SCERT AP 8th Class Social Study Material Pdf 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాక్యాలను మీరు అంగీకరిస్తారా ? అంగీకరించటానికీ, అంగీకరించకపోటానికి కారణాలను పేర్కొనండి. (AS1)
a) అడవులను సంరక్షించటానికి వ్యక్తిగత ఆస్తి అన్న భావన ముఖ్యమైనది.
b) అడవులన్నింటినీ మనుషులు కాపాడాలి. …
c) గత కొద్ది శతాబ్దాలుగా భూమి మీద నివసిస్తున్న ప్రజలు తమ జీవనోపాధికి అడవులపై ఆధారపడటం తగ్గింది.
జవాబు:
a) ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. నాది అన్నభావనే ఎవరినైనా నడిపిస్తుంది. ఆ భావన గిరిజనులలో పోగొట్టడం మూలంగానే 200 ఏళ్ళ నుంచి అడవులు తగ్గిపోయాయి.

b) అవును, నేను ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. అడవులనన్నింటినీ మనుషులు కాపాడాలి. ఎందుకంటే అడవుల వలన సకల మానవాళీ లబ్ధి పొందుతోంది. అవి లేకపోతే మానవాళి మనుగడే లేదు.

C) ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి అనేక రకాలైన ఇతర ఉద్యోగ, వ్యాపార అవకాశాలు భూమి మీద లభిస్తున్నాయి. కాబట్టి వీరు అడవుల మీద జీవనోపాధికి ఆధారపడటం తగ్గించారు.

ప్రశ్న 2.
గత కొన్ని శతాబ్దాలలో అటవీ వినియోగంలో వచ్చిన ప్రధాన మార్పులతో ఒక పట్టిక తయారు చేయండి. గత తరగతుల పాఠ్య పుస్తకాలు చూడాల్సిన అవసరం రావచ్చు. (AS3)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 1
జవాబు:

అంశం గిరిజన జీవనంపై ప్రభావం అడవిపై ప్రభావం
వ్యవసాయ ఆవిర్భావం వ్యవసాయ ఆవిర్భావం మూలంగా గిరిజనులు తమ సాంప్రదాయ ఆహారాన్ని మార్చి, పంటలు పండించి తినటం అలవాటు చేసుకున్నారు. దుంపలు, పళ్ళు, తేనె మొదలైన సహజ ఆహారాలకు దూరమౌతున్నారు. దీని మూలంగా వీరు అడవిని నరికి చదును చేసి వ్యవసాయం చేస్తున్నారు. 4, 5 సం||రాల తర్వాత వేరే చోటికి వెళ్ళి అక్కడ కూడా యిదే విధంగా చేస్తారు. ఆ ప్రాంతాల్లో చెట్లు మొలిచి పెద్దవిగా ఎదగాలంటే చాలా ఏళ్ళు పడుతుంది.
వలసపాలకుల రాక వలసపాలకులు అడవులపై వీరికి ఉన్న హక్కులన్నీ, లాక్కున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వీరు నిరాశ్రయులయ్యారు. కూలీలుగా మారారు. వీరు అభద్రతా భావనకు గురి అయ్యారు. అడవులు అటవీశాఖ ఆధ్వర్యంలోనికి వెళ్ళి పోయాయి, రక్షిత, రిజర్వు అడవులుగా వర్గీకరించబడ్డాయి. వీటి మీద ఆదాయం ప్రభుత్వం ఆ తీసుకునేది. తన బిడ్డలైన గిరిజనులను దూరం చేసుకున్నాయి. ప్రభుత్వ వినియోగం పెరిగింది.
ప్రభుత్వ నియమాలు స్వతంత్ర్యం తరువాత కూడా వీరి పరిస్థితులు మారటానికి ప్రభుత్వం ఏమి చేయలేదు. బ్రిటిషు విధానాన్నే అవలంబించారు. ఈ విధానాల కారణంగా వారి బ్రతుకులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాయి. 1988లో జాతీయ అటవీ విధానాన్ని, ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించి అడవుల పరిరక్షణకు. గిరిజనులను, అటవీ శాఖను బాధ్యులను చేశారు. పులుల అభయారణ్యాలు ఏర్పడ్డాయి. అటవీ హక్కుల చట్టం 2006 వల్ల గిరిజనులకి వారి హక్కులు, వారి భూములు వారికి వచ్చాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 3.
పైన ఇచ్చిన వాటి ఆధారంగా, లేదా అడవుల గురించి మీకు తెలిసిన దానిని బట్టి మీరు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అడవిని ఈ దిగువ అంశాలలో వివరించండి. (AS4)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 2
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. మా అడవి ఈ విధంగా ఉంటుంది.

చెట్ల సాంద్రత కనిపించే చెట్లు చెట్ల ప్రత్యేక అంశాలు
ఎకరాకు 650 నుండి750 చెట్ల వరకూ ఉన్నాయి. 1. వెలగ 1) ఈ కాయలు తినడానికి, పచ్చడికి ఉపయోగిస్తారు.
2. తునికి 2) ఈ ఆకులను బీడీలు చుట్టటానికి ఉపయోగిస్తారు.
3. వేప 3) శక్తి రూపం, వ్యాధి నిరోధక శక్తి కలిగినది.
4. ఉసిరి 4) ఔషధ విలువలు కలిగినది.
5. టేకు 5) గట్టికలప, గృహ వినియోగానికి
6. బూరుగు 6) దూది తీయడానికి

ప్రశ్న 4.
ఆంధ్రప్రదేశ్-అడవులు పటాన్ని పరిశీలించి ఏ జిల్లా జిల్లాల్లో అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయో పేర్కొనండి. (AS5)
జవాబు:
తూర్పు గోదావరి, విశాఖపట్నం, కడప, కర్నూలు, శ్రీకాకుళం మరియు ప్రకాశం జిల్లాలు అత్యధికంగా అడవులచే ఆవరించబడి ఉన్నాయి.

ప్రశ్న 5.
ఒక పాఠశాలలో కొంత మంది విద్యార్థులు ‘వనమహోత్సవ కార్యక్రమం’లో పాల్గొని కొన్ని మొక్కలు నాటారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? (AS6)
జవాబు:
దీనికి నేను చాలా ఆనందిస్తాను. చిన్న వయస్సు విద్యార్థులు దీనికి అలవాటు పడితే దేశభవిష్యత్తు చాలా బాగుంటుంది. అయితే మొక్కలు నాటడమే కాక వాటిని సక్రమంగా పెరిగేలా కూడా బాధ్యత తీసుకోవాలి. అపుడే ఇది ఫలవంతమౌతుంది.

ప్రశ్న 6.
“ఆంధ్రప్రదేశ్ లో అడవులు” శీర్షిక కిందగల పేరాను చదివి క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ అభివృద్ధికై నీవు సూచించే సలహాలు ఏవి? (AS2)
జవాబు:

  1. సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
  2. పూడ్చి వేసిన గనుల ప్రాంతంలో మొక్కలను పెంచాలి.
  3. అడవులలోని ఖాళీ ప్రదేశాలలో చెట్లను పెంచాలి.
  4. గృహావసరాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి.
  5. ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయాలి.
  6. సామాన్య ప్రజలలో అడవుల ఆవశ్యకత పట్ల అవగాహనను కలిగించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 7.
ఈ పాఠంలో ఇచ్చిన వివిధ రకాలైన అడవుల చిత్రాలలో ఉన్న ప్రదేశాలను మీ దగ్గరున్న అట్లా లో గుర్తించండి. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను నీవు గుర్తించగలవా? (AS5)
జవాబు:
పాఠంలో ఇచ్చిన చిత్రాలలో క్రింది అడవుల గురించి పేర్కొనబడింది.

  1. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని సతతహరిత అడవులు
  2. హిమాలయాలలోని గుల్ మాలో మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి.
  3. ఛత్తీస్ గఢ్ లోని టేకు అడవులు.
  4. రాయలసీమలోని పొద అడవులు.
  5. తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవులు.

పైన పేర్కొన్న అడవులు గల ప్రదేశాలను అట్లా లో గుర్తించగలను. వాటి మధ్య ఉన్న పోలికలు, భేదాలను కూడా గుర్తించగలను.

ప్రశ్న 8.
సతత హరిత అడవులకు, ఆకురాల్చే అడవులకు గల తేడాలేవి?
జవాబు:

సతత హరిత అడవులు ఆకురాల్చే అడవులు
1) చాలా ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖ ప్రాంతాలు, కేరళ, అండమాన్లలో ఎల్లప్పుడూ పచ్చగా ఉండే సతత హరిత అడవులుఉంటాయి. 1) కొన్ని నెలల పాటు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి.
2) ఈ ప్రాంత చెట్లు ఆకులు రాల్చి తిరిగి చిగురించేందుకు పట్టేకాలం తక్కువ 2) బాగా వేడిగా ఉండే నెలల్లో ఇవి ఆకులను రాల్చి వర్షాకాలంలో తిరిగి చిగురిస్తాయి. మన రాష్ట్రంలో ఈ అడవులు మాత్రమే ఉన్నవి.
3) హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే ప్రాంతంలో దేవదారు వంటి వృక్షాలు పెరుగుతాయి. 3) ఈ అడవులు మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 9.
పేజీ నెం. 59లో ఉన్న చిత్రాలను పరిశీలించి ఒక వ్యాఖ్య రాయండి. (AS2)
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 3
జవాబు:
అడవులలో జంతువులతో కలిసి జీవించిన మానవుడు వ్యవసాయానికై మైదాన ప్రాంతానికి వచ్చాడు. అయితే మానవ సంతతి (జనాభా) విపరీతంగా పెరగటంతో తన పూర్వపు నివాసాలైన అడవులను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టి, జంతువులు నివసించేందుకు చోటులేకుండా చేశాడు. జీవ వైవిధ్యానికి తావులేకుండా చేసి తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు. ఆ

ప్రశ్న 10.
అటవీ హక్కుల చట్టం 2006 సారాంశాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. అటవీ హక్కుల చట్టం 2006లోని మార్పులకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. పోరాడుతూ వచ్చారు.
  2. వీళ్ల తరఫున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజనుల హక్కుల కోసం జాతీయస్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి.
  3. సుదీర్ఘ చర్చల తరవాత 2006లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టాన్ని చేసింది.
  4. గిరిజనులకు చెందిన అడవులలో వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న హక్కులను తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారి అంగీకరించారు.
  5. గిరిజనుల హక్కులు పునరుద్ధరించకుండా అడవులను సంరక్షించటం అసాధ్యమని కూడా గుర్తించారు.
  6. ఈ కొత్త చట్టం చేయటానికి మూడు ప్రధాన కారణాలను అది పేర్కొంది. అవి :
    i) మొదటిది, అడవులను సంరక్షించటమే కాకుండా అదే సమయంలో అటవీ వాసులకు జీవనోపాధినీ, ఆహార భద్రతను కల్పించాల్సి ఉండడం.
    ii) రెండవది, అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను వలసపాలనలో, స్వతంత్రం వచ్చిన తరవాత కూడా గుర్తించకపోవటం వల్ల జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేయాల్సి ఉండడం.
    iii) మూడవది, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల (ఆనకట్టలు, పులుల అభయారణ్యాలు వంటివి) నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు, అడవిలోకి వెళ్ళే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించాల్సి ఉండటం.
  7. ఈ చట్టం వల్ల అటవీ వాసులకు, సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్లకు అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి, సాగుచేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి.
  8. ఈ చట్టాన్ని సరిగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు.

8th Class Social Studies 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.49

ప్రశ్న 1.
గత తరగతులలో వారు అదవుల గురించి, అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి చదివారు. అవి గుర్తు తెచ్చుకుని అటవీ ప్రజల గురించి మాట్లాడండి.
జవాబు:
“అందరికీ నమస్కారం. అడవులు భూమి మీద జీవానికి ప్రాణ ప్రదాతలు. ఎక్కడైనా అడవులు ఆ దేశ విస్తీర్ణంలో 33% ఆక్రమించి ఉండాలి. కాని భారతదేశంలో కేవలం 24% మాత్రమే ఆవరించి ఉన్నాయి. ఈ సంఖ్యలు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాయో సూచిస్తున్నాయి. అడవి బిడ్డలైన గిరిజనులలో దాదాపు 60% పైన అడవులలోనే నివసిస్తున్నారు. వారి జీవన విధానం ప్రకృతి ననుసరించి సాగుతుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, మతపరమైన కార్యక్రమాలు, సమూహాలు, వ్యవసాయం ఒకటి కాదు, అన్నీ వారిని మిగతా ప్రపంచీకులతో భిన్నంగా నిలబెడతాయి. వారి మనుగడ సవ్యంగా సాగితేనే, ప్రపంచం సవ్యంగా నడుస్తుంది. కాబట్టి అడవుల అభివృద్ధికి అందరూ సహకరించండి. కృతజ్ఞతలు, నమస్తే”.

ప్రశ్న 2.
తరగతిలో ప్రతి ఒక్కరూ అడవి చిత్రం గీసి, వాటిని పోల్చండి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 5
జవాబు:
అన్ని చిత్రాలను పోల్చండి :
కొన్ని చిత్రాలలో అడవులు దట్టంగాను, క్రింద నేల కూడా కనబడకుండా తీగలు అల్లుకుని పోయి ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులలో చెట్లు దూరం దూరంగా మధ్యలో ఖాళీ నేల కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చిత్రాలలో అడవులు అక్కడక్కడా చెట్లు మధ్యలో మైదానాలు లాగా ఉన్నాయి.

ప్రశ్న 3.
మీలో కొంతమందికి దగ్గరలోని అడవి తెలిసే ఉంటుంది – అక్కడి చెట్లు, మొక్కలు, జంతువులు, రాళ్లు, వంకలు, పక్షులు, పురుగులు చూసి ఉంటారు. ఇవి తెలిసిన వాళ్లని వాటి గురించి వివరించమనండి, అక్కడ ఏం చేస్తారో చెప్పమనండి.
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి. మా ఊరే ఒక అడవి. మా ఊరు ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఇక్కడ వెదురు, రావి, వేప, ఉసిరి, టేకు, సాలు మొ॥న వృక్షాలు అధికంగా ఉన్నాయి. కాఫీ, రబ్బరు మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కౄర మృగాలు కూడా ఉన్నాయని మా పెద్దలు చెబుతారు. ఇక్కడ రకరకాల పిట్టలు, రంగు రంగుల పురుగులు మాకు కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతాన్ని చూడటానికి అనేక మంది ఇక్కడకు వస్తారు. ఆనందంగా చూసి వెళతారు. మేము ఇక్కడ దొరికే దుంపలు, పళ్ళు, తేనె తింటాము. వాటిని తీసుకుని వెళ్ళి పట్నాలలో అమ్మి డబ్బు సంపాదిస్తాము. ఎలుగుబంటి వెంట్రుకలు, మూలికలు కూడా అమ్మి మాకు కావలసిన సొమ్ములను సంపాదించుకుంటాము.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 4.
కట్టెపుల్లలు, ఆకులు, పళ్లు లేదా దుంపలు సేకరించటానికి మీరు ఎప్పుడైనా అడవికి వెళ్లారా? దాని గురించి తరగతిలో వివరించండి. మీ ప్రాంతంలో అడవినుంచి ప్రజలు సేకరించే వస్తువుల జాబితా తయారు చేయండి. అలా సేకరించిన వాటిని ఏమి చేస్తారు?
జవాబు:
మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, శృంగవృక్షం గ్రామం. మా నాన్నగారు రామచంద్రరావుగారు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఒకసారి మా యింట్లో చండీ హోమం తలపెట్టారు. దానికి కావలసిన సమిధలు సేకరించడానికి నేను, మా స్నేహితులు కలిసి మా దగ్గరలోని అడవికి వెళ్ళాము. రావి, మారేడు, నేరేడు సమిధల్ని సేకరించాము. అడవిలోపలికి వెళ్ళాలంటే చాలా భయం వేసింది. మా ప్రాంతం వారు తేనె, మూలికలు, అనేక రకాల బెరళ్ళు, ఉసిరి, జిగురు, కుంకుళ్ళు, చింతపండు మొదలైనవి సేకరిస్తారు. అవి వారి అవసరాలకు ఉంచుకుని మిగతావి చుట్టు ప్రక్కల వారికి అమ్ముతారు.

ప్రశ్న 5.
మన జానపద కథలు, పురాణాలు పలుమార్లు అడవులను పేర్కొంటాయి. అటువంటి కథ ఏదైనా తరగతిలో చెప్పండి.
జవాబు:
మన పురాణాలలో ప్రఖ్యాతి గాంచినవి రామాయణ, మహాభారతాలు. ఈ రెండూ వనవాసాల్ని గురించి చెబుతున్నాయి. ఇది రామాయణానికి సంబంధించినది. రామునికి పట్టాభిషేకం ప్రకటించగానే, ఆయనకి మారుటి తల్లి అయినటువంటి ‘కైక’, 14 ఏళ్ళు అరణ్యవాసం శిక్ష ఆయనకి వేస్తుంది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా వనవాసానికి వెళతారు. ఆ అడవి మధ్య భారతదేశంలో చత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించి ఉన్నటువంటి అడవి. దండనకు ఉపయోగపడింది కాబట్టి దీనిని దండకారణ్యమని కూడా అన్నారు. అయితే ఈ అరణ్యవాసమే లోకకళ్యాణానికి దారి తీసింది. రావణుడు సీత నెత్తుకుపోవడం, రాముడు రావణున్ని చంపడం ఇవన్నీ ఈ అరణ్యవాసం మూలంగానే జరిగాయి.

ప్రశ్న 6.
అనేక అడవులను ప్రజలు పవిత్రంగా భావించి పూజిస్తారు. దేవుళ్లు, దేవతలు నివసించే ప్రాంతాలుగా కొన్ని అడవులు ప్రఖ్యాతిగాంచాయి. వాటి గురించి తెలుసుకుని తరగతి గదిలో చెప్పండి.
జవాబు:
వాపరయుగం తరువాత కలియుగం ప్రారంభం అయ్యే సమయంలో మునులు, ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థించారట – కలియుగంలో ‘కలి’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేము తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశాన్ని చూపించండని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పవిత్ర చక్రాన్ని తీసుకుని భూలోకం మీదకు విసిరాడట. అది ఉత్తరాన గోమతీ నదీ తీరంలో పాంచాల, కోసల (ప్రస్తుతం సీతాపూర్, U.P) ప్రాంతాల మధ్యలో పడిందట. ఆ ప్రాంతంలో వారిని తపస్సు చేసుకోమని బ్రహ్మ చెప్పాడట. అదే నేటి నైమిశారణ్యం చాలా పవిత్ర భూమి. భారతదేశంలో సూతుడు, శౌనకాది మహామునులకు చెప్పిన పురాణాలన్నీ ఇక్కడ చెప్పబడినవే. ఇది ఋషుల యజ్ఞయాగాదులతోనూ, తపోబలంతోను శక్తివంతమైన అడవి. మనం కూడా ఒకసారి చూసి వద్దాం రండి.

8th Class Social Textbook Page No.50

ప్రశ్న 7.
అడవి అంటే ఏమిటి? అడవిని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. అడవికి నిర్వచనం రాయండి. వీటిని తరగతిలో చర్చించి అధిక శాతం విద్యార్థులకు సరైనవిగా అనిపించే అంశాలను రాయండి.
జవాబు:
చెట్లతో ఉన్న విశాలమైన భూ భాగాన్ని అడవి అని అంటారు.

నిర్వచనం :

  1. ఒక స్థలం యొక్క పరిసరాలు అన్ని వైపులా చెట్లతో ఆవరించబడి ఉంటే దానిని అడవి అంటారు.
  2. పర్యావరణాన్ని అనేక రకాల చెట్లతో ప్రభావితం చేసే ప్రాంతంను అడవి అంటారు.

విద్యార్థులకు సరియైనవిగా అనిపించే అంశాలు :

  1. స్థలం : చాలా పెద్దదై ఉండాలి.
  2. చెట్లు : అంత పెద్ద స్థలం ఒకే రకమైనగాని, అనేక రకాలయిన చెట్లతో ఆవరించబడియుండాలి.
  3. పర్యావరణాన్ని ప్రభావితం చేయటం : అడవుల వలన పర్యావరణం నిజంగానే ప్రభావితం అవుతుంది.

ప్రశ్న 8.
అడవి నేపథ్యంలో క్రింది చిత్రానికి ఒక వ్యాఖ్యానం రాయంది.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 6
వ్యాఖ్యానం:
“ముందు అడుగేస్తే నుయ్యి,
వెనుకడుగేస్తే గొయ్యి.”
“హద్దు మీరిన వినియోగం,
శూన్యమవును భవితవ్యం”

8th Class Social Textbook Page No.51

ప్రశ్న 9.
అడవులు ఉండటం ముఖ్యమా ? అడవులన్నింటినీ నరికివేసి వ్యవసాయానికి, గనుల తవ్వకానికి, కర్మాగారాల నిర్మాణానికి, మనుషుల నివాసానికి ఉపయోగిస్తే ఏమవుతుంది ? అడవులు లేకుండా మనం జీవించలేమా ? మీ తరగతిలో చర్చించండి.
జవాబు:
మానవులు, వృక్షాలు పరస్పర ఆధారితాలు. అడవులు లేకుండా మనుషులు జీవించలేరు. మనం వదిలిన CO2 వృక్షాలు, వృక్షాలు వదిలిన O2 మనము పీల్చుకుని జీవిస్తున్నాము. భూమి మీద 1/3వ వంతు వృక్షాలు, లేదా అడవులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమౌతుంది లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మన జీవనానికి అవరోధం ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
ఈ ఊరికి, పట్టణానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం ఏది ? ఈ ప్రాంతం వ్యవసాయ భూమిగా, గనులుగా, నివాస , ప్రాంతంగా మారకుండా ఇంకా చెట్లతో ఎందుకు ఉందో తెలుసుకోండి?
జవాబు:
మాది మారేడుమిల్లి గ్రామం. ఇది కొండపైన ఉన్నది. తూ.గో జిల్లాలోనిది. రంపచోడవరం అడవి ప్రాంతం కూడా మాకు చాలా దగ్గర. ఇవి రెండూ అటవీ ప్రాంతాలే. ఇది బ్రిటిషువారి హయాంలో కూడా స్వతంత్రంగానే నిలిచింది. గిరిజనుల హయాంలోనే చాలా వరకూ ఉంది. ఈ ప్రాంతంలో ఎటువంటి ఖనిజాలు బయల్పడలేదు. త్రవ్వకాలు జరుపబడలేదు. దీని భౌగోళిక పరిస్థితి, చారిత్రక అంశాల రీత్యా ఇది చెట్లతో నిండి అడవిగానే మిగిలిపోయింది.

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 11.
సముద్ర తీరంలోని ప్రత్యేక పరిస్థితులను మడ చెట్లు ఎలా మలుచుకున్నాయో కనుక్కోండి.
జవాబు:
మడ అడవులు సముద్రతీర ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఉప్పునీటికి, సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి. సముద్ర అలలు ఈ ప్రాంతాలను రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తరువాత వెనక్కి తగ్గుతాయి. అంటే కొన్ని గం||ల పాటు ఉప్పునీటితోనూ, కొన్ని గంటల పాటు నీళ్ళు లేకుండానూ ఉంటుంది. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో బతకటానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేక అంశాలను అలవరుచుకున్నాయి. ఇవి కొమ్మల నుండి గొట్టాలవంటి అమరిక కలిగిన వేర్లవంటి వాటిని కలిగి ఉండి అవి నేలలో పాతుకొనిపోయి ఉంటాయి. వీటి ద్వారా ఇవి నీటిని, వాటికి కావలసిన గాలిని పీల్చుకుంటాయి. అలలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఉప్పును వేర్ల దగ్గరే అడ్డగిస్తాయి. వీటి ఆకులలో ఉప్పును విసర్జించే గ్రంథులు ఉన్నాయి.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 12.
నైజీరియాలోని భూమధ్యరేఖా ప్రాంత అడవుల గురించి చదివింది గుర్తుండి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని అడవులకూ, భూమధ్యరేఖా ప్రాంతపు అడవులకు ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:

భూమధ్యరేఖా ప్రాంతపు అడవులు ఆంధ్రప్రదేశ్ అడవులు
1) ఇవి భూమధ్యరేఖకు యిరువైపులా వ్యాపించి, ఉన్నాయి. 1) ఇవి భూమధ్యరేఖకి ఉత్తరాన మాత్రమే ఉన్నాయి.
2) ఇవి చాలా దట్టమైనవి. 2) ఇవి కొన్ని దట్టమైనవి, కొన్ని చాలా పలుచనివి.
3) ఇవి తడి, చిత్తడి నేలలో ఉంటాయి. 3) ఇవి ఎక్కువ కాలం పొడిగా ఉండే నేలలో ఉంటాయి.
4) అనేక రకాల వృక్షాలు పెరుగుతాయి. 4) చాలా తక్కువ రకాల వృక్షాలు ఉంటాయి.
5) ఇవి రవాణా సౌకర్యాలకు అనువుగా ఉండవు. 5) వీటిలో చాలా వరకు ప్రయాణం చేయడానికి, రవాణా సౌకర్యాలకు అనువుగా ఉంటాయి.

ప్రశ్న 13.
“మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వంద చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతు ఉంది” …… ఈ పరిస్థితి సరైనదేనా? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఈ పరిస్థితి సరియైనది కాదు. దీనివలన మన రాష్ట్రంలో జీవ వైవిధ్యం అడుగంటిపోతుంది. వర్షాలు తగ్గిపోతాయి. ఉపరితల సారం కొట్టుకుపోతుంది. యింకా అనేక కారణాల వలన యిది విషమ పరిస్థితి అని చెప్పవచ్చును.

8th Class Social Textbook Page No.56

ప్రశ్న 14.
a) అడవులను ప్రజలు ఉపయోగించుకుంటూ, వాటిని సంరక్షించడం సాధ్యమేనా?
b) చెట్లను కొట్టి, మార్కెట్టులో అమ్మి డబ్బు చేసుకోవచ్చని ఎవరైనా ఆశపెట్టి ఉంటే వాళ్ళు ఏమి చేసి ఉండేవాళ్ళు?
జవాబు:
a) సాధ్యమే. మన ప్రస్తుత సమాజంలో తోటలున్నవారు వాటి కాయలను, పళ్ళను అమ్ముకుని సంరక్షించుకున్నట్లే వీటిని సంరక్షించవచ్చు.

b) వారు కచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తారు. వారు వారి అవసరాలకి కొమ్మో, రెమ్మో నరుకుతారేమో కాని ఎవరెంత ఆశచూపినా చెట్లు మాత్రం నరికి ఉండే వారు కాదు. ఎందుకంటే అడవి వారికి ఇల్లు వంటిది. ఉన్న యింటినే ఎవరూ కూలదోసుకోరు కదా !

8th Class Social Textbook Page No.57

ప్రశ్న 15.
నీలగిరి చెట్లు, తేయాకు తోటలకూ, అడవికీ మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
అడవిలో ఉండే చెట్లు చాలా పొడవుగా ఉండి, పై భాగంలో దాని పొడవు ఎంత ఉందో దాదాపు అంత చుట్టుకొలతతో గుబురుగా కొమ్మలు, రెమ్మలు ఉండాలి. నీలగిరి చెట్లు పొడవుగానే ఉంటాయి కానీ, పై భాగంలో గుబురుగా ఉండవు. తేయాకు తోటల్లో మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి కాని వాటిని ఎత్తు పెరగనివ్వరు. 3, 4 అడుగుల ఎత్తు పెరిగిన ‘వెంటనే కత్తిరిస్తారు. అంత కంటే ఎత్తు పెరిగితే అవి ఆకులు కోయటానికి అందక, పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఈ మూడింటికీ మధ్య ఈ తేడాలు ఉన్నాయి.
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 4

8th Class Social Textbook Page No.58

ప్రశ్న 16.
అడవిని గిరిజనులు రక్షించడానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అడవి గిరిజనులకు అమ్మ వంటిది. వారి జననం, జీవితం, మరణం అన్నీ ఆ అడవి తల్లి ఒడిలోనే. వారికి, అడవికి మధ్య తేడాను వారు భావించరు. కాబట్టి అడవికి వారు ఎటువంటి ముప్పు వాటిల్లనివ్వరు. చివరికి వారు చేసే వ్యవసాయంలో కూడా నేలను ఎక్కువ దున్నితే, నేల వదులయి మట్టి కొట్టుకు పోతుందని, అక్కడక్కడ గుంటలు చేసి దాంట్లో విత్తనాలు వేస్తారు.

అటవీ అధికారులు ఉద్యోగరీత్యా ఏవో ప్రాంతాల నుండి అక్కడకు వస్తారు. వారికి ఆ ప్రాంతంపై అభిమానం కాని, ప్రాణాలొడి దానిని రక్షించాలనే భావం కాని సాధారణంగా ఉండవు. వీరికి గిరిజనులపై విశ్వాసం కూడా ఉండదు. ఇవే అడవిని గిరిజనులు రక్షించటానికీ, అటవీ అధికారులు రక్షించడానికీ మధ్య తేడాలు.

ప్రశ్న 17.
ఏ పద్ధతి అనుసరించి ఉంటే బాగుండేదో తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వం గిరిజన ప్రజలను తమ సాంప్రదాయ పద్ధతిలో జీవించనిచ్చి ఉంటే బాగుండి ఉండేదని మేము భావిస్తున్నాము. వారిని అడవుల నుండి వేరుచేసి అడవులకు, వారికి కూడా ద్రోహం చేసినట్లయింది. అంతేగాక వలస పాలకుల పాలనను అనుసరించినట్లయింది అని మేము భావిస్తున్నాము.

ప్రశ్న 18.
గత 200 సంవత్సరాలలో అడవులు తగ్గిపోతూ ఉండటానికి కారణాల జాబితా తయారు చేయండి. దీనికి పోడు వ్యవసాయం కూడా ఒక కారణమా ? మీ వాదనలు పేర్కొనండి.
జవాబు:
అడవులు తగ్గిపోవడానికి కారణాలు :

  1. వ్యవసాయం పెరుగుదల
  2. పశువులను మేపటం
  3. పెద్ద పెద్ద ప్రాజెక్టులు
  4. వంట చెరుకు, గృహవినియోగం కోసం ఎక్కువ ఉపయోగించడం
  5. పేపరు తయారీ
  6. గనుల త్రవ్వకం
  7. నూనె, గ్యాసు వెలికితీత
  8. కార్చిచ్చులు మొ||నవి.

దీనిలో పోడు వ్యవసాయం కూడా కొంత కారణమని చెప్పవచ్చు. పూర్వం గిరిజనులు అడవిపై ఆధారపడి జీవనం సాగించేవారు. వీరు కూడా ఎక్కువ శాతం ‘పోడు’ మీద ఆధారపడేసరికి అడవులు వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. వీటిలో మళ్ళీ చెట్లు పెరగాలంటే దానికి చాలా ఏళ్ళు పడుతుంది.

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ

ప్రశ్న 19.
ప్రభుత్వం విధించిన భూమి శిస్తును గిరిజనులు కట్టలేకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
బ్రిటిషు వారు ఒక్క కలంపోటుతో గిరిజనుల హక్కులను నేలరాసి, ఈ భూమిని వ్యవసాయానికి, జమిందార్లకు, రైతులకు ఇచ్చి ఆదాయాన్ని పొందాలనుకున్నారు. ఏ హక్కులు లేని గిరిజనులు కూలీలైనారు. గిరిజనులు పొందిన భూములకు శిస్తులు చెల్లించాల్సి వచ్చేది. ఇవి కట్టడానికి వారి దగ్గర సొమ్ములుండవు. కారణం గిరిజనులు వారి రోజు వారీ గ్రాసాన్నీ చూసుకునే వారు తప్ప దాచుకోవడం, మదుపు చేయడం లాంటి అవకాశాలు, అవసరాలు వారికుండేవి కావు – కాబట్టి వారు ఈ శిస్తులను చెల్లించలేకపోయేవారు.

8th Class Social Textbook Page No.60

ప్రశ్న 20.
గత 200 సంవత్సరాలుగా గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఈ చట్టం ఎంతవరకు తీరుస్తుంది?
జవాబు:
చట్టం చేయటం వలన మాత్రమే గిరిజనులకు జరిగిన అన్యాయం తీరదు. దానిని సరిగా అమలు జరిగేలా పరిస్థితులు ఉంటేనే మనం మార్పును చూడగలం.

ప్రశ్న 21.
సి.ఎఫ్. ఎమ్, ఇతర సామాజిక అటవీ పథకాలకు సంబంధించి మీ పెద్ద వాళ్ళ అనుభవాలను తెలుసుకోండి.
జవాబు:
అటవీ విధానాలను బ్రిటిషు వారి కాలంలోనే ప్రవేశపెట్టారు. 1882లో మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు అటవీ చట్టాన్ని ప్రవేశపెట్టి దాని తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టంగా మార్చారు. 1915లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1956, 1967, 1970, 1971లలో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాలను తయారుచేస్తారు. చివరికి భారతదేశం 1990లో ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రకటించింది. 1993లో ఆంధ్రప్రదేశ్ అటవీ విధానాన్ని ప్రకటిస్తూ దానినే సి.ఎఫ్.ఎమ్ గా పేరు మార్చింది. అయితే 1990 తర్వాత వచ్చినవన్నీ ప్రభుత్వం, గిరిజనులు ఇద్దరూ అడవులను పరిరక్షించవలసినదిగా చెప్పాయి. వీటన్నిటి లోటుపాట్లను సవరిస్తూ, 2006లో చేసిన అటవీ చట్టం గిరిజనులకు పూర్వపు హక్కులను పునరుద్ధరింపచేసింది. హక్కులు, చట్టాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నపుడే విజయవంతం అవుతాయి. లేకుంటే పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్నట్లు ఉంటుంది. ఇంతేగాక 1976లో సామాజిక అడవుల పెంపకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడవుల పైనున్న ఒత్తిడిని తగ్గించి అన్ని రకాల ఖాళీ నేలలలో చెట్లను పెంచడమే దీని ముఖ్యోద్దేశం.

8th Class Social Textbook Page No.61

ప్రశ్న 22.
ఈ విషయాన్ని తరగతిలో చర్చించండి – గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇదే సరియైన మార్గమా? అడవులను కాపాడటంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి ఏ యితర చర్యలు చేపట్టాలి
జవాబు:
గిరిజన ప్రజలకు జరిగిన అన్యాయాలను సరిచేయడానికి ఇది సరియైన మార్గమని నేను విశ్వసిస్తున్నాను. అడవిలో పుట్టి పెరిగిన వారే అడవిని రక్షించగలరు. అయితే వాటిని గిరిజనులు వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాల్సిన అవసరం ఉంది. వారికి కావలసిన కనీస అవసరాలకు కొంత ప్రభుత్వం మార్గం చూపించగలిగితే వారు ఎటువంటి వ్యతిరేక చర్యలకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది.

పట నైపుణ్యాలు

ప్రశ్న 23.
మీకీయబడిన భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:

  1. హిమాలయా ఆల్ఫైన్ అడవులు
  2. కేరళ అడవులు
  3. శ్రీకాకుళం
  4. పశ్చిమ కనుమలలోని అనైముడిలోని అడవులు
  5. దండకారణ్యం

AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 7

8th Class Social Textbook Page No.54

ప్రశ్న 24.
ఆంధ్రప్రదేశ్ లో అడవులను చూపించే పటం చూడండి. మీ జిల్లాలో అడవులు ఉన్నాయా ? ఉంటే, అవి ఎటువంటి అడవులు?
AP Board 8th Class Social Solutions Chapter 5 అడవులు - వినియోగం, సంరక్షణ 9
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ. మాకు 20 కి||మీల దూరంలో ‘కోరింగ సాంక్చువరీ’ ఉన్నది. దాని దగ్గర మడ అడవులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు వెనుకజలాలున్నాయి. ఈ ప్రాంతంలోనే ఈ మడ అడవులు ఉన్నాయి.