SCERT AP 8th Class Biology Study Material Pdf 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Biology 6th Lesson Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ
8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం
ప్రశ్న 1.
దీనిని చదివి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
జీవవైవిధ్యం – 2050 :
జవాబు:
అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు COP-2012 Hyd (Conference of Parties) తీర్మానాల ప్రకారం వచ్చే 4 దశాబ్దాలలో భూమిపై గల సహజవనరులు గడ్డిమైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ. సమశీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయి. 2050 నాటికి జీవవైవిధ్య నష్టం అంచనాలకు మించిపోతుంది. శీతోష్ణస్థితి మార్పు దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాదాపు 1.3 మిలియన్ల సహజ ఆవరణ వ్యవస్థలలో ఎలాంటి సహజ జీవజాతులు ఉండవు. (దిగువ రంగు ప్రాంతాలు జీవవైవిధ్య నష్ట సూచికలు. నీలిరంగు ప్రాంతాలు గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది).
ఎ. సూచిక రంగు ప్రాంతం (కలర్ కోడ్) ఏమి సూచిస్తుంది ?
బి. ఏ ప్రాంతం గరిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తుంది ?
సి. ఏయే ప్రాంతాలు కనిష్ఠ జీవవైవిధ్య నష్టాన్ని సూచిస్తున్నాయి ?
డి. 2010 నుండి 2050 వరకు జీవవైవిధ్య పరిస్థితిలో గమనించిన మార్పులేవి ?
ఇ. జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ఏం చర్యలు సూచించగలవు ?
(సి.ఒ.పి. – 2012 జీవవైవిధ్యం, హైదరాబాద్ వారి సౌజన్యంతో)
జవాబు:
ఎ. జీవవైవిధ్య నష్ట సూచికలను చూపిస్తుంది.
బి. 1) కెనడా పై ప్రాంతం.
2) ఐరోపా ఖండంపై ప్రాంతాలు.
3) దక్షిణాఫ్రికాలో … జీవవైవిధ్య నష్టం ఎక్కువ ఉంది.
సి. 1) దక్షిణ అమెరికా పై భాగం.
2) ఆస్ట్రేలియా ఖండం.
డి. దాదాపు 1.3 మిలియన్ల ప్రదేశాలలో ఎలాంటి జీవజాతులూ ఉండవు.
ఇ. ప్రకృతిని గౌరవించి, అన్ని జీవుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి సంరక్షించాలి.
1. జీవ వైవిధ్యంపై ప్రజలలో, పిల్లల్లో అవగాహన కల్పించాలి.
2. ప్రభుత్వాలు దీనిపై కృతనిశ్చయంతో కార్యక్రమాలను రూపకల్పన చేయాలి.
3. ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి.
ప్రశ్న 2.
అడవులు జీవావరణ నిల్వలని ఎలా చెప్పగలవు ? తగిన కారణాలు రాయండి.
జవాబు:
- అడవులలో వృక్ష, జంతు జాతులు, క్రిమికీటకాలు అనేకం ఉంటాయి.
- ఒకే జీవిలో ‘వైవిధ్యం ఉన్న జాతులను, ప్రజాతులను అడవులలో మనం చూడవచ్చు.
- అడవులలో ఉన్న సజీవ, నిర్జీవ వనరులు పరిసరాలు ఈ జీవరాశులకు వైవిధ్యం ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నాయి.
- ఇక్కడ జీవరాశులు తమ సహజ ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా, పరాగ సంపర్కం ద్వారా, విత్తన వ్యాప్తి ద్వారా, ఒక దానిపై ఒకటి ఆధారపడి, ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ తమ మనుగడ కొనసాగిస్తాయి.
- కాబట్టి అడవులను జీవావరణ నిల్వలని మనం చెప్పవచ్చు.
ప్రశ్న 3.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ? జీవుల్లో వైవిధ్యాలు ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
జీవవైవిధ్యం :
1. మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.
2. ఉదాహరణకు 1. ‘మందార’ మొక్కను తీసుకుందాం. 100 ఎర్రమందార మొక్కలు ఒక్కచోటే ఉన్నాయనుకోండి. అది జీవవైవిధ్యం కాదు.
3. కానీ అదే ప్రదేశంలో (ఆవరణ వ్యవస్థలో)
30 ఎర్ర మందారాలు, 10 తెల్ల మందారాలు, 10 ముద్ద మందరాలు, 10 రేక మందారాలు, 20 గులాబి రంగు మందారాలు, 20 వివిధ రంగు రేకులు గల మందారాలు ఉన్నాయనుకోండి. ఈ ప్రదేశం జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉన్న ఆవరణ వ్యవస్థ అని గుర్తించబడుతుంది. 4. ఒక ఆవరణ వ్యవస్థలో గడ్డి మాత్రమే ఉండకూడదు. దానితో పాటు ఇంకా రకరకాల మొక్కలు, జంతువులు, కీటకాలు ఉండాలి.
5. కోడిలో అడవి కోడి, నీటి కోడి, నాటు కోడి లాంటి వైవిధ్య జాతులు ఉండాలి.
6. ‘జాతి’ ఒకటే అయినా వాటి బాహ్య, అంతర నిర్మాణంలో వివిధ లక్షణాలు ఉంటే ఇది వైవిధ్యంగా గుర్తించబడుతుంది.
7. సూక్ష్మ జీవ ప్రపంచంలో కూడా వైవిధ్యం బాగా కనపడుతుంది.
8. మానవులలో కూడా ప్రదేశాన్ని, ఖండాన్ని బట్టి వైవిధ్యం ఉంటుంది.
ఉదా : వెస్టిండియన్లు – ఇండియన్లు – అమెరికన్లు.
ప్రశ్న 4.
ఈ పదాలను మీరు ఎలా అర్థం చేసుకున్నారు ? వివరించండి.
ఎ. అంతరించిన జాతులు
బి. ఆపదలో ఉన్న జాతులు
సి. ఎండమిక్ జాతులు
జవాబు:
ఎ) అంతరించిన జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు.
ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొ॥. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.
బి) ఆపదలో ఉన్న జాతులు : భూమిపై నున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. 1) అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో పడతాయి.
సి) ఎండమిక్ జాతులు : భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : (1) కంగారూలు ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. (2) కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి. (3) ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. (కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నాం)
ప్రశ్న 5.
పులిని సంరక్షించడానికి చర్యలు చేపట్టినప్పుడు పులితో పాటు సంరక్షించాల్సిన అంశాలు ఏవి ?
జవాబు:
1. పులిని సంరక్షించాలని అనుకున్నప్పుడు మొదట అడవులను సంరక్షించాలి.
2. వాటి ఆహారమైన చిన్న జంతువుల సంరక్షణ చేపట్టాలి.
3. పులులలో జనాభా లెక్కించేటప్పుడు ఆడ, మగ పులుల కచ్చితమైన సంఖ్యను తీసుకోవాలి.
4. వాటి ప్రజననానికి తగిన ఏర్పాటు అడవిలో చేయాలి. (లేదా కృత్రిమ ప్రజననమునకు ఏర్పాటు చేయాలి) (ప్రజననము అంటే ప్రత్యుత్పత్తి)
5. పులులు నీటి గుంటలు, వాగుల వద్దకు దాహం తీర్చుకోవటానికి వస్తాయి. వీటిలో నీటి ప్రవాహం వుండేలా చూడాలి. (వాగులపై లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిన్న (చెక్ డామ్ లు) ఆనకట్టలు కడుతున్నారు. వేసవిలో నీటిని అడవిలోని దిగువ ప్రాంతానికి వదిలేలా చర్యలు తీసుకోవాలి.)
6. పులుల వేటను పూర్తిగా నిషేధించాలి.
7. ఇవి ఎక్కువ రాత్రిపూట అడవిలో సంచరిస్తాయి. అందువల్ల రాత్రిపూట స్వేచ్ఛగా అడవిలో తిరిగే అవకాశం కల్పించాలి. (శ్రీశైలం అడవులలో రాత్రి 10 గం|| తరువాత వాహనాలను అడవిలోకి అనుమతించరు. పులులు స్వేచ్ఛగా ఒక చోట నుండి మరోచోటకు వెళ్ళాలి. అప్పుడే వాటి ప్రజననం సులువవుతుంది).
ప్రశ్న 6.
మానవ కార్యకలాపాలు ఏ విధంగా జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తున్నాయి ? జీవవైవిధ్య ఆవశ్యకతను ప్రజలు గుర్తించటానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యానికి నష్టం కలిగిస్తున్న మానవ కార్యకలాపాలు :
- అడవులను నరికి, వ్యవసాయానికి, నివాసానికి వినియోగించటం.
- కాలుష్యాన్ని పెంచటం.
- ఇళ్ళన్నీ కాంక్రీటుతో నిర్మించటం. పిచ్చుకల లాంటి వాటికి నష్టం కలుగుతోంది.
- సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్.
- ఇంటిలో, ‘పెరడు’ లేకుండా అంతా రాళ్ళు సిమెంటుతో నేలను కప్పటం.
- విదేశీ ఆక్రమణ జాతులను ఎక్కువగా పెంచటం (హైదరాబాద్ పావురాళ్ళు).
- జంతువుల, మొక్కల సహజ నివాసాన్ని ధ్వంసం చేయటం.
చేపట్టవలసిన చర్యలు :
- అడవుల నరికివేతను తగ్గించాలి.
- సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
- ఇంటిలో కనీసం కొద్ది స్థలంలోనైనా ‘పెరడు’ ఉంచి మొక్కలు పెంచాలి.
- పక్షులకు ప్రత్యేక సంరక్షణ కల్పించాలి. (పాలపిట్ట కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో కనిపించకుండా పోతోంది)
- సెల్ టవర్ల నిర్మాణాలను నియంత్రించాలి.
- స్థానిక జాతులను, ప్రజాతులను పెంచటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- ప్రకృతిలో ప్రతి జీవి ముఖ్యమైనది. దాని పాత్ర దానికి నిర్దేశించబడివుంది అన్న సత్యం గమనించాలి. ‘జీవించు – జీవించనివ్వు’ (Live – Let Live)
- జీవుల పట్ల భూత దయ చూపాలి.
- పిల్లలకు అవగాహన (NGC), (WWF) ల ద్వారా కల్పించాలి.
- అందమైన ఒకే జాతి జీవుల పట్ల ఆకర్షితమవకుండా, వేరు వేరు రకాలకు, జాతులకు సంబంధించిన మొక్కలను, జంతువులను అభివృద్ధి చేయాలి.
ప్రశ్న 7.
ఈ కింది వాటిలో ఆపదలో వున్న, ఎండమిక్ జీవులను గుర్తించి పటాల కింద పేరు రాయండి.
జవాబు:
1. ఎండమిక్ జీవులు :
2. ఆపదలో వున్న జీవులు :
ప్రశ్న 8.
పక్షుల వలస వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి ?
జవాబు:
1. వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.
2. దీని వెనకున్న శాస్త్రీయ కారణాలు :
(i) ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అతివేడి, అతిశీతల పరిస్థితులు పక్షుల ప్రజననానికి (ప్రత్యుత్పత్తికి) ఆటంకం అవుతుంది.
(ii) ఈ ప్రతికూల పరిస్థితులలో పిల్ల పక్షులు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉంటుంది.
(iii) మంచు గడ్డకట్టే ప్రాంతాలలో, మంచు ధారాళంగా కురిసే శీతాకాలంలో పక్షులు గుడ్లు పెట్టి పొదగటం, ఆహార సేకరణ, పెద్ద పక్షుల జీవనం దుర్లభమవుతుంది.
(iv) ఇలా పక్షులు నివాసం కోసం, ఆహారం కోసం, సురక్షితంగా ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి ‘వలస’ వస్తాయి. వీటిని ‘వలస పక్షులు’ అంటారు.
మనం వీటికి తగిన చెట్లు, పొదలు, తావులను సంరక్షిస్తూ అవి వచ్చి వెళ్లటానికి సాయం చేయాలి.
ప్రశ్న 9.
ఈ రోజుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు మన నివాసాల్లో చొరబడుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది ? కొన్ని కారణాలు తెలుసుకోవడానికి నీవు ఏమేమి ప్రశ్నలడుగుతావు ?
జవాబు:
- చిరుతలు అడవిలో ఉండాలి. మరి జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి ?
- వాటి నివాసయోగ్యమైన అడవి ప్రాంతం తగ్గిందా ?
- అడవిలో వాటికి ఆహారం, నీరు దొరకటం లేదా ?
- అవి స్వేచ్ఛగా తిరుగుతూ నివసించే ప్రాంతంలోకి మనం వెళ్ళామా ? వాటి నివాసాలలో మన ఆవాసాలు నిర్మించామా?
- ఎలుగుబంట్లు ఇష్టంగా తినే పుట్టతేనె పురుగులు, చెద పురుగులు అడవిలో లభిస్తున్నాయా ? లేదా ?
- వాటి సంఖ్య తగ్గిపోతున్నది ? ఎందుకు ?
- పాములు మన ఇళ్ళల్లోకి ఎందుకు చొరబడుతున్నాయి ?
- చీమల పుట్టలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకు ?
ప్రశ్న 10.
మీ పరిసరాలలో ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి. అక్కడ జంతువులను ఒక రోజంతా గమనించండి. ఒక జాబితా తయారుచేయండి. ఏమి గమనించారో రాయండి.
జవాబు:
మా ఊరిలో మా వీధిని ఎంచుకుని, అక్కడ ఉన్న జంతువుల జాబితాను సేకరించాను.
- ఆవులు
- గేదెలు
- మేకలు
- కోళ్ళు
- కొంగలు
- బల్లులు.
- తొండలు
- గొల్లభామలు
- తూనీగలు
- పిల్లులు
- కుక్కలు
- పందులు
- కాకులు
- గబ్బిలాలు
- ఎలుకలు
- పాములు
- పావురాలు (పెంపుడు)
- గిన్నె కోళ్ళు
- ఈము పక్షులు
- పిచ్చుకలు (విదేశీ ఆక్రమణ జాతి)
కింది విషయాలు గమనించాను :
- కొంగలు ప్రత్యేక సమయంలోనే వచ్చి వెళ్ళే వలస పక్షులు.
- గబ్బిలాల సంఖ్య తక్కువ ఉంది. (రేడియేషన్ వల్ల)
- పాముల సంఖ్య తక్కువయిందని మా నాన్న అన్నారు. (వీటిని విషపూరితమైనవని చంపటం ఒక కారణం.)
- పావురాలు పెంచుకుంటున్నారు.
- 5 నుండి 10 వరకు ఏమేరిన్ కుక్క పిల్లలు ఉన్నాయి.
- పిచ్చుకల సంఖ్య బాగా తక్కువగా ఉంది.
- పాలపిట్ట అసలు కనిపించలేదు.
ప్రశ్న 11.
ఇప్పుడు మరియు 30 ఏళ్ళ క్రితం ఉండే జంతువులు/పక్షుల జాబితాను తయారుచేయండి. ఇందుకోసం పెద్దల సహాయం తీసుకోండి. కొన్ని జంతువులు ప్రస్తుతం కనిపించక పోవటానికి గల కారణాలేమిటో రాయండి.
జవాబు:
మా తాతయ్య, ఆయన మిత్రుల సాయంతో నేను ఈ క్రింది జాబితా తయారుచేశాను.
(i) జంతువులు : 1. హైనాలు 2. అడవి పిల్లి 3. నీటి పిల్లి (ఫిషింగ్ పిల్లి). 4. చిరుత పులులు 5. ఉడుములు 6. ముంగిసలు 7. ముళ్ళ పందులు 8. జడల బర్రె 9. తోడేళ్ళు 10. అడవి తాబేళ్ళు
(ii) పక్షులు : 1. రాబందులు 2. గ్రద్దలు 3. నెమళ్ళు . 4. పిచ్చుకలు (సంఖ్య తగ్గింది) 5. నీటి కోళ్ళు 6. పాలపిట్టలు (సంఖ్య తగ్గింది) 7. కౌజు పిట్టలు (కనుజు) 8. ఎర్ర కాకులు 9. ఊర పిచ్చుకలు.
కారణాలు :
- అడవులను నరికివేయటం.
- హానికర క్రిమిసంహార మందులు పంటలపై, వాడటం.
- గాలిలో రేడియేషన్ ప్రభావం ఎక్కువ అవటం. (ఇది సెల్ ఫోన్లు, సెల్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్)
- ప్రజననానికి ఆటంకం ఏర్పడటం.
- వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మనుగడ కొనసాగించటం కష్టమవుతున్నది.
- ఆధునిక వ్యవసాయ పద్ధతులు. (వరి గూళ్ళు, గాదెలు ప్రస్తుతం తగ్గి, గోడౌన్లలోనే ఎక్కువగా నిల్వ చేస్తున్నారు.) (వరికోత యంత్రాల వల్ల వరికుప్ప (గూళ్ళు) వేసే అవసరమే వుండటంలేదు.)
ప్రశ్న 12.
ఒక వృక్షాన్ని ఆవరణ వ్యవస్థగా తీసుకుని దానితో సంబంధం ఉన్న మొక్కలు, జంతువులను నమోదు చేయండి.
జవాబు:
- ఒక వృక్షాన్ని ఒక ఆవరణ వ్యవస్థగా పరిగణించినప్పుడు దీనితో అనేక మొక్కలు, జంతువులు సంబంధం కలిగి ఉంటాయి.
- దీనిపై పరాన్నజీవులైన చిన్న మొక్కలు చెట్టు కాండం, శాఖలపై పెరుగుతాయి.
- చెట్టుపై అనేక కీటకాలు, తుమ్మెదలు వచ్చి వెళ్ళుతూ ఉంటాయి.
- అనేక పక్షులు, చిలుకలు, కాకులు, పిచ్చుకలు నివాసం ఏర్పర్చుకుంటాయి.
- వలస పక్షులలాంటి కొంగలు వచ్చి వాటి గూడులను ఏర్పర్చుకుంటాయి.
- కొంత కాలం తరువాత అవి వెళ్ళిపోతాయి.
- చెట్టు బెరడు కింద చెద పురుగులు ఉంటాయి.
- వీటిని తినడానికి వడ్రంగి పిట్టలు వస్తాయి.
- తేనెటీగలు తేనెతెట్టును పెట్టి నివశిస్తాయి.
- ఉడతలు చెట్టుపై తిరుగుతూ ఉంటాయి.
- కుక్కలు, గేదెలు, ఆవులు చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటాయి.
- పసిరిక పాములు చెట్టుపై నివాసముంటాయి.
ప్రశ్న 13.
ఇంటర్నెట్ లేదా గ్రంథాలయం పుస్తకాల సహాయంతో భారతదేశంలోని పక్షి సంరక్షణ కేంద్రాల సమాచారం సేకరించి జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 14.
భారతదేశానికి వలస వచ్చే పక్షుల జాబితాను తయారుచేయండి.
జవాబు:
శీతాకాలం వలస వచ్చే పక్షులు :
- సైబీరియన్ కొంగలు
- గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు
- రఫ్ పక్షులు
- నల్లరెక్క కొంగలు
- కామన్ టీల్
- యెల్లో వ్యాగ్ టేల్
- వైట్ వ్యాగ్ టేల్
- రోసీ పెలికాన్
- వుడ్ శాండ్ పైపర్
- స్పాటెడ్ శాండ్ పైపర్
వేసవికాలం వలస వచ్చే పక్షులు :
- ఏసియన్ కోయల్
- కుకూస్
- కోంచ్ డక్
- యురేషియం గోల్డెన్ ఓరియల్ .
- బ్లూ చీక్ డ్ బీ ఈటర్
- బ్లూ టైల్డ్ బీ ఈటర్
- బ్లాక్ క్రోడ్ నైట్ హెరోన్.
ప్రశ్న 15.
సమీపంలో గల అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించి అచ్చటి స్థానిక మొక్కలు, జంతువుల సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మా పాఠశాల దగ్గరలో ఉన్న అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్టర్ గార్ని, కలసి ఈ కింది సమాచారం సేకరించాము.
మా ప్రాంత సమీప అడవిలో ఉన్న మొక్కలు :
- టేకు చెట్లు
- మద్ది చెట్లు
- విప్ప చెట్లు
- తునికి చెట్లు
- వాక్కాయల చెట్లు
- బుడంకాయల తీగ
- రేగు చెట్లు
- నక్కేరుకాయల చెట్లు
- పల్లేరు కాయల తీగ
- పరిక్కాయ చెట్టు
- పాలచెట్టు
- వెదురు పొదలు
- తుమ్మచెట్లు
- జిట్రేగు చెట్లు
- నార వేప
- బూరుగు దూది చెట్లు
- దేవదారు
- అడవి నారింజ
- గిన్నె చెట్టు
- దాల్చిన చెక్క, లవంగ చెట్టు (చింతపల్లి అడవులు)
జంతువులు :
- పాల పిట్ట
- మొసలి
- ఎలుగుబంట్లు
- లేడి
- కొండచిలువలు
- పాములు (గోధుమ త్రాచు)
- రక్తపింజర
- కుందేళ్ళు
- నక్కలు
- అడవి కుక్కలు
- నీటి కోళ్ళు
- గువ్వ పిట్టలు (చిన్నపొదలో ఉంటాయి)
- గోరింకలు
- ఉడుము (అతితక్కువ ఉన్నాయట)
- అడవిదున్న
- మనుబోతులు
- అడవి పందులు
- నెమళ్ళు (మా ప్రాంతంలో అతితక్కువ)
- దుప్పి
- చిరుతపులి (ఒక్కటే ఉందని రేంజర్ గారు చెప్పారు)
ప్రశ్న 16.
జీవవైవిధ్యంపై సమావేశాలు నిర్వహించాల్సిన అవసరమేమిటి ? ఈ సమావేశాలపై సమాచారం సేకరించి అవి ఎక్కడ – ఎప్పుడు ఏ ఉద్దేశంతో నిర్వహించారో రాయండి.
జవాబు:
1. జీవవైవిధ్యంపై అవగాహన కోసం, అన్ని దేశాల ప్రజలు సమష్టిగా ఈ భూమిని ఎక్కువ జాతులతో నిలకడగా, సమతుల్యంగా ఉంచే ఉద్దేశ్యంతో ఈ జీవ వైవిధ్య సమావేశాలు జరుగుతాయి.
2. వీటివల్ల పూర్తిగా అంతరించిపోయే జాతుల సంరక్షణ, పరిరక్షణ జరపటానికి అవకాశం ఉంటుంది.
3. ఈ సమావేశాలలో ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేయబడుతుంది.
4. అందువల్ల జీవవైవిధ్య సదస్సులు జరపటం అవసరం.
సదస్సుల వివరాలు :
1. ప్రపంచ జీవవైవిధ్య సదస్సు – 2012 – హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్ – ఇండియా
2. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశం – జేజూ – దక్షిణ కొరియా
ప్రశ్న 17.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ? ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అత్యధిక జీవవైవిధ్యం గల ప్రాంతాలు గుర్తించండి.
జవాబు:
- భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది.
- అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.
- అడవిని కాపాడుకోవటం మన కర్తవ్యం.
- ‘అడవి’ జీవావరణాన్ని నిల్వ చేసే ఒక ప్రదేశంగా చెప్పవచ్చు.
- కానీ దురదృష్టవశాత్తు మనుషులే అడవులను నాశనం చేస్తూ, జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నారు.
ప్రశ్న 18.
మానవ క్రియల వల్ల మన జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం చేకూరింది. వీటిని రక్షించే కొన్ని మార్గాలను సూచించండి.
జవాబు:
మానవ క్రియల వల్ల జీవవైవిధ్యానికి నష్టం జరిగింది. దీనిని రక్షించే కొన్ని మార్గాలు.
- అడవులను సంరక్షించాలి.
- జంతువుల, మొక్కల సహజ ఆవాసాలు ధ్వంసం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి.
- వంట చెరకు సేకరణను ఆపి కిరోసిన్, గ్యా స్లతో వంట చేసుకోవాలి.
- పేపర్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలి.
- పేపర్ రీ సైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహించాలి.
- వన్య ప్రాణులను అమ్మటం, చంపటం చేయకుండా విదేశాలకు ఎగుమతి చేయకుండా చట్టాన్ని కఠినం చేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- పొలాలలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంపై నియంత్రణ వుండాలి.
- దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి.
- పిల్లలకు జీవవైవిధ్యం పై అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి.
- పారిశ్రామిక అవసరాలకు ప్రకృతి. వనరుల వినియోగం సున్నితమైన అంశం. దీనిపై ప్రజల, ప్రజాసంఘాల పర్యావరణ కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించాలి.
- మనం అభివృద్ధి కోసం ఎంతైతే అడవులను నాశనం చేశామో, అదే విస్తీర్ణంలో వేరే బీడు, మైదాన ప్రాంతాల్లో అడవుల పెంపకం చేపట్టాలి.
ప్రశ్న 19.
పలు రకాల మొక్కలు, జంతువులతో కూడిన పార్కు వన్యసంరక్షణ కేంద్రం లేదా జంతు ప్రదర్శనశాల చూసినప్పుడు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తారు ? కొన్ని వాక్యాలలో తెలపండి.
జవాబు:
1. వన్య సంరక్షణ కేంద్రంలో సంరక్షింపబడుతున్న పక్షులను చూసినపుడు చాలా ఆనందం, గొప్ప అనుభూతి కలుగుతుంది.
2. వాటిని నేను మునుపెన్నడూ చూడలేదు. వాటిని చూస్తే ఎంతో ఆనందంగా అనిపించింది.
3. రంగు, రంగు పూలమొక్కలు, వాటి ఉపయోగాలు అక్కడ తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.
4. రకరకాల మందు మొక్కలు, వాటి నుండి తయారయ్యే మందుల పేర్ల గురించి నాకు మునుపెన్నడూ తెలియదు. తెలుసుకున్న తర్వాత సంబరం అనిపించి వాటి ఉపయోగాన్ని నా స్నేహితులతో పంచుకుని మరింత ఆనందించాను.
5. అడవిలో పెరిగి సంచరించే పులి, సింహాలను చూసి మొదట భయపడ్డాను. కానీ తరువాత వాటిని ఇంకా ఇంకా చూడాలనిపించింది.
6. కోతులు, కొండముచ్చులు చేసే చిలిపి చేష్టలు నవ్వు తెప్పించాయి.
ప్రశ్న 20.
జీవవైవిధ్య సంరక్షణ పై మాట్లాడుకు ఒక ఉపన్యాస వ్యాసం తయారుచేయండి.
జవాబు:
ఉపయోగపడేదీ, ఉపయోగపడనిదీ ఏదైనప్పటికీ ప్రతి చెట్టుకు, జంతువుకు భూమిపై జీవించే హక్కు ఉందని గ్రహించడమే జీవవైవిధ్య సారాంశం. ప్రతిజీవి ఆవరణ వ్యవస్థలోని భాగమే. ఏ జీవి నశించినా (అది ఎండమిక్ కావచ్చు లేదా ఇతర ఆవాసాలలో ఉండవచ్చు) ఆవరణ వ్యవస్థలోని ఆహార గొలుసులు, ఆహార జాలకంపై దాని ప్రభావం ఉంటుంది.
దీని మూలంగా ప్రపంచ జీవవైవిధ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి భూమిపైన జీవవైవిధ్యాన్ని రక్షించాలంటే ముందుగా మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్థులం కావాలి. తరువాత ఇతరులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. ఈ రోజు కొన్ని జాతులు అంతరించిపోతే, రేపు అంతరించిపోయే జాబితాలో మనం ఉంటాం.
జీవవైవిధ్యాన్ని సంరక్షించుకోవడం అంటే అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించడం. ఇలా చేయటం వలన అడవులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందు తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించగలుగుతాయి.
ప్రకృతి మానవ అవసరాలకే గాని మానవ అత్యాశలకు కాదు. మానవులుగా మనం ఎప్పుడూ ప్రకృతిని మన అవసరాలకు ఎలా వినియోగించాలి అనే కోణంలో ఆలోచించాం కాని ! ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలి అనే కోణంలో ఆలోచించలేదు. మానవుడు ప్రకృతిలోని ఒక భాగం మాత్రమే. యావత్ ప్రకృతి కాదు. ప్రకృతిని సంరక్షిస్తే అది మనలను రక్షిస్తుంది.
ప్రశ్న 21.
జీవవైవిధ్య సంరక్షణ మన ఇంటి నుండే మొదలు అవుతుందని రాణి చెప్పింది. ఇది సరైనదేనా ? ఆమెను నీవు ఎలా సమర్థిస్తావు ?
జవాబు:
అవును. రాణి అన్నది నిజమే. నేను రాణిని సమర్థిస్తాను. ఎందుకంటే
- జీవుల సంరక్షణ మన ఇంటి నుండి ప్రారంభమవ్వాలి.
- మన ఇల్లు ‘ప్రకృతి’ అనే పెద్ద ఆవరణలో ప్రాథమిక ఆవాసం.
- దీనిలో జీవవైవిధ్యం ఉంటే, అది మన బజారుకి, అక్కడ నుండి గ్రామానికి, పట్టణాలకి, నగరాలకి, రాష్ట్రాలకి, దేశానికి, దేశ దేశాలకు విస్తరిస్తుంది.
- ఇది ఎవరో ఒక్కరే చేసే పనికాదు.
- ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది అందమైన కలసికట్టుగా, సామాజిక బాధ్యతగా భూతదయ ఉన్న మానవులుగా మనందరం చేయవలసిన ముఖ్యమైన పని.
ప్రశ్న 22.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
1. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. మనల్ని మనం కాపాడుకుందాం.
2. జీవించు – జీవించనివ్వు.
3. జీవుల మనుగడే – జీవవైవిధ్యం నిలకడ.
4. జీవించే హక్కు – ప్రకృతిలో ప్రతి జీవి హక్కు.
8th Class Biology 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ InText Questions and Answers
కృత్యములు
1. ‘పరిసరాల నమూనా’ నువ్వు తయారుచేయగలవా ? (పేజీ నెం. 84)
జవాబు:
నేను చేయగలను. ఉదాహరణకు మా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాల పటంలో వివిధ మొక్కలు, జంతువులు మొ|| వాటిని గుర్తించి నమూనా చిత్రం గీస్తాను.
ఇది మా ఇల్లు రంగు సూచిక (Colour Code)
1. మొక్కల – మొ – లేత ఆకుపచ్చ (మొక్కలు)
2. మొక్కలు – మొ – ముదురు ఆకుపచ్చ (చెట్లు)
3. జంతువులు – జ – ఎరుపు
4. మనుషులు – మ – ముదురు నీలిరంగు
5. పక్షులు – ప – గులాబి రంగు
6. కీటకాలు – కీ – గోధుమరంగు
7. చేపలు – చే – లేత నీలిరంగు
(a) చార్టులో ఎన్ని రంగులు గుర్తించావు ?
జవాబు:
చార్టులో ఏడు రంగులు గుర్తించాను.
(b) అది ఏమి తెలుపుతుంది ?
జవాబు:
ఆ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు, జంతువులు గురించి తెలుపుతుంది.
(c) రంగు సూచికలోని మొత్తం సంఖ్య దేనిని తెలియచేస్తుంది ?
జవాబు:
రంగు సూచికలోని మొత్తం సంఖ్య జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది.
2. ప్రకృతి పరిశీలన (పేజీ నెం. 85)
జవాబు:
సమీపంలోని అడవులలో (సాధ్యమైతే) ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు లేదా పొలాలు, తోటలు సందర్శించినపుడు ఇలాంటి అధ్యయనాన్ని (సర్వే) నిర్వహించండి.
మీ పరిశీలనలో ఏవీ తప్పిపోకుండా, మరచిపోకుండా జాగ్రత్త పడండి. పక్షుల గూళ్ళు, సాలీడు గూళ్ళు, పురుగులు, కీటకాలు, నాచుమొక్కలు, శిలీంధ్రాలు మొదలైనవన్/నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
అలాగే అధ్యయనం చేస్తున్నప్పుడు పక్షుల గూళ్ళు మొదలైన ఆవాసాలను కదిలించరాదు. ఇది వరకు వాడిన రంగుసూచికలనే వినియోగిస్తూ నమూనా చిత్రం తయారు చేయండి. అడవుల్లో ఉండే వన్యజీవులలోని వైవిధ్యం మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఇలా చేద్దాం
(a) ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది ?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.
(b) వీటిని పరిశీలించినపుడు మీ పరిసరాల గురించి ఎన్నో ఆలోచనలు స్ఫురించి ఉంటాయి. ఆలస్యం చేయకుండా సంకోచించకుండా మీ ఆలోచనలు రాయండి.
జవాబు:
- ప్రకృతి చాలా అందమైనది, మనోహరమైనది.
- ఇది ఎన్నో జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది. జీవితాన్ని ప్రసాదిస్తుంది.
- మనం కూడా ప్రకృతిలో ఒక ప్రాణిగా జీవించాలి.
- ప్రకృతిని మనం పాడుచేయకూడదు.
- మన అవసరాలకు ప్రకృతి స్వభావాన్ని నాశనం చేయరాదు.
- జీవించు – జీవించనివ్వు అనేది అందరికి ఆదర్శం కావాలి.
(c) రెండు నమూనా చిత్రాలను పోలుస్తూ మీ పరిశీలనలు రాయండి.
జవాబు:
పాఠ్యపుస్తకంలోని పటంతో పోల్చితే నేను గీచిన పటాలలో పచ్చదనం తక్కువగా ఉంది. అంటే మా ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉన్నాయి. కావున జీవవైవిధ్యం కూడా తగ్గుతుంది. జీవవైవిధ్యం పెంచటానికి చెట్ల సంఖ్యను పెంచాలి.
3(a) మొక్కలలో వైవిధ్యం ఉందని నువ్వు ఎలా చెప్పగలవు ? (పేజీ నెం. 85)
జవాబు:
ఏవైనా రెండు మొక్కలను (ఉదా : మందార, మల్లె) గమనిస్తే
దీని ద్వారా మొక్కలలో వైవిధ్యం ఉందని మనకు తెలుస్తుంది.
(b) జంతువులన్నీ ఒకేలా ఉంటాయా ? నీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
జంతువులన్నీ ఒకేలా ఉండవు. వైవిధ్యాలు (తేడాలు, భేదాలు, అనేక వేరు వేరు లక్షణాలు) ఉంటాయి.
ఉదా : గేదె, ఆవు (రెండూ క్షీరదాలే అయినా)
గేదెలు | ఆవులు |
1. ఇవి నల్లగా ఉంటాయి. | 1. ఇవి నల్లగా, ఎర్రగా, తెల్లగా, మచ్చలుగా, కూడా ఉంటాయి. |
2. ఇవి ఎండను తట్టుకోలేవు. | 2. ఎండను భరిస్తాయి. |
3. వర్షానికి బెదరవు. | 3. వర్షంలో గడపటానికి అంతగా ఇష్టపడవు. |
4. పాలు చిక్కగా ఉంటాయి. | 4. పాలు పలుచగా ఉంటాయి. |
5. పనిచేసే సామర్థ్యం తక్కువ. | 5. కష్టమైన పనులు కూడా చేస్తాయి. |
6. చలాకీతనం తక్కువ. | 6. చలాకీగా, హుషారుగా ఉంటాయి. |
4(a) నీకు తెలిసిన క్రికెట్ ఆటగాళ్ళ ఫోటోలు సేకరించి వారి మధ్య తేడాలు రాయగలవా ? (పేజీ నెం. 86)
జవాబు:
వెస్టిండియన్లు | ఆస్ట్రేలియన్లు |
1. జుట్టు రింగులుగా, నల్లగా ఉంది.
2. శరీరం నలుపు రంగులో ఉండి మెరుస్తోంది. 3. ముక్కు చివర్లు ఉబ్బినట్లు వున్నాయి. 4. పెదవులు పెద్దగా వున్నాయి. 5. కంటిపాప నల్లగా వుంది. 6. శారీరక దారుఢ్యం సాధన చేస్తే వచ్చినట్లుగా కనపడుతుంది. |
1. జుట్టు తిన్నగా, రాగి రంగులో ఉంది.
2. శరీరం తెల్లగా, పాలినట్లుగా ఉంది. 3. ముక్కులు ఆకర్షణీయంగా వున్నాయి. 4. పెదవులు ఆకర్షణీయంగా వున్నాయి. 5. కంటిపాప పిల్లి కళ్ళలా వున్నాయి. 6. శారీరక దారుఢ్యం పుట్టుకతో వచ్చినట్లు వుంటుంది. |
(b) కింది ప్రశ్నలు చర్చించండి. సారాంశాన్ని కింద రాయండి.
ప్రశ్న (i)
పూర్తిగా ఒక దానిదానితో మరొకటి పోలిన జీవులు ఉన్నాయా ?
జవాబు:
లేవు.
ప్రశ్న (ii)
వాటి మధ్యలో భేదాలు ఎందుకు ఉన్నాయి ?
జవాబు:
ఏ జీవి మరో జీవిలా ఉండదు. దాని ప్రత్యేకత ఉంటుంది. ఇది దాని నిర్మాణంపై, దాని ఆహార అలవాట్లు, నివాస ఆ ప్రాంత ప్రభావం ఉంటుంది.
ప్రశ్న (iii)
మొక్కలన్నీ తీగల మాదిరిగా పాకేవి అయితే ఏమవుతుంది ?
జవాబు:
1. మొక్కలన్నీ తీగలైతే నడవటానికి చోటుండదు.
2. జంతువులకు నీడ ఉండదు.
3. భూమిలో నీరు ఇంకదు.
4. విత్తన వ్యాప్తికి ఆటంకం కలుగుతుందని చర్చలో పాల్గొన్న నా మిత్రులు చెప్పారు.
ప్రశ్న (iv)
కోడికి, మేకకు కాళ్ళలో భేదం ఉందా ? లేదా ?
జవాబు:
ఉంది. కోడి కాళ్ళు చిన్నవి ; వీటి వేళ్ళ మధ్య చర్మం వుంది.
మేక కాళ్ళు పెద్దవి, వీటి వేళ్ళు గోర్లు గిట్టలుగా మారాయి.
ప్రశ్న (v)
పక్షుల గూళ్ళు ఒకే రకంగా ఉన్నాయా ?
జవాబు:
ఉండవు. కారణం ఒక్కొక్క పక్షి ఆకారం, దాని సౌకర్యాల మీద ఆధారపడి గూడు ఉంటుంది.
కాకి – పెద్ద పుల్లలతో గూడుకడతే – గిజిగాడు సన్నని తీగలు, కొబ్బరి ఆకు ఈనెలతో చిత్రంగా గూడు కడుతుంది.
5. మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమేనా ? మీరేమంటారు ? (పేజీ నెం. 92)
జవాబు:
అవును. మానవుడు కూడా పక్షులు, జంతువులు మాదిరిగానే ప్రకృతిలో ఒక భాగమే !
- ఎందుకంటే వాటితో పాటే మనం. వాటి మీద ఆధారపడి మనం ఇన్ని లక్షల సంవత్సరాలు జీవించాం.
- కానీ ఇప్పుడు మన కార్యకలాపాల వల్ల ప్రకృతి నాశనం అవుతుంది.
- దీని వల్ల జీవవైవిధ్యం నాశనమవుతుంది.
- ప్రకృతి లేకపోతే మానవ మనుగడే ఉండదు.
- అన్ని జీవులలాగా మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగం అని నా అభిప్రాయం.
పాఠ్యాంశములోని ప్రశ్నలు
ప్రశ్న 1.
రంపచోడవరం పులులు ఎందుకు అంతరించాయి ? (పేజీ నెం. 87)
జవాబు:
1. రంపచోడవరంలో రంగు మట్టితవ్వకాలు వలన వందల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.
ప్రశ్న 2.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.
ప్రశ్న 3.
రంపచోడవరం నెమళ్ళ సంఖ్య పెరిగింది. కారణం ఏమిటి ?
జవాబు:
- రంపచోడవరంలో రంగు మట్టి కోసం తవ్వకాలు చేసారు.
- అందువల్ల అడవి పలుచబడింది.
- ఆవాసం లేక పాములు బయట సంచరించాయి.
- అవి నెమళ్ళ కంటపడ్డాయి.
- పాములు నెమళ్ళకు ఇష్టమైన ఆహారం కాబట్టి అవి ఎక్కువ పాముల్ని తిన్నాయి.
- ఆహారం పుష్టిగా ఉంది. కాబట్టి ప్రత్యుత్పత్తిలో ఎక్కువ సఫలత వచ్చి నెమళ్ళ సంఖ్య పెరిగింది.
ప్రశ్న 4.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ? అసలు అలు (పేజీ నెం. 92)
జవాబు:
1. పులిని కాపాడాలంటే అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !
ప్రశ్న 5.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే !
2. పులులు తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది కదా !
ప్రశ్న 6.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.