SCERT AP 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 2nd Lesson బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

ఇవి చేయండి

1 (i) ‘x’ చరరాశితో కూడిన రెండు బహుపదులు రాయండి. (పేజీ నెం. 29)
సాధన.
5x2 + 2x – 8 మరియు 3x3 – 2x + 6.

(ii) ‘y’ చరరాశితో కూడిన మూడు బహుపదులు రాయండి. (పేజీ నెం. 29)
సాధన.
y3 – y2 + y; 2y2 + 7y – 9 + 3y3; y4 – y + 6 + 2y2.

(iii) 2x2 + 3xy + 5y2 అనే బహుపది ఒక చరరాశితో ఉన్నదా ? (పేజీ నెం. 29)
సాధన.
ఇచ్చిన బహుపది x, y అను రెండు చరరాశులను కలిగివున్నది.

(iv) వివిధ రకాల ఘనాకార వస్తువులకు వైశాల్యం, ఘనపరిమాణం కనుగొనే సూత్రాలు రాయండి. వాటిలో చరరాశులను, స్థిరరాశులను తెలపండి. (పేజీ నెం. 29)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 10

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

2. కింద ఇవ్వబడిన ప్రతి బహుపది యొక్క పరిమాణాలు రాయండి. (పేజీ నెం. 30)
i) 7x3 + 5x2 + 2x – 6
ii) 7 – x + 3x2
iii) 5p – \(\sqrt{3}\)
iv) 2
v) – 5xy2
సాధన.
i) పరిమాణం 3
ii) పరిమాణం 2
iii) పరిమాణం 1
iv) పరిమాణం 0
v) పరిమాణం 3

3. కింది వానిలో x2 యొక్క గుణకాలను రాయండి. (పేజీ నెం. 30)
i) 15 – 3x + 2x2
ii) 1 – x2
iii) πx2 – 3x + 5
iv) \(\sqrt{2}\)x2 + 5x -1
సాధన.
x2 గుణకము 2
x2 గుణకము -1
x2 గుణకము π
x2 గుణకము \(\sqrt{2}\)

4. కింద ఇవ్వబడిన బహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. (పేజీ నెం. 33)
i) x = 1 వద్ద P(x) = 4x2 – 3x + 7
సాధన.
x = 1 వద్ద p(x) యొక్క విలువ
= 4(1)2 – 3(1) + 7 = 8

ii) y= 1 వద్ద q(y) = 2y3 – 4y + \(\sqrt{11}\)
సాధన.
y = 1 వద్ద q(y) యొక్క విలువ
= 2(1)3 – 4(1) + \(\sqrt{11}\) = -2 + \(\sqrt{11}\)

iii) t = p (t∈R) వద్ద r(t) = 4t4 + 3t3 – t2 + 6
సాధన.
t = pవద్ద r(t) యొక్క విలువ
= 4p4 + 3p3 – p2 + 6

iv) z = 1 వద్ద s(z) = z3 – 1
సాధన.
z = 1 వద్ద S(z) యొక్క విలువ = 13 – 1 = 0

v) x = 1 వద్ద p(x) = 3x2 + 5x – 7
సాధన.
x = 1 వద్ద p(x) యొక్క విలువ
= 3(1)2 + 5(1) – 7 = 1

vi) z = 2 వద్ద q(2) = 5z3 – 4x + \(\sqrt{2}\)
సాధన.
z = 2 వద్ద q(2) యొక్క విలువ
= 5(2)3 – 4(2) + \(\sqrt{2}\)
= 40 – 8 + \(\sqrt{2}\)
= 32 + \(\sqrt{2}\)

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

5. కింది ఖాళీలను పూరించండి. (పేజీ నెం. 35)
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 1
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 2

6. 3y3 + 2y2 + y బహుపదిని ‘y’ చే భాగించి భాగహార సత్యం రాయండి. (పేజీ నెం. 38)
సాధన.
(3y3 + 2y2 + y) ÷ y = \(\frac{3 y^{3}}{y}+\frac{2 y^{2}}{y}+\frac{y}{y}\)
= 3y2 + 2y +1
భాగహార సత్యము = (3y2 + 2y + 1) · y
= 3y + 2y2 + y

7. 4p2+ 2p + 2 ను ‘2p’ చే భాగించి భాగహార సత్యాన్ని రాయండి. (పేజీ నెం. 38)
సాధన.
(4p2 + 2p + 2) ÷ 2 = \(\frac{4 p^{2}}{2 p}+\frac{2 p}{2 p}+\frac{2}{2 p}\)
= 2p + 1 + \(\frac{1}{\mathrm{p}}\)
భాగహార సత్యము = \(\left(2 p+1+\frac{1}{p}\right)\) × 2p
= 4p2 + 2p + 2

8. కింది వానిని కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 46)
1. 6x2 + 19x + 15
సాధన.
6x2 + 19x + 15
= 6x2 + 10x + 9x + 15
= 2x (3x + 5) + 3 (3x + 5)
= (3x + 5) (2x + 3)

2. 10m2 – 31m – 132
సాధన.
10m2 – 31m – 132
= 10m2 – 55m + 24m – 132
= 5m (2m – 11) + 12 (2m – 11)
= (2 – 11) (5m + 12)

3. 12x2 + 11x + 2
సాధన.
12x2 + 11x + 2 = 12x2 + 8x + 3x + 2
= 4x (3x + 2) + 1 (3x + 2)
= (3x + 2) (4x + 1)

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

9. కింది సమాసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్దాలు కనుగొనండి. (పేజీ నెం. 49)
i) (x + 5) (x + 5)
సాధన.
(x + 5) (x + 5)
= (x + 5)2
= x2 + 2(5) (5) + 52
= x2+ 10x + 25

ii) (p – 3) (p + 3)
సాధన.
(p – 3) (p + 3)
= p2 – 32
= p2 – 9

iii) (y – 1) (y – 1)
సాధన.
(y – 1) (y – 1)
= (y – 1)2
= y2 – 2y + 1

iv) (t + 2) (t + 4)
సాధన.
(t + 2) (t + 4)
= t2 + t (2 + 4) + 2 × 4
= 12 + 6t + 8

v) 102 × 98
సాధన.
102 × 98 = (100 + 2) (100 – 2)
= 1002 – 22
= 10000 – 4
= 9996

10. కింది వానిని తగిన సర్వసమీకరణాలనుపయోగించి కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 50)
i) 49a2 + 70ab + 25b2
సాధన.
49a2 + 70ab + 25b2
= (7a)2 + 2 (7a) (5b) + (5b)2
= (7a + 5b)2 = (7a + 5b) (7a + 5b)

ii) \(\frac{9}{16} x^{2}-\frac{y^{2}}{9}\)
సాధన.
\(\frac{9}{16} x^{2}-\frac{y^{2}}{9}\) = \(\left(\frac{3}{4} x\right)^{2}-\left(\frac{y}{3}\right)^{2}\)
= \(\left(\frac{3}{4} x+\frac{y}{3}\right)\left(\frac{3}{4} x-\frac{y}{3}\right)\)

iii) t2 – 2t + 1
సాధన.
t2 – 2t + 1 = (t)2 – 2(t) (1) + (1)2
= (t – 1)2 = (t – 1) (t – 1)

iv) x2 + 3x + 2
సాధన.
x2 + 3x + 2 = x2 + (2 + 1) x + (2 × 1)
= (x + 2) (x + 1)

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

11. i) (p+ 2q + r)2 ను విస్తరణ రూపంలో రాయండి. (పేజీ నెం. 52)
సాధన.
(p+ 2q + r)2
= (p)2 + (2q)2 + (r)2 + 2 (p) (24) + 2 (2q) (r) + 2(r) (p)
= p2 + 4q2 + r2 + 4pg + 4qr + 2rp

ii) (4x – 2y – 3z) ను సూత్రం ద్వారా విస్తరించండి. (పేజీ నెం. 52)
సాధన.
(4x – 2y – 3z)
= (4x)2 + (-2y)2 + (-3z)2 + 2 (4x) (-2y) + 2 (-2y) (-3z) + 2 (-3z) (4x)
= 16x2 + 4y2 + 9z2 – 16xy + 12yz – 24zx

iii) 4a2 + b2 + c2 – 4ab + 2bc – 4ca ను సూత్రం ద్వారా కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 52)
సాధన.
4a2 + b2 + c2 – 4ab + 2bc – 4ca
= (2a)2 + (-b)2 + (-c)2 + 2(2a) (-b) + 2 (- b) (-c) + 2(-c) (2a)
= (2a – b – c)2
= (2a – b – c) (2a – b – c)

12. (x + 1)3 ను సర్వసమీకరణం ఉపయోగించి విస్తరించండి. (పేజీ నెం. 54)
సాధన.
(x + 1)3 = (x)3 + (1)3 + 3 (x) (1) (x + 1)
= x3 + 1 + 3x (x + 1)
= x3 + 1 + 3x2 + 3x
= x3 + 3x2 + 3x + 1

13. (3m – 2n)3 ను గుణించండి. (పేజీ నెం. 54)
సాధన.
(3m – 2n)3 = (3m)3 – 3 (3m)2 (2n) + 3 (3m) (2n)2 – (2n)3
= 27m3 – 54m2n + 36mn2 – 8n3

14. a3 – 3a2b + 3ab2 – b3 ను కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 54)
సాధన.
a3 – 3a2b + 3ab2 – b3
= (a)3 – 3 (a)2(b) + 3 (a) (b)2 – (b)3
= (a – b)3 = (a – b) (a – b) (a – b)

15. గుణకారం చేయకుండానే (a – b – c) (a2 + b2 + c2 – ab + bc – ca) లబ్దంను కనుగొనండి. (పేజీ నెం. 55)
సాధన.
ఇచ్చిన సమస్య సరిగా లేదు. సాధన సాధ్యపడదు.

16. సర్వసమీకరణం ఉపయోగించి 27a3 + b3 + 8c3 – 18abcని కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 55)
సాధన.
27a3 + b3 + 8c3 – 18abc
= (32)3 + (b)3 + (2c)3 – 3(3a) (b) (2c)
= (3a + b + 2c) (9a2 + b2 + 4c2 – 3ab – 2bc – 6ca)

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

ప్రయత్నించండి

1. x చరరాశితో కూడిన ద్విపదిని రాయండి. (పేజీ నెం. 31)
సాధన.
x చరరాశితో కూడిన ద్విపది 2x + 3x2.

2. p చరరాశితో కూడిన 15 పదాలుండే బహుపదిని మీరు ఎలా రాస్తారు ? (పేజీ నెం. 31)
సాధన.
a14P14 + a13p13 + a12p12 + …… + a1p + a0

3. కింది బహుపదుల శూన్య విలువలు కనుగొనండి. (పేజీ నెం. 34)
1. 2x – 3
సాధన.
2x – 3 = 0
2x = 3
x = \(\frac {3}{2}\)
∴ 2x – 3 యొక్క శూన్య విలువ \(\frac {3}{2}\)

2. x2 – 5x + 6
సాధన.
x2 – 5x + 6 = 0
= x2 – 3x – 2x + 6 = 0
= x(x – 3) – 2 (x – 3) = 0
= (x – 2) (x – 3) = 0
⇒ x – 2 = 0 లేక x – 3 = 0
⇒ x = 2 లేక x = 3
∴ x2 – 5x + 6 యొక్క శూన్య విలువలు 2 లేక 3.

3. x + 5
సాధన.
x + 5 = 0
x = -5
∴ x + 5 యొక్క శూన్య విలువ x = – 5.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

4. xn – 1 అను బహుపదికి (x – 1) ఒక కారణాంకమని చూపండి. (పేజీ నెం. 45)
సాధన.
p(x) = xn – 1 అనుకొనుము.
x = 1 అయిన p(1) = 1n – 1 = 1 – 1 = 0
∴ p(1) = 0
∴ p(x) కు (x – 1) ఒక కారణాంకము.

5. కింది సర్వసమీకరణాలకు కూడా పటాలను గీచి నిరూపించండి. (పేజీ నెం. 49)
i) (x + y)2 ≡ x2 + 2xy + y2
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 3
సోపానం – 1: పటం – I వైశాల్యం = x · x = x2
సోపానం – 2 : పటం – II వైశాల్యం = x · y = xy
సోపానం – 3 : పటం – III వైశాల్యం = x · y = xy
సోపానం – 4 :.పటం – IV వైశాల్యం = y · y = y2
పెద్ద చతురస్ర వైశాల్యం = I, II, III మరియు IV ల వైశాల్యాల మొత్తము
∴ (x + y) (x + y) = x2 + xy + xy + y2
(x + y)2 = x2 + 2xy + y2

ii) (x + y) (x + y) ≡ x2 – y2
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 4
సోపానం – 1 : పటం – I వైశాల్యం
= x (x – y) = x2 – xy

సోపానం – 2 : పటం – II వైశాల్యం = (x – y) y = xy – y2
పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం = I & II ల వైశాల్యాల మొత్తం
(x + y) (x – y) = x2 – xy + xy – y2 = x2 – y2
∴ (x + y) (x – y) ≡ x2 – y2

iii) (x + a) (x + b) ≡ x2 + (a + b) x + ab
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 5
సోపానం – 1 : పటం – I వైశాల్యం = x2
సోపానం – 2 : పటం – II వైశాల్యం = ax
సోపానం – 3 : పటం – III వైశాల్యం = bx
సోపానం – 4 : పటం – IV వైశాల్యం = ab
∴ పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం = నాలుగు పటముల వైశాల్యాల మొత్తము
∴ (x + a) (x + b) = x2 + ax + bx + ab
(x + a) (x + b) = x2 + (a + b) x + ab

6. (x – y)3 లబ్దంను గుణకారం చేయకుండా ఎలా కనుగొంటారు ? లభాన్ని గుణకారం చేసి సరిచూడండి. (పేజీ నెం.52)
సాధన.
(x – y)3 = x3 – 3x2y + 3xy2 – 3y3
గుణకారం చేయగా, (∵ సర్వసమీకరణం)
(x – y)3 = (x – y)2 (x – y)
= (x2 – 2xy + y2) (x – y)
= x3 – 2x2y + xy2 – x2y + 2xy2 – y3
= x3 – 3x2y + 3xy2 – y3
రెండూ సమానము.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

ఆలోచించి, చర్చించి రాయండి

1. కింది సమాసాలలో ఏవి. బహుపదులు ? ఏవి కావు ? కారణాలు తెలపండి. (పేజీ నెం.28)
i) 4x2 + 5x – 2
ii) y2 – 8
iii) 5
iv) 2x2 + \(\frac{3}{x}\) – 5
v) \(\sqrt{3}\)x2 + 5y
vi) \(\frac{1}{x+1}\)
vii) \(\sqrt{x}\)
viii) 3xyz
సాధన.
i) 4x2 + 5x – 2 – బహుపది.
ii) y2 – 8 – బహుపది
iii) 5 – బహుపది
iv) 2x2 + \(\frac{3}{x}\) – 5 – బహుపది కాదు
v) \(\sqrt{3}\)x2 + 5y – బహుపది
vi) \(\frac{1}{x+1}\) – బహుపది కాదు
vii) \(\sqrt{x}\) – బహుపది కాదు
viii) 3xyz – బహుపది
ఎందుకనగా వీటి చరరాశుల యొక్క ఘాతాలు – 1, –\(\frac {1}{2}\)ల వంటి ఋణ పూర్ణసంఖ్య అయినది కావున.

2. ఒక చరరాశితో కూడిన 3వ పరిమాణ ఘనబహుపదిలో ఎన్ని పదాలుంటాయి ? కొన్ని ఉదాహరణలివ్వండి. (పేజీ నెం.31)
సాధన.
ఒక చరరాశితో కూడిన 3వ పరిమాణ ఘనబహుపదిలో గరిష్ఠంగా 4 పదాలుంటాయి.
ఉదా : x3 + 0, 2x3 + 2, 3y3 + 4y2 + 4

3. వర్గ బహుపదికి రెండు శూన్య విలువలుంటాయి. మరి ‘n’వ పరిమాణ బహుపదికి ఎన్ని శూన్య విలువలుంటాయో చెప్పగలరా ? (పేజీ నెం.36) సాధన.
‘n’ వ పరిమాణ బహుపదికి ‘n’ శూన్య విలువలు ఉంటాయి.

శేష సిద్ధాంతము :

p(x) అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ఠ పరిమాణంగల బహుపది మరియు ‘a’ అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు p(x) ను రేఖీయ బహుపది (x – a) చే భాగిస్తే వచ్చు శేషం p(a) అగును.
పై సిద్ధాంత నిరూపణను పరిశీలిద్దాం. (పేజీ నెం. 40)
ఉపపత్తి :
ఏకపరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ఠ పరిమాణంగల బహుపది p(x) ను తీసుకుందాం.
p(x) ను రేఖీయ బహుపది g(x) = (x – a) చే భాగించునప్పుడు భాగఫలం q(x) మరియు శేషం r(x) అనుకుందాం. అంటే p(x) మరియు g(x) అనేవి రెండు బహుపదులు అయిన సందర్భంలో p(x) యొక్క పరిమాణం ≥g(x) యొక్క పరిమాణం మరియు g(x) ≠ 0 అయితే మనకు q(x) మరియు r(x) అనే మరొక రెండు బహుపదులు వస్తాయి. ఇందులో r(x) = 0 లేదా r(x) పరిమాణం ఎప్పుడూ g(x) పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది.
భాగహార నియమం ప్రకారం
p(x) = g(x) · q(x) + r(x) గా రాయవచ్చు.
∴ p(x) = (x – a) · q(8) + r(x)
(∵ g(x) = (x – a))
(x – a) పరిమాణం 1 మరియు r(x) పరిమాణం (x – a) పరిమాణం కన్నా తక్కువ కనుక.
∴ r(x) పరిమాణం = 0, అంటే r(x) ఒక స్థిరరాశి.
దీనిని ‘K’ అనుకుంటే, ప్రతి వాస్తవ విలువ x కు r(x) = K.
కావున p(x) = (x – a) q(x) + K అగును.
x = a అయిన p(a) = (a – a) q(a) + K
= 0 + K = K
కావున సిద్ధాంతం నిరూపించబడినది.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

కారణాంక సిద్ధాంతము :

బహుపది పరిమాణం n ≥ 1 గా గల బహుపది p(x) మరియు ‘a’ ఏదేని వాస్తవ సంఖ్య అయినపుడు (i) p(a) = 0 అయిన (x – a) అనేది p(x) కు కారణాంకం అగును మరియు (ii) (x – a) అనేది p(x) కు కారణాంకం అయిన p(a) = 1 అగును. ఈ సిద్ధాంతం యొక్క సరళతరమైన నిరూపణ పరిశీలిద్దాం. (పేజీ నెం.43)
ఉపపత్తి :
శేష సిద్ధాంతం ప్రకారం
p(x) = (x – a) q(x) + p(a)
i) p(a) = 0 అయిన సందర్భంలో p(x) = (x – a) q(x) + 0 అగును.
= (x – a) q(x)
దీనిని బట్టి p(x) కు (x – a) కారణాంకమని చెప్పవచ్చు. నిరూపించబడింది.

ii) ఇదే విధంగా (x – a) అనేది p(x) కు కారణాంకం కావున p(x) = (x – a) సత్యం అవుతుంది. అనేది మరొక బహుపది.
∴ p(a) = (a – a) q(a)
= 0
∴ కావున (x – a) అనేది p(x) కు కారణాంకం అయిన p(a) = 0 అయినది.
ఈ విధంగా సిద్ధాంతం నిరూపించబడింది.

ఉదాహరణలు

1. p(x) = x + 2 అయిన p(1), p(2), p(-1) మరియు p(-2) లను కనుగొనండి. బహుపది x + 2 యొక్క శూన్య విలువలు (పేజీ నెం.34)
సాధన.
p(x) = x + 2
x కు బదులు 1 ను ప్రతిక్షేపిస్తే
p(1) = 1 + 2 = 3
అలాగే xకు బదులు 2 ను ప్రతిక్షేపిస్తే
p(2) = 2 + 2 = 4
x బదులు – 1 ను ప్రతిక్షేపిస్తే
p(-1) = – 1 + 2 = 1
x బదులు – 2 ను ప్రతిక్షేపిస్తే
p(-2) = – 2 + 2 = 0.
దీనిని బట్టి 1, 2, -1 అనేవి ఇచ్చిన బహుపదికి శూన్య విలువలు కాలేదు. p (-2) = 0 అయినది కావున – 2 బహుపది శూన్య విలువ అయినది.

2. p(x) = 3x + 1 బహుపది యొక్క శూన్య విలువ కనుగొనండి. (పేజీ నెం.34)
సాధన.
p(x) యొక్క శూన్య విలువ కనుగొనడం అంటే బహుపది సమీకరణం. p(x) = 0 ను సాధన చేయడమే.
అనగా
3x + 1 = 0
3x = -1
x = –\(\frac {1}{3}\)
కావున 3x + 1 బహుపది శూన్యవిలువ –\(\frac {1}{3}\) అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

3. బహుపది 2x – 1 యొక్క శూన్యవిలువ కనుగొనండి. (పేజీ నెం. 85)
సాధన.
p(x) యొక్క శూన్యవిలువ కనుగొనడం అంటే బహుపది సమీకరణం p(x) = 0 ను సాధించడమే.
కనుక p(x) = 2x – 1 అనుకోండి.
2x – 1 = 0 అవుతుంది.
x = \(\frac {1}{2}\)(ఎలా ?)
p(\(\frac {1}{2}\))విలువలను బహుపదిలో ప్రతిక్షేపించి సరిచూడండి.
ఇప్పుడు p(x) = ax + b, a ≠ 0, అయితే దీనిని రేఖీయ బహుపది అంటారు. దీని యొక్క శూన్యవిలువను ఎలా కనుగొంటారు ?
p(x) యొక్క శూన్యవిలువను కనుగొనాలంటే, p(x) = 0 బహుపది సమీకరణాన్ని సాధించాలి.
అంటే ax + b = 0, a ≠ 0
కావున ax = – ab
అనగా x = \(\frac{-b}{a}\)
అందుచే x = \(\frac{-b}{a}\) అనేది p(x) = ax + b యొక్క ఒకే ఒక శూన్యవిలువ అయినది. ఏక చరరాశిలోగల రేఖీయ బహుపదికి ఒకే ఒక శూన్య విలువ ఉంటుంది.

4. x2 – 3x + 2 అనే బహుపదికి 2 మరియు 1 అనే విలువలు శూన్యాలవుతాయో, లేదో సరిచూడండి. (పేజీ నెం.36)
సాధన.
p(x) = x2 – 3x + 2 అనుకొనుము.
x కు బదులు 2 ను ప్రతిక్షేపించగా
p(2) = (2)2 – 3(2) + 2
= 4 – 6 + 2 = 0
అలాగే x ను 1 తో మార్చగా
p(1) = (1)2 – 3(1) + 2 = 1 – 3 + 2 = 0
కావున 2 మరియు 1 అనేవి రెండునూ x2 – 3x + 2 యొక్క శూన్యవిలువలు అయినాయి.
శూన్యవిలువలు సరిచూడడానికి మరేమైనా విధానం ఉన్నదా ?
x2 – 3x + 2 అనే బహుపది పరిమాణం ఎంత ? ఇది రేఖీయ బహుపది అవుతుందా ? కాదు. ఇది వర్గ బహుపది. కావున వర్గబహుపదికి రెండు శూన్యవిలువలు ఉంటాయని చెప్పవచ్చు.

5. x2 + 2x – a అనే బహుపది యొక్క శూన్య విలువ 3 అయితే ‘a’ విలువ కనుగొనండి. (పేజీ నెం.36)
సాధన.
p(x) = x2 + 2x – a అనుకొనుము.
బహుపది శూన్యవిలువ 3 కావున p(3) = 0.
x2 + 2x – a = 0
x = 3 విలువ ప్రతిక్షేపించగా
(3)2 + 2(3) – a = 0
9 + 6 – a = 0
15 – a = 0
-a = -15
లేదా a = 15

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

6. 3x2 + x – 1 ను x + 1 చే భాగించండి. (పేజీ నెం. 38)
సాధన.
p(x) = 3x2 + x – 1 మరియు q(x) = x + 1 అని తీసుకోండి.
p(x) ను q(x) చే భాగించాలి. మీరు ముందు తరగతులలో నేర్చుకున్న భాగహార విధానం గుర్తుకు తెచ్చుకోండి.
సోపానం 1 : \(\frac{3 x^{2}}{x}\) = 3X భాగించగా ఇది భాగఫలంలో మొదటి పదం అగును.
సోపానం 2 : (x + 1) 3x = 3x2 + 3x (గుణించగా)
3x + 3x నుండి 3x2 + x, తీసివేయగా (-2x) వచ్చింది.
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 6
సోపానం 3 : \(\frac{-2 x}{x}\) = – 2 (భాగించగా) ఇది భాగఫలంలో రెండవ షదం అయింది.
సోపానం 4 : (x + 1)(- 2) = – 2x – 2 (గుణించగా), దీనిని (- 2x – 1), నుండి తీసివేయగా ‘1’ వస్తుంది.
సోపానం 5 : భాగహారం ఆపివేసాం. శేషం 1 వచ్చింది. ఇది స్థిరరాశి. (స్థిరరాశిని ఎందుకు బహుపదితో భాగించలేమో చెప్పగలరా ?)
దీని నుండి మనకు భాగఫలం (3x – 2) మరియు శేషం (+1) వచ్చాయి.
గమనిక : భాగహార ప్రక్రియలో శేషం ‘సున్న’ గాని లేదా శేషం యొక్క పరిమాణం, విభాజక పరిమాణం కన్నా తక్కువైన సందర్భంలో ప్రక్రియ పూర్తయినదిగా భావిస్తాం .
ఇప్పుడు, దీని నుండి భాగహార సత్యాన్ని కింది విధంగా రాయవచ్చు.
3x2 + x – 1 = (x + 1) (3x – 2) + 1
అంటే విభాజ్యం = (విభాజనం × భాగఫలం) + శేషం
ఈ బహుపది p(x) లో x కు బదులు – 1 ప్రతికేపించగా
p(x) = 3x2 + x – 1
P(-1) = 3(-1)2 + (-1) – 1
= 3(+1) + (-1) – 1 = 1.
[p(-1) యొక్క విలువ, భాగహారంలో శేషం (1) సమానమైనాయని మీరు భాగహారం చేసి పరిశీలించవచ్చు.]
కావున p(x) = 3x2 + x – 1 ను (x + 1) చే భాగించగా వచ్చిన శేషం, p (-1) యొక్క విలువ అంటే x + 1 యొక్క శూన్య విలువ (i.e. x = -1) సమానం అయినాయి.

7. 2x4 – 4x3 – 3x – 1 అనే బహుపదిని (x – 1) చే భాగించి శేషాన్ని, విభాజకం యొక్క శూన్యవిలువతో సరిచూడండి. (పేజీ నెం.39)
సాధన.
f(x) = 2x4 – 4x3 – 3x – 1 అనుకోండి.
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 7
పొడవు భాగహార పద్ధతిలో, మనం మొదట 2x4, x ను ఎన్నిసార్లు హెచ్చిస్తే వస్తుందో చూడాలి.
\(\frac{2 x^{4}}{x}\) = 2x3
ఇప్పుడు (x – 1) (2x3) = 2x4 – 2x3 గా గుణించాలి.
తిరిగి శేషంలో మొదటి పదం చూడాలి. (అంటే – 2×3) ఈ విధంగా భాగహారం పూర్తి చేయాలి.
ఇచ్చట భాగఫలం 2x3 – 2x2 – 2x – 5 మరియు శేషం – 6 వచ్చింది.
ఇప్పుడు (x – 1) యొక్క శూన్య విలువ 1 కావున
x = 1 ని f(x) లో ప్రతిక్షేపిస్తే
f(x) = 2x4 – 4x3 – 3x – 1
f(1) = 2(1) – 4(1)3 – 3(1) – 1
= 2(1) – 4(1) – 3(1) – 1
= 2 – 4 – 3 – 1 = -6
భాగహారంలో వచ్చిన శేషం మరియు బహుపది f(x) నకు (x – 1) యొక్క శూన్య విలువ సమానమేనా ?

8. x3 + 1 ను (x + 1) తో భాగిస్తే వచ్చే శేషం కనుగొనుము. (పేజీ నెం.41)
సాధన.
ఇచ్చట p(x) = x3 + 1
రేఖీయ బహుపది x + 1 శూన్య విలువ -1
[x + 1 = 0 కావున x = -1]
x లో -1 ను ప్రతిక్షేపిస్తే
p(-1) = (-1)3 + 1 = – 1 + 1 = 0
కావున శేష సిద్ధాంతం ప్రకారం (x3 + 1) ను (x + 1) చే భాగించగా ‘సున్న’ శేషం వచ్చింది.
దీని కొరకు x3 + 1 ను x + 1 చే భాగహారం చేసి సరిచూడవచ్చు.
ఇక్కడ (x + 1) ను (x3 + 1) కు కారణాంకమని నీవు చెప్పగలవా ?

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

9. x3 – 2x2 – 5x + 4 బహుపదికి (x – 2) కారణాంకమా ? సరిచూడండి. (పేజీ నెం.41)
సాధన.
p(x) = x3 – 2x2 – 5x + 4 అనుకోండి.
ఇచ్చిన బహుపదికి (x – 2) కారణాంకం అవునో లేదో తెలుసుకోవాలంటే
(x – 2) యొక్క శూన్యవిలువ 2 తో x కు బదులు ప్రతిక్షేపించాలి.
అనగా x – 2 = 0 ⇒ x = 2.
p(2) = (2)3 – 2(2)2 – 5(2) + 4
= 8 – 2(4) – 10 + 4
= 8 – 8 – 10 + 4 = – 6.
శేషం ‘సున్న’ కానందున x3 – 2x2 – 5x + 4 బహుపదికి (x – 2) కారణాంకం కాదు.

10. p(y) = 4y3 + 4y2 – y – 1 అను బహుపది (2y + 1) నకు గుణిజం అవుతుందా ? సరిచూడండి. (పేజీ నెం.41)
సాధన.
p(y) ను (2y + 1) కచ్చితంగా భాగిస్తే p(y) కు (2y + 1) గుణిజం అవుతుందని మీకు తెలుసు.
అందువలన 2y + 1 యొక్క శూన్యవిలువ
అనగా y = \(\frac {-1}{2}\), P(y) లో \(\frac {-1}{2}\) ను ప్రతిక్షేపిస్తే
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 8
కావున (2y + 1) అనేది p(y) కు కారణాంకం అయినది. దీనిని బట్టి p(y) అనేది (2y + 1) కి గుణిజం అని చెప్పవచ్చు.

11. ax3 + 3x2 – 13 మరియు 2x3 – 5x + a అను బహుపదులు (x – 2) చే భాగించునప్పుడు శేషాలు సమానం అయితే ‘a’ విలువ కనుగొనండి. (పేజీ నెం.42)
సాధన.
p(x) = ax3 + 3x2 – 13 మరియు
q(x) = 2x3 – 5x + a అనుకుందాం.
∵ p(x) మరియు q(x) లను (x – 2) చే భాగిస్తే శేషాలు సమానం.
∴ p(2) = q(2)
a(2)3 + 3(2)2 – 13 = 2(2)3 – 5(2) + a
8a + 12 – 13 = 16 – 10 + a
8a – 1 = a + 6
8a – a = 6 + 1
7a = 7
a = 1

12. x3 + 2x2 + 3x + 6 అనే బహుపదికి (x + 2) కారణాంకం అవుతుందా ? (పేజీ నెం.44)
సాధన.
p(x) = x3 + 2x2 + 3x + 6 మరియు
g(x) = x + 2 అనుకొనుము.
g(x) యొక్క శూన్య విలువ – 2
కావున p(-2) = (-2)3 + 2(-2)2 + 3(-2) + 6
= -8+ 2(4) – 6 + 6
= – 8 + 8 – 6 + 6 = 0
కావున, కారణాంక సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన బహుపది x3 + 2x2 + 3x + 6 కు (x + 2) కారణాంకం అవుతుంది.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

13. 2x3 – 9x2 + x + K అను బహుపది సమాసానికి (2x – 3) కారణాంకం అయితే K విలువ కనుగొనండి. (పేజీ నెం. 44)
సాధన.
(2x – 3) అనేది p(x) = 2x3 – 9x2 + x + K బహుపదికి కారణాంకం.
(2x – 3) = 0 అయితే x = \(\frac {3}{2}\)
∴ (2x – 3) యొక్క శూన్యవిలువ \(\frac {3}{2}\)
అందుచే (2x – 3) అనేది p(x) కు కారణాంకం అయిన p(\(\frac {3}{2}\)) = 0 అగును.
p(x) = 2x3 – 9x2 + x + K
⇒ P(\(\frac {3}{2}\)) = 2(\(\frac {3}{2}\))3 – 9(\(\frac {3}{2}\))2 + \(\frac {3}{2}\) + K = 0
⇒ 2(\(\frac {27}{8}\)) – 9(\(\frac {9}{4}\)) + \(\frac {3}{2}\) + K = 0
⇒ \(\left(\frac{27}{4}-\frac{81}{4}+\frac{3}{2}+K=0\right)\) × 4
27 – 48 + 6 + 4K = 0
-48 + 4K = 0
4K = 48
కావున K = 12

14. (x – 1) అనేది x10 – 1 అనే బహుపది కారణాంకమని నిరూపించండి. ఇదే విధంగా x11 – 1కు కూడా కారణాంకమని చూపండి. (పేజీ నెం. 45)
సాధన.
p(x) = x10– 1 మరియు g(x) = x11 – 1 అనుకొనుము.
(x – 1) రెండు బహుపదులు p(x) మరియు g(x) లకు కారణాంకమౌతుందని చూపాలంటే p(1) = 0 మరియు g(1) = 0 అని చూపితే సరిపోతుంది.
ఇప్పుడు
p(x) = x10 – 1 మరియు g(x) = x11 – 1
AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions 9
కనుక కారణాంక సిద్ధాంతం ప్రకారం (x – 1) అనేది p(x) మరియు g(x) లకు కారణాంకం అయినది.

15. 3x2 + 11x + 6 ను కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం.46)
సాధన.
p, q లు అనేవి రెండు సంఖ్యలు మరియు
p + q = 11 మరియు pq = 3 × 6 = 18
సందర్భంలో p, q లను కనుగొనాలంటే
18 లబ్దంగా రాయగలిగే కారణాంకాల జతలను పరిశీలిస్తే (1, 18), (2, 9), (3, 6) జతలలో, (2, 9) జత p + q = 11 ను తృప్తి పరుస్తాయి.
కావున 3x2 + 11x + 6 = 3x2 + 2x + 9x + 6
= x(3x + 2) + 3(3x+2)
= (3x + 2) (x + 3)

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

16. 2x4 – 6x3 + 3x2 + 3x – 2 అనే బహుపది x2 – 3x + 2 చే భాగింపబడుతుందా ? సరిచూడండి. కారణాంక సిద్ధాంతం ఉపయోగించి ఏ విధంగా సరిచూస్తారు ? (పేజీ నెం.46)
సాధన.
విభాజకం ఒక రేఖీయ బహుపది కాదు. ఇది ఒక వర్గ బహుపది. వర్గబహుపది యొక్క మధ్య పదాన్ని విభజించి కారణాంకాలుగా కనుగొనుట మీరు నేర్చుకున్నారు కదా! ఆ విధంగా చేస్తే
x2 – 3x + 2 = x2 – 2x – x + 2
= x(x – 2) – 1 (x- 2)
= (x – 2) (x – 1)
2x4 – 6x3 + 3x2 + 3x – 2 అనే బహుపదికి x2 – 3x + 2 వర్గ బహుపది కారణాంకమని చూపాలంటే, (x – 2) మరియు (x – 1) లను కారణాంకాలుగా చూపాలి.
కావున p(x) = 2x4 – 6x3 + 3x2 + 3x – 2 తీసుకుంటే
p(x) కు (x – 2) కారణాంకం అయిన
p(2) = 2(2)4 – 6(2)3 + 3(2)2 + 3(2) – 2
= 2(16) – 6(8) + 3(4) + 6 – 2
= 32 – 48 + 12 + 6 – 2
= 50 – 50 = 0
p(2) = 0 కావున p(x) కు (x – 2) కారణాంకం అవుతుంది.
మరొక కారణాంకం (x – 1), p(x) కు కారణాంకం కావాలంటే
p(1) = 2(1)4 – 6(1)3 + 3(1)2 + 3(1) – 2
= 2(1) – 6(1) + 3(1) + 3 – 2
= 2 – 6 + 3 + 3 – 2
= 8 – 8 = 0
∴ p(1) = 0 అయినందున. (x – 1) అనేది p(x)కు కారణాంకం అయింది.
(x – 2) మరియు (x – 1) రెండునూ p(x) కు కారణాంకాలైనందున వాటి లబ్ధం x2 – 3x + 2 కూడా p(x) = 2x4 – 6x3 + 3x2 + 3x – 2 కు కారణాంకం అవుతుంది.

17. x3 – 23x2+ 142x – 120 ను కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం.47)
సాధన.
p(x) = x3 – 23x2 + 142x – 120 అనుకొనండి.
వీటితో ప్రయత్నిస్తే మనకు p(1) = 0 అవుతుంది (సరిచూడండి).
కావున p(x) కు (x – 1) కారణాంకం అవుతుంది.
తర్వాత p (x) ను (x – 1) చే భాగిస్తే మనకు x2 – 22x + 120 వస్తుంది.
దీని కారణాంక విభజన మరొక విధంగా చేసి చూద్దాం
x3 – 23x2 + 142x – 120
= x3 – x2 – 22x2 + 22x + 120x – 120
= x2(x – 1) – 22x(x – 1) + 120 (x – 1)
(ఎలా ?)
= (x – 1) (x2 – 22x + 120)
ఇప్పుడు x2 – 22x + 120 వర్గబహుపది కావున, మధ్యపదంను విడదీసి కారణాంకాలు కనుగొందాం.
x2 – 22x + 120 = x2 – 12x – 10x + 120
= x(x – 12) – 10(x – 12)
= (x – 12) (x – 10)
కావున x3 – 23x2 + 142x – 120
= (x – 1)(x – 10)(x – 12) అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

18. కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం. 49)
(i) x2 + 5x + 4
(ii) 9x2 – 25
(iii) 25a2 + 40ab + 16b2
(iv) 49x2 – 112xy + 64y2
సాధన.
i) ఇచ్చట x2 + 5x + 4 = x2 + (4 + 1)x + (4) (1)
ఈ బహుపదిని (x + a) (x + b).
≡ x2 + (a + b)x + ab
అనే సర్వసమీకరణంతో పోల్చగా మనకు (x + 4) (x + 1) వస్తుంది.

ii) 9x2 – 25 = (3x)2 – (5)2
దీనిని x2 – y2 ≡ (x + y) (x – y) అను సర్వసమీకరణంతో పోల్చగా
∴ 9x2 – 25 = (3x + 5) (3x – 5) అగును.

iii) ఇచ్చట బహుపది 25a2 + 40ab + 16b2
= (5a)2 + 2(5a) (4b) + (4b)2
ఈ సమాసాన్ని x2 + 2xy + y2 తో పోల్చగా, x = 5a మరియు y = 4b అని పరిశీలించవచ్చు.
(x + y)2 ≡ x2 + 2xy + y2 సర్వసమీకరణము వినియోగిస్తే
మనకు 25a2 + 40ab + 16b2 = (5a + 4b)2
= (5a + 4b) (5a + 4b) అగును.

iv) ఇచ్చట 49x2– 112xy + 64y2, మనకు
49x2 = (7x)2, 64y2 = (8y)2 మరియు 112 xy = 2(7x) (8y) అని తెలుస్తున్నది.
దీనిని సర్వసమీకరణం (x – y)2 ≡ x2 – 2xy + y2 తో పోల్చగా
మనకు 49x2 – 112xy + 64y2
= (7x)2 = 2(7x) (8y) + (8y)2
= (7x – 8y)2
= (7x – 8y) (7x – 8y) అయినది.

19. (2a + 3b + 5)2 ను సర్వసమీకరణం ద్వారా విస్తరించండి. (పేజీ నెం.51)
సాధన.
ఇచ్చిన సమాసంను (x + y + z)2 తో పోల్చగా,
మనకు x = 24, y = 3b మరియు z = 5 వస్తాయి.
అందువలన సర్వసమీకరణం V, ద్వారా మనం (2a + 3b + 5)2 = (2a)2 + (3b)2 + (5)2 + 2(2a)(3b) + 2(3b) (5) + 2(5) (2a)
= 4a2 + 9b2 + 25 + 12ab + 30b + 20a.

20. (5x – y + z) (5x – y + z) యొక్క లబ్దాన్ని కనుగొనండి. (పేజీ నెం.51)
సాధన.
ఇచ్చట (5x – y + z) (5x – y + z)
= (5x + y + z)2
= [5x + (-y) + z]2
అందువలన మనం సర్వసమీకరణం V,
(x + y + z)2 ≡ x2 + y2 + z2 + 2xy + 2yz + 2zx తో పోల్చగా మనకు
(5x + (-y) + z)2 = (5x)2 + (-y)2 + (2)2 + 2(5x) (-y) + 2(-y) (z) + 2(z) (5x)
= 25x2 + y2 + z2 – 10xy – 2yz + 10zx

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

21. 4x2 + 9y2 + 25z2 – 12xy – 30yz + 20zx ను కారణాంకాలుగా విభజించండి. (పేజీ 38.51)
సాధన.
మనకు
4x2 + 9y2 + 25z2 – 12xy – 30yz + 20zx
= [(2x)2 + (-3y)2 + (5z)2 + 2(2x) (-3y) + 2(-3y)(5z) + 2(5z)(2x)]
సర్వ సమీకరణం V తో పోల్చగా
(x + y + z)2 ≡ x2 + y2 + z2 + 2xy + 2yz + 2zx
మనకు = (2x – 3y + 5z)2
= (2x – 3y + 5z)(2x – 3y + 5z)

22. కింది ఘనాలను విస్తరించండి. (పేజీ నెం.53)
(1) (2a + 3b)3 (ii) (2p – 5)3
సాధన.
i) ఇచ్చిన సమాసాన్ని (x + y)3 తో పోల్చగా,
మనకు x = 2a మరియు y = 3b అగును.
కావున, సర్వసమీకరణం VI, వాడితే (2a + 3b)3
= (2a)3 + (3b)3 + 3(2a)(3b) (2a + 3b)
= 8a3 + 27b3 + 18ab (2a + 3b)
= 8a3 + 27b3 + 36a2b + 54 ab2
= 8a3 + 36a2b + 54ab2 + 27b3

ii) ఇచ్చిన సమాసాన్ని (x – y) తో పోల్చగా, మనకు.
x = 2p మరియు y = 5 అగును.
కావున, సర్వసమీకరణం VII, వాడితే, (2p – 5)3
= (2p)3 – (5)3 – 3(2p)(5) (2p – 5)
= 8p3 – 125 – 30p (2p – 5)
= 8p3 – 125 – 60p2 + 150p
= 8p3 – 60p2 + 150p – 125.

23. కింది వానిని తగిన సర్వసమీకరణాలు ఉపయోగించి గణించండి. (పేజీ నెం.53)
(i) (103)3
(ii) (99)3
సాధన.
i) మనకు (103)3 = (100 + 3)3 వచ్చును.
దీనిని (x + y)3 ≡ x3 + y3 + 3xy(x + y) తో పోల్చగా, మనకు
= (100)3 + (3)3 + 3(100) (3) (100 + 3)
= 1000000 + 27 + 900(103)
= 1000000 + 27 + 92700
= 1092727

ii) మనకు (99)3 = (100 – 1)3
దీనిని (x – y)3 ≡ x – y – 3xy(x – y) తో పోల్చగా, మనకు
= (100)3 – (1)3 – 3(100) (1) (100 – 1)
= 1000000 – 1 – 300 (99)
= 1000000 – 1 – 29700
= 970299.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

24. 8x3 + 36x2y + 54xy2 + 27y3 కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం.54)
సాధన.
ఇచ్చిన సమాసాన్ని మనం దిగువ విధంగా రాస్తే
8x3 + 36x2y + 54xy2 + 27y3
= (2x)3+ 3(2x)2 (3y) + 3(2x) (3y)2 + (3y)3
దీనిని సర్వసమీకరణం VI తో పోల్చగా
(x + y)3 ≡ x3 + 3x2y + 3xy2 + y2
మనకు = (2x + 3y)3
= (2x + 3y) (2x + 3y) (2x + 3y) కారణాంకాలుగా వస్తాయి.

25. లబ్ధం కనుగొనండి. (పేజీ నెం.54)
(2a + b + c) (4a2 + b2 + c2 – 2ab – bc – 2ca)
సాధన.
ఇవ్వబడిన లబ్దాన్ని దిగువ విధంగా రాయవచ్చు.
= (2a + b + c) [(2a)2 + b2 + c2 – (2a)(b) – (b)(c) – (c) (2a)]
సమీకరణం VIII తో పోల్చగా
(x + y + z) (x2 + y2 + z2 – xy – yz – zx)
≡ x3 + y3 + z3 – 3xyz
= (2a)3 + (b)3 + (c)3 – 3(2a) (b) (c)
= 8a3 + b3 + c3 – 6abc

26. a3 – 8b3 – 64c3 – 24abc ను కారణాంకాలుగా విభజించండి. (పేజీ నెం.55)
సాధన.
ఇవ్వబడిన సమాసం
a3 – 8b3 – 64c3 – 24abc
= (a)3 + (-2b)3 + (-4c)3 – 3(a)(-2b) (-4c)
దీనిని సర్వసమీకరణం VIII తో సరిపోల్చగా
x3 + y3 + z3 – 3xyz
≡ (x + y + z) (x2 + y2 + z2 – xy – yz – zx)
మనకు
= (a – 2b – 4c) [(a)2 + (-2b)2 + (-4c)2 – (a) (-2b) – (-2b) (-4c) – (-4c) (a)]
= (a – 2b – 4c) (a2 + 4b2 + 16c2 + 2ab – 8bc + 4ca) కారణాంకాలుగా వస్తాయి.

AP Board 9th Class Maths Solutions Chapter 2 బహుపదులు మరియు కారణాంక విభజన InText Questions

27. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం 2x2 + 9x – 5 అయిన దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులకు తగిన అనుకూల కొలతల విలువలు కనుగొనండి. (పేజీ నెం. 55)
సాధన.
దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులను l, b లుగా తీసుకోండి.
దీర్ఘ చతురస్ర వైశాల్యం = 2x2 + 9x – 5
lb = 2x2 + 9x – 5
= 2x2 + 10x – x – 5
= 2x(x + 5) – 1(x + 5)
= (x + 5) (2x – 1)
l, b లకు తగిన అనుకూల కొలతల విలువలు తీసుకుంటే
∴పొడవు = (x + 5)
వెడల్పు = (2x – 1)
x = 1 అయిన l = 6, b = 1
x = 2 అయిన l = 7, b = 3
x = 3 అయిన l = 8, b = 5
…………….
…………….