SCERT AP Board 7th Class Telugu Guide Answers 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu 12th Lesson Questions and Answers స్ఫూర్తి ప్రదాతలు

7th Class Telugu 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు Textbook Questions and Answers

ప్రశ్నలు – జవాబులు

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
స్కౌట్స్ లో విశేష సేవలందించిన విద్యార్థులకు ఏయే అవార్డులు ఇస్తారు?
జవాబు:
ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకూ చదివే పిల్లలకు స్కౌట్స్ గైడ్స్ సంస్థ శిక్షణ నిస్తుంది. ఇందులో కార్యక్రమాలలో పాల్గొని విశేష సేవలందించిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో రాజ్య పురస్కార్, దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు.

ప్రశ్న 2.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు ఎందుకు పిలువబడ్డారు?
జవాబు:
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ మొదలైన 16 భాషలలో 40 వేల పాటలను బాలు పాడారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గడించారు. అంతేకాదు ఏ నటుడికి పాడితే అతని గొంతును అనుకరించి పాడేవారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమ న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా ఎందరో వర్ధమాన గాయకులను తయారుచేశారు. అందుచేతనే బాలును బహుముఖ ప్రజ్ఞాశాలిగా పిలుస్తారు.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 3.
కవిశేఖర ఉమర్ ఆలీషా తెలుగు సాహిత్యా నికి ఎలాంటి కృషి చేశారు?
జవాబు:
తెలుగుభాషపై మమకారంతో 16వ ఏటనే ‘విద్యావిలాసం’ అనే శతకం రచించారు. 18వ ఏట మణిమాల నాటకం వ్రాశారు. అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌరవ రంగం, విచిత్ర బిల్హణీయం అనే నాటికలు, తారామతి, శాంత, పద్మావతి మొదలైన నవలలు వ్రాశారు. ‘జల్లుర్భా’ అనే యునానీ వైద్యగ్రంథం రచించారు. స్త్రీ, సామాజిక సమస్యలు ప్రస్తావించి, పరిష్కారాలు చూపారు. దాదాపు 50 పుస్తకాలు రచించి తెలుగు సాహిత్యానికి సేవ చేశారు.

ప్రశ్న 4.
కోడి రామమూర్తిని కలియుగ భీముడని ఎందుకంటారు?
జవాబు:
స్పెయిన్లో జరిగిన ఎడ్లపోటీలో ఎద్దును గాలిలోకి లేపి గిరగిరా త్రిప్పి విసిరేశాడు కోడి రామ్మూర్తి. కాలికి ఇనుప గొలుసులతో కారును కడితే, కారును అంగుళం కదలనీయకుండా ఆపిన మహాబలవంతుడు. ఊపిరి .బిగపట్టి ఒళ్లంతా గొలుసులు కట్టించుకొని ఊపిరి వదిలితే అవన్నీ పటపటా తెగిపోయేవి. రొమ్ముపై బండరాళ్లు పెట్టించుకొని వాటిని పగలకొట్టించుకొనేవాడు. అందుచేతనే కోడి రామ్మూర్తిని కలియుగ భీముడనేవారు.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాడిచర్లవారు అనుభవించిన జైలు జీవితం ఎటువంటిది?
జవాబు:
ఆంధ్ర తిలక్ గా ప్రసిద్ధులైన గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు వెల్లూరు సెంట్రల్ జైల్ జీవితం చాలా దారుణంగా అనుభవించారు.

ఆకట్టుకోవడానికి రెండు గోచీలు, మూర పొడవు ఉన్న రెండు తువ్వాళ్లు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినడానికి మట్టి మూకుడు, తాగడానికి మట్టిముంత, మల, మూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావుపాటి కడియాలు వేశారు. మెడకు మరో కడియం వేశారు. కొయ్యముక్కను వాటిలో దూర్చారు. తలబోడి చేయించారు. తినడానికి రాగి సంకటి ముద్ద పెట్టారు. దానిలో రాళ్లు, పుల్లలు, పురుగులు ఉండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని ఆయన 3 సంవత్సరాలు అనుభవించారు.

ప్రశ్న 2.
అన్నారుల పాలిట .అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మను ఎందుకు పిలుస్తారు?
జవాబు:
డొక్కా సీతమ్మగారు .నిరంతరం అన్నదానం చేసేది. ఒకసారి ఆమె అంతర్వేది వెళుతుంటే ఒక పెళ్లి బృందం కనిపించింది. వారు ఆకలితో మాట్లాడుకొనే మాటలను వింది. వారు డొక్కా సీతమ్మగారింటికి వెడితే అన్నం పెడతారు. చంటి పిల్లలకు పాలిస్తారు. అప్పటిదాకా ఓర్చుకోండి. అని ఒక పెద్దావిడ చెప్పడం వింది. వెంటనే తన – ప్రయాణం విరమించుకొంది. డొక్కా సీతమ్మగారు వారి కంటే ముందుగా, తన ఇంటికి వెళ్లింది. చక్కగా వంట చేసింది. వాళ్లు రాగానే తృప్తిగా భోజనాలు పెట్టింది. ఒకసారి ఒక తహసీల్దారుకు గరిక వేళ్లతో పచ్చడి చేసి భోజనం పెట్టింది.

ఈ విధంగా అన్నార్తుల పాలిట అపర అన్నపూర్ణగా డొక్కా సీతమ్మగారు ప్రసిద్ధి పొందింది.

AP Board 7th Class Telugu Solutions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 3.
స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాల గురించి వ్రాయండి.
జవాబు:
స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు.

ముసలివారిని రోడ్లు దాటిస్తారు. మూగజీవుల దాహార్తిని తీర్చి, సేవలు చేస్తారు. మొక్కలను నాటుతారు. రోజూ నీళ్లు పోస్తారు. అనారోగ్యంగా ఉన్నవారికి సహాయం చేస్తారు. జాతరలలో క్యూలను ఏర్పాటు చేస్తారు. నిరక్షరాస్యులకు చదువు చెబుతారు. దేవాలయాల వద్ద, ఉత్సవాలలో, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినపుడు, ఆపదలో, అవసరంలో ఉన్న వారికి స్వచ్ఛందంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అవసరమైన సేవలు చేస్తారు.