గుణాలు” అంటారు.

ప్రశ్న 46.
ఆర్జిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత :
లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు.
ఉదా : జిరాఫీ మెడ.

ప్రశ్న 47.
సూక్ష్మ పరిణామం అనగానేమి?
జవాబు:
సూక్ష్మపరిణామం : జాతిలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.

ప్రశ్న 48.
స్థూలపరిణామం అనగానేమి?
జవాబు:
స్థూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియను జాతుల ఉత్పత్తి లేదా “స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 49.
సమజాత అవయవాలు అనగానేమి?
జవాబు:
సమజాత అవయవాలు:
ఒకే నిర్మాణం కలిగి విభిన్న జీవులలో వేరు వేరు పనులను నిర్వహించే అవయవాలను “సమజాత అవయవాలు” అంటారు.
ఉదా : తిమింగలం చెయ్యి, గబ్బిలం చెయ్యి.

ప్రశ్న 50.
సమానమైన అవయవాలు అనగానేమి?
జవాబు:
సమానమైన అవయవాలు :
విభిన్న నిర్మాణం కలిగిన, వేరు వేరు జీవులలో ఒకే పనిని నిర్వహించే అవయవాలను సమానమైన అవయవాలు అంటారు.
ఉదా : పక్షి రెక్క, గబ్బిలం రెక్క ఎగరటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 51.
పిండాభివృద్ధిశాస్త్రం అనగానేమి?
జవాబు:
పిండాభివృద్ధిశాస్త్రం :
ఒక జీవి అండం మొదలుకొని, సంపూర్తిగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించి అధ్యయనం చేయడాన్ని “పిండాభివృద్ధిశాస్త్రం” అంటారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 52.
శిలాజాలు అనగానేమి?
జవాబు:
శిలాజాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలను “శిలాజాలు” అంటారు.

ప్రశ్న 53.
శిలాజాల వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి ఆధారంగా శిలాజాల వయస్సును నిర్ణయిస్తారు.

ప్రశ్న 54.
అవశేష అవయవాలు అనగానేమి?
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామ క్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే “అవశేషావయవాలు” (Vestigial organs) అంటారు.

ప్రశ్న 55.
జన్యుశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
“గ్రెగర్ జోహాన్ మెండల్” ను జన్యుశాస్త్ర పిత అంటారు.

ప్రశ్న 56.
లింగ సహలగ్నత పైన పరిశోధన చేసినవారు ఎవరు?
జవాబు:
వాల్టర్ స్టటన్, థామస్ హంట్ మోర్గాలు లింగ సహలగ్నతపై పరిశోధన చేశారు.

ప్రశ్న 57.
వాల్టర్, మోర్గాన్లు ఏ జీవిపై ప్రయోగాలు చేశారు?
జవాబు:
వాల్టర్, మోర్గాన్లు చిన్న పండ్ల ఈగ ( సోఫిలా మెలనోగాసర్) పై పరిశోధనలు చేశారు.

ప్రశ్న 58.
లామార్కిజాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్కిజాన్ని తప్పు అని నిరూపించాడు. అతను ఎలుక తోకను 22 తరాల వరకూ కత్తిరించి, ఆ లక్షణం తరువాత తరానికి రావటం లేదని నిరూపించాడు.

ప్రశ్న 59.
ప్రకృతివరణం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
చార్లెస్ డార్విన్ “ప్రకృతివరణం” సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

ప్రశ్న 60.
డార్విన్ రచించిన గ్రంథం పేరు ఏమిటి?
జవాబు:
డార్విన్ రచించిన ప్రముఖ గ్రంథం పేరు, జాతుల ఉత్పత్తి (The origin of species).

ప్రశ్న 61.
మానవునిలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎంత?
జవాబు:
మానవునిలో 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు ఉంటాయి.

ప్రశ్న 62.
ఆడవారిలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
ఆడవారిలో ‘XX’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 63.
పురుషులలోని లైంగిక క్రోమోజోమ్స్ ఏమిటి?
జవాబు:
పురుషులలో ‘XY’ అనే లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి.

ప్రశ్న 64.
మానవుడిని ‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అంటారు. ఎందుకు?
జవాబు:
మానవునిలో దాదాపు 180 అవశేష అవయవాలు ఉన్నాయి. ఉదాహణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషాయవాల మ్యూజియం” అంటారు.

ప్రశ్న 65.
మానవులనందరినీ ఏ ఖండం నుండి వలస చెందినవారుగా భావిస్తున్నారు?
జవాబు:
మానవుల అతిపురాతనజీవి హోమోసెఫియన్స్. దీనిని ఆఫ్రికాలో కనుగొన్నారు. కావున మనుషులందరూ ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వారుగా భావిస్తున్నారు.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది ? తండ్రి వల్లనా, తల్లి వల్లనా? శిశువులలో లింగ నిర్ధారణను ప్లోచార్టు రూపంలో వివరించండి.
జవాబు:
లింగ నిర్ధారణ తండ్రి వలన జరుగును.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6

ప్రశ్న 2.
శిలాజాల గురించి తెలుసుకొనుటకు పురాజీవ శాస్త్రవేత్తను మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. శిలాజాల వయస్సును ఏవిధంగా కనుగొంటారు?
  2. శిలాజాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి?
  3. శిలాజాలలో ఏ మూలకాలు ఎక్కువగా ఉంటాయి?
  4. పరిణామక్రమం తెలుసుకోవడానికి శిలాజాలు ఏవిధంగా ఉపయోగపడతాయి?

ప్రశ్న 3.
క్రింది గళ్ళ చదరమును పరిశీలించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఏక సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తిని వ్రాయుము.
ii) పై చదరంలో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు?
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
జవాబు:
i) 3 : 1
ii) రెండు విషమయుగ్మజ మొక్కలు (YY) మరియు (YY)

ప్రశ్న 4.
జీవ పరిణామం జరిగినదనడానికి పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి?
జవాబు:
నిదర్శనాలు :

  1. చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించతగిన పోలికలు వుంటాయి.
  2. కప్ప డింభకము, కప్ప కన్నా చేపను పోలివుండును.
  3. ప్రతి జీవి జీవిత చరిత్ర, పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది.
  4. తొలిదశలో వున్న పిండాన్ని వేరొక దాని నుండి వేరుగా గుర్తించటము కష్టము.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 5.
జీవ పరిణామం జరగకపోతే ఏం జరగొచ్చు?
జవాబు:

  1. క్రొత్త జాతులు ఏర్పడవు / జాతుల ఉత్పత్తి ఉండదు
  2. జీవుల మనుగడ ఉండదు.
  3. వైవిధ్యాలు ఉండవు.
  4. అనుకూలనాలు ఉండవు.
  5. నిదర్శనాలు ఉండవు.

ప్రశ్న 6.
F1 తరం అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ సంకరీకరణ ప్రయోగంలో, రెండు శుద్ధ జాతుల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని ‘F1 తరం’ అంటారు.

లక్షణాలు:

  1. ఇవన్నీ దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉంటాయి.
  2. బహిర్గత లక్షణాలు ప్రదర్శిస్తాయి.
  3. కానీ జన్యురూపం పరంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ప్రశ్న 7.
పరిణామం అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
మార్పు చెందే ప్రక్రియను పరిణామం (Evolution) అంటారు. Evolution అనే పదానికి ‘మడత విప్పుట’ అని అర్ధం (పెద్దదిగా మారటం). సరళంగా, సూక్ష్మంగా ఉండే జీవులు స్థూల, సంక్లిష్టంగా మారే ప్రక్రియ పరిణామం. దీనిలో రెండు రకాలు కలవు. అవి:
1. సూక్ష్మపరిణామం :
జాతులలోని చిన్న చిన్న మార్పులను “సూక్ష్మపరిణామం” అంటారు.
ఉదా : జీవులలోని రంగుల లక్షణం.

2. స్టూలపరిణామం :
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల “ఉత్పత్తి లేదా స్థూలపరిణామం” అంటారు.

ప్రశ్న 8.
లామార్క్ సిద్ధాంతం తప్పు అని ‘వీస్మస్’ ఎలా నిరూపించాడు?
జవాబు:
ఆగస్టస్ వీస్మస్ లామార్క్ సిద్ధాంతాన్ని ఎలుకలపై ప్రయోగాలు చేసి పరీక్షించాడు. అతడు ఎలుకల తోకలు తొలగించాడు. కానీ సంతతి మామూలుగానే తోకలతో జన్మించాయి. తరువాత తరం ఎలుకల తోకలు కూడా తొలగించుకుంటూ అలా 22 తరాల వరకు చేశాడు. అయితే ప్రతిసారి ఎలుకలు తోకలతోనే పుట్టాయి. శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అది తమ సంతతికి అందించవని వీస్మస్ నిర్ధారించాడు.

ప్రశ్న 9.
జీవ పరిణామానికి ఏ ఏ శాస్త్రాల నుండి నిదర్శనాలు లభిస్తున్నాయి?
జవాబు:
జీవ పరిణామానికి క్రింది శాస్త్రాల నుండి మద్దతు లభిస్తుంది.

  1. శరీరధర్మ శాస్త్రము – సహజాత అవయవాలు, సమానమైన అవయవాలు
  2. పిండోత్పత్తి శాస్త్రము – పిండాభివృద్ధిలో పూర్వజీవుల లక్షణాలు
  3. పురాజీవ శాస్త్రం – శిలాజాలు

వీటి నుండే కాకుండా, వర్గీకరణ శాస్త్రం, జన్యుశాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం నుండి అనేక నిదర్శనాలు జీవ పరిణామాన్ని సమర్థిస్తున్నాయి.

ప్రశ్న 10.
శిలాజాలు అనగానేమి? అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 5

  1. ప్రాచీన జీవయుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే నిర్జీవ పదార్థాలనే “శిలాజాలు” అంటారు.
  2. పురాతన జీవులు లేదా వృక్షాల ఏ భాగమైనా శిలాజాలుగా ఏర్పడవచ్చు.
  3. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జీవులలోని కర్బన పదార్థాలు క్షీణించి, పూర్తి నిర్మూలన చెందకుండా ఉండటం వల్ల శిలాజాలు ఏర్పడతాయి.
  4. శిలాజాలు భూమి లోపలి పొరల్లో, నీటి లోపలి నిక్షేప శిలల్లో (Sediments) లభించవచ్చు.

ప్రశ్న 11.
శిలాజాలు ఏర్పడే విధానం వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
ప్రాచీన జీవుల పూర్తి దేహం కాకుండా ఏవేని భాగాలు – ఎముకలు, దంతాలు, – కొమ్ములు, విత్తనాలు, పత్రాలు లేదా ముద్రలు శిలాజాలుగా లభిస్తాయి. డైనోసార్ల పాదాల శరీరం కుళ్ళి నశించిపోతుంది. ఆ తరువాత కనిపించదు. కానీ కొన్నిసార్లు శరీరం మొత్తం లేదా ఏవైనా కొన్ని భాగాలు సహజంగా నశించిపోకుండా ఉండి శిలాజాలుగా మిగిలిపోతాయి. ఉదాహరణకు ఏదేని చనిపోయిన కీటకం బురదలో చిక్కుకుపోయిందనుకుంటే, అది అంత సులువుగా నశించదు. బురద క్రమంగా ఎండి, గట్టిపడే పరిస్థితులుంటే ఆ మట్టి లోపలి కీటకం దేహం, భాగాలు, ముద్రలుగా ఉండిసోతాయి. ఇలా చెడిపోకుండా ఉండిపోయిన ముద్రలను కూడా శిలాజాలే అంటారు.

ప్రశ్న 12.
శిలాజ వయస్సును ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఒక శిలాజ కాలాన్ని చెప్పగలరు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం (Palaeontology) అని అంటారు. పురాజీవ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును లేదా అవి నివసించిన కాలాన్ని కనుగొంటారు. అందుకు రేడియోధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం మరియు పొటాషియం యొక్క ఐసోటోప్లను ఉపయోగిస్తారు. శిలాజాల లోపలి ఖనిజ లవణాల లేదా శిలాజాలున్న శిలలలోని ఐసోటోప్ల అర్ధజీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల కాలాన్ని అంచనా వేస్తారు.

ప్రశ్న 13.
అవశేష అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అవశేష అవయవాలు :
పరిణామక్రమంలో భాగంగా అవసరంలేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించి పోకుండా, నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలనే అవశేషావయవాలు (Vestigial organs) అంటారు.
ఉదా :
మన జీర్ణవ్యవస్థ ‘ఉండుకం’ (Appendix) లోని జీర్ణక్రియలో అది ఏ విధంగానూ తోడ్పడదు. కానీ కుందేలు వంటి శాకాహారులలో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధినే నిర్వర్తిస్తుంది. అలా నిరుపయోగంగా మానవునిలో దాదాపు 180 అవశేషావయవాలున్నాయి. ఉదాహరణకు చెవితమ్మె, చర్మంపై కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు మొదలగునవి. అందుచేతనే మానవుడిని “నడిచే అవశేషావయవాల మ్యూజియం” అని అంటారు.

ప్రశ్న 14.
ప్రక్క పటాన్ని పరిశీలించి నీవు గమనించిన తేడాలు తెలపండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 8
జవాబు:
ప్రక్క పటంలో అన్ని గులాబి పూలు ఉన్నప్పటికి వాటి మధ్య తేడాలు ఉన్నాయి. కొన్ని ఎరుపు, పసుపు, తెలుపు, నీలం రంగులలో ఉన్నాయి. పుష్పాల పరిమాణంలో కూడా వ్యత్యాసం ఉంది. కొన్ని పెద్దవిగా ఉంటే, మరి కొన్ని చిన్నవిగా ఉన్నాయి. వాటితో పాటు ఆకర్షక పత్రదళాల సంఖ్య, ఆకుపరిమాణం, కాండం, ముళ్లు మొదలైన లక్షణాలలో కూడా భేదాలు గమనించవచ్చు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
‘జీవులలో భిన్న లక్షణాలు ఏర్పడటానికి జన్యువులు కారణం’ దీనిని సమర్థిస్తూ చిన్న వ్యాసం రాయండి.
జవాబు:
క్రోమోజోమునందలి DNA లో ఒక భాగమైన జన్యువు జీవులలో ఒక నిర్దిష్టమైన లక్షణమును నియంత్రిస్తుంది. DNA ఒక ప్రోటీనును ఉత్పత్తి చేయుట ద్వారా లక్షణమును నియంత్రిస్తుంది. క్రోమోజోమునందు వేల సంఖ్యలో ఉండు జన్యువులు రకరకాల లక్షణములను నియంత్రిస్తాయి.

జన్యువులు ఒక తరం నుండి మరియొక తరానికి లక్షణాలను అందించడానికి ఉపయోగపడే అనువంశికత ప్రమాణాలు, జన్యువులు జతలుగా పనిచేస్తాయి. ఒకే విధమైన లక్షణాలను నియంత్రించే జన్యువులకు ఒక ఇంగ్లీషు అక్షరము ఇవ్వబడింది. ఉదాహరణకు ఎత్తును నియత్రించే జన్యువు ‘T’ గాను, పొట్టిని నియంత్రించే జన్యువు ‘t’ గాను సూచించబడుతుంది.

ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. ఒక లక్షణానికి కారణమైన రెండు కారకాలు ఉన్నా, వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమవుతుంది. అటువంటి జన్యువును బహిర్గత జన్యువు అంటారు. రెండవ జన్యువు బహిర్గతం కాకుండా అంతర్గతంగా ఉంటుంది.

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పురాతన జీవుల సమాచారం మనకు తెలుపుటకు ప్రకృతి భద్రపరిచిన విలువైన ఆధారాలు శిలాజాలు. శిలాజాల గూర్చి నీవు సేకరించిన సమాచారం తెలుపుము.
జవాబు:

  1. ప్రాచీన జీవ యుగాలలో నివశించిన జీవుల ఉనికిని తెలియజేసే, ప్రకృతిసిద్ధంగా భద్రపరిచిన నిర్జీవ పదార్థాలనే శిలాజాలు అంటారు.
  2. పురాజీవశాస్త్రం ప్రాచీనయుగాలలో జీవించిన జీవుల సమాచారాన్ని తెలియజేస్తుంది.
  3. కార్బన్ రేటింగ్ పద్దతినుపయోగించి జీవులు, జీవించిన కాలాన్ని భూగర్భశాస్త్రవేత్తలు కనుగొంటారు.
  4. శిలాజాల యందు లభించే క్రోమోజోమ్ సమాచారం ద్వారా వంశపారంపర్య లక్షణాలు లభిస్తాయి.
  5. ఆహారపు అలవాట్లు, జీవనవిధానాలు – శరీర నిర్మాణం గురించి తెలుస్తుంది.
  6. కాలగమనంలో జీవులు పొందిన వివిధ రూపాంతరాలు, క్రొత్తజీవులు ఏర్పడిన విధానం గురించిన సమాచారం లభిస్తుంది.

ప్రశ్న 2.
మనతో పాటు భూమి మీద జీవించే హక్కు జీవులన్నిటికీ కలదు. జీవ వైవిధ్య పరిరక్షణపై ప్రజలలో చైతన్యం కలిగించే నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. జీవించు – జీవించనివ్వు
  2. ప్రకృతిని ప్రేమించు – జీవవైవిధ్యాన్ని సంరక్షించు
  3. జీవకారుణ్యాన్ని చూపించు – జీవ వైవిధ్యాన్ని విస్తరించు
  4. తోటి జీవరాశిని కాపాడు – అందమైన ప్రకృతిని చూడు
  5. అన్ని జీవులను ఆదరించు – వైవిధ్యాన్ని సంరక్షించు
  6. పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి

ప్రశ్న 3.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠాణీ మొక్కను ఎంచుకోవటానికి గల కారణాలు :
1. ‘బఠాణీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి.
ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.

2. బఠాణీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.

3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.

4. బఠాణీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.

ప్రశ్న 4.
మానవులలో లింగ నిర్ధారణను ఫ్లో చార్టు గీసి, వివరించండి.
(లేదా)
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయు ఫ్లో చార్టు గీయుము.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10

  1. ఆడవారిలో రెండు X క్రోమోజోములు, మగవారిలో X, Y క్రోమోజోమ్ లు ఉంటాయి.
  2. స్త్రీ సంయోగ బీజాలలో ఒకే రకమైన X క్రోమోజోమ్లు , పురుష సంయోగ బీజాలలో X మరియు Y క్రోమోజోమ్లు ఉంటాయి.
  3. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరి X, Y క్రోమోజోమ్ తో ఏర్పడే శిశువు అబ్బాయి అవుతుంది.
  4. అదే X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఏర్పడే శిశువు అమ్మాయి అవుతుంది.

ప్రశ్న 5.
జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి నీ వంతుగా నీవు చేస్తున్న ప్రయత్నాలేవి?
జవాబు:

  1. భూమిపై నివసిస్తున్న జీవులలో గల వైవిధ్యమే జీవ వైవిధ్యం.
  2. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, వేటాడటాన్ని నిషేధించాలి.
  3. సుస్థిర అడవుల సంరక్షణా పద్ధతులను అవలంబించాలి.
  4. నేను నావంతుగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.
  5. ప్రజలను చైతన్య పరుస్తూ వారిని వివిధ జీవ వైవిధ్య సంరక్షణా కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తాను.
  6. పాఠశాల పరిసర ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాను.
  7. జీవ వైవిధ్యానికి సంబంధించిన నినాదాలు, గోడ పత్రికలు ముద్రిస్తాము.
  8. విద్యుత్తును సాధ్యమైనంత వరకు పొదుపుగా వినియోగిస్తాను.
  9. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుంటాము.
  10. ఆవాస ప్రాంతాలలో చెట్లను నరికివేస్తే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాను.
  11. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తాను.

ప్రశ్న 6.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10
i) ఈ షో చార్డ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మానవునిలో లింగ నిర్ధారణ తెలియజేయును.

ii) ‘X’ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆడపిల్ల పుడుతుంది.

iii) శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మా, నాన్నలలో ఎవరు?
జవాబు:
తండ్రి

iv) సంతతిలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉంటాయి?
జవాబు:
23 జతలు

ప్రశ్న 7.
ఈ చిత్రాన్ని పరిశీలించండి. సమాధానములు రాయండి.
వంశీ, ప్రియలు నూతన దంపతులు. వారు మగపిల్లవానిని కనాలనుకొంటున్నారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 11
a) మగ పిల్లవాడు జన్మించాలంటే జరుగవలసిన క్రోమోజోముల బదిలీని తెలిపే సంభావ్యతా చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 12

b) శిశువు లింగ నిర్ధారణలో ఎవరు పాత్ర పోషిస్తారు? ఎలా చెప్పగలవు?
జవాబు:
శిశువు లింగ నిర్ధారణలో తండ్రి పాత్ర పోషిస్తారు. ఎందుకనగా మగశిశువును నిర్థారించే “Y” క్రోమోసోమ్ తండ్రిలోనే ఉత్పత్తి అవుతుంది.

ప్రశ్న 8.
దృశ్యరూపం మరియు జన్యురూపం అనగానేమి? మెండల్ ఏకసంకరణ పద్ధతి ద్వారా వీటిని వివరించండి.
జవాబు:
దృశ్యరూపం :
జీవులలో బయటకు కన్పించే (బహిర్గతం) అయ్యే లక్షణాన్ని దృశ్యరూపంగా గుర్తిస్తాం.

జన్యురూపం :
జీవులు ప్రదర్శించే స్వరూప స్వభావాల సంభావ్యత క్రమాన్ని జన్యురూపంగా గుర్తిస్తాం.

పసుపు (YY) ఆకుపచ్చ (YY), విత్తనాలు ఉన్న శుద్ధజాతుల బఠాణీల మొక్కల మధ్య పరపరాగ సంపర్కం చేయగా F1 తరంలో మొక్కలన్నీ పసుపు రంగు విత్తనాలు కల్గి ఉన్నాయి. అంటే F1 తరంలో పసుపు రంగు దృశ్యరూపంగా గుర్తించటం జరిగింది.

ఈ F1 తరంలో ఏర్పడే విత్తనాల జన్యురూపం ‘Yy’
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13

F2 తరం : F1 తరం మొక్కల మధ్య (YY) స్వపరాగ
సంపర్కం చేయగా F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2

దృశ్యరూప నిష్పత్తి : 3 : 1; జన్యురూప నిష్పత్తి : 1 : 2 : 1

ప్రశ్న 9.
మెండల్ అనువంశికతా సూత్రాలను తెలుపుము. మెండల్ తన ప్రయోగాలకు ఐరాణీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు రాయండి.
జవాబు:
మెండల్ అనువంశికతా సూత్రాలు:

  1. బహిర్గతత్వ సూత్రం,
  2. పృథక్కరణ సూత్రం,
  3. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం.

మెండల్ తన ప్రయోగానికి బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు :

  1. స్పష్టమైన లక్షణాలు కల్గి ఉండటం
  2. ద్విలింగ పుష్పాలు కల్గి ఉండటం
  3. ఆత్మ పరాగసంపర్కం జరపడం
  4. సంకరీకరణానికి అనువుగా ఉండటం
  5. బఠానీ ఏకవార్షిక మొక్క

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 10.
ప్రక్కన ఉన్న ఫ్లోచార్టు గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 14
i) ఈ ఫ్లోచార్టు దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
శుద్ధ పొడవు మరియు పొట్టి మొక్కల మధ్య మెండల్ ఏక సంకరీకరణము.

ii) F1 తరపు మొక్కల దృశ్యరూపం ఏమిటి?
జవాబు:
అన్నీ మొక్కలూ పొడవైనవి.

iii) తరం యొక్క దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తులు తెల్పండి.
జవాబు:
దృశ్యరూప నిష్పత్తి 3 : 1
జన్యురూప నిష్పత్తి 1 : 2 : 1

iv) ఈ ఫ్లోచార్టు ద్వారా నీవు ఏ అనువంశిక సూత్రాలను అర్థం చేసుకుంటావు?
జవాబు:
బహిర్గతత్వ సూత్రము మరియు పృథక్కరణ సూత్రము

ప్రశ్న 11.
జీవ పరిణామం గురించి డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం నందలి ముఖ్యాంశాలను రాయంది.
జవాబు:
డార్విన్ సిద్ధాంతము నందలి ముఖ్యాంశాలు :

  1. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది.
  2. ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు.
  3. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  4. సంతతి అధిక సంఖ్యలో వుంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  5. ఉపయుక్తమైన లక్షణాలు గల జీవులు మనుగడ కోసం జరిగే పోరాటంలో విజయం సాధిస్తాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకొని కొత్త పరిస్థితులలో జీవించగల్గుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ వుంటే అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది.

ప్రశ్న 12.
జీవ పరిణామంను నిరూపించే ఏవైనా రెండు ఆధారాలను గురించి వివరించండి.
జవాబు:
1. నిర్మాణ సామ్య అవయవాలు :
తిమింగలాల్లో వాజాలు (ఈదడానికి), గబ్బిలాల్లో రెక్కలు (ఎగరడానికి), చిరుతల్లో కాళ్ళు (పరిగెత్తడానికి), మనుషుల్లో చేతులు (పట్టుకోవడానికి), చుంచు ఎలుకల్లో కాళ్ళు (తవ్వడానికి) ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడే ముందరి చలనాంగాల అంతర్నిర్మాణము ఒకేలా ఉంటుంది. వీటన్నింటి ఎముకల అమరిక ఒకేలా ఉంటాయి. సకశేరుకాలన్నీ ఒకే పూర్వీకుల నుండి పరిణామం ఫలితంగా ఏర్పడినవేనని ఈ రుజువులు తెలుపుతున్నాయి. ఈ అవయవాలనే నిర్మాణసామ్య అవయవాలు’ అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అపసారి పరిణామం) అందురు.

2. క్రియాసామ్య అవయవాలు :
పక్షులు, గబ్బిలాల రెక్కలు గురించి పరిశీలిస్తే, గబ్బిలం రెక్కలలో పొడవుగా ఉన్న వేళ్ళ మధ్యలో సాగడానికి, ముడుచుకోవడానికి వీలుగా ఉన్న చర్మపంకం కనిపిస్తుంది. కానీ పక్షులలో రెక్కలు ఈకలతో కప్పబడిన ముందరి చలనాంగాలు. ఈ రెండింటిలో నిర్మాణం, అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి నిర్వర్తించే విధి మాత్రం ఒక్కటే. నిర్మాణం వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకేరకమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్య అవయవాలు అంటారు. ఈ విధమైన పరిణామాన్ని (అభిసారి పరిణామం) అంటారు.

3. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు :
చేప నుండి మానవుని వరకు గల వివిధ జీవుల పిండాలలో గుర్తించదగిన పోలికలు ఉంటాయి. ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శించును. జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకులు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది.

4. శిలాజ నిదర్శనాలు :
ప్రాచీన జీవ యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలియజేసే ప్రకృతి సిద్ధంగా భద్రపరచబడిన నిర్జీవ పదార్థాలను శిలాజాలు అంటారు. శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు. భూగర్భ శాస్త్రవేత్త శిలాజకాలాన్ని లెక్కించి చెప్పగలుగుతారు. కార్బన్ డేటింగ్ పద్దతిని ఉపయోగించి శిలాజాల వయస్సును, అవి నివసించిన కాలాన్ని కనుగొందురు.
ఉదా : రాక్షస బల్లులు (డైనోసారస్) కీటోసారస్ ప్రస్తుతం మనకు లభించిన శిలాజ నిదర్శనాలు.

ప్రశ్న 13.
బఠానీ మొక్కలలో బహిర్గత, అంతర్గత లక్షణాలను బట్టి F2 తరంలో వాటి నిష్పత్తిని తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 15

ప్రశ్న 14.
ఈ క్రింది పదాలను వివరించండి.
ఎ) యుగ్మవికల్పకాలు బి) సమయుగ్మజ స్థితి సి) విషమయుగ్మజ స్థితి డి) F1 తరం ఈ) F1 తరం ఎఫ్) దృశ్యరూపం జి) జన్యురూపం హెచ్) బహిర్గతం ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం
జవాబు:
ఎ) యుగువికల్పకాలు :
ప్రతి లక్షణాన్ని నియంత్రించే ఒక జత కారకాలను యుగ్మ వికల్పకాలు అంటారు. ప్రస్తుతం ఈ కారకాలనే ‘జన్యువులు’ అంటారు.
ఉదా : పొడవు (TT), పొట్టి (tt).

బి) సమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి రెండూ ఒకే రకమైన కారకాలుంటే దానిని ‘సమయుగ్మజం’ (Homozygous) అంటారు.
ఉదా : పసుపురంగు (YY), గుండ్రని విత్తనం (RR),

సి) విషమయుగ్మజ స్థితి :
ఒక లక్షణానికి వ్యతిరేక లక్షణాలున్న జన్యువులు జతగా ఉంటే దానిని “విషమయుగ్మజం” అంటారు. (Heterozygous) అంటారు.
ఉదా: పసుపురంగు (YY), గుండ్రం (Rr),

డి) F1 తరం :
సంకరణ ప్రయోగంలో, సమయుగ్మజ మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన మొదటి తరాన్ని “F1 తరం” అంటారు. ఇవి దృశ్యరూపం పరంగా ఒకే విధంగా ఉండి జన్యురూపంగా విషమయుగ్మజ స్థితిలో ఉంటాయి.

ఈ) F2 తరం :
F1 తరం మొక్కల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపగా ఏర్పడిన సంతతిని “F2 తరం” అంటారు. ఇవి దృశ్యరూపంగా 3:1 నిష్పత్తిని, జన్యుపరంగా 1 : 2 : 1 నిష్పత్తిని కలిగి ఉంటాయి.

ఎఫ్) దృశ్యరూపం :
ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాలను “దృశ్యరూపం” అంటారు.
ఉదా : పొడవు, పొట్టి.

జి) జన్యురూపం :
జీవి ప్రదర్శించే లక్షణాలకు కారణమైన జన్యుస్థితిని “జన్యురూపం” అంటారు.
ఉదా : పొడవు (TT లేదా TI).

హెచ్) బహిర్గతం :
విషమయుగ్మజ స్థితిలో జీవి ఏదో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అని, అటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు.
ఉదా : విషమయుగ్మజ పొడవు మొక్క (TV) పొడవు మరియు పొట్టి లక్షణాల కారకాలను కలిగి ఉన్నప్పటికి అది పొడవు మొక్కగా ఉంటుంది. ఇక్కడ పొడవు బహిర్గత లక్షణం. పొట్టి అంతర్గత లక్షణం.

ఐ) స్వతంత్ర జన్యువ్యూహనం :
యుగ్మవికల్పకాలలో రెండు కారకాలు ఉన్నప్పటికీ, సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఒక్కో కారకం విడిపోయి ప్రవేశిస్తాయి. ఈ సందర్భంలో ప్రతి కారకం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఈ జన్యు ధర్మాన్ని పృధక్కరణ లేదా వేరుపడే సూత్రం లేదా స్వతంత్ర జన్యువ్యూహనం (Law of Segregation) అంటారు.
ఉదా: విషమయుగ్మజ పొడవు మొక్క (T) నుండి, రెండు రకాల సంయోగబీజాలు (T) (1) ఏర్పడతాయి. ఇవి ఏర్పడేటప్పుడు ఒక కారకం, మరొక కారకంపై ప్రభావాన్ని చూపుతుంది.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 15.
మెండల్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
వైవిధ్యాలు గురించి అవి అనువంశికంగా సంక్రమించే విధానం గురించి 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ పరిశోధన చేశాడు. ఇతను బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసి అనువంశికతను వివరించాడు. ఇతని సిద్ధాంతంలో మూడు పరికల్పనలు, రెండు సూత్రాలు ఉన్నాయి.

పరికల్పనలు :
మొదటి పరికల్పన :
జీవిలోని ప్రతి ప్రత్యేక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. (వీటిని నేడు మనం జన్యువులు అంటున్నాము. ఈ జన్యువుల జతను యుగ్మవికల్పకం అంటారు.)

రెండవ పరికల్పన :
సంతతిలోని రెండు కారకాలు ఒక్కో జనకుని నుండి ఒక్కొక్కటి పొందును.

వివరణ :
సంయోగబీజాల కలయిక వలన జీవి ఏర్పడుతుంది. సంయోగబీజం ఒకటి తల్లి నుండి మరొకటి తండ్రి నుండి వస్తాయి. కావున సంతతిలోని యుగువికల్పకంలో ఒకటి తల్లి మరొకటి తండ్రికి చెంది ఉంటాయి.

మూడవ పరికల్పన :
సంతతికి లభించిన రెండు భిన్న కారకాలలో ఒక కారకం మాత్రమే బహిర్గతమవుతుంది.

వివరణ :
సంతతి విషమయుగ్మజ స్థితిలో ఉంటే ఒక లక్షణం మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని బహిర్గతం అంటారు.

సిద్ధాంతాలు :
తన పరికల్పనల ఆధారంగా మెండల్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించాడు. అవి

1. బహిర్గత సిద్ధాంతం :
జీవి విషమయుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడుతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది.
ఉదా : విషమయుగ్మజ పొడవు (Tt) మొక్కలో పొడవు లక్షణం ప్రదర్శింపబడి పొట్టి లక్షణం అంతర్గతంగా ఉంటుంది.

2. వేరుపడే సూత్రం :
యుగ్మవికల్పకాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్నవిక్సలకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.
ఉదా :
విషమయుగ్మజ పొడవు మొక్క (Tt) నుండి రెండు రకాల సంయోగబీజాలు (T), (t) సమ సంఖ్యలో ఏర్పడతాయి.

ప్రశ్న 16.
దార్విన్ సిద్ధాంతాన్ని వివరించండి.
జవాబు:
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809-1882)
ప్రకృతి వరణం (natural selection) అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. డార్విన్ తన 22వ యేట HMS బీగిల్ అనే నౌకలో ప్రపంచ సర్వే కోసం బయలుదేరి 5 సంవత్సరాలు ప్రయాణించాడు. గాలాపాగస్ దీవులతో సహా ఎన్నెన్నో ప్రదేశాలను అతడు సందర్శించాడు. ఆయా ప్రదేశాలలోని మొక్కలు, జంతువుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అలాగే ఎంతో సమాచారాన్ని, ఋజువులను కూడా సేకరించాడు.

డార్విన్ సిద్ధాంతంలో ప్రధానంగా మూడు సత్యాలు (పరిశీలనలు), రెండు సూత్రీకరణలు (సిద్ధాంతాలు) ఉంటాయి. అవి

1. అత్యుత్పత్తి :
(మొదటి సత్యం) జీవులు తమ సంతతిని అధికసంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఒక ఆవాలు చెట్టు, తన జీవితకాలంలో 10 వేల విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ మొక్కలుగా మారితే భూమి అంతా ఆవాల మొక్కలతో నిండిపోతుంది.

2. జనాభా నిర్ణీత సంఖ్య :
(రెండవ సత్యం) జీవులు తమ సంతతిని అధికంగా ఉత్పత్తి చేసినా, ఏ జీవి భూమి అంతటినీ ఆక్రమించలేదు. ప్రతి జాతి సంఖ్య నిర్దిష్టంగా నియంత్రించబడుతుంది. జనాభా నిర్ణీత సంఖ్యలో ఎందుకు ఉంటుందని డార్విన్ ఆలోచించాడు.

3. మనుగడ కోసం పోరాటం :
(మొదటి సిద్ధాంతం) జీవులు అధిక సంఖ్యలో ఏర్పడిన్పటికి, అవి జీవించటంలో అధికమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. వాటి అవసరాలు ఒకే విధంగా ఉండుట వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనినే ‘మనుగడ కోసం పోరాటం’ అంటారు. మరి ఈ పోరాటంలో ఏ జీవులు గెలుస్తాయి? ఏవి మరణిస్తాయి? అని ఆలోచించాడు.

4. వైవిధ్యాలు :
(మూడవ సత్యం) జీవులన్నీ ఒకే విధమైన లక్షణాలలో లేవు. జీవుల మధ్య ఉండే ఈ వ్యత్యాసాలను వైవిధ్యాలు అంటారు. పించ్ పక్షుల ముక్కుల ఆకారం వాటి ఆహార అలవాట్లకు గల సంబంధాన్ని పరిశీలించి, డార్విన్ వైవిధ్యాలు మనుగడకోసం పోరాటానికి తోడ్పడతాయని భావించాడు.

5. యోగ్యతను సార్థక జీవనం :
(రెండవ సిద్ధాంతం) మనుగడ కోసం జరిగే పోరాటంలో వైవిధ్యాలు తోడ్పడితే అవి సమర్థవంతంగా జీవించగలుగుతాయి. మనుగడకు తోడ్పడే ఇటువంటి లక్షణాలను అనుకూలనాలు అంటారు. అనుకూలనాలు లేని జీవులు నశించి ప్రకృతి నుండి తొలగించబడతాయి. ప్రకృతిచే ఎన్నుకొనబడే ఈ ప్రక్రియను ‘ప్రకృతి వరణం’ అంటారు.
1. అత్యుత్పత్తి 2. జనాభా నిర్ణీత సంఖ్య – మనుగడ కోసం పోరాటం 3. వైవిధ్యాలు యోగ్యతమ సార్థక జీవనం
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 16

ప్రశ్న 17.
మెండల్ స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతంను వివరించండి.
జవాబు:
మెండల్ స్వతంత్ర వ్యూహన సిద్దాంతం :
బఠానీ మొక్కలలో పై విధంగా ద్విసంకర సంకరణం జరపగా, సంతతిలో పసుపు (Yy), గుండ్రని (RR) మరియు ముడతలు (rr), ఆకుపచ్చ (yy) లక్షణాలు కనిపించాయి. F1 తరం మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరిపినపుడు ఆయా లక్షణాలు, ఇతర లక్షణాలతో స్వతంత్రంగా కలిసిపోయి F2 తరం ఏర్పడింది.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17

– (1) RRYY (2) RRYy (3) RrYY (4) RrYy (5) RRYy (6) RrYY (7) RrYy (8) RrYy (9) RrYy అనేవి గుండ్రని మరియు పసుపు విత్తనాలనిచ్చేవి.
– (1) RRyy(2) Rryy (3) Rryy అనేవి గుండ్రని మరియు ఆకుపచ్చనివి.
– (1) rr Yy(2) rr Yy (3) Ir YY అనేవి ముడతలు మరియు పసుపువి.
– rryy అనేవి ముడతలు మరియు ఆకుపచ్చనివి.

పై ఫలితాలను బట్టి ప్రతి లక్షణానికి కారణమైన కారకం స్వతంత్రంగా ఉంటూ సంయోజబీజాలలో మనగలిగనట్లు నిర్ధారణకు రావచ్చు. అంటే కారకాలనేవి (factors) స్వతంత్రమైనవి మరియు సంయోగబీజాల ద్వారా అనువంశికంగా సంతతికి అందించబడతాయి. ఈ ఒక జతకన్నా ఎక్కువ లక్షణాల యొక్క అనువంశికతను గమనిస్తే, ఆ జత లక్షణాలకు కారణమైన కారకాలు చేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించుటనే లేదా అందించుటనే “స్వతంత్ర వ్యూహన సిద్ధాంతమని” అంటారు.

ప్రశ్న 18.
లామార్క్ సిద్ధాంతాన్ని వివరించండి. (లేదా) ఆర్తిత గుణాల అనువంశికత అనగానేమి?
జవాబు:
ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్ది అభివృద్ధి చేసుకొన్న లక్షణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం- ఇలా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడతాయి. దీనిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు.

ఉదా :
జీన్ బాప్టిస్ట్ లామార్క్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి. కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు జింకల వలెనే ఉండేవని లామార్క్ భావించాడు. ఆహార కొరత కారణంగా నేలపైన మరియు చెట్ల యొక్క కింది శాఖలు లేకుండా పోయాక జిరాఫీలు మెడసాచి పైన ఉన్న శాఖలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. కనుక మెడనిసాచి పై శాఖలను అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు.

ఎందుకంటే ఎల్లప్పుడూ మెడను సాచి ఉపయోగించడం మూలంగా కొన్ని తరాల తరవాత జిరాఫీల మెడ సాగిపోయి ఇప్పుడు ఉన్నట్లు సాగిన మెడ గల జిరాఫీల ఆవిర్భావం జరిగి ఉంటుంది. ఇలా ఒక జీవి తన మనుగడ కోసం అవసరం కొద్దీ అభివృద్ధి చేసుకున్న లక్షణాలను లేదా గుణాలను ఆర్జిత గుణాలు (Acquired characters) అంటారు. లామార్క్ అభిప్రాయం ప్రకారం ఈ విధంగా ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి. దీనినే ‘ఆర్జిత గుణాల అనువంశికత’ అంటారు. ఉదా : సాగిన మెడ మరియు పొడవు ఎదిగిన ముందుకాళ్ల జిరాఫీ.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 19.
DNA గురించి తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

  1. DNA అనగా డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆమ్లం. ఇది కేంద్రకంలో ఉండే ఒక ఆమ్లం.
  2. జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు.
  3. మీరు DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని వాట్సన కనుగొన్నారు. ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు.
  4. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్పేట నిర్మితం.
  5. దీనిలో మెట్ల వలె ఉండేవి నత్రజని క్షారాలు. అవి అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్.
  6. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్స్ తో పాటుగా వాట్సన్ మరియు క్రికు నోబెల్ బహుమతి వచ్చింది.
  7. జుట్టు యొక్క రంగు, చర్మం మొదలగు లక్షణాలు దీనికి ఉదాహరణలు.
  8. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పునకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

ప్రశ్న 20.
దార్విన్ సిద్ధాంత సారాంశం తెలపండి.
జవాబు:
డార్విన్ సిద్ధాంత సారాంశం :

  1. ఒక జీవి జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు. కానీ సమూహంలోని అన్ని జీవులూ ఒకే రకంగా కాదు.
  2. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి.
  3. అధిక సంఖ్యలో సంతతి ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది.
  4. తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవులకన్నా, ఉన్నవి మనుగడ కొనసాగించడానికి, ప్రత్యుత్పత్తి ద్వారా అధిక సంతానం ఉత్పన్నం చేస్తుంది.
  5. ఉపయుక్త వైవిధ్యాలుండి, మనుగడ సాగిస్తున్న జీవులు అనువంశికంగా సంతతికి వాటిని అందజేస్తాయి. అలాగే ప్రతి తరంలోనూ జరగడం వలన ఆ వైవిధ్యాలు సర్వసాధారణ లక్షణాలవుతాయి.
  6. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు వాటికి అనుగుణంగా మార్పులు లేదా అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలో జీవించగలుగుతాయి.
  7. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటుచేసుకుంటూ ఉంటే, అది ఒక కొత్త జాతి ఏర్పడటానికి దారితీస్తుంది. కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది.
  8. భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినవే.

ప్రశ్న 21.
కొత్త జాతులు ఏర్పడే విధానాన్ని ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి (Speciation) అని లేదా స్థూలపరిణామం (Macro evolution) అనీ అంటారు.

ఉదా : ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు లైంగికంగా కలిసి సంతతిని పొందగలవని మనకు తెలుసు. కానీ ఎర్ర, ఆకుపచ్చ కుమ్మరి పురుగులు ఏవేని కారణాలచేత చాలా కాలం వేరైపోయాయని ఊహించుకోండి (ఉదాహరణకు కాయలు తినడానికై నోట కరచుకొని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో జారవిడిచాయనుకోండి).

కొన్ని సంవత్సరాలలో రెండు రకాల కుమ్మరి పురుగులలోనూ ఎంతో వైవిధ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత అవి అనుకోకుండా కలిసినప్పటికీ ప్రత్యుత్పత్తి జరపలేవు. సంతతిని ఉత్పత్తి చేయలేవు. ఏదైనా జీవులు వాటి జాతి జీవులతోనే కలవడం, సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త జాతులు ఏర్పడుతుంటాయి.

ప్రశ్న 22.
మానవ పరిణామక్రమం తెలపండి.
జవాబు:
ఆధునిక మానవుడి రూపు సంతరించుకొనే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామం అంటారు. ఇతర మొక్కలు, జంతువులన్నింటి వలెనే మనకు కూడా పరిణామ చరిత్ర ఉంది. ఆదిమానవుని వలె కనిపించే జీవులు 7 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉండేవారు. మానవులకు (హోమో సెపియన్స్) చెందిన అతి పురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి 2 లక్షల 50 వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు తెలుపుతున్నది.

మానవ పరిణామ క్రమం :
హోమో హెబిలస్ – 1.6 – 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో ఎరెక్షన్ – 1-1.8 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
హోమో సెపియన్స్ నియండర్తలెన్సిస్ – 2.3-3 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు.
హోమో సియన్స్ (ప్రస్తుత మానవులు) – 40 వేల సంవత్సరాల పూర్వం నుండే నివసిస్తున్నారని తెలియుచున్నది.

ప్రశ్న 23.
పరిణామక్రమంలో మానవ వలస ప్రయాణం తెలపండి. (లేదా) మానవులలోని వేరు వేరు జాతులు ఒకే జాతి నుండి పరిణామం చెందాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. మానవులంతా ఆఫ్రికా నుండి వచ్చినవారే! మానవుల అతిపురాతన జీవులు హెమో సెపియన్స్ అక్కడే కనుగొనబడ్డారు.
  2. మన జన్యు సమాచారం కూడా ఆఫ్రికన్ మూలాలనే సూచిస్తోంది.
  3. అంటే రెండు మిలియన్ సంవత్సరాల పూర్వం అక్కడే మానవులుండేవారు. తర్వాతే వివిధ కారణాలతో మన పూర్వీకులు ఆఫ్రికాను వదిలి బయటకు వచ్చారు. కొందరేమో అక్కడే ఉండిపోయారు.
  4. వలసకు బయలుదేరిన వారు ఆఫ్రికా నుండి ఆసియా, తరవాత ఆసియా మధ్యభాగం, యురేషియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా అలా చేరుకున్నారు.
  5. వారిలో కొందరు ఇండోనేషియా దీవుల నుండి ప్రయాణిస్తూ ఫిలిప్పైన్స్ మీదుగా ఆస్ట్రేలియా చేరారు.
  6. అలాగే బేరింగ్ జలసంధి దాటి అమెరికా చేరుకున్నారు.
  7. వారంతా ఒకే దారిలో లేదా ఒకే కాలంలో పయనించలేదు. కేవలం ప్రయాణించాలనే ప్రయాణించలేదు. అప్పటి అవసరాలు, కారణాలు వారు ప్రయాణించేలా పురికొల్పి ఉంటాయి.
  8. ముఖ్యంగా ముందుకు, వెనుకకు, గుంపులుగా, ఒకసారి కొంత కొంత మంది వేరవుతూ, ఒకరికొకరు విడిపోతూ ఆఫ్రికా నుండి దూరంగా, ఆఫ్రికాలోనికి అలా ప్రయాణించారు.

ప్రశ్న 24.
ఒక ప్రయోగంలో F1 తరంలో అన్ని గుండ్రని పసుపు విత్తనాలు ఏర్పడినాయి (Yy Rr). F2 తరంలో గుండ్రని పసుపు (YYRr లేదా YY RR), గుండ్రని ఆకుపచ్చ (vy RRor YyRr), ముడతలు పడిన పసుపు (Yyrr లేదా YYrr) ముడతలు పడిన ఆకుపచ్చ (vy rr) గింజలు వచ్చాయి.
జవాబు:
1. ఒక్కొక్క రకం మొక్కలు ఎంతెంత శాతం ఏర్పడినవి?
గుండ్రని పసుపు గింజల మొక్కలు : 9 %
ముడతలు పడిన పసుపు గింజల మొక్కలు : 3%
గుండ్రని ఆకుపచ్చ గింజల మొక్కలు : 3%
ముడతలు పడిన ఆకుపచ్చ గింజల మొక్కలు : 1% గా ఏర్పడినవి.
అంటే వీటి జన్యురూప నిష్పత్తి 9 : 3 : 3 : 1 గా ఉంది.

2. ఏ మొక్కలు ఏర్పడటానికి ఎంత సంభావ్యత ఉందో కనుగొనగలరా?
ఔను. నాలుగు రకాల మొక్కలు 9:3:3:1 నిష్పత్తిలో ఏర్పడ్డాయి.

3. మెండల్ పరిశోధనలతో మీరు ఏకీభవిస్తున్నారా?
ఔను, మెండల్ పరిశోధనల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 25.
‘మానవుడు ఆఫ్రికా ఖండంలోనే మొదట జన్మించాడు’ అన్న అంశంపై మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు ఒక చరిత్రకారుడిని కలిసినపుడు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు?
జవాబు:

  1. మానవ పరిణామము అనగానేమి?
  2. మానవుని పోలివుండే ఆదిమానవుడు ఎప్పుడు భూమిపై కనిపించడం జరిగినది?
  3. ఆదిమానవుడు ఎక్కడ జీవించాడు?
  4. ప్రస్తుత మానవ సమాజాలు ఎక్కడ నివసిస్తున్నప్పటికి వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి?
  5. మానవులకు చెందిన అతిపురాతన శిలాజం భూమిపై మానవుల ఉనికి ఎప్పటి నుండి ఉందని చెపుతుంది?
  6. మానవజాతి అయిన ‘హోమోసెపియన్సు’ ఎన్ని సంవత్సరాల క్రితం నుండి నివసిస్తున్నారని తెలుస్తోంది?
  7. ఆఫ్రికా నుండి కొన్ని మానవ సమాజాలు ఎప్పుడు అక్కడ నుండి బయలుదేరినాయి?
  8. మానవులందరూ ఒకే మానవుని నుండి ఉద్భవించినారా?

ప్రశ్న 26.
మానవ పరిమాణ క్రమాన్ని ఫ్లోచార్ట్ ద్వారా చూపండి.
జవాబు:
మానవ పరిణామక్రమం (Human evolution) :
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 19

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 20
జవాబు:
పృథక్కరణ సూత్రం

2.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 21
జవాబు:
సూక్ష్మ పరిణామం

3.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 22
జవాబు:
అనువంశిక లక్షణాలు

4.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 23
జవాబు:
మనుగడ కోసం పోరాటం

5.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 24
జవాబు:
ఆహారం మరియు ఆశ్రయం కోసం వివిధ జాతుల మధ్య పోరాటం

6.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 25
జవాబు:
పురాజీవ శాస్త్ర నిదర్శనాలు

7.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 26
జవాబు:
అవశేషావయవాలు

8.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 27
జవాబు:
Tt

9.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 28
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

10.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 29
జవాబు:
Tt

11.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 30
జవాబు:
పసుపు, ముడతలు

సరైన గ్రూపును గుర్తించండి

12. మెండల్ ప్రయోగాల సంఘటనలు ఏవి వరుస క్రమంలో ఉన్నాయి?
A. స్వచ్ఛమైన జాతి ఎంపిక – స్వచ్చమైన మొక్కలను సంకరణం – F1 మొక్కలు స్వయం ఫలదీకరణం
B. F1 మొక్కలు స్వయం ఫలదీకరణం – F1 మొక్కలను సంకరణం చేయడం – మొత్తం F2 మొక్కలు శుద్ధ జాతీ
జవాబు:
గ్రూపు – A

13. మెండల్ ఏక సంకర సంకరణంలో ఏ గ్రూపు లక్షణాలు సరైనవి?
A. F1 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు
B. F2 లక్షణాలు : సమయుగ్మజ పొడవు, విషమ యుగ్మజ పొడవు, సమయుగ్మజ పొట్టి
జవాబు:
F2 లక్షణాలు

14. క్రింది వానిలో మెండల్ ప్రయోగానికి అనువైన బఠానీ మొక్కల లక్షణాలు ఏవి?
A. ఏక వార్షిక మొక్క ద్విలింగ పుష్పాలు, ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
B. ద్వివార్షిక మొక్క ఏకలింగ పుష్పాలు, తక్కువ మొత్తంలో విత్తనాలు ఉత్పత్తి చేయడం.
జవాబు:
గ్రూపు – A

15. బఠాణీ మొక్కల్లో మెండల్ అధ్యయనం చేసిన పరస్పర విరుద్ధ లక్షణాలు ఏవి ?
A. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఎరుపు & నీలం
కాయ రంగు – ఆకుపచ్చ & పసుపు
B. కాండం పొడవు – పొడవు & పొట్టి
పూల రంగు – ఊదారంగు & తెలుపు
విత్తనం రంగు – పసుపు & ఆకుపచ్చ
జవాబు:
గ్రూపు – B

16. బరాణీ మొక్కల్లో దిగువ పేర్కొన్న ఏ గ్రూపు బహిర్గత లక్షణాలు?
A. పొడవైన, ఊదారంగు, గ్రీవ, గుండ్రని
B. పొట్టి, తెలుపు, శిఖరపు, ముడతలు
జవాబు:
గ్రూపు – A

17. ఈ దిగువ పేర్కొన్న ఏ సముదాయం అభిసారి పరిణామాన్ని సూచిస్తున్నాయి?
A. గబ్బిలం రెక్క – మానవుని చేయి
B. గబ్బిలం రెక్క – సీతాకోకచిలుక రెక్క
జవాబు:
గ్రూపు – B

18. దిగువ పేర్కొన్న ఏ మొక్క భాగాలు నిర్మాణ సామ్య అవయవాలు?
A. ముళ్ళు – నులి తీగలు & కొక్కేలు – ముళ్ళు
B. క్యారెట్ – బంగాళదుంప & మొక్క యొక్క ఆకు – ఒపర్షియా యొక్క కాండం
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

19. దిగువ పేర్కొన్న ఏ జీవులు లామార్క్ వాదానికి చెందినవి?
A. ఫించ్ పక్షులు, సాల్మన్ చేపలు
B. జిరాఫీ, పాములోని చలనాంగాలు
జవాబు:
గ్రూపు – B

20. దిగువ పేర్కొన్న ఏ సముదాయం పరిణామానికి సంబంధించిన స్వరూప శాస్త్ర నిదర్శనాలు కావు?
A. నిర్మాణసామ్య అవయవాలు, క్రియాసామ్య అవయవాలు
B. శిలాజాలు, పిండ దశలు
జవాబు:
గ్రూపు – B

21. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు మానవ పరిణామం సరైన క్రమంలో ఉన్నది?
A. హోమో హెబిలిస్ – హోమో ఎరెక్టస్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్ – హోమో సెపియన్స్
B. హోమో ఎరెక్టస్ – హోమో హెబిలిస్ – హోమో సెపియన్స్ – హోమో సెపియన్స్ నియాండర్తాలెన్సిస్
జవాబు:
గ్రూపు – A

22. దిగువ పేర్కొన్న ఏ పరిస్థితి వారసత్వంగా సంక్రమిస్తుంది?
A. రెక్కల పురుగు జనాభాలో బరువు తగ్గడం
B. ఎర్ర రెక్కల పురుగు నుండి ఉత్పరివర్తన ఆకుపచ్చ రెక్కల పురుగు ఉద్భవం
జవాబు:
B

23. దిగువ పేర్కొన్న ఏ వైవిధ్యం ప్రకృతి వరణానికి దారి తీస్తుంది?
A. బీజకణ వైవిధ్యం
B. శారీరక కణాల వైవిధ్యం
జవాబు:
A

24. దిగువ పేర్కొన్న ఏ గ్రూపు అవశేష అవయవాలు?
A. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. జ్ఞాన దంతాలు, ఉండుకం, బాహ్య చెవి కండరాలు, పురుషుల శరీరం మీద వెంట్రుకలు
జవాబు:
గ్రూపు – B

25. దిగువ పేర్కొన్న వాటిలో ఏవి శిలాజాలుగా సంరక్షించ బడుతున్నాయి?
A. బాహ్య అస్థిపంజరం, ఎముకలు, దంతాలు, వెంట్రుకలు
B. కండరాలు, నాలుక, చర్మం, గోళ్లు
జవాబు:
గ్రూపు – A

26. శిలాజాల వయస్సును లెక్కించడానికి ఏ సమూహ ఐసోటోపులను ఉపయోగిస్తారు?
A. ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్
B. కార్బన్, యురేనియం, పొటాషియం
జవాబు:
గ్రూపు – B

ఉదాహరణలు ఇవ్వండి

27. సమయుగ్మజ పొడవు యొక్క జన్యురూపం TT. పొట్టి మొక్క యొక్క జన్యు రూపం ఏమిటి ?
జవాబు:
tt

28. పొడవు బఠాణి మొక్క యొక్క ఒక లక్షణం. దీనికి విరుద్ధమైన లక్షణం ఏమిటి?
జవాబు:
పొట్టి

29. సీతాకోకచిలుక మరియు దోమ యొక్క ముఖ భాగాలు నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చిరుత మరియు మానవుడు యొక్క పూర్వాంగాలు

30. కీటకాల రెక్కలు మరియు పక్షి రెక్కలు క్రియాసామ్య అవయవాలకు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీతాకోకచిలుక రెక్కలు మరియు గబ్బిలం యొక్క రెక్కలు.

31. పెరిపీటస్, ఎకిడ్నా సంధాన సేతువులకు ఉదాహరణలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కియోటెరిక్స్

32. ‘X’ స్త్రీ బీజం యొక్క లైంగిక క్రోమోజోము. పురుష లైంగిక క్రోమోజోముకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
X మరియు Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

33. డార్వినిజం అనేది పరిణామ సిద్దాంతాలలో ఒకటి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లామార్కిజం

34. 3: 1 ఏక సంకర సంకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి. ఏక సంకర సంకరణం యొక్క జన్యురూప నిష్పత్తి ఏమిటి?
జవాబు:
1 : 2 : 1

35. డోడో విలుప్త జీవికి ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డైనోసార్లు

36. స్వరూప శాస్త్రం, అంతర నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం అనేవి పరిణామ సిద్ధాంతానికి సాక్ష్యాలను అందించే విజ్ఞానశాస్త్ర శాఖలు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పురాజీవశాస్త్రం

పోలికను గుర్తించుట

37. 44 : మానవులలో శారీరక క్రోమోజోములు : : ? : మానవులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
2

38. XX; స్త్రీలలో లైంగిక క్రోమోజోములు : : ? : పురుషులలో లైంగిక క్రోమోజోములు
జవాబు:
XY

39. X, Y : శుక్రకణాలు : : ? : అండం
జవాబు:
X

40. Tt : F1 తరం : : TT, Tt, tt 😕
జవాబు:
F2 తరం

41. ఎలుకలు : వీస్మన్ : : ఫించ్ పక్షులు 😕
జవాబు:
డార్విన్

42. ఉండుకం : అవశేష అవయవం : : తోకతో ఉన్న బేబీ 😕
జవాబు:
అటావిస్టిక్ అవయవం

43. TT: సమయుగ్మజ పొడవు : : ? : సమయుగ్మజ పొట్టి
జవాబు:
tt

44. యోగ్యతముల సార్లక జీవనం :: డార్విన్ : : ఆర్జిత లక్షణాల అనువంశికత 😕
జవాబు:
లామార్క్

45. బీజద్రవ్య సిద్ధాంతం : వీసమన్ : : An essay on the principles of population.
జవాబు:
మాల్టస్

46. నిటారైన మనిషి : నియాండర్తలెన్సిస్ : : ఆధునిక మానవుడు 😕
జవాబు:
హోమో సెపియన్స్

శాస్త్రవేత్తను గుర్తించండి

47. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన మతగురువు. ఆయన దాదాపు 34 రకాలకు చెందిన 10000 బఠాణీ మొక్కలపై అధ్యయనం చేశారు. ఆయన ‘జన్యు శాస్త్ర పితామహుడు’ గా పేరొందాడు.
జవాబు:
గ్రెగర్ జోహన్ మెండల్

48. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరి ద్వంద్వ కుండలి ఆకారాన్ని కలిగి ఉంటుంది అని వీరు ఇరువురు కనుగొన్నారు.
జవాబు:
ఫ్రాన్సిస్ క్రీక్ & జేమ్స్ వాట్సన్

49. డ్రోసోఫిలాలో లింగ సహలగ్న లక్షణాలను వారు కనిపెట్టారు. డ్రోసోఫిలాలో వంశపారంపర్యత గురించి అధ్యయనం చేశారు.
జవాబు:
వాల్టర్ సటన్ & థామస్ హంట్ మోర్గాన్

50. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మొదటి వ్యక్తి ఆయన. ఆర్జిత గుణాల అనువంశికత అనే పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
జవాబు:
జీన్ బాప్టిస్ట్ లామార్క్

51. ఆయన ‘ప్రకృతి వరణం’ అనే ప్రసిద్ధ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. HMS బీగిల్ అనే నౌకలో గాలాపాగస్ దీవులను సందర్శించి, ఫించ్ పక్షులలో వైవిధ్యాలను గమనించాడు.
జవాబు:
చార్లెస్ డార్విన్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

52. ఆయన రాసిన పుస్తకం ‘Principles of geology’. భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయి అని ప్రతిపాదించారు.
జవాబు:
చార్లెస్ లైల్

53. జనాభా గుణ శ్రేణిలో పెరుగుతుంటే (1, 2, 4, 8, …..) వాటి ఆహార అవసరాలు అంక శ్రేడి పద్దతిలో పెరుగుతున్నాయి. (1, 2, 3, 4, …..) అని వివరించాడు.
జవాబు:
మాల్టస్

54. ప్రకృతి వరణం కొత్త జాతుల పుట్టుకకు దోహద పడిందని స్వతంత్రంగా ప్రకృతి వరణం సిద్ధాంతాన్ని నిర్ధారించింది.
జవాబు:
ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్

నేను ఎవరు?

55. నేను ఒక రకమైన పరిణామం, పెద్ద ఎత్తున మార్పులు సంభవించడం వలన కొత్త జాతులు ఏర్పడతాయి.
జవాబు:
స్థూల పరిణామం

56. ఆర్జిత గుణాలు దాని సంతానానికి అందజేయబడతాయి అని వివరించే లామార్క్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని.
జవాబు:
ఆర్జిత గుణాల అనువంశికత

57. ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారం సొమాటో ప్లాస్మాలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమించవు. కానీ బీజద్రవ్యంలో సంభవించే మార్పులు తరువాతి తరానికి సంక్రమిస్తాయి.
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం

58. అవయవాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, భిన్నమైన విధిని కలిగి ఉండటం అనే స్వరూప శాస్త్ర నిదర్శనాన్ని నేను.
జవాబు:
నిర్మాణ సామ్య అవయవాలు

59. మానవ శరీరంలోని కొన్ని అవయవాలు జీవక్రియల్లో ఎటువంటి పాత్ర కలిగి ఉండవు. పరిణామ క్రమంలో ఈ అవయవాలు పనిచేయకుండా పోయాయి.
జవాబు:
అవశేషావయవాలు

60. నేను శిలాజాలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర విభాగాన్ని.
జవాబు:
పురాజీవశాస్త్రం

61. ఐసోటోపులు , కలిగియున్న రాయి లేదా మూలకాల వయసును ఈ పద్ధతి ద్వారా గణించవచ్చు.
జవాబు:
కార్బన్ డేటింగ్ పద్ధతి

62. నేను శీతాకాలం పంటను. లక్షణాలు వారసత్వంగా ఎలా వస్తాయో నిరూపించడానికి మెండల్ నన్ను తన ప్రయోగాలకు ఉపయోగించాడు. నా శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు:
పైసం సెటైవం

63. నేను అనువంశికత ప్రమాణాన్ని. మెండల్ నన్ను కారకంగా పిలిచాడు.
జవాబు:
జన్యువులు

64. జన్యువుల యొక్క అన్ని సంభావ్యతలను లెక్కించడానికి సహాయపడే ఒక రేఖాత్మక చిత్రరూపాన్ని?
జవాబు:
పన్నేట్ స్క్వేర్

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

65. విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను వంశపారంపర్యం అంటారు.
జవాబు:
విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతతి పొందే ప్రక్రియను అనువంశికత అంటారు.

67. ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ద్విసంకర సంకరణం అని అంటారు.
జవాబు:
ఒక జత విభిన్న లక్షణాలు గల రెండు బఠాణీ మొక్కల మధ్య సంకరణం చేయడాన్ని ఏకసంకర సంకరణం అని అంటారు.

68. ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమో జోమ్ జతను శారీరక క్రోమోజోములు అని అంటారు.
జవాబు:
ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణలో సహాయపడే క్రోమోజోమ్ జతను లైంగిక క్రోమోజోములు అని అంటారు.

69. ఆర్తిత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.
జవాబు:
అనువంశికత లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

70. నిర్మాణ సామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.
జవాబు:
క్రియాసామ్య అవయవాలు విభిన్న నిర్మాణం కలిగి మరియు ఒకే విధిని కలిగి ఉంటాయి.

71. మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది స్త్రీ బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.
జవాబు:
మానవులలో శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది పురుష బీజము యొక్క రక్తాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది.

72. బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని బహిర్గతత్వ సూత్రం అంటారు.
జవాబు:
బీజ కణాలు ఏర్పడేటప్పుడు ఒక జత లక్షణాలకు కారణమైన కారకాలు వేరే లక్షణాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా సంతతికి లభించడాన్ని స్వతంత్ర జన్యు
వ్యూహన సిద్దాంతం అంటారు.

73. ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పురాజీవశాస్త్రం అంటారు.
జవాబు:
ఒక జీవి అండం మొదలుకొని సంపూర్ణంగా ఎదగడం వరకు గల వివిధ అభివృద్ధి దశలను గురించిన అధ్యయనం చేయడాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు. 66. మొక్కల పెంపకం, సంకరణం గురించి డార్విన్ తన ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. జ. మొక్కల పెంపకం, సంకరణం గురించి మెండల్ తన – ప్రయోగాల్లో ఇలా పేర్కొన్నాడు. అనువంశికత సూత్రాలను ఆయన ప్రతిపాదించారు.

74. ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను వంశపారంపర్య లక్షణాలుగా పిలుస్తారు.
జవాబు:
ఒక జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చేసుకున్న లక్షణాలను ఆర్జిత లక్షణాలుగా పిలుస్తారు.

జతపరచుట

75. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లామర్కిజం – లామార్క్
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్
డార్వినిజం – డార్విన్
జవాబు:
బీజద్రవ్య సిద్ధాంతం – మెండల్

76. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఉపయుక్త నిరుపయుక్త అవయవాలు – వీస్మన్
ఎలుకలపై ప్రయోగాలు – లామార్క్
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్
జవాబు:
ఫించ్ పక్షులలో వైవిధ్యం – డార్విన్

77. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముళ్ళు మరియు నులి తీగలు – క్రియాసామ్య అవయవాలు
క్యారెట్ మరియు అల్లం – నిర్మాణసామ్య అవయవాలు
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు
జవాబు:
ఆర్కియోటెరిక్స్ – సంధాన సేతువు

78. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్
జన్యుపదార్థం – DNA
కెటోసారస్ – శిలాజం
జవాబు:
కార్బన్ డేటింగ్ – హైడ్రోజన్

79. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
F1 తరం – TT, Tt, it
జనక తరం – Tr, it
F2 తరం – It
జవాబు:
జనక తరం – TT, tt

80. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
విషమయుగ్మజం – YY
సమయుగ్మజం – Yy
YY, Yy- యుగ్మ వికల్పాలు
జవాబు:
YYYy – యుగ్మ వికల్పాలు

81. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
దృశ్యరూపం – 3 : 1
జన్యురూపం – 1 : 2 : 1
పన్నేట్ స్క్వేర్ – డార్విన్
జవాబు:
పన్నేట్ స్క్వేర్ – డార్విన్

82. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
లైంగిక క్రోమోజోములు – 44
పురుష లైంగిక క్రోమోజోములు – X,Y
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y
జవాబు:
స్త్రీ లైంగిక క్రోమోజోములు – Y

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

83. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
పూల రంగు – నీలం
విత్తనం రంగు – పసుపు
కాయ రంగు – ఎరుపు
జవాబు:
విత్తనం రంగు – పసుపు

బొమ్మలపై ప్రశ్నలు

84.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 31
ఈ పటాలు దేనిని సూచిస్తున్నాయి?
జవాబు:
చెవి తమ్మెలలో వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.

85.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
ఈ కాయ సహాయంతో మొక్కను గుర్తించండి.
జవాబు:
బఠానీ మొక్క

86.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2
ఈ చతురస్రము అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
ఆర్.సి. పన్నెట్

87.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 32
ఈ జన్యుపదార్థం యొక్క నిర్మాణం పేరేమిటి?
జవాబు:
ద్వికుండలిని నిర్మాణం

88.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 33
ఏరకమైన పరిణామ సిద్ధాంతాన్ని ఈ చిత్రం సూచిస్తుంది?
జవాబు:
బీజ ద్రవ్య సిద్ధాంతం

89.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 34
ఏ వర్గాలకు ఈ జీవి సంధాన సేతువుగా ఉంటుంది?
జవాబు:
సరీసృపాలు మరియు పక్షులు

90.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6
తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఈ శిలాజాన్ని భద్రపరచారు?
జవాబు:
BM బిర్లా సైన్స్ సెంటర్, హైదరాబాదు

91.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 35
లాగూర్క్ ప్రతిపాదించిన సూత్రం ఏమిటి?
జవాబు:
కణాల అనువంశికత

92.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 37
ఈయన ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం పేరు?
జవాబు:
ప్రకృతివరణం

93.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 36
ఈయన ఏ శాస్త్రానికి పితామహుడు?
జవాబు:
పురాజీవశాస్త్రం

ఖాళీలను పూరించండి

94. జీవుల మధ్య గల స్యల ను…………
జవాబు:
వైవిధ్యం

95. జీవుల లక్షణాలు తరువాతి తరానికి సంక్రమించడాన్ని ……….. అంటారు.
జవాబు:
అనువంశికత

96. జన్యుశాస్త్ర పితామహుడు ……………
జవాబు:
మెండల్

97. బఠానీ మొక్క శాస్త్రీయ నామం ………..
జవాబు:
పైసమ్ సటైవమ్

98. ఏక సంకరణ ప్రయోగ దృశ్యరూప నిష్పత్తి
జవాబు:
3 : 1

99. ………. శాస్త్రం శిలాజాలను అధ్యయనం చేస్తుంది.
జవాబు:
జన్యుశాస్త్రం

10th Class Biology 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1 Mark Bits Questions and Answers

1. గాలాపాగన్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు
A) ఏనుగులు
B) జిరాఫీలు
C) ఎలుకలు
D) ఫించ్ పక్షులు
జవాబు:
D) ఫించ్ పక్షులు

2. క్రింది పటంలోని జీవుల శరీర భాగాలు ……… కు ఉదాహరణ.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 41
A) నిర్మాణ సామ్య అవయవాలు
B) క్రియాసామ్య అవయవాలు
C) సహజాత అవయవాలు
D) పైవేవీ కావు
జవాబు:
A) నిర్మాణ సామ్య అవయవాలు

3. జాతుల ఉత్పత్తి (The Origin of Species) రచయిత ………
A) ఛార్లెస్ డార్విన్
B) బాప్టిస్ట్ లామార్క్
C) ఛార్లెస్ లైల్
D) గ్రిగర్ జోహాన్ మెండల్
జవాబు:
A) ఛార్లెస్ డార్విన్

4. జెనిటిక్స్ పితామహుడు ….
(లేదా)
జన్యుశాస్త్ర పిత ఎవరు?
A) మెండల్
B) డార్విన్
C) వాట్సన్
D) లామార్క్
జవాబు:
A) మెండల్

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

5. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
A) వాట్సన్
B) క్రిక్
C) పై ఇద్దరూ
D) వీరిద్దరూ కాదు
జవాబు:
A) వాట్సన్

6. పురా జీవశాస్త్రం దీని గురించి తెల్పుతుంది …………
A) ?
B) శిలాజాలు
C) విత్తనాలు
D) ఫలాలు
జవాబు:
B) శిలాజాలు

7. క్రింది వ్యాఖ్యలలో సరికానిది.
A) మాలాస్ సిద్ధాంతము ‘An Essay on the Principles of Population’ లో ఉంది.
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.
C) ప్రకృతి వరణము అనే ప్రఖ్యాత సిద్ధాంతమును
D) “ఆర్జిత గుణాల అనువంశికత” అనే సిద్ధాంతాన్ని లామార్క్ ప్రతిపాదించాడు.
జవాబు:
B) జీవ పరిణామ సిద్ధాంతమును చార్లెస్ ఎల్ వ్రాశాడు.

8. ఒక సమయుగ్మజ పొడవు మొక్కను, ఒక సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం జరిపినప్పుడు F1 తరంలో జన్యురూప నిష్పత్తి
A) 2 : 1 : 1
B) 1 : 1 : 2
C) 1 : 2: 1
D) 2 : 2 : 2
జవాబు:
C) 1 : 2: 1

9. క్రింది వాటిని జతపరుచుము.
1. DNA ( ) a. జన్యుశాస్త్ర పిత
2. మెండల్ ( ) b. ప్రకృతి వరణం
3. డార్విన్ ( ) c. ద్వికుండలి
A) 1 – a, 2 – b, 3 – c
B) 1 – b, 2 – c, 3 – a
C) 1 – c, 2 – b, 3 – a
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b

10. క్రింది వాటిలో మెండల్ తన ప్రయోగాలకు బరానీ
A) స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం
B) ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం
C) ఆత్మపరాగ సంపర్కం జరపడం
D) తక్కువ ఖరీదు
జవాబు:
D) తక్కువ ఖరీదు

11. కింది వానిలో డార్విన్ సిద్ధాంతంకు సంబంధించనిది.
A) ఒక సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా ఉండవు.
B) వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అందవచ్చు.
C) పరిణామం నెమ్మదిగా, నిరంతరాయంగా జరుగుతుంది.
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.
జవాబు:
D) జనాభా గుణ శ్రేణిలో పెరగదు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

12. క్రియాసామ్య అవయవాలు
A) మేక పూర్వాంగం మరియు పక్షి రెక్క
B) తిమింగలం వాజం మరియు పక్షి రెక్క
C) మనిషి చేయి మరియు పక్షి రెక్క
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క
జవాబు:
D) గబ్బిలం రెక్క మరియు పక్షి రెక్క

13. i) చాలా దగ్గర సంబంధం గల జీవులలో వైవిధ్యాలు కనిపిస్తాయి.
ii) జనకులు తమ యుగ్మ వికల్పాలలోని ఏదో ఒక యుగ్మ వికల్పాన్ని యధేచ్చగా సంతతికి అందిస్తారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు.
A) (i) సరైనది; (ii) సరైనది.
B) (i) సరికాదు; (ii) సరికాదు.
C) (i) సరైనది; (ii) సరికాదు.
D) (i) సరికాదు; (ii) సరైనది.
జవాబు:
A) (i) సరైనది; (ii) సరైనది.

14. బరానీ మొక్క నందు కింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు?
A) విత్తనం రంగు
B) పుష్పం ఉన్న స్థానం
C) విత్తన బరువు
D) కాండం పొడవు
జవాబు:
C) విత్తన బరువు

15. ప్రకృతి వరణం అనగా ………..
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) ఉపయోగం లేని లక్షణాలను ప్రకృతి ఎంపిక మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది చేయడం
C) ప్రకృతి యోగ్యత కల్గిన లక్షణాలను వ్యతిరేకించడం
D) పైవేవి కావు
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం

16. మెండల్ ఏక సంకరణ ప్రయోగాలలో F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి
A) 2: 1 : 1
B) 1 : 2 : 1
C) 3 : 1
D) 9 : 3 : 3 : 1
జవాబు:
C) 3 : 1

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

17. కింది వాటిలో సరయిన జతను గుర్తించండి.
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం
B) జీన్ బాప్టిస్ట్ లామార్క్ – ప్రకృతి వరణం
C) చార్లెస్ డార్విన్ – ఆర్జిత గుణాల అనువంశికత
D) అగస్ట్ వీస్మాన్ – జనాభా సిద్ధాంతం
జవాబు:
A) గ్రిగర్ జోహన్ మెండల్ – పృథక్కరణ సూత్రం

మీకు తెలుసా?

• మెండల్ చేసిన ప్రయోగాలకు ఉదాహరణలు

మెండల్ ఏ ప్రయోగం చేసినా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు రాసిపెట్టుకునేవాడు. కింది అంశాలను పరిశీలిస్తే మెండల్ ఎన్ని ప్రయోగాలు నిర్వహించాడో, ఎన్ని ఫలదీకరణలు జరిపాడో, ఎన్ని మొక్కలపై ప్రయోగాలు చేశాడో మనం తెలుసుకోవచ్చు.

  1. మొదటి ప్రయోగం 15 మొక్కలపై 60 ఫలదీకరణలు.
  2. రెండవ ప్రయోగం 10 మొక్కలపై 58 ఫలదీకరణలు
  3. మూడవ ప్రయోగం 10 మొక్కలపై 35 ఫలదీకరణలు
  4. నాల్గవ ప్రయోగం 10 మొక్కలపై 40 ఫలదీకరణలు.
  5. ఐదవ ప్రయోగం 5 మొక్కలపై 23 ఫలదీకరణలు
  6. ఆరవ ప్రయోగం 10 మొక్కలపై 34 ఫలదీకరణలు
  7. ఏడవ ప్రయోగం 10 మొక్కలపై 37 ఫలదీకరణలు.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
మెండల్ ఎన్నో రకాలుగా ప్రయోగాలు నిర్వహించినప్పటికి వాటినన్నిటిని క్రోడీకరించి ఒక సాధారణ రూపంలోనికి మార్చడాన్ని మనం గమనించవచ్చు.

• బఠానీ ఏకవార్షిక మొక్క. ఇది తన జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేస్తుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో బఠానీ సులభంగా పెరగగలుగుతుంది. క్రీ.పూ. 2000 సం॥లో ఆఫ్ఘనిస్తాన్లో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.పూ. 2250 – 1750 కాలంలో హరప్ప ప్రస్తుత పాకిస్తాన్ వాయవ్య భారతదేశ ప్రాంతంలో బఠానీని పండించినట్లుగా రుజువులున్నాయి. అలాగే గంగానదీ పరివాహక ప్రాంతంలోని దక్షిణ భారతదేశంలోని బఠానీ పంట పండించేవారు. దీనిలో విటమిన్ ‘ఎ, సి, ఇ, కె మరియు బి కాంప్లెక్స్’లు Ca, Fe, Mg, Mn, P, S మరియు Zn లవణాలు కూడా ఉన్నాయి.

• జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనల్లో DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నారు. DNA అణువు సర్పిలంగా ఉండే మెట్ల మాదిరిగా ఉంటుందని గుర్తించారు.
AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 18

ఈ ఆకారాన్నే ద్వంద్వ కుండలి (Double helix) అని అంటారు. ఇది ఏకాంతరంగా అమర్చబడిన చక్కెరలు మరియు ఫాస్ఫేట్లతో నిర్మితమై ఉంటుంది. దీనిలో అడినిన్, గ్వానిస్, థైమిన్ మరియు సైటోసిన్ అనే నత్రజని క్షారాలు మెట్లవలె అమరి ఉంటాయి. ఫ్రాంక్లిన్ మరియు మౌరిస్ విల్కిన్లు కూడా DNA ఆవిష్కరణలో వాట్సన్, లతో కలిసి పనిచేశారు. జన్యుశాస్త్రంలో నూతన ప్రయోగాలకు దారితీసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను వాట్సన్ మరియు క్రిక్స్ బృందానికి నోబెల్ బహుమతి వచ్చింది. DNA యొక్క రసాయనిక స్వభావం జీవులలో లక్షణాలను నిర్ధారిస్తుంది. జుట్టు, చర్మపు రంగు మొదలైనవి ఇలాంటి లక్షణాలకు ఉదాహరణలు. DNA యొక్క రసాయనిక నిర్మాణంలో ఏ చిన్న మార్పు కలిగినా అది సంతతి యొక్క లక్షణాలలో మార్పుకు కారణమవుతుంది. ఆ మార్పులే వైవిధ్యాలకు దారితీస్తాయి.

• లైంగిక క్రోమోజోమ్ ఆవిష్కరణ :
వాల్టర్ స్టటన్ మరియు థామస్ హంట్ మోర్గాన్లు 1956వ సంవత్సరంలో చిన్న పండ్ల ఈగ –సోఫిలా మెలనోగాస్టర్) గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేశారు. గ్రాసోఫిలాలో లింగ సహలగ్నత లక్షణాలను కనుగొనేటప్పుడు లక్షణాలకు కారణమయ్యే జన్యువులు క్రోమోజోమ్ లో ఉన్నట్లు నిర్ధారించబడినది. డ్రాసోఫిలాలలోని వంశపారంపర్యత గురించి వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేశారు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 38
• చారెస్ డార్విన్, ఆల్బెడ్ రస్పెల్ వాలెట్ల ఆలోచనలు ఒకేలా ఉండేవి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న సమయంలో వాలెస్ రాసిన ఉత్తరాన్ని అందుకున్నాడు. వాలెస్ ఇండోనేషియా దీవులలో తన పరిశోధనల గురించి, ప్రకృతి వరణం గురించి రాశాడు. తాను ఆలోచించినట్లుగానే వాలెస్ సిద్ధాంతం కూడా ఉండటం డార్విన్‌ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. తరవాత డార్విన్, వాలెస్ కలిసి Journal of Linnaean Society పత్రికలో ప్రకృతి వరణం గురించి ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
దాని తరవాతే డార్విన్ తన ప్రముఖమైన గ్రంథం ‘జాతుల | ఆల్ఫ్రెడ్ రస్సెల్ ఉత్పత్తి (The Origin of Species)’ ప్రచురించి, ప్రకృతి వరణం గురించి వివరించాడు.

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 40
• ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది. పక్షులనా? సరీసృపాలనా? లేదా రెండింటినా? రెండు విభిన్న సమూహాలకు చెందిన లక్షణాలను కలిగి ఉండే జీవులను సంధాన సేతువులు అంటారు. ఆర్కియోప్టెరిక్స్ యొక్క శిలాజం పక్షులు, సరీసృపాల నుండి పరిణామ క్రమంలో ఉద్భవించాయని తెలియజేస్తుంది. అందువల్ల దీనిని పక్షులకు, సరీసృపాలకు మధ్య సంధానంగా భావిస్తారు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 8th lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 39

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

These AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 7th lesson Important Questions and Answers జీవక్రియలలో సమన్వయం

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆవు వంటి జంతువులలో వ్యతిరేక దిశలో పెరిస్టాలిసిస్ జరగకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆవులు ఆహారాన్ని త్వరగా నమిలి మ్రింగి తీరిక సమయంలో తిరిగి నోటిలోనికి తెచ్చుకొని నెమరువేస్తాయి. వ్యతిరేక పెరిస్టాలిసిస్ జరగకపోతే ఈ నెమరువేయు ప్రక్రియ జరగదు.

ప్రశ్న 2.
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
ఆహారవాహికలో శ్లేష్మం లేకపోతే :

  1. పెరిస్టాలిటిక్ చలనముకు అవరోధం ఏర్పడును.
  2. ఆహారపు బోలస్, జారడంకు కష్టమగును.
  3. ఆహారం మ్రింగడం కష్టతరమగును.
  4. ఆహారవాహిక గోడలు దెబ్బతినును.
  5. వివిధ గాడతలు గల ఆహార పదార్థాల నుండి ఆహారవాహిక రక్షించబడదు.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పూరించండి.
జవాబు:

జీర్ణాశయంలో స్రవించబడే హార్మోనులువిధులు
గ్రీలిన్ఆకలి కోరికలు ప్రేరేపించుట
లెఫ్టిన్ఆకలి కోరికను తగ్గించుట

ప్రశ్న 4.
జీర్ణమైన ఆహారాన్ని శోషించుకునే చిన్న ప్రేగు యొక్క భాగమేది?
జవాబు:
సూక్ష్మచూషకాలు (విల్లి)

ప్రశ్న 5.
పిండిపై లాలాజలం యొక్క చర్యలో ఉపయోగించు రసాయనం ఏది?
జవాబు:
అయోడిన్ ద్రావణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 6.
మీ తరగతి గదిలో ఆహార వాహిక నందు జరిగే పెరిస్టాలిటిక్ చలనంను అర్థం చేసుకోవడానికి నిర్వహించిన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు ఏవి?
జవాబు:
పెరిస్టాలిటిక్ చలన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు : సైకిల్ ట్యూబ్, బంగాళదుంప, నూనె.

ప్రశ్న 7.
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం లేకపోతే ఏం జరగవచ్చు?
జవాబు:
1. ఆహారమును మింగలేము
(లేదా)
2. ఆహారము జీర్ణాశయమునకు చేరదు.

ప్రశ్న 8.
జీర్ణక్రియ అనగానేమి?
జవాబు:
జీర్ణక్రియ:
సంక్లిష్ట ఆహారపదార్థాలను, రక్తంలో శోషణ చెందే సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు.

ప్రశ్న 9.
జీర్ణక్రియలో ఏ ఏ జీవక్రియల సమన్వయం పరిశీలించవచ్చు?
జవాబు:
మన శరీరంలో అనేక జీవక్రియలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయి.
ఉదా : జీర్ణక్రియ జరగటానికి నాడీవ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.

ప్రశ్న 10.
ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగాన్ని చేరతాయి?
జవాబు:
జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆకలి సంకేతాలు, పదవ కపాలనాడి ‘వేగస్ నాడి’ ద్వారా మెదడులోని ‘డైయన్ సెఫలాన్’ను చేరతాయి.

ప్రశ్న 11.
రుచులలో భేదం ఎలా కల్గుతుంది?
జవాబు:
ఆహారపదార్ధాలలోని రసాయన స్వభావాన్ని బట్టి వివిధ రుచులు ఏర్పడతాయి. తీపి, ఉప్పు, పులుపు, చేదు వంటి రుచులు ఆహారపదార్థంలోని రసాయన భేదాలను బట్టి ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఆహారం రుచిని కనుగొనటంలో అంగిలి పాత్ర ఏమిటి?
జవాబు:
ఆహారం లాలాజలంలో కరిగినపుడు ద్రవస్థితికి మారుతుంది. నాలుక అంగిలిని నొక్కినపుడు ఆహారపదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి రుచిగుళికలలోనికి ప్రవేశిస్తాయి.

ప్రశ్న 13.
మానవ నోటిలో దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మానవ నోటిలో నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
అవి 1. కుంతకాలు 2. రదనికలు 3. చర్వణకాలు 4. అగ్రచర్వణకాలు

ప్రశ్న 14.
చూర్ణం చేయటం అనగానేమి?
జవాబు:
చూర్ణం చేయటం :
నోటిలో దంతాలు ఆహారాన్ని విసరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని “నమలడం లేదా చూర్ణం చేయటం” (Mastication) అంటారు.

ప్రశ్న 15.
బోలస్ అనగా నేమి?
జవాబు:
బోలస్ :
నోటిలో ఆహారం ముక్కలు కాబడి, లాలాజలంతో కలసి మింగటానికి అనుకూలంగా జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
ఆహారంపై లాలాజలం చర్య ఏమిటి?
జవాబు:
లాలాజలంలో ‘ఏమైలేజ్ ‘ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చుతుంది. పిండిపదార్ధం → చక్కెర

ప్రశ్న 17.
లాలాజలం యొక్క స్వభావం ఏమిటి?
జవాబు:
లాలాజలం క్షార స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 18.
ఆహారవాహిక పని ఏమిటి?
జవాబు:
ఆహారవాహిక నోటిలోని ఆహారాన్ని జీర్ణాశయంలో చేర్చటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 19.
ఆహారవాహికలోని కదలికలను ఏమంటారు? (లేదా) పెరిస్టాలిసిస్ అనగానేమి?
జవాబు:
ఆహారం ప్రయాణించేటప్పుడు ఆహారవాహికలో అలల వంటి కదలికలు ఏర్పడతాయి. వీటినే ‘పెరిస్టాల్ చలనాలు’ అంటారు. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్‌ సిస్’ అంటారు.

ప్రశ్న 20.
జీర్ణాశయం రసాయనికంగా ఏ స్వభావం కల్గి ఉంటుంది?
జవాబు:
జీర్ణాశయ గోడలు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI) కలిగి ఉండుట వలన జీర్ణాశయం రసాయనికంగా ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది.

ప్రశ్న 21.
కైమ్ (Chyme) అనగానేమి?
జవాబు:
క్రైమ్ :
జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమై ద్రవంలా మారుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” (Chyme) అంటారు.

ప్రశ్న 22.
సంవరిణి కండరం (Pyloric sphincter) ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
జవాబు:
జీర్ణాశయం నుండి ఆంత్రమూలం ప్రారంభమయ్యే ప్రాంతంలో సంవరిణీ కండరం ఉంటుంది. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 23.
ఆహారవాహికలో వ్యతిరేక పెరిస్టాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. నెమరు వేయు జంతువులలో వ్యతిరేక పెరిస్టాల్సస్ వలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వచ్చి నెమరు వేయటం జరుగుతుంది.
  2. మానవులలో ఈ క్రియ ఆహారనాళానికి సరిపడని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే రక్షణ ప్రతిచర్యగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 24.
జీర్ణక్రియలో పాల్గొనే కొన్ని హార్మోన్స్ పేర్లు తెలపండి.
జవాబు:
సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్స్ జీర్ణక్రియలో పాల్గొంటాయి.

ప్రశ్న 25.
ఆంత్రచూషకాలు (Villi) అనగానేమి? వాటి పని ఏమిటి?
జవాబు:
చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్ర చూషకాలు (Villi) అంటారు. ఇవి శోషణ తల వైశాల్యం పెంచి, జీర్ణమైన ఆహారాన్ని శోషించుకొంటాయి.

ప్రశ్న 26.
శోషణ అనగానేమి?
జవాబు:
శోషణ :
జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని “శోషణ” అంటారు. ఇది చిన్నప్రేగులలో జరుగుతుంది.

ప్రశ్న 27.
రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు?
జవాబు:
ఆహారవాహిక నుండి పాయువు వరకు 9 మీటర్ల పొడవునా, జీర్ణవ్యవస్థకు అనుబంధంగా నాడీవ్యవస్థ వ్యాపించి ఉంది. దీనిని రెండవ మెదడుగా పరిగణిస్తున్నారు.

ప్రశ్న 28.
మలం అనగానేమి?
జవాబు:
మలం :
జీర్ణవ్యవస్థలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను “మలం” అంటారు. ఇది పాయువు ద్వారా విసర్జింపబడుతుంది.

ప్రశ్న 29.
కణాలకు శక్తి ఎలా లభిస్తుంది?
జవాబు:
జీర్ణక్రియ ద్వారా శోషించబడిన పోషకాలు కణాలలో ఆక్సీకరణం చెంది శక్తిని ఇస్తాయి.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 30.
అనియంత్రిత చర్యలు మెదడు ఏ భాగంలో నియంత్రించబడతాయి?
జవాబు:
శ్వాసక్రియ, హృదయస్పందన వంటి అనియంత్రిత చర్యలు స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మెదడులోని మజ్జి ముఖం నియంత్రిస్తుంది.

ప్రశ్న 31.
‘ఆకలి కోరికలు’ ఎలా ఏర్పడతాయి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు, జీర్ణాశయ గోడలు ‘గ్రీలిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ జీర్ణకోశంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

ప్రశ్న 32.
ఆకలి కోరికలు ఎలా నియంత్రించబడతాయి?
జవాబు:
మనకు కడుపు నిండుగా ఉండి ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినపుడు లెఫ్టిన్ అనే మరో హార్మోన్ స్రవించబడి ఆకలిని అణిచి వేస్తుంది.

ప్రశ్న 33.
మనం వాసన, రుచిని ఎలా గుర్తించగల్గుతాము?
జవాబు:
ముక్కులోని శ్లేష్మసరం ఓ పలుచని నీటిపొర కలిగి ఉంటుంది. మనం వాసన చూసినపుడు గాలిలో తేలియాడే వాసన పదార్ద అణువులు ఈ పొరలో కరుగుతాయి. ముక్కు మరియు నాలుకపై గల రసాయన గ్రాహకాలు లేదా ఘ్రాణ గ్రాహికలు (Olfactory receptors) సంకేతాలను నాడీ ప్రచోదాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది.

ప్రశ్న 34.
నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
రష్యాకు చెందిన ఇవాన్ పావ్లోవ్ నిబంధిత, ఉద్దీపన, ప్రతిస్పందనలపై ప్రయోగాలు చేశాడు. ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే లాలాజలం ఊరటం ఒక నిబంధిత ఉద్దీపనకు ప్రతిస్పందన అని చెప్పాడు.

ప్రశ్న 35.
మనకు రోజూ నిర్దిష్ట సమయంలోనే ఎందుకు ఆకలి వేస్తుంది?
జవాబు:
మనం రోజూ నిరిష సమయానికి ఆహారం తీసుకోవటం వలన శరీర జీవక్రియలు దానికి అలవాటు పడిపోతాయి. ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్యగా మారి రోజూ అదే సమయానికి ఆకలివేస్తుంది.

ప్రశ్న 36.
మనకు జలుబు చేసినపుడు ఆహార రుచిని సరిగా గుర్తించలేము. ఎందుకు?
జవాబు:
రుచి జనం వాసనతో ముడిపడి ఉంది. జలుబు చేసినపుడు, శ్లేష్మసరంలోని అధిక శ్లేష్మం వలన వాసనను గుర్తించలేము. కావున రుచిని కూడ సరిగా ఆస్వాదించలేము.

ప్రశ్న 37.
మనం తినే ఆహారాన్ని, రుచిని ప్రభావితం చేయు అంశాలు ఏమిటి?
జవాబు:

  1. నోటిలోని తేమ
  2. అంగిలి నొక్కబడటం
  3. పదార్థ ఉష్ణోగ్రత
  4. పదార్థం యొక్క వాసన
  5. పదార్ధ రసాయన స్వభావం మొదలగు అంశాలు ఆహార రుచిని ప్రభావితం చేస్తాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రెండు ఆకుపచ్చని పత్రాలలో ఒక దానికి గ్రీజు రాసి ఉంచి, మరొకటి అలాగే వదిలేసి, ఆ రెండు ఆకులపై రెండు చుక్కల ఆమ్లం వేసిన ప్రయోగములో నీవు ఏమి గమనించెదవు?
జవాబు:

  1. గ్రీజు రాసిన ఆకు పై భాగం ఆమ్లం వలన దెబ్బతినలేదు. ఆమ్ల ప్రభావాన్ని గ్రీజు ఒక పొరలా ఉండి నిరోధించింది.
  2. గ్రీజు రాయని ఆకు ఆమ్ల ప్రభావం వలన దెబ్బతిని పాడైపోయింది.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది.
  3. సరిగ్గా మాట్లాడలేము.
  4. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 3.
జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలను తెలుసుకొనుటకు గాస్ట్రో ఎంటరాలజిస్టు అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
జవాబు:

  1. మనకు ఆజీర్ణము ఎందుకు కలుగును?
  2. మనకు వాంతులు ఎందుకు కలుగుతాయి?
  3. మనకు త్రేన్పులు ఎందుకు కలుగుతాయి?
  4. మనకు అల్సర్స్ ఎందుకు కలుగుతాయి?
  5. మనకు కడుపులో మంట ఎలా కలుగుతుంది?

ప్రశ్న 4.
నోటిలో జరిగే జీర్ణక్రియలో కండరాల పాత్రను తెలపండి.
జవాబు:

  1. నోటిలో ఉండే వలయ కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించటంలోనూ సహాయపడతాయి.
  2. దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టి, కొరకటం మరియు నమలటం వంటి క్రియలకు తోడ్పడతాయి.
  3. దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, క్రిందకు, ముందుకు, వెనుకకు కదిలించటంలో తోడ్పడతాయి.

ప్రశ్న 5.
నోటి జీర్ణక్రియలో పాల్గొనే వివిధ భాగాలు తెలపండి.
జవాబు:
దంతాలు ఆహారాన్ని నమలడం, విసరడంలో తోడ్పడితే నాలుక కదలికలు ఆహారాన్ని లాలాజలంతో కలుపుతూ నోటి కుహరంలో సమంగా విస్తరించడంలో తోడ్పడుతుంది. నోటి కండరాలు ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి సహాయపడతాయి. 5వ కపాలనాడి దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 6.
పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
జవాబు:
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పని చేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు.

మన జీర్ణవ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1-1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

ప్రశ్న 7.
ఆహారవాహికలో ఆహారం జారటానికి లాలాజలం ఎలా తోడ్పడుతుంది?
జవాబు:

  1. ఆహారనాళపు గోడలు జారుడు గుణంగల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని ‘శ్లేష్మం’ (Mucus) అంటారు.
  2. శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
  3. దీని వలన ఆహార బోలస్ నూనెపూసిన బంగాళదుంపల్లా ఆహారవాహికలో సులభంగా కదులుతూ కిందికి జారుతుంది.
  4. దీనికి తోడుగా ఆహార బోలలోని లాలాజలం సులభంగా దానిని జీర్ణాశయంలోకి చేరవేయడంలో ఉపయోగకడుతుంది.

ప్రశ్న 8.
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు ఏమిటి?
జవాబు:
జీర్ణాశయంలో ఆహారం పొందే మార్పులు

  1. జఠర రసంతో చిలకబడి, ఆమ్ల స్వభావంగా మారుతుంది.
  2. జఠర రసంలోని రెనిన్ పాలపదార్థంపై పనిచేస్తుంది.
  3. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేసి క్రొవ్వు ఆమ్లాలుగా మార్చుతుంది.
  4. పెప్సిన్ ప్రోటీన్స్ పైన పనిచేసి వాటిని పెప్టైడ్, పాలిపెప్టెడ్ గా మార్చుతాయి.

ప్రశ్న 9.
ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారం ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా జీరాశయం చిన్న ప్రేగులోకి తెరుచుకునే భాగంలో గల సంవరిణీ కండరాన్ని (Pyloric sphincter) సంకోచం చెందిస్తుంది. అందువల్ల ఆంత్రమూలం లోపలికి దారి ఏర్పడి అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం కొద్దికొద్ది మోతాదుల్లో ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.

ప్రశ్న 10.
నెమరు వేయటం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
జవాబు:
కొన్ని శాఖాహార జంతువులు, విరామ సమయంలో, జీర్ణాశయం నుండి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా నమలుతాయి. ఈ ప్రక్రియను ‘నెమరు వేయుట’ అంటారు. ఆహారం దొరికినపుడు, నెమరువేయు జంతువులు ఆహారాన్ని పూర్తిగా నమలకుండా గబగబా మింగుతాయి. విరామ సమయంలో ఇవి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొంటాయి. ఈ ప్రక్రియలో ఆహారవాహికలోని కండరాలు వ్యతిరేక పెరిస్టాల్సినను జరుపుతాయి. అందువలన ఆహారం జీర్ణాశయం నుండి నోటిలోనికి వస్తుంది.

ప్రశ్న 11.
మానవ ఆహారనాళంలో వ్యతిరేక చలనం ఎప్పుడు జరుగుతుంది?
జవాబు:

  1. ఒకవేళ మనం చెడిపోయిన లేదా శరీరానికి సరిపడని ఆహారపదార్థాలు తిన్నప్పుడు జీర్ణక్రియా యంత్రాంగం దాన్ని గుర్తుపట్టి జీర్ణం చేయడానికి నిరాకరిస్తుంది.
  2. అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో పనిచేసే జీర్ణాశయ గోడలలో అలజడి ఏర్పడి, జీర్ణం కాని ఆహారంతోపాటు ‘క్రైమ్’ను కూడా బయటకు నెట్టివేస్తుంది.
  3. దీనినే మనం వాంతులుగా పరిగణిస్తాం. ఒక్కోసారి హఠాత్తుగా త్రేన్పులు కూడా (belching) వస్తుంటాయి.

ప్రశ్న 12.
పెద్దప్రేగులో మలం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్దప్రేగును చేరినపుడు దానిలోని నీటిని పెద్దప్రేగు గోడలు శోషిస్తాయి.
  2. పెరిస్టాలిసిస్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద ప్రేగు నుండి పురీషనాళంలోకి కదిలిస్తాయి.
  3. పెద్ద ప్రేగులోని కొలాన్ ఎడమ భాగం మలాన్ని నిలువ చేసే ట్యాంలా పనిచేస్తుంది. నీటిని పునఃశోషణం చెందుతుంది.
  4. మిగిలిన వ్యర్థాలు పెద్ద ప్రేగులోని చివరి భాగమైన పురీషనాళంలో నిలువ చేయబడతాయి.
  5. దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్నే సాధారణంగా ‘మలం’ (Faecal matter) అంటాం.
  6. తదుపరి ఇది శరీరం నుండి పాయువు (Anus) ద్వారా బయటకు విసర్జింపబడుతుంది.

ప్రశ్న 13.
గుప్పెడు మిగిలిపోయిన తడి టీ పొడిని ఒక అద్దుడు కాగితంలో తీసుకొని ఒక ముద్దలా చేయండి. తరవాత దానిని సున్నితంగా ఒత్తి తెరిచి చూడండి. ‘ఏం గమనించారు? అద్దుడు కాగితం టీ పొడిలోని నీటిని పీల్చుకుంది కదా! ఈ ప్రక్రియను జీర్ణవ్యవస్థలోని ఏ భాగంతో పోల్చవచ్చు?
జవాబు:
తడి టీ పొడిలోని నీటిని అద్దుడు కాగితం పీల్చుకొన్నట్లు మన జీర్ణవ్యవస్థలోని జీర్ణమైన ఆహారం నుండి పెద్ద ప్రేగు నీటిని పీల్చుకొంటుంది. ఈ ప్రక్రియలో జీర్ణమైన ఆహారాన్ని టీ పొడితోనూ, పెద్ద ప్రేగును అద్దుడు కాగితంతోనూ పోల్చవచ్చు.

ప్రశ్న 14.
మలవిసర్జన ఎలా నియంత్రించబడుతుంది?
జవాబు:
పెద్ద ప్రేగు చివరి భాగంలో ఉండే రెండు కండర పొరలు పాయువు యొక్క సంవరణి కండరాలుగా (Anal sphincter)ఏర్పడతాయి. లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగా పనిచేస్తుంది. ఇవి మలవిసర్జన మార్గాన్ని నియంత్రిస్తాయి.

ప్రశ్న 15.
కణాలలో శక్తి ఎలా వెలువడుతుంది?
జవాబు:

  1. ఉచ్చ్వాస క్రియలో ఆక్సిజన్ వాయుగోణుల గోడల ద్వారా రక్తంలోకి చేరుతుంది.
  2. ఇక్కడ నుండి ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించి శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయబడుతుంది.
  3. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులోని వాయుగోణులలోనికి చేరుతుంది.
  4. నిశ్వాస క్రియలో అది బయటకు పంపబడుతుంది. కణాల్లోకి పోషకాలు ఆక్సీకరణం చెంది శక్తి విడుదలవుతుంది.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 16.
మన శరీరంలోని వివిధ వ్యవస్థలు సమన్వయంగా పని చేస్తున్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. సంక్లిష్టమైన ఈ జీర్ణక్రియా విధానంలో అనేక రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి.
  2. జీర్ణక్రియ నోటినుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతున్నప్పటికీ దీనికి శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థలతో సమన్వయం ఎంతో అవసరం.
  3. లేకపోతే ఆహారం ఆక్సీకరణం చెందడం పదార్థాల రవాణా, శక్తి ఉత్పాదకత మొదలైన ప్రక్రియలు చోటుచేసుకోలేవు. అలా జరగనట్లయితే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్న జీవ వ్యవస్థలన్నీ నిలిచిపోతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహార వాహికలో ఆహారం పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు నెట్టబడి, జీర్ణాశయాన్ని చేరుతుంది. దీన్ని పటము. ద్వారా చూపండి. బోలస్ అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6
బోలస్ :
నోటిలో ఆహారం నమలబడి లాలాజలంతో కలిసి ఏర్పడే ముద్దను బోలస్ అంటారు. ఇది ఆస్యకుహరంలో ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
పెరిస్టాల్టిక్ చలనం అంటే ఏమిటి? ఆహారవాహికలో ఆహార చలనాన్ని, మీరు పాఠశాలలో చేసిన సైకిలు ట్యూబ్ లో ఆలుగడ్డ (బంగాళదుంప) కదలిక ప్రయోగంతో పోల్చి వివరించండి.
జవాబు:
ఆహారం మ్రింగినపుడు ఆహారవాహికలో ఏర్పడే అని యాంత్రిత క్రమబద్ద చలనాన్ని పెరిస్టాల్టిక్ చలనం అంటారు. దీని వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.

మేము నిర్వహించిన సైకిల్ ట్యూబ్ ప్రయోగంలో
సైకిల్ ట్యూబ్ – ఆహారవాహిక
బంగాళదుంప – ఆహారపు
నూనె పూత – లాలాజలం
కదలిక – పెరిస్టాలిటిక్ చలనంతో పోల్చవచ్చు.

ప్రశ్న 3.
జీర్ణాశయం సొంత ఆమ్లాల స్రావాల నుండి తనను తాను ఎలా రక్షించుకుంటుందో అర్థం చేసుకొనుటకు నిర్వహించిన ఆమ్లం మరియు పత్ర ప్రయోగం విధానాన్ని రాయండి. ఫలితాలను మానవ జీర్ణ వ్యవస్థలో జరిగే అంశాలతో పోల్చండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
రెండు ఆకులు, పెట్రోలియం జెల్లీ / వాజ్ లీన్, బలహీన ఆమ్లం, రెండు పెట్రెడిషన్లు, డ్రాపర్.

ప్రయోగ విధానం :

  1. రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించాలి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీన్ పూయాలి. మరొక దానిని అలాగే వదిలేయాలి.
  2. రెండు ఆకులను పెట్రెడిష్ లో ఉంచి 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై డ్రాపర్ సహాయంతో వేయాలి.
  3. అరగంట తరువాత పత్రాలను పరిశీలించాలి. వాజ్ లీన్ పూసిన ఆకులో ఏ మార్పు ఉండదు.
  4. వాజ్ లీన్ పూయని ఆకు ఆమ్లం ప్రభావం నుండి రక్షించబడలేదు. (కాలినట్లుగా మారింది).

పోలిక :

  1. శ్లేష్మ పదార్థం జీర్ణాశయపు గోడలపై ఒక పలుచని పొరలా ఏర్పడుతుంది. ఇది ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది.
  2. పెట్రోలియం జెల్లీ చేసే పనిని జీర్ణాశయపు గోడలలోని శ్లేష్మం చేసే పనితో పోల్చవచ్చు.

ప్రశ్న 4.
క్రింది వాటికి కారణాలు తెలపండి.
a) జీర్ణాశయం ఖాళీ అయినపుడు ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు ఇంక ఆహారం అవసరం లేదనిపిస్తుంది.
c) జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఒక ద్రాక్షపండును నాలుకపై ఉంచినపుడు దాని రుచి మనకు తెలియదు.
జవాబు:
a) జీర్ణకోశ గోడల నుండి ‘గ్రీలిన్’ హార్మోన్ స్రవించుట వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
b) జీర్ణాశయం ఆహారంతో నిండినపుడు లెప్టిన్ అనే హార్మోన్ స్రవించబడి ఆకలిని అణచివేస్తుంది.
c) ఋణ గ్రాహికలు మూసుకుపోవటం వలన జలుబు చేసినపుడు ఆహారం రుచిగా ఉండదు.
d) ఆహారపదార్థం రుచి కళికలలోనికి ప్రవేశించినపుడు మాత్రమే రుచి తెలుస్తుంది. ద్రాక్షపండు ద్రవరూపంలో లేకపోవటం వలన పదార్ధం రుచి కళికలలోనికి ప్రవేశించలేదు.

ప్రశ్న 5.
మానవ జీర్ణ వ్యవస్థలోని క్రింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులు తెల్పండి.
a) ఆహారవాహిక
b) జీర్ణాశయం
c) చిన్న ప్రేగు
d) పెద్ద ప్రేగు
జవాబు:
a) ఆహారవాహిక :
ఆహారవాహికలో పెరిస్టాలిసిస్ బోలను జీర్ణాశయంలోనికి నెడుతుంది.

b) జీర్ణాశయం :
జీర్ణాశయంలో పెరిస్టాలిసిస్ ఆహారాన్ని నిల్వ చేయుటలోనూ, ముక్కలు చేయుటలోనూ, జఠర రసంలో కలుపుటలోనూ తోడ్పడుతుంది.

c) చిన్న ప్రేగు :
జీర్ణ రసాలతో క్రైమ్ ను కలుపుతుంది.

d) పెద్ద ప్రేగు :
జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు పురీష నాళం ద్వారా బయటకు పంపుటలో సహాయపడుతుంది.

ప్రశ్న 6.
పిండిపై లాలాజలం యొక్క చర్యను వివరించడానికి నీవు చేసిన ప్రయోగమును వివరించుము.
(లేదా)
పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను తెలుసుకొనుటకు నీవు నిర్వహించిన ప్రయోగం తెలపండి. లాలాజలము యొక్క pH ను ఏ విధంగా గుర్తించారు?
జవాబు:
కావాల్సిన పరికరాలు :
1) పరీక్షనాళిక, 2) పిండి, 3) లాలాజలం, 4) అయోడిన్ ద్రావణం, 5) డ్రాపర్, 6) pH కాగితం.

ప్రయోగ విధానం :

  1. ఒక పరీక్షనాళిక తీసుకుని సగం వరకు నీటితో నింపి చిటికెడు పిండి కల్పి బాగా కదిలించండి.
  2. మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా రెండు పరీక్షనాళికల్లో తీసుకోండి.
  3. టీస్పూన్ లాలాజలంను ఒక పరీక్షనాళికలో కలపండి. రెండో పరీక్షనాళికలో కలపవద్దు.
  4. 45 ని|| తరువాత ఒక చుక్క అయోడిన్ ద్రావణం రెండు పరీక్షనాళికలలో కలపండి.

పరీశీలన మరియు నిర్ధారణ :
లాలాజలం కలిపిన ద్రావణం నీలిరంగులోకి మారలేదు. లాలాజలం కలపని ద్రావణం నీలిరంగులోకి మారింది.

గుర్తించుట :
ఒక చిన్న pH కాగితం ముక్కను తీసుకుని నాలుకపై తాకించండి. దానిపై ఏర్పడిన రంగును రంగు పట్టికతో జత చేసి చూడండి pH విలువను గుర్తించవలెను.

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 7.
రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం – దీనిని నిరూపించే ఒక కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. కొంచెం చక్కెరను నాలుకపై వేసుకొని, నాలుకను అంగిలికి తగలకుండా నోటిని తెరిచి ఉంచాలి.
  2. కొద్ది సేపటికి రుచి గుర్తించబడుతుంది.
  3. స్టాప్ క్లాక్ ను ఉపయోగించి నాలుకపై చక్కెర ఉంచినప్పటి నుండి రుచి గుర్తించినప్పటి వరకు పట్టిన సమయాన్ని గుర్తించాలి.
  4. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని నాలుకపై చక్కెర వేసుకొని దానిని అంగిలితో నొక్కి ఉంచి చేయాలి.
  5. ఇప్పుడు రుచి చాలా కొద్ది సమయంలోనే తెలుస్తుంది.
  6. దీనిని బట్టి రుచి నాలుక మరియు అంగిలికి సంబంధించిన విషయం అని తెలుస్తుంది.

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
i) ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను ఏమంటారు?
జవాబు:
ఆహారవాహికలో గల కండరాలు తరంగం లాగా జరిపే కదలికలను పెరిస్టాలిటిక్ చలనము అంటారు.

ii) ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆహారవాహిక పొడవాటి గొట్టము వంటి నిర్మాణము కలిగి ఉంటుంది.

iii) ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేషస్తరం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
శ్లేష్మము, ఆహారము సులభంగా క్రిందికి జారుటకు తోడ్పడుతుంది.

iv) ఆహార నాళంలోని ఏఏ భాగాలు ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి?
జవాబు:
ఆహార నాళంలోని గ్రసని మరియు జీర్ణాశయము ఆహారవాహిక ద్వారా కలుపబడుతూ ఉంటాయి.

ప్రశ్న 9.
నోటి జీర్ణక్రియలో లాలాజల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. అనియంత్రిత నాడీవ్యవస్థ చర్య వలన లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి.
  2. ఇది ఆహారాన్ని తేమగా చేసి నమిలి మింగడానికి అనుకూలంగా తయారుచేస్తుంది. అపుడు ఆహారం జిగురు ముద్దలా మారుతుంది. దీనిని “బోలస్” (Bolus) అంటారు.
  3. నాలుక సహాయంతో మింగడం వలన ఇది ఆహారవాహికలోనికి చేరుతుంది.
  4. లాలాజలంలో ఉండే ‘లాలాజల ఎమైలేజ్’ అనే ఎంజైమ్ పెద్ద పెద్ద పిండిపదార్థ అణువులను చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది. సాధారణంగా చక్కెరలుగా మారుస్తుంది.
  5. మింగే క్రియాయంత్రాంగం కూడా నాడీ సమన్వయంతో పనిచేస్తుంది. మెదడు కాండం దగ్గరలోని మజ్జిముఖంలో ఈ నియంత్రణ కేంద్రం ఉంటుంది.
  6. దంతాలు, నాలుక సహాయంతో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడం వల్ల ఆహార పదార్థాల పరిమాణం మింగడానికి అనువుగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆహారవాహికలో ‘బోలస్’ ఎలా క్రిందకు కదులుతుంది?
జవాబు:

  1. ఆహారవాహిక గోడలు రెండు రకాలైన మెత్తని నునుపు కండరాలను కలిగి ఉంటాయి.
  2. లోపలి పొరలో వలయాకార కండరాలు వెలుపలి పొరలో సంభాకార కండరాలు ఉంటాయి.
  3. వలయాకార కండరాలు సంకోచించినపుడు ఆహారపు ముద్దకు వెనుక ఉండే ఆహారవాహిక భాగం ముడుచుకుని ఆహార ముద్దను కిందికి జరిగేలా ఒత్తిడి కలిగిస్తుంది.
  4. స్తంభాకార కండరాల వలన ఆహారవాహికలోని బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పవుతుంది. బోలస్ ముందుకు కదులుతుంది.
  5. ఇలా కండరాల సంకోచ వ్యాకోచ కదలికల వలన ఒక తరంగం లాంటి చలనం ఏర్పడి ఆహార బోలను జీర్ణాశయం లోనికి నెడుతుంది. ఈ ప్రక్రియను ‘పెరిస్టాల్ సిస్’ (Peristalsis) అంటారు.
  6. ఇది అనియంత్రితమైనది, మరియు అనియంత్రిత నాడీవ్యవస్థ అధీనంలో నియంత్రించబడుతుంది.

ప్రశ్న 11.
చిన్నప్రేగుల అంతర నిర్మాణం వర్ణించండి.
జవాబు:

  1. చిన్నప్రేగుల లోపలి గోడలు అనేక ముడతలు పడి ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు అంటారు.
  2. ఆంత్రచూషకాలు రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉంటుంది.
  3. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ ప్రక్రియను శోషణ అంటారు.
  4. శోషణ చిన్నప్రేగుల ప్రధానవిధి. శోషణాతల వైశాల్యం పెంచటానికి ఆంత్రచూషకాలు తోడ్పడతాయి.
  5. గ్లూకోజ్ రక్తనాళంలోనికి, ఎమైనోఆమ్లాలు, గ్లిజరాల్ శోషరస నాళంలోనికి శోషణ చెంది శరీర కణజాలానికి రవాణా కాబడతాయి.

ప్రశ్న 12.
రెండవ మెదడు అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
  2. దాదాపు 100 మిలియన్ల నాడీకణాలు ఈ రెండవ మెదడులో ఇమిడి ఉంటాయి. ఇది వెన్నుపాము లేదా పరిధీయ నాడీవ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను మించి ఉంటుంది.
  3. జీర్ణనాడీవ్యవస్థలోని ఈ మహా నాడీకణాల సముదాయం జీర్ణవ్యవస్థ యొక్క అంతర ప్రపంచం, అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది.
  4. ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేయడం, పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు, యాంత్రిక మిశ్రణీకరణ విధానాలు, లయబద్దమైన కండర సంకోచాలు ఒకదానివెంట ఒకటిగా జీర్ణక్రియా చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి.
  5. రెండవ మెదడు తనదైన స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండడంవల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
  6. జీర్ణవ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా ఈ వ్యవస్థ ఇంత సంక్లిష్టతతో ఏర్పడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రశ్న 13.
జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని చూపే బొమ్మను గీయండి. జీర్ణాశయంలో ఆహార కదలికలు వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 1

  1. పెరిస్టాల్టిక్ చలనాలు ఆహారాన్ని ఒక చోట నుండి మరియొక చోటుకి కదిలిస్తాయి.
  2. జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ కదలికలు, కండరాల కదలికలు వేగంగా ఉండడం వల్ల ఆహారం మెత్తగా నూరబడుతుంది.
  3. జీర్ణాశయ కండరాలలో కలిగే సంకోచ సడలికలు ఆహారాన్ని ఆమ్లాలు మరియు ఇతర జీర్ణరసాలతో కలిపి చిలుకుతాయి. జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తటి జావలాంటి ద్రవంలా మారుస్తాయి. దీనిని క్రైమ్ అంటారు.
  4. జీర్ణాశయంలో జీర్ణక్రియ ముగింపు దశకు చేరుకునే సరికి జీర్ణాశయ గోడల సంకోచాలు తగ్గుముఖం పడతాయి.

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం ½ Mark Important Questions and Answers

ఫ్లో బారులు

1.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 2
జవాబు:
నాడీ వ్యవస్థ

2.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 3
జవాబు:
లెఫ్టిన్

3.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 4
జవాబు:
ద్వారగొర్ధం

4.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 5
జవాబు:
పులుపు

5.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 6
జవాబు:
పొలియెట్

6.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 7
జవాబు:
ఋణ గ్రాహకాలు / వాసన గ్రాహకాలు

7.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 8
జవాబు:
రదనికలు

సరైన గ్రూపును గుర్తించండి

8. ఏ గ్రూపు సంఘటనలు సరైన క్రమంలో ఉన్నాయి?
A. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
B. గ్రీలిన్ జీర్ణాశయ గోడల నుండి స్రవించడం – రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం – జీర్ణాశయంలో ఆకలి కోరికలు
జవాబు:
గ్రూపు – A

9. మెదడు వాసనను గుర్తించే సరైన క్రమాన్ని కనుగొనండి.
A. మెదడులో ఘోణ గ్రాహకాలు-ముక్కులో ఋణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
B. ముక్కులో మాణ గ్రాహకాలు-మెదడులో ఘ్రాణ గ్రాహకాలు – వాసన గుర్తించబడటం
జవాబు:
గ్రూపు – B

10. ఏ గ్రూపు సంఘటనలు ఆహారం యొక్క రుచిని గుర్తించడంలో చోటు చేసుకుంటాయి?
A. నాలుక మీద ఉంచిన ఆహారం – లాలాజలంలో కరగడం – నాలుకతో అంగిలిని నొక్కడం.
B. నాలుక మీద ఉంచిన ఆహారం – నోరు తెరచి ఉంచడం – నాలుక అంగిలిని తాకరాదు.
జవాబు:
గ్రూపు – A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

11. ఏ గ్రూపు దంత అమరిక సరైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. కుంతకాలు – రదనికలు – చర్వణకాలు – అగ్ర చర్వణకాలు
B. కుంతకాలు – రదనికలు – అగ్ర చర్వణకాలు – చర్వణకాలు
జవాబు:
గ్రూపు – B

12. క్రింది వానిలో పాలపళ్ళు దంత సూత్రాన్ని సూచించేది ఏమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 9
జవాబు:
గ్రూపు – B

13. ఆహార వాహిక యొక్క పెరిస్టాలసిస్ సమయంలో ఏ గ్రూపు సంఘటనలు చోటు చేసుకుంటాయి?
A. వలయ కండరాల సంకోచం – ఆహార వాహిక విశాలం – స్తంభాకార కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం
B. వలయ కండరాల సంకోచం – ఆహారవాహిక ముడుచుకుపోవడం-స్తంభాకార కండరాల సంకోచం – బోలస్ ముందు ఉన్న ఆహారవాహిక విశాలం.
జవాబు:
గ్రూపు – B

14. ఏ గ్రూపు ప్రక్రియలు జీర్ణాశయంకు సంబంధించినవి?
A. నూరడం, ప్రొపల్టన్, రెట్రోపర్టైన్
B. నమలడం, మాస్టికేషన్, శోషణం
జవాబు:
గ్రూపు – A

15. ఏ గ్రూపు సంఘటనలు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటాయి?
A. మింగడం, హార్మోన్ స్రావం, మాస్టికేషన్
B. లాలాజలం స్రావం, పెరిస్టాలసిస్, రివర్స్ పెరిస్టాలసిస్
జవాబు:
గ్రూపు – B

నేను ఎవరు?

16. నేనొక హార్మోన్‌ని. ఆకలి అనే అనుభూతిని కల్గించి, ఆహారం తీసుకొనే విధంగా ప్రేరణను కల్గిస్తాను.
జవాబు:
గ్రీలిన్

17. నాలుక మీద ఇమిడి మరియు రుచిని గ్రహించడం నా బాధ్య త.
జవాబు:
రుచి మొగ్గ

18. నోటి కుహరం మరియు నాసికా కుహరాల మధ్య అమరియున్న అస్థి పలకను నేను. ఆహారం నాకు వ్యతిరేకంగా నొక్కినప్పుడు మాత్రమే మీరు ఆహారం
జవాబు:
అంగిలి

19. నేను మెదడులో ఒక బాగం. మింగుట అనే ప్రక్రియ నా అధీనంలో జరుగుతుంది.
జవాబు:
మజ్జిముఖం

20. నేనొక జిగురు లాంటి పదార్థాన్ని మరియు ఆహారవాహిక గోడలు దెబ్బతినకుండా కందెన వలె పనిచేస్తూ కాపాడతాను.
జవాబు:
శ్లేష్మం

21. ఆహారనాళంలో కనపడే తరంగాకార కదలికను. ఆహారం ఆహారనాళంలో ముందుకు కదలడానికి తోడ్పడతాను.
జవాబు:
పెరిస్టాలసిస్

22. జీర్ణనాళపు గోడలలో ఆహారవాహిక నుండి పాయువు వరకు ఏర్పడిన సంక్లిష్ట నాడీ కణాలతో ఏర్పడిన నాడీ యంత్రాంగాన్ని.
జవాబు:
జీర్ణ సాడీ వ్యవస్థ / రెండవ మెదడు

23. నేను లాలాజలంలో ఉండే ఒక ఎంజైమ్ ను మరియు కార్బోహైడ్రేట్ పై చర్య జరుపుతాను.
జవాబు:
టయలిన్ / లాలాజల అమైలేజ్

24. ఆహారనాళంలో పొడవైన భాగాన్ని నేను. నా పూర్వ భాగము గ్రసనితోను మరియు నా పరభాగము జీర్ణాశయంతోను ‘కలపబడి ఉంటుంది.
జవాబు:
ఆహార వాహిక

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

25. నేను అమెరికన్ శాస్త్రవేత్తని. నా ప్రయోగాలు జీర్ణక్రియ భావనలు విప్లవంగా మారాయి.
జవాబు:
డా॥ బ్యూమాంట్ దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

26. కడుపు నిండినప్పుడు గ్రీలిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.
జవాబు:
కడుపు నిండినప్పుడు లెఫ్టిన్ స్రవించడం వల్ల ఆకలి అణచివేయబడుతుంది.

27. ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని రిట్రో పల్టన్ అంటారు.
జవాబు:
ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేయడాన్ని మాస్టికేషన్ / నమలడం అంటారు.

28. 10వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.
జవాబు:
5వ కపాలనాడి దవడ భాగంలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది.

29. మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని పెప్సిన్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం నలుపు రంగు అదృశ్యం అవుతుంది. యొక్క రుచిని గుర్తించగలరు.
జవాబు:
మనం లాలాజలాన్ని స్టార్చ్ ద్రావణానికి జోడించినప్పుడు, లాలాజలంలోని టయలిన్/ అమైలేజ్ ఎంజైమ్ యొక్క చర్య వలన నీలం సలుపు రంగు అదృశ్యం అవుతుంది.

30. మింగడం అనేది మెదడు కాండం అనగా ద్వారగోర్లం నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
మింగడం అనేది మెదడు కాండం అనగా మజ్జిముఖం నియంత్రణలో ఉంటుంది.

31. పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు ఎంటరిక్ నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
జవాబు:
పెరిస్టాలిసిస్ అనేది అసంకల్పిత చర్య మరియు స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.

32. చిన్న ప్రేగులో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
పెద్ద ప్రేగు లో నీరు పునఃశోషణం చెందుతుంది మరియు మిగిలిన వ్యర్థాలు పురీషనాళంలో నిల్వ చేయబడతాయి.

33. మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో జఠర నిర్గమ సంవరిణి దోహదపడుతుంది.
జవాబు:
మలద్వార రంధ్రం తెరుచుకోవడం మరియు మూయడంలో పాయువు సంవరిణి కందరం దోహదపడుతుంది.

34. జఠర రసంలో ఎక్కువ మొత్తంలో సల్స్యురిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.
జవాబు:
జఠర రసంలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది మరియు రసాయన చర్యలలో పాల్గొనే రసాయన కారకంగా పనిచేస్తుంది.

35. రివర్స్ పెరిస్టాలసిస్లో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 5వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిలో కండర సంకోచాలు స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రణలో 10వ కపాలనాడి ద్వారా నియంత్రించబడతాయి.

జతపరచుట

36. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
పాల దంతాలు – 20
జ్ఞాన దంతాలు – 8
శాశ్వత దంతాలు – 32
జవాబు:
జ్ఞాన దంతాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

37. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
కుంతకాలు – విసరడం
రదనికలు – చీల్చడం
అగ్ర చర్వణకాలు – కొరకడం
జవాబు:
రదనికలు – చీల్చడం

38. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఆకలి కోరికలు – 30-45 నిమిషాలు
లాలాజలం pH – 6.4-7.2
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు
జవాబు:
కడుపు ఖాళీ చేసే సమయం – 10 గంటలు

39. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నాలుక – ఝణ గ్రాహకాలు
ఆకలి కోరికలు – వేగస్ నాడి
ముక్కు – రుచి గ్రాహకాలు
జవాబు:
ఆకలి కోరికలు – వేగస్ నాడి

40. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మాస్టికేషన్ – 5వ కపాలనాడి
హార్మోన్ల స్రావం – హైపోథాలమస్
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి
జవాబు:
రివర్స్ పెరిస్టాలసిస్ – 7వ కపాలనాడి

41. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం
బోలస్ – పాక్షికంగా జీర్ణమైన ఆహారం
క్రైమ్ – మెత్తగా చేయబడిన ఆహారపు ముద్ద
జవాబు:
మలము – జీర్ణం కాని వ్యర్థ పదార్థం

42. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
రెండవ మెదడు – జీర్ణనాళం
జఠర నిర్గమ సంవరిణి – జీర్ణాశయం
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు
జవాబు:
పాయు సంవరిణి కండరం – పెద్ద ప్రేగు

ఉదాహరణలు ఇవ్వండి

43. వాంతులు రివర్స్ పెరిస్టాలసిస్కు ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
త్రేనుపు

44. నెమరువేయడం అనేది రివర్స్ పెరిస్టాలసిస్ ప్రక్రియ. నెమరువేయు జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆవు/గేదె

45. గబ్బిలం నిశాచర జంతువుకు ఉదాహరణ. దిశాచర జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు

46. గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి కోరికలను ప్రేరేపిస్తుంది. కాలేయం, క్లోమం మొదలైన వాటి నుంచి జీర్ణ రసాలను స్రవించడాన్ని ప్రేరేపించే హార్మోన్‌కు మరో ఉదాహరణ. ఇవ్వండి.
జవాబు:
సెక్రెటిన్ / కోల్ సెప్టోకైనిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

47. జీర్ణాశయం దగ్గరలో జఠర నిర్గమ సంవరిణి కండరం ఉంటుంది. మలద్వారం వద్ద ఉండే నంవరిణి కండరానికి మరో ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
పాయు సంవరిణి కండరం

విస్తరించుము

48. ENSని విస్తరించుము.
జవాబు:
Enteric Nervous System/ జీర్ణనాడీవ్యవస్థ

49. ANSని విస్తరించుము.
జవాబు:
Autonomous Nervous System/స్వయంచోదిత నాడీవ్యవస్థ

50. pH ని విస్తరించుము.
జవాబు:
Potential of Hydrogen

పోలికను గుర్తించుట

51. ఆహారవాహిక : బోలస్ : : జీర్ణాశయం 😕
జవాబు:
క్రైమ్

52. కుంతకాలు: 2::?: 1
జవాబు:
రదనికలు

53. ముక్కు : ఘోణ గ్రాహకాలు : : ? : రుచి గ్రాహకాలు
జవాబు:
నాలుక

54. పెరిస్టాలసిస్ : ఆహార వాహిక :: రెట్రోపర్టన్ : ?
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

55. జీర్ణాశయం : చిలకడం :: సూక్ష్మ చూషకాలు 😕
జవాబు:
శోషణం

బొమ్మలపై ప్రశ్నలు

56.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 10
దీనికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
జవాబు:
గ్రీలిన్

57.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 11
ఈ చిత్రం దేనిని సూచిస్తుంది?
జవాబు:
నాలుక చూషకాలు

58.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 12
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
pH స్కేలు

59.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 13
ఈ ప్రయోగంలో ఏ పదార్థాన్ని మీరు శ్లేష్మం పొరగా ఉపయోగిస్తారు?
జవాబు:
రదనిక

60.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 14
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
లాక్టియేల్స్

ఖాళీలను పూరించండి

61. జీర్ణవ్యవస్థలో సంచి వంటి నిర్మాణం …………….
జవాబు:
జీర్ణాశయం

62. ఆహారం ఆహారవాహికలో జారటానికి ………… తోడ్పడుతుంది.
జవాబు:
శ్లేష్మం

63. ఆహారవాహికలోని చలనం …………
జవాబు:
పెరిస్టాలిటిక్ చలనం

64. చెరకును చీల్చటానికి ఉపయోగించే దంతము ………..
జవాబు:

65. పాయు సంవరణి కండరాల సంఖ్య …………
జవాబు:
2

66. లాలాజల స్వభావం ………..
జవాబు:
క్షార స్వభావం

67. జీర్ణవ్యవస్థలో ఆమ్ల స్వభావం కలిగిన భాగం ………
జవాబు:
జీర్ణాశయం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

68. లాలాజలంలోని ఎంజైమ్ ………
జవాబు:
టయలిన్

69. అయోడిన్ పిండిపదార్థాన్ని …………… రంగుకు మారుస్తుంది.
జవాబు:
నూనె

10th Class Biology 7th lesson జీవక్రియలలో సమన్వయం 1 Mark Bits Questions and Answers

1. వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
A) పులి
B) ఉడుత
C) ఆవు
D) పిల్లి
జవాబు:
C) ఆవు

2. మానవుని దంతసూత్రం \(\frac{2}{2}, \frac{1}{1}, \frac{2}{2}, \frac{3}{3}\) ఇందులో \(\frac{1}{1}\) సూచించేది ………..
A) కుంతకాలు
B) రదనికలు
C) అగ్రచర్వణకాలు
D) చర్వణకాలు
జవాబు:
B) రదనికలు

3. నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు ……….
A) రదనికలు
B) కుంతకాలు
C) చర్వణకాలు
D) అగ్రచర్వణకాలు
జవాబు:
A) రదనికలు

4. మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2:1: 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
A) రదనికలు
B) చర్వణకాలు
C) అగ్రచర్వణకాలు
D) కుంతకాలు
జవాబు:
B) చర్వణకాలు

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

5. పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 15
A) ఆహారవాహిక
B) జీర్ణాశయము
C) ఆంత్రమూలము
D) ఉండుకము
జవాబు:
C) ఆంత్రమూలము

6. శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ
A) పెరిస్టాల్టిక్ చలనం
B) శోషణం
C) వాంతి
D) జీర్ణమవడం
జవాబు:
C) వాంతి

7. బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 16
A) ద్విపత్ర కవాటం
B) పైలోరిక్ కవాటం
C) విల్లె
D) త్రిపత్ర కవాటం
జవాబు:
B) పైలోరిక్ కవాటం

8. పాక్షికముగా జీర్ణమైన ఆహారము …………
A) టైమ్
B) బోలస్
C) ఎముక
D) కండరము
జవాబు:
A or B

9. నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్య మైనది?
A) 6వ కపాలనాడి
B) 5వ కపాలనాడి
C) 10వ కపాలనాడి
D) దృక్ నాడి
జవాబు:
C) 10వ కపాలనాడి

10. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
A) మారదు
B) తగ్గుతుంది
C) పెరుగుతుంది
D) పైవేవీ కాదు
జవాబు:
C) పెరుగుతుంది

11. జఠర రసములో ఉన్న ఆమ్లము
A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C) నైట్రస్ ఆమ్లము
D) ఫాస్ఫారిక్ ఆమ్లము
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము

12. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆ పదార్థం
A) ఆమ్లం
B) క్షారం
C) తటస్థం
D) హార్మోన్
జవాబు:
A) ఆమ్లం

13. మానవునిలో దంత విన్యాసం
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 20
జవాబు:
A

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

14. మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
A) గ్రీలిన్
B) వాసోప్రెస్సిన్
C) లెఫ్టిన్
D) ఇన్సులిన్
జవాబు:
C) లెఫ్టిన్

15. మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజైమ్
A) లాలాజల అమైలేజ్
B) పెప్సిన్ అవంతి
C) ట్రిప్సిన్
D) లైపేజ్
జవాబు:
A) లాలాజల అమైలేజ్

16. పిండి పదార్థాల పై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ కారకాన్ని వాడతావు?
A) KOH
B) ఆల్కహాల్
C) అయోడిన్
D) సున్నపునీరు
జవాబు:
C) అయోడిన్

17.
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 18
A) థ్రాంబోలైనేజ్
B) థ్రాంబిన్
C) ఫ్రాంఛాంబిన్
D) ఎంటిరోకైనేజ్
జవాబు:
B) థ్రాంబిన్

18. రెండవ మెదడు అనగా ………..
A) మస్తిష్కం
B) అనుమస్తిష్కం
C) జీర్ణ నాడీవ్యవస్థ
D) వెనుక మెదడు
జవాబు:
C) జీర్ణ నాడీవ్యవస్థ

19. ఆకలితో రజిని ఏడుస్తోంది. ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమైన హార్మోను ఏది?
A) లెఫ్టిన్
B) గ్రీలిన్
C) వాసోప్రెస్సిన్
D) థైరాక్సిన్
జవాబు:
B) గ్రీలిన్

20. జీర్ణాశయం, ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంపరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గాస్టిక్
జవాబు:
B) పైలోరిక్

21. ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి?
A) 10-15 నిముషాలు
B) 1-2 గంటలు
C) 15-20 నిముషాలు
D) 30-45 నిముషాలు
జవాబు:
D) 30-45 నిముషాలు

22. మనకు కడుపు నిండుగా ఉండి, ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్
A) సెక్రిటిన్
B) గ్లూకోగాన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
C) లెఫ్టిన్

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం

23. కింది బొమ్మను గుర్తించండి. అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్
AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 17
A) ధమని రక్తనాళం
B) చాలకనాడీ కణం
C) శ్వాసగోణి
D) ఆంత్రచూషకం
జవాబు:
D) ఆంత్రచూషకం

మీకు తెలుసా?

* పగలు నిద్రించినపుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?
నిశాచర జీవుల (Nocturnals) గురించి మీరు వినే ఉంటారు కదా! ఇవి రాత్రివేళలో చురుకుగా ఉంటాయి. అయితే మనం పగటివేళలో చురుకుగా ఉండి, రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటాం. శరీరంలోని వ్యవస్థలన్నీ మనం పనిచేస్తున్నప్పుడు చురుకుగా ఉంటాయి. అందుకే మనిషిని దివాచరులు (Diurnal animals) అంటారు. మన జీర్ణ వ్యవస్థ పగటివేళలో చురుకుగా ఉండడం వలన అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటివేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం తలదిండును తడుపుతుంది. కానీ రాత్రివేళలో ఇలా జరగదు. సాధారణంగా ఒక రోజులో మనం 1- 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాం.

పునశ్చరణం

AP 10th Class Biology Important Questions 7th lesson జీవక్రియలలో సమన్వయం 19

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

These AP 10th Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 6th lesson Important Questions and Answers ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
సజీవులలో సమవిభజన ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
సమవిభజన గాయాలు మాన్పటానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది.

ప్రశ్న 2.
బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయంది.
జవాబు:
బీజ దళాలు మొక్కలో పత్రాలు ఏర్పడేవరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 3.
నీవు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలను సందర్శించిన డాక్టర్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. AIDS వ్యాధి ఎలా కలుగుతుంది?
  2. AIDS ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది?
  3. AIDS వ్యాధి లక్షణాలు ఏవి?
  4. AIDS వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రశ్న 4.
ప్రథమ స్తన్యం అనగా నేమి?
జవాబు:
గర్భావధి చివరిదశలో స్తన గ్రంథుల్లో ప్రోగయ్యే శోషరసాన్ని పోలిన ద్రవాన్ని ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం (Colostrum) అంటారు. ఇది నవజాత శిశువులో వ్యాధి నిరోధకతను పెంచడానికి అత్యావశ్యకం. దీని తరువాత పాలు స్రవించబడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 5.
స్త్రీ భ్రూణ హత్యల నివారణకు రెండు సలహాలను సూచించండి.
జవాబు:

  1. సంబంధిత నినాదాలు తయారు చేయుట
  2. ర్యాలీలు నిర్వహించుట
  3. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచుట.

ప్రశ్న 6.
రైజోపస్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించినపుడు మీరు తీసుకొనిన రెండు జాగ్రత్తలను తెలుపండి.
జవాబు:

  1. ప్రయోగంలో ఉపయోగించే రొట్టెను నేరుగా చేతులతో ముట్టరాదు.
  2. రొట్టెను చేతులతో ముట్టినట్లయితే చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.
  3. రొట్టెను ఒక గంటపాటు ఆరుబయట ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సాంక్రమిక పదార్థాలను గ్రహిస్తుంది.
  4. రొట్టెను వుంచిన సంచిని మాత్రము తెరవద్దు.
  5. ప్రతి రెండు రోజులకోసారి పరీక్షిస్తూ, ఎండిపోకుండా కొంత నీటిని చల్లుతూ ఉంచాలి.
  6. సంచిని దూరంగా, చీకటి, తేమ మరియు వెచ్చగా వుండే ప్రదేశంలో ఉంచాలి.

ప్రశ్న 7.
ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
ప్రత్యుత్పత్తి :
ఒక జీవి తన జీవిత కాలంలో తనను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ధర్మాన్ని “ప్రత్యుత్పత్తి” అంటారు.

ప్రశ్న 8.
అనుకూల పరిస్థితులలో పారమీషియం ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
అనుకూల పరిస్థితులలో పారమీషియం ద్విధావిచ్ఛిత్తి ద్వారా రెండు పిల్ల పారమీషియంలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగటం వలన ఎక్కువ సంఖ్యలో జీవులు ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 9.
అననుకూల పరిస్థితులలో పారమీషియం ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
ప్రతికూల పరిస్థితులలో రెండు పారమీషియాలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకొంటాయి. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి.

ప్రశ్న 10.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి : సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని “అలైంగిక ప్రత్యుత్పత్తి” అంటారు.

ప్రశ్న 11.
ద్విధావిచ్చిత్తి అనగానేమి?
జవాబు:
ద్విధావిచ్చిత్తి :
ఏకకణ జీవులు రెండుగా విడిపోయే ప్రక్రియను “ద్విధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది సౌష్ఠవంగా జరుగుతుంది.
ఉదా: అమీబా, పారమీషియం

ప్రశ్న 12.
బహుధావిచ్చిత్తి అనగా నేమి?
జవాబు:
బహుధావిచ్చితి :
ఒక జీవి ఎక్కువ భాగాలుగా విడిపోయి, అవి జీవులుగా రూపొందే ప్రక్రియను “బహుధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది.

ప్రశ్న 13.
‘అనిషేక జననం’ అనగానేమి?
జవాబు:
అనిషేక జననం :
ఫలదీకరణం జరగకపోయినా అండం అభివృద్ధి చెంది పిల్లజీవులుగా ఏర్పడే ప్రక్రియను “అనిషేక జననం” అంటారు.

ప్రశ్న 14.
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకములను తెలపండి.
జవాబు:
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి విధానాలు :
స్టోలన్లు : వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ
లశునాలు: ఉల్లి
కొమ్ములు : పసుపు
దుంప : బంగాళదుంప

ప్రశ్న 15.
కణజాలవర్ధనం అనగానేమి?
జవాబు:
కణజాలవర్ధనం: మొక్కలలోని కొంత కణజాలాన్ని వర్ధన యానకంలో ఉంచినపుడు, అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ ప్రక్రియను “కణజాలవర్ధనం” అంటారు.

ప్రశ్న 16.
సిద్ధబీజాశయ పత్రాలు అనగానేమి?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రాలు :
ఫెర్న్ మొక్క ఆకుల అడుగు భాగాన బూడిద రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను “సిద్ధబీజాశయ పత్రాలు” (Sporophyll) అంటారు.

ప్రశ్న 17.
బాహ్య ఫలదీకరణం అనగానేమి?
జవాబు:
బాహ్య ఫలదీకరణం :
తల్లి శరీరానికి బయట జరిగే ఫలదీకరణను “బాహ్య ఫలదీకరణం” అంటారు.
ఉదా : చేపలు, కప్పలు

ప్రశ్న 18.
అంతర ఫలదీకరణ అనగానేమి?
జవాబు:
అంతర ఫలదీకరణం : సీ జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు

ప్రశ్న 19.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు తెలపంది.
జవాబు:
ముష్కాలు, శుక్రవాహిక, ప్రసేకం, పౌరుష గ్రంథి, మేహనం, ఎపిడిడిమిస్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

ప్రశ్న 20.
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాల పేర్లు చెప్పండి.
జవాబు:
గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు, స్త్రీ బీజకోశాలు, యోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 21.
అండోత్సర్గం అనగానేమి?
జవాబు:
అండోత్సర్గం :
గ్రాఫియన్ పుటిక నుండి అండం విడుదల కావటాన్ని “అండోత్సర్గం” (Ovulation) అంటారు.

ప్రశ్న 22.
పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏమిటి?
జవాబు:
పిండాన్ని ఆవరిస్తూ పరాయువు (Chorion), ఉల్బం (Amnion), ఎల్లంటోయిస్ (Allantois) అనే పొరలు ఉంటాయి.

ప్రశ్న 23.
తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
జవాబు:
జరాయువు బొడ్డు తాడు (నాభిరజ్జువు) ద్వారా తల్లి, పిండాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది.

ప్రశ్న 24.
జననాంతరం అనగానేమి?
జవాబు:
జననాంతరం :
శిశువు జననం తరువాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంత వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియను “జననాంతరం” అంటారు.

ప్రశ్న 25.
పిండకోశంలో ఎన్ని కణాలు ఎన్ని సమూహాలుగా అమరి ఉంటాయి?
జవాబు:
పిండకోశంలో మొత్తం ఏడు కణాలు, మూడు సమూహాలుగా ఉంటాయి. వీటిలో ధృవ కేంద్రకం ద్వయస్థితికంగా ఉండును.

ప్రశ్న 26.
ఏకలింగ పుషాలు అనగానేమి?
జవాబు:
ఏకలింగ పుష్పాలు :
కొన్ని పుష్పాలు కేసరావళిగాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇటువంటి పుష్పాలను “ఏకలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : సొరకాయ, బొప్పాయి

ప్రశ్న 27.
ద్విలింగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
ద్విలింగ పుష్పాలు :
కేసరావళి అండకోశము రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను “ద్విలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : బఠాని, ఉమ్మెత్త

ప్రశ్న 28.
స్వపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
స్వపరాగ సంపర్కం :
ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రం చేరడాన్ని “స్వపరాగ సంపర్కం” అంటారు.

ప్రశ్న 29.
పరపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
పరపరాగ సంపర్కం :
పుష్పంలోని పురుష బీజకణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల స్త్రీ బీజకణాలతో ఫలదీకరణ జరిగితే దానిని “పరపరాగ సంపర్కం” (Cross pollination) అంటారు.

ప్రశ్న 30.
పిండ కోశంలోని కణాలు ఏమిటి?
జవాబు:
పుష్పించే మొక్కల పిండకోశంలో 7 కణాలు ఉంటాయి. వీటిలో మూడు ప్రాతిపదిక కణాలు రెండు సహాయకణాలు. ఒక స్త్రీ బీజకణం, ఒక ద్వితీయ కేంద్రకం ఉంటాయి.

ప్రశ్న 31.
అంకురచ్ఛదము ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పురుష బీజకణం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి అంకురచ్ఛదాన్ని (Endo sperm) ఏర్పరుస్తుంది.

ప్రశ్న 32.
ద్విఫలదీకరణ అనగానేమి?
జవాబు:
ద్విఫలదీకరణ :
మొక్కలలో రెండు పురుష కేంద్రకాలు ఏర్పడి, ఒకటి స్త్రీ బీజకణంతోనూ, మరొకటి ద్వితీయ కేంద్రకంతోనూ కలుసాయి. ఇలా పిండకోశంలో రెండు ఫలదీకరణాలు జరగడాన్ని “ద్విఫలదీకరణం” అంటారు.

ప్రశ్న 33.
DNA అనగానేమి? దాని రసాయనిక నిర్మాణం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆసిడ్ ను “DNA” అంటారు. ఇది ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుంది. దీని నిర్మాణాన్ని 1953లో “జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రికె” కనుగొన్నారు.

ప్రశ్న 34.
సమవిభజన గల ఉపదశలు ఏమిటి?
జవాబు:
సమ విభజనలో ప్రథమదశ, మధ్యస్థదశ, చలనదశ మరియు అంత్యదశ అనే ఉపదశలు ఉన్నాయి.

ప్రశ్న 35.
మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
జవాబు:

  1. మధ్యస్థదశలో క్రోమోజోములు, సెంట్రిమియర్లు అన్నీ వరుసగా అమరి మధ్య ఫలకాన్ని ఏర్పరుస్తాయి.
  2. క్రోమోజోములను అంటి ‘కండె పరికరం’ ఏర్పడుతుంది.
  3. మధ్య ఫలకం, కండె పరికరం మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్ష్యం.

ప్రశ్న 36.
క్షయకరణ విభజన ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
క్షయకరణ విభజనలో లైంగిక కణాల క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడి సంయోగబీజాలు ఏర్పడతాయి. వీటి కలయిక వలన ఏర్పడిన కొత్త జీవిలో తల్లి జీవుల వలె క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.

ప్రతి తరంలోనూ క్రోమోజోమ్ ల సంఖ్య స్థిరంగా ఉంచటానికి క్షయకరణ విభజన తోడ్పడుతుంది.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
స్టాక్, సయాన్ అనగా నేమి?
జవాబు:
సయాన్ :
అంటుకట్టే ప్రక్రియలో వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కను “సయాన్” అంటారు.

స్టాక్ :
సయానికి ఆధారాన్నిచ్చే క్రింది మొక్కను “స్టాక్” అంటారు.

ప్రశ్న 38.
అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు తెలపండి.
జవాబు:
విచ్ఛిత్తి, కోరకీభవనం, ముక్కలు కావటం, సిద్ధబీజాలు, అనిషేక ఫలాలు మొదలైనవి. అలైంగికోత్పత్తిలోని కొన్ని ప్రక్రియలు.

ప్రశ్న 39.
కోరకీభవనాన్ని ఏ జీవులలో గమనిస్తావు?
జవాబు:
ఈస్ట్ వంటి శిలీంధ్రాలలో కోరకీభవనాన్ని గుర్తించవచ్చు.

ప్రశ్న 40.
ముక్కలవటం (Fragmentation) ఏ జీవులలో పరిశీలించవచ్చు?
జవాబు:
చదును పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవులలో ముక్కలవటం గమనించవచ్చు.

ప్రశ్న 41.
అనిషేక జననం ఏ ఏ జంతువులలో గమనించవచ్చు?
జవాబు:
తేనెటీగలు, చీమలు, కందిరీగలలో అనిషేక జననం గమనించవచ్చు.

ప్రశ్న 42.
పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది?
జవాబు:
రణపాల ఆకు (బ్రయోఫిల్లమ్) పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.

ప్రశ్న 43.
ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కలు ఏమిటి?
జవాబు:
చెరకు, గులాబి, మందార వంటి మొక్కలు ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి చెందుతాయి.

ప్రశ్న 44.
పాలను పెరుగుగా మార్చే సూక్ష్మజీవిలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి?
జవాబు:
లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. ఇది ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను విపరీతంగా పెంచుతుంది.

ప్రశ్న 45.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనిషేక ఫలనం (Parthenogenesis) ప్రక్రియలో విత్తనరహిత ఫలాలు ఏర్పడతాయి.
ఉదా : అరటి, ద్రాక్ష

ప్రశ్న 46.
కొన్ని లైంగిక వ్యాధులు తెలపండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ మొదలైనవి లైంగిక వ్యాధులు.

ప్రశ్న 47.
కొన్ని గర్భనిరోధక పద్ధతులు తెలపండి.
జవాబు:
భౌతిక ఉపకరణాలు : కండోమ్ లు, డయాఫ్రమలు, కాపర్ – T
రసాయన ఉపకరణాలు : స్పెర్మిసైడ్స్, మాలా – డి
శస్త్ర ఉపకరణాలు : వేసెక్టమీ, ట్యూబెక్టమీ మొదలైన గర్భనిరోధక పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న 48.
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రము అనగానేమి?
జవాబు:
సెమినల్ ప్లాస్మా :
శుక్ర గ్రాహికలు ఉత్పత్తిచేసే ద్రవం, పౌరుష గ్రంధి స్రావాలు, కౌపర్ గ్రంధి స్రావాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు.

శుక్రము :
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము (Semen) అంటారు.

ప్రశ్న 49.
‘స్కలనము’ అనగానేమి?
జవాబు:
స్కలనము :
పురుష జీవి నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని ‘స్కలనము’ అంటారు.

ప్రశ్న 50.
సాధారణ ఫలదీకరణము జరగడానికి శుక్ర కణాలకు ఉండవలసిన లక్షణాలేవి?
జవాబు:
i) సాధారణ ఫలదీకరణానికి శుక్ర కణాలలో 60% సరైన ఆకారము, పరిమాణంలో ఉండాలి.
ii) కనీసం 40% వేగంగా చలించేలా ఉండాలి.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈ క్రింది పటంలో 4, b, c, d లను గుర్తించి వాటి విధులను వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1
జవాబు:
a) అండాశయం :
మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండాశయం, స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ, పురుష బీజకణాలు కలసి సంయోగ బీజం అండాశయంలో ఏర్పడుతుంది. ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర వహిస్తుంది.

b) కీలం :
పురుష బీజకణాలు దీని ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరటానికి తోడ్పడుతుంది.

c) కేసర దండం :
కేసరము పురుష బీజ ప్రత్యుత్పత్తి భాగము. దీనికి కేసర దండం, పరాగకోశం అని రెండు భాగాలుంటాయి. కేసర దండం పరాగ కోశానికి ఆధారాన్నిస్తుంది.

d) పరాగ కోశం :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పరాగకోశంలో పురుష బీజకణాలైన “పరాగ రేణువులు” ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 2.
మానవ శుక్రకణం పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5

ప్రశ్న 3.
రెండు లక్షణాలను ఎన్నుకొని అంటుకట్టుట ద్వారా వాంఛిత ఉపయుక్త లక్షణాలను ఎలా పొందవచ్చో వివరించండి.
జవాబు:

  1. రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
  2. నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని అవాంఛిత లక్షణాలు గల భాగాన్ని సయాన్ అని అంటారు.
  3. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్బాలి.
  4. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు కావలసిన లక్షణాలున్న మొక్కలను సయాగా ఉపయోగించాలి.

ప్రశ్న 4.
పిండకోశం బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 2

ప్రశ్న 5.
మీ పాఠశాలకు వచ్చిన డాక్టర్ తో HIV వ్యాప్తి చెందే మార్గాలను తెలిసికోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. HIV సంక్రమించే మార్గాలు ఏమిటి?
  2. రక్తమార్పిడి ద్వారా HIV వ్యాపిస్తుందా?
  3. సిరంజ్ లను వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించండి.
  4. తల్లి నుండి బిడ్డకు HIV సంక్రమిస్తుందా?

ప్రశ్న 6.
క్షయకరణ విభజనలో మాతృకణాల కంటే ఏర్పడే పిల్లకణాల్లో క్రోమోసోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఒకవేళ ఇలా జరుగకపోతే ఏమవుతుందో ఊహించి వ్రాయండి.
జవాబు:

  1. క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడనట్లయితే రెండు కణాల కలయిక వలన కొత్తతరంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది.
  2. క్రోమోజోముల సంఖ్యలోని మార్పు జీవి లక్షణాలను పూర్తిగా మార్చివేస్తుంది.
  3. జనకతరంతో పొంతన లేని కొత్తతరం ఏర్పడుతుంది.
  4. కొత్తతరంలో మనుగడకు తోడ్పడని విపరీత లక్షణాలు ఏర్పడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 7.
విత్తనరహిత ఫలాలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా అభివృద్ధి చేసిన వాటికి రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
కొన్ని మొక్కలలో అండం క్షయకరణ విభజన జరగకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి విత్తనరహిత ఫలాలు.
ఉదా : పుచ్చకాయ, ద్రాక్ష

ప్రశ్న 8.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధులు రాకుండా నీవు తీసుకునే జాగ్రత్తలేవి?
జవాబు:

  1. తెలియని వ్యక్తులతో లేదా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకపోవడం,
  2. శృంగారంలో పాల్గొనిన ప్రతిసారి కండోమ్ ఉపయోగించడం.
  3. రోగులకు సురక్షిత రక్తాన్ని ఎక్కించడం.
  4. డిస్పోసబుల్ సిరంజిలు మరియు సూదులు ఉపయోగించడం.
  5. HIV పాజిటివ్ ఉన్న తల్లి, డాక్టరు సలహా మేరకు మాత్రమే పిల్లల్ని కనాలి.

ప్రశ్న 9.
ఇవ్వబడిన పటాన్ని గమనించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 3
a) ఏ ఏ దశలు పూర్తవటానికి ఒకే సమయం తీసుకుంటాయి?
b) DNA సంశ్లేషణ ఏ దశలో జరుగుతుంది?
జవాబు:
a) ‘G1’ దశ మరియు ‘S’ దశ.
b) ‘S’ దశ

ప్రశ్న 10.
బొమ్మను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4
i) బొమ్మలోని పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల పేర్లను రాయండి.
ii) బొమ్మలో సూచించిన 1, 2 భాగాల పేర్లు రాయండి.
జవాబు:
i) పురుష నిర్మాణాలు : పరాగరేణువులు, పరాగకోశము
స్త్రీ నిర్మాణాలు : కీలాగ్రము, అండాశయం, మరియు అండము.

ii) 1) రక్షక పత్రావళి, 2) ఆకర్షణ పత్రావళి

ప్రశ్న 11.
అప్పారావ్ మరియు రాములమ్మ కొత్తగా పెళ్ళైన నిరక్షరాశ్యులైన జంట. కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి కొరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను కొన్నింటిని వ్రాయుము.
జవాబు:
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతులు :
1) కండోమ్స్ 2) డయాఫ్రమ్స్ (క్యాప్స్) 3) కాపర్-టి 4) లూప్ 5) పిల్స్

ప్రశ్న 12.
సమవిభజనలో మధ్యస్థ దశ బొమ్మగీసి, దాని గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5

  1. క్రోమోజోమ్ లు కండే ఫలకము దగ్గరకు కదులుతాయి.
  2. సెంథీమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి.

ప్రశ్న 13.
అనిషేక జననం ఏ సందర్భంలో జరుగుతుంది? ఈ ప్రక్రియ జరిపే జంతువులకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
ఫలదీకరణము చెందని అండ కణము నుంచి పిల్ల జీవులు నేరుగా ఏర్పడినప్పుడు అనిషేక జననము జరుగును.
ఉదా : 1. తేనెటీగలు, 2. చీమలు, 3. కందిరీగ

ప్రశ్న 14.
వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుందా?
జవాబు:

  1. వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయం వేరుగా ఉంటుంది.
  2. కీటకాల జీవితకాలం కొన్ని నెలలలోనే పూర్తి అయితే, ఏనుగు సంతానోత్పత్తికి 360 రోజులు పడుతుంది.
  3. ఈస్ట్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఒక గంట వ్యవధిలోనే తమ సంఖ్యను విస్తృతంగా పెంచుకుంటాయి.
  4. పిల్లి, కుక్కలలో గర్భావధికాలం 63 రోజుల ఉండగా, ఆవులో 280 రోజులు, గుర్రంలో 330 రోజులు ఉంటుంది.
  5. చుంచులలో అతి తక్కువ గర్భావధి 20 రోజులు ఉండగా, మానవునిలో 280 రోజులు ఉంటుంది.

ప్రశ్న 15.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

అలైంగిక ప్రత్యుత్పత్తిఉదాహరణ
1. విచ్ఛిత్తిబాక్టీరియా, పారమీషియం
2. కోరకీభవనంఈస్ట్‌
3. ముక్కలవటంస్పైరోగైరా శిలీంధ్రం
4. అనిషేక ఫలాలుపుచ్చకాయ, ద్రాక్ష
5. పునరుత్పత్తిప్లనేరియా

ప్రశ్న 16.
విచ్ఛిత్తి గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 6
విచ్ఛిత్తి (Fission):
పారమీషియం , బాక్టీరియా వంటి ఏకకణ జీవులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి సాధారణంగా ఏకరూపకత కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సౌష్ఠవంగా జరుగుతుంది. పారమీషియం రెండుగా విడిపోవడాన్ని ద్విధావిచ్చిత్తి అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే దానిని బహుధావిచ్చిత్తి అని అంటారు. పారమీషియం పారామీషియంలో విచ్చిత్తి , వంటి జీవులలో తరచుగా ఈ విధానంలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

ప్రశ్న 17.
కోరకీభవనం గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 7
జనక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతాయి. అది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్‌లో కోరకీభవనం.

ప్రశ్న 18.
ముక్కలగుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 8
కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం చదును పురుగులు, మోల్డులు, లైకేన్లు, స్పెరోగైరా వంటి సరళజీవులలో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది.

ప్రశ్న 19.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
ప్రకృతిలో సహజంగా కొన్నిసార్లు అండాలు ఫలదీకరణం చెందకుండానే, అండాశయం ఫలంగా మారుతుంది. ఇటువంటి కాయలో విత్తనాలు ఉండవు. వీటిని అనిషేక ఫలాలు అంటారు.

మానవుడు జిబ్బరెల్లిన్ వంటి ఫైటో హార్మోన్లను చల్లి కృత్రిమంగా అనిషేక ఫలాలు పొందుతున్నాడు.
ఉదా : అరటి, ద్రాక్ష

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
పార్టినోజెనెసిస్ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా, జరగకపోయినా అండం జీవిగా అభివృద్ధి చెందుతుంది.
  2. ఈ ప్రక్రియలో ఏకస్థితిక పిల్లజీవులు మగజీవులు గాను, ద్వయస్థితిక అండాల నుండి ఆడజీవులు అభివృద్ధి చెందుతాయి.
  3. ఫలదీకరణతో ప్రమేయం లేకుండా అండాలు, జీవులుగా వృద్ధి చెందే ప్రక్రియను పార్టినోజెనెసిస్ అంటారు.
    ఉదా : తేనెటీగలు, చీమలు, కందిరీగలు

ప్రశ్న 21.
పునరుత్పత్తి అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 17
పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం కలదు. ఈ ప్రక్రియను పునరుత్పత్తి అంటారు. దీనిని ‘ముక్కలవటం’ అనే శాఖీయోత్పత్తితో పోల్చవచ్చు.
ఉదా : ప్లనేరియా, వానపాము.

ప్రశ్న 22.
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు :

  1. ఛేదనం : చెరకు, మందార
  2. అంటు తొక్కుట : మల్లె, గన్నేరు
  3. అంటుకట్టుట : గులాబి, మామిడి

ప్రశ్న 23.
ఛేదనం గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 9
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఆ ఛేదనం చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి. కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి, మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : బంతి, గులాబి

ప్రశ్న 24.
అంటు తొక్కుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 10
అంటు తొక్కుట (Layering) :
మొక్కలో కనీసం ఒక కణపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తరువాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అపుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేయాలి. వేర్లను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది.
ఉదా : మల్లె, గన్నేరు.

ప్రశ్న 25.
సిద్ధబీజాశయ పత్రం అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 11
ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ముదిరిన ఆకుల అడుగుభాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు (Sporophyll) అంటారు.

ప్రశ్న 26.
చేపలు, కప్పలు ఎక్కువ సంఖ్యలో అందాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఎందుకు?
జవాబు:
చాలా వరకు చేపలు, ఉభయచరాలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీ జీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంది. అదే విధంగా పురుష జీవి మిలియన్లలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. కాబట్టి స్త్రీ, పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి.

ప్రశ్న 27.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అనుబంధ గ్రంథులు ఏవి? వాటి పని ఏమిటి?
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులైన పౌరుష గ్రంథి, రెండు కాఫర్ గ్రంథులు కలిసి జిగురు వంటి ఆ స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని శుక్రం అంటారు. ఇది శుక్రకణాలకు పోషక పదార్థాలను అందించడంతో పాటు శుక్రకణాల కదలికలకు మాధ్యమంగా కూడా పనిచేస్తుంది.

ప్రశ్న 28.
అండోత్సరం అనగానేమి?
జవాబు:
స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు (Graphian follicles) అంటారు. ఈ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి పుటికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినపుడు, పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం (Ovulation) అంటారు.

ప్రశ్న 29.
ఫలదీకరణ సమయంలో గర్భాశయంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం లేదా సంయుక్త బీజం ప్రవేశించడానికి ముందుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు దీని లోపలి గోడలు మృదువుగా, దళసరిగా మారతాయి. తేమతో కూడిన ద్రవాన్ని స్రవిస్తాయి. రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది. ఇప్పుడు గర్భాశయం పిండ ప్రతిస్థాపనకు సిద్ధంగా ఉందన్నమాట.

ప్రశ్న 30.
పిండ ప్రతిస్థాపన అనగానేమి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారం ఇవ్వడానికి వీలుగా వేరు వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 31.
కణజాలవర్ధనం అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.

ప్రశ్న 32.
జరాయువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు (Chorion) అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ళవంటి నిర్మాణాలు గర్భాశయ మృదుకణజాలంలోనికి పెరుగుతాయి. క్రమేపి గర్భాశయి జ్యంలో పాతుకున్న ఈ వేళ్ళ వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం, దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు (Placenta) ను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 33.
జరాయువు పని ఏమిటి?
జవాబు:
పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో తల్లికి, బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విస్తరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 34.
నాభిరజ్జువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. పిండం యొక్క మరోక త్వచం ఎల్లంటోయిస్ (Allantois) త్వచం పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది.
  2. సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి.
  3. ఈ నాళాన్నే నాభిరజ్జువు (Umbellical cord) అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్త నాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషకపదార్థాలు అందజేయబడతాయి.

ప్రశ్న 35.
గర్భావధి కాలం అనగానేమి? వివిధ జంతువులలోని గర్భావధికాలం తెలపండి.
జవాబు:
గర్భావధి కాలం :
పిండం పూర్తిగా అభివృద్ధి చెందటానికి పట్టే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. వివిధ జీవులలో సరాసరి గర్భావధి కాలం వేర్వేరుగా ఉంటుంది. పిల్లి, కుక్కలలో గర్భావధి కాలం 63 రోజులు. గుర్రం 330 రోజులు, ఆవు 280 రోజులు. ఎలుకలు మరియు చుంచుల గర్భావధి కాలం 20-22 రోజులు ఉంటుంది.

ప్రశ్న 36.
జనసాంతరం అనగానేమి?
జవాబు:

  1. ప్రసవం తరువాత శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరజువును వైద్యులు కత్తిరించి వేరుచేస్తారు.
  2. శిశువుతోనున్న నాభిరజువు యొక్క చిన్న భాగం కృశించుకుపోయి కొద్ది రోజులలో ఊడిపోతుంది. ఈ భాగాన్ని నాభి అంటాం.
  3. శిశుజననం తరవాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంతవరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే ‘జననాంతరం’ అంటారు.

ప్రశ్న 37.
ప్రథమ స్తన్యం అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథులలో ప్రోగవుతుంది. దీనినే “ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం” అంటారు.
  2. శిశుజననం తరువాత కొన్ని రోజులు స్తన గ్రంథులు ముర్రుపాలనే స్రవిస్తాయి.
  3. నవజాత శిశువులో వ్యాధినిరోధకత పెంచటానికి ఇవి అత్యావశ్యకం.

ప్రశ్న 38.
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత :
అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 39.
పరాగసంపర్కానికి సంబంధించి డార్విన్ పరిశీలన ఏమిటి?
జవాబు:
మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.

ప్రశ్న 40.
విత్తనంలో అంకురచ్ఛదం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
అంకురచ్చదాన్ని ఉపయోగించుకొని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి. కొన్ని మొక్కల బీజదళాలు (ఉదా : చిక్కుడు) అలకు రచ్చదాన్ని పూర్తిగా వినియోగించుకొని విత్తనాలుగా మారతాయి. ఫలితంగా పోషక పదార్థాల నిలువలు పెరగడం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది. మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితోపాటుగా అంకురచ్ఛద కణజాలం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది.

ప్రశ్న 41.
కణవిభజన మీద ‘ఆగస్ట్ వీస్మన్’ ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:

  1. ఒక జాతి జీవులలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా, ఒకే విధంగా ఉంటుంది.
  2. కణ విభజన జరిగినా క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.

ప్రశ్న 42.
లైంగిక వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి?
జవాబు:
లైంగిక వ్యాధులు ఎక్కువగా సురక్షితం కాని లైంగిక కార్యకలాపాల వలన, శుద్ధిచేయని సూదులు మొదలైన ఉపకరణాల వలన, రక్త మార్పిడి వలన ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. కొన్ని సందర్భాలలో తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపిస్తాయి.

ప్రశ్న 43.
ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకొంటున్న చర్యలు ఏమిటి?
జవాబు:
ప్రభుత్వం ART కేంద్రాల ద్వారా (Anti Retroviral Therapy) HIV వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు కలుగజేస్తోంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాలు AIDS నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆశ (ASHA – Accredited Social Health Activist), రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ మొదలైన కార్యక్రమాల ద్వారా AIDS వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణా చర్యలను తెలుపుతూ అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.

ప్రశ్న 44.
కుటుంబ నియంత్రణకు చేసే శస్త్రచికిత్సలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 12
స్త్రీ పురుషులిద్దరికీ కుటుంబ నియంత్రణ (birth control) కోసం శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పురుషులకు చేసే శస్త్రచికిత్సలో శుక్రనాళాన్ని కత్తిరించి నాళం రెండు చివరలను గట్టిగా కట్టి ముడివేస్తారు. అందువల్ల శుక్రకణాలు విడుదల కాకుండా అడ్డగించబడతాయి. ఈ పద్ధతినే వేసెక్టమీ (Vasectomy) అంటారు. స్త్రీలలో అండనాళంలో (Fallopian tubes) చిన్న భాగాన్ని కత్తిరించి, తీసివేసి చివరలను గట్టిగా ముడి వేస్తారు. ఇలా చేయటం ద్వారా అండం, అండనాళంలోనికి వెళ్ళకుండా చేస్తారు. దీనిని ట్యూబెక్టమీ అంటారు.

ప్రశ్న 45.
18 సంవత్సరాలు వయస్సు నిండకుండా అమ్మాయిలకు వివాహం ఎందుకు చేయకూడదు?
జవాబు:
చిన్నతనంలో తల్లి కావడం అనారోగ్యానికి దారితీస్తుంది. శిశువుకు జన్మనివ్వడం అనేది ఒక సంక్లిష్టమైన జీవన ప్రక్రియ. స్త్రీలలో 18 సంవత్సరాలు నిండిన తరువాతే శిశువుకు జన్మనివ్వడానికి శారీరకంగా సిద్ధంగా ఉంటారు. నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలకు ముఖ్యమైన కారణాలు. కుటుంబ సంక్షేమశాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 21 శాతం మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. పోషకాహార లోపం కూడా ప్రసవ సమయానికి ముందు, ప్రసవం తరువాత మరణానికి దారితీస్తుంది. కాబట్టి 18 సంవత్సరాల వయస్సు నిండకుండా అమ్మాయిలు వివాహానికి అంగీకరించకూడదు.

ప్రశ్న 46.
ద్విధావిచ్ఛిత్తి ఏ విధంగా బహుధావిచ్చిత్తి కంటే భిన్నంగా ఉంటుంది?
జవాబు:

ద్విధావిచ్ఛిత్తిబహుధావిచ్చిత్తి
1. రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి.1. ఎక్కువ పిల్ల జీవులు ఏర్పడతాయి.
2. సౌష్ఠవంగా జరుగుతుంది.2. సౌష్ఠవంగా జరగదు.
3. అనుకూల పరిస్థితులలో జరుగుతుంది.3. ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది.
4. తక్కువ సమయం పడుతుంది.4. ఎక్కువ సమయం పడుతుంది.

ప్రశ్న 47.
ఫలదీకరణ అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
ఫలదీకరణ :
స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణ అంటారు. ఇది రెండు రకాలు.

1. బాహ్య ఫలదీకరణ :
శుక్రకణాలు, అండాల కలయిక జంతు శరీరం బయట జరిగితే దానిని “బాహ్య ఫలదీకరణ” అంటారు.
ఉదా : చేప, కప్ప

2. అంతర ఫలదీకరణ :
ఫలదీకరణ స్త్రీ జీవి శరీరంలో జరిగితే దానిని “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 48.
‘బాల్య వివాహాలను ఒక సాంఘిక దురాచారం’ అని తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:

  1. బాల్య వివాహం చేయటం ఓడిపోనున్న ఆటతో సమానం.
  2. బాల్య వివాహాలు వద్దు – చదువే ముద్దు.
  3. బాల్య వివాహాలను అరికట్టండి – బాలికలను ఎదగనీయండి.
  4. బాలిక అమ్మా అని పిలవాలి – ఆమె అమ్మా అని పిలవబడకూడదు.
  5. మంచి వివాహాలు నిదానంగా జరుగుతాయి. బాలిక వివాహం పట్ల జాగరూకత ఉండాలి.
  6. బాల్య వివాహాలు వద్దు – బతుకంతా నరకం చేయవద్దు.

ప్రశ్న 49.
HIV ఎయిడ్స్ వ్యాధి నివారణ తెలుపుతూ 5 నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.
  2. ఎయిడ్స్ వ్యాధి నీ కళ్ళను మూయక ముందే వాటిని నీవు తెరువు.
  3. ఎయిడ్స్ వ్యాధిని అసహ్యించండి… వ్యాధిగ్రస్తులను కాదు.
  4. విజ్ఞానాన్ని వ్యాప్తి చేయండి…. HIV వైరసన్ను కాదు.
  5. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు …. అంటించుకునే వ్యాధి.
  6. కండోమ్ ను ధరించు ….. వ్యాధి సంక్రమణను నివారించు.

ప్రశ్న 50.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 13
పైన గీయబడిన మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో A, B, C, D అని సూచించిన భాగముల పేర్లు వ్రాయుము.
జవాబు:
A – ఫాలోపియన్ నాళం (స్త్రీ బీజవాహిక) –
B – అండాశయం, C – గర్భాశయం, D – యోని

ప్రశ్న 51.
కౌమార దశలోని పిల్లలలో ఎటువంటి జీవన నైపుణ్యాలు ఉండవలసిన అవసరముందో వివరించండి.
జవాబు:

  1. సరియైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యం అనగా సరియైన విధంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం.
  2. వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం అనగా, స్నేహితులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం.
  3. సంభాషణ నైపుణ్యం అనగా తమ అభిప్రాయాలను, భయాలను, సందేహాలను నిర్భయంగా వ్యక్తపరచడం.
  4. సమస్యలను అధిగమించే నైపుణ్యం అనగా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం.
  5. సమవయస్కుల ఒత్తిళ్ళకు సరియైన రీతిలో స్పందించడం అనగా తోటి వారి వత్తిడులకు లొంగకుండడం.
  6. మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనగా, స్త్రీలు పురుషుల పట్లను, పురుషులు స్త్రీల పట్లను సరియైన అవగాహనతో మెలగడం.

ప్రశ్న 52.
శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత జరిగే మార్పులు ఏవి?
జవాబు:

  1. శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది.
  2. ఫలదీకరణం తరువాత అండం సంయుక్తబీజం (Zygote) గా మారుతుంది.
  3. సంయుక్తబీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజనలు చెందడం మొదలవుతుంది.
  4. గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల ‘బంతిగా మారుతుంది.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పుష్పంలో అండము నుండి విత్తనము ఏర్పడే విధానములో ఉండే మార్పులను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం విధానం :

  1. మొక్క జాతిని బట్టి అండాశయంలో ఒకటి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. ప్రతీ అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు మరియు సిద్ధ బీజకణాలను కలిగిన పిండకోశం (embryo sac) ఉంటుంది.
  2. పిండకోశం 7 కణాలను, 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధ బీజం 4 విభజనల తరువాత 8 కణాల స్థితి లోనికి వస్తుంది.
  3. 3 కణాలు పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాదకణాలు” (Antipodals) అంటారు. పిండకోశం పూర్వ భాగంలో 3 కణాలుంటాయి. వానిలో రెండు “సహాయ కణాలు” (Synergids), ఒకటి “స్త్రీ బీజకణం” (Egg) ఉంటాయి.
  4. మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది. “దీనిని ద్వితీయ కేంద్రకం” అంటారు.
  5. పరాగ రేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం పిండకోశం లోనికి ప్రవేశించగానే, కొనభాగం పగిలిపోయి రెండు పురుష బీజకణాలు పిండకోశంలోనికి విడుదలవుతాయి.
  6. వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. దీనివల్ల “సంయుక్త బీజం” ఏర్పడుతుంది. మరొక పురుష బీజ కేంద్రకం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి “అంకురచ్ఛదం” (Endosperm)ను ఏర్పరుస్తుంది. అలా రెండు సార్లు ఫలదీకరణ జరగటాన్ని “ద్విఫల దీకరణం” (Double fertilization) అంటారు.
  7. ద్విఫలదీకరణం తరువాత అండంలో త్వరితగతిన జరిగే అనేక మార్పుల కారణంగా, అంకురచ్చదం ఏర్పడటం మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది. పిండంలో ఒకటి లేదా రెండు బీజదళాలు ఏర్పడతాయి.
  8. అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
  9. ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం పలుమార్లు సమవిభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరుచుకొని విత్తనంగా మారుతుంది.
  10. అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి.

ప్రశ్న 2.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

మొక్క పేరువ్యాప్తి చెందే పద్ధతి
1. మామిడిఅంటుకట్టడం
2. గులాబి, మందారఛేదనం
3. మల్లెఅంటు తొక్కడం
4. రణపాలఆకు అంచుల నుండి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి
5. బంగాళదుంపదుంప
6. ఉల్లిలశునం

i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
జవాబు:
పట్టికలో సూచించినవి శాఖీయోత్పత్తి విధానాలు.

ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడి సంయోగం చెందుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడవు.

iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
జవాబు:
బంగాళదుంప మొక్కలు ‘కన్నులు’ అనే శాఖీయోత్పత్తి విధానంలో వ్యాప్తి చెందును.

iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
శాఖీయోత్పత్తిలో మొక్కల నాణ్యత మారదు. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 3.
వివిధ మొక్కలలో అవలంభించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు :
a) అంటు తొక్కుట :
మల్లె, జాజి వంటి పుష్ప, మొక్కలు బలహీన కాండాలను కల్గి ఉంటాయి. వీటి బెరడును కొంచెం తొలగించి, భూమిలో పాతిపెట్టి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయు పద్దతిని అంటు తొక్కుట అంటారు.

b) అంటుకట్టుట :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు. ఈ ప్రక్రియలో క్రింది భాగాన్ని (వేరు కల్గిన భాగం) స్టాక్ అని, పైన పెరిగిన భాగాన్ని సయాన్ అని అంటారు.
ఉదా : గులాబి, మామిడి.

c) కణజాల వర్ధనం :
ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. కణజాలాన్ని కాలలో పెంచి మొక్కలుగా పెంచుతారు. ఇది నియంత్రిత పరిస్థితులలో జరుగుతుంది.

ప్రశ్న 4.
క్రింది పటాల ఆధారంగా కణ విభజనలోని వివిధ దశలను గుర్తించి, వివరించండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 14
జవాబు:

దశవివరణ
A) ప్రథమదశ1. క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా, దళసరిగా మారతాయి. (కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించేలా తయారవుతాయి.) కేంద్రకం చిన్నదవుతుంది.
2. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి
సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి.
3. కేంద్రకత్వచం అంతర్థానమవుతుంది.
4. కడ్డీ వంటి సెంట్రియోలను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె పరికరాన్ని ఏర్పరుస్తుంది. (జంతు కణాలలో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయి. క్షయకరణ విభజన వలె క్రోమోజోమ్ లు జతలుగా ఏర్పడవు.)
B) మధ్యస్థదశ1. క్రోమోజోమ్ లు కండె. ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి.
2. సెంట్రోమియర్ చీలిపోయి రెండు క్రొమాటిడ్లు వేరవుతాయి.
C) చలనదశ1. సెంట్రోమియర్లను అంటి ఉన్న కండె తంతువులు సంకోచం చెందడం వలన క్రొమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి.
D) అంత్యదశ1. క్రొమాటిద్దు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనబడవు. తిరిగి క్రోమోజోమ్లుగా మారుతున్నాయన్నమాట.
2. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి.
3. కణ త్వచంలో నొక్కు ఏర్పడటం ద్వారా రెండు పిల్ల కేంద్రాలు వేరవుతాయి. (జంతు కణాలలో), అదే మొక్కలలో అయితే కండే పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణఫలకం ఏర్పడటం ద్వారా రెండు కేంద్రకాలు వేరవుతాయి.
4. కేంద్రకం రెండుగా విడిపోతుంది. తరువాత సైటోప్లాజమ్ విభజన జరుగుతుంది. రెండు కణాలు ఏర్పడతాయి.

ప్రశ్న 5.
సమ విభజనలోని వివిధ దశలేవి ? వాటిని సూచించే బొమ్మలు గీసి, ప్రథమ దశలో ఏ మార్పులు జరుగుతాయో వివరించండి.
జవాబు:
1) ప్రథమ దశ 2) మధ్యస్థ దశ 3) చలనదశ 4) అంత్యదశ
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15

ప్రథమదశలో జరిగే మార్పులు :

  1. క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది పొట్టిగా మారతాయి. కేంద్రకం చిన్నదవుతుంది.
  2. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి.
  3. కేంద్రక త్వచం అంతర్థానమవుతుంది.
  4. కడ్డీ వంటి సెంట్రియోల్స్ ను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 6.
చక్కని అండాశయం నిర్మాణం పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 11

ప్రశ్న 7.
పుష్పించే మొక్క జీవిత చరిత్రను తెలిపే పటం గీయండి. బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15
బీజదళాలు మొక్కలో పత్రాలు ఏర్పడే వరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 8.
పటమును పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 16
ఎ) పుష్పంలోని నాలుగు ప్రధాన భాగములేవి?
బి) పటంలో బీజకణాలను ఉత్పత్తి చేసే నిర్మాణాలేవి?
సి) పరాగ సంపర్కానికి తోడ్పడే భాగాలేవి?
డి) మొగ్గదశలో పుష్పాన్ని రక్షించు నిర్మాణాలేవి?
ఇ) పటంలోని ఏ భాగం భవిష్యత్ లో ఫలంగా మారుతుంది?
జవాబు:
ఎ) 1. రక్షక పత్రావళి, 2. ఆకర్షక పత్రావళి, 3) కేసరావళి, 4) అండకోశం
బి) కేసరావళి, అండకోశం సి) ఆకర్షక పత్రావళి డి)రక్షక పత్రావళి ఇ) అండకోశం

ప్రశ్న 9.
కొన్ని జీవులు అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తిని వివిధ రకాలుగా జరుపుకుంటాయి. క్రింద ఇవ్వబడిన జీవులను మరియు వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని నీవు సేకరించిన సమాచారం ఆధారంగా సరైన విధంగా పట్టికలో నింపండి.
ఉల్లి, స్పెరోగైరా, స్ట్రాబెర్రీ, అల్లం, తేనెటీగలు, పారామీషియం , ప్లనేరియా, ఈస్ట్.
జవాబు:

జీవి పేరుఅది జరిపే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం
1. ఉల్లిలశునం
2. స్పెరోగైరాముక్కలగుట
3. స్ట్రాబెర్రీస్టోలన్
4. అల్లంకొమ్ములు
5. తేనెటీగలుఅనిషేక ఫలనం
6. పారామీషియంద్విధావిచ్ఛిత్తి
7. ప్లనేరియాపునరుత్పత్తి
8. ఈస్ట్కోరకీభవనం

ప్రశ్న 10.
i) పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములు గుర్తించుము.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 17

ii) పుష్పంలో గల లైంగిక అవయవాలు ఏవి?
ఎ) కేసరావళి బి) అండకోశం

ప్రశ్న 11.
ప్రయోగశాలలో రైజోపస్ యొక్క సిద్ధబీజాశయాలను గమనించుటకు అవలంబించు ప్రయోగ విధానము మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించండి.
(లేదా)
రైజోపసను పరిశీలించుటకు మీరు నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన సామగ్రి మరియు ప్రయోగ విధానమును రాయండి.
జవాబు:
పరికరాలు : సూక్ష్మదర్శిని, బ్రెడ్, ప్లాస్టిక్ సంచి, నీరు సైడ్, కవర్ స్లిప్.
తయారీ విధానం :

  1. బ్రెడ్ నుగాని, రొట్టెను గాని నియమిత పరిస్థితులలో ఉంచి రైజోపస్ లేదా బూజును పెంచాలి.
  2. ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి దానిపై నీళ్ళు చల్లాలి. అది తేమను గ్రహిస్తుంది. ఇప్పుడు సంచిలో కొంత గాలి ఉండేలా దారంతో ముడి వేయండి.
  3. చీకటి మరియు వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. 2-3 రోజుల్లో బూజు పెరగడం మొదలై 1-2 వారాల్లో పూర్తిస్థాయిలో పెరుగుతుంది.

పరిశీలన :

  1. ఒక గాజు సైడ్ తీసుకొని దానిపై మధ్యలో ఒకచుక్క నీరువేసి పంటి పుల్లతో కొంత బూజు తీసుకొని స్లెడ్ మధ్యలో ఉంచాలి.
  2. దానిపై కవర్‌తో నీటి బుడగలు లేకుండా అమర్చాలి.
  3. అధికంగా ఉన్న నీటిని టిష్యూ పేపరుతో తొలగించాలి. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
  4. రైజోపసను చేతితో ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

జాగ్రత్తలు :

  1. బూజును పెంచే సంచిని మిగతా ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
  2. రొట్టెను చేతితో పట్టుకుంటే, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ప్రశ్న 12.
మొక్కలలో జరిగే ద్విఫలదీకరణను వివరించండి. దీని తర్వాత ఏర్పడే అంకురచ్ఛదం ఉపయోగాలను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం :
పుష్పించే మొక్కలలో పరాగరేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగ నాళం పిండకోశంలోనికి ప్రవేశించగానే కొన భాగం పగిలిపోయి రెండు పురుషబీజకణాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. మరొక పురుషబీజ కణం పిండకోశం మధ్యలోనున్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదం ఏర్పరుస్తుంది ఇలా ఫలదీకరణం రెండు సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు.

  1. అంకురచ్ఛదాన్ని ఉపయోగించుకుని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి.
  2. అంకురచ్ఛదంలో నిలువ చేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
  3. కొన్ని మొక్కల బీజదళాలు అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకుని విత్తనాలుగా మారుతాయి.
  4. పోషక పదార్థాల నిలువలు పెరగటం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది.

ప్రశ్న 13.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధాణాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 18
i) స్త్రీ సంయోగ బీజాన్ని ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి?
జవాబు:
స్త్రీ బీజకోశము (అండాశయము)

ii) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
స్త్రీ బీజవాహిక (ఫాలోపియన్ నాళము)

iii) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండము అభివృద్ధి చెందు ప్రాంతం ఏమిటి?
జవాబు:
గర్భాశయము

iv) కొన్ని సందర్భాలలో వైద్యులు ఫాలోఫియన్ నాళాన్ని కత్తిరించి ముడి వేస్తారు. ఈ ఆపరేషన్ పేరు ఏమిటి ?
జవాబు:
ట్యూబెక్టమీ

ప్రశ్న 14.
మొక్కలలో జరిగే కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి.
జవాబు:
1. కృత్రిమ శాఖీయ విధానాలు
i) ఛేదనం ii) అంటు తొక్కుట iii) అంటుకట్టుట

2. i) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్కభాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి క్రొత్త మొక్క పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార

3. ii) అంటుతొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగివున్న శాఖను నేలవైస వంచి నా ప ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కప్పివుంచిన భాగం నుంచి కొత్తవేరు అని
కొమ్మను జనక మొక్క నుండి వేరుచేయాలి. ఉదా : మల్లె, గన్నేరు.

4. iii) అంటుకట్టుట :
రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి, ఒక మొక్కగా పెరుగుతాయి. నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్కనుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అనీ అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి, పురివున్న దారంతో కట్టాలి.
ఉదా : ఆపిల్, మామిడి

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 15.
కింది ఇచ్చిన సమాచారాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రతి జీవిలో రెండు రకాల కణ విభజనలు జరుగుతాయి. సమ విభజనలో క్రోమోజోమ్ సంఖ్య (20) లో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి (1) కు తగ్గుతుంది, అని వీసమన్ ఎరికల్పన చేశాడు.
i) ‘n’ మరియు ‘2n’ అనేవి వేటిని సూచిస్తాయి?
జవాబు:
‘n’ ఏకస్థితికమును, ‘2n’ ద్వయ స్థితికమును సూచిస్తాయి.

ii) క్షయకరణ విభజన ఏ కణాలలో జరుగుతుంది?
జవాబు:
లైంగిక కణాలలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన జరుగుతుంది.

iii) క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే క్రోమోజోముల సంఖ్య తరువాత తరాలలో స్థిరంగా వుండదు.

iv) చర్మ కణాలు ఏ రకం అయిన కణవిభజనను జరుపుతాయి?
జవాబు:
చర్మ కణాలు సమవిభజనను జరుపుతాయి.

ప్రశ్న 16.
తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు పొందుటకు రెండు సహజ మరియు రెండు కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులను ఉదాహరణలతో తెలుపండి.
జవాబు:
I. సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
ఉదా : రణపాల

2) కాండాలు:
1) స్టోలన్స్ : ఉదా : మల్లె, స్ట్రాబెర్రీ,
2) లశునాలు : ఉదా : ఉల్లి,
3) కొమ్ములు : ఉదా : పసుపు, అల్లం,
4) దుంపలు : ఉదా : బంగాళాదుంప

3) వేర్లు : ఉదా : డాలియా, ముల్లంగి, క్యారెట్

II. కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరుచేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార,

2) అంటు తొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగి వున్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తర్వాత ఈ కప్పి వుంచిన భాగం నుండి కొత్తవేర్లు ఉత్పత్తి అవుతాయి.
ఉదా : మల్లె, గన్నేరు.

3) అంటు కట్టుట:
i) రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కల్సిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
ii) నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు.
iii)’స్టాక్’, ‘సయాన్’ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి దారంతో కట్టాలి. ఉదా : మామిడి, నిమ్మ, ఆపిల్, గులాబి.

ప్రశ్న 17.
కింద నటికను పరిశీలించండి.

ప్రత్యుత్పత్తి విధానంజీవులు
విచ్చిత్తిపారామీషియం, బాక్టీరియా
కోరకీభవనంఈస్ట్, హైడ్రా
ముక్కలగుటస్పెరోగైరా, బద్దె పురుగులు
కొమ్ములుపసుపు, అల్లం
ఛేదనంగులాబి, మందార
అంటుకట్టుటనిమ్మ, ఆపిల్

పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(i) పై పట్టికలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే రెండు జీవుల పేర్లు రాయండి.
(ii) సై పట్టికలో సూచించిన వాటిలో రెండు కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలను రాయండి.
(iii) పై వాటిలో సహజ శాఖీయ వ్యాప్తి జరిపే రెండు మొక్కల పేర్లు రాయండి.
(iv) విచ్ఛిత్తి ద్వారా ఒక జీవి నుండి ఎన్ని జీవులు ఏర్పడతాయి?
జవాబు:
1. పారామీషియం, బాక్టీరియా, ఈస్ట్, హైడ్రా
2. (ఎ) ఛేదనము (బి) అంటుకట్టుట
3. (ఎ) పసుపు (బి) అల్లం
4. విచ్చిత్తి – ద్విదా విచ్చిత్తి – రెండు జీవులు ఏర్పడతాయి.
(లేదా)
విచ్ఛిత్తి – బహుదా విచ్ఛిత్తి – రెండు కంటే ఎక్కువ జీవులు ఏర్పడతాయి.

ప్రశ్న 18.
మొక్కలలోని సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 19 AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 20
సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.

కాందాలు :
రన్నర్లు, సోలన్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాండం ద్వారా జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.

స్టోలన్లు – వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ, లశునాలు – ఉల్లి; కొమ్ములు – పసుపు; దుంప – బంగాళదుంప.

వేర్లు :
దాలియా, ముల్లంగి, క్యారట్ మొదలగు వాటిపై పెరిగే చిన్నచిన్న మొగ్గలు, పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి.

ప్రశ్న 19.
అంటుకట్టుట గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 21
అంటుకట్టుట (Grafting) :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు.

ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని, వేరే మొక్క నుండి వేరుచేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 20.
సిద్ధబీజాల గురించి రాయండి.
జవాబు:

  1. శిలీంధ్రాలలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
  2. శిలీంధ్రాలలో సిద్ధబీజాలు ఏర్పడే పద్ధతిని స్పోరులేషన్ అంటారు.
  3. సిద్ధబీజము ఒక సూక్ష్మమైన, ఏకకణ ప్రత్యుత్పత్తి చేసే ప్రమాణం.
  4. శిలీంధ్రాలలో సిద్ధబీజములు సిద్ధబీజాశయము అనే ప్రత్యేకమైన నిర్మాణంలో ఏర్పడతాయి.
  5. సిద్ధబీజాశయములోని కేంద్రకము అనేక సార్లు సమవిభజన చెంది, అనేక సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది.
  6. సిద్ధబీజాలు అనుకూల పరిస్థితులలో అంకురించి పెక్కు తంతువులతో ఒక పెద్ద జీవిగా ఏర్పడతాయి.

ప్రశ్న 21.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 9
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండు ముష్కాలు బాహ్యంగా ఉండే సంచిలాంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. దీనినే ముష్కగోణి అంటారు. ముష్కాలలో అధిక సంఖ్యలో మిలియన్ల కొద్దీ పురుష బీజకణాలైన శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను తెలుసుకోవడానికి మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటంను పరిశీలించండి. ప్రతీ ముష్కంలో చాలా లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో బాగా మెలితిరిగి చిన్న చిన్న నాళికలు ఉంటాయి. వీటిని శుక్రోత్పాదక నాళికలు అంటారు. ఇవి దాదాపు 80 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. శుక్రనాళికలు శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలను సేకరిస్తాయి. శుక్రనాళికలన్నీ కలిసి ఎపిడిడిమిసను ఏర్పరుస్తాయి. ఇక్కడ శుక్ర కణాలు తాత్కాలికంగా నిలువ ఉంటాయి. ఇక్కడి నుండి శుక్రనాళం ద్వారా ప్రసేకంలోనికి, అక్కడి నుండి శరీరం వెలుపలికి వెలువడుతాయి.

ప్రశ్న 22.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 10

  1. స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలుంటాయి. ఇవి ఉదరకుహరంలో మూత్రపిండాలకు దిగువగా ఉంటాయి.
  2. ఒక్కొక్క అండకోశంలో అనేక సంచీల్లాంటి నిర్మాణాలున్నాయి. వీటిని స్త్రీ బీజకోశ పుటికలు లేక గ్రాఫియన్ పుటికలు అంటారు.
  3. ప్రతి పుటికలోనూ పెద్దగా ఉండే ఒక అండము ఉంటుంది.
  4. పుటిక నుండి విడుదలయిన అండము ఫాలోపియన్ నాళములోనికి ప్రవేశిస్తుంది.
  5. ఈ నాళం పుర్వాంతము వేళ్ళలాంటి అనేక నిర్మాణాలను కలిగి ఉంటుంది.
  6. దీనికి శైలికలు కూడా ఉంటాయి. ఇవి అండము ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయంలోకి కదలడానికి తోడ్పడుతాయి.
  7. గర్భాశయము దృఢంగా కండరయుతంగా ఉండే కోశము వంటి నిర్మాణము.
  8. ఇది యోని అను కండరయుత నాళంలోకి తెరచుకొని ఉంటుంది.

ప్రశ్న 23.
పిండాన్ని చుట్టి ఉంచు పొరలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 22

  1. పెరుగుతున్న పిండము తన చుట్టూ రెండు పొరలను ఏర్పరుచు కుంటుంది.
  2. అవి 1) పరాయువు 2) ఉల్బం
  3. పరాయువు గర్భాశయ గోడతో సంబంధం ఏర్పరుచుకొని, పిండానికి ఉల్బం పోషక పదార్థాలను అందజేయటంలోనూ, పిండము నుండి విసర్జక పదార్థాలను తీసివేయటంలోనూ సహాయపడుతుంది.
  4. ఉల్బము పిండము చుట్టూ ఉండే ఒక సంచి వంటి నిర్మాణము.
  5. ఇందులో ఉల్బక ద్రవముంటుంది. ఇది పిండమును యాంత్రిక అఘాతముల నుండి రక్షిస్తుంది.
  6. మరొక త్వచం ఎల్లంటోయిస్ పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది.
  7. సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిసే నాళాన్ని ఏర్పరుస్తుంది.
  8. ఈ నాళాన్ని నాభిరజువు (Umbellical cord) అంటారు.

ప్రశ్న 24.
శిశు జనన ప్రక్రియను వివరించండి.
జవాబు:

  1. శిశుజననం, గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటినొప్పులు అని భావిస్తాం.
  2. ముందుగా గర్భాశయ కండర సంకోచ సడలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకుల్య అయిన యోని వైపునకు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తాయి.
  3. ఈ దశలో శిశువును ఆవరించియున్న ఉల్బం పగిలి అందులోని ద్రవ పదార్థాలు బయటకు విడుదలవుతాయి.
  4. ప్రసవం సరియైన విధానంలో జరుగుతోంది. అనడానికి ఇది ఒక సరయిన సంకేతం.
  5. అప్పుడు గర్భాశయ కండరాల సంకోచాలు బలంగా, అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోనికి నెట్టబడుతుంది.

ప్రశ్న 25.
శిశు జననానికి ముందు గర్భాశయంలో కలిగే మార్పులు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 23

  1. గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్న పిండం పెరిగి రూపుదాల్చుకుంటుంది.
  2. భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది.
  3. సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు, గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కిందివైపునకు గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది.
  4. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది.
  5. కొన్ని సమయాలలో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రసవం చాలా కష్టం.
  6. శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. దీనిని ఒక సంక్లిష్టమైన దృగ్విషయంగా భావిస్తారు.

ప్రశ్న 26.
పుష్ప నిర్మాణం వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 24
పుష్పమునకు గల కాడను పుష్పవృంతం అంటారు. దీని చివరి భాగం ఉబ్బి ఉంటుంది. దీనిని పుష్పాసనం అంటారు. దీనిపై సాధారణంగా (1) రక్షక పత్రాలు (2) ఆకర్షక పత్రాలు (3) కేసరావళి (4) అండకోశము అను పుష్పభాగాలు వివిధ వలయాలలో అమరి ఉంటాయి.

1) రక్షక పత్రములు :
ఇవి మొదటి వలయంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఇవి మొగ్గదశలో, పుష్పం లోపలి భాగాలను కప్పి ఉండి రక్షణనిస్తాయి.

2) ఆకర్షక పత్రములు :
ఇవి పుష్పం యొక్క రెండవ వలయంలో వివిధ వర్ణములను, సువాసనను కలిగి, కీటకాలను పరాగ సంపర్కం కోసం ఆకర్షించటానికి సహాయపడతాయి.

3) కేసరావళి :
ఇవి పుష్ప మూడవ వలయంలో ఉంటాయి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. కేసరావళి, కేసరదండము, పరాగకోశము అను భాగాలను కలిగి ఉంటుంది. పరాగకోశాలలో పరాగరేణువులు తయారవుతాయి.

4) అండకోశము :
ఇవి పుష్పాసనం నాల్గవ వలయంలో ఉండే భాగము. ఇది అండాశయము, కీలము, కీలాగ్రము అను భాగాలను కలిగి ఉంటుంది. అండాశయములో అండములు ఉంటాయి. ఇవి అండాశయంలో అండన్యాస స్థానం వద్ద అమరి ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 27.
అండం యొక్క నిర్మాణం వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 25

  1. స్త్రీ సంయోగబీజాన్ని అండం అంటారు.
  2. అండాశయములోని అండన్యాస స్థానమునందు అండములు అండ వృంతము ద్వారా చేర్చబడి ఉంటాయి.
  3. అండములోని కణజాలాన్ని, అండాంత కణజాలము అంటారు. అండము రెండు పొరలచే లేక అండ కవచములచే కప్పబడి ఉంటుంది.
  4. ఈ రెండు కవచాలు అండాన్ని పూర్తిగా కప్పకుండా ఒక చిన్న రంధ్రాన్ని వదులుతాయి. దాన్ని అండ ద్వారము అంటారు.
  5. అండం క్రింద భాగములో రెండు కవచములు ప్రారంభమయ్యే స్థలాన్ని ఛలాజా అని పిలుస్తారు.
  6. అండాంత కణజాలము నుండి ఒక కణము స్థూల సిద్ధబీజ మాతృకణముగా విభేదనము చెందుతుంది. ఇది ద్వయక స్థితిలో (2n) ఉంటుంది.
  7. క్షయకరణ విభజన ద్వారా ఈ మాతృకణము నాలుగు సూలసిద్ధ బీజాలను ఇస్తుంది. వీటిలో ఒకటి మాత్రమే పిండకోశముగా అభివృద్ధి చెందుతుంది.
  8. ఇది ఏక స్థితిదశలో ఉంటుంది. దీనిని స్త్రీ సంయోగ బీజదము అని అంటారు.

ప్రశ్న 29.
ఫలదీకరణ తరువాత పుష్పంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణము తరువాత పుష్పభాగాలలో అనేక మార్పులు వస్తాయి.

  1. అండాశయము ఫలముగాను, అండము విత్తనముగాను మారుతుంది.
  2. అండము యొక్క రెండు కవచములు విత్తనములపై కవచంగాను, లోకవచంగాను మారుతాయి.
  3. అండకోశపు కీలము, కీలాగ్రము రాలి పోతాయి.
  4. కొన్ని సందర్భాలలో రక్షణ పత్రాలు పొడిగా అయి ఫలదీకరణం తరువాత ఉండిపోతాయి.
  5. పుష్పములో కేసరాలు, ఆకర్షణ పత్రావళి కూడా పడిపోతాయి.

ప్రశ్న 30.
ద్విఫలదీకరణ అనగా నేమి?
జవాబు:

  1. జంతువులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది.
  2. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్ఛదం ఏర్పడతాయి.
  3. పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి.
  4. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి.
  5. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి అండాన్ని చేరుతుంది.
  6. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది.
  7. ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్ధాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.

ప్రశ్న 31.
కణవిభజన చరిత్ర గురించి తెలపండి.
జవాబు:

  1. కణాలు అంతకు ముందు ఉన్న కణాల నుండే ఉత్పన్నమవుతాయని “విర్చోవ్” మొదట ప్రతిపాదించాడు.
  2. 1852 లో “రాబర్ట్ రెమెక్” కణవిభజన గురించి పరిశోధన జరిపాడు.
  3. “వాల్టర్ ఫ్లెమింగ్” 1879లో, కణవిభజన సమయంలో కణ కేంద్రకంలో దారపుపోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు.
  4. “విల్ హెల్మ్ రాక్స్” ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైన విభిన్నమైన అంశాలను కలిగి ఉంటుందని తెలిపాడు.
  5. “గ్రెగర్ మెండల్” బఠాని మొక్కలో పరిశోధనలు జరిపి, అనువంశికతా సూత్రాలను తెలిపాడు.
  6. “వాట్సన్ మరియు క్రిక్”లు క్రోమోజోమ్స్ DNA తో నిర్మితమవుతాయని DNA ద్వికుండలి నిర్మాణం కలిగిఉంటుందని నిరూపించారు.

ప్రశ్న 32.
కణచక్రంలోని దశలు తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 3
సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన (mitosis) అంటాము. అది 40 నుంచి 60 నిమిషాలల్లోనే పూర్తవుతుంది. (సరిగ్గా విభజనకై తీసుకొనే సమయం), రెండు కణ విభజనలకు మధ్య నుండే సమయాన్ని అంతర్దశ (interphase) అంటారు. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు.

G1 దశ : ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది.
S దశ : ఇది DNA సంశ్లేషణ జరిగే దశ. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి.
G2 దశ : ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్యగల దశ. కణాంగాలు విభజన చెందుతాయి. క్రోమోజోమ్లు సమవిభజనకు సిద్ధమవుతాయి.
M దశ : ఇది సమవిభజన జరిగే దశ.

ప్రశ్న 33.
కణ విభజనలోని దశలను వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 26

ప్రశ్న 34.
క్షయకరణ విభజన గురించి రాయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 6
క్షయకరణ విభజన (Meosis) :

  1. శరీర కణాలన్నింటిలో సాధారణంగా జరిగే సమ విభజన వలె కాకుండా క్షయకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడేటప్పుడే జరుగుతుంది.
  2. క్షయకరణ విభజన రెండు దశలలో ఉంటుంది.
  3. మొదటి దశ క్షయకరణ విభజన మాతృకణాలలో జరుగుతుంది. (రెండు జతల క్రోమోజోమ్లుంటాయి.)
  4. రెండుసార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది.
  5. రెండవ దశ సాధారణ సమవిభజన మాదిరిగా ఉంటుంది.
  6. క్రోమోజోమ్ విభజన జరగదు. కాబట్టి పిల్లకణాలకు క్రోమోజోమ్లు సమానంగా పంచబడతాయి. అందువల్ల నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
  7. కానీ మాతృకణాల కంటే సగం క్రోమోజోమ్ లనే కలిగి ఉంటాయి. కనుక వీటినే ఏకస్థితికాలు (ఒకే జత క్రోమోజోమ్ లు ఉంటాయి) అంటారు.
  8. ఈ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. కనుక ఈ విభజనను క్షయకరణ విభజన (Reduction division) అంటారు.

ప్రశ్న 35.
మన రాష్ట్రంలో AIDS విస్తరణ గురించి రాయండి.
జవాబు:
దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2011-12 సం|| ప్రభుత్వ గణాంకాల ప్రకారం 24 లక్షలకు పైగా HIV పాజిటివ్ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించారు.

ప్రతి సంవత్సరం రాష్ట్ర జనాభాలో పురుషులలో 1.07 శాతం, స్త్రీలలో 0.73 శాతం మంది HIV కి గురువుతున్నారు. ఇదికూడా ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న వారిలో ముఖ్యంగా 15-49 సంవత్సరాల వయసుల సమూహంలో 0.09 శాతం ఉండగా గర్భిణీలో 1.22 శాతం మంది ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

నిరక్షరాస్యత, అనారోగ్యం , నిరుద్యోగం, వలసలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు పాటించకపోవడం, విచ్చలవిడితనం, వ్యభిచారం మొదలైనవి HIV ప్రబలడానికి కారణం అవుతున్నాయి.

ప్రశ్న 36.
గర్భనిరోధం అనగానేమి? కొన్ని గర్భనిరోధ పద్దతులు సూచించంది.
జవాబు:
స్త్రీ గర్భం ధరించకుండా ఉండటం కోసం ఫలదీకరణం జరగకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవడాన్ని గర్భనిరోధం (Contraception) అంటారు. ఏదేని ఉపకరణం లేదా రసాయనం (మందులు) ఉపయోగించి స్త్రీలలో గర్భధారణను అడ్డుకుంటే దానినే గర్భనిరోధక సాధనం (Contraceptive) అంటారు.

ప్రస్తుతం గర్భనిరోధక విధానాలెన్నో అందుబాటులో ఉన్నాయి. భౌతికపరమైన ఉపకరణాలుగా కండోమ్ లు మరియు డయాఫ్రము (Cap) మొదలైనవి ఉపయోగించవచ్చు. ఇలా కేవలం ఫలదీకరణ ప్రక్రియనే కాకుండా లైంగిక అంటువ్యాధులు (Sexally Transmitted Diseases (STD) వ్యాపించకుండా కూడా అరికట్టడంలో ఉపయోగపడతాయి.

ఇవి కాకుండా ఇతర గర్భనిరోధక మార్గాలేవీ కూడా లైంగిక వ్యాధుల వ్యాప్తిని నిరోధించలేవు. నోటి ద్వారా తీసుకొనే మాత్రలు లేదా స్త్రీ లైంగిక అవయవాలలో ఉంచే మాత్రలలోని రసాయనాలు లేదా హార్మోన్లు అండాశయాలు అండాన్ని విడుదల చేయకుండా ఫలదీకరణం జరగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో పురుషుల కోసం కూడా ఇలాంటి మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఆ మాత్రల వలన శుక్రకణాలు చనిపోతాయి. కనుకనే వీటిని శుక్రకణనాశినులు లేదా స్పెర్మిసైడ్స్ (Spermicides) అని అంటారు.

గర్భాశయ ద్వారంలో అమర్చడానికి వీలైన కాపర్ – T, లూప్ మొదలైనవి ఎంతో ప్రభావవంతమైన గర్భనిరోధక సాధనాలుగా ఉపయోగపడతాయి. అవాంఛిత గర్భధారణ కాకుండా గర్భనిరోధక సాధనంగా కాపర్ – T ని ఉపయోగిస్తే అది గర్భాన్ని రాకుండా నిరోధించవచ్చు. కానీ, భాగస్వామికి ఒకవేళ ఏదేని లైంగిక అంటువ్యాధి ఉంటే దానిని ఆపలేదు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
భ్రూణహత్యలు అనగానేమి? దానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
గర్భస్థ శిశువులను గర్భవిచ్ఛిత్తి ద్వారా చంపటాన్ని భ్రూణహత్యలు అంటారు. ఇది ప్రధానంగా లింగవివక్ష ఆధారంగా జరగటం బాధాకరవిషయం.

కారణాలు :

  1. సమాజంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఉండటం.
  2. ఆడపిల్లల పెంపకం, కట్నకానుకలు, వ్యయభరితంగా మారటం.
  3. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం.
  4. గర్భధారణపై అవగాహన లేక అవాంఛిత గర్భం దాల్చటం.
  5. నైతిక విలువలు లేక పెళ్ళికి ముందు గర్భం దాల్చటం వంటి కారణాలు భ్రూణహత్యలకు కారణమవుతున్నాయి.

ప్రశ్న 38.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 27
a) పటంలో చూపబడిన వ్యవస్థ ఏ జీవక్రియను నిర్వహిస్తుంది?
b) పురుష సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) వేసక్టమి ఆపరేషన్లో ఏ భాగాన్ని కత్తిరిస్తారు?
d) ముష్కాలు వేనిలో అమరి ఉంటాయి?
e) పటంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన వ్యవస్థ ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తుంది.
b) పురుష సంయోగబీజాలు ముష్కాలలో ఉత్పత్తి అవుతాయి.
c) వేసక్టమి ఆపరేషన్లో శుక్రవాహికలను కత్తిరిస్తారు.
d) ముష్కాలు ముష్కగోణులలో అమరి ఉంటాయి. –
e) ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ‘మూత్రాశయం’.

ప్రశ్న 39.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 28
a) శుక్ర కణంలోని మూడు ప్రదానభాగాలు ఏమిటి?
b) శుక్రకణం చలనానికి తోడ్పడు నిర్మాణం ఏమిటి?
c) శుక్రకణ చలనానికి శక్తిని అందించే మైటోకాండ్రియాలు ఏ భాగంలో ఉంటాయి?
d) ఆక్రోసోమ్ ప్రయోజనం ఏమిటి?
e) మానవ శుక్రకణ కేంద్రకంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి?
జవాబు:
a) శుక్ర కణంలో 1) తల 2) మధ్యభాగం 3) తోక అనే మూడు భాగాలు ఉంటాయి.
b) శుక్రకణ చలనానికి తోక ఉపయోగపడును.
c) మైటోకాండ్రియాలు మధ్యభాగంలో ఉంటాయి.
d) ఎక్రోసోమ్ అండంలోనికి చొచ్చుకుపోవటానికి తోడ్పడుతుంది.
e) శుక్రకణంలో 23 క్రోమోజోమ్లు ఉంటాయి.

ప్రశ్న 40.
ప్రక్కపటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 18
a) పటంలో చూపబడిన కండరయుత సంచి వంటి నిర్మాణం ఏమిటి?
b) స్త్రీ సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) ట్యూబెక్టమీలో కత్తిరించబడే భాగాలు ఏమిటి?
d) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
e) గర్భాశయ గ్రీవం ఏ భాగంలోనికి తెరుచుకొంటుంది?
జవాబు:
a) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కండరయుత సంచి వంట నిర్మాణం గర్భాశయం.
b) స్త్రీ సంయోగబీజాలు స్త్రీ బీజకోశంలో ఉత్పత్తి అవుతాయి.
c)ట్యూబెక్టమీలో ఫాలోపియన్ నాళాలు కత్తిరించబడతాయి.
d) మానవునిలో ఫలదీకరణ ఫాలోపియన్ నాళాలలో జరుగును.
e) గర్భాశయ గ్రీవం యోనిలోనికి తెరుచుకొంటుంది.

ప్రశ్న 41.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 29
a) పటంలో చూపబడిన భాగము ఏమిటి?
b) ఈ నిర్మాణంలో ఎన్ని కణాలు ఎన్ని గుంపులుగా ఉంటాయి?
c) ఈ నిర్మాణంలో ద్వయ స్థితిక కణము ఏమిటి?
d) పై వైపున ఉన్న మూడు కణాలను ఏమంటారు?
e) సీబీజ కణం మొక్క స్థానం ఏమిటి?
జవాబు:
a) పటములో చూపబడిన నిర్మాణాన్ని ‘పిండకోశం’ అంటారు.
b) పిండకోశంలో ఏడు కణాలు మూడు గుంపులుగా ఉంటాయి.
c) ద్వితీయ కేంద్రకం ద్వయస్థితిక దశలో ఉంటుంది.
d) పై వైపున ఉన్న మూడు కణాలను ప్రాతిపదిక కణాలు అంటారు.
e) క్రింద ఉన్న మూడు కణాలలో మధ్యకణం స్త్రీ బీజకణము.

ప్రశ్న 42.
అంటుకట్టడం ద్వారా ఏ ఏ మొక్కలను పెంచుతారో మీ గ్రామంలోని తోట యజమానిని అడిగి తెల్సుకోవడానికి ప్రశ్నల జాబితా రాయండి. తెలుసుకున్న సమాచారాన్ని నమోదు చేయడానికి నమూనా పట్టిక రాయండి.
జవాబు:

  1. అంటుకట్టడం అనగానేమి?
  2. అంటుకట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?
  3. అంటుకట్టడం వలన వ్యాప్తి చెందించబడే మొక్కలు ఏవి?
  4. అంటుకట్టడం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొక్కలు వ్యాధులను తట్టుకొని నిలబడగలుగుతాయా?
  5. అంటుకట్టడం ద్వారా కొత్త మొక్క రావడానికి ఎంత సమయం అవసరం అవుతుంది?
  6. వాంఛిత లక్షణాలు కలిగిన మొక్కలను అంటుకట్టడం ద్వారా పొందవచ్చా?
  7. అంటుకట్టడంలో నేల యందు గల మొక్క భాగాన్ని ఏమంటారు?
  8. అంటుకట్టడంలో నేలయందున్న మొక్క భాగానికి జతకట్టబడిన భాగాన్ని ఏమంటారు?

ప్రశ్న 43.
పుష్పించే మొక్క జీవితచక్రం పటం గీచి, భాగాలు గుర్తించండి. మొక్క జీవితచక్రంలో ఏకస్థితిక నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15
మొక్క జీవిత చక్రంలో సంయోగబీజాలు (అండాలు, పరాగ రేణువులు) ఏకస్థితికంలో ఉంటాయి.

ప్రశ్న 44.
ఆరోగ్యం – పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కలిగించడానికి నీవు చేపట్టే కార్యక్రమాలు ఏమిటి?
జవాబు:

  1. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భముగా ఆరోగ్య సదస్సులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహింపచేస్తాను.
  2. సామూహిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమములు ఏర్పాటు చేయుటలో వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తాను.
  3. క్రిమిరహిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికి మాత్రలు సరఫరా అయ్యే విధంగా చూస్తాను.
  4. వ్యక్తిగత పరిశుభ్రత – ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులచే సెమినార్లు నిర్వహిస్తాను.
  5. చిన్న కుటుంబము యొక్క ఆవశ్యకతను వివరిస్తాను. కుటుంబ నియంత్రణను పాటించే విధంగా గ్రామస్తులను ప్రోత్సహిస్తాను.
  6. కరపత్రాలను ముద్రించి పంచుట ద్వారా సంతులిత ఆహారము యొక్క ప్రాధాన్యతను, తీసుకోవలసిన అవసరాన్ని తెలుపుతాను.
  7. మల మూత్రవిసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాను.
  8. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన పాఠశాలలు నెలకొల్పే విధంగా ప్రోత్సహిస్తాను.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 45.
మానవ శుక్రకణ నిర్మాణాన్ని పటసహాయమున వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5
శుక్రకణము :

  1. శుక్రకణానికి ఏక్రోజోమ్ మరియు కేంద్రకము కలిగిన తల ఉంటుంది.
  2. శుక్రకణం అండములోనికి ప్రవేశించటానికి ఏక్రోజోమ్ తోడ్పడుతుంది.
  3. మధ్యలో ఉండే పురుష కేంద్రకం, స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది.
  4. శుక్రకణం తల, మధ్యభాగం మెడతో కలుపబడతాయి.
  5. మధ్యభాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.
  6. తోక శుక్రకణం ముందుకు కదలటానికి తోడ్పడుతుంది.

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 30
జవాబు:
మొగ్గ తొడగటం

2.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 31
జవాబు:
ఆకులు

3.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 32
జవాబు:
రైజోమ్

4.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 33
జవాబు:
అంటు తొక్కుట

5.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 34
జవాబు:
ద్విదావిచ్ఛిత్తి

6.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 35
జవాబు:
పిండకోశం

7.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 36
జవాబు:
ఫెర్న్

8.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 37
జవాబు:
కేసరావళి

9.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 38
జవాబు:
ఏకలింగ పుష్పము

10.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 39
జవాబు:
కీలాగ్రం

11.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 40
జవాబు:
పరాగ సంపర్కం

12.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 41
జవాబు:
జీవ కారకాలు

13.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 42
జవాబు:
ఫలం

14.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 43
జవాబు:
ఎపిడిడిమిస్

15.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 44
జవాబు:
స్థలన నాళం

16.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 45
జవాబు:
ఫాలోపియన్ నాళం

17.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 46
జవాబు:
సంయుక్త బీజం

18.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 47
జవాబు:
క్షయకరణ విభజన

19.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 48
జవాబు:
S దశ

20.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 49
జవాబు:
మధ్య దశ

శాస్త్రవేత్తను కనుగొనండి

21. ఇతను కణ సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు, కణాలు అన్నీ ముందుగా ఉన్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి అని చెప్పాడు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ విర్కోన్

22. అతను జర్మన్ శాస్త్రవేత్త. 1952లో కణ విభజనపై తన పరిశీలనలను ప్రచురించాడు. ద్విదావిచ్ఛిత్తి జంతు కణాల ప్రత్యుత్పత్తి సాధనమని ఆయన పేర్కొన్నారు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ రీమాక్

23. కణాలలో విభజన సమయంలో కేంద్రకంలో నిలువుగా వీడిపోయే దాతాల వంటి నిర్మాణాలు గమనించాడు. అతను ఆ కణ విభజనకు సమ విభజన అని పేరు పెట్టాడు. అతను ఎవరు?
జవాబు:
వాల్తేర్ ఫ్లెమింగ్

24. జీవులలోని క్రోమోజోమ్ జననీ జనకుల నుండి సంక్రమిస్తాయని ప్రతిపాదించారు. అతను ఎవరు?
జవాబు:
విల్మ్ రూక్స్

25. అతను కంటిచూపు తక్కువగా ఉన్న జీవశాస్త్రవేత్త. వరుస కణ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని అతను ఊహించాడు. అతను ఎవరు?
జవాబు:
ఆగస్టు వీస్మాన్

26. 1904 లో సమ విభజన దశలు ఆయనచే ధృవీకరించబడినాయి. అతను ఎవరు?
జవాబు:
థియోడర్ బోవేరి

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

27. 1953లో వరుస ప్రయోగాల తరువాత జన్యు పదార్థం యొక్క రసాయన స్వభావం వారిచే నిర్ణయించబడింది. వారు ఎవరు?
జవాబు:
జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్

28. అతను కణ శాస్త్రవేత్త. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు. కణ సంలీన టెక్నిక్ ఉపయోగించి అంతర దశ నిర్మాణాన్ని ఆయన వెల్లడించారు. అతను ఎవరు?
జవాబు:
పోటు నరసింహారావు

విస్తరించుము

29. G1 దశ – పెరుగుదల దశ 1
30. Sదశ – సంశ్లేషణ దశ
31. S2 దశ – పెరుగుదల దశ 2
32. M దశ – సమ విభజన దశ
33. H.I – హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్
34. A.I.D.S – అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్
35. A.R.T – యాంటీ – రెట్రోవైరల్ థెరపీ
36. A.S.H.A – గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త
37. S.T.D – లైంగికంగా సంక్రమించే వ్యాధి
38. D.N.A – డీ ఆక్సిరైబో న్యూక్లిక్ ఆసిడ్

సరైన గ్రూపును గుర్తించండి

39. ఈ క్రింది సమూహాలలో ఏది సహజ శాఖీయ వ్యాప్తి పద్దతి కాదు?
ఎ) విచ్చిత్తి, మొగ్గ తొడగటం, ముక్కలు కావటం
బి) ఛేదనం, అంటు తొక్కుట, అంటుకట్టుట
జవాబు:
గ్రూపు-బి

40. కాండం ద్వారా ఏ మొక్కల సమూహం వ్యాప్తి చేయబడదు?
ఎ) క్యారెట్, బ్రయోఫిల్లమ్, ముల్లంగి
బి) మల్లె, ఉల్లిపాయ, బంగాళాదుంప
జవాబు:
గ్రూపు-ఎ

41. కాండం ద్వారా వ్యాప్తి చెందే సమూహం ఏది?
ఎ) స్టోలన్, మొక్కజొన్న, రైజోమ్
బి) మొగ్గ తొడుగుట, పత్ర మొగ్గలు, విచ్ఛిత్తి
జవాబు:
గ్రూప్-ఎ

42. కింది వాటిలో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తున్న సమూహము ఏది?
ఎ) ద్రాక్ష, పుచ్చకాయ, క్యారెట్
బి) పుట్టగొడుగు, రైజోపస్, ఫెర్న్
జవాబు:
గ్రూపు-బి

43. పురుష పునరుత్పత్తి వ్యవస్థకు చెందిన అనుబంధ గ్రంథుల సమూహం ఏది?
ఎ) శుక్ర గ్రాహికలు, ప్రోస్టేట్ గ్రంథి, కౌపర్ గ్రంథి
బి) పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి
జవాబు:
గ్రూపు-ఎ

44. ఏ జీవుల సమూహం బాహ్య ఫలదీకరణం జరుపుతాయి ?
ఎ) కుక్క పిల్లి, ఏనుగు
బి) చేప, కప్ప, వానపాము
జవాబు:
గ్రూపు-బి

45. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగాలు ఏవి?
ఎ) అండాశయం, గర్భాశయం, యోని
బి) టెస్టిస్, ఎపిడిడిమిస్, యురేత్రా
జవాబు:
గ్రూపు-ఎ

46. స్త్రీలలోని గర్భనిరోధక పద్ధతుల సమూహం ఏది?
ఎ) కండోమ్స్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ
బి) కాపర్-టి, డయాఫ్రాగమ్, నోటి మాత్రలు
జవాబు:
గ్రూపు-బి

47. కణ చక్రం యొక్క సరైన క్రమం ఏది?
ఎ) G1 – S – G2 – M
బి) G1 – G2 – S – M
జవాబు:
గ్రూపు-ఎ

48. సమ విభజన దశల యొక్క సరైన క్రమం ఏది?
ఎ) ప్రథమ, చలన, మధ్య అంతిమ దశలు
బి) ప్రథమ, మధ్య, చలన, అంత్య దశలు
జవాబు:
గ్రూపు-బి

49. పువ్వు యొక్క అండకోశంలో ఉన్న భాగాలు ఏమిటి?
ఎ) అండాశయం, కీలాగ్రం, కీలం
బి) కాడ, పరాగకోశం, పుప్పొడి రేణువులు
జవాబు:
గ్రూపు-ఎ

50. ఏ కణాల సమూహం సమ విభజన జరుపుతాయి?
ఎ) అస్థి కణం, కాలేయ కణం, నెఫ్రాన్లు
బి) సిద్ధబీజ తల్లి కణం, పుప్పొడి తల్లి కణం, శుక్ర తల్లి కణం
జవాబు:
గ్రూపు-ఎ

51. ఏక స్థితిక క్రోమోజోమ్ లను కలిగి ఉన్న కణాల సమూహం ఏది?
ఎ) ధ్రువ కేంద్రకాలు, జైగోట్, స్త్రీ బీజ కణం
బి) యాంటిపోడల్ కణాలు, సహాయక కణాలు, స్త్రీ బీజ కణం
జవాబు:
గ్రూపు-బి

జతపరచుట

52. సరిపోలని దాన్ని గుర్తించండి.
ముష్కము – శుక్రకణాలు
అండాశయం – టెస్టోస్టెరాన్
ప్రసేకము – మూత్ర జననేంద్రియ నాళం
జవాబు:
అండాశయం – టెస్టోస్టెరాన్

53. సరిగ్గా సరిపోలిన దాన్ని కనుగొనండి.
అండాశయం – శుక్రకణాలు
ముష్కములు – అండము
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం
జవాబు:
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

54. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం
ప్రొజెస్టెరాన్ – ఆడవారిలో ద్వితీయ లైంగిక లక్షణాలు
టెస్టోస్టెరాన్ – పిండ ప్రతిస్థాపన
జవాబు:
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం

55. సరిపోలని దాన్ని గుర్తించండి.
అండ ఉత్పత్తి – 28-30 రోజులు
గర్భధారణ కాలం – 180 రోజులు
జరాయువు ఏర్పడటం – గర్భం యొక్క 12 వారాలు
జవాబు:
గర్భధారణ కాలం – 180 రోజులు

56. సరిపోలని దాన్ని గుర్తించండి.
రక్షక పత్రావళి – రక్షణ
ఆకర్షక పత్రావళి – ప్రకాశవంతమైన రంగు
కేసరాలు – అండకోశం
జవాబు:
కేసరాలు – అండకోశం

57. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
అండాశయం – విత్తనంపై పొర
అండం – విత్తనం
విత్తనకవచం – పండు
జవాబు:
అండం – విత్తనం

58. సరిపోలని దాన్ని గుర్తించండి.
గాయాలు మానటం – సమవిభజన
బీజకణాలు – క్షయకరణ విభజన
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన
జవాబు:
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన

59. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
పారామీషియం – మొగ్గ తొడగటం
ఫ్లనేరియా – పునరుత్పత్తి
హైడ్రా – ద్విదావిచ్ఛిత్తి
జవాబు:
ప్లనేరియా – పునరుత్పత్తి

60. సరిపోలని దాన్ని గుర్తించండి.
ఆకులు – పత్ర మొగ్గలు
అల్లం – రన్నర్
రోజ్ – స్టోలన్
జవాబు:
రోజ్ – స్టోలన్

ఉదాహరణలు ఇవ్వండి

61. హైడ్రామొగ్గ తొడగటం ద్వారా ప్రత్యుత్పత్తి చేయగలదు. ఇటువంటి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్‌

62. ద్విదావిచ్చిత్తి ప్రక్రియ ద్వారా అమీబా తదుపరి తరానికి ప్రత్యుత్పత్తి చేస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పేరామీషియం / బాక్టీరియా

63. ప్లనేరియా ప్రత్యుత్పత్తికి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
హైడ్రా

64. బ్రయోఫిల్లమ్ ఆకుల ద్వారా వ్యాప్తి చెందే మొక్క వేర్ల ద్వారా వ్యాప్తి చెందగల మొక్కకు మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్యారెట్ / ముల్లంగి

65. రైజోమ్ ఒక భూగర్భ కాండం, ఇది అడ్డంగా పెరిగింది. నిలువుగా పెరిగిన భూగర్భ కాండానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కార్న్

66. ఛేదనం అనేది మొక్కలలో ఒక కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతి. బహుళ పండ్ల మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అంటుకట్టుట

67. ఫెర్న్ మొక్క సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రొట్టె బూజు / పుట్ట గొడుగు

68. ఏకలింగ పువ్వుకు గుమ్మడి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొప్పాయి

69. టెస్టోస్టెరాన్ పురుష లైంగిక హార్మోన్. స్త్రీ లైంగిక హార్మోన్‌కు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్రోజన్ / ప్రొజెస్టెరాన్

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

70. హెచ్.ఐ.వి. లైంగిక సంక్రమణ వ్యాధి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్

71. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్య

పోలికను గుర్తించుట

72. బాహ్య ఫలదీకరణం : కప్ప : 😕 : పులి
జవాబు:
అంతర్గత ఫలదీకరణం

73. ముష్కం : శుక్రకణం : : అండాశయము 😕
జవాబు:
అండము

74. పరాగకోశం 😕 : : పిండం కోశం : స్త్రీ బీజ కణం
జవాబు:
పుప్పొడి రేణువు

75. సహాయ కణం : n::? : 2n
జవాబు:
ధ్రువ కేంద్రకాలు / కేంద్ర కణం

76. మగవారు : వేసెక్టమీ : : ఆడవారు 😕
జవాబు:
ట్యూబెక్టమీ

77. ప్రొజెస్టెరాన్ : స్త్రీ లైంగిక హార్మోన్ : 😕 : పురుష లైంగిక హార్మోన్
జవాబు:
టెస్టోస్టెరాన్

78. రైజోపస్ 😕 : : శైవలం : ముక్కలు కావటం
జవాబు:
సిద్ధబీజాలు

79. 2n : మియోసిస్ : : n:?
జవాబు:
సమ విభజన

80. లశునం : ఉల్లిపాయ : 😕 : బంగాళాదుంప
జవాబు:
దుంప కాండం

నేను ఎవరు?

81. నేను ఒకే జాతికి చెందిన కొత్తతరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న జీవిత ప్రక్రియను.
జవాబు:
ప్రత్యుత్పత్తి

82. నేను జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తిని. ఈ ప్రక్రియలో తేనెటీగల ఫలదీకరణం చెందని గుడ్ల నుండి డ్రోన్లు ఏర్పడతాయి.
జవాబు:
అనిషేక జననము (పారాథెనో జెనెసిస్)

83. నేను మొక్కలలో కృత్రిమ వ్యాప్తి పద్ధతిని. ఈ పద్ధతిలో ఒక మొక్క యొక్క ఒక భాగంలో మరొక మొక్కను ఉంచడం వలన, అవి ఒకే విధమైన మొక్కలా పెరుగుతాయి.
జవాబు:
అంటు కట్టుట (గ్రాఫ్టింగ్)

84. నేను కణచక్రంలో ఒక దశను. నేను రెండు కణ విభజనల మధ్య అంతరాన్ని. ఈ దశలో క్రోమోజోమ్ ల సంఖ్య రెట్టింపు అవుతుంది.
జవాబు:
అంతర దశ

85. నేను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అనుబంధ గ్రంథుల నుండి స్రవింపబడతాను. పురుషుల శరీరం నుండి శుక్రకణాలను పంపించడానికి నేను సహాయంచేస్తాను.
జవాబు:
శుక్ర స్రావం

86. నేను అండాశయంలో గుండ్రని కణాల బంతి లాగ ఉన్నాను. అండం ఈ చిన్న నిర్మాణం నుండి అభివృద్ధి చెందుతుంది.
జవాబు:
ఫియన్ పుటిక

87. నేను పిండం మరియు తల్లి నుండి ఏర్పడిన కణజాలం. నేను గర్భం దాల్చిన 12 వారాల వద్ద ఏర్పడతాను మరియు పిండం యొక్క పోషణకు సహాయపడతాను.
జవాబు:
జరాయువు

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

88. నేను గర్భావధి చివరలో క్షీర గ్రంథులలో శోషరసము వంటి ద్రవం పేరుకుపోవడం వలన ఏర్పడతాను. నేను పిల్లల రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాను.
జవాబు:
ప్రారంభ స్తన్యము

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

89. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి స్వలింగ పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.
జవాబు:
మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి లైంగిక పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.

90. కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు మోనో లైంగిక పువ్వులు.
జవాబు:
కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు ద్విలింగ లైంగిక పువ్వులు.

91. యాంటీ పోడల్ కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.
జవాబు:
సహాయక కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.

92. స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు టెస్టోస్టిరాన్ బాధ్యత వహిస్తుంది.
జవాబు:
స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు ఈస్ట్రోజెన్ బాధ్యత వహిస్తుంది.

93. వాసా ఎఫరెన్షియా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
అడెనోకార్సినోమా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్డ్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.

94. మగవారిలో అండాశయాల యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.
జవాబు:
మగవారిలో శుక్రనాళం యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.

95. ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని స్పోరోఫిల్స్ మొగ్గలు అంటారు.
జవాబు:
ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని ఎపిఫిల్లస్ మొగ్గలు అంటారు.

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

96. ఈ క్రింది నినాదాల యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆడపిల్లలు గులాబీ రేకులలాంటి వారు, వారిని కాపాడండి.
భవిష్యత్ తరాలను కాపాడటానికి అమ్మాయిలను రక్షించండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్యలను ఆపడానికి

బొమ్మలపై ప్రశ్నలు

97.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 50
స్ట్రాబెర్రిలోని కాండం ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
స్టోలన్

98.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 51
ఈ చిత్రంలో చూపించబడిన శాఖీయ వ్యాప్తి విధానం?
జవాబు:
అంటుకట్టుట

99.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 52
పటంలో చూపబడిన అలైంగిక నిర్మాణం?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రం

100.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 53
ఇవ్వబడిన పుష్పము ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
ద్విలింగ పుష్పము

101.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 54
పుష్పంలో అందమైన భాగాల పని?
జవాబు:
కీటకాల ఆకర్షణ

102.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 55
పటంలో చూపబడిన X భాగం ఏమిటి?
జవాబు:
పరాగనాళం

103.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 56
పటంలో తప్పుగా గుర్తించిన భాగం.
జవాబు:
ఫాలోపియన్ నాళం

104.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 57
ఈ పటంలో చూపబడిన భాగం యొక్క పని
జవాబు:
శుక్రకణ కదలిక

105.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 59
పటంలో చూపబడిన కణ విభజన దశ ఏమిటి?
జవాబు:
చలన దశ

ఖాళీలను పూరించండి

106. బంగాళాదుంప ……. ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
జవాబు:
కన్నుల

107. భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండం ………..
జవాబు:
రైజోమ్

108. పుష్పంలోని లైంగిక వలయాల సంఖ్య
జవాబు:
2

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

109. పిండకోశములో ద్వయస్థితిక కేంద్రకము …………..
జవాబు:
మధ్యస్థ కేంద్రకము

110. విత్తనాలు లేకుండా ఏర్పడే ఫలాలు ……..
జవాబు:
అని షేక ఫలాలు

111. పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క …..
జవాబు:
రణపాల

112. మొక్కలలోని లైంగిక భాగం ………….
జవాబు:
పుష్పము

113. పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య …………
జవాబు:
7

10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1.

జాబితా – Aజాబితా – B
1. ముక్కలగుటశిలీంధ్రాలు
2. కోరకీభవనముపారామీషియమ్
3. ద్విదావిచ్ఛిత్తిచదునుపురుగు

తప్పుగా జతపరచబడినవి ఏవి?
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3
జవాబు:
B) 2, 3

2. సమవిభజనలోని కణచక్రం యొక్క ప్లోచార్ట్ దశలను సరియైన, క్రమంలో అమర్చండి.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 61
A) 4, 1, 2, 3
B) 2, 3, 4, 1
C) 4, 2, 3, 1
D ) 1, 3, 4, 2
జవాబు:
A) 4, 1, 2, 3

3. బొమ్మలో గుర్తించిన ‘X’ దీనిని సూచిస్తుంది.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 60
A) సహాయకణాలు
B) ప్రతిపాదిత కణాలు
C) ధృవ కేంద్రకం
D) అండకణం
జవాబు:
C) ధృవ కేంద్రకం

4. సరైన క్రమాన్ని గుర్తించండి.
A) ప్రథమదశ → చలనదశ → అంత్యదశ → మధ్యస్థదశ
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ
C) మధ్యస్థదశ → అంత్యదశ → ప్రథమదశ → చలనదశ
D) ప్రథమదశ → చలనదశ → మధ్యస్థదశ → అంత్యదశ
జవాబు:
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

5. శుక్ర కణాలను ఉత్పత్తి చేసే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం
A) శుక్రవాహిక
B) పౌరుష గ్రంథి
C) ముష్కాలు
D) శుక్రాశయము
జవాబు:
C) ముష్కాలు

6. మొక్కల్లో పురుష బీజకేంద్రం ద్వితీయ కేంద్రకంతో కలిస్తే ఏర్పడేది
A) పిండకోశం
B) అంకురచ్ఛదం
C) బీజదళాలు
D) సిద్ధబీజాలు
జవాబు:
B) అంకురచ్ఛదం

7. విభజన చెందని కణాలున్న శరీర భాగం
A) మెదడు
B) ఊపిరితిత్తులు
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
A) మెదడు

8. అండాలను ఉత్పత్తిచేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగము ఏది?
A) గర్భాశయ ముఖద్వారం
B) ఎపిడిడిమిస్
C) అండాశయము
D) ఫాలోఫియన్ నాళం
జవాబు:
C) అండాశయము

9. పార్థినోజెనిసిస్ ప్రదర్శించే జీవి ……..
A) తేనెటీగలు
B) కందిరీగలు
C) చీమలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

10. గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవేవి?
A) సిగరెట్ పొగలో రసాయనాలు
B) ఆల్కహాల్
C) మందులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

11. మానవులలో గర్భావధి కాలం
A) 330 రో॥
B) 20 రో॥
C) 280 నె॥
D) 280 రో॥
జవాబు:
D) 280 రో॥

12. ఈ క్రింది విత్తనాలలో అంకురచ్ఛదం కలది ………..
A) ఆముదము
B) బఠాణి
C) కందులు
D) పెసలు
జవాబు:
A) ఆముదము

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

13. మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రిందయివ్వబడినవి. సరియైన క్రమంలో అమర్చండి.
1) కౌమార దశ
2) శిశుదశ
3) వయోజన దశ
4) బాల్య దశ
A) 1, 3, 4, 2
B) 4, 2, 3, 1
C) 2, 4, 1, 3
D) 3, 1, 2, 4
జవాబు:
C) 2, 4, 1, 3

14. ఈ చిహ్నం తెలియజేయు అంశం
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 62
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
B) ప్రపంచ వైద్యుల దినోత్సవం
C) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
D) ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జవాబు:
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

15. సైడ్ పైన ఒక విద్యార్థి పరాగరేణువును సూక్ష్మదర్శినిలో పరీక్షించినపుడు ఈ క్రింది విధంగా కనబడింది.
‘X’ దేనిని సూచించును?
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 63
A) పక్వం చెందిన కేంద్రకం
B) పరాగ నాళం
C) కీలాగ్రం
D) నాళికా కేంద్రకం
జవాబు:
B) పరాగ నాళం

16. ప్రక్క పటంలో ‘X’ దేనిని తెలియజేస్తుంది?
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 57
A) ఆక్రోసోమ్
B) తల
C) కేంద్రకం
D) తోక
జవాబు:
A) ఆక్రోసోమ్

17. కోరకీభవనము ఏ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి?
A) ఈస్ట్
B) పారమీసియం
C) వానపాము
D) అమీబా
జవాబు:
A) ఈస్ట్

18. క్రింది బొమ్మలోని సమవిభజన దశను గుర్తించుము.
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 64
A) ప్రథమ దశ
B) చలన దశ
C) మధ్య స్థ దశ
D) అంత్య దశ
జవాబు:
B) చలన దశ

19. క్రింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని
i) ప్రొజెస్టిరానను స్రవించుట
ii) టెస్టోస్టిరానను స్రవించుట
iii) ఆళిందమును ఏర్పరచుట
iv) శుక్రకణాల ఉత్పత్తి
A) (i) మరియు (iii)
B) (ii) మరియు (iv)
C) (iii) మరియు (iv)
D) (i) మరియు (ii)
జవాబు:
B) (ii) మరియు (iv)

20. సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క
A) మందార
B) గడ్డిచామంతి
C) బంతి
D) ఫెర్న్
జవాబు:
D) ఫెర్న్

21. కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరచి చూచినపుడు కనిపించే భాగాలు
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 65
A) బీజదళాలు మరియు ప్రథమ మూలం
B) ప్రథమ కాండం, బీజదళం
C) బీజదళం మరియు అంకురచ్ఛదం
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం
జవాబు:
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం

22. కింది వానిలో వేరుగా ఉన్నది
A) పౌరుష గ్రంథి
B) ఎపిడిడిమిస్
C) శుక్రవాహికలు
D) ఫాలోపియన్ నాళం
జవాబు:
D) ఫాలోపియన్ నాళం

AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

23. అండకణం శుక్రకణం కన్నా పెద్దదిగా ఉంటుంది అని ఉపాధ్యాయుడు బోధించాడు. దీనికి గల కారణం
A) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది.
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
C) మందమైన కణత్వచాన్ని కలిగి ఉంటుంది.
D) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది.
జవాబు:
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.

24. గర్భధారణ జరిగాక 3 నెలల పిండాన్ని ఏమంటారు?
A) సంయుక్త బీజం
B) జరాయువు
C) పిండం
D) భ్రూణం
జవాబు:
D) భ్రూణం

25. ఎయిడ్స్ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే ……
A) పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రక్తమార్పిడికి ఉపయోగించాలి.
B) డిస్పోజబుల్ సూదులను వాడాలి.
C) సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. పటంలో చూపబడిన మొక్క
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 66
A) బంగాళాదుంప
B) వాలిస్ నేరియా
C) స్ట్రాబెర్రీ
D) రణపాల
జవాబు:
D) రణపాల

మీకు తెలుసా?

* వాణిజ్యరీత్యా ఈ సాంప్రదాయ పద్ధతులకు బదులుగా అధునాతన కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులైన కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు. కణజాల వర్ధనంలో కేవలం మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ణన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.

* లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత : అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. ఈ పాఠం ప్రారంభంలో పారమీషియంలో జరిగే లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తులను గురించి చర్చించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి.

* మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపరం జరుపుకొనే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.

* లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్చదం ఏర్పడతాయి. పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండకోశంలోని స్త్రీ బీజకణాన్ని చేరుతుంది. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్థాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.

* ఆగస్ట్ వీస్మన్ ఒక జీవ శాస్త్రవేత్త. అతనికి కంటిచూపు తక్కువగా ఉండేది. కణాలను సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించడం కష్టంగా ఉండేది. అందుకే అతను ఇతర మార్గాల ద్వారా తన పరిశోధనలను కొనసాగించాడు. శాస్త్రం కేవలం సేకరించిన సమాచారంపైనే ఆధారపడి అభివృద్ధి చెందలేదు. సేకరించబడిన సమాచారాన్ని గురించి ఆలోచించడం మరియు నూతన విషయాలను కనుక్కోవడం, వాటిని వ్యాఖ్యానించడం కూడా పరిశోధనే అవుతుంది. ఆగస్ట్ వీసమన్ తనకు కంటిచూపు తక్కువ అని విచారిస్తూ వృథాగా కూర్చోలేదు. తన సమయాన్నంతా శాస్త్ర విషయాలను గురించి ఆలోచించడానికే కేటాయించాడు. నిజంగా అతనెంత గొప్పవాడో, ఆదర్శప్రాయుడో ఆలోచించండి.

పునశ్చరణం
AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 67

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

These AP 10th Biology Important Questions and Answers 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 5th lesson Important Questions and Answers నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కింది బొమ్మలోని నాడీ పేరు రాసి, అది చేసే పనిని తెల్పండి.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1
జవాబు:

  1. ఈ బొమ్మలోని నాడీ జ్ఞాననాడీ లేదా అభివాహి నాడీ.
  2. ఈ నాడీ దేహములోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు చేర్చును.

ప్రశ్న 2.
మీ పాఠశాల ప్రయోగశాలలో మీరు చేసిన చిక్కుడు విత్తనము మొలకెత్తె కృత్యంలో కాండం మరియు వేరు పెరుగుదలను గమనించి ఉన్నారు. వారం తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజసమాంతరంగా ఉంచినప్పుడు కాండం పెరుగుదలలో నీవు పరిశీలించి నమోదు చేసిన అంశాలను వ్రాయగలవు.
జవాబు:

  1. కాంతి సోకే కాండ భాగంలో అధికంగా ఆక్సిన్లు చేరుతాయి.
  2. కనుక ఆ భాగంలో కణాలు వేగంగా పెరిగి కాండం కాంతివైపు వంగుతుంది. దీనినే కాంతి అనువర్తనం అంటారు.

ప్రశ్న 3.
“మొక్కలు ఉద్దీపనాలకు ప్రతిస్పందిస్తాయి” నీవు దీనిపై ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు ఏఏ మొక్కల సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తావు?
జవాబు:
ప్రొద్దుతిరుగుడు పువ్వు, దోస తీగలు, కాకర తీగలు, మైమోసాప్యుడికా (అత్తిపత్తి) మొదలగునవి.

ప్రశ్న 4.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఇన్సులిన్ హార్మోన్ గురించి 2 వాక్యాలు వ్రాయండి.
జవాబు:

  1. కోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికలు, ఇన్సులిన్ అనే హార్మోనును స్రవించును.
  2. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రించును.
  3. ఇన్సులిన్ లోపించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి మధుమేహ వ్యాధి (డయాబెటిస్ మిల్లిటస్) కలుగును.

ప్రశ్న 5.
కిటికీ వద్ద పెరుగుచున్న మొక్క సూర్యరశ్మి వైపు వంగుతుంది. ఇలా వంగడానికి కారణము ఏమి?
జవాబు:

  1. మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
  2. మొక్కలపై కాంతి పడినపుడు కాండాగ్రంలోని విభాజ్య కణజాలం ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోనును ఉత్పత్తి చేస్తాయి.
  3. ఆక్సినుల ప్రభావం వలన కణాలు విభజన చెంది కాంతి వైపుకు వంగుతాయి. దీనినే కాంతి అనువర్తనం అంటారు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 6.
బొమ్మలో సూచించిన భాగాన్ని గుర్తించి అది చేసే పనిని రాయండి.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 2
జవాబు:

  1. సైనాప్స్ (లేదా) నాడీ సంధి
  2. ఇది ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారమును చేరవేసే క్రియాత్మక భాగం.

ప్రశ్న 7.
శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగమేది?
జవాబు:
శరీర సమతాస్థితిని నియంత్రించే భాగం : అనుమస్తిష్కము

ప్రశ్న 8.
హార్మోన్స్ అనగానేమి?
జవాబు:
వినాళ గ్రంథులచే స్రవించబడే రసాయన పదార్థాలను “హార్మోన్స్” అంటారు. ఇవి నేరుగా రక్తంలోనికి విడుదలై నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. 1905 వ సంవత్సరంలో ఆంగ్ల శరీరధర్మ శాస్త్రవేత్త వీటికి హార్మోన్స్ అని పేరుపెట్టాడు.

ప్రశ్న 9.
ఫైటో హార్మోన్స్ అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
మొక్కలలో ఉత్పత్తి అయ్యే హార్మోనను ఫైటోహార్మోన్స్ అంటారు. ఇవి మొక్కలలో నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తాయి.
ఉదా : ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్స్, ఇథైలిన్, అబ్ సైసిక్ ఆమ్లం.

ప్రశ్న 10.
ఉద్దీపనాలు అనగానేమి?
జవాబు:
ఉద్దీపనాలు :
జీవుల బాహ్య లేదా అంతర పరిసరాలలోని నిర్దిష్ట మార్పులను “ఉద్దీపనాలు” అంటారు. (లేదా) జీవులలో ప్రతిస్పందనను కలిగించే మార్పులను ఉద్దీపనాలు అంటారు.

ప్రశ్న 11.
ప్రతిస్పందన అనగానేమి?
జవాబు:
ప్రతిస్పందన :
ఉద్దీపనలకు జీవులు చూపించే ప్రతిచర్యలను “ప్రతిస్పందనలు” అంటారు.

ప్రశ్న 12.
నాడీకణంలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
నాడీకణంలోని ప్రధానంగా 1. కణదేహం 2. ఆగ్దాన్ 3. డెండ్రైట్స్ అనే భాగాలు ఉంటాయి.

ప్రశ్న 13.
నాడీకణ ఆగ్జాన్ దేనితో కప్పబడి ఉంటుంది?
జవాబు:
నాడీకణ ఆగ్దాన్ మయలిన్ తొడుగుతో కప్పబడి ఉంటుంది.

ప్రశ్న 14.
పొడవును ఆధారంగా చేసుకుని మెదడు, వెన్నుపాములలోని ఆగ్దాన్స్, డెంటైట్ను గుర్తుపట్టగలమా?
జవాబు:
పొడవు ఆధారం చేసుకుని మెదడు, వెన్నుపాములోని ఆగ్జాన్స్, డెండ్రైట్స్ గుర్తుపట్టలేము. వాటిని కప్పుతూ ఉండే మయలిన్ తొడుగు ఆధారంగా గుర్తుపట్టవచ్చు. మెదడు, వెన్నుపాము ప్రాంతంలోని ఎక్సాన్ల చుట్టూ మయలిన్ తొడుగు ఉండదు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 15.
సైనాప్స్ అనగానేమి?
జవాబు:
సైనాప్స్ :
ఒక నాడీకణంలోని డెండ్రైట్స్ మరొక నాడీకణంలోని ఎక్సాతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్ని “సైనాప్స్” అంటారు.

ప్రశ్న 16.
అభివాహిక నాడులు అనగానేమి?
జవాబు:
అభివాహిక నాడులు :
జ్ఞానేంద్రియాల నుండి కేంద్రీయ నాడీ వ్యవస్థ వైపు సమాచారాన్ని తీసుకెళ్ళే నాడులను “అభివాహినాడులు” అంటారు. వీటినే “జ్ఞాననాడులు” అని కూడా అంటారు.

ప్రశ్న 17.
చాలక నాడులు అనగానేమి?
జవాబు:
చాలక నాడులు :
కేంద్రియ నాడీవ్యవస్థ నుండి సమాచారాన్ని శరీర వివిధ భాగాలకు తీసుకెళ్లే నాడులను “అపవాహి నాడులు లేదా చాలక నాడులు” అంటారు.

ప్రశ్న 18.
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం అనగానేమి?
జవాబు:
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం : ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్ ను “ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం” అంటారు.

ప్రశ్న 19.
ప్రతిచర్యలలో ఉద్దీపనల వేగం ఎంత?
జవాబు:
ప్రతిచర్యలలో ఉద్దీపనల వేగం 100 మీ/సె. గరిష్ట వేగంతో జరుగుతుంది.

ప్రశ్న 20.
శరీరంలోని నాడీవ్యవస్థను ఎన్ని రకాలుగా విభజిస్తారు?
జవాబు:
శరీరంలో నాడీవ్యవస్థ వ్యాపించే విధానం బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి :

  1. కేంద్రీయ నాడీవ్యవస్థ
  2. పరిధీయ నాడీవ్యవస్థ.

ప్రశ్న 21.
కేంద్రీయ నాడీవ్యవస్థలోని భాగాలు ఏమిటి?
జవాబు:
మెదడు, వెన్నుపాము కేంద్రీయ నాడీవ్యవస్థలోని భాగాలు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 22.
మెదడును రక్షించే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
మెదడును రక్షిస్తూ 1. కపాలం 2. మెనింజస్ 3. మస్తిష్క మేరు ద్రవం ఉన్నాయి.

ప్రశ్న 23.
మెదడులోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
మెదడును ప్రధానంగా 1. ముందు మెదడు 2. మధ్య మెదడు 3. వెనుక మెదడుగా విభజిస్తారు.

ప్రశ్న 24.
మానవ మెదడు బరువు ఎంత?
జవాబు:
మెదడు దాదాపు 1400 గ్రా|| బరువు ఉంటుంది. శరీరం మొత్తం బరువులో ఇది 2%. పురుషులలో 1350 గ్రా. స్త్రీలలో 1275 గ్రా. బరువు ఉంటుంది.

ప్రశ్న 25.
సైనా లో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది?
జవాబు:
సైనాప్స్ లో సమాచార ప్రసరణ రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది.

ప్రశ్న 26.
మెదడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత?
జవాబు:
మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది.

ప్రశ్న 27.
కపాలనాడులు అనగానేమి?
జవాబు:
కపాలనాడులు :
మెదడు నుండి ఏర్పడే నాడులను “కపాలనాడులు” అంటారు. వీటి సంఖ్య 12 జతలు.

ప్రశ్న 28.
వెన్నునాడులు అనగానేమి?
జవాబు:
వెన్నునాడులు :
వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను “వెన్నునాడులు” అంటారు. వీటి సంఖ్య 31 జతలు. ఇవన్నీ మిశ్రమనాడులు.

ప్రశ్న 29.
Enteric నాడీవ్యవస్థ అనగానేమి?
జవాబు:
మన శరీరంలో కేంద్రీయ నాడీవ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థతో పాటుగా, జీర్ణనాళంలో మరో నాడీవ్యవస్థ ఉంది. ఇది కేంద్రీయ, పరిధీయ నాడీవ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుంది. దీనిని ‘చిన్న మెదడు’ అనుమారు పేరుతో కూడా పిలుస్తారు. దీనినే “Enteric నాడీవ్యవస్థ” అంటారు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 30.
వినాళ గ్రంథులు అనగానేమి?
జవాబు:
వినాళ గ్రంథులు :
నాళాలు లేని గ్రంథులను “వినాళ గ్రంథులు లేదా అంతస్రావీ గ్రంథులు” అంటారు. ఇవి రసాయనాలను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి.

ప్రశ్న 31.
నాస్టిక్ చలనాలు (Nastic movements) అనగానేమి?
జవాబు:
నాస్టిక్ చలనాలు : మొక్కలు బాహ్య ఉద్దీపనాలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిస్పందనలను “సాస్టిక్ చలనాలు” (Nastic movements) అంటారు.

ప్రశ్న 32.
కాంతి అనువర్తనం అనగానేమి?
జవాబు:
కాంతి అనువర్తనం : మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని “కాంతి అనువర్తనం” అంటారు.
ఉదా : కాండము.

ప్రశ్న 33.
గురుత్వ అనువర్తనం అనగానేమి?
జవాబు:
గురుత్వ అనువర్తనం :
మొక్కలు భూ ఆకర్షణశక్తికి ప్రతిస్పందించడాన్ని “గురుత్వ అనువర్తనం” అంటారు.
ఉదా : వేరు.

ప్రశ్న 34.
స్పర్శానువర్తనం అనగానేమి?
జవాబు:
స్పర్శానువర్తనం :
స్పర్శ లేదా తాకటం వలన మొక్కలు చూపే ప్రతిస్పందనలను “స్పర్శానువర్తనం లేదా థిగ్మో ట్రాపిజం” అంటారు.
ఉదా : అత్తిపత్తి,

ప్రశ్న 35.
రసాయన అనువర్తనం అనగానేమి?
జవాబు:
రసాయన అనువర్తనం :
మొక్కలు రసాయనిక పదార్థాలకు చూపే ప్రతిస్పందనను “రసాయన అనువర్తనం లేదా కీమో ట్రాపిజం” అంటారు.
ఉదా : పరాగరేణువులు మొలకెత్తటం.

ప్రశ్న 36.
నులితీగల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
బలహీన కాండాలు ఆధారాలను పట్టుకొని ఎగబ్రాకటానికి నులితీగలు తోడ్పడతాయి.

ప్రశ్న 37.
నీటి అనువర్తనం అనగానేమి?
జవాబు:
నీటి అనువర్తనం : మొక్కలు నీరు లభించే ప్రదేశం వైపుకు పెరుగుదలను చూపుతాయి. దీనిని “నీటి అనువర్తనం” అంటారు.

ప్రశ్న 38.
నాడీవ్యవస్థ గురించి మొదట పరికల్పన చేసిన వ్యక్తి ఎవరు? అతను ఏమని చెప్పాడు.
జవాబు:
గాలన్ అనే గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129 – 200) నాడీవ్యవస్థ గురించి ముఖ్యమైన పరిశీలన చేశాడు. గాలన్ నాడులు రెండు రకాలు అని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శ) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూపేది.

ప్రశ్న 39.
మెదడులోని వెలుపలి భాగం బూడిద రంగులో ఉంటుంది. ఎందుకు?
జవాబు:
మెదడులో నాడీ కణ దేహాలు బయటి పొరతో ఉండి, కేశనాళికలతో కలిసి బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని “grey matter లేదా బూడిద రంగు పదార్థం” అంటారు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 40.
మెదడు లోపలి భాగాలు తెలుపు రంగులో ఉంటాయి. ఎందుకు?
జవాబు:
మెదడు లోపలి పొరలలో నాడీకణాల ఆగ్దాన్లు ఉంటాయి. ఇవి మయలిన్ తొడుగు కలిగి తెల్లగా ఉండుట వలన మెదడు లోపలి భాగాలు తెలుపు రంగులో ఉంటాయి.

ప్రశ్న 41.
పిల్లిని చూచిన ఎలుక పరిగెత్తింది. దీనిలోని ఉద్దీపన ప్రతిస్పందనలు ఏమిటి?
జవాబు:
పిల్లి – ఉద్దీపన, పరిగెత్తటం – ప్రతిస్పందన

ప్రశ్న 42.
నీ నిజజీవితంలో ఉద్దీపన, ప్రతిస్పందనలకు రెండు ఉదాహరణలు ఇవ్వంది.
జవాబు:

ఉద్దీపనప్రతిస్పందన
1. చలిగా ఉంది.దుప్పటి కప్పుకుంటాను.
2. దాహంగా ఉంది.నీరు త్రాగుతాను.

ప్రశ్న 43.
క్రికెట్ ఆటలో ఫీల్డర్ వెనుకకు పరిగెడుతూ క్యాచ్ పట్టాడు. ఈ సందర్భంలో ఏ ఏ అవయవాలు సమన్వయంగా పనిచేస్తాయి.
జవాబు:
కళ్ళు, మెదడు, కాళ్ళు, చేతులు సమన్వయంగా పనిచేయటం వలన ఫీల్డర్ క్యాచ్ పట్టగలిగాడు.

ప్రశ్న 44.
చక్కెర వ్యా ధి అనగానేమి? దానికి గల కారణం ఏమిటి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉండటం, చక్కెర వ్యాధి లక్షణం. క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సరైన మోతాదులో లేకపోవటం ఈ వ్యాధికి కారణం.

ప్రశ్న 45.
పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేనికి పేరు?
జవాబు:
అడ్రినలిన్ హార్మోన్ మానసిక ఉద్రేకాలను నియంత్రిస్తుంది. దీనిని “పోరాట లేదా పలాయన హార్మోన్” అంటారు.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 46.
సాధారణ మొక్కలు నీటి కొరతను ఎలా తట్టుకుంటాయి?
జవాబు:
వేసవికాలంలో మొక్కలు అబ్ సైసిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని ప్రభావం వలన ఆకులు రాలటం, పత్రరంధ్రాలు మూసుకుపోవటం జరిగి నీటినష్టాన్ని తగ్గిస్తాయి.

10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
తమను తినే జంతువుల నుండి రక్షించుకొనుటకు మొక్కలు అనుసరించు విధానాలను మీ గ్రామములో గల రెండు మొక్కలను ఉదాహరణగా తీసుకొని వివరించండి.
జవాబు:
1. వేప :
వేపలో ఉండే నింబిన్ అనే ఆల్కలాయిడ్ వలన దాని భాగాలు చేదుగా ఉంటాయి. కనుక తమను తినే జంతువుల నుండి రక్షించుకుంటాయి.

2. బ్రహ్మజెముడు :
ముళ్ళను ఏర్పరచుకొనుట ద్వారా రక్షించుకుంటాయి.

3. ఉమ్మెత్త :
పత్రాలు చెడు వాసన కలిగి ఉండటం.

ప్రశ్న 2.
మొక్కలు తమ పరిసరాల్లో కలుగు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి అని తెలుసుకొన్నపుడు నీవెలా అనుభూతి చెందావు?
జవాబు:

  1. మొక్కలలోని అనువర్తన మరియు నాస్తిక్ చలనాలను ప్రకృతిలో గమనించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అవుతాను.
  2. కిటికీ దగ్గర పెరుగుతున్న మొక్క కాంతి వైపు వంగుట
  3. వేరు భూమి వైపు పెరగటం.
  4. కాకర, దోస లాంటి తీగ మొక్కలు స్పర్శ లేక తాకటం వలన, నులితీగల పెరుగుదల జరగడం.
  5. సీతాకోకచిలుకలు మకరందం కొరకు పుష్పాల చుట్టూ తిరగటం వంటి దృశ్యాలను చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.

ప్రశ్న 3.
మానవ శరీరంలో అధివృక్క గ్రంథి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. అధివృక్క గ్రంథి మూత్రపిండంపై టోపీలా ఉంటుంది.
  2. దీని నిర్మాణంలో వల్కలం, దవ్వ అనే భాగాలు ఉంటాయి.
  3. ఇది ఎడ్రినలిన్ అనే హార్మోను స్రవిస్తుంది.
  4. దీనిని పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు.
  5. ఇది అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి తోడ్పడును.

ప్రశ్న 4.
హార్మోన్లు, ఎంజైములకు మధ్యగల తేడాలేమిటి?
జవాబు:

హార్మోన్లుఎంజైమ్లు
1) ఇవి వినాళ గ్రంథుల నుండి స్రవింపబడతాయి1. ఇవి నాళ గ్రంథుల నుండి స్రవింపబడతాయి.
2) ఇవి రక్తము ద్వారా ప్రసరిస్తాయి.2. ఇవి నాళముల ద్వారా ప్రసరిస్తాయి.
3) ఇవి తక్కువ మోతాదులో విడుదలవుతాయి.3. ఇవి ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి.
4) వీటి చర్యాశీలత నెమ్మదిగా జరుగుతుంది.4. వీటి చర్యాశీలత వేగవంతంగా జరుగుతుంది.
5) ఇవి జీవక్రియలకు తోడ్పడతాయి.5. ఇవి జీర్ణక్రియలో తోడ్పడతాయి.

ప్రశ్న 5.
జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల మధ్య సమన్వయం గురించి అర్థం చేసుకోడానికి వైద్యునితో ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:

  1. జీర్ణక్రియలోని ంథులు ఎలా ప్రేరేపించబడతాయి?
  2. జీర్ణక్రియ స్రావాలు ఎప్పుడు నిలిపివేయబడతాయి?
  3. గ్రంథుల పనికి, నాడీవ్యవస్థకు మధ్యగల సంబంధం ఏమిటి?
  4. జీర్ణ మండల నాడీవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని నీవు భావిస్తున్నావా?
  5. న్యూరోట్రాన్స్మ టర్స్ అంటే ఏమిటి? జీర్ణక్రియలో వాటి పాత్ర ఏమిటి?
  6. మానవ శరీరంలో రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు? ఎందుకు?

ప్రశ్న 6.
అసంకల్పిత ప్రతీకార చర్యలో వెన్నుపాము పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. వెన్నుపాము చాలా వేగంగా వెంటనే ప్రతిస్పందనలను చూపుతుంది.
  2. ఈ నాడీ ప్రచోదనాలు నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
  3. దీనివల్ల మనం అనేక అపాయకరమైన పరిస్తితుల నుండి రక్షించుకోగల్గుతున్నాము.
  4. వెన్నుపాము ద్వారా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలు నిజంగా అద్భుతం మరియు అభినందనీయం.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 7.
ముందు మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడి (10 వ కపాల నాడి) ఆకలి సంకేతాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి, ‘ఆకలి కోరికలు’ దాదాపు 30-45 నిముషాల వరకు కొనసాగుతాయి. గ్రీలిన్ స్థాయి పెరిగినపుడు ఆకలి ప్రచోదనాలతో పాటు ఆహారం తినాలనే ఉద్దీపన భావన కలుగుతుంది. పై విషయం చదివి ఏవైనా రెండు ప్రశ్నలు తయారుచేసి రాయుము.
జవాబు:

  1. ఆకలి సంకేతాలను చేరవేసే నాడులు ఏవి?
  2. ఆకలి కోరికలు ఎంతసేపు కొనసాగుతాయి?
  3. మెదడులోని ఏ భాగము ఆకలి కోరికలకు ముఖ్యస్థానం?
  4. ఏ రసాయనిక పదార్థం వలన ఆహారం తినాలనే ఉద్దీపన భావం కలుగుతుంది?
  5. ఆకలికి సంబంధించిన హార్మోన్లను పేర్కొనండి.

ప్రశ్న 8.
న్యూరాలజిస్టు కలిసినపుడు మెదడు యొక్క విధులను గురించి తెలుసుకొనుటకు అడిగే కొన్ని ప్రశ్నలు రాయండి.
జవాబు:
న్యూరాలజిస్టుని అడిగే ప్రశ్నలు :
i) మానవునిలో సృజనాత్మకతకు కారణం అయ్యే మెదడులోని భాగమేది?
ii) ఆల్కహాలు సేవించడానికి – మెదడు విధికి సంబంధం ఏమిటి?
iii) ఫిట్స్ ఎందుకు వస్తాయి?
iv) మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జీవనశైలి అవసరం?
v) మేథస్సు (1.0.) పెరగటానికి ఎటువంటి ఆహారం తినాలి?

ప్రశ్న 9.
ఈ దిగువ నీయబడిన పటములో a, b, c, d లను గుర్తించి వాటి యొక్క విధులను వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 3
జవాబు:
a) జ్ఞాననాడి / అభివాహినాడి – ప్రచోదనాలను జ్ఞానేంద్రియాల నుండి కేంద్రనాడీ వ్యవస్థకు చేరవేయుట.
b) చాలకనాడి / అపవాదినాడి – ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థ నుండి నిర్వాహక అంగాలకు చేరవేయడం
c) తెలుపురంగు ప్రాంతం.
d) నిర్వాహక అంగం-ప్రచోదనాలకు స్పందించడం.

ప్రశ్న 10.
పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

హార్మోన్ఉపయోగాలు
థైరాక్సిన్సాధారణ పెరుగుదల రేటు, జీవక్రియలపై ప్రభావం
ఆక్సిన్స్కణాల పెరుగుదల, కాండం, వేరు విభేదనం

i) పై వాటిలో ఫైటోహార్మోన్ ఏది?
ii) మానవుల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
జవాబు:
i) ఆక్సీన్స్
ii) థైరాక్సిన్

ప్రశ్న 11.
రెండు అనువర్తన చలనాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
1. మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పంటించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
ఉదా : ప్రొద్దుతిరుగుడు మొక్క

2. మొక్కలు గురుత్వాకర్షణ బలంవైపుగా ప్రతిస్పందిస్తాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.
ఉదా : మొక్కలలో వేర్ల పెరుగుదల

3. మొక్కలలో వేర్లు నీరువున్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఈ ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు.
ఉదా : రాళ్ళను, గోడలను అంటిపెట్టుకొని పెరిగే మొక్కలు.

4. స్పర్శ (లేదా) తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను ‘స్పర్శానువర్తనం’ అంటారు.
ఉదా : దోసతీగ, బీరతీగ, కాకరతీగ మొదలగునవి.

5. రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను రసాయనికానువర్తనం అంటారు.
ఉదా : పరాగరేణువులు, కీలాగ్రము స్రవించే తీయని ద్రవాలు

ప్రశ్న 12.
లాంగర్ హాన్ పుటికలు పనిచేయకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కాదు.
  2. డయాబిటస్ మిల్లిటస్ (లేదా) మధుమేహము (లేదా) చక్కెర వ్యాధి రావచ్చును.
  3. రక్తములో చక్కెర స్థాయి పెరుగును.

ప్రశ్న 13.
క్రింది పట్టికను చదవండి.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 4
క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
i) భావోద్వేగాలకు గురి అయినప్పుడు విడుదలగు హార్మోన్?
జవాబు:
భావోద్వేగాలకు గురి అయినప్పుడు విడుదలగు హార్మోన్ : అడ్రినలిన్

ii) ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు ఏవి?
జవాబు:
ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు : ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్

ప్రశ్న 14.
రాముకి యాక్సిడెంట్ అయినది. అప్పటి నుండి అతడు సరిగా నడవలేకపోతున్నాడు మరియు సరిగా పదార్థాల వాసన గుర్తించలేకపోతున్నాడు. అతని మెదడులో ఏఏ భాగాలు దెబ్బతిని ఉంటాయి?
జవాబు:

  1. రాముకి యాక్సిడెంట్ వల్ల అనుమస్తిష్కం దెబ్బతినుట వల్ల శరీర సమతాస్థితిని కోల్పోయి సరిగా నడవలేకపోతున్నాడు.
  2. ముందు మెదడులోని ఝణలంబికలు దెబ్బతినుట వల్ల వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కోల్పోయాడు.

ప్రశ్న 15.
మొక్కలలోని వివిధ అనువర్తన చలనాలు, అవి ఏ ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తున్నాయో తెలియచేయు పట్టికను తయారు చేయుము.
జవాబు:

అనువర్తక చలనంఉద్దీపనలకు తగిన ప్రతిస్పందన
1. కాంతి అనువర్తన చలనంసూర్యకాంతివైపు చలనము
2. గురుత్వానువర్తన చలనంభూమ్యాకర్షణ వైపు చలనము
3. నీటి అనువర్తనమువేర్లు నేలలో నీరు వున్న ప్రాంతం వైపు చలనము
4. స్పర్శానువర్తనంనులితీగలు, ఎగబ్రాకే మొక్కలు స్పర్శ లేదా తాకుట వలన కలిగే చలనం

ప్రశ్న 16.
మీ శరీరంలో మీరు గమనించిన రెండు నియంత్రిత, రెండు అనియంత్రిత చర్యలు రాయండి.
జవాబు:
నియంత్రిత చర్యలు :
1. అస్థి కండరాల కదలికలు, 2. ఆహారాన్ని మింగడము, 3. మల విసర్జన

అనియంత్రిత చర్యలు :
1. హృదయ స్పందన, 2. ఆహార జీర్ణక్రియ, 3. రక్త ప్రసరణ

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 17.
మన శరీరంలో నాడులు రెండు రకాలుగా ఉంటాయని, గాలన్ ఎలా నిర్ధారించగలిగాడు?
జవాబు:
మన శరీరంలోని అన్ని భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు గాయం అయినప్పుడు ప్రవర్తనలో అనేక మార్పులు సంభవిస్తాయి. మెదడు ఎలా నియంత్రిస్తుందో అనే విషయాన్ని కొంత ఆలోచన మాత్రమే చేయగలిగారు. గాలన్ అనే గ్రీకు శరీరధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129–200) ముఖ్యమైన పరిశీలన చేశాడు. అతనికి సంబంధించిన ఒక రోగి రథం పై నుండి పడడం వలన మెడపై వాపు రావడంతో తన భుజంలో స్పందన కోల్పోయినట్లు ఫిర్యాదు చేశాడు.

గాలన్ రెండు రకాల నాడులు ఉంటాయని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శను) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూసేది. అతని ప్రకారం మెడలో వాపు రావడానికి కారణం స్పర్శను (జ్ఞానాన్ని) తెలియజేసే నాడులు నాశనం చెందడం.

ప్రశ్న 18.
నాడీకణం, సైనాప్స్ మధ్యగల సంబంధం వివరించండి.
జవాబు:
నాడీకణం, సైనాప్స్ మధ్య సంబంధం :
రెండు నాడీకణాల మధ్య విధిని నిర్వహించే ప్రాంతమే సైనాప్స్. ఇక్కడ ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారం బదలాయింపు జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి జీవ పదా సంబంధం లేక చిన్న ఖాళీ ప్రదేశం లేకపోయినప్పటికీ సమాచారం రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది.

మెదడుపైన గాని, వెన్నుపాముపైన గాని మరియు వెన్నుపాము చుట్టూ సైనాప్లు ఉంటాయి. వీటి తరువాత వెన్నుపాము (synopse) లు ప్రాంతం నుండి ఏక్సాన్లు సంకేతాలను మన శరీరంలోని ప్రత్యేక భాగాలకు తీసుకుని వెళ్తాయి.

ప్రశ్న 19.
Knee jerk అనగానేమి?
జవాబు:

  1. మోకాలు క్రింది భాగాన గట్టిగా కొట్టినప్పుడు, తొడ కండరాలలో కుదుపు ఏర్పడుతుంది. దీనిని “Knee jerk” అంటారు.
  2. దీనిని 1875లో గుర్తించారు.
  3. మొదటిలో దీనిని ప్రతిచర్యగా భావించినప్పటికీ, ఇందులో నాడీ మార్గం మాత్రమే ఉందని నిర్ధారించారు.

ప్రశ్న 20.
మెదడు ఎలా రక్షించబడుతుంది?
జవాబు:

  1. మానవ శరీర పరిమాణంతో పోల్చినపుడు మిగిలిన జంతువుల కంటే మానవ మెదడు చాలా పెద్దది. మెదడు ఎముకలతో తయారుచేయబడిన గట్టి పెట్టె వంటి నిర్మాణంలో భద్రపరచబడి ఉంటుంది. ఆ నిర్మాణాన్ని కపాలం (Cranium) అంటాం.
  2. మెదడును ఆవరించి మూడు త్వచాలు ఉంటాయి. వీటిని “మెనింజస్” అంటారు. ఈ త్వచాలు మెదడుతో పాటుగా వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి.
  3. వెలుపలి మరియు మధ్యత్వచం మధ్య మస్తిష్కమేరు ద్రవం (cerebro spinal fluid) ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుండి (shocks) కాపాడి మెదడుకు రక్షణ ఇస్తాయి.

ప్రశ్న 21.
వెన్నుపాము సమాచారాన్ని మెదడు నుండి పంపే మార్గంగానే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని ఎలా చెప్పగలవు?
జవాబు:

  1. లియోనార్డో డావెన్సి, స్టీఫెన్ హెల్స్ తమ ప్రయోగంలో కప్ప మెదడును తొలగించినా అది బ్రతికి ఉండటం గమనించారు.
  2. అదే విధంగా చర్మాన్ని గిచ్చినప్పుడుగాని, గ్రుచ్చినప్పుడు గాని కప్పలో కండరాల చలనాన్ని గమనించారు.
  3. కప్ప వెన్నుపాములో సూదీని నిలువుగా గ్రుచ్చినప్పుడు, వెన్నుపాము నశించిన కప్ప చనిపోవటం జరిగింది.
  4. దీనిని బట్టి వెన్నుపాము సమాచారాన్ని మెదడుకు పంపే మార్గమే కాకుండా, నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

ప్రశ్న 22.
పరిధీయ నాడీవ్యవస్థ అనగానేమి?
జవాబు:

  1. కపాలనాడులు కశేరునాడులను కలిపి పరిధీయ నాడీవ్యవస్థ అంటారు.
  2. ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థకు అనుబంధంగా ఉండి నియంత్రణ, సమన్వయాన్ని నిర్వహిస్తుంది.
  3. దీనిలో కపాలనాడులు-12, కశేరునాడులు-31 మొత్తం 43 జతల నాడులు ఉంటాయి.

ప్రశ్న 23.
వెన్నుపాము ఉదర మూలం కండరాలను నియంత్రిస్తుందని ఎలా చెప్పగలను?
జవాబు:

  1. స్కాట్లాండుకు చెందిన చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్కు చెందిన ఫ్రాంకోయిస్ మెంథోం డె అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వెన్నుపాముపై ప్రయోగాలు నిర్వహించి వెన్నుపాము రెండు మూలాలు వేరు వేరు విధులను నిర్వహిస్తాయని పేర్కొన్నారు.
  2. వీరి ప్రయోగంలో స్పష్టమూలం తొలగించినపుడు ఆ జంతువులో ఎటువంటి చెప్పుకోదగ్గ చర్యను చూపలేదు.
  3. ఉదర మూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైన చర్య కనబడింది.
  4. దీనినిబట్టి ఉదర మూలం కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని స్పష్టం చేశారు.

ప్రశ్న 24.
మస్తిష్క మేరు ద్రవం ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
జవాబు:

  1. మెదడుని, వెన్నుపాముని కప్పుతూ మూడు త్వచాలు ఉంటాయి. అందు బయటి, మధ్యత్వచాల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది.
  2. దాని పనులు – 1) మెదడుకు, వెన్నుపాముకు హాని కలుగకుండా రక్షిస్తుంది. 2) మెదడు, వెన్నుపాములలోని కణాలకు పోషక పదార్థాలను అందిస్తుంది.

ప్రశ్న 25.
ఏక్సాను, డెండ్రైటుల మధ్యగల భేదములను వ్రాయుము.
జవాబు:

ఏక్సానుడెండ్రైటు
1) ప్రతి నాడీకణానికి ఒకటే ఏక్సాను ఉంటుంది.1) నాడీకణం నుండి ఏర్పడే డెండ్రైటుల సంఖ్య ఒకటి నుండి అనేక వేలు ఉంటుంది
2) పొడవుగా ఉంటుంది.2) పొట్టిగా ఉంటుంది.
3) శాఖలు ఉండవు.3) శాఖలు ఉంటాయి.
4) కొన్ని ఏక్సానులు మయలిన్ తొడుగును కలిగి ఉంటాయి.4) వీనిలో మయలిన్ తొడుగు, రన్వీర్ కణుపులు ఉండవు.

ప్రశ్న 26.
పునశ్చరణ యాంత్రికం (Feedback mechanism) అనగానేమి?
జవాబు:
శరీరంలో హార్మోన్ల చర్యను నియంత్రించే యంత్రాంగాన్ని పునశ్చరణ యంత్రాంగం అంటారు. హార్మోన్ చర్యల వలన పెరిగిన జీవక్రియ రేటులను సాధారణ స్థాయికి తీసుకురావటంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 27.
అడ్రినలిన్ హార్మోను ఉద్వేగాలు కలుగజేసే లేదా పోరాట పలాయన హార్మోన్ అని ఎందుకు అంటారు?
జవాబు:

  1. అధివృక్క గ్రంథి దవ్వ ప్రాంతం నుండి ఎడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.
  2. రక్తంలో దీని స్థాయి, పెరిగినపుడు హృదయ స్పందన రేటు, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతాయి.
  3. అందువలన జీవికి కోపం, ఉద్రేకం, పోరాట లక్షణాలు పెరుగుతాయి.
  4. దీని స్థాయి తగ్గినప్పుడు జీవక్రియ రేటు తగ్గి జీవి పారిపోవటం చేస్తుంది.
  5. మానసిక ఉద్రేకాలను ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. కావున దీనిని మానసిక ఉద్వేగాలు కలుగజేసే హార్మోన్ అని అంటారు.

ప్రశ్న 28.
విత్తనాలలో సుప్తావస్థను గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:

  1. విత్తనాలలో సుప్తావస్థకు అబ్ సైసిక్ ఆమ్లం అనే ఫైటో హార్మోన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
  2. సుప్తావస్థలో జీవక్రియల రేటు కనిష్ట స్థాయికి పడిపోతాయి.
  3. ఇది ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి తోడ్పడుతుంది.
  4. అనుకూల పరిస్థితులు ఏర్పడినపుడు సుప్తావస్థ తొలగించబడుతుంది.
  5. జంతువులు కూడ సుప్తావస్థను ప్రదర్శించటం గమనించదగ్గ విషయం.

ప్రశ్న 29.
జ్ఞాననాడీకణం పటం గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1
జ్ఞాననాడీ

ప్రశ్న 30.
చాలకనాడీకణం పటం గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 5

10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కింది సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

హార్మోనులుఉపయోగాలు
1) ఆక్సీనులుకణం పెరుగుదల, కాండం, వేరు విభేదనం చూపడం
2) ఆబ్ సైసిక్ ఆమ్లంపత్రరంధ్రాలు మూసుకోవడం, విత్తనాలలో సుప్తావస్థ
3) ఇథిలీన్ఫలాలు పక్వానికి రావడం
4) సైటోకైనిన్లుకణ విభాజనను ప్రేరేపించడం, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చూడడం.

i) మొక్కలలో ఉండే హార్మోనులను ఏమంటారు?
ii) మొక్కల పెరుగుదలకు తోడ్పడే హార్మోను ఏది?
iii) రైతులు వచ్చి మామిడికాయల మధ్యలో కార్బెడ్ ను ఉంచుతారు. దీనికి కారణం ఏమిటి ? నాలుగైదు రోజుల తర్వాత ఏమి గమనించవచ్చు?
iv) మొక్కలు కూడా జంతువుల మాదిరిగా ప్రతిస్పందిస్తాయి. నీవు దీనిని అంగీకరిస్తావా ? నీ సమాధానాన్ని సమర్ధించండి.
జవాబు:
i) మొక్కలలో ఉండే హార్మోన్లను ‘ఫైటోహార్మోన్లు’ అంటారు.
ii) మొక్కల పెరుగుదలకు ఆక్సిన్స్, సైటోకైనిన్స్ తోడ్పడతాయి.
iii) కార్బైడ్ నుండి విడుదలయ్యే ఇథిలీన్ కాయలను పండిస్తుంది. అందువలన పచ్చి మామిడికాయలు నాలుగు రోజుల తరువాత పండినట్టు కనిపిస్తాయి.
iv) అవును. మొక్కలు వేసవికి పత్రాలను రాల్చుతాయి. వర్షానికి ఆకులు వేస్తాయి. వసంత ఋతువులో పుష్పిస్తాయి. అత్తిపత్తి వంటి మొక్కలు తాకగానే ముడుచుకుపోతాయి.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 2.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 6
పై పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వంది.
1. వినాళ గ్రంథులు మరియు హార్మోన్ల యొక్క ప్రాముఖ్యతను వ్రాయండి.
జవాబు:

  1. 1905 వ సం||లో స్టార్లింగ్ అనే ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త రక్తంలో స్రవించే సంఘటనలను నియంత్రించే పదార్థాలకు “హార్మోనులు” అని పేరుపెట్టాడు. హార్మోన్లను స్రవించే గ్రంథులను “వినాళ గ్రంథులు” (Endocrine glands) అని అంటారు.
  2. వీటి స్రావాలను తీసికొని వెళ్ళడానికి ఎటువంటి నాళాలుగాని, గొట్టాలుగాని ఉండవు. అవి నేరుగా రక్తంలో కలసిపోతాయి. అందువల్ల వాటిని వినాళగ్రంథులు అంటారు.
  3. శరీరంలోని వివిధ చర్యలు హార్మోనుల ద్వారా నియంత్రించబడి నాడీ వ్యవస్థతో సమన్వయపరుస్తుంది.
  4. ఎముకల పెరుగుదల, సాధారణ పెరుగుదల, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి వివిధ జీవన క్రియలలో హార్మోనులు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

2. ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ ఏది?
జవాబు:
సొమాటోట్రోపిన్ ఎముకల పెరుగుదలకు ప్రాముఖ్యత వహిస్తుంది. పీయూష గ్రంథి, సొమాటోట్రోపిన్ హార్మోను స్రవిస్తుంది. ఇది మెదడు అడుగుభాగంలో ఉంటుంది.

3. ఒకవేళ టెస్టోస్టిరాను స్రవించకుంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
టెస్టోస్టిరాన్ హార్మోనును ముష్కాలు స్రవిస్తాయి. ఇది గానీ స్రవించకుంటే పురుషులలో ముఖంపై పెరిగే వెంట్రుకలు, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పులు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి జరగదు.

4. థైరాక్సిన్ స్రవించే వినాళ గ్రంథి మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
థైరాక్సిన్ స్రవించే వినాళ గ్రంధి మెడభాగంలో వాయునాళం దగ్గరలో ఉంటుంది.

5. స్త్రీలలో, పురుషులలో ఇద్దరిలోనూ ఉండే వినాళ గ్రంథులు ఏవి?
జవాబు:
పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి ఈ రెండు వినాళ గ్రంథులు స్త్రీలలో, పురుషులలో ఉండే గ్రంధులు.

ప్రశ్న 3.
మానవ మెదడులోని వివిధ భాగాలను తెలిపి అవి నిర్వర్తించే విధులను పట్టిక రూపంలో రాయండి.
(లేదా)
మెదడులోని ముఖ్యమైన భాగాల పేర్లను తెల్పి, ముందు మెదడు విధులను తెల్పండి.
జవాబు:
మానవ మెదడులోని భాగాలు :

  1. 1ముందు మెదడు : మస్తిష్కం, ద్వారగోర్థం
  2. మధ్య మెదడు : దృక్ గోళాలు
  3. వెనుక మెదడు : అనుమస్తిష్కం, మజ్జిముఖం.

ముందు మెదడు విధులు :
1. మస్తిష్కం :

  1. మానసిక సామర్థ్యాలకు స్థావరం, ఆలోచనలను, జ్ఞాపకాలను కారణాలు వెతికే శక్తి, ఊహాశక్తి, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది.
  2. అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం.

2. ద్వారర్థం :

  1. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట.
  2. నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు.

మధ్య మెదడు విధులు :
i) మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్ కు పంపుతాయి.
ii) దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతాయి.

వెనుక మెదడు విధులు :
1) అనుమస్తిష్కం (Cerebellum) :
i) శరీర సమతాస్థితిని; భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది.
ii) మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది.

2) మజాముఖం (Medulla oblongata) :
1) శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రం.
(వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది.)
ii) మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 4.
మొక్కలలో కనిపించే వివిధ రకాల అనువర్తనాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
మొక్కలు కింది అనువర్తనాలు ప్రదర్శిస్తాయి.
1) కాంతి అనువర్తనం :
కాంతికి అనుకూలంగా మొక్కలు ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
ఉదా : కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలలో తీగలు కాండం కాంతి సోకుతున్న వైపుకు పెరుగుతుంది.

2) గురుత్వానువర్తనం :
మొక్కలలో వేర్లు భూమివైపు అంటే గురుత్వాకర్షణ బలం వైపుకు ప్రతిస్పందిస్తాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.

3) నీటి అనువర్తనం :
రాళ్ళను గాని, గోడలను గాని అంటిపెట్టుకుని పెరిగే మొక్కలలో వేర్లు రాయి లేదా గోడవైపు నుండి దూరంగా నేలలో నీరు ఉన్నవైపు పెరుగుతాయి. ఇటువంటి ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు.

4) స్పరానువర్తనం :
స్పర్శ లేదా తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను స్పర్శానువర్తనం అంటారు.
ఉదా : దోసకాయ, కాకరకాయ వంటి తీగలలో కాండం బలహీనంగా ఉండి సన్నగా ఉండడం చేత పైకి ఎగబ్రాకదు.. నులి తీగలు మొక్కలు నిలువుగా పెరగడానికి దోహదం చేస్తాయి.

5) రసాయనికానువర్తనం :
పక్వం చెందిన కీలాగ్రం తియ్యని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగ రేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఉద్దీపనలకు పరాగ రేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగ నాళం పరాగ రేణువు నుంచి బయలుదేరి ఫలదీకరణం కొరకు అండాన్ని చేరుతుంది. ఇటువంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను రసాయనికానువర్తనం అంటారు.

ప్రశ్న 5.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 7
i) ప్రక్క చిత్రం మన శరీరంలోని ఏ వ్యవస్థకు చెందినది?
జవాబు:
మానవ నాడీ వ్యవస్థ

ii) A మరియు B భాగముల పేర్లను వ్రాయుము.
జవాబు:
A) అనుమస్తిష్కం
B) మజ్జిముఖం

iii) భాగము ‘C’ ను అతి ప్రధాన వినాళ గ్రంథిగా పిలుస్తారు. దీని పేరేమి?
జవాబు:
పీయూష గ్రంథి లేక పిట్యూటరీ గ్లాండ్

iv) ప్రక్క చిత్రంలోని ఏ భాగం సమస్యలను పరిష్కరించడానికి, పజిల్స్ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది?
జవాబు:
మస్తిష్కము (సెరిబ్రమ్)

ప్రశ్న 6.
మానవుని యొక్క రెండవ మెదడుగా ఏ వ్యవస్థను అంటారు? ఎందుకో వివరించండి.
జవాబు:

  1. జీర్ణనాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తాం.
  2. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన వలయాన్ని కల్గి ఉంటుంది.
  3. జీర్ణనాళంలోని నాడీ కణజాలాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపటం లేదా అప్పుడప్పుడు అకలి సంకేతాలు పంపటం వరకే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారం పంపే న్యూరోట్రాన్స్మిటర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
  4. జీర్ల మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది.
  5. మానసిక స్థాయిని నిర్ణయించడంతో పాటు శరీరంలోని కొన్ని వ్యాధులను నిర్ణయించటంలో కీలకపాత్ర వహిస్తుంది.
  6. బాహ్య ప్రపంచం నుండి మనం తీసుకునే ఆహారం వలన కలిగే వైవిధ్యమైన భౌతిక రసాయన ఉద్దీపనలు ఆహారనాళాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి.
  7. కండర నిర్మాణాలు, నాడీ నిర్మాణాలు సమన్వయం చేస్తూ జరిగే అనేక కదలికలకు నిలయంగా ఉంటుంది.
  8. ఆహారవాహిక నుండి పాయువు వరకు దాదాపు 9 మీటర్ల పొడవు కల్గి జీర్ణనాడీ వ్యవసగా పిలువబడే రెండవ మెదడులోని అనేక నాడులు, పొరల రూపంలో జీర్ణాశయపు గోడలలో ఇమిడి ఉంటాయి.
  9. ఆహారాన్ని చిన్న చిన్న రేణువులుగా విచ్చిన్నం చేయడం, పోషకాలను గ్రహించటం, వ్యర్థాలను విసర్జించటం లాంటి జీవక్రియలను ఉత్తేజపర్చటం, సమన్వయం చేయడం కొరకు యాంత్రిక మిశ్రమీకరణ విధానాలు లయబద్ధంగా కండర సంకోచాలు జరపటంలో సహాయపడుతుంది.
  10. స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తి కలిగి ఉండటం వలన జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 7.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

అవయవంపట్టిక -1
నాడీ వ్యవస్థ ప్రభావం
పట్టిక – 2
నాడీ వ్యవస్థ ప్రభావం
1. కన్నుకనుపాప పెద్దదగుటకనుపాప యథాస్థితికి రావడం
2. నోరులాలాజలం స్రవించడం ఆపడంలాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరచడం
3. ఊపిరితిత్తులుశ్వాసనాళం పెద్దది కావడంశ్వాసనాళం యథాస్థితికి రావడం
4. గుండెహృదయ స్పందన వేగాన్ని పెంచడంహృదయ స్పందన వేగాన్ని తగ్గించడం
5. రక్తనాళాలురక్తపీడనాన్ని పెంచడంరక్తపీడనాన్ని తగ్గించడం
6. క్లోమంక్రియావేగాన్ని తగ్గించడంక్రియావేగాన్ని పెంచడం

i) సహానుభూత నాడీవ్యవస్థ నిర్వహించే రెండు విధులను రాయండి.
జవాబు:
కనుపాప పెద్దదగుట, లాలాజలం స్రవించడం ఆపడం మొదలగునవి.

ii) సహానుభూత పరనాడీ వ్యవస్థ ప్రభావం చూపే రెండు అవయవాల పేర్లు రాయండి.
జవాబు:
కన్ను, గుండె మొదలగునవి.

iii) పై పట్టిక ప్రకారం రక్త పీడనం పెంచడంపై ప్రభావం చూపే నాడీ వ్యవస్థను తెలపంది.
జవాబు:
సహానుభూత నాడీ వ్యవస్థ

iv) ఏయే నాడీ వ్యవస్థలు కలసి స్వయం చోదిత నాడీ వ్యవస్థను ఏర్పరుచును?
ఎ. సహానుభూత, సహానుభూత పర నాడీవ్యవస్థ

ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించండి. ఈ పటం ఏ ప్రక్రియను తెలియచేస్తుంది ? ఈ ప్రక్రియను ఒక ఫ్లో చార్టు రూపంలో వివరించండి.
జవాబు:
ఫ్లో చార్టు :
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 8

ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాములు వ్రాయుము.

విభాగం – Iవిభాగం – II
ఆక్సిక్స్అడ్రినలిన్
జిబ్బరెల్లిన్స్టెస్టోస్టీరాన్
ఇథిలీన్ఈస్ట్రోజెన్
అబ్సెసిక్ ఆమ్లంథైరాక్సిన్
సైటోకైనిన్లుపెరుగుదల హార్మోన్

a) దేని ఆధారంగా పై వర్గీకరణ జరిగినది?
జవాబు:
మొక్కలు మరియు జంతువులనందు ఉత్పత్తి అగు హార్మోన్స్ ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది.

b) అడ్రినలిన్ ఎ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
అడ్రినల్ గ్రంథి నుండి అడ్రినలిన్ ఉత్పత్తి అవుతుంది.

c) ఏ హార్మోన్ చర్య వలన పత్రరంధ్రాలు మూసుకుంటాయి?
జవాబు:
అబ్సెసిక్ ఆమ్లం చర్య వలన పత్రరంధ్రాలు మూసుకుంటాయి.

d) ఆక్సిన్స్ యొక్క విధులేవి ?
జవాబు:
ఆక్సిన్స్ విధులు :
మొక్కలలో కణం పెరుగుదల మరియు కాండం, వేర్లు విభేదనం

ప్రశ్న 10.
కార్తీక్ మూత్రంలో అధికశాతం చక్కెర కలిగియుండడం, వరుణ్ ఎక్కువసార్లు తక్కువ గాధత గల మూత్రాన్ని విసర్జించడం జరుగుచున్నది. ఈ రెండు వ్యాధులకు కారణములను వివరించండి.
జవాబు:

  1. మూత్రంలో అధిక చక్కెర కల్గివున్న స్థితిని డయాబిటస్ మిల్లిటస్ (మధుమేహము) అందురు.
  2. ఎక్కువసార్లు తక్కువ గాఢత గల మూత్రాన్ని విసర్జించటమనే స్థితిని డయాబిటస్ ఇన్సిపిడస్ (అతిమూత్ర వ్యాధి) అందురు.
  3. శరీరంలో ఇన్సులిన్ స్రావము తగ్గినపుడు రక్తంలో అధిక చక్కెర స్థాయి కలిగిన డయాబిటస్ మిల్లిటస్ కలుగును.
  4. వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢతగల మూత్ర విసర్జన చేయవలసి వుంటుంది. దీనినే డయాబిటస్ ఇన్సిపిడస్ (లేదా) అతిమూత్రవ్యాధి అందురు.

ప్రశ్న 11.
మొక్కలలో పెరుగుదలను నియంత్రించే ఫైటో హార్మోన్ల గురించి వివరించండి.
జవాబు:
1. ఆక్సిన్లు :
కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనం

2. జిబ్బరెల్లిన్లు :
విత్తనాల అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవవటం, పుష్పించడానికి ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం.

3. సైటోకైనిన్లు :
కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వకోరకాలు పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చేయడం, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం.

4. అబ్ సైసిక్ ఆమ్లం :
పత్ర రంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ.

5. ఈథలీన్ : ఫలాలు పక్వానికి రావడం.

ప్రశ్న 12.
నాడీకణం నిర్మాణం తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 9
నాడీకణంలో ‘3’ ముఖ్య భాగాలు కలవు.

  1. కణ దేహం
  2. డెండ్రైటులు
  3. ఆక్సాన్

1) కణదేహం :
కణదేహాన్ని సైటాన్ అని కూడా అంటారు. దీనిలో పెద్ద కేంద్రకం కలదు. దీని జీవ పదార్థంలో పెద్ద పెద్ద రేణువులుండును. వీనిని “నిస్సల్ కణికలు” అంటారు. అవి R.N.A. మరియు ప్రోటీన్లతో ఏర్పడును. నాడీకణంలో జరిగే సంశ్లేషణ చర్యలన్నీ కణదేహంలో జరుగును.

2) బెండైటులు :
కణదేహం నుండి చెట్టు ఆకారంలో, అమరి వుండే నిర్మాణాలనే “డెండైటులు” అంటారు. వీటి సంఖ్య ఒకటి నుండి అనేక వేల వరకు ఉంటుంది. ఇవి ఇతర నాడీకణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందజేస్తాయి.

3) ఆక్సాస్ :
ఇది నాడీ కణదేహం నుండి ఏర్పడుతుంది. ప్రతి నాడీకణానికి ఒకే ఒక ఆక్సాన్ ఉండును. ఇది చాలా పొడవుగా ఉండును. ఈ నాడీ పోగులు డెండ్రైటులతో, నాడీకణాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ప్రచోదనాలు వీని ద్వారా వేగంగా ప్రయాణిస్తాయి.

ప్రశ్న 13.
క్రియను అనుసరించి నాడులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
క్రియను అనుసరించి నాడులు మూడు రకాలు. అవి :
1) అభివాహి నాడులు (Afferent nerves) :
ఈ నాడులు కేంద్రీయ నాడీ వ్యవస్థ (మెదడు + వెన్నుపాము) వైపు సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. ఇవి సమాచారాన్ని పరిసరాలలో మార్పును కండరాలపై నున్న నాడీ అంత్యాల ద్వారా (వీటికి stimulus detections ఉద్దీపనల నిర్ధారణ) ద్వారా మెదడు తీసుకొని వెళ్తాయి. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు.

2) అపచాలక నాడులు :
ఈ నాడులు కేంద్రీయ వ్యవస్థ (మెదడు) నుండి సమాచారాన్ని శరీరంలో నాడీ అంత్యాలు ఉండే వివిధ భాగాలకు తీసుకొని వెళ్తాయి. వీటినే చాలకనాడులు అంటారు.

3) సహ సంబంధనాడులు :
ఈ అపవాహక, అభివాహక నాడులు రెండింటిని కలుపుతాయి.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 14.
ప్రతిక్రియ ప్రతిచర్యాచాపం అనగానేమి? దానిలో పాల్గొనే భాగాలు తెలపండి.
జవాబు:
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం :
ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ను “ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం” అంటారు.

ప్రతీకార చర్యాచాపములో భాగమునిర్వర్తించు పని
1) గ్రాహకము1) వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది.
2) జ్ఞాన (అభివాహి) నాడీకణం2) గ్రాహకము నుండి వార్తలను వెన్నుపాములోనికి మధ్యస్థ నాడీకణాలకు చేరవేస్తుంది.
3) మధ్యస్థ నాడీకణము3) వార్తలను విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది.
4) చాలక నాడీకణము4) వెన్నుపాము నుండి వార్తలను నిర్వాహక అంగానికి చేరవేస్తుంది.
5) నిర్వాహక అంగము5) అపవాహి నాడి నుండి వార్తలను గ్రహించి, ప్రతిచర్యలను చూపిస్తుంది.

ప్రశ్న 15.
వెన్నుపాము నిర్మాణం తెలపండి.
జవాబు:

  1. వెన్నుపాము పొడవుగా స్థూపాకారంలో ఉంటుంది.
  2. ఇది మొండెము పృష్టతలం (వీపు) పొడవునా, వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది.
  3. వెన్నెముకలో వుండే వెన్నుపూసలు దీనికి హాని కలుగకుండా రక్షణనిస్తాయి.
  4. వెన్నుపాము మధ్యలో శృంగాలతో కూడిన బూడిద రంగు పదార్థం ఉంటుంది.
  5. ఈ శృంగాలలో పైన వుండే వాటిని పృష్ట శృంగాలు అనీ, దిగువగా వుండే వాటిని ఉదర శృంగాలు అనీ అంటారు.
  6. బూడిదరంగు పదార్థంలో ఉండే కుల్యని నాడీకుల్య అంటారు.
  7. ఇది వెన్నుపాము పొడవునా ఉంటుంది.
  8. ఈ నాడీకుల్య మస్తిష్కమేరు ద్రవంతో నిండి ఉంటుంది.

ప్రశ్న 16.
స్వయంచోదిత నాడీవ్యవస్థ అనగానేమి? ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు శరీర అంతర్భాగాలు. రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అటువంటి పరిధీయ నాడీవ్యవస్థను స్వయంచోదిత నాడీవ్యవస్థ (Automatic Nervous System) అని అంటారు. అంతేకాకుండా చర్మంలోని కొన్ని కండర ప్రాంతాలలో మరియు అస్థి కండరాలలో నియంత్రిత విధిని కలిగి ఉంటుంది.

స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధి యొక్క ఉదాహరణను చూస్తే మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడం అని చెప్పవచ్చు.

మనం ఎప్పుడైతే చీకటి గదిలో ప్రవేశిస్తామో వెళ్ళిన వెంటనే మనకు ఏమీ కనబడదు. మెల్ల మెల్లగా గదిలోని వస్తువులు చూస్తుంటాం. ఎందుకంటే అప్పుడు మన కంటిపాప యొక్క వ్యాసం పెరగడం వలన ఎక్కువ కాంతి లోపలికి వస్తుంది. చీకటి గది నుండి బయటకు అధిక వెలుతురులోకి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసం తగ్గిపోయి తక్కువ కాంతి పడేటట్లు చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయంచోదిత నాడీవ్యవస్థ ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 17.
ఏదైనా వేడి వస్తువు మీ చేతికి తాకినప్పుడు వెంటనే మీకు తెలియకుండా చేతిని వెనుకకు ఎలా తీసివేయగలుగుతారో తెలియజెప్పండి.
జవాబు:

  1. ఏదైనా వస్తువును తాకినప్పుడు మనకు తెలియకుండా చేతిని వెనుకకు తీసివేస్తాము.
  2. ఇది నిబంధన రహిత ప్రతీకార చర్య.
  3. ఇది మనకు పుట్టుకతోనే, వారసత్వంగా సంక్రమిస్తుంది.
  4. చేయి అనే గ్రాహకం వేడి అనే ప్రేరణ సమాచారాన్ని గ్రహించి, విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది.
  5. జ్ఞాననాడి ఈ తరంగాలను వెన్నుపాములోని మధ్యస్థ నాడీ కణాలకు చేరవేస్తుంది.
  6. ఈ మధ్యస్థ నాడీ కణాలు ఈ సమాచారాన్ని విశ్లేషించి, ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి.
  7. మధ్యస్థ నాడీకణాల నుండి చాలకనాడులు ఈ సమాచారాన్ని నిర్వాహక అంగమైన కండరాలకు చేరవేస్తాయి.
  8. అందువల్ల కండరాలు సంకోచించి చేయి వెనుకకు తీసుకోబడుతుంది.

ప్రశ్న 18.
మానవ శరీరంలోని వినాళ గ్రంథులు తెలిపి అవి ఉత్పత్తి చేసే హార్మోన్స్ వాటి ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 10 AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 11

ప్రశ్న 19.
‘జంతురాజ్యంలో మానవ మెదడు అతిక్లిష్టమైన అంగము’ – వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. జంతు రాజ్యంలో మానవుని మెదడును అతిక్లిష్టమయిన నిర్మాణంగా పరిగణిస్తారు.
  2. దీనిలో పది బిలియన్లకు పైగా నాడీకణాలు, అంతకు 10 నుండి 50 రెట్లు గ్లియల్ కణాలు ఉన్నాయి.
  3. ఒక్క మస్తిష్క వల్కలంలోనే సుమారు 2.6 బిలియనుల నాడీకణాలు ఉన్నాయి.
  4. ఒక్కొక్క నాడీకణము ఇతర నాడీకణాల నుండి సుమారు 100 నుండి 10,000 వార్తలను గ్రహించి, విద్యుత్ ప్రకంపనాలను సెకనుకి 0.6 నుండి 120 మీటర్ల వేగంతో తీసుకొనిపోతుంది.
  5. మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు రెండు శాతం మాత్రమే.
  6. కాని ఇది మానవుడు తీసుకునే మొత్తం ఆక్సిజన్లో 20 శాతం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.
  7. ఇతర కణాలలా కాక, శక్తి కోసం మెదడు పూర్తిగా గ్లూకోజ్ మీదే ఆధారపడుతుంది.
  8. మెదడు శక్తి కోసం ఫాటీ ఆమ్లాలను ఉపయోగించుకోలేదు.

ప్రశ్న 20.
నాడులు వివిధ మార్గాలను సూచించే దిమ్మె చిత్రం గీయండి. సహసంబంధ నాడులు అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 12
అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. ఇవి అసంకల్పిత ప్రతీకార చర్యలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 21.
ఉద్దీపనలకు మొక్కల్లో, జంతువుల్లో ప్రతిస్పందించే తీరులో గల పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:

  1. మొక్కలు మరియు జంతువులు తమ చుట్టూ ఉండే ప్రేరణలకు ప్రతిక్రియలను చూపుతాయి. కాని అవి ప్రతిస్పందించే పద్దతి వేరువేరుగా ఉంటుంది.
  2. పెద్ద జంతువులు నాడీవ్యవస్థ మరియు అంతస్రావ వ్యవస్థల ద్వారా ప్రేరణలకు ప్రతిస్పందనలు చూపిస్తాయి.
  3. మొక్కలకు జంతువుల మాదిరిగా నాడీ మరియు అంతస్రావ వ్యవస్థలు ఉండవు. కాని అవి కొన్ని రసాయనిక పదార్దములు లేదా హార్మోనుల సహాయంతో నియంత్రణ చర్యలను చూపిస్తాయి.
  4. మొక్కలు కాంతి, ఉష్ణము, నీరు, స్పర్శ, ఒత్తిడి, రసాయన పదార్ధములు, గురుత్వాకర్షణ మొదలైన ప్రేరణలను గుర్తించగలవు.
  5. మొక్కలలో ఉండే హార్మోనులను ఫైటోహార్మోనులు అంటారు. ఇవి ప్రేరణలకు స్పందించి ప్రతిస్పందనలను నియంత్రించగలవు. ఫైటోహార్మోనులు మొక్కలకు సంబంధించి ఒకటి లేదా ఇతర పెరుగుదలకు సంబంధించిన అంశములను సమన్వయము మరియు నియంత్రణను చేస్తాయి.

ప్రశ్న 22.
ప్రతీకార చర్యాచాపం చూపే పటం గీయండి. ఈ ప్రక్రియలో కీలకపాత్ర వహించే నాడులు ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 13
ప్రతీకార చర్యలో సహసంబంధ నాడులు లేదా మధ్యస్థ నాడీకణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి ప్రచోదన ప్రయాణ మార్గాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

ప్రశ్న 23.
పరిధీయ నాడీ వ్యవస్థను చూపే పటం గీయండి.
(లేదా)
వెన్నుపాము అంతర నిర్మాణం చూపే పటం గీయండి. దీనిలో ఏ ఏ రంగు ప్రాంతాలు గమనించవచ్చు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 14
వెన్నుపాము అడ్డుకోతలో వెలుపలివైపు తెలుపురంగు పదార్థం లోపలి వైపు బూడిద రంగు పదార్థం సీతాకోక చిలుక , రెక్కల వలె అమరి ఉంటుంది.

ప్రశ్న 24.
క్రింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.
ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమపద్ధతి ఉన్నది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. మొదటి దశ ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడంతో మొదలవుతాయి. అందిన సమాచారాన్ని ప్రసారం చేయడం రెండవ దశ, సమాచారాన్ని విశ్లేషించడం మూడవదశ. ప్రచోదనానికి సరైన ప్రతిక్రియ చూపడం చివరి దశ.
అ) ఈ సమాచారం దేనిని తెలియచేస్తుంది?
ఆ) పై సమాచారాన్ని ఫ్లో చార్టు రూపంలోకి మార్చండి.
ఇ) ఈ చర్యను నిర్వహించే యంత్రాంగం గురించి రాయండి.
జవాబు:
అ) పై సమాచారం ప్రేరణకు ప్రతిస్పందన చూపడంలో ఉన్న క్రమపద్ధతిని సూచిస్తుంది.
ఆ)
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 15
ఇ) శరీరం బయట లేదా లోపల జరిగే మార్పులను నాడీ వ్యవస్థ గ్రాహక కణముల ద్వారా గ్రహిస్తుంది. విద్యుత్ ప్రచోదనల రూపంలోనికి మార్చబడిన సమాచారము విశ్లేషించబడి ప్రతిస్పందనలు వెలువడతాయి. ఈ ప్రతిస్పందనలు విద్యుత్ ప్రచోదనాల రూపంలో నిర్వాహక అంగాలైన కండర కణాలు మరియు గ్రంథి కణాలకు చేర్చబడతాయి. అవి సరియైన ప్రతిస్పందనలు చూపిస్తాయి మరియు భవిష్యత్తు అవసరాల కోసం సమాచారం నిల్వ చేయబడుతుంది.

10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 16
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థ

2.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 17
జవాబు:
మజ్జిముఖం

3.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 18
జవాబు:
పయామేటర్

4.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 19
జవాబు:
అబ్ సైసిక్ ఆమ్లం

5.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 20
జవాబు:
చాలక నాడులు

6.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 21
జవాబు:
సహసంబంధ నాడులు

7.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 22
జవాబు:
డెండ్రైట్లు

8.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 23
జవాబు:
అపవాహి నాడి

9.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 24
జవాబు:
నీటి అనువర్తనం

10.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 25
జవాబు:
హార్మోన్లు

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు మొక్క హార్మోన్లు కావు?
A. ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్
B. ఈస్ట్రోజన్, టెస్టోస్టీరాన్, అడ్రినలిన్
జవాబు:
గ్రూపు B

12. ఏ సమూహం నాడీ ప్రచోదనం యొక్క కచ్చితమైన క్రమంలో ఉంది?
A. బెంజైట్లు – కణదేహం – అక్షము – నాడీ అంత్యాలు – నాడీ కణసంధి
B. కణదేహం – అక్షము – నాడీ అంత్యాలు – రెండ్రైట్లు – నాడీ కణసంధి
జవాబు:
గ్రూపు A

13. నాడీ కణాల్లో ఉండే భాగాలు ఏవి?
A. మస్తిష్కం, గ్లియల్ కణాలు, వెన్నుపాము
B. డెండ్రైట్స్, కణదేహం, అక్షము
జవాబు:
గ్రూపు B

14. ఏ గ్రూపు గ్రంథులు హార్మోనులను స్రవిస్తాయి?
A. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి
B. కాలేయం, క్లోమం, ప్లీహం
జవాబు:
గ్రూపు A

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

15. ఏ హార్మోన్లు బీజకోశాలతో ముడిపడి ఉంటాయి?
A. థైరాక్సిన్, గొనాడోట్రోఫిన్, ఆక్సిటోసిన్
B. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్
జవాబు:
గ్రూపు B

16. ఏ గ్రూపుకి చెందిన గ్రంథులు జతగా ఉంటాయి?
A. ముష్కాలు, అండాశయాలు, అధివృక్క గ్రంధి
B. థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, క్లోమం
జవాబు:
గ్రూపు A

17. క్రింది వాటిలో అసంకల్పిత చర్యల గ్రూపు ఏది?
A. శ్వాసించడం, జీర్ణక్రియ, హృదయ స్పందన
B. మలవిసర్జన, మూత్రవిసర్జన, మింగడం
జవాబు:
గ్రూపు A

18. దిగువ పేర్కొన్న ఏ అనుభూతులు ద్వారగోరక్రంనకు సంబంధించినవి?
A. చలి, వేడి, బాధ, ఒత్తిడి
B. నిద్ర, ఆకలి, దాహం , కోపం
జవాబు:
గ్రూపు B

19. ప్రతీకార చర్యాచాపం యొక్క ఏ భాగాలు సరైన క్రమంలో ఉన్నాయి?
A. గ్రాహకం – జ్ఞాననాడి – మధ్యస్థ నాడీకణం – చాలకనాడి – నిర్వాహక అంగము
B. గ్రాహకం – మధ్యస్థ నాడీకణం – జ్ఞాననాడి – చాలకనాడి – నిర్వాహక అంగము
జవాబు:
గ్రూపు A

20. ఏ గ్రూపు హార్మోన్లు ప్రధాన గ్రంథి నుంచి స్రవించబడతాయి?
A. ఇన్సులిన్, గ్లూకాగాన్, థైరాక్సిన్
B. సోమాటో ట్రోఫిన్, థైరోట్రోఫిన్, ల్యూటినైజింగ్ హార్మోన్
జవాబు:
గ్రూపు B

శాస్త్రవేత్తను గుర్తించండి

21. ఆయన గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త. శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గమనించారు. వానిలో సంబంధమైనది అని తెలియజేశారు.
జవాబు:
గాలన్

22. కొన్ని జంతువులలో మెదడును తొలగించినప్పటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపించడాన్ని వీరు ఇరువురు గుర్తించారు.
జవాబు:
లియోనార్డో డావిన్సీ & స్టీఫెన్ హేల్స్

23. వెన్నెముకకు సంబంధించి రెండు మూలాలు ఉంటాయని ఒకటి పృష్ఠమూలం మరొకటి ఉదరమూలం మరియు అవి వేర్వేరు విధులను నిర్వహిస్తాయి అని నిరూపించారు.
జవాబు:
చార్లెస్ బెల్ & ఫ్రాంకోయిస్ మెంజెండై

24. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన వ్యాధి నిర్ధారణ శాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరించారు మరియు క్లోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేశారు.
జవాబు:
పాల్ లాంగర్ హాన్స్

25. వారు కుళ్ళిపోయిన జంతువుల క్లోమం నుండి ఇన్సులినను వేరుచేశారు. వారి కృషి ఫలితంగా నేడు ఇన్సులినను ఎక్కువ మంది డయాబెటిస్ రోగుల చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.
జవాబు:
టొరంటో, బాంటింగ్, బెస్ట్ & మెక్ లాడ్

26. ఆయన ఆంగ్ల శరీరధర్మ శాస్త్రవేత్త. వినాళగ్రంథుల నుండి స్రవించే పదార్థాలకు హార్మోన్ అని పేరు పెట్టారు.
జవాబు:
స్టార్టింగ్

27. వీరు కాంతి అనువర్తనం మీద అనేక ప్రయోగాలు చేశారు. అంకురం పైన పార్శ్వ కాంతి సోకేలా చేసినప్పుడు ఏదో ప్రభావం పై నుండి క్రిందకి ప్రసరించడం వలన మొక్కలో వంపుకి కారణమవుతుందని వారు నిర్ధారించారు.
జవాబు:
చార్లెస్ డార్విన్ & ఫ్రాన్సిస్ డార్విన్

28. ఆయన డచ్ వృక్ష శరీరధర్మ శాస్త్రవేత్త. ఓటు ధాన్యం అంకురం యొక్క ప్రాంకుర కవచం మీద ప్రయోగాలు నిర్వహించి ఒక రసాయనాన్ని వేరుచేసి దానికి ఆక్సిస్ అని పేరు పెట్టాడు.
జవాబు:
FW, వెంట్

ఉదాహరణ ఇవ్వండి

29. కాలేయం నాళసహిత గ్రంథికి ఒక ఉదాహరణ. ప్రధాన గ్రంథిగా వ్యవహరించే వినాళగ్రంధికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పిట్యూటరీ గ్రంథి ఒకటి జ్ఞాన సంబంధమైనది మరొకటి చర్యకు

30. ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి సహాయపదే హార్మోను మరొక ఉదాహరణ ఇవ్వంది.
జవాబు:
గ్లూకగాన్

31. వాసోప్రెస్సి లోపించడం వలన దయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డయాబెటిస్ మెల్లిటస్

32. ముష్కల ప్రత్యుత్పత్తి అవయవంగా మరియు వినాళగ్రంథి వలె పనిచేస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఇవ్వంది.
జవాబు:
అండకోశాలు

33. పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కారణం. అదేవిధంగా స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు పాత్ర వహించే హార్మోన్ కు ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్రోజన్

34. మనుషులలో ప్రతీకార చర్యకు మోకాలి కుదుపు ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
దగ్గడం / తుమ్మడం / కాంతి కళ్ళ మీద పడినప్పుడు కళ్ళు మూయడం.

35. ‘మైమోసా ప్యూడికాను స్పర్శానువర్తనానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
వీనస్ ఫై ట్రాప్ / డయోనియా (కీటకాహార మొక్కలు)

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

36. కాంతి అనువర్తనానికి, కాండం ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పత్రాలు

37. సైటోకైనిన్ అనే ఫైటోహార్మోన్, పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో సహాయపడుతుంది. పత్రరంధ్రాలు మూసుకోవడంలో సహాయపడే ఫైటోహార్మోను మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అబ్ సైసిక్ ఆమ్లం

38. వరాగనాళం అందాలవైపు పెరగడం రసాయన అనువర్తనం. స్పర్శానువర్తనానికి మరొక ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
నులితీగలు

జతపరచుట

39. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
విప్పారిన కనుపాప – సహానుభూత నాడీవ్యవస్థ
సంకోచించిన కనుపాప -సహానుభూత పరనాడీ వ్యవస్థ
భూమి మీద శరీరం స్థితి మరియు సమతాస్థితి – మజ్జిముఖం
జవాబు:
భూమి మీద శరీరం స్థితి మరియు సమతాస్థితి – మజ్జిముఖం

40. సరిగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కపాల నాడులు – 31 జతలు
పరిధీయ నాడులు – 43 జతలు
కశేరు నాడులు – 12 జతలు
జవాబు:
పరిధీయ నాడులు – 43 జతలు

41. తప్పుగా జత చేయబడిన దానిని గుర్తించండి.
కాంతి అనువర్తనం – స్పర్శ లేదా తాకడం
నీటి అనువర్తనం – నీరు
గురుత్వానువర్తనం – గురుత్వాకర్షణ శక్తి
జవాబు:
కాంతి అనువర్తనం – స్పర్శ లేదా తాకడం

42. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
అడ్రినలిన్ – జీవక్రియ కార్యకలాపాలు
సొమాటో ట్రోఫిన్ – ఎముకల పెరుగుదల
థైరాక్సిన్ – రక్తంలో చక్కెర పెరుగుదల
జవాబు:
సొమాటోట్రోఫిన్ – ఎముకల పెరుగుదల

43. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
వెన్నుపాము – ప్రతీకార చర్యలు
అనుమస్తిష్కం – కండరాల కదలికలు
మధ్యమెదడు – చూపు మరియు వినికిడి ప్రతి చర్యలు
జవాబు:
అనుమస్తిష్కం – కండరాల కదలికలు

44. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఇథిలీన్ – పండు పండటం
ఆక్సినులు – కాండం పాడవడం
జిబ్బరెల్లిన్స్ – కణవిభజన
జవాబు:
ఇథిలీన్ – పండు పండటం

45. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
పిట్యూటరీ గ్రంథి – మెదడు
థైరాయిడ్ గ్రంథి – మెడ
అడ్రినల్ గ్రంథి – తల
జవాబు:
అడ్రినల్ గ్రంథి – తల

46. సరిగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముందు మెదడు – అనుమస్తిష్కం
మధ్య మెదడు – దృక్ లంబికలు
వెనుక మెదడు – మస్తిష్కం
జవాబు:
మధ్య మెదడు – దృక్ లంబికలు

47. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించంది.
నిస్సల్ కణికలు – కణదేహం
రన్వీర్ కణుపులు – డెంజైట్లు
ష్వాన్ కణాలు – మైలీన్ తొడుగు
జవాబు:
రవీర్ కణుపులు – డెండ్రైట్లు

48. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మెదడు – కపాలం
గైరి – మస్తిష్కంలోని గట్లు
సల్సి – మస్తిష్కంలోని గాడులు
జవాబు:
మెదడు – కపాలం

విస్తరించుము

49. CNS – Central Nervous System / కేంద్రీయ నాడీ వ్యవస్థ
50. PNS – Peripheral Nervous System / పరిధీయ నాడీవ్యవస్థ
51. ANS – Autonomous Nervous System / స్వయంచోదిత నాడీవ్యవస్థ

నేను ఎవరు?

52. రెండు నాడీకణాల మధ్య ఉన్న క్రియాత్మక ప్రాంతం నేను. ఒక నాడీకణం నుంచి మరొక నాడీకణానికి సమాచారం బదిలీ చేయడానికి తోడ్పడతాను.
జవాబు:
సైనాప్స్ / నాడీ కణసంధి

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

53. జ్ఞానేంద్రియాల నుంచి కేంద్రీయ నాడీవ్యవస్థ వైపుకు సందేశాలను తీసుకెళ్లే నాడిని నేను.
జవాబు:
జ్ఞాననాడులు / అభివాహినాడులు

54. నేను అసంకల్పిత చర్యల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని.
జవాబు:
ప్రతీకార చర్యాచాపం

55. ఆలోచనా, జ్ఞాపకశక్తి, తర్కం, గ్రహణశక్తి, ఉద్రేకం, సంభాషణ వంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగాన్ని ,
జవాబు:
మస్తిష్కం

56. ‘నేను కేంద్రనాడీ వ్యవస్థ చుట్టూ ఉండే ద్రవం లాంటి భాగాన్ని. కేంద్రీయ నాడీవ్యవస్థను షాకుల నుండి దెబ్బల నుండి రక్షణ కల్పిస్తాను.
జవాబు:
మస్తిష్కమేరు ద్రవం

57. పాన్స్ వెరోలి నుంచి వెన్నుపాము వరకు విస్తరించి ఉన్న నేను త్రిభుజాకార నిర్మాణాన్ని, హృదయ స్పందన, శ్వాసకోశ మరియు వాసోమోటర్ కార్యకలాపాలను నియంత్రిస్తాను.
జవాబు:
మజ్జిముఖం

58. నేను ఒక రకమైన నాడీవ్యవస్థ. కాంతి లేదా చీకటి పరిస్థితులలో ఉన్నప్పుడు కనుపాప కదలికలను నియంత్రిస్తాను.
జవాబు:
స్వయంచోదిత నాడీవ్యవస్థ

59. వినాళగ్రంథుల నుండి స్రవించే ‘ప్రేరేపించుట’ అనే అర్థం గల పదార్థాన్ని.
జవాబు:
హార్మోన్

60. “అడ్రినలిన్ స్థాయి పెరగడం కోపానికి దారి తీస్తుంది. అడ్రినలిన్ స్థాయి తగ్గుదల సాధారణ స్థితికి దారి ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు. తీస్తుంది.” ఈ రకమైన సమతుల్యం హార్మోన్ స్థాయిలు నా చేత నియంత్రించబడతాయి.
జవాబు:
పునఃశ్చరణ యాంత్రికం

61. స్పర్శ ద్వారా నాస్టిక్ చలనాన్ని చూపించే మొక్క నేను. ఆ ఆకులను తాకినప్పుడు అవి వెంటనే ముడుచుకుపోతాయి.
జవాబు:
మైమోసా పూడికా

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

62. ఒక రాయి దగ్గర మొక్క పెరుగుతుండగా వేర్లు, రాయికి దూరంగా నేలలో ఎక్కడ నీరు దొరుకుతుందో ఆ దిశలో పెరుగుతుంది. ఈ రకమైన అనువర్తనాన్ని గురుత్వాను వర్తనం అంటారు.
జవాబు:
ఒక రాయి దగ్గర మొక్క పెరుగుతుండగా వేర్లు, రాయికి దూరంగా నేలలో ఎక్కడ నీరు దొరుకుతుందో ఆ దిశలో పెరుగుతుంది. ఈ రకమైన అనువర్తనాన్ని నీటి అనువర్తనం అంటారు.

63. సాధారణ స్థాయి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం క్లోమంలోని కణాలు రక్తంలోకి గ్లూకాగాను ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
సాధారణ స్థాయి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం క్లోమంలోని కణాలు రక్తంలోకి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి.

64. మూత్రాశయం యొక్క సంకోచ, సడలింపులు సహాను భూత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి.
జవాబు:
మూత్రాశయం యొక్క సంకోచ, సడలింపులు స్వయం చోదిత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి.

65. మెదడు పెరికార్డియం అనే మూడు పొరలచే కప్పబడి ఉంటుంది.
జవాబు:
మెదడు మెనింజస్ అనే మూడు పొరలచే కప్పబడి ఉంటుంది.

66. అభివాహినాడులు సమాచారాన్ని కేంద్రీయ నాడీవ్యవస్థ నుండి నిర్వాహక అవయవానికి చేరవేస్తాయి.
జవాబు:
చాలక / అపవాహి నాడులు సమాచారాన్ని కేంద్రీయ నాడీవ్యవస్థ నుండి నిర్వాహక అవయవానికి చేరవేస్తాయి.

67. ఒక నాడీకణం యొక్క డెండ్రైట్స్ ఒకదానితో మరొకటి లేదా ఇతర నాడీకణం యొక్క డెండ్రైట్స్ తో కలిసే ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు.
జవాబు:
ఒక నాడీకణం యొక్క డెండ్రైట్స్ ఒకదానితో మరొకటి లేదా ఇతర నాడీకణం యొక్క అక్షముతో కలిసే

68. పార్శ్వ కోరకం, అగ్రకోరకం యొక్క పెరుగుదలను నియంత్రించడం జిబ్బరెల్లిన్ అనే మొక్క హార్మోన్ ఆధీనంలో ఉంటుంది.
జవాబు:
పార్శ్వ కోరకం, అగ్రకోరకం యొక్క పెరుగుదలను నియంత్రించడం ఆక్సినులు అనే మొక్క హార్మోన్ ఆధీనంలో ఉంటుంది.

69. పజిల్స్ కు పరిష్కారం కనుగొనే మెదడులోని భాగం అనుమస్తిష్కం.
జవాబు:
పజిలకు పరిష్కారం కనుగొనే మెదడులోని భాగం మస్తిష్కం

70. పువ్వులు మరియు ఆకులను తాజాగా ఉంచడానికి అబ్ సైసిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
జవాబు:
పువ్వులు మరియు ఆకులను తాజాగా ఉంచడానికి సైటోకైనిన్స్ ఉపయోగపడుతుంది.

పోలికను గుర్తించుట

71. కనుపాప విస్తరణ : సహానుభూత నాడీ వ్యవస్థ :: కనుపాప సంకోచం 😕
జవాబు:
సహానుభూత పరనాడీ వ్యవస్థ

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

72. కశేరు నాడులు : 31 జతలు : : ? : 12 జతలు
జవాబు:
కపాల నాడులు

73. జ్ఞాన నాడులు : అభివాహి నాడులు : : చాలక నాడులు 😕
జవాబు:
అపవాహి నాడులు

74. పత్రరంధ్రము మూసుకోవడం : అబ్ సైసిక్ ఆమ్లం : : పత్రరంధ్రము తెరుచుకోవడం 😕
జవాబు:
సైటోకైనిన్

75. కణం పెరుగుదల : ఆక్సిన్లు :: కాండం యొక్క పెరుగుదల 😕
జవాబు:
జిబ్బరెల్లిన్స్

76. థైరాయిడ్ : మెడ :: ? : మెదడు
జవాబు:
పిట్యూటరీ గ్రంథి

77. కాంతి అనువర్తనం : ? :: గురుత్వానువర్తనం : వేరు
జవాబు:
కాండం

78. మెదడు : కపాలం :: ? : వెన్నెముక
జవాబు:
కశేరు నాడీ దండం

79. నిస్సల్స్ గుళికలు : కణదేహం :: ష్వాన్ కణం 😕
జవాబు:
మైలీన్ తొడుగు

80. మైమోసా పూదిక : స్పర్శాసువర్తనం :: ఫలవంతమైన కీలాగ్రం 😕
జవాబు:
రసాయన అనువర్తన చలనం

బొమ్మలపై ప్రశ్నలు

81.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 26
పటంలో గుర్తించిన ‘భాగం X పేరేమిటీ?
జవాబు:
నాడీకణసంధి

82.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 10
ఈ చిత్రంలో ఏ రకమైన అనువర్తన చలనం చూపించబడింది?
జవాబు:
కాంతి అనువర్తనం

83.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 3
ఈ ప్రయోగం చేసింది ఎవరు?
జవాబు:
F.W. వెంట్

84. ఓటు అంకురం యొక్క ఏ భాగంలో యఫ్. డబ్ల్యు. వెంట్ ప్రయోగాలు చేశారు?
జవాబు:
ప్రాంకుర కవచం

85.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 28
ఈ మొక్కలో ఏ రకమైన అనువర్తన చలనం చూపబడింది?
జవాబు:
స్పర్శానువర్తనం

86.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 27
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
అనుమస్తిష్కం

87.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 29
ఈ చిత్రంలో ఏ కృత్యం నిర్వహించబడింది?
జవాబు:
మోకాలి కుదుపు ప్రతీకార చర్య

88.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 29
ఈ కృత్యంలో నాడీవ్యవస్థ యొక్క ఏ అవయవం పాత్ర ఉండదు?
జవాబు:
మెదడు

89.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 31
ఈ చిత్రంలో పోరాటానికి ఏ హార్మోన్ కారణం?
జవాబు:
అడ్రినలిన్

90.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 32
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
రన్వీర్ కణుపులు

ఖాళీలు పూరించండి

91. జీవ క్రియలను సమన్వయం చేయు వ్యవస్థ ……..
జవాబు:
నాడీ వ్యవస్థ

92. కేంద్రీయ వ్యవస్థలో ప్రధాన భాగాలు …….
జవాబు:
మెదడు, వెన్నుపాము

93. తెలివి తేటలకు కేంద్రము ………
జవాబు:
మస్తిష్కం

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

94. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ……….
జవాబు:
నాడీకణం

95. రెండు నాడీ కణాలు కలిసే ప్రాంతం ……….
జవాబు:
నాడీకణ సంధి

96. మొక్కలలో ……… సమన్వయం లోపించి ఉండును.
జవాబు:
నాడీ సమన్వయం

97. మొక్కలలో రసాయనిక సమన్వయం నిర్వహించే రసాయనాలు
జవాబు:
ఫైటో హార్మో న్స్

98. బాష్పోత్సేకం నియంత్రించే హార్మోను ………..
జవాబు:
ABA

99. మెదడుతో ప్రమేయం లేకుండా జరిగే చర్యలు ……..
జవాబు:
అసంకల్పిత ప్రతీకార చర్యలు

100. మెదడులోని ………. భాగము వెన్నుపాముగా కొనసాగుతుంది.
జవాబు:
మజ్జి ముఖం

10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. ప్రక్క పటంను గుర్తించుము.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 33
A) ఆల్గే
B) న్యూరాన్
C) రక్తకణం
D) మైటోకాండ్రియా
జవాబు:
B) న్యూరాన్

2. పత్ర రంధ్రాలను (స్టామటా) మూసి ఉంచటానికి మొక్కలలో ఏ హార్మోను బాధ్యత వహిస్తుంది?
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 33
A) అజ్ సైసిక్ ఆసిడ్
B) ఆక్సిన్
C) సైటోకైనిన్
D) ఇథిలీన్
జవాబు:
A) అజ్ సైసిక్ ఆసిడ్

3. ప్రక్క పటంలో లోపించిన భాగం పేరేమిటి?
A) నిస్సల్ కణికలు
B) కేంద్రకము
C) నా సంధి
D) డెండ్రైటులు
జవాబు:
B) కేంద్రకము

4. ఆకలి బాగా అయినపుడు విడుదలయ్యే హార్మోన్
A) అడ్రినలిన్
B) థైరాక్సిన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
D) గ్రీలిన్

5. మెదడులో అతిపెద్ద భాగం
A) ముందు మెదడు
B) మధ్య మెదడు
C) వెనుక మెదడు
D) కపాలం
జవాబు:
A) ముందు మెదడు

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

6. రెండవ మెదడుగా పిలువబడేది
A) కపాలంలోని మెదడు
B) జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ
C) కేంద్రీయ నాడీవ్యవస్థ
D) అంతస్రావీ వ్యవస్థ
జవాబు:
B) జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ

7. మెదడును రక్షించునవి ………….
A) కపాలము
B) మెనింజిన్ పొర
C) A మరియు B
D) మృదులాస్థి
జవాబు:
B) మెనింజిన్ పొర

8. మధుమేహము ఈ గ్రంథికి సంబంధించినది.
A) పిట్యూటరి
B) థైరాయిడ్
C) క్లోమము
D) అడ్రినల్
జవాబు:
C) క్లోమము

9. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం …………..
A) మధ్యమెదడు
B) మజ్జా ముఖం (మెడుల్లా)
C) ద్వారగోర్దం (డైయన్ సెఫలాన్)
D) మస్తిష్కం (సెరిబ్రమ్)
జవాబు:
C) ద్వారగోర్దం (డైయన్ సెఫలాన్)

10. దోస, కాకర వంటి బలహీన కాండాలు గల మొక్కలు చూపు లక్షణము
A) కాంతి అనువర్తనము
B) స్పర్శానువర్తనము
C) గురుత్వానువర్తనము
D) రసాయనికానువర్తనము
జవాబు:
B) స్పర్శానువర్తనము

11. ఒక వ్యక్తి తన భావావేశములపై నియంత్రణను కోల్పోయాడు. మెదడులో పని చేయని భాగం
A) మస్తిష్కం
B) మజ్జిముఖం
C) మధ్య మెదడు
D) అనుమస్తిష్కం
జవాబు:
A) మస్తిష్కం

12. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం
A) కిరణజన్య సంయోగక్రియ తగ్గడం
B) పెరుగుదల నియంత్రణ
C) మొక్క హార్మోన్ల విడుదల
D) మేసే జంతువుల నుండి రక్షలు
జవాబు:
D) మేసే జంతువుల నుండి రక్షలు

13.
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 34
ఉద్దీపనలకు లోనయినప్పుడు చూపే ఏ చలనాన్ని పై చిత్రం సూచిస్తుంది?
A) జలానువర్తనం
B) స్పర్శానువర్తనం
C) కాంతి అనువర్తనం
D) గురుత్వానువర్తనం
జవాబు:
B) స్పర్శానువర్తనం

14. క్రింది వానిలో సరైన వాక్యము
A) మస్తిష్కం కండరాల కదలికలకు కేంద్రము.
B) ద్వారగోర్థం – ఆలోచనలు, జ్ఞాపకాలు, కారణాలు, వెతికే శక్తికి కేంద్రము.
C) అనుమస్తిష్కం – శరీర సమతాస్థితి, శరీరస్థితిని బట్టి కండరాల కదిలికలను నియంత్రిస్తుంది.
D) మధ్య మెదడు-మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం క్రియలను నియంత్రిస్తుంది.
జవాబు:
C) అనుమస్తిష్కం – శరీర సమతాస్థితి, శరీరస్థితిని బట్టి కండరాల కదిలికలను నియంత్రిస్తుంది.

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

15. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్
A) అడ్రినలిన్
B) టెస్టోస్టిరాన్
C) వాసోప్రెస్సిన్
D) ఈస్ట్రోజెన్
జవాబు:
D) ఈస్ట్రోజెన్

16. క్రింది వానిలో ఏది మానవునిలో స్రావక పదార్థం కాదు?
A) ఎంజైమ్
B) హార్మోన్
C) లాలాజలం
D) స్వేదం
జవాబు:
D) స్వేదం

17. మైమోసాపూడికా నందు స్పర్శానువర్తనం రక్షణకు తోడ్పడగా, కాకరలో నులితీగెలు దేనికి తోడ్పడుతాయి?
A) ఆధారం
B) పోషణ
C) శ్వాసక్రియ
D) విసర్జన
జవాబు:
A) ఆధారం

18. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను సుమ తన బెడ్ రూం కిటికీలో ఉంచింది. కొన్ని రోజుల తరువాత గమనిస్తే ఆ మొక్క వెలుతురు వైపు వంగి పెరిగింది. ఎందుకనగా
A) గురుత్వానువర్తనము
B) కాంతి అనువర్తనము
C) రసాయన అనువర్తనము
D) నీటి అనువర్తనము
జవాబు:
B) కాంతి అనువర్తనము

19. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవటం వల్ల కలిగే లాభం
A) కిరణజన్య సంయోగక్రియ తగ్గటం
B) మేసే జంతువుల నుండి రక్షణ
C) పెరుగుదల నియంత్రణ
D) మొక్క హార్మోన్ల విడుదల
జవాబు:
B) మేసే జంతువుల నుండి రక్షణ

20. ఇన్సులిన్ హార్మోన్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది?
A) కాలేయం
B) క్లోమం
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
B) క్లోమం

21. మెదడులోని ఈ భాగము శరీర సమతాస్థితి మరియు భంగిమ నియంత్రించును.
A) మస్తిష్కము
B) అనుమస్తిష్కం
C) మధ్యమెదడు
D) ద్వారగోట్టాము
జవాబు:
B) అనుమస్తిష్కం

22. కణవిభజనను ప్రేరేపించే ఫైటో హార్మోను
A) జిబ్బరెల్లిన్
B) ఇథైలిన్
C) ఆక్సిన్
D) సైటోకైనిన్
జవాబు:
D) సైటోకైనిన్

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

23. క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్
A) వ్యాసోప్రెస్సిన్
B) అడ్రినలిన్
C) ఇన్సులిన్
D) ప్రొజెస్టిరాన్
జవాబు:
C) ఇన్సులిన్

మీకు తెలుసా?

• మోకాలి ప్రతీకారచర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కాని మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినపుడు మోకాలి ప్రతీకారచర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీమార్గం ఉంటుందని స్పష్టమవుతున్నది.

• నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

• మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడుకు ఉపయోగించబడుతుంది. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు, స్త్రీ మెదడు దాదాపుగా 1275 గ్రాములు,

• మెదడు నుండి బయలుదేరే నాడులను కపాలనాడులు (Cranial nerves) అని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులు (Spinal nerves) అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మన దేహంలో మొత్తం 12 జతల కపాలనాడులు మరియు 31 జతల వెన్నునాడులు ఉంటాయి.

• కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్లే కాకుండా మన శరీరంలోని జీర్ణనాళంలో ఒక ప్రత్యేకమైన నాడీవ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరిధీయ నాడీవ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుందని, దానికి రెండవ మెదడు లేదా జీర్ణ నాడీవ్యవస్థ (Enteric) అని పేరు పెట్టారు.

• మైమోసాఫ్యూడికా పత్రవృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పల్వైని (Puluine) అంటారు. వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని (Nastic movement) చూపిస్తుంది. దీనిని స్పర్శానువర్తనం (Thigmotrophism) అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈ నెలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తు పల్వైనిలోని నీరు పత్రంలో వేరే భాగాలవైపు వలస వెళుతుంది. అందువలన పల్వైని గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది. 20-30 నిమిషాల తరువాత పల్వైనిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారతాయి.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 35
AP 10th Class Biology Important Questions 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 36

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

These AP 10th Biology Important Questions and Answers 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 4th lesson Important Questions and Answers విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రాథమిక ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ఉత్పన్నాలు : పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి పదార్థాలను “థమిక జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.

ప్రశ్న 2.
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని “ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్, రెసిన్లు.

ప్రశ్న 3.
మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఎందుకు?
జవాబు:
మూత్రంలో ‘యూరోక్రోమ్’ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్ధం వలన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.

ప్రశ్న 4.
అవయవదానంపై అవగాహన పెంచేందుకు రెండు నినాదాలు రాయండి.
జవాబు:
అవయవదానం – మహాదానం
అవయవాలు దానం చెయ్యండి – మరణం తరువాత కూడా జీవించండి.

ప్రశ్న 5.
మానవునిలో ఏవైనా రెండు విసర్జకావయవాల పేర్లు రాయండి.
జవాబు:
1) మూత్రపిండాలు, 2) చర్మం, 3) ఊపిరితిత్తులు, 4) కాలేయం, 5) పెద్ద ప్రేగు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 6.
రక్తం మరియు మూత్రం రెండింటిలోను వున్న రెండు పదార్థాలు ఏవి?
జవాబు:
గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, యూరియా, క్రియాటిన్, యూరిక్ ఆమ్లము, కాల్షియం, ఫాస్ఫరస్.

ప్రశ్న 7.
మీ క్షేత్ర పర్యటనలో మీరు కొన్ని ఆల్కలాయిడ్స్ కలిగిన మొక్కలను సేకరించారు. వాటిలో మనకు హాని కలిగించే ఆల్కలాయిడ్స్ పేర్లు వ్రాయండి.
జవాబు:
నికోటిన్, మార్ఫీన్, కొకైన్

ప్రశ్న 8.
మీ పరిసరాలలో నీవు పరిశీలించిన ఏయే మొక్కలు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి?
జవాబు:
వేప, తులసి, జిల్లేడు, తంగేడు, చామంతి

ప్రశ్న 9.
మొక్కల్లో తయారయ్యే పదార్థాలను ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అని వర్గీకరిస్తారు. ఈ రెండు రకాలకూ ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : పిండి పదార్థములు (కార్బోహైడ్రేటులు), మాంసకృత్తులు (ప్రోటీనులు), కొవ్వులు

ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : ఆల్కలాయిడ్లు, రెసిన్లు, టానిన్లు, జిగురులు, మరియు లేటెక్స్.

ప్రశ్న 10.
మూత్రపిండాలు వ్యాధి బారిన పడకుండా ఉండుటకు నీవు. పాటించే రెండు ఆరోగ్యకర అలవాట్లు రాయండి.
జవాబు:

  1. తగినంత నీటిని త్రాగటం
  2. ఆహార పదార్థాలలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం
  3. పండ్ల రసాలను ఎక్కువగా తాగటం

ప్రశ్న 11.
క్షీరదాల మూత్రపిండ అంతర్నిర్మాణమును పరిశీలించే ప్రయోగంలో నీవు తీసుకున్న జాగ్రత్తలేవి?
జవాబు:

  1. గొర్రె మూత్రపిండమును సేకరించిన తర్వాత రక్తమంతా పోయేలా నీటిలో శుభ్రంగా కడగాలి.
  2. పూర్తిగా ఆరిన తర్వాత దానిని ట్రేలో పెట్టి పరిశీలించాలి.
  3. పరిశీలన పూర్తయిన తర్వాత యాంటీ బాక్టీరియల్ లోషన్ తో చేతులు కడుక్కోవాలి.

ప్రశ్న 12.
ఒక వ్యక్తి శరీరం నీరు, వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. అతని కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్నాయి. ఈ స్థితిని ఏమంటాము? ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది?
జవాబు:

  1. కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్న స్థితిని యురేమియా అంటారు.
  2. విసర్జక వ్యవస్థ (మూత్రపిండాలు) సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది.

ప్రశ్న 13.
మీ దైనందిన జీవితంలో ఉపయోగించుకొంటున్న రెండు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నకాల పేర్లను రాయండి.
జవాబు:
1) ఆల్కలాయిడ్లు 2) టానిన్లు 3) రెసిన్లు 4) జిగుర్లు 5) లేటెక్స్

ప్రశ్న 14.
జీవక్రియలు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవ కణంలో జరిగే రసాయనిక చర్యలను జీవక్రియలు అంటారు.
ఇవి రెండు రకాలు. అవి : 1) నిర్మాణాత్మక క్రియలు, 2) విచ్ఛిన్న క్రియలు.

1) నిర్మాణాత్మక క్రియలు :
పదార్థాలు తయారుచేయబడతాయి. ఉదా : కిరణజన్యసంయోగక్రియ.

2) విచ్చిన్న క్రియలు :
పదార్థాలు విడగొట్టబడతాయి. ఉదా : జీర్ణక్రియ, శ్వాసక్రియ.

ప్రశ్న 15.
సమతుల్యత అనగా నేమి?
జవాబు:
దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని “సమతుల్యత” అంటారు. సమతుల్యత దెబ్బతింటే జీవక్రియలలో ఆటంకం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
హైలస్ అనగా నేమి?
జవాబు:
హైలస్ :
మూత్రపిండం లోపలి తలంలో ఉండే పుటాకార నొక్కును “హైలస్” అంటారు. దీని నుండి వృక్పధమని లోపలికి ప్రవేశించగా, వృక్కసిర, మూత్రనాళం బయటకు వస్తాయి.

ప్రశ్న 17.
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే భాగాలు ఏమిటి?
జవాబు:
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే వెలుపలి ముదురు రంగు ప్రాంతాన్ని ‘వల్కలం’ అని, లోపలి లేత రంగు ప్రాంతాన్ని ‘దవ్వ’ అని అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 18.
మూత్రపిందం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏమిటి?
జవాబు:
మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం “నెఫ్రాన్”. దీనినే “వృక్కనాళాలు” అంటారు.

ప్రశ్న 19.
నెఫ్రాలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
నెఫ్రాన్లోని ప్రధాన భాగాలు :
నెఫ్రాలో ప్రధానంగా 1) మాల్ఫీజియన్ దేహం 2) వృక్కనాళిక అనే ప్రధాన భాగాలు ఉంటాయి.

ప్రశ్న 20.
రక్తకేశనాళికాగుచ్ఛం (గ్లోమరులస్) అనగా నేమి?
జవాబు:
రక్తకేశనాళికాగుచ్ఛం :
బొమన్ గుళికలో అభివాహ రక్తనాళం అనేక రక్తకేశనాళికలుగా విడిపోతుంది. దీనిని “గ్లోమరులస్” లేదా “రక్తకేశనాళికా గుచ్ఛం” అంటారు.

ప్రశ్న 21.
మాల్ఫీజియన్ దేహంలో ఏ ఏ భాగాలు ఉంటాయి?
జవాబు:
మాల్ఫీజియన్ దేహంలో 1) బొమన గుళిక 2) రక్తకేశనాళికా గుచ్ఛం (గ్లోమరులస్) అనే భాగాలు ఉంటాయి.

ప్రశ్న 22.
పోదోసైట్స్ అనగా నేమి?
జవాబు:
పోదోసెట్ :
భౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని “పోడోసైట్లు” అంటారు. పదార్థాల వడపోతకు వీలుకలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మరంధ్రాలు ఉంటాయి.

ప్రశ్న 23.
వృక్కనాళికలోని భాగాలు ఏమిటి?
జవాబు:
వృక్కనాళికలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి :

  1. సమీపస్థ సంవళితనాళం
  2. హెన్లీశిక్యం
  3. దూరస్థ సంవళితనాళం.

ప్రశ్న 24.
పార్టీనీయం మొక్క వలన మనకు కలిగే నష్టం ఏమిటి?
జవాబు:
పార్టీనీయం మొక్క పుప్పొడి రేణువులు, మనకు ఎలర్జీని కలిగిస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు ఎలర్జీని, ఆస్తమాను కలిగిస్తాయి.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 25.
నెఫ్రా లో పునఃశోషణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
సమీప సంవళితనాళంలో పునఃశోషణ జరుగుతుంది.

ప్రశ్న 26.
నెఫ్రాన్ యొక్క ఏ ప్రాంతంలో మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది?
జవాబు:
నెఫ్రాన్లోని దూరస్థ సంవళితనాళంలో నాళికాస్రావం వలన మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది.

ప్రశ్న 27.
నెఫ్రాల్లో నీటి పునః శోషణకు తోడ్పడే హార్మోన్ ఏమిటి? .
జవాబు:
నీటి పునఃశోషణకు వాసోప్రెస్సిన్ హార్మోన్ తోడ్పడుతుంది.

ప్రశ్న 28.
ఆళిందం (Vestibule) అనగా నేమి?
జవాబు:
మూత్రాశయం చివరి నాళాన్ని ప్రసేకం అంటారు. ఇది స్త్రీలలో 4 సెం.మీల పొడవు ఉంటుంది. దీనిని ‘ఆళిందం’ (Vestibule) అని కూడా అంటారు. అయితే ప్రసేకం పురుషులలో 20 సెం.మీ.ల పొడవు ఉండి ఉంటుంది. ఇది జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది.

ప్రశ్న 29.
మూత్ర విసర్జన అనగా నేమి?
జవాబు:
మూత్ర విసర్జన :
మూత్రాశయం సంకోచం చెంది మూత్రాన్ని బయటకు పంపే ప్రక్రియను “మూత్ర విసర్జన” అంటారు.

ప్రశ్న 30.
మూత్రానికి రంగును కలిగించే పదార్థం ఏమిటి?
జవాబు:
యూరోక్రోమ్ అనే పదార్థం మూత్రానికి రంగుని కలిగిస్తుంది.

ప్రశ్న 31.
మూత్రంలో ఉండే పదార్థాలు ఏమిటి?
జవాబు:
మూత్రంలో ఉండే పదార్థాలు :
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి.

ప్రశ్న 32.
సెబం అనగానేమి?
జవాబు:
సెబం :
చర్మంలోని సెబేషియస్ గ్రంథులు స్రవించే పదార్థాన్ని “సెబం” అంటారు. ఇది రోమాలను మృదువుగా ఉంచటంతోపాటు చర్మతేమను రక్షిస్తుంది.

ప్రశ్న 33.
శీలాజకణాలు అనగానేమి?
జవాబు:
శిలాజకణాలు :
మొక్కల పండ్లలో వ్యర్థాలను నిల్వ చేసే కణాలను “శిలాజకణాలు” అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 34.
ఆల్కలాయిడ్స్ అనగా నేమి?
జవాబు:
ఆల్కలాయిడ్స్ :
మొక్కలలో ఏర్పడే నత్రజని ఉత్పన్నాలను “ఆల్కలాయిడ్స్” అంటారు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి.
ఉదా : క్వినైన్, నికోటిన్.

ప్రశ్న 35.
మొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరు?
జవాబు:
“డా|| చార్లెస్ హఫ్ నగెల్” 1954లో సమరూప కవలలకు, మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేశాడు.

ప్రశ్న 36.
సంకోచరిక్తికలు ఏ జీవిలో ఉన్నాయి?
జవాబు:
అమీబా, పారమీషియం వంటి ఏకకణజీవులలో సంకోచరిక్తికలు విసర్జనను, ద్రవాభిసరణను నియంత్రిస్తాయి.

ప్రశ్న 37.
ఏ వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు?
జవాబు:
స్పంజికలు, సీలెంటిరేటా వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు.

ప్రశ్న 38.
మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఎలా కోల్పోతాయి?
జవాబు:
మొక్కలు బాష్పోత్సేకం, మరియు బిందుస్రావం ప్రక్రియల ద్వారా అధికంగా ఉన్న నీటిని కోల్పోతాయి.

ప్రశ్న 39.
రబ్బరును ఏ మొక్క నుండి తయారు చేస్తారు?
జవాబు:
హీవియా బ్రెజీలియన్సిస్ మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు.

ప్రశ్న 40.
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఏమిటి?
జవాబు:
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు CO2, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరికామ్లం , పైత్యరస వర్ణకాలు, లవణాలు మొదలైనవి.

ప్రశ్న 41.
శరీర వ్యర్థాలలో ప్రమాదకరమైనది ఏమిటి?
జవాబు:
శరీర వ్యర్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యమైనది.

ప్రశ్న 42.
వాసోప్రెస్సిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం విసర్జించబడుతుంది. దీనిని “అతిమూత్ర వ్యాధి” లేదా “డయాబెటిస్ ఇన్సిపిడస్” అంటారు.

ప్రశ్న 43.
‘యురేమియ’ అనగా నేమి?
జవాబు:
యురేమియ:
మూత్ర పిండాలు పనిచేయటం ఆగిపోతే, శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యురేమియ’ అంటారు. ఈ దశలో కాళ్లు, చేతులు ఉబ్బిపోతాయి.

ప్రశ్న 44.
హీమోడయాలసిస్ అనగా నేమి?
జవాబు:
హీమోడయాలసిస్ :
కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు.

ప్రశ్న 45.
టానిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
టానిన్లను తోళ్ళను పదును చేయటానికి, మందులలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 46.
రైసిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
వార్నిష్ తయారీలో రెసిన్లు వాడతారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 47.
జిగురుల ఉపయోగం ఏమిటి?
జవాబు:
అతికించుటకు, బైండింగ్ వర్కులలోను, ఆహారపదార్థాలలోనూ జిగురులు ఉపయోగిస్తారు.

ప్రశ్న 48.
బయోడీజిల్ తయారీకి ఏ మొక్కను ఉపయోగిస్తారు?
జవాబు:
జట్రోపా, కానుగ మొక్కలను బయోడీజిల్ తయారీకి వాడతారు.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విసర్జక వ్యవస్థలో కలిగే అవరోధాలకు గల కారణాలు తెలుసుకొనేందుకు నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:

  1. విసర్జక వ్యవస్థలో అవరోధాలు ఎలా ఏర్పడతాయి?
  2. అవరోధాలు ఏర్పడటానికి దారితీసే పరిస్థితులు ఏమిటి?
  3. ఆహారపదార్థాలకు, అవరోధాలకు ఉన్న సంబంధం ఏమిటి?
  4. అవరోధాల వలన సంభవించే పరిస్థితులు ఏమిటి?

ప్రశ్న 2.
క్షేత్ర పర్యటనలో మీరు పరిశీలించిన అంశాల సహాయంతో ఈ క్రింది పట్టికను పూరించండి.
జవాబు:

మొక్క పేరుమొక్క నుండి లభించే జీవక్రియోత్పన్నంఉపయోగం
ఎ) వేపనింబిన్యాంటీ సెప్టిక్
బి) ఉమ్మెత్తస్కోపోలమైన్మత్తుమందు

ప్రశ్న 3.
ప్రతి మానవునిలోని రెండు మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవములు. హరిత 23 సంవత్సరాల వయస్సులో ఒక మూత్రపిండాన్ని ఆమె తండ్రికి దానం చేసింది. ప్రస్తుతం ఆమెకు ఒక మూత్రపిండం మాత్రమే ఉంది. పెళ్ళి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది.
ఎ) హరిత కూతురుకు ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి?
జవాబు:
హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.

బి) మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
శారీరక మార్పులు అనువంశికంగా సంక్రమించవు. కావున హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.

ప్రశ్న 4.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి నీవు నీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలను కుంటున్నావు?
జవాబు:

  1. నీరు ఎక్కువగా త్రాగాలి.
  2. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  3. నియమానుసార వ్యాయామం.
  4. కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరినీళ్ళు ఎక్కువగా త్రాగాలి.
  5. ద్రాక్ష, పుచ్చకాయ, కమలా వంటి నీరు అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
  6. వేపుడు కూరలను తినకూడదు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 5.
మూత్రపిండ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. మూత్రపిండాలలో రాళ్లు ఎలా ఏర్పడతాయా?
  2. డయాలసిస్ అనగానేమి?
  3. ధూమపానం, ఆల్కహాలు వలన మూత్రపిండాలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
  4. ESRD అనగానేమి?

ప్రశ్న 6.
రబ్బరు మరియు తోళ్ళ పరిశ్రమలలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఏవి? ఏవి ఏ మొక్క నుండి లభిస్తాయి?
జవాబు:

  1. రబ్బరు, తోళ్ళ పరిశ్రమలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు లేటెక్స్ మరియు టానిన్స్
  2. లేటెక్స్ – హేవియా బ్రెజిలియన్సిస్ (రబ్బరు మొక్క) టానిన్ – తుమ్మ, తంగేడు

ప్రశ్న 7.
మూత్రపిండాలు పనిచేయక పోవటం గూర్చి నెఫ్రాలజిస్టును అడిగే నాలుగు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మూత్రపిండాలు ఎప్పుడు పనిచేయడం మానేస్తాయి?
  2. మూత్రపిండాలు పనిచేయకపోవటం వలన కలిగే లక్షణాలు ఏవి?
  3. ఏ రకమైన నివారణోపాయాలను తీసుకోవటం ద్వారా మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చు?
  4. ఒకవేళ మూత్రపిండం పనిచేయుట మానేస్తే ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి?

ప్రశ్న 8.
కింది పట్టికను పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4

పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) పై పట్టికలో మానవుల మాదిరిగా విసర్జక వ్యవస్థ ఉన్న జీవులేవి?
జవాబు:
సరీసృపాలు / పక్షులు / క్షీరదాలు (లేదా) సరీసృపాలు / పక్షులు / క్షీరదాలకు సంబంధించిన ఉదాహరణలు.

ii) వానపాములో మరియు బొద్దింకలో ఉండే విసర్జకావయవాలేవి?
జవాబు:
ఎ) వానపాములో నెఫ్రీడియా (వృక్కము)
బి) బొద్దింకలో మాల్ఫీజియన్ నాళికలు / హరిత గ్రంథులు

ప్రశ్న 9.
మూత్రం ఏర్పడే విధానంలోని దశలు ఏవి?
జవాబు:
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.

  1. గుచ్ఛగాలనం (Glomerular filtration),
  2. వరణాత్మక పునఃశోషణం (Tubular reabsorption),
  3. నాళికాస్రావం (Tubular secretion),
  4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం (Formation of hypertonic urine).

ప్రశ్న 10.
ప్రాథమిక మూత్రం అనగా నేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం (Primary urine) అంటాం. ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. ప్రాథమిక మూత్రంలో రక్తకణాలు ఉండవు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. ప్రాథమిక మూత్రంలో నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్యకేశనాళికా వల (Peritubular network) లోనికి పునఃశోషణం అవుతాయి.

ప్రశ్న 11.
గుచ్ఛగాలనం గురించి రాయండి.
జవాబు:
గుచ్ఛగాలనం :
అభివాహి ధమనిక కలిగించే పీడనం వల్ల రక్తకేశనాళికాగుచ్ఛం గుండా’ రక్తం ప్రవహిస్తుంది. ఈ పీడనం ఫలితంగా రక్తం వడపోయబడుతుంది. వ్యర్థపదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు వడపోయబడి బొమన్ గుళికకు చేరుతాయి.

ప్రశ్న 12.
వరణాత్మక పునఃశోషణలో ఏ ఏ పదార్థాలు శోషించబడతాయి?
జవాబు:
వరణాత్మక పునఃశోషణం :
ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను పరికేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజ్, ఆమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియంల క్లోరైలు, 75% నీరు పునః శోషించబడతాయి.

ప్రశ్న 13.
నాళికాస్రావంలో స్రవించబడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
నాళికాస్రావం :
రక్తకేశనాళికల నుండి మూత్రనాళికలోనికి వ్యర్థపదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, pH ని నియంత్రిస్తాయి.

ప్రశ్న 14.
మూత్రం ఎలా గాఢత చెందుతుంది?
(లేదా)
మూత్రం ఏర్పడే విధానం తెలపండి.
జవాబు:
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. హెస్లీ శిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించియున్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెస్సిన్ (ADH) అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ఈ ద్రవాన్ని మూత్రం (Urine) అంటారు. ఇది రక్తం కన్నా అధిక గాఢతతో ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 15.
అతిమూత్ర వ్యాధి అనగానేమి ? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్పగాఢతగల మూత్రాన్నే విసర్జించవలసి ఉంటుంది. శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను హార్మోన్ చర్య క్రమబద్దీకరిస్తుంది. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది. దీనినే ‘డయాబెటిస్ ఇన్సిపిడస్’ లేదా ‘అతిమూత్ర వ్యాధి’ అంటారు.

ప్రశ్న 16.
మూత్రనాళికలు గురించి వ్రాయండి.
జవాబు:
మూత్రనాళికలు ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుండి ఒక జత తెల్లని, కండరయుతమైన సన్నని మూత్రనాళాలు బయటికి వస్తాయి. ఇవి దాదాపు 30 సెం.మీ. పొడవు ఉంటాయి. పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. మూత్రం, మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారానే పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది.

ప్రశ్న 17.
మూత్రాశయం గురించి రాయండి.
జవాబు:
మూత్రాశయం పలుచని గోడలు కలిగి, బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి (కటివలయ) భాగంలో పురీషనాళానికి ఉదరతలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300-800 మి.లీ.ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది.

ప్రశ్న 18.
ప్రసేకం గురించి రాయండి.
జవాబు:
ప్రసేకం, మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటికి విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలో తెరచుకునే – చోట సంవరణీ (Sphincter) కండరం ఉండి కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెం.మీ.ల పొడవు ఉంటుంది. దానిని ఆళిందం (Vestibule) అంటారు. అయితే పురుషులలో 20 సెం.మీ. పొడవుండి మూత్ర జననేంద్రియనాళంగా ప్రసేకం (Uretra) పిలవబడుతుంది.

ప్రశ్న 19.
మూత్ర విసర్జన ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
మూత్రాశయంలో గరిష్టంగా 700-800 మి.లీ. మూత్రం నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300-400 మి.లీ. మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి, దాని గోడలలోని స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన (Micturition) అంటారు.

మానవుడు రోజుకు దాదాపు 1.6-1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. అయితే అధికంగా నీరు, పండ్లరసాలు, ద్రవాలు ఎక్కువ తీసుకొనేవారు ఎక్కువగానూ, తక్కువ తీసుకునే వారు తక్కువగానూ మూత్రాన్ని విసర్జించటం సాధారణంగా జరుగుతుంది.

ప్రశ్న 20.
మూత్ర విసర్జనను ఎలా నియంత్రించగలం?
జవాబు:
మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు జతల వర్తుల సంవరిణీ కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ రెండు కండరాలు సంకోచస్థితిలో ఉంటాయి. దీనివలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరేకొద్ది అది కలుగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడనం అధికమవుతుంది. దీనివలన అసంకల్పితంగా పై వర్తుల సంవరిణీ కండరం సడలుతుంది. కానీ కింది సంవరిణీ కండరం మన అధీనంలో ఉండి మూత్రవిసర్జనను నియంత్రించగలం. కానీ చిన్నపిల్లలలో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. కాలక్రమేణా వారు మూత్రవిసర్జనను నియంత్రించగలుగుతారు.

ప్రశ్న 21.
మూత్ర సంఘటనమును తెలపండి.
జవాబు:
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్పేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా (pH = 6.0) గా ఉన్నా క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియా ఏర్పడుతుంది.

ప్రశ్న 22.
మూత్రపిండ మార్పిడి అనగానేమి? దీనిలో ఉన్న సమస్య ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండ మార్పిడి అంటారు. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు. రోగికి అమర్చిన మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్య విద్య వైజ్ఞానిక కృషి ఇలాంటి ప్రక్రియల సమర్థతను పెంచాయి.

ప్రశ్న 23.
అవయవదానం అనగానేమి? మన శరీరంలోని ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు?
జవాబు:
వైద్య పరంగా మరణించారని నిర్ధారించిన వ్యక్తి నుండి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీనిని “అవయవదానం” అంటారు. దాత శరీరం నుండి రెండు మూత్రపిండాలు, గుండె, వాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం కళ్లు (కార్నియా) లాంటి అవయవాలు గ్రహిస్తారు.

ప్రశ్న 24.
చర్మాన్ని విసర్జక అవయవంగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1
చర్మం అసంఖ్యాకమైన స్వేదగ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్తకేశ నాళికలుంటాయి. స్వేదగ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియా ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్న నీటిని మరియు అతి తక్కువ మోతాదులో లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతూ చర్మం ఒక అదనపు విసర్జకాంగంగా పరిగణించబడుతోంది. చర్మంలోని సెబేషియస్ గ్రంథులు సెబం అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబం, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు మరియు ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.

ప్రశ్న 25.
విసర్జక క్రియలో కాలేయం పాత్ర ఏమిటి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
కాలేయం రక్తంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబినను విచ్ఛిన్నం చేసేటపుడు బైలురూబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్’ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిలవవుండి తర్వాత పైత్యరసంతోపాటు కొలెస్ట్రాల్ మరియు స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షారలవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి. యూరియా తయారీలోను కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 26.
పెద్ద ప్రేగులో తొలగించబడే లవణాలు ఏమిటి?
జవాబు:
పెద్దప్రేగు (Large intestine) :
అధికంగానున్న కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకళాకణజాలం (Epithelial) చేత వేరుచేయబడి మలంతోబాటు బయటికి విసర్జింపబడతాయి.

ప్రశ్న 27.
అమీబా, పారమీషియం వంటి ఏకకణ జీవులలో విసర్జన విధానం తెలపండి.
జవాబు:
మంచి నీటిలో నివసించే అమీబా, పారమీషియం మొదలైనవి సంకోచరిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమత చూపుతాయి. సంకోచరిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. సంకోచరిక్తికలు (Contraltile vacuole) కణద్రవ్యంలో కొద్దికొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన కణద్రవాభిసరణ (Osmosis) ద్వారా జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 28.
మొక్కలు వ్యర్థాలను విషపూరితాలుగా మార్చి ఎందుకు నిల్వ చేసుకొంటాయి?
జవాబు:
కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కల భాగాలు తినడానికి వీలుకాని రుచితో ఉంటాయి. అందువల్ల ఆ మొక్కలను జంతువులు తినలేవు. కొన్ని రసాయనాలు ఎక్కువగా విషపూరితంగా ఉండి వీటిని తిన్న జంతువులు చనిపోతాయి.

ప్రశ్న 29.
మొక్క తమ వ్యర్థాలను ఎలా ఉపయోగించుకొంటుంది?
జవాబు:

  1. కొన్ని రకాల మొక్కలలో మొక్క భాగాలకు గాయమైనపుడు కొన్ని రసాయనాలను స్రవిస్తాయి. అలా స్రవించిన రసాయనాలు గాయాన్ని మాన్పుటలో మొక్కకు సహాయపడతాయి.
  2. కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన పదార్థాలను వెదజల్లి తమకు ఉపయుక్తంగా మార్చుకొంటాయి. పరాగసంపర్కానికి, విత్తన వ్యాప్తికి, పోషణకు కూడా ఉపయోగపడేలా చేసుకోగలుగుతాయి.
  3. వేరు బుడిపెలను కలిగి ఉన్న మొక్కలు కొన్ని రసాయనిక స్రావాలచేత రైజోబియం బాక్టీరియాలను ఆకర్షించి, ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయి.

ప్రశ్న 30.
టానిన్లు, రెసిన్లు గురించి వర్ణించండి.
జవాబు:
టానిన్లు :
టానిన్లు కర్బన సంయోగపదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమవర్ణం కలిగి ఉంటాయి. టానిన్లు టానింగ్ లేదా తోళ్ళను పదునుచేయడానికి మరియు మందులలోను ఉపయోగిస్తారు.
ఉదా : తుమ్మ, తంగేడు.

రెసిన్లు :
రెసిన్ నాళాలను కలిగి ఉండటం అత్యధిక వివృత బీల ప్రత్యేకత. రెసిన్లను వార్నిష్ లో ఉపయోగిస్తారు.
ఉదా : పైనస్.

ప్రశ్న 31.
జిగురులు గురించి తెలపండి.
జవాబు:
జిగురులు :
వేప, తుమ్మ మొదలైన చెట్లు శాఖలు, కాండంపై గాయాలైనపుడు అవి జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేస్తుంది. ఆర్థికంగా చూస్తే జిగురులు చాలా విలువైనవి. వాటిని అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా మందుల తయారీలోను, ఆహార పదార్థాలలోను ఉపయోగిస్తుంటారు.

ప్రశ్న 32.
లేటెక్స్ గురించి రాయండి.
జవాబు:
లేటెక్స్ :
లేటెక్స్ జిగురుగా తెల్లగా పాలవలే ఉండే ద్రవపదార్థం, ఇది మొక్కలోకి లేటెక్స్ కణాల్లో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజీలియన్సిస్ (రబ్బరు మొక్క) మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారుచేస్తారు. జట్రోపా మొక్క నుండి బయోడీజిలను తయారుచేస్తారు.

ప్రశ్న 33.
చూయింగ్ గమ్ ను ఎలా తయారు చేస్తారు?
జవాబు:
చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేసే ఒక రకమైన జిగురు పదార్థం. 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ ను చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు.

ప్రశ్న 34.
రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే, ఏమి జరుగుతుంది?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని (End Stage Renal Disease – ESRD) అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యూరేమియ’ అంటారు. కాళ్లు, చేతులు ఉబ్బిపోత రక్తం శుద్ధికాకపోవడం వలన నీరసం, అలసట వస్తాయి.

ప్రశ్న 35.
మూత్రపిండాలు పనిచేయనప్పుడు, పరిష్కారం ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి కృత్రిమ మూత్రపిండాల ద్వారా రక్తాన్ని శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని డయలైజర్ లోనికి పంపి మలినాన్ని తొలగిస్తారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 36.
మనకు ఉపయోగపడే ఆల్కలాయిడ్లను తెలపండి.
జవాబు:
క్వినైన్ – మలేరియా నివారణకు
నికోటిన్ – క్రిమి సంహారిణిగా
రిసర్ఫిన్ – పాముకాటుకు
నింబిన్ – యాంటీ సెప్టిక్ గా ఉపయోగిస్తారు.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మానవుని రక్తము నుండి జీవ వ్యర్థములను తొలగించడానికి మూత్రపిండము ఎలా అనుకూలంగా ఉన్నది?
(లేదా)
మూత్రం ఏర్పడడంలోని వివిధ దశలేవి? ఆయా దశలలో ఏం జరుగుతుందో వివరించండి.
జవాబు:
మూత్రపిండాల నిర్మాణం :

  1. మానవునిలో విసర్జన వ్యవస్థలో ఉండే భాగాలు ఎ) ఒక జత మూత్రపిండాలు, బి) ఒక జత మూత్రనాళాలు సి) మూత్రాశయం మరియు డి) ప్రసేకం.
  2. మూత్రపిండాల లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్పధమని మూత్రపిండం లోనికి ప్రవేశిస్తుంది. వృక్కసిర మూత్రనాళం వెలుపలికి వస్తుంది.
  3. శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్పధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కసిర మూత్రపిండం నుండి బయటికి పంపుతుంది.
  4. మూత్రపిండంలో రక్తం వడకట్టబడుతుంది. ఫలితంగా వేరుచేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటికి విసర్జించబడతాయి. దీనిలో నెఫ్రాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

మూత్రం ఏర్పడే విధానం :
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.

  1. గుచ్చగాలనం
  2. వరణాత్మక పునఃశోషణం
  3. నాభికాస్రావం
  4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.

1) గుచ్చగాలనం :
వృక్క ధమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశ నాళికా గుచ్చం లోనికి ప్రవేశిస్తుంది. ఈ ధమని కలిగించే పీడనం వల్ల రక్తం వడపోయబడుతుంది. వ్యర్థ పదార్థాల అణువులు, పోషక పదార్థాల అణువులు, నీరు వడపోయబడి బొమన్స్ గుళికకు చేరతాయి.

2) వరణాత్మక పునఃశోషణం :
వరణాత్మక పునః శోషణం ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియం

3) నాళికాస్రావం :
సమీపస్థ సంవళితనాళంలో పునఃశోషణం తరువాత మూత్రం హెగ్లీశక్యం ద్వారా దూరస్థ సంవళితనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం,. హైడ్రోజన్ అయానులు బాహ్యరక్తకేశనాళికా వల నుండి దూరస్థ సంవళిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యమవుతుంది.

4) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం :
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణమవుతుంది. హెన్లీశిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది.

మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం , కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి.

ప్రశ్న 2.
కింది పట్టికను విశ్లేషించి ప్రశ్నలకు సమాధానం రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 3
A) బైలురూబిన్ తెలుసుకోవాలంటే ఏ పరీక్ష అవసరం?
జవాబు:
బైలురూబిన్ పరీక్ష

B) చక్కర వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు?
జవాబు:
అన్నం తినకముందు, తిన్న తరువాత నిర్వహించిన చక్కెర పరీక్ష ద్వారా చక్కెర వ్యాధిని నిర్ధారించవచ్చు.

C) పై నివేదిక పరిశీలించిన తర్వాత ఆ వ్యాధిగ్రస్థ వ్యక్తి ఏ ఇతర సమస్యలు ఎదుర్కొనుండవచ్చును?
జవాబు:
రోగి అధిక రక్తపీడనం కల్గి ఉన్నాడు. రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంది. ఇది చక్కెర వ్యాధిని సూచిస్తుంది.

D) ఆ సమస్యలు ఏయే భాగాలపై ప్రభావం చూపుతాయి?
జవాబు:
ఈ సమస్యలు రోగి హృదయం మరియు క్లోమంపై ప్రభావం చూపుతాయి.

ప్రశ్న 3.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఆల్కలాయిడ్మొక్కలోని భాగంఉపయోగం
క్వినైన్బెరడుమలేరియా నివారణ
నికోటిన్ఆకులుక్రిమి సంహారిణి
మార్ఫిన్ఫలంమత్తుమందు, నొప్పి నివారిణి
కెఫెన్విత్తనాలునాడీవ్యవస్థ ఉత్తేజ కారకం
పైరిత్రాయిడ్స్పుష్పాలుకీటక నాశనులు
స్కోపోలమైన్పండ్లు, పూలుమత్తుమందు

i) మొక్కల యొక్క ఏ భాగాలు ఆల్కలాయిడ్లుగా ఉపయోగపడతాయి?
జవాబు:
బెరడు, ఆకులు, ఫలం, విత్తనాలు, పుష్పాలు.

ii) మొక్కలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ లేవి?
జవాబు:
నికోటిన్, పైరిత్రాయిడ్స్

iii) మత్తుమందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్లు మొక్క ఏ భాగాల నుండి తయారవుతాయి?
జవాబు:
పండ్లు, పూలు

iv) మలేరియా జ్వరం వస్తే ఏ ఆల్కలాయిడ్ వాడతారు?
జవాబు:
క్వి నైన్

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 4.
మానవ విసర్జక వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి.
(లేదా)
కింది భాగాలతో కూడిన పటం ఏ వ్యవస్థకు చెందినది? దాని పటం గీచి, భాగాలను గుర్తించండి.
a) మూత్రపిండాలు b) మూత్రనాళాలు c) మూత్రాశయము
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5

ప్రశ్న 5.
సలోని సమాచారమును విశ్లేషించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

ఆల్కలాయిడ్మొక్కలోని భాగంఉపయోగాలు
క్వినైన్బెరడుమలేరియా నివారణ
పైరిత్రాయిడ్స్ఆకులుక్రిమి సంహారిణి
రిసర్సెన్వేరుపాముకాటు నుండి రక్షణ
కెఫీన్విత్తనాలునాడీ వ్యవస్థ ఉత్తేజకారకం
నింబిన్విత్తనాలు, బెరడు, ఆకులుయాంటీ సెప్టిక్

i) మలేరియా చికిత్సకు ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
క్వినైన్

iii) క్రిమి సంహారిణిగా ఏ ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది?
జవాబు:
పైరిత్రాయిడ్స్

iii) కెఫీన్ వల్ల మానవ శరీరంలోని ఏ వ్యవస్థ ఉత్తేజం చెందుతుంది?
జవాబు:
నాడీ వ్యవస్థ

iv) పాముకాటు నుండి రక్షణనిచ్చే ఆల్కలాయిడ్ ఏ మొక్క భాగము నుండి లభిస్తుంది?
జవాబు:
రావుల్ఫియా సర్పెస్ టైనా లేక సర్పగంథి మొక్క వేరు.

ప్రశ్న 6.
విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని దేనిని పేర్కొంటారు? దాని బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి. అభివాహ ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
(లేదా)
వృక్కనాళీక నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
(లేదా)
ఈ క్రింది భాగాలను గుర్తించటానికి నీవు ఏ పటంను గీస్తావు ? ఆ పటంను గీసి క్రింది భాగాలను గుర్తించండి.
1) భౌమన్ గుళిక 2) వృక్క నాళిక 3) సంగ్రహణ నాళం
(లేదా)
హె శిక్యము, బొమన్ గుళిక గల విసర్జక అవయవము యొక్క పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:

విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని నెఫ్రాన ను పేర్కొంటారు.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 3
రక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి, దానిలోని పదార్థాలు వడపోతకు గురికావడానికి అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది.
1. వృక్క నాళిక (నెఫ్రాన్)లో 2 భాగాలుంటాయి.
1 మాల్ఫీజియన్ దేహం,
2. వృక్క నాళిక

2. మాల్వీజియన్ దేహం :
నెఫ్రాలో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బొమన్ గుళిక అంటారు. అందులోని రక్తకేశ నాళికా గుచ్ఛం మరియు బౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.

3. రక్తకేశ నాళికాగుచ్చం అభివాహిధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహిధమనిక ఏర్పడుతుంది.

4. వృక్క నాళిక : దీనిలో మూడు భాగాలుంటాయి.
1) సమీపస్థ సంవళిత నాళం (PCT), 2) హెన్లీశిక్యం, 3) దూరస్థసంవళిత నాళం (DCT)

ప్రశ్న 7.
మానవునిలో కల అనుబంధ విసర్జకావయవాలేవి? అవి ఉత్పత్తి చేయు విసర్జక పదార్థాలు ఏమిటి?
జవాబు:
అనుబంధ విసర్జక అవయవాలు – విసర్జక పదార్థాలు
1. ఊపిరితిత్తులు ……. CO2 మరియు నీరు.
2. చర్మం ……… – స్వేదం మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థ పదార్థాలు (సెబం).
3. కాలేయం …… బైలురూబిన్, బైలువర్డిన్, యూరోక్రోం.
4. పెద్ద ప్రేగు ……. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం .మరియు ఐరన్ యొక్క లవణాలు మలపదార్ధంతో పాటు విసర్జించబడును.

ప్రశ్న 8.
మూత్రపిండాలు పనిచేయని వ్యక్తి (ESRD) పాటించవలసిన తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కార పద్ధతులను వివరించండి.
జవాబు:
వివరణ :
ESRD వ్యక్తికి తాత్కాలిక పరిష్కార పద్ధతి – డయాలసిస్ (లేదా) కృత్రిమ మూత్రపిండము మరియు శాశ్వత పరిష్కార పద్ధతి మూత్రపిండ మార్పిడి.

డయాలసిస్ :

  1. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కంధనాన్ని నిరోధించే కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోకి పంపిస్తారు.
  2. డయలైజర్ యంత్రంలో రక్తం గొట్టాల వంటి సెల్లో ఫేన్ తో తయారైన నాళికల ద్వారా ప్రవహించును. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి వుంటాయి.
  3. డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు వుండవు కనుక డయలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది.

మూత్రపిండ మార్పిడి :

  1. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు.
  2. రోగికి అమర్చిన మూత్రపిండము సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా వుండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి వుంటుంది.
  3. ఈ మధ్య కాలంలో దాతల నుండి మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలు సేకరించి మూత్రపిండాలు పాడైపోయిన వారికి అమరుస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 9.
మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని పరిశీలించిన ప్రయోగ విధానాన్ని, పరిశీలనలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : మూత్రపిండము అంతర లక్షణాలను అధ్యయనం చేయుట.

పరికరాలు :
1. మేక / గొర్రె మూత్రపిండము, 2. పదునైన బ్లేడు / స్కాల్ పల్, 3. ట్రే, 4. నీరు, 5. గ్లోస్

ప్రయోగ విధానము :
1. మూత్రపిండమును రక్తమంతా పోయేలా నీటిలో కడగాలి.
2. ఒక పదునైన బ్లేడు లేదా స్కాల్ పల్ సహాయంతో మూత్రపిండాన్ని నిలువుగా, జాగ్రత్తగా కోసి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించాలి.

పరిశీలన :

  1. మూత్ర పిండము బయటవైపు ముదురు ఎరుపు రంగులోనూ, లోపలి వైపు లేత గులాబి రంగులోనూ కనబడుతుంది.
  2. పుటాకారంగా ఉన్న లోపలి తలంలో మధ్యలో ఉన్న పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కమని మూత్ర పిండములోనికి, వృక్కసిర మూత్రనాళంలోకి వస్తాయి.
  3. ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగమును వల్కలము అని, లేత ‘వర్ణములో ఉన్న లోపలి భాగమును దవ్వ అని అంటారు.
  4. ప్రతి మూత్రపిండములోనూ సూక్ష్మ వృక్క నాళాలు / నెఫ్రాన్లు ఉంటాయి.

ప్రశ్న 10.
మానవ విసర్జన వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
మానవ విసర్జన వ్యవస్థలో ప్రధానంగా 1) ఒక జత మూత్రపిండాలు 2) ఒక జత మూత్రనాళాలు 3) ఒక మూత్రాశయం 4) ప్రసేకం అనే భాగాలు ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5

1. మూత్రపిండాలు :

  1. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో, పృష్ఠకుడ్యానికి అంటుకొని ఒక జత ఉంటాయి.
  2. దీని వెలుపలి భాగం కుంభాకారంగాను, లోపలి భాగం పుటాకారంగాను ఉంటుంది.
  3. పుటాకార భాగంలో ఉండే నొక్కును నాభి అంటారు. దీని ద్వారా వృక్కమని లోపలికి ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
  4. ప్రతి మూత్రపిండం దాదాపు ఒక మిలియన్ నెఫ్రాన్లచే నిర్మించబడి ఉంటుంది.

2. మూత్రనాళాలు :
ఒక జత మూత్రనాళాలు మూత్రపిండం నుండి బయలుదేరి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. ఇవి దాదాపు 30 సెం.మీ పొడవు ఉంటాయి.

3. మూత్రాశయం :
ఇది బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. 300-800 మి.లీ. మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వచేస్తుంది.

4. ప్రసేకం :
మూత్రాశయం నుండి మూత్రాన్ని విసర్జించే నాళం. ఇది సంవరణి కండరాన్ని కలిగి ఉండి స్త్రీ, పురుషులలో వేరువేరు పొడవులతో ఉంటుంది.

ప్రశ్న 11.
మానవ మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
మూత్రపిండం-అంతర్నిర్మాణం :
మూత్ర పిండం అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి మూత్రపిండ నిలువు కోతను పరిశీలిద్దాం. మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వృక్క ధమని – వెలుపలి భాగాన్ని వల్కలం (Cortex) అనీ, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ (Medulla) అనీ అంటారు. ప్రతీ మూత్రపిండంలోనూ సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 నుండి 1.8 మిలియన్) సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి. వాటినే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్ (Nephron) లని అంటారు.

ప్రశ్న 12.
మూత్ర సంఘటనము ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
మూత్రం లేత పసుపురంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగుకి కారణమవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపైన ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకొన్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమినేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది.

పిండిపదార్థాలు అధికంగా తీసుకొన్నవారి మూత్రంలో అధిక చక్కెర కనిపించవచ్చు. ద్రవపదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొన్నవారి రక్తంలోనికి అధికంగా నీరు చేరటం ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది.

ప్రశ్న 13.
వివిధ జీవులలోని విసర్జన వ్యవస్థలు తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4

ప్రశ్న 14.
మొక్కలలో విసర్జన జంతువుల కంటే ఎలా విభిన్నంగా ఉంటుంది?
జవాబు:

  1. తయారైన వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేకంగా అవయవాలు ఉండవు.
  2. మొక్కల్లో వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం కావడమనే ప్రక్రియ జంతువులతో పోల్చినపుడు అతి నెమ్మదిగా జరుగుతుంది.
  3. అంటే మొక్కల్లో వ్యర్థ పదార్థాల తయారీ కూడా అతి నెమ్మదిగా జరుగుతుందన్నమాట.
  4. అవి మొక్క దేహంలో పోగవడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది.
  5. ఆకుపచ్చని మొక్కలు రాత్రిపూట, హరిత పదార్థం లేని భాగాలలో మొక్కలు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి.
  6. కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేయబడి ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా, కాండంలోని లెంటి సెల్స్ ద్వారా వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 15.
మొక్కలలో ఉత్పత్తి అయ్యే, జీవరసాయన పదార్థాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కల్లో ఉత్పత్తయ్యే వరసాయనిక పదార్థాలు రెండు రకాలు. అవి :
1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు.

1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు :
పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి వాటిని ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారు.

2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలంటారు.
ఉదా : ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెసిన్లు, జిగురులు మరియు లేటెక్సులు అయితే మొక్కలు వాటిని తమకోసం ఉత్పత్తి చేసుకోగా, మనం ఆయా రసాయనాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాం.

ప్రశ్న 16.
మొక్కలలోని ఆల్కలాయిడ్స్, వాటి ఉపయోగాలు, ఉత్పత్తి అయ్యే భాగాలు తెలుపుతూ పట్టిక రూపొందించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 6

ప్రశ్న 17.
విసర్జించడం, స్రవించటం మధ్యగల పోలికలు ఏమిటి? అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నమైనవి?
జవాబు:
విసర్జన మరియు స్రావం రెండూ ఒక రకమైనవే. రెండింటిలోను వ్యర్ధమైన లేదా అవసరం లేని పదార్థాలను తరలించడం లేదా బయటికి పంపించటం జరుగుతుంది. విసర్జన అనేది జీవులలోని వ్యర్థ పదార్థాల తొలగింపు కాగా, స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదలించడం. అందుకే స్రావం క్రియాత్మకమైనది అనీ, విసర్జన క్రియాత్మకం కానిదనీ అంటారు. ఉదాహరణకు మానవునిలో – కన్నీళ్ళు, చెమట, మూత్రం, కార్బన్ డై ఆక్సెడ్ మొదలైనవన్నీ విసర్జితాలు, ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం అనేవి స్రావాలుగా చెప్పుకుంటాం.

మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ పరిసరాల్లోకి విసర్జిస్తాయి. కాగా ఆకులు, బెరడు, పండ్లు రాలడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తొలగించుకుంటాయి. వివిధ రూపాలలో స్రావాలను విడుదల చేస్తాయి.

విసర్జన, స్రావం :

విసర్జనస్రావం
1) వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ.1) పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేసే ప్రక్రియ.
2) క్రియాత్మకం కాని ప్రక్రియ.2) క్రియాత్మక ప్రక్రియ.
3) మానవునిలో యూరియా, యూరికామ్లం, అమ్మోనియా విసర్జన పదార్థాలు.3) ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం స్రావాలు.
4) మొక్కలలో ఆల్కలాయిడ్లు, రెసిన్ మొదలైనవి విసర్జితాలు.4) జిగురులు, లేటెక్స్ వంటివి స్రావితాలు.

ప్రశ్న 18.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2
a) మూత్రపిండం నిలువుకోతలో నీవు గమనించే భాగాలు ఏమిటి?
b) మూత్రపిండం వెలుపలి భాగం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది?
c) మూత్రపిండంలో కనిపించే సన్నని నాళాలు ఏమిటి?
d) మూత్రపిండ నాభి నుండి వెలుపలికి వచ్చే నాళాలు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం నిలువుకోతలో వల్కలం, దవ్వ, వృక్కద్రోణి అనే భాగాలు ఉంటాయి.
b) మూత్రపిండ వెలుపలి భాగం వల్కలం. దీనిలో మూత్ర నాళికల యొక్క బొమన్ గుళికలు అమరి ఉండుట వలన ఎరుపుగా కనిపిస్తుంది.
c) మూత్రపిండం మూత్రనాళికలు అనే సన్నని నాళాలు కల్గి ఉంటుంది.
d) మూత్రపిండ నాభి నుండి వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.

ప్రశ్న 19.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5
a) పటంలో విసర్జక వ్యవస్థకు సంబంధించని భాగము ఏమిటి?
b) కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది ఎందుకు?
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండంలో ఏమైనా మార్పులు వస్తాయా?
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళం పేరు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం మీద టోపీలా ఉండే వినాళగ్రంథికి విసర్జన వృక్క సిర క్రియతో సంబంధం లేదు.
b) ఉదర కుహరంలో కాలేయ కుడివైపున స్థలం ఆక్రమించటం వలన కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండం పరిమాణంలో కొంచెం పెరిగి, విధి నిర్వహణా సామర్ధ్యం పెంచుకొంటుంది.
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళాన్ని ప్రసేకం అంటారు.

ప్రశ్న 20.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 7
a) ప్రక్క పటము దేనిని సూచిస్తుంది?
b) దీని నిర్మాణంలోని రెండు ప్రధాన భాగాలు ఏమిటి?
c) నాళికా స్రావం ఏ ప్రాంతంలో జరుగుతుంది?
d) వరణాత్మక శోషణం జరిగే ప్రాంతాలు ఏమిటి?
జవాబు:
a) ఈ పటం మూత్రనాళిక నిర్మాణాన్ని సూచిస్తుంది.
b) మూత్రనాళికా నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి.
అవి 1. బొమన్ గుళిక, 2) మాల్పీజియన్ దేహం.
c) నాళికాస్రావం దూరస్థ సంగ్రహనాళంలో జరుగును (DCT).
d) వరణాత్మక శోషణం, సమీప సంవళిత నాళం (PCT) మరియు హెన్లీశిక్యంలో జరుగును.

ప్రశ్న 21.
మానవ శరీరంలో వ్యర్థాల విసర్జనలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా తోడ్పడుతాయనడాన్ని నీవెలా సమర్ధిస్తావు?
జవాబు:

  1. మానవ శరీరంలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా వ్యర్థాల విసర్జనకు తోడ్పడతాయి.
  2. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి నత్రజని సంబంధిత వ్యర్థాలైన యూరియా మరియు యూరికామ్లాన్ని మరియు ఇతర వ్యర్థాలను విసర్జిస్తాయి.
  3. మూత్రపిండాలతోపాటు ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము, ప్రేవులు, లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు కూడా కొన్ని రకాల వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  4. ఊపిరితిత్తులు కార్బన్ డై ఆక్సెడ్ మరియు నీటిని శరీరం నుండి తొలగిస్తాయి.
  5. చర్మము చెమట రూపంలో నీరు మరియు లవణములను విసర్షిస్తుంది.
  6. కాలేయము మూత్రము ద్వారా పైత్యరస లవణాలు అయిన బైలిరూబిన్ మరియు బైలివర్జిన్లను విసర్జిస్తుంది.
  7. శరీరములో అధిక మొత్తంలో నిల్వ ఉన్న కాల్షియం , మెగ్నీషియం మరియు ఇనుము లవణాలను పెద్ద ప్రేగు ఉపకళా కణజాలాలు మలముతో బాటు బయటకు విసర్జిస్తాయి.
  8. లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు అతిస్వల్ప పరిమాణంలో నత్రజని సంబంధిత పదార్థాలను లాలాజలము మరియు కన్నీరు ద్వారా విసర్జిస్తాయి.

ఇన్ని రకాలుగా శరీరము నందలి వివిధ అవయవములు మరియు గ్రంథులు శరీరములో నిల్వ ఉండే వ్యర్ధ పదార్ధములను బయటకు పంపుటలో అవి నిర్వహించు పాత్రను నేను అభినందిస్తాను.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 22.
కింది స్లో చార్టును గమనించండి. ఖాళీ గడులు నింపండి. ఇది ఏ వ్యవస్థకు చెందినదో వివరించండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 8
జవాబు:
1) మూత్రపిండం 2) హెన్లీ శిక్యం 3) వృక్కద్రోణి 4) ప్రసేకం

ఈ ఫ్లోచార్టు విసర్జన వ్యవస్థకు సంబంధించినది. రక్తం ఏ విధముగా మూత్రపిండం నందు ప్రయాణిస్తుందో తెలుపుతుంది మరియు మూత్రము ఏర్పడే విధము మరియు బయటకు విసర్జించబడే విధానము గురించి వివరిస్తుంది.

మూత్రపిండమునకు వృక్కధమని రక్తమును సరఫరా చేస్తుంది. వృక్కడమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశనాళికాగుచ్ఛంలోనికి ప్రవహిస్తుంది. గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో పునఃశోషణ తరువాత మూత్రం హెస్లీ శిక్యం ద్వారా దూరస్థ సంవళిత నాళంలోనికి చేరుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో కూడా నాళికా స్రావం కొద్ది పరిమాణంలో జరుగుతుంది.

నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. తరువాత సంగ్రహనాళంలో వాసోప్రెస్సిన్ అనే హార్మోను సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ద్రవాన్ని మూత్రం అంటారు.

సంగ్రహనాళం నుండి మూత్రం వృక్మద్రోణిలోకి అక్కడ నుండి మూత్రనాళం, మూత్రాశయం మరియు ప్రసేకం ద్వారా బయటకు విసర్జించబడుతుంది.

ప్రశ్న 23.
రంగయ్యకు ఆరోగ్యం సరిగా లేదు. డాక్టర్ నిర్వహించిన పరీక్షల్లో క్రింది ఫలితాలు వచ్చాయి. పట్టికను విశ్లేషించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 9
అ) రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నది అని ఎలా చెప్పవచ్చు?
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు నిర్వహించాలి?
ఇ) పై నివేదిక ఆధారంగా నీవేం గ్రహించావు?
ఈ) పై నివేదిక ఆధారంగా డాక్టరును నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
అ) ఆహారం తినకముందు సాధారణ చక్కెర స్థాయి (గ్లూకోజ్) 60 – 100 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు చక్కెర స్థాయి ఆహారం తినకముందు 120 ఉన్నది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజు సాధారణ స్థాయి 160 – 180 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు 220గా ఉన్నది. రెండు సందర్భాలలోను గ్లూకోజు స్థాయిలు రక్తం నందు ఎక్కువగా ఉండుట వలన రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు.

ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయాలి.

ఇ) పై నివేదిక ఆధారంగా రంగయ్యకు అధిక రక్త పీడనము, చక్కెర వ్యాధి ఉన్నదని, రక్తం నందు 24 గంటల ప్రోటీను స్థాయి కూడా ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. మూత్రం నందు సోడియం స్థాయి సాధారణముగానే ఉన్నదని తెలియుచున్నది. రక్తం నందు పరిమాణం సాధారణ స్థాయి కంటే హెచ్చుగా నున్నది.

ఈ)

  1. చక్కెర వ్యా ధి వలన కలిగే నష్టాలు ఏమిటి?
  2. చక్కెర వ్యాధి కలుగుటకు కారణమేది?
  3. రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించు హార్మోను ఏది?
  4. అధిక రక్త పీడనము ఎందువలన కలుగుతుంది?
  5. అధిక రక్త పీడనము వలన కలిగే అనర్థాలు ఏమిటి?
  6. మూత్రం నందు 24 గంటల ప్రోటీను ఎక్కువైతే ఏం జరుగుతుంది?
  7. మన శరీరానికి సోడియం ఏ విధంగా అవసరం అవుతుంది?
  8. బైలిరూబిన్ వర్ణక స్థాయి రక్తమునందు ఎక్కువ అయితే కలిగే అనర్థాలు ఏమిటి?

ప్రశ్న 24.
రక్తం మూత్రపిండాలలో శుభ్రపడుతుంది. మూత్రపిండాలలోని నెఫ్రాన్లో రక్తం నుండి అనేక వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి. విసర్జన వ్యవస్థలో నిన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలు ఏమిటి?
జవాబు:

  1. మూత్రపిండాలు మన శరీరం నుండి వ్యర్థాలను విసర్జిస్తాయి. అవి శరీరంలో విటమినులు, ఖనిజలవణాలు, కొవ్వులు సమతుల్యత కలిగి ఉండేలా చూస్తాయి.
  2. ప్రతిరోజు మన శరీరం నుండి 1.6 లీ నుండి 1.8 లీటర్ల వరకు మూత్రము విసర్జించబడుతుంది. దీనిలో మన శరీరానికి ఉపయోగపడని ఖనిజ లవణములు, విటమినులు ఉంటాయి.
  3. మానవ మూత్రాశయము మానవ మెదడు పరిమాణం కలిగి ఉండడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
  4. అతిచిన్నవైన మూత్రపిండాలు మానవ జీవిత కాలంలో రమారమి 7,850, 000, 000 గాలనుల ద్రవపదార్థాలను విసర్జించుటకు కారణమవుతాయి.
  5. మానవ మూత్రాశయము సుమారు 400 మి.లీ. పరిమాణంలో మూత్రమును నిలువచేయగలుగుతుంది.
  6. మానవ మూత్రములో ఉండే యూరియా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
  7. ఒక్కొక్క మూత్రపిండము అతి సూక్ష్మమైన రక్తాన్ని వడకట్టే సుమారు 10 లక్షల కంటే ఎక్కువ ఉండే నెఫ్రాన్లను
    (లేదా)
    మూత్రనాళికలను కలిగియుండటం నన్ను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది.

ప్రశ్న 25.
మీ గ్రామంలో ఏయే మొక్కలు లభిస్తాయి ? వీటిలో ఏయే మొక్కల ఉప ఉత్పన్నాలు మీరు నిజజీవితంలో ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:
1) మా గ్రామంలో లభ్యమయ్యే మొక్కల వివరాలు :
సపోట, కొబ్బరి, తుమ్మ, మామిడి, జామ, తాటి, అరటి, పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త, గడ్డి చామంతి, తంగేడు, పైనస్, వాలిస్ నేరియా, టేకు మొదలైన మొక్కలు పెరుగుతాయి.

2) పై మొక్కలందు ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేయు మొక్కలు :
పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త మరియు చామంతి. ఈ మొక్కల ఉప ఉత్పన్నాలు నిత్యజీవితములో ఎంతో ఉపయోగపడతాయి.

మొక్కఆల్కలాయిడ్ఉపయోగం
పొగాకునికోటిన్క్రిమిసంహారిణి
సర్పగంధిరిసర్ఫిన్పాముకాటు నుండి రక్షణ
కాఫీకెఫెన్నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం
వేపనింబిన్యాంటిసెప్టిక్
ఉమ్మెత్తస్కోపోలమైన్మత్తుమందు
గడ్డిచామంతిపైరిత్రాయిడ్స్కీటకనాశనులు

3) తుమ్మ, తంగేడు నుండి లభ్యమయ్యే టానిన్లను తోళ్ళను శుభ్రం చేయడానికి వినియోగిస్తాము.

4) వేప, తుమ్మ చెట్ల నుండి లభ్యమయ్యే జిగురును అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా ఉపయోగిస్తాం.

5) పైనస్ నుండి లభ్యమయ్యే రెసిన్లను వార్ని ఉపయోగిస్తాం.

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్టులు

1.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 10
జవాబు:
మూత్రాశయం

2.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 11
జవాబు:
వృక్క ద్రోణి

3.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 12
జవాబు:
గ్లోమరులస్

4.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 13
జవాబు:
హెన్లీ శిక్యం

5.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 14
జవాబు:
ఎంజైమ్స్

6.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 15
జవాబు:
స్రావాలు

7.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 16
జవాబు:
రెసిన్

8.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 17
జవాబు:
హెస్లీ శిక్యం

9.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 18
జవాబు:
కాలేయం

10.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 19
జవాబు:
వరణాత్మక పునఃశోషణం

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు సమ్మేళనాలు నత్రజని సంబంధిత వ్యర్థాలు?
A. అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం
B. గ్లూకోజ్, అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లం
జవాబు:
గ్రూపు A

12. ఏ రక్తనాళాల సమూహం ఆమ్లజనిసహిత రక్తాన్ని తీసుకెళతాయి?
A. వృక్కసిర, వృక్క ధమని, వృక్క నాళిక
B. వృక్క ధమని, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు B

13. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. అభివాహి ధమనిక, గ్లోమరులస్, అపవాహి ధమనిక
B. గ్లోమరులస్, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు A

14. అల్పగాఢత గల మూత్రం మరియు అధిక మూత్ర విసర్జన లక్షణాలు ఉన్న వ్యాధిని గుర్తించండి.
A. డయాబెటిస్ ఇన్సిపిడస్
B. డయాబెటిస్ మెల్లిటస్
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

15. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. సంగ్రహణ నాళం-కేలిసిస్-పిరమిడ్-ద్రోణి మూత్రనాళం
B. సంగ్రహణ నాళం-పిరమిడ్-కేలిసిస్-ద్రోణి – మూత్రనాళం
జవాబు:
గ్రూపు B

16. ఈ క్రింది ఏ సమూహం మానవునిలోని అనుబంధ విసర్జక అవయవాలు?
A. ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. గుండె, కళ్ళు, క్లోమం
జవాబు:
గ్రూపు A

17. ఏ గ్రూపు సమ్మేళనాలు ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు కావు?
A. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు
B. ఆల్కలాయిడ్స్, రెసిన్, లేటెక్స్
జవాబు:
గ్రూపు B

18. ఏ గ్రూపు పండ్ల నుంచి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు వెలికితీస్తారు?
A. మార్ఫిన్, కొకైన్, స్కోపాలమైన్
B. కెఫిన్, నింబిన్, రిసర్ఫిన్
జవాబు:
గ్రూపు A

19. ఏ గ్రూపులోని సమ్మేళనాలు మొక్కల్లోని నత్రజని సంబంధిత ద్వితీయ జీవక్రియోత్పన్నాలు కావు?
A. క్వినైన్, పైరిథ్రాయిడ్స్, నికోటిన్
B. రెసిన్, లేటెక్స్, టానిన్స్
జవాబు:
గ్రూపు B

20. ఏ గ్రూపు మొక్కల స్రావాలకు సంబంధించినవి?
A. లేటెక్స్, రెసిన్లు, జిగురులు
B. ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం
జవాబు:
గ్రూపు A

విస్తరించుము

21. LS – Longitudinal Section
22. PCT – Proximal Convoluted Tubule/ సమీపస్త సంవళిత నాళము
23. DCT – Distal Convoluted Tubule / దూరస్థ సంవళిత నాళము
24. ESRD – End Stage Renal Diseas

ఉదాహరణలు ఇవ్వండి

25. జలచర జంతువులు అమ్మోనియాను నత్రజని వ్యర్థాలుగా విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లంను విసర్జించే జంతువుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కీటకాలు మరియు పక్షులు

26. పక్షులు యూరిక్ ఆమ్లం అనే నత్రజని వ్యర్థాలను విసర్జిస్తాయి. యూరియాను విసర్జించే జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు

27. రక్తస్కందన నిరోధక పదార్థానికి హెపారిన్ ఒక ఉదాహరణ. కృత్రిమ రక్తస్కందన నిరోధక పదార్థానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సోడియం ఆక్సలేట్ / సోడియం సిట్రేట్

28. సేబాషియస్ గ్రంథులు చర్మం ద్వారా సెబమ్ ను విసర్జిస్తాయి. అధికంగా తీసుకున్న ఔషధాలను తొలగించడంలో సహాయపడే అనుబంధ విసర్జక అవయవానికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
కాలేయం

29. అమీబా సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పారామీషియం

30. పొరిఫెరా వర్గ జీవులలో విసర్జన కొరకు ప్రత్యేకమైన విసర్జకావయవాలు లేవు. జీవుల ప్రతి కణంలోకి నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా విసర్జ కావయవాలు లేని వర్గానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీలెంటరేటా

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

31. క్వినైన్ అనేది బెరడు నుండి సేకరించిన ఆల్కలాయిడ్ మరో ఉగా హరణ ఇవ్వండి.
జవాబు:
రిసర్ఫిన్ మరియు నింబిన్

32. స్కోపాలమైన్ అనేది పుష్పం నుండి సేకరించిన ఆల్కలాయిడ్. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పైరిత్రాయిడ్లు

33. ఆల్కలాయిడ్స్ అనేవి నైట్రోజన్ ను కలిగి ఉండే ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. కార్బన్ ని కలిగి ఉన్న ద్వితీయ జీవక్రియోత్పన్నానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
టానిన్లు

34. నింబిన్ అనేది యాంటీ సెప్టిక్ గా ఉపయోగించే ఆల్కలాయిడ్. కీటకనాశనిగా వాడే ఆల్కలాయిడు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నికోటిన్ / పైరిత్రాయిడ్లు

35. హీవియా మొక్క నుండి లభించే లేటెస్ట్ ను రబ్బరు తయారీలో వాడతారు. లేటెక్స్ ను స్రవించే మొక్కకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జ ట్రోపా

36. మానవులలో స్రావాలకు ఉదాహరణలు హార్మోన్లు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లాలాజలం/ఎంజైములు

నేను ఎవరు?

37. నేను వృక్షశాస్త్రవేత్తను. మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోకి స్రవిస్తాయి అని నా ప్రయోగాల ద్వారా తెలియజేశాను.
జవాబు:
బ్రుగ్ మన్

38. నేనొక మొక్కను. రబ్బరును తయారు చేయడానికి ఉపయోగించే జిగటగా ఉండే పాలపదార్థాన్ని నేను స్రవిస్తాను.
జవాబు:
హీవియా బ్రెజిలియన్సిస్

39. నేను ద్వితీయ జీవక్రియోత్పన్నాన్ని. నేను ఎక్కువగా వివృతబీజ మొక్కలలో ఉంటాను. మరియు నన్ను వార్నిష్‌లలో ఉపయోగిస్తారు.
జవాబు:
రెసిన్

40. నన్ను సర్పగంధి మొక్క అని పిలుస్తారు. నేను స్రవించే ఆల్కలాయిడు పాముకాటుకు మందుగా ఉపయోగిస్తారు.
జవాబు:
రావుల్ఫియా సర్పెంటైనా

41. నేనొక విత్తనాన్ని, కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసే ఆల్కలాయిడ్ ను కలిగి ఉంటాను.
జవాబు:
కాఫీ విత్తనం

42. ఎకైనోడర్మటా జీవులలో చలనానికి, పోషక మరియు వర్థపదార్థాల రవాణా కొరకు ఏర్పడిన అవయవవ్యవస్థను.
జవాబు:
జలప్రసరణ వ్యవస్థ

43. నేనొక వర్గాన్ని. ఈ వర్గంలో మొదటిసారిగా విసర్జక నిర్మాణాలు ఏర్పడ్డాయి.
జవాబు:
ప్లాటీ హెల్మింథిస్

44. ఏకకణ జీవులలో ద్రవాభిసరణ క్రమతను నియంత్రించే కణాంగాన్ని,
జవాబు:
సంకోచరిక్తిక

45. ఎర్రరక్తకణాలు చనిపోవడం వలన హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే వ్యర్థాన్ని మరియు మూత్రం యొక్క రంగుకి కారణమైన వర్ణక పదార్థాన్ని.
జవాబు:
యూరోక్రోమ్

46. నేనొక వాషింగ్టన్ కి చెందిన సర్టైన్ ని. 1954లో మొదటి సారిగా మూత్రపిండ ఆపరేషన్ చేసిన ఘనత నాదే.
జవాబు:
డా|| చార్లెస్ హఫ్ నగెల్

జతపరచుట

47. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రం – యూరోక్రోమ్
రక్తం – పత్రహరితం
పత్రం – హీమోగ్లోబిన్
జవాబు:
మూత్రం – యూరోక్రోమ్

48. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
అమ్మోనియా – చేప
యూరియా – మానవులు
యూరిక్ ఆమ్లం – ఎలుక
జవాబు:
యూరిక్ ఆమ్లం – ఎలుక

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

49. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రాశయం సామర్థ్యం – 1.6 – 1.81 లీటర్లు
రోజుకు విసర్జించే మూత్ర
పరిమాణం – 700-800 మి.లీ.
డయాలిసిసికి పట్టే సమయం – 3-6 గంటలు
జవాబు:
డయాలిసిస్ కి పట్టే సమయం – 3-6 గంటలు

50. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తులు – CO2 & నీరు
కాలేయం – అదనపు మందులు
చర్మం – బిలిరుబిన్
జవాబు:
చర్మం – బిలిరుబిన్

51. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
అనెలిడా – మాల్ఫీజియన్ నాళికలు
నెమటోడా – రెనెట్ కణాలు
ఆరోపోడా – నెఫ్రీడియా
జవాబు:
నెమటోడా – రెనెట్ కణాలు

52. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మానవుడు – మూత్రపిండం
పక్షులు – హరితగ్రంథులు
మొలస్కా – మెటా నెఫ్రీడియా
జవాబు:
పక్షులు – హరిత గ్రంథులు

53. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు – కార్బోహైడ్రేట్
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు
మొక్కలలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు – రాఫైడ్లు
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు

54. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నికోటిన్ – బెరడు
క్వి నైన్ – ఆకు
స్కోపాలమైన్ – పుష్పం
జవాబు:
స్కోపాలమైన్ – పుష్పం

55. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
నల్లమందు – నొప్పి నివారిణి
నింబిన్ – మత్తుమందు
పైరిత్రాయిడ్ – కీటకనాశిని
జవాబు:
నింబిన్ – మత్తుమందు

56. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
జిగురు – తుమ్మ
అలర్జిన్ – పార్టీనియం
టానిన్ – జట్రోపా
జవాబు:
టానిన్ – జట్రోపా

పోలికను గుర్తించుట

57. గడ్డి చామంతి : పువ్వు :: సింకోనా 😕
జవాబు:
బెరడు

58. వేప : అజాడిరక్త ఇండికా :: ? : నికోటియాన టొబాకం
జవాబు:
పొగాకు

59. స్కోపాలమైన్ : మత్తుమందు :: కొకైన్ 😕
జవాబు:
నొప్పి నివారిణి

60. చూయింగ్ గమ్ : చికిల్ :: బయోడీజిల్ 😕
జవాబు:
జట్రోపా

61. రెసిన్ : మొక్క స్రావం :: లాలాజలం 😕
జవాబు:
మానవ స్రావం

62. శ్వాసక్రియ : CO2 :: బాష్పోత్సేకం 😕
జవాబు:
నీరు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

63. వృక్క ధమని : ? :: వృక్క సిర : ఆమ్లజనిరహిత రక్తం
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

64. గుచ్చగాలనం : బౌమన్ గుళిక :: నాళికా స్రావం 😕
జవాబు:
దూరస్థ సంవళిత నాళము

65. సజల మూత్రం : వాసోప్రెస్సిన్ :: ? : రక్తస్కందన నిరోధకం
జవాబు:
హెపారిన్

66. డయాలసిస్ : కృత్రిమ మూత్రపిండం :: జీవన్ దాన్ పథకం 😕
జవాబు:
అవయవ దానం

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

67. జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం యూరియా.
జవాబు:
జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం అమ్మోనియా.

68. ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను న్యూరాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
జవాబు:
ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.

69. దూరస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్య కేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.
జవాబు:
సమీపస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్యకేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.

70. వరణాత్మక పునఃశోషణం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.
జవాబు:
నాళికా స్రావం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.

71. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ మెల్లిటస్ అంటారు.
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు.

72. ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని ఎడిమ అంటారు.
జవాబు:
ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని యూరేమియా అంటారు.

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

73. ఆల్కలాయిడ్స్ కర్బన సమ్మేళనాలు మరియు విష పూరితం.
జవాబు:
ఆల్కలాయిడ్స్ నత్రజని సమ్మేళనాలు మరియు విష పూరితం.

బొమ్మలపై ప్రశ్నలు

74.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 20
ఈ పరికరంలో ఉపయోగించిన ద్రవం పేరేమిటి?
జవాబు:
డయలైజింగ్ ద్రావణం

75.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 21
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
మూత్రపిండ మార్పిడి

76.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 22
ఈ మొక్కల్లో ఉండే ఆల్కలాయిడ్ పేరేమిటి?
జవాబు:
స్కోపోలమైన్

77.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 23
ఈ మొక్క నుండి స్రవించే పదార్థం ఏమిటి?
జవాబు:
లేటెక్స్

78.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 24
ఈ పటంలో U ఆకారంలో ఉన్న భాగం పేరు ఏమిటి?
జవాబు:
హె శిక్యం

79.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 25
ఈ పటంలో తప్పుగా గుర్తించిన భాగం పేరేమిటి?
జవాబు:
వృక్క సిర (మూత్రనాళం)

80.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 26
మానవునిలో అనుబంధ విసర్జక అవయ వంగా పనిచేసే ఈ పటాన్ని గుర్తించండి.
జవాబు:
కాలేయం

ఖాళీలను పూరించండి

81. విసర్జన ప్రధాన లక్ష్యము
జవాబు:
శరీర అయాన్ సమతా స్థితి

82. మూత్రపిండ లోపలి తల నొక్కును ఏమంటారు?
జవాబు:
హైలమ్

83. మూత్రపిండం లోనికి ………. ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
జవాబు:
వృక్క ధమని

84. మూత్రపిండం యొక్క వెలుపలి వలయాన్ని ………. అంటారు.
జవాబు:
వల్కలము

85. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ………….. నెఫ్రాన్
జవాబు:
వృక్క నాళిక

86. మూత్రనాళికలోని తలపిన్ను వంటి నిర్మాణం …………
జవాబు:
హె శిక్యం

87. కృత్రిమ మూత్రపిండాన్ని …….. అంటారు.
జవాబు:
డయాలసిస్

88. ………… మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
జవాబు:
కుడి

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

89. మొక్కలలోని విసర్జక పదార్థాలను ……. అంటారు.
జవాబు:
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు

90. ఆల్కలాయిడ్స్ …….. ఉత్పన్నాలు.
జవాబు:
కర్బన

91. తోళ్ళ పరిశ్రమలో ఉపయోగించే వృక్ష వ్యర్థాలు ………..
జవాబు:
టానిన్లు

92. రబ్బరు మొక్క ………… నుండి రబ్బరు తయారు చేస్తారు.
జవాబు:
లేటెక్స్

93. మొక్కల వేర్ల నుండి వ్యర్థాల విసర్జనను ఏమంటారు?
జవాబు:
అయాన్ నిశ్రావణం

94. ఏ మొక్క ఆల్కలాయిడ్ ను యాంటీ బయాటిక్ గా ఆవాడతారు?
జవాబు:
వేప

95. రెసిన్లను ఏ పరిశ్రమలలో వాడతారు?
జవాబు:
రంగుల పరిశ్రమలో

10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. పాముకాటు నుండి రక్షణ పొందడానికి ఈ క్రింది ఆల్కలాయిడను ఉపయోగిస్తారు.
A) క్వి నైన్
B) రిసర్ఫిన్
C) కెఫెన్
D) నింబిన్
జవాబు:
B) రిసర్ఫిన్

2. ఈ కింది వానిలో విసర్జక అవయవము లేని జంతువును గుర్తించండి.
A) పక్షి
B) అమీబా
C) స్పంజికలు
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

3. ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు ఉబ్బిపోయాయి. నీరసం అలసట వస్తుంది. అతనిలో ఈ అవయవం పాడై ఉండవచ్చు.
A) మూత్రపిండం
B) మెదడు
C) గుండె
D) కాలేయం
జవాబు:
A) మూత్రపిండం

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

4. క్రింది వాటిలో సరిగ్గా లేని జత ఏది?
A) ప్లాటి హెల్మింథిస్ – జ్వాలకణాలు
B) ఆగ్రోపొడ – మాల్ఫీజియన్ నాళికలు
C) మొలస్కా – మెటానెఫ్రీడియా
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ
జవాబు:
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ

5. ఈ క్రింది పటములో ‘X’ ను గుర్తించుము.
A) బౌమన్ గుళిక
B) సిర
C) నాళము
D) కప్పు
జవాబు:
A) బౌమన్ గుళిక

6. మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవములుగా గల జీవి ………
A) వానపాము
B) బొద్దింక
C) ఏలికపాము
D) ప్లనేరియా
జవాబు:
B) బొద్దింక

7. రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఏ విధంగా గుర్తిస్తారు?
A) స్కానింగ్ ద్వారా
B) మూత్ర పరీక్ష ద్వారా
C) థర్మామీటర్ తో
D) రక్తపరీక్ష ద్వారా
జవాబు:
B) మూత్ర పరీక్ష ద్వారా

8. మన శరీరంలో మూత్రం ప్రయాణించే సరైన మార్గం
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం
B) మూత్రనాళాలు → మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు
C) మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు
D) ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు → మూత్రాశయం
జవాబు:
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం

9. క్రింది స్లో చార్టును పూర్తి చేయుము.
వరణాత్మక . . అతిగా ఢత గల గుచ్చ గాలనం మూత్రం ఏర్పడడం
A) నాళికా స్రావం
B) నాళికా వడబోత
C) నాళికా విసర్జన
D) మూత్రం ఏర్పడటం
జవాబు:
A) నాళికా స్రావం

10. నేను ఒక మొక్కను. నా విత్తనాల నుండి జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. నేనెవరిని?
A) రబ్బరు మొక్క
B) వేప మొక్క
C) కాక్టస్ మొక్క
D) జట్రోపా మొక్క
జవాబు:
D) జట్రోపా మొక్క

11. మొలస్కాలో విసర్జక అవయవాలు ఏవి?
A) రెనెట్ కణాలు
B) హరిత గ్రంథులు
C) మెటా నెఫ్రీడియా
D) మూత్రపిండాలు
జవాబు:
C) మెటా నెఫ్రీడియా

12. మూత్రము ఏర్పడే విధానంలో ఈ క్రింది నాలుగు దశలు ఉన్నవి. వాటిని క్రమ పద్ధతిలో అమర్చండి.
i) వరణాత్మక పునఃశోషణ
ii) గుచ్చగాలనం
iii) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం
iv) నాళికా స్రావం
A) (i), (ii), (iii), (iv)
B) (iv), (iii), (ii), (i)
C) (iii), (ii), (i), (iv)
D) (ii), (i), (iv), (iii)
జవాబు:
D) (ii), (i), (iv), (iii)

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

13. సరైన జతను గుర్తించండి.
A) ప్రోటోజోవా – జ్వాలాకణాలు
B) అనెలిడా – మూత్రపిండాలు
C) ఇఖైనోడర్మేటా – నెఫ్రీడియా
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు
జవాబు:
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు

14. మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణము
A) బైలిరూబిన్
B) యూరోక్రోమ్
C) క్లోరైడ్లు
D) క్రియాటినిన్
జవాబు:
B) యూరోక్రోమ్

15. గ్రూపు — A గ్రూపు – B
i) ప్లాటి హెల్మింథస్ ( ) a) నెఫ్రిడియ
ii) అనెలిడ ( ) b) జ్వాలా కణాలు
iii) ఆర్రోపోడా ( ) మాల్ఫీజియన్ నాళికలు
A) i – b, ii – a, iii – c
B) i – b, ii – c, iii – a
C) i – a, ii – c, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
A) i – b, ii – a, iii – c

16. చర్మము : చెమట : : ఊపిరితిత్తులు : ………….
A) కార్బన్-డై-ఆక్సెడ్
B) మలం
C) యూరియా
D) లాలాజలం
జవాబు:
A) కార్బన్-డై-ఆక్సెడ్

17. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవిచ్చే సలహాలేవి?
A) రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం
B) పొగ తాగడం, మద్యం సేవించడం మానివేయడం
C) రక్తపీడనంను అదుపులో ఉంచుకోవడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

18. ప్లాటి హెల్మింథిస్ వర్గ జీవుల్లో విసర్జకావయవాలు
A) నెఫ్రిడియా
B) జ్వాలాకణాలు
C) హరిత గ్రంథులు
D) మూత్ర పిండాలు
జవాబు:
B) జ్వాలాకణాలు

AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

19. కింది వాటిలో తప్పు వాక్యాన్ని గుర్తించండి.
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.
B) మధుమేహం ఉన్నవారి మూత్రంలో చక్కెర ఉంటుంది.
C) మూత్రం లేత పసుపురంగులో ఉండడానికి యూరోక్రోమ్ కారణం.
D) ద్రవ పదార్థాలు లేదా నీరు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువసార్లు మూత్రానికి వెళతారు.
జవాబు:
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.

మీకు తెలుసా?

* 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత దాదాపుగా అందరిలోను ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది.
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 28

* మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో సమరూప కవలలకు చేసిన ఘనత డా. చార్లెస్ హఫ్ నగెల్ అనే వాషింగ్టన్‌కు చెందిన సర్జనకు చెందుతుంది. మన దేశంలో మొదటిసారి డిసెంబర్ 1వ తేదీ 1971న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూర్ లో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది.

* చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేయబడిన ఒక రకమైన జిగురు పదార్థం. దీనిని 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు. పార్టీనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలుగజేస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి.

పునశ్చరణ
AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 27

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

These AP 10th Biology Important Questions and Answers 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 3rd lesson Important Questions and Answers ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
రక్తఫలకికలు రక్త స్కందనంలో పాల్గొంటాయి. రక్తఫలకికలు లేకపోతే ప్రమాదం జరిగినపుడు రక్తం గడ్డకట్టదు. అందువలన అధిక రక్తస్రావం జరిగి వ్యక్తి మరణిస్తాడు.

ప్రశ్న 2.
ఇద్దరు వ్యక్తుల రక్తపీడనం ఇలా ఉంది.

రామయ్య140 / 807
రంగయ్య110 / 90

ఎవరి రక్తపీడనం ఎక్కువ ? అది దేనిని సూచిస్తుంది?
జవాబు:
రామయ్య రక్తపీడనం ఎక్కువ. దీనిలో 140 సిస్టోలిక్ పీడనం, 80 డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది.

ప్రశ్న 3.
మన నాడీస్పందన ఎప్పుడు అధికమౌతుంది?
జవాబు:
పరిగెత్తుట, వ్యాయామము, భయం, ఉద్వేగం, ఎత్తైన ప్రదేశాలకు ఎక్కుతున్నప్పుడు అధికమౌతుంది.

ప్రశ్న 4.
శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

  1. రక్తంలో ఎర్ర రక్తకణాలు ఉంటాయి, కానీ శోషరసంలో ఉండవు.
  2. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ శోషరసం వర్ణరహితంగా ఉండును.

ప్రశ్న 5.
ఏ జీవులలో రక్తం ఆక్సిజన్‌ను సరఫరా చేయదు?
జవాబు:
ఆర్థోపొడా జీవులు లేదా కీటకాలు (లేదా) వాయునాళ శ్వాసవ్యవస్థ కలిగిన జీవులు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 6.
మేక గుండె పరిశీలించుటకు ప్రయోగశాలలో మీరు ఉపయోగించిన పరికరాలను తెలుపండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
1. మేక తాజా గుండె, 2. సోడాస్త్రాలు, 3. ఉపయోగించిన పెన్ను, రీఫిల్స్, 4. పదునైన బ్లేడు, (లేదా) స్కాల్ పెల్, 5. డిసెక్షన్ ట్రే, 6. ఒక మగ్గు నీరు, 7. డిసెక్షన్ కత్తెర, 8. ఫోర్సెప్స్.

ప్రశ్న 7.
ప్రయోగశాలలో వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాల జాబితాను తెల్పండి.
జవాబు:
వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాలు : క్లాంప్, గాజు గొట్టం, గట్టి రబ్బరు గొట్టం, కుండీలో పెరుగుతున్న మొక్క.

ప్రశ్న 8.
శరీరంలో అతి పెద్ద ధమని పేరు రాయండి.
జవాబు:
శరీరంలో అతి పెద్ద ధమని : బృహద్ధమని

ప్రశ్న 9.
పటంలో చూపిన పరికరాన్ని గుర్తించి, దాని పేరు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1
జవాబు:
స్పిగ్మోమానోమీటర్.

ప్రశ్న 10.
అధిక రక్తపోటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు డాక్టర్‌ను మీరు అడిగే రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. అధిక రక్తపోటు వలన కలిగే పరిణామాలు ఏమిటి?
  2. అధిక రక్తపోటును ఎలా నివారించవచ్చు?

ప్రశ్న 11.
నిమ్నస్థాయి జీవులలో జీవక్రియలు ఎలా జరుగుతాయి?
జవాబు:
అమీబా, హైడ్రా. వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం (Diffusion), ద్రవాభిసరణ (Osmosis) వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతాయి.

ప్రశ్న 12.
నాడీస్పందన అనగానేమి?
జవాబు:
నాడీస్పందన :
హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో లయ కదలికను నాడీ స్పందన (Pulse) అంటారు. నాడీ స్పందన రేటు హృదయస్పందన రేటుకు సమానం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 13.
ఎడిమా అనగానేమి?
జవాబు:
ఎడిమా :
కాళ్ళలోని కణజాల ద్రవం పైకి ప్రసరించక కాళ్ళలో నిల్వ ఉండుటవలన వాపు కనిపిస్తుంది. ఈ స్థితిని “ఎడిమా” అంటారు. ప్రధానంగా ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణించినపుడు ఈ స్థితిని గమనించవచ్చు.

ప్రశ్న 14.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
హృదయస్పందన వలన రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుందని మనకు తెలుసు. గుండె నుండి ప్రవహించే రక్తం, రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరకు రక్తకేశనాళికలను చేరుతుంది. పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశనాళికల ద్వారా కణజాలాలలోనికి చేరుతుంది. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని “కణజాల ద్రవం” (Tissue fluid) అంటారు.

ప్రశ్న 15.
అమీబా వంటి ఏకకణ జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది?
జవాబు:
అమీబా, హైడ్రా, వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం, ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 16.
ప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రసరణ వ్యవస్థ:
జీవులలో కణజాలానికి కావలసిన పదార్థాలను రవాణా చేయు వ్యవస్థను “ప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 17.
గుండెకు రక్షణను కల్పించే నిర్మాణం ఏమిటి?
జవాబు:
ప్రక్కటెముకలు, హృదయావరణత్వచం గుండెకు రక్షణ కల్పిస్తాయి.

ప్రశ్న 18.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళం ఏమిటి?
జవాబు:
కరోనరి ధమని గుండె కండరాలకు రక్తాన్ని అందిస్తుంది.

ప్రశ్న 19.
గుండెలోని గదులు ఏమిటి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పై రెండు గదులను “కర్ణికలు” అని, క్రింది రెండు గదులను “జఠరికలు” అని అంటారు.

ప్రశ్న 20.
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలు ఏమిటి?
జవాబు:
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలను “ధమనులు” అంటారు.

ప్రశ్న 21.
పుపుస ధమని పని ఏది?
జవాబు:
పుపుస ధమని గుండె నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళుతుంది.

ప్రశ్న 22.
ఊర్ధ్వబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
ఊర్ధ్వబృహత్ సిర తలపైన ఉన్న భాగాల నుండి రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 23.
అథోబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
అథోబ్మహత్ సిర శరీరం క్రింద భాగాల నుండి, రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 24.
ధమనీ ఛాపం (Arota)అనగానేమి?
జవాబు:
ధమనీ ఛాపం :
శరీరంలోని అతి పెద్ద ధమనిని ధమనీ చాపం అంటారు. ఇది ఎడమ జఠరిక నుండి ప్రారంభమై శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 25.
ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ద్వివలయ ప్రసరణ :
దేహభాగాలకు రక్తాన్ని రెండు వలయాలలో పంపే హృదయాన్ని “ద్వివలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 26.
సూక్ష్మ కేశనాళికలు అనగానేమి?
జవాబు:
సూక్ష్మకేశనాళికలు :
శరీరంలో రక్తనాళాలు సన్నని నాళాలుగా విడిపోతాయి. వీటిని సూక్ష్మనాళికలు (Capillaries) అంటారు. లాటిన్ భాషలో capillaries అంటే కేశం అని అర్థం. ఈ నాళాలు వెంట్రుకలవలె సన్నగా ఉంటాయి.

ప్రశ్న 27.
హార్దిక వలయం అనగానేమి?
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని “హృదయస్పందన లేదా హార్దిక వలయం” (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 28.
హార్దిక వలయంలోని ప్రక్రియలు ఏమిటి?
జవాబు:
హర్దిక వలయంలో ఒక సంకోచదశ (సిస్టోల్), ఒక సడలింపు దశ (డయాస్టోల్) ఉంటాయి.

ప్రశ్న 29.
హార్దిక వలయానికి పట్టే సమయం ఎంత?
జవాబు:
హార్దిక వలయం సుమారుగా 0.8 సెకన్లలో పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కర్ణికల సంకోచానికి 0.11-0. 14 సెకన్లు, జఠరికా సంకోచానికి 0.27-0. 35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 30.
ఏకవలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :
రక్తప్రసరణ ఒకే వలయం ద్వారా జరిపే వ్యవస్థను “ఏకవలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 31.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవం (Tissue fluid) అంటారు.

ప్రశ్న 32.
శోషరసం, కణజాలద్రవం మధ్యగల భేదమేమి?
జవాబు:
ఘనపదార్థాలు లేని రక్తాన్ని “శోషరసం” అంటారు. కణజాలలో ఉన్న శోషరసాన్ని “కణజాలద్రవం” అంటారు.

ప్రశ్న 33.
సీరం అనగానేమి?
జవాబు:
సీరం :
రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన ద్రవాన్ని “సీరం” అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 34.
బ్రౌనియన్ చలనం అనగానేమి?
జవాబు:
బ్రౌనియన్ చలనం : కణజీవపదార్థంలో ఉండే సహజ కదలికలను “బ్రేనియన్ చలనం” అంటారు.

ప్రశ్న 35.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో కాకుండా శరీర కుహరాల ద్వారా ప్రసరించే వ్యవస్థను “వివృత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
ఉదా : బొద్దింక

ప్రశ్న 36.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో ప్రసరించే వ్యవస్థను “సంవృత ‘రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు
ఉదా : మానవుడు.

ప్రశ్న 37.
రక్తపీడనం అనగానేమి? దాని విలువ ఎంత?
జవాబు:
రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు కలిగించే పీడనాన్ని “రక్తపీడనం” అంటారు. దీని విలువ 120/80.

ప్రశ్న 38.
120/80 దేనిని తెలియజేస్తుంది?
జవాబు:
120/80 లో 120 సిస్టోలిక్ పీడనాన్ని, 80 డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 39.
రక్తస్కందనంలో పాల్గొనే ఎంజైమ్ ఏమిటి?
జవాబు:
రక్తస్కందనంలో థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఇది రక్తఫలకికల నుండి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 40.
మొక్కలలోని పోషక కణజాలం పని ఏమిటి?
జవాబు:
మొక్కలలోని పోషక కణజాలం ఆహార రవాణాలో పాల్గొంటుంది.

ప్రశ్న 41.
నాళికాపుంజం దేనితో నిర్మితమౌతుంది?
జవాబు:
దారువు, పోషకకణజాలం వలన నాళికాపుంజం నిర్మితమవుతుంది.

ప్రశ్న 42.
వేరు పీడనం అనగానేమి?
జవాబు:
వేరు పీడనం :
వేరు, నీటిని పీల్చుకొన్నప్పుడు కలిగించే పీడనాన్ని “వేరు పీడనం” అంటారు.

ప్రశ్న 43.
బాష్పోత్సేకం అనగానేమి?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహభాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని “బాష్పోత్సేకం” అంటారు.

ప్రశ్న 44.
జఠర ప్రసరణ కుహరం ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
స్పంజికలు, హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులలో జఠర ప్రసరణ కుహరం ఉంటుంది.

ప్రశ్న 45.
శరీరంలో పెద్ద ధమని ఏమిటి?
జవాబు:
బృహత్ ధమని శరీరంలోని పెద్ద ధమని. ఇది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 46.
అతి పెద్ద గుండె గల జంతువు ఏమిటి?
జవాబు:
నీటి తిమింగలం 750 కేజీల బరువు కలిగిన పెద్ద గుండె కలిగి ఉంటుంది.

ప్రశ్న 47.
రక్తపోటు అనగానేమి?
జవాబు:
రక్తపోటు :
రక్తపీడనం 120/80 కంటే అధికంగా ఉంటే దానిని “రక్తపోటు” అంటారు.

ప్రశ్న 48.
నీరు మూలకేశాలలోనికి ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది?
జవాబు:
మూలకేశాలలోనికి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా చేరుతుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీలిమ తన మిత్రులతో ఒక కృత్యం నిర్వహించింది. దాని ఫలితాలను కింది పట్టికలో నమోదుచేసింది. పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
జవాబు:
నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది.

ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
జాగింగ్ లో ఎక్కువ శక్తి వినియోగించబడి శ్వాసక్రియరేటు పెరుగుతుంది. కణజాలానికి అధిక ), అందించుటకు హృదయస్పందన రేటు పెరుగును.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 2.
ఒక విద్యార్థి ఆడుకుంటున్నప్పుడు గాయపడ్డాడు. అయితే రక్తం కారడం ఎంత సేపటికీ ఆగలేదు. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చో, రాయండి.
జవాబు:
రక్తస్కందనం జరగకపోవటానికి

  1. రక్త ఫలకిలకలు తక్కువగా ఉండవచ్చు.
  2. విటమిన్ K లోపించి ఉండవచ్చు.
  3. హీమోఫీలియా వ్యాధి కల్గి ఉండవచ్చు.
  4. రక్త స్కందన ప్రోటీన్స్ లోపించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయుడి నుండి “రక్త స్కందన” గురించి తెలుసుకొనుటకు ఏ ప్రశ్నలను వేస్తావు?
జవాబు:

  1. రక్తస్కందనం అనగానేమి?
  2. రక్తం ఏ విధంగా గడ్డ కడుతుంది?
  3. రక్తం గడ్డ కట్టడానికి కారణమేమిటి?
  4. రక్తం గడ్డ కట్టుటలో జరిగే ప్రక్రియ ఏమిటి?
  5. ఏ పదార్థము రక్తనాళములలో రక్తము గడ్డకట్టకుండా నివారిస్తుంది?
  6. రక్తం గడ్డ కట్టడానికి కావలసిన విటమిన్ ఏది?
  7. ప్రమాదాలు జరిగినపుడు రక్తం గడ్డ కట్టకపోతే ఏమి జరుగుతుంది?
  8. రక్తములో ఉన్న ఏ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహాయం చేస్తాయి?

ప్రశ్న 4.
మానవ హృదయంలో కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి పేర్లు రాయండి.
జవాబు:

కవాటం పేరుకవాట స్థానం
1) కుడి కర్ణికా జఠరిక కవాటం / త్రిపత్ర కవాటం / అగ్రత్రయ కవాటం.1) కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో
2) ద్విపత్ర కవాటం / మిట్రల్ కవాటం / అగ్రద్వయ కవాటం.2) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్యలో
3) పుపుస కవాటం / అర్ధ చంద్రాకార కవాటం3) పుపుస ధమని బయలుదేరే వద్ద
4) దైహిక కవాటం4) బృహద్ధమని బయలుదేరే వద్ద

ప్రశ్న 5.
మీ పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయుల రక్త పీడనముల సమాచారం సేకరించారు కదా. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 3
జవాబు:

  1. శ్రీ విజయ్ రక్తపీడనం సాధారణ స్థాయిలో ఉన్నది.
  2. శ్రీమతి ఉమాదేవి అధిక రక్తపీడనం కలిగి ఉన్నది. ఈమెలో చికాకు, ఆందోళన లక్షణాలు ఉన్నాయి.
  3. శ్రీ నాగేశ్వరరావు అధిక రక్తపోటును కలిగి ఉన్నాడు. ఈయన భయం, తొందరగా కోపాన్ని ప్రదర్శించడం మొదలగు లక్షణాలతో బాధపడుచున్నారు.
  4. శ్రీమతి శాంత అల్ప రక్తపీడనం (Low B.P) తో బాధపడుచున్నది. ఈమె అలసట, కళ్ళు తిరగడం, మగతగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉన్నది.

ప్రశ్న 6.
శోషరస వ్యవస్థ విధుల గురించి తెలుసుకున్న తరువాత మీ పెద్దలకు నీవు ఎడిమా గురించి ఎటువంటి సలహాలిస్తావు?
జవాబు:

  1. వీలైనంతవరకు ఒకే చోట స్థిరముగా కూర్చోకూడదు.
  2. కాళ్ళను కదుపుతూ ఉండాలి.
  3. వీలైనంతవరకు వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
  4. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  5. నిరంతర వ్యాయామం చెయ్యాలి.
  6. ఉష్ణోగ్రతలలో సంభవించే అధిక తేడాల నుంచి తమను తాము రక్షించుకోవాలి.

ప్రశ్న 7.
సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. సిరలలో రక్తం ఒకే మార్గంలోనే ముందుకే కాకుండా, వెనుక ప్రయాణిస్తుంది.
  2. గుండెకు రక్తం చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
  3. సిరలు ఉబ్బే అవకాశం ఉంది.

ప్రశ్న 8.
పుప్పుస సిరను తాడుతో బంధిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:

  1. పుపుస సిరను తాడుతో బంధించుట వలన ఊపిరితిత్తుల నుంచి గుండెకు సరఫరా అయ్యే ఆమ్లజని సహిత రక్తం సరఫరా అవ్వదు.
  2. దీని వలన శరీరానికి ఆమ్లజని సహిత రక్తం అందక జీవి మరణించును.

ప్రశ్న 9.
హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?
జవాబు:

  1. సక్రమమైన ఆహార నియమాలు పాటించాలి.
  2. తక్కువ కొవ్వులు కల్గిన ఆహారాన్ని తీసుకోవాలి.
  3. క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి.
  4. ఆల్కహాలు, ధూమపానం చేయకూడదు.
  5. శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ప్రశ్న 10.
క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4
a) హృదయ స్పందన అనగా నేమి?
జవాబు:
హృదయ స్పందన :
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన అంటారు.
(లేదా)
ఒక సిస్టోల్ మరియు డయాస్టోలను కలిపి హృదయ స్పందన అంటారు.

b) గుండె బరువుకు, హృదయ స్పందనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
గుండె బరువు పెరిగే కొద్దీ ఒక నిమిషానికి జరిగే హృదయ స్పందనలు తగ్గుతాయి.

ప్రశ్న 11.
ప్రసరణ వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నతస్థాయి జీవులు వ్యాపనం, ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాల కొద్దీ సమయం అవసరమవుతుంది.

ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికి ప్రత్యేకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది. జీవులు ప్రత్యేకంగా ఏర్పరచుకునే ఈ వ్యవస్థనే ‘ప్రసరణ వ్యవస్థ’ (Circulatory system) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 12.
స్టెతస్కోపు ఆవిష్కరణను తెలపండి.
జవాబు:
“రెని లెన్నెక్” (Rene Laennec) అనే శాస్త్రవేత్త 1816 సం||లో స్టెతస్కోపును కనుగొన్నాడు. స్టెతస్కోపు కనుగొనక పూర్వం వైద్యులు రోగి రొమ్ముపై చెవి ఆనించి హృదయస్పందన వినేవారు. రోగి హృదయస్పందన వినటానికి వెన్నెక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. గొట్టం ఒక చివరను రోగి రొమ్ముకు ఆనించి, రెండవ చివర చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెన్నెక్ దీనికి స్టెతస్కోపు అని పేరు పెట్టాడు.

ప్రశ్న 13.
హృదయం ఎలా రక్షించబడుతుంది?
జవాబు:

  1. హృదయం చుట్టూ రెండు పొరలు గల హృదయావరణం ఉంటుంది.
  2. ఈ రెండు పొరల మధ్య వుండే కుహరాన్ని ‘హృదయావరణ కుహరం’ అంటారు.
  3. దీనిలో హృదయావరణ ద్రవం ఉంటుంది.
  4. హృదయావరణం, హృదయావరణ ద్రవం హృదయాన్ని షాకుల నుండి, దెబ్బల నుండి రక్షిస్తాయి.
  5. హృదయాన్ని కాపాడుతూ అన్నివైపుల నుండి ప్రక్కటెముకలు వెనుకవైపు నుండి వెన్నుముక రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 14.
సిరా వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:

  1. మానవ శరీరంలో మూడు మహాసిరలు ఉన్నాయి. అవి :
    1) పూర్వమహాసిర 2) పరమహాసిర 3) పుపుససిర.
  2. పూర్వమహాసిర తల, మెడవంటి శరీర పైభాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  3. అథోమహాసిర శరీర దిగువ భాగాల నుండి (ఉదరం, కాళ్ళు, చేతులు) ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  4. పుపుససిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 5

ప్రశ్న 15.
రక్తప్రసరణ వ్యవస్థ గురించిన ప్రాచీన తప్పుడు భావనలను విలియం హార్వే ఎలా ఖండించాడు?
జవాబు:
గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుందనే భావన తప్పని హార్వే నిరూపించాడు. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో అలాగే ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు చోటు చేసుకుంటాయో లెక్కించాడు.

ఒక గంటలో గుండె మనిషి బరువుకు మూడురెట్ల రక్తం పంపిణీ చేస్తుందని హార్వే కనుగొన్నాడు. అంటే అంత రక్తం, ఇంత తక్కువ సమయంలో ఉత్పత్తి కాదు. దీనిని బట్టి రక్తం గుండె నుండి శరీరానికి, శరీరం నుండి గుండెకు మరల మరలా ప్రవహిస్తుందని చెప్పవచ్చు అని గుర్తించాడు.

ప్రశ్న 16.
రక్తకేశనాళికలను ఎలా గుర్తించారు? వాటి అర్థం ఏమిటి?
జవాబు:
హార్వే మరణించిన 4 సంవత్సరాల తర్వాత 1661 సంవత్సరంలో మాల్ఫీజి గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేశాడు. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొరలోని (పెటాజియం ) రక్తనాళాలను సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు మరియు సిరల మధ్యనుండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను చూడగలిగాడు.

ఆ సన్నని రక్తనాళాలకు సూక్ష్మ కేశనాళికలు (capillaries) అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో Capillaries అంటే కేశం అని అర్థం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి.

రక్తకేశనాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గూర్చి, పూర్తిగా అర్థం అయ్యింది.

ప్రశ్న 17.
హార్దిక వలయానికి ఎంత సమయం పడుతుంది?
జవాబు:
హారిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొనే సంకోచక్రియ (systole), విశ్రాంతి తీసుకునే యథాపూర్వస్థితు (diastole) లు ఒకదానివెంట ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకన్లలో పూర్తవుతుంది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11-0. 14 సెకన్లు కాగా జఠరికల సంకోచానికి 0.27-0.35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 18.
శోషరస వ్యవస్థ అనగానేమి? దాని విధులు ఏమిటి?
జవాబు:
కణజాలంలో మిగిలిపోయిన ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్తప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దానినే శోషరస వ్యవస్థ అంటారు. లాటిన్ భాషలో లింఫ్ అంటే నీరు అని అర్థం.
రక్తాన్ని, కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వృథా పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం. శోషరసం నిర్వహించే విధులు.

సిరా వ్యవస్థకు సమాంతరమైన ఈ వ్యవస్థ కణజాలద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చటానికి తోడ్పడుతోందన్నమాట.

ప్రశ్న 19.
వివిధ జంతువుల శరీరం బరువు, గుండె బరువు, హృదయస్పందన గురించిన సమాచారం సేకరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 6

ప్రశ్న 20.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అనగానేమి?
జవాబు:
స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. కీటకములు, మొలస్కా జీవులలో రక్తనాళాలు లేవు.
  2. ఈ జంతువులలో హృదయం శరీరంలో పెద్ద కాలువల్లా వుండే ప్రదేశాల్లోకి రక్తాన్ని పంపు చేస్తుంది. వీటిని ‘కోటరాలు’ అంటారు.
  3. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థని “స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 21.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. చాలా జంతువులలో రక్తనాళాలు ఉంటాయి.
  2. హృదయం రక్తాన్ని వీటిలోకి పంపు చేస్తుంది. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థను “బంధిత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
  3. కప్పల వంటి ఉన్నతస్థాయి జీవులలో రక్తం హృదయం నుండి ధమనులలోకి, ధమనుల నుండి సిరల ద్వారా మళ్లీ గుండెకు చేరుతుంది. దీనిని ‘ద్వివలయ రక్తప్రసరణ’ అంటారు.
  4. చేపలలో రక్తం హృదయం ద్వారా ప్రసరిస్తుంది. దీనిని ‘ఏకవలయ రక్తప్రసరణ’ అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 22.
హీమోఫీలియా అనగానేమి?
జవాబు:
రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా సుమారు 3 నుండి 6 నిముషాల సమయం పడుతుంది. కాని కొందరు వ్యక్తులలో ‘K’ విటమిన్ లోపం వలన గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. జన్యులోపం వలన కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని ‘హీమోఫీలియా’ (Haemophilia) అంటారు. దగ్గరి సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం వలన కలిగే పిల్లల్లో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువ.

ప్రశ్న 23.
మైదాన ప్రాంతాలకంటే అటవీ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. ఎందుచేత?
జవాబు:
మొక్కలలో ఎల్లప్పుడు తగినంత నీరు నిరంతరంగా ప్రసరిస్తుంటుంది. ఉదాహరణకి ఒక పెద్ద వృక్షం ప్రతిరోజు 900 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో వెలుపలికి పంపుతుంది. వీటి వలననే అడవులలో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో సంతృప్తం చెందుతుంది. నీటి ఆవిరితో నిండి పవనాలు ఇటువైపుగా వీచేటప్పుడు అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో మరింతగా సంతృప్తం చెందుతాయి. కాబట్టి వర్షం కురుస్తుంది.

అందుకే మైదాన ప్రాంతాల కంటే కూడా అటవీ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది.

ప్రశ్న 24.
తయారైన ఆహారం మొక్కలలో ఎలా రవాణా చేయబడుతుంది?
జవాబు:
ఆకుపచ్చటి మొక్కలలో ఆకులలో తయారైన ఆహారం చక్కెర రూపంలో మిగిలిన ‘కణాలకు రవాణా చేయబడుతుంది. ముఖ్యంగా చురుకుగా పెరిగే భాగాలు మరియు నిల్వచేసే భాగాలకు రవాణా చేయబడుతుంది.

ఆకులలోని ఈనెలలో దారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయని మనకు తెలుసు. ఇవి కాండంలోని కణజాలంతో అనుసంధానమై ఉంటాయి.

ప్రశ్న 25.
ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండాలు జిగటగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ఎఫిడ్స్ (Aphids) పోషక కణజాలం నుండి ఎక్కువ మొత్తంలో చక్కెరను గ్రహించినప్పటికీ మొత్తాన్నీ శోషించలేవు. మిగిలిన చక్కెర చిక్కటి ద్రవరూపంలో పాయువు నుండి వెలుపలికి వస్తుంది. దీనిని తేనె (honey – dew) అంటారు. అందువల్లనే ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండం, ఆకులు చేతితో తాకితే అంటుకున్నట్లుగా ఉంటాయి.

ప్రశ్న 26.
క్షీరదాలు చెట్లకు ఎలా హాని కల్గిస్తాయి? దీని నివారణ మార్గం ఏమిటి?
జవాబు:
కొన్ని క్షీరదాలు పోషక కణజాలంలో ఉండే ఆహారం కోసం చెట్టు బెరడును తొలుస్తాయి.

సాధారణంగా పోషక కణజాలంలోని చక్కెర కొరకు శీతాకాలంలో ఆహారపు కొరత ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి. చిట్టెలుకల వంటి కొన్ని జంతువులు చిన్న చిన్న మొక్కలకు హాని చేస్తుంటే కుందేళ్ళ వంటి జంతువులు పెద్ద పెద్ద చెట్లను నాశనం చేస్తుంటాయి. కుందేళ్ళ వంటి జంతువుల వల్ల చెట్లకు హాని కలగకుండా అటవీ సంరక్షణకు ఇనుప తీగ వలను అమరుస్తారు. అయితే ఇది ఖర్చుతో కూడినది. అందుకోసం అటవీశాఖ అధికారులు అడవులలో కుందేళ్ళ బారి నుండి వృక్షాలను కాపాడడానికి మాంస భక్షకులైన నక్కలు, గుడ్లగూబలు, బాడ్జర్లను (Badger) పెంచుతుంటారు.

ప్రశ్న 27.
రీసస్ కారకం గురించి రాయండి.
జవాబు:
రీసస్ కారకం :
రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే రీసస్ కారకం. బ్రిటన్ దేశ జనాభాలో 85 శాతం మందిలో ఈ రకమైన ప్రతిదేహాలున్నట్లు గమనించారు. దీనిని మొట్టమొదటిసారిగా (మకాక్) రీసస్ అనే జాతి కోతులలో గుర్తించారు. అందువల్ల ఈ ప్రతిదేహాలకు రీసస్ కారకం అని పేరు వచ్చింది. రక్తంలో ఈ ప్రతిదేహాలు కలిగిన వారిని Rh+ గానూ, లేని వారిని Rh గానూ గుర్తిస్తారు.

సాధారణంగా Rh వ్యక్తుల ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. ఒకవేళ Rh+ వ్యక్తి రక్తాన్ని Rhకు ఎక్కించినట్లయితే అతనిలో Rh ప్రతిరక్షకాలు ఏర్పడి Rh+ రక్తకణాలను నాశనం చేస్తాయి. ఇది
శిశువులలో తీవ్రమైన ఆటంకంగా పరిణమిస్తుంది.

ప్రశ్న 28.
Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నప్పుడు పుట్టే పిల్లలలో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
ఒకవేళ Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నపుడు పుట్టే పిల్లల్లో కొందరు Rh+ గానే ఉంటారు. గర్భంలో ఉన్నపుడు తల్లి నుండి పిండానికి నిరంతరం రక్తం సరఫరా కావలసిన పరిస్థితి ఉంటుంది. బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసిపోతుంది. అప్పుడు ఆమెలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. తరువాత పుట్టే పిల్లలు కూడా Rh+ అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం పెరుగుతూపోతుంది. ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా బిడ్డకు చేరినట్లయితే వారు తీవ్రమైన రక్తహీనతకు గురవుతారు. కొన్నిసార్లు గర్భస్రావం, ప్రాణాపాయం కూడా జరగవచ్చు.

ఇలాంటి సందర్భాలలో ప్రతిరక్షకాలు లేకుండా శిశువులో మొత్తం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. Rh+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూదిమందు ఇవ్వడం ద్వారా తరువాత పుట్టే పిల్లలకు హాని జరగకుండా వైద్యసదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రశ్న 29.
మీ దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరకు వెళ్ళి శోషరస వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇందుకు నీవు ఏ ప్రశ్నలు వేస్తావు?
జవాబు:

  1. శోషరసము అనగానేమి?
  2. శోషరస వ్యవస్థనందలి భాగములు ఏవి?
  3. శోషరస వ్యవస్థ నిర్వహించు విధులేవి?
  4. శోషరస వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మధ్యగల భేదములు ఏవి?
  5. శోషరస వ్యవస్థకు, సిరల వ్యవస్థకు మధ్యగల పోలికలు ఏవి?
  6. కణజాల ద్రవం అనగానేమి?
  7. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని ఏమంటారు?
  8. కణజాలాలలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని తిరిగి ప్రధాన రక్త వ్యవస్థలోనికి చేర్చే ప్రసరణ వ్యవస్థ ఏది?

ప్రశ్న 30.
రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం పంపుచేసే విధానం గురించి తెలుసుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా గుర్తుంచుకున్న అంశాలు ఏమిటి? అందుకు కారణం ఏమిటి?
జవాబు:
శారీరక కసరత్తులు చేసిన తరువాత హృదయం వేగంగా కొట్టుకోవడంను నేను’ ప్రత్యేకంగా గుర్తించాను. కసరత్తులు చేసినప్పుడు కణజాలాలలో ఉన్న శక్తి నిల్వలు ఖర్చు అయిపోతాయి. అందువలన గుండె వేగంగా కొట్టుకొని ఎక్కువ మొత్తంలో ఆమ్లజనిని కణాలకు సరఫరా చేస్తుంది. ఆమ్లజని ఆహార పదార్థాలపై చర్య జరిపి శక్తిని ఎక్కువగా విడుదల చేస్తుంది. కొంత సేపటి తరువాత గుండె సాధారణ వేగంతో పనిచేస్తుంది.

గుండె కొట్టుకోవడంలో లయబద్దంగా లబ్ డబ్, లబ్ డబ్ శబ్దం రావడం కూడా నేను ప్రత్యేకంగా గుర్తించుకున్నాను. చిన్నదైన పిడికెడు పరిమాణంలో ఉండే గుండె పంపు చేసే విధానాన్ని అర్థం చేసుకున్నాక దానిని అభినందించకుండా ఉండలేకపోతాము.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తస్కందనం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
(లేదా)
కబాడీ ఆడుతూ గాయపడ్డ రాముకు 6 నిమిషాలలోనే రక్తస్రావం ఆగిపోయింది. ఈ ప్రక్రియ జరిగే విధానంను వివరించండి.
జవాబు:
శరీరానికి గాయం తగిలినపుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గడ్డకట్టి తెగినచోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే ‘స్కందనం’ అంటారు. రక్తం గడ్డకట్టకపోతే శరీరంపై చిన్న గాయం తగిలినా విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 7

  1. గాయం నుండి రక్తం స్రవించినపుడు రక్తఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను స్రవిస్తాయి.
  2. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్ గా మారుస్తుంది.
  3. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
  4. ఈ తంతువులలో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
  5. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి.
  6. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ‘సీరం’ (Serum) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 8

ప్రశ్న 2.
పంపింగ్ పరికరము అని మానవ శరీరములో దేనిని అంటారు? దాని నిర్మాణాన్ని పటం ద్వారా వివరించండి.
జవాబు:
మానవ శరీరంలోని హృదయము లేదా గుండెను పంపింగ్ పరికరము అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 9

హృదయము – బాహ్య నిర్మాణము :

  1. హృదయం, ఉరః పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. మీ గుండె పరిమాణం సుమారుగా మీ పిడికిలి అంత ఉంటుంది.
  2. ఇది కార్డియాక్ కండరంతో. చేయబడి ఉంది.
  3. గుండె బేరీ పండు ఆకారంలో ఉండి, త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను, కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది.
  4. గుండెను ఆవరించి రెండు పొరలుంటాయి. వీనిని “హృదయావరణ త్వచాలు” అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది.

అంతర్నిర్మాణం :

  1. గుండె లోపల ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు గుండెను నాలుగు గదులుగా విభజిస్తాయి.
  2. పై రెండు గదులను ‘కర్ణికలు’ అని, క్రింద రెండు గదులను ‘జఠరికలు’ అని అంటారు.
  3. గుండె గోడలకు అంటిపెట్టుకొన్న రక్తనాళాలను ‘కరోనరీ’ రక్తనాళాలంటారు.
  4. ఇవి గుండె కండరాలకు రకాన్ని సరఫరా చేస్తాయి.
  5. పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలుచగాను, కిందివైపు ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి.
  6. దృఢంగా ఉన్న రక్తనాళాలను ‘ధమనులు’ అంటారు. ‘బృహద్ధమని’ హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది అతి పెద్ద ధమని.
  7. చిన్న ధమని, “పుపుస ధమని”. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసికుపోతుంది.
  8. గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను “ఊర్ధ్వ బృహత్సిర” అంటారు.
  9. ఇది శరీరం పై భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  10. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను “అధోబృహత్సర” అంటారు.
  11. ఇది శరీరం దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  12. ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే ‘పుపుస సిరలు’ తెరుచుకొనే రంధ్రాలుంటాయి.
  13. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  14. ఎడమ జఠరిక నుండి “బృహద్ధమని” శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  15. కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్యగల కుడికర్ణిక జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని “అగ్రత్రయ కవాటం” అని అంటారు.
  16. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్యగల ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకము పైగల కవాటాన్ని “అగ్రద్వయ కవాటం” అని అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 3.
క్షీరదాల గుండె అంతర నిర్మాణం పరిశీలించడానికి నీవు గొర్రె గుండె నిలువుకోతను ప్రయోగశాలలో పరిశీలించావు కదా ! దాని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబు ఇమ్ము.
a) గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉండవు. జఠరికలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంపుచేయాలి. కనుక జఠరికల గోడలు కర్ణికల గోడల కంటే మందంగా ఉంటాయి.

b) గుండెలోని గదులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు కలవు. అవి రెండు కర్ణికలు మరియు రెండు జఠరికలు.

c) గుండెలోని గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరు చేయబడ్డాయి? ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
గుండెలోని గదులు ఒకదానితో ఒకటి విభాజకాల చేత వేరుచేయబడ్డాయి. కవాటాల ద్వారా కలపబడ్డాయి.

d) హృదయం అఘాతాల నుండి ఎలా రక్షింపబడుతుంది?
జవాబు:
హృదయం, హృదయావరణ త్వచం, హృదయావరణ ద్రవంచే అఘాతాల నుండి రక్షించబడుతుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

వర్గం పేరుప్రసరణ వ్యవస్థ రకం
1. నిడేరియాజఠర ప్రసరణ కుహరం
2. ప్లాటీ హెల్మింథస్జీర్ణవ్యవస్థ
3. నిమాటీహెల్మింథస్మిథ్యాశరీర కుహరం
4. అనెలిడారక్త నాళాలు
5. ఆర్రోపోడావివృత రక్తప్రసరణ వ్యవస్థ

i) రక్తనాళాలు మొట్టమొదటగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి?
ii) రక్తంలో హీమోగ్లోబిన్ కల జీవులేవి?
iii) ఏ జీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడుతుంది?
iv) ఆర్రోపోడా జీవులు వివృత రక్తప్రసరణ వ్యవస్థను కలిగి ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
i) రక్తనాళాలు మొట్టమొదటగా అనెలిడా వర్గజీవులలో ఏర్పడ్డాయి.
ii) అనెలిడా వర్గ జీవులలో రక్తం యందలి ప్లాస్మాలో హి మోగ్లోబిన్ ఉండును.
iii)నిడేరియా వర్గజీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడును.
iv) ఆర్రోపోడా వర్గ జీవులలో రక్తనాళాలు లేకపోవడం చేత, కోటరాలు ఏర్పడి వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది.

ప్రశ్న 5.
మానవ హృదయంలోని కవాటాలు, అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులను గురించి వివరించండి.
జవాబు:
మానవ హృదయంలోని కవాటాలు :

  1. కుడికర్ణిక, కుడి జఠరికకు మధ్య గల కవాటం – అగ్రత్రయ కవాటం
  2. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్య గల కవాటం – అగ్రద్వయ కవాటం
  3. పుపుస ధమని పూర్వభాగంలో గల కవాటం – పుపుస ధమని కవాటం
  4. బృహద్ధమని పూర్వభాగంలో గల కవాటం – మహాధమని కవాటం

గుండెకు అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులు :

  1. గుండే గోడలకు అంటి పెట్టుకుని కరోనరె రక్తనాళాలు ఉంటాయి. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
  2. ఎడమ జఠరిక పై భాగం నుండి బృహద్ధమని బయలుదేరుతుంది. ఇది శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  3. కుడి జఠరిక పై భాగం నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. ఇది ఆమ్లజనిరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  4. గుండె పై భాగంలో కుడివైపున ఊర్ధ్వ బృహత్సిర ఉంటుంది. శరీరంపై భాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది.
  5. గుండె కుడివైపు దిగువ భాగంలో అధోబృహత్సిర ఉంటుంది. ఇది శరీర దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి చేరవేస్తుంది.

ప్రశ్న 6.
మానవుని శోషరస వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరిస్తూ, విధులను తెలియచేయండి.
జవాబు:

  1. కణజాలంలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దీనినే శోషరస వ్యవస్థ అంటారు.
  2. కణజాలాలలో ఉన్న శోషరసమే కణజాల ద్రవం.
  3. రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, . కణాల నుండి వృధా పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం.
  4. రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం.
  5. సిరావ్యవస్థకు సమాంతరమైన వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరావ్యవస్థలోకి చేర్చుటకు తోడ్పడును.
  6. అస్తికండరాల సంకోచము వలన సిరలపైన, శోషరసనాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తము, శోషరసం గుండెవైపు నెట్టబడును.

ప్రశ్న 7.
రక్తస్కందన ప్రక్రియలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:

  1. రక్తంలో ఉండే రక్త ఫలకికలు రక్తస్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి.
  2. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది.
  3. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్‌గా మారుస్తుంది.
  4. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ పోగులలో రక్త కణాలు చిక్కుకుని స్కందనము ఏర్పడుతుంది. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కుని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని ‘సీరం’ అంటారు.
    AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 10

ప్రశ్న 8.
లలిత తన తాతగారిని డాక్టరుగారి దగ్గరకు తీసుకొని వెళ్లినపుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టరు చెప్పారు.
i) అధిక రక్తపోటు అనగా నేమి?
జవాబు:
అధిక రక్తపోటు :
విశ్రాంతి సమయంలో ఒక వ్యక్తికి రక్తపీడనం 120/80 mmHg కంటే ఎక్కువ వుంటే దానిని అధిక రక్తపోటు అంటారు.

ii) అధిక రక్తపోటుకు కారణాలు ఏవి?
జవాబు:
అధిక రక్తపోటుకు కారణాలు :
అధిక బరువు, ఒత్తిడితో కూడిన జీవనం మరియు జన్యుసంబంధ కారణాలు.

iii) అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు తెల్పండి.
జవాబు:
అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు :

  1. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  2. కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి.
  3. ఒత్తిడి తగ్గించుకోవడము అవసరము.
  4. ధూమపానం, మద్యపానం చేయకుండా వుండాలి.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 9.
కర్ణికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి కర్ణికఎడమ కర్ణిక
1. పెద్దదిగా ఉంటుంది.1. చిన్నదిగా ఉంటుంది.
2. పూర్వ, పర మహాసిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది.2. పుపుస సిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది.
3. ఊపిరితిత్తుల నుండి తప్ప, మిగిలిన అన్ని శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది.3. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. ఇందులో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.4. ఇందులో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. రక్తాన్ని కుడి జఠరికలోనికి పంపుతుంది.5. రకాన్ని ఎడమ జఠరికలోనికి పంపుతుంది.

ప్రశ్న 10.
జఠరికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి జఠరికఎడమ జఠరిక
1. చిన్నదిగా ఉంటుంది.1. పెద్దదిగా ఉంటుంది.
2. దీని నుండి పుపుస మహాధమని బయలుదేరుతుంది.2. దీని నుండి దైహిక మహాధమని బయలుదేరుతుంది.
3. కుడికర్ణిక నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది.3. ఎడమ కర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. దీనిలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.4. దీనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది.5. ఊపిరితిత్తులకు తప్ప మిగతా శరీర భాగాలన్నింటికి ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది.
6. కుడి కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రత్రయ కవాటం రక్షిస్తుంది.6. ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రద్వయ కవాటం రక్షిస్తుంది.

ప్రశ్న 11.
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోయే రక్తనాళాలను వర్ణించండి.
జవాబు:
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళాలను మహా ధమనులు అంటారు.
అవి (1) పుపుస మహాధమని (2) దైహిక మహాధమని (3) హృదయ ధమనులు

1) పుపుస మహాధమని :
ఇది హృదయంలోని కుడి జఠరికలో ఉన్న ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి, ఎడమ పుపుస ధమనులుగా చీలిపోయి కుడి, ఎడమ ఊపిరితిత్తులకు అందజేస్తాయి.

2) దైహిక మహాధమని :
ఇది శాఖోపశాఖలుగా చీలి హృదయంలోని ఎడమ జఠరిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.

3) హృదయ ధమనులు :
ఇవి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరాలకి తీసుకుపోతాయి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 11

ప్రశ్న 12.
ఏకవలయ, ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :

  1. చేపలలో గుండె ద్వారా రక్తం ఒకసారే ప్రవహిస్తుంది.
  2. ఈ విధమైన రక్తప్రసరణని ఏకవలయ ప్రసరణము అంటారు.
  3. ఈ వ్యవస్థను ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఇందు మొప్పలకు రక్తాన్ని పంపే హృదయాన్ని జలశ్వాస హృదయం అంటారు.

ద్వివలయ ప్రసరణ :

  1. కప్ప, ఇతర ఉన్నత జంతువులలో రక్తం ‘హృదయం ద్వారా రెండు సార్లు ప్రయాణిస్తుంది.
  2. ఒకసారి హృదయం ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం శరీర భాగాల మధ్య ప్రయాణిస్తుంది.
  3. ఇటువంటి ప్రసరణని ద్వివలయ ప్రసరణము అంటారు.
  4. ఇట్టి హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 12

ప్రశ్న 13.
సిరలలో రక్తకదలికలను నిరూపించటానికి హార్వే నిర్వహించిన ప్రయోగం ఏమిటి?
జవాబు:
ఆ రోజుల్లో సంయుక్త సూక్ష్మదర్శిని కాని, ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కాని లేవు. 17 వ శతాబ్దంలో సిరలలో రక్తం యొక్క కదలికలను నిరూపించడానికి విలియం హార్వే చేసిన ప్రయోగాన్ని పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13

  1. రక్తనాళాలు బాగా కనిపించే వ్యక్తి యొక్క దండ చేయి (మోచేతి పై భాగంలో పటంలో చూపిన విధంగా) గుడ్డతో గట్టిగా కట్టాలి. (ఒక వేలుదూరేంత స్థలం ఉండాలి.)
  2. మరొక గుడ్డను చాపచుట్టలా మడిచి దానిని పిడికిలితో గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చర్మం కింది రక్తనాళాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి.
  3. బాగా లావుగా ఉబ్బినట్లున్న, శాఖలుగా విడిపోని రక్తనాళాన్ని గుర్తించండి.
  4. ఆ రక్తనాళంపై దండచేయి వైపు వేలు ఉంచి, మెల్లిగా, రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోయేవరకు ఒత్తిడి కలుగచేయండి. (బొమ్మ సహాయం తీసుకోండి)
  5. ఇప్పుడు వేలిని ఒత్తుతూ మోచేతి నుండి అరచేతి వరకు కదిలించండి. ఈ రక్త నాళంలో రక్తం నిలువ ఉండి ఉబ్బి స్పష్టంగా బయటకు కనిపిస్తాయి. వీటినే సిరలు అంటారు.
  6. సిరలలో రక్త ప్రసరణ గుండె వైపుకు ఉంటుంది. ఈ ప్రసరణను నిరోధించుట వలన రక్తం పోగై స్పష్టంగా బయటకు కనిపించాయి.

ప్రశ్న 14.
హృదయం పనిచేయు విధానంలోని దశలను తెలపండి. లేదా హార్దిక వలయాన్ని వివరించండి.
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయస్పందన వలయం లేదా హార్దిక వలయం (Cardiac cycle) అంటారు. దీనిలోని దశలను పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 14
1) గుండెలోని నాలుగు గదులు ఖాళీగా విశ్రాంతి (సడలింపు) స్థితిలో ఉన్నాయనుకొనే ఊహతో హార్దిక వలయం జరిగే విధానాన్ని పరిశీలిద్దాం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 15
2) పూర్వపర మహాసిరల నుండి రక్తం కుడికర్ణికలోనికి, పుపుస గల నుండి ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది.
3) ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి. కర్ణికల సంకోచం వలన రక్తం కర్ణిక, జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుని జఠరికలోనికి ప్రవేశిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 16
4) జఠరికలు రక్తంతో నిండగానే సంకోచిస్తాయి. అదే సమయంలో (సడలింపు), కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి.
5) జఠరికల సంకోచం వలన రక్తం దైహిక చాపంలోనికి, పుపుస ధమనిలోనికి, వానిలో ఉన్న కవాటాలు తెరచుకుని ప్రవహిస్తుంది. అదే సమయంలో కర్ణికలు, జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి. కవాటాలు మూసుకోవటం వలన మొదటి ‘లబ్’ అనే శబ్దం పెద్దగా మనకు వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 17
6) జఠరికలు యథాస్థితికి చేరుకునే సమయంలో, జఠరికలలోని పీడనం తగ్గిపోతుంది. దీనివలన రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం వెనుకకు రావటానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాలలోని కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు జఠరికలలోనికి రావటాన్ని నిరోధిస్తాయి. ఈ కవాటాలు మూసుకొన్నప్పుడు రెండవ ‘డబ్’ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 18
7) ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధ పడతాయి.

హృదయస్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి ‘హార్దిక వలయం ‘ (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 15.
ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తెలపండి.
జవాబు:
ప్రొటోజోవన్స్ :
అమీబా వంటి ఏకకణజీవుల పదార్థంలో సహజసిద్ధమైన కదలికలుంటాయి. ఈ కదలికలను ‘బ్రేనియన్ చలనం’ అంటారు. ఈ చలనం వలన కణంలోని అన్ని భాగాలకు పోషకపదార్థాలు ఆమ్లజని సమానంగా సరఫరా అవుతాయి.

ఏకకణజీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకణ జీవులూ తమ కణాలలో కణాంతర ప్రసరణ వ్యవస్థ (intercellular transport system) ను కలిగి ఉంటాయి. నాడీ కణాలతో సహా మన శరీరంలోని అన్ని కణాలలోని జీవదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది.

పారాజోవన్స్ :
స్పంజికల వంటి పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి. సహజసిద్ధమైన నీటి ప్రవాహాలు నియమబద్దంగా ఉండవు. కాబట్టి, స్పంజికలు శరీరం లోపల ఉండే కశాభాల కదలికల (fiagella) వలన తమ ప్రవాహలను తామే సృష్టించుకుంటాయి.

స్పంజికలకంటే అభివృద్ధి చెందిన హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులు తమ శరీరంలో జఠరప్రసరణ కుహరమనే (gretro vascular cavity) ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జఠర ప్రసరణకుహరం ఆహారాన్ని ఓం యులంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది.

ప్లాటి హెల్మెంథిస్ :
ఫాసియోలా హెపాటికా వంటి ప్లాటి హెల్మెంథిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణవ్యవస్థ శాఖోపశాఖలుగా , విస్తరించి ఉంటుంది. వీనిలో కూడా జీర్ణక్రియ, ప్రసరణలు రెండింటినీ ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ జీవులలో ప్రతి కణం నుండి వ్యర్థ పదార్థాలను ప్రత్యేక విసర్జక వ్యవస్థ గ్రహిస్తుంది. ఈ జీవుల శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ, విసర్జక వ్యవస్థలే ఆక్రమించాయి.

నిమాటిహెల్మెంథిస్ :
ఏలికపాముల (నట్టలు) వంటి నిమాటి హెల్మెంథిన్ల శరీరంలో ఉండే విధ్యాశరీర కుహరం , పదార్థాల (Pseudocoeloem) సేకరణ, వితరణను నిర్వహిస్తుంది.

అనిలెడ్లు :
నిజశరీరకుహర జీవులైన వానపాముల వంటి అనిలెడ్లు ద్రవాల కదలిక కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీనిలో మొట్ట మొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు.

ఆరోపొడ :
బొద్దింక వంటి ఆరోపొడ వర్గపు జీవులలో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ, రక్తనాళాలు లేకపోవటం వలన, రక్తం పెద్ద పెద్ద కోటరాల (ఖాళీ ప్రదేశాలు)లోనికి ప్రవహిస్తుంది. కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. అలాగే శ్వాసవ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అంటారు.

ఆరోపొడతో పాటుగా, చాలా మొలస్కా :
జీవులు, కింది స్థాయి కార్డేటాజీవులలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

మొలస్కాన్స్, కార్డేట్స్ :
పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ, రక్తం రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అంటారు. అనిలెడా, ఇఖైనోడెర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోపొడ మొలస్కా జీవులలోను, అన్ని పై స్థాయి కార్డేటా జీవులలోను ఈ రకమైన రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 16.
వేరు పీడనం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
వేరు పీడనం :
వేరు నీటిని పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు. దీనివలన నీరు వేరు నుండి కాండములోనికి చేరుతుంది. వేరు పీడనాన్ని మానోమీటరు సహాయంతో కొలుస్తారు.

ప్రయోగం :
ఉద్దేశం : వేరు పీడనం నిరూపించుట.

పరికరాలు :
కుండీలో పెరుగుతున్న మొక్క, గాజు గొట్టం, రబ్బరు గొట్టం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19

విధానం :

  1. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని, భూమి ఉపరితలం కంటే 1 సెం.మీ పైన ఉండే విధంగా కాండం భాగాన్ని కోయాలి.
  2. గాజు గొట్టాన్ని కోసిన కాండ భాగానికి, రబ్బరుగొట్టం రబ్బరు గొట్టంతో కట్టాలి.
  3. గాజు గొట్టంలో నీరు పోసి నీటి మట్టాన్ని (M1) కొలిచి నమోదు చేయాలి.
  4. 2-3 గంటల పాటు, ప్రయోగ అమరికను కదపకుండా ఒకచోట ఉంచాలి.

పరిశీలన : రెండు గంటల తరువాత గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల (M2) ను గుర్తించాను.

వివరణ :
గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల, వేరు నీరు పీల్చడం వలన జరిగింది. వేరు నీటిని పీల్చి గాజు గొట్టంలోని నీటిని పైకి నెట్టింది. నీటిని పైకి నెట్టిన ఈ బలాన్ని వేరు పీడనం అంటారు.

నిరూపణ :
మొక్కలలో వేరు పీడనం ఉంటుందని నిరూపించటమైనది.

ప్రశ్న 17.
బాష్పోత్సేకం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరైపోవడాన్ని బాష్పోత్సేకం అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 20

నిరూపణ :

  1. కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కను ఎన్నుకొని దానికి నీరు పోశాను.
  2. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మొక్క కొమ్మకు కట్టి సూర్యరశ్మిలో ఉంచాను.
  3. కొంత సేపటి తరువాత పాలిథిన్ కవర్‌లో నీటి తుంపరలు గమనించాను.
  4. ఇది మొక్క పత్రాల నుండి వెలువడి పాలిథిన్ కవర్‌లో చేరింది.
  5. ఇలా మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని ‘బాష్పోత్సేకం’

ప్రశ్న 18.
మొక్కలలో ఖనిజ లవణాల రవాణాను వివరించండి.
జవాబు:
ఖనిజ లవణాల రవాణా :

  1. మొక్కల పోషణకు ఖనిజ లవణాలు (స్థూల, సూక్ష్మపోషకాలు) అవసరం.
  2. మృత్తిక ద్రావణం నుండి మూలకేశాల ద్వారా ఖనిజ లవణాలు గ్రహించబడతాయి.
  3. ఈ లవణాలన్నీ విద్యుదావేశ అయాన్ల రూపంలో ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ Na+, Cl అయాన్లు రూపంలోనూ, మెగ్నీషియం సల్ఫేట్ Mg2+, So42- అయాన్ల రూపంలో ఉంటాయి.
  4. ఇవి మూలకేశాల ద్వారా వ్యాపనం పద్దతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించి శోషించబడతాయి.
  5. ఆయాన్లు శోషించబడిన తరువాత నీటి ద్వారా దారునాళాలలోకి చేరుకుని అక్కడ నుండి పెరుగుదల స్థానాలకు వెళ్ళి పెరుగుదలకు వినియోగించబడతాయి.
  6. కొన్ని సందర్భాలలో దారువు నుండి పోషక కణజాలానికి పార్శ్వంగా కూడా ప్రసరిస్తాయి. మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 19.
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపడానికి నీవు ఏ ప్రయోగాన్ని చేస్తావు? ఎలా చేస్తావో వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపుట.

కావలసిన పరికరాలు :
రెండు గాజు సీసాలు, ఎరుపు రంగు ద్రవం, నీలి రంగు ద్రవం, తెల్ల పుష్పం కలిగిన కాండం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 21

విధానం :

  1. రెండు గాజు గ్లాసులు తీసుకొని ఒక దానిలో ఎరుపు రంగు నీరు మరొక దానిలో నీలిరంగు నీరు పోసాను.
  2. తెల్లపుష్పం కలిగిన కాండం తీసుకొని దానిని సగం వరకు రెండుగా చీల్చాను.
  3. చీల్చిన రెండు భాగాలను రెండు గ్లాసులలో ఉంచి, రెండు గంటల తరువాత పరిశీలించాను.

పరిశీలన :
రెండు గంటల తరువాత తెలుపురంగు పుష్పంలో కొంతభాగం ఎరుపు చారలను, మరికొంత నీలి చారలను కలిగి ఉంది.

వివరణ :
పువ్వులలోని ఈ రంగు చారలు గ్లాసులోని నీటివలన ఏర్పడింది. గ్లాసులలోని నీరు కాండం ద్వారా పుష్పంలోనికి ప్రయాణించుట వలన రంగు చారలు ఏర్పడ్డాయి. కాండంలో నీరు ప్రయాణించిన ఈ నాళాలను అడ్డుకోతలో పరిశీలించవచ్చు. ఈ నాళాలనే దారువు అంటారు.

నిరూపణ :
మొక్కలలో నీరు దారువు ద్వారా రవాణా అవుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 20.
పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా అవుతాయని నీవు ఎలా నిరూపిస్తావు?
జవాబు:

  1. పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయిని తెలుసుకోవడానికి మరొక ప్రయోగం ద్వారా కూడా నిరూపించవచ్చు.
  2. దారువు కనబడే విధంగా దాని చుట్టూ ఉన్న బెరడును తొలగించాలి. మధ్యభాగం మాత్రం ఉంచి మిగిలిన మొత్తం కణజాలాన్ని పోషక కణజాలంతో సహా తొలగించాలి.
  3. కొన్ని రోజుల తరువాత తొలగించిన బెరడు పై భాగాన్ని, కింది భాగాన్ని కణజాలాన్ని విశ్లేషించినప్పుడు మనకు ఆహార పదార్థ నిలువలు వలయంగా ఏర్పడిన పై భాగంలో మాత్రమే కనబడుతుంది. కింది భాగంలో కనబడదు.
  4. కొన్ని రోజుల తరువాత మనం అలాగే వదిలి పెడితే రింగుపై భాగంలో కాండ మందం పెరుగుతుంది. కాని కింది భాగంలో పెరుగుదల జరగదు.
  5. అందువలన కాండం చుట్టూ ఉన్న కణజాలానికి ఎటువంటి నష్టం కలిగించినా వేరుకు ఆహార సరఫరా ఆగిపోతుంది. తద్వారా చెట్టు మరణిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 21.
అధిక రక్తపీడనం అనగానేమి? దాని లక్షణాల నివారణ ఏమిటి?
జవాబు:
1) సామాన్యంగా మానవునిలో రక్తపీడనం 120/80 ఉంటుంది.
2) కొంతమందిలో సామాన్యంగా ఉండే రక్తపీడనం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. దీనినే హైపర్ టెన్షన్ లేక హై బి.పి. అని అంటారు.

కారణాలు:
3) రక్తంలో కొలెస్టరాల్ (కొవ్వు) శాతము ఎక్కువైనచో, అది ధమనుల గోడలలో చేరుతుంది. అప్పుడు ధమనుల గోడలు దళసరిగా తయారవుతాయి. అప్పుడు ధమనుల లోపలి కుహరం చిన్నదవుతుంది. తర్వాత రక్తం అధిక పీడనంతో ప్రవహించును.
4) దీర్ఘకాలపు ఒత్తిడి, శ్రమ, ధూమపానము, మద్యపానము వల్ల కూడా అధిక పీడనం కలుగును.
5) మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా అధిక రక్తపీడనానికి కారణం కావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
6) ఆహార నియమాలు పాటించాలి.
7) తగుమాత్రం వ్యాయామం చేయాలి.
8) అదనపు ఒత్తిడి, శ్రమకు లోనుగాకుండా చూసుకోవాలి.
9) ధూమపానం, మద్యపానం సేవించకుండా ఉండాలి.
10) 45 సం||లు పైబడిన వారు కనీసం ఏడాదికి రెండుసార్లైనా రక్తపీడనం పరీక్షని చేయించుకోవాలి.

ప్రశ్న 22.
తలసేమియా వ్యాధిని గూర్చి రాయండి.
జవాబు:

  1. తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్తసంబంధ వ్యాధి.
  2. ఎర్రరక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది.
  3. తలసేమియాతో బాధపడేవారిలో ఆక్సిజనను రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
  4. ఈ వ్యాధి ఆల్ఫా మరియు బీటా అనే రెండు రకాలు.
  5. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వివిధ భాగాలలో వచ్చే లోపాలవల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు వస్తాయి.
  6. తక్కువస్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం, ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం, గుండెపోటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

ప్రశ్న 23.
తలసేమియా చికిత్స విధానం తెలపండి.
జవాబు:
తలసేమియా మేజర్ :
పెరుగుదల తక్కువగా ఉండడం, పెళుసు బారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలను మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులలో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70% కన్నా తగ్గినపుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హి మోగ్లోబిన్ స్థాయి 115-120 గ్రా./లీ. గా ఉండేలా చూడడం. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతిమూడు నాలుగు వారాలకొకసారి గాఢత కలిగిన ఎర్రరక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూలకణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదర/సోదరిల నుండి సేకరించిన ఎముక మజ్జలో ఉండే ఎర్రరక్త కణాల మూలకణాల (ఎముక మజ్జ) మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు.

ప్రశ్న 24.
ఈ క్రింది పట్టికను పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 22
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 23

ప్రశ్న 25.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
a) ఈ ప్రయోగ ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరం పేరు ఏమిటి?
c) కుండీలో నీరు పొయ్యకుండా ప్రయోగం నిర్వహిస్తే ఏం జరుగుతుంది?
d) ఈ ప్రయోగానికి నీవు ఉపయోగించే ప్రత్యామ్నాయ పరికరాలు ఏమిటి?
జవాబు:
a) వేరు పీడనం నిరూపించటం ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం.
b) వేరు పీడనం కొలవటానికి ఉపయోగించే పరికరం పేరు మానోమీటరు.
c) కుండీలో నీరు పోయకపోతే, వేరుపీడనం ఏర్పడదు. కావున నీటిమట్టంలో మార్పు రాదు.
d) గాజునాళం బదులు లెవల్ పైపు వాడి ప్రయోగం నిర్వహించవచ్చు.

ప్రశ్న 26.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) గుండెలో ఏ వైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది?
b) ఆమ్లజని రహిత రక్తం ఏ ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును?
c) మహాధమని గుండె ఏ గది నుండి బయలుదేరును?
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
a) గుండెలో కుడివైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.
b) ఆమ్లజని రహిత రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును.
c) మహాధమని ఎడమ జఠరిక నుండి బయలుదేరును.
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తూ కవాటాలు ఉంటాయి.

ప్రశ్న 27.
ప్రక్క పటం గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు?
b) ఈ ప్రయోగంలో పరిశీలించిన రక్తనాళాలు ఏమిటి?
c) ప్రయోగంలో మోచేతికి పైగా కట్టు ఎందుకు కట్టారు?
d) సిరలలో రక్తం వెనుకకు ఎందుకు రాదు?
జవాబు:
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త విలియం హార్వే.
b) ఈ ప్రయోగం ద్వారా సిరలను పరిశీలించవచ్చును.
c) మోచేతికి పైన కట్టు కట్టటం వలన రక్తం ప్రవాహం ఆగి సిరలు ఉబ్బి కనిపిస్తాయి.
d) సిరలలో రక్తం వెనుకకు రాకుండా కవాటాలు నిరోధిస్తాయి.

ప్రశ్న 28.
ప్రక్క పటాన్ని పరిశీలించండి. ఇది ఏ రకమైన హార్దిక వలయాన్ని సూచిస్తుంది? ఇక్కడ జరిగే విధానాన్ని వివరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 24
జవాబు:

  1. ఇవ్వబడిన పటం ద్వివలయ ప్రసరణ వ్యవస్థను సూచిస్తుంది.
  2. ఉన్నత జంతువుల్లో రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రయాణం చేస్తుంది. ఒకసారి హృదయం, ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం, శరీర భాగాల మధ్య.
  3. ఇటువంటి ప్రసరణను ద్వివలయ ప్రసరణమని, హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అని అంటారు. ఈ వ్యవస్థని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఊపిరితిత్తులకు, గుండెకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని పుపుస వలయం అని, హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని దైహిక వలయం అని అంటారు.
  5. పుపుస వలయం లేదా ప్రసరణ నందు శరీర అవయవాల నుండి సేకరించబడిన రక్తం హృదయం కుడి కర్ణికకు చేరి అక్కడ నుండి కుడి జఠరికకు పోతుంది. కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు చేరి ఆమ్లజనీకరణం అవుతుంది. ఆమ్లజని సహితరక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికకు, ఇక్కడ నుండి ఎడమ జఠరికకు చేరుతుంది.
  6. దైహిక వలయం నందు ఎడమ కర్ణిక నుండి, రక్తం ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఇక్కడ నుండి దైహిక మహాధమని ద్వారా శరీర వివిధ భాగాలకు చేరుతుంది. శరీర భాగాల నుండి పూర్వపరమహాసిరల ద్వారా కుడి కర్ణికను చేరుతుంది.

ప్రశ్న 29.
ఈ క్రింది పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25
ఎ) ఏ వయస్సు వారిలో హృదయస్పందన ఎక్కువగా ఉంది?
జవాబు:
నవజాత శిశువు

బి) ఏ వయస్సు వారిలో హృదయస్పందన తక్కువగా ఉంది?
జవాబు:
సుశిక్షితులైన క్రీడాకారులు

సి) క్రీడాకారులలో హృదయస్పందన తక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
క్రీడాకారుల హృదయం ఒక హృదయస్పందన ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తమును శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. హృదయము నందలి గోడలు మందముగా ఉండుట వలన హృదయం ఎక్కువ మొత్తంలో రక్తమును పంపు చేస్తుంది.

డి) నవజాత శిశువుకి, పిల్లల మధ్య హృదయస్పందనలో ఎక్కువగా తేడాలు ఉండటానికి కారణమేమిటి?
జవాబు:

  1. థైరాయిడ్ మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులైన తల్లులు జన్మనిచ్చిన పిల్లలలో హార్మోన్ ,మార్పుల వలన మరియు గ్లూకోజు స్థాయిలను అనుసరించి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  2. కొంతమంది నవజాత శిశువుల్లో గుండెనందు ప్రత్యేక కణజాలమైన అనుబంధ విద్యుత్ కణజాలంతో పుడతారు. ఈ కణజాలం ఎక్కువ హృదయస్పందనకు కారణమవుతుంది.
  3. ఉల్ఫ్ పార్కిన్సన్ సిండ్రోమ్ మరియు వైట్ సిండ్రోమ్ నందు అదనపు కణములు ఉండుట వలన మరియు అనుబంధ మార్గము వలన అదనముగా గుండె కొట్టుకోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 30.
మానవులలో గల రక్తనాళాలను దేని ఆధారంగా వర్గీకరిస్తావు? వాటి మధ్య గల తేడాలను పట్టికలో వ్రాయండి.
జవాబు:
మానవులలో గల రక్తనాళాలను అవి తీసుకుని పోయే రక్తం ఆధారంగా ప్రధానంగా మూడు రకాలు. అవి :
ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. ధమనులు గుండె నుండి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తాయి. సిరలు శరీర భాగాల నుండి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకొని వస్తాయి. ధమనులు మరియు సిరల మధ్యన ఉండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను సూక్ష్మకేశ నాళికలు అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 26

ప్రశ్న 31.
ధమనులు సిరలలో జరిగే రక్త ప్రవాహాన్ని, వాటి అడ్డుకోత బొమ్మను గీయండి. వాటి ద్వారా రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 27

  1. ధమనులందు ఆమ్లజనిసహిత రక్తం ప్రవహిస్తుంది. ధమనులు ఆమ్లజనిసహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తప్ప శరీర అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. పుపుస ధమని ఆమ్లజని రహితరక్తాన్ని ఊపిరితిత్తులకు గుండె నుండి సరఫరా చేస్తుంది.
  2. శరీర అన్ని భాగముల నుండి సిరలు ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరించి గుండెనందలి కుడి కర్ణికకు చేరుస్తాయి. పుపుస సిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనిసహిత రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది.
  3. అతి చిన్నవైన ధమనికలను మరియు సిరలను రక్తకేశనాళికలు కలుపుతాయి.

ప్రశ్న 32.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
ఎ) అధిక బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:
ఎక్కువ బరువు కలిగిన జంతువులలో ఎక్కువ బరువు కలిగిన హృదయం ఉంటుంది. ఒక హృదయస్పందనలో పెద్దదైన హృదయం ఎక్కువ మొత్తంలో శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. తిరిగి హృదయం పూర్తిగా నిండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువలన అధిక బరువు కలిగిన జంతువులలో హృదయస్పందనలు చాలా తక్కువగా ఉంటాయి. హృదయం పూర్తిగా ఖాళీ కావటం అనేది అధిక బరువు కలిగిన జీవులలో అసంభవం.

బి) తక్కువ బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
తక్కువ శరీర బరువు కలిగిన జంతువులలో హృదయం కూడా తక్కువ బరువు ఉంటుంది. రక్తాన్ని శరీర భాగాలకు పంపించడానికి సంకోచించినపుడు అతి తక్కువ పరిమాణంలో రక్తం శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అందువలన ఎక్కువ మొత్తం రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.

సి) శరీర బరువుకు హృదయస్పందనానికి గల సంబంధమేమి?
జవాబు:
శరీర బరువు పెరిగితే హృదయస్పందనలు తక్కువగా ఉంటాయి. శరీర బరువు తక్కువగా ఉంటే హృదయస్పందనలు ఎక్కువ.

డి) శరీర బరువుతో పోలిస్తే, గుండె బరువు తక్కువగా ఉండటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవి అనేక అవయవాలు మరియు అవయవ వ్యవస్థలతో నిర్మితమై ఉంటుంది. హృదయం జీవి శరీరములో ఒక భాగమైనందున సాధారణముగా శరీర బరువు కంటే హృదయం బరువు తక్కువగా ఉంటుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ ½ Mark Important Questions and Answers

1. బి.పి.ని విస్తరించుము.
జవాబు:
Blood Pressure / రక్త పీడనం

శాస్త్రవేత్తను గుర్తించండి

2. రోగి హృదయ స్పందన వినడానికి మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. దానికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు.
జవాబు:
రెని లెన్నేక్

3. ఇతను ఇటాలియన్ వైద్యుడు. కాలిలోని సిరలను అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండటం గుర్తించాడు.
జవాబు:
గైరోలమా ఫ్యాబ్రిసి

4. ఇతనొక బ్రిటీష్ వైద్యుడు. గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను గుర్తించాడు. ఇవి రక్తాన్ని కర్ణికల నుండి జఠరికలకు ప్రవహింపజేస్తాయి అని కనుగొన్నాడు.
జవాబు:
విలియం హార్వే

5. ఆయన సూక్ష్మజీవ శాస్త్రవేత్త. చిన్న ధమనులు మరియు సిరలు అతిసన్నని, చిన్నవైన రక్తనాళాల ద్వారా అనుసంధానించబడి ఉన్నట్లు కనుగొన్నాడు. వాటికి సూక్ష్మ కేశనాళికలు అని పేరు పెట్టాడు.
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

ఫ్లో చార్టులు

6. చేపలోని ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థలో ఖాళీని పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 29
జవాబు:
మొప్పలు

7.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 30
జవాబు:
రక్త కేశనాళికలు

8.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 31
జవాబు:
ప్లాస్మా

9.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 32
జవాబు:
ఎడమ జఠరిక

10.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 33
జవాబు:
ప్రసరణ కణజాలం

11.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 34
జవాబు:
పుపుస మహాధమని

12.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 35
జవాబు:
త్రాంబోకైనేజ్

13.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 39
జవాబు:
ఫైబ్రినోజెన్

14.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 36
జవాబు:
వల్కల కణాలు / వల్కలం

15.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 37
జవాబు:
పత్రరంధ్రాలు

సరైన గ్రూపును గుర్తించండి

16. ఏ గ్రూపు కణాలు మొక్కలకు సంబంధించినవి?
A. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు
B. దారువు పోషక కణజాలం, పత్రాంతర కణాలు
జవాబు:
సమూహం B

17. రక్తం గడ్డ కట్టడానికి సంబంధం లేని సమూహాన్ని గుర్తించండి.
A. త్రాంబిన్, ఫైబ్రినోజెన్, త్రాంబోకైనేజ్
B. హెపారిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు
జవాబు:
సమూహం B

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

18. ఏ గ్రూపుకు సంబంధించిన రక్త నాళాలలో ఆమ్లజని సహిత రక్తం ప్రవహించదు?
A. దైహిక మహాధమని, కరోనరీ ధమని, పుపుస మహాసిర
B. పుపుస మహాధమని, కరోనరీ సిర, పర మహాసిర
జవాబు:
సమూహం B

19. ఏ గ్రూపు జీవులు వివృత రక్త ప్రసరణ వ్యవస్థను చూపిస్తాయి?
A. కీటకం, రొయ్య, సాలీడు
B. వానపాము, ఆక్టోపస్, మానవుడు
జవాబు:
సమూహం A

20. మొక్కలలో రవాణా కొరకు ఏ ప్రక్రియలు సహాయ పడతాయి?
A. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ద్రవాభిసరణ
B. వేరు పీడనం, బాష్పోత్సేకం, సంసంజన మరియు అసంజన బలాలు
జవాబు:
సమూహం B

21. ఏ గ్రూపులోని కణాలు కణికారహిత కణాలు కావు ? జ.
A. ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ సరైన గ్రూపును గుర్తించండి
B. మోనోసైట్లు, లింఫోసైట్లు, రక్తఫలకికలు
జవాబు:
సమూహం A

22. ఏ గ్రూపు లక్షణాలు ధమనులకు సంబంధించినవి?
A. పలుచని గోడలు, మిడిమిడి కవాటాలు
B. మందపాటి గోడలు, అంతర్గతం, కవాటాలు లేవు
జవాబు:
సమూహం B

23. రక్త ప్రసరణ యొక్క సరైన క్రమాన్ని కనుగొనండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 38
జవాబు:
సమూహం B

24. రక్త ప్రసరణ జరిగే విధానం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి.
A. ఊపిరితిత్తులు → ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → కరోనరీ ధమనులు → హృదయ కండరం
B. హృదయ కండరం → కరోనరీ ధమనులు ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → ఊపిరితిత్తులు
జవాబు:
సమూహం A

25. ఇవ్వబడ్డ టేబుల్ లో ఖాళీని పూరించండి.

వర్గమురవాణా వ్యవస్థ
కార్డేటాసంవృత ప్రసరణ వ్యవస్థ
?వివృత ప్రసరణ వ్యవస్థ

జవాబు:
ఆర్రోపోడా

ఉదాహరణలు ఇవ్వండి

26. బహుకణ జంతువులు శరీరంలో ఉన్న పదార్థాలను రవాణా చేయడానికి రక్తం అనే ప్రత్యేక ద్రవాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. మీ శరీరంలో పదార్థాలను రవాణా చేసే మరొక ద్రవానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లింఫ్ / శోషరసం

27. గొల్లభామ అనే కీటకంలో రక్తం వర్ణరహితం. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొద్దింక

28. వివృత రక్తప్రసరణ వ్యవస్థ కీటకాలలో కనిపిస్తుంది. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మలస్కా జీవులు

29. హైడ్రా వంటి నిడేరియా జీవులు పదార్థాల రవాణా కొరకు శరీరంలో జఠర ప్రసరణ కుహరం అనే నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. దీనికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జెల్లీ ఫిష్

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

30. పూర్వ మహాసిర శరీరంలోని వివిధ భాగాల నుండి ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరిస్తుంది. మరొక మహాసిర కు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పర మహాసిర

పోలికను గుర్తించుట

31. అమీబా : ట్రేనియన్ చలనం :: స్పంజికలు 😕
జవాబు:
నీటి ప్రవాహాలు

32. సిరలు : ఆమ్లజనిరహిత రక్తం :: ? : ఆమ్లజనిసహిత రక్తం
జవాబు:
ధమనులు

33. ఆమ్లజనిసహిత రక్తం : పుపుస మహాసిర :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

34. ఆమ్లజనిసహిత రక్తం : మహాధమని :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

35. ఆమ్లజనిసహిత రక్తం : శరీర భాగాలు :: ? : ఊపిరితిత్తులు
జవాబు:
ఆమ్లజని రహిత రక్తం

36. హృదయ స్పందన : స్టెతస్కోప్ :: రక్తపీడనం 😕
జవాబు:
స్పిగ్మో మానోమీటర్

37. కవాటాలు : ఫాబ్రిసి :: రక్త కేశనాళికలు 😕
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

38. రక్తం : రక్తనాళాలు :: శోషరసం 😕
జవాబు:
శోషరస నాళాలు

39. రక్త స్కందన ఎంజైము : త్రాంబోకైనేజ్ :: రక్త స్కందన విటమిన్ 😕
జవాబు:
విటమిన్ K

40. పత్రాలు : పత్రరంధ్రాలు :: కాండం 😕
జవాబు:
లెంటిసెల్స్

41. దారువు : నీరు :: ? : పోషకాలు
జవాబు:
పోషక కణజాలం

42. RBC యొక్క లోపం : అనీమియా :: జన్యు రుగ్మత 😕
జవాబు:
తలసేమియా

దోషాన్ని గుర్తించి, సరిచేసీ రాయండి

43. గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు టయలిన్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.
జవాబు:
గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.

44. రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే ప్లాస్మా అంటారు.
జవాబు:
రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే సీరం అంటారు. పోలికను గుర్తించుట

45. ధమనీ వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.
జవాబు:
సిరా వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.

46. ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.
జవాబు:
ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.

47. మూలకేశాలలోని రిక్తికలోకి నీరు విసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.
జవాబు:
మూలకేశాలలోని రిక్తికలోకి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.

48. ఫ్లూరల్ ఫ్లూయిడ్ గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.
జవాబు:
హృదయావరణ కుహరద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

49. వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారుచేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల యాంత్రిక కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.
జవాబు:
వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారు చేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల నాళికా పుంజం / ప్రసరణ కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.

జతపరచుట

50. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సిస్టోలిక్ పీడనం – 80
సాధారణ రక్తపీడనం – 120/80
డయాస్టోలిక్ పీడనం – 120
జవాబు:
సాధారణ రక్తపీడనం – 120/80

51. తప్పుగా జత చేయబడ్డ దానిని గుర్తించండి.
హార్దిక వలయం – 0.1
సెకను కర్ణికా సంకోచం – 0.11-0.14 సెకన్లు
జఠరిక సంకోచం – 0.27-0.35 సెకన్లు
జవాబు:
హార్దిక వలయం – 0.1 సెకను

52. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
అగ్రత్రయ కవాటం – కుడి కర్ణికా – జఠరికా రంధ్రం
అగ్రద్వయ కవాటం – ఎడమ కర్ణికా – జఠరికా రంధ్రం
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం
జవాబు:
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం

53. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
కర్ణికల సిస్టోల్ – కర్ణికలు మరియు జఠరికలు విశ్రాంతి
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం
జఠరికల డయాస్టోల్ – కర్ణికలు మరియు జఠరికల సంకోచం
జవాబు:
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం

54. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
కణజాల ద్రవం – శోషరసం
సీరం – రక్త మాతృక
శోషరసం – రక్తం మరియు కణజాలం మధ్య కనెక్షన్
జవాబు:
సీరం – రక్త మాతృక

55. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సాధారణ రక్తపీడనం – <120/80 అల్ప రక్తపీడనం – 120/80 అధిక రక్తపీడనం – > 120/80
జవాబు:
అధిక రక్తపీడనం – > 120/80

56. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
ఎఫిడ్స్ – తొండము
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్
వేరు – ద్రవాభిసరణ పీడనం
జవాబు:
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్

నేను ఎవరు?

57. నేను ఛాతీ కుహరంలో అమరియున్న పియర్ ఆకారంలో ఉన్న అవయవాన్ని. నేను పిండాభివృద్ధి దశలో 21వ రోజు స్పందించడం ప్రారంభిస్తాను.
జవాబు:
హృదయం

58. నేను చేపలలో కనపడే రక్త ప్రసరణను, శరీర భాగాల నుంచి గుండెకు, అక్కడి నుంచి శ్వాసకోశ అవయ వాలకు రక్తం ప్రవహిస్తుంది.
జవాబు:
ఏకవలయ ప్రసరణం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

59. నేను సిరా వ్యవస్థకు సమాంతరంగా ఏర్పడిన రవాణా వ్యవస్థను. టాన్సిల్స్, అడినాయిడ్స్, ప్లీహం, థైమస్ అనేవి ఆ వ్యవస్థలో భాగాలు.
జవాబు:
శోషరస వ్యవస్థ

60. మొక్కల్లో ఉండే జీవన ప్రక్రియను నేను. ఈ ప్రక్రియలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా మరియు కాండం యొక్క లెంటి సెల్స్ ద్వారా నీరు ఆవిరైపోతుంది.
జవాబు:
బాష్పోత్సేకం

61. రక్తం గడ్డ కట్టడానికి రక్తంలోని రక్తఫలకికలు మరియు ఇతర కారకాలతో పాటుగా అవసరమయ్యే విటమిన్ ని.
జవాబు:
విటమిన్ K

62. నేనొక వర్ణద్రవ్యాన్ని, రక్త వర్ణానికి మరియు శ్వాస వాయువుల రవాణాకు సహాయపడతాను.
జవాబు:
హీమోగ్లోబిన్

63. నేను ఒక కవాటాన్ని. ఎడమ జఠరిక నుండి రక్తాన్ని మహాధమనిలోనికి రక్తం ప్రవేశించడానికి అనుమతిస్తాను.
జవాబు:
మహాధమని కవాటం

64. నేనొక విభాజకాన్ని, కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణికను వేరు చేస్తాను.
జవాబు:
కర్ణికాంతర విభాజకం

బొమ్మలపై ప్రశ్నలు

65.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 40
ఈ పరికరం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
రక్తపోటును కొలవడానికి

66.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 41
ఈ చర్యకు కారణమైన ఎంజైమ్ పేరేమిటి?
జవాబు:
త్రాంబోకైనేజ్

67.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 42
సిరల మధ్య కలుపుతూ ఉన్న రక్తనాళాన్ని గుర్తించండి.
జవాబు:
రక్త కేశనాళికలు

68.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 43
ఈ పటంలోని ఎగువ గదులను ఏమంటారు?
జవాబు:
కర్ణికలు

69.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 44
పటంలో చూపిన వ్యవస్థ ఏమిటి?
జవాబు:
శోషరస వ్యవస్థ

70.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
ఈ పటం ఏ ప్రయోగాన్ని సూచిస్తుంది?
జవాబు:
వేరుపీడన ప్రయోగం

ఖాళీలను పూరించండి

71. మానవ శరీరంలో రవాణా ద్రవాలు …………
జవాబు:
రక్తం, శోషరసం

72. రక్తాన్ని పంపు చేయు సాధనం ……..
జవాబు:
గుండె

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

73. ఆమ్లజనిరహిత రక్తం కలిగిన ధమని …..
జవాబు:
పుప్పుస ధమని

74. శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే వలయం …………..
జవాబు:
దైహిక వలయం

75. గుండెలోని కవాటాల సంఖ్య
జవాబు:
4

76. గుండెను చుట్టి ఉండు పొర ………….
జవాబు:
హృదయావరణ త్వచం

77. గుండె ఎడమ వైపు ఉండే రక్తం …..
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

78. ద్విపత్ర కవాట స్థానము ………
జవాబు:
ఎడమ కర్ణిక జఠరిక రంధ్రము

79. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగిన జీవి ……..
జవాబు:
బొద్దింక

80. మొదటిసారిగా రక్తనాళాలు కలిగిన జీవుల వర్గం ……….
జవాబు:
అనిలెడా

81. మొక్కలలో నీటి రవాణా చేయు కణజాలం ……….
జవాబు:
దారువు

82. పోషక కణజాలం పని …………
జవాబు:
ఆహార రవాణా

83. వేరులో నీటిని పీల్చుకొనే నిర్మాణాలు …………
జవాబు:
మూలకేశాలు

84. కాండంలోనికి నీరు ప్రవేశించటానికి తోడ్పడే వత్తిడి …………….
జవాబు:
వేరు పీడనం

85. కీటకాలు ఆహారం సంపాదించటానికి ………… ను దారువులోనికి చొప్పిస్తాయి.జవాబు:
ప్రోబోసిస్

86. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ………..
జవాబు:
విటమిన్ K

87. రక్తాన్ని గడ్డ కట్టించే ప్రోటీన్స్ ………
జవాబు:
తాంబ్రిన్, ప్రోత్రాంబిన్

88. రక్తాన్ని గడ్డ కట్టించే రక్త కణాలు …………
జవాబు:
రక్త ఫలకికలు

89. ఊపిరితిత్తుల నుండి ………… రక్తం గుండెకు చేరుతుంది.
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

90. మానవ శరీరంలో పెద్ద దమని ….
జవాబు:
మహా ధమని

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. ఊపిరితిత్తులపై ఉన్న పొరను ప్లూరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు?
A) హైపర్ కార్డియం
B) పెరికార్డియం
C) ఎపికార్డియం
D) అప్పర్ కార్డియం
జవాబు:
B) పెరికార్డియం

2. మానవుని గుండెలో గదులు
A) 1 కర్ణిక, 1 జఠరిక
B) 2 కర్ణికలు, 1 జఠరిక
C) 1 కర్ణిక, 3 జఠరికలు
D) 2 కర్ణికలు, 2 జఠరికలు
జవాబు:
D) 2 కర్ణికలు, 2 జఠరికలు

3. మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ……….. జరగదు.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) నీటి రవాణా
D) ప్రత్యుత్పత్తి
జవాబు:
C) నీటి రవాణా

4. సామాన్య రక్త పీడనము కొలవడానికి డాక్టరు ఉపయోగించే పరికరం
రక్త పీడనం కొలుచుటకు వాడే పరికరం
A) స్పిగ్మోమానోమీటరు
B) మానోమీటర్
C) హైగ్రోమీటర్
D) బారోమీటర్
జవాబు:
A) స్పిగ్మోమానోమీటరు

5. రక్తనాళాల అడ్డుకోతలో కండర పొర మందంగా క్రింది వానిలో కన్పిస్తుంది ……
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్
b) రక్త పీడనం – థర్మో మీటర్
c) అమీబా – బ్రౌనియన్ చలనం
A) a
B) b
C) c
D) పైవేవీకాదు
జవాబు:
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్

6. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడేది
A) దారు కణజాలం
B) ఉపకళా కణజాలం
C) పోషక కణజాలం
D) స్తంభ కణజాలం
జవాబు:
A) దారు కణజాలం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

7. ఇచ్చిన ప్రయోగం కింది వానిలో దేనిని గురించి తెలుసుకొనుటకు నిర్వహిస్తారు?
A) వేరు పీడనం
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) బాష్పోత్సేకం
జవాబు:
D) బాష్పోత్సేకం

8. నడవడం, పరిగెత్తడం వంటి సమయాలలో రక్త పీడనం ఏ విధంగా ఉంటుంది?
A) సాధారణంగా
B) తక్కువగా
C) ఎక్కువగా
D) పైవేవీ కాదు
జవాబు:
C) ఎక్కువగా

9. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది?
A) కుడి కర్ణిక, కుడి జఠరిక
B) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక
C) కుడి కర్ణిక, ఎడమ జఠరిక
D) ఎడమ కర్ణిక, కుడి జఠరిక
జవాబు:
A) కుడి కర్ణిక, కుడి జఠరిక

10. పటంలో చూపిన రక్తనాళం రక్తాన్ని శరీర భాగాల నుండి హృదయానికి తీసుకువెళుతుంది. దీని పేరేమి?
A) ధమని
B) రక్తకేశ నాళిక
C) సిర
D) కండర తంతువు
జవాబు:
C) సిర

11. క్రింది వానిలో సరికాని జత ఏది?
i) పుపుస ధమని
ii) పుపుస సిర
iii) బృహద్ధమని
iv) బృహత్సిర
A) i, iii
B) ii, iv
C) i, ii
D) iii, iv
జవాబు:
B) ii, iv

12. ఈ చిత్రంలో చూపబడిన క్రియ
A) బాష్పోత్సేకము
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) పోషణ
జవాబు:
A) బాష్పోత్సేకము

13. జతపరచండి.
జాబితా -1 జాబితా – 2
1) కర్ణికల సిస్టోలు ఎ) 0.27 – 0.35 సె.
2) జఠరికల సిస్టోలు బి) 0.8 సె.
3) హార్దిక వలయం సి) 0.11 – 0. 14 సె.
A) 1-బి, 2-ఎ, 3-సి
B) 1-బి, 2-సి, 3-ఎ
C) 1-సి, 2-ఎ, 3-బి
D) 1-సి, 2-బి, 3-ఎ
జవాబు:
C) 1-సి, 2-ఎ, 3-బి

14. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
i) ధమనుల గోడలు మందంగా ఉంటాయి.
ii) ధమనులు గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
iii) ధమనుల్లో రక్త పీడనం తక్కువ.
iv) పుపుస ధమనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
A) (i), (iii)
B) (i), (iv)
C) (ii), (iv)
D) (i), (ii)
జవాబు:
D) (i), (ii)

15. ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ కల జీవి
A) కప్ప
B) నత్త
C) కోడి
D) చేప
జవాబు:
D) చేప

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

16. ఈ బొమ్మను గుర్తించుము.
A) సిర అడ్డుకోత
B) సిరిక అడ్డుకోత
C) ధమని అడ్డుకోత
D) రక్తకేశ నాళిక అడ్డుకోత
జవాబు:
C) ధమని అడ్డుకోత

17. మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది
A) పోషక కణజాలం
B) బాహ్య చర్మం
C) దారువు
D) విభాజ్య కణజాలం
జవాబు:
C) దారువు

18. వేరు పీడనం ప్రయోగం చేసేటప్పుడు నీవు తీసుకునే జాగ్రత్త ఏది?
A) మొక్క కొమ్మలను కలిగి ఉండాలి.
B) మొక్కను చీకటిలో ఉంచాలి.
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.
D) గాజు గొట్టం పరిమాణం, కాండం పరిమాణం కన్నా పెద్దదిగా ఉండాలి.
జవాబు:
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.

19. రాము యొక్క హృదయ స్పందన రేటు 72/ని. అయిన అతని నాడీ స్పందన రేటు ………..
A) 72/ని. కన్నా ఎక్కువ
B) 72/ని. కన్నా తక్కువ
C) 72/ ని. కు సమానం
D) అంచనా వేయలేం
జవాబు:
C) 72/ ని. కు సమానం

20. సరియైన వాక్యమును గుర్తించుము.
A) అవకాశిక (lumen) ఎక్కువ.
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.
C) సిరల గోడల మందం ఎక్కువ.
D) ధమనుల్లో కవాటాలుంటాయి.
జవాబు:
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.

21. సరియైన జతను గుర్తించండి.
i) పుపుస సిర a) ఆమ్లజని రహిత రక్తం
ii) పుపుస ధమని b) కుడి కర్ణిక, కుడి
iii)కరోనరి రక్తనాళాలు c) ఆమ్లజని సహిత రక్తం
iv)అగ్రత్రయ కవాటం d) గుండెకు రక్తం
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b
B) (i) – a, (ii) – b, (iii) – c, (iv) – d
C) (i) – c, (ii) – b, (iii) – d, (iv) – a
D) (i) – c, (ii) – a, (iii) – b, (iv) -d
జవాబు:
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b

22. కింది బొమ్మను పరిశీలించి అది ఏ వ్యవస్థకు సంబంధించినదో గుర్తించండి.
A) విసర్జక వ్యవస్థ
B) నాడీ వ్యవస్థ
C) శోషరస వ్యవస్థ
D) కండర వ్యవస్థ
జవాబు:
C) శోషరస వ్యవస్థ

23.

జాబితా – Aజాబితా – B
i) రెండు గదుల హృదయంa) కప్ప
ii) మూడు గదుల హృదయంb) ఆవు
iii) నాలుగు గదుల హృదయంc) చేప

A) i – a, ii – c, iii – b
B) i – a, ii – b, iii – c
C) i – c, ii – a, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
C) i- c, ii – a, iii – b

24. నాడీ స్పందనను కనుగొనడానికి నీవు తయారుచేసిన పరికరంలో ఉపయోగించిన వస్తువులు
A) దారం మరియు అగ్గిపుల్ల
B) దారం మరియు చొక్కా గుండీ
C) అగ్గిపుల్ల మరియు నాణెం
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య
జవాబు:
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

25. క్రింది వానిలో రక్తం గడ్డ కట్టుటలో పాత్ర లేనిది
A) ఫిల్లో క్వినోన్
B) ఫైబ్రిన్ అందించడం
C) థ్రాంబిన్
D) థైమిన్
జవాబు:
D) థైమిన్

మీకు తెలుసా?

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25 AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
• మానవునిలో ఒక మిల్లీలీటరు రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సెకన్ల సమయం పడుతుంది. ఇదే రక్తాన్ని వ్యాపన పద్దతిలో ఇంతదూరం ప్రయాణించటానికి సుమారుగా 60 సంవత్సరాల కాలం పడుతుంది.

మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోత్సేకం చెందుతుంది? ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది. ఒక ఎకరం విస్తీర్ణంలోని మొక్కజొన్న తోట నుండి 13,25,000 లీటర్ల నీరు ఆవిరి అవుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది.

పునశ్చరణ
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 45

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

These AP 10th Biology Important Questions and Answers 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 2nd lesson Important Questions and Answers శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. అందుకు కారణమైన సూక్ష్మజీవి ఏది?
జవాబు:
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. దీనికి కారణమైన సూక్ష్మజీవి – ఈస్ట్.

ప్రశ్న 2.
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలయిన శక్తి ఏ పదార్ధ రూపంలో నిల్వ ఉంటుంది?
జవాబు:
“ATP” (అడినోసిన్ టైఫాస్ఫేట్).

ప్రశ్న 3.
క్రింది పటంలో a, b లను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1
(a) మాత్రిక (b) క్రిస్టే

ప్రశ్న 4.
అవాయు మరియు వాయు సహిత శ్వాసక్రియలలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి?
జవాబు:
వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : కార్బన్ డై ఆక్సైడ్ (CO2), నీరు, శక్తి

అవాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : ఇథనాల్ / లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, శక్తి

ప్రశ్న 5.
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏ రసాయనం ఏర్పడుతుంది?
జవాబు:
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే రసాయనం : లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణానికి డయాజీన్ గ్రీన్ ద్రావణాన్ని ఎందుకు కలుపుతారు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణములో ఆక్సిజన్ వుందో, లేదో తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
బొమ్మ దేనిని గురించి తెలుపుతుంది?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2
జవాబు:
వాయుగత వేళ్ళు / శ్వాస వేళ్ళు / నిమాటోపోర్స్ / మడ చెట్టు వేళ్ళు / మాంగ్రూవ్ చెట్టు వేళ్ళు

ప్రశ్న 8.
శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించి శక్తిని వెలువరించే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు.

శ్వాసక్రియ Respiration అనే పదం Respire అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. దీని అర్థం ‘పీల్చడం’ అయితే , శ్వాసక్రియ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగించబడటం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది.
C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Cal

ప్రశ్న 9.
ఊపిరితిత్తులలోని శ్వాస కదలికకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
ఊపిరితిత్తులు తమంతటతాముగా గాలిని లోపలకు తీసుకోవడంగాని, బయటకు పంపడంగాని చేయలేవు. ఛాతీ కండరాలు మరియు ఉరఃకుహరాన్ని, ఉదరకుహరాన్ని వేరుచేసే కండరయుతమైన ఉదరవితానం (diaphragm) అనే పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి, బయటకు పోవడానికి సహాయపడతాయి.

ప్రశ్న 10.
మానవ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత?
జవాబు:
మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ. వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

ప్రశ్న 11.
కణశ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
శరీరంలోని జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణశాస్వక్రియ (Cellular respiration) అంటారు. ఇది కణస్థాయిలో జరుగుతుంది.

ప్రశ్న 12.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి? అది ఏ జీవులలో జరుగుతుంది?
జవాబు:
చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఉదా : కప్ప, వానపాము, జలగ

ప్రశ్న 13.
స్థిరమైన వాయువు అని దేనికి పేరు? దీనిని ఎలా గుర్తిస్తారు?
జవాబు:
స్థిరవాయువు :
కార్బన్ డై ఆక్సైడ్ ను స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు అంటారు. సున్నపు తేటను తెల్లగా మార్చే గుణం ఆధారంగా CO2 ను గుర్తిస్తారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 14.
ఖర్చు అయ్యే వాయువు అని దేనికి పేరు?
జవాబు:
పదార్థాలు మండించినపుడు, జీవులు శ్వాసించినపుడు ఈ వాయువు ఖర్చు అయ్యేది. కనుక ఆక్సిజన్ ను ఖర్చు అయ్యే వాయువు (Vitiated air) అని భావించారు.

ప్రశ్న 15.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలోని రకాలు : శ్వాసక్రియ ప్రధానంగా రెండు రకాలు. అవి:

  1. అవాయు శ్వాసక్రియ
  2. వాయుసహిత శ్వాసక్రియ.

ప్రశ్న 16.
శ్వాసక్రియలోని దశలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియ దశలను రెండు రకాలుగా విభజిస్తారు. అవి:

  1. బాహ్య శ్వాసక్రియ
  2. అంతర శ్వాసక్రియ.

బాహ్య శ్వాసక్రియలో ఎ) ఉచ్ఛ్వాసం బి) నిశ్వాసం అనే దశలు ఉంటాయి. అంతర శ్వాసక్రియలో ఎ) గ్లైకాలసిస్ బి) క్రెట్స్ వలయం/కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 17.
మానవుని శ్వాసవ్యవస్థలో గాలి ప్రసరణ మార్గాన్ని చూపించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 3

ప్రశ్న 18.
ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు.

ప్రశ్న 19.
ఊపిరితిత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
మన శరీర అవయవాలలో నీటిపైన తేలే ఒక అవయవం ఊపిరితిత్తులు. ఇవి బెలూన్ లాగా వ్యాకోచించే సామర్థ్యంతో 1200 మి.లీ వాయువును ఎప్పుడూ కలిగి ఉంటాయి. వీటి పూర్తి సామర్థ్యం 5900 మి.లీ.

ప్రశ్న 20.
శ్వాస కదలికలో తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
పురుషుల శ్వాసకదలికలో ఉదరవితానం, స్త్రీల శ్వాసకదలికలో ప్రక్కటెముకలు ప్రముఖపాత్రను వహిస్తాయి.

ప్రశ్న 21.
ఊపిరితిత్తులు ఎలా రక్షించబడతాయి?
జవాబు:
ఊపిరితిత్తులకు చుట్టూ ప్లూరా అనే రెండు పొరలు ఉంటాయి. ఈ రెండు పొరల మధ్య ఉన్న ద్రవం ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది.

ప్రశ్న 22.
కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణద్రవ్యం (Cytoplasm) లో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంతభాగం (గ్లైకాలసిస్) కణద్రవ్యంలోనూ, మరికొంతభాగం (క్రెట్స్ వలయం) మైటోకాండ్రియాలో జరుగుతుంది.

ప్రశ్న 23.
కణశక్త్యాగారాలు అని వేటికి పేరు?
జవాబు:
శ్వాసక్రియలో శక్తి మైటోకాండ్రియాలలో వెలువడుతుంది. అందువలన మైటోకాండ్రియాలను “కణశక్త్యాగారాలు” అంటారు.

ప్రశ్న 24.
అవాయు శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ఏమిటి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం / ఇథనాల్, CO2, శక్తి వెలువడతాయి.

ప్రశ్న 25.
శ్వాసక్రియకు, దహన క్రియకు గల పోలికలు ఏమిటి?
జవాబు:

  1. శ్వాసక్రియ మరియు దహనక్రియ రెండూ ఆక్సీకరణ చర్యలు.
  2. ఈ రెండు క్రియలలో శక్తి వెలువడుతుంది.

ప్రశ్న 26.
వాయునాళ శ్వాసక్రియ ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
ఆర్రోపొడ వర్గానికి చెందిన కీటకాలు వాయునాళ వ్యవస్థ ద్వారా శోషిస్తాయి.
ఉదా : బొద్దింక, మిడతలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 27.
జల శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
కొన్ని జలచర జీవులు మొప్పల ద్వారా శోషిస్తాయి. ఈ శ్వాసక్రియను “మొప్పల శ్వాసక్రియ లేదా జలశ్వాసక్రియ” అంటారు.
ఉదా : చేప

ప్రశ్న 28.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను “చర్మీయ శ్వాసక్రియ” అంటారు.
ఉదా : వానపాము, జలగ

ప్రశ్న 29.
శ్వాసవేర్లు ఏ మొక్కలలో ఉంటాయి?
జవాబు:
బురద నేలలలో పెరిగే మొక్కలు, మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలోని మొక్కలు శ్వాసవేర్లు కలిగి ఉంటాయి.

ప్రశ్న 30.
లెంటిసెల్స్ అనగానేమి?
జవాబు:
కాండం మీద ఉన్న పత్రరంధ్రాలను “లెంటిసెల్స్” అంటారు. ఇవి వాయు వినిమయానికి తోడ్పడతాయి.

ప్రశ్న 31.
జీవక్రియలు అనగానేమి?
జవాబు:
జీవ కణాలలో జరిగే రసాయనిక చర్యలను “జీవక్రియలు” అంటారు.
ఉదా : శ్వాసక్రియ, జీర్ణక్రియ.

ప్రశ్న 32.
ఆక్సిజన్ సహిత రక్తం, ఆక్సిజన్ రహిత రక్తం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ఆక్సిజన్ సహిత రక్తం, ప్రకాశవంతమైన ఎరుపురంగులో ఉండి ఆక్సిజన్ రహిత రక్తం కంటే భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 33.
రక్తంలోని ఏ పదార్థం వాయు రవాణాలో పాల్గొంటుంది?
జవాబు:
రక్తంలోని ‘హిమోగ్లోబిన్’ O2 ను CO2 ను రవాణా చేస్తుంది. ఆక్సిజన్ తో కలిసినపుడు ఆక్సీహిమోగ్లోబినను, CO2 తో కలిసినపుడు కార్బాక్సీహిమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 34.
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు :
శ్వాసక్రియలో CO2 నీరు, శక్తి విడుదల అవుతాయి.

ప్రశ్న 35.
క్రీడాకారులు ఎక్కువ దూరం ఎలా పరిగెత్తగల్గుతారు?
జవాబు:
ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండటం వలన వీరు పరిగెత్తే సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడటం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగల్గుతారు.

ప్రశ్న 36.
ఎక్కువ శ్రమచేసినపుడు కండరాలు ఎందుకు నొప్పి పెడతాయి?
జవాబు:
శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్’ లభ్యత లేనప్పుడు కండరాలు అవాయు పద్దతిలో శ్వాసిస్తాయి. అందువలన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి నొప్పి కలుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
దహనం, శ్వాసక్రియ దాదాపుగా ఒకే విధమైన చర్యలు అనవచ్చా? దీనికి నీకున్న ఆధారాలు ఏమిటి?
జవాబు:

  1. దహనం మరియు శ్వాసక్రియనందు చక్కెర అయిన గ్లూకోజు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది.
  2. రెండు క్రియలకు ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం.
  3. శ్వాసక్రియ, దహనం రెండూ శక్తిని విడుదల చేసే ప్రక్రియలు.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
a) ఈ ప్రయోగంలో సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు ఏది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు లేదా CO2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4

b) మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు తక్కువ పరిమాణంలో ఉంది?
జవాబు:
ఆక్సిజన్ లేదా ఆమ్లజని లేదా O2.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది. 3) సరిగ్గా మాట్లాడలేము.
  3. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

ప్రశ్న 3.
మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. రాత్రి శ్వాసక్రియను జరుపుతాయి అని బాలు చెప్పాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా, లేదా ? ఎందుకు ?
జవాబు:

  1. నేను, బాలు అభిప్రాయంతో ఏకీభవించటం లేదు.
  2. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు కాంతిశక్తి అవసరం అవుతుంది. కాని, శ్వాసక్రియ కాంతి మీద ఆధారపడదు.
  3. కావున కిరణజన్య సంయోగక్రియ పగటిపూట మాత్రమే జరుగుతుంది. శ్వాసక్రియ పగలు, రాత్రి కూడా జరుగుతుంది.

ప్రశ్న 4.
నీవు ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిని కలిసినప్పుడు శ్వాస సంబంధ వ్యాధుల గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. శ్వాస సంబంధ వ్యాధుల లక్షణాలను తెల్పండి.
  2. శ్వాస సంబంధ వ్యాధుల నుండి రక్షించుకొనుటకు నేను ఏ జాగ్రత్తలు పాటించాలి?
  3. పొగత్రాగడం ఊపిరితిత్తులకు ఏ విధంగా హానిచేస్తుంది?
  4. సాధారణంగా మానవులకు కలిగే శ్వాససంబంధిత వ్యాధులు ఏవి?

ప్రశ్న 5.
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని నిరూపించే ప్రయోగానికి అవసరమైన రెండు రసాయనాలు, రెండు పరికరాలను రాయండి.
జవాబు:
రసాయనాలు :
1. గ్లూకోజ్ ద్రావణం, 2. పారాఫిన్ ద్రావణం, 3. డయాజీన్ గ్రీన్ (జానస్ గ్రీన్ బి), 4. సున్నపు నీరు/ బైకార్బొనేట్ ద్రావణం / సూచికా ద్రావణం

పరికరాలు :
1. థర్మామీటర్, 2. ప్లాస్క్ (సీసా), 3. పరీక్ష నాళిక, 4. రబ్బరు బిరడాలు, 5. డెలివరీ గొట్టము

ప్రశ్న 6.
ఊపిరితిత్తులలోని వాయుగోణుల పరిమాణం ఎంత?
జవాబు:
ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడుతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 7.
ఉపజిహ్విక అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. గ్రసనిలో కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణాన్ని ఉపజిహ్విక అంటారు. ఇది గ్రసనిలో ఉంటుంది.
  2. స్వరపేటికలోనికి ఆహారం పోకుండా ఉపజిహ్విక ఆహారం వాయువుల కదలికను క్రమబద్ధీకరిస్తుంది.
  3. ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మ్రింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని’ మూసి ఉంచి ఆహారం శ్వాసవ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్ళిస్తుంది.
  4. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాసమార్గం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది.
  5. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు, ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికను సక్రమంగా అమలు చేయడానికి నాడీ నియంత్రణ చాలా అవసరం.

ప్రశ్న 8.
ఉచ్ఛ్వాసం, నిశ్వాసంలలో ఉదరవితానం పాత్ర ఏమిటి?
జవాబు:
ఉరఃకుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదరవితానం ఆ గది కింది భాగం అవుతుంది. ఉదరవితానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరఃకుహరం వైపునకు ఉంటుంది. ఉదరవితాన కండరాలు సంకోచించినపుడు అది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది. దీని వలన ఉరఃకుహర ఘనపరిమాణం పెరుగుతుంది.

ఉరఃకుహరం ఘనపరిమాణం పెరిగినపుడు, దాని లోపలి పీడనం తగ్గి గాలి బయటి నుండి నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. దీనినే “ఉచ్ఛ్వాసం” అంటారు.

తరువాత దీనికి విపర్యం (వ్యతిరేకంగా) జరుగుతుంది. ఛాతి యథాస్థానానికి చేరుకుంటుంది. ఉదరవితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది. ఉరఃకుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపలి గాలి వాయుమార్గం ద్వారా బయటకు వెళుతుంది. దీనినే “నిశ్వాసం” అంటారు.

ప్రశ్న 9.
ఊపిరితిత్తుల గురించి రాయండి.
జవాబు:
మన ఊపిరితిత్తులు ‘స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను ఆఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

ప్రశ్న 10.
శ్వాసక్రియ రేటును ప్రభావితం చేసే కారకాలు ఏమిటి?
జవాబు:
మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను, తక్కువ (Shallow) ఒత్తిడితోను జరుగుతుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి పనులుచేసే సమయంలో వేగంగాను, గాఢంగాను (ఎక్కువ ఒత్తిడితో) జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస, నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. భయపడినపుడు, ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసక్రియ రేటు పెరగటం మనకు అనుభవమే.

ప్రశ్న 11.
మైటోకాండ్రియాను కణశక్త్యాగారాలు అంటారు. ఎందుకు?
జవాబు:

  1. కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యం (cytoplasm) లో జరుగుతుంది.
  2. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోను, మరికొంత భాగం మైటోకాండ్రియాలోను జరుగుతుంది.
  3. ఈ చర్యలో విడుదలైన శక్తి ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది.
  4. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్యాగారాలు (Power houses of energy) అంటారు.

ప్రశ్న 12.
ఎనర్జీ కరెన్సీ అనగానేమి? దాని శక్తి విలువ ఎంత?
జవాబు:
1) ఎనర్జీ కరెన్సీ :
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ATP) అనే ప్రత్యేక పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తాల్లో ఉండే రసాయన శక్తి. దీనికి కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అంటారు.

2) ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటికి రవాణా అవుతుంది. ప్రతి ATPలో 67200 కాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినపుడు శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 13.
గ్లూకోజ్ నుండి శక్తి ఎలా విడుదలవుతుంది?
జవాబు:
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పైరూవిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 14.
ఆక్సిజన్ లోటు అనగానేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
మనం శారీరక శ్రమ ఎక్కువగా చేసినపుడు కణాలలో శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి కండరాలు అలసటకు లోనౌతాయి. తిరిగి కండరాలు సాధారణ స్థితికి రావటానికి లాక్టిక్ ఆమ్లం తొలిగించవలసిన అవసరం ఉంది. దీని కొరకు కండరాలకు ఆక్సిజన్ కావాలి. కండరాలు ఆక్సిజనన్ను కోరుకునే ఈ స్థితిని ‘ఆక్సిజన్ లోటు’ అంటారు.

ప్రశ్న 15.
చక్కెర ద్రావణం నుండి ఇథనాల్ ఎలా తయారుచేస్తారు?
జవాబు:
చక్కెర ద్రావణం, ఈ మిశ్రమాన్ని కదిలించకుండా, ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే, కొంచెం సేపటి తరువాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారుచేసిన ఇథనాల్ అనే కొత్త పదార్థం. చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం (Fractional distillation) అనే ప్రక్రియ ద్వారా ఇథనాలను వేరుచేయవచ్చు. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత (70°C) వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 16.
ఎక్కువ శారీరక శ్రమ చేసినపుడు, మనం అలసిపోతాం. ఎందుకు?
జవాబు:
పరుగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి శ్వాసక్రియరేటు కూడా పెరుగుతుంది. అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట. అందువలననే మనకు శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన కలుగుతుంది.

శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనపుడు కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి. అందువలన ‘లాక్టిక్ ఆమ్లం’ విడుదలవుతుంది. ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరంలో పేరుకొనిపోయినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి మనకు అలసిన అనుభూతిని కలిగిస్తుంది. కొంత విశ్రాంతి తరువాత తిరిగి మనం సాధారణ స్థితికి వస్తాం.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 17.
శరీర కుడ్యం ద్వారా శ్వాసించే జీవులు ఏవి?
జవాబు:
అమీబా వంటి ఏక కణజీవులు, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం నిర్వహిస్తాయి.

ప్రశ్న 18.
వాయునాళ వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:
బొద్దింక, మిడతల వంటి కీటకాల్లో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. వాయునాళాలు, వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్‌ను నేరుగా అందిస్తాయి.

ప్రశ్న 19.
మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు ఏ విధంగా శ్వాసిస్తాయి?
జవాబు:
మొసలి, డాల్సిన్ వంటి జలచరాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. కావున ఇవి గాలి కోసం తరచుగా నీటి నుండి బయటకు వస్తుంటాయి. మొసలి, డాల్ఫిన్స్ ఒకప్పుడు భూచర జీవనం గడిపి, తిరిగి నీటి ఆవాసాలలోనికి వెళ్ళటం వలన అనుకూలనాలను అభివృద్ధి చేసుకొన్నాయి. భూచర జీవులు కొన్ని తిరిగి జలావాసాలలోనికి ప్రవేశించాయనటానికి ఈ జీవులు నిదర్శనాలు.

ప్రశ్న 20.
మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:

  1. మొక్కలలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది.
  2. పత్రరంధ్రాలతోపాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి.
  3. వేర్ల ఉపరితలం కాండం మీద ఉండే ‘లెంటిసెల్స్’ కణవాయు వినిమయంలో పాల్గొంటాయి.
  4. మడ అడవులుగా పిలువబడే మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం ‘శ్వాసవేళ్ళు’ (Aerial roots) అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది.

ప్రశ్న 21.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
ఆక్సిజన్ ప్రమేయం బట్టి శ్వాసక్రియ రెండు రకాలు. అవి:
1. వాయుసహిత శ్వాసక్రియ :
పెద్దజీవులలో జరుగుతుంది. అధిక శక్తి వెలువడును. గ్లైకాలసిస్, క్రెట్స్ వలయం అనే దశలు ఉంటాయి.

2. అవాయు శ్వాసక్రియ :
ఆక్సిజన్ అవసరం ఉండదు. తక్కువ శక్తి వెలువడుతుంది. గ్లైకాలసిస్, కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
అ) ఈ పటం ఏ జీవ వ్యవస్థకు సంబంధించినది?
ఆ) A, B భాగాల పేర్లు రాయండి.
ఇ) అవి ఏయే వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి?
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి? దాని ఫలితంగా ఏమి జరుగుతుంది?
జవాబు:
అ) శ్వా సవ్యవస్థ
ఆ) A. వాయుగోణి B. రక్తకేశనాళికల వల
ఇ) శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ వాయు వినిమయం. ఊపిరితిత్తులందలి వాయుగోణులు మరియు రక్తకేశనాళికల మధ్య వాయు వినిమయం జరుగుతుంది. దీనివలన రక్తకేశనాళికలందలి కార్బన్ డై ఆక్సెడ్ వాయుగోణిలోనికి, వాయుగోణి నందలి ఆక్సిజన్ రక్తకేశనాళికలలోనికి ప్రవేశించును.

ప్రశ్న 23.
నాసికా రంధ్రాల నుండి వాయుగోణుల వరకు ఉండే మార్గం వెచ్చగా, తేమగా ఉండడం వల్ల ప్రయోజనమేమి?
జవాబు:
నాసికా కుహరము నందు వాయువు వడపోయబడుతుంది. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర, రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలావరకు ఆపేస్తాయి. అంతేకాకుండా నాసికా కుహరము ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంతకు ముందు కంటే తేమగా తయారవుతుంది. గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణవ్యవస్థలు రెండింటికీ సంబంధించిన గ్రసనిభాగంలో కొనసాగుతాయి. ఇదే ప్రక్రియ వాయుగోణుల వరకు కొనసాగుతుంది.

ప్రశ్న 24.
రక్తంలోని హిమోగ్లోబిన్ ఏయే పనులు నిర్వర్తిస్తుంది? రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవుల్లో శ్వాసక్రియలో రక్తం పాత్ర ఏమిటి?
జవాబు:
హిమోగ్లోబిన్ నిర్వహించే విధులు : ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణజాలములకు హిమోగ్లోబిన్ రక్తాన్ని తీసుకొని వెళుతుంది. ఇది కార్బన్ డై ఆక్సైడు కణజాలముల నుండి ఊపిరితిత్తులకు మోసుకువస్తుంది. కణాలకు నైట్రిక్ఆక్సెడ్ను కూడా రవాణా చేస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవులలో రక్తం కేవలం జీర్ణమైన ఆహార పదార్థములను కణజాలములకు సరఫరా చేయును. మరియు కణాలలో శ్వాసక్రియవలన తయారయిన వ్యర్థ పదార్థములను విసర్జన వ్యవస్థకు సరఫరా చేయును.

ప్రశ్న 25.
క్రింది పట్టికను చూడండి. దీని నుండి మీరేమి గ్రహించారో రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 24
జవాబు:
ఈ పట్టిక ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో గాలిలో ఉండే వాయువుల శాతాన్ని తెలుపుతుంది. ఉచ్ఛ్వాసంలో 21 శాతం ఉన్న ఆక్సిజన్ నిశ్వాసంలో 16 శాతానికి తగ్గుతుంది. దీనికి కారణం ఆక్సిజన్ కణ శ్వాసక్రియలో వినియోగించబడుతుంది. కార్బన్ డయాక్సెడ్ ఉచ్ఛ్వాసంలో 0.03 శాతం ఉంటుంది. నిశ్వాసంలో అది 4 శాతానికి పెరగడానికి కారణం కణశ్వాసక్రియ వలన కార్బన్ డయాక్సెడ్ ఉత్పత్తి కావడమే. నైట్రోజన్ యొక్క శాతం ఉచ్ఛ్వాసంలోను నిశ్వాసంలోను ఒకే విధంగా (78%) ఉండుటకు కారణము దానికి శ్వాసక్రియలో పాత్ర లేకపోవడము.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు జరిపే శ్వాసక్రియ గురించి వ్రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 6

  1. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి.
  2. మొక్కల వేర్లలో ఉండే మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి.
  3. ఇవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి.
  4. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలంలో పైకి చొచ్చుకుని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 2.
శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించే ప్రయోగాన్ని మీ పాఠశాలలో నిర్వహించిన విధానాన్ని రాయండి. ఇదే ప్రయోగం పొడి విత్తనాలతో చేస్తే ఫలితం ఎలా ఉండవచ్చు?
లేదా
ప్రయోగశాలలో శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించుటకు మీరు నిర్వహించిన ప్రయోగం యొక్క విధానం మరియు తీసుకొనిన జాగ్రత్తలు వివరించండి.
జవాబు:
పరికరాలు :
మొలకెత్తిన గింజలు, ధర్మాస్ ప్లాస్కు, థర్మామీటరు, బిరడా.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7

ప్రయోగ విధానం :

  1. మొలకెత్తిన గింజలను ఒక ధర్మాస్ ప్లాస్కులో తీసుకోవాలి.
  2. బిరడాను తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటరును అమర్చాలి. థర్మామీటరు. నొక్కు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
  3. థర్మాస్ ప్లాను బిరడాతో బిగుతుగా బిగించాలి.
  4. ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయాలి.
  5. మంచి ఫలితాల కొరకు 24 గంటలు పరిశీలించాలి.

పరిశీలన :
ప్రతి రెండు గంటలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించింది.

పరికల్పన :
ఈ ప్రయోగం పొడి విత్తనాలలో నిర్వహిస్తే ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

జాగ్రత్తలు :

  1. థర్మామీటరు బల్బు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
  2. ప్లాస్కులోనికి గాలి చొరబడకుండా చూడాలి.

ప్రశ్న 3.
A) క్రింది పటమును పరిశీలించి, ఈ ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 8
1) పై పటం దేనిని సూచించును?
జవాబు:
అవాయు శ్వాసక్రియ, లేదా అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ నిర్ధారణ పరీక్ష.

2) పై ప్రయోగంలో వేడి చేసి, చల్లార్చిన గ్లూకోజ్ పై పారాఫిన్ ద్రవాన్ని పొరగా ఎందుకు పోస్తారు?
జవాబు:
ప్రయోగంలో బయటి నుండి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా నిరోధించవచ్చు.

3) గ్లూకోజు ఎందుకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు? కలిపిన తరువాత ఏ మార్పును గమనించావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకొనుటకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు. కలిపిన తరువాత నీలిరంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబి రంగులో మారటం గమనిస్తాము.

4) ఈ ప్రయోగంలో సున్నపు నీరును ఎందుకు ఉపయోగించారు?
జవాబు:
సున్నపు నీరు ఉపయోగించడం వలన అవాయు శ్వాసక్రియలో వెలువడిన CO2 ను నిర్ధారించవచ్చు. (CO2 సున్నపుతేటను ఆ పాలవలె మారుస్తుంది.)

5) థర్మామీటర్ యొక్క బల్బ్ గ్లూకోజ్ నీటిలో ఎందుకు మునిగి ఉండాలి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో వెలువడే ఉష్ణోగ్రతలను థర్మామీటరు ద్వారా నమోదుచేసి నిర్ధారించటానికి.

B) తరగతి గదిలో అవాయు శ్వాసక్రియ ప్రయోగం నిర్వహించావు కదా ! కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము.
a) ఈ ప్రయోగం నిర్వహించడం ద్వారా నీవు ఏ ఏ విషయాలు నిరూపించగలవు?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం మరియు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అగునని నిరూపించగలను.

b) ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని నీవు ఎందుకు వేడిచేశావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను తొలగించడానికి.

c) వేడిచేసిన తర్వాత గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేదు అని ఎలా నిర్ధారించుకుంటావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణానికి డయజిన్ గ్రీన్ (లేదా జానస్ గ్రీన్ బి) ద్రావణాన్ని కలిపినపుడు ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటే గులాబీ రంగులోకి మారుతుంది.

d) సున్నపుతేటలో నీవు గమనించిన మార్పులు ఏమి? ఎందుకు?
జవాబు:
ఈ ప్రయోగంలో ఉత్పత్తి అయిన కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు తేటను పాలవలె తెల్లగా మారుస్తుంది.

ప్రశ్న 4.
మానవునిలో వాయు ప్రసార మార్గపు క్రమాన్ని ప్లో చార్టు ద్వారా వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 9
నాసికా రంధ్రాల ద్వారా వాయువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరంలో గాలిలోని దుమ్ము, ధూళికణాలు తొలగించబడతాయి. గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. ఉప జిహ్విక అనే కండరపు కవాటం ఆహారపు, వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల లోనికి సరిగ్గా ప్రవేశించునట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్ళే నిర్మాణం. వాయునాళం ఉరః కుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క ఊపిరితిత్తిలోకి చేరుతుంది. శ్వాసనాళాలు అనేకసార్లు చీలుతూపోయి చివరకు శ్వాసనాళికలుగా అంతమవుతాయి. శ్వాసనాళికలు వాయుగోణులలో అంతమవుతాయి. రక్త కేశనాళికలు వాయుకోశగోణుల గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు వినిమయం జరుగుతుంది. రక్తం ఆక్సిజన్ ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది.

ప్రశ్న 5.
A) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
B) థర్మామీటర్ రీడింగ్ లో ఏ విధమైన మార్పు ఉంటుంది?
(లేదా)
ఈ ప్రయోగం నిర్వహించేటపుడు థర్మామీటరులో మార్పును గమనించారా?
C) ఈ ఉష్ణం ఎక్కడి నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
D) ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి?
E) ఈ ప్రయోగాన్ని పొడి విత్తనాలతో నిర్వహిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?
F) ఈ ప్రయోగంలో నీవు ఉపయోగించిన పరికరములు ఏవి?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
జవాబు:
A) శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించడం.
B) థర్మామీటరులో రీడింగ్ పెరుగుతుంది.
C) మొలకెత్తుతున్న విత్తనాలు శ్వాసించడం వలన కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడింది. (లేదా) మొలకెత్తుతున్న విత్తనాల నుండి ఉష్ణం వెలువడింది.
D) థర్మామీటరు యొక్క బల్బు విత్తనాల మధ్యలో ఉండేలా జాగ్రత్తపడాలి.
E) థర్మామీటరులోని ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు.
F) గాజు జాడీ, మొలకెత్తిన విత్తనాలు, రబ్బరు బిరడా, థర్మామీటరు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
“శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది” అని నిరూపించుటకు మీ పాఠశాల ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు కదా ! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరాల జాబితా రాయండి.
జవాబు:
పరికరాలు :
1. మొలకెత్తు విత్తనాలు / మొలకలు, 2. ప్లాస్టిక్ బాటిల్, 3. చిన్న బీకరు, 4. సున్నపుతేట

ii) ఈ ప్రయోగాన్ని నిర్వహించు విధానము వివరించండి.
జవాబు:
ప్రయోగ విధానము :

  1. వెడల్పాటి మూత కలిగిన ప్లాస్టిక్ బాటిల్ నందు మొలకెత్తు విత్తనాలను తీసుకోవాలి.
  2. ఒక చిన్న బీకర్ నందు మూడు వంతుల వరకు సున్నపుతేట తీసుకోవాలి.
  3. ఈ బీకర్‌ను బాటిల్ నందు ఉంచాలి.
  4. బాటిల్ ను మూతతో గాలి జొరబడకుండా గట్టిగా బిగించాలి.
  5. ఇలాంటి అమరికనే మరొకదానిని పొడి విత్తనాలతో తయారుచేసుకోవాలి.
  6. ఈ అమరికలను ఒకటి నుండి రెండు రోజులు కదపకుండా ఉంచాలి.

ప్రశ్న 7.
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించడానికి అనుసరించవలసిన ప్రయోగ విధానం రాయండి. దాని పటం గీయండి.
(లేదా)
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని అర్థము చేసుకొనుటకు నీవు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగ విధానమును తెలుపుము.
జవాబు:
ఉద్దేశం : శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట.

పరికరాలు :
వెడల్పు మూతిగల రెండు గాజు సీసాలు, మొలకెత్తుతున్న శనగగింజలు, పొడి శనగగింజలు, సున్నపునీరు ఉన్న బీకర్లు.

ప్రయోగ విధానం :
1) వెడల్పు మూతిగల రెండు గాజుసీసాలు తీసుకోవాలి. ఒకదానిలో మొలకెత్తుతున్న శనగగింజలు ఉంచాలి. రెండవ దానిలో పొడి శనగగింజలు ఉంచవలెను.

2) రెండు గాజుసీసాలలో సున్నపుతేటతో నింపిన బీకర్లు ఉంచాలి. తరువాత రెండు సీసాల రబ్బరు బిరడాలను గట్టిగా బిగించాలి.

3) సీసామూతి చుట్టూ గాలి చొరబడకుండా వేజిలైన్ పూయవలెను. సీసాలను కదపకుండా రెండు రోజులు ఉంచవలెను.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
పరిశీలన :
4) ఒకటి రెండు రోజులు గమనించినట్లయితే మొలకెత్తుతున్న థి తనలు ఎం సి ఏరులో ఉన్న సున్నపు టు ఎక్కువగా తెల్లటి పాలవలె మారుతుంది.

5) దీనికి కారణము మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరపడం వల్ల వెలువడిన కార్బన్ డై ఆక్సైడ్ వల్లనే సున్నపు తేట పాల వలె మారిందని చెప్పవచ్చు.

6) పొడిగింజలు గల సీసాలోని సున్నపు తేట తెల్లగా పాలవలె అంతగా మారదు.

విడుదల ఫలితం :
7) కనుక శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించడమైనది.

ప్రశ్న 8.
క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
i) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉంది?
ii) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
iii) లాక్టిక్ ఆమ్ల గాఢత 25 నిముషాల తర్వాత ఎంత ఉంది?
iv) లాక్టిక్ ఆమ్ల గాఢతకు, కండరాల నొప్పికి మధ్య గల సంబంధమేమిటి?
జవాబు:
1) 20 మి.గ్రా / ఘ. సెం.మీ.
2) “B” స్థానం (లేదా) 20 నిమిషాలు దగ్గర
3) 101 మి.గ్రా / ఘ. సెం.మీ.
4) లాక్టిక్ ఆమ్లం గాఢత పెరిగితే కండరాల నొప్పి కూడా పెరుగుతుంది.

ప్రశ్న 9.
కింద ఇచ్చిన పరికరాల అమరికను గమనించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 11
i) ఈ ప్రయోగం ద్వారా ఏ ప్రక్రియ గురించి తెలుసుకుంటాం?
జవాబు:
ఈ ప్రయోగం ద్వారా దహన ప్రక్రియ గురించి తెలుసుకుంటాం.

ii) ఈ ప్రక్రియ శ్వాసక్రియతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
శ్వాసక్రియ నీటి సమక్షంలో జరుగుతుంది. దహన ప్రక్రియ నీరు లేనప్పుడు జరుగును.

iii) ఈ ప్రయోగంకు శ్వాసక్రియతో ఉన్న పోలికలు ఏవి?
జవాబు:
ఈ రెండు ప్రక్రియలలో శక్తి విడుదల అగును.

iv) ఏ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది.

ప్రశ్న 10.
కింది అంశాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 12
పై అంశాల ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) గ్లూకోజ్ ఎన్ని పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది?
ii) పైరువిక్ ఆమ్లం వాయుసహిత లేదా అవాయు శ్వాసక్రియలలో పాల్గొనడం దేనిపై ఆధారపడి ఉంటుంది?
iii) వాయుసహిత, అవాయు శ్వాసక్రియలు రెండింటిలో దేంట్లో ఎక్కువ శక్తి విడుదలవుతుంది?
iv) మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడే రసాయన పదార్ధమేది?
జవాబు:
i) 2 పైరువిక్ ఆమ్ల అణువులు
ii) ఆక్సిజన్ లభ్యత
iii) వాయుసహిత శ్వాసక్రియ
iv) లాక్టిక్ ఆమ్లము

ప్రశ్న 11.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) ప్రక్క పటం దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
మైటోకాండ్రియా

b) పటంలో చూపిన ‘X’ భాగాన్ని గుర్తించండి.
జవాబు:
మాత్రిక

c) ప్రక్కన చూపిన పటము యొక్క విధులను తెల్పండి.
జవాబు:
కణ శ్వాసక్రియలో పాల్గొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

d) ప్రక్కన చూపిన పటము ఏ వ్యవస్థకు సంబంధించినది?
జవాబు:
శ్వాసవ్యవస్థకు సంబంధించినది.

ప్రశ్న 12.
మనం విడిచేగాలిలో CO2 ఉంటుందని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4
ఉద్దేశం :
మనం విడిచే గాలిలో CO2 ఉంటుందని నిరూపించుట.

పరికరాలు :
రెండు పరీక్షనాళికలు, సున్నపుతేట, గాజునాళాలు, సిరంజి

విధానం :
రెండు పరీక్షనాళికలు తీసుకొని ఒకదానిలో సున్నపుతేట, మరొక దానిలో నీటిని తీసుకోవాలి. రెండింటిలోనికి గాజు నాళాలు అమర్చి గాలి ఊదాలి.

పరిశీలన :
గాలి ఊదినపుడు పరీక్షనాళికలోని సున్నపుతేట తెల్లగా పాలవలె మారింది.

నిర్ధారణ :
మరొక సున్నపుతేట ఉన్న పరీక్షనాళికలోనికి సిరంజి ద్వారా గాలి ఊదినపుడు అది రంగు మారలేదు. అంటే మనం విడిచే గాలిలో ఉన్న వాయువు సున్నపుతేటను పాలవలె మార్చింది. సున్నపునీటిని పాలవలె మార్చే వాయువు CO2.

నిరూపణ :
మనం విడిచే గాలిలో CO2 ఉండి సున్నపుతేటను పాలవలె మార్చుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 13.
వాయుగోణులలో జరిగే వాయుమార్పిడి గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 14

  1. ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోణుల నుండి రక్తకేశనాళిలోనికి, రక్తకేశనాళికల నుండి వాయుగోణులలోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్, ‘వాయుగోణులలోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతాయన్నమాట.
  2. అతిసూక్ష్మమైన వాయుగోణులు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే రక్త కేశనాళికలు ఉంటాయి.
  3. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్త కేశ నాళికలలోనికి ప్రవహించి, వాయుగోణుల నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది.
  4. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ రక్త కేశనాళికల నుండి వాయుగోణులలోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మనం నిశ్వాసించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళుతుంది.
  5. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెకు చేరి, అక్కడ నుండి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది.

ప్రశ్న 14.
శరీరంలో జరిగే వాయువుల రవాణా విధానాన్ని వివరించండి.
జవాబు:
వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు (సుమారు 21%) మొత్తం రక్తంలోని ఎర్రరక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్తో సంతృప్తం చెంది, రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికీ ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే క్లోరోఫిల్ లో మెగ్నీషియం అణువు ఉంటుంది. హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము (Fe) అణువు ఉంటుంది.

ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఈ రక్తం కణజాలాలకు చేరినపుడు ఆక్సిజన్
హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాలలోనికి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బై కార్బొనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్ తో కలుస్తుంది. మరికొంత ప్లాస్మాలో కరుగుతుంది.
Hb + O2 → HbO2 (ఊపిరితిత్తులలో)
HbO2 → Hb + O2 (కణజాలాలలో)

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 15.
పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళతారు. ఎందుకు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 15
సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ ( ణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్రమట్టానికి 13 కిలోమీటర్లపైన (8 మైళ్ళు) ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. అందువలన పర్వాతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లు తీసుకెళతారు.

ప్రశ్న 16.
శ్వాసక్రియ దశలను ఫ్లోచార్టు రూపంలో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 16

ప్రశ్న 17.
మైటోకాండ్రియా నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18

  1. మైటోకాండ్రియాలు పొడవుగా, దండాకారముగా మరికొన్ని గోళాకారంలో లేక టెన్నిస్ రాకెట్ ఆకారంలో ఉంటాయి.
  2. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో మాత్రిక ఉండును.
  3. మాత్రిక చుట్టూ మైటోకాండ్రియా లోపలి త్వచము కప్పబడి యుండును.
  4. దీని లోపలి త్వచం ముడతలుపడి ఉంటుంది. వీటిని క్రిస్టే అంటారు. ఇవి మాత్రికలో వ్యాపించి ఉంటాయి.
  5. ముడతల మధ్య ఉండే స్థలం మైటోకాండ్రియా వెలుపలి భాగంతో కలిసి ఉంటుంది.
  6. మాత్రికలలోకి చొచ్చుకుంటూ, లోపలి త్వచం నుండి ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక రేణువులుంటాయి. ఈ రేణువులకు గోళాకారపు అగ్రభాగం, వృంతం ఉంటాయి. వాటి వృంతాలు లోపలి త్వచానికి చేర్చబడి అగ్రభాగం మాత్రికలోకి ఉంటాయి.
  7. మైటోకాండ్రియా వెలుపలి భాగం బాహ్యత్వచంతో కప్పబడి ఉంటుంది. ఇది ముడతలు లేకుండా నునుపుగా ఉంటుంది.
  8. మైటోకాండ్రియాలో. శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైములు ఉండును.
  9. మైటోకాండ్రియాలో శక్తి ATP రూపంలో నిలువచేయబడి ఉండుట వల్ల వీనిని శక్తి ఉత్పాదక కేంద్రములందురు.

ప్రశ్న 18.
గ్రాఫ్ ను పరిశీలించండి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా పేరుకుంటున్నదో పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాల్వివండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
నిరంతర వ్యాయామం రక్తంలోని లాక్టికామ్లం గాఢతను ప్రభావితం చేసే అంశాన్ని చూపే గ్రాఫ్
అ) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉన్నది?
జవాబు:
ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత 20మి.గ్రా/ఘ. సెం.మీ ఉంది.

ఆ) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
జవాబు:
9 నిమిషాలకు లాక్టిక్ ఆమ్లం గాఢత అత్యధిక స్థాయికి చేరింది.

ఇ) C మరియు D స్థానముల మధ్య లాక్టిక్ ఆమ్ల గాఢత ఒకే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయి చేరడానికి ఎంత సమయం పట్టవచ్చు?
జవాబు:
లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయికి చేరటానికి 100 నిమిషాలు పడుతుంది. అంటే గంటా నలభై నిమిషాలు.

ప్రశ్న 19.
చేపలో జరిగే శ్వాసక్రియను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 19

  1. చేప నోటిని తెరచి ఆస్యకుహరం నేల భాగాన్ని కిందకు దించుతుంది.
  2. దీనివల్ల ఆక్సిజన్ కరిగి ఉన్న బయటి నీరు ఆస్యకుహరంలోకి తీసుకోబడుతుంది.
  3. ఇపుడు నోటిని మూసి ఆస్యకుహరం నేలను పైకి నెట్టుతుంది.
  4. నీరు ఆస్యకుహరం నుండి గ్రసనిలోనికి నెట్టబడుతుంది.
  5. గ్రసని నుండి అంతర జలశ్వాసరంధ్రాల ద్వారా చేపలో జరిగే శ్వాసక్రియ మొప్ప కోష్టాలలోకి చేరి మొప్ప పటలికలను తడుపుతుంది.
  6. నీటిలోని ఆక్సిజన్ మొప్ప పటలికల్లోని రక్తాన్ని చేరుతుంది.
  7. రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ నీటిలోకి చేరుతుంది. నీరు బాహ్య జల శ్వాసరంధ్రాల ద్వారా బయటకుపోతుంది.
  8. ఈ విధంగా చేపలో మొప్పల ద్వారా జరుగు శ్వాసక్రియను జలశ్వాసక్రియ అంటారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
మొక్కలలో జరిగే వాయు రవాణాను వివరించండి.
జవాబు:

  1. పత్రరంధ్రాలు, లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి. కణాలలో ఉండే ఖాళీలు (గాలి గదులు) వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి.
  2. ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగానూ ఉంటాయి. ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి.
  3. పత్రరంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటిపొరలో కరుగుతుంది. కణకవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది. కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది.
  4. దీనితోపాటు నీరు, కార్బన్ డై ఆక్సైడ్ కూడా వెలువడతాయి. ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది. ఏర్పడిన కార్బన్ డై ఆక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది.
  5. ఈ చర్య వ్యాపన పద్దతిలో జరుగుతుంది. కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు, గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది.
  6. అదే సమయంలో గాలి గదులలో పత్రరంధ్రాలు, లెంటిసెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది.
  7. అందువల్ల వెలుపలి గాలి పత్రరంధ్రాలగుండా లోపలికి ప్రవేశిస్తుంది.
  8. అదే విధంగా కార్బన్ డై ఆక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల పై చర్యకు వ్యతిరేక దిశలో వెలుపలికి వస్తుంది.

ప్రశ్న 21.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
a) పటంలో చూపబడిన భాగము పేరు ఏమిటి?
b) ఈ భాగము ఏ అవయవంలో ఉంటుంది?
c) ఈ భాగము నిర్వహించు క్రియ ఏమిటి?
d) వాయుమార్పిడిలో ఇమిడి ఉన్న సూత్రము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన భాగము వాయుగోణి.
b) వాయుగోణులు ఊపిరితిత్తులలో ఉంటాయి.
c) వాయుగోణులలో వాయుమార్పిడి జరుగుతుంది.
d) వాయుమార్పిడి వినిమయం లేదా విసరణ సూత్రం ఆధారంగా జరుగుతుంది.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) పటంలో చూపబడిన కణాంగము ఏమిటి?
b) ఈ కణాంగము ఏ క్రియను నిర్వహిస్తుంది?
c) క్రిస్టే అనగానేమి?
d) ఈ కణాంగానికి గల మరొక పేరు ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన కణాంగము మైటోకాండ్రియా.
b) కణాంగము శ్వాసక్రియను నిర్వహిస్తుంది.
c) మైటోకాండ్రియా లోపలి త్వచం ముడుతలను క్రిస్టే అంటారు.
d) మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని పిలుస్తారు.

ప్రశ్న 23.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 20
a) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో వాడిన పరికరాలు తెలపండి.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం నీవు గమనించే మార్పు ఏమిటి?
d) శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించటానికి నీవు ఏ మార్పులు చేస్తావు?
జవాబు:
a) శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
b) ప్రయోగంలో గాజుసీసా, మొలకెత్తిన గింజలు, సున్నపునీటి బీకరు, సీసా మూత ఉపయోగించారు.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం బీకరులోని సున్నపునీరు తెల్లగా మారటం గమనించాను.
d) సీసా మూత ద్వారా థర్మామీటరును శనగగింజల మధ్య అమర్చి, శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించవచ్చు.

ప్రశ్న 24.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 21
a) ఈ ప్రయోగంలో మండించిన పదార్థం ఏమిటి?
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము ఏమిటి?
c) ఈ ప్రయోగం ద్వారా ఏ క్రియను నిరూపిస్తావు?
d) ప్రయోగం ద్వారా నిరూపించబడిన భౌతికక్రియ ఏ జీవక్రియను పోలి ఉంటుంది?
జవాబు:
a) ప్రయోగంలో మండించిన పదార్థం – గ్లూకోజ్
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము – సున్నపునీరు
c) ఈ ప్రయోగం ద్వారా దహనక్రియను నిరూపిస్తారు.
d) దహనము అనే భౌతికచర్య, శ్వాసక్రియ అనే జీవక్రియను పోలి ఉంటుంది.

ప్రశ్న 25.
మానవుని శ్వాసవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి. మానవ ఊపిరితిత్తులు దేనితో నిర్మితమౌతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 22
మానవ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం వాయుగోణులు.

ప్రశ్న 26.
ఊపిరితిత్తులు మరియు రక్తకేశ నాళికల మధ్య జరిగే వాయు మార్పిడిని చూపు పటం గీయండి. ఏ పద్దతిలో ఈ వాయు మార్పిడి జరుగుతుందో తెలపండి.
జవాబు:

ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే ప్రక్రియను వినిమయం లేదా వ్యాపనం అంటారు.

ప్రశ్న 27.
శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం యొక్క పటం గీచి, భాగాలు గుర్తించండి. దీనిలో క్రిస్టే ఎలా రూపొందుతుంది?
(లేదా)
కణశక్యాగారముగా పిలువబడే కణాంగం పటం గీచి, భాగాలు గుర్తించండి. క్రిస్టే అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18
మైటోకాండ్రియా మైటోకాండ్రియా లోపలి త్వచం ముడతలను క్రిస్టే అంటారు. దీనిమీద ప్రాథమిక రేణువులు ఉంటాయి.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్పులు

1.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 25
జవాబు:
ఊపిరితిత్తులలో వాయుమార్పిడి

2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 26
జవాబు:
మైటోకాండ్రియా

3.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 27
జవాబు:
కిణ్వనం

4.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 28
జవాబు:
నాసికా కుహరాలు

5.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 29
జవాబు:
వాయునాళం

6.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 30
జవాబు:
ఇథైల్ ఆల్కహాల్

7.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 31
జవాబు:
చర్మ శ్వాసక్రియ

8.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 32
జవాబు:
వాయునాళం

9.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 33
జవాబు:
గ్రసని

10.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 34
జవాబు:
లెంటిసెల్స్

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. నాసిక – స్వరపేటిక – గ్రసని – వాయునాళం
B. నాసిక – గ్రసని – స్వరపేటిక – వాయునాళం
జవాబు:
సమూహం B

12. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. వాయునాళం – శ్వాసనాళం – శ్వాసనాళికలు – వాయుగోణులు
B. వాయునాళం – శ్వాసనాళికలు – శ్వాసనాళం – వాయుగోణులు
జవాబు:
సమూహం A

13. ఏ గ్రూపు సంఘటనలు నిశ్వాసక్రియకు సంబంధించినవి?
A. డయాఫ్రమ్ సంకోచించడం – ఉరఃకుహరం పరిమాణం పెరగడం – అంతర్గత పీడనం తగ్గడం – గాలి ఊపిరితిత్తుల్లోకి చేరడం
B. డయాఫ్రమ్ యథాస్థితికి చేరడం – ఉరఃకుహరం పరిమాణం తగ్గడం – అంతర్గత పీడనం పెరగడం – ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళడం
జవాబు:
సమూహం A

14. “కణజాలాలలో వాయు మార్పిడి” దశకు సంబంధించి ఈ క్రింది ఏ గ్రూపు ఘటనలున్నాయి?
A. వాయుగోణులలో O2 – వ్యాపనం – O2 రక్త కేశనాళికలోకి చేరడం
B. రక్త కేశనాళికలలోని O2 – వ్యాపనం – O2 కణంలోకి చేరడం
జవాబు:
సమూహం B

15. ఊపిరితిత్తుల నుండి రక్తానికి చేరడం క్రింది ఏ చర్యను సూచిస్తుంది?
A. Hb + O2 → HbO2
B. HbO2 → Hb + O2
జవాబు:
చర్య A

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

16. వాయురహిత శ్వాసక్రియతో సంబంధం లేని దశలు ఏవి?
A. గైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా
B. గైకాలసిస్, ఎలక్ట్రాన్ రవాణా, కిణ్వనం
జవాబు:
సమూహం A

17. ఏ గ్రూపు సమ్మేళనాలు వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడతాయి?
A. పైరువిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్
B. పైరువిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, నీరు
జవాబు:
సమూహం B

18. ఏ సమీకరణం వాయుసహిత శ్వాసక్రియకు సంబంధించినది?
A. C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Call
B. C6H12O6 → 2C2H5OH + 2 CO2 + 56 K.Call
జవాబు:
సమూహం B

19. ఏ సమూహంలోని జీవులు జల శ్వాసక్రియకు ఉదాహరణలు?
A. చేప, పీత, టాడ్ పోల్
B. వానపాము, కీటకం, పక్షి
జవాబు:
సమూహం A

20. ఏ భేదమును తప్పుగా పేర్కొన్నారు?

కిరణజన్య సంయోగక్రియశ్వాసక్రియ
1. ఇది అనబాలిక్ ప్రక్రియ.1. ఇది కాటబాలిక్ ప్రక్రియ.
2. O2 ఉపయోగించబడుతుంది మరియు CO2 విడుదల అవుతుంది.2. CO2 వినియోగించబడుతుంది మరియు O2 విడుదల అవుతుంది.

జవాబు:
2వ భేదం

ఉదాహరణలు ఇవ్వండి

21. మొక్కలలో శ్వాసక్రియ పత్రరంధ్రాల ద్వారా జరుగును. మొక్కలలో శ్వాసక్రియ జరిగే మరో భాగానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెంటిసెల్స్

22. మాంగ్రూవ్ మొక్క శ్వాసక్రియ కొరకు శ్వాసించే వేర్లను కలిగి ఉంటుంది. శ్వాసించడానికి ప్రత్యేకమైన కణజాలం ఉండే మొక్కలకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కిడ్

23. గ్లూకోజ్ శ్వాసక్రియ ఆధారానికి ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఫ్యాటీ ఆమ్లాలు

24. కేంద్రకపూర్వ కణాలలో కణశ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో కణద్రవ్యంతోపాటు కణ శ్వాసక్రియలో పాల్గొనే మరొక భాగాన్ని పేర్కొనండి.
జవాబు:
మైటోకాండ్రియా

25. బాక్టీరియాలో లాక్టిక్ ఆమ్లం అనేది వాయురహిత శ్వాసక్రియ యొక్క తుది ఉత్పత్తి. మన శరీరంలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడే భాగానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కండరాలు

26. కిణ్వన ప్రక్రియలో ఇథనాల్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో మరో ఉత్పత్తి ఏమిటి?
జవాబు:
CO2

27. కిణ్వ ప్రక్రియను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించే మరో సందర్భానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
దోస పిండి, ఇడ్లీ పిండి తయారీలో

28. ‘గ్లూకోజ్ ద్రావణం మరియు బైకార్బోనేట్ ద్రావణం అనేవి వాయురహిత శ్వాసక్రియ జరిపే ప్రయోగాల్లో ఉపయోగించే రసాయనాలు. ఈ ప్రయోగంలో ఉపయోగించే రసాయనానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లిక్విడ్ పారాఫిన్

29. అమీబా వంటి ఏకకణ జీవులు వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరిగే బహుకణ జీవికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
హైడ్రా

30. చర్మ శ్వాసక్రియ జరిపే జీవికి ఉదాహరణ వానపాము. చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించగల జీవికి ఉదాహరణను ఇవ్వండి:
జవాబు:
కప్ప

శాస్త్రవేత్తను గుర్తించండి

31. ఆక్సిజన్ మరియు ఇతర వాయువులను కనుగొన్నాడు.
జవాబు:
జోసెఫ్ ప్రీస్ట్లీ

32. మనం పీల్చేగాలి మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటూ వస్తువులను మండించడానికి సహాయపడుతుంది. గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు 1/6 వ వంతు పరిమాణంలో ఉంటుందని తన ప్రయోగాల ద్వారా గుర్తించాడు.
జవాబు:
లావోయిజర్

33. జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైన వాటిలో నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి.
జవాబు:
జాన్ డాపర్

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

34. “శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ. దీని వలననే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది” అని పేర్కొన్నాడు.
జవాబు:
రాబిన్సన్

35. యోగాభ్యాస అనే శాస్త్రీయ శ్వాస పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఎనిమిది విభాగాలలో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు.
జవాబు:
మహర్షి పతంజలి

నేను ఎవరు?

36. నేను వాతావరణములో ఉన్నటువంటి వాయువు మరియు నన్ను స్థిర గాలి అని పిలిచేవారు. నేను సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చుతాను.
జవాబు:
CO2

37. నాసికా కుహరం నుండి నోటి కుహరాన్ని వేరు చేసే ఒక అస్తి పలక
జవాబు:
అంగిలి

38. C ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాల ద్వారా ఆవరించబడి ఉంటాను. నన్ను గాలిగొట్టం అని కూడా పిలుస్తారు.
జవాబు:
వాయునాళం

39. నన్ను ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా పిలుస్తారు.
జవాబు:
వాయుగోణులు

40. బాక్టీరియా మరియు ఈస్ట్ లో కనపడే వాయురహిత శ్వాసక్రియ నేను.
జవాబు:
కిణ్వనం

41. కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగాన్ని నేను మరియు నన్ను కణ శక్త్యాగారము అని కూడా పిలుస్తారు.
జవాబు:
మైటోకాండ్రియా

42. నేనొక భౌతిక, అనియంత్రిత ప్రక్రియ. ఈ ప్రక్రియలో పదార్థాన్ని మండించడం కొరకు ఉష్ణాన్ని బయటి నుండి అందించడం జరుగుతుంది.
జవాబు:
దహనం

43. నేనొక జీవిని. శ్వాసకోశ వాయువుల రవాణాకు తోడ్పడే శ్వాసవర్ణకం నాలో లేదు. తద్వారా వాయునాళాల ద్వారా గాలి నేరుగా కణజాలానికి చేరుకుంటుంది.
జవాబు:
బొద్దింక

44. నేనొక ఉభయచర జీవిని. నేను చర్మం, ఊపిరితిత్తులు మరియు ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసిస్తాను.
జవాబు:
కప్ప

జతపరచుట

45. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఆకులు – లెంటిసెల్స్
కాండం – పత్రరంధ్రము
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్
జవాబు:
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్

46. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l
నిశ్వాస వాయువులోని CO2 – 0.03%
ఉచ్ఛ్వాస వాయువులోని O2 – 16%
జవాబు:
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l

47. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బాక్టీరియా – కిణ్వనం
కండరాలు – వాయురహిత శ్వాసక్రియ
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ
జవాబు:
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ

48. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
ATP – ఎనర్జీ కరెన్సీ
మైటోకాండ్రియా – కణ శక్త్యాగారము
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం
జవాబు:
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం

49. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
కండరాలు – లాక్టిక్ ఆమ్లం
బాక్టీరియా – ఇథైల్ ఆల్కహాల్
ఈస్ట్ – CO2 + లాక్టిక్ ఆమ్లం
జవాబు:
కండరాలు – లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

50. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు
జల శ్వాసక్రియ – వాయునాళం
చర్మ శ్వాసక్రియ – మొప్పలు
జవాబు:
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు

51. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
పక్షులు – పుపుస శ్వాసక్రియ
టాడ్ పోల్ – జల శ్వాసక్రియ
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ
జవాబు:
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ

52. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బొద్దింక – వాయునాళం
వానపాము – చర్మం
బల్లి – మొప్పలు
జవాబు:
బల్లి – మొప్పలు

53. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
స్థిరమైన గాలి – CO2
బొగ్గుపులుసు వాయువు – H2
ఖర్చయ్యే వాయువు – O2
జవాబు:
బొగ్గుపులుసు వాయువు – H2

54. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
స్వరపేటిక – శబ్దపేటిక
వాయునాళం – ఆహార గొట్టం
ఆహారవాహిక – గాలిగొట్టం
జవాబు:
స్వర పేటిక – శబ్ద పేటిక

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి.

55. ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు క్షయకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.

56. కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన గ్రసని అనే పోలికను గుర్తించుట భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటిక ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
జవాబు:
కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజిహ్విక అనే భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటికలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

57. వాయునాళంలో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
స్వరపేటిక లో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.

58. పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తుంది.
జవాబు:
పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తం తీసుకొస్తుంది.

59. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా కార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.

60. నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు హరితరేణువు కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.
జవాబు:
నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు మైటో కాండ్రియా కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.

61. మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని అవర్ణిక అంటారు.
జవాబు:
మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని మాత్రిక అంటారు.

62. ATP అణువులో శక్తి హైడ్రోజన్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.
జవాబు:
ATP అణువులో శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

63. కండరాలలో పైరువిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.
జవాబు:
కండరాలలో లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.

64. వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.

పోలికను గుర్తించుట

65. ఉచ్ఛ్వాస O2 : 21% :: నిశ్వాస O2😕
జవాబు:
16%

66. నిశ్వాస CO2: 44% :: ఉచ్ఛ్వాస CO2😕
జవాబు:
0.03%

67. ఉచ్చ్వాస O2 : 21% :: ? : 44%
జవాబు:
నిశ్వాస CO2

68. బ్యా క్టీరియా : లాక్టిక్ ఆమ్లం :: ? : ఇథైల్ ఆల్కహాల్
జవాబు:
ఈస్ట్

69. పీత : మొప్పలు :: ? : వాయునాళం
జవాబు:
కీటకాలు

70. కప్ప : చర్మం :: ? : టాడ్ పోల్
జవాబు:
మొప్పలు

71. CO2 : స్థిరమైన వాయువు :: ? : ఖర్చయ్యే వాయువు
జవాబు:
ఆక్సిజన్

72. గాలిగొట్టం : ? :: శబ్దపేటిక : స్వరపేటిక
జవాబు:
వాయునాళం

బొమ్మలపై ప్రశ్నలు

73.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 35
గాలిని బైటకి వదిలినప్పుడుఅద్దంపై ఉండే ఆవిరికి ఏ ప్రక్రియ కారణమవుతుంది?
జవాబు:
శ్వాసక్రియ

74.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 36
ఈ చిత్రంలోని పార్ట్ X ను గుర్తించండి.
జవాబు:
గ్రసని

75.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 37
వాయునాళాన్ని ముడుచుకుపోకుండా, మూసుకుపోకుండా నిరోధించే భాగాలు ఏవి?
జవాబు:
O ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాలు

76.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 38
ఊపిరితిత్తులకు గాయం కాకుండా కాపాడే త్వచపు నిర్మాణం ఏది?
జవాబు:
ఫ్లూరా

77.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 39
ఈ ప్రక్రియ శ్వాసక్రియలోని ఏ దశను తెలుపుతుంది?
జవాబు:
ఉచ్చ్వా సం

78.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 40
ఏ భౌతిక ప్రక్రియ వాయుగోణులు మరియు రక్త కేశనాళికల మధ్య వాయువుల మార్పిడిని అనుమతిస్తుంది?
జవాబు:
వ్యాపనం / విసరణ

79.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 41
ఈ ప్రయోగం నుండి విడుదలయ్యే ఏ వాయువు సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సెడ్

80.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 42
పటంలో చూపిన ఈ నిర్మాణాలు మొక్క యొక్క ఏ భాగంలో ఉంటాయి?
జవాబు:
కాండం

ఖాళీలను పూరించండి

81. శ్వాసక్రియ ప్రధాన లక్ష్యం …………
జవాబు:
శక్తి విడుదల

82. శ్వాసక్రియ నిర్వహించు కణాంగం ……….
జవాబు:
మైటోకాండ్రియా

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

83. ఆక్సిజన్ ప్రమేయం లేని శ్వాసక్రియ …….
జవాబు:
అవాయు శ్వాసక్రియ

84. శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ………….
జవాబు:
CO2, నీటిఆవిరి, ఉష్ణం మరియు శక్తి

85. కిణ్వనం అంత్య ఉత్పనము …………
జవాబు:
ఆల్కహాల్

86. అవాయు శ్వాసక్రియ జరుపు జీవులు ……….
జవాబు:
ఈస్ట్, బాక్టీరియా

87. సున్నపు తేటను పాల వలె మార్చు వాయువు. ………
జవాబు:
CO2

88. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక ప్రమాణం …………
జవాబు:
వాయుగోణులు

89. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే ప్రాంతం ………..
జవాబు:
వాయుగోణులు

90. ఊపిరితిత్తులను కప్పి ఉంచు పొర ……..
జవాబు:
ఫ్లూరా

91. శ్వాస కదలికలలో ప్రముఖ పాత్ర వహించునది ………
జవాబు:
ఉదర వితానం

92. కాండంపై శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణం ……….
జవాబు:
లెంటి సెల్స్

93. మడ అడవులలోని మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణాలు …..
జవాబు:
వాయుగత వేర్లు

94. జలచర జీవులలో శ్వాస అవయవాలు …………..
జవాబు:
మొప్పలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

95. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి …………..
జవాబు:
వానపాము, కప్ప

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అని దీనికి పేరు.
A) ADP
B) మైటోకాండ్రియా
C) ATP
D) క్లోరోప్లాస్టు
జవాబు:
C) ATP

2. అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి
A) డయాబీన్ గ్రీన్
B) పొటాషియం హైడ్రాక్సైడ్
C) బెటాడిన్
D) సల్ఫర్ తో ఉన్న కడ్డీ
జవాబు:
A) డయాబీన్ గ్రీన్

3. మనము విడిచే గాలిలోని అంశాలు ……..
A) కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఆక్సిజన్
B) ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి ఉపయోగించే ద్రావణం
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి
D) నీటి ఆవిరి మాత్రమే
జవాబు:
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి

4. భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమౌతుంది?
A) ప్రాణికోటికి O2 అందదు
B) ప్రాణికోటికి CO2 అందదు
C) ప్రాణికోటికి N2 అందదు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాణికోటికి O2 అందదు

5. మనము CO2 ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించటానికి ఉపయోగిస్తాం.
A) రంగులోని మార్పు
B) వాసనలోని మార్పు
C) స్థితిలోని మార్పు
D) ఆకారంలోని మార్పు
జవాబు:
A) రంగులోని మార్పు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

6. కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవడం, CO2 అణువు గ్లూకోజ్ గా సంశ్లేషించబడటం – ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? A) మైటోకాండ్రియా
B) రైబోజోములు
C) హరితరేణువు
D) లైసోజోములు
జవాబు:
C) హరితరేణువు

7. వంశీ నిర్వహించిన ప్రయోగంలో ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం ….
A) విత్తనాలు మొలకెత్తడం వల్ల CO2 విడుదలగును
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును
C) శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును
D) శ్వాసక్రియలో CO2 విడుదలగును
జవాబు:
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును

8. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత?
A) 44
B) 4.4
C) 0.4
D) 0.04
జవాబు:
B) 4.4

9. హీమోగ్లోబిను ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది?
A) O2
B) SO2
C) NO2
D) PO4
జవాబు:
A) O2

10. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం
A) శ్వా సనాళిక
B) వాయుగోణులు
C) క్రిస్టే
D) నెఫ్రాన్
జవాబు:
A) శ్వా సనాళిక

11. శ్వాసక్రియలోని వివిధ దశల సరయిన క్రమాన్ని గుర్తించండి.
A) ఉఛ్వాస నిశ్వాసాలు → రక్తం → ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ
C) ఉఛ్వాస నిశ్వాసాలు – ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ → రక్తం
D) ఊపిరితిత్తులు → కణజాలాలు → రక్తం → కణశ్వాసక్రియ
జవాబు:
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

12. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) స్వర పేటిక
B) గ్రసని
C) నాశికా కుహరం
D) వాయు నాళం
జవాబు:
A) స్వర పేటిక

మీకు తెలుసా?

→ ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

→ మన ఊపిరితిత్తులు (స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

→ మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

→ సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన (8 మైళ్ళు) ఆక్సీజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్దతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్‌ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గజ ఈతగాళ్ళ సమస్యలు వేరేవిధంగా ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

* మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పై రూబిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితోపాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్ గా కాని, లాక్టిక్ ఆమ్లంగా కాని మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే పదవ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 43

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

These AP 10th Biology Important Questions and Answers 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 1st Lesson Important Questions and Answers పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
డాక్టరు దగ్గర నుండి పౌష్టికాహార లోపం వలన కలుగు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కావలసిన పట్టికను వ్రాయండి.
జవాబు:

వ్యాధి పేరులక్షణాలుఏ పోషకాహార లోపం వల్ల కలుగుతుంది
1. క్యాషియార్కర్కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బుతాయి.ప్రోటీన్ లోపం
2. మెరాస్మస్నిస్సత్తువగా, బలహీనంగా ఉండటం; కీళ్ళవాపు, కండరాలలో పెరుగుదల లోపంప్రోటీన్లు, కేలరీల లోపం

ప్రశ్న 2.
మానవుని ప్రేగులో నివసించే బ్యాక్టీరియా తయారుచేసే విటమిన్ ఏది?
జవాబు:
B12 విటమిన్ ప్రేగులో నివసించే బాక్టీరియాచే తయారుచేయబడును.

ప్రశ్న 3.
ఎంజైములు లేని జీర్ణరసం ఏది?
జవాబు:
ఎంజైములు లేని జీర్ణరసం ‘పైత్యరసం’.

ప్రశ్న 4.
ఒక విద్యార్థి అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటాడు. మరొక విద్యార్థి కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటాడు. అయినా ఇద్దరూ వ్యాధులకు గురయ్యారు. వారికి ఏ వ్యాధులు వచ్చి ఉంటాయి?
జవాబు:

  1. అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తిన్న విద్యార్థి స్థూలకాయత్వం అనే వ్యాధికి గురయ్యాడు.
  2. కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తిన్న విద్యార్థి మెగాస్మస్ అనే వ్యాధికి గురయ్యాడు.

ప్రశ్న 5.
ఆకులలో పిండి పదార్థం ఉనికిని తెలుసుకొనుటకు మీరు నిర్వహించిన ప్రయోగంలో ఉపయోగించిన రెండు రసాయనాల పేర్లు రాయండి.
జవాబు:

  1. అయోడిన్ లేదా బెటాడిన్ లేదా టింక్చర్ అయోడిన్.
  2. ఆల్కహాల్ లేదా మిథైలేటెడ్ స్పిరిట్ లేదా స్పిరిట్

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 6.
కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించి, ఈ క్రియను సూచించేందుకు తుల్య సమీకరణం రాయండి.
జవాబు:
మొక్కలలో పత్రహరితం కలిగిన పత్రాలు కాంతిశక్తిని వనరుగా ఉపయోగించుకుంటూ, సరళ అకర్బన అణువులను (CO2, నీరు) సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చు జీవ రసాయనిక ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2

ప్రశ్న 7.
పోషకాహార లోపం గురించి తెల్సుకోవడానికి నీవు డాక్టర్ గారిని అడిగే ప్రశ్నలను రాయండి.
జవాబు:

  1. పోషక ఆహార లోపం అనగానేమి?
  2. పోషక ఆహారలోప రకాలు తెలపండి.
  3. పోషక ఆహారలోప కారణాలు ఏమిటి?
  4. పోషక ఆహార లోపాన్ని ఎలా నివారించవచ్చు?

ప్రశ్న 8.
మోల్స్ అర్ధ పత్ర ప్రయోగములో KOH ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరమని సూచించుట ఈ ప్రయోగ ఉద్దేశము. సీసాలోపల ఉన్న KOH సీసాలోని CO2 ను పీల్చుకుంటుంది. దాని వల్ల సీసాలోపల ఉన్న ఆకులో CO2 లేకపోవడం వల్ల పిండి పదార్థాలు ఏర్పడవు.

ప్రశ్న 9.
భూమిక “భూమిపైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే భూమిపైన జీవరాశి మనుగడ కష్టమవుతుందని” చెప్పింది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
జవాబు:
భూమిపై కల సమస్త జీవరాశులన్నీ ఆకుపచ్చని మొక్కలపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆహారం మరియు ఆక్సిజన్ కోసం ఆధారపడతాయి.

ప్రశ్న 10.
వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల లేదా ఎక్కువ కాన్పులయిన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవించే వ్యాధి ఏది?
జవాబు:
మర్మా స్

ప్రశ్న 11.
ట్రిప్సిన్ ఆహారంలోని ఏ అంశంపై చర్య జరిపి వేటిగా మారుస్తుంది?
జవాబు:

  1. ప్రోటీన్లపై చర్య జరుపును.
  2. పెన్షన్లుగా మార్చును.

ప్రశ్న 12.
పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులకు రెండు ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:
పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు :
1) క్వాషియార్కర్, 2) మెరాసమస్, 3) బెరిబెరి, 4) గ్లాసైటిస్, 5) పెల్లాగ్రా, 6) అనీమియా, 7) స్వర్వీ, 8) రికెట్స్.

ప్రశ్న 13.
మలబద్దకంతో బాధపడుతున్న మీ స్నేహితునికి ఎలాంటి సలహాలు ఇస్తావు?
జవాబు:
i) ప్రతిరోజూ తీసుకునే ఆహారం నందు పీచుపదార్థాలు తప్పక ఉండే విధంగా చూసుకోవాలి.
ii) ప్రతిరోజూ సరిపడినంత నీరు త్రాగాలి.

ప్రశ్న 14.
పోషకాహార లోపనివారణ ప్రచార కార్యక్రమానికి అవసరమయ్యే రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. “సంతులిత ఆహారం తిందాం – ఆరోగ్యంగా ఉందాం.”
  2. “పోషకాహారాన్ని తీసుకో – వ్యాధులను దూరం చేసుకో”.

ప్రశ్న 15.
జీర్ణక్రియలో నాలుక పాత్ర ఏమిటి?
జవాబు:
నాలుక ఆహారాన్ని మిశ్రమంగా చేయటానికి దంతాల మధ్యకు చేర్చుతుంది. ఆహారం నమిలిన తరువాత ఆహార వాహికలోనికి నెట్టటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 16.
కిరణజన్యసంయోగక్రియ జరగడానికి కావలసిన ముడి పదార్థాలు ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన ముడి పదార్థాలు:

  1. కార్బన్ డై ఆక్సైడ్
  2. నీరు
  3. సూర్యరశ్మి
  4. పత్రహరితం

ప్రశ్న 17.
కిరణజన్య సంయోగక్రియలో చిట్టచివరిగా ఏర్పడే ఉత్పన్నాలు ఏమై ఉంటాయి?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు :
గ్లూకోజ్, నీటిఆవిరి మరియు కార్బన్ డై ఆక్సైడ్. గ్లూకోజ్ పిండి పదార్థంగా మార్చబడి నిల్వ చేయబడుతుంది.

ప్రశ్న 18.
కిరణజన్యసంయోగక్రియ ద్వారా కాంతిశక్తి రసాయనశక్తిగా మార్చబడుతుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన శక్తి సూర్యుని నుండి గ్రహించబడుతుంది. ఈ సౌరశక్తిని ఉపయోగించుకొని మొక్కలు ఆహార పదార్థాలను తయారుచేసుకొంటాయి. ఆహార పదార్థాలలో శక్తి రసాయనిక బంధాల రూపంలో నిల్వ చేయబడుతుంది. కావున కిరణజన్యసంయోగక్రియ ద్వారా కాంతిశక్తి రసాయనశక్తిగా మార్చబడుతుందని భావిస్తున్నాను.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 19.
కిరణజన్యసంయోగక్రియలోని ప్రధాన సోపానాలు ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియలో ప్రధానంగా రెండు దశలు కలవు.

  1. కాంతిచర్యలు : గ్రానాలో జరుగుతాయి.
  2. నిష్కాంతి చర్యలు : అవర్ణికలో జరుగుతాయి.

ప్రశ్న 20.
కిరణజన్యసంయోగక్రియలోని దశలు ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి:
1. కాంతి చర్య :
కాంతి సమక్షంలో జరిగే కిరణజన్యసంయోగక్రియ మొదటి దశ ఇది. ఈ దశలో కాంతిశక్తి గ్రహించబడి, పత్రహరితం ఆక్సీకరణం చెందుతుంది. ఇది పత్రహరితంలోని గ్రానాలో జరుగుతుంది.

2. నిష్కాంతి చర్య :
ఇది కిరణజన్య సంయోగక్రియలోని రెండవదశ. హరితరేణువులోని సోమాలో జరుగుతుంది. కాంతి శక్తితో పనిలేదు. కానీ కాంతి చర్యలో ఏర్పడిన శక్తిగ్రాహకాలు అవసరం.

ప్రశ్న 21.
జీర్ణక్రియ అనగానేమి?
జవాబు:
జీర్ణక్రియ :
ఎంజైమ్ ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళపదార్థాలుగా విడగొట్టి, శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని “జీర్ణక్రియ” అంటారు.

ప్రశ్న 22.
సంతులిత ఆహారం అనగానేమి?
జవాబు:
సంతులిత ఆహారం :
అన్ని రకాల పోషకాలు సరిపడిన స్థాయిలో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. సంతులిత ఆహారం వలన అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

ప్రశ్న 23.
పోషకాహార లోపం అనగానేమి?
జవాబు:
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారం తీసుకోవటం వలన కలిగే దుష్ఫలితాలను పోషకాహారలోపం అంటారు.

ప్రశ్న 24.
పోషకాహార లోపాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి?
జవాబు:
పోషకాహార లోపాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అవి :

  1. కేలరీ పరమైన పోషకాహార లోపం
  2. ప్రొటీన్ల సంబంధిత పోషకాహార లోపం
  3. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం.

ప్రశ్న 25.
‘రెటినాల్’ లోప ఫలితం ఏమిటి?
జవాబు:
విటమిన్ ‘ఎ’ ను రెటినాల్ అంటారు. దీని లోపం వలన రేచీకటి, అంధత్వం , కంటి సమస్యలు వస్తాయి.

ప్రశ్న 26.
మొక్కలలోని పోషణ విధానం ఏమిటి?
జవాబు:
మొక్కలు కాంతి స్వయంపోషణను అవలంబిస్తాయి.

ప్రశ్న 27.
పత్రహరితం అనగానేమి? దాని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
మొక్కలలో ఆకుపచ్చ రంగుని కలిగించే వర్ణ పదార్థాన్ని పత్రహరితం అంటారు. ఇది సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చుతుంది.

ప్రశ్న 28.
కిరణజన్యసంయోగక్రియ అంత్య పదార్థాలు తెలపండి.
జవాబు:
పిండిపదార్థం, నీటి ఆవిరి, ఆక్సిజన్, కిరణజన్యసంయోగక్రియలో ఏర్పడతాయి.

ప్రశ్న 29.
ఆకు నుండి పత్రహరితం తొలగించటానికి ఏమి చేయాలి?
జవాబు:
ఆకును మీథైలేట్ స్పిరిట్లో ఉంచి, వేడి చేయుట ద్వారా పత్రహరితం తొలగించవచ్చు.

ప్రశ్న 30.
పిండి పదార్థాన్ని ఎలా నిర్ధారిస్తావు?
జవాబు:
పిండి పదార్థ నిర్ధారణ :
అయోడిన్ పరీక్ష ద్వారా పిండి పదార్థాన్ని నిర్ధారించవచ్చు. అయోడిన్ సమక్షంలో పిండి పదార్థం నీలి నల్లరంగుకు మారుతుంది.

ప్రశ్న 31.
CO2 ను పీల్చుకొనే రసాయన పదార్థం ఏమిటి?
జవాబు:
పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) CO2, ను పీల్చుకొనే స్వభావం కలిగి ఉంటుంది.

ప్రశ్న 32.
కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియలో వెలువడే వాయువు ఆక్సిజన్.

ప్రశ్న 33.
హరితరేణువులు అనగానేమి?
జవాబు:
హరితరేణువులు :
పత్రహరితం కలిగి ఉన్న కణాంగాలను “హరితరేణువులు” అంటారు. ఇవి పత్రాంతర కణాలలో 40 నుండి 100 వరకు ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 34.
గ్రానా అనగానేమి?
జవాబు:
గ్రానా :
హరితరేణువులో థైలకాయిడ్ త్వచముల దొంతరలను “గ్రానా” అంటారు. దొంతరల మధ్య ఉన్న ద్రవభాగాన్ని “సోమా” అంటారు.

ప్రశ్న 35.
కిరణజన్యసంయోగక్రియ వర్ణదాలు అనగానేమి?
జవాబు:
హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్యసంయోగక్రియ వర్ణదాలు అంటారు.

ప్రశ్న 36.
పత్రహరిత వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? అవి ఏవి?
జవాబు:
హరితరేణువుల్లోని థైలకాయిడ్ దొంతరలో రెండు ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణద్రవ్యాలు ఉంటాయి. క్లోరోఫిల్ – ‘ఎ’ నీలి ఆకుపచ్చ వర్ణదం కాగా, క్లోరోఫిల్ ‘బి’ పసుపు ఆకుపచ్చగా ఉంటుంది.

ప్రశ్న 37.
కిరణజన్యసంయోగక్రియలోని దశలు ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియ రెండు దశలలో జరుగుతుంది. అవి

  1. కాంతిచర్య
  2. నిష్కాంతి చర్య

ప్రశ్న 38.
ఫోటాలసిస్ అనగానేమి?
జవాబు:
ఫోటాలసిస్ :
కాంతి రేణువులోని శక్తిని వినియోగించుకొని నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని కాంతి నీటి విశ్లేషణ లేదా ‘ఫోటాలసిస్’ అంటారు.
H2O → H+ + OH

ప్రశ్న 39.
కాంతి చర్య అంత్య ఉత్పన్నాలు ఏమిటి?
జవాబు:
ATP, NADPH లు కాంతి చర్య అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ‘శక్తి గ్రాహకాలు’ అంటారు.

ప్రశ్న 40.
నిష్కాంతి చర్యలోని మధ్యస్థ పదార్థం ఏమిటి?
జవాబు:
నిష్కాంతి చర్యలోని మధ్యస్థ పదార్థం ‘రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్’. ఇది అనేక ఎంజైమ్స్ లను ఉపయోగించుకొంటూ, చివరిగా గ్లూకోజ్ ను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 41.
శిలీంధ్రాలలోని పోషణ విధానము ఏమిటి?
జవాబు:
శిలీంధ్రాలు పూతికాహారపోషణ విధానాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 42.
పెరిస్టాల్టిక్ చలనం అనగానేమి?
జవాబు:
పెరిస్టాల్టిక్ చలనం:
పదార్థాల కదలిక కోసం అవయవాలలో ఏర్పడే అలల తరంగం వంటి ఏకాంతర చలనాన్ని “పెరిస్టాలిక్ చలనం” అంటారు. దీనిని ఆహార వాహికలో స్పష్టంగా గమనించవచ్చు.

ప్రశ్న 43.
ఎమల్సీకరణం అనగానేమి?
జవాబు:
ఎమల్సీకరణం :
కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం, కొవ్వు పదార్థాలను జీర్ణంచేసి చిన్న చిన్న రేణువులుగా మార్చుతుంది. ఈ విధానాన్ని “ఎమల్సీకరణం” అంటారు.

ప్రశ్న 44.
క్లోమరసంలోని ఎంజైమ్స్ ఏమిటి?
జవాబు:
క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి అదే విధంగా లైపేజ్ కొవ్వులను జీర్ణం చేయటానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 45.
చిన్న ప్రేగులలోని జీర్ణరసం ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
చిన్నప్రేగుల గోడలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఈ స్రావాలు ప్రోటీన్లు మరియు కొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి.

ప్రశ్న 46.
కైమ్ అనగానేమి?
జవాబు:
క్రైమ్ :
ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోనికి మారుతుంది. దీనిని “కైమ్” అంటారు.

ప్రశ్న 47.
జఠర సంవరణీకండర ప్రయోజనం ఏమిటి?
జవాబు:
జీర్ణాశయం చివరి భాగంలో సంవరణీ కండరం ఉంటుంది. దీనిని జఠర సంవరణీకండరం అంటారు. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 48.
ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది? జీర్ణక్రియలో దాని పాత్ర ఏమిటి?
జవాబు:
ఎంజైమ్స్ లేని జీర్ణరసం పైత్యరసం. ఇది కాలేయంచే స్రవించబడుతుంది. ఈ జీర్ణరసం కొవ్వుల ఎమల్సీకరణకు తోడ్పడుతుంది.

ప్రశ్న 49.
శోషణ అనగానేమి?
జవాబు:
శోషణ :
జీర్ణమైన అంత్యపదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా కావడాన్ని “శోషణ” అంటారు. ఇది చిన్న ప్రేగులో జరుగుతుంది.

ప్రశ్న 50.
ఆంత్రచూషకాలు అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
ఆంత్రచూషకాలు :
చిన్నప్రేగు లోపలి ఉపరితలం మడతలు పడి, వ్రేళ్ళ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. వీటిని “ఆంత్రచూషకాలు” అంటారు. శోషణాతల వైశాల్యం పెంచటానికి ఇవి తోడ్పడతాయి.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 51.
పెద్దప్రేగు యొక్క పని ఏమిటి?
జవాబు:
జీర్ణంకాని వ్యర్థ పదార్థాల నుండి నీటిని, లవణాలను తిరిగి పీల్చుకోవటం పెద్ద ప్రేగు ప్రధాన విధి.

ప్రశ్న 52.
మలవిసర్జన అనగానేమి?
జవాబు:
మలవిసర్జన :
జీర్ణంకాని వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులో మలంగా మారుతుంది. ఈ మలం పాయువు ద్వారా విసర్జింపబడుతుంది. ఈ ప్రక్రియను “మలవిసర్జన” అంటారు.

ప్రశ్న 53.
వాంతి అనగానేమి?
జవాబు:
జీర్ణాశయం నుండి అనవసరమైన పదార్థాలు కానీ, హానికరమైన పదార్థాలను కానీ బయటకు పంపే ప్రక్రియను వాంతి అంటారు. ఈ ప్రక్రియను ఆహార వాహికలో వ్యతిరేక “పెరిస్టాల్ సిస్” జరగటం వలన ఆహారం జీర్ణాశయం నుండి నోటి ద్వారా బయటకు వస్తుంది.

ప్రశ్న 54.
న్యూనతా వ్యాధులు అనగానేమి?
జవాబు:
న్యూనతా వ్యాధులు :
పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అంటారు. ఉదా : క్వాషియార్కర్, మెరాస్మస్.

ప్రశ్న 55.
కిరణజన్యసంయోగక్రియ ప్రయోగాలలో మొక్కను మొదట చీకటిలో ఉంచి, తరువాత వెలుతురులో ఉంచటానికి కారణం ఏమిటి?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియను పిండిపదార్థ ఉనికి ద్వారా నిర్ధారిస్తారు. ఆకును నేరుగా పిండిపదార్ధ పరీక్ష చేస్తే, ఆకులో నిల్వ ఉన్న పిండిపదార్ధము వలన పరీక్షా ఫలితాలు తప్పుగా వస్తాయి. కావున ఆకులో నిల్వ ఉన్న ఆహారాన్ని తొలగించటానికి మొక్కను చీకటిలో ఉంచుతారు. తరువాత ప్రయోగ పరిస్థితులలో కిరణజన్యసంయోగక్రియ జరగటానికి మొక్కను వెలుతురులో ఉంచుతారు.

ప్రశ్న 56.
క్వాషియార్కర్ వ్యాధి కారణము ఏమిటి?
జవాబు:
క్వాషియార్కర్ ప్రోటీన్స్ లోపం వలన కలిగే న్యూనతా వ్యాధి.

ప్రశ్న 57.
మెగాస్మస్ వ్యాధి కారణం ఏమిటి?
జవాబు:
ప్రోటీన్స్ మరియు కేలరీ పోషకాహారం లోపం వలన మెరాస్మస్ వ్యాధి కలుగును.

ప్రశ్న 58.
దాదాపుగా సజీవ ప్రపంచానికంతటికి కిరణజన్యసంయోగక్రియను మౌలిక శక్తివనరు అని చెప్పగలరా?
జవాబు:
భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు మొక్కల పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నాయి. కావున సజీవ ప్రపంచానికి కిరణజన్యసంయోగక్రియను మౌలిక శక్తి వనరుగా చెప్పవచ్చు.

ప్రశ్న 59.
స్వయంపోషకాలకు కావలసిన శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది?
జవాబు:
స్వయంపోషకాలకు కావలసిన శక్తి సూర్యుని నుండి లభిస్తుంది.

ప్రశ్న 60.
ఎక్కువ రోజుల పాటు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కలిగే ఫలితం ఏమిటి?
జవాబు:
మనం ఎక్కువ రోజుల పాటు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు, సాధారణంగా పైత్యంతో, పసరుతో కూడిన వాంతులతో బాధపడుతుంటాము. ఎక్కువగా కొవ్వు పదార్థాలను తిన్నప్పుడు, కాలేయం కొవ్వును తట్టుకొనే శక్తిని కోల్పోతుంది. అప్పుడు మనం తలనొప్పి, వాంతులతో బాధపడతాం.

ప్రశ్న 61.
సిట్రస్ ఫలాలలో లభించే విటమిన్ ఏది?
జవాబు:
విటమిన్ ‘సి’ సిట్రస్ ఫలాలలో లభిస్తుంది. ఇది గాయాలు మాన్పటంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 62.
అన్ని విటమిన్లు ఆహారం ద్వారా లభిస్తాయా?
జవాబు:
లేదు. కొన్ని విటమిన్స్ ఆహారం ద్వారా లభిస్తే మరికొన్ని విటమిన్లు శరీరంలోని బాక్టీరియాచే తయారుచేయబడతాయి.
ఉదా : B12, విటమిన్ K.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 63.
గోధుమలు, జొన్నలు, బియ్యం వంటి వాటిని నోటిలో నమిలితే కాసేపటికి తియ్యగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:
గోధుమలు, జొన్నలు, బియ్యం వంటి వాటిని నోటిలో నమిలినపుడు లాలాజలము నందలి ఎంజైమ్ ఎమైలేజ్ పై వాటినందు ఉండు సంక్లిష్ట పిండిపదార్థ అణువులను మాత్రసు అనే చక్కెరగా ‘మారుస్తుంది. అందువలన మనకు ఆహార పదార్ధములు తియ్యగా అనిపిస్తాయి.

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
A, D, E, K విటమిన్స్ క్రొవ్వులలో కరుగుతాయి. వీటి లోపం వల్ల మనం ఎటువంటి వ్యాధులకు గురి అవుతాము. ఈ విటమినుల కొరకు ఏ ఏ వనరులు మనకు అవసరము పట్టిక రూపంలో వ్రాయండి.
జవాబు:

విటమిన్లుకలిగే వ్యాధులువనరులు
విటమిన్ Aరేచీకటి, చత్వారం, కండ్లు పొడిబారడం, చర్మం పొలుసులు బారడంఆకుకూరలు, క్యారట్, టమాటా, గుమ్మడికాయ, చేపలు, గుడ్లు, కాలేయం, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, పాలు
విటమిన్ Dరికెట్స్కాలేయం, గుడ్లు, వెన్న, ఉదయపు ఎండ
విటమిన్ Eవంధ్యత్వ సమస్యలుపండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, మాంసం, గుడ్లు, పొద్దుతిరుగుడు నూనె
విటమిన్ Kరక్తం గడ్డకట్టకపోవడంమాంసం, గుడ్లు, ఆకు కూరలు, పాలు

ప్రశ్న 2.
లాలాజల గ్రంథుల నాళాలు మూసుకొనిపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలం మ్యూసిన్ మరియు టయలిన్ లేదా, అమైలేజ్ ను కలిగి ఉంటుంది.
  2. మ్యూసిన్ ఆహారానికి జారుడు స్వభావాన్ని కలుగజేసి సులువుగా మింగడానికి ఉపయోగపడుతుంది.
  3. టయలిన్ లేదా అమైలేజ్ సంక్లిష్ట పిండిపదార్థాలను సరళ చక్కెరలుగా జీర్ణం చేస్తుంది.
  4. లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోతే పై ప్రక్రియలన్నీ జరగక ఆహారం సరిగా జీర్ణం కాదు.

ప్రశ్న 3.
స్థూలకాయత్వం, దాని పర్యవసానాల గూర్చి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయుడిని అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
జవాబు:
ఉపాధ్యాయుని స్థూలకాయం గురించి మరింత తెలుసుకోవడానికి కింది ప్రశ్నలు అడుగుతాను. TS June 2017

  1. స్థూలకాయత్వానికి కారణాలు ఏమిటి?
  2. ప్రణాళికాబద్ధంగా శరీర బరువును ఎలా తగ్గించాలి?
  3. స్థూలకాయత్వం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏవి?
  4. స్థూలకాయత్వంతో బాధపడేవారు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి?

ప్రశ్న 4.
పోషణ అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
పోషణ :
జీవి శరీరంలోనికి పోషకాలను గ్రహించటాన్ని పోషణ అంటారు. ఇది ప్రధానంగా మూడు రకాలు. అవి :

  1. స్వయంపోషణ
  2. పరపోషణ
  3. మిశ్రమపోషణ

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1

ప్రశ్న 5.
స్వయంపోషణ గురించి రాయండి.
జవాబు:

  1. స్వయంపోషకాలు కాంతిశక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలు తయారుచేసుకుంటాయి.
  2. అవి నేలలోని నీటిని మరియు ఖనిజ లవణాలతో పాటుగా గాలిలోని కొన్ని వాయువులను కూడా వినియోగించుకుంటాయి.
  3. ఈ సరళ పదార్థాలను ఉపయోగించి పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి.
  4. స్వయం పోషకాలైన మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే’ ఈ కార్బోహైడ్రేట్ మానవులతో బాటు అత్యధిక శాతం జీవరాశులకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 6.
కిరణజన్యసంయోగక్రియ అనగానేమి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1
కిరణజన్యసంయోగక్రియ:
కాంతిని ఒక వనరుగా ఉపయోగించుకుంటూ, అంత్య ఉత్పత్తిగా కార్బోహైడ్రేట్సును తయారుచేస్తూ, ఆకుపచ్చ మొక్కలలో జరిగే సంక్లిష్ట రసాయనిక చర్యలను కిరణజన్యసంయోగక్రియ అంటారు.
(లేదా)
ఆకుపచ్చ మొక్కలలో వుండే హరిత రేణువులు సూర్యకాంతిలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఉపయోగించి, కార్బోహైడ్రేట్సను తయారుచేసే కాంతి రసాయన చర్యను కిరణజన్యసంయోగక్రియ అంటారు.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2

ప్రశ్న 7.
శోషణ సముదాయం లేదా కిరణజన్యసంయోగక్రియ ప్రమాణాలు అనగానేమి?
జవాబు:
పత్రంలోని హరితరేణువుల్లోని థెలకాయిడ్ దొంతరలలో రెండు ప్రధాన రకాలైన పత్రహరిత వర్షకాలుంటాయి. క్లోరోఫిల్ ‘ఏ’ నీలి-ఆకుపచ్చ వర్ణదం కాగా క్లోరోఫిల్ ‘బి’ పసుపు-ఆకుపచ్చగా ఉంటుంది. ప్రతి గ్రానాలోనూ దాదాపు 250 నుండి 400 వర్ణద అణువులు కలిసి కాంతి శోషణ సముదాయం (Light Harvesting Complex) గా ఏర్పడతాయి. వీటిని కిరణజన్యసంయోగక్రియ ప్రమాణాలు అంటారు. ఆకుపచ్చని మొక్కల క్లోరోప్లాస్లో అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలు అన్నీ కలిసి కిరణజన్యసంయోగక్రియను సంయుక్తంగా నిర్వహిస్తాయి.

ప్రశ్న 8.
పూతికాహారులు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కొన్ని ఈస్టు, కుక్కగొడుగులు, రొట్టె బూజులు వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు. ఇంకొన్ని రకాల జీవులు అతిథేయ జీవిపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణకు కస్కుట, పేను, జలగ, బద్దెపురుగు మొదలైన జీవులు పరాన్న పోషణను పాటిస్తాయి.

ప్రశ్న 9.
పారామీషియంలో పోషణ విధానం తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2
ఏకకణ జీవి అయిన పారామీషియంకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. ఒక ప్రత్యేకస్థానం నుండి ఆహారం గ్రహించబడుతుంది. శరీరం అంతా వ్యాపించి ఏర్పడటం ఉన్న శైలికల కదలిక వలన ఆహారం ఆ ప్రత్యేక స్థానాన్ని చేరుకుంటుంది. అక్కడ నుండి శరీరం లోపలికి వెళ్తుంది. ఆ భాగాన్ని కణముఖం (Cytostome) అంటారు.

ప్రశ్న 10.
బంగారు తీగ (డాడర్)లో పోషణ విధానం తెలపండి.
జవాబు:
బంగారు తీగ లేదా డాడర్ అని పిలువబడే ఈ మొక్కలో పత్రహరితం ఉండదు. కస్కుటా రిఫ్లెక్సాలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇది చూషకాలు (Haustoria) ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. హాస్టోరియాలు వేళ్ళమాదిరిగా ఉండి అతిథేయి కణజాలంలో చొచ్చుకొనిపోతాయి. ఒక్కొక్కసారి అతిథేయిని చంపేస్తాయి కూడా.

ప్రశ్న 11.
జీర్ణవ్యవస్థలోని భాగాలను వాటిలో ఆహార ప్రయాణ మార్గాన్ని సూచిస్తూ ఫ్లోచార్టు గీయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 3

ప్రశ్న 12.
నోటిలో జరిగే జీర్ణక్రియను వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 4

  1. మనం తీసుకున్న ఆహారం నోటిలో దంతాల ద్వారా ముక్కలుగా లాలాజలనాళం చేయబడి నోటిలోని లాలాజలంతో కలుస్తుంది. ఫలితంగా ఆహారం తడిగా, మెత్తగా జారుడు స్వభావాన్ని పొందుతుంది. దీనినే ముద్దగా అంగిలి – చేయడం (Mastication) అంటాం.
  2. ఇటువంటి మెత్తగా జారుడు స్వభావం కలిగిన ఆహారం ఆహారవాహిక ఉపజిహ్వక (Oesophagus) గుండా జీర్ణాశయంలోకి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది.
  3. ఆస్యకుహరంలో ఉండే 3 జతల లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం స్రవించబడుతుంది.
  4. రెండు జతల లాలాజల గ్రంథులు దవడల ప్రక్కన మరియు నాలుక కింద అమరి ఉంటాయి. ఒక జత గ్రంథులు అంగిలిలో అమరి ఉంటాయి.
  5. లాలాజలంలో అమైలేజ్ (టయలిన్) అనే ఎంజైమ్ ఉంటుంది. అమైలేజ్ ఎంజైమ్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన పదార్థాలుగా మారుస్తుంది.
    AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 7

ప్రశ్న 13.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అజీర్తి కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:
మనం తీసుకున్న ఆహారం జీర్ణంకానప్పుడు అజీర్తితో బాధపడుతుంటాం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అజీర్తి కలగకుండా ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.

  1. సాధారణమైన సమతుల ఆహారాన్ని తీసుకోవడం
  2. మెల్లగా, ప్రశాంతంగా తినడం
  3. ఆహారాన్ని బాగా నమిలి తినడం
  4. తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 14.
అల్సరకు గల కారణాలు ఏమిటి? నివారణ మార్గాలు ఏమిటి?
జవాబు:
జీర్ణాశయం ఆంత్రమూలంలో ఏర్పడిన పుండ్లు (Ulcers) అజీర్తికి ప్రధాన కారణం. ఈ పరిస్థితిని ఎక్కువగా ఎల్లప్పుడు చికాకు, ఆందోళనతో ఉండే వారిలో చూస్తాం. విశ్రాంతి లేకుండా పనిచేయడం, హడావిడిగా భోజనం చేయడం అజీర్తికి కారణాలు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే డాక్టర్లు, ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు, స్టాక్ బ్రోకర్లు, వ్యాపారస్తులు మొదలైనవారు ఎక్కువగా అల్సర్లకు గురవుతుంటారు. ఎవరైతే ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటారో వారికి జీర్ణాశయంలో పుండ్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో జీర్ణాశయ అల్సర్లకు బాక్టీరియా కారణం అవుతోంది.

ప్రశ్న 15.
మలబద్దకం యొక్క నష్టాలు ఏమిటి? దానిని ఎలా నివారించవచ్చు?
జవాబు:
ఆరోగ్యంగా ఉండాలంటే మలబద్దకం లేకుండా ప్రతిరోజు మన జీర్ణాశయాన్ని ఖాళీ చేయాలి. జీర్ణంకాని ఆహారం పెద్ద ప్రేగులో చాలా రోజుల వరకు అలాగే నిల్వ ఉంటే అందులో పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే హానికరమైన పదార్థాలు రక్తంలోకి శోషించబడతాయి. అందువల్ల అనేక ఇతర రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మన ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా తినటం వలన మలబద్దకాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 16.
క్వాషియార్కర్ గురించి రాయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 9
క్వాషియార్కర్ (Kwashiorkor)
ఇది ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతరావకాశాలలో నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.

ప్రశ్న 17.
మెరాస్మస్ గురించి రాయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 10
మెరాస్మస్ (Marasmus)
ఈ వ్యాధి ప్రోటీన్లు, కేలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్పులయిన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులలో నిస్సత్తువగా, బలహీనంగా ఉండడం, కీళ్ళవాపు కండరాలలో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలైన లక్షణాలుంటాయి.

ప్రశ్న 18.
స్థూలకాయత్వం గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 5
స్థూలకాయత్వం (Obesity)
అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద ఆరోగ్యసమస్యగా మారింది. స్థూలకాయంతో బాధపడుతుండే పిల్లలు భవిష్యత్తులో డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలకు తొందరగా గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయతకు దారితీస్తున్న ఇతర జంక్ ఫుడ్స్, అనారోగ్యకర ఆహార అలవాట్ల గురించి మీ తరగతిలో చర్చించండి.

ప్రశ్న 19.
విటమిన్లు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
విటమిన్లు :
జీవక్రియలలో కీలకపాత్ర వహించే కర్బన పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇది సూక్ష్మ పరిమాణంలో ఉంటూ, జీవక్రియలను నియంత్రిస్తాయి.

లభ్యత :
శరీరం విటమిన్లు పొందటానికి రెండు రకాల వనరులను కలిగి ఉంది. ఒకటి మనం తినే ఆహారం ద్వారా విటమిన్ల లభ్యత, రెండవది జీర్ణవ్యవస్థలో బాక్టీరియా విటమిన్లను సంశ్లేషించి శరీరానికి అందిస్తుంది.

రకాలు :
విటమిన్లు కరిగే స్వభావాన్ని బట్టి రెండు రకాలు. అవి:

  1. నీటిలో కరిగేవి : బి కాంప్లెక్స్, విటమిన్ సి
  2. కొవ్వులలో కరిగేవి : విటమిన్ ఎ, డి, ఇ మరియు కె

ప్రశ్న 20.
జ్వరం వచ్చినపుడు డాక్టర్లు నూనెలో వేయించిన వేపుళ్ళు తినకూడదంటారు. ఎందుకో కారణాలు తెల్పండి.
జవాబు:
జ్వరముగా ఉన్నప్పుడు రోగులకు తేలికపాటి ఆహారమును తీసుకోవాలని సూచిస్తారు. జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ ఎక్కువ పోషక విలువలు కలిగిన మాంసం, చేపలు తదితరములైన వేయించిన పదార్థములను తేలికగా జీర్ణం చేసుకోలేదు. వేపుడు పదార్థములు జీర్ణ వాహికపై అదనపు శ్రమను కలుగజేసే లక్షణములు కలిగి ఉంటాయి. అందువలన డాక్టర్లు వేపుళ్ళు తినకూడదని అంటారు.

ప్రశ్న 21.
స్వయంపోషణ జరగడానికి కావలసిన పరిస్థితుల గురించి వివరించండి. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 14

  1. స్వయంపోషణలో ప్రధానమైనది కాంతి స్వయంపోషణ. ఈ ప్రక్రియను కిరణజన్యసంయోగక్రియ అంటారు.
  2. ఈ క్రియ జరగటానికి మొదటిగా పత్రహరితం అవసరం. దీనితోపాటుగా, నీరు, CO2, సూర్యరశ్మి తప్పనిసరి. ఈ నాలుగు కారకాలు లేకుండా స్వయంపోషణ జరగదు.
  3. స్వయంపోషణలో చివరిగా పిండి పదార్థం, నీటిఆవిరి మరియు ఆక్సిజన్ ఏర్పడతాయి.

ప్రశ్న 22.
పత్రరంధ్రం పటం గీయండి. కిరణజన్యసంయోగక్రియలో దీని పాత్రను తెలపండి.
జవాబు:

  1. కిరణజన్యసంయోగక్రియలో CO2 గ్రహించబడి ఆక్సిజన్ వెలువడుతుంది.
  2. ఈ వాయు వినిమయం పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది.
  3. పత్ర రంధ్రాలు మొక్కకు ముక్కువంటివి. ఇవి శ్వాసించటానికి మరియు రక్షకకణం కిరణజన్యసంయోగక్రియలో వాయు వినిమయానికి ఉపయోగపడతాయి.
  4. కిరణజన్యసంయోగక్రియలో గ్రహించబడే కార్బన్ డై ఆక్సైడ్ పత్రరంధ్రాలచే పత్రరంధ్రం నియంత్రించబడుతుంది.
  5. రక్షక కణాల సడలింపు వ్యాకోచం వలన పత్రరంధ్ర పరిమాణం మారుతూ, వాయు వినిమయాన్ని నియంత్రిస్తుంది.

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రక్క పటంలోని ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులీయండి.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 12
ఎ) ఈ ప్రయోగం ద్వారా ఏ విషయాన్ని నిరూపిస్తావు?
బి) ప్రయోగమునకు ఉపయోగించిన పరికరాలేమిటి?
సి) ప్రయోగమును నీడలో ఉంచి జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయి?
డి) ప్రయోగ ఫలితాన్ని రాబట్టుటకు నీవేమి చేస్తావు?
జవాబు:
ఎ) కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలగునని నిరూపించుట.
బి) 1. బీకరు, 2. పరీక్షనాళిక, 3 గరాటు, 4. హైడ్రిల్లా మొక్కలు
సి) పరీక్ష నాళిక నీటిమట్టంలో ఎటువంటి మార్పు ఉండదు. కిరణజన్య సంయోగక్రియ జరగదు / గాలిబుడగలు ఏర్పడవు.
డి) మండుతున్న అగ్గిపుల్లను పరీక్షనాళిక మూతి వద్ద ఉంచినట్లయితే ప్రకాశవంతంగా మండును.

ప్రశ్న 2.
పటంలోని ప్రయోగంను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 6
A) ఈ ప్రయోగం ద్వారా ఏ విషయాన్ని నిరూపిస్తావు?
B) ఈ ప్రయోగానికి ఉపయోగించిన పరికరాలు ఏవి?
C) ఈ ప్రయోగానికి KOH ద్రావణాన్ని ఎందుకు ఉపయోగించారు?
D) ఈ ప్రయోగంలో రెండు ఆకులు ఎందుకు పరీక్షించాలి?
జవాబు:
A) కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సెడ్ అవసరం అని నిరూపించడం.
B) వెడల్పు మూత గల గాజు సీసా, చీల్చబడిన రబ్బరు కార్కు: KOH ద్రావణం, కుండీలో పెరుగుతున్న మొక్క అయోడిన్.
C) సీసాలో ఉన్న గాలిలోని CO2 ను పీల్చివేయడానికి
D) కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరం అని నిరూపించే ప్రయోగం కాబట్టి CO2 లభించిన ఒక పత్రంను మరియు CO2 లభించని మరొక పత్రంను పరీక్షించాలి.

ప్రశ్న 3.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

విటమిన్వనరులువిటమిన్ లోపంతో కనిపించే వ్యాధి లక్షణాలు
థయామిన్తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లువాంతులు, మూర్చ, ఆకలి లేకపోవడం, శ్వాస సమస్యలు, పక్షవాతం
ఆస్కార్బిక్ ఆమ్లంమొలకెత్తిన గింజలు, క్యారెట్, ఆకుకూరలు, టమాటగాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం
రెటినాల్ఆకుకూరలు, క్యారెట్, టమాట, గుమ్మడి, బొప్పాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్రేచీకటి, చత్వారం, కంటి నుండి నీరు కారడం, చర్మం పొలుసుబారుట, నేత్ర పటల సమస్యలు
కాల్సిఫెరాల్కాలేయం, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, పెళుసు బారడం, దొడ్డికాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు
టోకోఫెరాల్పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దు తిరుగుడు నూనెపురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం
ఫైలో క్వినైన్మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలుఅధిక రక్తస్రావం, రక్తం గడ్డ కట్టకపోవడం

(i) ఎముకల సంబంధ వ్యాధులు ఏ విటమిన్ల లోపం వల్ల వస్తాయి?
(ii) పండ్లను తినడం వల్ల ఏ విటమిన్లు లభిస్తాయి?
(iii) పక్షవాతం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తినాలి?
(iv) ఏ ఆహార పదార్థాలు తింటే విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు రావు?
జవాబు:
i) కాల్సిఫెరాల్ / విటమిన్ – డి / సన్ షైన్ విటమిన్
ii) టోకోఫెరాల్ / విటమిన్ – ఇ / యాంటీ స్టెరిలిటి విటమిన్ / రెటినాల్
iii) థయామిన్ (విటమిన్ B1), తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు మరియు గుడ్లు తినాలి.
iv) కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, మొలకెత్తిన గింజలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, పాలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, నూనె గింజలు.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 4.
కిరణజన్య సంయోగక్రియలో గాలి ప్రధాన పాత్రను పోషిస్తుందని తెల్పుటకు ప్రీస్టే, చేసిన గంట జాడీ, పుదీనా మొక్క ప్రయోగాన్ని రాయండి.
జవాబు:

  1. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని 1770వ సంవత్సరంలో జోసఫ్ ప్రీస్టే (Priestly) నిర్వహించిన ప్రయోగాల ద్వారా తెలిసింది.
  2. గాలి చొరబడని గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడాన్ని ప్రిస్టీ (Priestly) గమనించాడు. అదే విధంగా గాలి చొరబడని గంట జాడీలో ఉంచిన ఎలుకకు ఊపిరి ఆడకపోవడాన్ని కూడా గమనించాడు.
  3. ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి లేదా ఎలుక లేదా రెండూ కూడా ఏదోవిధంగా గంట జాడీలోని గాలికి నష్టం కలిగించినట్లు నిర్ధారణకు వచ్చాడు.
  4. కానీ గంట జాడీలో ఒక పుదీనా మొక్కను ఉంచి పరిశీలించినపుడు ఎలుక ప్రాణంతో ఉండడాన్ని, కొవ్వొత్తి వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు.
  5. ప్రిస్టీ (Priestly) ఈ క్రింది నిర్ధారణకు వచ్చాడు.
    “జంతువుల శ్వాసక్రియకు, కొవ్వొత్తి వెలగడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు తిరిగి గాలిలోకి ప్రవేశపెడ్తాయి”.

ప్రశ్న 5.
B1, B2, B3, A, C, D, E, K – ఇవి విటమినుల సంకేతాలు. ఇందులో కొన్ని నీటిలో కరుగుతాయి. మరికొన్ని క్రొవ్వులో కరుగుతాయి. వీటిని పై రెండు రకాలుగా విభజించి వీటి లోపం వల్ల కలిగే వ్యాధులను పట్టికలో పొందుపరచండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 7

ప్రశ్న 6.
కిరణజన్య సంయోగక్రియ సందర్భంగా క్లోరోప్లాస్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో కొంతి ఆధారిత చర్యలను నివరించుము.
(లేదా)
కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య యొక్క యాంత్రికాన్ని వివరించండి.
జవాబు:
కాంతిచర్య / కాంతి రసాయన చర్య :
1) కాంతి ద్వారా ప్రేరేపించబడి అనేక రసాయన చర్యలు ఒకదాని వెంబడి ఒకటి అతి త్వరగా జరుగుతుంటాయి. కనుక దీనిని కాంతి చర్య లేదా కాంతి రసాయన దశ అంటారు. కాంతి చర్య క్లోరోప్లాలోని గ్రానా థైలకాయిడ్ లో జరుగుతుంది.

2) మొదటి సోపానం :
క్లోరోఫిల్ కాంతిలోని కాంతి ఫోటాన్లను శోషించి క్రియావంతమవుతుంది.

3) రెండవ సోపానం :
(ఫోటోలైసిస్ / హిల్ చర్య) నీటి అణువు H+, OH అయాన్లుగా విడగొట్టడానికి కాంతి శక్తి – వినియోగించబడుతుంది. దీనిని కాంతి విశ్లేషణ అంటారు. లేదా హిల్ చర్య అంటారు.
H2O → H+ + OH

4) మూడవ సోపానం :
OH అయాన్లు ఒకదాని వెంట ఒకటిగా జరిగే అనేక చర్యల పరంపర ద్వారా నీరు (H2O) మరియు NADPH లను ఉత్పత్తి చేస్తుంది. ATP లు NADPH లు అంత్యపదార్థాలుగా ఏర్పడుతాయి. వీటిని శక్తిగ్రాహకాలు అంటారు.

ప్రశ్న 7.
కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగానికి కావలసిన పరికరాలు మరియు ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
బ్లాక్ పేపర్, క్లిప్స్, కుండీలో పెరుగుతున్న మొక్క అయోడిన్, మిథైలేటెడ్, స్పిరిట్, పెట్రెడిష్

ప్రయోగ విధానం :

  1. కుండీలో పెరుగుతున్న మొక్కలోని పిండి పదార్థం తొలగించడానికి వారం రోజులు చీకటిలో ఉంచాలి. ఒక నల్లని కాగీతం తీసుకొని మీకు నచ్చిన డిజైన్ కత్తిరించండి.
  2. డిజైను కాగితాన్ని ఆకుకు పైన క్రింద ఉంచి క్లిప్స్ పెట్టాలి. నల్లటి భాగం గుండా కాంతి ఆకుపైన పడకుండా కాగితం ఉండేలా అమర్చాలి.
  3. అమరికలో ఉన్న మొక్కను సూర్యరశ్మిలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత ఆకును వేరుచేసి నీటిలో వేడి చేయండి.
  4. ఆకును పరీక్ష నాళికలో ఉంచి మిథైలేటెడ్ స్పిరిట్ పోసి, దానిని నీరు ఉన్న బీకరులో ఉంచి వేడి చేయాలి. ఆకు నుండి పత్రహరితం తొలగిన తరువాత దానిని పెట్రిడిలో ఉంచాలి.
  5. ఆకుపై కొన్ని చుక్కల అయోడిన్ వేయండి. ఎక్కడైతే సూర్యరశ్మి సోకలేదో అక్కడ తెల్లగా, మిగతా భాగం నీలంగా మారింది.

నిర్ధారణ :
ఆకుపై ఎక్కడైతే సూర్యరశ్మి సోకలేదో అక్కడ పిండి పదార్థం ఏర్పడక తెల్లగా ఉంది. ఆకు మిగతా భాగంలో సూర్యరశ్మితో సహా అన్ని కారకాలు ఉండటం వల్ల పిండిపదార్థం ఏర్పడింది. ఆకు నీలంగా మారింది.

ప్రశ్న 8.
కొవ్వులలో కరిగే విటమిన్లేవి ? వాటి లోపం వలన కలిగే వ్యాధులు మరియు వ్యాధి లక్షణాలను గూర్చి రాయండి.
జవాబు:
క్రొవ్వులో కరిగే విటమిన్లు

విటమిన్ల పేర్లువ్యాధి పేరువ్యాధి లక్షణాలు
విటమిన్ A (రెటినాల్)రేచీకటి, చత్వారంరాత్రిపూట సరిగ్గా కనబడకపోవటం, కంటి నుండి నీరు కారటం, నేత్రపటల సమస్యలు, చర్మం పొలుసు బారటం.
విటమిన్ D (కాల్సిఫెరాల్)రికెట్స్ఎముకలు సరిగ్గా పెరగకపోవటం, పెళుసు బారడం, దొడ్డికాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు
విటమిన్ E (టోకోఫెరాల్)వంధ్యత్వంపురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం
విటమిన్ K (ఫైలోక్వినోన్)అధిక రక్తస్రావంరక్తం తొందరగా గడ్డకట్టకపోవటం

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 9.
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సెడ్ అవసరము అని నిరూపించుటకు మీ పాఠశాల ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని నిర్వహించే ఉంటారు. 9వ తరగతి చదువుచున్న రాజు కూడా ఆ ప్రయోగాన్ని నిర్వహించాలనుకుంటున్నాడు. అతనికి గల కొన్ని అనుమానాలను నివృత్తి చేయుము.
i) ప్రయోగానికి ముందు కుండీలో పెరుగుతున్న మొక్కను చీకటి గదిలో సుమారు వారం రోజుల వరకు ఉంచారు కదా! ఎందుకు?
జవాబు:
మొక్కలోని పిండిపదార్థం తొలగించుటకు ప్రయోగానికి ముందు కుండీలో పెరుగుతున్న మొక్కను చీకటి గదిలో సుమారు వారం రోజుల వరకు ఉంచారు.

ii) గాజు జాడీలో KOH గుళికలు ఉంచారు. ఎందుకు?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ ను శోషించుటకు గాజు జాడీలో KOH గుళికలు ఉంచారు.

iii) ఈ ప్రయోగ నిర్వహణకు ఉపయోగించిన పరికరాలు ఏవి?
జవాబు:
పరికరాలు :
కుండీలో పెరుగుచున్న మొక్క, వెడల్పు మూతిగల పారదర్శక గాజుసీసా, చీల్చబడిన రబ్బరు కార్కు.

iv) ఈ ప్రయోగాన్ని ఒక వేళ నీడలో నిర్వహిస్తే ఫలితం ఎలా ఉంటుంది?
జవాబు:
ఈ ప్రయోగాన్ని ఒక వేళ నీడలో నిర్వహిస్తే కిరణజన్య సంయోగక్రియ జరగదు.

ప్రశ్న 10.
ప్రయోగ పరికరాల అమరికను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 8
1) కొవ్వొత్తి ఎందుకు ఆరిపోయింది?
జవాబు:
క్రొవ్వొత్తి వెలగడానికి అవసరమయిన వాయువు (ఆక్సిజన్) అయిపోవడం వలన క్రొవ్వొత్తి ఆరిపోయింది.

2) ఈ ప్రయోగంలో ఎలుక, కొవ్వొత్తి మధ్య మీరు ఏమైనా సంబంధాన్ని గుర్తించారా?
జవాబు:
ఈ ప్రయోగంలో ఎలుక జీవించడానికి, క్రొవ్వొత్తి వెలగడానికి ఒకే వాయువు (ఆక్సిజన్) అవసరం.

3) ఈ ప్రయోగం నందు ప్రీస్టే పరిశీలనలు ఏమిటి?
జవాబు:
ప్రీస్ట్రీ ఈ ప్రయోగం ద్వారా, మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి, జంతువుల మనుగడకు దోహదం చేస్తుందని పరిశీలించాడు.

4) గంట జాడీ నందు పుదీన మొక్కను ఉంచినపుడు కొవ్వొత్తి నిర్విరామంగా వెలుగుతుంది. ఎందుకు?
జవాబు:
గంట జాడీ నందు పుదీనా మొక్క విడుదలచేసే ఆక్సిజన్ వలన క్రొవ్వొత్తి నిర్విరామంగా వెలుగుతుంది.

ప్రశ్న 11.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి, దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 9
i) పై వాటిలో వంధ్యత్వ నివారణకు ఉపయోగపడే విటమినను గుర్తించండి.
జవాబు:
విటమిన్ – ఇ (టోకోఫెరాల్)

ii) చిగుర్ల నుండి రక్తము రావడానికి ఏ విటమిన్ లోపం కారణము?
జవాబు:
విటమిన్ – సి (ఆస్కార్బిక్ ఆమ్లం)

iii) పై వాటిలో కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవి?
జవాబు:
రెటినాల్ (ఎ), టోకోఫెరాల్ (ఇ), ఫిల్లోక్వినోన్ (3)

iv) K విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి యొక్క లక్షణాలేవి?
జవాబు:
అధికరక్తస్రావం, రక్తం గడ్డకట్టకపోవటం.

ప్రశ్న 12.
“ఆకులలో పిండిపదార్థం కలదని” నిరూపించే ప్రయోగ విధానాన్ని, జాగ్రత్తలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
ఆకులలో పిండి పదార్థము కలదని నిరూపించుట.

పరికరాలు :
1) బీకరు 2) పరీక్షనాళిక 3) ట్రైపాడ్ స్టాండ్ 4) బున్ సెన్ బర్నర్ 5) ఇనుప వల 6) పెట్రెడిష్ 7) డ్రాపర్ 8) బ్రష్

రసాయనాలు :
1) ఇథనాల్ / మిథలేటెడ్ స్పిరిట్ 2) నీరు 3) ఆకు 4) అయోడిన్ / బెటాడిన్ ద్రావణం

ప్రయోగ విధానము :

  1. కుండీలో పెరుగుతున్న మొక్క నుండి ఒక ఆకును తీసుకోవాలి.
  2. పరీక్షనాళికలో మిథలేటెడ్ స్పిరిట్ తీసుకొని అందులో ఆకును ఉంచాలి.
  3. పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి వేడి చేయడం వలన ఆకులోని పత్రహరితము తొలగించబడి ఆకు పాలిపోయినట్లుగా కనబడుతుంది.
  4. ఆకును పెట్రెడిష్ లో ముడుతలు పడకుండా వెడల్పుగా పరిచి అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేయాలి.

పరిశీలన :
ఆకు నీలి నలుపు రంగులోకి మారుతుంది. దీనిని బట్టి ఆకులలో పిండిపదార్థము కలదని నిరూపించవచ్చు.

జాగ్రత్తలు :

  1. మెత్తగా పలుచని ఆకులు కలిగిన మొక్కను ఎంపిక చేసుకోవాలి.
  2. వేడి పరీక్ష నాళిక నుండి ఆకును చేతితో నేరుగా తీయకుండా, బ్రష్ ను ఉపయోగించాలి.
  3. అయోడిన్ చుక్కలను డ్రాపర్ సహాయంతో మాత్రమే వేయాలి.

ప్రశ్న 13.
జంతువులు వినియోగించుకొంటున్న గాలిని మొక్కలు భర్తీ చేస్తాయని ప్రీస్టే ఎలా నిర్ధారించాడు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 8
గాలి చొరబడని గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడాన్ని ప్రీస్టే గమనించాడు. అదేవిధంగా గాలి చొరబడని గంట జాడీలో ఉంచిన ఎలుకకు . ఊపిరాడకపోవడం కూడా గమనించాడు. ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి, ఎలుక రెండూ కూడా ఏదో విధంగా గంట జాడీలోని గాలికి నష్టం కలిగించినట్లు నిర్ధారణకు వచ్చాడు. కానీ గంట జాడీలో ఒక పుదీనా మొక్కను ఉంచి పరిశీలించినప్పుడు ఎలుక ప్రాణంతో ఉండడాన్నీ, కొవ్వొత్తి వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. జంతువుల శ్వాసక్రియకూ, కొవ్వొత్తి వెలగడానికీ ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతుంటాయని .ఈ ప్రయోగం ద్వారా జోసఫ్ ప్రీస్టే ఊహించాడు.

ప్రశ్న 14.
కాంతి చర్యను వర్ణించండి.
జవాబు:
కిరణజన్యసంయోగక్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి

1. కాంతి చర్య (Light dependent reaction)
2. నిష్కాంతి చర్య (Light independent reaction)

కాంతి చర్య (కాంతి రసాయన దశ) (Light dependent reaction)

కిరణజన్యసంయోగక్రియలో మొదటి దశ ఇది. ఈ చర్యలో కాంతి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో కాంతి ద్వారా ప్రేరేపించబడిన అనేక రసాయనిక చర్యలు ఒకదాని వెంట ఒకటి అతి త్వరగా జరుగుతుంటాయి. అందువలన ఈ దశను కాంతి రసాయన దశ (Photochemical phase) అంటారు. కాంతిచర్య క్లోరోప్లాస్లోని గ్రానా, థైలకాయిలో జరుగుతుంది. కాంతి చర్య వివిధ సోపానాలలో జరుగుతుంది.

మొదటి సోపానం :
క్లోరోఫిలను కాంతిశక్తికి బహిర్గతం ఎలక్ట్రాన్ చేసినప్పుడు ఫోటాన్లను శోషించి క్రియావంతమవుతుంది.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 10

రెండవ సోపానం :
నీటి అణువు హైడ్రోజన్ (H), హైడ్రాక్సిల్ (OH) అయాన్లుగా విచ్ఛిత్తి చేయడానికి ఈ కాంతిశక్తి వినియోగించబడుతుంది.
H2O → H+ + OH

ఈ చర్యను నీటి కాంతి విశ్లేషణ (Photolysis) అంటారు. ఫోటో అనగా కాంతి-లైసిస్ అనగా విచ్ఛిత్తి చేయడం అని అర్థం. అంటే కాంతి ద్వారా నీటి అణువు విచ్చిత్తి చెందడం అన్నమాట. దీనిని ‘హిల్’ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. అందువల్ల దీనిని ‘హిల్ చర్య’ అని కూడా అంటారు.

మూడవ సోపానం :
అత్యంత చర్యాశీలమైన నీటి అయాన్లు రెండు మార్గాలలో తొందరగా మార్పు చెందుతాయి.

  1. OH అయాన్లు ఒకదాని వెంట ఒకటిగా జరిగే అనేక చర్యల పరంపర ద్వారా నీరు (H2O) మరియు ఆక్సిజన్ (O2) ఉత్పత్తి చేస్తుంది.
  2. నీరు మొక్క లోపల వినియోగించబడుతుంది. కానీ ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోకి విడుదలవుతుంది.
  3. H+ అయాన్ నిష్కాంతి చర్యలో క్రమానుగత చర్యల పరంపరలకు లోనవుతుంది.
  4. కాంతి చర్యలో అడినోసిస్ ట్రై ఫాస్ఫేట్ (ATP) మరియు నికోటినమైడ్ అడినోసిన్ డై ఫాస్ఫేట్ (NADPH) లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని శక్తిగ్రాహకాలు (Assimilatory powers) అని కూడా అంటారు.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 11

ప్రశ్న 15.
నిష్కాంతి చర్యలను వర్ణించండి.
జవాబు:
కిరణజన్యసంయోగక్రియలోని రెండవ దశను నిష్కాంతి చర్య అంటారు. వీటికి కాంతిశక్తితో సంబంధం లేనప్పటికి, కాంతిచర్యలో ఏర్పడిన శక్తి గ్రాహకాలు తప్పని సరిగా కావాలి. ఈ చర్యలన్నీ హరిత రేణువులోని అవర్ణికలో జరుగుతాయి.
1) ఈ చర్యలలో మొదటిగా రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ పదార్థంచే CO2 గ్రహించబడి ఆరు కార్బన్లు గల హెక్సోజ్ చక్కెరగా మారుతుంది.
CO2 + రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ → హెక్సోజ్ చక్కెర

2) నిలకడలేని ఈ హెక్సోజ్ చక్కెర విచ్ఛిన్నం చెంది, మూడు కార్బన్లు గల ఫాస్ఫా గ్లిజరిక్ ఆమ్లం (PGA) గా విడిపోతుంది.
హెక్సోజ్ చక్కెర → 2 PGA

3) ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్ల అణువులు రెండు కలిసి, కొన్ని వరుస మార్పుల తరువాత గ్లూకోజ్ గా మారును.
2 PGA → గ్లూకోజ్

4) ఈ గ్లూకోజ్ వినియోగించబడి, మిగిలినది పిండిపదార్థంగా నిల్వచేయబడుతుంది.

ప్రశ్న 16.
అమీబాలో ఆహార సేకరణ విధానం తెలపండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 12

  1. ఏక కణజీవి అమీబాలో ఆహారం శరీరం ఉపరితలం నుండి సేకరించ బడుతుంది.
  2. అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుండి వేళ్ళవంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది.
  3. ఈ మిథ్యాపాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది.
  4. ఆహార రిక్తికలో సంక్లిష్ట ఆహారపదార్థాలు సరళపదార్థాలుగా విడగొట్టబడిన తరువాత కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి.
  5. జీర్ణం కాని పదార్థం కణం ఉపరితలానికి చేరి అక్కడ నుండి వెలుపలికి పంపబడుతుంది.

ప్రశ్న 17.
బంగారు తీగను వర్ణించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 13
బంగారు తీగ కాండం సన్నగా పొడవుగా, నారింజ, లేత గులాబి, పసుపు లేదా గోధుమ రంగులో గాని ఉంటుంది. డాడర్ పుష్పాలు బొడిపెల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. పసుపు లేదా తెలుపు రంగులో ఆకర్షక పత్రాలు ఉండే తమ్మెలు గంట ఆకారంలో (సంయుక్త ఆకర్షక పత్రాలు) ఉంటాయి. పత్రాలు సన్నటి పొలుసుల మాదిరిగా క్షీణించి ఉంటాయి.

బంగారు తీగ కాండం తీగలా అతిథేయ మొక్క చుట్టూ మెలికలు తిరిగిన తరువాత పక్కనున్న మరొక కాండాన్ని చుట్టి పెనవేసుకొని పోవడం వలన అతిథేయి మొక్కపై మొత్తం వల మాదిరిగా ఆక్రమించి జాలాకారంగా కస్కుటాలో హాస్టోరియాలు కనబడుతుంది.

ప్రశ్న 18.
విటమిన్స్ లభ్యత, వాటి లోపం వలన కలిగే వ్యాధులు, లక్షణాలు తెలుపుతూ పట్టిక రూపొందించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 14

ప్రశ్న 19.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 5
a) ప్రక్క పటంలో చూపించిన కణాంగము ఏ క్రియను నిర్వహిస్తుంది?
b) ఈ కణాంగము ఏ భాగాలలో ఉంటుంది?
c) ఈ కణాంగములోని ప్రధానభాగాలు ఏమిటి?
d) ఈ కణాంగములో సంశ్లేషణ చేయబడు పదార్థం ఏమిటి?
జవాబు:
a) ఈ కణాంగము పేరు హరితరేణువు. ఇది కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తుంది.
b) ఈ కణాంగము మొక్కల ఆకుపచ్చభాగాలైన పత్రము లేతకాండాలలో ఉంటుంది.
c) ఈ కణాంగంలో ప్రధానంగా 1) త్వచం 2) హేమా పిండిపదార్థపు రేణువు 3) గ్రానా అనే భాగాలు ఉంటాయి.
d) ఈ కణాంగంలో గ్లూకోజ్ సంశ్లేషణ చేయబడి తరువాత పిండిపదార్థంగా మారుతుంది.

ప్రశ్న 20.
కింది పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 15
a) ఈ పటము ఏ నిర్మాణాన్ని సూచిస్తుంది?
b) పటం మధ్యభాగంలో వలయాకారంగా ఉన్న నిర్మాణం పని ఏమిటి?
c) పటంలో పైన, క్రింద ఉన్న వరుసకణాల పని ఏమిటి?
d) స్తంభాకార స్పంజి కణజాలం మధ్య భేదాలు ఏమిటి?
జవాబు:
a) పటంలో ఆకు అడ్డుకోత చూపబడింది.

b) పటం మధ్యలో ఉన్న వలయాకార నిర్మాణం నాళికాపుంజం. ఇది రవాణాకు తోడ్పడుతుంది. పై భాగంలో ఉండే దారువు నీటి రవాణాకు, క్రింది భాగంలో ఉండే పోషక కణజాలం ఆహార రవాణాకు తోడ్పడును.

c) పైన, క్రింద ఉన్న వరుస కణాలను బాహ్యచర్మం అంటారు. ఇది రక్షణకు తోడ్పడును.

d) స్తంభాకార కణజాలం దగ్గరగా అమర్చబడి, అధికసంఖ్యలో హరితరేణువులను కలిగి కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడుతుంది. స్పంజి కణజాలం కణాంతర భాగాలను కలిగి వాయు మార్పిడికి తోడ్పడుతుంది.

ప్రశ్న 21.
కింది పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 20
a) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరాలు ఏమిటి?
c) సీసాలో ఉంచిన రసాయనం ఏమిటి? దాని అవసరం ఏమిటి?
d) ప్రయోగం తరువాత, పత్రం యొక్క ఏ భాగం నీలిరంగుకు మారును?
జవాబు:
a) కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరమని నిరూపించుట ఈ ప్రయోగ ఉద్దేశం.
b) ఈ ప్రయోగంలో, వెడల్పు మూతిగల సీసా, రబ్బరుబిరడా, కుండీ మొక్క ఉపయోగించారు.
c) సీసాలోపల తీసుకొన్న రసాయనం KOH. ఇది సీసాలోని CO2 ను పీల్చుకొంటుంది.
d) ప్రయోగ అనంతరం సీసా వెలుపలి ఉన్న పత్రభాగం నీలిరంగుగా మారును.

ప్రశ్న 22.
క్రింద ఉన్న ఫ్లోచార్టును గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 3
a) ఈ ఫ్లోచార్ట్ ఏ జీవక్రియను వివరిస్తుంది?
b) మానవుని జీర్ణవ్యవస్థలో ఆహారం జీర్ణమయ్యే ప్రాంతాలు గుర్తించండి.
c) ఫ్లోచార్టులో ఉదహరించబడిన గ్రంథులు, వాటి జీర్ణరసాలు తెలుపండి.
d) జీర్ణవ్యవస్థలో ఆహారం శోషణ చెందే ప్రాంతము ఏది?
జవాబు:
a) ఈ ఫ్లోచార్టు మానవ జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియను వివరిస్తుంది.

b) ఆహారం జీర్ణమయ్యే ప్రాంతాలు, 1) నోరు, 2) జీర్ణాశయం, 3) ఆంత్రమూలం, 4) చిన్న ప్రేగు

c) కాలేయం – పైత్యరసం
క్లోమము – క్లోమరసం

d) జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులో శోషణ చెందుతుంది.

ప్రశ్న 23.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 8
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు?
b) ఈ ప్రయోగంలో కొవ్వొత్తి, ఎలుకకు ఉన్న సంబంధం ఏమిటి?
c) ఈ ప్రయోగంలో పుదీనా మొక్కకు బదులు మరొక ఎలుకను ప్రవేశపెడితే ఏం జరుగును?
d) భూమి మీద మొక్కల ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త జోసఫ్ ప్రీస్టే.

b) ఈ ప్రయోగంలో కొవ్వొత్తి మరియు ఎలుక రెండూ ఆక్సిజనన్ను వినియోగించుకొన్నాయి.

c) పుదీనా మొక్క స్థానంలో మరొక ఎలుకను ప్రవేశపెడితే, ఆక్సిజన్ త్వరగా అయిపోయి ఎలుకలు త్వరగా మరణిస్తాయి. కొవ్వొత్తి త్వరగా ఆరిపోతుంది.

d) భూమి మీద ఉన్న జీవరాశులకు ఆక్సిజన్‌ను అందించేవి మొక్కలు. ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా, జంతువులకు ఆహారాన్ని ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి.

ప్రశ్న 24.
జీవక్రియల్లో కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే భూగోళంలో కలిగే అనర్దాలను రాయండి.
జవాబు:
1) మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరపకపోతే మిగతా సజీవులకు ఆహారం లభ్యంకాదు. ఎందుకంటే మిగిలిన జీవులన్నీ ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడినాయి.

2) కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు కార్బన్ డై ఆక్సెడ్ అవసరం. కిరణజన్య సంయోగక్రియ జరుగకపోతే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుతుంది. ఇది జరిగితే భూ ఉష్ణోగ్రతలు పెరిగి భూగోళం వెచ్చబడటానికి కారణమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరిగితే ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. దీనివలన సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి, అనేకమైన జీవులు చనిపోతాయి.

3) కిరణజన్య సంయోగక్రియ గాలిలోనికి ఆమ్లజనిని విడుదల చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ జరుగకపోతే ఆమ్లజని విడుదల కాకపోవడం చేత సజీవులు మరణిస్తాయి.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 25.
స్వయంపోషకాలలో పోషణ, సూర్యకాంతి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జరుగుతుంటుంది కదా! ఈ రెండు సందర్బాలకు తేడాలు ఏమిటి?
జవాబు:
మొక్కలు మరియు కొన్ని రకాల బాక్టీరియాలు స్వయంపోషకాలకు ఉదాహరణలు. మొక్కలు సూర్యకాంతి ఉన్నప్పుడు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. బాక్టీరియా కాంతి లేనప్పుడు స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఈ బాక్టీరియాలు అకర్బన శక్తి వనరులను వినియోగించి కార్బన్ డై ఆక్సైడ్ నుండి కర్బన సమ్మేళనాలను తయారు చేసుకుంటాయి. అందువలన ఈ బాక్టీరియాలను రసాయన స్వయంపోషక జీవులు అంటారు. ఈ ప్రక్రియ ద్వారా బాక్టీరియాలు తమకు కావలసిన ఆహారము లేదా శక్తిని సమకూర్చుకుంటాయి. రసాయన ప్రక్రియ ద్వారా ఆహారమును తయారు చేయడానికి కావలసిన శక్తిని అకర్బన అణువులయిన ఇనుము, గంధకము మరియు మెగ్నీషియంలను ఆక్సీకరణము చేయుట ద్వారా పొందుతాయి.
ఉదా : నత్రజని స్థాపక బాక్టీరియా – నేలయందు ఉండునది.

లావా పదార్థములందుండు ఇనుము ఆక్సీకరణ బాక్టీరియా సముద్ర అడుగుభాగమున వేడి రంధ్రముల యందుండే గంధకము ఆక్సీకరణ బాక్టీరియా.

ప్రశ్న 26.
డాక్టర్‌ను అడిగి కింది విషయాల గురించి తెలుసుకోండి. చార్టును తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి.
ఎ) ఏ పరిస్థితులలో రోగికి గ్లూకోజ్ అవసరమౌతుంది?
బి) ఎప్పటి వరకు గ్లూకోజ్ అందిస్తారు?
సి) గ్లూకోజ్ రోగిని ఎలా కోలుకోనేటట్లు చేస్తుంది?
జవాబు:
ఎ) గ్లూకోజ్ అవసరమయ్యే పరిస్థితులు :

  1. రోగి బాగా నీరసంగా ఉన్నప్పుడు
  2. రోగి దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతూ బలహీనం చెందినపుడు
  3. డయేరియాతో రోగి నీరసించినపుడు
  4. ఆపరేషన్ తరువాత రోగి త్వరగా కోలుకోవటానికి, గ్లూకోజ్ ఎక్కిస్తారు.

బి) ఎప్పటి వరకు గ్లూకోజ్ ఎక్కిస్తారు?
1. సాధారణంగా వ్యక్తి యొక్క ఆరోగ్యస్థితి, వ్యాధిని బట్టి డాక్టర్లు ఎక్కించాల్సిన గ్లూకోజు మోతాదును నిర్ణయిస్తారు. కొన్నిసార్లు రోగి కోలుకోనే వరకు గ్లూకోజ్, విరామంతో ఎక్కిస్తుంటారు.

సి) గ్లూకోజ్ రోగిని ఎలా కోలుకొనేటట్లు చేస్తుంది?
1. గ్లూకోజ్ సరళమైన చక్కెర పదార్థం. ఇది నేరుగా రక్తంలోనికి శోషణ చెంది, కణ శ్వాసక్రియలో పాల్గొని, శక్తిని ఇస్తుంది. తక్షణ శక్తి లభించుట వలన రోగి త్వరగా కోలుకుంటాడు. మిగిలిన ఆహార పదార్థాలవలె గ్లూకోజ్ జీర్ణక్రియలోనికి చేరి జీర్ణం కావలసిన అవసరం లేదు. అందుకే నేరుగా రక్తంలోనికి ఎక్కిస్తారు.

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ ½ Mark Important Questions and Answers

సరైన గ్రూపును గుర్తించండి

1. ఏ జీవుల సమూహం జాంతవ పోషణను చూపిస్తుంది?
A. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు
B. స్వయం పోషకాలు, పూతికాహారులు, పరాన్నజీవులు
జవాబు:
సమూహం A

2. ఈ క్రింది ఏ సమూహం, పరపోషణకు సంబంధించినది?
A. స్వయంపోషణ, సహజీవనము, పరాన్న జీవనం
B. పూతికాహార పోషణ, పరాన్న జీవనం, జాంతవ పోషణ
జవాబు:
సమూహం B

3. ఏ జీవుల సమూహం పూతికాహారులు?
A. హుక్ వార్మ్, కస్కుట, లైకెన్
B. శిలీంద్రం, రొట్టె బూజు, పుట్టగొడుగు
జవాబు:
సమూహం B

4. ఏ గ్రూపు జీవులలో జాంతవ పోషణ ఉండదు?
A. అమీబా, పారామీషియం, మానవులు
B. మొక్కలు, కస్కుట, శిలీంధ్రాలు
జవాబు:
సమూహం B

5. ఏ సమూహంలోని కాంతి చర్య సంఘటనలు సరియైన క్రమంలో అమర్చబడినాయి?
A. పత్రహరితం కాంతిని శోషించుట, నీటి కాంతి విశ్లేషణ, స్వాంగీకరణ శక్తి ఏర్పడటం
B. పత్రహరితం కాంతిని శోషించుట, స్వాంగీకరణ శక్తి ఏర్పడటం, నీటి కాంతి విశ్లేషణ
జవాబు:
సమూహం A

6. ఏ సమూహంలోని వ్యాధులకు విటమిన్ లోపంతో సంబంధం లేదు?
A. క్వాషియోర్కర్, మెరాస్మస్, ఊబకాయం
B. అనీమియా, స్కర్వీ, రికెట్స్
జవాబు:
సమూహం A

7. ఏ గ్రూపులోని ఎంజైమ్ లు – కార్బోహైడ్రేట్ల పై పని చేయవు?
A. టయలిన్, అమైలేజ్, సుక్రేజ్
B. లైపేజ్, ట్రిప్సిన్, పెప్పిన్
జవాబు:
సమూహం B

8. ఏ సమూహంలోని విటమిన్ లు రక్తహీనతను కలిగిస్తాయి?
A. పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లం, సయానోకోబాలమిన్
B. నియాసిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, బయోటిన్
జవాబు:
సమూహం A

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

9. క్లోమరసంలో ఏ గ్రూపు ఎంజైమ్ లు ఉంటాయి?
A. అమైలేజ్, పెప్సిన్, లైపేజ్
B. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్
జవాబు:
సమూహం B

10. ఏ సమూహంలోని విటమిన్స్ కొవ్వులో కరుగుతాయి?
A. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కె
B. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి
జవాబు:
సమూహం A

ఫ్లో చార్టులు

11.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 16
జవాబు:
ఆస్యకుహరం

12.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 17
జవాబు:
ఆంత్రమూలం

13.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 18
జవాబు:
పురీషనాళం

14.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 19
జవాబు:
నీటి అణువు విచ్ఛిన్నం

15.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 20
జవాబు:
జీర్ణక్రియ

16.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 21
జవాబు:
నీటిలో కరిగే విటమిన్లు

17.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 22
జవాబు:
మొక్కలు / కిరణజన్య సంయోగక్రియ బాక్టీరియా

18.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 23
జవాబు:
పక్షి / మానవుడు

19.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 24
జవాబు:
పూతికాహార పోషణ

20.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 25
జవాబు:
క్వాషియోర్కర్

విస్తరించుము

21. CO2 – కార్బన్ డై ఆక్సైడ్
22. H2S – హైడ్రోజన్ సల్ఫైడ్
24. ATP – అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్
25. NADP – నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ ( విటమిన్లు
26. NADPH – నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్
27. RUBP – రిబ్యులోజ్ 1, 5 బై ఫాస్ఫేట్

ఉదాహరణ ఇవ్వండి

28. మొక్కల వలె కాంతి శక్తిని ఉపయోగించుకొని తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకునే సామర్థ్యం కలిగి ఉండే జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కిరణజన్య సంయోగక్రియ జరిపే బాక్టీరియా / శైవలాలు

29. కస్కుట మొక్క పరాన్నజీవికి ఉదాహరణ. జంతు పరాన్న జీవికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
రింగ్ వార్మ్ / జలగ / పేను / జంతువులు

30. పూతికాహార పోషణకు పుట్టగొడుగు ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
శిలీంధ్రాలు / రొట్టె బూజు జాంతవ పోషణ

31. జాంతవ పోషణను చూపించే ఏకకణ జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అమీబా / పారామీషియం

32. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ల మీద పనిచేస్తుంది. కొవ్వులపై చర్య జరిపే ఎంజైమ్ కు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లైపేజ్

33. క్వాషియోర్కర్, పోషకాహార లోపానికి ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మెరాస్మస్

34. నెమరు వేసే జీవులలో వ్యతిరేక పెరిస్టాలసిస్ కనిపిస్తుంది. మానవులలో దీనిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వాంతి చేసుకోవడం

35. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధం చేసే జీర్ణ గ్రంథికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్లోమం

36. విటమిన్ ‘ఎ’ ని కలిగి ఉన్న పండ్లకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొప్పాయి / మామిడి

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

37. విటమిన్ బి-కాంప్లెక్స్ నీటిలో కరిగే విటమిన్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
విటమిన్ సి

శాస్త్రవేత్తను గుర్తించండి

38. 1931లో కిరణజన్య సంయోగక్రియకు సమీకరణాన్ని ప్రతిపాదించి ఆమోదించారు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు.
జవాబు:
సి.బి. వాన్ నీల్.

39. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్, నీటి నుంచి విడుదల అవుతుందని తెలియజేశాడు. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్యలను గురించి కనుగొన్నాడు.
జవాబు:
రాబర్ట్ హిల్

40. తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడం వలన మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి, జంతువుల మనుగడకు దోహదం చేస్తుందని నిర్ధారించాడు.
జవాబు:
జోసెఫ్ ప్రీస్టే

41. ఆయన డచ్ శాస్త్రవేత్త. నీటి మొక్కలపై జరిపిన ప్రయోగంలో, ప్రకాశవంతమైన సూర్యకాంతి సమక్షంలో నీటిమొక్కల, ఆకుపచ్చ భాగాల చుట్టూ చిన్నపాటి బుడగలు ఏర్పడతాయని చీకటిలో ఉన్నప్పుడు బుడగలు ఏర్పడలేదని తెలియజేశాడు.
జవాబు:
జాన్ ఇంజెన్ హౌజ్

42. ఆయన జర్మన్ వృక్ష శాస్త్రవేత్త. పత్రహరితం మొక్కలలోని కణం అంతా వ్యాపించి ఉండదని గమనించాడు.
జవాబు:
జులియస్ వాన్ సాక్స్

43. అతను జర్మన్ వృక్ష శాస్త్రవేత్త. ఆక్సిజన్ ఉత్తేజిత బాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలి కాంతి కిరణాలను ప్రసరింపజేసినపుడు అవి గుంపులుగా ఏర్పడటం గమనించాడు.
జవాబు:
ఎంగల్ మన్

44. ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఆకుపచ్చ రంగులో ఉన్న పదార్థాన్ని వెలికితీసి, దానికి పత్రహరితమని పేరు పెట్టారు.
జవాబు:
పెల్లిటియర్ మరియు కావనో

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి

45. పరపోషకాలు అనేవి కాంతి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా తమ స్వంత ఆహారాన్ని సంశ్లేషణ చేయగల జీవులు.
జవాబు:
స్వయంపోషకాలు అనేవి కాంతి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా తమ స్వంత ఆహారాన్ని సంశ్లేషణ చేయగల జీవులు.

46. మొక్కలు ఆకుపచ్చ వర్ణద్రవ్యం కెరోటిన్ ని కలిగి ఉంటాయి.
జవాబు:
మొక్కలు ఆకుపచ్చ వర్ణద్రవ్యం పత్రహరితంని కలిగి ఉంటాయి.

47. కిరణజన్య సంయోగక్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడటంతో పాటుగా ఒక నీటి అణువు, ఒక అణువు కార్బన్ డై ఆక్సైడ్ కూడా ఉత్పన్నమవుతాయి.
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడటంతో పాటుగా ఒక నీటి అణువు, ఒక అణువు ఆక్సిజన్ కూడా ఉత్పన్నమవుతాయి.

48. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ నుంచి విడుదలవుతుంది.
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్, నీరు నుంచి విడుదలవుతుంది.

49. పిండిపదార్థం యొక్క ఉనికిని నీలం ఆకుపచ్చ రంగు ద్వారా గుర్తించవచ్చు.
జవాబు:
పిండిపదార్థం యొక్క ఉనికిని నీలం – నలుపు రంగు ద్వారా గుర్తించవచ్చు.

50. అమీబా తన శైలికల ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది.
జవాబు:
అమీబా తన మిథ్యాపాదాలు ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది.

51. జీరాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అంటారు.
జవాబు:
జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని క్రైమ్ అంటారు.

52. జీర్ణాశయం చివర ఉండే ఉప జిహ్విక ఆహార పదార్థాన్ని జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి వచ్చే విధంగా నియం త్రిస్తాయి.
జవాబు:
జీర్ణాశయం చివర ఉండే వలయాకార సంవరిణి కండరాలు ఆహార పదార్థాన్ని జీర్ణాశయం నుండి చిన్నప్రేగులోకి వచ్చే విధంగా నియంత్రిస్తాయి.

53. పెప్సిన్ పిండి పదార్థాన్ని డెక్టోజ్ మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది.
జవాబు:
టయలిన్ పిండి పదార్థాన్ని డెక్ట్రోజ్ మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది.

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

54. బయోటిన్ లోపం వల్ల పిల్లగ్రా వస్తుంది.
జవాబు:
నియాసిన్ లోపం వల్ల పెల్లగ్రా వస్తుంది.

నేను ఎవరు

55. నేనొక విటమిన్ సి. ప్రేగుల్లో ఉండే బాక్టీరియా నన్ను సంశ్లేషణ చేస్తాయి.
జ. బి12 / సయానోకోబాలమిన్

56. నేనొక విటమిన్ లోపం వలన కలిగే వ్యాధిని. ఎముకలు సరిగా పెరగకపోవడం, పెళుసు బారడం, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు వ్యాధి లకణాలు.
జవాబు:
రికెట్స్

57. నేనొక విటమిన్ ని. నేను ఆకుకూరలలో, పుల్లని పండ్లు మరియు మొలకెత్తిన గింజలలో లభిస్తాను. నా రసాయన నామం ఏమిటి?
జవాబు:
ఆస్కార్బిక్ ఆమ్లం

58. నేనొక విటమిన్ ని. క్యారెట్, టమోటా, బొప్పాయి, మామిడి మరియు ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తాను. నా లోపం వల్ల మీ దేహంలో ఏ భాగం ప్రభావితం అవుతుంది?
జవాబు:
కన్ను మరియు చర్మం

59. నేను ఎంజైములు లేని జీర్ణ రసాన్ని మరియు కొవ్వుల మీద పనిచేస్తాను.
జవాబు:
పైత్యరసం

60. నేను జఠర గ్రంథుల నుండి స్రవించబడే ఎంజైమ్ ను మరియు ప్రోటీన్ల మీద పనిచేస్తాను.
జవాబు:
పెప్సిన్

61. నేను కిరణజన్య సంయోగక్రియ ప్రయోగంలో ఉపయోగించే రసాయన పదార్థాన్ని మరియు CO2 ని శోషించుకునే లక్షణం నాకు ఉంది.
జవాబు:
KOH

62. కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన, తీగలుగా చుట్టు కుంటూ పెరిగే పత్రరహిత పరాన్నజీవి మొక్కను నేను.
జవాబు:
కస్కుట

63. అధిక కేలరీల ఆహారం తీసుకోవటం వలన కలిగే పోషకాహార లోపాన్ని నేను.
జవాబు:
ఊబకాయం

64. పత్రహరితాన్ని తొలంచడానికి సహాయపడే రసాయన పదార్థాన్ని నేను.
జవాబు:
మిథిలేటెడ్ స్పిరిట్

పోలికను గుర్తించుట

65. స్వయం పోషకాలు : మొక్కలు :: పరపోషకాలు 😕
జవాబు:
జంతువులు నేను ఎవరు?

66. హుక్ వార్మ్ : పరాన్న జీవి :: రైజోపస్ 😕
జవాబు:
పూతికాహారి

67. లాలాజలం : నోరు :: పైత్యరసం 😕
జవాబు:
ఆంత్రమూలం

68. కాంతి చర్యలు 😕 :: నిష్కాంతి చర్యలు : అవర్ణిక
జవాబు:
గ్రానా

69. ఆక్సిజన్ : కాంతి చర్యలు :: ? : నిష్కాంతి చర్యలు
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్

70. అమైలేజ్ : కార్బోహైడ్రేట్ :: ? : కొవ్వులు
జవాబు:
లైపేజ్

71. కార్బో హైడ్రేట్ : గ్లూకోజ్ :: ప్రోటీన్ 😕
జవాబు:
అమైనో ఆమ్లాలు

72. కాంతి చర్యలు : ? :: నిష్కాంతి చర్యలు : క్రెబ్
జవాబు:
రాబర్ట్ హిల్

73. థయామిన్ : బెరి బెరి :: ? : గ్లోసైటిస్
జవాబు:
రైబోఫ్లేవిన్

74. విటమిన్ K : ఫిల్లోక్వినోన్ :: విటమిన్ E 😕
జవాబు:
టోకోఫెరోల్

జతపరుచుట

75. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
అంతర గ్రహణం – నోరు
శోషణ – జీర్ణాశయం
మల విసర్జన – పాయువు
జవాబు:
శోషణ – జీర్ణాశయం

76. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఆహార వాహిక – పెరిస్టాలసిస్
నోరు – చిలకడం
జీర్ణాశయం – మాస్టికేషన్
జవాబు:
ఆహార వాహిక – పెరిస్టాలసిస్

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

77. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కాలేయం – పైత్యరసం
క్లోమం – క్లోమరసం
జీర్ణాశయం – ఆంత్రరసం
జవాబు:
జీర్ణాశయం – ఆంత్రరసం

78. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
క్వాషియోర్కర్ – ప్రోటీన్ లోపం
ప్లోరోసిస్ – విటమిన్ లోపం
ఊబకాయం – కేలరీల లోపం
జవాబు:
క్వాషియోర్కర్ – ప్రోటీన్ లోపం

79. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
విటమిన్ D – కాల్సిఫెరాల్
విటమిన్ B6 – పైరిడాక్సిన్
విటమిన్ A – టోకోఫెరాల్
జవాబు:
విటమిన్ A – టోకోఫెరాల్

80. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
రికెట్స్ – కన్ను
గ్లాసైటిస్ – నాలుక
జెరోఫ్తాల్మియా – చర్మం
జవాబు:
గ్లాసైటిస్ – నాలుక

81. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
పాంటాథెనిక్ ఆమ్లం – చిలకడదుంప
ఆస్కార్బిక్ ఆమ్లం – తృణధాన్యాలు
థయమిన్ – నిమ్మ
జవాబు:
పాంటాథెనిక్ ఆమ్లం – చిలకడదుంప

82. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
జాన్ ఇంజెన్ హౌజ్ – హైడ్రిల్లా ప్రయోగం
జోసెఫ్ ప్రీస్ట్లీ – అర్ధపత్ర ప్రయోగం
మోల్ – గంటజాడీ ప్రయోగం
జవాబు:
జాన్ ఇంజెన్ హౌజ్ – హైడ్రిల్లా ప్రయోగం

83. సరైన క్రమాన్ని గుర్తించండి.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 26
జవాబు:
సి

84. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
శాకాహారి – కుక్క
మాంసాహారి – కుందేలు
సర్వభక్షకి – కాకి
జవాబు:
సర్వభక్షకి – కాకి

బొమ్మలపై ప్రశ్నలు

85.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 27
ఈ పటం ఏ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది?
జవాబు:
విటమిన్ K

86.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 28
ఈ పరీక్ష దేనిని సూచిస్తుంది?
జవాబు:
పిండిపదార్థ పరీక్ష

87.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 29
గంట జాడీలో ఎలుకకు ఊపిరి ఆగక పోవడానికి ఏ వాయువు కారణం?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్

88.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 30
ఈ ప్రయోగం పేరేమిటి?
జవాబు:
మోల్స్ అర్ధపత్ర ప్రయోగం మోల్

89.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 31
ఈ ప్రయోగంలో గరాటులో ఉంచిన మొక్క, పేరేమిటి?
జవాబు:
హైడ్రిల్లా / ఎలోడియా మొక్కలు

90.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 32
పటంలోని X భాగాన్ని గుర్తించండి.
జవాబు:
స్పంజి మృదుకణజాలం :

91. ఈ పటంలో తప్పుగా లేబుల్ గుర్తించిన భాగాన్ని
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 33
జవాబు:
జీర్ణాశయం

92.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 34
ఈ జీవిలో ఏ రకమైన పోషణ కనిపిస్తుంది?
జవాబు:
జాంతవ పోషణ

93.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 35
పటంలో చూపిన ‘X’ అనే భాగం పేరేమిటి?
జవాబు:
లాలాజల గ్రంథులు

94.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 36
పటం సహాయంతో మీ శరీరంలో ఉండే అతి పెద్ద జీర్ణగ్రంథి గుర్తించండి.
జవాబు:
కాలేయం

95.
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 37
ఆకులో ఈ నిర్మాణాలు ఎక్కడ కనపడతాయి?
జవాబు:
క్రింది బాహ్యచర్మం

ఖాళీలను పూరించండి

96. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు ………….
జవాబు:
ఆక్సిజన్

97. కిరణజన్య సంయోగ క్రియలో అంతర కారకం ………..
జవాబు:
పత్రహరితం

98. థైలకాయిడ్ దొంతరను ఇలా ………….. అంటారు.
జవాబు:
గ్రాన

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

99. నీటి అణువు విచ్చిన్నం చెందే ప్రక్రియ …………
జవాబు:
నీటి కాంతి విశ్లేషణ

100. కిరణజన్య సంయోగక్రియలోని రెండవ దశ ………….
జవాబు:
నిష్కాంతి దశ

101. ఆహార నాళ ప్రారంభ భాగం ………..
జవాబు:
నోరు

102. అతిపెద్ద జీర్ణగ్రంథి …………
జవాబు:
కాలేయం

103. జీర్ణనాళంలో ఆమ్ల స్థితి కలిగిన భాగం ……….
జవాబు:
జీర్ణాశయం

104. జీర్ణక్రియకు తోడ్పడే రసాయనాలు ……….
జవాబు:
ఎంజైమ్స్

105. జీర్ణవ్యవస్థలో శోషణ జరిగే భాగం ………….
జవాబు:
చిన్న ప్రేగు

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
A) హస్టోరియా – కస్కుటా
B) టెస్టోస్టిరాన్ – స్త్రీ బీజకోశము
C) గ్రానం – హరిత రేణువు
D) ఉపజిహ్వక – నోరు
జవాబు:
B) టెస్టోస్టిరాన్ – స్త్రీ బీజకోశము

2. ఫోలిక్ ఆమ్లము లోపం వల్ల కలిగే వ్యాధి
A) రక్త హీనత
B) పెల్లాగ్రా
C) గ్లాసైటిస్
D) రికెట్స్
జవాబు:
A) రక్త హీనత

3. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరైన వాక్యం
A) కాంతిశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది
B) కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
C) కాంతిశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది
D) ఉష్ణశక్తి రసాయనిక శక్తిగా మారుతుంది
జవాబు:
B) కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారుతుంది

4. పిండి పదార్థాన్ని గుర్తించే పరీక్షలో అయోడిను బదులుగా ఈ క్రింది పదార్థాన్ని కూడా వాడవచ్చు …….
A) బెటాడిన్
B) బ్రోమిన్
C) క్లోరిన్
D) బెంజీన్
జవాబు:
A) బెటాడిన్

5. క్రింది సమీకరణంలో లోపించినది రాయండి.
CO2 + 2H2O → CH2O + …….. + O2
A) CO2
B) H2O
C) C6H12O6
D) 6SO2
జవాబు:
B) H2O

6. ఈ క్రింది విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కల్గుతుంది.
A) B1
B) B2
C) B3
D) B6
జవాబు:
B) B2

7. అయోడిన్ పరీక్ష ద్వారా కింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు?
A) కొవ్వులు
B) మాంసకృత్తులు
C) విటమిన్లు
D) పిండి పదార్థాలు
జవాబు:
D) పిండి పదార్థాలు

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

8. ఈ క్రింది వానిలో సరైన జతకానిది ………….
A) ప్రోటీన్లు – అమైనో ఆమ్లాలు
B) కార్బోహైడ్రేట్స్ – గ్లూకోజ్
C) క్రొవ్వులు – పిండిపదార్థం
D) గ్లూకోజ్ – పిండిపదార్థం
జవాబు:
C) క్రొవ్వులు – పిండిపదార్థం

9. క్రింది వ్యాఖ్యలను చూడండి.
ఎ) క్వాషియోర్కర్ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది.
బి) మెరాస్మస్ వ్యాధి కేవలం కేలరీల లోపం వల్ల వస్తుంది.
A) ఎ, బి రెండూ సత్యాలు
B) ఎ సత్యము, బి అసత్యము
C)ఎ అసత్యము, బి సత్యము
D) ఎ, బి రెండూ అసత్యాలే
జవాబు:
B) ఎ సత్యము, బి అసత్యము

10. మొక్కను చీకటి గదిలో ఉంచితే ……… జరగదు.
A) శ్వాసక్రియ
B) ప్రత్యుత్పత్తి
C) కిరణజన్య సంయోగక్రియ
D) నీటి రవాణా
జవాబు:
C) కిరణజన్య సంయోగక్రియ

11. ఒక వ్యక్తి అజీర్తితో బాధపడటం లేదంటే ఈ విధంగా విశ్లేషించవచ్చు
A) సమతుల ఆహారాన్ని తీసుకోవడం లేదు
B) ఆహారాన్ని తొందరగా తినడం
C) ఆహారాన్ని బాగా నమిలి తినడం
D) తిన్న వెంటనే వ్యాయామం చేయడం
జవాబు:
C) ఆహారాన్ని బాగా నమిలి తినడం

12. ఈ కణాంగం పేరు
AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 38
A) త్వచము
B) మైటోకాండ్రియా
C) హరితరేణువు
D) ఏదీకాదు
జవాబు:
C) హరితరేణువు

13. కిరణజన్య సంయోగక్రియ అంత్య పదార్థము
A) గ్లూకోజ్
B) ఆక్సిజన్
C) నీరు
D) అన్ని
జవాబు:
A) గ్లూకోజ్

14. క్రింది వానిలో పరాన్న జీవనము జరిపేది
A) కస్కుట
B) ఈస్ట్
C) పుట్టగొడుగు
D) చేప
జవాబు:
A) కస్కుట

15. మీ ఆహారంలో విటమిన్ ‘A’ లోపించినట్లైతే వచ్చే’ వ్యాధిలో లక్షణాలు ఉండవచ్చు?
A) తక్కువ కాంతిలో చూడలేకపోవుట
B) ఆకలి లేకపోవడం
C) వెలుతురు చూడలేకపోవడం
D) నీటి విరేచనాలు
జవాబు:
A) తక్కువ కాంతిలో చూడలేకపోవుట

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

16. ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమౌతుంది?
A) మొక్క చనిపోతుంది
B) బాగా పెరుగుతుంది
C) పొట్టిగా మారుతుంది
D) పైవేవి కాదు
జవాబు:
D) పైవేవి కాదు

17. ప్రోటీన్ల లోపం వలన కలిగే వ్యాధి
A) క్వాషియార్కర్
B) మెగాస్మస్
C) స్థూలకాయత్వం
D) అనీమియా
జవాబు:
A) క్వాషియార్కర్

18. అతిథేయి మొక్కలోనికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహించడానికి కస్కుటా మొక్కలలో గల ప్రత్యేక నిర్మాణాలు
A) డాడర్
B) హాస్టోరియా
C) లెగ్యూమ్ వేర్లు
D) వాయుగత వేర్లు
జవాబు:
B) హాస్టోరియా

19. ఈ క్రింది వానిలో సరయిన దానిని గుర్తించండి.
a. థయమిన్ (B1) ( ) 1. స్కర్వీ
b. సిట్రికామ్లం (C) ( ) 2. రేచీకటి
c. రెటినాల్ (A) ( ) 3. బెరిబెరి
A) (a – 3), (b – 1), (c – 2)
B) (a – 1), (b – 2), (c – 3)
C) (a – 2), (b – 3), (c – 1)
D) (a – 3), (c – 1), (b – 2)
జవాబు:
A) (a – 3), (b – 1), (c – 2)

20. భిన్నమైన దానిని గుర్తించుము.
A) కార్బోహైడ్రేట్లు
B) కొవ్వులు
C) ప్రోటీన్స్
D) పైరిత్రాయిడ్స్
జవాబు:
D) పైరిత్రాయిడ్స్

21. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారకాలు
A) కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, పత్రహరితం, ఉష్ణోగ్రత
B) కాంతి, నీరు, పత్రహరితం, ఉష్ణోగ్రత
C) కాంతి, ఉష్ణోగ్రత, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్

22. క్రింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసం
A) పైత్యరసం
B) జఠరరసం
C) క్లోమరసం
D) లాలాజలం
జవాబు:
A) పైత్యరసం

23. క్రింది వాటిలో పరాన్న జీవి మొక్క
A) కస్కుట
B) మందార
C) కాకర
D) మల్లె
జవాబు:
A) కస్కుట

24. పెప్సిన్ : ప్రోటీన్లు : : లైపేజ్ : …………
A) కార్బోహైడ్రేట్లు
B) కొవ్వులు
C) విటమిన్లు
D) సుక్రోజ్
జవాబు:
B) కొవ్వులు

25. C6H12O6 + 6O2 → + 6H2O + శక్తి
A) 6CO2
B) C6H12O6
C) 6O2
D) 12CO2
జవాబు:
A) 6CO2

26. క్రింది వాక్యాలను సరిచూడండి.
1. పత్రహరితం రక్తంలోని హీమోగ్లోబిన్ అనే వర్ణకంను పోలి ఉంటుంది.
2. హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే, పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది.
A) 1 సరియైనది, 2 తప్పు
B) 1 తప్పు, 2 సరియైనది
C) 1, 2 రెండూ సరియైనవి
D) 1, 2 రెండూ తప్పు
జవాబు:
C) 1, 2 రెండూ సరియైనవి

27. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
i) కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సీజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి.
ii) కిరణజన్య సంయోగక్రియలో నీటి అణువు విచ్ఛిత్తి చెందటం ఒక ముఖ్యమైన సంఘటన.
A) (i) – సత్యము, (ii) – సత్యము
B) (i) – అసత్యము, (ii) అసత్యము
C) (i) – సత్యము, (ii) – అసత్యము
D) (i) – అసత్యము, (ii) – సత్యము
జవాబు:
A) (i) – సత్యము, (ii) – సత్యము

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

28. నేనొక విటమినను. నేను పప్పుధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము, పాలు, మూత్రపిండాలు మొదలగువానిలో లభిస్తాను. నా లోపం వల్ల మీకు నాడీ సంబంధ సమస్యలు కలుగుతాయి. నేనెవరిని?
A) థయమిన్
B) పైరిడాక్సిన్
C) పాంటోథెనిక్ ఆమ్లం
D) బయోటిన్
జవాబు:
D) బయోటిన్

29. కింది వానిలో టీకాల ద్వారా నివారించలేని వ్యాధి
A) పోలియో
B) హెపటైటిస్
C) మలేరియా
D) కోరింతదగ్గు
జవాబు:
C) మలేరియా

30. సరికాని జత ఏది?
A) విటమిన్ A – రెటినాల్
B) విటమిన్ D – కాల్సిఫెరాల్
C) విటమిన్ K – టోకోఫెరాల్
D) విటమిన్ C – ఆస్కార్బిక్ ఆమ్లం
జవాబు:
C) విటమిన్ K – టోకోఫెరాల్

31. క్రింది వాటిని జతపరుచుము.

జాబితా – Aజాబితా – B
i) పెప్సిన్a) పిండి పదార్థాలు
ii) అమైలేజ్b) ప్రోటీన్లు
iii) లైపేజ్c) క్రొవ్వులు

A) (i) – (b), (ii) – (a), (iii) – (c)
B) (i) – (a), (ii) – (b), (iii) – (c)
C) (i) – (c), (ii) – (b), (iii) – (a)
D) (i) – (a), (ii) – (c), (iii) – (b)
జవాబు:
A) (i) – (b), (ii) – (a), (iii) – (c)

32. ప్రయోగశాలలో ద్రావణాల్లో ఆక్సిజన్ ఉందో, లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించే కారకం
A) KOH ద్రావణం
B) జానస్ గ్రీన్ B
C) అయోడిన్ ద్రావణం
D) మిథిలీన్ బ్లూ
జవాబు:
B) జానస్ గ్రీన్ B

33. క్రింది వానిలో సరియైన జత కానిది?
A) పైత్యరసం – కాలేయం
B) ట్రిప్సిన్ – క్లోమం
C) పెప్సిన్ – చిన్నప్రేగు
D) టయలిన్ – లాలాజల గ్రంథులు
జవాబు:
C) పెప్సిన్ – చిన్నప్రేగు

34. ఆకులోని హరిత పదార్థమును తొలగించడానికి చేసే ప్రయోగంలో ఉపయోగించే రసాయనము
A) మిథిలేటెడ్ స్పిరిట్
B) KOH ద్రావణము
C) అయొడిన్ ద్రావణం
D) అసిటిక్ ఆమ్లము
జవాబు:
A) మిథిలేటెడ్ స్పిరిట్

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

35. ‘E’ విటమిను ఇలా కూడా పిలుస్తారు.
A) ఫైలోక్వినోన్
B) కాల్సిఫెరాల్
C) ఆస్కార్బిక్ ఆమ్లం
D) టోకోఫెరాల్
జవాబు:
D) టోకోఫెరాల్

మీకు తెలుసా?

* కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అటువంటప్పుడు కిరణజన్యసంయోగ క్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాన్లను వేరుచేయలేము. కాని 1954 తరువాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుండి కిరణజన్యసంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్టు వేరుచేయగలిగాడు.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 39

I.

శాస్త్రవేత్తఅంశము
1. సి.బి. వాన్ నీల్కిరణజన్యసంయోగక్రియ సమీకరణం
2. వాన్ హెల్మాంట్మొక్కల బరువు పెరుగుదలలో నీటిపాత్ర
3. జోసఫ్ ప్రీస్టేకిరణజన్యసంయోగక్రియలో గాలి ప్రాధాన్యత, ఆక్సిజన్ ఆవిష్కరణ
4. లేవోయిజర్ఆక్సిజన్ కు నామకరణం
5. ఇంజన్‌ హౌజ్కిరణజన్యసంయోగక్రియలో కాంతి ప్రాధాన్యత
6. ఎంగల్మన్కిరణజన్యసంయోగక్రియ కనుగొనే స్థానం
7. పెల్లిటియర్, కావనోపత్రహరిత కషాయం
8. జూలియస్ వాన్సక్స్పత్రహరిత పరిశీలన
9. డేనియల్ ఆర్నాన్హరితరేణువును కణం నుండి వేరుచేయుట

II.

ఆహారపదార్థంఎంజైమ్స్అంత్య ఉత్పన్నం
1. పిండిపదార్థంఅమైలేజ్, రెనిన్ (లాలాజలం)చక్కెరలు, గ్లూకోజు
2. ప్రోటీన్లుపెప్సిన్ (జఠరరసం)
ట్రిప్సిన్ (క్లోమరసం)
పెప్టిడేజెస్ (ఆంత్రరసం)
ఎమైనో ఆమ్లాలు
3. కొవ్వులుపైత్యరసం (కాలేయం)
లైపేజ్ (క్లోమరసం)
కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

These AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 12th Lesson Important Questions and Answers కార్బన్ – దాని సమ్మేళనాలు

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
అణు సాదృశ్యంను నిర్వచించండి.
జవాబు:
ఓకే అణు ఫార్ములా గల సమ్మేళనాలు వేరు వేరు ధర్మాలను కలిగి ఉండడాన్ని అణు సాదృశ్యం అంటారు.

ప్రశ్న 2.
ఈ క్రింది ప్రమేయ సమూహాల పేర్లు వ్రాయండి.
a) – COOR
b) – OH
జవాబు:
a) – COOR = ఎస్టర్
b) – OH = ఆల్కహాల్

ప్రశ్న 3.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 1 కు IUPAC పేరు రాయండి.
జవాబు:
3 మోనో క్లోరో బ్యూట్ 1 ఈన్ (లేదా) 3 క్లోరో 1 బ్యూటీన్.

ప్రశ్న 4.
దహనచర్యలో ఆక్సిజన్ పాత్రను వివరించండి.
జవాబు:
ఆక్సిజన్ దహన చర్యకు దోహదకారి (లేక) పదార్థం మండడానికి ఆక్సిజన్ సహాయపడుతుంది (లేక) ఆక్సిజన్ లేనిదే దహనచర్య జరుగదు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 5.
పిండికి ఈస్ట్ ను కలిపిన కొద్ది సేపటికి అది ఉబ్బుతుంది. ఎందుకు?
జవాబు:

  1. పిండికి ఈస్టను కలిపినప్పుడు ఈస్ట్ జైమేజ్, ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ లను విడుదల చేయును.
  2. ఇన్వర్టేజ్ ఎంజైము పిండి పదార్థంలోని పాలిశాకరైడ్ లను మోనోశాకరైడ్లుగా విడగొట్టును.
  3. జైమేజ్ ఎంజైమ్ మోనోశాకరైడ్లను ఆల్కహాల్ మరియు CO2 లుగా విడగొట్టును.
  4. ఇలా విడుదలయిన CO2 వాయువు పిండి నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోతుంది.
  5. అందువలన పిండి ఉబ్బి మెత్తగా తయారవుతుంది.

ప్రశ్న 6.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 2
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 3

ప్రశ్న 7.
నానో ట్యూమై రెండు ఉపయోగాలను రాయండి.
జవాబు:

  1. నానో ట్యూబ్ లను అణుతీగలుగా ఉపయోగిస్తారు.
  2. సమీకృత వలయాలలో రాగికి బదులుగా నానో ట్యూబ్ లను అనుసంధాన తీగలుగా ఉపయోగిస్తారు.
  3. అతి చిన్నదైన కణంలోకి ఏదేని జీవాణువులను ప్రవేశపెట్టడానికి నానో ట్యూబ్ లను ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
3, 7-డై బ్రోమో-4, 6-2 క్లోరో-ఆర్ట్-5-ఈన్-1, 2-డై ఓల్ అనే కర్బన సమ్మేళనం యొక్క అణునిర్మాణం రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 4

ప్రశ్న 9.
ఆవర్తన పట్టికలో కార్బన్ యొక్క స్థానం తెల్పండి.
జవాబు:
కార్బన్ ఆవర్తన పట్టికలోని 14వ గ్రూప్ లేదా IVA గ్రూప్ మరియు 2వ పిరియడ్ కు చెందిన అలోహము.

ప్రశ్న 10.
సంకరీకరణము అనగానేమి?
జవాబు:
పరమాణువులలో దాదాపు సమాన శక్తి గల ఆర్బిటాళ్లు ఒకదానితో ఒకటి కలిసి అదే సంఖ్యలో సమాన శక్తి, ఆకృతి గల ఆర్బిటాళ్ల సమితిని ఏర్పరచే ప్రక్రియను సంకరీకరణము అంటారు.

ప్రశ్న 11.
మీథేన్ లో sp³ – s అతిపాతంను సూచించు పటాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 5

ప్రశ్న 12.
ఇథిలీన్ (ఈథేన్) అణు ఆకృతిని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 6

ప్రశ్న 13.
రూపాంతరత అనగానేమి?
జవాబు:
ఒక మూలకం రెండు లేక అంతకంటే ఎక్కువ రూపాలలో లభ్యమవుతూ అవి దాదాపు ఒకే విధమైన రసాయన ధర్మాలు మరియు వివిధ భౌతిక ధర్మాలను ప్రదర్శించుటను ,రూపాంతరత అంటారు.

ప్రశ్న 14.
కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరాలు ఏవి?
జవాబు:
నేలబొగ్గు, కోక్, కొయ్య బొగ్గు, జంతు బొగ్గు, దీపాంగరం మొదలైనవి కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరాలు.

ప్రశ్న 15.
కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలను తెల్పండి.
జవాబు:
వజ్రం, గ్రాఫైట్ మరియు బక్ మిస్టర్ ఫుల్లరిన్ అనేవి కార్బన్ యొక్క స్ఫటిక రూపాలు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 16.
అమ్మోనియం సయనేట్ నుంచి యూరియాను ఏ విధంగా తయారు చేస్తారు?
జవాబు:
అమ్మోనియం సయనేట్ ను వేడిచేస్తే యూరియా ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 7

ప్రశ్న 17.
కర్బన పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన గొలుసులు ఏర్పరచే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
కర్బన పరమాణువులు ఒకదానితో ఒకటి కలసి పొడవైన గొలుసులు ఏర్పరచే ప్రక్రియను కాటినేషన్ అంటారు.

ప్రశ్న 18.
కార్బనను ఎందుకు విలక్షణ మూలకం అంటారు?
జవాబు:
కార్బన్ ఈ క్రింది పేర్కొనబడిన ధర్మాలు కలిగి ఉండటం వలన కార్బన్ ను విలక్షణ మూలకంగా గుర్తిస్తారు.

  1. చతుర్ సంయోజకత
  2. కాటినేషన్ (శృంఖల సామర్థ్యం)
  3. బహుబంధాల ఏర్పాటు

ప్రశ్న 19.
హైడ్రోకార్బన్లు అనగానేమి?
జవాబు:
కార్బన్ మరియు హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు.

ప్రశ్న 20.
రేఖీయ కర్బన సమ్మేళనానికి ఒక ఉదాహరణ తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 8

ప్రశ్న 21.
శృంఖల కర్బన సమ్మేళనానికి ఒక ఉదాహరణ తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 9

ప్రశ్న 22.
చక్రీయ కర్బన సమ్మేళనానికి ఒక ఉదాహరణ తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 10

ప్రశ్న 23.
ఆల్కేనులు అనగానేమి?
జవాబు:
కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధం గల సంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కేనులు అంటారు.

ప్రశ్న 24.
ఆల్కీనులు అనగానేమి?
జవాబు:
కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం కలిగిన అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కీనులు అంటారు.

ప్రశ్న 25.
ఆల్కెనులు అనగానేమి?
జవాబు:
కర్బన పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కెనులు అంటారు.

ప్రశ్న 26.
ఒక హైడ్రోకార్బన్ యొక్క ఫార్ములా C12H24. అయితే అది ఏ సమజాత శ్రేణికి చెందిందో తెల్పండి.
జవాబు:
C12H24 అణు ఫార్ములా కలిగిన హైడ్రోకార్బన్ ఆల్కీన్ సమజాత శ్రేణికి చెందినది.

ప్రశ్న 27.
ప్రమేయ సమూహం అనగానేమి?
జవాబు:
ఒక కర్బన సమ్మేళనం యొక్క ధర్మాలు తనలో ఉన్న ఏ మూలకం లేదా సమూహంపై ఆధారపడుతుందో దానిని ప్రమేయ సమూహం అంటారు.

ప్రశ్న 28.
అణు సాదృశ్యం అనగానేమి?
జవాబు:
ఒకే అణుఫార్ములా కలిగి, వేరు వేరు ధర్మాలు గల కర్బన సమ్మేళనాలను అణు సాదృశ్యాలు అంటారు. ఈ దృగ్విషయాన్ని అణు సాదృశ్యం అంటారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 29.
రెండు వరుస సమజాతుల మధ్య తేడా ఎంత ఉంటుంది?
జవాబు:
రెండు వరుస సమజాతుల మధ్య తేడా – CH2 ఉంటుంది.

ప్రశ్న 30.
3 – బ్రోమో – 2 – క్లోరో – 5 ఆక్సో హెక్సనోయిక్ ఆమ్లం నిర్మాణాన్ని తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 11

ప్రశ్న 31.
సఫోనిఫికేషన్ అనగానేమి?
జవాబు:
ఎస్టర్‌ను క్షార సమక్షంలో జలవిశ్లేషణ చెందించి సబ్బును పొందే ప్రక్రియను సఫోనిఫికేషన్ అంటారు.

ప్రశ్న 32.
సబ్బు అనగానేమి?
జవాబు:
రసాయనికంగా సబ్బులు ఫాటీ ఆమ్లాల సోడియం లేక పొటాషియం లవణాలు.

ప్రశ్న 33.
గ్రాఫైట్ ఒక ఉత్తమ విద్యుత్ వాహకంగా ఎలా పని చేస్తుంది?
జవాబు:
అస్థానీకృత π ఎలక్ట్రాన్ వ్యవస్థ వలన గ్రాఫైట్ ఒక ఉత్తమ విద్యుత్ వాహకంగా పని చేస్తుంది.

ప్రశ్న 34.
ఫుల్లరిన్ల ఉపయోగాలు తెల్పండి.
జవాబు:

  1. ఫుల్లరిన్లను కొన్ని రకాల బాక్టీరియాలను నియంత్రించుటకు ఉపయోగిస్తారు.
  2. ఫుల్లరిన్లను మెలనోమా వంటి క్యాన్సర్ నివారణలలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 35.
ఆక్సీకరణులు అనగానేమి?
జవాబు:
వేరే పదార్థాలను ఆక్సీకరణం చెందించే పదార్థాలను ఆక్సీకరణులు అంటారు.

ప్రశ్న 36.
ఆల్కేనులను ఫారాపిన్లు అని ఎందుకు అంటారు?
జవాబు:
ఫారాపిన్లు అనే పదం parum – little, affins = affinity అనే పదాల నుంచి వచ్చింది. దాని అర్థం చర్యాశీలత తక్కువ ఆల్కేనుల చర్యాశీలత తక్కువ కాబట్టి వాటిని ఫారాపిన్లు అంటారు.

ప్రశ్న 37.
వాహనాలలో ఆల్కహాల్ ఉపయోగం తెల్పండి.
జవాబు:
10% ఇథనోల్ కలిగిన గాసోలిన్ ఉత్తమ వాహన ఇంధనంగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 38.
కొల్లాయిడల్ ద్రావణం అనగానేమి?
జవాబు:
విక్షేపక ప్రావస్థ యొక్క కణాల వ్యాసము 1nm కంటే ఎక్కువగాను 1000 nm కంటే తక్కువ పరిమాణంలో విక్షేపణ యానకంలో ఉంటే దానిని కొల్లాయిడల్ ద్రావణం అంటారు.

ప్రశ్న 39.
కార్బన్ కాకుండా కాటినేషన్‌ను ప్రదర్శించే ఇతర మూలకాలు ఏవి?
జవాబు:
సల్ఫర్, ఫాస్ఫరస్ మరియు సిలికాన్.

ప్రశ్న 40.
రేఖీయ గొలుసులు గల హైడ్రోకార్బన్లను ఏమని పిలుస్తారు?
జవాబు:
ఏలిఫాటిక్ లేదా ఎసైక్లిక్ హైడ్రోకార్బన్లు.

ప్రశ్న 41.
IUPACని విస్తరించండి.
జవాబు:
అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్ర సంఘం International Union of Pure and Applied Chemistry.

ప్రశ్న 42.
కర్బన సమ్మేళనాలకు పేర్లు పెట్టేటప్పుడు ప్రమేయ సమూహాల అవరోహణక్రమాన్ని తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 12

ప్రశ్న 43.
ఇంధనంగా ఇథనోల్ పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ఇథనోల్ పూర్తిగా మండి అధిక శక్తిని ఇస్తుంది. కాలుష్యం కూడా తక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి ఇంధనంగా ఇథనోల్ పాత్ర అభినందనీయం.

ప్రశ్న 44.
ఊరగాయలు నిల్వ ఉంచుటలో ఇథనోయిక్ ఆమ్ల పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ఇథనోయిక్ ఆమ్లాన్ని వెనిగర్ రూపంలో ఊరగాయలు అధిక కాలం నిల్వ ఉంచడానికి కలుపుతారు. కాబట్టి ఊరగాయలు నిల్వ ఉంచుటలో ఇథనోయిక్ ఆమ్లం ప్రధానపాత్ర కలిగి ఉంది.

ప్రశ్న 45.
వంటగ్యాస్ లీకవుతున్నట్లు ఏ విధంగా గుర్తిస్తావు?
జవాబు:
వంటగ్యాస కు ఇథైల్ మెర్కిప్టన్ అనే వాసనను ఇచ్చే సమ్మేళనాన్ని కలుపుతారు. దాని ద్వారా వచ్చే దుర్వాసన ద్వారా గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించవచ్చు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 46.
వంటగ్యాస్ (LPG) పర్యావరణ రక్షణలో ఏ విధంగా ఉపయోగపడుతున్నది?
జవాబు:
ఇది అధిక ఉష్ణాన్ని ఇవ్వడమే కాక ఎటువంటి పొగను ఇవ్వదు. కాబట్టి కాలుష్యాన్ని బాగా తగ్గిస్తుంది. కాబట్టి పర్యావరణ రక్షణలో తోడ్పడుతున్నది.

ప్రశ్న 47.
ఔషధాల పరిశ్రమలలో ఇథనోల్ ఏ విధంగా ఉపయోగపడుతున్నది?
జవాబు:
ఔషధాల పరిశ్రమలలోని టించర్లను ఇథనోల్ లో తయారు చేస్తారు. అంతే కాకుండా ఔషధాల తయారీలో ఉపయోగపడే ఇతర సమ్మేళనాలు అనగా క్లోరోఫాం, ఇథనోయిక్ ఆమ్లం మొదలైన వాటిని ఇథనోల్ నుంచి తయారు చేస్తారు.

ప్రశ్న 48.
కృత్రిమంగా తయారు చేయబడ్డ డిటర్జెంట్లు పర్యావరణానికి ఏ విధంగా హానికరం?
జవాబు:

  1. కొన్ని కృత్రిమ డిటర్జెంట్లు బాక్టీరియా చేత విచ్ఛిన్నం చేయబడవు. కాబట్టి ఇవి నదులలో కాని, సరస్సులలో కాని, కలిసినపుడు జల కాలుష్యాన్ని ఏర్పరుస్తున్నాయి.
  2. ఇవి చాలాకాలం నీటిలో ఉండడం వలన నీటిలోని జలచరాలకు హాని కలిగిస్తున్నాయి.

ప్రశ్న 49.
ఈ క్రింది సమ్మేళనం పేరు తెల్పండి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 13
జవాబు:
2, 3 – డై మిథైల్ – సైకో హెక్సాన్ – 1 – ఓల్

ప్రశ్న 50.
హైడ్రోకార్బన్ల మౌళిక వర్గీకరణను తెలుపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 14

ప్రశ్న 51.
CH3 – CH3 ; CH2 = CH2 మరియు HC ≡ CH లలో కార్బన్ యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
CH3 – CH3 లో కార్బన్ వేలన్సీ – 4
CH2 = CH2 లో కార్బన్ వేలన్సీ – 3
HC ≡ CH లో కార్బన్ వేలన్సీ – 2

ప్రశ్న 52.
మిసిలి (సబ్బు నురగ కణం) అనగానేమి?
జవాబు:
సబ్బు నీటిలో గోళాకారంలో దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహాన్నే మిగిలి అంటారు.

ప్రశ్న 53.
సబ్బు కణంలో హైడ్రోఫోబిక్ కొన, హైడ్రోఫిలిక్ కొన అనగానేమి?
జవాబు:
1) సబ్బు కణం యొక్క కార్బాక్సీ AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 15 కోన కలిగిన ధృవకొనను హైడ్రోఫిలిక్ కొన అంటారు. ఇది నీటివైపు ఆకర్షించబడుతుంది.

2) సబ్బు కణం యొక్క అధృవ కొనను (హైడ్రోకార్బన్ కొనను) హైడ్రోఫోబిక్ కొన అంటారు. ఇది మురికి వైపు ఆకర్షించబడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 8

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సబ్బు అణువు ఆకృతిని గీయండి.
జవాబు:
సబ్బు అణువును చూపు పటం
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 8

ప్రశ్న 2.
మీథేన్ అణువు ఆకృతిని గీసి, అణువులో బంధకోణం రాయండి.
జవాబు:
మీథేన్ అణువులోని బంధకోణం 109°28′
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 16

ప్రశ్న 3.
a) వనస్పతి కొవ్వు (నెయ్యి) (vegetable fat) కంటే వనస్పతి నూనెలు (vegetable oils) ఆరోగ్యా నికి మంచివి : అంటారు. ఎందుకు?
జవాబు:
వనస్పతి నూనెలు అసంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటాయి. (లేదా) వనస్పతి నూనెలు తేలికగా జీర్ణం అవుతాయి.

b) AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 17 కు IUPAC పేరు రాయండి.
జవాబు:
3 మోనో క్లోరో బ్యూట్ 1 ఈన్ (లేదా) 3 క్లోరో 1 బ్యూటీన్

ప్రశ్న 4.
ఆల్కీలని వేటిని అంటారు ? వాని సాధారణ ఫార్ములా రాసి, ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:

  • కార్బన్, కార్బన్ మధ్య ద్విబంధం గల అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కీన్లు అంటాం.
  • ఆల్కీన్ల సాధారణ ఫార్ములా CnH2n.
  • ఉదాహరణ : ఇథిలీన్ లేదా C2H4.

ప్రశ్న 5.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 18
పటం ఆధారంగా సమాధానాలు వ్రాయండి.
1) ఈ సమ్మేళనం పేరు వ్రాయండి.
2) ఇందులో వాడబడిన ప్రమేయ సమూహం పేరేమిటి?
జవాబు:
1) సమ్మేళనము : 2, 3-డై ఇథైల్-సైక్లో హెక్సేన్-1-ఓల్
2) ప్రమేయ సమూహము : ఆల్కహాల్

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 6.
కింద ఇచ్చిన సమ్మేళనాలలోని ప్రమేయ సమూహాలను గుర్తించి, IUPAC పేర్లు రాయండి.
i) AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 19
జవాబు:
ఈ సమ్మేళనపు ప్రమేయ సమూహం పేరు ఆల్డిహైడ్. దీని సమ్మేళనపు IUPAC పేరు 2 – క్లోరో – బ్యూటనాల్

ii) AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 20
జవాబు:
ఈ సమ్మేళనపు ప్రమేయ సమూహం కీటోన్. దీని IUPAC పేరు 3 – మిథైల్ – 2 – బ్యూటనోన్.

ప్రశ్న 7.
ఈథైలోని సంకరీకరణం అతిపాతాన్ని సూచించే పటాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 21

ప్రశ్న 8.
ఈ కింది వానిలో ఏవి అసంతృప్త కర్బన సమ్మేళనాలు? మీ యొక్క సమాధానమును సమర్థించండి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 22
జవాబు:
పైన ఇచ్చిన కర్బన సమ్మేళనాలలో a మరియు స్త్రీ సంతృప్తి కర్బన సమ్మేళనాలు. కారణం వీటి మధ్య ఏక బంధాలు ఉన్నాయి. మిగిలినవి అసంతృప్త కర్బన సమ్మేళనాలు. ఎందుకంటే వీటి కర్బన పరమాణువుల మధ్య ద్విబంధం, త్రిబంధం ఉన్నాయి.

ప్రశ్న 9.
ఈ క్రింది సమ్మేళనాలలో ఏవి శృంఖల గొలుసు మరియు చక్రీయ గొలుసు కలిగిన ఉన్నాయో గుర్తించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 23
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 24

ప్రశ్న 10.
నిత్యజీవితంలో కార్బన్ పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. మన ఆహారంలో ఉపయోగపడు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు మొదలైనవి కార్బన్ చేత తయారు చేయబడ్డాయి.
  2. వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగించే దారాలు ప్రధానంగా సెల్యులోజ్, ఇతర పదార్థాలచే తయారు చేయబడతాయి. ఇవన్నీ కార్బన్ ను కలిగి ఉంటాయి.

ప్రశ్న 11.
అంతరిక్ష వాహక నౌకలో వజ్రం యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
వజ్రానికి హానికరమైన వికిరణాలను వేరుచేయగల సామర్థ్యం కలిగి ఉండటం చేత అంతరిక్ష వాహక నౌకల కిటికీలను వజ్రంతో తయారు చేస్తారు. ఈ విధంగా వజ్రం హానికరమైన వికిరణాల నుంచి అంతరిక్షంలోకి వెళ్ళే మనుష్యులను రక్షిస్తుంది. కాబట్టి వజ్రం యొక్క పాత్ర ఎంతో అభినందనీయం.

ప్రశ్న 12.
దహన చర్యలో ఆక్సిజన్ పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
మన నిత్యజీవితంలో, ఇంధనాలను మండించడం ద్వారా శక్తిని పొందుతున్నాము. ఇది ఒక దహనచర్య. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతున్నది. కావున ఇంధనాలను మండించి మానవ కోటికి శక్తిని అందిస్తున్న ఆక్సిజన్ పాత్ర ఎంతైనా అభినందనీయం.

ప్రశ్న 13.
sp సంకరీకరణాన్ని వివరించండి.
జవాబు:

  1. కార్బన్ ఉత్తేజితస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s¹ 2px¹ 2py¹2pz¹
  2. ఒక S మరియు ఒక p ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది రెండు సర్వసమాన sp ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తుంది.
  3. దీనినే sp సంకరీకరణం అంటారు.

ప్రశ్న 14.
నానోట్యూబులను వర్ణించండి.
జవాబు:

  1. నానోట్యూబులు గ్రాఫైట్ లాగే షట్కోణ సంయోజనీయ బంధం గల కర్బన పరమాణువులను షీట్స్ గా కలిగి ఉంటుంది.
  2. ఈ షీట ను చుట్టి స్థూపంను తయారు చేయవచ్చు. అందువలననే వీటిని నానోట్యూబులు అంటారు.
  3. నానోట్యూబులు కూడా గ్రాఫైట్ లాగా ఉత్తమ విద్యుత్ వాహకాలు.
  4. ఇంటిగ్రేటెడ్ వలయాలలో కాపర్ స్థానంలో కారకాలను కలుపుటకు ఉపయోగిస్తారు.
  5. శాస్త్రవేత్తలు బయో అణువులను నానోట్యూబులలో ఎక్కించి వాటిని ఏకకణంగా ఇంజెక్ట్ చేస్తున్నారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 15.
ఈథీన్ నుంచి ఇథనోల్ ఏ విధంగా తయారు చేస్తారు?
జవాబు:
P2O5 లేదా టంగ్ స్టన్ ఉత్ప్రేరక సమక్షంలో అధిక పీడన, ఉష్ణోగ్రతకు గురిచేస్తూ ఈథీన్ కు నీటి ఆవిరి కలిపి పెద్ద మొత్తంలో ఆల్కహాల్ ను తయారుచేస్తారు.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 25

ప్రశ్న 16.
ఇథనోల్ యొక్క భౌతిక ధర్మాలు వ్రాయుము.
జవాబు:

  1. ఇథనోల్ మంచి సువాసన గల రంగులేని ద్రవం.
  2. స్వచ్ఛమైన ఆల్కహాల్ 78.3°C వద్ద మరుగుతుంది. దీనిని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు.
  3. ఇథనోల్ లో మిథనోల్, మిథైల్ ఐసోబ్యుటైల్ కీటోన్ వంటి మలినాలను కలిపితే అది త్రాగుటకు వీలుపడదు మరియు విషపూరితం. దీనినే డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు.
  4. ఇథనోల్ మంచి ద్రావణి. దీనిని దగ్గుమందులు, టింక్చర్ అయోడిన్ వంటి మందుల తయారీలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 17.
సోడియం మరియు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఇథనోల్ యొక్క చర్యలు వ్రాయండి.
జవాబు:
1) సోడియం లోహం ఇథనోల్ తో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ చర్యలో సోడియం ఇథాక్సెడ్ కూడా ఏర్పడుతుంది.
2C2H5OH + 2Na → 2C2H5ONa + H2

2) ఇథనోల్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో 170°C వద్ద చర్య జరిపి ఈథీన్ ను ఏర్పరుస్తుంది.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 26

ప్రశ్న 18.
వజ్రంను కార్బన్ యొక్క శుద్ధమైన రూపంగా పరిగణిస్తారు. దానిని ఏ విధంగా నిరూపించవచ్చు?
జవాబు:
ఆక్సిజన్ సమక్షంలో వజ్రంను వేడిచేస్తే 800°C వద్ద మండి కార్బన్ డై ఆక్సైడ్ ను ఏర్పరుస్తుంది మరియు ఎటువంటి అవలంబనం కనిపించదు. ఈ విధంగా వజ్రాన్ని కార్బన్ యొక్క శుద్ధమైన రూపంగా గుర్తించవచ్చు.

ప్రశ్న 19.
సంకలన చర్యలను వివరించండి.
జవాబు:
ద్విబంధం లేదా త్రిబంధం కలిగిన అసంతృప్త పదార్థాలు ఉదాహరణకు ఆలీనులు, ఆల్కెనులు సంకలన చర్యలలో పాల్గొని సంతృప్త పదార్థాలను ఏర్పరుస్తాయి.

వీటిలో ద్విబంధం లేదా త్రిబంధం వద్ద కారక సంకలనం జరుగుతుంది.
ఉదా :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 27

ప్రశ్న 20.
ఈథర్లు అనగానేమి? ఉదాహరణ తెల్పండి.
జవాబు:
నీటిలోని రెండు హైడ్రోజన్ పరమాణువుల స్థానంలో ఆల్కైల్ సమూహాలను ప్రతిక్షేపించగా ఏర్పడ్డ కర్బన సమ్మేళనాలను ఈథర్లు అంటారు.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 28

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 29
ఇచ్చిన కర్బన సమ్మేళనాన్ని పరిశీలించి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి.
a) ఇచ్చిన కర్బన సమ్మేళనంలో ఉన్న కార్బన్లకు IUPAC నియమాల ఆధారంగా సంఖ్యలను ఇవ్వండి. (మీ జవాబు పత్రంలో రాయండి.)
b) ఇచ్చిన కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం పేరు తెల్పండి.
c) ఇచ్చిన కర్బన సమ్మేళనంలో మూల పదం పేరు తెల్పండి.
d) ఇచ్చిన కర్బన సమ్మేళన IUPAC నామం రాయండి.
జవాబు:
a) AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 29
b) ప్రమేయ సమూహం పేరు = OH (ఆల్కహాల్)
c) మూల పదం = పెంట్ (C5)
d) IUPAC నామం : పెంట్ – 4 – ఈన్ – 2 – ఓల్

ప్రశ్న 2.
కింది పట్టికలో ఖాళీగా ఉన్న గడులలో ఆల్కేన్లకు సంబంధించిన సమాచారం నింపండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 30
i) పై పట్టిక ఆధారంగా ఆల్కేన్స్ యొక్క సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
ఆల్కేనుల యొక్క సాధారణ ఫార్ములా CnHan+2.

ii) C2H6 నందు గల మొత్తం ‘σ’ బంధాల సంఖ్య ఎంత?
జవాబు:
C2H6 నందు గల ‘σ’ బంధాల సంఖ్య 7.

iii) పై సాంకేతికాలలో మీరు గుర్తించిన క్రమానుగతం ఏమిటి?
జవాబు:
పై సాంకేతికాలలో -CH2 గ్రూపు వ్యత్యాసం కనబడుచున్నది.

iv) ఆల్కేనులలో కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధం ఉంటుంది. దీనిని మీరు అంగీకరిస్తారా? కారణాలు రాయండి.
జవాబు:
పై ఆల్కేనులలో కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధం కలదు. ఎందుకనగా అది సంతృప్త హైడ్రోకార్బన్ కనుక.

ప్రశ్న 3.
కార్బన్ రూపాంతరాల రకాలను తెల్పి, ప్రతిదానికి 3 ఉదాహరణలు రాయండి.
జవాబు:
కార్బన్ యొక్క రూపాంతరాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి స్ఫటిక రూపాలు, అస్ఫటిక రూపాలు.

స్పటిక రూపాలకు ఉదాహరణలు :
వజ్రం, గ్రాఫైట్, బక్ మినిస్టర్ పుల్లరిన్, నానో ట్యూబులు మొదలగునవి.

అస్ఫటిక రూపాలకు ఉదాహరణలు :
బొగ్గు, కోక్, కలప, చార్ కోల్, జంతు చార్ కోల్, నల్లని మసి, వాయురూప కార్బన్, పెట్రోలియం కోక్, చక్కెర మొదలగునవి.

ప్రశ్న 4.
కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణుల యొక్క ఏవేని ‘4’ అభిలాక్షణిక ధర్మాలను వ్రాయండి.
జవాబు:
కర్బన సమ్మేళనాల శ్రేణుల్లోని వరుసగా ఉండే రెండు సమ్మేళనాలు – CH2 భేదంతో ఉంటే వాటిని సమజాత శ్రేణులు
అంటారు. ఉదా : 1) CH4, C2H6, C3H8, …………….
2) CH3OH, C2H5OH, C3H7OH, …………….

లక్షణాలు :

  1. ఇవి ఒక సాధారణ ఫార్ములాను కలిగి ఉంటాయి.
    ఉదా : ఆల్కేన్ (CnH2n + 2), ఆల్కీన్ (Cn H2n), ఆల్కన్ (CnH2n – 2).
  2. వీటి శ్రేణుల్లో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య భేదం (-CH2) ఉంటుంది.
  3. ఒకే విధమైన ప్రమేయ సమూహాన్ని కలిగియున్నందున ఒకే విధమైన రసాయన ధర్మాలను సూచిస్తాయి.
  4. ఇవి వాని భౌతిక ధర్మాలలో ఒక సాధారణ క్రమం పాటిస్తాయి.

ప్రశ్న 5.
ఆల్కేనులను పారాఫిన్లు అని ఎందుకు అంటారో తెలిపి, ఆల్కే ప్రతిక్షేపణ చర్యలను వివరింపుము.
(లేదా)
ఆల్కేన్లు పారాఫిన్లుగా పరిగణింపబడతాయి. అవి సంకలన చర్యల కన్నా ప్రతిక్షేపణ చర్యలనిస్తాయి. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
a) పారాఫిన్లు అనే పదం parum = little; affins = affinity అనే పదాల నుండి వచ్చింది. దీని అర్థం చర్యాశీలత తక్కువ. ఆల్మేన్ల చర్యాశీలత తక్కువ. కావున ఆల్మేన్లను పారాఫిన్లు అంటారు.

b) ఆల్కేనుల ప్రతిక్షేపణ చర్యలు :
ఒక రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని మూలకం లేక సమూహం, వేరొక మూలకం లేక సమూహం చేత ప్రతిక్షేపించబడితే దానిని ప్రతిక్షేపణ చర్య అంటారు. ఆల్మేన్లు ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటాయి.

ఉదా :
సూర్యకాంతి సమక్షంలో మీథేన్ క్లోరిన్లో చర్య జరిపి మిథేన్ లోని అన్ని హైడ్రోజన్ పరమాణువులు క్లోరిన్ చేత వరుసగా ప్రతిక్షేపించబడతాయి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 31

ప్రశ్న 6.
ఎస్టరీకరణ చర్యను అవగాహన చేసుకొనుటకు నిర్వహించే ప్రయోగానికి కావలసిన పదార్థాలు, పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. ఈ ప్రయోగంలో ఎస్టరు ఏర్పడిందని మీరు ఎలా గుర్తిస్తారు?
జవాబు:
ఎస్టరిఫికేషన్ కి కావలసిన పదార్థాలు :
పరీక్ష నాళిక, బీకరు, త్రిపాది, బర్నర్, నీరు, తీగ వల, అబ్సల్యూట్ ఆల్కహాలు (ఇథనోల్), గ్లేషియల్ ఎసిటిక్ ఆమ్లం, గాఢ సల్ఫ్యూరికామ్లం .

ప్రయోగ విధానము :
ఒక పరీక్ష నాళికలో 1 మి.లీ. అబ్సల్యూట్ ఆల్కహాలును తీసుకొని దానికి 1 మి.లీ. గ్లీషియల్ ఎసిటిక్ ఆమ్లం కలపాలి. దీనికి కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరికామ్లం కలపాలి. ఒక బీకరులో నీటిని పోసి వేడి చేసి ఆ నీటిలో 5 నిమిషాలపాటు ఆల్కహాలు, ఎసిటికామ్లం గల పరీక్షనాళికను ఉంచండి. 20-30 మి.లీ. నీటికి వెచ్చగ ఉండే పరీక్షనాళికలోని మిశ్రమాన్ని కలుపండి. ఆ మిశ్రమం తియ్యని వాసన వస్తే ఎస్టర్ తయారయినదని నిర్ధారణ చేయవచ్చును.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 7.
కార్బన్ యొక్క అణుసాదృశ్యం మరియు కాటనేషన్ ధర్మాలను వివరించండి.
జవాబు:
కార్బన్ యొక్క శృంఖల సామర్థ్యం – (కాటనేషన్ ధర్మం) :

  1. కార్బన్ కు ఇతర పరమాణువులతో కలిసి పొడవైన గొలుసు వంటి సమ్మేళనాలను ఏర్పర్చగలదు. ఈ సామర్థ్యమును శృంఖల సామర్థ్యం అంటారు.
  2. కార్బనకు గల ఈ శృంఖల ధర్మం వలన అవి అసంఖ్యాకమైన కార్బన్ పరమాణువులు గల అతి పొడవైన శృంఖలాలుగా, శాఖాయుత శృంఖలాలుగా, వలయాలుగా గల అణువులను ఏర్పరచే సామర్థ్యం కలిగి ఉంటుంది.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 32

కార్బన్ యొక్క అణుసాదృశ్యము :

1. ఒకే అణుఫార్ములా కలిగి ఉండి వేరువేరు నిర్మాణాలు గల అణువులను కార్బన్ ఏర్పర్చగలదు. దీనినే అణు సాదృశ్యము అంటారు.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 33

2. పైన తెలిపిన రెండు అణువులలో C4H10 ఫార్ములా కలదు. కాని నిర్మాణాలు వేరుగా ఉన్నవి. ఈ రెండు అణు సాదృశ్యకాలు. ఈ రెండు ప్రత్యేక ధర్మాల వల్ల కార్బన్ చాలా సమ్మేళనాలను ఏర్పర్చగలుగుతుంది.

ప్రశ్న 8.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 34
పై నిర్మాణాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
a) పై సమ్మేళనంలోని ప్రధాన ప్రమేయ సమూహం పేరు వ్రాయండి.
b) పై సమ్మేళనంలోని ‘మాతృ శృంఖలం’ (Parental chain) ను గుర్తించండి.
c) పై సమ్మేళనంలో ప్రతిక్షేపకాలు ఏవి?
d) IUPAC నామీకరణ విధానంలో పై సమ్మేళనానికి పేరును సూచించండి.
జవాబు:
a) కీటోన్
b)
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 35
c) మిథైల్ గ్రూపు, హైడ్రాక్సీ గ్రూపు
d) 7- హైడ్రాక్సీ-5-మిథైల్ హెస్టన్-2-ఓన్

ప్రశ్న 9.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 36
పై పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానములు రాయండి.
i) ఆల్కేల్లో సాధారణ ఫార్ములా రాయండి.
ii) అసంతృప్త హైడ్రోకార్బన్ పేర్లు రాయండి.
iii) ఆల్కెన్ సమజాతి శ్రేణిని రాయండి.
iv) హెక్సేన్ సాంకేతికమును రాయండి.
జవాబు:
i) CnH2n + 2
ii) ప్రోపీన్ (C3H6), బ్యూటీన్ (C4H8), పెంటైన్ (C5H8), హెక్సెన్ (C6H10)
iii) C2H2, C3H4, C4H6, C5H8, ………..
(లేదా)
ఈథైన్, ప్రొపైన్, బ్యుటైన్, పెంటైన్, ……
iv) C6H14

ప్రశ్న 10.
కార్బన్ ఏర్పరిచే వివిధ రకాల బంధాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
a) కార్బన్ నాలుగు ఏక సంయోజనీయ బంధాలను ఒకే మూలక పరమాణువుతో ఏర్పరచగలదు.
ఉదా :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 37

b) కార్బన్ నాలుగు ఏక సంయోజనీయ బంధాలను వేరువేరు మూలక పరమాణువులతో ఏర్పరచగలదు.
ఉదా :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 38

c) కార్బన్ పరమాణువులు రెండు ఏక మరియు ఒక ద్విబంధాన్ని ఏర్పరచగలవు.
ఉదా :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 39

d) కార్బన్ పరమాణువుల ఏక మరియు త్రిబంధాన్ని ఏర్పరచగలదు.
ఉదా : H-C ≡ C – H; CH3 – C ≡ N

e) కర్బన పరమాణువులు రెండు ద్విబంధాలను ఏర్పరచగలవు.
ఉదా : CH3 – CH = C = CH2

ప్రశ్న 11.
మీథేన్ లో sp³ సంకరీకరణాన్ని వివరించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 40
2) ఉత్తేజిత స్థాయిలోని కార్బన్ పరమాణువులోని S ఆర్బిటాల్ (2s) మరియు మూడు p ఆర్బిటాళ్ళు (2px, 2py, 2pz) సంకరీకరణం చెంది నాలుగు సర్వసమాన sp³ ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి.

3) 2s, 2p ఆర్బిటాళ్ళలోని నాలుగు ఎలక్ట్రానులు ఈ నాలుగు సర్వసమాన sp³ ఆర్బిటాళ్ళలో హుండ్ నియమం ఆధారంగా ఒక్కొక్కటి చొప్పున నింపబడతాయి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 41
4) కార్బన్ పరమాణువులో నాలుగు ఒంటరి ఎలక్ట్రానులు ఉండటం వలన అది ఇతర పరమాణువులతో నాలుగు బంధాలు ఏర్పరచగలదు.

5) కార్బన్ హైడ్రోజన్‌తో చర్య పొందినపుడు నాలుగు హైడ్రోజన్ పరమాణువుల ఒంటరి ఎలక్ట్రానులు కలిగిన s ఆర్బిటాళ్ళు sp³ ఆర్బిటాళ్ళతో అతిపాతం చెంది 109°28′ కోణంలో బంధాలను ఏర్పరుస్తాయి.

6) కర్బన పరమాణువు యొక్క నాలుగు ఆర్బిటాళ్ళు టెట్రా హైడ్రన్ యొక్క నాలుగు చివరలకు మరియు కేంద్రకం మధ్యలోకి చేరడం వల్ల ఎలక్ట్రానుల మధ్య గల వికర్షణ బలాలు కనిష్ఠంగా ఉంటాయి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 42

7) హైడ్రోజన్ యొక్క S ఆర్బిటాళ్ళు sp3 ఆర్బిటాళ్ళతో అతిపాతం చెంది 4 సర్వసమాన sp³ – S సిగ్మాబంధాలను . ఏర్పరుస్తాయి.

ప్రశ్న 12.
sp² సంకరీకరణాన్ని ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
sp² సంకరీకరణానికి ఉదాహరణ ఈథేన్.

  1. ఉత్తేజిత స్థాయిలో కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s¹ 2px¹ 2py¹ 2pz¹.
  2. రెండు కర్బన పరమాణువులు ఒక S మరియు రెండు p ఆర్బిటాళ్ళు కలిసి మూడు sp² ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి.
  3. ప్రతి కార్బన్ పరమాణువుపై అసంకరీకరణ pz ఆర్బిటాల్ మిగిలిపోతుంది.
  4. ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగిన మూడు sp² ఆర్బిటాళ్ళు కేంద్రకం చుట్టూ 120° కోణంతో వేరు చేయబడతాయి.
  5. రెండు కర్బన పరమాణువుల ఒక్కొక్క sp² ఆర్బిటాళ్ళు అంత్య అతిపాతం చెందడం వల్ల సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తాయి.
  6. ప్రతి కర్బన పరమాణువు యొక్క మిగిలిన రెండు sp² ఆర్బిటాళ్ళు ఒంటరి ఎలక్ట్రానులు కలిగిన రెండు హైడ్రోజన్ పరమాణువులతో అంత అతిపాతం చెందుతాయి.
  7. అసంకరీకరణ p ఆర్బిటాళ్ళు పార్శ్వ అతిపాతం చెంది π బంధాన్ని ఏర్పరుస్తాయి.
  8. కావున ఈథీన్ లో కార్బన్ పరమాణువుల మధ్య 1 సిగ్మా మరియు 1 పై బంధం ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 6AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 43

ప్రశ్న 13.
ఎసిటిలీన్ అణువు ఏర్పడే విధానమును వివరించండి.
జవాబు:
1) కార్బన్ ఉత్తేజిత స్థాయిలో ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s¹ 2px¹2py¹ 2pz¹.

2) ఎసిటిలీన్ రెండు కర్బన పరమాణువులు sp సంకరీకరణంకు గురి అయ్యి రెండు సర్వసమాన sp ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి.

3) ప్రతి కార్బన్ పరమాణువుపై సంకరీకరణం చెందని రెండు p ఆర్బిటాళ్ళు (py, pz) ఉంటాయి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 44
4) రెండు కార్బన్ పరమాణువుల యొక్క ఒక్కొక్క sp ఆర్బిటాళ్ళు అంత అతిపాతం చెంది sp – sp సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తాయి.

5) ఇంకొక sp ఆర్బిటాల్ హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్ లో అతిపాతం చెంది sp – s సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తుంది.

6) రెండు కార్బన్ పరమాణువుల యొక్క అసంకరీకరణ ఆర్బిటాళ్ళు పార్శ్వ అతిపాతం చెంది రెండు π బంధాలు ఏర్పరుస్తాయి.

7) ఈ విధంగా ఎసిటిలీన్ (ఈథైన్) అణువులో కార్బన్ పరమాణువుల మధ్య ఒక సిగ్మా, రెండు పై బంధాలు ఏర్పడతాయి.

ప్రశ్న 14.
వజ్రం నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 45

  1. వజ్రం కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరము.
  2. వజ్రంలో కర్బన పరమాణువులు sp³ సంకరీకరణానికి గురి అవుతాయి.
  3. కాబట్టి కర్బన పరమాణువులు టెట్రా హైడ్రల్ నిర్మాణాన్ని పొందుతాయి.
  4. వజ్రం యొక్క త్రిమితీయ నిర్మాణం క్రింద ఇవ్వబడినది.
  5. వజ్రంలో C – C బంధాలు అత్యంత బలమైనవి. కాబట్టి వజ్రం నిర్మాణాన్ని విచ్చిన్నం చేయడానికి అధిక శక్తి అవసరం.
  6. అందువలన వజ్రం అత్యంత గట్టిగా ఉండే పదార్థంగా గుర్తించబడినది.

ప్రశ్న 15.
బక్ మిస్టర్ ఫుల్లరిన్ నిర్మాణాన్ని గురించి వివరించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 46

  1. బక్ మిస్టర్ ఫుల్లరిన్లకు వివిధ పరిమాణంలో గల కార్బన్ అణువులు ఉంటాయి.
  2. ఈ విధమైన అణువుల అమరికవల్ల అవి గుళ్ళ గోళం, దీర్ఘవృత్తం లేదా గొట్టం వంటి నిర్మాణాలు పొందుతున్నాయి.
  3. వాయుస్థితిలో ఉన్న కార్బన్ జడవాయువులు కలిగిన వాతావరణంలో ఘనీభవించడం వలన, ఫుల్లరిన్లు ఏర్పడతాయి.
  4. గోళాకార ఫుల్లరిన్లను బక్కీబాల్స్ అని కూడా అంటారు.
  5. బక్ మిస్టర్ ఫుల్లరిన్ (C60) లో గోళాకృత 60 కర్బన అణువులు ఒక ఫుట్ బాల్ (soccer) ఆకృతిని ఏర్పరుస్తాయి.
  6. ఫుల్లరిలో 12 పంచకోణ, 20 షట్కోణ తలాలు ఫుట్ బాల్ ఆకృతిని ఏర్పరుస్తాయి మరియు ప్రతి కార్బన్ పరమాణువు sp² సంకర ఆర్బిటాళ్ళు కలిగి ఉంటుంది.

ప్రశ్న 16.
IUPAC పద్ధతి కర్బన సమ్మేళనాల గురించి ఇచ్చే వివరాలు తెల్పండి.
జవాబు:
IUPAC పద్ధతి ఈ క్రింది వివరాలను ఇస్తుంది.

  1. అణువులోని కర్బన పరమాణువుల సంఖ్య. దీనినే మనం రూట్ పదం అంటాము.
  2. ప్రతిక్షేపించబడిన పరమాణువు.
  3. అణువులోని ప్రమేయ సమూహం.

ముందుపదం (Prefix) :
ముందుపదంలో వివిధ రకాలు కలవు. ప్రాథమిక, గౌణ, సంఖ్యా పదాలు మొదలైనవి.

  1. చక్రీయ సమ్మేళనాలకు (prefix) చక్రీయ అని వస్తుంది.
  2. గౌణ prefix హాలోజన్ ప్రతిక్షేపకాలకు హాలో అని వస్తుంది. ఆల్కెల్ సమూహాలు అయితే ఆల్కెల్ అని వస్తుంది.

చివరి పదం (Suffix) :
ఇది వివిధ భాగాలు కలిగి ఉన్నది ప్రాథమిక , గౌణ మరియు సంఖ్యా suffix.
1) ప్రాథమిక suffix ఈ విధంగా ఇవ్వబడతాయి.
ఆల్కేన్ (C – C) → ఏన్ (an)
ఆల్కీన్ (C = C) → ఈన్ (en)
ఆలైన్ (C ≡ C) → ఐన్ (yn) మొదలైనవి.

2) గౌణ suffix. ప్రమేయ సమూహమునకు ఇవ్వబడే పదాల గురించి తెల్పుతుంది.
ఉదా :
హైడ్రోకార్బన్లు – (e)
ఆల్కహాల్ – ఓల్ (ol)
ఆల్డిహైడ్ – ఆల్ (al)
కీటోన్ – ఓన్ (one)
కార్బాక్సిలిక్ ఆమ్లం ఓయిక్ (oic) మొదలైనవి.

3) సంఖ్యా పూర్వపదాలు (prefixes) : డై, ట్రై మొదలైనవి.

4) ప్రతిక్షేపకాలు ఎక్కడ ఉన్నాయి, బహుబంధం ఎక్కడ ఉంది, ప్రమేయ సమూహం ఎక్కడ ఉంది తెలియజేయుటకు సంఖ్యలను ఉపయోగిస్తున్నారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 17.
లోహాలు, లోహ హైడ్రాక్సైడ్లు, లోహ కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఇథనోయిక్ ఆమ్లంతో ఏ విధంగా చర్య పొందుతాయో తెల్పండి.
జవాబు:
1) లోహంతో ఇథనోయిక్ ఆమ్లం చర్య :
ఇథనోయిక్ ఆమ్లం క్రియాత్మక లోహాలైన సోడియం, పొటాషియం వంటి వాటితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.
2CH3 COOH + 2Na → 2CH3COONa+ H2

2) ఇథనోయిక్ ఆమ్లం, లోహ హైడ్రాక్సైడ్ మధ్య చర్య :
ఇథనోయిక్ ఆమ్లం NaOH వంటి లోహ హైడ్రాక్సైడ్ తో చర్య జరిపి లవణం మరియు నీటిని ఏర్పరుస్తుంది.
CH3 COOH + NaOH → CH3COONa+ H2O

3) కార్బోనేట్ మరియు హైడ్రోజన్ కార్బోనేట్లు ఇథనోయిక్ ఆమ్లంతో చర్య :
ఇథనోయిక్ ఆమ్లంతో కార్బోనేట్ మరియు హైడ్రోజన్ కార్బోనేట్ చర్య జరిపి CO2 వాయువును విడుదల చేస్తాయి.
ఉదా : 2CH3COOH + Na2CO3 → 2CH3COONa+ H2O + CO2
CH3COOH + NaHCO3 → CH3COONa+ H2O + CO2

ప్రశ్న 18.
కార్బన్ ఏ ఏ రూపాలలో లభిస్తుందో వివరించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 47

ప్రశ్న 19.
కార్బన్ యొక్క వివిధ రూపాంతరాలు తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 48

ప్రశ్న 20.
ఈ క్రింది సమ్మేళనాల నిర్మాణాలు వ్రాయుము.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 49
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 50

ప్రశ్న 21.
ఈ క్రింది సమ్మేళనాల యొక్క తర్వాత సమజాతీయ నిర్మాణాన్ని, వాటి ఫార్ములాలను పేర్లను వ్రాయండి.
1) HCHO 2) CH3OH
జవాబు:
1)

సమజాత శ్రేణిఫార్ములాపేరు
CH3CHOC2H4Oఇథనాల్
CH3CH2CHOC3H6Oప్రొపనాల్
CH3CH2CH2CHOC4H8Oబ్యూటనాల్
CH3CH2CH2CH2CHOC5H10Oపెంటనాల్

2)

సమజాత శ్రేణిఫార్ములాపేరు
CH3CH2OHC2H6Oఇథనోల్
CH3CH2CH2OHC3H8Oప్రొఫనోల్
CH3CH2CH2CH2OHC4H10Oబ్యూటనోల్
CH3CH2CH2CH2CH2OHC5H11Oపెంటనోల్

ప్రశ్న 22.
బ్యూటనోయిక్ ఆమ్లం, C3H7 COOH యొక్క నిర్మాణ పటం గీయండి.
జవాబు:
బ్యూటనోయిక్ ఆమ్లం యొక్క సాంకేతికము = C4H8O2
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 51

ప్రశ్న 23.
‘బ్యూటేను’ యొక్క సాదృశ్యకాలు (isomers) నిర్మాణాలను గీయండి.
జవాబు:
బ్యూటేను యొక్క సాదృశ్యకాలు n – బ్యూటేన్, ఐసో బ్యూటేన్ మరియు సైక్లో బ్యూటేన్.
నిర్మాణాలు :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 52

ప్రశ్న 24.
కింది వానికి నిర్మాణ పటాలను గీయండి.
అ) ఇథనోయిక్ ఆమ్లం
ఆ) ప్రొపనాల్
ఇ) ప్రొవీన్
ఈ) క్లోరోప్రొపీన్
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 53

ప్రశ్న 25.
కింది సమ్మేళనాలకు నిర్మాణాలను గీయండి.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 54
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 55

ప్రశ్న 26.
ఇథనోయిక్ ఆమ్లం మరియు ఈథైన్ (ఎసిటిలీన్) లకు ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాలను గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 57

ప్రశ్న 27.
మిసిలి (Micelle) యొక్క పటమును గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 25

ప్రశ్న 28.
ఆల్డిహైడ్ (Aldehydes) ల సమజాతశ్రేణి (Homologous series) లోని మొదటి నాలుగు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాను రాసి, వాని నిర్మాణ పటాలను (structures) గీయండి.
జవాబు:
ఆల్డిహై సమజాత శ్రేణిలో మొదటి నాలుగు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాలు :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 58

ప్రశ్న 29.
C5 H12 అణు ఫార్ములా కలిగిన పెంటేనకు ఎన్ని సాదృశ్యాలను గీయగలం? అవి ఏవి? వాటి నిర్మాణపటాలను గీసి, వాని సాధారణ పేర్లను పేర్కొనండి.
జవాబు:
పెంటేన్ యొక్క సాదృశ్యాలు ‘3’. అవి : 1) పెంటేన్ 2) ఐసో పెంటేన్ 3) నియో పెంటేన్
సాదృశ్యాల నిర్మాణ పటములు :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 59

కార్బన్ శృంఖలం పొడవు ఆధారంగా మూలపదాలు
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 60

ప్రాథమిక పరపదాలు
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 61

హైడ్రో కార్బన్లలో సంకరణం మరియు ఆకృతులు
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 62

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Important Questions and Answers

ప్రశ్న 1.
మూలకాలు, సమ్మేళనాలు లేదా మిశ్రమాలు ఏవి రూపాంతరత అనే ధర్మాన్ని చూపుతాయి. సరైన ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
మూలకాలు రూపాంతరత అనే ధర్మాన్ని ప్రదర్శిస్తాయి.

రూపాంతరతను ప్రదర్శించు మూలకాలు :
కార్బన్, సల్ఫర్, తగరం, ఆక్సిజన్ మొదలగునవి. ఉదాహరణకు కార్బన్ అను మూలకం స్ఫటిక మరియు అస్ఫటిక రూపాంతరాలను ప్రదర్శించును.

కార్బన్ స్ఫటిక రూపాలు :
డైమండ్, గ్రాఫైట్

కార్బణ్ అస్ఫటిక రూపాలు :
కోల్, కోక్, చార్ కోల్, యానిమల్ చార్ కోల్, దీపాంగరము, పెట్రోలియం, కోక్ మొదలగునవి.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

ప్రశ్న 2.

మూలకంసమ్మేళనంమిశ్రమం
కార్బన్CaCO3NH4Cl + SiO2

i) పై పట్టికలో రూపాంతరత ధర్మం కలది ఏది?
ii) పై పట్టికలో కార్బన్ కు, CaCO3 ల మధ్య ఏ ధర్మంలో తేడా కలదు?
జవాబు:
i) కార్బన్ అను మూలకంకు రూపాంతరత ధర్మం కలదు.
ii) కార్బన్ ఒక మూలకము మరియు CaCO3 ఒక మిశ్రమము. రెండూ వేర్వేరు పదార్థాలు.

ప్రశ్న 3.
మనం పేపర్ పై పెన్సిల్ తో వ్రాసినపుడు గీతలు ఏర్పడతాయి. ఆ గీతలు దేని వలన ఏర్పడతాయి? ఆ పదార్థ నిర్మాణాన్ని తెలియచేయండి.
జవాబు:
పేపర్ పై పెన్సిల్ తో వ్రాసినపుడు ఏర్పడు గీతలు గ్రాఫైట్ వలన సాధ్యము. గ్రా ఫైట్ వజ్రము యొక్క అస్పటిక రూపము.

  1. పేపర్ పై పెన్సిల్ తో రాసినపుడు ఫై లో గల లోపలి పొరల మధ్య ఆకర్షణ బలాలు విచ్ఛిన్నం అవుతాయి. కాబట్టి విడిపడిన గ్రాఫైట్ పొరలు పేపర్ పై ఉండిపోతాయి.
  2. అంతేకాకుండా ఈ పెన్సిల్ మార్కింగ్ గ్లను ఎరేజర్ ద్వారా తేలికగా తొలగించవచ్చు. ఎందువలన అనగా గ్రాఫైట్ పొరలు పేపరును గట్టిగా అంటి పెట్టుకొని ఉండవు.
  3. గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణాన్ని C – C బంధాలు అను ఈ పొరలలోనే కలిగి ఉంటుంది. ఈ పొరల మధ్య బలహీన బలాలు పనిచేస్తాయి.
  4. ఈ పొరలు సమతల త్రిభుజీకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
  5. ఈ పొరలలో ప్రతి కార్బన్ sp² సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది.
  6. ఈ sp² ఆర్బిటాళ్ళు అతిపాతం చెందడం వల్ల C – C బంధాలు ఏర్పడతాయి.
  7. ప్రతి కార్బన్ పరమాణువులో సంకరీకరణంలో పాల్గొనని ఒక p ఆర్బిటాల్ మిగిలిపోతుంది.
  8. ఈ అసంకరీకరణ 2 ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది మొత్తం పొరపై కేంద్రీకృతమయ్యే π వ్యవస్థను ఏర్పరుస్తాయి.
  9. రెండు పొరల మధ్య బలహీన ఆకర్షణ బలాలు లేక వాండర్ వాల్ బలాలు 3.35Å దూరంతో వేరుచేయబడతాయి.
  10. ఈ బలాలు నీటి సమక్షంలో మరింత బలహీనపడతాయి. కాబట్టి గ్రాఫైట్ లోని బలాలు విచ్ఛిన్నం చేయుట తేలిక.
  11. అందువలన గ్రాఫైట్ ను కందెనగాను మరియు పెన్సిల్ లో లెడ్ గాను ఉపయోగిస్తున్నారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 63

ప్రశ్న 4.
నానోట్యూబులు అనగానేమి? వాటి ఉపయోగాలను తెలియచేయండి.
జవాబు:

  1. సమయోజనీయ బంధాలలో పాల్గొనే కర్బన పరమాణువుల షట్ముఖ అమరికల వలన ఏర్పడునవి నానోట్యూబులు.
  2. ఇవి గ్రాఫైట్ పొరలను పోలి ఉంటాయి.
  3. ఈ పొరలు చుట్టుకొని స్థూపాకార గొట్టాలుగా మారుతాయి. అందుకనే వీటిని నానోట్యూబులు అంటారు.

ఉపయోగాలు :

  1. వీటిని ట్రాన్సిస్టర్లుగా వాడతారు.
  2. సమీకృత వలయాలలో అనుసంధానం తీగలుగా వాడతారు.
  3. కణంలోనికి ఏదేని జీవాణువును పంపుటకు వాడతారు.
  4. 3-డి రూపంలోని ఎలక్ట్రోడుల తయారీకి
  5. కృత్రిమ కండరాల తయారీకి
  6. రసాయన తుంపరలులోని మూలకాలను కనుగొనుటకు.
  7. అభివృద్ధి చెందిన దేశాలలో నీటి శుద్ధికై వాడుచున్నారు.

ప్రశ్న 5.
డైమండ్-గ్రాఫైటులు కార్బన్ రూపాంతరాలైనప్పటికీ అవి ధర్మాలలో విభేదిస్తాయి. వాటి ధర్మాలను పట్టికలో పొందుపరచండి.
జవాబు:

వజ్రంగ్రాఫైట్
1) ఇది సహజసిద్ధంగా లభించును.1) ఇది కృత్రిమముగా కూడా లభించును.
2) ఇది చాలా గట్టిదైన పదార్థం.2) ఇది పలుచగా మరియు జారుడు గుణం కల్గి ఉండును.
3) ఇది అధమ ఉష్ణ, విద్యుత్ వాహకము.3) ఇది ఉత్తమ ఉష్ణ, విద్యుత్ వాహకము.
4) దీని వక్రీభవన గుణకము విలువ 2.42Å.4) దీని వక్రీభవన గుణకము విలువ 2.0 నుండి 2.25Å.
5) దీనికి అధిక ద్రవీభవన స్థానము 4000K కన్నా ఎక్కువ ఉండును.5) దీనికి అల్ప ద్రవీభవన స్థానము .1800Kగా ఉండును.

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు ½ Mark Important Questions and Answers

1. కార్బన్ యొక్క ఋణవిద్యుదాత్మకత ఎంత?
జవాబు:
2.5

2. a) కార్బన్ C-4 అయాన్లను ఏర్పరచలేదు.
b) కార్బన్ C+4 అయాన్లను ఏర్పరచలేదు.
c) కార్బన్ ఎలక్ట్రాన్లను పంచుకోలేదు.
పై వానిలో ఏది సరియైన వాక్యం?
జవాబు:
‘a’ మరియు ‘b’

3. క్రింది వానిలో ఏది సాధ్యపడదు?
a) C – C – C – C
b) C = C = C-C
c) C ≡ C ≡ C – C
d) C – C ≡ C – C
జవాబు:

4. కార్బన్’ ఉత్తేజస్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
1s² 2s¹ 2px¹ 2py¹ 2pz¹

5.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 64
1) పై ఎలక్ట్రాన్ విన్యాసం ఏ మూలకానికి చెందినది?
జవాబు:
కార్బన్

2) పైన చూపబడిన స్థితి ఏమిటి?
జవాబు:
ఉత్తేజిత

3) కార్బన్ యొక్క భూ స్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి?
జవాబు:
1s² 2s² 2p²

4) కార్బన్ ఉత్తేజిత స్థితిలో ఎన్ని జతకాని ఎలక్ట్రాన్లు ఉంటాయి?జవాబు:
జవాబు:
‘4’

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

6. కార్బన్ ఎంత సంయోజనీయతను ప్రదర్శించును?
జవాబు:
నాలుగు (చతుస్సంయోజనీయత).

7. కార్బన్ పరమాణువు ఈ క్రింది బంధాన్ని ఏర్పరచలేదు.
A) ఏక
B) ద్వి
C) త్రి
D) ఏదీలేదు
జవాబు:
D) ఏదీలేదు

8. క్రింది వానికి ఉదాహరణనిమ్ము.
i) కార్బన్ నాలుగు హైడ్రోజన్లతో ఏకబంధాలను ఏర్పరుచుట.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 65

ii) కార్బన్ వేర్వేరు మూలక పరమాణువులతో 4 ఏక సమయోజనీయ బంధాలను ఏర్పరుచుట.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 66

iii) కార్బన్ ఒక ద్విబంధం మరియు రెండు ఏక బంధాలను ఏర్పరుచుట.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 67

iv) కార్బన్ ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధం ఏర్పరుచుట.
జవాబు:
H – C ≡ C – H

9. C2H2 లలో కార్బన్ ఏఏ బంధాలను ఏర్పరుచును?
జవాబు:
ఏక మరియు త్రిబంధాలు.

10. భూస్థాయి కార్బన్ యొక్క ఎలక్ట్రానుల అమరిక బ్లాక్ పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 68

11. ఉత్తేజిత స్థాయిలో కార్బన్ యొక్క ఎలక్ట్రానుల పంపిణీ చూపు పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 69

12. కార్బన్ ఉత్తేజిత స్థాయిలోకి ఏ ఎలక్ట్రానుల మార్పిడి ద్వారా వెళ్తుంది?
జవాబు:
‘2s’ లోని ఒక ఎలక్ట్రాన్ ‘2pz‘ ఆర్బిటాలకు చేరును.

13. ఎలక్ట్రాన్ ను ఉత్తేజపరిచే శక్తి కార్బను ఎక్కడి నుండి లభిస్తుంది?
జవాబు:
బంధ శక్తి (ఇతర పరమాణువులతో బంధాన్ని, ఏర్పరచినపుడు విడుదల చేయబడే బంధశక్తి)

14. మీథేన్లో \(\text { HĈH }\) బంధకోణం ఎంత?
జవాబు:
109°28′

15. ఆర్బిటాళ్ళ సంకరీకరణం అనే భావనను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
లైనస్ పౌలింగ్ (1931)

16. సంకరీకరణం చెందడం వలన ఏర్పడిన కొత్త ఆర్బిటాళ్ళను ఏమని పిలుస్తారు?
జవాబు:
సంకర ఆర్బిటాళ్ళు

17. sp³ సంకర ఆర్బిటాళ్ళు ఏర్పడాలంటే ఏఏ ఆర్బిటాళ్ళు సంకరీకరణంలో పాల్గొనాలి?
జవాబు:
ఒక s – ఆర్బిటాల్, మూడు p – ఆర్బిటాళ్లు

18. sp³ సంకర ఆర్బిటాళ్ళు గరిష్ఠంగా ఎన్ని ఉంటాయి?
జవాబు:
4

19. sp³ సంకరీకరణం ద్వారా ఏర్పడ్డ నాలుగు ఆర్బిటాళ్ల శక్తి ఎలా వుంటుంది?
జవాబు:
సమానంగా (లేదా) ఒకేలా

20. CH4 అణువులో ఉండే సంకరీకరణం ఏమిటి?
జవాబు:
sp³

21. CH4 అణువు ఆకృతి ఏమిటి?
జవాబు:
టెట్రాహెడ్రాన్

22. మీథేన్ లో కార్బన్ మరియు హైడ్రోజన్ మధ్య ఎటువంటి బంధం ఉంటుంది?
జవాబు:
sp³ – S

23. ఈథేన్ సాధారణ నామం ఏమిటి?
జవాబు:
ఇథిలీన్ (CH2 = CH2)

24. ఇథిలీలో ఎటువంటి సంకరీకరణం జరుగును?
జవాబు:
sp²

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

25. జతపరుచుము.

1) sp³a) 3 సంకర ఆర్బిటాళ్లు
2) sp²b) 4 సంకర ఆర్బిటాళ్లు
3) spc) 2 సంకర ఆర్బిటాళ్లు
d) 1 సంకర ఆర్బిటాల్

జవాబు:
(1) – b, (2) – a, (3) – C

26. ఇథిలీన్లో ఒక కార్బన్ చుట్టూ ఉన్న పరమాణువులు ఎంత కోణంతో వేరుచేయబడి ఉంటాయి?
జవాబు:
120°

27. ఈథీన్ లో ‘C’ మరియు ‘C’ ల మధ్య ఎటువంటి బంధం ఉండును?
A) sp² – sp²
B) sp2 – sp2
C) sp³ – sp³
D) sp² – s
జవాబు:

28. π బంధం ఏర్పడాలంటే p – ఆర్బిటాళ్ళు ఎలా అతిపాతం చెందుతాయి?
జవాబు:
పార్శ్వ అతిపాతం

29. CH2 = CH2 ను ఏమని పిలుస్తారు?
జవాబు:
ఈథేన్ / ఇథిలీన్

30. ఒక s, ఒక p ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది ఏర్పడే సంకర ఆర్బిటాళ్ళు ఏవి?
జవాబు:
sp, sp

31. ఈథైన్ యొక్క సాధారణ నామం ఏమిటి?
జవాబు:
ఎసిటిలీన్

32. జతపరుచుము :
1) C2H2 ( ) a) ఈథేన్
2) C2H4 ( ) b) ఈజైన్
3) C2H6 ( ) c) ఈథేన్
జవాబు:
1 – b, 2 – c, 3 – a

33. ఎసిటిలీన్ అణువులో కార్బన్ల మధ్య ఉండే బంధం
A) ఏక
B) ద్వి
C) త్రి
D) చెప్పలేం
జవాబు:
C) త్రి

34. జతపరుచుము :
1) C2H2 ( ) a) σsp – sp
2) C2H4 ( ) b) σsp² – sp²
3) C2H6 ( ) c) σsp³ – sp³
జవాబు:
1 – a, 2 – b, 3 – c

35. 1) ఎసిటిలీన్ అణువులో 3σ, 2π
2) ఇథిలీన్ అణువులో 5σ, 1π
3) ఈథేన్ అణువులో 6σ, 0π
పై వానిలో ఏది సరియైనది కాదు?
జవాబు:
3

36. ఏదేని ఒక మూలకం రెండు కన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభిస్తూ, రసాయన ధర్మాలలో దాదాపు సారూప్యతను కలిగి ఉండి భౌతిక ధర్మాలలో విభేదించే ధర్మాన్ని ఏమంటారు?
జవాబు:
‘రూపాంతరత’

37. ఒక మూలకం యొక్క విభిన్న రూపాలను ఏమంటారు?
జవాబు:
రూపాంతరత

38. కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరానికి ఉదాహరణ నిమ్ము
జవాబు:
బొగ్గు, కోక్, చార్ కోల్, నల్లని మసి మొదలగునవి.

39. కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలను రాయుము.
జవాబు:
వజ్రం, గ్రాఫైట్, బక్ మిస్టర్ ఫుల్లరిన్, నానో ట్యూబులు.

40. వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు ఉత్తేజిత స్థితిలో ఎటువంటి సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
sp3

41. ఇప్పటివరకూ తెలిసిన పదార్థాలలో అతి గట్టి పదార్థం ఏమిటి?
జవాబు:
వజ్రం

42. గ్రాఫైట్ లో కార్బన్ల మధ్య ఎటువంటి ఆవరణం ఉంటుంది?
జవాబు:
త్రికోణీయ సమతల ఆవరణం

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

43.

a) గ్రాఫైట్ నిర్మాణంలో సంకరీకరణంi) sp²
b) వజ్రం నిర్మాణంలో సంకరీకరణంii) sp³
iii) sp

పై వానిని జతపరుచుము.
జవాబు:
a – i, b – ii

44. గ్రాఫైట్ ను నిజజీవితంలో ఎక్కడ వినియోగిస్తున్నాం?
జవాబు:
1) పెన్సిల్ 2) లూబ్రికెంట్స్ (కందెనలు)

45. ఫైట్ ను చెక్కడం / అరగదీయడం సులువు. కారణం ఏమిటి?
జవాబు:
ఫైట్ పొరల మధ్య 3.35 A° దూరం ఉండటం. (వాండర్ వాల్ బలాల వలన)

46. A) గ్రాఫైట్ ఒక మంచి విద్యుద్వాహకం
R) గ్రాఫైట్ విస్థాపనం చెంది వున్న π ఎలక్ట్రాన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
A) A, R లు ఒప్పు మరియు A కు R సరియైన కారణం.
B) A, R లు ఒప్పు మరియు A కు R సరియైన కారణం కాదు.
C) A ఒప్పు, R తప్పు
D) రెండూ తప్పు జ. A
జవాబు:
A) A, R లు ఒప్పు మరియు A కు R సరియైన కారణం.

47. బక్ మిస్టర్ ఫుల్లరిన్ ఆకారం ఏమిటి?
A) బోలుగా ఉండే గోళం
B) దీర్ఘ ఘనం
C) నాళం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

48. ఫుల్లరిన్లు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
బాష్పకార్బన్ ఘనీభవించడం వలన.

49. ఫుల్లరిన్లను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
క్రోటో మరియు స్మాలీ

50. గోళాకారంలో ఉన్న ఫుల్లరినను ఏమందురు?
జవాబు:
బక్కీబాల్స్

51. బక్కీబా లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి?
జవాబు:
60

52. బక్కీబాల్ ఏర్పడడానికి ఎన్ని పంచముఖ, ఎన్ని షణ్ముఖ ఆకృతి కలిగిన ముఖాలు కలిగి ఉంటాయి?
జవాబు:
12 పంచముఖ, 20 షణ్ముఖ

53. బక్కీబాల్స్ లో కార్బన్లో ఎటువంటి సంకరీకరణం కలిగి ఉంటుంది?
జవాబు:
sp²

54. ఫుల్లరిన్ యొక్క ఒక ఉపయోగం రాయండి.
జవాబు:
విశిష్ఠ రోగ నిరోధక ఔషధాల తయారీలో వినియోగిస్తారు.

55. మెలెనోమా వంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధం తయారీలో వినియోగించే కార్బన్ రూపాంతరత ఏది?
జవాబు:
ఫుల్లరిన్

56. నానో నాళాలను ఎవరు కనుగొన్నారు?
జవాబు:
సుమియో లీజిమ (1991)

57. నానో ట్యూబులలో కర్బన పరమాణువుల మధ్య ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
షణ్ముఖ

58. స్థూపాకారపు గొట్టాలు మాదిరిగా ఉండే కార్బన్ రూపాంతరాలు ఏవి?
జవాబు:
నానో ట్యూబులు

59. క్రింది వానిలో విద్యుత్ వాహకాలు
A) గ్రాఫైట్
B) నానో ట్యూబులు
C) వజ్రం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

60. నానోట్యూబులను అణుతీగలుగా వినియోగిస్తారు. ఎందుకు?
జవాబు:
నానోట్యూబులు మంచి విద్యుద్వాహకాలు

61. IC లలో రాగికి బదులు వినియోగించే కార్బన్ రూపాంతరం ఏమిటి?
జవాబు:
నానో ట్యూబులు

62. స్టీలు కన్నా దృఢమైన కర్బన పదార్థం ఏమిటి?
జవాబు:
గ్రాఫిన్

63. యూరియా అను కర్బన సమ్మేళనాన్ని ఎవరు కనుగొన్నారు?
జవాబు:
F. వోలర్

64. వోలర్ యూరియాను దేని నుండి తయారు చేశాడు?
జవాబు:
అమ్మోనియం సయనేట్

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

65. యూరియా అణు నిర్మాణం రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 70

66. శృంఖల ధర్మం (కాటనేషన్) అనగానేమి?
జవాబు:
అతిపెద్ద అణువులను ఏర్పరచగల ధర్మాన్ని కాటనేషన్ అంటారు.

67. కార్బన్ ఈ క్రింది శృంఖలాలను ఏర్పరచగలదు.
A) పొదవైన
B) శాఖాయుత
C) వలయాకార
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

68. కాటనేషన్ సామర్థ్యం గల కొన్ని మూలకాలను రాయండి.
జవాబు:
సల్ఫర్, ఫాస్ఫరస్, కార్బన్

69. కార్బన్ క్రింది బంధాలను ఏర్పరచలేదు.
A) నాలుగు ఏక సంయోజనీయతా బంధాలు
B) ఒక ద్విబంధం మరియు రెందు ఏకబంధాలు
C) ఒక ఏక, ఒక త్రిబంధం
D) ఒక ద్విబంధం, ఒక త్రిబంధం
జవాబు:
D) ఒక ద్విబంధం, ఒక త్రిబంధం

70. హైడ్రోకార్బన్లు అనగానేమి?
జవాబు:
కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగి యున్న సమ్మేళనాలు.

71. ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్లని వేటిని పిలుస్తారు?
జవాబు:
వివృత శృంఖల హైడ్రోకార్బన్లు

72. వివృత శృంఖల హైడ్రోకార్బన్ కి ఒక ఉదాహరణ ఇమ్ము.
జవాబు:
n- పెంటేన్ (CH3-CH2-CH2-CH2-CH3)

73. సంవృత శృంఖల సమ్మేళనంకి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 71

74. ఆల్కేనులు అనగానేమి?
జవాబు:
రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధాలను కలిగి ఉన్న హైడ్రోకార్బన్లు.

75. ఆలీనులు అనగానేమి?
జవాబు:
రెండు కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్వి బంధం కలిగి ఉన్న హైడ్రోకార్బన్లు.

76. ఆల్కైనులు అనగానేమి?
జవాబు:
రెండు కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్లను ఆలైన్లు అంటారు.

77.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 72
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 73

78. సంతృప్త హైడ్రోకార్బన్లు అని వేటిని అంటారు?
జవాబు:
కార్బన్ల మధ్య ఏకబంధాలున్న హైడ్రోకార్బన్లు.

79. A) ప్రవచనం : ఆల్కేనులు అన్నీ అసంతృప్త హైడ్రోకార్బన్లే
B)కారణం : ఆల్కేనులలో కార్బన్ల మధ్య ఏక బంధాలుంటాయి.
A) A మరియు R లు సరియైనవి.
A ను R సమర్థించును.
B) A మరియు R లు సరియైనవి.
A ను R సమరించదు.
C) A సరియైనది. R సరియైనది కాదు
D) A సరియైనది కాదు. R సరియైనది.
జవాబు:
D) A సరియైనది కాదు. R సరియైనది.

80. అసంతృప్త హైడ్రోకార్బన్లకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఆల్కీనులు, ఆలైన్లు

81. క్రింది వానిలో ఏవి అసంతృప్త సమ్మేళనాలు?
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 74
జవాబు:
B, C లు

82. సమజాత శ్రేణులలో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య ఎంత భేదం ఉంటుంది?
జవాబు:
-CH2

83. ‘కర్బన సమ్మేళనాల శ్రేణులలో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య -CH2 భేదంతో ఉంటే వాటిని ఏమని పిలుస్తారు?
జవాబు:
సమజాత శ్రేణులు

84. సమజాత శ్రేణులకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
1) CH4, C2H6, C3H8, ………
2) CH3OH, C2H5OH, C3H7OH, …..

85. సమజాతాలు లేదా సంగతాలు అనగానేమి?
జవాబు:
ఒక సమజాత శ్రేణికి చెందిన అణువులను సమజాతాలు అంటారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

86. కొన్ని సమజాత శ్రేణులని రాయండి.
జవాబు:
ఆల్మేన్లు, ఆల్కీన్లు, ఆలైన్లు

87. ఆల్కేనుల సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
CnH2n+2

88. ఆలైన్ల సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
CnH2n-2

89. ఆల్కీల సాధారణ ఫార్ములా రాయండ.
జవాబు:
CnH2n

90. ఆల్కహాల్ సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
(CnH2n+1) OH.

91. C2H4, C3H6, …….లో తరువాత పదం ఏమిటి?
జవాబు:
C4H8

92. ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి, వేర్వేరు ధర్మాలను కలిగి ఉండే సమ్మేళనాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
అణు సాదృశ్యకాలు

93. అణుసాదృశ్యం అనగానేమి?
జవాబు:
ఒకే అణు ఫార్ములా గల సమ్మేళనాలను వేర్వేరు ధర్మాలను కలిగి ఉండడాన్ని అణుసాదృశ్యం అంటారు.

94. నిర్మాణంలోని భేదం వలన కలిగిన అణుసాదృశ్యంను ఏమంటారు?
జవాబు:
నిర్మాణాత్మక అణు సాదృశ్యం.

95. CH3-CH2-CH2-CH3 యొక్క అణుసాదృశ్యకాన్ని రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 75

96. C5H12 కి రెండు అణుసాదృశ్యాలను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 76

97. i) ఒకే రకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలు అన్నీ ఒకే రకమైన చర్యలలో పాల్గొంటాయి.
ii) ప్రమేయ సమూహాన్ని బట్టి కర్బన సమ్మేళన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
పై వానిలో సరికాని వాక్యం / వాక్యాలు ఏవి?
జవాబు:
రెండూ సరియైనవే.

98. హాలో హైడ్రోకార్బన్లలో ఏయే పరమాణువులుంటాయి?
జవాబు:
హాలోజన్, హైడ్రోజన్ (H), కార్బన్ (C).

99. ఒక హాలో హైడ్రోకార్బన్ కి ఉదాహరణనిమ్ము.
జవాబు:
CH3Cl

100. C, H, O లు ఉండే కొన్ని ప్రమేయ సమ్మేళనాలు ఏవి?
జవాబు:
ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలికామ్లం, ఈథర్,

101. ఆల్కహాల్ సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
R – OH

102. -OH గ్రూపును కలిగిన హైడ్రోకార్బనను ఏమంటారు?
జవాబు:
ఆల్కహాల్

103. ఆల్కహాల్ ప్రమేయ సమూహం గల కొన్ని సమ్మేళనాలను రాయుము.
జవాబు:
CH3OH, CH3CH2OH,
CH3-CHOH – CH3

104. ఆల్డిహైడ్లనగానేమి?
జవాబు:
-CHO గ్రూపును కలిగియున్న హైడ్రోకార్బన్లను ఆలి హైళ్లు అంటారు.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

105. ఆల్డిహైడ్ సాధారణ ఫార్ములాను రాయండి.
జవాబు:
R-CHO

106. క్రింది వానిని జతపర్చుము :
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 77
జవాబు:
a – ii, b – iii, c – i

107. కీటోన్ ప్రమేయ సమూహం గ్రూపును రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 78

108. AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 79 ప్రమేయ సమూహాన్ని కలిగియున్న కర్బన సమ్మేళనాన్ని ఏమంటారు?
జవాబు:
కీటోన్లు

110. డై మిథైల్ కీటోన్ అణు ఫార్ములాను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 80

110. కార్బాక్సిలిక్ ఆమ్లం సాధారణ ఫార్ములా ఏమిటి ?
జవాబు:
R – COOH

111. కార్బాక్సిలికామ్లం R-COOH లో ‘R’ అనగా
A) ఆల్కైల్ గ్రూపు
B) H పరమాణువు
C) A లేదా B
D) హాలోజన్ గ్రూపు
జవాబు:
C) A లేదా B

112. కొన్ని కార్బాక్సిలికామ్లాల పేర్లు రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 81

113. నీటి అణువులో రెండు హైడ్రోజన్ పరమాణువుల స్థానంలో రెండు ఆ్కల్ గ్రూపులను ప్రతిక్షేపిస్తే ఏర్పడేవి ఏవి?
జవాబు:
ఈథర్లు

114. కొన్ని ఈథర్ల అణు ఫార్ములాలను రాయండి.
జవాబు:
a) CH3 – O – CH3 (డై మిథైల్ – ఈథర్)
b) CH3 – CH2-O-CH3(ఈథైల్ మిథైల్ ఈథర్)
c) CH2 = CH-O-CH3(మిథైల్ వినైల్ ఈథర్)

115. ‘ఏస్టర్లు’ అనగానేమి?
జవాబు:
కార్బాక్సిలిక్ ఆమ్లాల ఉత్పన్నాలను ఎస్టర్లు అందురు.

116. -COOH → కార్బాక్సిలికామ్లం : : | ? |- ఎస్టర్ పదాలను రాయుము.
జవాబు:
– COOR

117.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 82
పై సమ్మేళనాల పేర్లు రాయండి.
జవాబు:
i) ఇథైల్ మిథైల్ కీటోన్
ii) ఇథైల్ మిథైల్ ఎస్టర్

118. అమైన్ సమూహాన్ని రాయండి.
జవాబు:
-NH2

119. R-NH2 ప్రమేయ సమూహం పేరు రాయండి.
జవాబు:
అమైన్

120. క్రింది వానిని జతపర్చండి :
a) ఆల్కహాల్ ( ) i) R-CHO
b) ఆల్డిహైడ్ ( ) ii) R-CO-R
c) కీటోన్ ( ) iii) R-OH
జవాబు:
a – iii, b – i, c – ii

121. క్రింది వాటిని జతపర్చండి.
a) కార్బాక్సిలికామ్లం ( ) 1) CH3-COOH
b) ఈథర్ ( ) 2) CH3-O-CH3
c) ఎస్టర్ ( ) 3) CH3-COO-C2H5
జవాబు:
a – 1, b – 2, c – 3

122. IUPAC అనగానేమి?
జవాబు:
అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్ర సంఘం

123. IUPAC విధానంలో ‘మూలపదం’ దేనిని సూచించును?
జవాబు:
కార్బన్ల సంఖ్యను

124. హైడ్రోకార్బన్స్ యొక్క శృంఖలం యొక్క సామాన్య పేరు ఏమిటి?
జవాబు:
ఆల్క్ – (Alk)

125. మూలపదం ‘హెక్స్’లో ఎన్ని కార్బన్లు ఉంటాయి?
జవాబు:
‘6’

126. C8, C5 లుగా శృంఖలం పొడవులు గల మూల పదాలను రాయుము.
జవాబు:
C8 – ఆక్ట్, C5 – పెంట్

127. జతపర్చుము :
1) C – C ( ) a) – ఐన్
2) C = C ( ) b) – ఏన్
3) C ≡ C ( ) c) – ఈన్
జవాబు:
1 – b 2 – c 3 – a

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

128. IUPAC నామీకరణంలో, ఒకవేళ కర్బన సమ్మేళనం ఒక సంతృప్త సమ్మేళనం అయితే దాని పరపదంగా ….. ను చేర్చాలి.
జవాబు:
‘e’

129. శాఖాయుత సంతృప్త హైడ్రోజన్ భాగమైన హైడ్రోకార్బన్ ను ఏమందురు?
జవాబు:
ఆల్కైల్ సమూహం (లేదా) ఆల్కైల్ ప్రాతిపదిక.

130. ఆల్కేన్ : C. Haa+ : ఆల్మైల్ : ?
జవాబు:
Cn H2a+1

131. ‘ఆల్కైల్’ను ఏ అక్షరంతో సూచిస్తారు?
జవాబు:
‘R-‘

132. ‘ఆల్కెల్’ ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
ఆల్కేన్ల నుండి ఒక హైడ్రోజన్‌ను తొలగించడం ద్వారా ఏర్పడుతుంది.

133. బ్యూటేన్ నుండి తయారయ్యే ఆల్కైల్ సమూహం పేరు రాయండి.
జవాబు:
బ్యూటైల్

134. పెంటైల్ అణు ఫార్ములా రాయుము.
జవాబు:
C5H11

135.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 83
• పై సమ్మేళనంలో మూలపదం ఏమిటి?
జవాబు:
హెఫ్ట్

• పూర్వపదం ఏమిటి?
జవాబు:
మిథైల్

136.
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 84
A) 2-మిథైల్ బ్యూటేన్
B) 3-మిథైల్ బ్యూటేన్
C) ఐసో బ్యూటేన్
D) ఏవీకాదు
జవాబు:
A) 2-మిథైల్ బ్యూటేన్

137. 4-మిథైల్ హెక్సేస్ ఫార్ములా రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 85

138. 4 – మిథైల్ హెక్స్ – 3 – ఐన్ నిర్మాణాత్మక ఫార్ములాను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 86

139. 4-మిథైల్ హెస్ట్ – 2 – ఈన్ యొక్క నిర్మాణాత్మక ఫార్ములా రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 87

140. సాధారణంగా IUPAC నామీకరణంలో క్రింది పదాల వరుస క్రమాన్ని రాయండి.
i) పూర్వపదం
ii) మూలపదం
iii) ప్రతిక్షేపకస్థానం
iv) ద్వితీయ పరపదం
v) ప్రాథమిక పరపదం
జవాబు:
iii – i- ii – v – iv

141. 2, 2, 3, 3 – టెట్రా మిథైల్ హెస్టన్ నిర్మాణాత్మక ఫార్ములాను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 88

142. కొన్ని పూర్వపదాలు రాయుము.
జవాబు:
డై, ట్రై, టెట్రా, …..

143. CH3 – CH = CH -CH – C ≡ CH యొక్క IUPAC పేరు రాయండి.
జవాబు:
హెక్స్ – 4 – ఈన్ – 1 – ఐన్

144. CH ≡ C – CH = C = CH – COOH లో ద్వితీయ పరపదంగా ఏమి రాయాలి?
జవాబు:
ఓయికామ్లం

145. 3-ఇథైల్ -2, 3 – డై మిథైల్ హెస్టన్ నిర్మాణాత్మక ఫార్ములా రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 89

146. ఒక కార్బన్ సమ్మేళనం యొక్క IUPAC సమీకరణంలో కార్బన్ పరమాణువులను ఇలా లెక్కించాలి.
A) కుడి నుండి ఎడమకు
B) ఎడమ నుండి కుడికి
C) A లేదా B
D) మధ్య నుండి ఎడమకు గాని కుడికి గాని
జవాబు:
C) A లేదా B

147. కార్బన్ మరియు దాని సమ్మేళనాలు ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది వేటిని ఇచ్చును?
జవాబు:
CO2, వేడి మరియు కాంతి

148. దహన చర్య
a) ఆక్సీకరణ చర్య
b) క్షయకరణ చర్య
c) a లేదా b
జవాబు:
a) ఆక్సీకరణ చర్య

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

149. కార్బనన్ను ఆక్సిజన్తో మండించినప్పుడు విడుదలయ్యేది?
A) CO2
B) H2O
C) శక్తి
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

150. ఇథనోల్ దహన చర్యా సమీకరణం రాయండి.
జవాబు:
CH3CH2OH + 3O2 → 2CO2 + 3H2O + శక్తి

151. ఒక హైడ్రోకార్బనను సరిపోయినంత ఆక్సిజన్ మండించినప్పుడు నీలి మంటతో మండింది. ఆ హైడ్రోకార్బన్
A) అసంతృప్త హైడ్రోకార్బన్
B) సంతృప్త హైడ్రోకార్బన్
C) A మరియు B
D) ఏవీకావు
జవాబు:
B) సంతృప్త హైడ్రోకార్బన్

152. క్రింది వానిలో ఏవి మసితో కూడిన మంటను ఇస్తాయి?
A) అసంతృప్త హైడ్రోకార్బన్లు
B) సుగంధభరిత సమ్మేళనాలు
C) గాలి సరిగాలేని సంతృప్త హైడ్రోకార్బన్లు
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

153. అప్పుడప్పుడూ వంటపాత్రలపై మంట వలన నల్లని మసి ఏర్పడుతుంది. కారణం ఏమిటి?
జవాబు:
ఆక్సిజన్ సరిపోయినంత లేక.

154. i) అన్ని దహన చర్యలూ ఉష్ణమోచక చర్యలు.
ii) అన్ని దహన చర్యలూ ఆక్సీకరణ చర్యలు.
iii) దహన చర్యలో శక్తి విడుదలగును.
iv)అన్ని ఆక్సీకరణ చర్యలూ దహన చర్యలు.
పై వానిలో సరియైన వాక్యాలు ఏవి?
జవాబు:
i, ii, iii

155. ఇథనోల్ ఇథనాల్ గా మారడం
A) దహనచర్య
B) ఆక్సీకరణచర్యలు
C) A & B
D) A & B doo soo
జవాబు:
C) A & B రెండూ కావు

156. అసంతృప్త హైడ్రోకార్బన్లు – సంతృప్త హైడ్రో కార్బన్లుగా మారడానికి క్రింది చర్యలలో పాల్గొంటాయి.
A) సంకలన
B) ప్రతిక్షేపణ
C) A మరియుB
జవాబు:
A) సంకలన

157. బ్యూట్-2-ఐనను బ్యూటేన్ గా మార్చునపుడు ఏ ఉత్ప్రేరకాన్ని వినియోగిస్తారు?
జవాబు:
నికెల్

158. ఒక రసాయనిక చర్యవేగాన్ని పెంచేది ఏది?
జవాబు:
ఉత్ప్రేరకం

159. నూనెల హైడ్రోజనీకరణలో వినియోగించే ఉత్ప్రేరకం ఏది?
జవాబు:
నికెల్

160. జతపర్చుము.
a) జంతువుల నూనె ( ) i) సంతృప్త కార్బన్
b) మొక్కల నూనె ( ) ii) అసంతృప్త కార్బన్
జవాబు:
a – i, b – ii

161. జంతు సంబంధ నూనెలను వంటలకు వినియోగించ కూడదు. ఎందుకు?
జవాబు:
అవి సంతృప్త కార్బన్లను కలిగి వుంటాయి.

162. గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉండేవి.
A) నూనెలు
B) క్రొవ్వులు
C) A మరియు B
జవాబు:
B) క్రొవ్వులు

163. ఆల్కేన్లను పారాఫిన్లని ఎందుకంటారు?
జవాబు:
తక్కువ చర్యాశీలత వలన

164. మీథేన్, క్లోరి తో ఏ రకమైన చర్యలలో పాల్గొనును?
A) సంకలన
B) ప్రతిక్షేపణ
C) A మరియుB
జవాబు:
B) ప్రతిక్షేపణ

165. క్లోరోఫాం రసాయన సంకేతం రాయుము.
జవాబు:
CHCl3

166. క్లోరోఫాం, క్లోరితో చర్య జరిపి దేనిని ఏర్పరుచును?
జవాబు:
CCl4

167. AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 90
జవాబు:
ఇథనోయిక్ ఆమ్లం

168. ఈథేన్ నుండి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేయునపుడు వినియోగించే ఉత్ప్రేరకాలు ఏవి?
జవాబు:
P2O5 / టంగ్ స్టన్ ఆక్సైడ్

169. తృణధాన్య ఆల్కహాల్ (grain alcohol) అని దేనినంటారు?
జవాబు:
ఇథనోల్

170. ఆక్సీకారిణులు దహనచర్యలో …… కి గురి అవుతాయి.
A) ఆక్సీకరణానికి
B) క్షయకరణానికి
C) A లేదా B
జవాబు:
B) క్షయకరణానికి

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

171. ఆక్సీకారిణికి ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్,
ఆమీకృత పొటాషియం డై క్రోమేట్.

172. ‘కిణ్వ ప్రక్రియ’ అనగానేమి?
జవాబు:
పిండి పదార్థాలను ఇథైల్ ఆల్కహాలుగా మార్చే ప్రక్రియ

173. కిణ్వ ప్రక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి?
జవాబు:
ఇథనోల్ + CO2

174. ఇథనోల్ బాష్పీభవన స్థానం ఎంత?
జవాబు:
78.3°C

175. పరమ ఆల్కహాల్ అనగానేమి?
జవాబు:
100% ఇథనోల్

176. డినేచర్డ్ ఆల్కహాల్ (అసహజ ఆల్కహాల్)లో సాధారణంగా కలిపే మలినాలు ఏవి?
జవాబు:
‘మిథనాల్, మిథైల్ ఐసోబ్యుటెల్ కీటోన్, ఏవియేషన్ గాసోలిన్.

177. గాసోలిన్ 10% ఆల్కహాల్ ఉపయోగమేమి?
జవాబు:
వాహనాల ఇంధనం.

178. సాధారణంగా మద్యపానీయాలలో ఉండే ఆల్కహాల్ ఏది?
జవాబు:
ఇథనోల్ (ఇథైల్ ఆల్కహాల్), C2H5OH.

179. ఇథనోల్ యొక్క ఒక ఉపయోగాన్ని రాయండి.
జవాబు:

  1. మంచి ద్రావితంగా వినియోగిస్తారు.
  2. టింక్చర్ అయోడిన్, దగ్గు మందులలో వినియోగిస్తారు.

180. వాహనదారులు మద్యం సేవన గుర్తింపు పరికరంలో ఉండే రసాయనం ఏమిటి?
జవాబు:
పొటాషియం డై క్రోమేట్ (K2Cr2O7).

181. ఇథనోల్ లో సోడియం ముక్కను వేస్తే ఏమవుతుంది?
జవాబు:
హైడ్రోజన్ వాయువు విడుదలగును.

182. ఇథనోలకు H2SO4 కలిపి నీటిని తొలగించి, ఈథేనన్ను ఏర్పరచే చర్యనేమంటారు?
జవాబు:
డీహైడ్రేషన్ చర్య

183. క్రింది వానిలో తియ్యని వాసన గలది.
A) ఇథనోల్
B) ఇథనోయికామ్లం
C) రెండూ
D) రెండూ కావు
జవాబు:
A) ఇథనోల్

184. ఇథనోయికామ్లం సాధారణ నామం ఏమిటి?
జవాబు:
ఎసిటికామ్లం

185. వెనిగర్ ఎలా తయారు చేస్తారు?
జవాబు:
5-8% ఎసిటికామ్ల ద్రావణాన్ని నీటిలో కలిపి వెనిగరు తయారు చేస్తారు.

186. వెనిగర్ యొక్క నిజజీవిత వినియోగాన్ని రాయండి.
జవాబు:

  1. వంటలలో వినియోగిస్తారు.
  2. పచ్చళ్ళు నిల్వ చేయడానికి వినియోగిస్తారు.

187. వెనిగర్ లో ఉండే ఆమ్లం ఏది?
జవాబు:
ఎసిటికామ్లం (లేదా) ఇథనోయికామ్లం

188. ఆమ్లాల యొక్క బలాన్ని ……. విలువ పరంగా లెక్కిస్తారు.
జవాబు:
pka

189. జతపర్చుము :
1) CH3COOH + 2Na → i) H2O
2) CH3COOH + NaOH → ii) H2
3) CH3COOH + Na2CO3 → iii) H2O+ CO2
జవాబు:
1) ii 2) i 3) iii

190. ఎస్టర్లు కలిగి ఉండే ప్రమేయ సమూహాన్ని రాయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 26

191. ఎస్టర్ల సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
R-C00 – R’

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

192. ఎస్టర్లు ఎటువంటి వాసనని కలిగి ఉంటాయి?
జవాబు:
తియ్యని వాసన

193. ఇథనోల్ ను ఎసిటికామ్లంతో కలిపిన ఏమి ఏర్పడును?
జవాబు:
ఎస్టర్ (ఇథైల్ ఎసిటేట్)

194. ఎస్టర్ తయారీకి ఒక ద్విగత చర్యను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 91

195. ఇథైల్ ఎసిటేట్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఇథనోల్, ఇథనోయికామ్లం

196. సబ్బులు అనగానేమి?
జవాబు:
ఫాటీ ఆమ్లాల సోడియం (లేదా) పొటాషియం లవణం.

197. సబ్బు సాధారణ ఫార్ములా రాయండి.
జవాబు:
RCOONa (లేదా) RCOOK

198. కొన్ని ఫాటీ ఆమ్లాల పేర్లు రాయండి.
జవాబు:
C15H31 COOH, C17H35COOH, C17H33COOH.

199. ఓలియిక్ ఆమ్లం ఫార్ములా రాయండి.
జవాబు:
C17H33COOH

200. స్టీరిక్ ఆమ్లం ఫార్ములా రాయండి.
జవాబు:
C17H35COOH

201. క్రొవ్వు అనగానేమి?
జవాబు:
గ్లిజరాల్ మరియు ఫాటీ ఆమ్లాలు కలిగి ఉన్న ఎస్టర్లనే క్రొవ్వులు అంటారు.

202. ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్ అనగానేమి?
జవాబు:
గ్లిజరాల్

203. ఎస్టర్లను ఆఫీకృత జలవిశ్లేషణ చేయడం ద్వారా సబ్బును తయారుచేసే ప్రక్రియను ఏమని పిలుస్తారు?
జవాబు:
సఫోనిఫికేషన్

204. ద్రావిత కణాల వ్యాసం ఎంత వుంటే ఒక ద్రావణం నిజద్రావణం అవుతుంది?
జవాబు:
1nm కన్నా తక్కువ.

205. ఒక ద్రావణంలో ద్రావిత కణాల వ్యాసం 1nm – 100nm మధ్య వుంటే ఆ ద్రావణాన్ని ఏమంటారు?
జవాబు:
కాంజికాభ కణ ద్రావణం (లేదా) కొల్లాయిడల్ ద్రావణం

206. సబ్బు కణాలు అన్నీ కలిసి నీటిలో తేలియాడు సబ్బు గాఢతను ఏమంటారు?
జవాబు:
సందిగ్గ మిసిలి గాఢత (CMC)

207. మిసిలి అనగానేమి?
జవాబు:
సబ్బు నీటిలో గోళాకారంగా దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహం.

208. సబ్బు ద్రావణం ఇలా ఉండును.
A) నిజద్రావణం
B) కొల్లాయిడ్
C) A & B
D) రెండూ కావు
జవాబు:
C) A & B

209. సబ్బు కణం యొక్క కొనలను ఏమంటారు?
జవాబు:
హైడ్రోఫోబిక్ కొన, హైడ్రోఫిలిక్ కొన

210. సబ్బు కణం యొక్క ఏ కొన నూనె / గ్రీజు / జిడ్డును అతుక్కుంటుంది?
జవాబు:
అధృవ కొన (హైడ్రోఫోబిక్)

211. సబ్బు కణంలో ధృవ కొన భాగంలో ఉండేది ఏది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 92

212. i) నీటిలో ఉండే వేరు వేరు మిసిలి కణాలు ఒక దగ్గరకు చేరి అవక్షేపం ఏర్పరుస్తాయి.
ii) సబ్బు కణాల మధ్య అయాన్ – అయాన్ వికర్షణ ఉంటుంది.
పై వాక్యాలలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
(i)

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

213. పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు వినియోగించు కర్బన సమ్మేళనం ఏది?
జవాబు:
ఇథిలీన్

10th Class Physics 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. మీథేనులో బంధ కోణం …………
A) 104°31′
B) 107°48′
C) 180°
D) 109°28′
జవాబు:
D) 109°28′

2. ఎసిటిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్ తో చర్య జరుపునపుడు దానికి గాఢ H2SO4 కలుపుతాం. ఈ ప్రక్రియను…. అంటారు.
A) సపోనిఫికేషన్
B) ఎస్టరిఫికేషన్
C) కాటనేషన్
D) ఐసోమెరిజం
జవాబు:
B) ఎస్టరిఫికేషన్

3. గ్రాఫైట్ మరియు వజ్రం రెండు
A) సాదృశ్యకాలు
B) రూపాంతరాలు
C) సమజాతాలు
D) లోహాలు
జవాబు:
B) రూపాంతరాలు

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

4. CH3 – CH2 – CH2 – COOH పేరు
A) ప్రాపనోయిక్ ఆమ్లం
B) ప్రాపనార్లీ హైడ్
C) బ్యూటనోయిక్ ఆమ్లం
D) బ్యూటనార్లీ హైడ్
జవాబు:
C) బ్యూటనోయిక్ ఆమ్లం

5. సబ్బులు నీటి కాలుష్యాన్ని కలిగించకపోవడానికి కారణం
A) సబ్బులు నీటిలో కరుగవు.
B) సబ్బులు నీటిలో కరుగుతాయి.
C) సబ్బులు 100% జీవ విచ్ఛిన్నం చెందుతాయి (bio-degradable).
D) సబ్బులు జీవ విచ్ఛిన్నం చెందవు (non-biodegradable).
జవాబు:
B & C

6. పచ్చళ్ళు నిల్వచేయడానికి ఉపయోగించే వెనిగర్ లో ఎసిటిక్ ఆమ్లం ఎంత శాతం ఉంటుంది?
A) 5 – 8
B) 10 – 15
C) 100
D) 50
జవాబు:
A) 5 – 8

7. X అనే పదార్థ ద్రావణానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగులేని, ‘వాసనలేని వాయువు Y వెలువడింది. Y వాయువు సున్నపుతేటను పాలవలె మార్చినచో X పదార్థాన్ని గుర్తించండి.
A) NaHCO3
B) NaOH
C) CH3COONa
D) NaCl
జవాబు:
A) NaHCO3

8. పచ్చళ్ళు నిల్వ చేయుటకు ఉపయోగించు కార్బాక్సిలిక్ ఆమ్లం ………..
A) మిథనోయిక్ ఆమ్లం
B) ప్రొపనోయిక్ ఆమ్లం
C) ఇథనోయిక్ ఆమ్లం
D) బ్యుటనోయిక్ ఆమ్లం
జవాబు:
C) ఇథనోయిక్ ఆమ్లం

9. CH, – CH – CH – CH, యొక్క IUPAC నామం
A) క్లోరోబ్యూటేన్
B) 2 – క్లోరోబ్యూటేన్
C) 2, 3 – క్లోరోబ్యూటేన్
D) 2, 3-డై క్లోరోబ్యూటేన్
జవాబు:
D) 2, 3-డై క్లోరోబ్యూటేన్

10. ‘ఆల్కెన్ సమజాత శ్రేణి’ యొక్క సాధారణ ఫార్ములా …….
A) CnH2n + 2
B) Cn H2n
C) Cn H2n – 2
D) Cn H2n + 1
జవాబు:
C) Cn H2n – 2

11. ప్రమేయ సమూహాన్ని ప్రాధాన్యత ప్రకారం ఎంచుకొనుటలో క్రింది వానిలో ఏది సత్యం?
A) -COOH > – CHO > R – OH > – NH2 > C = O > COOR
B) -COOH > – COOR > C = O > R – OH – NH2 > CHO
C) -COOH > – COOR > – CHO > > C = O > R – OH > – NH2
D) -COOH > – CHO > – COOR > C = O > R – OH > – NH2
జవాబు:
C) -COOH > – COOR > – CHO > > C = O > R – OH > – NH2

12. ఆల్కీన్ సాధారణ ఫార్ములా ……….
A) Cn H2n
B) Cn H2n + 1
C) Cn H2n – 2
D) CnH
జవాబు:
A) Cn H2n

13. C2H6 + Cl2 → C2H5Cl + HCl
C2H5Cl + Cl2 → A+ HCl
పై చర్యలో “A” అనగా ……
A) C2H5Cl2
B) C2H4Cl
C) C2H4Cl2
D) C2H5Cl
జవాబు:
C) C2H4Cl2

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు

14. CH3 – CCl2 – CBr2 – CH = CH2 యొక్క IUPAC
A) 2, 2-డై క్లోరో-3, 3-డై బ్రోమో పెంట్-1-ఈన్
B) 3, 3-డై బ్రోమో పెంట్-1-ఈన్
C) 3, 3-డై బ్రోమో-4, 4-డై క్లోరో పెంట్-2 ఈన్
D) 3, 3-డై బ్రోమో-4,4-డై క్లోరో పెంట్-1-ఈన్
జవాబు:
D) 3, 3-డై బ్రోమో-4,4-డై క్లోరో పెంట్-1-ఈన్

మీకు తెలుసా?

‘బక్ మిస్టర్ ఫుల్లరిన్’ లను సాధారణంగా ‘ఫుల్లరిన్’ అంటాం. వీటిని 1985లో రైస్ మరియు సస్సెక్స్ యూనివర్సిటీలకు చెందిన రాబర్ట్. ఎఫ్, కర్ల్, హరాల్డ్ డబ్ల్యూ, క్రోటో మరియు రిచర్డ్. ఈ. స్మాలీ అనే శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. వీరికి 1996లో రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. రిచర్ట్ బక్ మిస్టర్ (బక్కి) పుల్లర్ అనే శాస్త్రవేత్త మరియు వాస్తుశిల్పి (architect) తయారు చేసిన జియోడెసిక్ (geodesic) నిర్మాణంతో పోలి ఉండటం వలన ఈ అణువులకు ఈ పేరు పెట్టడం జరిగింది.

గ్రాఫిన్ – ఒక కొత్త అద్భుతమైన పదార్థం
AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 93

గ్రాఫిన్ దాని పేరులో సూచించిన మాదిరిగా పెన్సిల్ తయారిలో ఉపయోగించే గ్రాఫైట్ నుండి తయారవుతుంది. గ్రాఫైట్ వలెనే గ్రాఫిన్ కూడా మొత్తంగా కార్బన్ పరమాణువులతోనే ఏర్పడుతుంది. 1mm మందంగల గ్రాఫైట్ దాదాపు 3 మిలియన్ పొరల గ్రాఫిన్ కలిగి ఉంటుంది. గ్రాఫిన్ నందు 0.3 నానోమీటర్ల మందం కలిగి తేనెతుట్టెను పోలిన షణ్ముఖీయ (hexagonal) నిర్మాణం అంతటా కార్బన్ పరమాణువులు విస్తరించి ఉంటాయి. .

గ్రాఫిన్ రాగి కన్నా మంచి విద్యుత్ వాహకం. స్టీలు కన్నా 200 రెట్లు బలమైనది. కాని 6 రెట్లు తేలికైనది. అలాగే కాంతికి దాదాపు సంపూర్ణంగా పారదర్శకమైనది.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 94
మద్యం తాగినట్లు అనుమానింపబడిన వ్యక్తిని మద్య సేవన నిర్ధారణ పరికరంతో ఉండే మౌత్ పీలో గల ప్లాస్టిక్ బ్యాగ్ లోనికి గాలిని ఊదమని పోలీసు అధికారి చెబుతాడు. ఈ పరికరంలో పొటాషియం డై క్రోమేట్ (K2 Cr2O7) స్పటికాలు ఉంటాయి. K2Cr2O7 అనేది మంచి ఆక్సీకారిణి కావటంచేత అది వ్యక్తి శ్వాసలో ఇథనోలు ఉన్నట్లయితే దానిని ఇథనాల్ మరియు ఇథనోయిక్ ఆమ్లంగా, ఆక్సీకరణ చెందిస్తుంది. .

ఆరెంజ్ రంగులో ఉండే Cr2O72- అయాన్ నీలి ఆకుపచ్చ Cr3+ గా మారుతుంది. డ్రైవర్ తీసుకొన్న ఆల్కహాల్ పరిమాణాన్ని బట్టి ఆకుపచ్చరంగులోకి మారిన నాళం పొడవు మారుతుంది.

AP 10th Class Physical Science Important Questions 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు 95
కొన్ని చోట్ల ప్రస్తుత పోలీసులు విద్యుత్ ఉపకరణాలను సైతం ఉపయోగిస్తున్నారు. దానిలో ఒక చిన్న విద్యుత్ ఘటం ఉండి, ఊపిరిలోని ఇథనోల్ ఆక్సీకరణ చెందగానే విద్యుత్ సిగ్నలను ఉత్పత్తి చేస్తుంది.

ఇంకా ఆధునికంగా పోలీసులు IR వర్ణపటం కూడా ఇథైల్ ఆల్కహాల్ లోని C – OH మరియు C – H ల మధ్య బంధాలను కనుగొనడానికి ఉపయోగిస్తున్నారు.