AP SCERT 9th Class Maths Textbook Solutions Chapter 15 గణితములో నిరూపణలు Ex 15.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 9th Class Maths Solutions 15th Lesson గణితములో నిరూపణలు Exercise 15.2
1. కింది ప్రశ్నలను నిగమన పద్ధతి ద్వారా ఆలోచించి సాధించండి.
ప్రశ్న (i)
మనుషులందరూ మరణం కలవారే. జీవన్ ఒక మనిషి. రెండు వాక్యముల నుండి జీవన్ గురించి ఏమి చెప్పగలరు?
సాధన.
పై రెండు వాక్యాల నుండి జీవన్ ఒక మనిషి, కావున మరణం కలవాడు.
ప్రశ్న (ii)
తెలుగు ప్రజలందరూ భారతీయులే. x ఒక భారతీయుడు. x తెలుగువాడు అని చెప్పగలవా ?
సాధన.
చెప్పలేము. x అనే భారతీయుడు, ఏదో ఒక రాష్ట్రంకు చెందినవాడై ఉండాలి.
ఉదాహరణకు తమిళుడు, గుజరాతీ, కన్నడీయుడు … మొ||లైన వారు.
ప్రశ్న (iii)
అంగారక గ్రహవాసుల నాలుకలు ఎర్రగా ఉంటాయి. గులాగ్ (Gulag) అంగారక గ్రహవాసి. రెండు వాక్యముల నుండి గులాగ్ గురించి ఏమి చెప్పగలవు ?
సాధన.
గులాగ్ ఎర్రని నాలుక కలవాడు.
ప్రశ్న (iv)
కింది కార్టూన్ నందు ఇచ్చిన బొమ్మలో రాజు యొక్క వివేచనలో (ఆలోచన) గల తప్పును తెల్పండి.
సాధన.
చురుకైన వారందరూ అధ్యక్షులుకారు. కావున రాజు చురుకైన వాడే కానీ అధ్యక్షుడు కాడు.
ప్రశ్న 2.
నీకు, నాలుగు కార్డులు ఇవ్వబడినవి. ప్రతి కార్డుపై ఒక వైపు అంకెలు రెండవ వైపు ఇంగ్లీషు అక్షరములు ఇవ్వబడినవి. వీటికి “ఒక కార్డుకు ఒక వైపు హల్లు ఉంటే, రెండవ వైపు బేసి సంఖ్య ఉంటుంది” అను నియమం కలదు. ఏ రెండు కార్డులను తిప్పిన మనము పై నియమము ఉన్నదో లేదో సరిచూడగలమా ?
సాధన.
నియమము : ఒక కార్డుకు ఒకవైపు హల్లు ఉంటే, రెండవ వైపు బేసి సంఖ్య వుండును.
కార్డులు B మరియు 8 లను తిప్పిన పై నియమమును సరిచూడగలము.
‘B’ ను తిప్పినపుడు సరిసంఖ్యవున్నచో నియమము పాటించనట్లే.
‘8’ ను తిప్పినపుడు అచ్చు ఏర్పడినచో నియమం పాటించనట్లే.
ప్రశ్న 3.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. అందు నాలుగు సూచనలు సత్యము. కాని అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపడవు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు.
(a) ఆ సంఖ్య 9 కంటే పెద్దది.
(b) ఆ సంఖ్య 10 యొక్క గుణిజము కాదు.
(c) ఆ సంఖ్య 7 యొక్క గుణిజము.
(d) ఆ సంఖ్య బేసి సంఖ్య.
(e) ఆ సంఖ్య 11 యొక్క గుణిజము కాదు.
(f) ఆ సంఖ్య 200 కంటే చిన్నది.
(g) దాని ఒకట్ల స్థానములోని అంకె పదుల స్థానములోని అంకెకన్నా పెద్దది.
(h) దాని పదుల స్థానములోని అంకె బేసిసంఖ్య. ఆ సంఖ్య ఏది ?
సాధన.
సూచన | సారాంశము |
a | ఆ సంఖ్య 10 నుండి 99 ల మధ్య కలదు. ఈ సూచన ఉపయోగం లేదు. |
b | ఆ సంఖ్య 10, 20, 30, …… 90 లలో ఏదీకాదు. |
c | ఆ సంఖ్య 7, 14, 21, 28, 35, 42, … 98లలో ఏదో ఒకటి అయ్యి వుండవచ్చు. |
d | ఆ సంఖ్య 7, 21, 35, 49, 63, 77, 91 లలో ఏదో ఒకటి అయ్యి వుండును. |
e | ఆ సంఖ్య 7, 21, 35, 49, 63, 91 లలో ఏదో ఒకటై ఉండును. |
f | ఉపయోగము లేదు. |
g | ఆ సంఖ్య 35, 49 లలో ఏదో ఒకటి అగును. |
h | ఆ సంఖ్య 35. |