SCERT AP 7th Class Science Study Material Pdf 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 7th Lesson Questions and Answers మొక్కలలో ప్రత్యుత్పత్తి
7th Class Science 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. మందార మొక్క సాధారణంగా ………………………. పద్ధతిలో ఉత్పత్తి చేయబడుతుంది. (శాఖీయ)
2. ఒక పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం …………… (కేసరావళి)
3. అండకోశంలో దిగువన ఉబ్బి ఉన్న భాగం ………… (అండాశయం)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి చేసే మొక్క
ఎ) రణపాల
బి) గులాబి
సి) హైడ్రిల్లా
డి) నీలగోరింట
జవాబు:
ఎ) రణపాల
2. మొక్కలో ప్రత్యుత్పత్తి భాగం
ఎ) వేరు
బి) కాండం
సి) పత్రం
డి) పుష్పం
జవాబు:
డి) పుష్పం
3. పరాగసంపర్క కారకాలు
ఎ) గాలి
బి) నీరు
సి) కీటకాలు
డి) పైన పేర్కొన్నవన్నీ
జవాబు:
డి) పైన పేర్కొన్నవన్నీ
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) బంగాళదుంప | 1) కాండ ఛేదనం |
B) రణపాల | 2) విత్తనాలు |
C) చెరకు | 3) ఆకులు |
D) వేపచెట్టు | 4) కన్నులు |
E) అరటి | 5) పరాగకోశం |
6) పిలకలు |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) బంగాళదుంప | 4) కన్నులు |
B) రణపాల | 3) ఆకులు |
C) చెరకు | 1) కాండ ఛేదనం |
D) వేపచెట్టు | 2) విత్తనాలు |
E) అరటి | 6) పిలకలు |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కింది వాక్యాలు సత్యమా కాదా అని గుర్తించండి. సత్యం కాని వాక్యాలను సరిచేయండి.
a) గుమ్మడి పాదులో పువ్వులు ఏకలింగక పుష్పాలు.
జవాబు:
ఈ వాక్యం సత్యము
b) విత్తనాలు అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడతాయి.
జవాబు:
ఈ వాక్యం అసత్యం. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఉండవు.
c) సాధారణంగా గులాబీలు విత్తనాల ద్వారా ఉత్పత్తి అవుతాయి.
జవాబు:
ఈ వాక్యం అసత్యం. సాధారణంగా గులాబీలు శాఖీయ వ్యాప్తి అయిన కాండ ఛేదనం ద్వారా ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 2.
పరాగరేణువులను కీలాగ్రానికి బదిలీ చేయబడటాన్ని ఏమంటారు? పట సహాయంతో దానిలోని రకాలను వివరించండి.
జవాబు:
పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు. ఇది రెండు రకాలు.
1. స్వపరాగ సంపర్కం :
పరాగ రేణువులు ఒకే పుష్పంలో పరాగకోశం నుంచి, అదే పుష్పంలో కీలాగ్రానికి చేరినట్లయితే దానిని స్వపరాగ సంపర్కం అంటారు.
2. పరపరాగ సంపర్కం :
ఒక పువ్వులోని పరాగ రేణువులు పరాగకోశం నుండి మరొక పువ్వులోని కీలాగ్రానికి చేరితే దానిని పరపరాగ సంపర్కం అంటారు.
ప్రశ్న 3.
మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయగలవా? ఉదాహరణల సాయంతో ఆ విధానాలను వివరించండి.
జవాబు:
విత్తనాలు లేకుండా కొత్త మొక్కల్ని శాఖీయ వ్యాప్తి విధానంలో ఉత్పత్తి చేయగలము. అవి :
1. పిలకలు :
అరటి మొక్కలు పెరిగే కొద్ది తల్లి మొక్క అడుగు భాగం నుండి చిన్న కొత్త మొక్క పైకి లేస్తుంది. వీటిని పిలకలు లేదా సక్కర్స్ అంటారు. వీటి ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి.
2. కణుపులు :
చెరకు మొక్కలలో కణుపులను నరికి భూమిలో పాతిపెట్టటం ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
3. అంట్లు :
మల్లె మొక్కలో కాండాలు బలహీనంగా ఉంటాయి. వీటి కాండం భూమిలో ఉండి చిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే అంట్లు అంటారు.
4. ఛేదనం :
పుదీనా వంటి ఆకు కూరలను, కాండాలు మరియు కణుపులను కత్తిరించి సాగుచేస్తారు. ఈ పద్ధతిని ఛేదనం అంటారు.
5. కన్నులు :
బంగాళదుంపలో గుంట వంటి నిర్మాణాన్ని కన్నులు అంటారు. వీటిని కత్తిరించి భూమిలో నాటడం వలన కొత్త మొక్కలు ఏర్పడతాయి.
వీటితో పాటుగా నేల అంట్లు, అంటు తొక్కటం, అంటుకట్టటం వంటి శాఖీయ విధానంలో కూడ మొక్కలు ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 4.
మామిడి పువ్వు యొక్క పుప్పొడి, జామ పువ్వులోని కీలాగ్రాన్ని చేరితే ఏమవుతుంది?
జవాబు:
- మామిడి పువ్వు పుప్పొడి జామ పువ్వులోని కీలాగ్రాన్ని చేరినా ఫలదీకరణం జరగదు.
- ఫలదీకరణం ఒకే జాతి జీవుల మధ్య స్వేచ్ఛగా జరుగుతుంది.
- మామిడి మరియు జామ మొక్కలు వేరు వేరు జాతి మొక్కలు.
- కావున వీటి మధ్య ఫలదీకరణ జరగదు.
ప్రశ్న 5.
ప్రకృతిలో ఉన్న తేనెటీగలన్నీ అంతరించిపోతే ఏమవుతుందో ఊహించండి, దాని పర్యవసానాలు తెలపండి.
జవాబు:
- తేనెటీగలు మకరందం సేకరించటానికి పుష్పాల మధ్య తిరుగుతుంటాయి.
- ఈ ప్రక్రియలో అవి పరాగరేణువులను మోసుకొచ్చి ఫలదీకరణకు తోడ్పడతాయి.
- ప్రకృతిలో జరిగే ఫలదీకరణ ప్రక్రియలో తేనెటీగలు కీలకమైనవి.
- తేనెటీగలు అంతరించిపోతే మొక్కలలో ఫలదీకరణ తగ్గిపోతుంది.
- ఫలితంగా చాలా మొక్కలు అంతరించిపోతాయి.
- వ్యవసాయంలో పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది.
- కావున రసాయనాల వాడకం ఆపి తేనెటీగలను సంరక్షించుకోవాలి.
ప్రశ్న 6.
ఉమ్మెత్త పువ్వు యొక్క భాగాలను అధ్యయనం చేయడం కొరకు ప్రయోగశాల కృత్యంలో మీరు తీసుకోవాల్సిన పరికరాలు, ప్రయోగ విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:
ఉద్దేశం : పుష్ప భాగాలను పరిశీలించటం
పరికరాలు : ఉమ్మెత్త పుష్పం, బ్లేడు, భూతద్దం.
విధానం :
- ఒక ఉమ్మెత్త పుష్పాన్ని తీసుకొని దాని నిలువు తలంలో పొడవుగా కోయండి.
- దాన్ని రెండు సమభాగాలు చేసి పరిశీలించండి.
- పుష్పంలో భాగాల అమరిక పటం గీయండి.
జాగ్రత్తలు :
- బ్లేడు పదునుగా ఉంటుంది కావున కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- పుష్పాన్ని సున్నితంగా నైపుణ్యంతో కోయాలి.
ప్రశ్న 7.
సంపూర్ణ పుష్పం యొక్క పటాన్ని గీసి, భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 8.
రాహుల్ తన తోటి విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటనకు వెళ్ళాడు. అతడు ఒక పువ్వుపై కీటకమును పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు దీనిని సమర్ధించగలరా?
జవాబు:
- రాహుల్ పనిని నేను సమర్థించను.
- పూలపై ఉండే పురుగులు ఫలదీకరణకు తోడ్పడతాయి.
- వాటిని పట్టుకోవటం లేదా చంపటం ఫలదీకరణపై ప్రభావం చూపుతుంది.
- ప్రకృతిలో ప్రతి జీవికీ బ్రతికే హక్కు స్వేచ్చగా సంచరించే హక్కు ఉన్నాయి. వాటికి మనం భంగం కలిగించ కూడదు.
- ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని గౌరవించాలి.
ప్రశ్న 9.
నగరంలో నివసించే వెంకట్ తన ఆరు అంతస్తుల భవనం పై భాగంలో ఒక “పైకప్పు తోట”ను నిర్వహిస్తున్నాడు. బీర పాదు పుష్కలమైన పుష్పాలను కలిగి ఉంటుంది. కానీ ఆ పువ్వులు కాయలుగా ఎదగవు. బీరకాయల దిగుబడి కొరకు మీరు అతడికి ఏమైనా సూచనలు ఇవ్వగలరా?
జవాబు:
- ఫలదీకరణ వలన పుష్పాలు కాయలుగా మారతాయి.
- వెంకట్ తన పై కప్పు గార్డెన్ లో బీరకాయలు కాయాలంటే ఫలదీకరణ ప్రక్రియను ప్రోత్సహించాలి.
- దీని కోసం అతను కీటకాలు వాలటానికి అవకాశం కల్పించాలి. చుట్టూ Net లు కట్టి ఉంటే తొలగించాలి.
- హానికర రసాయనాల వాడకం తగ్గించాలి.
- తన తోటలో మకరందం గల ఇతర పుష్పాల పెంపకం చేపట్టాలి.
- చివరి ప్రయత్నంగా కృత్రిమ పరాగ సంపర్కం నిర్వహించాలి.
ప్రశ్న 10.
కృత్రిమ శాఖీయ ఉత్పత్తిలో వివిధ పద్ధతులను ఒక చార్టుపై గీసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
7th Class Science 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి InText Questions and Answers
7th Class Science Textbook Page No.5
ప్రశ్న 1.
కాండాలను నాటడం ద్వారా మనం అన్ని మొక్కలనూ పెంచవచ్చా?
జవాబు:
లేదు. కాండాలను నాటటం ద్వారా కొన్ని రకాల మొక్కలను మాత్రమే పెంచగలము.
ప్రశ్న 2.
కొత్త మొక్కలు కాండం నుండి ఎలా వస్తాయి?
జవాబు:
కొత్త మొక్కలు కొన్ని శాఖీయ పద్ధతుల ద్వారా కాండం నుండి వస్తాయి.
ఉదా : నేలంటు, అంటు కట్టడం మొ||నవి.
7th Class Science Textbook Page No. 7
ప్రశ్న 3.
అరటి పండులో విత్తనాలు ఎప్పుడైనా చూశారా?
జవాబు:
అడవిలో వన్యంగా పెరిగే అరటిలో నల్లటి, గుండ్రని, పెద్దవిగా ఉండే విత్తనాలు ఉంటాయి. మనం సాగుచేసే అరటిలో ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి.
ప్రశ్న 4.
మీరు ఎప్పుడైనా విత్తనాలను మల్లె మొక్కలలో చూశారా?
జవాబు:
అవును. మల్లె పువ్వు నుండి పొడవైన కాయలు ఏర్పడి విత్తనాలు కలిగి ఉంటాయి. వీటిని నాటటం వలన కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 5.
కొత్త మందార మొక్కలు ఎలా ఉత్పత్తి చేస్తారో గమనించారా?
జవాబు:
సాధారణంగా మందార మొక్కలను కాండ ఛేదనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు.
7th Class Science Textbook Page No. 25
ప్రశ్న 6.
ఫలదీకరణ తరువాత పువ్వులో ఎలాంటి మార్పులు వస్తాయి?
జవాబు:
ఫలదీకరణ తరువాత ఎదిగిన అండాశయం పండుగా మారి, మిగిలిన పుష్పభాగాలు రాలిపోతాయి.
ఆలోచించండి – ప్రతిస్పందించండి
7th Class Science Textbook Page No. 25
ప్రశ్న 1.
కొన్ని మొక్కలు చిన్న అసంఖ్యాకమైన విత్తనాలను ఎందుకు ఉత్పత్తి చేస్తాయి?
జవాబు:
- విత్తనాలు మొలకెత్తటానికి, చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.
- మరికొన్ని విత్తనాలను జంతువులు ఆహారంగా తీసుకొంటాయి.
- మరికొన్ని విత్తనాలు సరైన స్థలాన్ని చేరకపోవచ్చు.
- అందువలన మొక్కలు విత్తనాలను అసంఖ్యాకంగా ఉత్పత్తి చేస్తాయి.
- అందుచేత విత్తనాలు మొలకెత్తే అవకాశాలు మెరుగవుతాయి.
ప్రశ్న 2.
కొన్ని విత్తనాలకు ఎందుకు రెక్కలు ఉంటాయి?
జవాబు:
- విత్తనాలలో కొన్ని గాలి ద్వారా వ్యాపిస్తాయి.
- గాలి ద్వారా ఎక్కువ దూరం విస్తరించటానికి వాటికి రెక్కలు అవసరం.
- రెక్కలు గల విత్తనాలు గాలి వాలుగా చాలా దూరం ప్రయాణించి మొలకెత్తుతాయి.
- రెక్కలు అనేవి విత్తనాలకు ఒక అనుకూలం.
ప్రశ్న 3.
కొన్ని విత్తనాలు ఎక్కువ పీచుతో ఉంటాయి. ఎందుకు?
జవాబు:
- నీటి ద్వారా వ్యాపించే విత్తనాలు ఎక్కువ పీచు కలిగి ఉంటాయి.
- నీటి ద్వారా విత్తనాలు ప్రయాణించేటప్పుడే అవి బాగా నానతాయి.
- విత్తనాల చుట్టూ ఉండే పీచు నీటి నుండి విత్తనాలను రక్షిస్తుంది.
- అంతేగాక ఇవి నీటిలో తేలియాడేటట్లు చేస్తాయి.
ఉదా : కొబ్బరి.
ప్రశ్న 4.
కొన్ని ఎండిన కాయలు ఎందుకు పగులుతాయి?
జవాబు:
- ఎండిన కాయలు పగలటం అనేది ఒక యాంత్రిక విధానం.
- కాయలు పగలటం ద్వారా విత్తనాలు దూరంగా విసిరివేయబడతాయి.
- అందువలన విత్తన వ్యాప్తి జరిగి మొలకెత్తుతాయి.
ఉదా : బెండ, మినుము, కందులు.
ప్రశ్న 5.
కొన్ని విత్తనాలకు కేశాలు (వెంట్రుకలు) ఎందుకు ఉంటాయి?
జవాబు:
- కేశాలు (వెంట్రుకలు) కలిగిన విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి.
- ఇవి విత్తనాన్ని తేలికగా ఉంచి గాలి వాలుతో ఎక్కువ దూరం ప్రయాణించటానికి తోడ్పడతాయి.
- పొడవాటి వెంట్రుకలు గల, విత్తనాలు గాలిలో చాలా దూరం వ్యాపింప చేస్తాయి.
ప్రశ్న 6.
చాలావరకు పండ్లు ఎందుకు తియ్యని కండ కలిగి ఉంటాయి?
జవాబు:
- అండాశయాలు విత్తనాలుగా అభివృద్ధి చెందే కొలది, అండకోశం పరిపక్వమై, అండకోశ కుడ్యం, ఫలదీకరణం చెందిన అండం పై పొర (pericarp) కండగా రూపొందుతాయి.
- అనేక విత్తనాలు కలిగిన పండ్లలో ఫలదీకరణం చెందిన అండాశయాల సంఖ్యకు అనుగుణంగా కండరయుత నిర్మాణం అభివృద్ధి చెందుతుంది.
- తియ్యగా కండ కలిగిన ఫలాలు జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
- జంతువులు వీటిని ఆహారంగా తీసుకొని ఇతర ప్రాంతాలలో విసర్జిస్తాయి.
- అందువలన ఇటువంటి పండ్లు తమ విత్తనాలను జంతువుల ద్వారా వ్యాపింప చేస్తాయి.
ప్రశ్న 7.
కొన్ని విత్తనాలకు కొక్కెములు ఎందుకు ఉంటాయి?
జవాబు:
- కొక్కెములు, ముళ్ళు కలిగిన విత్తనాలు, జంతువుల రోమాలలో చిక్కుకుంటాయి.
- అందువలన అవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా అవుతాయి.
- జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఇలా కొక్కెములు, ముండ్లు కలిగి ఉంటాయి.
ఉదా : తేలుకొండి.
ప్రశ్న 8.
కొన్ని విత్తనాలు ఎందుకు బరువైనవిగా మరియు గుండ్రంగా ఉంటాయి?
జవాబు:
- బరువైన గుండ్రని విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
- బరువుగా ఉండటం వలన ఇవి నీటిలో మునిగి ప్రయాణిస్తాయి.
- గుండ్రముగా ఉండుట వలన సులువుగా దొర్లగలవు.
ఉదా : తామర
ప్రశ్న 9.
కొన్ని విత్తనాలు ఎందుకు తేలికగా, చిన్నగా ఉంటాయి?
జవాబు:
- తేలికైన విత్తనాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
- ఎక్కువ దూరం ప్రయాణించటానికి విత్తనాలు బరువు తక్కువుగా ఉంటాయి.
ఉదా : గడ్డి చామంతి.
ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 31
ప్రశ్న 1.
ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, గ్లాడియోలా, చిలగడదుంప, బ్రయోఫిలిమ్, బెగోనియాలో శాఖీయ వ్యాప్తి విధానానికి సంబంధించి పెద్దల నుండి, ఇంటర్నెట్ లేదా మీ స్కూలు లైబ్రరీ నుంచి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మొక్క | శాఖీయ వ్యాప్తి |
1. ఉల్లిపాయ | దీనిలో కాండం పొట్టిగా నొక్కబడి ఒక బిళ్ళ లేదా డిస్క్ ఆకారంలో మారుతుంది. దీని అడుగుభాగం నుండి వేర్లు ఉత్పత్తి జరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లిలోని ఇటువంటి శాఖీయవ్యాప్తిని బల్బులు అంటారు. |
2. వెల్లుల్లి | వెల్లుల్లిలో కూడ ఉల్లివలె బల్బుల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగుతుంది. దీనిలో కూడ కాండం పొట్టిగా నొక్కబడి డిస్క్ ఆకారం ఉంటుంది. ఇది శాఖీయ వ్యాప్తికి తోడ్పడుతుంది. |
3. అల్లం | అల్లం భూగర్భ కాండం రకానికి చెందినది. దీనిని రైజోమ్ అంటారు. ఇది భూమిలో సమాంతరంగా పెరుగుతూ కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ఉన్న మొగ్గలు శాఖీయ వ్యాప్తికి తోడ్పడతాయి. |
4. గ్లాడియోలా | ఇవి ఆహార నిల్వ కాండాలను కలిగి ఉంటాయి. వీటిని కార్న్ అంటారు. కార్న్‌లను నాటటం ద్వారా శాఖీయవ్యాప్తి జరుగుతుంది. |
5. చిలగడ దుంప | దీనిని స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఇది వేర్ల రూపాంతరం. వేర్లు ఆహారాన్ని నిల్వ చేయటం వలన లావుగా ఉబ్బి ఉంటాయి. వీటిని ముక్కలుగా చేసి నేలలో పాతిపెట్టటం వలన కొత్త మొక్కలు వస్తాయి. |
6. బ్రయోఫిలిమ్ | దీనినే రణపాల ఆకు అంటారు. దీని ఆకు అంచుల నుండి కొత్త మొక్కలు వస్తాయి. వీటిని పత్రోపరిస్థిత మొగ్గలు అంటారు. వీటి ద్వారా శాఖీయ వ్యాప్తి జరుగును. |
7. బెగోనియా | బెగోనియాలో కూడా శాఖీయ వ్యాప్తి ఆకుల ద్వారా జరుగును. ప్రధానంగా బెగోనియా రెక్స్ క్లోటమ్ లో ఆకు ఛేదనాలు కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఆకులోని ఈనెల నుండి ఇవి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. |
ప్రశ్న 2.
ఏవైనా కొన్ని విత్తనాలను తీసుకుని మొక్కను పెంచి దాని పెరుగుదలను నమోదుచేసి తరగతిగదిలో ప్రదర్శించండి.
జవాబు:
ప్రశ్న 3.
ఇంటర్నెట్, స్కూలు లైబ్రరీ లేదా మీ పరిసరాలను పరిశీలించడం ద్వారా విత్తనాల ప్రయాణంలో పాల్గొనే వివిధ కారకాల గురించి సమాచారాన్ని సేకరించండి. చిత్రాలు మరియు మీ వివరణలతో ప్ బుక్ తయారు చేయండి. మరియు దిగువ టేబుల్ ని ప్రతిదానికి కనీసం మూడు ఉదాహరణలతో నింపండి.
జవాబు:
వ్యాప్తి కారకాలు | విత్తనాలు / పండు పేరు |
గాలి | జిల్లేడు, గడ్డి చామంతి, జమ్ము |
నీరు | తామర, కొబ్బరి, వాలిస్ నేరియా |
జంతువులు | తేలుకొండికాయ, జామ, మామిడి |
పక్షులు | ఆముదం, వేప, రావి, మర్రి |
మనుషులు | టమాటా, వరి, కాఫీ, గోధుమ |
ఇతర మార్గాలు (పేలటం ద్వారా) | బెండ, కంది, మినుము, పెసర |
కృత్యాలు
కృత్యం – 1
ప్రశ్న 1.
మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో చర్చించి క్రింది పట్టికను అవును లేదా కాదు సమాధానాలతో పూరించండి.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
చెట్టు పేరు | విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి | విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి |
1. మల్లెపూవు | అవును | అవును |
2. చింత | అవును | కాదు |
3. కరివేపాకు | అవును | అవును |
4. అరటి | కాదు | అవును |
5. కొత్తిమీర | అవును | కాదు |
6. మునగ | అవును | కాదు |
ఎ) విత్తనాల ద్వారా ఏ మొక్కలు ప్రత్యుత్పత్తి చేస్తున్నాయి?
జవాబు:
విత్తనాల ద్వారా చింత, కొత్తిమీర, మునగ ప్రత్యుత్పత్తి చేస్తున్నాయి.
బి) ఏ మొక్కలు విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి చేస్తున్నాయి?
జవాబు:
మల్లె, కరివేపాకు, అరటి విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి చేస్తున్నాయి.
సి) ఏమొక్కలు రెండు మార్గాల ద్వారా ప్రత్యుత్పత్తిని చేస్తున్నాయి?
జవాబు:
మల్లె, కరివేపాకు, అరటి మొక్కలు విత్తనాలు లేకుండా మరియు విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తున్నాయి.
కృత్యం – 2
ప్రశ్న 2.
పుష్ప భాగాలను సవివరంగా తెలుసుకొనుటకు ఒక ప్రయోగశాల కృత్యాన్ని నిర్వహించండి.
ప్రయోగశాల కృత్య పత్రము
జవాబు:
విద్యా ర్థి పేరు : X x x x
తేది : xxxx
ఉద్దేశ్యం : పుష్పంలోని భాగాలను పరిశీలించుట.
కావలసిన వస్తువులు : రెండు ఉమ్మెత్త పుష్పాలు, బ్లేడు, భూతద్దం, పెన్సిల్
విధానం :
ఒక ఉమ్మెత్త పుష్పాన్ని దాని కాడ వద్ద పట్టుకొని బాహ్య లక్షణాలను పరిశీలించండి. ఆ పుష్పం యొక్క పటాన్ని క్రింది పెట్టెలో గీయండి. పరిశీలనా వివరాలను నమోదు చేయండి.
పుష్ప భాగాలు :
బయటకు కనిపిస్తున్న భాగాలు :
రక్షక పత్రావళి :
రంగు : ఆకుపచ్చ
ఆకారం : గుండ్రంగా
సంఖ్య : 5
కలిసి ఉన్నాయా / విడివిడిగా ఉన్నాయా? : కలిసి ఉన్నాయి.
ఆకర్షక పత్రావళి:
రంగు : తెలుపు
ఆకారం : గుండ్రముగా
సంఖ్య : 5
కలిసి ఉన్నాయా? విడివిడిగా ఉన్నాయా? : కలిసి ఉన్నాయి.
విధానం :
మీకివ్వబడిన ఉమ్మెత్త పుష్పాన్ని నిలువుగా కింది నుంచి పై వైపుకు చీల్చండి. అన్ని భాగాలు మధ్యకు చీలేలా జాగ్రత్త పడండి. లోపలి వైపు పరిశీలించి పటంగా గీయండి.
లోపలి భాగాలు
కేసరావళి :
రంగు : తెలుపు
ఆకారం : పొడవుగా
సంఖ్య : 5
కలిసి ఉన్నాయా? విడివిడిగా ఉన్నాయా? : వారం విడివిడిగా ఉన్నాయి.
అండకోశము :
రంగు: లేత పసుపు
ఆకారం : పొడవుగా
సంఖ్య : ఒక్కటి
కలిసి ఉన్నాయా? విడివిడిగా ఉన్నాయా? : విడిగా ఉంది.
కృత్యం – 3
ప్రశ్న 3.
మీ పాఠశాల తోట నుండి వివిధ రకాల పూలను సేకరించండి. ప్రతి పుష్పాన్ని తీసుకొని అందులో ఉన్న భాగాలను లెక్కించండి. వివరాలను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
ఎ) ఏపుష్పాలలో నాలుగు వలయాలు ఉన్నాయి?
జవాబు:
ఉమ్మెత్త, మందార, తూటి, బెండకాయ వంటి పుష్పాలలో నాలుగు వలయాలు ఉన్నాయి.
బి) ఒకటి లేదా రెండు వలయాలు ఏ పుష్పాలలో లోపించి వున్నాయి?
జవాబు:
గుమ్మడి, కాకర, బీర, సొర వంటి పుష్పాలలో ఒక వలయం లోపిస్తుంది.
సి) ఏ పుష్పంలో ఏ వలయం లోపించినదో రాయండి.
జవాబు:
గుమ్మడి, కాకర, బీర, సొర, పుష్పాలలో కొన్నింటిలో కేసరావళి, మరికొన్ని పుష్పాలలో అండకోశం లోపించాయి.
డి) సంపూర్ణ పుష్పాలకు ఉదాహరణలు ఇవ్వండి. …………….. ……………. ……………….
జవాబు:
మందార, ఉమ్మెత్త, తూటి.
ఇ) అసంపూర్ణ పుష్పాలకు ఉదాహరణలు ఇవ్వండి. ……………… ……………….. ………………
జవాబు:
కాకర, బీర, గుమ్మడి.
కృత్యం – 4
ప్రశ్న 4.
మందార, బొప్పాయి, బీరకాయ వంటి పుష్పాలను సేకరించి, అండకోశం, కేసరావళిలను పరిశీలించి క్రింది పట్టికను పూరించండి. మిగిలిన పట్టికను మీ పరిసరాలలో ఉన్న మొక్కలతో నింపండి.
జవాబు:
ఎ) ఏ మొక్కల్లో పుష్పాలు అండకోశం లేదా కేసరావళిలో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉన్నాయి?
జవాబు:
బొప్పాయి, బీర, కాకర వంటి మొక్కలు అండకోశం లేదా కేసరావళి ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉన్నాయి.
బి) ఏ మొక్కల్లో కేసరావళి మరియు అండకోశం ఒకే పువ్వులో ఉన్నాయి?
జవాబు:
మందార, ఉమ్మెత్త వంటి పుష్పాలలో కేసరావళి, అండకోశం ఒకే పువ్వులో ఉన్నాయి.
సి) ఏ మొక్కల్లో కేసరావళి మరియు అండకోశం ఒకే మొక్కపై విభిన్న పుష్పాలలో ఉంటాయి?
జవాబు:
బీర, కాకర
డి) ఏ మొక్కలలో కేసరావళి మరియు అండకోశం రెండు విభిన్న మొక్కలలో, రెండు విభిన్న పుష్పాలలో ఉంటాయి?
జవాబు:
బొప్పాయి, తాటి
కృత్యం – 5
ప్రశ్న 5.
విత్తన వ్యాప్తి ఆవశ్యకతను తెలపటానికి నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు?
జవాబు:
ఉద్దేశం : విత్తనాల వ్యాప్తి అవసరము తెలుపుట.
పరికరాలు : మట్టితో నింపిన రెండు కప్పులు, ఆవాల గింజలు.
విధానాలు:
- మట్టితో నిండిన రెండు కప్పులు తీసుకోండి.
- మొదటి కప్పులో గుప్పెడు ఆవాలు, రెండవ కప్పులో నాలుగు ఆవాల గింజలు మాత్రమే తీసుకోండి.
- రోజూ వాటికి సమానంగా నీళ్ళు పోయండి.
- 15 రోజులు తరువాత గమనించండి.
పరిశీలన :
మొదటి కప్పులో గింజలు నుండి మొక్కలు సరిగా ఎదగలేదు. రెండవ కప్పులో నాలుగు గింజలు మొలకెత్తి బాగా పెరిగాయి.
నిర్ధారణ :
మొక్కలు పెరగటానికి సరిపడినంత స్థలం కావాలి. అందుకే విత్తనాలు దూర ప్రాంతాలను వ్యాప్తి చెందుతాయి.
ఎ) ఏకప్పులో ఉన్న మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి?
జవాబు:
రెండవ కప్పులోని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి.
బి) అన్ని విత్తనాలు ఒకే చోట పడితే ఎలా పెరుగుతాయి?
జవాబు:
అన్ని విత్తనాలు ఒకే చోట పడితే మొక్కలు ఆరోగ్యంగా పెరగవు.
సి) వాటికి పెరగటానికి తగినంత స్థలం, పోషకాలు, నీరు దొరుకుతాయా?
జవాబు:
దొరకవు. వాటి కోసం పోటీ ఏర్పడుతుంది.
డి) ఇలాంటి పరిస్థితులలో మొక్కలు పెరిగితే ఏమవుతుంది?
జవాబు:
ఇలాంటి పరిస్థితులలో పెరిగిన మొక్కలు బలహీనంగా, అనారోగ్యంగా ఉంటాయి.
ఇ) ఈ పరిస్థితులను మొక్కలు ఎలా అధిగమిస్తాయి?
జవాబు:
విత్తనాలు దూరంగా వ్యాప్తి చెందటం వలన, ఈ పరిస్థితిని అధిగమనిస్తాయి.