SCERT AP 9th Class Social Studies Guide Pdf 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
కింద పేర్కొన్న వాక్యాలు ఏ దేశానికి సంబంధించినవో గుర్తించండి. (బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్) (AS1)
జవాబు:
- విప్లవం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ నెలకొల్పబడింది. – బ్రిటన్
- విప్లవం తరువాత కూడా రాజుకి పాలనలో కొంత పాత్ర ఉన్న దేశం – ఫ్రాన్స్
- ప్రజాస్వామ్యాన్ని స్థాపించటానికి మరొక దేశంతో యుద్ధం చేయవలసి వచ్చిన దేశం – అమెరికా
- హక్కుల చట్టాన్ని ఆమోదించారు. – అమెరికా
- రాచరికాన్ని కూలదోయటానికి రైతాంగం నాయకత్వం వహించింది. – ఫ్రాన్స్
- మానవ పౌరహక్కుల ప్రకటనను ఆమోదించారు. – ఫ్రాన్స్
ప్రశ్న 2.
కొత్త రూపాలలో ప్రభుత్వాలు ఏర్పడటం వెనుక సామాజిక మేధావుల ప్రధాన ఆలోచనలు ఏమిటి? అవి ప్రజాదరణను ఎలా పొందాయి? (AS1)
జవాబు:
అధిక పన్నులు, నిరంకుశ పాలనలతో ప్రజలు విసిగిపోయారు. ఆహార పదార్థాల కొరత, నిరంతరం కరవుకాటకాలు, సమాజంలో కొందరికే అధికారం, వారికే పాలనా బాధ్యతలు, అత్యున్నత అధికారం రాచవర్గీయులకు చెందడం, వారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకపోవడం, ఓటు హక్కు కల్పించకుండా చూడడం, చర్చి, మతాధికారులు, కులీనులు, ఆధ్వర్యంలో భూములు కేటాయించబడి ఉండడం, సమాజంలో 3 వ వర్గంగా లేదా మూడవ ఎస్టేట్ లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు, ఉపాధ్యాయులు, న్యాయస్థాన అధికారులు, కళాకారులు, రచయితలు ఆలోచించి, సామాజిక హోదా గలవారే దేశాన్ని మార్చగలరని, దేశాన్ని నడిపించగలరని తలంచారు. 90 శాతం ప్రజలు రైతాంగం మరియు సామాజిక మేథావి వర్గానికి చెందినవారు, వెనుకబడినవారు మరియు మహిళలున్నారు. వీరు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలరని, ప్రజల అవసరాలు, సంక్షేమం చూడగలరని ఆలోచించారు.
ప్రజలు కూడా రాజ్యా ధికారాలతో స్వేచ్ఛా, సమానత్వాలు, తగిన అవకాశాలు లేక పోవడం వల్ల సామాజిక మేధావుల ఆలోచనలతో వస్తున్న ప్రజా ప్రభుత్వాలు, పన్నులు లేని ప్రభుత్వాలు, సంక్షేమం చూసే నూతన అధికారం చూసి ఆనందించారు. ఆ విధంగా ప్రజాదరణ పొందింది.
ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటులకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
1774లో ఫ్రాన్సు XVI లూయీ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఖజానా ఖాళీగా ఉంది. నిరంతర యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక వనరులు తగ్గాయి. విద్య, సైన్యం, న్యాయవ్యవస్థ ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకొని అధిక పన్నులు విధించారు. ఫ్రాన్స్ లో మూడు ఎస్టేట్లు ఉండగా, మొదటి ఎస్టేట్ సభ్యులకు పన్ను విధించకుండా 90% ప్రాతినిధ్యం గల మూడవ ఎస్టేట్ పై పన్నులు విధించారు. రైతాంగం జీవనం దుర్భరంగా ఉండేది. వాళ్ళు ప్రభువుల పొలాల్లో, ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేది. ఆహార కొరత వల్ల చాలామంది చనిపోయారు. దీనికి తోడు రూసో, జాక్వెస్, మాంటెస్క్యూ రచనలు ద్వారా సామాజిక చైతన్యం కల్గించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు, పుస్తకాలు ప్రజలను మేల్కొలిపాయి. దీనికితోడు ఎస్టేట్స్ జనరల్ సమావేశంలో 3 వ ఎస్టేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించకపోవడం తదితర కారణాలతో ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటుకు కారణమైంది.
ప్రశ్న 4.
విప్లవం వల్ల ఫ్రెంచి సమాజంలో ఏ వర్గాలు ప్రయోజనం పొందాయి? ఏ బృందాలు. అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది? విప్లవానంతర పరిణామాల వల్ల ఏ సామాజిక వర్గాలు నిరాశకు గురై ఉంటాయి? (AS1)
జవాబు:
ఫ్రెంచి విప్లవం వల్ల సమాజంలో చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, రైతాంగం, చేతివృత్తుల కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు వీరు కాకుండా 18 వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించారు. విదేశీ సముద్ర వాణిజ్యం, సముద్ర వ్యాపారం, పట్టు, ఉన్ని వ్యాపారస్తులు మొదలగువారు, మహిళలు ప్రయోజనం పొందారు. మొదటి, రెండవ ఎస్టేట్ సభ్యులు మతాధిపతులు, కులీన వర్గంవారు అధికారాన్ని వదులుకున్నారు. విప్లవానంతర పరిణామం వల్ల మతగురువులు, చర్చి నిర్వాహకులు, రాజవంశీయులు, వంశపారంపర్య రాజులు, మతాధిపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంపన్న వర్గాలకు చెందినవారు, విలాసవంతమైన జీవితాలు కొనసాగించినవారు.
ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల అధ్యాయం పూర్తి చేసిన తరువాత, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఏ ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయో జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక రాజకీయ ఉద్యమాలకు, ఆదర్శాలకు, ప్రాథమిక హక్కులకు ఫ్రెంచి విప్లవ కాలంలో గల హక్కులు అనుసరణీయమైనాయి. వాటిలో ప్రధానంగా
- సమానత్వం హక్కు
- స్వేచ్ఛా, స్వాతంత్ర్యం హక్కు
- సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలు
- చట్టం ప్రజల అభీష్టాన్ని నెరవేర్చేదని, దానిముందు పౌరులందరు సమానమనే విధానం. అదే మన దేశంలో గల సమ న్యాయపాలన.
- వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు.
- మానవులు స్వేచ్ఛాజీవులు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మొదలగు ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయి.
ప్రశ్న 6.
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి. (AS4)
జవాబు:
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉంది. పరిపాలనా వ్యవస్థ ఖర్చులకి, ప్రజా సైన్యం నిర్వహించడానికి, పన్నులు విధించడం తప్పనిసరి చేయడం. ఆస్తుల నిష్పత్తిలో పౌరులందరకు వర్తింపజేయడం వైరుధ్యాలకు తావిస్తుంది. ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదని, అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలనే దానికి వ్యతిరేకిస్తాను.
ప్రశ్న 7.
‘ప్రాతినిధ్యం లేకుండా పన్నులు లేవు’ అన్న నినాదాన్ని అమెరికా వలస రాష్ట్రాలు లేవనెత్తటానికి కారణాలు ఏమిటి? (AS1)
(లేదా)
“ప్రాతినిధ్యం లేనిదే పన్నులు లేవు” అనే నినాదాన్ని మీరు ఎలా అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం’ లేకుండా పన్ను చెల్లింపులేదు”.
ఇంగ్లాండ్ దేశం ఉత్తర అమెరికా తూర్పు తీరంలో 13 వలస రాష్ట్రాలను ఏర్పరిచింది. ఇంగ్లాండ్ నుంచి వ్యవసాయం, చిన్న కర్మాగారాలు, వ్యాపారం కోసం ఇంగ్లాండు నుంచి అధికులు వచ్చి వలస
రాష్ట్రాలలో లాభాలు ఆర్జించి స్థిరపడ్డారు. వలస రాష్ట్రాలకు సైతం చట్టాలు చేసే అధికారం, ప్రజలను నియంత్రించే అధికారం ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ తీసుకుంది. కాని అక్కడి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళు కాదు. వలస రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంగ్లీషు వ్యాపారస్థులు, కర్మాగారాలకు లాభం కలిగించే చట్టాలను పార్లమెంట్ తరుచు చేస్తుండేది. దాంతో విసిగిపోయిన అమెరికా వలస ప్రాంతాలు “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు” అన్న నినాదాన్ని లేవదీశారు.
ప్రశ్న 8.
మధ్య తరగతి అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు? అది యూరప్ లో ఎలా ఏర్పడింది? (AS1)
(లేదా)
“18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు” – యూరప్లో మధ్యతరగతి ఆవిర్భావం గూర్చి వివరించండి.
జవాబు:
యూరప్లో 13 వ శతాబ్దం ప్రారంభంలో మధ్య తరగతి అంటే ప్రజలు సొంతనిర్ణయాలు తీసుకోక, స్వయంగా ఆలోచించక, మతగురువులు, చర్చి ఆధిపత్యంలో జీవనం సాగించేవారు. అత్యధిక రైతాంగం కట్టుబానిసలుగా జీవనం సాగించేవారు. యజమానుల ఆధీనంలో బందీగా వాళ్ళ పొలాల్లో, కర్మాగారాల్లో పనిచేయవలసి వచ్చేది. కాని 18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. రాను రాను విదేశీ సముద్ర వాణిజ్యం, ఉన్ని, పట్టువస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వాళ్ళు సంపన్నులయ్యారు. వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులే కాకుండా మూడవ ఎస్టేట్లో న్యాయవాదులు, పాలన యంత్రాంగ అధికారులు, వృత్తినిపుణులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ విద్యావంతులు.
ప్రశ్న 9.
యూరప్ పటంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్, ప్రష్యా, స్పెయిన్, ఆస్ట్రియాలను గుర్తించండి. (AS5)
జవాబు:
ప్రశ్న 10.
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు నిర్వహించిన పాత్రను ఎలా అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు ప్రధాన పాత్రను పోషించారు. ఫ్రెంచి సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా వత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. పురుషులకు ఉన్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. తమను ప్రేక్షక పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని మహిళల పోరాటాలు ఫ్రెంచి విప్లవానికి నాంది అయింది.
ప్రశ్న 11.
పేజి నెం. 168లోని “భీతావహ పాలన” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి, దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మతగురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా వివిచారణలో నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి, ప్రభు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు. చర్చిలను – “సివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వం కార్యాలయాలకు ఇచ్చారు. రాబిస్పియర్‌ను 1794 జులైలో దోషిగా తేల్చి, మరునాడే గిల్లెటిన్ ద్వారా చంపేశారు.
9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers
9th Class Social Textbook Page No.161
ప్రశ్న 1.
మన. నేపథ్యంలో రాజుల పార్టీ, పార్లమెంటరీ పార్టీల వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
సంభాషణ
రాజుల పార్టీ : ఈ దేశాన్ని , ఈ సామ్రాజ్యాన్ని కాపాడేది, రక్షించేది మేమే. మేము లేకపోతే ఈ ప్రపంచ మనుగడే లేదు తెలుసా?
పార్లమెంటరీ పార్టీ : ప్రజల కోరికలను నెరవేర్చేది, ప్రజాభీష్టం మేరకు పాలన చేసేది మేమే. మేము ప్రజలను, కన్నబిడ్డలవలే పాలిస్తాము.
రాజుల పార్టీ : మా పార్టీ దేవుని కృషితో, సృష్టిలో భాగం. మేము దైవాంశ సంభూతులం. మేము దేవునికి మారుగా పరిపాలన చేస్తున్నాం.
పార్లమెంటరీ పార్టీ : ప్రజలకు మాట్లాడే హక్కులు ఇచ్చాము. . స్వేచ్ఛగా బ్రతికే హక్కులు అందించాము. నచ్చిన మతాన్ని స్వీకరించామని చెప్పాము. అందరికీ అన్ని సౌకర్యాలు అందించాము.
రాజుల పార్టీ : ఈ విశాల సామ్రాజ్యంలో హాయిగా బ్రతుకుతున్నాం. ఏ బాధలు వచ్చినా రమ్మన్నాం. మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటామన్నాం.
పార్లమెంటరీ పార్టీ : ప్రజాస్వామ్యంలో మేమే మీకు అధిక అధికారాలు మేమిచ్చాము. కులమతాలు లేవన్నాము. చట్టం ముందు అందరూ సమానులే నన్నాం. మీ క్షేమమే మా భాగ్యం. మీ” సేవే ఆ దేవుని సేవ.
ప్రశ్న 2.
పౌరయుద్ధం వల్ల ఇంగ్లాండు ప్రజలపై, రాజుపై ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
పౌరయుద్ధం అంటే ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధం. పౌరయుద్ధం వల్ల పరిపాలన కుంటుపడింది. అధిక పన్నుల భారం మోయవలసి వచ్చింది. ప్రజల క్షేమ సమాచారం, సంక్షేమం మరచిపోవడం వల్ల తరుచుగా అంతర్యుద్ధం వల్ల ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆకలితో, రోగాలు, జబ్బులతో ఆహార సమస్యలతో అనేకులు మరణించారు. . పౌర యుద్ధం వల్ల రాజులు తమ ఉనికినే కోల్పోయే దుస్థితి దాపురించింది. పదవులు కోల్పోయి, అధికారం దూరం అయి, బలవంతపు చావులు దాపురించాయి. విలాసవంతమైన జీవనం కాకుండా ప్రజల ఆగ్రహానికి బలై కోరి చావులు తెచ్చుకున్నారు.
9th Class Social Textbook Page No.163
ప్రశ్న 3.
కింద ఉన్న పటంలోని ఖాళీ డబ్బాలను వీటినుంచి అనువైన పదంతో నింపండి :
ఆహారం కోసం అల్లర్లు, మరణాల సంఖ్య పెరగటం, పెరుగుతున్న ఆహార ధరలు, చిక్కిన శరీరాలు, సామాజిక అశాంతి.
జవాబు:
9th Class Social Textbook Page No.168
ప్రశ్న 4.
(165 పేజీలోని చార్టుని చూడండి) 1791 రాజ్యాంగంలో ఫ్రెంచ్ సమాజంలో ఏ వర్గ ప్రజలు లాభపడి ఉంటారు? ఏ వర్గాలు అసంతృప్తి చెందడానికి అవకాశముంది?
జవాబు:
ఫ్రెంచి సమాజంలో లాభపడిన వర్గం ఓటు హక్కు కలిగిన సుమారు 50,000 మంది వీరి ద్వారా జాతీయ శాసనసభకు 745 మంది ఎన్నికై ఫ్రెంచ్ సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. రాజు, మంత్రులపై వీరికి నియంత్రణ ఉంటుంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గం లాభపడింది. ఈ అదే విధంగా ఓటు హక్కు లేనివారు, అధికంగా పన్నులు చెల్లించలేనివారు, 25 సం||లు నిండని పౌరులు బాధపడ్డారు. దీని ద్వారా తక్కువ జనాభాగల ప్రాంతంలోని వారు ఎక్కువ లాభాన్ని పొందారు. అదే విధంగా ఎక్కువ జనాభా గలదే అయినా ఓటు లేకపోవడం వలన వారు చాలా నష్టపోయారు.
ప్రశ్న 5.
ఫ్రాన్స్ లోని ఘటనల ప్రభావం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగర్తీ లేదా స్పెయిన్ వంటి పక్క దేశాలపై ఎలా ఉండి ఉంటుంది? ఫ్రాన్స్ లో జరుగుతున్న దానికి సంబంధించి వస్తున్న వార్తలకు ఆయాదేశాలలోని రాజులు, వ్యాపారస్తులు, రైతాంగం, కులీన వర్గాలు, మతనాయకుల స్పందన ఎలా ఉండి ఉంటుంది?
జవాబు:
ఫ్రాన్స్ లోని ఘటనలు, విప్లవ ప్రభావం, దాని నేపథ్యం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగేరి, లేదా స్పెయిన్ వంటి ప్రక్కదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. కులీన పాలనలతో, నిరంకుశ అధికారాలతో, మతాధికారుల నియంత్రణ గల రాచరిక రాజ్యాలు ఆందోళనలకు గురయ్యాయి. ప్రజాభీష్టం మేరకు, ప్రజల సంక్షేమ అవసరాల మేరకు, పరిపాలన జరగకపోతే ప్రజల ఆగ్రహానికి గురైతే రాజ్యాలు, పదవులు పోవడమే కాకుండా, ప్రజల చేతిలో మరణాలు సంభవించడం భయాందోళనలకు గురయ్యారు. రాజులు, కులీన వర్గాల మతనాయకుడు భయపడి తమ విధానంలో మార్పు అవసరం అని భావించగా, రైతాంగం, వ్యాపారస్థులు మాత్రం రాజులు, పరిపాలకులలో మార్పు తేవడానికి ఉద్యమాలు, విప్లవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావించారు.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు సేకరించండి. వాళ్ళలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు, ఎందుకు? ఆ వ్యక్తిపై ఒక పేరా రాయండి.
జవాబు:
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో ప్రధానమైన వాళ్ళలో 13 వలస రాష్ట్రాలలో బ్రిటన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 1776 జూలై 4 న ఫిలడెల్ఫియాలో జరిగిన మూడవ కాంగ్రెస్ సమావేశంలో థామస్ జెఫర్సన్ రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించారు. “మానవులందరూ సమానులుగా సృష్టింపబడ్డారని” సృష్టికర్త ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే హక్కులు వంటి కొన్ని హక్కులను ఇచ్చాడని పేర్కొంది. అమెరికా ప్రజలలో చైతన్యం నింపిన వారిలో థామస్ జెఫర్‌సన్ ఒకరు.
అదేవిధంగా ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి అవినీతి, విలాసకర ప్రభువులు, చర్చి, మతాధికారులు, కులీనులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, 90 శాతం గల రైతులు, చేతి వృత్తి కళాకారులు, కళాకారులు, మహిళలు, తత్వవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు.
వీళ్ళలో నాకు బాగా నచ్చినవారు రూసో. సమజంలో ఏ వ్యక్తి పుట్టుకతో సామాజిక హోదా, హక్కులు కలిగిలేరని, స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు అనేక సంకెళ్ళతో బ్రతుకుతున్నాడన్నారు. అందరికీ స్వాతంత్ర్యం, సమాన చట్టాలు, సమాన అవకాశాలు ఆధారంగా ఏర్పడిన సమాజం కోసం కలలుకన్నాడు. రూసో ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఆధారపడిన ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు.
రూసో అభిప్రాయాలు, ఆలోచనలు పుస్తకాలు, వార్తా పత్రికల ద్వారా ఫ్రెంచి విప్లవంలో చైతన్య స్ఫూర్తిని రగిలించింది.