SCERT AP 7th Class Science Study Material Pdf 8th Lesson కాంతితో అద్భుతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Science 8th Lesson Questions and Answers కాంతితో అద్భుతాలు

7th Class Science 8th Lesson కాంతితో అద్భుతాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరింపుము.

1. కుంభాకార దర్పణం ఏర్పరచే ప్రతిబింబం నిటారైనది, చిన్నది మరియు ……… (మిథ్యా ప్రతిబింబం)
2. రెండు దర్పణాల మధ్య అనంత ప్రతిబింబాలు ఏర్పడాలంటే ఆ రెండింటిని ఉంచవలసిన కోణం ………….. (180°)
3. నోటిలోని భాగాలను చూడటానికి దంతవైద్యుడు ఉపయోగించే దర్పణం ……………. (పుటాకార దర్పణం)
4. తెరమీద పట్టలేని ప్రతిబింబాన్ని ……………….. అంటారు. (మిథ్యా ప్రతిబింబం)

II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. పెరిస్కోప్లో రెండు దర్పణాల మధ్య కోణం
a) 0°
b) 30°
c) 45°
d) 60°
జవాబు:
c) 45°

2. రెండు దర్పణాల మధ్య 180° కోణం ఉండే విధంగా ఉంచినప్పుడు వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య
a) 1
b) 2
c) 3
d) 4
జవాబు:
d) 4

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

3. క్రింది వానిలో సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణం కానిది
a) సమాన పరిమాణం
b) నిజ
c) పార్శ్వ విలోమం
D) నిటారైన
జవాబు:
b) నిజ

4. ఒక కాంతికిరణం సమతల దర్పణం మీద దాని లంబదిశలో పతనం చెందినప్పుడు పరావర్తన కోణం విలువ
a) 90°
b) 45°
c) 0°
d) 180°
జవాబు:
a) 90°

5. క్రింది వానిలో స్పష్టమైన ప్రతిబింబమును ఏర్పాటు చేసేది
a) కాగితం
b) గుడ్డ
c) కార్డ్ బోర్డు
d) సమతల దర్పణం
జవాబు:
d) సమతల దర్పణం

III. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) మంచు ముక్కల నుండి పరావర్తనం 1) క్రమ పరావర్తనం
B) స్థిరంగా ఉన్న నీటి నుండి పరావర్తనం 2) క్రమరహిత పరావర్తనం
C) హెడ్ లైట్లలో పరావర్తకాలు 3) నీలిరంగు కాంతి
D) రియర్ వ్యూ దర్పణాలు 4) పుటాకార దర్పణం
E) రెటీనాను గాయపరిచే కాంతి 5) పసుపురంగు కాంతి
6) కుంభాకార దర్పణం

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) మంచు ముక్కల నుండి పరావర్తనం 2) క్రమరహిత పరావర్తనం
B) స్థిరంగా ఉన్న నీటి నుండి పరావర్తనం 1) క్రమ పరావర్తనం
C) హెడ్ లైట్లలో పరావర్తకాలు 4) పుటాకార దర్పణం
D) రియర్ వ్యూ దర్పణాలు 6) కుంభాకార దర్పణం
E) రెటీనాను గాయపరిచే కాంతి 3) నీలిరంగు కాంతి

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కాంతి పరావర్తనం అనగానేమి? ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
కాంతి పరావర్తనం :
వస్తువులపై పడిన కాంతి అదే యానకంలో తిరిగి వెనుకకు రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు.
ఉదా :

  1. అద్దం ముందు మనం నిలబడినపుడు, కాంతి అద్దంపై పడి పరావర్తనం చెంది కంటికి చేరటం వలన మనకు ప్రతిబింబం కనిపిస్తుంది.
  2. నిశ్చలంగా ఉండే నీటి ఉపరితలం అద్దం వలె కాంతిని పరావర్తనం చెందిస్తుంది.

ప్రశ్న 2.
కాంతి పరావర్తన నియమాలను రాయండి.
జవాబు:
కాంతి పరావర్తనం చెందినపుడు మూడు నియమాలను పాటిస్తుంది. అవి: 3

  1. పతన కోణం పరావర్తన కోణానికి సమానం.
  2. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబము ఒకే తలంలో ఉంటాయి.
  3. పతన కిరణం, పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉంటాయి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

ప్రశ్న 3.
పెరిస్కోవోని దర్పణాలను ఒకదాని కొకటి సమాంతరంగా ఎందుకు ఉంచుతాం? అవి అలా సమాంతరంగాలేకుంటే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. పెరిస్కోప్ నిర్మాణంలో రెండు వంపులు ఉంటాయి.
  2. ఈ వంపులలో సమతల దర్పణాలు 45° కోణంలో ఉంటాయి.
  3. రెండు వంపులలో ఉండే దర్పణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
  4. దీని వలన దర్పణాల మీద పడిన కాంతి పెరిస్కోప్ నుండి బయటకు వచ్చి కంటిని చేరతాయి.
  5. అందువలన నేల ఉపరితలం పైన ఉన్న సైనికులను చూడగలం.
  6. రెండు దర్పణాలు సమాంతరంగా లేకపోతే పరావర్తన కాంతి కంటిని చేరదు.
  7. పరిశీలిస్తున్న వ్యక్తికి ఏమీ కనపడదు. కావున పెరిస్కోప్ పనిచేయనట్లే భావించవచ్చు.

ప్రశ్న 4.
ఒక దర్పణమును ఉపయోగించి వెలుగుతున్న కొవ్వొత్తి యొక్క ప్రతిబింబమును పొందే సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏవి?
జవాబు:

  1. సమతల దర్పణాలు మిథ్యా మరియు నిటారు ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి.
  2. దర్పణం ఉపయోగించి క్రొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పర్చినపుడు అది అద్దంలో నిలువుగా ఏర్పడినది.

దీని కోసం జాగ్రత్తలు :

  1. వస్తువు దర్పణం ఎదురెదురుగా ఉండేటట్లు చూడాలి.
  2. పగలని అద్దాన్ని ఎన్నుకోవాలి.
  3. గదిలో వెలుతురు సరిపడినంత ఉండేటట్లు చూసుకోవాలి.
  4. కొవ్వొత్తి దూరం పెంచితే వస్తువు ప్రతిబింబం చిన్నదైపోతుంది. కావున తగినంత దూరంలో కొవ్వొత్తి అమర్చుకోవాలి.
  5. అద్దంపై ఎటువంటి మరకలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

ప్రశ్న 5.
పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబాల యొక్క ధర్మాలను రాయండి.
జవాబు:
పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబాల యొక్క ధర్మాలు లేదా లక్షణాలు :

  1. నిజ ప్రతిబింబమును ఏర్పర్చును. కొన్ని సందర్భాలలో మిథ్యా ప్రతిబింబము ఏర్పర్చును.
  2. ప్రతిబింబ పరిమాణం పెద్దది మరియు సమానంగా ఉండవచ్చు.
  3. ప్రతిబింబం తలక్రిందులుగా కొన్నిసార్లు నిలువుగా ఉంటుంది.
  4. వస్తు స్థానాన్ని బట్టి ప్రతిబింబ లక్షణాలు మారతాయి.
  5. మిథ్యా మరియు నిటారు ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 6.
కాంతి క్రమపరావర్తనం మరియు క్రమరహిత పరావర్తనములను సూచించే పటాలను గీయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 1

ప్రశ్న 7.
సమతల దర్పణాలు ఏర్పరచే అనేక ప్రతిబింబాలను మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ గమనిస్తాం?
జవాబు:
మన నిజ జీవితంలో సమతల దర్పణాలు ఏర్పర్చే అనేక ప్రతిబింబాలను అనేక చోట్ల గమనించవచ్చు. అవి :

  1. స్వీట్స్ దుకాణంలో స్వీట్స్ కనిపించటానికి
  2. బార్బర్ షాప్లో తల వెనుక భాగం చూడటానికి
  3. షాపింగ్ మాల్స్ లలో ఆకర్షణ కోసం
  4. డ్రస్సింగ్ రూమ్ లలో
  5. ఊయల కృష్ణమందిరాలలో
  6. నగల దుకాణాలలో
  7. బట్టల షాపులలో
  8. కొన్ని హెటల్ హాల్స్ లలో

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

ప్రశ్న 8.
క్రమరహిత పరావర్తనాలను మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ గమనిస్తాం?
జవాబు:

  1. గరుకైన గాజు మీద క్రమరహిత పరావర్తనం వలన ప్రతిబింబం స్పష్టంగా ఉండదు.
  2. గీతలు పడ్డ అద్దాలు క్రమరహిత పరావర్తనాన్ని కల్గిస్తాయి.
  3. తొణుకుతున్న నీటి ఉపరితలాలు క్రమరహిత పరావర్తనాన్ని కల్గిస్తాయి.
  4. నునుపు లేని ఫ్లోరు, గోడలు, క్రమరహిత పరావర్తనం కల్గిస్తాయి.

ప్రశ్న 9.
గోళాకార దర్పణాల నిజ జీవిత అనువర్తనాలు రాయండి.
జవాబు:
నిజ జీవితంలో మనం పుటాకార మరియు కుంభాకార దర్పణాలను అనేక సందర్భములలో ఉపయోగిస్తాము. అవి:

  1. E.N.T డాక్టర్స్ హెడ్ మిర్రర్ గా పుటాకార దర్పణం వాడతారు. ఈ కాంతిని గొంతు, చెవి, ముక్కులలోకి పంపి వాటి లోపలి భాగాలను పరిశీలిస్తారు.
  2. దంతవైద్యులు పుటాకార దర్పణాన్ని వాడి దంతాల ప్రతిబింబాలను పెద్దవిగా చేసుకొని పరిశీలిస్తారు.
  3. కంటివైద్యులు, ‘ఆఫాల్మొస్కోప్’ అనే పరికరంలో పుటాకార దర్పణం వాడి కాంతిని నేరుగా కంటిలోనికి పంపుతారు.
  4. వాహనాలు, టార్చిలైట్ల వెనుక పుటాకార దర్పణం వాడటం వలన కాంతి సమాంతర పుంజంగా మార్చబడి చాలా దూరం ప్రయాణిస్తుంది.
  5. డ్రైవర్స్ ప్రక్కన ఉండే రియర్ వ్యూ మిర్రర్ లో కుంభాకార కటకం వాడి ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన వస్తువుల ప్రతిబింబాలను గమనిస్తారు.
  6. రోడ్డు వంపులలో ప్రమాదాలను నివారించటానికి, ఘాట్ రోడ్ మలుపులలో ఎదురు వచ్చే వాహనాలను గుర్తించటానికి కుంభాకార దర్పణం వాడతారు.
  7. ATM మిషన్లో కుంభాకార దర్పణం వాడటం వలన వెనుకవారు మీ పిన్ నంబర్‌ను గమనించే అవకాశం ఉండదు.

7th Class Science 8th Lesson కాంతితో అద్భుతాలు InText Questions and Answers

7th Class Science Textbook Page No. 35

ప్రశ్న 1.
కాంతి జనకాల నుండి కాంతి ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
కాంతి జనకాల నుండి కాంతి ఋజు మార్గంలో ప్రయాణిస్తుంది.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Science Textbook Page No. 47

ప్రశ్న 1.
దీపక్ రోడ్డుపై ఒక వాహనాన్ని చూశాడు. ఆ వాహనంపై TOMAJUAMA అని రాసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఆ పదము ఏమిటి? ఎందుకలా క్రొత్తగా రాయటం జరిగింది?
జవాబు:

  1. దర్పణాలలో ప్రతిబింబాలు పార్శ్వ విలోమంగా ఉంటాయి.
  2. ఇది అక్షరాల విషయంలో చదవటానికి కష్టముగా ఉంటుంది.
  3. అందువలన అంబులెన్స్ పై పేరును త్రిప్పి రాస్తారు.
  4. దానిని అద్దంలో చూచినపుడు సరిగా కనిపిస్తుంది.
  5. అందువలన వాహనదారులు రియర్ వ్యూ మిర్రర్ లో అంబులెన్స్ వాహనాన్ని గుర్తించి దానికి దారి ఇవ్వడం సులభమౌతుంది.

7th Class Science Textbook Page No. 53

ప్రశ్న 2.
పెరిస్కోప్ ఉన్న రెండు దర్పణాలను మనం ఎందుకు ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి? అవి ఒక దానికొకటి సమాంతరంగా లేకుంటే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. పెరిస్కోప్ నిర్మాణంలో రెండు వంపులు ఉంటాయి.
  2. ఈ వంపులలో సమతల దర్పణాలు 45° కోణంలో ఉంటాయి.
  3. రెండు వంపులలో ఉండే దర్పణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
  4. దీని వలన దర్పణాల మీద పడిన కాంతి పెరిస్కోప్ నుండి బయటకు వచ్చి కంటిని చేరతాయి.
  5. అందువలన నేల ఉపరితలం పైన ఉన్న సైనికులను చూడగలం.
  6. రెండు దర్పణాలు సమాంతరంగా లేకపోతే పరావర్తన కాంతి కంటిని చేరదు.
  7. పరిశీలిస్తున్న వ్యక్తికి ఏమీ కనపడదు. కావున పెరిస్కోప్ పనిచేయనట్లే భావించవచ్చు.

కృత్యాలు, ప్రాజెక్ట్ పనులు

7th Class Science Textbook Page No. 67

ప్రశ్న 1.
సోలార్ కుక్కర్ మరియు సోలార్ హీటర్లలో పెద్ద పరిమాణంలో గల పుటాకార దర్పణాలు ఉపయోగించి సూర్యకిరణాలను కేంద్రీకృతం చేస్తారు. ఈ సూత్రాన్ని ఉపయోగించి మీ సొంత సోలార్ కుక్కర్లను మీ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో తయారు చేయండి మరియు మీ స్కూల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 2

ప్రశ్న 2.
గోళాకార దర్పణాల ఉపయోగాలు గురించి సమాచారం సేకరించి ఒక రిపోర్టు తయారుచేయండి.
జవాబు:
వంపు తలాలు కలిగిన దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు. ఇవి రెండు రకాలు అవి :

  1. పుటాకార దర్పణాలు,
  2. కుంభాకార దర్పణాలు.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 3
పుటాకార దర్పణాలు : వీటిని

  1. వాహనాల హెడ్ లైట్ల వెనుకాల
  2. E.N.T. డాక్టర్స్ శరీర భాగాల పరిశీలనకు
  3. కంటి డాక్టర్స్ ఆఫ్లాల్మొస్కోప్ అనే పరికరంలోనూ
  4. దంత వైద్యులు దంతాలను పరిశీలించటానికి వాడతారు.

ఈ దర్పణం వలన ప్రతిబింబము పెద్దదిగా దగ్గరగా కనిపించుట వలన డాక్టర్స్ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు.

కుంభాకార దర్పణం :
ఇది ఉబ్బెత్తు వక్రతలాన్ని కల్గి ఉంటుంది. దీని ప్రతిబింబము నిటారుగా, చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలోని వస్తువులను చూచుటకు దీనితో సాధ్యం. కావున దీనిని
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 4

  1. వాహనాల రియర్ వ్యూ మిర్రర్ లోనూ
  2. రహదారుల వంపులలో ఎదురు వచ్చే వాహనాలు పరిశీలించటానికి వాడతారు.
  3. ATM మిషన్లపై భద్రతా ప్రమాణాలు పెంచటానికి కూడ వాడతారు.

ప్రశ్న 3.
మీ పాఠశాల మరియు ఇంట్లో ఏ వస్తువులు దర్పణాలుగా పనిచేస్తున్నాయో జాబితా తయారు చేయండి మరియు అవి అలా ఎందుకు ఉన్నాయో రిపోర్టు తయారు చేయండి.
జవాబు:

  1. మా ఇంట్లో స్టీలు పళ్ళెము, గిన్నె లోహపు పాత్రలు అన్ని దర్పణాలుగా పని చేస్తున్నాయి. ఇవి నునుపైన తలం కల్గి ఉండుట వలన సంపూర్ణ పరావర్తనం జరిపి దర్పణాలుగా పని చేస్తున్నాయి.
  2. వంపు కలిగిన స్పూన్, గరిటె, గిన్నె అడుగు భాగాలు వలయాకార దర్పణాలుగా పని చేస్తున్నాయి. ఇవి వెలుపలి వైపు ఉబ్బెత్తుగా ఉండి కుంభాకార దర్పణంలాగా లోపలి వైపు గుంటగా ఉండి పుటాకార దర్పణంలాగా పని చేస్తున్నాయి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

ప్రశ్న 4.
ఒక ఖాళీ టూత్ పేస్టు డబ్బాను మరియు దానికి సరిపడే పరిమాణంలో రెండు దర్పణాలను తీసుకొని పెరిస్కోప్ తయారు చేయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 5

కృత్యాలు

కృత్యం – 1

ప్రశ్న 1.
కిరణపుంజం అనగానేమి? అందలి రకాలు ఏవి?
జవాబు:
కాంతి అనేది, అనేక కాంతి కిరణాల సముదాయం . ఈ కాంతి కిరణాల సముదాయాన్ని కాంతి కిరణ పుంజం అంటారు. కాంతి కిరణ పుంజాలు 3 రకాలు. అవి :

  1. సమాంతర కాంతి కిరణ పుంజం,
  2. అభిసరణ కాంతికిరణ పుంజం,
  3. అపసరణ కాంతికిరణ పుంజం.

1. సమాంతర కాంతి కిరణపుంజం :
ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణాల సముదాయాన్ని సమాంతర కాంతికిరణ పుంజం అంటారు. సమాంతర కాంతికిరణ పుంజాన్ని అవగాహన చేసుకోవడానికి సందర్భం-1 ని గమనించండి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 6
సందర్భం-1 :
ఒక అట్టముక్కను మరియు కార్డుబోర్డును తీసుకోండి. కార్డుబోర్డుపై సన్నని చీలికలను చేయండి. కార్డుబోర్డును అట్టముక్కకు లంబంగా ఉంచండి. ఇప్పుడు దానిని ఉదయంపూట ఎండలో పటంలో చూపిన విధంగా ఉంచండి. కాంతికిరణాలు సూర్యుని నుండి కార్డుబోర్డుపై పడి సన్నని చీలికలగుండా ప్రయాణిస్తాయి. ఆ కాంతికిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతికిరణాల సముదాయాన్ని సమాంతర సమాంతర కాంతికిరణ పుంజం అంటారు.

2. అభిసరణ కాంతికిరణ పుంజం :
వివిధ దిశల నుండి ప్రయాణిస్తున్న కాంతికిరణాలు ఒక బిందువు వద్ద చేరితే అలాంటి కాంతికిరణ సముదాయాన్ని అభిసరణ కాంతికిరణ పుంజం అంటారు. అభిసరణ కాంతికిరణ పుంజం గురించి అర్థం చేసుకోవడానికి సందర్భం-2 ను గమనించండి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 7
సందర్భం -2 :
పై సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒక ఆక్రలిక్ దర్పణాన్ని కాంతికిరణాలు వచ్చే మార్గంలో పటంలో చూపిన విధంగా అమర్చండి. కాంతికిరణాలన్నీ, దర్పణంపై పడి ఒక బిందువు వద్దకు చేరతాయి. ఇలా అన్ని దిశలనుండి వచ్చిన కాంతికిరణాలు ఒక బిందువును చేరే కాంతి కిరణాల సముదాయాన్ని అభిసరణ కాంతికిరణ పుంజం అంటారు.

3. అపసరణ కాంతికిరణ పుంజం :
ఒక కాంతిజనకము నుండి వివిధ దిశలలో ప్రయాణించే కాంతికిరణ సముదాయాన్ని అపసరణ కాంతికిరణ పుంజం అంటారు. అపసరణ కాంతికిరణ పుంజం గురించి అర్థం చేసుకోవడానికి సందర్భం-3 ను గమనించండి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 8
సందర్భం-3 :
పై సందర్భంలో ఆక్రలిక్ దర్పణాన్ని కాంతికిరణ మార్గంలో పటంలో చూపిన విధంగా ఏర్పాటు చేయండి. దర్పణం నుంచి వెనుతిరిగిన కాంతి కిరణాలన్నీ వివిధ దిశలలో ప్రయాణిస్తాయి. ఈ విధంగా కాంతి జనకం నుండి వివిధ దిశలలో ప్రయాణించే కాంతికిరణాల సముదాయాన్ని అపసరణ కాంతికిరణ పుంజం అంటారు.

ఎ) ఇప్పుడు మనం వస్తువులను ఎలా చూడగలుగుతున్నాం?
జవాబు:
కాంతి వస్తువులపై పడి పరావర్తనం చెంది కంటిని చేరటం వలన మనం వస్తువులను చూడగలము.

బి) మన చుట్టూ ఉన్న వస్తువులను చూడడానికి కేవలం కాంతి మాత్రమే సరిపోతుందా?
జవాబు:
మనం వస్తువులు చూడటానికి

  1. కాంతి ఉండాలి.
  2. వస్తువుకు, కంటికి మధ్య కాంతి జనకం, వస్తువు మధ్య ఏదీ అడ్డం ఉండరాదు.

కృత్యం – 2

ప్రశ్న 2.
కాంతి పరావర్తనం ఆధారంగా మనం చూడగల్గుతున్నామని ఎలా నిరూపించగలము?
జవాబు:
కాంతి పరావర్తనం :
కాంతి జనకాల నుండి వస్తువులపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి వెనుకకు మరలే దృగ్విషయాన్ని కాంతి పరావర్తనం అంటారు.

ఉద్దేశం :
కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా మనం చూడగల్గుతున్నాం అని నిరూపించుట.

పరికరాలు :
ఒక టార్చిలైట్, అట్టముక్క, విధానం :

  1. ఒక టార్చి లైట్ తీసుకొని చీకటి గదిలోనికి ప్రవేశించాలి.
  2. చీకటి గదిలోని వస్తువులు ఏమీ కనిపించవు.
  3. అప్పుడు టార్చిలైట్ వెలిగించాలి.
  4. టార్చి వెలుగు వలన వస్తువులు కనిపించాయి.
  5. ఇప్పుడు టార్చి వెలిగించి కంటికి ఎదురుగా అట్టముక్క అడ్డం పెట్టుకోవాలి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 9
పరిశీలన :
టార్చిలైటు వెలుగు ఉన్నప్పటికి అట్ట అడ్డం ఉండుట వలన గదిలో వస్తువులు కనిపించలేదు.

వివరణ :
టార్చిలైట్ వెలుగు వస్తువులపై పడి, పరావర్తనం చెంది నీ కంటిని చేరుతున్నప్పుడు అట్టముక్క ఆపివేసింది. అందువలన వస్తువులు కనిపించలేదు.

నిరూపణ :
వస్తువుల నుండి పరావర్తనం చెందిన కాంతి కంటిని చేరటం వలన మనం వస్తువులను చూడగల్గుతున్నాము.
ఎ) మీరు ఏవైనా వస్తువులను చూడగలిగారా?
జవాబు:
లేదు. ఏమీ కనిపించలేదు. టార్చ్ లైట్ ను ఆన్ చేసి వస్తువుల మీదికి ప్రసరించేటట్లు చేయండి.

బి) ఇప్పుడు ఏమయింది?
జవాబు:
టార్చ్ లైట్ ఆన్ చేయగానే వస్తువులు కనిపించాయి.
వస్తువులకు, మీ కంటికి మధ్యలో ఒక కార్డుబోర్డును ఉంచి వస్తువులను చూడటానికి ప్రయత్నించండి.

సి) మీరు ఇప్పుడు ఆ వస్తువులను చూడగలిగారా? ఎందుకు?
జవాబు:
లేదు. వస్తువు నుండి వస్తున్న కాంతి కంటికి చేరకుండా కార్డుబోర్డు అడ్డం ఉండుట వలన వస్తువులు కనబడలేదు.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

ప్రశ్న 3.
ఒక సమతల దర్పణమును చేతిలో ఉంచుకుని ఆరుబయట ఎండలో ఒక బిల్డింగ్ ఎదురుగా నిలబడండి. సూర్యకాంతిని ఆ దర్పణంపై పడేలాగా చేయండి. ఇప్పుడు దర్పణం యొక్క దిశను మారుస్తూ సూర్యకాంతిని ఆ బిల్డింగ్ గోడపై పడేలాగా చేయండి.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 10
ఎ) సూర్యకాంతి బిల్డింగ్ గోడపై ఎందుకు పడింది?
జవాబు:
సూర్యుని నుంచి వచ్చిన కాంతి కిరణాలు దర్పణంపై పడి వెనుకకు వచ్చాయి. గోడపై పడిన కాంతిని సూర్యుని యొక్క ప్రతిబింబం అనవచ్చు.

కృత్యం – 4

ప్రశ్న 4.
ఒక కాంతి జనకం నుండి కాంతిని క్రింద చూపిన వివిధ రకాల వస్తువులపై ప్రసరింపచేసి, ప్రతి సందర్భంలో పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

వస్తువు వస్తువు తలం యొక్క లక్షణం (నునుపైన మరియు మెరుస్తున్న / నునుపైనది కాని మెరుపులేనిది / గరుకైనది) పరిశీలన (స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడింది / ప్రతిబింబం ఏర్పడింది. కాని స్పష్టంగా లేదు / ప్రతిబింబం ఏర్పడలేదు)
1. సమతల దర్పణం నునుపైనది, మెరుస్తున్నది స్పష్టమైన ప్రతిబింబం
2. కొత్త స్టీలు పళ్ళెం నునుపైనది, మెరుస్తున్నది స్పష్టమైన ప్రతిబింబం
3. కార్డ్ బోర్డు మెరుపు లేదు, గరుకైనది ప్రతిబింబం ఏర్పడలేదు
4. థర్మోకోల్ షీటు నునుపైనది, మెరుపు లేదు ప్రతిబింబం ఏర్పడలేదు
5. గుడ్డముక్క గరుకైనది ప్రతిబింబం ఏర్పడలేదు
6. కాగితం నునుపైనది కాని మెరుపు లేదు ప్రతిబింబం ఏర్పడలేదు

కృత్యం – 5

ప్రశ్న 5.
పరావర్తన నియమాలను ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉదేశం : పరావర్తన నియమాలు నిరూపించుట

పరికరాలు :
కోణమానిని, లేజర్ లైట్, డ్రాయింగ్ బోర్డు, సమతల దర్పణం.

విధానం :

  1. ఒక సమతల దర్పణం తీసుకొని డ్రాయింగ్ బోర్డుకు, కదలకుండా బిగించాను.
  2. దర్శణం వెనుక కోణమానిని నిలువుగా అమర్చాను.
  3. ఒక లేజర్ లైట్ తీసుకొని కాంతిని కోణమానినిలోని కోణం కొలుస్తూ దర్పణంపై పడే విధంగా వేయాలి.

పరిశీలన :

  1. దర్పణం పైన పడిన లేజర్ కాంతి పరావర్తనం చెంది కోణమానిని రెండవ వైపు నుండి బయటకు రావటం గమనించవచ్చు.
  2. ఇప్పుడు లేజర్ కాంతికిరణం కోణాలు మార్చుతూ, పరావర్తన కిరణం కోణాన్ని గమనిస్తూ విలువలను పట్టికలో నమోదు చేయాలి.
    AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 11
పతన కోణాలు పరావర్తన కోణాలు
1. 20° 20°
2. 40° 40°
3. 60° 60°
4. 80° 80°

నిర్ధారణ: పై పట్టిక పరిశీలన ఆధారంగా

  1. పతన కోణం, పరావర్తన కోణం విలువలు సమానంగా ఉన్నాయి.
  2. పతన కోణం, పరావర్తన కోణం మధ్య ఉన్న లంబానికి ఇరువైపులా ఉన్నాయి.
  3. పతన కోణం, పరావర్తన కోణం మరియు లంబాలు ఒకే తలంలో ఉన్నాయి.

కృత్యం – 6

ప్రశ్న 6.
సమతల దర్పణంలో వస్తుదూరము, ప్రతిబింబ దూరము సమానంగా ఉంటాయని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం :
సమతల దర్పణంలో ప్రతిబింబ దూరం వస్తు దూరానికి సమానమని నిరూపించుట.

పరికరాలు :
సమతల దర్పణం, చెబోర్డు, షానర్

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 12
విధానం:

  1. ఒక చెస్ బోర్డును తీసుకొని దానికి ఒకవైపున నిలువుగా సమతల దర్పణం అమర్చాలి.
  2. చెస్ బోర్డు మీద ఒక గదిలో షార్పనం ఉంచాలి.
  3. షానర్ నుండి దర్పణానికి మధ్య గల చతురస్రాకార గడులు లెక్కించాలి.
  4. అదే విధంగా ప్రతిబింబములో దర్పణానికి, షార్పనకు మధ్య ఉన్న గడులను లెక్కించాలి.

పరిశీలన :
వస్తువు నుండి దర్పణానికి మధ్య ఉన్న చతురస్రాకార గడుల సంఖ్య, ప్రతిబింబము నుండి దర్పణానికి మధ్య ఉన్న చతురస్రాకార గడుల సంఖ్యకు సమానంగా ఉంది.

నిర్ధారణ :
అంటే వస్తువు దూరం ప్రతిబింబం దూరానికి సమతల దర్పణంలో సమానంగా ఉంది.

కృత్యం – 7

ప్రశ్న 7.
పార్శ్వ విలోమం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
పార్శ్వ విలోమం :
సమతల దర్పణ ప్రతిబింబములో, వస్తువుతో పోల్చినప్పుడు, కుడి ఎడమలు తారుమారుగా ఉంటాయి. ఈ విషయాన్ని పార్శ్వ విలోమం అంటారు.

ఉద్దేశం :
పార్శ్వ విలోమాలను నిరూపించుట

పరికరాలు : ఒక పెద్ద సమతల దర్పణం.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 13
విధానం :

  1. ఒక పెద్ద అద్దం ముందు నిలబడి నీ ప్రతిబింబాన్ని పరిశీలించాలి.
  2. తరువాత కుడిచేతిని పైకి లేపాలి.
  3. నీవు కుడి చేతిని పైకి లేపినపుడు దర్పణంలో నీ ప్రతిబింబము ఎడమ చేతిని పైకి లేపుతుంది.
  4. ఇప్పుడు కుడి చేతిని దించి ఎడమ చేతిని పైకి ఎత్తండి.

పరిశీలన :
ఎడమచేతిని పైకి ఎత్తినపుడు ప్రతిబింబములో కుడిచేయి పైకి ఎత్తినట్లుగా ఉంది.

వివరణ :
సమతల దర్పణంలో ప్రతిబింబం కుడి, ఎడమలు తారుమారై కనిపిస్తాయి. ఈ ధర్మాన్నే “పార్శ్వ విలోమం” అంటారు.

కృత్యం – 8

ప్రశ్న 8.
సమతల దర్పణ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము అని ఎలా నిరూపిస్తావు?
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 14
జవాబు:
ఉద్దేశం :
సమతల దర్పణ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబమని నిరూపించుట

పరికరాలు :
కొవ్వొత్తి, సమతల దర్పణం, తెల్ల అట్టముక్క

విధానం :

  1. వెలుగుతున్న కొవ్వొత్తిని సమతల దర్పణం ముందు ఉంచండి.
  2. దర్పణం నందు కొవ్వొత్తి ప్రతిబింబము పరిశీలించండి.
  3. కొవ్వొత్తి వెనుక తెల్ల అట్టముక్కను ఉంచండి.
  4. అట్టముక్కను ముందుకు వెనుకకు జరుపుతూ ప్రతిబింబం ఏర్పడుతుందేమో గమనించండి.

పరిశీలన :
తెల్ల అట్టముక్క మీద ఎటువంటి ప్రతిబింబం ఏర్పడలేదు.

నిర్ధారణ :
సమతల దర్పణం నుండి ఏర్పడే ప్రతిబింబాన్ని తెరమీద పట్టలేము. కావున దీనిని మిథ్యా ప్రతిబింబము అంటారు.

కృత్యం – 9

ప్రశ్న 9.
వాలు, దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాలకు సమీకరణాలు రాబట్టండి.
జవాబు:
ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకుని దానిపై తెల్లకాగితాన్ని పరచండి. ఆ తెల్లకాగితంపై ఒక అర్ధవృత్తాన్ని గీయండి. దానిపై కోణమానిని సహాయంతో (0° నుండి 180°ల వరకు కోణాలను గుర్తించండి. ఒకే పరిమాణం గల రెండు సమతల దర్పణాలను తీసుకొని వాటిని క్రింది పటంలో చూపిన విధంగా ఒక సెల్లో పెన్ టేపు సహాయంతో అతికించండి. రెండు దర్పణముల మధ్య 120 ల కోణం ఉండే విధంగా ఆ దర్పణములను అర్ధవృత్తము మీద ఉంచండి. ఇప్పుడు ఆ దర్పణాల మధ్యలోకి ఒక వెలుగుతున్న కొవ్వొతిని తీసుకురండి. దర్పణాలచే ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్యను లెక్కించండి. దర్పణాల మధ్య కోణాన్ని 120°ల నుండి 90°, 60°, 459, 30°కు తగ్గించండి.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 15
ప్రతిసందర్భంలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్యను లెక్కించండి. పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 16
దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యను కనుగొనే సూత్రాన్ని ఉత్పాదించే ప్రయత్నం చేద్దాం.
360 డిగ్రీలను దర్పణాల మధ్యలో గల కోణం (9)తో భాగించి దాని నుండి ఒకటిని తీసివేయండి. మీరు ఏం విలువను పొందారు? ఈ విలువ దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్యకు సమానమైనదా? పై పట్టిక నుండి ఈ దర్పణాల మధ్యలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య (n) ను కింది సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 17

రెండు దర్పణముల మధ్య సున్నా డిగ్రీల కోణం ఉన్నప్పుడు వాటి మధ్య ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి?
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 18
సూత్రం నుండి, వాటి మధ్య అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయి.

కృత్యం – 10

ప్రశ్న 10.
షూ బాక్సులో రాజమార్గం :
ఒక షూ బాక్సు తీసుకొని దానిలో రెండు సమతల దర్పణములను వాటి యొక్క పరావర్తన తలాలు ఎదురుగా ఉండే విధంగా అమర్చండి. ఆ రెండు దర్పణముల మధ్య బాక్స్ అడుగు భాగంలో ఒక రహదారిని గీయండి. ఆ రోడ్డుకు ఇరువైపులా రెండు ఎల్ ఈడి వీధిలైట్లును అమర్చండి. దర్పణం ఉన్నవైపున బాక్సుకు మధ్యలో ఒక రంధ్రం చేసి ఆ ప్రాంతంలో దర్పణంపై గల రంగుపూత తొలగించండి. ఆ రంధ్రం గుండా బాక్స్ లోపల దృశ్యాన్ని గమనించండి.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 19
ఎ) మీకు ఎలా అనిపించింది?
జవాబు:
చాలా ఆశ్చర్యమేసింది. రోడ్డు చాలా దూరం, అనంతంగా కనిపించింది.

బి) ఇది ఎలా జరిగి ఉండవచ్చు?
జవాబు:
రెండు సమతల దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడుట వలన ఇది సాధ్య మైనది.

పరిశీలన :
రంధ్రం గుండా బా లోనికి పరిశీలించినపుడు అందమైన రోడ్డు అనంతంగా చాలా దూరం కనిపిస్తుంది.

వివరణ :
ఈ నిర్మాణంలో రెండు సమతల దర్పణాలు ఎదురెదురుగా అమర్చుట వలన అనంత ప్రతిబింబాలు ఏర్పడి రహదారి చాలా పొడవుగా ఉన్న భ్రాంతి కల్గిస్తుంది.

సూత్రం :
సమతల దర్పణాలను సమాంతరంగా అమర్చినపుడు ప్రతిబింబాలు అనేకం ఏర్పడతాయి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు

కృత్యం – 11

ప్రశ్న 11.
పెరిస్కోప్ నిర్మాణమును పనిచేయు విధానమును వివరించండి.
జవాబు:
ఉద్దేశం : పెరిస్కోప్ తయారు చేయుట

పరికరాలు :
ఖాళీ అగరుబత్తి పెట్టె, రెండు దర్పణాలు, స్కేలు, పెన్సిల్, బ్లేడ్, గమ్.

విధానం :

  1. ఒక ఖాళీ అగరుబత్తి పెట్టె తీసుకొని దాని రెండు చివరల పెన్సిల్ తో చతురస్ర పెట్టెలు గీయండి.
  2. ఆ చతురస్రాలలో కర్ణముల వెంబడి చీలికలు చేసి సమతల దర్పణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేటట్లు అమర్చాలి.
  3. దర్పణాల పరావర్తన తలాలకు ఎదురుగా వెడల్పు తక్కువగా ఉండే వైపున రెండు కిటికీలను ఏర్పాటు చేయండి.
  4. సిద్ధమైన పెరిస్కోపు వస్తువు వైపు ఉంచి క్రింద ఉన్న దర్పణం నుండి పరిశీలించండి.

పరిశీలన :
పైన ఉన్న వస్తువులు క్రింద ఉన్న దర్పణాల నుండి కనిపిస్తున్నాయి.

పనిచేయు విధానం :

  1. వస్తువు నుండి వచ్చిన కాంతి కిరణాలు మొదట దర్పణం M, మీదపడి క్రిందకు పరావర్తనం చెందుతాయి.
  2. క్రింది దర్పణం M2 కూడా వాలుగా ఉండటం వలన కాంతి మరోసారి పరావర్తనం చెంది కంటిని చేరుతుంది.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 20
సూత్రం :
సమతల దర్పణాల మీద కాంతి పరావర్తనం ఆధారంగా పెరిస్కోప్ పని చేస్తుంది.

ప్రయోజనం :

  1. సబ్ మెరైన్లోని వ్యక్తులు భూ ఉపరితలాన్ని పరిశీలించటానికి
  2. కందకాలలోని సైనికులు శత్రువులను గమనించటానికి
  3. కాంతి పరావర్తనం అర్థం చేసుకోవటానికి

కృత్యం – 12

ప్రశ్న 12.
ఒక స్టెయిన్ లెస్ స్టీలు గరిటెను తీసుకోండి. దాని బాహ్య ఉబ్బెత్తు ఉపరితలాన్ని మీ మొహం దగ్గరికి తీసుకువచ్చి దానిలోకి చూడండి.
ఎ) దానిలో మీ ప్రతిబింబం కనిపించిందా?
జవాబు:
అవును. ప్రతిబింబం కనిపించింది.
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 21

బి) మీరు సమతల దర్పణంలో చూసే ప్రతిబింబానికి దీనికీ ఏమైనా తేడా గమనించారా?
జవాబు:
ప్రతిబింబం చిన్నదిగా, నిటారుగా ఉంది.

సి) ప్రతిబింబం ఎలా ఉంది? (నిటారు/తలక్రిందులు)
జవాబు:
నిటారుగా ఉంది.

డి) ప్రతిబింబ పరిమాణం ఎలా ఉంది? (సమానము / చిన్నది / పెద్దది)
జవాబు:
చిన్నదిగా ఉంది.
స్పూనును వెనక్కు తిప్పి ‘మీ ప్రతిబింబాన్ని గరిటె లోపలి తలంలో గమనించండి.

ఇ) ఇప్పుడు ప్రతిబింబం ఎలా ఉంది? (నిటారు/ తలక్రిందులు)
జవాబు:
తలక్రిందులుగా ఉంది.

ఎఫ్) ప్రతిబింబ పరిమాణం ఎలా ఉంది? (సమానము/ చిన్నది / పెద్దది)
జవాబు:
పెద్దదిగా ఉంది.

జి) గరిటె నుండి మీ ముఖాన్ని దూరంగా జరిపే ప్రయత్నం చేయండి. మీరు ప్రతిబింబ పరిమాణంలో ఏదైనా తేడా గమనించారా?
జవాబు:
ప్రతిబింబ పరిమాణం ఇంకా పెద్దదిగా కనిపించినది.

కృత్యం – 13

ప్రశ్న 13.
పుటాకార దర్పణం ఏ రకమైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుందో ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 22

  1. ఒక V ఆకారపు చెక్క స్టాండును తీసుకోండి. దాని పై పుటాకార దర్పణం ఉంచండి.
  2. ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని దర్పణం ముందర సుమారు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచండి.
  3. తెరను, లేదా తెల్లటి కాగితాన్ని, దర్పణం నుండి ముందుకు, వెనుకకు కదపటం ద్వారా కొవ్వొత్తి యొక్క ప్రతిబింబమును తెరమీద పట్టే ప్రయత్నం చేయండి.
  4. తెరను వెలుగుతున్న కొవ్వొత్తికి దర్పణమునకు మధ్యలో అడ్డుపడకుండా జాగ్రత్త వహించండి.
  5. వెలుగుతున్న కొవ్వొత్తిని దర్పణం ముందు వివిధ దూరాలలో ఉంచుతూ దర్పణంవైపు జరపండి.
  6. ప్రతి సందర్భంలో స్పష్టమైన ప్రతిబింబమును తెరమీద పెట్టే ప్రయత్నం చేయండి. మీ పరిశీనలను కింది పట్టికలో నమోదు చేయండి.

AP Board 7th Class Science Solutions Chapter 8 కాంతితో అద్భుతాలు 23