SCERT AP 9th Class Social Studies Guide Pdf 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బాల్య వివాహాల దుష్ఫలితాలు ఏవి? (AS1)
జవాబు:
బాల్య వివాహాల దుష్ఫలితాలు :

  1. చిన్న వయసులో గర్భవతులు కావడం.
  2. ఆడ పిల్లల అక్రమ రవాణాకు, అమ్మకానికి అవకాశం ఏర్పడడం.
  3. చదువుకు ఆటంకం.
  4. శారీరక ఎదుగుదలకు ఆటంకం.
  5. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారుట.
  6. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం.
  7. వైకల్యంతో కూడిన శిశు జననాలు లేదా మృత శిశువులు జన్మించడం.
  8. ఎదుగుదల లేని పిల్లలను బలవంతంగా కుటుంబ వ్యవస్థలోకి నెట్టివేయడం.
  9. అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 2.
గృహహింస ఎందుకు సర్వసాధారణమైంది? అది ఏయే రూపాల్లో కనిపిస్తుంది? కారణాలు రాయండి. (AS1)
జవాబు:
మన రాజ్యాంగం పౌరులందరికీ గౌరవంగా బ్రతికే హక్కును ఇచ్చింది. స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు కూడా గౌరవంగా బ్రతకాలి. వారిని దూషించకుండా, అవమానించకుండా ఉండాలి. స్త్రీలు చేసే పనిని గౌరవించి, వారి హక్కులు, స్వేచ్ఛా వాతావరణంలో అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించాలి. ప్రతీ కుటుంబంలో స్త్రీలను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీస్తున్నారు. స్త్రీ పై ఆధిపత్యం కోసం పద్ధతి ప్రకారం జరిపే చర్యల క్రమమే గృహహింస.

కారణాలు :

  1. స్త్రీలలో గల అమాయకత్వం.
  2. స్త్రీల రక్షణకు కల్పించే చట్టాలపై అవగాహన లేకపోవడం.
  3. స్త్రీలలో గల నిరక్షరాస్యత.
  4. పురుష అహంకార సమాజం.
  5. స్త్రీల పట్ల సమాజం చిన్న చూపు.
  6. స్త్రీకి స్త్రీయే శత్రువుగా మారటం.
  7. స్త్రీలలో గల నిరాసక్తత.

ప్రశ్న 3.
మీరు బాలికలు, మహిళల యొక్క వివిధ సమస్యల గురించి చదివారు. ఇలాంటి సమస్యలు మీ గ్రామంలో లేదా పట్టణంలో ఎప్పుడైనా గమనించారా? అయితే, ఏం చేయాలి? (AS4)
జవాబు:
మా గ్రామం మరియు మా పరిసర ప్రాంతాలలో బాల్య వివాహాలు, వరకట్నం, లైంగిక వేధింపులు గమనించాం.

మా గ్రామంలో వరకట్న సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబాలు, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. వరుడ్ని వేలంలో కొన్నట్లు ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే వారిని పెండ్లాడే సంస్కృతి కనిపిస్తుంది.

  1. ముందుగా సమాజంలో మార్పు రావాలి.
  2. స్త్రీల యొక్క గుణగణాలకు, కుటుంబ సాంప్రదాయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
  3. వరకట్నం అడిగే పెద్దలను, వరుడ్ని పోలీసులకు అప్పజెప్పాలి.
  4. స్త్రీలలో మార్పు రావాలి.
  5. ఇంకా కట్నం కోసం వేధించే భర్తలను నిర్భయంగా పోలీసులకు, కోర్టులకు, స్వచ్ఛంద సంస్థల ముందుంచాలి.

ప్రశ్న 4.
బాలికలు, మహిళల సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది. వాటిని సక్రమంగా అమలు చేయడానికి మీరిచ్చే సూచనలు ఏవి?
(లేదా)
బాలికలు, మహిళల అభివృద్ధి మరియు సంరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలు మరియు చట్టాల రూపకల్పన చేస్తుంది. వాటిని సక్రమంగా అమలు చేయటానికి మీరందించే సూచనలు ఏమిటి?
జవాబు:
అనాదిగా మవదేశం పురుషాధిక్యత గలది. స్త్రీలు అంటే చిన్న చూపు పురాతన కాలం నుండి కొనసాగుతుంది. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొను అనేక సమస్యల నుండి, వేధింపుల నుండి, హింసల నుండి రక్షణకై అనేక చట్టాలు రూపొందించి, అండగా ఉంటూ అధికారులు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నాయి.

అయితే చట్టాలు సక్రమంగా అమలు చేయడానికిగాను సలహాలు :

  1. చట్టాలపై స్త్రీలలో అవగాహన కలిగించడానికి గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
  2. అవగాహన సదస్సులు, బహిరంగ వేదికలలో చట్టాలపై వివరంగా తెలియజేయాలి.
  3. సమాచార సాధనాలైన రేడియో, టీ.వి, వార్తాపత్రికలు, సినిమాల ద్వారా చట్టాలపై అవగాహన కలిగించడానికి ఎక్కువ సమయం, స్థలం కేటాయించాలి.
  4. స్త్రీలు విద్యావంతులు కావాలి.
  5. పాఠశాల స్థాయి నుండే బాలికలలో చట్టాలపై పూర్తి అవగాహన కలిగించాలి.
  6. డ్వాక్రా, మహిళా సంఘాల సమావేశాలలో చట్టాలు – లభించే ప్రయోజనాలు, కల్పించే సౌకర్యాలు వివరించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 5.
మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
ఈ రోజుల్లో మహిళలు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. ఆడ పిల్లలను చదివించడానికి బయట ప్రాంతాలకు పంపించడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆంక్షలు, బయట ప్రపంచంలో మహిళలను వేధించడం, బాధించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆడవాళ్ళు కనిపిస్తే ఎగతాళి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, మానసిక క్షోభకు గురిచేసే మాటలనడం, అవమానించడం, భయపెట్టి, బెదిరించి, మాయమాటలు చెప్పి, ప్రేమలో దించి, లొంగదీసుకొని, హత్యా నేరాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తున్నాం. అంతేకాకుండా వరకట్నం పెండ్లి సమయంలోనే కాకుండా, వివాహానంతరం కూడా ఇంకా అధికంగా కట్నం తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపడం జరుగుతుంది. అమ్మాయి జన్మిస్తే తల్లిని నిందించడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రశ్న 6.
మీరు తహశీల్దారు అయితే, బాల్య వివాహాలను ఎలా అరికడతారు?
జవాబు:
బాల్యం జీవితాంతం గుర్తుండే తీపి గుర్తు. వెంటాడే సుందర దృశ్యం. బాల్యం మధురానుభూతులు అనుభవించక ముందే, చదువుకోవాలనే కోరిక తీరక ముందే, బాలబాలికల వివాహ వయస్సు రాకముందే అంటే బాలురకు 21 సం||లు బాలికకు 18 సం|| నిండక ముందే చాలా ప్రాంతాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

నేనే తహశీల్దారును అయితే :

  1. నా మండల పరిధిలోగల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో గల విద్యార్థులలో చైతన్యం కల్గించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను.
  2. పోలీస్ అధికారి, ప్లీడర్, ఒక డాక్టర్‌ను ప్రతీ గ్రామానికి పంపించి తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు, బలవంతంగా వివాహాలు జరిపిస్తే వేసే శిక్షలు, ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరిస్తాను. (వారి ద్వారా)
  3. ఎక్కడైనా అవగాహన లోపంతో బాల్య వివాహాలు జరిగినట్లు వివిధ గ్రామాధికారులు ద్వారా తెలుసుకొని, మహిళా సంక్షేమ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.
  4. ప్రతీ గ్రామంలో కూడా బాల్య వివాహాల నిరోధానికై కమిటినీ ఏర్పాటు చేసి, అంగన్‌వాడీ టీచర్, ANM, ఆశ వర్కర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులను కమిటీగా నియమించి నిరోధానికి కృషి చేస్తాను.
  5. ప్రతీ గ్రామ సభలో దండోరా వేయించి సామాజిక అవగాహన కలిగింపజేస్తాను.

ప్రశ్న 7.
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కొరకు ఒక కరపత్రాన్ని తయారుచేయండి. (AS6)
జవాబు:
మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కరపత్రం :

ఆడదే ఆధారం – కాని వారికి లేదు సహకారం

సృష్టికి మూలకారణం ఆడది. ఆడది లేకుంటే ఈ సృలేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా సమాజానికి దశను, దిశను నిర్దేశించే ముహిళలు నేడు అణగదొక్కబడుతున్నారు. ఆత్మన్యూనతా భావంతో అడుగంటిపోతున్నారు. చివరకు ఆత్మహత్యలే ప్రధానమనుకుంటున్నారు.

అక్రమ రవాణా :
ఉద్యోగం ఇప్పిస్తామని, సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి, వ్యభిచార గృహాలకు విక్రయించి, హింసించి మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

వరకట్నపు పిచాచి :
అమ్మాయి, అబ్బాయి వివాహం అనంతరం (వధూవరులు) ఆనందంగా జీవించడానికి పెండ్లి సమయంలో అత్తవారు ఇచ్చే కానుకలు రోజురోజుకు వెర్రితలలు వేసి నేడు వరకట్నంను వేలం వేస్తున్నారు. కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు, వారి ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేని సందర్భాలెన్నో. కొన్నిసార్లు వివాహాలు జరిపించినా, తదనంతరం అదనపు కట్నం కొరకు అమ్మాయిని వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో చంపివేయడం చూస్తున్నాం. ఇది న్యాయమా?

గృహ హింస :
స్త్రీలు చేసే పనిని గౌరవించాలి, ఆదరించాలి, చేయూతనందించాలి. అలాకాకుండా నాలుగు గోడల మధ్య మహిళలను రకరకాల పద్ధతులతో హింసించి, మానసిక క్షోబకు గురిచేసి ఆత్మహత్యా విధానాలకు పురికొల్పుతూ, నిండు జీవితాలను బలిచేస్తున్నారు.

లైంగిక ఆత్యాచారాలు, వేధింపులు :
ఇటీవల కాలంలో మహిళలపై ఆత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమై పోయాయి. ఆఫీసులలో, లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. ఎదురు తిరిగిన వారిని యాసిడ్ తో దాడి చేస్తున్నారు. కనీస మర్యాద కూడా పాటించకుండా పశువులతో సమానంగా ప్రవర్తిస్తున్నారు.

మారాలి, సమాజం మారాలి. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో, ఎక్కడ మర్యాదలు ఆందజేస్తామో ఆ సమాజమే బాగుపడుతుంది. ఇప్పటికైనా మహిళలకు అందించాలి సహకారం.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రశ్న 8.
పేజీ నెం. 275లోని ‘అత్యాచారం, లైంగిక వేధింపులు’ అంశం చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
ఇటీవల కాలంలో విదేశీ సంస్కృతి వెర్రి తలలు వేసి మహిళలపట్ల చిన్నచూపు ఏర్పడి విచక్షణా జ్ఞానాన్ని మరచిపోయి, మహిళలపట్ల అనేక క్రూర చర్యలకు పాల్పడుతున్నారు. అందులో ప్రధానమైన దుశ్చర్య అత్యాచారాలు – లైంగిక వేధింపులు. స్వేచ్ఛగా, హాయిగా విహరించలేని, తిరగలేని దౌర్భాగ్యం మనకు మహిళల పట్ల కానవస్తుంది. రోజు రోజుకు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ‘ వేధింపులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఈ రకమైన వేధింపుల నిరోడానికి, లైంగిక, అత్యాచార నియంత్రణకు జస్టిస్ జె.యస్. వర్మ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియుమించి ఫిబ్రవరి 2, 2013న దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దీని ప్రకారం

  1. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడుతుంది.
  2. మహిళలపై యాసిడ్ దాడి సమయంలో పెనుగులాటలో దాడి చేసినవారు మరణించినా మహిళలకు శిక్షలేదు.
  3. మహిళా పోలీస్ ద్వారా విచారణ జరుపబడుతుంది.
    ఈ విధంగా మహిళలకు రక్షణ కల్పించబడుతుంది.

9th Class Social Studies 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.271

ప్రశ్న 1.
అప్పుడప్పుడు 15 సంవత్సరములు కూడా నిండని పిల్లలకు వారి ప్రమేయం, ఇష్టాయిష్టాలు చూడకుండా పెళ్ళిళ్లు చేస్తున్నారు. ఇలాంటివి ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయం చేస్తారు?
జవాబు:
అప్పుడప్పుడూ గ్రామీణ పల్లె ప్రాంతాలలో 18 సం||లు పూర్తికాకుండా 13, 14, 15 సం||ల వయసులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం, తల్లిదండ్రులలో, పిల్లలలో చైతన్యం లేకపోవడం, తదనంతర కష్టాలు, నష్టాలు వారికి తెలియకపోవడం. అంతేకాకుండా పిల్లల పుట్టిన తేదీ, వయస్సు విషయాలలో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం లేకపోవడం. ఇలాంటి బాల్య వివాహాలు జరిగినట్లు మొదట గుర్తించేది గ్రామ కార్యదర్శి. గ్రామ కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్.డి.ఓ, మండల స్థాయిలో తహశీల్దారుకు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా వారికి ఫిర్యాదు చేస్తాడు. పై అధికారుల సూచన మేరకు మహిళ సంక్షేమ అధికారి CDPO మరియు సబ్ ఇన్ స్పెక్టరు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మొ||వారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా పెళ్ళిళ్ళు ఆపవచ్చు.

9th Class Social Textbook Page No.273

ప్రశ్న 2.
మీ నివాస ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం గమనించారా? ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి? దీనిని నిరోధించాలంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎవరు బాధ్యత వహించాలి?
జవాబు:
మా ప్రాంతంలో కట్నం కోసం మహిళలను వేధించడం నిరంతరం చూస్తున్నాం. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు, ఆడపడుచులు, భర్త తరచుగా వేధించడం, తిట్టడం, కొట్టడం, కొన్ని సందర్భాలలో బలవంతంగా చంపి, ఆత్మహత్యలుగా చిత్రీకరించడం చేస్తున్నారు. మరికొన్ని సందర్భాలలో ఈ మహిళలు ఈ వేధింపులు, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

దీనిని నిరోధించాలంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి. వరకట్నం అనే సాంఘిక దురాచారం రూపు మాపడానికి రేపటి భావిభారత పౌరులైన విద్యార్థుల నుండే చైతన్యం రావాలి. చదువుకున్న వారిలో, తల్లిదండ్రులలో అవగాహన పెరగాలి. కట్నం వేధింపులకు విధించే శిక్షలు కఠినంగా ఉండాలి. దీనిని రూపుమాపడానికి సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

9th Class Social Textbook Page No.274

ప్రశ్న 3.
గృహ హింస ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మొదలై రాను రాను దురలవాటుగా మారిపోతుంది. హింస నుండి మరింత హింస పుడుతుంది. దీన్ని ఎలా ఆపవచ్చు? ఎవరు సహాయపడతారు?
జవాబు:
స్త్రీలు కూడా పౌరులే. స్త్రీలు గౌరవంగా బ్రతకడం, ఎవరూ దూషించకుండా, అవమానించకుండా ఉండడం, స్త్రీలు చేసే పనిని గౌరవించడమే కాకుండా వారికున్న హక్కులను అనుభవించేటట్లు పరిస్థితులు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత.

ప్రారంభంలో చిన్న చిన్న మాటలతో అవమానించి, చులకన చేసి మాట్లాడి చివరకు శారీరక, మానసిక క్షోభకు గురిచేసి జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు.

గృహహింస మొదట ప్రారంభం కుటుంబం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో మార్పు రావాలి. మానవత్వం వెల్లివిరియాలి. కుటుంబ సభ్యుల్లో మార్పు రానప్పుడు, గృహహింస అనేక రూపాల్లో బయట పడుతున్నప్పుడు, మహిళలు పోలీస్ అధికారికి గాని, జుడీషియల్ అధికారికిగాని, ఫస్ట్ క్లాస్/మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు స్వయంగాగాని, ఫోన్ ద్వారాగాని, ఇ-మెయిల్ ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, జరుగుతుందని తెలిసినప్పుడు పై అధికారులకు తెలియచేస్తూ ఆపగలరు. నిరోధించగలరు. సహాయపడగలరు.

AP Board 9th Class Social Solutions Chapter 22 మహిళా రక్షణ చట్టాలు

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పేదవారికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. మీకు సమీపంలో ఉన్న వకీలు/ప్లీడరును సంప్రదించి సమాచారం సేకరించండి.
జవాబు:
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. ఏ పౌరుడు కూడా ఆర్థిక కారణాల మూలంగా, ఇతర బలహీనతల కారణంగా న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం’ అందిస్తుంది. ఇందులకై కేంద్రప్రభుత్వం 1976వ సం||లో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 39(ఎ) జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ సహాయాన్ని అందించేలా చేయడానికి లోక్ అదాలత్ లను ఏర్పరచింది.

న్యాయ సహాయం పొందడానికి అర్హులు :

  1. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  2. మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు, అవిటివారు.
  3. ప్రకృతి వైపరీత్యాల బాధితులు, వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు.

రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం కలవారు.

దరఖాస్తు చేసే విధానం :
జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయసేవా అధికార సంస్థకు సహాయం కొరకు దరఖాస్తు చేస్తే సహాయం అందించబడుతుంది.

న్యాయ సహాయ విధానాలు :

  1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట.
  2. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించడం.
  3. కేసులకు పరిశీలించిన మీదట, అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టడం.
  4. న్యాయ సహాయం పొందినవారికి ఆయా కేసులలో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడం, మొదలగు సహాయాలు అందించబడతాయి.