AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 7 హరిశ్చంద్రుడు.
AP State Syllabus 8th Class Telugu Important Questions 7th Lesson హరిశ్చంద్రుడు
8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు Important Questions and Answers
I. అవగాహన- ప్రతిస్పందన
అ) కింది అపరిచిత పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు :
1. కలహపడే ఇంట్లో ఏం నిలువదు?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.
2. కలకాలం ఎలా మెలగాలి?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.
3. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది?
జవాబు:
ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడ పిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం – నష్టం’.
2. కింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్న మమృతంబు వోడుముదనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు :
1. ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు?
జవాబు:
వేల్పులు, ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.
2. నిపుణమతులు ఎటువంటివారు?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.
3. వేల్పులు దేన్ని చూసి భయపడలేదు?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల పట్టుదల”.
3. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు :
1. చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.
2. ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.
3. ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.’
4. కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి.
రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము
ప్రశ్నలు:
1. రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.
2. సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము, సుధలు కురిపిస్తుంది.
3. యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. –
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు – సుకవి’.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
ద్విపదకు జీవంపోసిన గౌరన 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన కవిత్వం నిండా అచ్చతెలుగు పలుకుబళ్ళు జాలువారుతుంటాయి. హరిశ్చంద్రుడు అనే పాఠం రాసిన ఆయన గురించి రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
‘హరిశ్చంద్రుడు’ పాఠ్యాంశ రచయిత గౌరన. ఈయన 15వ శతాబ్దికి చెందినవాడు. వీరు హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించారు. ఈయనకు ‘సరస సాహిత్య విచక్షణుడు’ అనే బిరుదు ఉంది. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు, జాతీయాలతో కవిత్వం అందరిని అలరిస్తుంది. అచ్చతెలుగు పలుకుబడులు కవిత్వం నిండా పుష్కలంగా ఉంటాయి.
ప్రశ్న 2.
‘ద్విపద’ ప్రక్రియను వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ద్విపద ఒకటి. ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ప్రతిపాదంలోను నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోను మూడు ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటుంది. 1-4 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.
ప్రశ్న 3.
హరిశ్చంద్రుని పాత్ర స్వభావం రాయండి.
జవాబు:
పురాణ పురుషుల్లో హరిశ్చంద్రుడు ప్రసిద్ధుడు. ఈయన షట్చక్రవర్తులలో గొప్పవాడు. ఆడినమాట తప్పని స్వభావం కలవాడు. సత్యం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు. రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా తాను నమ్మిన సత్యమునకే కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.
ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
“బ్రహ్మ రాత మారవచ్చు ….. తూర్పున సూర్యుడు అస్తమించవచ్చు కానీ హరిశ్చంద్రుడు మాట తప్పడు” అని తెలిపే హరిశ్చంద్రుని కథను రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
సాటిలేని విజ్ఞానఖనియైన వశిష్ఠుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ దేవేంద్రా ! ఈ ప్రపంచంలో మహా పరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు పదహారు రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా కలవాడు. వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరితేరినవాడు. మేఘంలా గంభీరమైనవాడు. దయకు సముద్రుని వంటివాడు. పుణ్యాత్ముడు.
పండితులచే ప్రశంసలు పొందువాడు. సర్వశాస్త్రాలసారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిట సింహం వంటివాడు. షట్చక్రవర్తులలో ఒకడు. నీతిమంతమైన పాలన చేసేవాడు. సత్యం తప్పనివాడు. మహాజ్ఞాని. సత్యవాక్పరిపాలకుడు.
సూర్యవంశస్థుడయిన త్రిశంకుని కుమారుడు. సాటిలేని విజ్ఞానం కలవాడు. సూర్యవంశమనే పాలసముద్రానికి చంద్రుని వంటివాడు. ఆడినమాట తప్పనివాడు. దేవేంద్రా ! రెండువేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యం కాదు. అతను సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు.
ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు ? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున ఆస్తమించినా, మేరుపర్వతం భూమిలో కుంగినా, ఆకాశం ఊడి కిందపడినా, భూగోళం తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, వజ్రాయుధం పదును తగ్గినా హరిశ్చంద్రమహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు.
ప్రశ్న 2.
సత్యాన్ని పలుకడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
జవాబు:
మానవులు ఎన్నో ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. వాటిలో సత్యమును మాట్లాడడం మంచిది. సత్యమును మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని :
- ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
- నైతిక విలువలు సమున్నతంగా వృద్ధి చెందుతాయి.
- సమాజంలో ధర్మతత్పరతకు అవకాశం కలుగుతుంది.
- సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి.
- మరణించినా శాశ్వతమైన కీర్తిని పొందుతాడు.
- అందరికి ఆదర్శంగా నిలిచే అవకాశం కలుగుతుంది.
- సమాజంలో మంచి గుణాలు చిరస్థాయిగా నిలుస్తాయి.
ఈ విధంగా సత్యాన్ని పలకడం వల్ల మానవులకు ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.
ఇ) కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
నీకు నచ్చిన పురాణ పురుషుని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
శ్రీశైలం, ప్రియమైన మిత్రురాలు విజయలక్ష్మికి, నీ మిత్రురాలు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది మన పురాణ పురుషుల్లో నాకు ఎంతోమంది నచ్చారు. వారిలో హరిశ్చంద్రుడు ముఖ్యుడు. ఆయన సత్యానికి కట్టుబడి ఉన్నాడు. కార్యానికి రాజ్యాన్ని, సంపదను కోల్పోయాడు. అయినా సత్యవాక్య పరిపాలనకు కట్టుబడి ఉన్నాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. అందుకే నాకు హరిశ్చంద్రుడు అంటే ఇష్టం. నీకు నచ్చిన పురాణ పురుషుని గురించి వివరంగా నాకు తెలియజేయి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 2.
హరిశ్చంద్రుడు పాఠ్యభాగం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
- సత్యం పలకండి. ఆదర్శవంతంగా జీవించండి.
- సత్యమే జయిస్తుంది.
- సత్యం మీరని ధర్మమే నిలబడుతుంది.
- సత్యమే ధర్మం. సత్యమే తపస్సు.
- భారతీయ అంతరాత్మ సత్యమే.
- నిజం నిలకడమీద నిలుస్తుంది.
- నిజం నిప్పులాంటిది.
- నిజం దేవుడెరుగు. నీరు పల్లమెరుగు.
- నిజం నిప్పులాంటిది. అది కాల్చక మానదు.
ప్రశ్న 3.
సత్యహరిశ్చంద్రుని గురించి తెలుసుకున్నారు కదా ! అతని గుణాలు తెలుసుకున్నారు కదా! తల్లిదండ్రులు, అట్లే ఉపాధ్యాయులు చెప్పే మంచి నీతి వాక్యాలను రాయండి.
జవాబు:
పిల్లలకు తల్లి చెప్పే మంచి బుద్ధులు :
- తోడి పిల్లలతో దెబ్బలాడవద్దు
- పక్క పిల్లలతో స్నేహంగా ఉండు
- బట్టలు మాపుకోకు
- పుస్తకాలు జాగ్రత్తగా చూసుకో
- ఉపాధ్యాయులు చెప్పేది విని శ్రద్దగా రాసుకో
- అసత్యం చూట్లాడకు
- మధ్యాహ్నం భోజనం చెయ్యి
- చెడ్డవారితో స్నేహం చెయ్యకు – మొదలయినవి.
ఉపాధ్యాయుడు చెప్పే మంచి బుద్ధులు :
- ఏ రోజు పాఠం ఆ రోజే చదువు
- ఇంటిపని శ్రద్ధగా పూర్తిచెయ్యి
- చదువుపై శ్రద్ధ పెట్టు
- ఆటలు ఆడుకో
- వ్యాయామానికై శ్రద్ధ పెట్టు
- తల్లిదండ్రులను, గురువులను గౌరవించు
- అసత్యం మాట్లాడకు
- తోటి బాలబాలికలను అన్నాచెల్లెళ్ళవలె, ప్రేమగా గౌరవించు – మొదలయినవి.
ప్రశ్న 4.
మీకు పద్యాలు తెలుసు కదా ! ఈ పాఠం ద్వారా ద్విపదను కూడా తెలుసుకున్నారు కదా ! ఇతర పద్యాలకూ, ద్విపదకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వివరించి మీకు నచ్చినదాన్ని ప్రశంసిస్తూ రాయండి.
జవాబు:
‘ద్విపద’ పద్యంలో రెండే, పాదాలుంటాయి. పాదానికి నాలుగు గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మూడేసి ఇంద్రగణాలు, ఒక సూర్య గణం ఉంటాయి. మూడవ గణం మొదటి అక్షరానికి యతి ఉంటుంది. ప్రాస నియమం ఉండాలి. ప్రాస నియమంలేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.
‘ద్విపద’ పద్యం అచ్చమైన తెలుగు ఛందస్సు. దీనిని తెలుగులో రాసిన మొదటి దేశీయకవి ‘పాల్కురికి సోమనాథుడు’. ఈయన ద్విపదలో బసవపురాణాన్ని రాశాడు.
తెలుగులో ఇతర ఛందస్సులైన వృత్త పద్యాలలో ఒక విధమైన అందమైన నడక ఉంది. అవి చదవడానికి వినసొంపుగా ఉంటాయి. ఇక ‘సీస’ పద్యాల్లో ఒక విధమైన “తూగు” ఉంది. ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఉంటుంది. ఏ ఛందస్సు అందం దానిదే. మనోహరమైన “ద్విపద” కూడా మన తెలుగు వారి ఛందస్సు. ఈ ఛందస్సుల్లో మహాకవియైన గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. ద్విపద దేశీయ ఛందస్సు. వృత్తములు సంస్కృత ఛందస్సులు.
8th Class Telugu 7th Lesson హరిశ్చంద్రుడు 1 Mark Bits
1. భానుడు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. ఆదిత్యుడు జగానికి మిత్రుడు. (సమానార్ధక పదాన్ని గుర్తించండి) (S.A.I – 2018-19)
ఎ) ఇందుడు
బి) సోముడు
సి) ఆదిత్యుడు
డి) రేరాజు
జవాబు:
సి) ఆదిత్యుడు
2. ఈ క్రిందివానిలో క్వార్థక వాక్యము గుర్తించండి. (S.A.II – 2018-19)
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు
బి) హరిశ్చంద్రుడు సత్యమాడుచున్నాడు స్వర్గానికి
సి) హరిశ్చంద్రుడు సత్యమాడితే స్వర్గానికి వెళతాడు
డి) హరిశ్చంద్రుడు సత్యముతో స్వర్గానికి వెళ్లాలి.
జవాబు:
ఎ) హరిశ్చంద్రుడు సత్యమాడి స్వర్గమునకు వెళ్లాడు
3. దేవతల రాజు సురేంద్రుడు ఐరావతంపై ఊరేగాడు. (అర్థాన్ని గుర్తించండి) (S.A.II – 2017-18)
ఎ) ఇంద్రుడు
బి) అగ్నిదేవుడు
సి) వాయుదేవుడు
డి) వరుణుడు
జవాబు:
ఎ) ఇంద్రుడు
4. నాకు అడవిలో కంఠీరవాన్ని చూస్తే భయం. కానీ మా గోడమీద వాలే కంఠీరవాన్ని మాత్రం ప్రేమగా నిమురుతాను. (నానార్థాలు గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) పులి – కాకి
బి) ఏనుగు – దున్న
సి) సింహం – పావురం
డి) జిరాఫీ – కోకిల
జవాబు:
సి) సింహం – పావురం
5. భానుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తున్నాడు. (S.A.III – 2015-16)
ఎ) సూర్యుడు
బి) చంద్రుడు
సి) ఇంద్రుడు
డి) ధర్ముడు వెళ్లడానికి
జవాబు:
ఎ) సూర్యుడు
6. చంద్రశేఖర్ ఎప్పుడూ చిటపటలాడు తుంటాడు. (S.A.III. 2015-16)
ఎ) నవ్వుతుంటాడు
బి) కోపపడుతుంటాడు
సి) మెల్లగా నడుస్తుంటాడు
డి) పరిగెత్తుతుంటాడు
జవాబు:
బి) కోపపడుతుంటాడు
7. వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. ఆమె కడవతో వడివడి అడుగులతో గడపదాటింది. (S.A.III – 2015-16)
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ఛేకానుప్రాస
డి) వృత్త్యనుప్రాస
జవాబు:
డి) వృత్త్యనుప్రాస
భాషాంశాలు – పదజాలం
అర్థాలు :
8. దురితం దూరం చేసుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) దుష్టం
బి) పాపం
సి) పుణ్యం
డి) దుర్మతి
జవాబు:
బి) పాపం
9. బుధులు గౌరవనీయులు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అంతరంగాలు
బి) మూర్ఖులు
సి) పండితులు
డి) పామరులు
జవాబు:
సి) పండితులు
10. రిపువును దూరంగా ఉంచాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) మిత్రుడు
బి) గురువు
సి) విశ్వము
డి) శత్రువు
జవాబు:
డి) శత్రువు
11. శరధిలో జలం ఉంటుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) కొలను
బి) ఝరి
సి) సముద్రం
డి) బావి
జవాబు:
సి) సముద్రం
12. నిత్యం సత్యం పలకాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అప్పుడు
బి) ఎల్లప్పుడు
సి) కొంత
డి) ఎప్పుడు
జవాబు:
బి) ఎల్లప్పుడు
13. తనువును రక్షించుకోవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) శరీరం
బి) జిహ్వ
సి) నాశిక
డి) కర్ణం
జవాబు:
ఎ) శరీరం
14. మదిలో మంచి ఉండాలి – గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి.
ఎ) మనసు
బి) నాలుక
సి) శరీరం
డి) తనువు
జవాబు:
ఎ) మనసు
15. ఎల్లప్పుడు బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వాస్తవికం
బి) అబద్ధం
సి) నృతం
డి) నుతం
జవాబు:
బి) అబద్ధం
16. పయోనిధిలో రత్నాలు ఉంటాయి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ఉదకం
బి) క్షీరం
సి) సముద్రం
డి) వారి
జవాబు:
సి) సముద్రం
17. ఆయన విజ్ఞానానికి నిధి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) నిలయం
బి) కొలను
సి) కోవెల
డి) మందారం
జవాబు:
ఎ) నిలయం
పర్యాయపదాలు :
18. రాజు పరిపాలించాడు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఉమాపతి, గురుపతి
బి) నృపతి, పృథ్వీపతి
సి) నరపతి, అసురపతి
డి) వంద్యుడు, పశుపతి
జవాబు:
బి) నృపతి, పృథ్వీపతి
19. నందనుడు కార్యసమరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుమారుడు, సుతుడు
బి) విశ్వము, జగము
సి) జలము, పుత్రిక
డి) చామంత, చాగరిత
జవాబు:
ఎ) కుమారుడు, సుతుడు
20. వారిధిలో రత్నములు ఉండును – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సముద్రం, జలధి
బి) వారి, మధుజ
సి) వారిజం, వారుణి
డి) పయోధరం, అవనిధి
జవాబు:
ఎ) సముద్రం, జలధి
21. కంఠీరవం గుహలో ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) కుక్కురం, పంచాస్యం
బి) సింహం, కేసరి
సి) పుండరీకం, శృగాలం
డి) ఖరం, శునకం
జవాబు:
బి) సింహం, కేసరి
22. బొంకు పలుకరాదు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) బాష్పం, అనృతం
బి) శ్రుతం, వాచం
సి) అబద్ధం, అసత్యం
డి) నృతం, వాగ్మి
జవాబు:
సి) అబద్ధం, అసత్యం
23. మిన్ను విరిగి పడింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ఆకాశం, నింగి
బి) నభం, నాకం
సి) గగనం, నగం
డి) నగరం, ప్రాంతం
జవాబు:
ఎ) ఆకాశం, నింగి
24. ఘనము వర్షించు – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) రవం, ధరణి
బి) మేఘము, పయోధరం
సి) గిరి, నఖము
డి) నభం, ధర
జవాబు:
బి) మేఘము, పయోధరం
25. గిరి పై నదులు ఉన్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) గిరిజ, గిరిక
బి) కొండ, అది
సి) అచలం, ఆధారం
డి) అధరం, జలధరం
జవాబు:
బి) కొండ, అది
ప్రకృతి – వికృతులు
26. విద్య నేర్పాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) విద్దె
బి) విద్యా
సి) వేద్య
డి) విత్తు
జవాబు:
ఎ) విద్దె
27. మానవులకు గరువము పనికిరాదు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అహంకారం
బి) దుర్మతి
సి) గర్వము
డి) గెర్వము
జవాబు:
సి) గర్వము
28. అబ్బురం చూపాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అంతరంగం
బి) అద్భుతం
సి) ఆశ్చర్యం
డి) ఆహార్యం
జవాబు:
బి) అద్భుతం
29. విజ్ఞానం అర్పించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) విరుదం
బి) విజానం
సి) విజ్ఞానం
డి) విన్నానం
జవాబు:
డి) విన్నానం
30. సత్యం పలకాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) శిత్తు
బి) సత్తు
సి) సత్తె
డి) సిత్త
జవాబు:
బి) సత్తు
31. గుణము పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గోరము
బి) గొనము
సి) గునము
డి) గొరము
జవాబు:
బి) గొనము
32. చట్టం తెలియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) సస్త్రం
బి) శాస్త్రం
సి) శేస్త్రం
డి) శస్త్రం
జవాబు:
బి) శాస్త్రం
నానార్థాలు :
33. రాజు కువలయానందకరుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చంద్రుడు, ప్రభువు
బి) సింహం, కేసరి
సి) కెరటం, వీచిక
డి) చంద్రుడు, బుధుడు
జవాబు:
ఎ) చంద్రుడు, ప్రభువు
34. అందరు ధర్మం ఆచరించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పుణ్యం, న్యాయం
బి) తనువు, తరుణి
సి) తాపసి, ధరణి
డి) వసుధ, పుణ్యం
జవాబు:
ఎ) పుణ్యం, న్యాయం
35. గుణం పొందాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) రోదరం, గుణము
బి) గురువు, గోపురం
సి) స్వభావం, వింటినారి
డి) జలజం, జలధరం
జవాబు:
సి) స్వభావం, వింటినారి
36. బుధుడు వంద్యుడు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పండితుడు, బుధగ్రహం
బి) ఒకయతి, మూర్యుడు
సి) పండితుడు, పచనుడు
డి) పరవశుడు, పండితుడు
జవాబు:
ఎ) పండితుడు, బుధగ్రహం
37. పాకం రుచిగా ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జలధి, గారె
బి) వంట, కావ్యపాకం
సి) తంట, తరుణి
డి) తాపసం, పార్థుడు
జవాబు:
ఎ) జలధి, గారె
వ్యుత్పత్తర్థాలు :
38. వారిజం సుమనోహరం – గీత గీసిన పదానికి వుత్పత్తి ఏది?
ఎ) నీటి నుండి పుట్టినది
బి) క్షీరము నండి పుట్టినది
సి) పయోధరం నుండి పుట్టినది
డి) వాసన నుంచి పుట్టినది
జవాబు:
ఎ) నీటి నుండి పుట్టినది
39. శరములకు నిలయమైనది – అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) ధరణి
బి) శరధి
సి) క్షీరధి
డి) అవని
జవాబు:
బి) శరధి
40. రంజింపచేయువాడు అనే వ్యుత్పత్యర్థం గల పదం ఏది?
ఎ) నాకము
బి) సూత్రధారుడు
సి) రాజు
డి) నారదుడు
జవాబు:
సి) రాజు
41. పద్మము నుండి పుట్టినవాడు – ఈ వ్యుత్పత్తికి తగిన పదం ఏది?
ఎ) వారిధం
బి) పయోధరం
సి) క్షీరోనిది
డి) వారిజగర్భుడు
జవాబు:
డి) వారిజగర్భుడు
42. భాస్కరుడు – ఈ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) కాంతిని కలుగజేయువాడు
బి) చీకటిని కలుగజేయువాడు
సి) అంతరంగం చూచువాడు
డి) అవనిని దర్శించువాడు
జవాబు:
ఎ) కాంతిని కలుగజేయువాడు
వ్యాకరణాంశాలు
సంధులు :
43. తలపెల్ల – ఈ పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) తలపో + ఎల్ల
బి) తలపె + ఎల్ల
సి) తలప + యెల్ల
డి) తలపు + ఎల్ల
జవాబు:
బి) తలపె + ఎల్ల
44. గుణసంధిలో ఏకాదేశంగా వచ్చేవి
ఎ) గ, జ, డ, ద, లు
బి) ఏ, ఓ, అర్
సి) ఐ, ఔ
డి) య, వ, ర, ల
జవాబు:
బి) ఏ, ఓ, అర్
45. గసడదవాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) తల్లిదండ్రులు
బి) శీతోష్ణములు
సి) ఎత్తుపల్లాలు
డి) మృదుమధురములు
జవాబు:
ఎ) తల్లిదండ్రులు
46. విద్యాధికుడు వర్ధిల్లాలి – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) విద్ది + ధికుడు
బి) విద్యా + అధికుడు
సి) విద్యే + అధికుడు
డి) విద్య + ఆధికుడు
జవాబు:
బి) విద్యా + అధికుడు
47. క్రింది వానిలో సరళములు గుర్తించండి.
ఎ) గ, జ, డ, ద, బ
బి) పర్గ, స, ల
సి) క, చ, ట, త, ప
డి) జ్ఞ, ఇ, న, ణ, మ
జవాబు:
ఎ) గ, జ, డ, ద, బ
48. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) వృద్ధి సంధి
బి) గుణసంధి
సి) ఉత్వసంధి
డి) ఇత్వతసంధి
జవాబు:
డి) ఇత్వతసంధి
49. క్రింది వానిలో ఇత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వానికైన
బి) ముందడుగు
సి) అత్తమ్మ
డి) అమ్మహిమ
జవాబు:
ఎ) వానికైన
50. తనువెల్ల రక్షించి – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) పడ్వాది సంధి
బి) ఉత్వ సంధి
సి) అత్వ సంధి
డి) రుగాగమ సంధి
జవాబు:
బి) ఉత్వ సంధి
51. కింది వానిలో గుణసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) వంటాముదం
బి) దేవేంద్ర
సి) దివిజాగ్రజుడు
డి) ముందడుగు
జవాబు:
సి) దివిజాగ్రజుడు
52. శాస్త్రార్థం – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) విసర్గ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు :
53. మహాభాగ్యం – ఈ పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) గొప్ప యొక్క భాగ్యం
బి) గొప్పదైన భాగ్యం
సి) భాగ్యము యొక్క గొప్ప
డి) భాగ్యము నందలి గొప్పదనం
జవాబు:
బి) గొప్పదైన భాగ్యం
54. సప్తమీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) విచార కోవిదుడు
బి) సత్మీర్తి
సి) వారిజగర్భుడు
డి) శాస్త్రార్ధము
జవాబు:
ఎ) విచార కోవిదుడు
55. వినయభూషితుడు – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వినయమునందు భూషితుడు
బి) వినయము కొరకు భూషితుడు
సి) వినయము చేత భూషితుడు
డి) వినయము వలన భూషితుడు
జవాబు:
సి) వినయము చేత భూషితుడు
56. విద్యాసంపన్నుడు – ఇది ఏ సమాసము?
ఎ) కర్మధారయం
బి) ద్వంద్వ
సి) తృతీయా తత్పురుషం
డి) బహువ్రీహి
జవాబు:
సి) తృతీయా తత్పురుషం
57. వారిజగర్భుడు – ఇది ఏ సమాసమో గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) బహువ్రీహి
సి) కర్మధారయం
డి) ద్వంద్వ
జవాబు:
బి) బహువ్రీహి
58. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) ద్వంద్వ
సి) బహుబ్లిహి
డి) ద్విగువు
జవాబు:
ఎ) తత్పురుష
59. విజ్ఞానమునకు నిధి – ఈ పదానికి సమాసపదం గుర్తించండి.
ఎ) ప్రతి విజ్ఞానం
బి) విజ్ఞాన నిధి
సి) నిధి విజ్ఞానం
డి) అవిజ్ఞాన నిధి
జవాబు:
బి) విజ్ఞాన నిధి
60. రిపుగణము- ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రిపువు అనెడి గణము
బి) రిపువు చేత గణము
సి) రిపువు నందలి గణము
డి) రిపువు వలన గణము
జవాబు:
ఎ) రిపువు అనెడి గణము
61. సంఖ్యా శబ్దం పూర్వంగా కలిగిన సమాసం గుర్తించండి.
ఎ) ద్విగువు
బి) రూపకం
సి) అవ్యయీభావం
డి) తత్పురుష
జవాబు:
ఎ) ద్విగువు
62. సత్కీర్తి – ఇది ఏ సమాసం?
ఎ) అవ్యయీభావ సమాసం
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) బహున్రీహి సమాసం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
గణవిభజన:
63. ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి?
ఎ) రెండు
బి) మూడు
సి) నాలుగు
డి) ఆరు
జవాబు:
డి) ఆరు
64. ద్విపదలో పాదానికి గల గణాలు ఎన్ని?
ఎ) 3
బి) 4
సి) 8
డి) 6
జవాబు:
బి) 4
65. ద్విపదలో పాదానికి గణాలు ఏవి?
ఎ) మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాలు
బి) నాలుగు ఇంద్ర గణాలు
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం
డి) నాలుగు సూర్య గణాలు
జవాబు:
సి) మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం
66. గర్విత – ఈ పదానికి గణాలు గుర్తించండి.
ఎ) UII
బి) IUU
సి) UIU
డి) III
జవాబు:
బి) IUU
67. IIIU – ఇది ఏ గణం?
ఎ) జ గణం
బి) ఇంద్ర గణం
సి) సూర్య గణం
డి) భ గణం
జవాబు:
సి) సూర్య గణం
వాక్యాలు :
68. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్మణి వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం
69. చదివితే ర్యాంకు వస్తుంది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అవర్ధక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) చేదర్థక వాక్యం
డి) శత్రర్థక వాక్యం
జవాబు:
సి) చేదర్థక వాక్యం
70. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు?
ఎ) అప్యర్థకం
బి) తద్ధర్మార్థకం
సి) శత్రర్థకం
డి) క్వార్థం
జవాబు:
డి) క్వార్థం
71. హరిశ్చంద్రునిచేత సత్యం పలుకబడింది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) కర్మణి వాక్యం
72. ఊరికి వెళ్ళవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థక వాక్యం
బి) ఆశీర్వార్ధకం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
డి) నిషేధార్థక వాక్యం
73. నీరు పల్లంగా ప్రవహించును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) నిశ్చయాత్మక వాక్యం
డి) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
డి) తద్ధర్మార్థక వాక్యం
అలంకారాలు :
74. చిటపట చినుకులు టపటప పడెను – ఇందులోని అలంకారం ఏది?
ఎ) వృత్త్యనుప్రాస
బి) లాటానుప్రాస
సి) యమకం
డి) ముక్తపదగ్రస్తం
జవాబు:
బి) లాటానుప్రాస
75. నీకు వంద వందనాలు – ఇది ఏ అలంకారం?
ఎ) వృత్త్యనుప్రాస
బి) ఛేకానుప్రాస
సి) లాటానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) ఛేకానుప్రాస
76. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగింపబడితే – అది ఏ అలంకారం?
ఎ) ఛేకానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) ఛేకానుప్రాస
77. నగజ గజముపై వెళ్ళింది – ఇందులోని అలంకారం ఏది?
ఎ) ముక్తపదగ్రస్తం
బి) ఛేకానుప్రాస
సి) యమకం
డి) అంత్యానుప్రాస
జవాబు:
బి) ఛేకానుప్రాస
సొంతవాక్యాలు :
78. మిన్నంటు : నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటాయి.
79. ఉన్నతుడు : మహానీయుడు ఉన్నతుడిగా జీవిస్తాడు.
80. దురితం : పుణ్యకార్యాలతో దురితం దూరం అవుతుంది.
81. గుణములు : మానవులు మంచి గుణములను అలవరచుకోవాలి.
82. పరాక్రమం : యుద్ధంలో పరాక్రమం చూపాలి.
విశేషాంశాలు
1. వజ్రాయుధము : ఇది ఇంద్రుని ఆయుధం. మిక్కిలి శక్తివంతమైంది.
2. వారిజగర్భుడు : 1. తామరపూవు జన్మస్థానము (పుట్టు నెలవు) గా కలవాడు – బ్రహ్మ
2. తామరపూవు గర్భము నందు కలవాడు – విష్ణువు వారిజగర్భుడు – కమలగర్భుడు – వనజగర్భుడు – పద్మగర్భుడు – తమ్మిచూలి – పర్యాయపదములు.
3. వారిజాప్తుడు : తామర పూలకు చుట్టము – సూర్యుడు
వారిజాప్తుడు – కమలాప్తుడు – తామరసాప్తుడు – పద్మ బాంధవుడు – తమ్మి చుట్టము – పర్యాయపదములు.
4. షట్చక్రవర్తులు : ఆరుగురు చక్రవర్తులు.
1. హరిశ్చంద్రుడు 2. నలుడు 3. పురుకుత్సుడు 4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు.
5. సప్తమహర్షులు : ఏడుగురు మహర్షులు.
1. వశిష్ఠుడు 2. అత్రి 3. గౌతముడు 4. కశ్యపుడు 5. భరద్వాజుడు 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు.
6. సప్తసముద్రములు : ఏడు సముద్రాలు
1. లవణ, 2. ఇక్షు, 3. సురా, 4. సద్వి, 5. దధి, 6. క్షీర, 7. జల.
7. షోడశ మహాదానములు : (పదహారు గొప్పదానములు)
1. గోదానము 2. భూదానము 3. తిలదానము 4. హిరణ్యదానము 5. రత్నదానము 6. విద్యాదానము 7. కన్యాదానము 8. దాసీదానము 9. శయ్యాదానము 10. గృహదానము 11. అగ్రహారదానము 12. రథదానము 13. గజదానము 14. అశ్వదానము 15. ఛాగ (మేక) దానము 16. మహిష (దున్నపోతు) దానము