SCERT AP 9th Class Social Studies Guide Pdf 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పారిశ్రామిక కార్మికుల జీవితాలకు సంబంధించి కింద ఉన్న వాక్యాలలో సరైనవి ఏవి ? సరికాని వాటిని సరిచేయండి. (AS1)
ఎ) కార్మికులు పరిశ్రమలను నియంత్రించేవాళ్ళు.
జవాబు:
కార్మికులు ఏ మాత్రం దయ, కనికరం, సానుభూతిలేని యజమానుల నియంత్రణలో పనిచేశారు.

బి) కార్మికుల జీవన పరిస్థితులు సౌకర్యంగా ఉండేవి.
జవాబు:
పారిశ్రామికీకరణ వలన కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి.

సి) కార్మికుల అసంతృప్తికి తక్కువ వేతనాలు ఒక కారణం. (✓)
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

డి) పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనలకు ప్రాధాన్యత ఉండేది.
జవాబు:
పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనల కంటే హేతువు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.

ఇ) జానపద కథలు, జానపద పాటలలో ప్రకృతికి దగ్గరగా ఉన్న విలువలకు కాల్పనికవాద రచయితలు, కళాకారులు ప్రాధాన్యతనిచ్చారు.
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

ప్రశ్న 2.
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను కొన్నింటిని పేర్కొనండి. ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి. (AS1)
జవాబు:
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు :

 1. నూలు పరిశ్రమలలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు, పనిలేకుండాపోయింది.
 2. యంత్రాలతో పోటీపడలేని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదలుగా మారారు.
 3. కనీస వేతనాలు ఉండేవి కావు.
 4. అధిక పని గంటలు ఉండేవి.
 5. మహిళల, పిల్లల పనిభారం ఎక్కువగా ఉండేది.
 6. తమ హక్కుల కోసం పోరాడడానికి బలమైన కార్మిక సంఘాలు లేవు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.
 7. సానుభూతిలేని పర్యవేక్షకులు, యజమానుల నియంత్రణలో పనిచేయడం.
 8. భద్రత, గౌరవప్రద జీవనానికి అవకాశం లేదు.
 9. దారిద్ర్యం, దుర్భర జీవన పరిస్థితులు.
 10. నివసించే ప్రాంతాలు అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

ఈ రోజుల్లో :

 1. అంత దుర్భర జీవన పరిస్థితులు లేవు.
 2. కొన్ని ప్రాంతాలలో తక్కువ వేతనాలు లభిస్తున్నాయి.
 3. యజమానుల నిరంకుశత్వ, ఒంటెద్దు పోకడలు ఉన్నాయి.
 4. కార్మికుల కోర్కెలు తీర్చలేని యజమానులు లాకౌట్స్ పేరిట పరిశ్రమలను మూసివేస్తున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం (సోషలిజం)ల భావనలను పోలుస్తూ ఒక పేరా రాయండి.. అవి ఎంత వరకు సారూప్యాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి? (AS1)
(లేదా)
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం మధ్య పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి. అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్టు నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది. పెట్టుబడిదారీ విధానం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే పరిస్థితికి అనివార్యంగా, అన్యాయంగా, దోపిడీకి దారితీస్తుందన్నది సామ్యవాదం చేసే విమర్శ. ‘వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాలలో సమానత్వం అన్నది పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి. సోషలిస్టుల * ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, ఏ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

పోలికలలో ప్రధానంగా పెట్టుబడిదారీ విధానంలోని సామ్యవాదంలోను ఉత్పత్తి సాధనాలు ఉండాలి.
1. వస్తూత్పత్తికి పెట్టుబడి రెండింటికి అనివార్యం.
2. నాణ్యమైన వస్తూత్పత్తికి ప్రాధాన్యం. యుగాలు

పెట్టుబడిదారీ విధానం సామ్యవాదం
1. పారిశ్రామికులు, వ్యాపారస్తులు, తమ సంపద ద్వారా యంత్రాలను, ముడి సరుకులను కొనుగోలు చేసి, కార్మికుల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మటమే పెట్టుబడిదారీ విధానం. 1. ప్రకృతి వనరులు, ఆస్తులు, వ్యక్తుల కింద వారి నియంత్రణ లో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనేది సామ్యవాదం.
2. ఉత్పత్తి చేసిన వస్తువులను వాడకం కొరకు కాక, లాభాల కొరకై వినియోగిస్తారు. 2. పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల అధీనంలో ఉంటాయి. 3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు ప్రభుత్వ అధీనంలో ఉండును.
4. ధనిక, బీద అను రెండు వర్గాలు కన్పించును. 4. ఆర్థిక అసమానతల నివారణకు తోడ్పడును.
5. కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకం. 5. కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు.
6. సప్లై మరియు డిమాండ్లు ధరను నిర్ణయిస్తాయి. 6. ధరలను ప్రభుత్వం స్వయంగా నిర్ణయిస్తుంది.
7. మార్కెట్ ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. 7. మార్కెట్ ను చట్టాల ద్వారా ప్రభుత్వం నియంత్రిస్తుంది.
8. వచ్చే లాభాలు వ్యక్తిగత సంపదను పెంచుతాయి. 8. వచ్చే లాభాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 4.
సమానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు అనుసరించిన విధానాలలో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
మానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు :

అనుసరించిన విధానాలలో పోలికలు :

 1. నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల జీవనోపాధిని కోల్పోవటానికి కారణంగా భావించిన మరమగ్గాలపై దాడి చేసి నాశనం చేశారు.
 2. ఆహారం కొరకు ఉద్యమాలు.
 3. గడ్డి నుంచి గింజను వేరు చేసే నూర్పిడి యంత్రాల వల్ల తమకు పనిలేకుండా పోతుందని భయపడిన కార్మికులు అల్లర్లకు దిగారు.
 4. కనీస వేతనం కొరకు మహిళల, పిల్లల భారం తగ్గించటం, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం, తమ హక్కుల కోసం పోరాడటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడటం కోసం అనుసరించిన విధానాలలో పోలికలు ఉన్నాయి.

తేడాలు

మహిళలు కార్మికులు
1. ఓటు హక్కు కొరకు, ఆస్తి హక్కు కొరకు ఉద్యమాలు 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల సాధన కొరకు
2. పురుషుల ఆధిపత్యం నుండి విముక్తి కొరకు 2. దోపిడీ నుండి మెరుగైన వేతనాల కొరకు
3. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం కొరకు 3. యజమానుల యంత్రాలు, సరుకు నిల్వలపై దాడి చేయటం ద్వారా
4. విద్య, వైద్య, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయటం, బలవంతంగా విధవను చేయడం వంటి వాటి విముక్తి కొరకు 4. అణచివేత నుండి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో విముక్తి కొరకు

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 5.
కార్మికులు, మహిళల నేపథ్యంలో “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అన్న భావనలను తెలియచేయటానికి ఒక గోడ పత్రిక తయారుచేయండి. ఈ హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలను గుర్తించండి. (AS5)
జవాబు:

 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచానికి అందించబడిన అమూల్యమైన ఆదర్శా లు.
 2. అయితే ఈ భావనలు కార్మికులకు, మహిళలకు సమాన వేతనం.
 3. సమాన అవకాశాలు, అవకాశాలలో సమానత్వం ముఖ్యమైనవి.
 4. తమ కోర్కెలు చట్టబద్ధంగా తెలియజేయటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు.
 5. కుల, మతాలకు, పేద, ధనిక తారతమ్యం లేకుండా వివక్షత లేకుండా విద్య, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కల్పించుట.
 6. స్త్రీ, కార్మికులకు సమాన ఓటు హక్కు కల్పించుట.
 7. సమాన పనికి సమాన వేతనం.
 8. కార్మికులకు, మహిళలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించుట.
 9. పార్లమెంటరీ, శాసనసభల, ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు.

హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలు :

 1. మహిళలకు ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు.
 2. ఉద్యోగ భద్రత లేదు. మహిళలు, పిల్లలు పట్ల కారుణ్యం లేదు.
 3. ఆర్థిక అసమానతలు.
 4. ఎటువంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ సమానులని గుర్తించక పోవడం.
 5. కార్మికులు తమ హక్కుల కొరకు, సంక్షేమం కొరకు చేసిన ఉద్యమాల కాలంలో జీతాలు నిలిపివేత, కంపెనీ లాకౌట్ ప్రకటన.

ప్రశ్న 6.
సామాజిక నిరసన ఉద్యమాలు జరిగిన దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఇటలీ
5. భారత్
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1

ప్రశ్న 7.
పేజీ నెం. 202లోని చివరి రెండు పేరాలు చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
రోజు రోజుకు పురుష ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను దూరం చేయడానికిగాను మహిళల్లో చైతన్యం వచ్చింది. వివిధ రచయిత్రులు, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, మహిళా ఉద్యమంలో భాగంగా వారిలో చైతన్యం ఉప్పొంగి, రాజకీయ, సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం వంటి అన్ని రంగాలలో వివక్షతకు చరమగీతం పాడారు.

భారతదేశంలో సంఘసంస్కర్తలు నడిపించిన ఉద్యమాలు, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం, బలవంతంగా విధవను చేయటం వంటి దురాచారాలను దూరం చేయ్యటానికి, విద్యయే కారణమని మహిళలు గ్రహించారు.

భారతదేశంలో గాంధీజీ వంటి నాయకులు మహిళా ప్రాధాన్యత గుర్తించి ఉద్యమంలో మహిళల పాత్రను నొక్కి చెప్పారు. కనుకనే స్వాతంత్ర్యం అనంతరం మహిళల కొరకు హక్కులు, చట్టాలు పొందుపరిచి సముచిత స్థానం కల్పించారు.

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.198

ప్రశ్న 1.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు నిరసన ఉద్యమాలకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, జాతీయ రాజ్యాల ఆవిర్భావంతో చేతివృత్తులు, వ్యవసాయం అడుగంటి, ఉద్యోగ భద్రత దూరమై, కార్మికులు, మహిళలు, చిన్న రైతులు, శ్రామికులలో అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు సాగి ఉద్యమాలు చెలరేగాయి.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాల ఆవశ్యకతను గుర్తించిన వీరు వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాల సమానత్వం, వివక్షత లేకుండా హక్కులు పొందడానికి, ఓటు హక్కు వంటి హక్కులు సాధించుకోవడానికి, కార్మిక సంఘాలు, సమావేశాలు, చర్చలు, ఉద్యోగ భద్రత కొరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తినిచ్చాయి.

ప్రశ్న 2.
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలను ప్రజలు సాధించారా?
జవాబు:
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలు ప్రజలు సాధించారని చెప్పవచ్చు. కాని కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆశయాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు పరిశ్రమలలో, వివిధ వ్యవసాయ పనులలో లభించడం లేదు. చాలా పట్టణాలు, గ్రామాలలో కులవివక్ష, మతవివక్ష కనబడుతూ, ఆడపిల్లల విషయంలో విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విషయంలో వివక్షత కనిపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ భావనలతో స్ఫూర్తిని పొందిన సామాజిక ఉద్యమాలు మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా?
జవాబు:
మా ప్రాంతంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలను ఆశయంగా తీసుకొని, ఇటీవల మహిళలు, ఆడపిల్లల యెడల జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, మానభంగాలు, వారికి ఎదురౌతున్న సహోద్యోగుల వేధింపులు, రక్షణకై ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. బాలురుతో పాటు బాలికకు కూడా సమాన ప్రాధాన్యత కొరకు విద్య, ఇంటిలో లభించని స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకై తల్లిదండ్రులలో చైతన్యానికి కార్యక్రమాలు చేపడుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
“మొక్కజొన్న చట్టాలు” తొలగించాలని కార్మికులు ఎందుకు కోరారు? భూస్వాములు వాటిని ఎందుకు సమర్థించారు?
జవాబు:
ఫ్రాన్స్ తో ఇంగ్లాండు యుద్దాలు వల్ల వాణిజ్యం దెబ్బతింది. కర్మాగారాలు మూసివేశారు. సగటు వేతనాల స్థాయికి అందనంతగా రొట్టె ధరలు పెరిగాయి. పేద ప్రజల ఆహారంలో రొట్టె (మొక్కజొన్న రొట్టె) ముఖ్యమైనది. దాని ధర వాళ్ళ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. రొట్టెల నిల్వలను జప్తు చేసి లాభాల కోసం అధిక ధరలకు అమ్మేవారు.

బ్రిటన్లో ధరలు ఒక మేరకు పెరిగే వరకు చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించే “మొక్కజొన్న చట్టాలకు” భూస్వాములు సమర్థించారు.

ప్రశ్న 5.
మన దేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయా?
జవాబు:
మనదేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరంతరం కరవు కాటకాలు, సరియైన ఉత్పత్తి లేకపోవడం వల్ల దిగుమతులు పేద ప్రజలకు మేలు చేస్తాయి.

9th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
యంత్రాలను పగలగొట్టడం కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చింది?
జవాబు:
నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. ఉపాధి కోల్పోయి, పేదలుగా మారారు. తమ ఈ దుర్భరస్థితికి యంత్రాలే కారణమని యంత్రాలను కార్మికులు తగలబెట్టారు.

 1. దీని ద్వారా అనేక సందర్భాలలో కర్మాగార యజమానులు కార్మికులతో సంప్రదింపులకు సిద్ధపడి మెరుగైన పని పరిస్థితులు కల్పించడానికి అంగీకరించారు.
 2. వీరికి సామాజిక మద్దతు లభించింది.
 3. సామ్యవాద భావాలు మరింత బలపడడానికి కారణమయ్యాయి.

ప్రశ్న 7.
యంత్రాలు పగలగొట్టిన వాళ్ళకు మరణశిక్ష విధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఇది సరైనదేనా?
జవాబు:
ఉపాధి కోల్పోయి, పేదరికం పెరిగి, ఆకలితో అలమటించిన వారు ఏ ఆందోళనకైనా, ఏ ప్రతీకార చర్యలకైనా దిగవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆ చర్యలకు గల కారణాలు తెలుసుకొని వారికి పునరావాసం కల్పించాలే గాని, మరణశిక్ష విధిస్తూ విచక్షణారహితంగా చంపడం సరైన చర్య కాదు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 8.
కర్మాగారంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినపుడు సాధారణంగా కొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూనే కార్మికులలో నిరుద్యోగం పెంచకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
కర్మాగారాలలో కొత్త యంత్రాల వలన కొంతమంది ఉపాధి కోల్పోతారు. ఎందుకంటే 50 మంది కార్మికులు ఒక రోజులో చేయవలసిన పని ఒక యంత్రం 3 గంటలలో చేస్తుంది. అదేవిధంగా యంత్రాల ద్వారా నాణ్యత, నమ్మకం ప్రజలలో ఉంటుంది. కార్మికుల నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన అనుకున్న లాభాలు అందకపోవచ్చు. దానివలన యజమానులు మనుషుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతున్నారు.

కాని యంత్రాల సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేస్తున్న కార్మికులను తొలగించకూడదు. యంత్రాలపై పర్యవేక్షణకు, ఉత్పత్తులకు, మార్కెట్ కల్పించడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మార్కెట్ సిబ్బందిని నియమించడానికి గాను కొంతమంది నిరుద్యోగులకు పని కల్పించవచ్చు.

9th Class Social Textbook Page No.202

ప్రశ్న 9.
మార్క్స్ ప్రతిపాదించిన సామ్యవాదం లుద్దిజంతో ఏ విధంగా విభేదించింది?
జవాబు:
లుద్దిజం కార్మికులను విప్లవవాదులుగా మార్చి హింసా, దౌర్జన్య, ఆస్తుల అంతానికి పూనుకుంది. రహస్య విప్లవవాద సంస్థలు ఏర్పడడానికి అవకాశం కల్పించింది. కనీస వేతనం, పనిభారం తగ్గించటం మొదలగు వాటికి అందజం ప్రాధాన్యతనీయగా, సామ్యవాదం దానితో విభేదించింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న ప్రతిదీ సామాజిక ఉత్పత్తి అవుతుంది. వస్తు ఉత్పత్తిలో భాగస్వాములైన అందరికీ ‘వాటా ఉంటుంది. ఉత్పత్తి సమాజానికి సంబంధించినది అయి ఉంటుంది. తాత్కాలిక హక్కులు, హింసా ప్రవృత్తిపై మార్క్స్ విభేదించారు. మెరుగైన వేతనాల కోసమే కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేయాలన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పని చేయాలన్నారు.

ప్రశ్న 10.
కర్మాగార ఉత్పత్తి మెరుగైనది, కోరుకోదగినది అని మార్క్స్ ఎందుకు భావించాడు?
జవాబు:
కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తిలేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకమని మార్క్స్ వాదించెను. కర్మాగారాలను, వనరులన్నింటిని కార్మికులు చేజిక్కించుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటిని నడపటం మొదలు పెడితే కొత్త, సమసమాజానికి మార్గం అవుతుంది. ఉత్పత్తి అన్నది ఒక కుటుంబం, ఒక చిన్న క్షేత్రం లేదా ఒక గ్రామానికి సంబంధించింది కాకుండా మొత్తం సమాజానికి సంబంధించినదిగా అవుతుంది.

ప్రశ్న 11.
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య తేడా కన్పిస్తుంది.

ముందు కాలం నాటి సామ్యవాదులు ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలని వాదించలేదు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తులను వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని చెప్పారు. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

మార్క్స్ దృష్టిలో సామ్యవాదం అంటే ప్రపంచం పారిశ్రామికంగా మారి, అందరి ఉత్పాదక శక్తులను వెలికితీసి కొరత అనేది లేకుండా చేయటం వల్ల ప్రగతిశీలమైనది అన్నారు. కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. కర్మాగారాలు, భూములు, ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారని మార్క్స్ చెప్పెను.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయా? ఆ ఉద్యమాల నాయకులతో ముఖాముఖి నిర్వహించి, నివేదిక తయారుచేయండి. దానిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
మా చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయి.

సామాజిక నిరసన ఉద్యమాలలో భాగంగా ఇటీవల కాలంలో మా ప్రాంతంలో మహిళలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు.

మా ఊరిలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని పద్మక్క నాయకత్వంలోని మహిళలు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్కతో ముఖాముఖి :
నేను – అక్కా ! మన ఊరిలో మద్యపానాన్ని నిషేధించాలని ఎందుకు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్క – మద్యపానం వలన చాలా కుటుంబాలు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నష్టపోవడం జరుగుతుంది.

నేను – అక్కా ! మద్యపానాన్ని సేవించడం వలన ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఎలా నష్టపోవడం జరుగుతుంది?

పద్మక్క – మద్యపానం సేవించడం వలన ఆరోగ్యపరంగా అనేక వ్యాధులకు గురికావలసి ఉంటుంది. ఊపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి.

నేను – అక్కా ! ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా ! మద్యపానాన్ని సేవించడం వలన.

పద్మక్క – ఉన్నాయి. పేద, మధ్యతరగతి పౌరులు తాను సంపాదించిన రోజు వారి వేతనంలో 3 వంతులు తాగడానికి ఉపయోగిస్తే మిగిలిన ఒక వంతు ఆ కుటుంబ జీవనానికి చాలక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వారి వద్ద ధనం లేక ఎవరిని అడిగిన త్రాగుబోతు వానికి ‘అప్పు ఎలా ఇస్తారని, ఒకవేళ ఇచ్చిన మరల మాకు తిరిగి ఎలా ఇవ్వగల్గుతారని ఎవరు ఇవ్వరు. అలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

అందువలన మద్యపానాన్ని సేవించవద్దు. తాగేవారిని ప్రోత్సహించవద్దు.

పట నైపుణ్యాలు

1. పెట్టుబడిదారీ విధానం – పిరమిడ్
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 2