SCERT AP 9th Class Social Studies Guide Pdf 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 1st Lesson భూమి – మనం
9th Class Social Studies 1st Lesson భూమి – మనం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూసి కింది ప్రదేశాల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించండి. (AS5)
1. కన్యాకుమారి : ……………………., ………………………….
2. ఇంఫాల్ ……………………….., ……………………………
3. జైసల్మేర్ ……………………………, …………………………
4. పూనా ……………………………., …………………………
5. పాట్నా ……………………………, ………………………….
జవాబు:
1. 8°35′ ఉత్తర అక్షాంశం, 77°36′ తూర్పు రేఖాంశం.
2. 24°44′ ఉత్తర అక్షాంశం, 93°58′ తూర్పు రేఖాంశం.
3. 26° 55′ ఉత్తర అక్షాంశం, 70° 54′ తూర్పు రేఖాంశం.
4. 18°32′ ఉత్తర అక్షాంశం, 73°52′ తూర్పు రేఖాంశం.
5. 27°34′ ఉత్తర అక్షాంశం, 81°46′ తూర్పు రేఖాంశం.
ప్రశ్న 2.
అక్షాంశ, రేఖాంశాలతో సరిపోయే పదాలను గుర్తించండి. (AS1)
జవాబు:
అక్షాంశాలు | రేఖాంశాలు |
సమాంతర రేఖలు | నిలువురేఖలు |
వృత్తాలు | అర్ధవృత్తాలు |
ఉహాజనిత రేఖలు | ఉహాజనిత రేఖలు |
అడ్డంగా గీయబడినవి | కాలాన్ని నిర్ణయిస్తాయి. |
ప్రశ్న 3.
క్రింద ఉన్న ప్రపంచ కాల మండలాల పటం చూడండి. (AS5)
(అ) మీరు విజయవాడ నుండి పారిస్ కి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
పశ్చిమానికి ప్రయాణించడం జరుగుతుంది.
(ఆ) హైదరాబాదు నుంచి టోక్యోకి వెళుతుంటే ఏ కాల మండలానికి ప్రయాణిస్తున్నారు?
జవాబు:
తూర్పునకు ప్రయాణించడం జరుగుతుంది.
ప్రశ్న 4.
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎందుకు కష్టమైనది? (AS1)
జవాబు:
భూమి ఏర్పడటం, దాని నిర్మాణం గురించి అధ్యయనం చేయటం కష్టం ఎందువల్లనంటే …
- భూమి పుట్టుక మీద భిన్నాభిప్రాయాలుండటం.
- ప్రారంభంలో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవి అన్నీ దానిచుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
- 500 సం||రాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు.
- భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
- నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని తెలుసుకున్నారు.
- పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సం||రాల తరువాత అంతరించిపోతుందని అభిప్రాయపడ్డారు.
- భూమి పుట్టుక అధ్యయనం చేయడానికి సరైన శాస్త్ర విజ్ఞానం కూడా అంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు.
- శాస్త్రీయ పరికరాలు ఇంకా కనిపెట్టవలసిన అవసరం ఉంది.
- ఇంకా ఎన్నో అంశాలు ఋజువు కావలసి ఉంది.
ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండల పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది.
ప్ర. భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని మీరు ఎలా చెప్పగలరు.? అయితే కారణాలు ఏమిటి?
జవాబు:
భూమి ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది.
కారణాలు :
- కేంద్రభాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమిపై పొరగా మారుతుంది.
- భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది.
- ఈ విధంగా భూ పటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది.
- భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతునే ఉంది. అందువల్ల భూమి ఇంకా క్రియాశీలకంగా ఉంది.
ప్రశ్న 6.
గ్రిడ్ అనగా నేమి? అది మనకు ఎలా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్
అంటారు. గ్రిడ్ మనకు ఏ విధంగా సహాయపడుతుందనగా: – 1. ఈ గళ్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. 2. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలం. ఉదా : అక్కడ ఎంత వేడిగా ఉన్నది, ఎంత చల్లగా ఉన్నది, అక్కడికి చేరుకోవటానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.
ఏ క్షణంలో అక్కడ సమయం ఎంత ఉంటుంది వంటి అంశాలను తెలుసుకోవచ్చు.
ప్రశ్న 7.
కింది వాని మధ్యగల తేడాలు వివరించండి. (AS1)
జవాబు:
ఆ) స్థానిక కాలం – ప్రామాణిక కాలం
ఆ) భూమధ్యరేఖ – ప్రామాణిక కాలం
అ) స్థానిక కాలం :
- భూభ్రమణం వల్ల భూమి మీద ఉన్న ఏ స్థలమైనా 24 గంటలలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
- అంటే ప్రతి రేఖాంశం ఒక దినంలో ఒకసారి సూర్యునికి ఎదురుగా వస్తుంది.
- అప్పుడు ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలకు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుంది.
- ఈ సమయాన్ని ఆ ప్రాంతం యొక్క స్థానిక కాలం అంటారు.
ప్రామాణిక కాలం :
- ప్రతి దేశానికి ఒక ప్రామాణిక కాలాన్ని నిర్ణయించారు.
- దీని వల్ల కాలాన్ని గుర్తించడం సులభమౌతుంది.
- సాధారణంగా ప్రామాణిక కాలాన్ని నిర్ధారించడానికి ఆ దేశం మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తిస్తారు.
- ఆ రేఖాంశం యొక్క స్థానిక కాలాన్ని ఆ దేశమంతటికి ప్రామాణిక కాలంగా వర్తింపజేస్తారు.
ఆ) భూమధ్యరేఖ :
- భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ. అంటారు.
- ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది.
- ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది. కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు.
- దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.
ప్రామాణిక రేఖాంశం :
- ఇంగ్లాండ్ లోని గ్రీన్ విచ్ (Greenwich – ఉచ్చారణ గ్రీనిచ్) లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
- ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించటం మొదలుపెట్టారు.
ప్రశ్న 8.
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయం పాటిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? (AS1)
జవాబు:
భారతదేశంలో ప్రతి రాష్ట్రం తమ స్థానిక సమయాన్ని పాటిస్తే –
- సమయం విషయంలో గందరగోళం నెలకొంటుంది.
- సమయాన్ని నిర్ణయించటం మరింత క్లిష్టమవుతుంది.
- ఒక గంట వ్యవధితో దేశాన్ని పలు కాల మండలాలుగా విభజిస్తారు.
ప్రశ్న 9.
మీ ఉపాధ్యాయుల సహాయంతో నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రామాణిక రేఖాంశాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
నేపాల్ ప్రామాణిక రేఖాంశం – 82° 30′ తూర్పు రేఖాంశం (+ 5.45 యుటిసి)
పాకిస్థాన్ ప్రామాణిక రేఖాంశం – 74°22 తూర్పు రేఖాంశం (యుటిసి + 6 గం)
బంగ్లాదేశ్ ప్రామాణిక రేఖాంశం – 90° 24 తూర్పురేఖాంశం (యుటిసి + 4 గం)
ఇంగ్లాండ్ ప్రామాణిక రేఖాంశం – 0°07 పశ్చిమరేఖాంశం (యుటిసి + 1 గం).
మలేషియా ప్రామాణిక రేఖాంశం – 105° తూర్పురేఖాంశం (యుటిసి + 8 గం)
జపాన్ ప్రామాణిక రేఖాంశం – 135° తూర్పురేఖాంశం (యుటిసి + 9 గం)
ప్రశ్న 10.
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే ఒక పోస్టరు తయారుచేయండి.
జవాబు:
భూ పరిరక్షణ కోసం ఆలోచింపజేసే పోస్టర్
9th Class Social Studies 1st Lesson భూమి – మనం InText Questions and Answers
9th Class Social Textbook Page No.2
ప్రశ్న 1.
సుదూరంగా ఉన్న నక్షత్రాలు, పాలపుంతల రహస్యాల గురించీ, విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఎందుకు ఉంది?
జవాబు:
- వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నారు.
- ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇతర నక్షత్రాలలో పోలిస్తే ఎప్పుడూ ఒకే దూరంలో ఉండే నక్షత్రాలు. ఇవి ఏమిటి? వీటికీ మనకూ సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
- ఆకాశంలో గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోటానికి ప్రయత్నించారు. అందువల్ల విశ్వం ఆవిర్భావం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఈనాటి మానవులకు ఉంది.
ప్రశ్న 2.
విశ్వం మధ్యలో భూమి ఉందనీ, సృష్టిలో ముఖ్యమైనది మానవులనీ మొదట భావించేవాళ్లు. ఈ అనంత విశ్వంలో మనం అతి చిన్న నలుసు మాత్రమేనని తెలుసుకోవటం వల్ల అది మనపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
- మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందనీ, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు.
- వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులూ లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు.
- కానీ తరువాత భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుళ్లని తెలుసుకున్నారు.
- నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని కూడా గత వంద సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. ఇది మనపై చూపే ప్రభావం ఏదీ శాశ్వతం కాదని, అనంత విశ్వంలో మనం చాలా చిన్న నలుసులం మాత్రమేనని అర్థమవుతుంది. కావున మనకు తెలిసినది తక్కువ అని, తెలియాల్సిందే ఎక్కువ అని కూడా అర్థమౌతుంది.
9th Class Social Textbook Page No.3
ప్రశ్న 3.
భూమి మీద కాలాలు ఏర్పడటానికి గల కారణాలను కింది వానిలో గుర్తించండి.
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. భూమి చుట్టూ చంద్రుడు నెలకు ఒకసారి తిరగటం
3. అక్షంపై సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం
4. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
5. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
6. భూమి గోళాకారంలో ఉండటం
7. సంవత్సర పరిభ్రమణ కాలంలో సూర్యుడి నుండి భూమి ఉండే దూరం
జవాబు:
1. అక్షంపై రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడం
2. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం
3. కక్ష్య తలంతో పోలిస్తే భూమి అక్షం వంగి ఉండటం
4. భూమి గోళాకారంలో ఉండటం
9th Class Social Textbook Page No.4
ప్రశ్న 4.
భూమి అకస్మాత్తుగా ఏర్పడిందని అనుకుంటున్నారా లేక అది ఒక సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగా ఏర్పడిందని అనుకుంటున్నారా?
జవాబు:
భూమి ఒక సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియల ఫలితంగానే ఏర్పడింది.
- ఎక్కువమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలయ్యింది.
- భూమి అనేక దశలలో మార్పు చెంది, ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
- పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలై, ద్రవ దశ గుండా పరిణమించింది.
- ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది.
- విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి.
- ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది.
- భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది.
- బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్రభాగంగా మారితే, తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాల క్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన, చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది.
ప్రశ్న 5.
అనేక యాదృచ్చిక ఘటనల ఫలితంగా భూమి మీద మానవులు రూపొందారని కొంతమంది నమ్ముతారు. లేకుంటే భూమి మీద ప్రాణం ఏర్పడి ఉండేదే కాదు. వాళ్ళతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:
మా కారణాలు కూడా శాస్త్రవేత్తలు తెల్పినవే.
- భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణీ లేకుండా నిర్జీవంగా గడిచింది.
- ఆ తరువాత సముద్రాలలో జీవం మొదలైంది.
- లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి.
9th Class Social Textbook Page No.5
ప్రశ్న 6.
భూప్రావారంను అధ్యయనం చేయటానికి మనం దాని వరకు ప్రయాణించలేం. అయితే భూప్రావారంలోని పదార్థాల ద్వారా దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఈ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా పొందవచ్చో చెప్పండి.
జవాబు:
భూప్రావారం:
- ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
- భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది.
- ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
- అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వలన మరియు యంత్రాలను భూ అంతర్భాగంలోనికి పంపడం ద్వారా వీటిని పొందవచ్చు.
9th Class Social Textbook Page No.7
ప్రశ్న 7.
ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ‘జిగ్ సా పజిల్’ లోని రెండు ముక్కలుగా ఏవైనా రెండు ఖండాలు కనిపిస్తున్నాయా? ఆ ఖండాలు ఏవి?
జవాబు:
జిగ్ సా పజిల్ లోని రెండు ముక్కలుగా కనిపించే రెండు ఖండాలు:
- లారెన్షియా
- గోండ్వానా భూమి.
ప్రశ్న 8.
ఆస్ట్రేలియా ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
దక్షిణం వైపునకు కదిలింది.
ప్రశ్న 9.
భారతదేశం ఏ దిశవైపునకు కదిలింది?
జవాబు:
తూర్పు వైపునకు కదిలింది.
9th Class Social Textbook Page No.8
ప్రశ్న 10.
కింద ఇచ్చిన పటం ఆధారంగా దిగువ పట్టిక నింపండి.
అర్ధ గోళం | ఖండాలు |
ఉత్తరార్ధగోళం | |
పశ్చిమార్ధగోళం | |
దక్షిణార్ధగోళం | |
తూర్పు అర్ధగోళం |
జవాబు:
అర్ధ గోళం | ఖండాలు |
ఉత్తరార్ధగోళం | ఉత్తర అమెరికా, ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలో సగభాగం. |
పశ్చిమార్ధగోళం | ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. |
దక్షిణార్ధగోళం | దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సగభాగం, అంటార్కిటికా. |
తూర్పు అర్ధగోళం | ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. |
9th Class Social Textbook Page No.12
ప్రశ్న 11.
అట్లాస్ చూసి ఈ దేశాలలో ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Time Zones) ఉన్నాయో తెలుసుకోండి.
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ.
జవాబు:
- అమెరికా : ఐదు ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి -9, -3, -2, -6, -5 మండలాలు.
- ఆస్ట్రేలియా : మూడు ప్రామాణిక కాల మండలాలు ఉన్నవి. అవి +8, +9, +10 మండలాలు.
- రష్యా : పది ప్రామాణిక కాలమండలాలు ఉన్నవి. అవి +3, +4, +5, +6, +7, +8, +9, +10, +11, +12 మండలాలు.
- జపాన్ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +9 మండలం.
- జింబాబ్వే : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది +2 మండలం.
- చిలీ : ఒకే ఒక్క ప్రామాణిక కాలమండలం ఉంది. అది -5 మండలం.
ప్రశ్న 12.
హైదరాబాదులోని ఒక కాల్ సెంటరులో స్వాతి పనిచేస్తోంది. ఆమె క్లయింటులు అమెరికాలో ఉన్నారు. కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింటుల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడూ రాత్రివేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని ? భూగోళశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి.
జవాబు:
- భారతదేశము తూర్పు అర్ధగోళంలోనూ, అమెరికా పశ్చిమార్ధగోళంలోనూ ఉంది.
- రెండు దేశాల మధ్య దాదాపు 12 గంటల కాల వ్యత్యాసం ఉంది.
- అమెరికా వాళ్ల మధ్యాహ్న 12 గంటల సమయం, మనకు అర్ధరాత్రి 12 గంటల సమయమవుతుంది.
- అందువలన స్వాతి ఎప్పుడూ వాళ్లకు పగటివేళలయిన, మన రాత్రివేళల్లోనే, పనిచేయవలసి వస్తుంది.
ప్రశ్న 13.
మెదడుకు మేత :
గ్రీన్ విచ్ (0) వద్ద మధ్యాహ్నం 12 : 00 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి :
(అ) ముంబయి (73° తూ.రే) ; (ఆ) షికాగో (87° 30 ప.రే) ; (ఇ) సిడ్నీ ‘(151° తూ.రే.).
జవాబు:
ఒక్కొక్క రేఖాంశానికి సమయ వ్యత్యాసం 4 ని||లు.
(అ) ముంబయి (73° తూ.రే) :
- 73 × 4 = 292 నిమిషాలు = 4 గం||ల 52 ని॥లు
- తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది. కనుక 4 గం|| 52 ని||లు కలుపవలసి ఉంటుంది.
- 12-00 + 4-52 = 16-52 అనగా స్థానిక సమయం సాయంత్రం 4 గం|| 52 ని||లు.
(ఆ) షికాగో (87° 30 ప.రే) :
- 87.30 × 4 = 87½ × 4 = 350 నిమిషాలు = 5 గం|| 50 ని||
- పశ్చిమ రేఖాంశము గ్రీన్ కు క్రింద ఉంటుంది. కనుక 5 గం|| 50 ని||లు తీసివేయవలసి ఉంటుంది.
- 12.00 – 5.50 = 6 గం|| 10 ని||
అందువలన స్థానిక సమయం ఉదయం 6గం|| 10ని||
(ఇ) సిడ్నీ (151° తూ.రే.) :
- 151 × 4 = 604 ని||లు = 10 గం|| 4 ని||
- తూర్పు రేఖాంశము గ్రీన్ విచ్ కు పైన ఉంటుంది.
- 12.00 + 10 – 04 = 22-04
అనగా స్థానిక సమయం రాత్రి 10 గం|| 4 ని||