SCERT AP 8th Class Social Study Material Pdf 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 4th Lesson ధృవ ప్రాంతాలు
8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
తప్పుగా ఉన్న వాక్యాలను సరైన వాస్తవాలతో తిరిగి రాయండి. (AS1)
అ. జంతువుల శరీర భాగాలను కేవలం బట్టలకే ఉపయోగించేవారు.
జవాబు:
జంతువుల శరీర భాగాలను ఆహారానికి, ఇళ్ళ నిర్మాణానికి, బట్టలకి, ఆయుధాల తయారీకి ఉపయోగించేవారు.
ఆ. ఆహారంలో ప్రధాన భాగం కూరగాయలు.
జవాబు:
ఆహారంలో ప్రధాన భాగం జంతు మాంసము, చేపలు.
ఇ. టండ్రా ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం ఉంది.
జవాబు:
సరియైన వాక్యం
ఈ. బయటి వాళ్లతో సంబంధాలు వాళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది.
జవాబు:
సరియైన వాక్యం
ప్రశ్న 2.
ఏడవ తరగతిలో మీరు భూమధ్యరేఖా ప్రాంతం గురించి చదివిన దాన్ని బట్టి ధృవ ప్రాంతంలో తేడాలు ఏమిటో చెప్పండి. (AS1)
జవాబు:
భూమధ్యరేఖా ప్రాంతం | ధృవ ప్రాంతం |
1. ఇది 07 నుండి 23½ ఉత్తర, దక్షిణ అక్షాంశముల మధ్య వ్యాపించి ఉంది. | 1. ఇది 66½ ఉత్తర అక్షాంశం నుండి 90° ఉ|| అక్షాంశం వరకూ వ్యాపించి ఉన్నది. |
2. ఇక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. | 2. సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. |
3. వీరికి 3 కాలాలు ఉంటాయి. | 3. వీరికి 2 కాలాలు మాత్రమే ఉంటాయి. |
4. వీరికి రాత్రి, పగలు ఒక రోజులో ఏర్పడతాయి. | 4. వీరికి రాత్రి, పగలు 6 నెలల కొకసారి ఏర్పడతాయి. |
5. వీరిది సంచార జీవనం. | 5. వీరిది స్థిర జీవనం. |
6. వీరికి బయటి ప్రపంచంతో సహచర్యం ఎక్కువ. | 6. వీరికి బయట ప్రపంచంతో సహచర్యం తక్కువ. |
ప్రశ్న 3.
టండ్రా ప్రాంత ప్రజల జీవితం అక్కడి వాతావరణం మీద ఎలా ఆధారపడి ఉంది? దిగువ అంశాలలో దీనిని వివరించండి. (AS1)
జవాబు:
ప్రశ్న 4.
మీరు నివసిస్తున్న ప్రాంతానికీ, ఈ పాఠంలో మీరు చదివిన ప్రాంతానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోని శీర్షికల వారీగా తేడాలన్నింటినీ పేర్కొనండి. ఇప్పుడు మీ ప్రాంతంలోని, టండ్రా ప్రాంతంలోని వివరాలు, చిత్రాలతో ఒక గోడపత్రిక తయారు చేయండి. (AS6)
జవాబు:
గోడ పత్రిక (భూమధ్యరేఖా వాసులతో ధృవ వాసులు)
నేను నివసిస్తున్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? | పాఠంలో చదివిన ప్రాంతం |
1. ఈ ప్రాంతం భూమధ్యరేఖకి, కర్కట రేఖకి మధ్యలో ఉన్నది. | 1. ఈ ప్రాంతం ఆర్కిటిక్ వలయానికి, ఉత్తర ధృవానికి మధ్యలో ఉన్నది. |
కాలాలు : 2. ఇక్కడ ప్రతిరోజూ రాత్రి, పగలు వస్తాయి. ఇక్కడ వేసవి, వర్ష, శీతాకాలాలు ఉన్నాయి. | 2. ఇక్కడరాత్రి, పగలు 6 నెలల కొకసారి వస్తాయి. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం మాత్రమే ఉన్నాయి. |
వేసవి : 3. ఇక్కడ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. | 3. ఇక్కడ వేసవిలో కూడా అల్ప ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయి. |
ప్రజలు : 4. ఇక్కడి ప్రజలు స్థిర నివాసాన్ని కలిగి, జీవితాన్ని గడుపుతారు. | 4. వీరు సంచార జీవితాన్ని, అభద్రతతో కూడిన నమ్మకమైన జీవితాన్ని గడుపుతారు. |
సామూహిక జీవనం : 5. ఇక్కడి ప్రజలు కుటుంబపరమైన జీవితాన్ని గడుపుతారు. | 5. వీరు సామూహిక జీవితాన్ని గడుపుతారు. |
వేట, చేపలు పట్టడం, ఆహారం : 6. ఈ ప్రాంతం వారు పండించిన ధాన్యం, కూరగాయలు ఉండటం అరుదు. అనేక వృత్తులు చేస్తారు. | 6. వీరు వేటాడిన మాంసాన్ని, చేపలను తింటారు. కూరగాయలు, మాంసం, చేపలు తింటారు. ఆహారధాన్యాలు, ఆహార సేకరణే వారి వృత్తి. |
ఆవాసం : 7. వీరు రకరకాల ఇళ్ళు, భవంతులు, గుడిసెలు, డేరాలలో నివసిస్తారు. | 7. వీరు గుడారాలు, మంచు యిళ్ళు మొ||న వాటిలో నివసిస్తారు. |
మతపరమైన నమ్మకాలు : 8. మతపరమైన విశ్వాసాలు, ఆత్మల పట్ల నమ్మకాల కలిగి ఉంటారు. పూజా విధానాలు కలిగి ఉన్నారు. అనేక రకాల మతాలు ఉన్నాయి. | 8. మతం, ఆత్మలు, అతీత శక్తులు, ఆచారాలు వుంటాయి. సంబరాలు నిర్వహిస్తారు. |
వినోదం : 9. ఆటలు, పాటలు, నృత్యాలు, విందులు, సినిమాలు ఎన్నో రకాలు. | 9. నైపుణ్యానికి సంబంధించిన పోటీలు, ఆటలు, ఇతర ఆచారపరమైన ఆటలు ఉంటాయి. విందులు కూడా ఉంటాయి. |
బయటి ప్రపంచంతో సంబంధాలు : 10. వీరికి ప్రపంచమంతా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. | 10. వీరికి ఎవరైనా తమ దగ్గరికి వస్తేనే వారితో సంబంధ బాంధవ్యాలుంటాయి. |
బట్టలు, కళలు: 11. వీరు అధునాతనమైన వస్త్రాలను, తేలికైన వస్త్రాలను ధరిస్తారు. | 11. వీరు మందపాటివి, ఊలువి ధరిస్తారు. జంతు చర్మాలను కూడా ధరిస్తారు. |
వృక్షజాలం : 12. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అడవులు కూడా ఉన్నాయి. | 12. ఇక్కడ గడ్డి, పొదలు మాత్రమే ఉన్నాయి. |
ప్రశ్న 5.
ఒక రోజు అంతా సూర్యుడు ఉండడనీ, మరొక రోజంతా సూర్యుడు అస్తమించడనీ ఊహించుకోండి. మీ రోజువారీ జీవితంలో ఎటువంటి మార్పులు చేస్తారు? వాటి గురించి క్లుప్తంగా రాయండి. (AS4)
జవాబు:
ఒక రోజంతా సూర్యుడు ఉండకపోతే తెల్లవారటం, చీకటిపడటం అనేది లేకుండా పోతుంది. తెల్లవారే సమయానికి అలవాటు ప్రకారం నిద్రలేచి ఇల్లంతా దీపాలు వేసి వెలుతురు చూసి పనులు చేసుకుంటాను. మా ప్రాంతమంతా యిదే విధంగా చేసి యధావిధిగా పనులు చేసుకుంటాము. పాఠశాలకు వెళ్ళి వస్తాను. చదువుకుని నిద్రపోతాను. సూర్యుడు అస్తమించనపుడు రాత్రి సమయానికి తలుపులు, కిటికీలు మూసివేసి యిల్లు చీకటి చేసుకుని నిద్రపోతాను.
ప్రశ్న 6.
మీ వద్ద గల అట్లాస్ సహాయంతో ఎస్కిమోకు చెందిన ఏవైనా ఐదు ప్రాంతాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
8th Class Social Studies 4th Lesson ధృవ ప్రాంతాలు InText Questions and Answers
8th Class Social Textbook Page No.40
ప్రశ్న 1.
ఈ ప్రాంతంలో ఏ ఏ ఖండాల భాగాలు ఉన్నాయి?
జవాబు:
ఈ ప్రాంతంలో ఉత్తర అమెరికా, ఐరోపా, రష్యాలలోని భాగాలు ఉన్నాయి.
ప్రశ్న 2.
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఏమవుతుందో గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
భూమధ్యరేఖ నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
8th Class Social Textbook Page No.42
ప్రశ్న 3.
టండ్రాలోని వేసవి గురించి అయిదు విషయాలు చెప్పండి.
జవాబు:
- టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు.
- మొదట్లో కొద్ది సేపటికే అస్తమిస్తాడు.
- మే నుండి జులై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అస్తమించడు.
- సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడు. క్షితిజానికి కొంచెం పైన మాత్రమే ఉంటాడు. కావున ఎక్కువ వేడి ఉండదు.
- వేసవి కాలంలో కూడా చలిగానే ఉన్నప్పటికీ, మంచు కరుగుతుంది. నదులు ప్రవహిస్తాయి. చెరువులు నీటితో నిండుతాయి.
- వేసవిలో యిక్కడి నిర్జన ప్రాంతాలలో రంగులు అలుముకుని సజీవంగా మారుతుంది.
ప్రశ్న 4.
ఖాళీలను పూరించండి :
• సూర్యుడు ………………, నెలల్లో కనిపించడు.
• ఈ సమయంలో …………….. నీరు …………….. చెట్లు …………….
జవాబు:
• ఆగస్టు నుండి ఫిబ్రవరి;
• టండ్రాలలో, గడ్డకట్టి, మంచుతో కప్పబడి ఉంటాయి.
ప్రశ్న 5.
టంద్రా ప్రాంతంలోని ప్రజలకు చలికాలంలో కాంతి ఎలా లభిస్తుంది?
జవాబు:
ధృవ ప్రాంతంలో చలికాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉండవు. అక్కడ ఉన్న మంచుపై నక్షత్రాల కాంతి ప్రతిఫలించి అనేక రంగులు కనిపిస్తాయి. ఇవి ధృవాల వద్ద చక్కని వెలుగునిస్తాయి. వీటిని ‘ధృవపు కాంతులు’ అని అంటారు. ఈ విధంగాను, నూనె, కొవ్వు దీపాలతోనూ వీరికి చలికాలంలో కాంతి లభిస్తుంది.
8th Class Social Textbook Page No.43
ప్రశ్న 6.
టండ్రా ప్రాంతంలో. అన్ని కాలాలలో మనుషులు నివసించకపోవటానికి కారణం ఏమిటి?
జవాబు:
టండ్రాలలో కాలాలు లేవు. ఎల్లప్పుడూ ఒకే రకమయిన వాతావరణం నెలకొని ఉంటుంది. ఉన్న రెండు కాలాలలో కూడా వేసవి నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండవు. రుచికరమైన, రకరకాల ఆహార పదార్థాలు ఉండవు. చలికాలమంతా చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోతుంది. వేసవికాలం కూడా కొద్దిపాటి ఉష్ణోగ్రతలే ఉంటాయి. అందువలన ఇక్కడ అన్ని కాలాలలో మనుషులు నివసించలేరు.
8th Class Social Textbook Page No.46
ప్రశ్న 7.
వాళ్ల పరిసరాల్లో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఎలా ఉపయోగించుకుంటారు?
జవాబు:
- వీరు జంతు చర్మాలను, చెక్కను గుడారాలు వేయడానికి ఉపయోగిస్తారు.
- దుంగలను, తిమింగలపు ప్రక్కటెముకలను ఉపయోగించి గుండ్రటి యిళ్ళు కడతారు.
- మంచును దట్టించి, ఇటుకలుగా తయారుచేసి వాటితో మంచు యిళ్ళను నిర్మిస్తారు.
ఈ విధంగా వారికి పరిసరాలలో దొరికే వనరులను ఇళ్లు కట్టుకోవటానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 8.
టండ్రా వృక్షజాలం అని వేటిని అంటారు?
జవాబు:
టండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది. కాబట్టి యిక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు ఉంటాయి. వీటిని ‘టండ్రా వృక్షజాలం’ అని అంటారు.
ప్రశ్న 9.
“ఎస్కిమో” అంటే ఏమిటి? వారి గురించి రాయండి.
జవాబు:
“ఎస్కిమో” అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం. ఎస్కిమోలు అని పిలువబడే వారిలో రెండు ప్రధాన బృందాలు ఉన్నాయి. అవి ఇన్యుయిట్, యుపిక్. వాళ్ళ భాషలో ఇన్యుయిట్ అంటే ‘అసలు ప్రజలు’ అని అర్థం. సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వారసులే ఎస్కిమోలు.
ప్రశ్న 10.
‘పర్మా ఫ్రాస్ట్’ అంటే ఏమిటి?
జవాబు:
చలి కారణంగా ధృవ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా శాశ్వతంగా ‘గడ్డ కట్టుకుని ఉంటుంది. దీనిని “పర్మా ఫ్రాస్ట్” అని అంటారు.
ప్రశ్న 11.
సమాన్లు అని ఎవరిని అంటారు?
జవాబు:
ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షమాన్లు అని అంటారు.
ప్రశ్న 12.
ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
ఎస్కిమోలు సంబరాలు, జనన-మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు, లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు.
ప్రశ్న 13.
వాళ్ళ ఇళ్ళ నిర్మాణాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తోంది?
జవాబు:
వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు. చెక్క చట్రాల మీద జంతు చర్మాలను కప్పి గుడారాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల దుంగలు, తిమింగలపు పక్కటెముకలతో గుండ్రటి యిళ్ళు కడతారు. నేలలో చిన్న గొయ్యి తవ్వి, దాని పైన గుండ్రటి కప్పు వేసి గడ్డి కట్టిన మట్టితో కప్పుతారు. కొన్నిచోట్ల రాతి పలకలతో యిళ్ళు కడతారు. కొంతమంది పొడిమంచును దట్టించి ఇటుకల మాదిరి చేసి గుండ్రటి పైకప్పు కడతారు. మంచు బల్లలు నిర్మించి వాటిని పడకకి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. వీరు మంచుతో కప్పబడిన నేలపై ఉండటం మూలంగా వీరు స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. కాబట్టి వీరి వాతావరణం వీరి ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చును.
8th Class Social Textbook Page No.48
ప్రశ్న 14.
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు మెరుగయ్యాయా, పాడయ్యాయా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
బయట వాళ్ళతో ఏర్పడిన సంబంధాల కారణంగా టండ్రా ప్రాంత వాసుల జీవితాలు వృద్ధికి, పతనానికి గురి అయ్యాయి అని చెప్పవచ్చు.
ఎస్కిమోలు, బయటివాళ్ల మధ్య సంబంధాన్ని ‘వృద్ధి, పతనం’ అంటారు. అలలు, అలలుగా బయటనుంచి వచ్చిన వాళ్ళ వల్ల కొంతకాలం పాటు సంపద, విద్య, ఉపాధి సమకూరాయి. ఆ తరవాత పేదరికం, ఎస్కిమోలు చెల్లాచెదురు కావడం వంటి విపత్తులు పరిణమించాయి. వృద్ధి దశలు : తిమింగిలాల వేట (1859 – 1910), జంతువుల వెంట్రుకల ఆధునిక వ్యాపారం (1925 – 1950), రక్షణకై సైనిక శిబిరాల నిర్మాణం (1950ల మధ్యకాలం), పట్టణాల నిర్మాణం (1960 ల మధ్యకాలం), చమురు అన్వేషణ, అభివృద్ధి (1970లు).
పైన పేర్కొన్న ఒకొక్కదాని వల్ల ఎస్కిమోలకు భిన్న సామాజిక, ఆర్థిక శక్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఎవరూ వెళ్లటానికి వీలులేకుండా ఉన్న ఉత్తర ప్రాంతాలు ఇప్పుడు విమానయానం, జాతీయ రహదారులు, శక్తిమంతమైన ఓడలు, సాటిలైట్ ప్రసారాల కారణంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా ఎస్కిమోల జీవన విధానంపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది.
ప్రశ్న 15.
ఈ పాఠంలోని చిత్రాలను చూడండి. ఎస్కిమోల బట్టలలో, వేటాడే విధానాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పురాతన కాలం వారు ముతకవి, బాగా బరువైనవి తక్కువ పదును పెట్టిన వస్త్రాలను ధరించారు. జంతువుల కొమ్ములతోనూ, బరిసెలతోను సూదిగా తయారు చేసిన వాటితోనూ, వేటాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలం వారు డిజైన్లు వేసిన దుస్తులను ధరించారు. టోపీలు కూడా అందంగా డిజైన్లు చేయబడ్డాయి. పాత ఆయుధాల స్థానంలోకి తుపాకీలు వచ్చాయని తెలుస్తోంది.
పట నైపుణ్యాలు
ప్రశ్న 16.
ఈ క్రింద నీయబడిన ప్రపంచపటంలో ధృవ ప్రాంతంలో ఏవేని 5 దేశాలను గుర్తించుము.
జవాబు:
ప్రశ్న 17.
గ్లోబు నమూనాను గీచి, ఆర్కిటిక్ వలయాన్ని, రెండు ధృవాలను, భూమధ్యరేఖను గీచి చూపించుము.
జవాబు: