AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 8 జీవన భాష్యం.
AP State Syllabus 8th Class Telugu Important Questions 8th Lesson జీవన భాష్యం
8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Important Questions and Answers
I. అనగాహన – ప్రతిస్పందన
అ) కింది ఆసరిచిత గద్యాలు చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది గద్యభాగాన్ని చదవండి. కింద ఇచ్చిన నాలుగు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి, బ్రాకెట్లలో రాయండి.
అంతరించిపోతున్న తెలుగు భాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.
వాక్యాలు :
1. కందుకూరి పూర్తి పేరు వీరేశలింగం పంతులు. (✓)
2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం. (✗)
3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన. (✗)
4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త. (✓)
2. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాలాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫెర్ ఆసియాలో మొట్టమొదట తపాలా బిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సిండే డాక్ అనేవారు.
ప్రశ్నలు:
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు.
2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.
3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.
4. సిండే డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.
3. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మగ్గుతున్న భారత జాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు :
1. సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో
2. తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలు పెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి
3. సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857
4. భారతదేశం ఆంగ్లేయుల పాలనలోకి పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857
4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి, ‘దేవరంపాడు’ శిబిరానికి ప్రాతినిధ్యం వహించేది. ఈ శిబిరం బాగా పనిచేసిందని ప్రశంసలు పొందింది. వివిధ గ్రామాల నుండి వందలమంది సత్యాగ్రహులు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్టు చేసేవారు. అయినా స్త్రీలు భయపడక ధైర్యంగా వారి నెదుర్కొన్నారు. మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోని స్త్రీలు జంకలేదు. సత్యాగ్రహం మానలేదు.
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులోను, దుర్గాబాయమ్మ చెన్నపూరిలోను, రుక్మిణమ్మ వేదారణ్యంలోనూ మరికొందరు స్త్రీలు భిన్న ప్రాంతాలలోనూ చూపిన సాహసోత్సాహములు, ఆంధ్రుల ప్రతిష్ఠను విస్తరింపజేశాయి అని ఆంధ్రపత్రిక 1932లో వీరిని ప్రశంసించింది.
ప్రశ్నలు :
1. లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహంలో ఏ శిబిరానికి నాయకత్వం వహించింది.
జవాబు:
లక్ష్మీబాయమ్మ ‘దేవరంపాడు’ శిబిరానికి నాయకత్వం వహించింది.
2. సత్యాగ్రహులు శిబిరానికి ఎక్కడ నుండి వచ్చేవారు?
జవాబు:
సత్యాగ్రహులు వివిధ గ్రామాల నుండి శిబిరానికి వచ్చేవారు.
3. ఎన్నిసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు?
జవాబు:
మూడుసార్లు శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
4. గుంటూరు ఉప్పు సత్యాగ్రహానికి నాయకురాలు ఎవరు?
జవాబు:
శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరులో నాయకత్వం వహించింది.
5. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బుకు మనసు కరగడం ద్వారా ఏ ఫలితం వస్తుంది?
జవాబు:
వర్షమై భూమి మీద కురుస్తుంది.
2. దారి ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
భయపడకుండా, నిరుత్సాహ పడకుండా ముందడుగు వేసే స్ఫూర్తి నలుగురికి దారి అవుతుంది.
3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
సి. నారాయణరెడ్డి గారు.
4. పై గేయం చదివి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘ఎడారి దిబ్బలు’ అంటే ఏమిటి?
6. కింది పరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
ఎవరికి వారే గీపెడితే ఆశించిన గమ్యం దొరకదోయ్,
సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం,
ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ సంతృప్తికే ‘సినారే’
దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం
ప్రశ్నలు :
1. ‘సమైక్యతతోనే ‘సంఘం వర్ధిల్లుతుంది’ అనే భావం ఏ పాదంలో ఉంది?
జవాబు:
2వ పాదం
2. ‘దయకురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం’ అనే మాట ద్వారా కవి మనుషులకు ఏమి సందేశం ఇస్తున్నాడు?
జవాబు:
తోటి మనిషికి సేవచేసే దయలోనే దైవం ఉన్నాడు.
3. ‘ప్రతిమలు’ అనే మాటకు అర్థం ఏమిటి?
జవాబు:
బొమ్మలు
4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గేయంలోని మొదటి పాదంలోని అర్థం ఏమిటి?
7. ఈ క్రింది పరిచిత గేయాన్ని చదవండి. అడిగిన విధంగా సమాధానాలు రాయండి.
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
వంకలు డొంకలు కలవనీ జడిపించకు నేస్తం !
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ప్రశ్నలు :
1. మబ్బులు కురవాలంటే ఏం జరగాలి?
జవాబు:
నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే కురుస్తాయి.
2. మనసుకు మబ్బు ముసరడం అంటే ఏమిటి?
జవాబు:
మనసుకు మబ్బు ముసరడం అంటే ఆందోళన, చింత, బాధ, దిగులు కమ్ముకోవడం.
3. ఈ పై గేయం ఆధారంగా రెండు ప్రశ్నలు తయారుచేయండి.
జవాబు:
1) ‘జంకని’ అంటే ఏమిటి?
2) ‘నేస్తం’ పర్యాయపదాలు రాయండి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931లో కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామంలో పుట్టారు. వీరు ప్రముఖ ఆధునిక కవి, వక్త, పరిశోధకులు, బహుభాషావేత్త, ప్రయోగశీలి.
నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచ పదులు మొదలైన నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమాపాటలు రాసారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అన్న వీరి సిద్ధాంత గ్రంథము ఎన్నో ముద్రణలను పొందింది. వీరి ‘విశ్వంభర’ కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన ‘జ్ఞానపీఠ అవార్డు’ లభించింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది. ‘చమత్కారం’ – వీరి కలానికీ, గళానికీ, ఉన్న ప్రత్యేకత.
ప్రశ్న 2.
‘గజల్’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉర్దూ సాహిత్య ప్రక్రియ ‘గజల్’. దీంట్లో ఒకే విషయాన్ని చెప్పాలనే నిర్బంధం ఉండదు. గజల్ లోని భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండు చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్తపరుస్తాయి. గజల్ పల్లవిని ఉర్దూలో ‘మత్తా’ అని, చివరి చరణాన్ని “మక్తా” అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీన్ని “తఖల్లస్” అంటారు. సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు.
ప్రశ్న 3.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచిపోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు, చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కవి తెలిపాడు.
ప్రశ్న 4.
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఉంటుంది పరీక్ష” అనే వాక్యం ద్వారా కవి మనకు ఇచ్చిన సందేశం ఏమిటి?
జవాబు:
మనకు ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చారు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే అని కవి తెలియజెప్పారు. కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తుచేశాడు. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే నీరు కారిపోవలసిందే అని కవి తెలిపాడు.
ప్రశ్న 5.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు “సినారె” ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
జవాబు:
బీడు పడి, పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని, ఏ ప్రయత్నాలూ చేయకుండా నిరాశకు లోనుకావద్దని, కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయని సినారె సందేశమిచ్చారు.
ఎడారి దిబ్బల వ్యవసాయంలాగే కొన్ని పనులు చేయడానికి మనం ముందుకురాము. దానివల్ల ప్రయోజనం ఉండదని ముందే తీర్మానించుకుంటాము. అది సరిగాదనీ, నీకు లభ్యమైన వస్తువును ఉపయోగంలో పెట్టుకోడానికి ప్రయత్నించాలని, అలా ప్రయత్నిస్తే ఎడారి చేలల్లో పంటలు పండినట్లు తప్పక ఫలితం ఉంటుందని నారాయణరెడ్డి గారి అభిప్రాయం. నీ వంతు ప్రయత్నం నీవు చేయాలనే కర్తవ్యాన్ని గుర్తుచేయడం ఈ వాక్యం యొక్క సందేశం.
ప్రశ్న 6.
ఈ గజల్ లో మీకు బాగా నచ్చిన చరణాలు ఏవి? ఎందుకు నచ్చాయో సమర్థిస్తూ వివరణ ఇవ్వండి.
జవాబు:
ఈ గజల్ లో నాకు “మనిషీ మృగము ఒకటనీ ………. ఒక ఊరవుతుంది” అనే చరణాలు బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ చరణాలలో నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అనే అర్థం ఉంది.
“ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష” అన్న చరణం కూడా నచ్చింది. తాను గొప్పవాడిని అయ్యానని, ఇంక తనకు ఎదురే లేదని, తనకు ఎంతో సంపద, సామర్థ్యం ఉందని ధీమాగా ఉండరాదనీ, ఏదో సమస్య వస్తూనే ఉంటుందనీ దాని భావం. ఇది గొప్ప జీవిత సత్యం. అలాగే “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అన్న చరణం గొప్ప సందేశాన్ని ఇస్తోంది. ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగకార్యం చేస్తే ఆ వ్యక్తి పేరు శాశ్వతంగా నిలుస్తుందని దీని అర్థం. ఇది గొప్ప జీవనసత్యం. అందువల్ల పై చరణాలు నాకు నచ్చాయి.
ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’ అని ‘సి.నా.రె’ ఎందుకు అని ఉంటారు?
జవాబు:
‘మనిషి’ భగవంతుని సృష్టిలో ఒకే రకం జీవి. అయినా నేడు సంఘంలో మనుష్యులు కులమత భేదాలతో, వర్గవైషమ్యాలతో విడిపోతున్నారు. అందువల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మత వైషమ్యాల వల్ల దేశాలూ, రాష్ట్రాలూ నాశనం అవుతున్నాయి. ప్రాంతీయ భేదాల వల్ల కలతలూ, కార్పణ్యాలూ పెరిగిపోతున్నాయి. అలాగాక గ్రామంలోని పదుగురూ అంటే పదిమందీ కలసి ఉంటే, అది చక్కని గ్రామం అవుతుంది. గ్రామంలోని ప్రజలంతా కలసి ఉంటే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. గ్రామంలోని పదిమందీ అంటే ఉన్నవాళ్ళంతా కులమత భేదాలు లేకుండా కలిసి, గ్రామాభివృద్ధికి కృషిచేస్తే అది చక్కని “ఊరు’ అవుతుంది. ఆదర్శ గ్రామం అవుతుందని భావం. ఆ గ్రామానికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూరుతాయి. ప్రభుత్వం కూడా ఆ గ్రామానికి కావలసిన ధన సహాయం చేస్తుంది. గ్రామ ప్రజల్లో సహకారం, ఐకమత్యం అవసరం అని చెప్పడానికే ‘సి.నా.రె’ ఈ వాక్యాన్ని రాశారు.
ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ గజల్ సారాంశం మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మబ్బులకు దయ కలిగితే నీరుగా మారి వర్షం వస్తుంది. మనస్సు పై దిగులు మబ్బులు కమ్మితే దుఃఖం వస్తుంది. వంకలూ, డొంకలూ ఉన్నాయని జంకకుండా ముందడుగు వేస్తే అదే పదిమందీ నడిచే దారిగా మారుతుంది. ఎడారి ఇసుకదిబ్బలు దున్నినా ఫలితం ఉండదని అనుకోకుండా, సేద్యం చేస్తే పంట పండుతుంది. మనిషి, జంతువు అని తేడాలు పెట్టుకోడం వ్యర్థం. పదిమంది మనుషులు కలిస్తే అది మంచి గ్రామం అవుతుంది.
ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుంది. హిమాలయం ఎత్తులో ఉన్నా వేడికి అది కరిగి నీరవుతోంది కదా ! బిరుదులు, సన్మానాలు పొందాము అనుకున్నా పేరు నిలువదు. గొప్ప త్యాగం చేస్తేనే పేరు నిలుస్తుంది.
ప్రశ్న 3.
ఏదైనా ఒక లక్ష్యసాధనలో విజయమూ కలగవచ్చు ! అపజయమూ కలగవచ్చు ! అందుకు గల కారణాలు ఊహించి రాయండి.
జవాబు:
మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలని కార్యసాధనకు దిగితే, అందుకు దైవం అనుకూలిస్తే, విజయం సాధించగలం. మనము చక్కని ప్రణాళికతో పని ప్రారంభిస్తే అందుకు పై అధికారులూ, తోటివారూ, ప్రక్కవారూ సహకరిస్తే మన లక్ష్యం నెరవేరుతుంది. మనం ప్రణాళిక లేకుండా పనికి దిగినా, పక్కవారు సాయం చేయకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం లక్ష్యమును సాధింపలేము. మనం మన శక్తికి తగిన లక్ష్యాన్ని ఎన్నుకుంటే తప్పక విజయం సాధిస్తాము. నేల విడిచి సాము చేస్తే కార్యాన్ని సాధించలేము.
మంచి మార్కులు సాధిస్తున్న విద్యార్థి ఐ.ఎ.ఎస్లో ఉత్తీర్ణత పొందగలడు. అత్తెసరు మార్కులవారు ఆ లక్ష్యాన్ని చేరలేరు. కార్యసాధనకు మంచి పట్టుదల, దీక్ష, నిరంతర కృషి కావాలి. అటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. కృషి ఉంటే, మనిషి ‘ఋషి’ అవుతాడు. కృషి లేకుండా కేవలం పగటి కలలు కనడం వల్ల, కార్య లక్ష్యసాధన కాదు.
ప్రశ్న 4.
“చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది” అంటే త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?
జవాబు:
త్యాగం చేసేవారి, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్తులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి. వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందేవిధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
ప్రశ్న 5.
రైతు గొప్పదనాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి. (S.A. I – 2018-19)
జవాబు:
కష్టజీవి రైతు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులు పంటలు పండిస్తేనే మనం అన్నం తినగల్గుతాం. రైతు అంటే ‘పంటకాపు’ అని నిఘంటు అర్థం. అంటే పంటను రక్షించేవాడు. వ్యవసాయదారుడు, కృషీవలుడు అనే పర్యాయ పదాలున్నాయి.
వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తి రైతు. పంటలు పండించే వారినే కాక మామిడి, కొబ్బరి, ద్రాక్ష తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తుంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకొని సాగు చేస్తుంటారు. వారిని కౌలు రైతులు అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకొనే ఉద్యోగులను రైతు కూలీలు అంటారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు. వారు విరక్తిలో కాడి పడేస్తే మనకు అన్నం దొరకదు. రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అని మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వాలు రైతును బిచ్చగాళ్ళను చేస్తున్నాయి. రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిలో ఉన్నారు. సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని, దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మన రాష్ట్రాలలో సగటున రోజుకు 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
ఏ రైతూ కన్నీరు పెట్టనప్పుడే భూమాత సంతోషిస్తుంది. రెక్కాడితే కాని డొక్కాడని ఎందరో రైతులున్నారు. వారందరికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలి. గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. ప్రభుత్వమే రైతు వద్ద పంటను కొనుగోలు చేయాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు.
ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
“జీవన భాష్యం” గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
- మంచు కరిగితే నీరవుతుంది.
- మంచి నడక నడిస్తే అది దారవుతుంది.
- వర్మం కురిస్తే పంట పైరవుతుంది.
- మంచి వ్యక్తులు కూడితే ఊరవుతుంది.
- నదులు పారితే అది ఏరవుతుంది.
- త్యాగధనులుంటే అది పేరవుతుంది.
ప్రశ్న 2.
ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:
- మీ రచనలలో మీకు బాగా నచ్చిన కావ్యం ఏది?
- ‘ప్రపంచ పదులు’ దీన్ని మీరు ఎలా సృష్టించారు?
- మీ సినీగేయాలలో మీకు నచ్చిన గేయం ఏది?
- మిమ్ములను కవిత్వం వైపు నడిపించినది ఎవరు?
- మీ రచనలకు ప్రేరణనందించిన అంశాలు ఏవి?
- మధ్యతరగతి మందహాసంలోని ప్రధానమైన అంశం ఏమిటి?
- ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలకు, మీరిచ్చే సందేశం ఏమిటి?
- విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఎలా బయటపడగలుగుతారు?
- నేటి యువ రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
- ప్రస్తుతం మీరు ఎందుకు సినిమా పాటలు రాయడంలేదు?
ప్రశ్న 3.
డా॥ సి. నారాయణరెడ్డిగారిని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ ధర్మవరం, ప్రియమైన మిత్రుడు అవినాష్ కు, నీ మిత్రుడు వ్రాయునది నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన తెలుగు సాహిత్య కవులలో డా|| సి. నారాయణరెడ్డిగారు సుప్రసిద్ధులు. వీరి శైలి మధురంగాను, సృజనాత్మకంగాను ఉంటుంది. వీరు రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరు రచించిన సినీ గీతాలు ఈనాటికి ఆపాత మధురంగా ఉన్నాయి. వీరి పరిశోధనాత్మక గ్రంథం ప్రశస్తి పొంది, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వీరి గజల్స్ తెలుగు ప్రాంతంలో ఉర్రూతగించాయి. అందుకే నాకు నారాయణరెడ్డిగారు అంటే చాలా ఇష్టం . ఇట్లు, చిరునామా : |
8th Class Telugu 8th Lesson జీవన భాష్యం 1 Mark Bits
1. ఏ సిరులు పొందని సంతృప్తి ఏమిటో (వ్యతిరేకపదం రాయండి) (S.A. II – 2018-19)
ఎ) అసంతోసం
బి) అసమ్మోహం
సి) అసంతృప్తి
డి) అతృప్తి
జవాబు:
సి) అసంతృప్తి
2. పరీక్షలు బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. (S.A. II – 2018-19)
ఎ) శత్రర్థకం
బి) సంయుక్తం
సి) సంక్లిష్ట
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం
3. సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. (ఏ వాక్యమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) క్త్వార్థకం
బి) శత్రర్థకం
సి) సంశయార్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం
4. శత్రర్థక వాక్యమును గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) రాజు ఆటలు ఆడి ఇంటికి వచ్చాడు.
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.
సి) రవి రేపు సినిమాకు వెళతాడు.
డి) సత్య బాగా చదివితే వాళ్ళ నాన్నకు పేరు వస్తుంది.
జవాబు:
బి) రమ వంట చేస్తూ పుస్తకం చదువుతోంది.
5. రవి ఎన్నో గ్రంథాలు చదివాడు. వాటిలో తాటియాకు పొత్తములు కూడా ఉన్నాయి. (సమానార్థక పదాన్ని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) తల
బి) మస్తకం
సి) పుస్తకం
డి) దేవాలయం
జవాబు:
సి) పుస్తకం
6. బాగా చదివితే బాగుపడతాం (గీత గీసిన పదం ఆధారంగా ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) క్వార్థకం
బి) శత్రర్థకం
సి) చేదర్థకం
డి) నిరర్థకం
జవాబు:
సి) చేదర్థకం
7. “ఆయన మాట కఠినం ; మనసు వెన్న” వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఉపమాలంకారం
బి) అతిశయోక్తి అలంకారం
సి) రూపకాలంకారం
డి) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
సి) రూపకాలంకారం
భాషాంశాలు – పదజాలం
అర్థాలు :
8. పదుగురు వెళ్ళారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనేకులు
బి) తక్కువమంది
సి) అల్పులు
డి) నీచులు
జవాబు:
ఎ) అనేకులు
9. మంచి నేస్తం ఉండాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వైరి
బి) విరోధి
సి) స్నేహితుడు
డి) సైనికుడు
జవాబు:
సి) స్నేహితుడు
10. ఏరు ప్రవహించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంబుధి
బి) నది
సి) సముద్రం
డి) క్షీరం
జవాబు:
బి) నది
11. మబ్బు కమ్మింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కంచుకం
బి) కెరటం
సి) మేఘం
డి) కవటం
జవాబు:
సి) మేఘం
12. విన్నాడు జంకకూడదు – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) మాట్లాడకూడదు
బి) భయపడకూడదు
సి) వినకూడదు
డి) వ్రాయకూడదు
జవాబు:
బి) భయపడకూడదు
13. వ్యర్ధంగా పిలువరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనవసరం
బి) అనంతం
సి) ఆకారం
డి) చెరగని
జవాబు:
ఎ) అనవసరం
14. గిరిపై తరులు ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థం ఏది?
ఎ) కోరిక
బి) పర్వతం
సి) ఝరి
డి) కొన
జవాబు:
బి) పర్వతం
15. శిరస్సు ప్రధానమైంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తల
బి) నాలుక
సి) కర్ణం
డి) చరణం
జవాబు:
ఎ) తల
పర్యాయపదాలు :
16. మనసు నిర్మలం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హృదయం, చిత్తం
బి) చీర, చేలం
సి) చీరం, గరుకు
డి) హృదయం, హేయం
జవాబు:
ఎ) హృదయం, చిత్తం
17. నీరు ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) జలం, వారి
బి) క్షీరం, వారి
సి) వాయువు, వర్షం
డి) పయోధరం, పయోధి
జవాబు:
ఎ) జలం, వారి
18. దారిలో వెళ్ళాలి – గీత గీసిన పదానికి పర్యాపదాలు గుర్తించండి.
ఎ) దారం, సూత్రం
బి) విల్లు, ధనువు
సి) పథం, మార్గం
డి) అంతరంగం, ఆకాశం
జవాబు:
సి) పథం, మార్గం
19. మృగం ఎక్కడుంది? – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఏది?
ఎ) మెకం, ఆహారం
బి) జంతువు, పసరము
సి) పరిహారం, పరివృత్తి
డి) జనిత, జాగృతి
జవాబు:
బి) జంతువు, పసరము
20. కళ్యాణం జరిగింది? – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) పెండ్లి, పరిణయం
బి) తరచు, తమరు
సి) కేలు, కీడు
డి) కార్ముకం, కారుణ్యం
జవాబు:
ఎ) పెండ్లి, పరిణయం
21. మంచి గుణం ఉండాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) స్వభావం, గొనము
బి) గోరు, గున్న
సి) చిన్న, చిగురు
డి) చివర, అంతిమం
జవాబు:
ఎ) స్వభావం, గొనము
ప్రకృతి – వికృతులు :
22. మనుష్యుడు ఉన్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గరమ
బి) మనిషి
సి) మనసు
డి) మరమ
జవాబు:
బి) మనిషి
23. చాగం చేయాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) త్యేగ్యం
బి) త్యాగం
సి) త్యేగం
డి) త్యోగం
జవాబు:
బి) త్యాగం
24. శిరము నందు వెంట్రుకలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సిరము
బి) శీరం
సి) సీసం
డి) కీరం
జవాబు:
ఎ) సిరము
25. గీములో ఉన్నాను – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) గేము
బి) గృహం
సి) గోము
డి) గృము
జవాబు:
బి) గృహం
26. సింహం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) శింహం
బి) సీరు
సి) సీమ
డి) సింగం
జవాబు:
డి) సింగం
27. సంతోషంగా ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) సంబరం
బి) సంగరం
సి) సంతసం
డి) సంగోరం
జవాబు:
సి) సంతసం
28. కార్యం చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) కారము
బి) కర్ణం
సి) కారిజం
డి) కేరియం
జవాబు:
బి) కర్ణం
నానార్థాలు :
29. కాలం చెల్లాడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) మరణం, సమయం
బి) చావు, చాకిరి
సి) సమయం, సాన
డి) కాలం, కాలయాపన
జవాబు:
ఎ) మరణం, సమయం
30. కరంతో పనిచేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండము
బి) దానము, దాపరికం
సి) దశ, దిశ
డి) ఆహారం, ఓగిరం
జవాబు:
ఎ) చేయి, తొండము
31. హరి రక్షకుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) శృగాలం, శృంగె
బి) విష్ణువు, కోతి
సి) బ్రహ్మ, ఇంద్రుడు
డి) కోతి, కృప
జవాబు:
బి) విష్ణువు, కోతి
వ్యుత్పత్త్యర్థాలు :
32. విశ్వాన్ని ధరించునది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ధరణి
బి) విశ్వము
సి) వారుణి
డి) వారిధి
జవాబు:
ఎ) ధరణి
33. ఆకాశంలో ఎగిరేది-అనే వ్యుత్పత్తి గల పదం
ఎ) ప్రసూనం
బి) పక్షి
సి) ప్రసూతి
డి) ప్రసన్నం
జవాబు:
బి) పక్షి
34. అమృతం – దీనికి వ్యుత్పత్తి ఏది?
ఎ) మరణాన్ని ఇచ్చేది
బి) చావును కలిగించేది
సి) అమృతమయం అయినది
డి) మరణము పొందింపనిది
జవాబు:
డి) మరణము పొందింపనిది
35. దినాన్ని కలుగజేయువాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) నళినీ బాంధవుడు
బి) దినకరుడు
సి) రజనీకరుడు
డి) మిత్రుడు
జవాబు:
బి) దినకరుడు
వ్యాకరణాంశాలు
సంధులు :
36. నీరందుతుంది కదా ! – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వసంధి
సి) అత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి
37. బాల్యమంతా – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) అత్వసంధి
సి) ఉత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
బి) అత్వసంధి
38. ఫలమేమి ఉంది – దీనిని విడదీయండి.
ఎ) ఫలమో + ఏమి
బి) ఫలము + ఏమి
సి) ఫలము + ఏమి
డి) ఫలమే + ఏమి
జవాబు:
బి) ఫలము + ఏమి
39. దారవుతుంది – దీనిని విడదీయండి.
ఎ) దార + అవుతుంది
బి) దారి + అవుతుంది
సి) దారె + అవుతుంది
డి) దారవు + తుంది
జవాబు:
బి) దారి + అవుతుంది
40. బాలికోన్నత పాఠశాల – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) విసర్గ సంధి
బి) ఉత్వసంధి
సి) శ్చుత్వసంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి
41. విలువేమి ఉంది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) విలువె + ఏమి
బి) విలువ + ఏమి
సి) విలువు + ఏమి
డి) విలువి + ఏమి
జవాబు:
బి) విలువ + ఏమి
42. అక్కడక్కడ ఉంది – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) టుగాగమ సంధి
బి) ద్విరుక్తటకారాదేశ సంధి
సి) ఆమ్రేడిత సంధి
డి) జశ్త్వసంధి
జవాబు:
సి) ఆమ్రేడిత సంధి
43. దేవాలయంలో భక్తులు ఉన్నారు – గీత గీసిన పదం వాక్యం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) ఉత్వసంధి
సి) అత్వసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
ఎ) సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు:
44. ఎడారిదిబ్బలు ఉన్నాయి-గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) కర్మధారయం
బి) సప్తమీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) అవ్యయీభావ
జవాబు:
బి) సప్తమీ తత్పురుష
45. కన్నీరు వచ్చింది – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కంటి యొక్క నీరు
బి) కన్ను వలన నీరు
సి) కన్ను చేత నీరు
డి) కన్నును నీరు
జవాబు:
ఎ) కంటి యొక్క నీరు
46. హిమగిరి శిఖరం ఉన్నతం – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) కర్మధారయం
సి) షష్ఠీ తత్పురుష
డి) బహువ్రీహి
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష
47. చెరగని త్యాగం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) చెరగని దైన త్యాగం
బి) చెరిగి యొక్క త్యాగం
సి) చెరిగిన యందు త్యాగం
డి) త్యాగం చెరిగింది
జవాబు:
ఎ) చెరగని దైన త్యాగం
48. నఞ్ తత్పురుషకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) కారుచీకటి
బి) అసత్యం
సి) కార్మికలోకం
డి) విద్యాధికుడు
జవాబు:
బి) అసత్యం
49. దొంగభయం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) దొంగ వలన భయం
బి) దొంగ యందు భయం
సి) దొంగచేత భయం
డి) దొంగకు భయం
జవాబు:
ఎ) దొంగ వలన భయం
వాక్యాలు :
50. అల్లరి చేస్తే దండన తప్పదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) చేదర్థక వాక్యం
సి) అప్యర్థకవాక్యం
డి) భావార్థక వాక్యం
జవాబు:
బి) చేదర్థక వాక్యం
51. నాచే పని చేయబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) తద్ధర్మార్థక వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
డి) కర్మణి వాక్యం
52. నడుస్తూ తింటున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అప్యర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం
53. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన ఏ సంధి?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) తుమున్నర్థక వాక్యం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
54. పాలు తెల్లగా ఉంటాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్
55. మీరు బాగా చదవండి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) మీరు బాగా చదవద్దు
బి) మీరు బాగా చదివి తీరాలి
సి) మీరు బాగా చదవలేకపోవచ్చు
డి) మీరు కొద్దిగా చదవాలి
జవాబు:
ఎ) మీరు బాగా చదవద్దు
56. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశ్చర్యార్థక వాక్యం
బి) అనుమత్యర్థకం
సి) భావార్థకం
డి) తుమున్నర్థకం
జవాబు:
బి) అనుమత్యర్థకం
57. ఆహా ! ఎంత బాగుందో ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రేరణార్థక వాక్యం
బి) ఆశ్చర్యార్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
బి) ఆశ్చర్యార్థక వాక్యం
గణ విభజన :
58. మైత్రేయి – ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) జ గణం
సి) య గణం
డి) భ గణం
జవాబు:
ఎ) త గణం
59. మర్యాద – ఇందులోని గణాలు ఏవి?
ఎ) III
బి) UUI
సి) UUU
డి) IIU
జవాబు:
బి) UUI
60. UIU – ఇది ఏ గణం?
ఎ) భ గణం
బి) స గణం
సి) త గణం
డి) ర గణం
జవాబు:
డి) ర గణం
61. III – ఇది ఏ గణం?
ఎ) మ గణం
బి) స గణం
సి) న గణం
డి) య గణం యం
జవాబు:
సి) న గణం
అలంకారాలు :
62. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) రూపకం
సి) అతిశయోక్తి
డి) అర్థాంతరన్యాస
జవాబు:
బి) రూపకం
63. క్రింది వానిలో అర్థాలంకారం ఏది?
ఎ) శ్లేష
బి) ముక్తపదగ్రస్తం
సి) అనన్వయం
డి) దృష్టాంతం
జవాబు:
ఎ) శ్లేష
64. సీతముఖం చంద్రునివలె మనోహరంగా ఉంది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) అర్థాంతరన్యాస
బి) ఉపమ
సి) రూపక
డి) అతిశయోక్తి
జవాబు:
బి) ఉపమ
65. జర్రి మర్రి తొర్రలో దూరింది – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) వృత్త్యనుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) వృత్త్యనుప్రాస
66. ఈ రాజు సాక్షాత్తు ఈశ్వరుడే – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
ఎ) రూపక
67. రాజుకు కువలయానందకరుడు – ఇందలి అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) శ్లేష
సి) అర్థాంతరన్యాస
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
డి) ముక్తపదగ్రస్తం
సొంతవాక్యాలు :
68. నేస్తం : మంచి నేస్తం వల్ల ఉపయోగాలు ఉంటాయి.
69. చెరగని : పొట్టిశ్రీరాములుగారి ఆత్మార్పణ తెలుగుజాతిపై చెరగని ముద్ర వేసింది.
70. హిమగిరి : హిమగిరి అందాలు ఆకట్టుకుంటాయి.
71. వ్యాప్తి : దేశ సంస్కృతీ వ్యాప్తికి కృషి చేయాలి.
72. త్యాగం : మహనీయుల త్యాగం వల్ల స్వాతంత్ర్యం వచ్చింది.
73. కన్నీరు : దుఃఖంతో కన్నీరు వస్తుంది.
74. ముసరడం : నీలిమేఘాలు ఆకాశమంతటా ముసురుకున్నాయి.
75. ఎడారి దిబ్బలు : ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు.
76. జంకని అడుగులు : గుండె బలం కలవాడు జంకని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు.
77. చెరగని త్యాగం : పరోపకార పరాయణులు చెరగని త్యాగ గుణం కలవారుగా ఉంటారు.