These AP 10th Biology Important Questions and Answers 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ will help students prepare well for the exams.
AP Board 10th Class Biology 5th lesson Important Questions and Answers నియంత్రణ – సమన్వయ వ్యవస్థ
10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
కింది బొమ్మలోని నాడీ పేరు రాసి, అది చేసే పనిని తెల్పండి.
జవాబు:
- ఈ బొమ్మలోని నాడీ జ్ఞాననాడీ లేదా అభివాహి నాడీ.
- ఈ నాడీ దేహములోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు చేర్చును.
ప్రశ్న 2.
మీ పాఠశాల ప్రయోగశాలలో మీరు చేసిన చిక్కుడు విత్తనము మొలకెత్తె కృత్యంలో కాండం మరియు వేరు పెరుగుదలను గమనించి ఉన్నారు. వారం తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజసమాంతరంగా ఉంచినప్పుడు కాండం పెరుగుదలలో నీవు పరిశీలించి నమోదు చేసిన అంశాలను వ్రాయగలవు.
జవాబు:
- కాంతి సోకే కాండ భాగంలో అధికంగా ఆక్సిన్లు చేరుతాయి.
- కనుక ఆ భాగంలో కణాలు వేగంగా పెరిగి కాండం కాంతివైపు వంగుతుంది. దీనినే కాంతి అనువర్తనం అంటారు.
ప్రశ్న 3.
“మొక్కలు ఉద్దీపనాలకు ప్రతిస్పందిస్తాయి” నీవు దీనిపై ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు ఏఏ మొక్కల సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తావు?
జవాబు:
ప్రొద్దుతిరుగుడు పువ్వు, దోస తీగలు, కాకర తీగలు, మైమోసాప్యుడికా (అత్తిపత్తి) మొదలగునవి.
ప్రశ్న 4.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఇన్సులిన్ హార్మోన్ గురించి 2 వాక్యాలు వ్రాయండి.
జవాబు:
- కోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికలు, ఇన్సులిన్ అనే హార్మోనును స్రవించును.
- ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రించును.
- ఇన్సులిన్ లోపించినట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి మధుమేహ వ్యాధి (డయాబెటిస్ మిల్లిటస్) కలుగును.
ప్రశ్న 5.
కిటికీ వద్ద పెరుగుచున్న మొక్క సూర్యరశ్మి వైపు వంగుతుంది. ఇలా వంగడానికి కారణము ఏమి?
జవాబు:
- మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
- మొక్కలపై కాంతి పడినపుడు కాండాగ్రంలోని విభాజ్య కణజాలం ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోనును ఉత్పత్తి చేస్తాయి.
- ఆక్సినుల ప్రభావం వలన కణాలు విభజన చెంది కాంతి వైపుకు వంగుతాయి. దీనినే కాంతి అనువర్తనం అంటారు.
ప్రశ్న 6.
బొమ్మలో సూచించిన భాగాన్ని గుర్తించి అది చేసే పనిని రాయండి.
జవాబు:
- సైనాప్స్ (లేదా) నాడీ సంధి
- ఇది ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారమును చేరవేసే క్రియాత్మక భాగం.
ప్రశ్న 7.
శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగమేది?
జవాబు:
శరీర సమతాస్థితిని నియంత్రించే భాగం : అనుమస్తిష్కము
ప్రశ్న 8.
హార్మోన్స్ అనగానేమి?
జవాబు:
వినాళ గ్రంథులచే స్రవించబడే రసాయన పదార్థాలను “హార్మోన్స్” అంటారు. ఇవి నేరుగా రక్తంలోనికి విడుదలై నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. 1905 వ సంవత్సరంలో ఆంగ్ల శరీరధర్మ శాస్త్రవేత్త వీటికి హార్మోన్స్ అని పేరుపెట్టాడు.
ప్రశ్న 9.
ఫైటో హార్మోన్స్ అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
మొక్కలలో ఉత్పత్తి అయ్యే హార్మోనను ఫైటోహార్మోన్స్ అంటారు. ఇవి మొక్కలలో నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తాయి.
ఉదా : ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్స్, ఇథైలిన్, అబ్ సైసిక్ ఆమ్లం.
ప్రశ్న 10.
ఉద్దీపనాలు అనగానేమి?
జవాబు:
ఉద్దీపనాలు :
జీవుల బాహ్య లేదా అంతర పరిసరాలలోని నిర్దిష్ట మార్పులను “ఉద్దీపనాలు” అంటారు. (లేదా) జీవులలో ప్రతిస్పందనను కలిగించే మార్పులను ఉద్దీపనాలు అంటారు.
ప్రశ్న 11.
ప్రతిస్పందన అనగానేమి?
జవాబు:
ప్రతిస్పందన :
ఉద్దీపనలకు జీవులు చూపించే ప్రతిచర్యలను “ప్రతిస్పందనలు” అంటారు.
ప్రశ్న 12.
నాడీకణంలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
నాడీకణంలోని ప్రధానంగా 1. కణదేహం 2. ఆగ్దాన్ 3. డెండ్రైట్స్ అనే భాగాలు ఉంటాయి.
ప్రశ్న 13.
నాడీకణ ఆగ్జాన్ దేనితో కప్పబడి ఉంటుంది?
జవాబు:
నాడీకణ ఆగ్దాన్ మయలిన్ తొడుగుతో కప్పబడి ఉంటుంది.
ప్రశ్న 14.
పొడవును ఆధారంగా చేసుకుని మెదడు, వెన్నుపాములలోని ఆగ్దాన్స్, డెంటైట్ను గుర్తుపట్టగలమా?
జవాబు:
పొడవు ఆధారం చేసుకుని మెదడు, వెన్నుపాములోని ఆగ్జాన్స్, డెండ్రైట్స్ గుర్తుపట్టలేము. వాటిని కప్పుతూ ఉండే మయలిన్ తొడుగు ఆధారంగా గుర్తుపట్టవచ్చు. మెదడు, వెన్నుపాము ప్రాంతంలోని ఎక్సాన్ల చుట్టూ మయలిన్ తొడుగు ఉండదు.
ప్రశ్న 15.
సైనాప్స్ అనగానేమి?
జవాబు:
సైనాప్స్ :
ఒక నాడీకణంలోని డెండ్రైట్స్ మరొక నాడీకణంలోని ఎక్సాతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్ని “సైనాప్స్” అంటారు.
ప్రశ్న 16.
అభివాహిక నాడులు అనగానేమి?
జవాబు:
అభివాహిక నాడులు :
జ్ఞానేంద్రియాల నుండి కేంద్రీయ నాడీ వ్యవస్థ వైపు సమాచారాన్ని తీసుకెళ్ళే నాడులను “అభివాహినాడులు” అంటారు. వీటినే “జ్ఞాననాడులు” అని కూడా అంటారు.
ప్రశ్న 17.
చాలక నాడులు అనగానేమి?
జవాబు:
చాలక నాడులు :
కేంద్రియ నాడీవ్యవస్థ నుండి సమాచారాన్ని శరీర వివిధ భాగాలకు తీసుకెళ్లే నాడులను “అపవాహి నాడులు లేదా చాలక నాడులు” అంటారు.
ప్రశ్న 18.
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం అనగానేమి?
జవాబు:
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం : ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్ ను “ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం” అంటారు.
ప్రశ్న 19.
ప్రతిచర్యలలో ఉద్దీపనల వేగం ఎంత?
జవాబు:
ప్రతిచర్యలలో ఉద్దీపనల వేగం 100 మీ/సె. గరిష్ట వేగంతో జరుగుతుంది.
ప్రశ్న 20.
శరీరంలోని నాడీవ్యవస్థను ఎన్ని రకాలుగా విభజిస్తారు?
జవాబు:
శరీరంలో నాడీవ్యవస్థ వ్యాపించే విధానం బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి :
- కేంద్రీయ నాడీవ్యవస్థ
- పరిధీయ నాడీవ్యవస్థ.
ప్రశ్న 21.
కేంద్రీయ నాడీవ్యవస్థలోని భాగాలు ఏమిటి?
జవాబు:
మెదడు, వెన్నుపాము కేంద్రీయ నాడీవ్యవస్థలోని భాగాలు.
ప్రశ్న 22.
మెదడును రక్షించే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
మెదడును రక్షిస్తూ 1. కపాలం 2. మెనింజస్ 3. మస్తిష్క మేరు ద్రవం ఉన్నాయి.
ప్రశ్న 23.
మెదడులోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
మెదడును ప్రధానంగా 1. ముందు మెదడు 2. మధ్య మెదడు 3. వెనుక మెదడుగా విభజిస్తారు.
ప్రశ్న 24.
మానవ మెదడు బరువు ఎంత?
జవాబు:
మెదడు దాదాపు 1400 గ్రా|| బరువు ఉంటుంది. శరీరం మొత్తం బరువులో ఇది 2%. పురుషులలో 1350 గ్రా. స్త్రీలలో 1275 గ్రా. బరువు ఉంటుంది.
ప్రశ్న 25.
సైనా లో సమాచార ప్రసరణ ఎలా జరుగుతుంది?
జవాబు:
సైనాప్స్ లో సమాచార ప్రసరణ రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది.
ప్రశ్న 26.
మెదడు తీసుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంత?
జవాబు:
మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది.
ప్రశ్న 27.
కపాలనాడులు అనగానేమి?
జవాబు:
కపాలనాడులు :
మెదడు నుండి ఏర్పడే నాడులను “కపాలనాడులు” అంటారు. వీటి సంఖ్య 12 జతలు.
ప్రశ్న 28.
వెన్నునాడులు అనగానేమి?
జవాబు:
వెన్నునాడులు :
వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను “వెన్నునాడులు” అంటారు. వీటి సంఖ్య 31 జతలు. ఇవన్నీ మిశ్రమనాడులు.
ప్రశ్న 29.
Enteric నాడీవ్యవస్థ అనగానేమి?
జవాబు:
మన శరీరంలో కేంద్రీయ నాడీవ్యవస్థ, పరిధీయ నాడీవ్యవస్థతో పాటుగా, జీర్ణనాళంలో మరో నాడీవ్యవస్థ ఉంది. ఇది కేంద్రీయ, పరిధీయ నాడీవ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుంది. దీనిని ‘చిన్న మెదడు’ అనుమారు పేరుతో కూడా పిలుస్తారు. దీనినే “Enteric నాడీవ్యవస్థ” అంటారు.
ప్రశ్న 30.
వినాళ గ్రంథులు అనగానేమి?
జవాబు:
వినాళ గ్రంథులు :
నాళాలు లేని గ్రంథులను “వినాళ గ్రంథులు లేదా అంతస్రావీ గ్రంథులు” అంటారు. ఇవి రసాయనాలను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి.
ప్రశ్న 31.
నాస్టిక్ చలనాలు (Nastic movements) అనగానేమి?
జవాబు:
నాస్టిక్ చలనాలు : మొక్కలు బాహ్య ఉద్దీపనాలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిస్పందనలను “సాస్టిక్ చలనాలు” (Nastic movements) అంటారు.
ప్రశ్న 32.
కాంతి అనువర్తనం అనగానేమి?
జవాబు:
కాంతి అనువర్తనం : మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని “కాంతి అనువర్తనం” అంటారు.
ఉదా : కాండము.
ప్రశ్న 33.
గురుత్వ అనువర్తనం అనగానేమి?
జవాబు:
గురుత్వ అనువర్తనం :
మొక్కలు భూ ఆకర్షణశక్తికి ప్రతిస్పందించడాన్ని “గురుత్వ అనువర్తనం” అంటారు.
ఉదా : వేరు.
ప్రశ్న 34.
స్పర్శానువర్తనం అనగానేమి?
జవాబు:
స్పర్శానువర్తనం :
స్పర్శ లేదా తాకటం వలన మొక్కలు చూపే ప్రతిస్పందనలను “స్పర్శానువర్తనం లేదా థిగ్మో ట్రాపిజం” అంటారు.
ఉదా : అత్తిపత్తి,
ప్రశ్న 35.
రసాయన అనువర్తనం అనగానేమి?
జవాబు:
రసాయన అనువర్తనం :
మొక్కలు రసాయనిక పదార్థాలకు చూపే ప్రతిస్పందనను “రసాయన అనువర్తనం లేదా కీమో ట్రాపిజం” అంటారు.
ఉదా : పరాగరేణువులు మొలకెత్తటం.
ప్రశ్న 36.
నులితీగల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
బలహీన కాండాలు ఆధారాలను పట్టుకొని ఎగబ్రాకటానికి నులితీగలు తోడ్పడతాయి.
ప్రశ్న 37.
నీటి అనువర్తనం అనగానేమి?
జవాబు:
నీటి అనువర్తనం : మొక్కలు నీరు లభించే ప్రదేశం వైపుకు పెరుగుదలను చూపుతాయి. దీనిని “నీటి అనువర్తనం” అంటారు.
ప్రశ్న 38.
నాడీవ్యవస్థ గురించి మొదట పరికల్పన చేసిన వ్యక్తి ఎవరు? అతను ఏమని చెప్పాడు.
జవాబు:
గాలన్ అనే గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129 – 200) నాడీవ్యవస్థ గురించి ముఖ్యమైన పరిశీలన చేశాడు. గాలన్ నాడులు రెండు రకాలు అని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శ) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూపేది.
ప్రశ్న 39.
మెదడులోని వెలుపలి భాగం బూడిద రంగులో ఉంటుంది. ఎందుకు?
జవాబు:
మెదడులో నాడీ కణ దేహాలు బయటి పొరతో ఉండి, కేశనాళికలతో కలిసి బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ భాగాన్ని “grey matter లేదా బూడిద రంగు పదార్థం” అంటారు.
ప్రశ్న 40.
మెదడు లోపలి భాగాలు తెలుపు రంగులో ఉంటాయి. ఎందుకు?
జవాబు:
మెదడు లోపలి పొరలలో నాడీకణాల ఆగ్దాన్లు ఉంటాయి. ఇవి మయలిన్ తొడుగు కలిగి తెల్లగా ఉండుట వలన మెదడు లోపలి భాగాలు తెలుపు రంగులో ఉంటాయి.
ప్రశ్న 41.
పిల్లిని చూచిన ఎలుక పరిగెత్తింది. దీనిలోని ఉద్దీపన ప్రతిస్పందనలు ఏమిటి?
జవాబు:
పిల్లి – ఉద్దీపన, పరిగెత్తటం – ప్రతిస్పందన
ప్రశ్న 42.
నీ నిజజీవితంలో ఉద్దీపన, ప్రతిస్పందనలకు రెండు ఉదాహరణలు ఇవ్వంది.
జవాబు:
ఉద్దీపన | ప్రతిస్పందన |
1. చలిగా ఉంది. | దుప్పటి కప్పుకుంటాను. |
2. దాహంగా ఉంది. | నీరు త్రాగుతాను. |
ప్రశ్న 43.
క్రికెట్ ఆటలో ఫీల్డర్ వెనుకకు పరిగెడుతూ క్యాచ్ పట్టాడు. ఈ సందర్భంలో ఏ ఏ అవయవాలు సమన్వయంగా పనిచేస్తాయి.
జవాబు:
కళ్ళు, మెదడు, కాళ్ళు, చేతులు సమన్వయంగా పనిచేయటం వలన ఫీల్డర్ క్యాచ్ పట్టగలిగాడు.
ప్రశ్న 44.
చక్కెర వ్యా ధి అనగానేమి? దానికి గల కారణం ఏమిటి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉండటం, చక్కెర వ్యాధి లక్షణం. క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సరైన మోతాదులో లేకపోవటం ఈ వ్యాధికి కారణం.
ప్రశ్న 45.
పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేనికి పేరు?
జవాబు:
అడ్రినలిన్ హార్మోన్ మానసిక ఉద్రేకాలను నియంత్రిస్తుంది. దీనిని “పోరాట లేదా పలాయన హార్మోన్” అంటారు.
ప్రశ్న 46.
సాధారణ మొక్కలు నీటి కొరతను ఎలా తట్టుకుంటాయి?
జవాబు:
వేసవికాలంలో మొక్కలు అబ్ సైసిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని ప్రభావం వలన ఆకులు రాలటం, పత్రరంధ్రాలు మూసుకుపోవటం జరిగి నీటినష్టాన్ని తగ్గిస్తాయి.
10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
తమను తినే జంతువుల నుండి రక్షించుకొనుటకు మొక్కలు అనుసరించు విధానాలను మీ గ్రామములో గల రెండు మొక్కలను ఉదాహరణగా తీసుకొని వివరించండి.
జవాబు:
1. వేప :
వేపలో ఉండే నింబిన్ అనే ఆల్కలాయిడ్ వలన దాని భాగాలు చేదుగా ఉంటాయి. కనుక తమను తినే జంతువుల నుండి రక్షించుకుంటాయి.
2. బ్రహ్మజెముడు :
ముళ్ళను ఏర్పరచుకొనుట ద్వారా రక్షించుకుంటాయి.
3. ఉమ్మెత్త :
పత్రాలు చెడు వాసన కలిగి ఉండటం.
ప్రశ్న 2.
మొక్కలు తమ పరిసరాల్లో కలుగు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి అని తెలుసుకొన్నపుడు నీవెలా అనుభూతి చెందావు?
జవాబు:
- మొక్కలలోని అనువర్తన మరియు నాస్తిక్ చలనాలను ప్రకృతిలో గమనించినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అవుతాను.
- కిటికీ దగ్గర పెరుగుతున్న మొక్క కాంతి వైపు వంగుట
- వేరు భూమి వైపు పెరగటం.
- కాకర, దోస లాంటి తీగ మొక్కలు స్పర్శ లేక తాకటం వలన, నులితీగల పెరుగుదల జరగడం.
- సీతాకోకచిలుకలు మకరందం కొరకు పుష్పాల చుట్టూ తిరగటం వంటి దృశ్యాలను చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.
ప్రశ్న 3.
మానవ శరీరంలో అధివృక్క గ్రంథి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
- అధివృక్క గ్రంథి మూత్రపిండంపై టోపీలా ఉంటుంది.
- దీని నిర్మాణంలో వల్కలం, దవ్వ అనే భాగాలు ఉంటాయి.
- ఇది ఎడ్రినలిన్ అనే హార్మోను స్రవిస్తుంది.
- దీనిని పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు.
- ఇది అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి తోడ్పడును.
ప్రశ్న 4.
హార్మోన్లు, ఎంజైములకు మధ్యగల తేడాలేమిటి?
జవాబు:
హార్మోన్లు | ఎంజైమ్లు |
1) ఇవి వినాళ గ్రంథుల నుండి స్రవింపబడతాయి | 1. ఇవి నాళ గ్రంథుల నుండి స్రవింపబడతాయి. |
2) ఇవి రక్తము ద్వారా ప్రసరిస్తాయి. | 2. ఇవి నాళముల ద్వారా ప్రసరిస్తాయి. |
3) ఇవి తక్కువ మోతాదులో విడుదలవుతాయి. | 3. ఇవి ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి. |
4) వీటి చర్యాశీలత నెమ్మదిగా జరుగుతుంది. | 4. వీటి చర్యాశీలత వేగవంతంగా జరుగుతుంది. |
5) ఇవి జీవక్రియలకు తోడ్పడతాయి. | 5. ఇవి జీర్ణక్రియలో తోడ్పడతాయి. |
ప్రశ్న 5.
జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల మధ్య సమన్వయం గురించి అర్థం చేసుకోడానికి వైద్యునితో ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
- జీర్ణక్రియలోని ంథులు ఎలా ప్రేరేపించబడతాయి?
- జీర్ణక్రియ స్రావాలు ఎప్పుడు నిలిపివేయబడతాయి?
- గ్రంథుల పనికి, నాడీవ్యవస్థకు మధ్యగల సంబంధం ఏమిటి?
- జీర్ణ మండల నాడీవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని నీవు భావిస్తున్నావా?
- న్యూరోట్రాన్స్మ టర్స్ అంటే ఏమిటి? జీర్ణక్రియలో వాటి పాత్ర ఏమిటి?
- మానవ శరీరంలో రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు? ఎందుకు?
ప్రశ్న 6.
అసంకల్పిత ప్రతీకార చర్యలో వెన్నుపాము పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
- వెన్నుపాము చాలా వేగంగా వెంటనే ప్రతిస్పందనలను చూపుతుంది.
- ఈ నాడీ ప్రచోదనాలు నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
- దీనివల్ల మనం అనేక అపాయకరమైన పరిస్తితుల నుండి రక్షించుకోగల్గుతున్నాము.
- వెన్నుపాము ద్వారా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలు నిజంగా అద్భుతం మరియు అభినందనీయం.
ప్రశ్న 7.
ముందు మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడి (10 వ కపాల నాడి) ఆకలి సంకేతాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి, ‘ఆకలి కోరికలు’ దాదాపు 30-45 నిముషాల వరకు కొనసాగుతాయి. గ్రీలిన్ స్థాయి పెరిగినపుడు ఆకలి ప్రచోదనాలతో పాటు ఆహారం తినాలనే ఉద్దీపన భావన కలుగుతుంది. పై విషయం చదివి ఏవైనా రెండు ప్రశ్నలు తయారుచేసి రాయుము.
జవాబు:
- ఆకలి సంకేతాలను చేరవేసే నాడులు ఏవి?
- ఆకలి కోరికలు ఎంతసేపు కొనసాగుతాయి?
- మెదడులోని ఏ భాగము ఆకలి కోరికలకు ముఖ్యస్థానం?
- ఏ రసాయనిక పదార్థం వలన ఆహారం తినాలనే ఉద్దీపన భావం కలుగుతుంది?
- ఆకలికి సంబంధించిన హార్మోన్లను పేర్కొనండి.
ప్రశ్న 8.
న్యూరాలజిస్టు కలిసినపుడు మెదడు యొక్క విధులను గురించి తెలుసుకొనుటకు అడిగే కొన్ని ప్రశ్నలు రాయండి.
జవాబు:
న్యూరాలజిస్టుని అడిగే ప్రశ్నలు :
i) మానవునిలో సృజనాత్మకతకు కారణం అయ్యే మెదడులోని భాగమేది?
ii) ఆల్కహాలు సేవించడానికి – మెదడు విధికి సంబంధం ఏమిటి?
iii) ఫిట్స్ ఎందుకు వస్తాయి?
iv) మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జీవనశైలి అవసరం?
v) మేథస్సు (1.0.) పెరగటానికి ఎటువంటి ఆహారం తినాలి?
ప్రశ్న 9.
ఈ దిగువ నీయబడిన పటములో a, b, c, d లను గుర్తించి వాటి యొక్క విధులను వ్రాయండి.
జవాబు:
a) జ్ఞాననాడి / అభివాహినాడి – ప్రచోదనాలను జ్ఞానేంద్రియాల నుండి కేంద్రనాడీ వ్యవస్థకు చేరవేయుట.
b) చాలకనాడి / అపవాదినాడి – ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థ నుండి నిర్వాహక అంగాలకు చేరవేయడం
c) తెలుపురంగు ప్రాంతం.
d) నిర్వాహక అంగం-ప్రచోదనాలకు స్పందించడం.
ప్రశ్న 10.
పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
హార్మోన్ | ఉపయోగాలు |
థైరాక్సిన్ | సాధారణ పెరుగుదల రేటు, జీవక్రియలపై ప్రభావం |
ఆక్సిన్స్ | కణాల పెరుగుదల, కాండం, వేరు విభేదనం |
i) పై వాటిలో ఫైటోహార్మోన్ ఏది?
ii) మానవుల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
జవాబు:
i) ఆక్సీన్స్
ii) థైరాక్సిన్
ప్రశ్న 11.
రెండు అనువర్తన చలనాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
1. మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పంటించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
ఉదా : ప్రొద్దుతిరుగుడు మొక్క
2. మొక్కలు గురుత్వాకర్షణ బలంవైపుగా ప్రతిస్పందిస్తాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.
ఉదా : మొక్కలలో వేర్ల పెరుగుదల
3. మొక్కలలో వేర్లు నీరువున్న ప్రాంతం వైపు పెరుగుతుంటాయి. ఈ ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు.
ఉదా : రాళ్ళను, గోడలను అంటిపెట్టుకొని పెరిగే మొక్కలు.
4. స్పర్శ (లేదా) తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను ‘స్పర్శానువర్తనం’ అంటారు.
ఉదా : దోసతీగ, బీరతీగ, కాకరతీగ మొదలగునవి.
5. రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను రసాయనికానువర్తనం అంటారు.
ఉదా : పరాగరేణువులు, కీలాగ్రము స్రవించే తీయని ద్రవాలు
ప్రశ్న 12.
లాంగర్ హాన్ పుటికలు పనిచేయకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
- ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి కాదు.
- డయాబిటస్ మిల్లిటస్ (లేదా) మధుమేహము (లేదా) చక్కెర వ్యాధి రావచ్చును.
- రక్తములో చక్కెర స్థాయి పెరుగును.
ప్రశ్న 13.
క్రింది పట్టికను చదవండి.
క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము.
i) భావోద్వేగాలకు గురి అయినప్పుడు విడుదలగు హార్మోన్?
జవాబు:
భావోద్వేగాలకు గురి అయినప్పుడు విడుదలగు హార్మోన్ : అడ్రినలిన్
ii) ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు ఏవి?
జవాబు:
ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు : ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్
ప్రశ్న 14.
రాముకి యాక్సిడెంట్ అయినది. అప్పటి నుండి అతడు సరిగా నడవలేకపోతున్నాడు మరియు సరిగా పదార్థాల వాసన గుర్తించలేకపోతున్నాడు. అతని మెదడులో ఏఏ భాగాలు దెబ్బతిని ఉంటాయి?
జవాబు:
- రాముకి యాక్సిడెంట్ వల్ల అనుమస్తిష్కం దెబ్బతినుట వల్ల శరీర సమతాస్థితిని కోల్పోయి సరిగా నడవలేకపోతున్నాడు.
- ముందు మెదడులోని ఝణలంబికలు దెబ్బతినుట వల్ల వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కోల్పోయాడు.
ప్రశ్న 15.
మొక్కలలోని వివిధ అనువర్తన చలనాలు, అవి ఏ ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తున్నాయో తెలియచేయు పట్టికను తయారు చేయుము.
జవాబు:
అనువర్తక చలనం | ఉద్దీపనలకు తగిన ప్రతిస్పందన |
1. కాంతి అనువర్తన చలనం | సూర్యకాంతివైపు చలనము |
2. గురుత్వానువర్తన చలనం | భూమ్యాకర్షణ వైపు చలనము |
3. నీటి అనువర్తనము | వేర్లు నేలలో నీరు వున్న ప్రాంతం వైపు చలనము |
4. స్పర్శానువర్తనం | నులితీగలు, ఎగబ్రాకే మొక్కలు స్పర్శ లేదా తాకుట వలన కలిగే చలనం |
ప్రశ్న 16.
మీ శరీరంలో మీరు గమనించిన రెండు నియంత్రిత, రెండు అనియంత్రిత చర్యలు రాయండి.
జవాబు:
నియంత్రిత చర్యలు :
1. అస్థి కండరాల కదలికలు, 2. ఆహారాన్ని మింగడము, 3. మల విసర్జన
అనియంత్రిత చర్యలు :
1. హృదయ స్పందన, 2. ఆహార జీర్ణక్రియ, 3. రక్త ప్రసరణ
ప్రశ్న 17.
మన శరీరంలో నాడులు రెండు రకాలుగా ఉంటాయని, గాలన్ ఎలా నిర్ధారించగలిగాడు?
జవాబు:
మన శరీరంలోని అన్ని భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు గాయం అయినప్పుడు ప్రవర్తనలో అనేక మార్పులు సంభవిస్తాయి. మెదడు ఎలా నియంత్రిస్తుందో అనే విషయాన్ని కొంత ఆలోచన మాత్రమే చేయగలిగారు. గాలన్ అనే గ్రీకు శరీరధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129–200) ముఖ్యమైన పరిశీలన చేశాడు. అతనికి సంబంధించిన ఒక రోగి రథం పై నుండి పడడం వలన మెడపై వాపు రావడంతో తన భుజంలో స్పందన కోల్పోయినట్లు ఫిర్యాదు చేశాడు.
గాలన్ రెండు రకాల నాడులు ఉంటాయని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శను) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూసేది. అతని ప్రకారం మెడలో వాపు రావడానికి కారణం స్పర్శను (జ్ఞానాన్ని) తెలియజేసే నాడులు నాశనం చెందడం.
ప్రశ్న 18.
నాడీకణం, సైనాప్స్ మధ్యగల సంబంధం వివరించండి.
జవాబు:
నాడీకణం, సైనాప్స్ మధ్య సంబంధం :
రెండు నాడీకణాల మధ్య విధిని నిర్వహించే ప్రాంతమే సైనాప్స్. ఇక్కడ ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారం బదలాయింపు జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి జీవ పదా సంబంధం లేక చిన్న ఖాళీ ప్రదేశం లేకపోయినప్పటికీ సమాచారం రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది.
మెదడుపైన గాని, వెన్నుపాముపైన గాని మరియు వెన్నుపాము చుట్టూ సైనాప్లు ఉంటాయి. వీటి తరువాత వెన్నుపాము (synopse) లు ప్రాంతం నుండి ఏక్సాన్లు సంకేతాలను మన శరీరంలోని ప్రత్యేక భాగాలకు తీసుకుని వెళ్తాయి.
ప్రశ్న 19.
Knee jerk అనగానేమి?
జవాబు:
- మోకాలు క్రింది భాగాన గట్టిగా కొట్టినప్పుడు, తొడ కండరాలలో కుదుపు ఏర్పడుతుంది. దీనిని “Knee jerk” అంటారు.
- దీనిని 1875లో గుర్తించారు.
- మొదటిలో దీనిని ప్రతిచర్యగా భావించినప్పటికీ, ఇందులో నాడీ మార్గం మాత్రమే ఉందని నిర్ధారించారు.
ప్రశ్న 20.
మెదడు ఎలా రక్షించబడుతుంది?
జవాబు:
- మానవ శరీర పరిమాణంతో పోల్చినపుడు మిగిలిన జంతువుల కంటే మానవ మెదడు చాలా పెద్దది. మెదడు ఎముకలతో తయారుచేయబడిన గట్టి పెట్టె వంటి నిర్మాణంలో భద్రపరచబడి ఉంటుంది. ఆ నిర్మాణాన్ని కపాలం (Cranium) అంటాం.
- మెదడును ఆవరించి మూడు త్వచాలు ఉంటాయి. వీటిని “మెనింజస్” అంటారు. ఈ త్వచాలు మెదడుతో పాటుగా వెన్నుపామును కూడా కప్పి ఉంచుతాయి.
- వెలుపలి మరియు మధ్యత్వచం మధ్య మస్తిష్కమేరు ద్రవం (cerebro spinal fluid) ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుండి (shocks) కాపాడి మెదడుకు రక్షణ ఇస్తాయి.
ప్రశ్న 21.
వెన్నుపాము సమాచారాన్ని మెదడు నుండి పంపే మార్గంగానే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని ఎలా చెప్పగలవు?
జవాబు:
- లియోనార్డో డావెన్సి, స్టీఫెన్ హెల్స్ తమ ప్రయోగంలో కప్ప మెదడును తొలగించినా అది బ్రతికి ఉండటం గమనించారు.
- అదే విధంగా చర్మాన్ని గిచ్చినప్పుడుగాని, గ్రుచ్చినప్పుడు గాని కప్పలో కండరాల చలనాన్ని గమనించారు.
- కప్ప వెన్నుపాములో సూదీని నిలువుగా గ్రుచ్చినప్పుడు, వెన్నుపాము నశించిన కప్ప చనిపోవటం జరిగింది.
- దీనిని బట్టి వెన్నుపాము సమాచారాన్ని మెదడుకు పంపే మార్గమే కాకుండా, నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
ప్రశ్న 22.
పరిధీయ నాడీవ్యవస్థ అనగానేమి?
జవాబు:
- కపాలనాడులు కశేరునాడులను కలిపి పరిధీయ నాడీవ్యవస్థ అంటారు.
- ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థకు అనుబంధంగా ఉండి నియంత్రణ, సమన్వయాన్ని నిర్వహిస్తుంది.
- దీనిలో కపాలనాడులు-12, కశేరునాడులు-31 మొత్తం 43 జతల నాడులు ఉంటాయి.
ప్రశ్న 23.
వెన్నుపాము ఉదర మూలం కండరాలను నియంత్రిస్తుందని ఎలా చెప్పగలను?
జవాబు:
- స్కాట్లాండుకు చెందిన చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్కు చెందిన ఫ్రాంకోయిస్ మెంథోం డె అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వెన్నుపాముపై ప్రయోగాలు నిర్వహించి వెన్నుపాము రెండు మూలాలు వేరు వేరు విధులను నిర్వహిస్తాయని పేర్కొన్నారు.
- వీరి ప్రయోగంలో స్పష్టమూలం తొలగించినపుడు ఆ జంతువులో ఎటువంటి చెప్పుకోదగ్గ చర్యను చూపలేదు.
- ఉదర మూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైన చర్య కనబడింది.
- దీనినిబట్టి ఉదర మూలం కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని స్పష్టం చేశారు.
ప్రశ్న 24.
మస్తిష్క మేరు ద్రవం ఎక్కడ ఉంటుంది? దాని పని ఏమిటి?
జవాబు:
- మెదడుని, వెన్నుపాముని కప్పుతూ మూడు త్వచాలు ఉంటాయి. అందు బయటి, మధ్యత్వచాల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది.
- దాని పనులు – 1) మెదడుకు, వెన్నుపాముకు హాని కలుగకుండా రక్షిస్తుంది. 2) మెదడు, వెన్నుపాములలోని కణాలకు పోషక పదార్థాలను అందిస్తుంది.
ప్రశ్న 25.
ఏక్సాను, డెండ్రైటుల మధ్యగల భేదములను వ్రాయుము.
జవాబు:
ఏక్సాను | డెండ్రైటు |
1) ప్రతి నాడీకణానికి ఒకటే ఏక్సాను ఉంటుంది. | 1) నాడీకణం నుండి ఏర్పడే డెండ్రైటుల సంఖ్య ఒకటి నుండి అనేక వేలు ఉంటుంది |
2) పొడవుగా ఉంటుంది. | 2) పొట్టిగా ఉంటుంది. |
3) శాఖలు ఉండవు. | 3) శాఖలు ఉంటాయి. |
4) కొన్ని ఏక్సానులు మయలిన్ తొడుగును కలిగి ఉంటాయి. | 4) వీనిలో మయలిన్ తొడుగు, రన్వీర్ కణుపులు ఉండవు. |
ప్రశ్న 26.
పునశ్చరణ యాంత్రికం (Feedback mechanism) అనగానేమి?
జవాబు:
శరీరంలో హార్మోన్ల చర్యను నియంత్రించే యంత్రాంగాన్ని పునశ్చరణ యంత్రాంగం అంటారు. హార్మోన్ చర్యల వలన పెరిగిన జీవక్రియ రేటులను సాధారణ స్థాయికి తీసుకురావటంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది.
ప్రశ్న 27.
అడ్రినలిన్ హార్మోను ఉద్వేగాలు కలుగజేసే లేదా పోరాట పలాయన హార్మోన్ అని ఎందుకు అంటారు?
జవాబు:
- అధివృక్క గ్రంథి దవ్వ ప్రాంతం నుండి ఎడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.
- రక్తంలో దీని స్థాయి, పెరిగినపుడు హృదయ స్పందన రేటు, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతాయి.
- అందువలన జీవికి కోపం, ఉద్రేకం, పోరాట లక్షణాలు పెరుగుతాయి.
- దీని స్థాయి తగ్గినప్పుడు జీవక్రియ రేటు తగ్గి జీవి పారిపోవటం చేస్తుంది.
- మానసిక ఉద్రేకాలను ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. కావున దీనిని మానసిక ఉద్వేగాలు కలుగజేసే హార్మోన్ అని అంటారు.
ప్రశ్న 28.
విత్తనాలలో సుప్తావస్థను గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
- విత్తనాలలో సుప్తావస్థకు అబ్ సైసిక్ ఆమ్లం అనే ఫైటో హార్మోన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- సుప్తావస్థలో జీవక్రియల రేటు కనిష్ట స్థాయికి పడిపోతాయి.
- ఇది ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి తోడ్పడుతుంది.
- అనుకూల పరిస్థితులు ఏర్పడినపుడు సుప్తావస్థ తొలగించబడుతుంది.
- జంతువులు కూడ సుప్తావస్థను ప్రదర్శించటం గమనించదగ్గ విషయం.
ప్రశ్న 29.
జ్ఞాననాడీకణం పటం గీయండి.
జవాబు:
జ్ఞాననాడీ
ప్రశ్న 30.
చాలకనాడీకణం పటం గీయండి.
జవాబు:
10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కింది సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
హార్మోనులు | ఉపయోగాలు |
1) ఆక్సీనులు | కణం పెరుగుదల, కాండం, వేరు విభేదనం చూపడం |
2) ఆబ్ సైసిక్ ఆమ్లం | పత్రరంధ్రాలు మూసుకోవడం, విత్తనాలలో సుప్తావస్థ |
3) ఇథిలీన్ | ఫలాలు పక్వానికి రావడం |
4) సైటోకైనిన్లు | కణ విభాజనను ప్రేరేపించడం, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చూడడం. |
i) మొక్కలలో ఉండే హార్మోనులను ఏమంటారు?
ii) మొక్కల పెరుగుదలకు తోడ్పడే హార్మోను ఏది?
iii) రైతులు వచ్చి మామిడికాయల మధ్యలో కార్బెడ్ ను ఉంచుతారు. దీనికి కారణం ఏమిటి ? నాలుగైదు రోజుల తర్వాత ఏమి గమనించవచ్చు?
iv) మొక్కలు కూడా జంతువుల మాదిరిగా ప్రతిస్పందిస్తాయి. నీవు దీనిని అంగీకరిస్తావా ? నీ సమాధానాన్ని సమర్ధించండి.
జవాబు:
i) మొక్కలలో ఉండే హార్మోన్లను ‘ఫైటోహార్మోన్లు’ అంటారు.
ii) మొక్కల పెరుగుదలకు ఆక్సిన్స్, సైటోకైనిన్స్ తోడ్పడతాయి.
iii) కార్బైడ్ నుండి విడుదలయ్యే ఇథిలీన్ కాయలను పండిస్తుంది. అందువలన పచ్చి మామిడికాయలు నాలుగు రోజుల తరువాత పండినట్టు కనిపిస్తాయి.
iv) అవును. మొక్కలు వేసవికి పత్రాలను రాల్చుతాయి. వర్షానికి ఆకులు వేస్తాయి. వసంత ఋతువులో పుష్పిస్తాయి. అత్తిపత్తి వంటి మొక్కలు తాకగానే ముడుచుకుపోతాయి.
ప్రశ్న 2.
పై పట్టికను పరిశీలించి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వంది.
1. వినాళ గ్రంథులు మరియు హార్మోన్ల యొక్క ప్రాముఖ్యతను వ్రాయండి.
జవాబు:
- 1905 వ సం||లో స్టార్లింగ్ అనే ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త రక్తంలో స్రవించే సంఘటనలను నియంత్రించే పదార్థాలకు “హార్మోనులు” అని పేరుపెట్టాడు. హార్మోన్లను స్రవించే గ్రంథులను “వినాళ గ్రంథులు” (Endocrine glands) అని అంటారు.
- వీటి స్రావాలను తీసికొని వెళ్ళడానికి ఎటువంటి నాళాలుగాని, గొట్టాలుగాని ఉండవు. అవి నేరుగా రక్తంలో కలసిపోతాయి. అందువల్ల వాటిని వినాళగ్రంథులు అంటారు.
- శరీరంలోని వివిధ చర్యలు హార్మోనుల ద్వారా నియంత్రించబడి నాడీ వ్యవస్థతో సమన్వయపరుస్తుంది.
- ఎముకల పెరుగుదల, సాధారణ పెరుగుదల, ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి వివిధ జీవన క్రియలలో హార్మోనులు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
2. ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ ఏది?
జవాబు:
సొమాటోట్రోపిన్ ఎముకల పెరుగుదలకు ప్రాముఖ్యత వహిస్తుంది. పీయూష గ్రంథి, సొమాటోట్రోపిన్ హార్మోను స్రవిస్తుంది. ఇది మెదడు అడుగుభాగంలో ఉంటుంది.
3. ఒకవేళ టెస్టోస్టిరాను స్రవించకుంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
టెస్టోస్టిరాన్ హార్మోనును ముష్కాలు స్రవిస్తాయి. ఇది గానీ స్రవించకుంటే పురుషులలో ముఖంపై పెరిగే వెంట్రుకలు, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పులు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి జరగదు.
4. థైరాక్సిన్ స్రవించే వినాళ గ్రంథి మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
థైరాక్సిన్ స్రవించే వినాళ గ్రంధి మెడభాగంలో వాయునాళం దగ్గరలో ఉంటుంది.
5. స్త్రీలలో, పురుషులలో ఇద్దరిలోనూ ఉండే వినాళ గ్రంథులు ఏవి?
జవాబు:
పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి ఈ రెండు వినాళ గ్రంథులు స్త్రీలలో, పురుషులలో ఉండే గ్రంధులు.
ప్రశ్న 3.
మానవ మెదడులోని వివిధ భాగాలను తెలిపి అవి నిర్వర్తించే విధులను పట్టిక రూపంలో రాయండి.
(లేదా)
మెదడులోని ముఖ్యమైన భాగాల పేర్లను తెల్పి, ముందు మెదడు విధులను తెల్పండి.
జవాబు:
మానవ మెదడులోని భాగాలు :
- 1ముందు మెదడు : మస్తిష్కం, ద్వారగోర్థం
- మధ్య మెదడు : దృక్ గోళాలు
- వెనుక మెదడు : అనుమస్తిష్కం, మజ్జిముఖం.
ముందు మెదడు విధులు :
1. మస్తిష్కం :
- మానసిక సామర్థ్యాలకు స్థావరం, ఆలోచనలను, జ్ఞాపకాలను కారణాలు వెతికే శక్తి, ఊహాశక్తి, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది.
- అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం.
2. ద్వారర్థం :
- కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట.
- నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు.
మధ్య మెదడు విధులు :
i) మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్ కు పంపుతాయి.
ii) దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతాయి.
వెనుక మెదడు విధులు :
1) అనుమస్తిష్కం (Cerebellum) :
i) శరీర సమతాస్థితిని; భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది.
ii) మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది.
2) మజాముఖం (Medulla oblongata) :
1) శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించే కేంద్రం.
(వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారుతుంటుంది.)
ii) మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నియంత్రిస్తుంది.
ప్రశ్న 4.
మొక్కలలో కనిపించే వివిధ రకాల అనువర్తనాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
మొక్కలు కింది అనువర్తనాలు ప్రదర్శిస్తాయి.
1) కాంతి అనువర్తనం :
కాంతికి అనుకూలంగా మొక్కలు ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
ఉదా : కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కలలో తీగలు కాండం కాంతి సోకుతున్న వైపుకు పెరుగుతుంది.
2) గురుత్వానువర్తనం :
మొక్కలలో వేర్లు భూమివైపు అంటే గురుత్వాకర్షణ బలం వైపుకు ప్రతిస్పందిస్తాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.
3) నీటి అనువర్తనం :
రాళ్ళను గాని, గోడలను గాని అంటిపెట్టుకుని పెరిగే మొక్కలలో వేర్లు రాయి లేదా గోడవైపు నుండి దూరంగా నేలలో నీరు ఉన్నవైపు పెరుగుతాయి. ఇటువంటి ప్రతిస్పందనను నీటి అనువర్తనం అంటారు.
4) స్పరానువర్తనం :
స్పర్శ లేదా తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను స్పర్శానువర్తనం అంటారు.
ఉదా : దోసకాయ, కాకరకాయ వంటి తీగలలో కాండం బలహీనంగా ఉండి సన్నగా ఉండడం చేత పైకి ఎగబ్రాకదు.. నులి తీగలు మొక్కలు నిలువుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
5) రసాయనికానువర్తనం :
పక్వం చెందిన కీలాగ్రం తియ్యని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగ రేణువులకు ఉద్దీపన కలుగజేస్తుంది. ఉద్దీపనలకు పరాగ రేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగ నాళం పరాగ రేణువు నుంచి బయలుదేరి ఫలదీకరణం కొరకు అండాన్ని చేరుతుంది. ఇటువంటి రసాయనిక పదార్థాల ప్రతిస్పందనలను రసాయనికానువర్తనం అంటారు.
ప్రశ్న 5.
i) ప్రక్క చిత్రం మన శరీరంలోని ఏ వ్యవస్థకు చెందినది?
జవాబు:
మానవ నాడీ వ్యవస్థ
ii) A మరియు B భాగముల పేర్లను వ్రాయుము.
జవాబు:
A) అనుమస్తిష్కం
B) మజ్జిముఖం
iii) భాగము ‘C’ ను అతి ప్రధాన వినాళ గ్రంథిగా పిలుస్తారు. దీని పేరేమి?
జవాబు:
పీయూష గ్రంథి లేక పిట్యూటరీ గ్లాండ్
iv) ప్రక్క చిత్రంలోని ఏ భాగం సమస్యలను పరిష్కరించడానికి, పజిల్స్ పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది?
జవాబు:
మస్తిష్కము (సెరిబ్రమ్)
ప్రశ్న 6.
మానవుని యొక్క రెండవ మెదడుగా ఏ వ్యవస్థను అంటారు? ఎందుకో వివరించండి.
జవాబు:
- జీర్ణనాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తాం.
- జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన వలయాన్ని కల్గి ఉంటుంది.
- జీర్ణనాళంలోని నాడీ కణజాలాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపటం లేదా అప్పుడప్పుడు అకలి సంకేతాలు పంపటం వరకే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారం పంపే న్యూరోట్రాన్స్మిటర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
- జీర్ల మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది.
- మానసిక స్థాయిని నిర్ణయించడంతో పాటు శరీరంలోని కొన్ని వ్యాధులను నిర్ణయించటంలో కీలకపాత్ర వహిస్తుంది.
- బాహ్య ప్రపంచం నుండి మనం తీసుకునే ఆహారం వలన కలిగే వైవిధ్యమైన భౌతిక రసాయన ఉద్దీపనలు ఆహారనాళాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి.
- కండర నిర్మాణాలు, నాడీ నిర్మాణాలు సమన్వయం చేస్తూ జరిగే అనేక కదలికలకు నిలయంగా ఉంటుంది.
- ఆహారవాహిక నుండి పాయువు వరకు దాదాపు 9 మీటర్ల పొడవు కల్గి జీర్ణనాడీ వ్యవసగా పిలువబడే రెండవ మెదడులోని అనేక నాడులు, పొరల రూపంలో జీర్ణాశయపు గోడలలో ఇమిడి ఉంటాయి.
- ఆహారాన్ని చిన్న చిన్న రేణువులుగా విచ్చిన్నం చేయడం, పోషకాలను గ్రహించటం, వ్యర్థాలను విసర్జించటం లాంటి జీవక్రియలను ఉత్తేజపర్చటం, సమన్వయం చేయడం కొరకు యాంత్రిక మిశ్రమీకరణ విధానాలు లయబద్ధంగా కండర సంకోచాలు జరపటంలో సహాయపడుతుంది.
- స్వీయ ప్రతిస్పందనలను, జ్ఞానేంద్రియ శక్తి కలిగి ఉండటం వలన జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నియంత్రిస్తుంది.
ప్రశ్న 7.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
అవయవం | పట్టిక -1 నాడీ వ్యవస్థ ప్రభావం |
పట్టిక – 2 నాడీ వ్యవస్థ ప్రభావం |
1. కన్ను | కనుపాప పెద్దదగుట | కనుపాప యథాస్థితికి రావడం |
2. నోరు | లాలాజలం స్రవించడం ఆపడం | లాలాజలం స్రవించడాన్ని ఉత్తేజపరచడం |
3. ఊపిరితిత్తులు | శ్వాసనాళం పెద్దది కావడం | శ్వాసనాళం యథాస్థితికి రావడం |
4. గుండె | హృదయ స్పందన వేగాన్ని పెంచడం | హృదయ స్పందన వేగాన్ని తగ్గించడం |
5. రక్తనాళాలు | రక్తపీడనాన్ని పెంచడం | రక్తపీడనాన్ని తగ్గించడం |
6. క్లోమం | క్రియావేగాన్ని తగ్గించడం | క్రియావేగాన్ని పెంచడం |
i) సహానుభూత నాడీవ్యవస్థ నిర్వహించే రెండు విధులను రాయండి.
జవాబు:
కనుపాప పెద్దదగుట, లాలాజలం స్రవించడం ఆపడం మొదలగునవి.
ii) సహానుభూత పరనాడీ వ్యవస్థ ప్రభావం చూపే రెండు అవయవాల పేర్లు రాయండి.
జవాబు:
కన్ను, గుండె మొదలగునవి.
iii) పై పట్టిక ప్రకారం రక్త పీడనం పెంచడంపై ప్రభావం చూపే నాడీ వ్యవస్థను తెలపంది.
జవాబు:
సహానుభూత నాడీ వ్యవస్థ
iv) ఏయే నాడీ వ్యవస్థలు కలసి స్వయం చోదిత నాడీ వ్యవస్థను ఏర్పరుచును?
ఎ. సహానుభూత, సహానుభూత పర నాడీవ్యవస్థ
ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించండి. ఈ పటం ఏ ప్రక్రియను తెలియచేస్తుంది ? ఈ ప్రక్రియను ఒక ఫ్లో చార్టు రూపంలో వివరించండి.
జవాబు:
ఫ్లో చార్టు :
ప్రశ్న 9.
క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాములు వ్రాయుము.
విభాగం – I | విభాగం – II |
ఆక్సిక్స్ | అడ్రినలిన్ |
జిబ్బరెల్లిన్స్ | టెస్టోస్టీరాన్ |
ఇథిలీన్ | ఈస్ట్రోజెన్ |
అబ్సెసిక్ ఆమ్లం | థైరాక్సిన్ |
సైటోకైనిన్లు | పెరుగుదల హార్మోన్ |
a) దేని ఆధారంగా పై వర్గీకరణ జరిగినది?
జవాబు:
మొక్కలు మరియు జంతువులనందు ఉత్పత్తి అగు హార్మోన్స్ ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది.
b) అడ్రినలిన్ ఎ గ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
అడ్రినల్ గ్రంథి నుండి అడ్రినలిన్ ఉత్పత్తి అవుతుంది.
c) ఏ హార్మోన్ చర్య వలన పత్రరంధ్రాలు మూసుకుంటాయి?
జవాబు:
అబ్సెసిక్ ఆమ్లం చర్య వలన పత్రరంధ్రాలు మూసుకుంటాయి.
d) ఆక్సిన్స్ యొక్క విధులేవి ?
జవాబు:
ఆక్సిన్స్ విధులు :
మొక్కలలో కణం పెరుగుదల మరియు కాండం, వేర్లు విభేదనం
ప్రశ్న 10.
కార్తీక్ మూత్రంలో అధికశాతం చక్కెర కలిగియుండడం, వరుణ్ ఎక్కువసార్లు తక్కువ గాధత గల మూత్రాన్ని విసర్జించడం జరుగుచున్నది. ఈ రెండు వ్యాధులకు కారణములను వివరించండి.
జవాబు:
- మూత్రంలో అధిక చక్కెర కల్గివున్న స్థితిని డయాబిటస్ మిల్లిటస్ (మధుమేహము) అందురు.
- ఎక్కువసార్లు తక్కువ గాఢత గల మూత్రాన్ని విసర్జించటమనే స్థితిని డయాబిటస్ ఇన్సిపిడస్ (అతిమూత్ర వ్యాధి) అందురు.
- శరీరంలో ఇన్సులిన్ స్రావము తగ్గినపుడు రక్తంలో అధిక చక్కెర స్థాయి కలిగిన డయాబిటస్ మిల్లిటస్ కలుగును.
- వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢతగల మూత్ర విసర్జన చేయవలసి వుంటుంది. దీనినే డయాబిటస్ ఇన్సిపిడస్ (లేదా) అతిమూత్రవ్యాధి అందురు.
ప్రశ్న 11.
మొక్కలలో పెరుగుదలను నియంత్రించే ఫైటో హార్మోన్ల గురించి వివరించండి.
జవాబు:
1. ఆక్సిన్లు :
కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనం
2. జిబ్బరెల్లిన్లు :
విత్తనాల అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవవటం, పుష్పించడానికి ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం.
3. సైటోకైనిన్లు :
కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వకోరకాలు పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చేయడం, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం.
4. అబ్ సైసిక్ ఆమ్లం :
పత్ర రంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ.
5. ఈథలీన్ : ఫలాలు పక్వానికి రావడం.
ప్రశ్న 12.
నాడీకణం నిర్మాణం తెలపండి.
జవాబు:
నాడీకణంలో ‘3’ ముఖ్య భాగాలు కలవు.
- కణ దేహం
- డెండ్రైటులు
- ఆక్సాన్
1) కణదేహం :
కణదేహాన్ని సైటాన్ అని కూడా అంటారు. దీనిలో పెద్ద కేంద్రకం కలదు. దీని జీవ పదార్థంలో పెద్ద పెద్ద రేణువులుండును. వీనిని “నిస్సల్ కణికలు” అంటారు. అవి R.N.A. మరియు ప్రోటీన్లతో ఏర్పడును. నాడీకణంలో జరిగే సంశ్లేషణ చర్యలన్నీ కణదేహంలో జరుగును.
2) బెండైటులు :
కణదేహం నుండి చెట్టు ఆకారంలో, అమరి వుండే నిర్మాణాలనే “డెండైటులు” అంటారు. వీటి సంఖ్య ఒకటి నుండి అనేక వేల వరకు ఉంటుంది. ఇవి ఇతర నాడీకణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందజేస్తాయి.
3) ఆక్సాస్ :
ఇది నాడీ కణదేహం నుండి ఏర్పడుతుంది. ప్రతి నాడీకణానికి ఒకే ఒక ఆక్సాన్ ఉండును. ఇది చాలా పొడవుగా ఉండును. ఈ నాడీ పోగులు డెండ్రైటులతో, నాడీకణాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. ప్రచోదనాలు వీని ద్వారా వేగంగా ప్రయాణిస్తాయి.
ప్రశ్న 13.
క్రియను అనుసరించి నాడులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
క్రియను అనుసరించి నాడులు మూడు రకాలు. అవి :
1) అభివాహి నాడులు (Afferent nerves) :
ఈ నాడులు కేంద్రీయ నాడీ వ్యవస్థ (మెదడు + వెన్నుపాము) వైపు సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. ఇవి సమాచారాన్ని పరిసరాలలో మార్పును కండరాలపై నున్న నాడీ అంత్యాల ద్వారా (వీటికి stimulus detections ఉద్దీపనల నిర్ధారణ) ద్వారా మెదడు తీసుకొని వెళ్తాయి. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు.
2) అపచాలక నాడులు :
ఈ నాడులు కేంద్రీయ వ్యవస్థ (మెదడు) నుండి సమాచారాన్ని శరీరంలో నాడీ అంత్యాలు ఉండే వివిధ భాగాలకు తీసుకొని వెళ్తాయి. వీటినే చాలకనాడులు అంటారు.
3) సహ సంబంధనాడులు :
ఈ అపవాహక, అభివాహక నాడులు రెండింటిని కలుపుతాయి.
ప్రశ్న 14.
ప్రతిక్రియ ప్రతిచర్యాచాపం అనగానేమి? దానిలో పాల్గొనే భాగాలు తెలపండి.
జవాబు:
ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం :
ప్రతీకార చర్యలను చూపించే నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ను “ప్రతిక్రియ, ప్రతిచర్యాచాపం” అంటారు.
ప్రతీకార చర్యాచాపములో భాగము | నిర్వర్తించు పని |
1) గ్రాహకము | 1) వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది. |
2) జ్ఞాన (అభివాహి) నాడీకణం | 2) గ్రాహకము నుండి వార్తలను వెన్నుపాములోనికి మధ్యస్థ నాడీకణాలకు చేరవేస్తుంది. |
3) మధ్యస్థ నాడీకణము | 3) వార్తలను విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది. |
4) చాలక నాడీకణము | 4) వెన్నుపాము నుండి వార్తలను నిర్వాహక అంగానికి చేరవేస్తుంది. |
5) నిర్వాహక అంగము | 5) అపవాహి నాడి నుండి వార్తలను గ్రహించి, ప్రతిచర్యలను చూపిస్తుంది. |
ప్రశ్న 15.
వెన్నుపాము నిర్మాణం తెలపండి.
జవాబు:
- వెన్నుపాము పొడవుగా స్థూపాకారంలో ఉంటుంది.
- ఇది మొండెము పృష్టతలం (వీపు) పొడవునా, వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది.
- వెన్నెముకలో వుండే వెన్నుపూసలు దీనికి హాని కలుగకుండా రక్షణనిస్తాయి.
- వెన్నుపాము మధ్యలో శృంగాలతో కూడిన బూడిద రంగు పదార్థం ఉంటుంది.
- ఈ శృంగాలలో పైన వుండే వాటిని పృష్ట శృంగాలు అనీ, దిగువగా వుండే వాటిని ఉదర శృంగాలు అనీ అంటారు.
- బూడిదరంగు పదార్థంలో ఉండే కుల్యని నాడీకుల్య అంటారు.
- ఇది వెన్నుపాము పొడవునా ఉంటుంది.
- ఈ నాడీకుల్య మస్తిష్కమేరు ద్రవంతో నిండి ఉంటుంది.
ప్రశ్న 16.
స్వయంచోదిత నాడీవ్యవస్థ అనగానేమి? ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు శరీర అంతర్భాగాలు. రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అటువంటి పరిధీయ నాడీవ్యవస్థను స్వయంచోదిత నాడీవ్యవస్థ (Automatic Nervous System) అని అంటారు. అంతేకాకుండా చర్మంలోని కొన్ని కండర ప్రాంతాలలో మరియు అస్థి కండరాలలో నియంత్రిత విధిని కలిగి ఉంటుంది.
స్వయంచోదిత నాడీవ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగే అనియంత్రిత విధి యొక్క ఉదాహరణను చూస్తే మన కంటిపాప చిన్నదిగా పెద్దదిగా మారడం అని చెప్పవచ్చు.
మనం ఎప్పుడైతే చీకటి గదిలో ప్రవేశిస్తామో వెళ్ళిన వెంటనే మనకు ఏమీ కనబడదు. మెల్ల మెల్లగా గదిలోని వస్తువులు చూస్తుంటాం. ఎందుకంటే అప్పుడు మన కంటిపాప యొక్క వ్యాసం పెరగడం వలన ఎక్కువ కాంతి లోపలికి వస్తుంది. చీకటి గది నుండి బయటకు అధిక వెలుతురులోకి వచ్చినప్పుడు కంటిపాప వ్యాసం తగ్గిపోయి తక్కువ కాంతి పడేటట్లు చేస్తుంది. ఈ రెండు ప్రక్రియలను స్వయంచోదిత నాడీవ్యవస్థ ప్రభావితం చేస్తుంది.
ప్రశ్న 17.
ఏదైనా వేడి వస్తువు మీ చేతికి తాకినప్పుడు వెంటనే మీకు తెలియకుండా చేతిని వెనుకకు ఎలా తీసివేయగలుగుతారో తెలియజెప్పండి.
జవాబు:
- ఏదైనా వస్తువును తాకినప్పుడు మనకు తెలియకుండా చేతిని వెనుకకు తీసివేస్తాము.
- ఇది నిబంధన రహిత ప్రతీకార చర్య.
- ఇది మనకు పుట్టుకతోనే, వారసత్వంగా సంక్రమిస్తుంది.
- చేయి అనే గ్రాహకం వేడి అనే ప్రేరణ సమాచారాన్ని గ్రహించి, విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది.
- జ్ఞాననాడి ఈ తరంగాలను వెన్నుపాములోని మధ్యస్థ నాడీ కణాలకు చేరవేస్తుంది.
- ఈ మధ్యస్థ నాడీ కణాలు ఈ సమాచారాన్ని విశ్లేషించి, ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి.
- మధ్యస్థ నాడీకణాల నుండి చాలకనాడులు ఈ సమాచారాన్ని నిర్వాహక అంగమైన కండరాలకు చేరవేస్తాయి.
- అందువల్ల కండరాలు సంకోచించి చేయి వెనుకకు తీసుకోబడుతుంది.
ప్రశ్న 18.
మానవ శరీరంలోని వినాళ గ్రంథులు తెలిపి అవి ఉత్పత్తి చేసే హార్మోన్స్ వాటి ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
ప్రశ్న 19.
‘జంతురాజ్యంలో మానవ మెదడు అతిక్లిష్టమైన అంగము’ – వ్యాఖ్యానించండి.
జవాబు:
- జంతు రాజ్యంలో మానవుని మెదడును అతిక్లిష్టమయిన నిర్మాణంగా పరిగణిస్తారు.
- దీనిలో పది బిలియన్లకు పైగా నాడీకణాలు, అంతకు 10 నుండి 50 రెట్లు గ్లియల్ కణాలు ఉన్నాయి.
- ఒక్క మస్తిష్క వల్కలంలోనే సుమారు 2.6 బిలియనుల నాడీకణాలు ఉన్నాయి.
- ఒక్కొక్క నాడీకణము ఇతర నాడీకణాల నుండి సుమారు 100 నుండి 10,000 వార్తలను గ్రహించి, విద్యుత్ ప్రకంపనాలను సెకనుకి 0.6 నుండి 120 మీటర్ల వేగంతో తీసుకొనిపోతుంది.
- మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు రెండు శాతం మాత్రమే.
- కాని ఇది మానవుడు తీసుకునే మొత్తం ఆక్సిజన్లో 20 శాతం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.
- ఇతర కణాలలా కాక, శక్తి కోసం మెదడు పూర్తిగా గ్లూకోజ్ మీదే ఆధారపడుతుంది.
- మెదడు శక్తి కోసం ఫాటీ ఆమ్లాలను ఉపయోగించుకోలేదు.
ప్రశ్న 20.
నాడులు వివిధ మార్గాలను సూచించే దిమ్మె చిత్రం గీయండి. సహసంబంధ నాడులు అనగానేమి?
జవాబు:
అభివాహి, అపవాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. ఇవి అసంకల్పిత ప్రతీకార చర్యలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ప్రశ్న 21.
ఉద్దీపనలకు మొక్కల్లో, జంతువుల్లో ప్రతిస్పందించే తీరులో గల పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:
- మొక్కలు మరియు జంతువులు తమ చుట్టూ ఉండే ప్రేరణలకు ప్రతిక్రియలను చూపుతాయి. కాని అవి ప్రతిస్పందించే పద్దతి వేరువేరుగా ఉంటుంది.
- పెద్ద జంతువులు నాడీవ్యవస్థ మరియు అంతస్రావ వ్యవస్థల ద్వారా ప్రేరణలకు ప్రతిస్పందనలు చూపిస్తాయి.
- మొక్కలకు జంతువుల మాదిరిగా నాడీ మరియు అంతస్రావ వ్యవస్థలు ఉండవు. కాని అవి కొన్ని రసాయనిక పదార్దములు లేదా హార్మోనుల సహాయంతో నియంత్రణ చర్యలను చూపిస్తాయి.
- మొక్కలు కాంతి, ఉష్ణము, నీరు, స్పర్శ, ఒత్తిడి, రసాయన పదార్ధములు, గురుత్వాకర్షణ మొదలైన ప్రేరణలను గుర్తించగలవు.
- మొక్కలలో ఉండే హార్మోనులను ఫైటోహార్మోనులు అంటారు. ఇవి ప్రేరణలకు స్పందించి ప్రతిస్పందనలను నియంత్రించగలవు. ఫైటోహార్మోనులు మొక్కలకు సంబంధించి ఒకటి లేదా ఇతర పెరుగుదలకు సంబంధించిన అంశములను సమన్వయము మరియు నియంత్రణను చేస్తాయి.
ప్రశ్న 22.
ప్రతీకార చర్యాచాపం చూపే పటం గీయండి. ఈ ప్రక్రియలో కీలకపాత్ర వహించే నాడులు ఏమిటి?
జవాబు:
ప్రతీకార చర్యలో సహసంబంధ నాడులు లేదా మధ్యస్థ నాడీకణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి ప్రచోదన ప్రయాణ మార్గాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
ప్రశ్న 23.
పరిధీయ నాడీ వ్యవస్థను చూపే పటం గీయండి.
(లేదా)
వెన్నుపాము అంతర నిర్మాణం చూపే పటం గీయండి. దీనిలో ఏ ఏ రంగు ప్రాంతాలు గమనించవచ్చు?
జవాబు:
వెన్నుపాము అడ్డుకోతలో వెలుపలివైపు తెలుపురంగు పదార్థం లోపలి వైపు బూడిద రంగు పదార్థం సీతాకోక చిలుక , రెక్కల వలె అమరి ఉంటుంది.
ప్రశ్న 24.
క్రింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.
ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమపద్ధతి ఉన్నది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. మొదటి దశ ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడంతో మొదలవుతాయి. అందిన సమాచారాన్ని ప్రసారం చేయడం రెండవ దశ, సమాచారాన్ని విశ్లేషించడం మూడవదశ. ప్రచోదనానికి సరైన ప్రతిక్రియ చూపడం చివరి దశ.
అ) ఈ సమాచారం దేనిని తెలియచేస్తుంది?
ఆ) పై సమాచారాన్ని ఫ్లో చార్టు రూపంలోకి మార్చండి.
ఇ) ఈ చర్యను నిర్వహించే యంత్రాంగం గురించి రాయండి.
జవాబు:
అ) పై సమాచారం ప్రేరణకు ప్రతిస్పందన చూపడంలో ఉన్న క్రమపద్ధతిని సూచిస్తుంది.
ఆ)
ఇ) శరీరం బయట లేదా లోపల జరిగే మార్పులను నాడీ వ్యవస్థ గ్రాహక కణముల ద్వారా గ్రహిస్తుంది. విద్యుత్ ప్రచోదనల రూపంలోనికి మార్చబడిన సమాచారము విశ్లేషించబడి ప్రతిస్పందనలు వెలువడతాయి. ఈ ప్రతిస్పందనలు విద్యుత్ ప్రచోదనాల రూపంలో నిర్వాహక అంగాలైన కండర కణాలు మరియు గ్రంథి కణాలకు చేర్చబడతాయి. అవి సరియైన ప్రతిస్పందనలు చూపిస్తాయి మరియు భవిష్యత్తు అవసరాల కోసం సమాచారం నిల్వ చేయబడుతుంది.
10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ ½ Mark Important Questions and Answers
ఫ్లో చార్టులు
1.
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థ
2.
జవాబు:
మజ్జిముఖం
3.
జవాబు:
పయామేటర్
4.
జవాబు:
అబ్ సైసిక్ ఆమ్లం
5.
జవాబు:
చాలక నాడులు
6.
జవాబు:
సహసంబంధ నాడులు
7.
జవాబు:
డెండ్రైట్లు
8.
జవాబు:
అపవాహి నాడి
9.
జవాబు:
నీటి అనువర్తనం
10.
జవాబు:
హార్మోన్లు
సరైన గ్రూపును గుర్తించండి
11. ఏ గ్రూపు మొక్క హార్మోన్లు కావు?
A. ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్
B. ఈస్ట్రోజన్, టెస్టోస్టీరాన్, అడ్రినలిన్
జవాబు:
గ్రూపు B
12. ఏ సమూహం నాడీ ప్రచోదనం యొక్క కచ్చితమైన క్రమంలో ఉంది?
A. బెంజైట్లు – కణదేహం – అక్షము – నాడీ అంత్యాలు – నాడీ కణసంధి
B. కణదేహం – అక్షము – నాడీ అంత్యాలు – రెండ్రైట్లు – నాడీ కణసంధి
జవాబు:
గ్రూపు A
13. నాడీ కణాల్లో ఉండే భాగాలు ఏవి?
A. మస్తిష్కం, గ్లియల్ కణాలు, వెన్నుపాము
B. డెండ్రైట్స్, కణదేహం, అక్షము
జవాబు:
గ్రూపు B
14. ఏ గ్రూపు గ్రంథులు హార్మోనులను స్రవిస్తాయి?
A. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి
B. కాలేయం, క్లోమం, ప్లీహం
జవాబు:
గ్రూపు A
15. ఏ హార్మోన్లు బీజకోశాలతో ముడిపడి ఉంటాయి?
A. థైరాక్సిన్, గొనాడోట్రోఫిన్, ఆక్సిటోసిన్
B. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్
జవాబు:
గ్రూపు B
16. ఏ గ్రూపుకి చెందిన గ్రంథులు జతగా ఉంటాయి?
A. ముష్కాలు, అండాశయాలు, అధివృక్క గ్రంధి
B. థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, క్లోమం
జవాబు:
గ్రూపు A
17. క్రింది వాటిలో అసంకల్పిత చర్యల గ్రూపు ఏది?
A. శ్వాసించడం, జీర్ణక్రియ, హృదయ స్పందన
B. మలవిసర్జన, మూత్రవిసర్జన, మింగడం
జవాబు:
గ్రూపు A
18. దిగువ పేర్కొన్న ఏ అనుభూతులు ద్వారగోరక్రంనకు సంబంధించినవి?
A. చలి, వేడి, బాధ, ఒత్తిడి
B. నిద్ర, ఆకలి, దాహం , కోపం
జవాబు:
గ్రూపు B
19. ప్రతీకార చర్యాచాపం యొక్క ఏ భాగాలు సరైన క్రమంలో ఉన్నాయి?
A. గ్రాహకం – జ్ఞాననాడి – మధ్యస్థ నాడీకణం – చాలకనాడి – నిర్వాహక అంగము
B. గ్రాహకం – మధ్యస్థ నాడీకణం – జ్ఞాననాడి – చాలకనాడి – నిర్వాహక అంగము
జవాబు:
గ్రూపు A
20. ఏ గ్రూపు హార్మోన్లు ప్రధాన గ్రంథి నుంచి స్రవించబడతాయి?
A. ఇన్సులిన్, గ్లూకాగాన్, థైరాక్సిన్
B. సోమాటో ట్రోఫిన్, థైరోట్రోఫిన్, ల్యూటినైజింగ్ హార్మోన్
జవాబు:
గ్రూపు B
శాస్త్రవేత్తను గుర్తించండి
21. ఆయన గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త. శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గమనించారు. వానిలో సంబంధమైనది అని తెలియజేశారు.
జవాబు:
గాలన్
22. కొన్ని జంతువులలో మెదడును తొలగించినప్పటికీ ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపించడాన్ని వీరు ఇరువురు గుర్తించారు.
జవాబు:
లియోనార్డో డావిన్సీ & స్టీఫెన్ హేల్స్
23. వెన్నెముకకు సంబంధించి రెండు మూలాలు ఉంటాయని ఒకటి పృష్ఠమూలం మరొకటి ఉదరమూలం మరియు అవి వేర్వేరు విధులను నిర్వహిస్తాయి అని నిరూపించారు.
జవాబు:
చార్లెస్ బెల్ & ఫ్రాంకోయిస్ మెంజెండై
24. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన వ్యాధి నిర్ధారణ శాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరించారు మరియు క్లోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేశారు.
జవాబు:
పాల్ లాంగర్ హాన్స్
25. వారు కుళ్ళిపోయిన జంతువుల క్లోమం నుండి ఇన్సులినను వేరుచేశారు. వారి కృషి ఫలితంగా నేడు ఇన్సులినను ఎక్కువ మంది డయాబెటిస్ రోగుల చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.
జవాబు:
టొరంటో, బాంటింగ్, బెస్ట్ & మెక్ లాడ్
26. ఆయన ఆంగ్ల శరీరధర్మ శాస్త్రవేత్త. వినాళగ్రంథుల నుండి స్రవించే పదార్థాలకు హార్మోన్ అని పేరు పెట్టారు.
జవాబు:
స్టార్టింగ్
27. వీరు కాంతి అనువర్తనం మీద అనేక ప్రయోగాలు చేశారు. అంకురం పైన పార్శ్వ కాంతి సోకేలా చేసినప్పుడు ఏదో ప్రభావం పై నుండి క్రిందకి ప్రసరించడం వలన మొక్కలో వంపుకి కారణమవుతుందని వారు నిర్ధారించారు.
జవాబు:
చార్లెస్ డార్విన్ & ఫ్రాన్సిస్ డార్విన్
28. ఆయన డచ్ వృక్ష శరీరధర్మ శాస్త్రవేత్త. ఓటు ధాన్యం అంకురం యొక్క ప్రాంకుర కవచం మీద ప్రయోగాలు నిర్వహించి ఒక రసాయనాన్ని వేరుచేసి దానికి ఆక్సిస్ అని పేరు పెట్టాడు.
జవాబు:
FW, వెంట్
ఉదాహరణ ఇవ్వండి
29. కాలేయం నాళసహిత గ్రంథికి ఒక ఉదాహరణ. ప్రధాన గ్రంథిగా వ్యవహరించే వినాళగ్రంధికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పిట్యూటరీ గ్రంథి ఒకటి జ్ఞాన సంబంధమైనది మరొకటి చర్యకు
30. ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి సహాయపదే హార్మోను మరొక ఉదాహరణ ఇవ్వంది.
జవాబు:
గ్లూకగాన్
31. వాసోప్రెస్సి లోపించడం వలన దయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
డయాబెటిస్ మెల్లిటస్
32. ముష్కల ప్రత్యుత్పత్తి అవయవంగా మరియు వినాళగ్రంథి వలె పనిచేస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఇవ్వంది.
జవాబు:
అండకోశాలు
33. పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కారణం. అదేవిధంగా స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు పాత్ర వహించే హార్మోన్ కు ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్రోజన్
34. మనుషులలో ప్రతీకార చర్యకు మోకాలి కుదుపు ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
దగ్గడం / తుమ్మడం / కాంతి కళ్ళ మీద పడినప్పుడు కళ్ళు మూయడం.
35. ‘మైమోసా ప్యూడికాను స్పర్శానువర్తనానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
వీనస్ ఫై ట్రాప్ / డయోనియా (కీటకాహార మొక్కలు)
36. కాంతి అనువర్తనానికి, కాండం ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పత్రాలు
37. సైటోకైనిన్ అనే ఫైటోహార్మోన్, పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో సహాయపడుతుంది. పత్రరంధ్రాలు మూసుకోవడంలో సహాయపడే ఫైటోహార్మోను మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అబ్ సైసిక్ ఆమ్లం
38. వరాగనాళం అందాలవైపు పెరగడం రసాయన అనువర్తనం. స్పర్శానువర్తనానికి మరొక ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
నులితీగలు
జతపరచుట
39. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
విప్పారిన కనుపాప – సహానుభూత నాడీవ్యవస్థ
సంకోచించిన కనుపాప -సహానుభూత పరనాడీ వ్యవస్థ
భూమి మీద శరీరం స్థితి మరియు సమతాస్థితి – మజ్జిముఖం
జవాబు:
భూమి మీద శరీరం స్థితి మరియు సమతాస్థితి – మజ్జిముఖం
40. సరిగా జతచేయబడిన దానిని గుర్తించండి.
కపాల నాడులు – 31 జతలు
పరిధీయ నాడులు – 43 జతలు
కశేరు నాడులు – 12 జతలు
జవాబు:
పరిధీయ నాడులు – 43 జతలు
41. తప్పుగా జత చేయబడిన దానిని గుర్తించండి.
కాంతి అనువర్తనం – స్పర్శ లేదా తాకడం
నీటి అనువర్తనం – నీరు
గురుత్వానువర్తనం – గురుత్వాకర్షణ శక్తి
జవాబు:
కాంతి అనువర్తనం – స్పర్శ లేదా తాకడం
42. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
అడ్రినలిన్ – జీవక్రియ కార్యకలాపాలు
సొమాటో ట్రోఫిన్ – ఎముకల పెరుగుదల
థైరాక్సిన్ – రక్తంలో చక్కెర పెరుగుదల
జవాబు:
సొమాటోట్రోఫిన్ – ఎముకల పెరుగుదల
43. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
వెన్నుపాము – ప్రతీకార చర్యలు
అనుమస్తిష్కం – కండరాల కదలికలు
మధ్యమెదడు – చూపు మరియు వినికిడి ప్రతి చర్యలు
జవాబు:
అనుమస్తిష్కం – కండరాల కదలికలు
44. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఇథిలీన్ – పండు పండటం
ఆక్సినులు – కాండం పాడవడం
జిబ్బరెల్లిన్స్ – కణవిభజన
జవాబు:
ఇథిలీన్ – పండు పండటం
45. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
పిట్యూటరీ గ్రంథి – మెదడు
థైరాయిడ్ గ్రంథి – మెడ
అడ్రినల్ గ్రంథి – తల
జవాబు:
అడ్రినల్ గ్రంథి – తల
46. సరిగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ముందు మెదడు – అనుమస్తిష్కం
మధ్య మెదడు – దృక్ లంబికలు
వెనుక మెదడు – మస్తిష్కం
జవాబు:
మధ్య మెదడు – దృక్ లంబికలు
47. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించంది.
నిస్సల్ కణికలు – కణదేహం
రన్వీర్ కణుపులు – డెంజైట్లు
ష్వాన్ కణాలు – మైలీన్ తొడుగు
జవాబు:
రవీర్ కణుపులు – డెండ్రైట్లు
48. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మెదడు – కపాలం
గైరి – మస్తిష్కంలోని గట్లు
సల్సి – మస్తిష్కంలోని గాడులు
జవాబు:
మెదడు – కపాలం
విస్తరించుము
49. CNS – Central Nervous System / కేంద్రీయ నాడీ వ్యవస్థ
50. PNS – Peripheral Nervous System / పరిధీయ నాడీవ్యవస్థ
51. ANS – Autonomous Nervous System / స్వయంచోదిత నాడీవ్యవస్థ
నేను ఎవరు?
52. రెండు నాడీకణాల మధ్య ఉన్న క్రియాత్మక ప్రాంతం నేను. ఒక నాడీకణం నుంచి మరొక నాడీకణానికి సమాచారం బదిలీ చేయడానికి తోడ్పడతాను.
జవాబు:
సైనాప్స్ / నాడీ కణసంధి
53. జ్ఞానేంద్రియాల నుంచి కేంద్రీయ నాడీవ్యవస్థ వైపుకు సందేశాలను తీసుకెళ్లే నాడిని నేను.
జవాబు:
జ్ఞాననాడులు / అభివాహినాడులు
54. నేను అసంకల్పిత చర్యల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాన్ని.
జవాబు:
ప్రతీకార చర్యాచాపం
55. ఆలోచనా, జ్ఞాపకశక్తి, తర్కం, గ్రహణశక్తి, ఉద్రేకం, సంభాషణ వంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగాన్ని ,
జవాబు:
మస్తిష్కం
56. ‘నేను కేంద్రనాడీ వ్యవస్థ చుట్టూ ఉండే ద్రవం లాంటి భాగాన్ని. కేంద్రీయ నాడీవ్యవస్థను షాకుల నుండి దెబ్బల నుండి రక్షణ కల్పిస్తాను.
జవాబు:
మస్తిష్కమేరు ద్రవం
57. పాన్స్ వెరోలి నుంచి వెన్నుపాము వరకు విస్తరించి ఉన్న నేను త్రిభుజాకార నిర్మాణాన్ని, హృదయ స్పందన, శ్వాసకోశ మరియు వాసోమోటర్ కార్యకలాపాలను నియంత్రిస్తాను.
జవాబు:
మజ్జిముఖం
58. నేను ఒక రకమైన నాడీవ్యవస్థ. కాంతి లేదా చీకటి పరిస్థితులలో ఉన్నప్పుడు కనుపాప కదలికలను నియంత్రిస్తాను.
జవాబు:
స్వయంచోదిత నాడీవ్యవస్థ
59. వినాళగ్రంథుల నుండి స్రవించే ‘ప్రేరేపించుట’ అనే అర్థం గల పదార్థాన్ని.
జవాబు:
హార్మోన్
60. “అడ్రినలిన్ స్థాయి పెరగడం కోపానికి దారి తీస్తుంది. అడ్రినలిన్ స్థాయి తగ్గుదల సాధారణ స్థితికి దారి ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు. తీస్తుంది.” ఈ రకమైన సమతుల్యం హార్మోన్ స్థాయిలు నా చేత నియంత్రించబడతాయి.
జవాబు:
పునఃశ్చరణ యాంత్రికం
61. స్పర్శ ద్వారా నాస్టిక్ చలనాన్ని చూపించే మొక్క నేను. ఆ ఆకులను తాకినప్పుడు అవి వెంటనే ముడుచుకుపోతాయి.
జవాబు:
మైమోసా పూడికా
దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి
62. ఒక రాయి దగ్గర మొక్క పెరుగుతుండగా వేర్లు, రాయికి దూరంగా నేలలో ఎక్కడ నీరు దొరుకుతుందో ఆ దిశలో పెరుగుతుంది. ఈ రకమైన అనువర్తనాన్ని గురుత్వాను వర్తనం అంటారు.
జవాబు:
ఒక రాయి దగ్గర మొక్క పెరుగుతుండగా వేర్లు, రాయికి దూరంగా నేలలో ఎక్కడ నీరు దొరుకుతుందో ఆ దిశలో పెరుగుతుంది. ఈ రకమైన అనువర్తనాన్ని నీటి అనువర్తనం అంటారు.
63. సాధారణ స్థాయి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం క్లోమంలోని కణాలు రక్తంలోకి గ్లూకాగాను ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
సాధారణ స్థాయి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం క్లోమంలోని కణాలు రక్తంలోకి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి.
64. మూత్రాశయం యొక్క సంకోచ, సడలింపులు సహాను భూత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి.
జవాబు:
మూత్రాశయం యొక్క సంకోచ, సడలింపులు స్వయం చోదిత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడతాయి.
65. మెదడు పెరికార్డియం అనే మూడు పొరలచే కప్పబడి ఉంటుంది.
జవాబు:
మెదడు మెనింజస్ అనే మూడు పొరలచే కప్పబడి ఉంటుంది.
66. అభివాహినాడులు సమాచారాన్ని కేంద్రీయ నాడీవ్యవస్థ నుండి నిర్వాహక అవయవానికి చేరవేస్తాయి.
జవాబు:
చాలక / అపవాహి నాడులు సమాచారాన్ని కేంద్రీయ నాడీవ్యవస్థ నుండి నిర్వాహక అవయవానికి చేరవేస్తాయి.
67. ఒక నాడీకణం యొక్క డెండ్రైట్స్ ఒకదానితో మరొకటి లేదా ఇతర నాడీకణం యొక్క డెండ్రైట్స్ తో కలిసే ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు.
జవాబు:
ఒక నాడీకణం యొక్క డెండ్రైట్స్ ఒకదానితో మరొకటి లేదా ఇతర నాడీకణం యొక్క అక్షముతో కలిసే
68. పార్శ్వ కోరకం, అగ్రకోరకం యొక్క పెరుగుదలను నియంత్రించడం జిబ్బరెల్లిన్ అనే మొక్క హార్మోన్ ఆధీనంలో ఉంటుంది.
జవాబు:
పార్శ్వ కోరకం, అగ్రకోరకం యొక్క పెరుగుదలను నియంత్రించడం ఆక్సినులు అనే మొక్క హార్మోన్ ఆధీనంలో ఉంటుంది.
69. పజిల్స్ కు పరిష్కారం కనుగొనే మెదడులోని భాగం అనుమస్తిష్కం.
జవాబు:
పజిలకు పరిష్కారం కనుగొనే మెదడులోని భాగం మస్తిష్కం
70. పువ్వులు మరియు ఆకులను తాజాగా ఉంచడానికి అబ్ సైసిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
జవాబు:
పువ్వులు మరియు ఆకులను తాజాగా ఉంచడానికి సైటోకైనిన్స్ ఉపయోగపడుతుంది.
పోలికను గుర్తించుట
71. కనుపాప విస్తరణ : సహానుభూత నాడీ వ్యవస్థ :: కనుపాప సంకోచం 😕
జవాబు:
సహానుభూత పరనాడీ వ్యవస్థ
72. కశేరు నాడులు : 31 జతలు : : ? : 12 జతలు
జవాబు:
కపాల నాడులు
73. జ్ఞాన నాడులు : అభివాహి నాడులు : : చాలక నాడులు 😕
జవాబు:
అపవాహి నాడులు
74. పత్రరంధ్రము మూసుకోవడం : అబ్ సైసిక్ ఆమ్లం : : పత్రరంధ్రము తెరుచుకోవడం 😕
జవాబు:
సైటోకైనిన్
75. కణం పెరుగుదల : ఆక్సిన్లు :: కాండం యొక్క పెరుగుదల 😕
జవాబు:
జిబ్బరెల్లిన్స్
76. థైరాయిడ్ : మెడ :: ? : మెదడు
జవాబు:
పిట్యూటరీ గ్రంథి
77. కాంతి అనువర్తనం : ? :: గురుత్వానువర్తనం : వేరు
జవాబు:
కాండం
78. మెదడు : కపాలం :: ? : వెన్నెముక
జవాబు:
కశేరు నాడీ దండం
79. నిస్సల్స్ గుళికలు : కణదేహం :: ష్వాన్ కణం 😕
జవాబు:
మైలీన్ తొడుగు
80. మైమోసా పూదిక : స్పర్శాసువర్తనం :: ఫలవంతమైన కీలాగ్రం 😕
జవాబు:
రసాయన అనువర్తన చలనం
బొమ్మలపై ప్రశ్నలు
81.
పటంలో గుర్తించిన ‘భాగం X పేరేమిటీ?
జవాబు:
నాడీకణసంధి
82.
ఈ చిత్రంలో ఏ రకమైన అనువర్తన చలనం చూపించబడింది?
జవాబు:
కాంతి అనువర్తనం
83.
ఈ ప్రయోగం చేసింది ఎవరు?
జవాబు:
F.W. వెంట్
84. ఓటు అంకురం యొక్క ఏ భాగంలో యఫ్. డబ్ల్యు. వెంట్ ప్రయోగాలు చేశారు?
జవాబు:
ప్రాంకుర కవచం
85.
ఈ మొక్కలో ఏ రకమైన అనువర్తన చలనం చూపబడింది?
జవాబు:
స్పర్శానువర్తనం
86.
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
అనుమస్తిష్కం
87.
ఈ చిత్రంలో ఏ కృత్యం నిర్వహించబడింది?
జవాబు:
మోకాలి కుదుపు ప్రతీకార చర్య
88.
ఈ కృత్యంలో నాడీవ్యవస్థ యొక్క ఏ అవయవం పాత్ర ఉండదు?
జవాబు:
మెదడు
89.
ఈ చిత్రంలో పోరాటానికి ఏ హార్మోన్ కారణం?
జవాబు:
అడ్రినలిన్
90.
‘X’ అనే భాగాన్ని గుర్తించండి.
జవాబు:
రన్వీర్ కణుపులు
ఖాళీలు పూరించండి
91. జీవ క్రియలను సమన్వయం చేయు వ్యవస్థ ……..
జవాబు:
నాడీ వ్యవస్థ
92. కేంద్రీయ వ్యవస్థలో ప్రధాన భాగాలు …….
జవాబు:
మెదడు, వెన్నుపాము
93. తెలివి తేటలకు కేంద్రము ………
జవాబు:
మస్తిష్కం
94. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ……….
జవాబు:
నాడీకణం
95. రెండు నాడీ కణాలు కలిసే ప్రాంతం ……….
జవాబు:
నాడీకణ సంధి
96. మొక్కలలో ……… సమన్వయం లోపించి ఉండును.
జవాబు:
నాడీ సమన్వయం
97. మొక్కలలో రసాయనిక సమన్వయం నిర్వహించే రసాయనాలు
జవాబు:
ఫైటో హార్మో న్స్
98. బాష్పోత్సేకం నియంత్రించే హార్మోను ………..
జవాబు:
ABA
99. మెదడుతో ప్రమేయం లేకుండా జరిగే చర్యలు ……..
జవాబు:
అసంకల్పిత ప్రతీకార చర్యలు
100. మెదడులోని ………. భాగము వెన్నుపాముగా కొనసాగుతుంది.
జవాబు:
మజ్జి ముఖం
10th Class Biology 5th lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1 Mark Bits Questions and Answers
1. ప్రక్క పటంను గుర్తించుము.
A) ఆల్గే
B) న్యూరాన్
C) రక్తకణం
D) మైటోకాండ్రియా
జవాబు:
B) న్యూరాన్
2. పత్ర రంధ్రాలను (స్టామటా) మూసి ఉంచటానికి మొక్కలలో ఏ హార్మోను బాధ్యత వహిస్తుంది?
A) అజ్ సైసిక్ ఆసిడ్
B) ఆక్సిన్
C) సైటోకైనిన్
D) ఇథిలీన్
జవాబు:
A) అజ్ సైసిక్ ఆసిడ్
3. ప్రక్క పటంలో లోపించిన భాగం పేరేమిటి?
A) నిస్సల్ కణికలు
B) కేంద్రకము
C) నా సంధి
D) డెండ్రైటులు
జవాబు:
B) కేంద్రకము
4. ఆకలి బాగా అయినపుడు విడుదలయ్యే హార్మోన్
A) అడ్రినలిన్
B) థైరాక్సిన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
D) గ్రీలిన్
5. మెదడులో అతిపెద్ద భాగం
A) ముందు మెదడు
B) మధ్య మెదడు
C) వెనుక మెదడు
D) కపాలం
జవాబు:
A) ముందు మెదడు
6. రెండవ మెదడుగా పిలువబడేది
A) కపాలంలోని మెదడు
B) జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ
C) కేంద్రీయ నాడీవ్యవస్థ
D) అంతస్రావీ వ్యవస్థ
జవాబు:
B) జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ
7. మెదడును రక్షించునవి ………….
A) కపాలము
B) మెనింజిన్ పొర
C) A మరియు B
D) మృదులాస్థి
జవాబు:
B) మెనింజిన్ పొర
8. మధుమేహము ఈ గ్రంథికి సంబంధించినది.
A) పిట్యూటరి
B) థైరాయిడ్
C) క్లోమము
D) అడ్రినల్
జవాబు:
C) క్లోమము
9. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం …………..
A) మధ్యమెదడు
B) మజ్జా ముఖం (మెడుల్లా)
C) ద్వారగోర్దం (డైయన్ సెఫలాన్)
D) మస్తిష్కం (సెరిబ్రమ్)
జవాబు:
C) ద్వారగోర్దం (డైయన్ సెఫలాన్)
10. దోస, కాకర వంటి బలహీన కాండాలు గల మొక్కలు చూపు లక్షణము
A) కాంతి అనువర్తనము
B) స్పర్శానువర్తనము
C) గురుత్వానువర్తనము
D) రసాయనికానువర్తనము
జవాబు:
B) స్పర్శానువర్తనము
11. ఒక వ్యక్తి తన భావావేశములపై నియంత్రణను కోల్పోయాడు. మెదడులో పని చేయని భాగం
A) మస్తిష్కం
B) మజ్జిముఖం
C) మధ్య మెదడు
D) అనుమస్తిష్కం
జవాబు:
A) మస్తిష్కం
12. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం
A) కిరణజన్య సంయోగక్రియ తగ్గడం
B) పెరుగుదల నియంత్రణ
C) మొక్క హార్మోన్ల విడుదల
D) మేసే జంతువుల నుండి రక్షలు
జవాబు:
D) మేసే జంతువుల నుండి రక్షలు
13.
ఉద్దీపనలకు లోనయినప్పుడు చూపే ఏ చలనాన్ని పై చిత్రం సూచిస్తుంది?
A) జలానువర్తనం
B) స్పర్శానువర్తనం
C) కాంతి అనువర్తనం
D) గురుత్వానువర్తనం
జవాబు:
B) స్పర్శానువర్తనం
14. క్రింది వానిలో సరైన వాక్యము
A) మస్తిష్కం కండరాల కదలికలకు కేంద్రము.
B) ద్వారగోర్థం – ఆలోచనలు, జ్ఞాపకాలు, కారణాలు, వెతికే శక్తికి కేంద్రము.
C) అనుమస్తిష్కం – శరీర సమతాస్థితి, శరీరస్థితిని బట్టి కండరాల కదిలికలను నియంత్రిస్తుంది.
D) మధ్య మెదడు-మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం క్రియలను నియంత్రిస్తుంది.
జవాబు:
C) అనుమస్తిష్కం – శరీర సమతాస్థితి, శరీరస్థితిని బట్టి కండరాల కదిలికలను నియంత్రిస్తుంది.
15. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమగు హార్మోన్
A) అడ్రినలిన్
B) టెస్టోస్టిరాన్
C) వాసోప్రెస్సిన్
D) ఈస్ట్రోజెన్
జవాబు:
D) ఈస్ట్రోజెన్
16. క్రింది వానిలో ఏది మానవునిలో స్రావక పదార్థం కాదు?
A) ఎంజైమ్
B) హార్మోన్
C) లాలాజలం
D) స్వేదం
జవాబు:
D) స్వేదం
17. మైమోసాపూడికా నందు స్పర్శానువర్తనం రక్షణకు తోడ్పడగా, కాకరలో నులితీగెలు దేనికి తోడ్పడుతాయి?
A) ఆధారం
B) పోషణ
C) శ్వాసక్రియ
D) విసర్జన
జవాబు:
A) ఆధారం
18. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను సుమ తన బెడ్ రూం కిటికీలో ఉంచింది. కొన్ని రోజుల తరువాత గమనిస్తే ఆ మొక్క వెలుతురు వైపు వంగి పెరిగింది. ఎందుకనగా
A) గురుత్వానువర్తనము
B) కాంతి అనువర్తనము
C) రసాయన అనువర్తనము
D) నీటి అనువర్తనము
జవాబు:
B) కాంతి అనువర్తనము
19. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవటం వల్ల కలిగే లాభం
A) కిరణజన్య సంయోగక్రియ తగ్గటం
B) మేసే జంతువుల నుండి రక్షణ
C) పెరుగుదల నియంత్రణ
D) మొక్క హార్మోన్ల విడుదల
జవాబు:
B) మేసే జంతువుల నుండి రక్షణ
20. ఇన్సులిన్ హార్మోన్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది?
A) కాలేయం
B) క్లోమం
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
B) క్లోమం
21. మెదడులోని ఈ భాగము శరీర సమతాస్థితి మరియు భంగిమ నియంత్రించును.
A) మస్తిష్కము
B) అనుమస్తిష్కం
C) మధ్యమెదడు
D) ద్వారగోట్టాము
జవాబు:
B) అనుమస్తిష్కం
22. కణవిభజనను ప్రేరేపించే ఫైటో హార్మోను
A) జిబ్బరెల్లిన్
B) ఇథైలిన్
C) ఆక్సిన్
D) సైటోకైనిన్
జవాబు:
D) సైటోకైనిన్
23. క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోన్
A) వ్యాసోప్రెస్సిన్
B) అడ్రినలిన్
C) ఇన్సులిన్
D) ప్రొజెస్టిరాన్
జవాబు:
C) ఇన్సులిన్
మీకు తెలుసా?
• మోకాలి ప్రతీకారచర్య యొక్క ఉనికిని మొదటగా 1875లో గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కాని మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినపుడు మోకాలి ప్రతీకారచర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీమార్గం ఉంటుందని స్పష్టమవుతున్నది.
• నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
• మెదడు దాదాపుగా 1400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉన్నప్పటికీ శరీరంలో మొత్తం ఉత్పన్నమైన శక్తిలో 20% శక్తిని మెదడుకు ఉపయోగించబడుతుంది. పురుషుని మెదడు బరువు రమారమి 1375 గ్రాములు, స్త్రీ మెదడు దాదాపుగా 1275 గ్రాములు,
• మెదడు నుండి బయలుదేరే నాడులను కపాలనాడులు (Cranial nerves) అని, వెన్నుపాము నుండి బయలుదేరే నాడులను వెన్నునాడులు (Spinal nerves) అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మన దేహంలో మొత్తం 12 జతల కపాలనాడులు మరియు 31 జతల వెన్నునాడులు ఉంటాయి.
• కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్లే కాకుండా మన శరీరంలోని జీర్ణనాళంలో ఒక ప్రత్యేకమైన నాడీవ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరిధీయ నాడీవ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుందని, దానికి రెండవ మెదడు లేదా జీర్ణ నాడీవ్యవస్థ (Enteric) అని పేరు పెట్టారు.
• మైమోసాఫ్యూడికా పత్రవృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పల్వైని (Puluine) అంటారు. వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని (Nastic movement) చూపిస్తుంది. దీనిని స్పర్శానువర్తనం (Thigmotrophism) అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈ నెలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తు పల్వైనిలోని నీరు పత్రంలో వేరే భాగాలవైపు వలస వెళుతుంది. అందువలన పల్వైని గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది. 20-30 నిమిషాల తరువాత పల్వైనిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారతాయి.
పునశ్చరణ