SCERT AP 8th Class Social Study Material Pdf 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం
8th Class Social Studies 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
భూగర్భగని సందర్శనని చూపించే ఫ్లో చార్టు తయారుచేయండి. (AS1)
జవాబు:
ప్రశ్న 2.
గనులలో పని చేస్తున్నప్పుడు ఉద్యోగులు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు, ముందు జాగ్రత్తలు, గని కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న శీర్షికతో పట్టిక తయారుచేయండి. (AS3)
జవాబు:
గనులలో పని చేస్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రధాన ఆరోగ్య సమస్యలు, ముందు జాగ్రత్తలు, గని కార్మికుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-
గనులలో పనిచేసే వారికి ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. రెండవది మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. కళ్ళ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి, ఇవే కాకుండా ఏవేనీ ప్రమాదాలు జరిగినపుడు అనుకోని సమస్యలు తలెత్తుతాయి.
ఉద్యోగంలో ఉన్నవారికి వారి వారి వృత్తిని బట్టి, చేసే పనులను బట్టి వారికి వ్యాధులు వస్తాయి.
ఉదా : ఉపాధ్యాయులకు గొంతు సమస్యలు, డ్రైవర్లకు – కీళ్ళ, కళ్ళ సమస్యలు, బరువులు మోసే వారికి, వెన్నుపూస సమస్యలు.
కొంత మందికి వారికి ఉన్న ఒత్తిడుల మూలంగా అనేక రకాల మానసిక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. వీరు నిత్య జీవితంలో ప్రాణాయామం , ధ్యానం, నడక వంటి యోగసాధనలు రోజుకి ఒక గంట చేసినట్లయితే -వీటిని అధిగమించవచ్చును.
గనులలో పనిచేసేవారు ముక్కుకి మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. కాళ్ళకు బూట్లు, చేతులకు తొడుగులు వేసుకోవాలి. గనిలో పనిచేసే యంత్రాలను రోజూ పరీక్ష చేసి సరిగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వారికి అందుబాటులో ఉండాలి.
ప్రశ్న 3.
జానకి ప్రస్తుతం వ్యవసాయ కూలిగా పని చేస్తోంది. ఆమెకు గని కార్మికురాలు కావాలని ఉంది. ఆమె పనిలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఉపాధిరంగ చిత్రం, ఆరోగ్య సమస్యలు వంటివి ఆమెకు వివరించండి. (AS1)
జవాబు:
“జానకీ, ఇప్పటి వరకూ మీరు పనిచేసిన రంగం వేరు. గని రంగం వేరు. ఇవి షిప్టు వేళలలో పనిచేస్తాయి. అంటే రాత్రి వేళల్లో కూడా పనిచేయాల్సి రావచ్చు. ఒక స్త్రీగా మికది ఇబ్బందికరమేమో ఆలోచించండి. ఇప్పుడు మీరు పచ్చటి పొలాలలో పరిశుద్ధమయిన వాతావరణంలో పనిచేస్తున్నారు. కాని అపుడు దుమ్ము, ధూళిలో పనిచేయాల్సి వస్తుంది. తలకి, చేతులకి, కాళ్ళకి ఏదో ఒకటి ధరించాల్సి వస్తుంది. ముఖ్యంగా పేలుడు పదార్థాలతో పనిచేయాల్సి వస్తుంది. కొద్ది కాలం తరువాత ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మీకు మేలు జరుగుగాక.. ఉంటాను”.
ప్రశ్న 4.
గనులలో యంత్రాలు, మానవ శ్రమ వినియోగించేటప్పుడు కార్మికుల అవసరంలో తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
గనులలో యంత్రాలు లేనపుడు మానవశ్రమ అధికంగా అవసరమవుతుంది. యంత్రాలున్నపుడు మానవశ్రమ తగ్గుతుంది. ఉదా : ఇది వరకు బొగ్గు గనుల్లో త్రవ్విన బొగ్గును, లిఫ్టుకు చేర్చడానికి తోపుడు బండ్లను వాడేవారు. వాటిని శ్రామికులే నడిపేవారు. కాని ఇప్పుడు ఆ బొగ్గును కన్వేయరు బెల్టుపై పంపుతున్నారు. దీని వలన అక్కడ శ్రామికుల అవసరం తగ్గింది. ఇలా అనేక యంత్రాలను వినియోగించడం మూలంగా ఇటీవల గనులలోకి క్రొత్త శ్రామికులను చేర్చుకోవడం తగ్గిందని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
దేశ ఆర్థిక పరిస్థితికి గనుల తవ్వకం దోహదం చేసిన దానిని ఈ అధ్యాయంలో ఎలా గుర్తించారు? (AS1)
జవాబు:
భారతదేశం స్వతంత్ర్యం వచ్చే నాటికి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. ఈ గనుల త్రవ్వకం మొదలు పెట్టిన తరువాత ప్రభుత్వానికి ఆదాయము లభించింది. వీటిని కౌలుకిచ్చిన తరువాత కూడా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇందువలన ఆర్థిక పరిస్థితికి గనుల తవ్వకం దోహదం చేసిన దానిని నేను ఈ అధ్యాయంలో గుర్తించాను.
ప్రశ్న 6.
“ఆంధ్రప్రదేశ్ లో ఖనిజాలు” పటాన్ని చూసి ఏ జిల్లాలో ఏ ఖనిజాలు ఉన్నాయో గుర్తించండి. (AS5)
జవాబు:
మాది …………… జిల్లా : మా జిల్లాలో …………… ఖనిజాలు ఉన్నాయి.
ప్రశ్న 7.
“ఖనిజాలు ఎవరికి చెందుతాయి” అనే పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. “ఖనిజ వనరులు ఏ ఒక్కరికీ చెందినవి కావు. ఇవి అందరి సంపద.” దీనిని ఏ విధంగా మీరు సమర్ధిస్తారు? (AS2)
ఖనిజాలు సాధారణంగా భూమి లోపలి పొరల్లో ఉంటాయి. ఇవి ఏ ఒక్క వ్యక్తికి చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. వీటిని అందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందుకే దేశంలోని యావత్తు ఖనిజ సంపదను ఆ దేశ ప్రభుత్వ ఆస్తిగా భావిస్తారు. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ ఖనిజాలను వినియోగిస్తుంది.
జవాబు:
భూమి లోపల దొరికే వస్తువులన్నీ ప్రభుత్వానికి అంటే ప్రజలకి చెందుతాయి. అయితే ఇవి ఏ వ్యక్తికో చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. అందరి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అందుకే దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ ఖనిజాలను వినియోగిస్తుంది.
ప్రశ్న 8.
ఈ క్రింది చిత్రాన్ని గమనించండి. ఇద్దరు వ్యక్తులు రెండు రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాళ్ళు గనుల తవ్వకంలో ఏ విషయంపై మాట్లాడుతున్నారు? (AS1)
జవాబు:
ఖనిజాల వలన మేం బతకలేకున్నాం :
ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి, గనుల తవ్వకం మూలంగా తన ఇంటిని, న బ్రతకలేకున్నాం బ్రతకలేం స్థలాన్ని పోగొట్టుకుంటున్నాడు. వారి జీవితాలు అస్తవ్యస్త మవుతున్నాయి. అందువలన అలా వ్యాఖ్యానించాడు.
ఖనిజాలు లేకుండా మేం బతకలేం :
ఈ వ్యాఖ్యానం చేసిన వ్యక్తి ప్రభుత్వం ద్వారా గనిని కౌలుకి తీసుకున్న వ్యక్తి. ఇతనికి ఖనిజాలు, గనులు లేకపోతే సంపద ఉండదు. అందువలన అలా వ్యాఖ్యానించాడు.
ప్రశ్న 9.
ఖనిజాలు దేశాభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతున్నాయి?
(లేదా)
ఖనిజాల వలన కలిగే ఉపయోగాలు ఏవి? (AS6)
జవాబు:
ఖనిజాలు దేశ సంపద. వీటిని ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యము ఆర్జించవచ్చు. ఖనిజాలు త్రవ్వేచోట వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. వీటిని శుద్ధి చేసి వివిధ వస్తువులు, ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమల ద్వారా ప్రజలకు ఉపాధి లభించడమే గాక జాతీయాదాయం కూడా పెరుగుతుంది. ఖనిజాలు, పరిశ్రమలు గల ప్రాంతాలలో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది. యురేనియం వంటి ఖనిజాలు అణుశక్తిగా ఉపయోగపడతాయి. ఈ రకంగా ఖనిజాలు దేశ సంపదను అభివృద్ధి చేస్తాయి.
ప్రశ్న 10.
వివిధ ఖనిజాలు, వాటి ఉపయోగాలను తెలిపే పట్టికను తయారుచేయండి. (AS3)
జవాబు:
ఖనిజము | ఉపయోగాలు |
1) ఇనుప ధాతువు (ముడి ఇనుము) | హెమటైట్ మరియు మాగ్నటైట్ ఇనుప ధాతువులను ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. |
2) మైకా (అభ్రకం) | విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. |
3) గ్రానైట్ | దీనిని కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణ స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు. |
4) మాంగనీస్ | దీనిని పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోనూ ఇనుము – ఉక్కు బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి (సిరామిక్స్) గాజు పరిశ్రమలలో ఉపయోగిస్తారు. |
5) బెరైటీస్ | పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం వాడతారు. |
6) ఫెల్డ్ స్పార్ | గాజు, సిరామిక్ వస్తువులు తయారు చేస్తారు. |
8th Class Social Studies 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం InText Questions and Answers
8th Class Social Textbook Page No.63
ప్రశ్న 1.
తనకు తానుగా పునరుద్ధరింపబడే ఖనిజం ఒకటి చెప్పండి. ఈ ప్రక్రియలో మనం ఎలా సహాయపడగలం?
జవాబు:
భూగర్భజలం ఒక పునరుద్ధరింపబడే ఖనిజము. వీటిని పెంచడానికి మనం ఈ క్రింది పనులు చేయాలి.
- ఇంకుడు గుంటలు త్రవ్వాలి.
- వర్షపు నీరు వృథాగా పోకుండా భూమిలోకి యింకి పోయేలా చర్యలు తీసుకోవాలి.
- చెట్లు కూడా భూగర్భజలాలని పెంచుతాయి. కాబట్టి చెట్లను పెంచాలి.
- పొలాల్లో ఉన్న మిగులు నీటిని కూడా బయటకు పారించి, వాటిని భూమిలోకి ఇంకేలా చేయవచ్చు.
- ఉపయోగించని డ్రెయిన్లలో నీరు పారించి, దానికి అడ్డు గేట్లను నిర్మించినట్లయితే అక్కడ నీరు నిదానంగా పారి, నేలలోకి ఇంకుతుంది.
ప్రశ్న 2.
మనం వాడుతున్నా తరిగిపోని, మనం ఏమి చేయకపోయినా పునరుద్ధరింపబడే శక్తి వనరు ఏదో చెప్పండి.
జవాబు:
గాలి
ప్రశ్న 3.
రైళ్ళు, కార్లు నడపటానికి వీలులేని ప్రపంచాన్ని మీరు ఊహించండి.
జవాబు:
రైళ్ళు, కార్లు కనిపెట్టని రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేది. కాని అవి ఉండి నడపడానికి వీలులేని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రపంచంలో దూరాలు బాగా పెరుగుతాయి. జీవితం నల్లేరు మీద నడకలా ఉంటుంది.
8th Class Social Textbook Page No.64
ప్రశ్న 4.
కింద ఇచ్చిన సహజ వస్తువులను పునరుద్ధరింపబడేవి, అంతరించిపోయేవిగా వర్గీకరించండి.
ఖనిజం అయితే టిక్కు (✓) పెట్టండి, కాకపోతే ఇంటూ (✗) పెట్టండి : వెదురు, బొగ్గు, సముద్రపు నీరు, మట్టి, చీమలు, ఇసుక, ఇనుప ఖనిజం, వజ్రాలు, చెట్లు, ముడి చమురు, గడ్డి, గాలి, పాలరాయి, చేపలు, బావినీళ్లు, సూర్యకాంతి.
జవాబు:
పునరుద్ధరింపబడే వనరు | అంతరించిపోయే వనరు | ఖనిజాలు |
1. వెదురు | ✗ | |
2. | బొగ్గు | ✓ |
3. సముద్రపు నీరు | ✗ | |
4. | చీమలు | ✗ |
5. | మట్టి | ✗ |
6. | ఇసుక | ✗ |
7. | ఇనుప ఖనిజం | ✓ |
8. | వజ్రాలు | ✓ |
9. చెట్లు | ✗ | |
10. | ముడిచమురు | ✓ |
11. గడ్డి | ✗ | |
12. గాలి | ✗ | |
13. | పాలరాయి | ✓ |
14. చేపలు | ✗ | |
15. | బావినీరు | ✗ |
16. సూర్యకాంతి | ✗ |
ప్రశ్న 5.
కింద ఇచ్చిన ఖనిజాలను లోహాలు, లోహాలు కాని వాటిగా వర్గీకరించి, ఇంధన వనరులను పేర్కొనండి : ఇనుప ఖనిజం, బాక్సెట్ (అల్యూమినియం ఖనిజం), బొగ్గు, రాగి ఖనిజం, సున్నపురాయి, జిప్సం, మైకా, భూగర్భ జలాలు, ముడి చమురు, సైంధవ లవణం, ఇసుక, వజ్రపు రాళ్లు,
జవాబు:
లోహాలు | లోహాలు కానివి | ఇంధన వనరు |
ఇనుప ఖనిజం | బొగ్గు | బొగ్గు |
బాక్సెటు | సున్నపురాయి | ముడిచమురు |
రాగి | భూగర్భ జలాలు | |
ముడిచమురు | ||
సైంధవ లవణం | ||
ఇసుక | ||
వజ్రపు రాళ్ళు | ||
జిప్సం | ||
మైకా |
8th Class Social Textbook Page No.66
ప్రశ్న 6.
కింద చిత్రాలు చూసి వాటిల్లో ఏది ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకమో, భూగర్భ తవ్వకమో, చమురు కోసం బోరు బావుల తవ్వకమో చెప్పండి.
జవాబు:
చమురు కోసం బోరు బావుల తవ్వకం – ఓపెస్ట్ గనుల తవ్వకం – భూగర్భ తవ్వకం.
8th Class Social Textbook Page No.67
ప్రశ్న 7.
ఖనిజాలను ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుంది?
జవాబు:
- 1970లలో ప్రభుత్వం గనులన్నింటినీ జాతీయం చేసింది.
- దీని ద్వారా ప్రభుత్వం గనుల త్రవ్వకాన్ని తానే నిర్వహించడమో లేదా లీజుకిచ్చి వారి నుంచి సొమ్ము తీసుకోవడమో చేస్తుంది.
- వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ప్రజోపయోగానికి, అభివృద్ధి పనులకు వెచ్చిస్తుంది.
ప్రశ్న 8.
మీ ప్రాంతంలో గనుల తవ్వకం జరుగుతూ ఉంటే అక్కడ పనిచేసే, నివసించే ప్రజల గురించి తెలుసుకోండి. చుట్టుపక్కల వాతావరణాన్ని గనుల తవ్వకం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. గనుల తవ్వకం వల్ల ఎంత మంది ప్రయోజనం , పొందుతున్నారో తెలుసుకోండి.
జవాబు:
మాది వై.యస్.ఆర్ కడప జిల్లాలో మంగంపేట. ఇక్కడ బెరైట్ ఖనిజ నిల్వలు ఉన్నాయి. వీటిని 1960లో కనుగొన్నారు. 1967 నుంచి దీని తవ్వకం కొనసాగుతుంది. ఈ గ్రామంలో ‘1200 కుటుంబాలు ఉండేవి. వీరిని కొత్త ప్రాంతానికి తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ (ప్రభుత్వరంగ కంపెనీ – ఎస్ఎండిసి) వారికి పునరావాసం కల్పించింది. ఈ గనులు ఈ కంపెనీకి చెందుతాయి. ఇందులో పనిచేసే కార్మికుల, ఉద్యోగస్టులు, స్థానిక ప్రజల కోసం NMDC చెట్లు నాటించడం లాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. మా నాన్నగారి పేరు R. ఈశ్వరరావు. ఆయన ఇక్కడ G.M. ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. ఇక్కడ పనిచేసే వారంతా కలిసి మెలిసి ఉంటారు.
8th Class Social Textbook Page No.68
ప్రశ్న 9.
a) మన ఖనిజాలను తవ్వడానికి ప్రైవేటు కంపెనీలను అనుమతించటంలోని లాభ, నష్టాలను చర్చించండి.
b) వాటిని ఎలా నియంత్రించవచ్చు?
c) పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఏమి చేయవచ్చు?
జవాబు:
a) 1. 1993లో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
2. దీని ద్వారా గనులను ప్రైవేటు వారికి కౌలుకిచ్చి వాటిలో త్రవ్వకాలు నిర్వహించమంది.
లాభాలు :
గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటూనే, కొంత ఆదాయం సమకూరుతోంది. అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానం తీసుకుని రావడానికి ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధానం ఫలితంగా గత 20 సం||రాలలో గనుల తవ్వకం ఊపందుకుంది. గనుల సంఖ్య, తవ్వి తీసే ఖనిజాలు, ఉపాధి ఈ రంగంలో పెరిగాయి.
నష్టాలు :
ప్రభుత్వ అనుమతిని లెక్క చేయకుండా ప్రయివేటు కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా గనులను తవ్వేస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో గనుల తవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా ప్రైవేటు కంపెనీలు ఖనిజాలను తరలించి వేస్తున్నాయి. నిజంగా అవి చెందాల్సిన ‘ప్రజలకు చెందటం లేదు’.
b) గనులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి. లేదా ప్రైవేటు వారికిచ్చినపుడు ఉన్నత స్థాయి అధికారుల అజమాయిషీ. – స్థానికుల పర్యవేక్షణ దానిపై ఉండేలా చర్యలు తీసుకోవాలి.
c) గనులను కౌలుకిచ్చేటప్పుడు, భూగర్భ గనులను తవ్వేవారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. తవ్వగా ఏర్పడిన గోతులను, గుట్టలను సరిచేయాలి. ఇసుక లాంటి వాటిలో ఎక్కువ తవ్వకుండా పర్యవేక్షణ ఉండాలి.
ప్రశ్న 10.
ప్రజలందరూ ఖనిజ వనరుల అసలైన యజమానులు అయితే వాళ్ళందరి మేలు కోసం వీటిని ఉపయోగించుకోవడం ఎలా?
జవాబు:
వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా సౌకర్యాల అభివృద్ధికి, ప్రజారోగ్య వసతులకు, విద్యకు, ఇతర సబ్సిడీలకు ఉపయోగించాలి. అపుడు ప్రజలందరి మేలు కోసం ఉపయోగించినట్లవుతుంది.
ప్రశ్న 11.
రానున్న తరాలకు, అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ వనరులు ఉండాలా, వద్దా? ఈ వనరులు అంతరించి పోకుండా వాళ్ళకి కూడా అందేలా ఎలా చూడగలం?
జవాబు:
రానున్న తరాలకు కూడా ఈ వనరులు ఉండాలి. ఇవి వారికి అందాలంటే మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడుకోవాలి. అలాగే కొన్ని వనరుల వాడకాన్ని నిర్దిష్ట శాతం మాత్రమే ఉండేలా చూడాలి. లేకుంటే ఇవి నిజంగానే భవిష్యత్తులో అంతరించిపోతాయి.
8th Class Social Textbook Page No.69
ప్రశ్న 12.
ఈ పరికరాలు ఏమిటో చెప్పండి.
జవాబు:
ఇవి గనిలో కార్మికుల భద్రత కోసం ఉపయోగించే పరికరాలు. అవి కర్ర, హెల్మెట్, లాంతరు మొదలైనవి.
ప్రశ్న 13.
కర్ర ఉపయోగం ఏమిటి?
జవాబు:
పేలుడు జరిగిన తరువాత, ఆ ప్రాంతం ఎలా ఉంది అని పరిశీలించడానికి అక్కడ కర్రతో తడుతూ ముందుకెళతారు. బొగ్గు వదులుగా ఉన్నచోట దుంగలు, ఇనుపరాడ్లు పెట్టి నిలబెడతారు.
ప్రశ్న 14.
హెల్మెట్ పై దీపం ఎందుకు ఉంది?
జవాబు:
గనిలో చాలా చీకటిగా ఉంటుంది. ఒక వ్యక్తి సంచరించే ప్రాంతంలో ముందు వైపు వెలుగు కోసం హెల్మెట్ పై దీపం ఉంటుంది.
ప్రశ్న 15.
చిత్రంలోని లాంతరును గుర్తించారా ? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?
జవాబు:
ఈ లాంతరు గనిలోనికి తీసుకువెళతారు. ఏమైనా విషవాయువులు గనిలో వెలువడినట్లయితే ఈ లాంతరు ద్వారా ఆ సంగతిని తెలుసుకుని జాగ్రత్త పడతారు.
ప్రశ్న 16.
కింద ఇచ్చిన హామీ పత్రం చూడండి. ఏఏ షరతులకు మేం అంగీకరించవలసి వచ్చింది?
జవాబు:
ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిని అంగీకరించాల్సి వచ్చింది. తగిన జాగ్రత్తలు, పాటిస్తామని, ప్రమాదాలు జరిగినపుడు, భద్రతా పెట్టిలోని పరికరాలతో ఎదుర్కొంటామని అంగీకరించాల్సి వచ్చింది.
8th Class Social Textbook Page No.73
ప్రశ్న 17.
ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు ? పర్యావరణం, భూములను నష్టపరుస్తూ, జీవనోపాధులు నష్టపోయేలా చేస్తూ తక్కువ ఖర్చుతో బొగ్గుతవ్వకం చేపట్టటం సమంజసమైనదేనా?
జవాబు:
a) విద్యుత్తు ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వనరులను (ఉదా: సముద్రపు నీరు, సూర్యకాంతి) ఉపయోగించే విధానాలను కనిపెట్టడం, కని పెట్టిన వాటిని అమలు పరచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
b) ఇది సమంజసం కాదు. దీనివలన ప్రభుత్వరంగ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి తేడా లేకుండా పోయిందని నేను భావిస్తున్నాను.
8th Class Social Textbook Page No.75
ప్రశ్న 18.
బొగ్గుగనుల తవ్వకాన్ని, మంగంపేటలో గనుల తవ్వకాన్ని పోల్చండి. పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:
- రెండూ నేల నుండి తవ్వి తీయబడేవే.
- ఇవి రెండూ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉన్నాయి.
- వీటిని అవసరమైన చోట డిటోనేటర్ల సహాయంతో పేలుస్తారు.
- నాణ్యత కోసం లోపలి పొరల వరకూ వెళతారు.
- కార్మికుల భద్రత కోసం చర్యలు చేపడతారు.
తేడాలు :
బొగ్గు గనుల తవ్వకం | మంగం పేటలో గనుల తవ్వకం |
1. ఇవి అనేక చోట్ల ఉన్నాయి. | 1. ఇవి ఒకే చోట ఉన్నాయి. |
2. వీటిలో వేల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగస్థులు ఉన్నారు. | 2. వీటిలో వందల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. |
3. ఈ గనులు భూగర్భ, ఓపెన్ కాస్ట్ అని రెండు రకాలు. | 3. ఇవి ఓపెన్ కాస్ట్ మాత్రమే. |
4. ఈ గనుల లోపల పురుషులు మాత్రమే పని చేస్తారు. | 4. వీటిలో స్త్రీలు కూడా పనిచేస్తారు. |
5. స్వాతంత్ర్యం రాకముందు నుండి ఈ గనులు తవ్వబడుతున్నాయి. | 5. 1967 నుండి ఈ తవ్వకాలు మొదలయ్యా యి. |
పట నైపుణ్యాలు
ప్రశ్న 19.
ఆంధ్రప్రదేశ్ ఖనిజాల పటం చూసి క్రింది పట్టిక నింపండి.
జవాబు:
జిల్లా | ఖనిజం |
1. శ్రీకాకుళం | బెరైటీస్ |
2. విజయనగరం | సున్నపురాయి, బెరైటీస్ |
3. పశ్చిమ గోదావరి | సున్నపురాయి |
4. కృష్ణా | గానైట్, ఇనుప ఖనిజం |
5. గుంటూరు | సున్నపురాయి |
6. ప్రకాశం | సున్నపురాయి, గ్రానైట్, ఇనుప ఖనిజం, బెరైటీస్ |
7. నెల్లూరు | మైకా, బెరైటీస్ |
8. చిత్తూరు | గ్రానైట్ |
9. అనంతపూర్ | సున్నపురాయి, ఇనుప ఖనిజం |
10. కర్నూలు | సున్నపురాయి |
11. కడప | సున్నపురాయి, బెరైటీస్, ఇనుప ఖనిజం |