SCERT AP Board 7th Class Telugu Guide Answers 4th Lesson మఱ్ఱిచెట్టు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 4th Lesson Questions and Answers మఱ్ఱిచెట్టు

7th Class Telugu 4th Lesson మఱ్ఱిచెట్టు Textbook Questions and Answers

వినడం – ఆలోచించి మాట్లాడడం
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 1

ప్రశ్న 1.
చిత్రాన్ని గమనించండి. మాట్లాడండి.
జవాబు:
పై చిత్రంలో ఒకడు గొడ్డలితో చాలా చెట్లు కొట్టేశాడు. అతను ఒక పెద్ద చెట్టు క్రింద సేద దీరదామని వస్తున్నాడు. తనను కూడా నరికేస్తాడేమోనని పెద్దచెట్టు భయపడింది. తమ జాతికే చెందిన కర్రవెళ్లి గొడ్డలిలో దూరి అతనికి సహాయం చేస్తున్నందుకు ఆ కర్రవైపు పెద్దచెట్టు కోపంగా చూసింది. అతను పెద్ద చెట్టు నీడలో సేద దీరాడు. దాని పళ్లు తిన్నాడు. తను కూడా సహాయమే చేసినందుకు తనమీద తనకే అసహ్యం వేసింది. మళ్లీ ఆలోచించింది. తనను చంపడానికి వచ్చిన వారికి కూడా సహాయం చేసే గొప్ప వృక్షజాతిలో పుట్టినందుకు ఆనందించింది. సహాయం పొంది కూడా చంపడానికి గొడ్డలెత్తే మానవజాతి పై జాలి పడింది.

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
చుట్టూ ఉన్న పరిసరాలలో మానవులకు మేలుచేసే చెట్లు/పక్షులు/జంతువులను గురించి వారి మాటల్లో చెప్పండి. (రాయండి)
జవాబు:
1) మేలు చేసే చెట్లు :
మేమందరం మేలు చేసే చెట్లమే. మీకు ‘నీడనిస్తాం. నిమ్మ, మామిడి, అరటి, కొబ్బరి, బొప్పాయి ఇలా ఎన్ని పేర్లని చెప్పుకోం. మేమంతా మానవులకు, పశువులకు, పక్షులకు, కీటకాలకి అంతెందుకు ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికీ, ఆహారాన్ని ఇస్తాం. నీడ నిస్తాం. అన్ని జీవులూ మామీద ఆధారపడతాయి. కాని, మేమెవ్వరి మీదా ఆధారపడం, మేము సొంతంగా ఆహారం తయారుచేసుకొంటాం. గాలి, సూర్యకాంతి, మా ఆకులలోని పచ్చదనాన్ని ఉపయోగించుకొని, ఆహారాన్ని తయారుచేస్తాం. అది మీరు తింటారు. మీకు ఆక్సిజన్ అందించేది కూడా మేమే. మీరు మాకేమీ ఉపకారం చేయక్కర్లేదు. మాకు అపకారం తలపెట్టకండి చాలు. ఇప్పటికే సరైన గాలి, చల్లదనం, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా బుద్ధిలేదు. మమ్మల్ని బ్రతకనివ్వరు. మేం లేకపోతే మీ బ్రతుకు దుర్బరం. అది తెలుసుకోండి. ఐనా వినకపోతే మీ ఖర్మ. (ఈ విధంగా చెప్పండి)

2) పక్షులు :
ప్రకృతిలో మా పక్షుల కిలకిలలు .మీకు వీనుల విందు చేస్తాయి. మా బ్రతుకు మేం బతుకుతుంటే మమ్మల్ని మీరు బతకనివ్వటల్లేదు. మీ ఆహారం కోసం మమ్మల్ని చంపుకొని తింటున్నారు. అయినా సహించాం. మా జాతికి చెందిన కోడి మిమ్మల్ని నిద్ర లేపుతుంది. కోడికి పల్లెటూరి గడియారమని పేరు. కోడిని పకోడిగా చేసుకొని తినేస్తున్నారు. మీ రాక్షసానందం కోసం మా కాళ్లకు కత్తులు కట్టి పోరాటాలు పెడుతున్నారు. నెమలి పింఛం అంత అందమైనదేదీ ఈ సృష్టిలో లేదు. ఆ నెమలి కూడా మీకు బలైపోతుంది. కొంతమంది దయామూర్తులు పక్షి ప్రేమికులు మమ్మల్ని పెంచుతూ కాపాడుతున్నారు. మీ ఆనందం కోసం మమ్మల్ని బాధ పెట్టకండి. చంపకండి.

3) జంతువులు :
మేము జంతువులం. మా బాధ వర్ణనాతీతం. మా బాధలకు ఎక్కువగా కారణమయ్యేది మానవులే. మాలోని ఆవులు, గేదెలు, మేకలు మీకు త్రాగడానికి పాలనిస్తున్నాయి. మా పాలు తాగి బలం పొంది, మమ్మల్నే కోసుకొని తినేస్తున్నారు. మీ ఇళ్లలో పెళ్లి వచ్చినా, చావు వచ్చినా మాకు చావు తప్పదు. మాకు పులులు, సింహాలు కంటే కూడా మాన్క “తేనే భయం. పులులు, సింహాలకే మీరంటే భయం. మీ మూర్ఖత్వానికి మాలోనూ, పక్షులలోనూ కొన్ని రకాల జాతులు నశించిపోయాయి. అక్కడక్కడా జంతు ప్రేమికులుండబట్టి ఈ మాత్రమైనా బతుకుతున్నాం. లేకపోతే మాకసలు బతుకే లేదు.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ప్రశ్న 2.
మీరు చూసిన / విన్నటువంటి బాధ / సంతోషం గురించి మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
నేను చూసిన బాధ :
ఒకసారి అమలాపురం దగ్గర ఉన్న ఒక గ్రామంలో గ్యాస్ లీకై మండిన సందర్భంలో చాలామంది శరీరాలు కాలిపోయాయి. ఒళ్లంతా కాలిపోయి మంటపుట్టి వాళ్లందరూ గోలగోలగా ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చేసింది. చాలా సేపు ఏడ్చాను. మా అమ్మా, నాన్న ఎంత ఊరుకో పెట్టినా ఏడుపు ఆగలేదు. ఇది జరిగి చాలాకాలమైంది. కానీ, ఇప్పటికీ చలిమంటంటే కూడా నాకు భయమే.

నేను చూసిన సంతోషం :
మా అక్క లావణ్య పెళ్లి జరిగి రెండేళ్లయింది. మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు. బోలెడన్ని పిండివంటలు చేసారు. ఎన్నో ఆటలు ఆడుకున్నాం. మా లావణ్యక్కను పెళ్లికూతుర్ని చేసిన రోజు అక్క చాలా సిగ్గుపడింది. ఆ సిగ్గు చూసి అందరూ ఒకటే నవ్వు. మా మాధురక్క ఐతే మరీ నవ్వేసింది. మా శివ బావగారు తెగ ఆటపట్టించారు. పెళ్లి పిలుపులకు, బ్యాండు మేళంతో ఊరంతా తిరిగాం. పెళ్లిలో కూడా మేమందరం చాలా ఆనందంగా తిరిగాం. మేమంతా పెళ్లి కొడుకైన సృజిత్ కు కారం కిళ్లీ ఇచ్చి ఏడిపించాం. ఆ పెళ్లి వేడుకలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి.

ప్రశ్న 3.
మఱ్ఱి చెట్టు నిస్వార్ధ బుద్ధితో పక్షులకు, మానవులకు ఎలాంటి సహాయాన్ని అందిస్తోందో మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
మఱ్ఱిచెట్టు నిస్వార్థ బుద్ధితో మానవులకు, పక్షులకు ఆశ్రయం కల్పించింది. మానవులకు చెట్టు కింద నీడ నిచ్చింది. పక్షులు చెట్టుపైన గూళ్లు కట్టుకొని నివసించేలాగా ఆశ్రయం కల్పించింది.

ప్రశ్న 4.
కింది వచనం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
స్వామి వివేకానంద అమెరికా, బ్రిటన్ వంటి సంపన్నదేశాలను దర్శించారు. భారతదేశానికి తిరిగి ప్రయాణమయినప్పుడు అక్కడి పత్రికా విలేఖరులు “మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా “భారతదేశాన్ని లోగడ ప్రేమించాను. కాని ఇప్పుడు భారతభూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. అది నాకొక తీర్థస్థానం” అని సగర్వంగా చెబుతారు. ఈ విధంగా కనిపించిన తల్లి మీద ఎలాంటి మాతృభావన ఉంటుందో మనకు జన్మభూమి అయిన భారతదేశం మీద కూడా అలాంటి మాతృభావన కలిగి ఉండాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు.
ప్రశ్నలు:
1) వివేకానందుణ్ణి పరాయి దేశంలో పత్రికా విలేఖరులు ఏమని ప్రశ్నించారు?
జవాబు:
వివేకానందుని మాతృభూమి పట్ల ఆయన అభిప్రాయాన్ని గూర్చి పత్రికా విలేఖరులు ప్రశ్నించారు.

2) విలేఖరుల ప్రశ్నకు వివేకానందుడు ఏమని సమాధానం చెప్పారు?
జవాబు:
భారతదేశాన్ని గతంలో తాను ప్రేమించానన్నాడు. కాని ఇప్పుడు భారతభూమిలోని ప్రతి ధూళికణం తనకు అత్యంత పవిత్రమైనదని అన్నాడు. భారతదేశం తనకొక తీర్థ స్థానమని పత్రికా విలేఖరులకు వివేకానందుడు చెప్పాడు.

3) మాతృభావన ఎవరి యెడల కలిగి ఉండాలని ప్రకటించారు?
జవాబు:
మన జన్మభూమి అయిన భారతదేశం ఎడల మనం మాతృభావన కలిగి ఉండాలని వివేకానందుడు ప్రకటించాడు.

4) వచనాన్ని చదివి ‘శీర్షిక’ను నిర్ణయించండి.
జవాబు:
ఈ పేరాకు ‘వివేకానందుని వివేకం’ అనే శీర్షికను నిర్ణయించాను.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మఱ్ఱి చెట్టు చెప్పిన నవ్వు తెప్పించే సంఘటన ఏది?
జవాబు:
మఱ్ఱిచెట్టు క్రింద కూర్చొన్న వాళ్లు చెట్టుపైన ఉన్న పక్షులను కొట్టేవారు. అది చూసి ఒక కాకి సహించలేకపోయింది. అది కూడా అదే చెట్టుపై గూడు కట్టుకొని ఉంటుంది. చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా ఉత్సాహంగా, గొప్పగా, మాట్లాడుతుంటే సరిగ్గా గురి చూసి, అతనిపై కాకి రెట్ట వేసేది. అప్పుడతని వెర్రిమొహం చూసి అందరూ ఘోల్లున. నవ్వేవారు. ఈ లోగా కాకి ఎగిరిపోయేది. ఆ సంఘటనకు మఱ్ఱిచెట్టుకూ నవ్వు వచ్చేది.

ప్రశ్న 2.
పక్షి కథను గురించి మఱ్ఱిచెట్టు ఏమి చెప్పింది?
జవాబు:
ఒకరోజు పిట్టలు కొట్టేవాడొకడు వచ్చాడు. భయంతో పక్షులన్నీ పారిపోయాయి. పిల్లలున్న ఆడపక్షులు మాత్రం పిల్లలను విడిచి వెళ్లలేక, గూళ్లలోనే కూర్చున్నాయి. పిట్టలు కొట్టేవాడు గూళ్లను పొడుస్తాడని వాటికీ తెలుసు. కానీ, ఏం చేస్తాయి? పిల్లలను వదిలి వెళ్లలేక ఉండిపోయాయి.

ఒక పక్షి మాత్రం గూటిదాకా వెళ్లలేకపోయింది. ఒక కొమ్మను అంటిపెట్టుకొని కూర్చొంది. కొమ్మ చిన్నది. పక్షి పెద్దది. అందుచేత అది వేటగాడికి కనిపించింది. బాకు కట్టి ఉన్న పెద్ద వాసంతో పిట్టలు కొట్టేవాడు దానిని పొడిచాడు. ఆ పక్షి కేరుమంది. దానిని బుట్టలో వేసుకొని వెళ్లిపోయాడు.

ప్రశ్న 3.
నరసింహులు బాల్యాన్ని గురించి మద్దిచెట్టు ఏమని నెమరువేసుకొంది?
జవాబు:
నరసింహులు గ్రామ సర్పంచ్. అతడు బాల్యంలో ఆకతాయితనంగా తిరిగేవాడు. చెరువులో ఈత కొట్టేవాడు. మఱ్ఱి చెట్టెక్కి కొమ్మలు విరిచేవాడు. గోలచేసేవాడు. చెట్టుపై ఉన్న పక్షులను తోలేసేవాడు. మరీ చిన్నప్పుడు బడి ఎగొట్టేవాడు. పలకా, పుస్తకాలతో తొర్రలో దాక్కొనేవాడు. ఊడలతో ఉయ్యాలలూగేవాడని అతని బాల్యాన్ని మఱ్ఱిచెట్టు గుర్తుచేసుకుంది.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మఱ్ఱిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని వివరించండి.
జవాబు:
తన నీడను కూర్చొని మానవులు అస్తమానూ హక్కుల గురించి మాట్లాడుకొనేవారు. కొమ్మలను ఆశ్రయించుకొని బతుకుతున్న పక్షులను బాధించేవారు. అది తమ హక్కులా భావించేవారు. తనను అడగకుండానే తన నీడను చేరేవారు. హాయిగా సేదతీరేవారు. కబుర్లు చెప్పుకొనేవారు. కాని, పక్షులకూ హక్కులుంటాయని ఆలోచించరు. చెట్లకు హక్కులుంటాయని తెలుసుకోరు. వాటికున్న జీవించే హక్కును హరించే హక్కు తమకుందని భావించే మనుషుల ఆలోచనా ధోరణికి మజ్జి చెట్టుకు అసహ్యం వేసింది. అదే హక్కుల గురించి మాట్లాడవలసిన సందర్భంగా ఏర్పడింది.

ప్రశ్న 2.
మఱ్ఱి చెట్టు తనకు – గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మఱ్ఱిచెట్టు గ్రామస్తులతో తనకు ఉన్న అనుబంధాన్ని చక్కగా చెప్పింది. గ్రామస్తులు చెప్పుకొనే సంగతులన్నీ తనకు తెలుసు. ఎవరికి వారే తామే ఉన్నామనుకొని రహస్యాలు చెప్పుకొనేవారట. తాము చెట్టు క్రింద నీడలో ఆశ్రయం. పొందుతూనే దానిమీద ఉన్న పక్షులను కొట్టేవారు. అది తమ హక్కుగా భావించేవారు. ఇవన్నీ మానవులలోని దుర్లక్షణాలు. వీటిని చక్కగా వివరించింది. పిట్టలు కొట్టేవాడు ఒక పక్షిని చంపిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పింది. అది చాలా హృదయ విదారకమైన దృశ్యం.

పాతకాలంనాటి మనుషులకు ఈ రోజులలో మనుషులకు తేడాలను బాగా చెప్పింది. ఆ రోజులలో ఎవరైనా చెట్ల కొమ్మలు విరుస్తున్నా, పక్షులను, జంతువులను కొడుతున్నా చూసినవారు గదమాయించేవారు. నేటి రోజులలో ఆ పద్ధతి పోయింది. ఎవ్వరూ ఎవరినీ పట్టించుకోవడంలేదు.

చిన్నతనంలో నరసింహులు చేసిన అల్లరిని గుర్తు చేసుకొంది. అతను సర్పంచ్ అయినందుకు ఆనందించింది. కాని, అతను తనను నరకడానికి వచ్చాడని తెలిసి బాధపడింది. ఈ విధంగా ప్రతి విషయాన్నీ మఱ్ఱిచెట్టు చక్కగా వివరించింది.

ప్రశ్న 3.
మానవుల వలె చెట్లు / పక్షులు, జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి.
జవాబు:
మానవుల వలే చెట్లు / పక్షులు / జంతువులు మాట్లాడగలిగితే అవి అనే మాటలకు మానవుడు ఈ భూమి మీద బతకలేడు. అతను చేసే అరాచకాలను ప్రకృతి ప్రశ్నించకే మూర్ఖుడిలా, ఉన్మాదిలాగా తయారయ్యాడు. కొన్నివేల హెక్టార్ల అడవులను మనిషి నాశనం చేశాడు. భూమండలం మీద కాలుష్యం పెంచాడు. ఆక్సిజన్ కొరత ఏర్పరిచాడు. వేడిని పెంచాడు. వర్షాలు రాకుండా చేశాడు. చెట్లు మాట్లాడితే ఈ అరాచకాలకు ఏనాడో అడ్డుకట్ట పడేది. భూలోకం స్వర్గలోకంలా ఉండేది.

ఆదిమానవుని కాలంలో పక్షులను, జంతువులను వేటాడి చంపాడు. ఆధునికుడయ్యాక పెంపకం పేరుతో చంపుతున్నాడు. అనేక పక్షి, జంతు జాతులు ఆనవాలు కూడా లేకుండా పోయాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మానవుని నూతన ఆవిష్కరణలు, సైన్సు అభివృద్ధి పక్షుల, జంతువుల నాశనానికి వచ్చింది. అవి మాట్లాడితే భూమండలం కిలకిలలతో కలకలలాడుతూ ఉండేది.

భాషాంశాలు

అ) కింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్ధాన్ని రాయండి.
ఉదా : గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది.
విస్తుపోవు – ఆశ్చర్యపడు

1. జంతువులు, పక్షులు వంటి ప్రాణుల యెడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు.
జవాబు:
నిర్దాక్షిణ్యం – దయలేకపోవడం

2. జడివానతో వీచే పెనుగాలి చెట్లను పెళ్ళగిస్తుంది.
జవాబు:
పెళ్ళగించు – పెకలించు

3. దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది.
జవాబు:
సత్తువ – బలం

4. 2025 నాటికి భారతదేశం ఇదమిద్ధంగా విశ్వగురుస్థానాన్ని చేరుతుంది.
జవాబు:
ఇదమిద్ధం – కచ్చితం

ఆ) కింది పదాలకు పర్యాయపదాలను పద విజ్ఞానం నుండి గ్రహించండి.

1. నెపం – కారణం, మిష
2. ఆశ్రయం – అండ, ఆలంబన
3. అపేక్ష – కాంక్ష, కోరిక

ఇ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.

1. హృదయము అ) సత్తువ
2. నిభ ఆ) ఎద
3. సత్వము ఇ) పత్తనము
4. పట్టణము ఈ) నెపము

జవాబు:

1. హృదయము ఆ) ఎద
2. నిభ ఈ) నెపము
3. సత్వము అ) సత్తువ
4. పట్టణము ఇ) పత్తనము

ఈ) కింది పదాలకు సొంతవాక్య ప్రయోగం చేయండి.
ఉదా : సీత, సావిత్రి కబుర్లు చెప్పుకొంటున్నారు.

మనసులో పెట్టుకొను – తరతరాలు – విశ్రాంతి – చీటికీ మాటికీ – చూడముచ్చట – చెవిలో పడటం జ్ఞాపకం – అపేక్ష – ఆశ్రయం – అల్లాడిపోవు – అస్తమానం – మరుపుకురానంత – గొంతునులమటం – ఉయ్యాలలూగు – ఆగతాయి పనులు.
జవాబు:
1) మనసులో పెట్టుకొను = ఎవ్వరికీ చెప్పకపోవడం.
సొంతవాక్యం : మంచిని మనసులో పెట్టుకొని తిరిగి ఉపకారం చేయాలి.

2) తరతరాలు = వంశంలోని అనేకమంది.
సొంతవాక్యం : గాంధీజీని తరతరాలు గుర్తుపెట్టుకుంటారు.

3) విశ్రాంతి = విరామము
సొంతవాక్యం : విశ్రాంతి లేకుండా కష్టపడితే విజయం వరిస్తుంది.

4) చీటికీ మాటికీ = ఎక్కువసార్లు
సొంతవాక్యం : చీటికీ మాటికీ బడి మానేస్తే చదువురాదు కదా !

5) చూడముచ్చట = చూడడానికి అందంగా ఉండడం.
సొంతవాక్యం : చంటి పిల్లల అల్లరి చూడముచ్చటగా ఉంటుంది.

6) చెవిలో పడటం = వినబడటం
సొంతవాక్యం : మంచిమాటలు చెవిలో పడటం అదృష్టం.

7) జ్ఞాపకం = గుర్తు
సొంతవాక్యం : వృద్ధులకు చిన్నతనం జ్ఞాపకం వస్తుంటుంది.

8) అపేక్ష = కోరిక
సొంతవాక్యం : ధనం పైన మితిమీరిన అపేక్ష పనికిరాదు.

9) ఆశ్రయం = ఆలంబన
సొంతవాక్యం : పేదలకు ఆశ్రయం ఇవ్వాలి.

10) అల్లాడిపోవు = బాధపడు
సొంతవాక్యం : వేసవిలో నీరు దొరకక కొందరు అల్లాడిపోతారు.

11) అస్తమానం = పదేపదే
సొంతవాక్యం : అస్తమానం ఆడుకోకూడదు. చదువుకోవాలి.

12) మరుపుకురానంత = మరిచిపోలేనంత
సొంతవాక్యం : ఎవరి విజయం వారికి మరుపురానంత ఆనందం ఇస్తుంది.

13) గొంతునులమటం = పీకనొక్కడం, చంపడం
సొంతవాక్యం : ఎవ్వరినైనా గొంతునులమటం తప్పు, మహాపాపం.

14) ఉయ్యాలలూగు = హాయిని అనుభవించు
సొంతవాక్యం : పిల్లలు ఆనందంతో ఉయ్యాలలూగుతారు.

15) ఆగతాయి పనులు = అల్లరి పనులు
సొంతవాక్యం : ఆగతాయి పనులు చేస్తే అపఖ్యాతి వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఉ) కింది పదాలను ఏ అర్థంలో – సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి.
ఉదా : కాలక్షేపం : ‘సమయాన్ని వృథాగా గడుపుట’ అనే అర్థంలో ఉపయోగిస్తారు.

1) హృదయ విదారకం :
మనసుకు చాలా బాధ కలిగించేదానిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు.

2) గుండెలు అలసిపోయేటట్టు :
విపరీతంగా ఏడుస్తున్న లేక బాధతో పరుగెడుతున్న సందర్భం వివరించేటపుడు ఇది ఉపయోగిస్తారు.

3) ముక్కు మీద వేలేసుకొను :
ఊహకందని పరిస్థితిని చూసి ఆశ్చర్యపడే వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

4) గుండె చెరువగు :
భరించలేనంత దుఃఖం కలిగిన దానిని గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

5) హృదయం ముక్కలవడం :
అనుబంధానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైన జరిగి బాధ కలిగిన సందర్భంలో వివరించేటపుడు ఇది ఉపయోగిస్తారు.

6) పొట్టన పెట్టుకును :
కాపాడగలిగీ కాపాడకుండా ఒకరి మరణానికి కారణమైన వారి గురించి వివరించే సందర్భంలో ఇది ఉపయోగిస్తారు.

వ్యాకరణాంశాలు

అ) కింది వాక్యాలు చదవండి.

1. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు.
2. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు.
3. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు.
4. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు.
5. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు.

ఆ) గీత గీసిన పదాలను విడదీసిరాయండి.
ఉదా : రామాయణాన్ని = రామాయణము + ని
1. భారతాన్ని = భారతము + ని
2. కల్పవృక్షాన్ని = కల్పవృక్షము + ని
3. హరివంశాన్ని = హరివంశము + ని
4. భాగవతాన్ని = భాగవతము + ని

పై ఉదాహరణల్లోని వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని / దేనిని / వేనిని అని ప్రశ్నిస్తే (వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించారు?) వచ్చే సమాధానాన్ని ‘కర్మ’ అని చెప్పవచ్చు. అలాంటి పదాలకు చివర ద్వితీయా విభక్తి ప్రత్యయమైన ని/ను (రామాయణాన్ని) చేరటాన్ని గమనించవచ్చు.

సకర్మకం – లకర్మకం

ఇ) కింది వాక్యాలను చదవండి.

1. కౌసల్య రాముని చూసి సంతోషించింది.
2. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది.
3. కైకేయి భరతుని రాజుగా చూడదలచింది.
4. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు.

పై ఉదాహరణల్లో క్రియకు ముందు ఎవరిని / దేనిని / వేనిని (కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది) అనే పదాన్ని ఉంచినపుడు సమాధానం వస్తోంది. కనుక ఈ వాక్యాలను ‘సకర్మకాలు’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఈ) కింది వాక్యాలు చదవండి.

1. దశరథుడు మరణించాడు.
2. జటాయువు నేలకూలాడు.
3. సూర్యుడు ఉదయిస్తున్నాడు.
4. సంపాతి ఎగురుతున్నాడు.

పై ఉదాహరణల్లో క్రియకు ముందు దేనిని / వేనిని / ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావడం లేదు. అంటే ఈ వాక్యాలలో కర్మ లేదని అర్థం. కనుక పై వాక్యాలను ‘అకర్మకాలు’ అంటారు.

ఇత్వ సంధి

ఉ) కింది వాక్యాలను గమనించండి.

1. కొండపల్లి విహార యాత్రకు వెళ్లి ఏమేమి బొమ్మలు కొన్నారు?
2. ఏమంటివి? మంచిని పంచమంటివా?
3. వసతి గృహ విద్యార్థులు సంక్రాంతికింటికి వెళ్లాలని అనుకుంటున్నారు.
4. మంచినెంచు వారు మానవులే?
5. మంచి కొంచెం చేసినా పదింతలు ఫలితాన్ని ఇస్తుంది.
6. సిరిగల వానికెయ్యెడల చేసిన మేలు నిష్ఫలం బగున్.

ఊ) గీత గీసిన పదాలను విడదీయండి.
ఉదా : ఏమేమి = ఏమి + ఏమి (ఇది ఇత్వ సంధి కాదు. ఆమ్రేడిత సంధి)
1. ఏమంటివి = ఏమి + అంటివి
2. సంక్రాంతికింటికి = సంక్రాంతికిన్ + ఇంటికి
3. మంచినెంచు = మంచిని + ఎంచు
4. పదింతలు = పది + ఇంతలు
5. వానికెయ్యెడల = వానికిన్ + ఎయ్యెడల

పై ఉదాహరణలలో విడదీసిన పదాలలో పూర్వ స్వరంగా ‘ఇ’ కారం ఉంది. ఇలా పూర్వస్వరంగా ‘ఇ’ ఉండి దానికి ఏదైనా అచ్చు పరమైనపుడు జరిగే సంధి కార్యాన్ని “ఇకారసంధి” అంటారు. పైన 2వ, 5వ ఉదాహరణలలో విడదీసినపుడు సంక్రాంతికిన్, వానికిన్, అని ఉంది. రెండు పదాలలోనూ చివర “నకారపు పొల్లు” ఉంది కదా ! ‘నకారపు పొల్లు’ను ‘ద్రుతము’ అంటారు. ‘ద్రుతము’ అంటే (అవసరం లేకపోతే) కరిగిపోవునది అని అర్థం.

ఇక్కడ ఇత్వసంధి కలిసినపుడది ,కరిగిపోయింది. సంక్రాంతికింటికి, వానికెయ్యెడల అనే రూపాలేర్పడ్డాయి. ద్రుతము కరగకపోతే “సంక్రాంతికినింటికి, వానికి నెయ్యెడల” అనే రూపాలుకూడా ఏర్పడతాయని గ్రహించండి. ఇది వైకల్పిక సంధి కదా ! పైన చెప్పిన సంక్రాంతికి నింటికి, వానికి నెయ్యెడల అనేవి సంధి రానప్పటి రూపాలని గుర్తుంచుకోండి.

ఋ) కింది పదాలను విడదీయండి. పూర్వ స్వరాన్ని గమనించండి.

1. అమ్మగారింట్లో = అమ్మగారి + ఇంట్లో ‘8’లోని హ్రస్వ ఇకారం)
2. అత్తగారింట్లో – అత్తగారి + ఇంట్లో (‘8’లోని హ్రస్వ ఇకారం)
3. చేతికందెడు = చేతికి(న్) + అందెడు (‘కి’లోని హ్రస్వ ఇకారం)
4. చిన్నదైనా – చిన్నది + ఐనా (‘ది’లోని హ్రస్వ ఇకారం)
5. లేనిదంటు – లేనిది + అంటు (‘ది’లోని హ్రస్వ ఇకారం)

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

ఋ) కింది వాక్యాలను చదవండి. ‘కర్మ’ ను గుర్తించి గీత గీయండి.

1. నేను చెరువు గట్టునే పుట్టాను.
2. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను.
3. పక్షి కేరుమని అరిచింది.
4. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు.
5. మర్రి చెట్టు పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి.
6. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు.

ఎ) పై వాక్యాల నుండి సకర్మక – అకర్మక వాక్యాలను విడదీసి రాయండి.
సకర్మక వాక్యాలు :
1. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను.
2. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు.
3. మర్రిచెట్టు పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి.
4. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు.

అకర్మక వాక్యాలు :
1. నేను చెరువు గట్టునే పుట్టాను.
2. పక్షి కేరుమని అరిచింది.

ఏ) పాఠం ఆధారంగా కొన్ని సకర్మక వాక్యాలు గుర్తించండి. రాయండి.

  1. పై భాగాన్నంతా కట్టెల క్రింద కొట్టారు.
  2. ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదాన్ని.
  3. అనేక విషయాలు చెప్పుకొంటూ ఉండేవారు.
  4. పులిజూదం ఆడుకొనేవారు.
  5. నేను గాలివీస్తూ ఉండేదానిని.
  6. నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు.
  7. నా వేళ్లే నాకు ఆహారాన్ని సమకూర్చి పెట్టినై
  8. నా నీడన మనుష్యులు విశ్రాంతిని పొందుతారు.
  9. నా నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తారు.
  10. కాకి గూడును కట్టుకొని ఉంది.

ఐ) పాఠం ఆధారంగా కొన్ని అకర్మక వాక్యాలు గుర్తించండి. రాయండి.

  1. ఆ కొమ్మను ఆకులు కూడా ఉన్నాయి.
  2. కొన్ని పక్షులు భయంతో లేచిపోయినై
  3. పిట్టలు కొట్టేవాడు క్రింద ఉన్నాడు.
  4. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను.
  5. ఆ పక్షి కొంచెం పెద్దది.
  6. రోజులలా మారినై.
  7. మానవుల దృష్టి మారిపోయింది.
  8. నరసింహులు మా గ్రామపంచాయితీ ప్రెసిడెంటు అయ్యాడు.
  9. నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరిగేవాడు.
  10. కాని, అతను అందుకు రాలేదు.

ప్రాజెక్టుపని

చుట్టూ వున్న పరిసరాలలో మానవులకు మేలు చేసే (వేప/రావి/తులసి/తుమ్మ ఏదైనా చెట్టు చిత్రాన్ని గీయండి. దాని గురించి రాయండి.
జవాబు:
వేప :
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 2
వేపచెట్టు ఆరోగ్య ప్రదాయిని. వేపచెట్టు గాలి తగిలితే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు నయమౌతాయి. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరంపై దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. వేప పుల్లతో పళ్లు తోముకుంటే పళ్లు గట్టిపడతాయి. పిప్పిపళ్లు, పుచ్చుపళ్లు వంటివి ఉండవు. పరగడుపున వేపచిగుళ్లు నమిలితే కడుపులో నులిపురుగులు పోతాయి. షుగరు వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. వేప కలపను గుమ్మాలకు ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కనుకనే వేపచెట్టును అమ్మవారిగా పూజిస్తారు. ప్రదక్షిణలు చేస్తారు.

తులసి :
AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 3
తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఇంటిలోను గుమ్మానికి ఎదురుగా తులసికోట కట్టుకొని, దానిలో తులసి మొక్కను వేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తులసిమొక్కలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి విష్ణుతులసి, రెండవది లక్ష్మీ తులసి. విష్ణుతులసి కొంచెం నల్లగా ఉంటుంది. తులసి ఆకులను పూజలలో ఉపయోగిస్తారు. విష్ణువుకు తులసిమాలలు అలంకరిస్తారు. తులసి తీర్థం త్రాగి ఉపవాసం ప్రారంభిస్తారు. ఉపవాసం ముగించడానికి కూడా తులసి తీర్థం త్రాగుతారు.

మందుల తయారీలో ఎక్కువగా విష్ణు తులసిని ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో వాడతారు. ఇంటి వైద్యంగా కూడా ఉపయోగిస్తారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె . జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రోగాలు నయం చేయడానికి తులసిని ఉపయోగిస్తారు. తులసిలో అధిక మోతాదులో యూజినాల్ ఉండడం వలన నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒక్కమాటలో తులసి మనపాలిట ఆరోగ్యలక్ష్మి.

సుభాషితం

మేలైనను గీడైనను
శీలవతీ ! మనుజుడెద్ది సేయు బరులకున్
వాలయంబుగ నది ఫల
కాలంబున గుడుచు వేరుగలుగదు చెపుమా !

భావం :
ఓ సదాచార సంపన్నురాలా ! మానవుడు ఇంకొకరికి మేలు చేసినా, కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. ఫలితం అనుభవించుటలో ఇంకో విధంగా జరగనే జరగదు.

ఉపాధ్యాయులకు సూచనలు

  1. ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ రచనను సేకరించండి. చదవండి.
  2. ‘నీతి చంద్రిక’ కథలను విద్యార్థులతో చదివించండి.

కవి పరిచయం

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు 4
రచయిత పేరు : త్రిపురనేని గోపీచంద్
జననం : కృష్ణాజిల్లా, అంగలూరులో 8. 9. 1910లో జన్మించారు.
తల్లిదండ్రులు : పున్నమాంబ, రామస్వామి చౌదరి.
చదువు : బి.ఎ. న్యాయవాద పట్టా (‘లా’ డిగ్రీ)
ఉద్యోగాలు : న్యాయవాది (కొంతకాలం), ఆంధ్రరాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్, ఆకాశవాణిలోనూ పనిచేశారు.

రచనలు :
ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు – కొడుకులు, మాకూ ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు మొదలైనవి.

అవార్డులు : వీరి రచన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 8.9.2011న గోపీచంద్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలాబిళ్ల విడుదల చేసింది.

ప్రత్యేకతలు :
గోపీచంద్ దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. ఆయన జీవితమే ఒక చైతన్య కు స్రవంతి. ఆయన 2.11. 1962న స్వర్గస్తులయ్యారు.

పదాలు – అర్థాలు

1. నేనిప్పుడే……… జ్ఞాపకం వుంది.
అర్థాలు :
లాట్లు = పోగులు, గుట్టలు (వస్తువుల)
నాశనం = నిర్మూలనం
కబుర్లు = మాటలు
ముఖమార్జన = పళ్లుతోముకొని ముఖం శుభ్రం చేసుకోవడం
రహస్యాలు = మర్మాలు
చెవిలో పడడం = వినబడడం
గ్రామస్తులు = గ్రామంలోనివారు
కుర్రకారు = యువత
విస్తుపోవడం = ఆశ్చర్యపోవడం
పులిజూదం = పులి – మేక ఆట
అర్థించుట = యాచించుట
చీటికీమాటికీ = చాలాసార్లు
అపేక్ష = ఆశ, అభిమానం
విత్తు = విత్తనం
ఇదమిద్దంగా = కచ్చితంగా
ఆశ్రయం = అండ
కసి = కోపం
భేదం = తేడా
నిత్యం = ఎల్లప్పుడూ
ఏటికికోటికి = ఎప్పుడైనా
జ్ఞాపకం = గుర్తు
హృదయం ముక్కలవడం = మనసుకు చాలా బాధ కలగడం
దారుణం = ఘోరం
అవిసిపోవడం = పగిలిపోవడం

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

2. ఒకరిమీద ………… కూర్చున్నారంటారా?
అర్థాలు :
సత్తువ = బలం
నిమ్మ = చెమ్మ
కించిత్ = కొద్దిగా
స్వార్థం = కేవలం తన గురించి
స్వభావం = తన యొక్క ఆలోచన
ఇబ్బంది = అసౌకర్యం
అల్లాడు = గిలగిల లాడు, బాధపడు
ముక్కుమీద వేలు వేసుకోవడం = ఊహించని దాన్ని చూసి ఆశ్చర్యపోవడం
ఘోరాపచారం = దారుణమైన తప్పు

3. అవి రెట్టలు వేస్తున్నవంటారా? …………. ఆ పిట్టలవాడు.
అర్థాలు :
అనాకారపు పనులు = వికృత చేష్టలు
కశ్మలం = మలినము, మురికి
సంపర్కం = కలయిక
పట్టుబడడం = అలవడడం
హింసించటం = బాధపెట్టడం
హృదయం ద్రవించడం = చాలా బాధ కలగడం
పరిసరాలు = చుట్టుప్రక్కలు
అపాయం = ప్రమాదం
అలలు = కెరటాలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం = చాలా భయపడడం
పసిగట్టు = గ్రహించు
కొన = చివర
బాకు = కత్తి
వాసం = దూలం

4. ఇదంతా………. లూగుతుండేవాడు.
అర్థాలు :
నులమడం = నలపడం
పెల్లగించి = వెలికితీసి
స్పృహ = తెలివి
నిర్దాక్షిణ్యంగా = దయలేకుండా
పొట్టను పెట్టుకోవడం = చంపడం
దృష్టి = ఆలోచన
ఆగతాయితనంగా = అల్లరి చిల్లరగా, బాధ్యత లేకుండా

AP Board 7th Class Telugu Solutions 4th Lesson మఱ్ఱిచెట్టు

5. ఆ నరసింహులు ……. నా ధర్మం !
అర్ధాలు :
సన్మానం = సత్కారం
చూడముచ్చటగా = అందంగా
పురస్కరించి = గౌరవించి
పార్కు = ఉద్యానవనం
అభ్యుదయం = అభివృద్ధి
పంథా = మార్గం
జోహారు = నమస్కారము
అర్పించడం = ఇవ్వడం
గుండె చెరువవ్వడం = చాలా బాధ కలగడం
నిర్లక్ష్యం = పట్టించుకోకపోవడం
విస్తరి = భోజనం చేయడానికి ఉపయోగించే ఆకు
ఘనకార్యం = గొప్ప పని
వడ్రంగి = కర్రతో సామానులు చేసే వ్యక్తి
కుప్ప = పోగు
మొండము = కాండము
సమూలంగా = పూర్తిగా
కుళ్లగించు = పెల్లగించు, పెకలించు
కొన ఊపిరి = చివరి శ్వా స
రంగరించి = కలిపి