SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:
- నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
- పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
- నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
- రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
- అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.
ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:
- ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
- పదార్థాలను క్షయం చేయదు.
- ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
- ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
- ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
- ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
- ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.
ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:
రీసైక్లింగ్ చేయగల పదార్థాలు | రీసైక్లింగ్ చేయలేని పదార్థాలు |
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లు | విద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు. |
ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.
ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే
- విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
- థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
- పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.
ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :
- ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
- టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
- టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
- టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.
బి) జీవ విచ్చిన్నం చెందడం :
- సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
- పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.
సి) రీసైక్లింగ్ :
- విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
- PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.
డి) వియోగం చెందడం :
- కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
- వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.
7. జతపరచండి. (AS1)
1) పాలిస్టర్ | ఎ) వంటసామాగ్రి |
2) PET | బి) కృత్రిమ పట్టు |
3) రేయాన్ | సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు |
4) నైలాన్ | డి) ఎలక్ట్రిక్ స్వి చు |
5) మెలమిన్ | ఇ) చిహ్నం |
6) పాలిథీన్ | ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి |
7) బేకలైట్ | జి) అన్ని దారాలకన్నా దృఢమైనది |
జవాబు:
1) పాలిస్టర్ | ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి |
2) PET | ఇ) చిహ్నం |
3) రేయాన్ | బి) కృత్రిమ పట్టు |
4) నైలాన్ | జి) అన్ని దారాలకన్నా దృఢమైనది |
5) మెలమిన్ | ఎ) వంటసామాగ్రి |
6) పాలిథీన్ | సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు |
7) బేకలైట్ | డి) ఎలక్ట్రిక్ స్వి చు |
8. ఖాళీలను పూరించండి. (AS1)
i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు
ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి
iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్
iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ
v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్
vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును
ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.
ఉదాహరణలు :
- (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
- HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
- (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.
ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:
కృత్రిమ దారం | కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు |
1. నైలాన్ | బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి. |
2. రేయాన్ | దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి. |
3. అక్రలిక్ | స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి. |
4. పాలిస్టర్ | దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి. |
ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:
థర్మో ప్లాస్టిక్లు | థర్మోసెట్టింగ్ ప్లాస్టికు |
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు. | 1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు. |
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి. మోనోమర్ల రేఖీయ అమరిక |
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి. మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక |
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది. | 3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది. |
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును. | 4. వీటిని రీసైక్లింగ్ చేయలేము. |
ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.
వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.
ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:
- కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
- కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
- నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
- తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
- తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
- ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
- కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.
ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:
- సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
- నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
- సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
- శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
- ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
- దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
- అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
- దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
- అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
- కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.
ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :
- ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
- వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
- ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
- ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
- ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
- ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:
- ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
- ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
- అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
మేరకు విధిగా పాటిస్తున్నాయి. - ఈ “4R” లు ఏమంటే
i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి. - ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
పరికరాల జాబితా
పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.
ప్రయత్నించండి
ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.
కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)
పద్ధతి :
- సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
- పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
- సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
- మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.
ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 46
ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:
- సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
- వీటికి మన్నిక తక్కువ.
- ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
- ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
- వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
- వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
- ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
- ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
- ఇవి మెరుపును కలిగి ఉండవు.
- వీటికి గట్టితనం తక్కువ.
పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.
ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.
8th Class Physical Science Textbook Page No. 47
ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.
8th Class Physical Science Textbook Page No. 49
ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.
కారణాలు :
- నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
- నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
- నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.
ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:
- నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
- ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
- ఈ దారాలు తడిసినా పాడుకావు.
- ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
- ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.
ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే
- తేలికగా ఉంటాయి.
- మెరుపును కలిగి ఉంటాయి.
- ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
- సులభంగా ఉతకవచ్చును.
- నీటిని ఎక్కువగా పీల్చవు.
- త్వరగా ఆరతాయి.
- ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
- కీటకాలు తినవు.
- పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
- తక్కువ ఖరీదుకు లభిస్తాయి.
8th Class Physical Science Textbook Page No. 50
ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:
- రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.
ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.
ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.
8th Class Physical Science Textbook Page No. 51
ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే
- శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
- చెమటను పీల్చుకుంటాయి.
- శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
- వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
- సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.
8th Class Physical Science Textbook Page No. 52
ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.
సహజ దుస్తులు | కృత్రిమ దుస్తులు |
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి. | 1) కృత్రిమ దారాలు చౌకైనవి. |
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి. | 2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు. |
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. | 3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి. |
4) ఇవి త్వరగా ఆరవు. | 4) ఇవి త్వరగా ఆరుతాయి. |
5) ఇవి మన్నికైనవి కావు. | 5) ఇవి మన్నికైనవి. |
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు. | 6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. |
ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:
ఇంట్లో ఉతకడం | డ్రైక్లీనింగ్ |
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు. | డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు. |
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి. | 2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు. |
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు. | 3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి. |
8th Class Physical Science Textbook Page No. 57
ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.
ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.
8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:
వనరు | గృహోపకరణాలు |
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. | నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి. |
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. | పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి. |
కృత్రిమ దారాలతో తయారయ్యేవి. | బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి. |
కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :
ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.
కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :
ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.
దారం | లక్షణాలు (మండించినపుడు) |
1. నూలు (పత్తి) | వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది. |
2. ఉన్ని | నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది. |
3. పట్టు | నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది. |
4. రేయాన్ | వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది. |
5. నైలాన్ | నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది. |
6. అక్రలిక్ | నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది. |
కృత్యం – 4
ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.
దారపు రకం | దారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య (గ్రాములలో) |
1. నూలు | 250 |
2. ఉన్ని | 500 |
3. పట్టు | 550 |
4. నైలాన్ | 1200 |
పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్
కృత్యం – 6
ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?
మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
చిహ్నముల సంఖ్యలు (Code Numbers)
- పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
- అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
- పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
- అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
- పాలీ ప్రొపిలీన్ (PP)
- పాలీ స్టెరీన్ (PS)
- ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)
కృత్యం – 7
ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
కృత్యం – 8
ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.
b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
ప్రయోగశాల కృత్యం
ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.
కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
పద్ధతి :
- సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
- పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
- సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
- ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
- వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
- ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనా | మెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడం | థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ |
1. టూత్ బ్రష్ కుంచె | నెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడం | థర్మోప్లాస్టిక్ |
2. దువ్వెన | మెత్తబడడం, కాలినవాసనతో మండడం | థర్మోప్లాస్టిక్ |
3. బకెట్ చిన్నముక్క | మెత్తబడడం, కాలిన వాసనతో మండడం | థర్మోప్లాస్టిక్ |
4. వంటపాత్ర పిడి | తర్వాత గట్టిపడడం | థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ |
5. విద్యుత్ స్విచ్ | తర్వాత గట్టిపడడం | థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ |
6. పళ్లెం | తర్వాత గట్టిపడడం | థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ |
7. కాఫీకప్పు | తర్వాత గట్టిపడడం | థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ |
కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :
ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.
వ్యర్థం పేరు | భూమిలో కలిసిపోవడానికి పట్టేకాలం | మార్పు |
1. కూరగాయలు, పండ్ల తొక్కలు | 10 – 20 రోజులు | జీవ విచ్ఛిన్నం చెందును. |
2. తినగా మిగిలిన పదార్థాలు | 10-20 రోజులు | జీవ విచ్ఛిన్నం చెందును. |
3. కాగితం | 10-30 రోజులు | జీవ విచ్ఛిన్నం చెందును. |
4. నూలు బట్ట | 2-6 నెలలు | జీవ విచ్ఛిన్నం చెందును. |
5. ప్లాస్టిక్ సంచి | 100 సం||ల కన్నా ఎక్కువ | జీవ విచ్ఛిన్నం చెందదు. |