SCERT AP 9th Class Social Studies Guide Pdf 5th Lesson జీవావరణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 5th Lesson జీవావరణం

9th Class Social Studies 5th Lesson జీవావరణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
జీవులను ఒక ప్రత్యేకమైన జీవావరణంగా వర్ణిస్తారు. వివరించండి. (AS1)
జవాబు:

 1. భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనినే “జీవావరణం” అంటారు.
 2. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి.
 3. అతి సూక్ష్మ బాక్టీరియా నుంచి అత్యంత పెద్దవైన మర్రి చెట్టు, నీలి తిమింగలాలు, ఏనుగులు వంటి జీవులు, పులులు మానవులతో భూమి విలసిల్లుతోంది.
 4. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండటం.
 5. నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండటం వల్ల ఒక్క భూమిపైన మాత్రమే జీవం సాధ్యమైంది. అందువల్ల జీవులతో కూడిన దానిని జీవావరణం అంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
ఆధునిక కాలంలో పర్యావరణ సంక్షోభం సృష్టించబడుతున్నది. వాటి యొక్క ప్రభావాన్ని వివరించండి. (AS4)
(లేదా)
పర్యావరణ సంక్షోభ పరిణామాలను తెలపండి.
జవాబు:

 1. పారిశ్రామికీకరణం, వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవిని ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
 2. ఇదే క్రమంలో భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులను కొల్లగొడుతున్నారు.
 3. దీని వల్ల అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి.
 4. ఖనిజ, చమురు, భూగర్భజలవనరులు అంతరించిపోతూ ఉన్నాయి.
 5. ప్రస్తుత జీవన విధానం సుస్థిరమైనది కాదని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు.
 6. ప్రకృతి వనరులను ఇదే తీరులో వినియోగించుకుంటూ పోతే మన పిల్లలు, వాళ్ల పిల్లలకు ఏమీ మిగలదు.
 7. మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.
 8. మానవుల వ్యాపార కార్యకలాపాల వల్ల భూమిపై ప్రతిజీవి, ప్రతి పదార్థమూ ప్రభావితం అవుతున్నాయి.
 9. ఇది ఇలాగే కొనసాగితే ఇతర జీవ జాతులకే కాక అంతిమంగా మనుషులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది.

ప్రశ్న 3.
సహజ వృక్ష సంపదను శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది. వివిధ రకాలైనటువంటి అడవులను, వాటిని ప్రభావితం చేసే శీతోష్ణస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 1
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 2

ప్రశ్న 4.
అంతరించిపోతున్న అడవులను ఎలా సంరక్షించుకోవచ్చు? (AS6)
(లేదా)
అడవుల సంరక్షణకై ఏవేని రెండు మార్గాలను సూచించండి.
(లేదా)
ప్రస్తుతం అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనుటకు నాలుగు సూచనలు రాయండి.
జవాబు:
అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకొనే విధానం :

 1. పారిశ్రామిక ప్రాంతాల యందు, పాఠశాలల ఆవరణంలోను, కళాశాలల ఆవరణంలోను,ఇంటి ఆవరణంలోను, రోడ్లు కిరువైపుల, కాలువ గట్లపైన, నదుల గట్లపైన, ఖాళీస్థలాల యందు, మొక్కలను పెంచాలి.
 2. అడవుల అక్రమ నరికి వేతలను అరికట్టి ఆక్రమ రవాణాను పూర్తిగా ఆపుచేయాలి.
 3. అడవులను నరుకుతున్న ప్రదేశాల యందు మొక్కలను నాటాలి.
 4. మొక్కల పెరుగుదలకు అన్ని రకాల చర్యలు చేపట్టాలి.
 5. అడవుల ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేయాలి.

ప్రశ్న 5.
పాఠ్యాంశాన్ని చదివి కింద పట్టిక నింపండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 3
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 4

ప్రశ్న 6.
ప్రపంచ పటంలో ఈ కింది దేశాలను గుర్తించండి.
1. న్యూజిలాండ్ .2. బ్రెజిల్ 3. ఆస్ట్రేలియా 4.ఉత్తర అమెరికా 5. చైనా 6. ఇండియా
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 5

ప్రశ్న 7.
పేజీ నెం. 57లోని “వనరులు అంతరించిపోవడం” అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
వనరులు అంతరించిపోవడం ఇటీవల చాలా తీవ్రమైంది. పారిశ్రామికీకరణ వేగంగా వృద్ధి చెందుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో దోపిడీకి గురౌతున్నాయి. అదే విధంగా భూమిలో కోట్ల సంవత్సరాలుగా నిలవ ఉన్న ఇంధన వనరులు అనగా బొగ్గు, ముడిచమురు కొల్లగొడుతున్నారు. వనరులు అంతరించడం వలన అటు జీవ వైవిధ్యానికి కూడా పెను సవాలు ఎదురౌతుంది. అడవులు తగ్గిపోతూ, ఖనిజాలు, చమురు, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతి వనరులు అంతరించడం వల్ల భవిష్యత్తు తరాల భవిష్యత్తు చీకటిలో కొట్టుమిట్టాడుతుంది. పర్యావరణం కూడా కలుషితమౌతూ, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

9th Class Social Studies 5th Lesson వాతావరణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.51

ప్రశ్న 1.
గాలి, నీరు మీద మొక్కలు ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పండి ; మొక్కలు ఆ రెండింటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి.
జవాబు:

 1. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్మిలతో అవినాభావ సంబంధం ఉంది.
 2. వీటినుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతుంది, తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
 3. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ‘ఆహార శృంఖలం’లో భాగం – అంటే ఒక రకమైన జీవరూపం మరొకదానికి ఆహారం అవుతుంది.
 4. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలలో ఉంటాయి. వీటన్నిటికీ ఉదాహరణలు తెలుసుకుందాం.
 5. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఇవి ఆహారం తయారుచేస్తాయి. వీటికి కావలసిన పోషకాలను నేలనుంచి, ప్రత్యేకించి ఇతర మొక్కలు, పశువుల వ్యర్థపదార్థాలు కుళ్లగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుంచి గ్రహిస్తాయి.
 6. నేలలో బ్యాక్టీరియా స్థిరీకరించిన నత్రజనిపై కూడా. ఇవి ఆధారపడతాయి. మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ‘శాకాహారులు’ అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.
 7. కుక్క, పిల్లి, డేగ, పులి వంటివి మాంసాహారులు, ఇవి శాకాహార జంతువులను తినడం వల్ల పరోక్షంగా మొక్కలపై ఆధారపడినవే. చనిపోయిన మొక్కలు, జంతువులు, వాటి వ్యర్థ పదార్థాలపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసి సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నం చేస్తాయి.
 8. మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 2.
దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి? తిరిగి వాటిని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

 1. దోమలు, సీతాకోకచిలుకలు వంటి పురుగులు రాళ్ళు లేదా మట్టి మీద, నీటి మీద ఆధారపడి ఉండటానికి కారణం దోమలు నీటి మీద నివసిస్తూ, గుడ్లు పెడుతూ తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ మానవుల, జంతువుల ఇతర విధములైన రక్తమును పీలుస్తూ జీవిస్తాయి.
 2. సీతాకోక చిలుకలు పుష్పాలలో మకరందాన్ని సేవిస్తూ జీవిస్తాయి. అలాగే ఇతర క్రిమికీటకాదులు తమతమ రీతులలో జీవనం చేస్తాయి.

9th Class Social Textbook Page No.55

ప్రశ్న 3.
మీ పరిసరాల్లో గట్టి కలప, మెత్తటి కలపతో చేసిన వస్తువులను గుర్తించండి.
జవాబు:
గట్టి కలపతో చేసిన వస్తువులు :
తలుపులు, కిటికీలు, మంచాలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, వివిధ రకాలైన గృహోపకరణాలు.

మెత్తటి కలపతో చేసినవి :
అగ్గి పుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో ఉండే చెట్ల పేర్లతో పాటు వాటి గురించి తెలుసుకోండి.
జవాబు:
మా ప్రాంతంలో ఉండే చెట్లు
మామిడి : కాయలు, కలపనిస్తుంది.
వేప : ఆరోగ్యప్రదాయిని, కలప, ఔషధాల సపోటానిస్తుంది.
చింత : కలప, చింతపండుకు ఉపయోగపడుతుంది.
సరుగుడు : కలపనిస్తుంది.
జీడిమామిడి : జీడిపప్పునిస్తుంది.
జామ : కాయలు, కలపనిస్తాయి.
సపోటా : కాయలనిస్తుంది.
ద్రాక్ష : పండ్లనిస్తుంది.
బాదం : పప్పునిస్తుంది.
మఱ్ఱి : కలపనిస్తుంది.

ప్రశ్న 5.
ప్రపంచ పటంలో ఎడారి ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

 1. సహారా ఎడారి
 2. కలహారి ఎడారి
 3. థార్ ఎడారి
 4. అరేబియన్ ఎడారి
 5. ఆస్ట్రేలియన్ ఎడారి
 6. అటకామా ఎడారి
 7. సోనోరన్ ఎడారి

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 6

9th Class Social Textbook Page No.56

ప్రశ్న 6.
వ్యవసాయం, పశుపోషణ మొదలు పెట్టినప్పుడు మనుషులు తమ చుట్టూ ఉన్న భూమి, నీరు, మొక్కలు, జంతువులను ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటారో చర్చించండి.
జవాబు:

 1. మానవులు వ్యవసాయం, పశుపాలన మొదలు పెట్టినప్పుడు, పర్యావరణాన్ని మరింతగా ప్రభావితం చేయసాగారు.
 2. ఇత్తడి, ఇనుము వంటి లోహాల వినియోగం, నగరాల నిర్మాణంతో, పర్యావరణంతో మానవ సంబంధాలు మారిపోయాయి.
 3. అనతి కాలంలోనే ప్రజలు నీళ్లు నిల్వచేయటానికి చెరువులు, పొలాలకు నీళ్ళు ‘ మళ్లించటానికి కాలువలు, నదులకు ‘ అడ్డంగా ఆనకట్టలు వంటివి నిర్మించటం మొదలు పెట్టారు.
 4. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రజలు రహదారులు వేశారు.
 5. మహా సముద్రాల మీద ఓడలు, పడవలతో ప్రయాణం చేశారు.

ప్రశ్న 7.
వాళ్లు ఏ ఇంధన వనరులను ఉపయోగించి ఉంటారు? వాటిని ఎలా పొంది ఉంటారు?
జవాబు:

 1. ఇంధన వనరుల కోసం పారిశ్రామిక దేశాలు ప్రపంచమంతటా వెదకసాగాయి.
 2. వాళ్లు ప్రపంచమంతా అన్వేషించి అన్ని రకాల వనరుల జాబితా తయారు చేశారు.
 3. లోతైన బావులు తవ్వి భూమి లోపల పొరల్లో ఏముందో చూశారు.
 4. అనతి కాలంలోనే భూమి అంతటా పెద్ద ఎత్తున గనుల తవ్వకం, అడవులు నరికి వేయటం, కర్మాగారాల నిర్మాణం, రోడ్లు వేయటం, వ్యవసాయ పొలాలుగా మార్చటం వంటివి చేపట్టారు.

AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం

ప్రశ్న 8.
నగరాలు నిర్మించటం వల్ల వాటి చుట్టూ నేల, నీళ్లు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:

 1. నగరాలు నిర్మించటం. వల్ల, పరిశ్రమలు స్థాపించటం వల్ల, జనాభా పెరుగుదల వల్ల ఖనిజాలు, అడవులు, నేల, రాళ్లు, గాలి వంటి ప్రకృతి వనరులు ఇంతకు ముందు కనీవినీ ఎరగని స్థాయిలో దోపిడికి గురవుతున్నాయి.
 2. నేల, నీళ్ళు కలుషితం అవుతున్నాయి.
 3. నేల వేడెక్కుతుంది. నీళ్ళు కలుషితం అవుతున్నాయి. వీటి వలన మానవుల జీవితం రోగాల బారిన పడుతుంది.
 4. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ,వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీరు, నేలను కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 9.
భూమి స్వరూపాన్ని, నీటి చక్రాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తోంది?
జవాబు:

 1. కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతుంది.
 2. ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారటం.
 3. దీనినే ప్రపంచం వేడెక్కటం అంటున్నారు.
 4. దీనితో వర్షాలు తగ్గిపోతున్నాయి.
 5. కాలుష్యం పెరిగిపోతుంది.
 6. మంచి నీటి ప్రవాహం ఏర్పడుతుంది.
 7. మరొక వైపు ధృవాల వద్ద మంచు సముద్రాల నీటి మట్టం పెరిగి దీవులు జలమయం అవుతాయి.
 8. శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గు పులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరై పోయే కర్బన మూలకాలు, భార లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
 9. వీటి వల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై ఆమ్ల వర్షాలు కురుస్తాయి. దీనితో జలచక్రం దెబ్బతింటుంది.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
దగ్గరలోని పరిశ్రమను సందర్శించి దానినుంచి వెలువడుతున్న వాయు, ద్రవ, ఘన వ్యర్థ పదార్థాలను గమనించండి. వాటి వల్ల మొక్కలు, పశువులు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళను అడిగి తెలుసుకోండి. సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఒక నివేదిక తయారుచేసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:

 1. మాకు దగ్గరలోని రవాణా పరికరాలు తయారుచేసే పరిశ్రమను సందర్శించడం జరిగింది.
 2. ఈ పరిశ్రమ బొగ్గు, చమురు నుంచి వచ్చే ఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తారు.
 3. ఈ విధంగా శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సెడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు, భారీ లోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.
 4. వీటివల్ల గంధిక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై, దాని ఫలితంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
 5. ఈ పరిశ్రమ ఘన, ద్రవ, వాయు రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేసి గాలి, నీటి (వాగులు, నదులు) వంటి ఉపరితల ప్రవాహాలను, బావులలోని భూగర్భ జలాలను నేలను కలుషితం చేస్తున్నాయి.
 6. ఇలాంటి కాలుష్యం వల్ల కొంత కాలానికి పర్యావరణం వేడెక్కుతుంది, శీతోష్ణస్థితులు మారిపోతాయి.
 7. ఈ ప్రభావం మొక్కలు, జంతువులు, మానవుల పై పడుతుంది.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో లేదా మీ గ్రామంలో అంతరించిపోతున్న జంతువులు లేదా పక్షులు వివరాలను సేకరించి, క్రింది పట్టికలో నింపి, తరగతి గదిలో చర్చించండి. అందుకు మీ తల్లిదండ్రుల, పెద్దల సహకారం తీసుకోండి.
AP Board 9th Class Social Solutions Chapter 5 జీవావరణం 7
జవాబు: