SCERT AP 9th Class Physics Study Material Pdf Download 9th Lesson తేలియాడే వస్తువులు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Physical Science 9th Lesson Questions and Answers తేలియాడే వస్తువులు
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
1. 2 సెం.మీ వ్యాసార్ధం గల గోళం యొక్క ద్రవ్యరాశి 0.05 కి.గ్రా. అయిన దాని సాపేక్ష సాంద్రత ఎంత? (AS 1)
జవాబు:
గోళం వ్యాసార్థం = 2 సెం.మీ.
ప్రశ్న 2.
ఒక సీసా ఖాళీగానున్నపుడు 20 గ్రాములు. దానిలో నీరు నింపినపుడు 22 గ్రాములు బరువు ఉంది. దానిని నూనెతో నింపినపుడు 21.76 గ్రాములుంటే ఆ నూనె సాంద్రత ఎంత? (AS 1)
జవాబు:
నీటి బరువు = 22 – 20 = 2 గ్రా
నూనె బరువు = 21.76 – 20 = 1.76 గ్రా.
ప్రశ్న 3.
ఒక గ్లాసులోని నీటిలో మంచుగడ్డ తేలుతూ ఉంది (మంచు సాంద్రత 0.9 గ్రా/ఘ. సెం.మీ). ఆ మంచుగడ్డ పూర్తిగా కరిగితే ఆ గ్లాసులోని నీటి మట్టంలో పెరుగుదల ఉంటుందా? (AS 1)
జవాబు:
గ్లాసులోని నీటిమట్టం పెరుగుతుంది.
కారణం :
మంచుగడ్డ సాంద్రత, నీటి సాంద్రతకన్నా తక్కువ ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. మంచుగడ్డ కరిగి నీరుగా మారడం వలన గ్లాసులోని నీటిమట్టం పెరుగుతుంది.
ప్రశ్న 4.
నీటిలో కొన్ని వస్తువులు తేలుతాయి. కొన్ని మునుగుతాయి. ఎందుకు? (AS 1)
జవాబు:
నీటిలో వస్తువు మునుగుట, తేలుట అనేది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి
1. సాపేక్ష సాంద్రత :
వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉంటే ఆ వస్తువు నీటిలో మునుగుతుంది, లేకుంటే తేలుతుంది.
2. వస్తువుచే తొలగింపబడిన నీటి ద్రవ్యరాశి :
వస్తువు సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, ఆ వస్తువుచే తొలగింపబడిన నీటి ద్రవ్యరాశి ఆ వస్తువు ద్రవ్యరాశికి సమానమైతే ఆ వస్తువు నీటిపై తేలుతుంది.
ప్రశ్న 5.
సాంద్రత, సాపేక్ష సాంద్రతలను వివరించండి. సూత్రాలు రాయండి. (AS 1)
జవాబు:
సాంద్రత : ప్రమాణ ఘనపరిమాణం గల వస్తువు ద్రవ్యరాశిని ఆ వస్తువు యొక్క సాంద్రత అంటారు.
ఘనపరిమాణం సాంద్రత ప్రమాణాలు : గ్రా/సెం.మీ (లేదా) కి. గ్రా/ మీ’.
సాపేక్ష సాంద్రత :
వస్తువు సాంద్రతకు, నీటి సాంద్రతకు గల నిష్పత్తిని ఆ వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత అంటారు.
సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఉండవు.
ప్రశ్న 6.
నీటి సాంద్రత ఎంత? (AS 1)
జవాబు:
నీటి సాంద్రత = 1 గ్రా/సెం.మీ. (లేదా) 1 కి. గ్రా/ మీ³.
ప్రశ్న 7.
ఉత్థవనం (buoyancy) అనగానేమి? (AS 1)
జవాబు:
ద్రవంలో ఉన్న వస్తువుపై ఊర్ధ్వ దిశలో కలుగజేయబడే బలాన్ని ఉత్పవనం అంటాం. ఈ బలం ఆ వస్తువు వల్ల తొలగించబడిన ద్రవం బరువుకి సమానం.
(లేదా)
వస్తువును ద్రవంలో తేలేటట్లు చేయగల సామర్థ్యమే ఉత్సవనం.
ప్రశ్న 8.
కింద ఇవ్వబడిన పదార్థాలను సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ గల వస్తువులు, 1కన్నా తక్కువ గల వస్తువులుగా వర్గీకరించండి. (AS 1)
(చెక్క ఇనుము, రబ్బరు, ప్లాస్టిక్, గాజు, రాయి, బెండు, గాలి, బొగ్గు, మంచు, మైనం, కాగితం, పాలు, కిరోసిన, కొబ్బరినూనె, సబ్బు)
జవాబు:
సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ గలవి | సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ గలవి |
ఇనుము | చెక్క |
గాజు | రబ్బరు |
రాయి | ప్లాస్టిక్ |
పాలు | బెండు |
సుబ్బు | గాలి |
బొగ్గు | |
మంచు | |
మైనం | |
కాగితం | |
కిరోసిన్ | |
కొబ్బరినూనె |
ప్రశ్న 9.
నీరు, పాలలో ఏది అధిక సాంద్రత కలిగినది? (AS 2)
జవాబు:
నీటి సాంద్రత 1 గ్రా./ఘ. సెం.మీ, మరియు పాల సాంద్రత 1.02 గ్రా./ఘ. సెం.మీ. కావున పాల సాంద్రత నీటి సాంద్రతకన్నా కొద్దిగా ఎక్కువ.
ప్రశ్న 10.
నీటిలో ఇనుము మునుగుతుంది. చెక్క తేలుతుంది. ఒకే ఘనపరిమాణం గల ఇనుము, చెక్క ముక్కలను ఒక్కటిగా కట్టి నీటిలో వేస్తే అది మునుగుతుందా? తేలుతుందా? ఊహించండి. ప్రయోగం చేసి మీ ఊహ సరైనదో, కాదో పరీక్షించుకోండి. (AS 2, AS 3)
జవాబు:
ఒకే ఘనపరిమాణం గల ఇనుము, చెక్క ముక్కలను ఒక్కటిగా కట్టి నీటిలో వేస్తే అది మునుగుతుంది.
కారణం :
రెండు వస్తువుల ఫలిత ద్రవ్యరాశి పెరుగుతుంది. తత్ఫలితంగా ఫలిత సాంద్రత కూడా పెరుగుతుంది.
ప్రశ్న 11.
చెక్క యొక్క సాపేక్ష సాంద్రతను కనుగొనండి. కనుగొనే విధానాన్ని వివరించండి. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం : చెక్క యొక్క సాపేక్ష సాంద్రతను కనుగొనుట. (ప్రయోగశాల కృత్యం – 1)
కావలసిన పరికరాలు :
ఓవర్ ఫ్లో పాత్ర, 50 మి.లీ. కొలజాడీ, స్ప్రింగు త్రాసు, చెక్క ముక్క నీరు
విధానం :
- 50 మి.లీ కొలజాడీ ద్రవ్యరాశిని కొలిచి నమోదు చేయండి.
- చెక్క ముక్క యొక్క ద్రవ్యరాశిని కనుగొని నమోదు చేయండి.
- ఓవర్ ఫ్లో పాత్రలో ప్రక్క గొట్టం గుండా నీరు పొర్లిపోయేంత వరకు నీటిని పోయండి.
- నీరు పొర్లిపోవడం ఆగిపోగానే ఆ గొట్టంకింద 50 మి.లీ.ల కొలజాడీ నుంచండి.
- ఇప్పుడు చెక్క ముక్కను పాత్రలోని నీటిలో జాగ్రత్తగా జారవిడవండి.
- చెక్కముక్కను నీటిలో ఉంచగానే పక్కగొట్టంద్వారా కొంతనీరు పొర్లి కొలజాడీలోకి చేరుతుంది.
- నీరు పొర్లిపోవడం ఆగే వరకు వేచి చూడండి.
- నీటితో సహా కొలజాడీ ద్రవ్యరాశిని కొలిచి పట్టికలో నమోదు చేయండి.
ప్రశ్న 12.
ఒక ద్రవం యొక్క సాపేక్ష సాంద్రతను ఎలా కనుగొంటారు? (ప్రయోగశాల కృత్యం – 2) (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం :
ద్రవం సాపేక్ష సాంద్రతను కనుగొనుట.
కావలసిన పరికరాలు :
50 మి.లీ. ద్రవం పట్టే సీసా, స్ప్రింగ్ త్రాసు, ఏదైనా ద్రవం (దాదాపు 50 మి.లీ.).
విధానం :
- ముందుగా ఖాళీ సీసా ద్రవ్యరాశి కనుగొనాలి.
- ఆ ఖాళీ సీసాను నీటితో నింపి మరల ద్రవ్యరాశిని కనుగొనాలి.
- ఇప్పుడు 50 మి.లీల నీటి ద్రవ్యరాశి = నీటితో నింపిన సీసా ద్రవ్యరాశి – ఖాళీ సీసా ద్రవ్యరాశి
- సీసా నుండి నీటిని తీసివేసి ఆ సీసాను ఏదైనా ద్రవం (పాలు) తో నింపి దాని ద్రవ్యరాశిని కనుగొనండి.
- 50 మి. లీ.ల ద్రవం ద్రవ్యరాశి = ద్రవంతో నింపిన సీసా ద్రవ్యరాశి – ఖాళీ సీసా ద్రవ్యరాశి
- ఇదే విధంగా ఏ ద్రవం యొక్క సాపేక్ష సాంద్రతనైనా కనుగొనవచ్చును. వివిధ ద్రవాల సాపేక్ష సాంద్రతలను కింది పట్టికలో నమోదు చేయండి.
ప్రశ్న 13.
వివిధ రకాల పండ్లు, కూరగాయల సాపేక్ష సాంద్రతలను కనుగొని జాబితా రాయంది. (AS 3)
జవాబు:
- ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు కింద ఉన్న ప్రశ్న (1)లో సూచించిన విధానాన్ని అనుసరించండి.
- ఈ విధానంలో చెక్క ముక్కకు బదులు వివిధ రకాల పండ్లు, కూరగాయలు వాడండి.
- వచ్చిన విలువలు కింది పట్టికలో నమోదు చేయండి.
పండు/కూరగాయ పేరు | సాపేక్ష సాంద్రత |
కాబేజి | 0.36 |
కాలిఫ్లవర్ | 0.26 |
సొరకాయ | 0.56 |
ఆలుగడ్డ (బంగాళదుంప) | 0.67 |
ఉల్లిపాయ | 0.59 |
మిరపకాయ | 0.29 |
కాకరకాయ | 0.4 |
ఆపిల్ | 1.22 |
ద్రాక్ష | 1.04 |
నారింజ | 0.34 |
ప్రశ్న 14.
బాల్ పెన్ రీఫిల్ లో లాక్టోమీటర్ తయారుచేయండి. రీఫిల్ నీటిలో నిటారుగా నిలబడడానికి మీరేం చేశారు?(కృత్యం – 2) (AS 5)
జవాబు:
- ఒక ఖాళీ బాల్ పెన్ రీఫిలను తీసుకోండి. దాని చివర లోహపు ముల్లు ఉండాలి.
- ఒక లావు పరీక్షనాళికను తీసుకొని, దానిని దాదాపుగా నిండుగా నీటిని తీసుకొని, పటంలో చూపినట్లు రీఫిలను నీటిలో ఉంచండి.
- రీఫిల్ యొక్క లోహపు ముల్లు కిందికి ఉండేటట్లుగా జాగ్రత్త వహించండి.
- రీఫిల్ నీటిలో ఎంతవరకు మునిగిందో, అక్కడ పెతో గుర్తు పెట్టండి.
- బాయిలింగ్ ట్యూబ్ నుండి నీటిని తీసివేసి, పాలను పోయండి.
- ఆ పాలలో రీఫిలను ఉంచండి.
- రీఫిల్ పాలలో ఎంతవరకు మునిగిందో, అక్కడ పెతో మరొక గుర్తు పెట్టండి.
- ఈ రెండు గుర్తులు ఒకే స్థానంలో ఉండవు.
- ఇదే అభివృద్ధి పరచబడిన లాక్టోమీటరు.
- రీఫిల్ యొక్క లోహపు ముల్లుకు ఒక బరువును (బెండు లాంటిది) అమర్చినచో రీఫిల్ ఒక పక్కకు వాలకుండా నిటారుగా నీటిలో తేలుతుంది.
ప్రశ్న 15.
పాదరస భారమితి బొమ్మ గీయండి. (AS 5)
జవాబు:
ప్రశ్న 16.
హైద్రాలిక్ బాక్స్ తయారీలో ఉపయోగపడుతున్న పాస్కల్ ఆవిష్కరణను నీవెలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:
పాస్కల్ నియమం :
ఏదైనా ప్రవాహి బంధింపబడి ఉన్నప్పుడు దానిపై బాహ్య పీడనం కలుగజేస్తే ఆ ప్రవాహిలో అన్ని వైపులా ఒకే విధంగా పీడనం పెరుగుతుంది.
ఉపయోగము :
- హైడ్రాలిక్ యంత్రాల తయారీలో ఈ సూత్రము ఉపయోగపడుతుంది.
- మెకానిక్ షాపులందు వాహనాలను బాగు చేసేటప్పుడు వాడే జాకీలు పాస్కల్ నియమముపై ఆధారపడి పనిచేస్తాయి.
- ఈ జాకీల వలన మనం కొద్ది బలాన్ని ప్రయోగించి భారీ వాహనాలను కూడా సులభంగా పైకెత్తవచ్చు.
ప్రశంస:
- కేవలం మెకానిక్ షాపులయందు మాత్రమే కాక ఎక్కడైతే ఎక్కువ బరువులను తక్కువ బలంతో పైకెత్తవలసి ఉంటుందో, ఆ పరిశ్రమలన్నింటిలోను హైడ్రాలిక్ జాక్లను ఉపయోగిస్తారు.
- శాస్త్రజ్ఞులు కనుగొన్న నియమాలు, సూత్రాలు అనేక నూతన పరికరాల రూపకల్పనకు దోహదపడి మన జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి.
- దీనివల్ల మనం శాస్త్రజ్ఞుల కృషిని తప్పక అభినందించాలి.
ప్రశ్న 17.
ఉత్సవనం గురించి వివరించిన ఆర్కిమెడీస్ సిద్ధాంతాన్ని నీవెలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:
ఆర్కిమెడీస్ సూత్రము :
ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా కాని, పాక్షికంగాగాని ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్సవన బలం ఆ వస్తువుపై ఊర్వ దిశలో పనిచేస్తుంది.
ఉపయోగము :
ఈ సూత్రము లోహాల స్వచ్చతను కనుగొనుటకు ఉపయోగపడును.
ప్రశంస:
- ఆర్కిమెడీస్ స్నానం చేస్తూండగా అకస్మాత్తుగా ఈ సూత్రం కనుగొనుట జరిగినది.
- ఈ సూత్రం సాయంతో రాజు తనకప్పజెప్పబడిన సమస్యను ఆర్కిమెడిస్ సులభంగా పరిష్కరించగలిగాడు.
- మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సమాధానాలుగా అనేక సూత్రాలను, నియమాలను శాస్త్రజ్ఞులు కనుగొనుట జరిగినది.
- హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోవుట గురించి వినే ఉంటారు.
- ఈ విగ్రహాన్ని ఉత్సవన బలం ఆధారంగానే బయటకు తీయగలిగారు.
- శాస్త్రజ్ఞులు ఆర్కిమెడిసన్ను ఒక మంచి గణిత శాస్త్రవేత్తగా గౌరవించారు.
- చంద్రునిపై కనుగొన్న ఒక పెద్ద బిలానికి ఆర్కిమెడీస్ పేరు పెట్టడం జరిగినది.
- కొన్ని శిఖరాలకు కూడా ఆర్కిమెడీస్ శిఖరాలు అని పేరు పెట్టడం జరిగినది.
- కావున ఆర్కిమెడీస్ కనుగొన్న అనేక విషయాలను మనం అభినందించక తప్పదు.
ప్రశ్న 18.
నీటిలో మునిగే పదార్థాలతో, నీటిలో మునగని పడవలు తయారుచేసే సాంకేతికత నీకు అద్భుతంగా అనిపించిందా? ఎందుకు? (AS 6)
జవాబు:
- ఇనుము సాపేక్ష సాంద్రత 8.5. ఇది నీటి సాంద్రతకన్నా చాలా ఎక్కువ.
- కాని అనేక టన్నుల ఇనుముతో తయారుచేయబడిన ఒక ఓడ నీటిలో తేలడం నిజంగా ఒక వింత.
- ఆర్కిమెడిస్ ఉత్సవన నియమం ప్రకారం ఏ వస్తువైనా ఒక ద్రవంలో ముంచబడినపుడు అది తొలగించే ద్రవం బరువు దాని బరువుకు సమానమైనప్పుడు ఆ వస్తువు ఆ ద్రవంలో తేలుతుంది.
- కావున ఓడలను, పూర్తిగా నింపబడిన ఓడ బరువు, అది తొలగించే నీటి బరువుకు సమానమయ్యేటట్లు అధిక ఉపరితల వైశాల్యంతో నిర్మిస్తారు.
- ఈ నిర్మాణంలో కచ్చితమైన కొలతలు, ఎంతో శాస్త్ర విజ్ఞాన నైపుణ్యము ఇమిడి ఉంటాయి.
- నిజంగా ఈ విధమైన కచ్చితమైన కొలతలు, ఇంతటి విలువైన శాస్త్ర విజ్ఞాన నైపుణ్యాన్ని కలిగియున్న శాస్త్రవేత్తలను, ఈ నియమాలను అందించిన శాస్త్రవేత్తలను అభినందించకుండా ఉండలేము.
ప్రశ్న 19.
మీ దైనందిన జీవితంలో ఆర్కిమెడీస్ సిద్ధాంతాన్ని ఎక్కడెక్కడ పరిశీలిస్తారు? రెండు ఉదాహరణలివ్వండి. (AS 7)
జవాబు:
నిత్యజీవితంలో ఆర్కిమెడీస్ నియమ ఉపయోగం :
- నిత్య జీవితంలో ఆర్కిమెడీస్ సూత్రం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
- నీటిపై తేలే చేపలు, నీటిలో ఈదే మనుషులు, నీటిపై తేలే మంచు పర్వతాలు, ఓడలు మొదలగునవి ఆర్కిమెడీస్ ఉత్సవన నియమాన్ని పాటిస్తాయి.
- గాలిలో బెలూను ఎగురవేయడం కూడా ఆర్కిమెడీస్ సూత్ర వినియోగమే.
- అలాగే బావిలో నుండి నీటితో నిండిన బకెట్ ను లాగేటప్పుడు, ఆ బకెట్ నీటి ఉపరితలానికి వచ్చే వరకు బరువును కోల్పోయినట్లనిపిస్తుంది. ఇది కూడా ఉత్తవన బలం యొక్క ఫలితమే.
- నీటిలో బాతు ఈదడం కూడా ఆర్కిమెడీస్ సూత్రానికి ఉదాహరణ.
ప్రశ్న 20.
మీ దైనందిన జీవితంలో పాస్కల్ నియమాన్ని ఎక్కడెక్కడ పరిశీలిస్తారు? రెండు ఉదాహరణలివ్వండి. (AS 7)
జవాబు:
పాస్కల్ నియమం యొక్క నిత్యజీవిత ఉపయోగాలు :
- హైడ్రాలిక్ జాక్స్
- హైడ్రాలిక్ పంపులు
- హైడ్రాలిక్ లిఫ్టులు
- హైడ్రాలిక్ క్రేన్లు
- సైఫన్
- బావులు
- డ్యాములు
ప్రశ్న 21.
50 గ్రా. ద్రవ్యరాశి గల ఒక పదార్థ ఘనపరిమాణము 20 ఘ. సెం.మీ. నీటి సాంద్రత 1 గ్రా./ఘ. సెం.మీ. అయితే ఆ పదార్థం నీటిలో మునుగుతుందా? తేలుతుందా? అది తొలగించే నీటి బరువు ఎంత? (AS 1)
జవాబు:
నీటి సాంద్రత : 1 గ్రా/సెం.మీ³
పదార్థ సాంద్రత, నీటి సాంద్రతకన్నా ఎక్కువ. కావున ఆ వస్తువు నీటిలో మునుగుతుంది.
ఆ వస్తువు సాపేక్ష సాంద్రత = 2.5 గ్రా/సెం.మీ³/1 గ్రా/సెం.మీ³ = 2.5
వస్తువు సాపేక్ష సాంద్రత = వస్తువు బరువు / వస్తువు ఘనపరిమాణమునకు సమాన ఘనపరిమాణము గల నీటి బరువు
వస్తువుచే తొలగింపబడిన నీటి ద్రవ్యరాశి = 20 గ్రా.
ప్రశ్న 22.
వాతావరణ పీడనం 100 కిలో పాస్కల్ ఉన్నపుడు నీటిలో 10 మీ. లోతున పీడనం ఎంత ఉంటుంది? (AS 1)
(పాస్కల్ = న్యూటన్/మీ²) (100 కిలో పాస్కల్ = 105 పాస్కల్ = 105 న్యూటన్/మీ² = 1 అట్మాస్పియర్).
జవాబు:
వాతావరణ పీడనం P = 100 కిలో పాస్కల్
నీటి ద్రవ్యరాశి : 1 గ్రా/సెం.మీ³
h లోతులో పీడనం Ph = P0 + ρ h g
= 100 + 10 × 1 × 9.8
= 100 + 98 – 198 కిలో పాస్కల్
ప్రశ్న 23.
ఇనుమును నీటిలో తేలేటట్లు చేయగలవా? ఎలా? (AS 3)
జవాబు:
ఇనుమును నీటిలో మునిగేటట్లు చేయవచ్చును.
విధానం :
- ఒక ఇనుప ముక్కను తీసుకొని దానిని ఒక నీరుగల జాడీలో జారవిడవండి.
- ఇనుప ముక్క నీటిలో మునుగుటను గమనిస్తాము.
- ఒక సన్నని ఇనుప రేకును తీసుకొని దానిని నాలుగు మడతలు వేసి నీటిలో వేయండి.
- ఇది కూడా నీటిలో మునుగుట గమనిస్తాము.
- ఇప్పుడు ఇనుప రేకు యొక్క మడతలు విప్పదీసి, దానిని ఒక గిన్నెలాగా మడిచి ఆ గిన్నెను నీటిలో వేయండి.
- ఆ గిన్నె నీటిలో తేలుటను గమనిస్తాము.
కారణం :
ఇనుప గిన్నెచే తొలగింపబడిన నీటి ద్రవ్యరాశి, ఆ ఇనుప గిన్నె బరువుకన్నా తక్కువ అవడం చేత ఇనుప గిన్నె నీటిపై తేలింది.
ప్రశ్న 24.
మీరు వివిధ ఘన, ద్రవ పదార్థాల సాపేక్ష సాంద్రతలను కనుగొన్నారు. వాటిని వాటి సాపేక్ష సాంద్రతల ఆరోహణ క్రమంలో రాయండి. (AS 4)
జవాబు:
పదార్థము | సాపేక్ష సాంద్రత |
కిరోసిన్ | 0.81 |
రబ్బరు | 0.94 |
పాలు | 1.02 |
గాజు | 1.29 |
ఇనుము | 8.5 |
ప్రశ్న 25.
వాహనాలలో వాడే ఆయిల్ బ్రేకులు బ్రాహప్రెస్ నియమాన్ని (పాస్కల్ నియమాన్ని) పాటిస్తాయి. మరి ఎయిర్ బ్రేకులు .. ఎలా పనిచేస్తాయి? వాహనాలలో ఎయిర్ బ్రేకులు పనిచేసే విధానాన్ని గురించి సమాచారాన్ని సేకరించండి. (AS 4)
జవాబు:
- ఎయిర్ బ్రేకులు శక్తి నిత్యత్వం అనే నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.
- సాధారణంగా రైలు పరిగెత్తుతున్నపుడు గతిశక్తి పుడుతుంది. ఈ గతిశక్తిని తగ్గిస్తే రైలు ఆగిపోతుంది.
- గాలినుపయోగించి గతిశక్తిని ఉష్ణశక్తిగా మార్చడం ద్వారా రైలును ఆపగలుగుతున్నారు.
- ఎయిర్ బ్రేకుల వ్యవస్థను పటంలో చూపడమైనది.
- ఇందులోని ముఖ్య భాగాలు: కంప్రెసర్, ప్రధాన రిజర్వాయర్, డ్రైవరు వద్దనుండే బ్రేకు వాల్వు, బ్రేకు గొట్టం , ట్రిపుల్ వాల్వు, ఆక్టిలరీ రిజర్వాయర్, బ్రేకు సిలిండర్, బ్రేకు బ్లాకు.
పనిచేయు విధానం:
- డ్రైవరు బ్రేకు వాల్వును నొక్కగానే బ్రేకు గొట్టంలోని గాలి పీడనం బయటకు నెట్టివేయబడును.
- ట్రిపుల్ వాల్వు ఈ పీడనం బయటకు నెట్టివేయబడడాన్ని గుర్తిస్తుంది.
- ఇప్పుడు బ్రేకు సిలిండర్‌కు, ఆక్టిలరీ రిజర్వాయర్‌కు మధ్యగల అనుసంధానం తెరుచుకోబడి, ఆర్డీలరీ రిజర్వాయర్ ద్వారా బ్రేక్ సిలిండర్ లోనికి గాలి నెట్టబడుతుంది.
- ఈ గాలి పీడనం, ముషలకాన్ని ముందుకు నెట్టడం ద్వారా, చక్రాలకు దగ్గరలోనున్న ముషలకాలు ముందుకు నెట్టబడి, చక్రాలను ఆపుతాయి.
- ఈ విధంగా ఎయిర్ బ్రేకులు పనిచేస్తాయి.
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు Textbook InText Questions and Answers
9th Class Physical Science Textbook Page No. 144
ప్రశ్న 1.
మీ వద్ద 30 ఘ. సెం.మీ. పరిమాణం గల దిమ్మె ఒకటి, 60 ఘ. సెం.మీ. పరిమాణం గల దిమ్మె ఒకటి ఉన్నాయనుకోండి. అవి ఏయే పదార్థాలతో తయారయ్యా యో నీకు తెలియదు. కాని 60 ఘ. సెం.మీ. పరిమాణం గలది ఎక్కువ బరువుంది. ఈ సమాచారంతో ఆ రెండు దిమ్మెలలో దేని సాంద్రత ఎక్కువో చెప్పగలరా?
జవాబు:
ఒక వస్తువు సాంద్రతను చెప్పాలంటే ఆ వస్తువు ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణములు తెలిసియుండాలి. కాని పై సందర్భములో కేవలం ఘనపరిమాణము మాత్రమే తెలుసు. కాని ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశులు తెలియవు కావున దేని సాంద్రత ఎక్కువో చెప్పలేము.
9th Class Physical Science Textbook Page No. 155
ప్రశ్న 2.
ఎ) “టారిసెల్లీ” భారమితిని చంద్రునిపై ఉంచితే ఏమి జరుగుతుంది?
జవాబు:
చంద్రునిపై వాతావరణ పీడనం లేదు కావున “టారిసెల్లి” భారమితిని చంద్రునిపై ఉంచితే పాదరస స్థంభం ఎత్తు ‘సున్న’ అవుతుంది.
బి) భారమితిలో పాదరస మట్టానికి కొంచెం దిగువగా గాజు గొట్టానికి ఒక రంధ్రం చేయబడి అందులో ఒక “పిడి” బిగించబడి ఉందనుకుందాం. ఆ రంధ్రం నుండి ఆ పిడిని తొలగిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
- పాదరస స్థంభం పైన “శూన్య ప్రదేశం” ఉంటుంది. కావున పాదరసం పైన ఎటువంటి పీడనం ఉండదు.
- అంతేగాక గాజు గొట్టంలోని పాదరస మట్టం యొక్క ‘భారం’ దానిపై వాతావరణ పీడన ఫలితంగా గిన్నెలోని పాదరసంవల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది.
- అందువల్ల పాదరస స్థంభం యొక్క ఎత్తులో ఎటువంటి మార్పు రాదు.
సి) భారమితిలో పాదరసానికి బదులుగా మనం నీరు ఎందుకు వాడకూడదు? ఒకవేళ మీరు వాడాలంటే గాజు గొట్టం పొడవు ఎంత ఉండాలి?
జవాబు:
భారమితిలో పాదరసానికి బదులుగా నీరు వాడలేము. ఎందుకంటే
1) నీరు ఉష్ణోగ్రత, పీడనములలోని అతి స్వల్ప మార్పులకు వ్యాకోచ, సంకోచాలు చెందదు.
2) నీరు వాడాలంటే గాజు గొట్టం పొడవు సుమారు 10 మీ. కంటే ఎక్కువ ఉండాలి. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ నీటిని తీసుకుంటే, పాదరస స్థంభం ఎత్తు
డి) భూమి చుట్టూ ఉన్న మొత్తం వాతావరణ పీడనం బరువు కనుక్కోండి. (భూ వ్యాసార్థం 6400 కి.మీ.)
జవాబు:
భూమి చుట్టూ ఉన్న మొత్తం వాతావరణ పీడనం బరువు = వాతావరణ పీడనం × భూ ఉపరితల వైశాల్యం
9th Class Physical Science Textbook Page No. 159
ప్రశ్న 3.
ఎ) స్వచ్ఛమైన నీటిలో కంటే ఉప్పునీటిలో మీరు సులభంగా తేలుతారు. ఎందుకు?
జవాబు:
ఉప్పునీటి సాంద్రత స్వచ్ఛమైన నీటి సాంద్రత కంటే ఎక్కువ.
బి) ద్రవంలో ముంచబడిన వస్తువుపై పార్వ దిశలో ఉత్సవన బలం ఎందుకుండదు?
జవాబు:
ఉత్సవన బలం ఊర్ధ్వ బలం మాత్రమే. వస్తువు ద్రవంలో ముంచబడినది అంటే దాని బరువు ఉత్సవన బలంకంటె ఎక్కువున్నది అని అర్థం. కావున పార్శ్వ దిశలో ఉత్సవన బలం ఉండదు.
సి) ఒకే పరిమాణం గల ఒక ఇనుప దిమ్మె, ఒక అల్యూమినియం దిమ్మెలను నీటిలో ముంచితే దీనిపై ఉత్సవన బలం అధికంగా ఉంటుంది?
జవాబు:
అల్యూమినియం దిమ్మెపై కన్నా ఇనుప దిమ్మెపై ఉత్సవన బలం అధికంగా ఉంటుంది. ఎందుకనగా ఇనుము సాంద్రత అల్యూమినియం సాంద్రత కన్నా ఎక్కువ.
డి) ఒక చెక్క దిమ్మెపై ఇనుప ముక్కను ఉంచి చెక్కదిమ్మె నీటిలో సాధారణ స్థితికంటే ఎక్కువ మునిగేటట్లు చేశారు. ఒకవేళ ఇనుప ముక్కను చెక్కదిమ్మెకు వేలాడదీస్తే చెక్కదిమ్మె ఎంతవరకు మునుగుతుంది? మొదటకంటే ఎక్కువ లోతుకా? తక్కువ లోతుకా?
జవాబు:
మొదటకంటే ఎక్కువ లోతుకు మునుగుతుంది.
9th Class Physical Science Textbook Page No. 143
ప్రశ్న 4.
‘ఒక సరదా కృత్యం చేద్దాం’ అనే కృత్యాన్ని నిర్వహించారు కదా… ఈ కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ఎ) కిరోసిన్ నీటిపై తేలుతుందా? లేక నీరు కిరోసిన్ పై తేలుతుందా?
జవాబు:
కిరోసిన్ నీటిపై తేలుతుంది.
బి) ఏయే వస్తువులు కిరోసిన్ పై తేలుతున్నాయి?
జవాబు:
గుండీలు, అగ్గిపుల్లలు, చిన్న చిన్న కాగితం ఉండలు వంటివి కిరోసిన్ పై తేలుతున్నాయి.
సి) ఏయే వస్తువులు కిరోసిన్లో మునిగి నీటిపై తేలుతున్నాయి?
జవాబు:
మైనం కిరోసిన్లో మునుగుతుంది, కాని నీటిపై తేలుతుంది.
డి) ఏయే వస్తువులు నీటిలో మునిగాయి?
జవాబు:
గుండు సూదులు, చిన్న రాళ్ళు, ఇసుక వంటివి నీటిలో మునిగాయి.
ఇ) పరీక్షనాళికలో ఏయే వస్తువులు ఎలా అమరాయో తెలిపే పటాన్ని గీయండి.
జవాబు:
ఎఫ్) ఎందుకు కొన్ని వస్తువులు తేలుతున్నాయి? కొన్ని మునుగుతున్నాయి?
జవాబు:
ఈ విధమైన ప్రవర్తనకు ఆయా వస్తువుల సాంద్రత ప్రధాన కారణం.
ప్రశ్న 5.
గాజు గోళీకన్నా బరువైన చెక్కముక్కలు నీటిలో ఎందుకు తేలుతున్నాయి?
జవాబు:
నీటి సాంద్రతతో పోల్చినపుడు చెక్క యొక్క సాంద్రత తక్కువగాను, గాజు (గోళీ) యొక్క సాంద్రత ఎక్కువగాను ఉంటుంది. అందువల్ల చెక్క నీటిపై తేలుతుంది.
ప్రశ్న 6.
అసలు ‘బరువు’, ‘తేలిక’ అంటే ఏమిటి?
జవాబు:
‘బరువు’, ‘తేలిక’ అనేవి వస్తువు యొక్క సాంద్రత మీద ఆధారపడి నిర్ణయించబడతాయి. ఒకే ఘనపరిమాణం గల రెండు వస్తువులను తీసుకున్నపుడు వాటిలో ఏది ఎక్కువ ద్రవ్యరాశిని కలిగియుంటుందో దానిని ‘బరువైన’ వస్తువుగా చెబుతాము.
9th Class Physical Science Textbook Page No. 147
ప్రశ్న 7.
ప్రయోగశాల కృత్యం 2 ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ఎ) కొబ్బరినూనెను నీటితో కలిపితే ఏది పైన తేలుతుంది?
జవాబు:
కొబ్బరినూనె పైన తేలుతుంది.
బి) కిరోసిన్లో చెక్కముక్కను పడవేస్తే మునుగుతుందా? తేలుతుందా? కారణం చెప్పండి.
జవాబు:
చెక్కముక్కను కిరోసిన్లో పడవేస్తే వెంటనే తేలుతుంది. కారణం చెక్క యొక్క సాంద్రత కిరోసిన్ సాంద్రతకన్నా తక్కువ ఉంటుంది. కాని కొంత సేపటి తర్వాత, చెక్కముక్క కిరోసినను పీల్చుకొని కిరోసిన్లో మునుగుతుంది.
సి) మైనం ముక్క నీటిలో తేలుతుందని, మరొక ద్రవం ‘X’ లో మునుగుతుందని అంటే ‘X’ ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా?
జవాబు:
మరొక ద్రవం ‘X’ యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ ఉంటుంది. కారణం :
- నీటి సాపేక్ష సాంద్రత = 1
- మైనం యొక్క సాపేక్ష సాంద్రత 1 కన్నా తక్కువ.
- కావున మైనం నీటిపై తేలును.
- కాని మైనం, మరొక ద్రవం ‘X’ లో మునుగును.
- కావున ఆ ద్రవం యొక్క సాపేక్ష సాంద్రత మైనం యొక్క సాపేక్ష సాంద్రత కన్నా తక్కువ ఉండాలి.
ప్రశ్న 8.
పాలకు నీరు కలిపితే ఆ మిశ్రమం యొక్క సాంద్రత పాల సాంద్రతకన్నా ఎక్కువ ఉంటుందా? లేక తక్కువ ఉంటుందా?
జవాబు:
పాలకు నీరు కలిపితే ఆ మిశ్రమం యొక్క సాంద్రత పాల సాంద్రతకన్నా తక్కువ ఉంటుంది.
ప్రశ్న 9.
సమాన ఘనపరిమాణం గల రెండు సీసాలలో ఒక దానిలో స్వచ్ఛమైన పాలని, మరొక దానిలో నీళ్ళు కలిపిన పాలని పోస్తే ఏసీసా బరువుగా ఉంటుంది?
జవాబు:
స్వచ్ఛమైన పాలు గల సీసా బరువుగా ఉంటుంది.
9th Class Physical Science Textbook Page No. 152
ప్రశ్న 10.
చిన్న చిన్న ఇనుప ముక్కలు నీటిలో మునుగుతున్నప్పటికీ, ఇనుము మరియు స్టీలు వంటి పదార్థాలతో చేయబడిన పెద్ద పెద్ద నౌకలు నీటిలో ఎలా తేలుతున్నాయో వివరించగలరా?
జవాబు:
- ఆర్కిమెడీస్ ఉత్సవన నియమం ప్రకారం, ఏదైనా వస్తువు ద్రవంలో ముంచబడినపుడు ఆ వస్తువుచే తొలగించబడిన నీటి బరువు, ఆ వస్తువు బరువుకు సమానమైనపుడు ఆ వస్తువు ఆ ద్రవంలో తేలుతుంది.
- కావున నౌకలను, వాటి బరువుకు సమానమైన బరువుగల నీటిని తొలగించే విధంగా అధిక ఉపరితల వైశాల్యంతో నిర్మిస్తారు.
ప్రశ్న 11.
ఒక లోహపు ముక్కకన్నా అంతే ద్రవ్యరాశి గల ఆ లోహంతో తయారుచేయబడిన గిన్నె ఎందుకు ఎక్కువ నీటిని పక్కకు తొలగిస్తుంది?
జవాబు:
లోహపు గిన్నె యొక్క ఉపరితల వైశాల్యం, లోహపు ముక్క యొక్క ఉపరితల వైశాల్యం కన్నా ఎక్కువ. అందువల్ల లోహపు గిన్నె ఎక్కువ నీటిని పక్కకు తొలగిస్తుంది.
9th Class Physical Science Textbook Page No. 153
ప్రశ్న 12.
గాజు గొట్టంలో పాదరస మట్టం ఎందుకు 76 సెం.మీ. ఉంటుంది?
జవాబు:
గాజు గొట్టంలోని పాదరస మట్టం యొక్క “భారం” దానిపై వాతావరణ పీడన ఫలితంగా గిన్నెలోని పాదరసం వల్ల కలిగే బలానికి సమానంగా ఉంటుంది. కావున గొట్టంలోని పాదరసం బరువు, గిన్నె పైనున్న వాతావరణ పీడనానికి సరిగ్గా సమానమయ్యేవరకు గొట్టంలోని పాదరసమట్టం మారుతూ ఉంటుంది. ఇది 76 సెం.మీ వద్ద స్థిరంగా ఉంటుంది.
9th Class Physical Science Textbook Page No. 157
ప్రశ్న 13.
రాయి నీటిలో మునిగినపుడు దాని భారాన్ని కోల్పోయినట్లు ఎందుకు అనిపిస్తుంది?
జవాబు:
నీటిలో ముంచబడిన రాయిపై ఊర్ధ్వదిశలో కలుగజేయబడిన ఉత్సవన బలం వలననే దానిపై భూమ్యాకర్షణ బలం, తగ్గినట్లయి ఆ రాయి బరువు కోల్పోయినట్లనిపిస్తుంది.
పరికరాల జాబితా
నీరు, కిరోసిన్, గుండీలు, గుండుసూదులు, అగ్గిపుల్లలు, చిన్న రాళ్లు, చిన్న కాగితం ఉండలు, ఇసుక, మైనం ముక్కలు, గాజు గోళీలు, చెక్క ముక్కలు, పెన్సిల్ రబ్బరు, చెక్కదిమ్మె, గాజు స్లెడులు, ఇనుప సీలలు, ప్లాస్టిక్ ఘనాలు, అల్యూమినియం sheet, రాళ్లు, బెండ్లు, పాలు, కొబ్బరినూనె, ఖాళీ బాల్ పెన్ రీఫిల్, ఖాళీ ప్లాస్టిక్ సీసా, బకెట్, నీరు, గాజు గ్లాస్, బీకరు, దూది, రాయి, పరీక్ష నాళిక, ఓవర్ ఫ్లో పాత్ర, 50 మి.లీ. కొలజాడీ, సాధారణ త్రాసు, బరువులు, స్ప్రింగ్ త్రాసు, సాంద్రత బుడ్డి, లావు పరీక్ష నాళిక, పాస్కల్ నియమాన్ని ప్రదర్శించే నమూనా
9th Class Physical Science 9th Lesson తేలియాడే వస్తువులు Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
సాంద్రతలను పోల్చడం :
ప్రశ్న 1.
సాంద్రత, సాపేక్ష సాంద్రతలను ఒక కృత్యం ద్వారా పోల్చుము.
జవాబు:
- ఒకే పరిమాణం గల రెండు పరీక్షనాళికలను తీసుకొని ఒకదానిలో నీరు, మరొక దానిలో నూనె నింపండి.
- వాటి బరువులు కనుగొనండి.
- నూనెతో నింపిన పరీక్షనాళిక బరువు ఎక్కువ ఉన్నట్లుగా గుర్తిస్తాము.
- దీనిని బట్టి నూనె సాంద్రత ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది.
- ఒకే పరిమాణం గల చెక్క, రబ్బరు దిమ్మెలను తీసుకోండి.
- వాటి బరువులు కనుక్కోండి.
- చెక్క దిమ్మె, రబ్బరు దిమ్మెకన్నా ఎక్కువ బరువు ఉన్నట్లు గమనిస్తాము.
- రెండు వస్తువుల సాంద్రతలను పోల్చాలంటే వాటిని సమాన ఘనపరిమాణంలో తీసుకొని వాటి ద్రవ్యరాశులను పోల్చడం ఒక పద్ధతి. అయితే ఇది అన్నిరకాల ఘనపదార్థాలకు వీలుపడకపోవచ్చు.
- దీనికొరకు ప్రతి వస్తువు సాంద్రతను నీటి సాంద్రతతో పోల్చి చూసే ఒక సులభమైన పద్ధతి ఉంది. దీనినే సాపేక్ష సాంద్రత అంటారు.
కృత్యం – 3
నీటి సాంద్రత కన్నా అధిక సాంద్రత కలిగిన పదార్థంతో తయారైన వస్తువులు నీటిలో తేలుతాయా?
ప్రశ్న 2.
నీటి సాంద్రత కన్నా అధిక సాంద్రత కలిగిన పదార్థంతో తయారైన వస్తువులు నీటిలో తేలుతాయా? ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
1) కింది పట్టికలో సూచించిన విధంగా కొన్ని వస్తువులను సేకరించండి.
2) ప్రతి వస్తువును ఒకదాని తర్వాత మరొకటిగా ఒక గ్లాసులోని నీటిలో వేసి, అవి మునుగుతాయో, తేలుతాయో గమనించండి.
3) మీ పరిశీలనలను కింది పట్టికలో నమోదు చేయండి.
వస్తువు | సాపేక్ష సాంద్రత | మునుగుతుందా? తేలుతుందా? |
పెన్సిల్ రబ్బరు | తేలుతుంది | |
రబ్బరు బంతి | తేలుతుంది | |
ప్లాస్టిక్ ఘనం | తేలుతుంది | |
ఇనుప సీల | మునుగుతుంది | |
ఇనుప పెట్టె | మునుగుతుంది | |
జామెట్రీ బాక్స్ | తేలుతుంది | |
గాజు గోళీ | మునుగుతుంది | |
చెక్క | తేలుతుంది | |
రాయి | మునుగుతుంది |
a) ప్రయోగ క్షేత్ర పరిశీలనలు (1) లో సూచించిన విధంగా ప్రతి వస్తువు యొక్క సాపేక్ష సాంద్రతలను కనుక్కోండి.
b) కొన్ని వస్తువులు నీటిలో మునుగుటను, కొన్ని వస్తువులు తేలుటను గమనిస్తాము.
c) జామెట్రీ బాక్సు వంటిది ఇనుముతో చేసినదైనప్పటికీ, నీటిపై తేలుటను గమనిస్తాము.
d) కావున వస్తువు నీటిలో మునుగుట, తేలుట అనేది ఆ వస్తువు యొక్క సాపేక్ష సాంద్రత పైనే కాదు, ఆ వస్తువు ఉపరితల వైశాల్యం పైన కూడా ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
కృత్యం – 4
వస్తుభారం, తొలగింపబడిన నీటిభారాలు సమానమా?
ప్రశ్న 3.
నీటిలో తేలే వస్తువు విషయంలో, ఆ వస్తువు బరువు దానిచే తొలగింపబడిన నీటి భారానికి సమానంగా ఉంటుందని చూపండి.
జవాబు:
- ఒక బీకరును తీసుకొని దాని భారాన్ని త్రాసుతో కొలిచి నమోదు చేయండి.
- ఓవర్ ఫ్లో పాత్రలో నీటిని నింపి, దాని పక్క గొట్టం గుండా నీరు పొర్లిపోవడం ఆగేంతవరకు వేచిచూడండి.
- త్రాసులో తూచిన బీకరును తీసి ఓవర్ ఫ్లో పాత్ర పక్క గొట్టం కింద ఉంచండి.
- ఒక చెక్క దిమ్మెను తీసుకొని మొదటగా దానిని నీటిలో తడిపి, తర్వాత దానిని ఓవర్ ఫ్లో పాత్రలోని నీటిలో నెమ్మదిగా జారవిడవండి.
- చెక్కదిమ్మెను నీటిలో విడవగానే పొర్లిన నీరు’ బీకరులో చేరుతుంది.
- ఇప్పుడు బీకరు బరువును నీటితో సహా కనుక్కోండి.
- రెండవసారి కనుగొన్న బీకరు బరువునుండి, మొదటిసారి కనుగొన్న బీకరు బరువును తీసివేస్తే చెక్కదిమ్మెచే తొలగించబడిన నీటి బరువు వస్తుంది.
- ఇప్పుడు చెక్కదిమ్మెను ఓవర్ ఫ్లో పాత్ర నుండి తీసివేసి, ఆరనిచ్చి, దాని బరువును కనుక్కోండి.
- చెక్కదిమ్మె బరువు, ఆ చెక్కదిమ్మెచే తొలగింపబడిన నీటి బరువులు సమానమని మనకు తెలుస్తుంది.
- ఇదే ప్రయోగాన్ని వివిధ రకాల వస్తువులతో చేసి మీ పరిశీలనలను కింది పట్టికలో నమోదు చేయండి.
కృత్యం – 5
అల్యూమినియంను తేలేటట్లు చేద్దాం :
ప్రశ్న 4.
అల్యూమినియంను తేలేటట్లు చేసే విధానాన్ని వివరింపుము.
జవాబు:
- పలుచటి అల్యూమినియం రేకును కొద్దిగా తీసుకోండి.
- దానిని 4 – 5 మడతలు మడవండి.
- దానిని నీటిలో పడవేసి పరిశీలించండి. అది మునుగుటను గమనిస్తాము.
- తర్వాత అల్యూమినియం రేకును బయటికి తీసి, దానిని తెరిచి ఒక గిన్నెవలె తయారుచేయండి. దానిని నీటిలో ఉంచి పరిశీలించండి.
- అది తేలుటను గమనిస్తాము.
- గిన్నె బరువును కనుక్కోండి.
- ఆ అల్యూమినియం గిన్నెచే తొలగింపబడిన నీటి బరువును కనుక్కోండి.
- ఈ రెండు బరువులు సమానంగా ఉండడాన్ని గమనించండి.
- కావున ఒక వస్తువు బరువు, దానిచే తొలగింపబడిన నీటి బరువుకు సమానమయినపుడు ఆ వస్తువు నీటిలో తేలుతుంది.
కృత్యం – 6
ద్రవాలలో ఊర్ధ్వముఖ బలాన్ని పరిశీలిద్దాం :
ప్రశ్న 5.
ద్రవం వస్తువులపై ఊర్ధ్వముఖ పీడనాన్ని కలుగజేస్తుందని ఋజువు చేయండి.
జవాబు:
- ఒక ఖాళీ ప్లాస్టిక్ సీసాను తీసుకొని దానికి గట్టిగా మూతను బిగించండి.
- ఆ సీసాను ఒక బకెట్ లోని నీటిలో ఉంచండి.
- అది నీటిలో తేలుతుంది.
- ఆ సీసాను పటంలో చూపినట్లు నీటిలోకి అదమండి. పై దిశలో ఒత్తిడి కలుగుతున్నట్లు అనిపిస్తుంది.
- సీసాను ఇంకా కిందికి అదమండి. పై దిశలో పనిచేసే బలం పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
- ఇప్పుడు సీసాను వదిలేయండి. అది నీటి ఉపరితలంపైకి దూసుకు వస్తుంది.
- ఊర్ధ్వ దిశలో పనిచేసే నీటి యొక్క ఈ బలం నిజమైనది మరియు పరిశీలించడానికి అనువైనది.
- ఒక వస్తువు ఉపరితల ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని “పీడనం” అంటారు.
కృత్యం – 7
గాలి పీడనాన్ని పరిశీలిద్దాం :
ప్రశ్న 6.
గాలి పీడనాన్ని పరిశీలించడానికి ఒక కృత్యాన్ని వివరించండి.
జవాబు:
- ఒక గాజుగ్లాసును తీసుకొని దానిలో అడుగుభాగాన కొంత దూదిని అంటించండి.
- గ్లాసును తలకిందులుగా చేసి పటంలో చూపినట్లు ఒక పాత్రలోని నీటిలో అడుగువరకు ముంచండి.
- తర్వాత గ్లాసును అలాగే బయటకు తీయండి.
- గ్లాసులోని దూది తడవకుండా ఉండడాన్ని గమనిస్తాము.
- గ్లాసులోని గాలి యొక్క ఒత్తిడి నీటి పై పనిచేసి గ్లాసులోనికి నీరు చేరకుండా అడ్డుకుంది.
- నీటి ఉపరితలంపైన ప్రమాణ వైశాల్యంలో కలుగజేయబడిన ఈ గాలి ఒత్తిడిని గాలి పీడనం అంటారు.
కృత్యం – 8
ఉత్ల్ఫవన బలాన్ని కొలవగలమా? ప్రయత్నిద్దాం !
ప్రశ్న 7.
ఉత్ల్ఫవన బలాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
- ఒక రాయిని స్ప్రింగు త్రాసుకు కట్టి దాని బరువును కనుగొనండి.
- ఒక బీకరులో సగం వరకు నీటిని తీసుకోండి.
- స్ప్రింగు త్రాసుకు వేలాడదీయబడిన రాయిని నీటిలో ముంచండి.
- ఇప్పుడు స్ప్రింగు త్రాసు రీడింగు నీటిలో ముంచబడిన రాయి బరువును తెలుపుతుంది.
- నీటిలో మునిగినప్పుడు రాయి బరువు మొదట ఉన్న బరువుకన్నా తగ్గినట్లుండడం గమనిస్తాము.
- ఆ రాయి కోల్పోయినట్లనిపించే బరువుని కొలవడం ద్వారా ఆ ద్రవం కలిగించిన ఉత్సవన బలాన్ని కొలవగలుగుతాము.
కృత్యం – 9
రాయి చేత తొలగింపబడిన నీటి బరువును కొలుద్దాం:
ప్రశ్న 8.
ఆర్కిమెడీస్ ఉత్తీవన సూత్రాన్ని పేర్కొని నిరూపించుము.
(లేదా)
ఆర్కిమెడిస్ సూత్రం తెలిపి దానిని ప్రయోగ పూర్వకంగా నీవెలా ఋజువు చేస్తావో రాయండి.
జవాబు:
ఆర్కిమెడీస్ ఉత్తవన సూత్రం:
ఏదైనా ఒక వస్తువును ఒక ప్రవాహిలో పూర్తిగా గాని, పాక్షికంగా గాని ముంచినప్పుడు ఆ వస్తువు తొలగించిన ప్రవాహి బరువుకు సమానమైన ఉత్సవన బలం ఆ వస్తువుపై ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది.
నిరూపణ:
- ఒక రాయిని తీసుకొని స్ప్రింగ్ త్రాసుతో దాని బరువును తూచండి.
- ఒక ఓవర్ ఫ్లో పాత్రను తీసుకొని దాని పక్క గొట్టం వరకు నీరు పోయండి.
- పటంలో చూపినట్లు ఆ పక్క గొట్టం కింద కొలతలు గల బీకరును ఉంచండి.
- ఇప్పుడు స్ప్రింగు త్రాసుకు వేలాడదీసిన రాయిని ఓవర్ ఫ్లో పాత్రలో పూర్తిగా ముంచండి.
- స్ప్రింగు త్రాసు రీడింగును, బీకరులోని నీటి కొలతను నమోదు చేయండి.
- స్ప్రింగు త్రాసు రీడింగు నీటిలో ముంచబడిన రాయి బరువును, బీకరులోని నీటి కొలత రాయి వలన తొలగించబడిన నీటి ఘనపరిమాణాన్ని తెలుపుతుంది.
- స్ప్రింగు త్రాసు యొక్క రెండు రీడింగులలోని తేడా, ఆ రాయి నీటిలో కోల్పోయినట్లనిపించే బరువుకు సమానం.
- బీకరులోని నీటి బరువును కనుక్కోండి.
- తగ్గినట్లనిపించే రాయి బరువు, ఆ రాయిచే తొలగింపబడిన నీటి బరువు సమానంగా ఉంటాయి.
- ఇది ఆర్కిమెడీస్ సూత్రానికి నిరూపణ.