AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 9 సందేశం.
AP State Syllabus 8th Class Telugu Important Questions 9th Lesson సందేశం
8th Class Telugu 9th Lesson సందేశం Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
అ) కింది అపరిచిత గద్యం చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
పరశురాముడు దుష్టులైన క్షత్రియులను చంపుటకు పుట్టినవాడు. అతని చేతిలో ఎందరో రాజులు మరణించారు. ఒక్క శ్రీరాముడు మాత్రమే అతనిని ఓడించాడు. అప్పటి నుండి యుద్దాలు మానేసి, మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటివాడు గంగ కోరిక పై భీష్మునికి యుద్ధవిద్యలు నేర్పాడు. భీష్ముడు పరశురాముని శిష్యుడు కనుక గురువు ఆజ్ఞాపించిన కార్యమును శిరసావహించి తీరతాడని అంబ నమ్మింది. ఏదో విధంగా పరశురాముని అనుగ్రహం సంపాదించి, భీష్ముని సాధించవచ్చని ఊహించింది.
ప్రశ్నలు :
1. గురు, శిష్యులెవరు?
జవాబు:
పరశురాముడు, భీష్ముడు.
2. ఎవరి ఆజ్ఞను శిరసావహించాలి?
జవాబు:
గురువు యొక్క ఆజ్ఞను.
3. రాజులు ఎందుకు మరణించారు?
జవాబు:
దుష్టత్వము వలన.
4. పరశురాముడిని శ్రీరాముడు ఎందుకు ఓడించగలిగాడు?
జవాబు:
శ్రీరామునిలో దుష్టత్వము లేకపోవటం వలన.
2. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాళాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టీల్ ఫైర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సింధ్ డాక్ అనేవారు.
ప్రశ్నలు :
1. డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు
2. సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.
3. అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.
4. సింధ్ డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.
3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఆహారధాన్యాల కొరత లేకపోయినా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు తిండి లేక చనిపోవటం దారుణసత్యం. దీనికి కారణాలు అనేకం. అందులో ఆహార పదార్థాలను వృథా చేయటం. మనం ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే అది అందవలసిన వారికి అందకుండా అడ్డపడుతున్నామన్నమాట. ఇలా వృథా అవుతున్న ఆహారంలో సగానికి సగం మామూలుగా పిల్లలు తినే కంచాలలోనే వృథా అవుతున్నది. తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి. వారు దాన్ని వృథా చేయకుండా తినేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత.
ప్రశ్నలు :
1. పిల్లల పట్ల ఎవరు బాధ్యతగా ఉండాలి?
జవాబు:
తల్లిదండ్రులు.
2. ప్రపంచ ఆహారదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం?
జవాబు:
అక్టోబరు 16వ తేదీ.
3. సరిపడ ఆహారమున్నా కొందరికి ఎందుకు తిండిలేదు?
జవాబు:
కొంతమంది ఆహారాన్ని వృథా చేయడం వలన.
4. మనం వృథా చేసేవాటిలో ఇంకొకటి ఏమిటి?
జవాబు:
నీరు
4. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఈ పురాతనమైన ఏడు ప్రపంచ అద్భుతాలలో ప్రధానమైనవి ఈజిప్టులోని పిరమిడ్లు. మిగిలిన ఆరు అద్భుతాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లేదా శిథిలావస్థను చేరుకున్నాయి. విలక్షణమయిన ఆకారంతో భూమ్యాకర్షణ శక్తికి తట్టుకుని నిలబడడం వలన పిరమిడ్లు ఈనాటికీ నిలిచి ఉన్నాయి. పిరమిడ్ ఆకారంలో ఇళ్ళు నిర్మించడానికి ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. అయినా కలపతో, గాజుతో చేసిన పిరమిడ్ ప్రతిరూపాలు ఫ్యూరియోలుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యత్ లో సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీ క్విటీస్ ఆఫ్ ఈజిప్ట్ సంస్థ అనుమతి పొందకుండా వీటి రెప్లికాలు తయారుచేయడానికి వీలుకాదు.
ప్రశ్నలు:
1. ప్రపంచంలోని వింతలెన్ని?
జవాబు:
ఏడు
2. కాలగర్భంలో కలిసిపోవడమంటే ఏమిటి?
జవాబు:
నశించిపోవడం.
3. “శిథిలావస్థ” – దీనిలో ఏ సంధి ఉంది?
జవాబు:
సవర్ణదీర్ఘ సంధి
4. ఎవరి అనుమతితో పిరమిడ్ ఆకారం తయారుచేయాలి?
జవాబు:
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటీక్విటీస్ ఆఫ్ ఈజిప్టు
5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్‌హౌజ్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు :
1. వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు
2. జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన
3. మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు
4. వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.
6. కింది అపరిచిత గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. III – 2016-17)
ప్రతి జీవికి ఆహారం అవసరం. అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. అన్నం దొరకని వారికి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు అన్నం విలువ ఏమిటో తెలుస్తుంది. చాలా మంది అన్నాన్ని వృథాగా పడేస్తుంటారు. అలా పడేసే ముందు వారు అన్నం దొరకక అల్లాడిపోయే పేదవారి గురించి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.
ప్రశ్నలు:
1. పూర్వులు అన్నాన్ని దేని స్వరూపంగా భావించారు?
జవాబు:
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
2. అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుంది?
జవాబు:
ఆకలితో ఉన్నప్పుడు
3. అన్నం వృథాగా పడేసే ముందు ఎవరి గురించి ఆలోచించాలి?
జవాబు:
అన్నం దొరకని పేదవారిని గురించి
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ప్రతి జీవికి అవసరమైనదేది?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సంపాదకీయ వ్యాసం ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియల్లో సంపాదకీయ వ్యాసం ముఖ్యమైనది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యానురూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేరచన సంపాదకీయ వ్యాసం. దీన్ని పత్రికా సంపాదకులు గానీ, ప్రత్యేక వ్యాసకర్తలు గానీ రాస్తూ ఉంటారు. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు, ఆలోచించేటట్లు చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకూ వర్తిస్తుంటాయి.
ప్రశ్న 2.
‘సంస్కరణ’ – పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
(లేదా)
సంస్కరణ’ పాఠ్యభాగ రచయిత ‘నండూరి రామమోహనరావు’గారి రచనా విశేషాలు రాయండి. (S.A. II – 2017-18)
జవాబు:
‘సంస్కరణ’ అనే పాఠ్యభాగ రచయిత శ్రీ నండూరి రామమోహనరావుగారు. తెలుగు పాత్రికేయులలో సుప్రసిద్ధులైన నండూరి రామమోహనరావు (1927 – 2011) కృష్ణాజిల్లా విస్సన్నపేటలో జన్మించారు. జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి, వనితాజ్యోతి మొదలైన పత్రికల్లో సంపాదకులుగా పనిచేసారు. విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం వీరి ప్రముఖ రచనలు. నండూరి వారి సంపాదకీయ వ్యాసాలు అయిన “అనుపల్లవి”, ‘చిరంజీవులు”, “నండూరి రామమోహనరావు వ్యాఖ్యావళి” పేరిట సంకలనాలుగా వచ్చాయి. పిల్లలకోసం కొన్ని ఇంగ్లీషు నవలలను తెలుగులో రాశారు. “చిలకచెప్పిన రహస్యం”, “మయూరకన్య” పిల్లల నవలలు, “హరివిల్లు” పేరిట పిల్లలగేయాలు వ్రాశారు.
తెలుగు విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయుడు అవార్డుతో సత్కరించింది.
ప్రశ్న 3.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కల్పించడం ద్వారా, వాటిని నిర్మూలించవచ్చని నండూరి వారన్నారు కదా ! దీనిని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
మద్యం తాగడం, మత్తు పదార్థాలు సేవించడం, పటేలో అర్ధనగ్ననృత్యాలు వంటి దురాచారాల పట్ల వ్యతిరేక ప్రచారం ద్వారా, ఆ దురాచారాల వల్ల నష్టపోయిన వారి కథల ప్రచారం ద్వారా, అప్పటి వారి రూపాల ఫొటోలను వారికి చూపడం ద్వారా, వారికి ఆ దురాచారాల పట్ల ఏహ్యభావం కల్పించాలి.
వరకట్నం తీసికోవడం అంటే, తమ సంతానాన్ని సంతలో పశువుల్లా అమ్మడమే అని, వారికి తెలియజెప్పాలి. కట్నం తీసికొన్న మగవాడు సంతలో అమ్మబడ్డ పశువు అని అతడికి తెలియజెప్పాలి. కట్నం పుచ్చుకున్న వాడిని పెళ్ళాడిన స్త్రీ, పశువును పెళ్ళాడినట్లే అని కన్యలకు చెప్పాలి.
ఈ విధంగా దురాచారాలపట్ల ఏహ్యభావం కల్పిస్తే క్రమంగా ఆ దురాచారం రూపుమాసిపోతుంది అన్నమాట సత్యం. క్లబ్బులో సగం బట్టలతో నాట్యం చేసిన తన ఫొటోను చూసిన ఆడది తిరిగి ఎన్నడూ, ఆ పని చేయదు. ఆ దుస్తుల్లో తన భార్య ఫొటోను చూసిన భర్త ఇంక ఎప్పుడూ భార్యను పట్లకు పంపడు. కాబట్టి నండూరి వారి మాట సమర్థింపదగినది.
ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘సంస్కరణ’ పాఠ్యభాగ సారాంశం రాయండి.
జవాబు:
సమాజంలో ఎన్నో సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటిలో బాల్యవివాహాలు, వరకట్నం, మద్యపానం మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పవచ్చు. బాల్యవివాహాలను నిర్మూలించడానికి శారదా చట్టం వంటిది వచ్చింది. అయినా ఎంతోమంది సంఘసంస్కర్తల ప్రయత్నాల మూలంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఈనాడు ‘వరకట్నం’ అనే సాంఘిక దురాచారం పెనుభూతంలా మారింది.
ఒకప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నందినీ శతపథి స్త్రీల అభ్యున్నతికి అవరోధాలుగా విద్యావిహీనత, వరకట్నం అనే ఈ రెండూ ప్రధానమని చెప్పారు. జనాభాలో నూటికి 70 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రజలు కూడా వరకట్న నిర్మూలనకు సిద్ధంగా లేరని తెలుస్తున్నది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం అనేది సంఘంలో గౌరవానికి చిహ్నంగా మారింది.
ఈనాడు వివాహాలు కూడా ఆర్భాటంగా జరుగుతున్నాయి. వివాహాల్లో వృథా వ్యయం అవుతున్నది. ఈ దురాచారాలకు శాసనాల అవసరం ఉంది. అయినా అంతకంటే ముఖ్యంగా ఈ దురాచారాలపట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలి. యువతీయువకులు కూడా దురాచారాలను ఎదిరించాలి. అప్పుడే దురాచారాల నిర్మూలన జరుగుతుంది.
ప్రశ్న 2.
సమాజంలో దురాచారాలపట్ల ప్రజల్లో అసహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని నండూరివారు అన్నారు కదా! దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
నండూరి రామమోహనరావు గారు ‘సంస్కరణ’ అనే పాఠ్యభాగాన్ని రచించారు. ఈ పాఠంలో కవి సంఘ సంస్కరణాభిలాషను, దాని ఆవశ్యకతను లోకానికి చాటి చెప్పాడు. ప్రస్తుత సమాజంలో సంఘ దురాచారాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగించడం ద్వారా వాటిని నిర్మూలించవచ్చని తెలియజేశారు. ఈ విషయం అక్షరాల సత్యం.
కేవలం చట్టాలు చేసినంత మాత్రాన సాంఘిక దురాచారాలను నిర్మూలించలేము. వరకట్నం లాంటి దురాచారాల నిర్మూలకు ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. బాల్యవివాహాల నిర్మూలనకు శారదా చట్టం వచ్చింది. అంతమాత్రాన బాల్యవివాహాలు ఆగడం లేదు. సంఘసంస్కర్తలు అలుపెరగని ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా ఆశించినంత ఫలితం రాలేదు. కాని చివరకు ప్రజల్లో ఇప్పుడిప్పుడే మూఢనమ్మకాల మీద, దురాచారాల మీద ఏహ్యభావం కలుగుతుంది. ఇది మరింతగా పెరగాలి. అప్పుడే సంఘ దురాచారాలు పూర్తిగా తొలిగిపోతాయి. ప్రజల జీవితాల్లో చైతన్యం కలుగుతుంది.
ఆధునిక కాలంలో వరకట్నం తీవ్రంగా వేధిస్తున్న ఒక సంఘ దురాచారం. ఎన్నో కాపురాలు దీని మూలంగా కూలిపోతున్నాయి. చట్టాలు ఎన్నో వచ్చాయి. అయినా ప్రజల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పటికైనా రావాలి. స్త్రీ విద్యపై కూడా ఇంకా ప్రజల్లో దురభిప్రాయం ఉంది. అది కూడా తొలగిపోవాలి. సమభావన కలగాలి. ప్రజల్లో సాంఘిక దురాచారాల పట్ల ఏహ్యభావం కలిగినప్పుడే సమాజానికి మేలు కలుగుతుంది.
ఇ) క్రింది అంశం గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
ప్రశ్న 1.
‘సంఘ సంస్కర్త’ ను గూర్చి వివరిస్తూ చెల్లికి లేఖ :
జవాబు:
నర్సాపురం, ప్రియమైన చెల్లెలు సుజాతకు, ఆశీస్సులు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ముఖ్యంగా ఈ లేఖలో గొప్ప సంఘ సంస్కర్తయగు కందుకూరి వీరేశలింగం పంతులుగారిని గూర్చి నీకు తెలియజేయ తలచాను. వీరేశలింగం పంతులుగారు కవిగా సంపాదించిన కీర్తి కంటె సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. హితకారిణి సమాజాన్ని స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు. సంఘంలోని అనేక దురాచారాలను, మూఢాచారాలను ఖండించారు. అందుకే కందుకూ 3 వీరేశలింగం పంతులుగారు తెలుగుజాతి గర్వించతగ్గ గొప్ప సంఘసంస్కర్త అని నా అభిప్రాయం. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 2.
సంఘసంస్కరణ ఆవశ్యకతను, సంఘ దురాచారాలను నిర్మూలించాలని కోరుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
అంటరానితనం వద్దు. మానవత్వమే ముద్దు.
మూఢాచారాలను దూరం చేయి. ప్రగతి సాధించు.
కులం కన్న గుణం మిన్న.
కులమతాలు వద్దు. ఆత్మీయతే ముద్దు.
మూఢనమ్మకాలపై అలుపెరగని పోరాటం చేయాలి.
స్త్రీలను గౌరవించు – ఆదర్శంగా జీవించు.
స్త్రీల ప్రగతే – దేశానికి గౌరవం.
బహుజన హితాయ – బహుజన సుఖాయ.
ప్రశ్న 3.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
కరపత్రం “ధైర్యే సాహసే లక్ష్మీ” మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు. స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపో , చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం. అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిల గాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష. ఇట్లు, |
ప్రశ్న 4.
వరకట్న సమస్యపై పదివాక్యాల్లో వ్యాసం రాయండి.
(లేదా)
నేటికీ వరకట్న మరణాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ దురాచారాన్ని గురించి వ్యాసం రాయండి. (S.A. III – 2016-17)
జవాబు:
వరునికిచ్చు కట్నం వరకట్నం. దాని వల్ల సమాజంలో ఏర్పడే సమస్యని వరకట్న సమస్య అంటారు. వరకట్నం కేవలం ఆడపిల్ల తల్లిదండ్రులకే కాదు కుటుంబం మొత్తానికి కూడా అదొక దుర్భర సమస్యగా తయారైంది. అసలు కట్నం అంటే కానుక. పెళ్ళి సందర్భంగా ఇచ్చే కానుక క్రమక్రమంగా కట్నమైంది. పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది. డబ్బు ఇచ్చి కన్యల్ని కొనుక్కొనేవాళ్ళు. ఆధునిక కాలంలో దాని స్థానంలో వరకట్నం వచ్చింది. ఇప్పుడు పెళ్ళి సమయంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుక్కి ఇచ్చే ధనం లేదా సంపదని వరకట్నం అంటున్నారు. కొందరు డబ్బు కట్నంగా ఇస్తే మరికొందరు భూములు ఇస్తారు.
వరకట్నం తీసుకోవడం గానీ, ఇవ్వడం గానీ నేరమని చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని పాటిస్తున్నదెవరు ? చట్టాన్ని కాపాడవలసిన అధికారులే వరకట్నం ఇస్తున్నారు – తీసుకుంటున్నారు. కంచే చేను మేస్తోంది ! వరకట్నం ఇవ్వనని ఎవరైనా శపథం చేస్తే అమ్మాయికి పెళ్ళికాని పరిస్థితి కూడా ఏర్పడుతోంది ! ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయికి కట్నం ఇవ్వలేక నానా బాధలు పడ్డవారే, అబ్బాయి పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి కట్నం ఇవ్వాలని పట్టుబడతారు.
వరకట్న నిర్మూలనం సాధ్యమవ్వాలంటే ముందుగా పెద్దలలో మార్పురావాలి. . శాఖాంతర, కులాంతర, ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలి. యువతీయువకులు ఆదర్శాలతో ఈ వరకట్నమనే దురాచారాన్ని రూపుమాపాలి. అమ్మాయికి ఇవ్వటం, అబ్బాయికి తీసుకోవటం రెండూ అక్రమమేనన్న ఆలోచన కలగాలి. కట్నం అనేది బానిసవ్యాపారమన్న ప్రచారం సాగాలి. రేడియోలు, టీ.వీ.లు, సాహిత్యం ద్వారా వరకట్న దురాచారం గురించి ప్రజలకి తెలియజెయ్యాలి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రజలు అమలుపరచాలి. అప్పుడే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుంది లేదా ‘తంటా’ అవుతుంది !
ప్రశ్న 5.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’
సోదరులారా!
మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం . పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీమూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.
పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోడి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.
దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళ వంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.
నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది.
జాగ్రత్త. స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా విజృంభించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణం చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు,
x x x x
ప్రశ్న 6.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
లేఖ రాజమండ్రి, ప్రియ మిత్రుడు అఖిలేశ్ కు, నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను. స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను. ఇట్లు, చిరునామా : |
8th Class Telugu 10th Lesson సంస్కరణ 1 Mark Bits
1. చైత్రశుద్ధనవమినాడు సీతారాములపరిణయం జరుగును. (పర్యాయపదాలు గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పుట్టినరోజు, జన్మదినం
బి) సంబరం, సంతోషం
సి) పుంసవనం, సీమంతం
డి) పెళ్లి, కళ్యాణం
జవాబు:
డి) పెళ్లి, కళ్యాణం
2. విద్దె లేని వాడు వింత పశువు (ప్రకృతి గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) విధి
బి) విదియ
సి) విదె
డి) విద్య
జవాబు:
డి) విద్య
3. నిజమే ! నాకీ సంగతి తెలీదు. (సంధిని గుర్తించండి.) (S.A.III – 2016-17)
ఎ) అకారసంధి
బి) ఉకారసంధి
సి) యడాగమసంధి
డి) ఇకార సంధి
బి) విదియ
జవాబు:
బి) ఉకారసంధి
భాషాంశాలు – పదజులం
అర్థాలు:
4. సంఘనిర్మూలన ఆవశ్యకత ఉంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అనాదరం
బి) అవసరం
సి) అవకాశం
డి) అనంతం
జవాబు:
బి) అవసరం
5. అధర్మాన్ని నిర్మూలన చేయాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) తిరోగతి
సి) తొలగించడం
డి) ఏవగించడం
జవాబు:
సి) తొలగించడం
6. అభ్యున్నతి సాధించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) ప్రగతి
బి) సాధికారత
సి) నేర్పరి
డి) గుర్తించు
జవాబు:
ఎ) ప్రగతి
7. దురాచారం తొలగాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) సదాచారం
బి) చెడు ఆచారం
సి) గొప్పదైన
డి) కనబరచు
జవాబు:
బి) చెడు ఆచారం
8. చైతన్యం రావాలి – గీత గీసిన పదానికి అర్థం పదాలు రాయండి.
ఎ) కదలిక
బి) మదలిక
సి) అవరోధం
డి) సాధికారత
జవాబు:
ఎ) కదలిక
9. విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) వినోదం
బి) ఆనందం
సి) విషాదం
డి) విచారం
జవాబు:
బి) ఆనందం
10. ప్రగతి ప్రస్ఫుటించింది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) తెల్లారు
బి) అవసరము
సి) కనబరచు
డి) అసహ్యించు
జవాబు:
సి) కనబరచు
11. ఇతరులను అసహ్యించుకోరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పెద్ద భూతం
బి) అక్కడక్కడ
సి) తొలగించు
డి) ఏవగించుకొను
జవాబు:
డి) ఏవగించుకొను
12. ధనం సంపాదించాలి – గీత గీసిన పదానికి అర్థాలు గుర్తించండి.
ఎ) సంపద, సాగరం
బి) విత్తం, ద్రవ్యం
సి) జలధి, హలం
డి) దండనం, దాపరికం
జవాబు:
బి) విత్తం, ద్రవ్యం
పర్యాయపదాలు :
13. స్త్రీ ప్రగతి సాధించాలి – గీత గీసిన పదానికి పర్యాయ గుర్తించండి.
ఎ) మహిళ, జామాత
బి) ద్రవ్యం, పైకం
సి) మహిళ, వనిత
డి) చట్టం, ఉత్తరువు
జవాబు:
సి) మహిళ, వనిత
14. ఇనుడు ప్రకాశించాడు- గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) ప్రభాకరుడు, చందురుడు
బి) జాబిల్లి, అంతరంగం
సి) శాసనం, ధనము
డి) సూర్యుడు, రవి
జవాబు:
డి) సూర్యుడు, రవి
15. కార్యం ఘనంగా ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఢంక, దాపు
బి) గొప్ప, శ్రేష్ఠం
సి) ఆనందం, శ్రేష్ఠం
డి) గోప్ప, ఘనసారం
జవాబు:
సి) ఆనందం, శ్రేష్ఠం
16. కృషి చేయాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సేద్యం, సాగరం
బి) ప్రయత్నం, పరిశ్రమ
సి) గొప్ప, దాపరికం
డి) అసహ్యం, వ్యవసాయదారుడు
జవాబు:
బి) ప్రయత్నం, పరిశ్రమ
17. హర్షం పొందాలి – గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) హారం, మనోహరం
బి) ఆనందం, సంతోషం
సి) సంతసం, సంతాపం
డి) సాగరం, జలధి
జవాబు:
బి) ఆనందం, సంతోషం
18. శాసనం తిరుగులేనిది-గీత గీసిన పదానికి సమానార్థకాలు గుర్తించండి.
ఎ) ఉత్తరువు, ఉత్తమం
బి) చట్టం, ఉత్తరువు
సి) అవేశం, ఆక్రందన
డి) అనువు, అరమరిక
జవాబు:
బి) చట్టం, ఉత్తరువు
19. స్త్రీ గౌరవనీయురాలు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) ఇంతి
బి) సింది
సి) శీరి
డి) గిరి
జవాబు:
ఎ) ఇంతి
20. దూరం ఉంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దేరం
బి) దవ్వు
సి) దాపు
డి) దాగరం
జవాబు:
బి) దవ్వు
21. నిక్కం పలకాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) నిజం
బి) నైజం
సి) నాగరం
డి) నైరాశ్యం
జవాబు:
ఎ) నిజం
22. విషయం తెలియాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వివేకం
బి) విసయం
సి) విసురం
డి) విసెరం
జవాబు:
బి) విసయం
23. గౌరవం చూపాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) గారవం
బి) గార్దభం
సి) శాస్త్రం
డి) గేరవం
జవాబు:
ఎ) గారవం
24. రూపం మనోహరం – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) రూపు
బి) రోపు
సి) రేసు
డి) వైపు
జవాబు:
ఎ) రూపు
25. అందరు నిద్య చదవాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వద్దె
బి) వెద్దె
సి) వొద్దె
డి) విద్దె
జవాబు:
డి) విద్దె
26. అచ్చెరువు పొందాము – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) ఆశ్చర్యం
బి) అక్కరువు
సి) ఆదరువు
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆశ్చర్యం
27. మంతిరి వచ్చాడు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) మంత్రి
బి) మంతెరి
సి) మబెరి
డి) మంచరి
జవాబు:
ఎ) మంత్రి
28. వివాహం జరిగింది – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) వేసహం
బి) వియ్యము
సి) వివాహం
డి) విసహం
జవాబు:
బి) వియ్యము
29. కృషి అవసరం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) సేద్యం, ప్రయత్నం
బి) సేద్యం, సాగరం
సి) పరిశ్రమ, పరిశీలన
డి) ప్రగతి, చైతన్యం
జవాబు:
ఎ) సేద్యం, ప్రయత్నం
30. జగతిన ప్రజలు వర్ధిల్లాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జాతి, వందనం
బి) సంతానం, జనం
సి) జాగృతి, అభ్యున్నతి
డి) శీలన, శిబిరం
జవాబు:
బి) సంతానం, జనం
31. చైతన్యం వెల్లివిరియాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చిరాకు, విరోగతి
బి) అధోగతి, అభ్యున్నతి
సి) ప్రాణం, తెలివి
డి) తపన, తామరసం
జవాబు:
సి) ప్రాణం, తెలివి
32. కళ్యాణం జరిగింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) పరిశీలన, ప్రగతి
బి) పెండ్లి, బంగారం
సి) అక్షతలు, ఆకాశం
డి) అనంతం, అంతరంగం
జవాబు:
బి) పెండ్లి, బంగారం
33. ఘనం కురిసింది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) ఘనసారం, శబ్దం
బి) గొప్ప, మేఘం
సి) శరీరం, తనువు
డి) పుట్టుట, ప్రగతి
జవాబు:
బి) గొప్ప, మేఘం
34. సత్యం జయించాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) నిజం, పూజ్యము
బి) నైజం, గుణం
సి) తపన, తాత్సారం
డి) పూజ్యం, పుణ్యము
జవాబు:
ఎ) నిజం, పూజ్యము
వ్యుత్పత్యర్థాలు :
35. నీటిని ధరించునది – అనే వ్యుత్పత్త్యర్థం గల పదం ఏది?
ఎ) జలధి
బి) కాసారం
సి) క్షీరం
డి) దాస్యం
జవాబు:
ఎ) జలధి
36. సత్పురుషులయందు పుట్టినది – అనే వ్యుత్పత్తి గల ఏది?
ఎ) అసహ్యం
బి) కులం
సి) దుఃఖం
డి) సత్యం
జవాబు:
డి) సత్యం
37. సమస్త ప్రాణులయందు సమభావన కలవాడు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) మిత్రుడు
బి) వైరి
సి) పగతుడు
డి) కృతజ్ఞుడు
జవాబు:
ఎ) మిత్రుడు
38. శాసనం పాటించాలి – గీత గీసిన పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) అందరికి ఆమోదయోగ్యమైంది
బి) దీని చేత రక్షింపబడును
సి) దాని చేత కొనబడును
డి) అందరి చేత పొందబడును
జవాబు:
బి) దీని చేత రక్షింపబడును
వ్యాకరణాంశాలు
సంధులు :
39. కింది వానిలో బహుళ సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గుణసంధి
సి) వృద్ధి సంధి
డి) విసర్గ సంధి
జవాబు:
ఎ) అత్వసంధి
40. చేసినంత పని – గీత గీసిన పదాన్ని విడదీసి, గుర్తించండి.
ఎ) చేసిన + ఎంత
బి) చేసిన + అంత
సి) చేసినా + యంత
డి) చేసినే + యంత
జవాబు:
బి) చేసిన + అంత
41. కారణమని – ఇది ఏ సంధికి ఉదాహరణయో గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) గుణసంధి
సి) యణాదేశ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
ఎ) ఉత్వసంధి
42. వ్యతిరేకాభిప్రాయం – ఇది ఏ సంధికి ఉదాహరణ?
ఎ) వృద్ధి సంధి
బి) త్రికసంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) అత్వసంధి పదం
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి
43. సరిగదా – దీన్ని విడదీసిన పదం గుర్తించండి.
ఎ) సరి + కదా
బి) సరి + గదా
సి) సరి + అదా
డి) సరే + కదా
జవాబు:
ఎ) సరి + కదా
44. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) అత్వసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) ఇత్వసంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి
45. వివాహాలు – దీనిని విడదీస్తే
ఎ) వివాహా + ఆలు
బి) వివాహము + లు
సి) వివ + అహములు
డి) వివాహ + ములు
జవాబు:
బి) వివాహము + లు
46. కింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) అత్తమ్మ
బి) ఏమిచ్చెను
సి) అభ్యున్నతి
డి) సరాగాలు
జవాబు:
సి) అభ్యున్నతి
సమాసాలు :
47. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) బహుజొహి
సి) అవ్యయీభావం
డి) కర్మధారయం
జవాబు:
ఎ) తత్పురుష
48. విద్యాహీనత – ఈ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) విద్యకు హీనత
బి) విద్యయందు హీనత
సి) విద్యచేత హీనత
డి) విద్య కొరకు హీనత
జవాబు:
డి) విద్య కొరకు హీనత
49. కింది వానిలో తృతీయా తత్పురుషకు ఉదాహరణ
ఎ) శక్తిహీనత
బి) ఆరోగ్య భయం
సి) గురుదక్షిణ
డి) పతిభిక్ష
జవాబు:
ఎ) శక్తిహీనత
50. వరుని కొరకు కట్నం-దీన్ని సమాసపదంగా గుర్తించండి.
ఎ) వరకట్నం
బి) పరకట్నం
సి) అనువరకటనం
డి) ప్రతికట్నం
జవాబు:
ఎ) వరకట్నం
51. విద్యావ్యాప్తి – ఇది ఏ సమాసం?
ఎ) విద్య చేత వ్యాప్తి
బి) విద్య వలన వ్యాప్తి
సి) విద్య యొక్క వ్యాప్తి
డి) విద్యను వ్యాప్తి
జవాబు:
సి) విద్య యొక్క వ్యాప్తి
52. అసత్యం – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సత్యమే అగుపించునది
బి) సత్యము కానిది
సి) ధర్మము కానిది
డి) సత్యముతో కూడినది
జవాబు:
బి) సత్యము కానిది
53. పూర్వకాలము – ఇది ఏ సమాసం?
ఎ) షష్ఠీ తత్పురుష
బి) పంచమీ తత్పురుష
సి) అవ్యయీభావం
డి) ప్రథమా తత్పురుష
జవాబు:
డి) ప్రథమా తత్పురుష
వాక్యాలు :
54. అంటరానితనం వద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధాక వాక్యం
బి) అష్యర్థక వాక్యం
సి) ముక్తపదగ్రస్తం
డి) నిదర్శనాలంకారం
జవాబు:
ఎ) నిషేధాక వాక్యం
55. రమ అల్లరి చేస్తూ ఆడుతున్నది – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) భావార్థకం
బి) తుమున్నర్థకం
సి) అప్యర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
డి) శత్రర్థకం
56. రామకృష్ణ పరమహంస, వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) అభ్యర్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం
57. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిశ్చయాత్మక వాక్యం
జవాబు:
ఎ) హేత్వర్థక వాక్యం
58. మీరు ఆటలు ఆడవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అనుమత్యర్థకం
బి) అభ్యర్థకం
సి) హేత్వర్థకం
డి) నిషేధాకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం
59. జగతి వర్ధిల్లాలి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంయుక్త
బి) ఆశీర్వచనార్థకం
సి) అప్యర్థకం
డి) హేత్వర్ధకం
జవాబు:
ఎ) సంయుక్త
60. వర్తమానకాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) శత్రర్థకం
బి) ఆశ్చర్యార్థకం
సి) క్వార్థకం
డి) అప్యర్థకం
జవాబు:
ఎ) శత్రర్థకం
గణవిభజన:
61. IUI – ఇది ఏ గణము?
ఎ) జ గణం
బి) త గణం
సి) మ గణం
డి) స గణం
జవాబు:
ఎ) జ గణం
62. జలజా – ఇది ఏ గణము?
ఎ) భ గణం
బి) స గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
బి) స గణం
63. IIUI – ఇది ఏ గణము?
ఎ) స న
బి) న గ
సి) న ల
డి) స ల
జవాబు:
డి) స ల
అలంకారాలు :
64. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండునట్లుగా ఒక పదం వెంటవెంటనే రావడం
ఎ) లాటానుప్రాస
బి) యమకం
సి) ముక్తపదగ్రస్తం
డి) ఉపమ
జవాబు:
ఎ) లాటానుప్రాస
65. కింది వానిలో పొసగని అలంకారం గుర్తించండి. రకమైన వాక్యం?
ఎ) రూపక
బి) యమకం
సి) అతిశయోక్తి
డి) ఉత్ప్రేక్ష
జవాబు:
బి) యమకం
66. ఉపమానోపమేయాలకు అభేదం చెప్పే అలంకారం ఏది?
ఎ) రూపక
బి) అతిశయోక్తి
సి) ముక్తపదగ్రస్తం
డి) అంత్యానుప్రాస
జవాబు:
ఎ) రూపక
67. ఉత్ప్రేక్ష – అనగా
ఎ) ఊహ
బి) ఆశ
సి) పల్లవి
డి) పోలిక
జవాబు:
ఎ) ఊహ
68. మానవా ! నీ ప్రయత్నం మానవా ! – ఇది ఏ అలంకారం?
ఎ) యమకం
బి) ముక్తపదగ్రస్తం
సి) లాటానుప్రాస
డి) ఉపమ
జవాబు:
బి) ముక్తపదగ్రస్తం
సొంతవాక్యాలు :
69. అవరోధాలు : కార్యసాధనలో అవరోధాలు తొలగించుకోవాలి.
70. ఆశ్చర్యం : ఇంద్రజాల ప్రదర్శన నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
71. నిరాడంబరం : మహాత్ములు ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు.
72. ఆవశ్యకత : సంఘసంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది.
73. దురాచారం : సమాజంలో దురాచారాలను నిర్మూలించాలి.
74. ప్రతిష్ఠ : భారతదేశ సమున్నత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం అయింది.