SCERT AP 7th Class Social Study Material Pdf 1st Lesson విశ్వం మరియు భూమి Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Social Solutions 1st Lesson విశ్వం మరియు భూమి

7th Class Social 1st Lesson విశ్వం మరియు భూమి Textbook Questions and Answers

కింది తరగతులలోని విషయ పునశ్చరణ

పటాన్ని పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 1

ప్రశ్న 1.
చిత్రంలో మీరు ఏమి గమనించారు?
జవాబు:
సూర్యుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, పాలపుంత, సౌర కుటుంబాలు, గ్రహాలు.

ప్రశ్న 2.
వీటిలో పగటిపూట కనిపించేవి మరియు రాత్రి సమయంలో కనిపించేవి ఏవి?
జవాబు:
పగటిపూట కనిపించేవి – సూర్యుడు.
రాత్రిపూట కనిపించేవి – నక్షత్రాలు, చంద్రుడు, పాలపుంత, తోకచుక్కలు.

ప్రశ్న 3.
ఈ అంశాలన్నింటిని మనం సమష్టిగా ఏమని పిలుస్తాము?
జవాబు:
విశ్వం అని పిలుస్తాము.

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

I. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.

ప్రశ్న 1.
విశ్వం గురించి మీకు ఏమి తెలుసు?
జవాబు:

  1. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును విశ్వం అంటారు.
  2. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్రవీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి.
  3. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైనది.
  4. విశ్వం అనే పదం లాటిన్ పదమైన “యూనివర్సమ్” నుండి ఉద్భవించింది. దీని అర్థం “మొత్తం పదార్థం” మరియు “మొత్తం అంతరిక్షం” అని.

ప్రశ్న 2.
సహజ పర్యావరణం అంటే ఏమిటి?
జవాబు:
సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువుల వంటి జీవులు ఉంటాయి. ఈ సహజ పర్యావరణంలో శిలావరణము, జలావరణము, వాతావరణము మరియు జీవావరణము ఉంటాయి. పర్యావరణంలో ఇవి సహజ అంశాలు. వీటిని భూమి యొక్క సహజ ఆవరణములు అని కూడా అంటారు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
“సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.” మీ సమాధానాన్ని సమర్ధించుకోండి.
జవాబు:
సహజ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.

  1. ఆదిమ మానవులు సహజ పరిసరాలతో మనుగడ సాగించటంలో తమను తాము అలవాటు చేసుకున్నారు. వారు సాధారణమైన జీవితాన్ని గడిపారు.
  2. వారి చుట్టూ ఉన్న ప్రకృతిని ఉపయోగించుకుని వారి అవసరాలను తీర్చుకున్నారు.
  3. స్థిర నివాసం మరియు. పారిశ్రామిక విప్లవం ఫలితంగా, మానవులు, సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో మరియు ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు.
  4. ఇది మానవ నిర్మిత పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ఏర్పడటానికి మరియు సహజ వాతావరణంలో మార్పులకు దారితీసింది.
  5. సహజ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణానికి భిన్నంగా ఉంటుంది.
  6. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  7. సహజంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పరిసరాలను సహజ పర్యావరణం అనవచ్చు.
  8. మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఏర్పరచుకున్నదే మానవ నిర్మిత పర్యావరణం.
  9. సహజ పర్యావరణం భూమి మీద జీవుల మనుగడకు ఆధారం.
  10. మానవ నిర్మిత పర్యావరణం లేకపోయినా జీవనం సాగించవచ్చు కానీ, సహజ పర్యావరణం లేకపోతే జీవం లేదు, ఉండదు.

ప్రశ్న 4.
పర్యావరణ పరిరక్షణపై ఏవైనా రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. పర్యావరణం పరిరక్షణ – సర్వజన సంరక్షణ.
  2. పర్యావరణాన్ని రక్షించండి – అది మిమ్మల్ని రక్షిస్తుంది.
  3. పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు.
  4. పర్యావరణ పరిరక్షణ – మన అందరి సంరక్షణ.
  5. మొక్క లేనిదే మెతుకే లేదు – మానవ జాతికి బ్రతుకే లేదు.

ప్రశ్న 5.
ఒకదానిపై ఒకటి ఆధారపడిన వివిధ మొక్కలు మరియు జంతువుల జాబితాను రాయండి.
జవాబు:

  1. జంతువులు మొక్కలపై ప్రాణవాయువు ఆక్సిజన్ (O2) మరియు ఇతర ఆహార పదార్థాల కోసం ఆధారపడతాయి. అలాగే చెట్లు ఆవాసాలుగా (షెల్టర్) ఉపయోగపడతాయి.
  2. మొక్కలు నేలలోని పోషకాల తయారీకి (హ్యూమస్), జంతువుల యొక్క విసర్జకాలపై, క్రుళ్ళిన జంతు కళేబరాలు మట్టిలో కలిసిపోయి అవి మొక్కలకు పోషకాలుగా ఉపయోగపడతాయి. జంతువులు వదిలిన కార్బన్ డయాక్సైడ్ ను మొక్కలు పీల్చుకుంటాయి.
  3. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు (పశువులన్నీ) – ‘గడ్డి’ని ఆహారంగా తీసుకుంటాయి.
  4. మానవుడు తన ఆహారం కోసం, ప్రాణవాయువు కోసం మొక్కలపై ఆధారపడతాడు.
  5. కోతులు, కుందేళ్ళు, చింపాంజీలు, కొండ ముచ్చులు మొ||నవి కాయలు, పండ్ల కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  6. అలాగే మొక్కలు, జంతువులు వదలిన కార్బన్‌డయాక్సైడ్ (CO2)పై మరియు నేలలోని (జంతు విసర్జకాలతో ఏర్పడిన) పోషకాలపై ఆధారపడతాయి.

ప్రశ్న 6.
వాతావరణంలో మిళితమైన అంశాలలో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పండి.
జవాబు:
వాతావరణం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్ మొ||న వాయువుల మిశ్రమం. భూమి ఏర్పడినప్పుడు ఇవి వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో మిళితమైన అంశాలలో మార్పునకు కారణాలు :

  1. వాతావరణంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం వలన
  2. అగ్ని పర్వత ఉద్బోధన ప్రక్రియ కారణంగా, వెలువడిన వాయువుల కారణంగా
  3. కిరణజన్యసంయోగక్రియల కారణంగా, వ్యవసాయం చేయటం వలన
  4. మానవుల యొక్క కార్యకలాపాలైన శిలాజ ఇంధనాల వాడకం, పరిశ్రమల స్థాపన, అడవుల నిర్మూలనం గనుల త్రవ్వకం మొదలైన వాటి వలన
  5. రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం వలన
  6. అణు విద్యుత్, థర్మల్ విద్యుత్ కర్మాగారాల స్థాపన వలన
  7. ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్ వలన, వాడకం వలన
  8. ప్లాస్టిక్ మరియు ఇతర చెత్త, వ్యర్థ పదార్థాల వలన వాతావరణంలోని అంశాలలో మార్పులు వస్తున్నాయి.

ప్రశ్న 7.
శిలావరణంలో లభించే ఖనిజాల పరిరక్షణకై ఏవైనా రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. మనవే కాదు సహజ వనరులు – ఉపయోగించుకోవాలి భావితరాలు
  2. ఖనిజాలు జాతికి నిధులు – సంరక్షించాలి సైనికులై ప్రజలు
  3. ఖనిజ సంపద దేశ సంపద – వాడాలి పొదుపుగా
  4. ఖనిజమే దేశానికి బలం – నడిపిస్తుంది దేశాన్ని అభివృద్ధి పథంలో

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

II. సరియైన సమాధానాలను ఎంచుకోండి.

1. క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది?
ఎ) కర్మాగారం
బి) మతం
సి) సమాజం
డి) వీటిలో ఏదీ కాదు
జవాబు:
ఎ) కర్మాగారం

2. భిన్నమైన దానిని కనుగొనండి.
ఎ) మైదానాలు
బి) రహదారి
సి) లోయ
డి) నది
జవాబు:
బి) రహదారి

3. పర్యావరణానికి ముప్పు ఏది?
ఎ) చెట్ల పెంపకం
బి) పంటలు పండించడం
సి) వాహనాల వినియోగం
డి) అన్నీ
జవాబు:
సి) వాహనాల వినియోగం

4. ఇది భూమి లోపలి రెండవ పొర.
ఎ) భూ ప్రావారం
బి) భూ అంతర కేంద్రం
సి) భూ బాహ్య కేంద్రం
డి) భూ పటలం
జవాబు:
ఎ) భూ ప్రావారం

5. ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది?
ఎ) భూ కేంద్రక సిద్ధాంతం
బి) సూర్య కేంద్రక సిద్ధాంతం
సి) మహా విస్ఫోటన సిద్ధాంతం
డి) పైవన్నీ
జవాబు:
సి) మహా విస్ఫోటన సిద్ధాంతం

II. జతపరుచుము.

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. శిలావరణం అ) నీటితో కూడిన సహజమైన ఆవరణం
2. జీవావరణం ఆ) భూమి చుట్టూ ఉన్న గాలి పొర
3. భూకేంద్రం ఇ) భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం
4. జలావరణం ఈ) భూమి యొక్క రాతి పొర
5. వాతావరణం ఉ) భూమి యొక్క లోతైన అంతర భాగం

జవాబు:

గ్రూపు-ఎ గ్రూపు-బి
1. శిలావరణం ఈ) భూమి యొక్క రాతి పొర
2. జీవావరణం ఇ) భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం
3. భూకేంద్రం ఉ) భూమి యొక్క లోతైన అంతర భాగం
4. జలావరణం అ) నీటితో కూడిన సహజమైన ఆవరణం
5. వాతావరణం ఆ) భూమి చుట్టూ ఉన్న గాలి పొర

IV. కింది పట్టిక నింపండి.

పదం మాతృక (పదాలు) మరియు అర్థం గ్రహించబడిన భాష
జీవావరణం బయోస్ మరియు స్పెరా – జీవం & గోళం లేదా బంతి గ్రీకు
శిలావరణం లిథో మరియు స్పెరా – రాయి & గోళం లేదా బంతి గ్రీకు
జలావరణం హైదర్ మరియు స్పైరా – నీరు & గోళం లేదా బంతి గ్రీకు
వాతావరణం అట్మోస్ మరియు స్పెరా – ఆవిరి & గోళం లేదా బంతి గ్రీకు
పర్యావరణం ఎన్విరోనర్ మరియు స్పెరా – పొరుగు & గోళం లేదా బంతి ఫ్రెంచి

పదబంధము

ఇచ్చిన సూచనలకు సంబంధించిన పదాలతో పజిల్ పరిష్కరించండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 2

నిలువు :
1. అన్ని జీవుల పరస్పర చర్య ద్వారా ఏర్పడిన వ్యవస్థ (6)
3. గాలి దుప్పటి (6)
5. మన పరిసరాలు (6)
6. ప్రాణ వాయువు (4)

అడ్డం :
2. భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర (6)
4. జీవాన్ని కలిగి ఉన్న గ్రహం (2)
7. నీటి సహజ ఆవరణం (6)
8. మానవ నిర్మిత పర్యావరణం (3)
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 3

7th Class Social Studies 1st Lesson విశ్వం మరియు భూమి InText Questions and Answers

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
విశ్వం గురించి మరికొంత సమాచారం సేకరించండి.
జవాబు:

  1. భూమి, అంతరిక్షాన్ని కలిపి విశ్వం అంటారు. లేదా
  2. అనేక మిలియన్ల గెలాక్సీలు, నీహారికలు మరియు శూన్య ప్రదేశాల సముదాయాన్ని విశ్వం అని పిలుస్తారు.
  3. విశ్వం ఆవిర్భావం గురించి మొట్టమొదటగా జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశస్థుడు తన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో పేర్కొన్నారు.
  4. లక్షలు, కోట్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల గుంపులను గెలాక్సీ అంటారు. అనేక కోట్ల గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 2.
అట్లాస్ మరియు ఇంటర్నెట్ ద్వారా విశ్వంలోని మరో రెండు గెలాక్సీల గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. మన దగ్గరలో ఉన్న లేదా సూర్యుడు భాగంగా ఉన్న గెలాక్సీని ‘పాలపుంత’ (Milkyway) లేదా ఆకాశ గంగ అంటారు.
  2. పాలపుంతకు దగ్గరలో ఉన్న గెలాక్సీ “ఆండ్రోమెడా”.
  3. ఆండ్రోమెడా’ గెలాక్సీని M31, NGC 224 అని అంటారు. ఇది సర్పిలాకారంలో ఉంటుంది.
  4. విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ‘హైడ్రా’, ఇందులో సుమారు 78 నక్షత్ర మండలాలు కలవు.
  5. విర్ల్ పూల్, పివీల్, సెంటరస్, లియో, ఉర్సామేజర్ మొ||న గెలాక్సీలు విశ్వంలో కలవు,

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 3.
సమాచారాన్ని సేకరించి క్రింది పట్టికను పూరించండి.

గ్రహం పేరు సహజ ఉపగ్రహాల సంఖ్య గ్రహ లక్షణాలు

జవాబు:

గ్రహం పేరు సహజ ఉపగ్రహాల సంఖ్య గ్రహ లక్షణాలు
1. బుధుడు • సూర్యుడికి అతి దగ్గరగా గల గ్రహం
• అతిచిన్న గ్రహం, వేగంగా తిరిగే గ్రహం
• అత్యంత వేడి గల 2వ గ్రహం
2. శుక్రుడు • భూమికి అతి దగ్గరగా గల గ్రహం
• అత్యంత ప్రకాశవంతమైన గ్రహం
• భూమి కవల గ్రహం
3. భూమి 1 • జీవం కలిగిన ఏకైక గ్రహం
• జలయుత గ్రహం (Blue Planet)
• సూర్యుని నుండి 3వ గ్రహం
4. అంగారకుడు 2 • రెడ్ ప్లానెట్ అంటారు. (అరుణ గ్రహం)

• అంగారక గ్రహం పైకి MAM ప్రయోగం చేసింది భారత్.

5. బృహస్పతి 79 • అతిపెద్ద గ్రహం
• అత్యల్ప భ్రమణ కాలం గల గ్రహం
• నక్షత్ర గ్రహం అంటారు
6. శని 82 • అందమైన వలయాలు గల గ్రహం
• అత్యల్ప సాంద్రత గల గ్రహం
7. ఇంద్రుడు 27 • పరిమాణంలో 3వ పెద్ద గ్రహం
• శుక్రుడు లాగే తూర్పు నుండి పడమర వరకు తిరుగుతుంది.
• మీథేన్ ఎక్కువగా ఉంటుంది.
8. వరుణుడు (నెప్యూన్) 14 • అతిశీతల గ్రహం
• సూర్యుని నుండి దూరంగా గల గ్రహం
• పరిభ్రమణ కాలం అత్యధికం

ప్రశ్న 4.
పటం 1.6లోని విషయాలను గమనించి వాటిని దిగువ పట్టికలోని శీర్షికల కింద వర్గీకరించి రాయండి.

సహజ పర్యావరణం మానవ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణం

జవాబు:

సహజ పర్యావరణం మానవ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణం
నిర్జీవులు : నీరు (జలావరణం) వంతెనలు
భవనాలు
భూమి (శిలావరణం) ఉద్యానవనాలు
గాలి (వాతావరణం) వ్యక్తిగత కుటుంబం పరిశ్రమలు
సజీవులు : జంతువులు సమాజం స్మారక నిర్మాణాలు
మొక్కలు మతం రహదారులు మొ||నవి
కీటకాలు విద్య
పక్షులు ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు
మనుషులు మొ||నవి

7th Class Social Textbook Page No.15

ప్రశ్న 5.
చిత్రం 1.7 నుండి, సహజ పర్యావరణ అంశాలను గమనించి దిగువ పట్టికలో ఇచ్చిన శీర్షికల క్రింద ఆ అంశాలను రాయండి. మీరు కూడా మరికొన్ని అంశాలను జోడించవచ్చు.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 4
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 5

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 6.
మీ ఉపాధ్యాయుడి సహాయంతో, అంతర్జాలం (ఇంటర్నెట్), గ్రంథాలయం (లైబ్రరీ) మొదలైన వివిధ వనరుల నుండి భూ స్వరూపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికను పూరించండి.

మొదటి శ్రేణి భూస్వరూపాలు రెండవ శ్రేణి భూస్వరూపాలు మూడవ శ్రేణి భూస్వరూపాలు

జవాబు:

మొదటి శ్రేణి భూస్వరూపాలు రెండవ శ్రేణి భూస్వరూపాలు మూడవ శ్రేణి భూస్వరూపాలు
1. మహాసముద్రాలు
2. ఖండాలు
1. మైదాన ప్రాంతాలు
2. పీఠభూములు
3. పర్వతాలు
1. ‘V’ ‘U’ ఆకారపు లోయలు
2. గార్జెస్ & అగాధధరులు
3. జలపాతాలు, వరద మైదానాలు
4. ఆక్స్ బౌ సరస్సులు, డెల్టాలు
5. మెరైన్లు, అఖాతాలు, అగ్రములు
6. బీచు, సముద్రపు తోరణాలు
7. భృగువు, పుట్టగొడుగు రాళ్ళు
8. ఇన్సెల్ బర్గ్, లోయస్ మైదానాలు
9. ఇసుక దిబ్బలు మొదలైనవి.

ప్రశ్న 7.
మన దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువుల జాబితాను తయారుచేసి వాటికి సంబంధించిన ఖనిజాల పేర్లను రాయండి.
వస్తువుల పేర్లు సంబంధిత ఖనిజాలు
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 6
జవాబు:

వస్తువుల పేర్లు సంబంధిత ఖనిజాలు
సీలు పాత్రలు ఇనుము + కార్బన్
మోటార్ వాహనాలు, కేబుల్స్ ఇనుము + క్రోమియం + నికెల్
విద్యుత్ పరికరాలు, ఫ్యూజులు నిక్రోమ్
వంట పాత్రలు, గరిటెలు జర్మన్ సిల్వర్ (రాగి + జింక్ + నికెల్)
విగ్రహాలు, వంట పాత్రలు, నాణేలు కంచు (కాపర్ + తగరం)
యంత్ర భాగాలు, పాత్రలు ఇత్తడి (రాగి + జింక్)
నాణేలు, ఫ్రేములు, విమానాల తయారీ అల్యూమినియం (బాక్సైట్)
తుపాకులు, బేరింగులు గన్ మెటల్ (రాగి + తగరం + జింక్)
ఆభరణాలు, నగలు బంగారం, వెండి

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 8.
ప్రపంచ పటంలో మహా సముద్రాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 7

ప్రశ్న 9.
ప్రపంచ పటంలో ప్రధాన సముద్రాలను గుర్తించండి.
జవాబు:
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 8

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 10.
పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం మరియు పచ్చదనం కలిగిన ప్రాంతం వంటి వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిల గురించి ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించి, ఇందుకు కారణాలు మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడానికి చర్యలను సూచించండి.
జవాబు:

  1. పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.
  2. పచ్చదనం (ఎక్కువ) కల్గిన ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.
  3. పచ్చదనం (చెట్లు) కల్గిన ప్రాంతంలో చెట్లు ఆక్సిజన్ ను విడుదల చేయటం వలన అక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి చర్యలు / సూచనలు :

  1. చెట్లు విరివిగా పెంచాలి.
  2. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించాలి.
  3. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి.
  4. CFCలను తగ్గించాలి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 11.
మీ పరిసరాలలోని వివిధ జీవరాశుల జాబితా తయారు చేసి వాటిని ఒక పట్టికలో మొక్కలు మరియు జంతువులుగా వర్గీకరించండి.
జవాబు:

మొక్కలు జంతువులు
తులసి, వేప, రావి, అశోక చెట్టు, జామ, మామిడి, చింత, సీతాఫలం, మర్రి, తుమ్మ, వెదురు, గులాబీ, టేకు, మందారం, గంధం చెట్టు, గానుగ, బొప్పాయి, జిల్లేడు, కొబ్బరి మొ||నవి. పులి, సింహం, నక్క తోడేలు, ఏనుగు, జింక, కుక్క గుర్రం, కంగారు, జిరాఫీ, చిరుత, పాండా, ఎలుగుబంటి, నీటి గుర్రం, హైనా, గొరిల్లా, కోతి, చింపాంజి, ఆవు, గేదె, ఎద్దు, మేక, గొ ర్రె మొ||నవి.

ప్రశ్న 12.
జీవావరణం, శిలావరణం మరియు జలావరణం మీద ఎలా ఆధారపడి ఉంది?
జవాబు:

  1. జీవావరణం ‘జీవం’ గాలి, నీరు,నేల పైనే ఆధారపడి ఉంది. ఇవి ఉంటేనే ‘జీవం’ ఉంటుంది. ఇవి లేని చోట నిర్జీవమే.
  2. శిలావరణం మరియు జలావరణంలు జీవావరణంతో అవినాభావ సంబంధం కల్గి ఉన్నాయి.
  3. జీవులకు ప్రాథమిక అవసరాలైన నీరు, నేల, (శిలావరణం, జలావరణం) ఇవి ఈ ఆవరణాల నుండే లభిస్తున్నాయి.

7th Class Social Textbook Page No.25

ప్రశ్న 13.
మీ పరిసరాలలోని మానవ పర్యావరణం యొక్క అంశాలను సేకరించి జాబితా తయారు చేయండి. అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోండి.
జవాబు:
మా పరిసరాలలోని మానవ పర్యావరణం యొక్క అంశాలు :

  1. కుటుంబం : చిన్న, పెద్ద, ఉమ్మడి కుటుంబాలు.
  2. సమాజం : గ్రామీణ, పట్టణ, గిరిజన మొ||న సమాజాలు.
  3. మతము : హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు జైన, బౌద్ధ మతాలు (ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు).
  4. విద్యా అంశాలు : పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు.
  5. ఆర్థిక అంశాలు : బ్యాంకులు, బీమా సంస్థలు మొ||నవి.
  6. రాజకీయ అంశాలు : రాజధానులు, వివిధ పార్టీలు, ప్రభుత్వాలు.
    ఇవన్నీ మానవ అవసరాల నుండి ఏర్పడినాయి.

ప్రశ్న 14.
మీ పెద్దల నుండి, వారు మీ వయస్సులో ఉన్నప్పుడు సహజ వాతావరణం ఎలా ఉందనే దాని గురించి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
నాడు సహజ వాతావరణం ఎలా ఉండేదంటే :

  1. కాలుష్యరహిత వాతావరణం.
  2. పచ్చని పల్లెలు, కాలుష్యం లేని జలాలు.
  3. మితిమీరిన అభివృద్ధి, విధ్వంసం లేదు.
  4. గాలి, నీరు, నేల స్వచ్ఛంగా ఉండేవి.
  5. ఇన్ని పరిశ్రమలు, ఇంత పారిశ్రామికాభివృద్ధి లేదు.
  6. ప్రకృతి ఒడిలో వ్యవసాయం చేసేవారు (రసాయనాల వాడకం తక్కువ).
  7. జంతువులు స్వేచ్ఛగా విహరించేవి.
  8. వృక్షాలు విరివిగా ఉండేవి.

ప్రశ్న 15.
సేకరించిన సమాచారం ఆధారంగా ఒక పోస్టర్‌ను తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 9

7th Class Social Textbook Page No.27

ప్రశ్న 16.
వాయు కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాల జాబితాను రూపొందించండి.
జవాబు:
వాయు కాలుష్యానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. పరిశ్రమల నుండి వచ్చే ధూళి, పొగ.
  2. వాహనాల నుండి వెలువడే కార్బన్లు (పొగ).
  3. ఏసిలు, రిఫ్రిజిరేటర్లు వాడకం వలన వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు,
  4. అణువిద్యుత్ ప్లాంట్లు.
  5. శిలాజ ఇంధనాల వాడకం.
  6. బహిరంగ చెత్త, వ్యర్థాలను తగలబెట్టడం.
  7. అడవుల నిర్మూలన, వ్యవసాయ ప్రక్రియలో వాడే రసాయనాలు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 17.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు సూచించండి.
జవాబు:
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవల్సిన చర్యలు :

  1. గృహాల నుండి, కర్మాగారాల నుండి కనీస స్థాయికి ఉద్గారాలను తగ్గించాలి.
  2. వాహనాల వినియోగం తగ్గించాలి. ప్రజా రవాణాను వినియోగించాలి.
  3. చెత్తను, వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్/విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని పరిశీలించాలి.
  4. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి, ప్రకృతి సేద్యం వైపుకు మళ్ళాలి.
  5. అధికంగా చెట్లను నాటడం, పెంచడం చేయాలి.

ప్రశ్న 18.
మీ ఉపాధ్యాయుని సహాయంతో వాయు కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలతో ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 10

ప్రశ్న 19.
నీటి కాలుష్యానికి కారణమయ్యే వివిధ మానవ కార్యకలాపాల జాబితాను రూపొందించండి.
జవాబు:
నీటి కాలుష్యానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి.
    ఉదా : కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు.
  2. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి.
  3. చెత్త మరియు జీవ సంబంధ వ్యర్థాల కారణంగా, నీరు కలుషితం అవుతుంది.
  4. సముద్రాలలో ఓడల రవాణా కారణంగా చమురుతో సముద్రపు నీరు కలుషితం అవుతుంది.
  5. ఆమ్ల వర్షాల కారణంగా నీరు కలుషితం అవుతుంది. 6) ప్లాస్టిక్ వాడకం కారణంగా నీరు కలుషితం అవుతుంది.

ప్రశ్న 20.
నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి చర్యలు సూచించండి.
జవాబు:
నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి సూచనలు :

  1. పారిశ్రామిక ద్రవ వ్యర్థాలను రీసైకిల్ చేసి, బయటకు విడుదల చేయాలి.
  2. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను వాడాలి.
  3. చెత్త మరియు ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో పారవేయాలి.
  4. సముద్ర జలాల్లోని ఓడల నిర్వహణ సమర్థవంతంగా చేయాలి.

ప్రశ్న 21.
నీటి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని, (వార్తాపత్రిక క్లిప్పింగులు మొదలైనవి) సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా తరగతి గదిలో చేయగలరు.

ప్రశ్న 22.
మీ ఉపాధ్యాయుల సహాయంతో, నీటి కాలుష్యానికి కారణమయ్యే సంఘటనలతో ఒక చిత్రాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 11

ప్రశ్న 23.
సహజ వనరుల పరిరక్షణ గురించి రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. సహజ వనరులు ప్రకృతి సంపద – దాని పరిరక్షణ మనందరి బాధ్యత.
  2. మనమే కాదు సహజ వనరులు – ఉపయోగించుకోవాలి భావితరాలు.
  3. సహజ వనరులు ప్రకృతి ప్రసాదించిన వరాలు – నిలుపుకోవాలి వాటిని తరతరాలు.
  4. వనరుల పరిరక్షణ – దేశాభివృద్ధికి సంరక్షణ.

ప్రశ్న 24.
నీటి సంరక్షణపై ఒక పోస్టర్ సిద్ధం చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా గీయగలరు.
ఉదా :
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 12

7th Class Social Textbook Page No.29

ప్రశ్న 25.
ప్రక్క చిత్రాన్ని గమనించి, మీ వ్యాఖ్య రాయండి.
AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి 13
జవాబు:

  1. జలయమయమైన పట్టణం.
  2. నీట మునిగిన నగరం.
  3. వరద విలయ తాండవం.
  4. వరద కోరల్లో చిక్కిన నగరం.

ప్రశ్న 26.
విపత్తుల నివారణ గురించి రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:

  1. మీ సంరక్షణే – దేశ సంరక్షణ.
  2. ఆపదలో, అవకాశం అంది పుచ్చుకో.
  3. ప్రతిక్షణం (జాగృతమై) చైతన్యం – మీ భవితకు భరోసా.
  4. ఊహించని విపత్తు – ముందుగానే ఊహించు.
  5. మీరు అప్రమత్తంగా ఉంటేనే – మీరు సజీవంగా ఉంటారు.

ప్రశ్న 27.
మీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సంభవించిన విపత్తుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
మా ప్రాంతంలో సంభవించిన విపత్తులు :

  1. భారీ వర్షాలు, తుఫానుల కారణంగా వరదలు సంభవించాయి (హుద్ హుద్, తిఖీ తుఫానులు).
  2. భూగర్భ జలాలు అడుగంటిపోవటం.
  3. కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం.
  4. కొండచరియలు విరిగిపడటం జరిగింది.
  5. రహదారి ప్రమాదాలు సంభవించటం.
  6. గతంలో సునామీ, భూకంపాలు వచ్చాయి.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
గెలీలియో యొక్క పరిశీలనలు ఏమిటి?
జవాబు:

  1. ఇటలీ దేశానికి చెందిన గెలీలియో అన్న మేధావి దూరదర్శినికి మెరుగులు దిద్దాడు.
  2. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళు దూరాన ఉన్నంత స్పష్టంగా కనిపించేది. ఈ ఆ పరికరం ఖగోళశాస్త్ర అధ్యయనానికి సైతం తోడ్పడింది.
  3. గెలీలియో బాగా రాస్తాడు, చక్కగా ఉపన్యాసాలిస్తాడు. కాబట్టి విస్తృత ప్రజాదరణ పొందాడు.
  4. కోపర్నికస్ సిద్ధాంతాలు చర్చిస్తూ జ్యూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహ పరిభ్రమణాన్ని తాను స్వయంగా చూసిన విషయం శ్రోతలకు చెప్పేవాడు.
  5. లోలకంలోని సిద్ధాంతాలను గెలీలియో కనుగొనటంతో మరింత మెరుగైన గడియారాలు తయారు చేయగలిగారు.
  6. పీసాలో వాలి ఉన్న భవన శిఖరం నుంచి చేసిన ప్రయోగంలో బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని అతడు నిరూపించాడు.

7th Class Social Textbook Page No.11

ప్రశ్న 2.
జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాం?
జవాబు:

  1. జూన్ 5న విశ్వవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు.
  2. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు (UNEP) నిర్వహిస్తూ పర్యావరణంపై ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తుంది.
  3. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐ.రా.స 1972లో ప్రారంభించింది.
  4. ఈ సందర్భంగా ఐ.రా.స ప్రపంచ దేశాలను ఆహ్వానించి ఒక సమ్మేళనం నిర్వహించింది.
  5. స్వీడన్లో నిర్వహించిన ఈ సమ్మేళనంలో సుమారు 119 దేశాలు పాల్గొన్నాయి.
  6. ప్రతి సంవత్సరం జూన్ 5న ఈ సమ్మేళనం జరుగుతుంది.

7th Class Social Textbook Page No.15

ప్రశ్న 3.
భూమి యొక్క సహజ ఆవరణములలో జీవావరణము ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
భూమి యొక్క సహజ ఆవరణములలో జీవావరణము భిన్నంగా ఉంటుంది, ఎలా అంటే

  1. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి. భూమి యొక్క ఇతర మూడు ఆవరణలు కలిసిన చోటైన జీవావరణంలో ‘జీవం’ వర్ధిల్లుతుంది.
  2. ఆ జీవావరణమే తిరిగి ఈ మూడు ఆవరణాలను ప్రభావితం చేస్తుంది.
  3. మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య కూడా పరస్పర సంబంధాలు ఉంటాయి.
    ఉదా : మొక్కలు, జంతువులు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 4.
ఇతర మూడు ఆవరణములు లేకుండా జీవావరణము మనుగడ సాగించలేదు. ఎందుకు?
జవాబు:

  1. సూర్యుడికి భూమి మరీ దగ్గరగా, మరీ దూరంగా లేనందున ‘జీవావరణములో అనువైన ఉష్ణోగ్రతలు – ఉండటం, నేల, నీరు, గాలి మూడు (ఆవరణాలు) కలిసి ఉండడం వల్ల ఒక భూమిపైన మాత్రమే జీవం సాధ్యమయింది.
  2. ఈ ఆవరణాలు ఒకదానితో ఒకటి ఆధారపడి ఉన్నాయి. అన్ని రూపాలలోని జీవులకు వాటి చుటూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్నిలతో అవినాభావ సంబంధం ఉంది. వీటి నుండి ‘జీవం’ తనకు కావలసినవన్నీ పొందుతుంది.

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 5.
ఏప్రిల్ ’22’ను ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’గా ఎందుకు జరుపుకుంటాము? మీ ఉపాధ్యాయుని సహాయంతో దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 22న ‘ధరిత్రీ దినోత్సవం’ జరుపుకుంటున్నారు.
  2. పర్యావరణం – భూమి పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్గించటమే దీని ముఖ్యోద్దేశ్యం.
  3. మొదట ఐ.రా.స 1969 మార్చిలో జాన్ మెక్కాల్ లో ప్రారంభించింది.
  4. తర్వాత అమెరికాకు చెందిన గేలార్డ్ నెల్సన్ ప్రారంభించారు. సెనెటర్ నెల్సన్ కి వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే ధరిత్రీ దినోత్సవం.
  5. మన వాతావరణంలో జరిగే మార్పులను వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికి తెలియజెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు.
  6. అలా 1970, ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం అమెరికాలో జరిగింది. ఇక అప్పటి నుండి ఆ తేది ఖరారైంది.

7th Class Social Textbook Page No.19

ప్రశ్న 6.
శిలావరణము యొక్క మరికొన్ని ఉపయోగాలు వ్రాయండి.
జవాబు:

  1. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణము.
  2. శిలావరణము యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని అందిస్తుంది.
  3. శిలావరణము యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
  4. ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడ అందిస్తుంది.

ప్రశ్న 7.
శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాల జాబితాను తయారు చేయండి.
జవాబు:
శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాలు :

  1. వ్యవసాయం (ప్రధానంగా పోడు వ్యవసాయం), అడవుల నిర్మూలన.
  2. ఇటుకలు, సిమెంటుతో నగరాలు కట్టడం, గృహ నిర్మాణం.
  3. గనుల తవ్వకం.
  4. ఆనకట్టల (పాజిట్లు) నిర్మాణం.
  5. రోడ్ల నిర్మాణం, వాహనాల వినియోగం మొ||నవి.

ప్రశ్న 8.
శిలావరణమును రక్షించటానికి చర్యలను సూచించండి.
జవాబు:
శిలావరణమును రక్షించటానికి చర్యలు :

  1. ఖనిజాలను (లోహాలను) తిరిగి వినియోగించుకోవాలి. (RRR)
  2. సహజ (ప్రకృతి) శక్తిని వినియోగించుకోవటం.
  3. వాహనాల వినియోగం తగ్గించటం (ప్రజా రవాణాను ఉపయోగించటం).
  4. పోడు వ్యవసాయంను నిర్మూలించడం.
  5. సామాజిక అడవుల పెంపకం చేపట్టడం.

ప్రశ్న 9.
మార్చి 22ను “ప్రపంచ జల దినోత్సవం”గా ఎందుకు జరుపుకుంటాము? మీ ఉపాధ్యాయుడి సహాయంతో దాని ప్రాముఖ్యతను తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రతి సం॥రం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుతున్నారు.
  2. మంచినీటి వనరుల సుస్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు.
  3. 1992 బ్రెజిల్ లోని రియోడిజనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) లో దీనిని ప్రతిపాదించారు.
  4. 1923, మార్చి 22న తొలి ప్రపంచ జలదినోత్సవం జరిగింది.

ప్రశ్న 10.
భూమిపై ఉన్న మొత్తం నీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము?
జవాబు:
భూమిపై ఉన్న మొత్తం నీటిని ఉపయోగించుకోలేకపోవటానికి కారణం.

  1. మొత్తం నీటిలో 97.25% ఉప్పునీరుగా మహాసముద్రాలలో ఉంది.
  2. కేవలం 2.75% మాత్రమే మంచినీరు. ఈ మంచి నీటిలో అధిక శాతం (68.7%) ధృవ ప్రాంతాల్లో మంచు పొరగా ఉంది.
  3. మంచినీటిలో 29, 9% భూగర్భ జలంగా ఉంది.
  4. పై కారణాల వల్ల భూమి మీద ఉన్న మొత్తం మంచి నీటిలో 0.26% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మనకు అందుబాటులో ఉన్న నీళ్ళు ఇవే.

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 11.
మీ పాఠశాలలో వివిధ ప్రయోజనాల కోసం నీటిని ఎలా ఉపయోగిస్తున్నారు ? నీరు వృథా అవుతున్న ప్రదేశాలు / సందర్భాలను గమనించండి.
జవాబు:
1) మా పాఠశాలలో త్రాగటానికి, వంట చేయడానికి, మొక్కలకు పోయటానికి, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రపరచటానికి నీటిని ఉపయోగిస్తాం.

2) నీరు వృథా అవుతున్న ప్రదేశం / సందర్భం:
ఎ) మరుగుదొడ్ల వద్ద కాళ్ళు, చేతులు, మొఖం కడుగుతూ వృథా చేస్తున్నారు.
బి) భోజన ప్లేట్లు శుభ్రపరిచే దగ్గర వృథా చేస్తున్నారు.
సి) త్రాగునీరు పట్టుకునే దగ్గర, త్రాగేటప్పుడు (సగం త్రాగి సగం పారబోస్తున్నారు).
డి) కొన్ని సందర్భాలలో పైపు లీకవ్వటం మూలంగా కూడా నీరు వృథా అవుతుంది.

ప్రశ్న 12.
నీటి వినియోగంలో వృధాని అరికట్టడానికి ఏయే చర్యలు సూచిస్తారు?
జవాబు:
నీటి వృథాని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు :

  1. పైపులలోని లీకేజులను నిర్మూలించాలి.
  2. మరుగుదొడ్లలో తక్కువ నీరు అవసరమయ్యే ఫ్లెష్ లను (కుళాయిలను) వాడాలి.
  3. సింకులలో నీటి వృథా తగ్గించాలి.
  4. మొక్కలకు కూడా నీటిని స్ప్రింక్లర్లు లాంటివి వినియోగించి వృథాను తగ్గించాలి.
  5. అవకాశమున్న చోట్ల నీటిని పునర్వినియోగించాలి.
  6. వర్షపు నీటిని సక్రమంగా నిల్వ ఉంచి, వినియోగించుకోవాలి.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 13.
భూగర్భ జలాలను పెంచడానికి కొన్ని చర్యలు సూచించండి. ఐస్ మొత్తం కరిగిపోయినట్లయితే ఏమి జరుగుతుంది?
జవాబు:
భూగర్భ జలాలను పెంచడానికి సూచనలు :

  1. ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వాలి.
  2. చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టాలి.
  3. గడ్డి మొక్కలు, చెట్లను నాటడం, సంరక్షించడం చేయాలి.
  4. బోరు బావులపై నియంత్రణను ఉంచాలి. నీటిని వృథా చేయకూడదు.
  5. చెరువుల (పూడిక తీయటం) సమర్థ నిర్వహణ.
  6. కాంటూరు బండింగ్, కందకాలు తీయటం మొ||నవి.
  7. ధృవ ప్రాంతాలలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోయినట్లయితే కరిగిన మంచు నీరుగా మారి సముద్రాలలోకి చేరుతుంది. కావున ప్రపంచంలోని అన్ని సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టం పెరిగినట్లయితే తీరప్రాంతాలతో సహా భూభాగం మొత్తం మునిగిపోయే ప్రమాదం కలదు.

ప్రశ్న 14.
సెప్టెంబరు 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవం”గా ఎందుకు జరుపుకుంటాము?
జవాబు:

  1. ప్రతి సం||రం సెప్టెంబరు 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ” జరుపుతున్నారు.
  2. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
  3. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకుగాను రూపొందించిన మాంట్రియల్ ప్రొటోకాల్ పై ప్రపంచ దేశాలు 1987, సెప్టెంబరు 16న సంతకాలు చేసాయి.
  4. అప్పటి నుండి ప్రతి సం|| సెప్టెంబరు 16ను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుతున్నారు.

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 15.
వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
వాతావరణంలో కార్బన్ డై ఆక్సెడ్ పెరిగినట్లయితే భూగోళం వేడెక్కటం జరుగుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ హరిత గృహ వాయువు కాబట్టి భూతాపం పెరగటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా భూగోళం వేడెక్కినట్లయితే ధృవాల దగ్గర ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బ తిని అతివృష్టి, అనావృష్టి ఏర్పడతాయి.

ప్రశ్న 16.
వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు?
జవాబు:
వాతావరణంలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) స్థాయిని ముఖ్యంగా

  1. విరివిగా చెట్లను పెంచటం (సంరక్షించడం) ద్వారా
  2. వాహనాల వినియోగం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం ద్వారా
  3. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా
  4. ఇంధనంగా హైడ్రోజన్ ని వాడటం, సౌరశక్తిని వినియోగించడం ద్వారా
  5. CFCలను తగ్గించుటకై ACలు, రిఫ్రిజిరేటర్లు వాడకం తగ్గించటం ద్వారా ఆక్సిజన్ స్థాయి పెంచవచ్చు.

ప్రశ్న 17.
“జీవావరణం” భూమి యొక్క “ప్రత్యేక సహజ ఆవరణం” గా ఎందుకు పరిగణించబడుతుంది?
జవాబు:

  1. ‘జీవావరణం’ లో మాత్రమే ‘జీవం’ కల్గి ఉంది.
  2. ‘జీవం’ అనేది మానవుడు సృష్టించలేడు. ప్రకృతి సిద్ధమైనది, సహజమైనది.
  3. మిగతా ఆవరణముల కన్నా జీవావరణం జీవం కల్గి ఉండటంతో ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మిగతా ఆవరణముల మనుగడ కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 18.
జీవావరణమును రక్షించడానికి మీరు ఏ చర్యలు సూచిస్తారు?
జవాబు:
జీవావరణమును రక్షించడానికి సూచనలు :

  1. ప్రకృతి / సహజ వనరులను పొదుపుగా వినియోగించుకోవాలి.
  2. వృక్ష, జంతు సంపదను సంరక్షించుకోవాలి.
  3. మొక్కలను నాటి సంరక్షించాలి, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
  4. వివిధ రకాల జంతువుల సంరక్షణకై రిజర్వ్ ఫారెస్టు , వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  5. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించాలి. లేకపోతే దీని ప్రభావం జీవావరణంపైనే పడుతుంది.

7th Class Social Textbook Page No.25

ప్రశ్న 19.
మానవ నిర్మిత పర్యావరణ స్థాపన సహజ వాతావరణంలో మార్పుకు ఎలా కారణమైంది? ఇది మనకు ఎలా హానికరం?
జవాబు:

  1. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  2. భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మొ||నవి వీనికి ఉదాహరణలు.
  3. ఈ మానవ నిర్మిత పర్యావరణ స్థాపన (కర్మాగారాలు, ప్రాజెలు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయం మొ||న వాటి వల్ల) సహజ వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టివేసింది.
  4. ఈ పర్యావరణ కాలుష్యం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడటం, శీతోష్ణస్థితిలో మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టి సంభవించటం వంటి హాని జరుగుతుంది.

ప్రశ్న 20.
సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందా? దానికి నీవు ఏమి చేయగలవు?
జవాబు:
సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీని కోసం నేనేమి చేయగలనంటే :

  1. మొక్కలు నాటడం, సంరక్షించడం (వన సంరక్షణ చేపట్టడం).
  2. వాహనాలను అత్యవసరమయితేనే వాడటం.
  3. శిలాజ ఇంధనాలను సాధ్యమయినంత తక్కువగా లేదా అస్సలు వాడకపోవటం.
  4. ఏసిలు, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించడం లేదా అస్సలు వాడకపోవడం.
  5. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టడం.

అన్వేషించండి

7th Class Social Textbook Page No.7

ప్రశ్న 1.
ఇంటర్నెట్ లో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అన్వేషించండి మరియు మీరు గమనించిన విషయాలతో జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వివరిస్తుంది.
  2. ఈ సిద్ధాంతంను మొదట జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
  3. ఈ విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని తను సిద్ధాంతీకరించాడు.
  4. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది.
  5. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి.

7th Class Social Textbook Page No.9

ప్రశ్న 2.
అంతర్జాలం ద్వారా ఇద్దరు (ప్రాచీన మరియు ఆధునిక) భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల గురించి సమాచారాన్ని సేకరించి తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
1) ఆర్యభట్ట (476 – 650) :
గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త. గణితం, ఖగోళశాస్త్రంలో అనేక ఆవిష్కరణలు చేసాడు. ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథాన్ని రచించాడు. “సున్నా”ను ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ గణిత ఖ్యాతిని తెలియజేసాడు. ‘పై’ విలువను లెక్క గట్టినాడు. గ్రహాల సంఖ్యను, సూర్య చంద్ర గ్రహణాలను గురించి నేటి పరికల్పనలకు దగ్గరగా వీరి ఆలోచనలున్నాయి. సూర్య చంద్ర గ్రహణాలకు కారణం ఛాయలేనని నాడే తెలియజేశాడు. భూమి ఆకారం, భూ చలనాలను గురించి కచ్చితంగా వివరించాడు. వీరి గొప్ప ప్రతిభకు గౌరవంగానే మన భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు.

2) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (1910 – 1995) :
భారతదేశానికి నోబెల్ బహుమతి తీసుకువచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త. వీరు 1910, అక్టోబర్ 10లో పంజాబులో జన్మించారు. 1922లో చెన్నైకు మారారు. సి.వి. రామన్ గారికి వీరు మనుమడు. అంతరిక్ష భౌతిక శాస్త్రంలో ఆసక్తి ఉండటం వలన దానిలో పరిశోధనలు చేపట్టారు. నక్షత్రాల పరిణామ దశల గురించి (పుట్టుక, పెరుగుట, రాలిపోవుట) వీరు చేసిన ఆవిష్కరణలకుగాను 1983 సంవత్సరంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేసారు.

AP Board 7th Class Social Solutions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
గ్రంథాలయం ద్వారా లేదా అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ప్లూటో సౌర్యవ్యవస్థ నుండి ఎందుకు తొలగించబడింది అనే సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
పూటో సౌరవ్యవస్థ నుండి ఎందుకు తొలగించబడిందంటే :

  1. తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉండటం.
  2. ప్లూటో కన్నా ఎక్కువ ద్రవ్యరాశి గల (పెద్ద) మరో గ్రహం ఎరిసను కనుగొనటం.
  3. IAU (ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్) గ్రహానికి ఉండవలసిన లక్షణాలను నిర్వచించారు (ఆగస్ట్ 2006లో). వీరి ప్రకారం గ్రహానికుండవలసిన లక్షణాలు
    ఎ) ఖగోళ వస్తువు సూర్యుని చుట్టూ తిరుగుతుండాలి.
    బి) గుండ్రంగా వుండాలి
    సి) తన కక్ష్యలో ఏ ఇతర వస్తువులుండరాదు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉండాలి. దీని ప్రకారం
  4. ప్లూటోకి తక్కువ ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ శక్తి ఉండటం వలన గ్రహంగా తొలగించి డ్వార్ఫ్ గ్రహంగా పరిగణిస్తున్నారు.

7th Class Social Textbook Page No.17

ప్రశ్న 4.
గ్రంథాలయ పుస్తకాలు లేదా అట్లాస్ ద్వారా వివిధ రకాల భూస్వరూపాల గురించి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీ ప్రాంతంలో గల వివిధ భూస్వరూపాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. (పై భావన అవగాహన కోసం మీరు మీ ఉపాధ్యాయునితో చర్చించవచ్చు).
జవాబు:
1) వివిధ భూస్వరూపాలు :
మొదటి శ్రేణి భూస్వరూపాలు : ఖండాలు, మహా సముద్రాలు
ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు : మైదానాలు, పీఠభూములు, పర్వతాలు

మూడవ శ్రేణి భూస్వరూపాలు :
ఎ) V ఆకారపు లోయలు, గార్జెస్, అగాథధరి, జలపాతాలు, దుముకుడు మడుగులు, వరద మైదానాలు, ఆక్స్‌బౌ సరస్సులు, డెల్టాలు.
బి) ‘U’ ఆకారపు లోయలు, మెరైన్లు.
సి) సముద్రపు గుహలు, సముద్రపు తోరణాలు, పేర్పుడు స్తంభాలు, బృగువు, అగ్రం, అఖాతం, బీన్లు.
డి) పుట్టగొడుగురాళ్ళు, ఇన్సెల్ బర్గ్, ఇసుక దిబ్బలు, లోయస్ మైదానాలు.

2) మా ప్రాంతంలో డెల్టా కలదు. ఇది (కృష్ణా) నది సముద్రంలో కలిసే ముందు రెండు పాయలుగా విడిపోయి, తనతో తీసుకు వచ్చిన మెత్తని మట్టి, ఇసుకను మేట వేస్తుంది. (ఒండ్రు). ఇలా ఏర్పడిన మైదానాలే డెల్టాలు. ఇవి ఒండ్రు మట్టితో ఏర్పడి, సారవంతంగా ఉంటాయి.

7th Class Social Textbook Page No.21

ప్రశ్న 5.
అంతర్జాలం (ఇంటర్నెట్), అట్లాస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నీటి వనరుల గురించి మరింత తెలుసుకోండి. (అవసరమైతే, మీ ఉపాధ్యాయులు లేదా పెద్దల సహాయం తీసుకోండి).
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నీటి వనరులు :
మహా సముద్రాలు : పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ (దక్షిణ) మహా సముద్రాలు.

సముద్రాలు :
మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం, కాస్పియన్ సముద్రం, పసుపు సముద్రం, ఏజియన్ సముద్రం, అరేబియా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, కరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, బేరింగ్ సముద్రం, అడ్రియాటిక్ సముద్రం, అరల్ సముద్రం మొదలైనవి.

నదులు :
నైలు, అమేజాన్, యాంధీ, మిస్సిస్సిపి, కాంగో, డాన్యూబ్, ఓల్గా, మెకాంగ్, నైజర్, బ్రహ్మపుత్ర, గంగా, సింధూ, ఇరావడి, జాంబేజీ, కొలెరాడో, కొలంబియా, ఆరెంజ్, టైగ్రిస్, లింపోపో, బ్లూనెలు, గోదావరి, మహా, కృష్ణా, యమునా, సట్లెజ్, నర్మదా, తపతి, రైన్, చీనాబ్ నదులు ముఖ్యమైనవి.

సరస్సులు :
బైకాల్, టాంగ్యానికా, సుపీరియర్, విక్టోరియా, మచిగాన్, బైకాల్, ఓంటారియో, టిటికాకా, న్యాసా, దాల్, ఉరల్ మొదలైనవి.

7th Class Social Textbook Page No.23

ప్రశ్న 6.
అంతర్జాల విద్యా వనరుల ద్వారా వాతావరణం యొక్క వివిధ పొరలు, వాయు పీడనం మరియు వివిధ పవనాల గురించి మరింత తెలుసుకోండి. (అవసరమైతే, మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి).
జవాబు:
వాతావరణం (యొక్క) పొరలు :

  1. టోపో ఆవరణం,
  2. స్ట్రాటో ఆవరణం,
  3. మెసో ఆవరణం,
  4. థర్మో ఆవరణం,
  5. ఎక్సో ఆవరణం.

పీడన మండలాలు :

  1. భూమధ్య రేఖా అల్ప పీడన ప్రాంతం,
  2. ఉప అయన రేఖా అధిక పీడన ప్రాంతం,
  3. ఉప ధృవ అల్ప పీడన ప్రాంతం,
  4. ధృవ అయన రేఖా అధిక పీడన ప్రాంతం.

పవనాలు: ప్రపంచ పవనాలు :

  1. వ్యాపార పవనాలు,
  2. పశ్చిమ పవనాలు,
  3. ధృవ పవనాలు.

ఋతు పవనాలు : కాలాన్ని బట్టి వీచే పవనాలు

స్థానిక పవనాలు : చినూక్, ఫోన్, లూ, సైమూన్, యెమో, నార్వేస్టర్ల్, మిస్ట్రాల్, ప్యూనా, పాంపెరొ.

ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
నీటి వినియోగం మరియు దాని వృథా గురించి మీ పరిసరాల నుండి సమాచారాన్ని సేకరించండి. నీటి వృథాను నియంత్రించడానికి సూచనలివ్వండి.
జవాబు:
1) మా పాఠశాలలో త్రాగటానికి, వంట చేయడానికి, మొక్కలకు పోయటానికి, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రపరచానికి నీటిని ఉపయోగిస్తాం.

2) నీరు వృథా అవుతున్న ప్రదేశం / సందర్భం :
ఎ) మరుగుదొడ్ల వద్ద కాళ్ళు, చేతులు, మొఖం కడుగుతూ వృథా చేస్తున్నారు.
బి) భోజన ప్లేట్లు శుభ్రపరిచే దగ్గర వృథా చేస్తున్నారు.
సి) త్రాగునీరు పట్టుకునే దగ్గర, త్రాగేటప్పుడు సగం త్రాగి సగం పారబోస్తున్నారు.
డి) కొన్ని సందర్భాలలో పైపు లీకవ్వటం మూలంగా కూడా నీరు వృథా అవుతుంది.

నీటి వృథాని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు :

  1. పైపులలోని లీకేజులను నిర్మూలించాలి.
  2. మరుగుదొడ్లలో తక్కువ నీరు అవసరమయ్యే ఫ్లెష్ లను (కుళాయిలను) వాడాలి.
  3. సింకులలో నీటి వృథా తగ్గించాలి.
  4. మొక్కలకు కూడా నీటిని స్ప్రింక్లర్లు లాంటివి వినియోగించి వృథా తగ్గించాలి.
  5. అవకాశమున్న చోట్ల నీటిని పునర్వినియోగించాలి.