AP SCERT 9th Class Maths Textbook Solutions Chapter 10 ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు Ex 10.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 9th Class Maths Solutions 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు Exercise 10.2
ప్రశ్న 1.
రెండు వైపులా మూయబడిన స్థూపాకారపు ట్యాంకు యొక్క ఎత్తు 1.4 మీటర్లు మరియు దాని భూవ్యాసార్ధము 56 సెం.మీ.గా యుండి లోహరేకుతో చేయబడియుంది. దీని సంపూర్ణతల వైశాల్యం ఎంత?
సాధన.
ట్యాంకు యొక్క భూ వ్యాసార్ధము ‘r’ = 56 సెం.మీ.
= \(\frac {56}{100}\) మీ. = 0.56 మీ
ట్యాంకు యొక్క ఎత్తు h = 1.4 మీ.
ట్యాంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం = 2πr (r + h)
లోహరేకు యొక వైశాల్యం = 2πr (r + h)
= 2 × \(\frac {22}{7}\) × 0.56 × (0.56 + 1.4)
= 2 × 22 × 0.08 × 1.96
= 6.8992 మీ2
= 6.90 మీ2
ప్రశ్న 2.
స్థూపము యొక్క ఘనపరిమాణము 308 ఘనపు సెంటి మీటర్లు, ఎత్తు 8 సెం.మీ. అయిన దాని ప్రక్కతల వైశాల్యమును, సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము.
సాధన.
స్థూపము యొక్క ఘనపరిమాణం V = πr2h
= 308 సెం.మీ3
స్థూపము యొక్క ఎత్తు h = 8 సెం.మీ.
∴ 308 = \(\frac {22}{7}\) . r2 × 8
∴ r2 = 308 × \(\frac {7}{22}\) × \(\frac {1}{8}\)
r2 = 12.25
∴ r = \(\sqrt{12.25}\) = 3.5 సెం.మీ.
ప్రక్కతల వైశాల్యం = 2πrh
= 2 × \(\frac {22}{7}\) × 3.5 × 8 = 176 సెం.మీ.2
సంపూర్ణతల వైశాల్యం = 2πr (r + h)
= 2 × \(\frac {22}{7}\) × 3.5 (3.5 + 8)
= 2 × 22 × 0.5 × 11.5 = 253 సెం.మీ.2
ప్రశ్న 3.
ఒక లోహపు దీర్ఘఘనము 22 సెం.మీ. × 15 సెం.మీ. × 7.5 సెం.మీ. కొలతలను కలిగియుంది. దానిని కరిగించి 14 సెం.మీ. ఎత్తుగల ఒక స్థూపముగా చేసిన దాని వ్యాసార్ధము ఎంత ?
సాధన.
లోహపు దీర్ఘఘనము యొక్క కొలతలు = 22 సెం.మీ. × 15 సెం.మీ. × 7.5 సెం.మీ.
స్థూపము యొక్క ఎత్తు, h = 14 సెం.మీ.
స్థూపముగా చేసిన దీర్ఘఘనము యొక్క ఘనపరిమాణం = స్థూపము యొక్క ఘనపరిమాణం
⇒ lbh = πr2h
⇒ 22 × 15 × 7.5 = \(\frac {22}{7}\) × r2 × 14
⇒ r2 = \(\frac{22 \times 15 \times 7.5 \times 7}{14 \times 22}\)
⇒ r2 = 7.5 × 7.5 ⇒ r = 7.5 సెం.మీ.
ప్రశ్న 4.
ఒక నీటితొట్టి స్థూపాకారముగా ఉంటూ 616 లీటర్ల సామర్థ్యమును కలిగియుంది. ట్యాంకు వ్యాసం 5.6 మీటర్లు అయిన ట్యాంకు ఎత్తును కనుగొనుము.
సాధన.
స్థూపము యొక్క ఘనపరిమాణము, V = πr2h = 616 లీ.
ట్యాంకు యొక్క వ్యాసం = 5.6 మీ.
వ్యాసార్ధం, r = \(\frac{d}{2}=\frac{5.6}{2}\) = 28 మీ.
ఎత్తు = h అనుకొనుము.
∴ πr2h = 616
\(\frac {22}{7}\) × 2.8 × 28 × h = 616
h = \(\frac{616 \times 7}{22 \times 2.8 \times 2.8}\) = 25
∴ ఎత్తు = 25 మీ.
ప్రశ్న 5.
ఒక లోహపు గొట్టం యొక్క పొడవు 77 సెం.మీ. దాని మధ్యచ్ఛేద అంతర వ్యాసం 4 సెం.మీ. మరియు బాహ్య వ్యాసం 4 సెం.మీ. (పటం చూడండి). అయిన ఈ క్రింది వానిని కనుగొనండి.
(i) లోపలి ప్రక్కతల వైశాల్యము
(ii) బాహ్య ప్రక్కతల వైశాల్యము
(iii) సంపూర్ణతల వైశాల్యమును కనుగొనండి.
సాధన.
(i) లోపలి ప్రక్కతల వైశాల్యము :
పైపు యొక్క ఎత్తు = 77 సెం.మీ.
లోపలి వ్యాసం = 4 సెం.మీ.
లోపలి వ్యాసార్ధం = \(\frac{d}{2}=\frac{4}{2}\) = 2 సెం.మీ.
∴ లోపలి ప్రక్కతల వైశాల్యం = 2πrh
= 2 × \(\frac {22}{7}\) × 2 × 77
= 88 × 11 = 968 సెం.మీ.2
(ii) బాహ్యప్రక్కతల వైశాల్యము :
బాహ్య వ్యాసం = 4.4 సెం.మీ.
∴ బాహ్య వ్యాసార్ధం r = \(\frac{d}{2}=\frac{4.4}{2}\) = 22 సెం.మీ.
పైపు యొక్క ఎత్తు = h = 77 సెం.మీ.
∴ బాహ్య ప్రక్కతల వైశాల్యం = 2πrh
= 2 × \(\frac {22}{7}\) × 2.2 × 77
= 96.8 × 11
= 1064.8 సెం.మీ.2
(iii) సంపూర్ణతల వైశాల్యము :
సంపూర్ణతల వైశాల్యము = లోపలి ప్రక్కతల వైశాల్యము + బాహ్య ప్రక్కతల వైశాల్యము
= 968 + 1064.8
= 2032.8 సెం.మీ2.
ప్రశ్న 6.
ఒక భవనము చుట్టూ 16 స్థూపాకార స్తంభములున్నవి. ప్రతి స్థూపాకార స్తంభము 56 సెం.మీ. వ్యాసము మరియు 35 మీ. ఎత్తులను కలిగియుంది. స్తంభముల ప్రక్కతల వైశాల్యమునకు రంగు వేసేందుకు చ.మీ.కు ₹ 5.50 వంతున ఎంత ఖర్చు అవుతుంది ?
సాధన.
స్థూపాకార స్తంభము యొక్క వ్యాసము = 56 సెం.మీ.
వ్యా సార్థము , r = \(\frac{d}{2}=\frac{56}{2}\) = 28 సెం.మీ.
= \(\frac {28}{100}\) మీ. = 0.28 మీ.
స్తంభము యొక్క ఎత్తు, h = 35 మీ.
మొత్తం స్తంభముల సంఖ్య = 16
రంగు వేసేందుకు ఒక చ.మీ.కు
అగు ఖర్చు = ₹5.50
ఒక స్తంభము యొక్క ప్రక్కతల వైశాల్యము = 2πrh
= 2 × \(\frac {22}{7}\) × 0.28 × 35
= 2 × 22 × 0.04 × 35
= 61.6 మీ2.
∴ 16 స్థూపాకార ప్తంభముల ప్రక్కతల వైశాల్యం
= 16 × 61.6
= 985.6 మీ.2
16 స్తంభములకు రంగు వేసేందుకు ఒక చ.మీ.కు
₹ 5.5 చొప్పున అగు ఖర్చు = 985.6 × 5.5
= ₹5420.8
ప్రశ్న 7.
ఒక రోడ్డు రోలరు యొక్క వ్యాసము 84 సెం.మీ., పొడవు 120 సెం.మీ. ఒక ఆటస్థలమును చదును చేయుటకు 500 సంపూర్ణ భ్రమణములు చేయవలసి ఉంది. అయితే ఆటస్థల వైశాల్యమును చ.మీ.లలో కనుగొనండి.
సాధన.
రోడ్డు రోలరు యొక్క వ్యాసము = 84 సెం.మీ.
వ్యాసార్థం = \(\frac {84}{2}\) = 42 సెం.మీ.
= \(\frac {42}{100}\) మీ. = 0.42 మీ.
రోడ్డు రోలరు యొక్క పొడవు = 120 సెం.మీ.
= \(\frac {120}{100}\) = 1.2 మీ.
ఆట స్థలమును చదునుచేయుటకు 500 సంపూర్ణ భ్రమణములు చేయవలసియుంది.
కాబట్టి 500 × రోలరు యొక్క ప్రక్కతల వైశాల్యము = ఆటస్థలం యొక్క వైశాల్యము
∴ ఆటస్థలం యొక్క వైశాల్యము = 500 × 2πrh
= 500 × 2 × \(\frac {22}{7}\) × 0.42 × 1.2 = 1584 మీ2
ప్రశ్న 8.
వృత్తాకార బావి యొక్క లోపలి వ్యాసము 3.5 మీ., లోతు 10 మీ. అయిన (i) లోపలి ప్రక్కతల వైశాల్యము (ii) ప్రక్కతలాలను ప్లాస్టరింగ్ చేయుటకు చ.మీ.కు 40 రూపాయల వంతున ఎంత ఖర్చు అవుతుంది ?
సాధన.
వృత్తాకార బావి యొక్క లోపలి వ్యాసము d = 3.5మీ.
వ్యాసార్ధము, r = \(\frac{d}{2}=\frac{3.5}{2}\) = 1.75 మీ.
బావి యొక్క లోతు (h) – 10 మీ.
(i) లోపలి ప్రక్కతల వైశాల్యము = 2πrh
= 2 × \(\frac {22}{7}\) × 1.75 × 10
= 110 మీ2
(ii) ప్లాస్టరింగ్ చేయుటకు చ.మీ.కు ₹ 40 చొప్పున
అగు ఖర్చు = 110 × 40
= ₹4400
9.
ప్రశ్న (i)
ఒక స్థూపాకార పెట్రోలు ట్యాంకు భూవ్యాసం 4.2 మీ., ఎత్తు 4.5 మీ. అయిన ట్యాంకు యొక్క సంపూర్ణతల వైశాల్యమును కనుక్కోంది.
సాధన.
స్థూపాకార ట్యాంకు యొక్క వ్యాసము ‘d’ = 4.2 మీ.
వ్యాసార్ధము, r = \(\frac{d}{2}=\frac{4.2}{2}\) = 21 మీ.
ట్యాంకు యొక్క ఎత్తు 5 = 4.5 మీ.
ట్యాంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము
= 2πr (r + h)
= 2 × \(\frac {22}{7}\) × 21 (2.1 + 4.5)
= 2 × 22 × 0.3 × 6.6 = 87.12 మీ.2
ప్రశ్న (ii)
ట్యాంకును తయారుచేసేందుకు వాడిన స్టీలులో \(\frac {1}{12}\) వ వంతు వృథా అయిన ఎంత పరిమాణపు స్టీలును ఉపయోగించారో లెక్కించుము.
సాధన.
వృథా అయిన స్టీలు పరిమాణం = \(\frac {1}{12}\)
ట్యాంకును తయారుచేసేందుకు వాడిన స్టీలు
= 1 – \(\frac {1}{12}\) = \(\frac {11}{12}\)
మొత్తం స్టీలు పరిమాణం = x మీ2 అనుకొనుము.
\(\frac {11}{12}\)x = 87.12 మీ.2
∴ x = 87.12 × \(\frac {12}{11}\) = 95.04 మీ.2
ప్రశ్న 10.
ఒక వైపు మూయబడి స్థూపాకార ద్రమ్ యొక్క లోపలి వ్యాసార్ధము 28 సెం.మీ., ఎత్తు 21 మీ. అయిన ఆ ద్రమ్ లో నిల్వ చేయగల నీటి సామర్థ్యమును లీటర్లలో తెల్పుము. (1 లీటరు = 1000 ఘనపు సెంటీమీటర్లు)
సాధన.
స్థూపాకార డ్రమ్ యొక్క లోపలి వ్యాసార్ధము ‘r’ = 28 సెం.మీ.
ఎత్తు, h = 2.1 మీ. = 2.1 × 100 = 210 సెం.మీ.
డ్రమ్ యొక్క ఘనపరిమాణము = πr²h
= \(\frac {22}{7}\) × 28 × 28 × 210
= 22 × 4 × 28 × 210 = 517440 ఘ. సెం.మీ.
= \(\frac {517440}{1000}\) లీ. = 517.44 లీ.
ప్రశ్న 11.
ఒక స్థూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యము 1760 చ.సెం.మీ. మరియు దాని ఘనపరిమాణము 12320 ఘనపు సెంటీమీటర్లు అయిన దాని ఎత్తును కనుగొనుము.
సాధన.
స్థూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యము = 2πrh
= 1760 సెం.మీ.2
స్థూపాకార వస్తువు యొక్క ఘనపరిమాణం = πr2h
= 12320 సెం.మీ.3
ఎత్తు = h అనుకొనుము.
ఘనపరిమాణం / ప్రక్కతల వైశాల్యం = \(\frac{\pi r^{2} h}{2 \pi r h}=\frac{12320}{1760}\)
⇒ \(\frac {r}{2}\) = 7
∴ r = 7 × 2 = 14 సెం.మీ.
2πrh = 1760 సెం.మీ.2
2 × \(\frac {22}{7}\) × 14h = 1760 సెం.మీ.
h = \(\frac{1760 \times 7}{2 \times 22 \times 14}\) = 20 సెం.మీ.
∴ స్థూపాకార వస్తువు యొక్క ఎత్తు = 20 సెం.మీ.