SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Physical Science 5th Lesson Questions and Answers పరమాణువులో ఏముంది ?
9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
పరమాణువులో గల మూడు ఉపకణాలేమిటి?
జవాబు:
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి పరమాణువులో గల మూడు ఉపకణాలు.
ప్రశ్న 2.
ఎలక్ట్రాన్, ప్రోటాన్, మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి.
జవాబు:
ప్రశ్న 3.
జె.జె. థామ్సన్ పరమాణు నమూనా పరిమితులను తెలపండి.
జవాబు:
పరమాణువులో ధనాత్మక మరియు ఋణాత్మక కణాలు ఒకదానినొకటి తటస్థ పరచుకోకుండా ఎలా రక్షింపబడుతున్నాయో వివరించలేకపోవడమే జె.జె. థామ్సన్ పరమాణు నమూనా యొక్క ముఖ్య లోపము.
ప్రశ్న 4.
రూథర్ ఫర్డ్ బంగారురేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు తెలపండి.
జవాబు:
రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగం యొక్క ముఖ్యమైన మూడు పరిశీలనలు :
- పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంటుంది.
- పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతిచిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు ఉండవు. దీని పరిమాణం పరమాణు పరిమాణంతో పోలిస్తే అత్యంత చిన్నది.
- ఈ కేంద్రకం చుట్టూ ఋణావేశ ఎలక్ట్రానులు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. ఈ చలనం సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండుట వలన రూథర్‌ఫర్డ్ నమూనాను గ్రహమండల నమూనా అంటారు.
ప్రశ్న 5.
సరైన దానికి (✓), సరికాని వాటికి (✗) లను గుర్తించండి.
i) రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, చాలా ఎక్కువ సంఖ్యలో ఆల్ఫా కణాలు బంగారు రేకులోంచి నేరుగా చొచ్చుకుపోయాయి. ఈ పరిశీలన ద్వారా కింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
ఎ) పరమాణువులో అతి చిన్న ధనావేశ ప్రాంతం ఉంటుంది. (✓)
బి) పరమాణువులో చాలా ప్రదేశం ఖాళీగా ఉంటుంది. (✓)
సి) ఆల్ఫా కణాలు ధనావేశ ప్రాంతంను నేరుగా ఢీ కొంటాయి. (✓)
డి) పరమాణువులో దట్టమైన ధనావేశ ప్రాంతం ఉంటుంది. (✗)
ii) రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో, కొన్ని సార్లు ఆల్ఫా కణాలు మాత్రం ఋజుమార్గం నుండి విచలనం చెందుతాయి. ఈ పరిశీలనల నుంచి క్రింది వానిలో ఏ నిర్ధారణకు రావచ్చు?
ఎ) పరమాణువులో ధనావేశం అతి తక్కువ ప్రాంతంలో ఉంటుంది. (✓)
బి) పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది. (✓)
సి) ఆల్ఫా కణాలు ధనావేశ ప్రాంతాన్ని నేరుగా ఢీ కొంటాయి. (✓)
డి) పరమాణువులో ధనావేశ ప్రాంతం దట్టంగా ఉంటుంది. (✗)
ప్రశ్న 6.
సోడియం ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి క్రింది వానిలో సరియైనది ఏది?
ఎ) 2, 8
బి) 8, 2,1
సి) 2, 1, 8
డి) 2, 8, 1
జవాబు:
డి) 2, 8, 1
ప్రశ్న 7.
బోర్ పరమాణు నమూనా ముఖ్యాంశాలు పేర్కొనండి.
జవాబు:
బోర్ పరమాణు నమూనాలోని మౌలిక ప్రతిపాదనలు :
- పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రానులు ఉంటాయి. ఈ స్థిర కక్ష్యలనే శక్తి స్థాయిలని పిలుస్తాం.
- ఈ స్థిర కక్ష్యలలో తిరుగుతున్నంత సేపూ ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
- పటంలో చూపినట్లు ఈ స్థిర కక్ష్యలను K, L, M, N …… అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 ……. అంకెలతో సూచిస్తాం.
ప్రశ్న 8.
మెగ్నీషియం, సోడియం మూలకాల సంయోజకతలను తెలపండి.
జవాబు:
మెగ్నీషియం :
- మెగ్నీషియం పరమాణు సంఖ్య – 12,
- ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 8, 2
- చిట్టచివరి కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కావున మెగ్నీషియం సంయోజకత 2.
సోడియం :
- సోడియం పరమాణు సంఖ్య – 11,
- ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 8, 1
- చిట్టచివరి కక్ష్యలో 1 ఎలక్ట్రాన్ ఉన్నది. కావున సోడియం సంయోజకత 1.
ప్రశ్న 9.
ద్రవ్యరాశి సంఖ్య 32 మరియు న్యూట్రాన్ల సంఖ్య 16 గా గల మూలకం పరమాణు సంఖ్యను, సంకేతాన్ని రాయండి.
జవాబు:
ద్రవ్యరాశి సంఖ్య (A) = 32 ; న్యూట్రాన్ల సంఖ్య (N) = 16
పరమాణు సంఖ్య Z = A – N = 32 – 16 = 16
∴ పరమాణు సంఖ్య 16 గా గల మూలకం : “సల్ఫర్”
సంకేతం : ‘S
ప్రశ్న 10.
Cl– లో పూర్తిగా నిండిన K మరియు L కర్పరాలు ఉంటాయి. వివరించంది.
జవాబు:
Cl– (క్లోరిన్) పరమాణు సంఖ్య – 17.
ఎలక్ట్రాన్ల పంపిణీ K
2n² సూత్రం ప్రకారం K కక్ష్య 2 ఎలక్ట్రాన్లను, ఒక్య 8 ఎలక్ట్రాన్లను గరిష్టంగా నింపుకోగలదు. కావున K మరియు Lక్ష్యలు పూర్తిగా నిండి ఉన్నాయి.
ప్రశ్న 11.
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల మధ్య ముఖ్య భేదమేమి?
జవాబు:
ఒకే మూలకానికి చెందిన ఐసోటోపుల మధ్య ముఖ్య భేదం :
- న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండదు.
- భౌతిక ధర్మాలు వేరుగానున్నప్పటికి రసాయన ధర్మాలలో సారూప్యత ఉంటుంది.
ప్రశ్న 12.
కింది వాక్యాలను పరిశీలించి ఒప్పు అయితే ‘T’ అని, తప్పు అయితే ‘F” అని వాటికి ఎదురుగా రాయండి.
a) పరమాణువు యొక్క కేంద్రకం కేంద్రక కణాలను మాత్రమే కలిగి ఉంటుందని థామ్సన్ ప్రతిపాదించాడు.
b) ఎలక్ట్రాన్, ప్రోటాన్ల సంయోగం వల్ల న్యూట్రాన్ ఏర్పడును. అందుచే న్యూట్రాన్ తటస్థంగా ఉంటుంది.
c) ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశిలో \(\frac{1}{1836}\) వంతు ఉంటుంది.
జవాబు:
a) (F)
b) (F)
c) (T)
ప్రశ్న 13.
“పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎందుకు ఉండవు?” అని గీతకు అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని నివృత్తి చేయగలరా? వివరించండి.
జవాబు:
పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్ మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఉండవు. ఒకవేళ అలా ఉంటే,
a) రూథర్ ఫర్డ్ α – కణ పరిక్షేపణ ప్రయోగంలో α – కణాలు పరిక్షేపణంగాని, విక్షేపణంగాని చెందవు.
b) ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణనలోకి తీసుకోలేనంత చిన్నది మరియు ఎలక్ట్రాన్ అస్థిరమైనది కావున ‘కేంద్రకము’ అనే భావన వచ్చి ఉండేది కాదు.
ప్రశ్న 14.
Z = 5 అయితే ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత?
జవాబు:
పరమాణు సంఖ్య Z = 5. ; ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 3
సంయోజకత : 3
ప్రశ్న 15.
ఈ క్రింది పట్టికలో ఖాళీలను సరైన సమాచారంతో పూరించండి.
జవాబు:
ప్రశ్న 16.
రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాని గీయండి. దీనిని గ్రహమండల నమూనా అని ఎందుకు అంటాం?
జవాబు:
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ల చలనం, సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండడం వల్ల రూథర్‌ఫర్డ్ నమూనాని గ్రహమండల నమూనా అంటారు.
ప్రశ్న 17.
పరమాణువు యొక్క నిర్మాణాన్ని, వివిధ పరమాణు నమూనాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మీరెలా అభినందిస్తారు?
జవాబు:
నేటికీ అనేక ఆలోచనలు రేకెత్తిస్తూ, శాస్త్రజ్ఞులపై కొత్త కొత్త సవాళ్ళు విసురుతున్నది పరమాణు నిర్మాణం అనే భావన.
1) ప్రస్తుతం మనకు తెలిసిన పరమాణు నిర్మాణానికి మూలమైన సిద్ధాంతాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు-లెవోయిజర్ (ద్రవ్యనిత్యత్వ నియమం), జోసెఫ్ ప్రొస్ట్ (స్థిరానుపాత నియమం), డాల్టన్ – (తన మొట్టమొదటి పరమాణు నమూనా), J.J. థామ్సన్ (పుచ్చకాయ నమూనా), రూథర్ ఫర్డ్ (గ్రహమండల నమూనా), నీల్స్ బోర్ (శక్తి స్థాయిలు) వంటి వారిని అభినందించక తప్పదు.
2) పరమాణువులో ఉండే మూడు ఉపకణాలైన ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లతోపాటు ఇంకా ఎన్ని ఉపకణాలున్నాయనే దానిపై నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
3) పరమాణు నిర్మాణం తెలియడం, అనేక నూతన ఆవిష్కరణలకు దారితీసి మన జీవితాన్ని సుఖమయం చేసిన శాస్త్రవేత్తల కృషిని అభినందించడంతో బాటు మనముందున్న ఎన్నో సవాళ్ళను స్వీకరించి పరిష్కారం కనుగొనవలసి ఉన్నది.
ప్రశ్న 18.
మీ పాఠ్యాంశంలో ఇచ్చిన వివిధ పరమాణు నమూనాలను పోల్చంది.
జవాబు:
ఈ అధ్యాయంలో నాలుగు పరమాణు నిర్మాణాలు చర్చించబడినవి. వాటిలోని ముఖ్యాంశాలు.
1) డాల్టన్ ప్రతిపాదన :
- పరమాణువు విభజింప వీలుకానిది.
- ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇతర మూలక పరమాణువులకు భిన్నంగా ఉంటాయి.
2) J.J. థామ్సన్ ప్రతిపాదన :
- పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.
- పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది.
3) రూథర్‌ఫర్డ్ ప్రతిపాదన :
- పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతి చిన్న సాంధ్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు ఉండవు.
- ఋణావేశ ఎలక్ట్రానులు ఈ కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంటాయి.
- పరమాణు కేంద్రక పరిమాణం పరమాణువుతో పోలిస్తే చాలా చిన్నది.
- దీనిని గ్రహమండల నమూనా అంటారు.
4) నీల్స్ బోర్ ప్రతిపాదనలు :
- పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిరకక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిర కక్ష్యలనే శక్తిస్థాయిలు అంటారు.
- ఈ స్థిర కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత సేపూ ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
- ఈ స్థిర కక్ష్యలను K, L, M, N ….. అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 …. అంకెలతో సూచిస్తాం.
ప్రశ్న 19.
నైట్రోజన్ మరియు బోరాన్లను ఉదాహరణలుగా తీసుకొని సంయోజకతని నిర్వచించండి.
జవాబు:
సంయోజకత :
పరమాణువు యొక్క బాహ్యతమ కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు.
(లేదా)
పరమాణు సంయోగ సామర్థ్యాన్నే సంయోజనీయత అంటారు.
నైట్రోజన్ సంయోజకత :
- నైట్రోజన్ పరమాణు సంఖ్య – 7.
- ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 5
- చిట్టచివరి కక్ష్యలో 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
- కావున నైట్రోజన్ సంయోజకత 5 కావలెను. కానీ ‘అష్టకం’ను పొందుటకు 5 ఎలక్ట్రాన్లను కోల్పోవడం కన్నా 3 ఎలక్ట్రాన్లను గ్రహించడం తేలిక.
- కావున నైట్రోజన్ సంయోజకత ‘3’.
బోరాన్ సంయోజకత :
- బోరాన్ పరమాణు సంఖ్య – 5
- ఎలక్ట్రాన్ల పంపిణీ : 2, 3
- బోరాన్ చిట్టచివరి కక్ష్యలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
- కావున బోరాన్ సంయోజకత 3.
ప్రశ్న 20.
జాన్ డాల్టన్ నుండి నీళ్బర్ వరకు ఉన్న శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను “పరమాణువు చరిత్ర” అనే శీర్షికతో ఒక కథగా రాయండి.
జవాబు:
పరమాణువు చరిత్ర :
ద్రవ్యనిత్యత్వ నియమము, స్థిర అనుపాత నియమమును ఆధారంగా చేసుకొని జాన్ డాల్టన్ పరమాణు నిర్మాణాన్ని ప్రతిపాదించాడు.
డాల్టన్ ప్రకారము :
- పరమాణువు విభజింప వీలుకానిది.
- ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఇతర మూలక పరమాణువులకు భిన్నంగా ఉంటాయి. తదుపరి J.J. థామ్సన్, పరమాణువు విభజింప తగినదని తెలిపాడు.
J.J. థామ్సన్ ప్రకారం –
- పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి, దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.
- పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంఫిణీ చేయబడి ఉంటుంది.
- మొత్తం ధనావేశాలు, ఋణావేశాలు సమానంగా ఉండటం వల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. ఈ నమూనాను పుచ్చకాయ నమూనా లేక ప్లమ్ పుడ్డింగ్ నమూనా అంటారు.
- గోల్డ్ స్టెయిన్ 1886లో శ్” వాస్ కనుగొన్నాడు.
అనంతరం థామ్సన్ శిష్యుడైన రూథర్ ఫర్డ్, 4-కణ పరిక్షేపణ ప్రయోగం థామ్సన్ నమూనాకు భిన్నమైన ఫలితాలనిచ్చింది. దీని ఆధారంగా రూథర్‌ఫర్డ్ ప్రతిపాదించిన నమూనా యొక్క ముఖ్యాంశాలు :
- పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతి చిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది.
- ఋణావేశ ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో చలిస్తుంటాయి.
- పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం అత్యంత చిన్నది.
కానీ ఈ నమూనా పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోయింది.
1913లో నీల్స్ బోర్, రూథర్ ఫర్డ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి మరొక నమూనాను ప్రతిపాదించాడు. దీని ప్రకారం –
- పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిరకక్ష్యలనే శక్తి స్థాయిలని పిలుస్తాం.
- ఈ స్థిర కక్ష్యలలో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించిపోకుండా ఉంటాయి.
- ఈ స్థిర కక్ష్యలను K, L, M, N … అక్షరాలతో లేదా n = 1, 2, 3, 4 … అంకెలతో సూచిస్తాం. ఈ నమూనా హైడ్రోజన్ కంటే బరువైన పరమాణు వర్ణపటాలను వివరించలేకపోయింది.
… ఇలా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది …
9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook InText Questions and Answers
9th Class Physical Science Textbook Page No.76
ప్రశ్న 1.
పరమాణువు తటస్థమైనది. కానీ అందులో ఋణావేశపూరిత ఎలక్ట్రానులు ఉంటాయి. ఋణావేశాలు మాత్రమే ఉంటే పరమాణువు తటస్థంగా ఉండదు. అప్పుడు పరమాణువు ఎందుకు తటస్థమైనదిగా ఉంది?
జవాబు:
- ఈ భావన ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఆవిష్కరణ జరగకముందుది, అంతేగాక రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాను ప్రతిపాదించక ముందుది.
- రూథర్ ఫర్డ్ పరమాణు నిర్మాణం ప్రతిపాదన ప్రకారం కేంద్రకం లోపల ఉండే ప్రోటాన్ల సంఖ్య, కేంద్రకం బయట ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం.
- దీనివల్ల మొత్తం ఋణావేశం, మొత్తం ధనావేశానికి సమానమై పరమాణువు తటస్థంగా ఉంటుంది.
9th Class Physical Science Textbook Page No. 80
ప్రశ్న 2.
కింది ప్రశ్నల ఆధారంగా రూథర్ ఫర్డ్, థామ్సన్ పరమాణు నమూనాలు పోల్చంది.
1) ధనావేశం ఎక్కడ ఉంది?
2) ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి?
3) ఇవన్నీ పరమాణువులో నిశ్చలంగా ఉంటాయా? లేదా చలిస్తూ ఉంటాయా?
జవాబు:
ప్రశ్నలు | థామ్సన్ నమూనా | రూథర్ ఫర్డ్ నమూనా |
ధనావేశం ఎక్కడ ఉంది? | ధనావేశం, పరమాణువు అంతటా సమంగా విస్తరించబడింది. | ధనావేశ ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయి. |
ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి? | పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి. | ఋణావేశ ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. |
ఇవన్నీ పరమాణువులో నిశ్చలంగా ఉంటాయా? లేదా చలిస్తూ ఉంటాయా? | ఎలక్ట్రాన్లు పరమాణువు లోపల నిశ్చలంగా ఉంటాయి. | ప్రోటాన్లు కేంద్రకంలో నిశ్చలంగా ఉండి, కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో ఎలక్ట్రానులు తిరుగుతూ ఉంటాయి. |
9th Class Physical Science Textbook Page No. 83
ప్రశ్న 3.
ఫాస్ఫరస్, సల్ఫర్ బహుళ సంయోజకతలను కలిగి ఉంటాయి. ఎందుకు కొన్ని మూలకాలు బహుళ సంయోజకతలని కలిగి ఉంటాయో పట్టిక-2 (పేజి 98) పరిశీలించి వివరించండి. మీ స్నేహితులు, ఉపాధ్యాయులతో చర్చించండి.
జవాబు:
- సల్ఫరక్కు చిట్టచివరి కక్ష్యలోనున్న ఎలక్ట్రానుల సంఖ్య 6.
- కావున సల్పర్ వేలన్సీ (8-6) = 2 కావలెను.
- కానీ సల్పర్ వివిధ రూపాలలో లభిస్తుంది.
- కావున ఉత్తేజస్థితిలో చివరి కక్ష్యలో నున్న 6 ఎలక్ట్రానులు కూడా బంధంలో పాల్గొనే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
- దీనివల్ల కొన్నిసార్లు సంయోజకత ‘6’ చూపును. ఉదా : SO2, SO3 మొ||వి.
- ఇదే విధంగా ఫాస్పరసకు కూడా జరుగును. ఉదా : PCl3, PCl5 మొ||వి.
9th Class Physical Science Textbook Page No. 75
ప్రశ్న 4.
విభిన్న మూలకాల పరమాణువులు భిన్నంగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
మూలకాల స్వభావము, ధర్మాలు పరమాణు అమరికను బట్టి ఉంటుంది. విభిన్న మూలకాలు విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఈ పరమాణువుల అమరికే.
ప్రశ్న 5.
పరమాణువులు ఒకేలా లేదా విభిన్నంగా ఉండేలా చేసేదేదైనా పరమాణువులో ఉందా?
జవాబు:
పరమాణు ఉపకణం అమరికే, పరమాణువులు ఒకేలా లేదా విభిన్నంగా ఉండేలా చేస్తుంది.
ప్రశ్న 6.
పరమాణువులు విభజింపశక్యం కానివా? లేదా పరమాణువు లోపల ఏదైనా ఉన్నదా?
జవాబు:
పరమాణువు విభజింపదగినదే. పరమాణువు లోపల ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లతో పాటు ఇంకా అనేకానేక ఉపకణాలు ఉంటాయని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి.
9th Class Physical Science Textbook Page No.77
ప్రశ్న 7.
పరమాణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ వంటి ఉప పరమాణు కణాలుంటే అవి పరమాణువులో ఏ విధంగా అమరి ఉంటాయో ఊహించండి.
జవాబు:
పరమాణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వంటి పరమాణు ఉపకణాల అమరికను గూర్చి రూథర్‌ఫర్, నీల్బర్ వంటి శాస్త్రవేత్తలు వివరించారు. వారి ప్రతిపాదనల ప్రకారం, పరమాణు మధ్యభాగంలో కేంద్రకం ఉంటుంది. దీనిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
9th Class Physical Science Textbook Page No. 80
ప్రశ్న 8.
పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంది?
జవాబు:
పరమాణు కేంద్రకంలోని ప్రోటానుల సంఖ్య, కేంద్రకం బయటి ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం. కావున పరమాణువులోని ధన, ఋణ ఆవేశాలు సమానంగా ఉంటాయి. దీనివల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. కానీ పరమాణు స్థిరత్వాన్ని గూర్చి నీల్స్ బోర్ మరొకవిధంగా వివరించాడు.
ప్రశ్న 9.
తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్ కేంద్రకంలో పడిపోకుండా ఉండేలా పరమాణువులో ఉపపరమాణు కణాలకు ఏదైనా ప్రత్యామ్నాయ అమరికను మీరు సూచించగలరా?
జవాబు:
ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ప్రత్యేకమైన స్థిర కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటిపై పనిచేసే అభికేంద్ర, అపకేంద్ర బలాలు పరిమాణంలో సమానంగా ఉండి, దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. కావున తిరుగుతున్న ఎలక్ట్రాన్లు కేంద్రకంలో పడిపోవు.
9th Class Physical Science Textbook Page No. 82
ప్రశ్న 10.
ఒక్కో కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు?
జవాబు:
ఒక్కో కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల సంఖ్య ఆ కర్పరపు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి కర్షరం (K) లో 2, రెండవ కర్పరం (L) లో 8, మూడవ కర్పరం (M) లో 18, నాల్గవ కర్పరం (N) లో 32 ఎలక్ట్రాన్లు …. ఇలా ఉంటూ ఉంటాయి.
ప్రశ్న 11.
ఏదైనా కర్పరంలో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుందా?
జవాబు:
ఏ కర్పరంలోను ఒకే ఎలక్ట్రాన్ ఉండదు.
ప్రశ్న 12.
కర్పరాలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
ఒక కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యని 2n² అనే సూత్రం ద్వారా నిర్ణయిస్తాము (n అనేది కర్పరం సంఖ్య).
ఉదా : L కర్పరం సంఖ్య = n = 2
∴ L కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల సంఖ్య = 2 × n² = 2 × 2² = 2 × 4 = 8.
9th Class Physical Science Textbook Page No. 83
ప్రశ్న 13.
ఆక్సిజన్ యొక్క సంయోజకతని ఎలా తెలుసుకుంటావు?
జవాబు:
- ఆక్సిజన్ పరమాణువులో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
- ఎలక్ట్రాన్ల పంపిణీ 2, 6.
- ఆక్సిజన్ చిట్టచివరి కక్ష్యలలో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ సంఖ్య 8 కి చాలా దగ్గర.
- కావున ఆక్సిజన్ సంయోజకత 8 – 6 = 2.
9th Class Physical Science Textbook Page No. 85
ప్రశ్న 14.
న్యూట్రాన్ల సంఖ్యని పరమాణు లక్షణంగా మనం పరిగణించగలమా?
జవాబు:
పరమాణు లక్షణాలలో ఒకటియైన పరమాణు ద్రవ్యరాశి, కేంద్రకంలోని ప్రోటానుల మరియు న్యూట్రానుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కావున న్యూట్రానుల సంఖ్యను పరమాణు లక్షణంగా మనం పరిగణించవచ్చు.
పరికరాల జాబితా
వివిధ పరమాణు నమూనాలను ప్రదర్శించే చార్టులు, ఎలక్ట్రాన్ల పంపిణీ చార్టు, ఐసోటోపుల ఫ్లాష్ కార్డులు …
9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
ప్రశ్న 1.
మీరు ఊహించిన విధంగా పరమాణు నిర్మాణాన్ని గీయండి.
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లను పరమాణువులో ఎన్నో విధాలుగా అమర్చవచ్చు. పరమాణువు ఒక గదిగా ఊహించుకోండి. కణాలను ఒకదాని తరువాత ఒకటి అడువరసలుగా అమర్చండి. ఎలా కనిపిస్తుందో మీరు బొమ్మ తీయండి. ఉప పరమాణు కణాల స్వభావంను దృష్టిలో ఉంచుకుని గోళాకారంగా ఉన్న పరమాణువులో వీటిని అమర్చే పటాన్ని గీయండి.
ప్రోటాన్లు ధనావేశాన్ని, ఎలక్ట్రానులు ఋణావేశాన్ని కలిగి ఉండి, న్యూట్రాన్లు ఆవేశరహితంగా ఉంటాయి. కావున న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక దగ్గర ఉంచి, ఎలక్ట్రాన్లను దూరంగా గాని, గోళం అంచుకు దగ్గరగా గాని ఉంచవచ్చు. ఇది కేవలం ఊహ మాత్రమే. ఇంకా ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చు.