SCERT AP 9th Class Social Studies Guide Pdf 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800
9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ఈ అధ్యాయంలో పునరుజ్జీవనంపై చర్చ ప్రధానంగా ……… (ఇంగ్లాండ్ / ఇటలీ / ఫ్రాన్స్/ జర్మనీ). (AS1)
జవాబు:
ఇటలీ.
ప్రశ్న 2.
పునరుజ్జీవన కాలంలో కింద పేర్కొన్న భావనలలో వచ్చిన మార్పుల గురించి ఒక పదం లేదా ఒక వాక్యంతో రాయండి. (AS1)
జవాబు:
అ. మానవతావాదులు : మరణాంతర జీవితం గురించి కాక ప్రపంచం గురించి ఆసక్తి చూపారు.
ఆ. పుస్తకాలు : 14 శ॥ నుంచి 17 శ॥ వరకు కొత్త మానవతా సంస్కృతి వికసించింది.
ఇ. చిత్రకళలు : చుట్టు ప్రక్కల ప్రకృతి నుంచి ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి చిత్రీకరించే వరకు.
ఈ. మానవులు : భౌతిక సంపద, అధికారం, కీర్తి నుంచి సత్ప్రవర్తన వరకు.
ఉ. మహిళలు : గృహసంరక్షణ ,నుంచి విద్య, ఆర్థికశక్తి, ఆస్తి సంపాదన వరకు.
ప్రశ్న 3.
బైబిలును ముద్రించడం ద్వారా దేవుడు, చర్చిపై భావనలు ఎలా ప్రభావితం అయ్యాయి? (AS1)
జవాబు:
బైబిలు ముద్రించడానికి పూర్వం చేతితో రాసిన బైబిలు ఉండేది. ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వశతాబ్దపు మహా విప్లవం. జర్మనీ దేశస్థుడు 1455లో జోహాన్స్ గుట్బెర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించాడు. కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకం వెంటనే వందలాది పాఠకులను చేరుకుంది. ఇటలీ మానవతావాద సంస్కృతి యూరప్లో వేగంగా వ్యాపించటానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులో ఉండటం ప్రధానకారణం.
ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని చర్చి శాసించిందని, చర్చికి అపార అధికారం, సంపద సమకూరి, అవినీతిమయం అయ్యిందని గ్రహించారు. విశ్వవిద్యాలయ పండితులు, చర్చి సభ్యులు కూడా మానవతా భావాలపట్ల ఆకర్షితులయ్యారు. సాధారణ మతానికి అనవసర ఆచారాలను తరువాత జోడించారని ఖండిస్తూ వాటిని త్యజించమని చెప్పారు. ఎక్కడో ఉన్న దేవుడు మనిషిని సృష్టించాడని, ‘ఇక్కడ’ ఇప్పుడు, ఆనందాన్వేషణలో జీవితాన్ని స్వేచ్ఛగా బతకమన్నాడని వాళ్ళు విశ్వసించారు.
ప్రశ్న 4.
మధ్యకాలంనాటి ఇటలీ నగరాలను ప్రస్తుత ఇటలీ నగరాలతో పోల్చండి. వాటి ప్రస్తుత పేర్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా? (AS1)
జవాబు:
బైజాంటైన్ సామ్రాజ్యం, ఇస్లామిక్ దేశాల మధ్య వాణిజ్యం విస్తరించటంతో ఇటలీ తీరం వెంట రేవు పట్టణాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా, పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగటంలో ఇటలీ నగరాలు కీలకపాత్ర పోషించాయి. ఈ నగరాలు తమను బలమైన సామ్రాజ్యంలో భాగంగా కాకుండా స్వతంత్ర పట్టణ దేశాలుగా చూడసాగాయి. వీటిల్లో “ఫ్లోరెన్స్” “వెనిస్”, గణతంత్రాలు కాగా, ఇంకా ఎన్నో యువరాజుల పాలనలోని నగరసభలుగా ఉండేవి. బాగా వర్ధిల్లిన నగరాలలో “వెనిస్” జెనోవాలు ముఖ్యమైనవి.
ఈ నగరాలలో మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు. బలమైన ప్యూడల్ భూస్వాములు కూడా ఇక్కడ లేరు. పట్టణ పరిపాలనలో ధనిక వ్యాపారులు, బ్యాంకర్లు చురుకుగా పాల్గొనేవారు. ఈ పట్టణాలను సైనిక నియంతలు పరిపాలించిన సమయంలో కూడా పట్టణ ప్రజలలో పౌరులమన్న భావన బలహీనపడలేదు.
ప్రస్తుత గ్రీకు నగరాలలో మానవతావాదం తాండవిస్తుంది. మరణాంతర జీవితం గురించేకాక, ఈ ప్రపంచం గురించి వాళ్ళు ఆసక్తి చూపారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞాన శాస్త్రం, కళలు వంటి వాటిని ముఖ్యమైనవిగా నేటి ఇటలీ నగరాలు భావించాయి.
ప్రశ్న 5.
14,15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో ఏ అంశాలను పునరుద్ధరించారు? (AS1)
జవాబు:
14, 15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో అనేక అంశాలు పునరుద్ధరించారు. గ్రీకు సాహిత్యం మానవ జీవితంలో ఆసక్తిని కలిగించింది. గ్రీకు, గ్రీకు రోమను సంస్కృతి, శిల్పాలు, చిత్రకళ, భవనాలు, సాహిత్యం , తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేవి. క్రైస్తవ మతాన్ని పాటించటానికి ప్రాధాన్యత నిచ్చిన రోమన్ కాథలిక్కు చర్చి ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని అది ఒత్తిడి చేసేది. పురాతన సాంస్కృతిక సంపద అంతా విస్మరింపబడి, కనుమరుగైపోయింది.
ఆ తరువాత పరిస్థితి మారింది. రైతాంగం, భూస్వాముల వర్గం చర్చి నియంత్రణను వ్యతిరేకించ సాగింది. భూస్వాముల, చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్చను అనుభవించసాగారు. చిత్రకళ, శిల్పం, ఇతర కళలు, సాహిత్యం వంటి వాటిల్లో కొత్త ధోరణులు బయలుదేరాయి. విజ్ఞానశాస్త్రం పునరుద్ధరించబడింది. రోమన్ సంస్కృతి అవశేషాలైన భవనాలు, శిల్పాలు వంటి వాటిని కళాకారులు అధ్యయనం చేయసాగారు. కళలు, శిల్పాలు, వృద్ధి చెంది సంస్కృతిని నిల్పాయి. మానవతా వాదంతో మనిషిలో సత్ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చారు.
ప్రశ్న 6.
మానవతావాద భావనలు ఇటలీలోని పట్టణాలను ముందుగా ఎందుకు ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత అనేక మంది గ్రీకు పండితులు తను సాహిత్యంతో ఇటలీకి పారిపోయారు. దీంతో పురాతన సాహిత్యం గ్రీకు భాషపట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. మానవతావాద భావనలు ముందుగా ఇటలీని పట్టణాలను ప్రభావితం చేశాయి. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవత వాదులు ముఖ్యమైనవిగా చెప్పటంతో పట్టణవాసులు ఆకర్షితులయ్యారు. కొత్త విషయాలు, చట్టం, మతం వంటి వాటిని బోధించటానికి విశ్వవిద్యాలయాలు స్థాపించారు.
ఇటలీలోని పట్టణ విద్యావంతులు ఈ విషయాల పట్ల ఆసక్తి కనపరిచారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను మానవతావాదులు విమర్శించడం కూడా ఇటలీ పట్టణ వాసులను ఆకర్షించింది. చిత్రకళ, శిల్పంనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ వాద
భావనలను పట్టణవాసులు స్వాగతించారు. భౌతిక సంపద, అధికారం, కీర్తి ఎల్ల ఇటలీవాసులు ఆకర్షితులయ్యారు.
ప్రశ్న 7.
మానవతావాద ఆలోచనల్లోని అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మానవ జీవనం ఆసక్తిని కల్గించింది. వాళ్ళు నివసించిన ప్రపంచం వాళ్ళకి చాలా కీలకమైనదిగా అనిపించింది. మానవతావాదం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దీనిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణాంతర జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి మానవతావాదులు ఆసక్తి చూపారు. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు. మానవ స్వభావం బహుముఖమైనది అన్న విశ్వాసంతో ఈ భావన ముడిపడి ఉంది.
ప్రశ్న 8.
పక్కన ఉన్న పట్టిక పుస్తకాల ముద్రణలో వృద్ధి గురించి చెబుతుంది. దాని గురించి ఏం చెప్పగలరు? (AS3)
(లేదా)
గ్రాఫ్ ఆధారంగా పుస్తకాల ముద్రణ గూర్చి రాయండి.
జవాబు:
15వ శతాబ్దం ముందు వరకు చేతితో రాసిన ప్రతులు కొంతమంది చేతుల్లోనే ఉండేవి. ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారుల చిత్రకళ, శిల్పాపత్రాలు, భవన 1450-1800 మధ్య కాలంలో విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇటలీ వెళ్ళవలసి వచ్చేది. పత్రాలు చేతితో రాసిన – యూరప్ లో ప్రచురితమైన పుస్తకాలు పుస్తకాలు, పెయింటింగ్లు, యూరప్, అమెరికా పురావస్తుశాలల్లో, ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియంలలో ఉండేవి. అయితే 1455 జోహాన్స్ గుటెన్బర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించారు.
“ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించటం 16వ శతాబ్దపు మహా విప్లవం”. 15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 || నాటికి శతాబ్దం కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
ప్రశ్న 9.
“ముద్రింపబడిన పుస్తకాలు మన జీవితాలలో ఇంకా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు తెలపండి. (AS4)
జవాబు:
తాళపత్ర గ్రంథాలు, చేతితో రాసిన పుస్తకాలు పరిమితంగా ఉండడమే కాకుండా, వాటి సాహిత్యం , విజ్ఞానం , భాష చదవడానికి, అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనిపెట్టడం, కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రణ చేసిన చైనీయులకు ప్రపంచం ఋణపడి ఉంది. అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం , మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖ పాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొ||లగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.
ప్రశ్న 10.
17వ శతాబ్దపు ఐరోపావాసులకు ప్రపంచం ఎలాగ భిన్నంగా అనిపించి ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
13వ శతాబ్దం ప్రారంభం, 13 శతాబ్దం ముందు ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు ఏవీ లేవు. పట్టణాలు కూడా క్షీణించాయి. రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవాళ్ళు. ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉండేవారు. అయితే 17వ శతాబ్దంలో ఐరోపాలో అనేక నూతన పోకడలు, అనేక రంగాలలో ప్రగతి కనిపించింది. చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టులతో ఐరోపావాసుల వ్యాపార వాణిజ్యాలు పునరుద్దరించబడ్డాయి. వ్యాపారస్తులు, చేతివృత్తి కళాకారులు నివసించే అనేక పట్టణాలు, నగరాలు ఏర్పడాయి. అనేక సంస్కరణలు, ఆవిష్కరణలు, రచనలు, రూపకల్పనలు చూసి ఐరోపా వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పునరుజ్జీవనం ద్వారా కొత్త మానవతా సంస్కృతి వికసించడం, సాహిత్యం , భవన నిర్మాణం, చిత్రకళలు వంటివి చూసి ఐరోపా వాసులు అమితానందం చెందారు.
ప్రశ్న 11.
పునరుజ్జీవన కాలం నాటి భవన నిర్మాణంలో రెండు ముఖ్యమైన అంశాలను చెప్పండి. (AS6)
జవాబు:
భవనాలలో పొడవాటి స్తంభాలు, కమానులు గుండ్రటి పైకప్పులను ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది ఒక కొత్త శైలికి దారి తీసింది. వాస్తవానికి ఇది పురాతన రోమన్ శైలి పునరుద్ధరణ మాత్రమే. ఇప్పుడు దీనిని క్లాసికల్ (సాంప్రదాయం) గా వ్యవహరిస్తున్నారు. ఈ కాలంలో మరొక ముఖ్యమైన మార్పు అంతకుముందు కాలంలో మాదిరి కళాకారులు వాళ్ళ సభ్యులైన బృందం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధిచెందసాగారు.
ప్రశ్న 12.
ప్రపంచ అవుట్ లైన్ పటంలో పేజీ నెం. 155 లోని భౌగోళిక అన్వేషణలను గుర్తించండి. (AS5)
జవాబు:
ప్రశ్న 13.
పేజీ నెం. 150 లోని నాల్గవ పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరప్లో మహిళల పాత్ర నామమాత్రమైనది. సంపన్న, కులీన కుటుంబాల పురుషులు ప్రజా జీవనంలో ముఖ్యపాత్ర పోషించారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, ప్రజా జీవనంలో తమకు వారసులుగా తమ కొడుకులకు చదువులు చెప్పించేవాళ్ళు. అయితే వివాహ సమయంలో మహిళలు తెచ్చిన కట్నంతో పురుషులు తమ వ్యాపారాలను పెంచుకొన్నారు. – కట్న కానుకలు అందించలేని మహిళలు అవివాహితులుగానే ఉండి పోయేవారు. ప్రజా జీవనంలో మహిళల పాత్ర పరిమితమే కాకుండా, మహిళలను గృహ సంరక్షకులుగానే చూసేవారు.
అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు ఇతర పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మహిళలు, పురుషుల వ్యాపార లావాదేవీలు చూసేవారు.
పటనైపుణ్యం
1.
2.
9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 InText Questions and Answers
9th Class Social Textbook Page No.145
ప్రశ్న 1.
ఎనిమిదవ తరగతిలో హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థ, ‘వెట్టి’ గురించి చదివారు. యూరపులోని ‘కట్టు బానిసత్వం’తో దీనిని పోల్చండి.
జవాబు:
హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థలో కౌలుదారులు, భూస్వాముల వ్యవసాయంలో వెట్టి చాకిరి చేస్తూ, సరియైన ఆదాయం, కూలీ లేకుండ దుర్భర జీవనం సాగించేవాళ్ళు. కష్ట నష్టాలలో ఆదుకొనే భూస్వాములు లేక తరతరాలుగా “వెట్టి” బతుకులతో జీవనం సాగించేవారు. యూరప్ లో రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగాన్ని వాళ్ళు నియంత్రించేవాళ్ళు. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవారు. యజమానుల అధీనంలో బందీలుగా, వాళ్ళ పొలాల్లో, కర్మాగారాలలో పనిచేయాల్సి వచ్చేది. వాళ్ళ తదుపున యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చేది.
ప్రశ్న 2.
పట్టణాల అభివృద్ధికి వ్యాపారం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:
భూస్వాములు, ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందినవారు అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పట్టణాలలో చేసేవారు తద్వారా వారి నివాసాలకు, వారి సుఖవంతమైన జీవనానికి, వలసవచ్చిన కార్మికులను ఆకర్షించడానికి విలువైన కట్టడాలు నిర్మించేవారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వానికి, పరిపాలకులకు తమవంతుగా లాభాలలో వచ్చిన వాటాలు విరాళంగా అందచేసేవారు.
ప్రశ్న 3.
పల్లెల్లో కంటే పట్టణాలలో కొత్త ఆలోచనలు గురించి తెలుసుకోటానికి, కొత్త విషయాలు ప్రయత్నించి చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
గ్రామాలలో జీవన విధానం ఒకే విధంగా ఉంటూ ఒకే రకమైన వృత్తితో, కూలి పనులతో నిరంతరం జీవనం సాగించే వాళ్ళు. అయితే పట్టణాలలో తమ ప్రావీణ్యత, నైపుణ్యం, చాకచక్యం చూపించాలంటే కొత్త ఆలోచనలు వివరించాలి. వినూత్నంగా ఆలోచించే వారికి ఎక్కువ జీతాలు, హోదా కలుగుతుంది. తద్వారా వారు ఉన్నతంగా జీవించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విజ్ఞానంలో వస్తున్న మార్పులను గమనించి, తమ పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రశ్న 4.
బహార్ట్ ప్రకారం కింది వాటిలో ఏది ఆధునిక దృక్పథానికి చెందినది, ఏది మధ్యకాలం నాటికి చెందినది?
అ) తెలుసుకుని, తమ నిర్ణయాలు తాము తీసుకునే సామర్థ్యంలో నమ్మకం ………….. (ఆధునిక దృక్పథానికి చెందినది)
ఆ) మతపర పుస్తకాలు, మతగురువులలో విశ్వాసం ………………….. (మధ్యకాలం నాటిది).
ఇ) దేవుడు అన్ని విషయాలు తెలియచేస్తాడన్న నమ్మకం …………………… (మధ్యకాలం నాటిది)
ఈ) మానవుల హేతువాదంపై విశ్వాసం ………………….. (ఆధునిక దృక్పథం)
9th Class Social Textbook Page No.146
ప్రశ్న 5.
ఇటలీ పటంలో గణతంత్రాలను, మూడు నగర సభలను గుర్తించండి.
జవాబు:
9th Class Social Textbook Page No.147
ప్రశ్న 6.
మానవతావాదులు ఎవరు? వారు ఏమి బోధించారు?
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దానిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతరం జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి వాళ్ళు వివరించారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి నమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవతావాదులు వివరించారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను విమర్శించారు.
9th Class Social Textbook Page No.149
ప్రశ్న 7.
16వ శతాబ్దపు ఇటలీ కళాకారులు తమ పనులలో ఉపయోగించుకున్న వివిధ శాస్త్రీయ అంశాలను వివరించండి.
జవాబు:
16వ శతాబ్దంలోని ఇటలీ భవన నిర్మాణం పురాతన రోము భవనాల నుంచి అనేక ప్రత్యేక లక్షణాలను అనుకరించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీ, పురుషుల శిల్పాలను మెచ్చుకుంటూ ఇటలీ శిల్పులు, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఎముకల నిర్మాణాల గురించి అధ్యయనం చేయటానికి వైద్యశాస్త్ర ప్రయోగశాలలకు కళాకారులు వెళ్లేవాళ్లు. తమ బొమ్మలు, శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయటానికి లియొనార్డో డా విన్సి వంటి కళాకారులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత.
9th Class Social Textbook Page No.150
ప్రశ్న 8.
అదే కాలంలో భారతదేశంలో ముద్రణా యంత్రం లేదు. శ్రీకృష్ణదేవరాయలు ఒక పుస్తకం రాసాడని అనుకుందాం. వివిధప్రాంతాలలోని పండితులకు అది ఎలా అందేది?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ముద్రణా యంత్రం లేకపోయినా రాయలు రాసిన పుస్తకం వివిధ ప్రాంతాలకు ఆయా ప్రాంతాల రాజోద్యోగులు, రాయబారులు, భటుల ద్వారా చేరవలసిన పండితులకు అందుతుంది.
ప్రశ్న 9.
రాజులు, మతగురువులు ముద్రణ యంత్రం పట్ల ఎలా స్పందించి ఉంటారు? దానిని స్వాగతించి ఉంటారా లేక ఆందోళన చెంది ఉంటారా?
జవాబు:
క్రైస్తవ మతాన్ని పాటించటానికి ఒత్తిడి చేసి, చర్చి పోపు ఆధిపత్యాన్ని ప్రచారం చేసిన మతగురువులు, ప్రారంభంలో ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని ఒత్తిడి చేసారు. మత ఆధిపత్యం ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ముద్రణా యంత్రం రావడంతో రాజులు, మతగురువులు ఆందోళన చెందారు. ఫ్యూడలిజం, రాజుల నిరంకుశత్వం, మతాధికారుల మూఢాచారాలు, ముద్రణ వల్ల ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చింది. ప్రజల భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా ప్రజలలోకి వెళ్ళి తిరగబడతారని, మత గురువుల ఆధిపత్యాన్ని ఎదిరించి, ప్రశ్నిస్తారని ఆందోళన చెందారు.
9th Class Social Textbook Page No.151
ప్రశ్న 10.
పునరుజ్జీవనాన్ని కొత్త యుగం అని కూడా అంటారు. సుఖాలను కోరుకోవడం, సంపద, భోగాలను ఆశించటం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయటం సరైనవేనని ప్రజలు భావించసాగారు. స్వార్థ ప్రయోజనాలను వ్యతిరేకిస్తూ, సంపద, సుఖాలను త్యజించాలంటూ ఉండే మత బోధనలకు ఇది విరుద్ధంగా ఉంది. పునరుజ్జీవన మానవతావాదులకున్న ఈ దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
పునరుజ్జీవనం కొత్త యుగమే కాకుండా ప్రజల మేధోపర ఆలోచనలకు, శాస్త్రీయ దృక్పథానికి, విచక్షణా జ్ఞానానికి పరాకాష్ట. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, వివిధ దశలను, రకరకాల పుస్తకాలను పరిశీలించిన పిదప సుఖాలను కోరుకోవడం, సంపద భోగాలను ఆశించడం, అనుభవించడం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయడం సరైనవేనని నేను ఏకీభవిస్తాను. మత. బోధకులు సుఖాలు త్యజించాలంటూ, వారు విలాసవంతమైన జీవనం సాగించారు. ప్రజల బలహీనతలతో మతం ముసుగును కొనసాగించారు. మానవతావాద సంస్కృతిలో మానవజీవితంపై భౌతిక సంపద, అధికారం, శారీరక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని చెప్పారు. నేనూ ఏకీభవిస్తాను.
9th Class Social Textbook Page No.152
ప్రశ్న 11.
ఆ కాలం మహిళలు గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల ఏ ప్రయోజనం పొందారు?
జవాబు:
అ. గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎలా ధైర్యంగా బ్రతకవచ్చో తెలుసుకున్నారు.
ఆ. స్వేచ్ఛ, సమానత్వం గుర్చి అవగాహన ఏర్పరచుకున్నారు.
ఇ. ఆస్తి, ఆర్థికశక్తి వలన మాత్రమే స్త్రీలు సుఖంగా జీవించగలరని తెలుసుకున్నారు.
ఈ. సమాజంలో గౌరవం పెరిగి ఉన్నతంగా జీవించగలమని తెలుసుకున్నారు.
9th Class Social Textbook Page No.154
ప్రశ్న 12.
కాథలిక్కు చర్చిని ఏ అంశాలలో ప్రొటెస్టెంటులు విమర్శించారు?
జవాబు:
అ. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదన్నారు.
ఆ. విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పారు.
ఇ. పాపపరిహార పత్రాలు అమ్మటం, కొనటం తప్పని చెప్పారు.
ఈ. చర్చి, పోప్ దురాశను విమర్శించారు.
ఉ. మతానికి అనవసర ఆచారాలు కూడదన్నారు.
ప్రశ్న 13.
భారతదేశంలోని భక్తి ఉద్యమానికి, ప్రొటెస్టెంటు ఉద్యమానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆ రెండింటి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
భగవంతుని యెడ ప్రేమ, సహనం, అహింస, తపస్సు, నిరాడంబరత్వాన్ని నమ్మిన వారు భక్తి ఉద్యమంలో దేవుడొక్కడే అని, రామ్, అల్లా, జీసస్ ఒక్కరేనని చెప్పారు. తమ పాటలు, తత్వాలు ద్వారా సామాన్య ప్రజలను ఆకర్షించారు. విగ్రహారాధన కూడదన్నారు. సంస్కారవంతమైన జీవనం ముఖ్యమన్నారు. ఇతరుల సేవతో తృప్తి పడాలన్నారు. జంతుబలులు, మూఢ విశ్వాసాలు వలదన్నారు. నిరాడంబర జీవనం కావాలన్నారు. అదేవిధంగా, ప్రొటెస్టెంట్ మతంలో దేవునితో సంబంధం ఏర్పరచుకోటానికి మతగురువు అవసరం లేదన్నారు. దేవునిపై విశ్వాస ముంచమన్నారు. ప్రజల నమ్మకాలపై మోసం చేయరాదన్నారు. పేదకు సేవ చేయటం ముఖ్యమన్నారు.
తేడాలు :
- భక్తి ఉద్యమంలో అన్ని మతాల సారం ఒక్కటేనన్నారు. కాని ప్రొటెస్టెంట్ లో క్రైస్తవ మతానికి ప్రాధాన్యత నిచ్చారు.
- భక్తి ఉద్యమం అన్ని ప్రాంతాలలో ప్రాచుర్యం పొందగా, ప్రొటెస్టెంట్ మతం పట్టణ ప్రాంతానికే పరిమితమైంది.
9th Class Social Textbook Page No.155
ప్రశ్న 14.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? విజ్ఞాన శాస్త్రానికి వాళ్లు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
రోజర్ బాకన్ :
లోహాలు, రసాయనాలతో అనేక ప్రయోగాలు చేసాడు. సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు.
నికోలస్ కోపర్నికస్ :
ఖగోళశాస్త్ర వేత్త. వేధశాలను స్థాపించాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి ఒకటని చెప్పాడు.
టోలమి : భూమి విశ్వానికి కేంద్రమని, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు దానిచుట్టూ తిరుగుతున్నవని వివరించాడు.
గెలీలియో : సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. లోలకంలోని సిద్ధాంతాలను కనుగొన్నాడు. బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని నిరూపించాడు.
9th Class Social Textbook Page No.157
ప్రశ్న 15.
పటం చూసి సముద్ర మార్గాలలో వివిధ అన్వేషణల జాబితా తయారుచేయండి.
జవాబు:
పోర్చుగల్ నావికుడైన ప్రిన్స్ హెన్రీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.
పోర్చుగల్ కి చెందిన బారొలొమ్యి డియాజ్ అన్న నావికుడు ఆఫ్రికాకి దక్షిణ భాగమైన గుడ్ హోప్ అగ్రం దాటి వెళ్ళాడు. వాస్కోడిగామా సముద్రంలో ఆఫ్రికాను చుట్టి ముట్టి 1498లో భారత్ లోని కాలికట్ తీరం చేరాడు. క్రిస్టఫర్ కొలంబస్ అట్లాంటిక్ సముద్రయానం తరువాత 1492లో అక్టోబర్ 12న ఒక దీవిని చేరుకున్నాడు. భారతదేశానికి తూర్పువైపుకి చేరుకున్నానని ఆ ప్రజలను ఇండియన్స్ అన్నాడు.
ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి అన్న నావికుడు కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, కొత్త ప్రపంచమని (అమెరికా) అని నిర్ధారించుకున్నాడు. ఫెర్డినాండ్ మాజిల్లాన్ (స్పెయిన్) ఓడలో ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చాడు. అట్లాంటిక్ సముద్రం దాటి, పసిఫిక్ మహా సముద్రంలోని ఫిలిప్పైన్స్ దీవులను చేరుకున్నాడు.
ప్రాజెక్టు
ప్రశ్న 1.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ కళాకారుల చిత్రాలను సేకరించి, వాటిని ఒక పుస్తకంలో అంటించండి.
జవాబు:
ప్రశ్న 2.
సూర్యుడి చుట్టూ భూమి తిరగటం లేదని నమ్మే మతగురువుకి, గెలీలియోకి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (T.Q.)
జవాబు:
సంభాషణ
మతగురువు : బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్న పాపి గెలీలియోను పిలిపించండి.
గెలీలియో : సెలవివ్వండి పరిశుద్ధులారా!
మతగురువు : భూమి విశ్వానికి కేంద్రం కాదని అంటున్నారట, ఏం బ్రతకాలని లేదా?
గెలీలియో : మన్నించండి! మత గురువుగారు! నాకృషితో సూక్ష్మదర్శినిని కనుగొన్నాను. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళ దూరంలో ఉన్నంత స్పష్టంగా కనిపిస్తుంది. జ్యూపిటర్ ఉపగ్రహాలు, గ్రహ పరిభ్రమణాన్ని స్వయంగా చూసాను.
మతగురువు : కాదు కాదు మీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి లేదా కఠిన శిక్షలకు గురౌతారు. దీర్ఘకాల ఖైదుకి గురి కావలసి ఉంటుంది.
గెలీలియో : “భూమి కదలికలను నేను చూసాను”. గొణుక్కుంటూ బయటకు వచ్చేస్తాడు.
ప్రశ్న 3.
ముద్రణ యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం ఏ ఏ విధాలుగా వాడుతున్నామో తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
ముద్రణా యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం అనేక విధాలుగా వాడుతున్నాం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్వేషణకు, సాహిత్యం , శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణ లోతుల అధ్యయనానికి, అంతరిక్ష, భూగోళ, విశ్వాంతర రహస్యాల ఛేదనకు, ఆవిష్కరణలు, రచనలు అభివృద్ధికి, ఆధారాలు సేకరణకు తోడ్పడుతుంది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, తత్వం, భూగోళశాస్త్ర అధ్యయనానికి తోడ్పాటునందించింది.