SCERT AP 7th Class Science Study Material Pdf 6th Lesson విద్యుత్ Textbook Questions and Answers.

AP State Syllabus 7th Class Science 6th Lesson Questions and Answers విద్యుత్

7th Class Science 6th Lesson విద్యుత్ Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరింపుము.

1. ఘట సంకేతంలో పొడవు గీత ………….. ధ్రువాన్ని, పొట్టి గీత …………….. ధ్రువాన్ని సూచిస్తాయి. (ధన, ఋణ)
2. ఇస్త్రీ పెట్టె విద్యుత్ యొక్క …………… ఫలితం ఆధారంగా పనిచేస్తుంది. (ఉష్ణ)
3. తెరచి ఉన్న స్విచ్ యొక్క సంకేతం…….
4. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఘటాల కలయికను ………………… అంటారు. (బ్యాటరీ)
5. ఎంసిబిను విస్తరించండి ……………… (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్)

II. సరైన జవాబు సూచించు అక్షరమును జాకెట్ లో రాయండి.

1. ఘటములను శ్రేణిలో కలిపినప్పుడు ……………. ఉంటుంది.
A) ఒకే లూప్
B) రెండు లూట్లు
c) అనేక లూప్లు
D) ఏదీకాదు
జవాబు:
A) ఒకే లూప్

2. 4 బల్బులను సమాంతరంగా కలిపినప్పుడు ఒక బల్బును తొలగించినచో మిగిలిన బల్బులు……
A) ఆరిపోవును
B) వెలుగుతూ ఉంటాయి.
C) వెలుగుతూ ఆరుతూ ఉంటాయి
D) చెప్పలేము
జవాబు:
B) వెలుగుతూ ఉంటాయి.

3. ప్రవచనము 1 : విద్యుత్ ప్రవహించుట వలన ఉష్ణము జనించుటను విద్యుత్ అయస్కాంత ఫలితం అంటారు.
ప్రవచనము 2 : విద్యుదయస్కాంతం విద్యుత్ వలన కలిగే అయస్కాంత ఫలితంపై పని చేస్తుంది.
A) 1,2 సత్యము
B) 1,2 అసత్వము
c) 1 సత్యం మరియు 2 అసత్యము
D) 1 అసత్యము, 2 సత్యము.
జవాబు:
c) 1 సత్యం మరియు 2 అసత్యము

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

4. రాము ఇంటిలో 60 వాట్ల బల్బులను ఐదు గంటలపాటు వినియోగించినచో ఎన్ని యూనిట్ల విద్యుత్తు వినియోగించాడు?
A) 1500 KWH
B) 0.3 KWH
C) 70 KWH
D) 1.5 KWH
జవాబు:
B) 0.3 KWH

5. విద్యుత్ ఉష్ణ ఫలితం ఆధారంగా …………. పని చేస్తుంది.
A) విద్యుత్ కేసు
B) లిఫ్ట్
C) ఎస్కలేటర్
D) హెయిర్ డ్రయిర్
జవాబు:
D) హెయిర్ డ్రయిర్

III. జతపరచండి.

గ్రూపు – A గ్రూపు – B
A) ఎంసిబి 1) వలయంలో ఉపయోగించు రక్షణ పరికరము
B) ఫ్యూజ్ 2) రెండు లేదా ఎక్కువ ఘటాల కలయిక
C) బ్యాటరీ 3) కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్
D) ఘటము 4) మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్
E) సిఎస్ఎల్ 5) రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చును
6) వలయము తెరుచుటకు, మూయుటకు ఉపయోగకరము

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) ఎంసిబి 4) మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్
B) ఫ్యూజ్ 6) వలయము తెరుచుటకు, మూయుటకు ఉపయోగకరము
C) బ్యాటరీ 2) రెండు లేదా ఎక్కువ ఘటాల కలయిక
D) ఘటము 5) రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చును
E) సిఎస్ఎల్ 3) కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్

IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
బల్బులను శ్రేణిలో కలిపినప్పుడు ఒక బల్బును తొలగించగానే మిగిలిన బల్బులు వెలగవు. ఎందుకు?
జవాబు:

  1. బల్బులను శ్రేణిలో కలిపినపుడు విద్యుత్ ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది.
  2. ఏదైనా ఒక బల్బును తొలగించగానే వలయం తెరుచుకొంటుంది.
  3. తెరుచుకొన్న వలయంలో విద్యుత్ రవాణా ఆగిపోతుంది.
  4. అందువలన శ్రేణిలో ఒక బల్బును తొలగించగానే మిగిలిన బల్బులు వెలగవు.

ప్రశ్న 2.
ఈ క్రింది పొడుపు కథలు చదివి దానికి జవాబు ఇవ్వండి.
1) వలయమును తెరుచుటకు, మూయుటకు ఉపయోగపడతాను. నేనెవరిని?
2) నేను మీ ఇంట్లో కాంతిని ఇస్తాను. నేనెవరిని?
3) నేను రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతాను. నేనెవరిని?
4) మేము లేకుండా విద్యుత్ పరికరాలను వలయంలో కలుపలేరు. మేమెవరము?
జవాబు:

  1. ఫ్యూజ్
  2. బల్బు
  3. ఘటం
  4. తీగె (లేదా) వాహకం

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

ప్రశ్న 3.
విద్యుత్ వల్ల కలిగే ఉష్ణము ఫలితం పై ఆధారపడి పని చేయు పరికరాలను ఉదహరించండి.
జవాబు:
విద్యుత్ వలన కలిగే ఉష్ణఫలితంపై ఆధారపడి పనిచేయు పరికరాలు :

  1. హీటర్
  2. స్టవ్
  3. ఇస్త్రీ పెట్టె
  4. డ్రయ్యర్
  5. కాఫీ కెటిల్

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 1

ప్రశ్న 4.
ఒక ఘటము, 5 బల్బులు మరియు స్విచ్ ని ఒక వలయంలో కలిపారు, కానీ బల్బులు వెలగడంలేదు. సాధ్యమైన కారణాలను ఊహించి రాయండి.
జవాబు:

  1. ఘటము పాడైపోయి ఉండవచ్చు.
  2. వలయంలో కనెక్షన్లు వదులుగా ఉండి ఉండవచ్చు.
  3. ఉన్న బల్బులలో ఏదో ఒకటి మాడిపోయి ఉండవచ్చు.
  4. స్విచ్ సరిగా పనిచేయకపోయి ఉండవచ్చు.
  5. విద్యుత్ వాహక తీగ సరిగా ఉండకపోవచ్చు.
  6. పరికరాలను వలయంలో సరిగా కలిపి ఉండకపోయి ఉండవచ్చు.

ప్రశ్న 5.
విద్యుదయస్కాంతమును తయారు చేయు విధానాన్ని తెలపండి. (కృత్యం – 6)
జవాబు:
ఉద్దేశం : విద్యుదయస్కాంతమును తయారు చేయుట

కావలసిన పరికరాలు :
బ్యాటరీ, స్విచ్, ఇనుపసీల, ఇన్సులేషన్ గల రాగి తీగ, గుండుసూదులు.

పద్ధతి :
ఒక ఇనుప సీలను తీసుకుని దాని చుట్టూ ఇన్సులేషన్ గల రాగి తీగను గట్టిగా చుట్టండి. ఇప్పుడు ఈ సీల తీగచుట్టలా పనిచేస్తుంది. తీగ చుట్టలా చుట్టబడిన రాగి తీగ యొక్క రెండు కొనలను ఒక బ్యాటరీకి మరియు ఒక స్విచ్ కు శ్రేణి సంధానం పటంలో చూపిన విధంగా కలపండి. (స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి). కొన్ని గుండు సూదులను ఇనుప సీలకు దగ్గరగా ఉంచి వలయాన్ని స్విచ్ ఆన్ చేయండి.

వివరణ :
వలయాన్ని ఆన్ చేయగానే గుండుసూదులు అన్నీ ఇనుప సీల దగ్గరకు వెళ్లడాన్ని మనం గమనించవచ్చు. విద్యుత్ ప్రవాహం వల్ల సీల చుట్టూ చుట్టబడిన రాగి తీగ అయస్కాంతంలాగా పనిచేస్తుందని మనం గుర్తించవచ్చు. అంటే సీలచుట్టూ చుట్టబడిన రాగి తీగ విద్యుదయస్కాంతంలాగా పనిచేస్తుందన్నమాట. వలయాన్ని ఆఫ్ చేసిన వెంటనే అన్ని గుండుసూదులు ఇనుప సీలను వదలి కింద పడతాయి. అంటే విద్యుత్ ప్రవహించకపోతే చుట్టబడిన రాగి తీగ అయస్కాంతం లాగా ప్రవర్తించలేదని అర్థమవుతుంది.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 2

ప్రశ్న 6.
కింది వాటికి సంకేతాలు గీయండి.
ఎ) బల్బు బి) ఘటం సి) బ్యాటరీ డి) తెరచిన స్విచ్
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 3

ప్రశ్న 7.
విద్యుత్ ఘటము, బల్బు మరియు ఆఫ్ చేసిన స్విచ్, తీగలను ఉపయోగించి తయారుచేసిన విద్యుత్ వలయ – పటము గీయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 4

ప్రశ్న 8.
మన నిత్య జీవితంలో విద్యుదయస్కాంత ఫలితం యొక్క ప్రాముఖ్యతను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:

  1. విద్యుదయస్కాంత ఫలితం మానవునికి ఒక వరం.
  2. ఇది మానవ జీవితాన్ని చాలా సందర్భంలో సౌకర్యంగా చేస్తుంది.
  3. బరువైన వస్తువులు, ఇనుప దూలాలను లేపటానికి వాడే ఫోన్లు విద్యుదయస్కాంత సూత్రంపైనే పనిచేస్తాయి.
  4. మన ఇళ్ళలో వాడే ఫ్యాన్లు, మోటర్లు అన్ని విద్యుదయస్కాంత ప్రభావం వలనే పనిచేస్తాయి.
  5. విద్యుత్ శక్తి వలన కలిగే అన్ని రకాల చలనాలలో మనకు ఈ దృగ్విషయం కనిపిస్తుంది.
  6. నిజంగా ఈ విద్యుదయస్కాంత ఫలితం ఒక అద్భుతం.

ప్రశ్న 9.
విద్యుత్ వృథాను అరికట్టడానికి ఉపయోగపడే కొన్ని నినాదాలను తయారు చేయండి.
జవాబు:

  1. విద్యుత్ను ఆదా చేయండి – విద్యుత్ కొరతను నివారించండి.
  2. అవసరంలేని ప్రతి స్విచ్ – ఆపి ఉంచండి.
  3. కిటికీలు తెరవండి – విద్యుత్ వాడకం తగ్గించండి.
  4. విద్యుత్ ఆదాకు – పాత తీగలు వద్దు.
  5. LEDలు వాడండి – బిల్లును తగ్గించుకోండి.
  6. విద్యుత్ లేని జీవితం – విలువ లేని జీవితం.

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

ప్రశ్న 10.
ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తికి చేయు ప్రథమ చికిత్సకు సలహాలు ఇవ్వండి.
జవాబు:
విద్యుత్ షాక్ తగిలిన వెంటనే

  1. విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
  2. సాధ్యం కానప్పుడు ఎండిన కర్రతో దూరంగా నెట్టాలి.
  3. విద్యుతం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నోటితో కృత్రిమశ్వాస అందించాలి.
  4. హృదయ స్పందన ఆగినపుడు ఛాతిని నొక్కుతూ స్పందనకు ప్రయత్నించాలి.
  5. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించాలి.

అభ్యాసాలు

ప్రశ్న 1.
చందు ఇంటిలో డిసెంబర్ నెల 2020 నందు గల విద్యుత్ మీటర్ రీడింగ్ 29171 యూనిట్లు. గత నెలలో మీటర్ రీడింగ్ 29062 యూనిట్స్ అయినా డిసెంబర్ నెలలో చందు చెల్లించవలసిన విద్యుత్ బిల్లు ఎంత?
జవాబు:
యూనిట్ విద్యుత్ ధర 3 రూ. 16 పై.

డిసెంబర్ నెల రీడింగు 29171 యూనిట్లు
గత నెల రీడింగు 29062 యూనిట్లు
ఉపయోగించిన కరెంట్ యూనిట్లలో 109 యూనిట్లు
ఒక యూనిట్ ధర 3.16 రూ
చెల్లించవలసిన బిల్లు 109 × 3.16 = 344.44
344.00 (సుమారు)

ప్రశ్న 2.
ఒక ఇంట్లో 100 వాట్ల బల్బులు 5, 60 వాట్ల బల్బులు 5, 40 వాట్ల బల్బులు 5 ఉన్నాయి. ప్రతి రోజు అన్ని బల్బులను 5 గంటల చొప్పున వెలిగిస్తారు. అయినా 2021వ సంవత్సరము ఫిబ్రవరి నెలకు ఎన్ని యూనిట్లు ఖర్చు అయినది? యూనిట్ ధర రూ. 2.80 చొప్పున ఎంతబిల్లు చెల్లించాలి?
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 5

7th Class Science 6th Lesson విద్యుత్ InText Questions and Answers

7th Class Science Textbook Page No. 165

ప్రశ్న 1.
నీకు తెలిసిన విద్యుత్ పరికరాలు తెలపండి.
జవాబు:
టి.వి, ఫ్రిజ్, ఫ్యాన్, కూలర్, బల్బు

ప్రశ్న 2.
మీ ఇంటిలో ఉపయోగిస్తున్న విద్యుత్ పరికరాల జాబితా తయారుచేయండి.
జవాబు:
టి.వి, ఫ్రిజ్, ఫ్యాన్, బల్బు, ఇస్త్రీ పెట్టె.

ప్రశ్న 3.
మనం స్విచ్ వేయగానే బల్బు ఎందుకు వెలుగుతుంది?
జవాబు:
మనం స్విచ్ వేయగానే విద్యుత్ వైర్లలో ప్రవహించి బల్బును చేరి వెలిగేలా చేస్తుంది.

7th Class Science Textbook Page No. 171

ప్రశ్న 4.
స్విచ్ ఆలో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుందా? ఎందుకని?
జవాబు:
విద్యుత్ వలయాన్ని తెరిచి ఉంచడానికి లేదా మూయడానికి స్విచ్ ను ఉపయోగిస్తామని మీకు తెలుసు. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు బల్బు వెలగదు. కారణం విద్యుత్ వలయం తెరువబడి ఉండడం. స్విచ్ ను ఆన్ చేసినప్పుడు విద్యుత్ వలయం మూయబడి బల్బు వెలుగుతుంది.

7th Class Science Textbook Page No. 173

ప్రశ్న 5.
ఏ బల్బులు తక్కువ విద్యుతను వినియోగించుకొంటాయి?
జవాబు:
L.E.D బల్బులు.

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

ప్రశ్న 6.
ఇంట్లో కరెంట్ పోయినపుడు మీరు మొదట దేనిని చెక్ చేస్తారు?
జవాబు:
ఇంట్లో కరెంట్ పోయినపుడు మొదట ఫ్యూజ్ ను చెక్ చేస్తాము.

7th Class Science Textbook Page No. 179

ప్రశ్న 7.
ఒకటి కంటే ఎక్కువ ఘటాలను లేదా బలులను వలయంలో కలపడం సాధ్యమా?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ ఘటాలను లేదా బల్బులను వలయంలో కలపవచ్చు.

ప్రశ్న 8.
టి.వి రిమోట్ మరియు టార్చ్ లలో విద్యుత్ ఘటాల అమరిక ఏమిటి?
జవాబు:
టి.వి రిమోట్ మరియు టార్చ్ లలో విద్యుత్ ఘటాలను శ్రేణి పద్దతిలో కలుపుతారు.

7th Class Science Textbook Page No. 183

ప్రశ్న 9.
వివాహాలు, పండుగల సమయంలో అలంకరణ బలులను ఎలా కలుపుతారు?
జవాబు:
అలంకరణ బల్బులను శ్రేణి పద్దతిలో కలుపుతారు.

ప్రశ్న 10.
ఇళ్ళలో విద్యుత్ పరికరాలను ఎలా కలుపుతారు?
జవాబు:
ఇళ్ళలో విద్యుత్ పరికరాలను సమాంతర పద్దతిలో కలుపుతారు.

7th Class Science Textbook Page No. 195

ప్రశ్న 11.
విద్యుద్ఘాతము (ఎలక్ట్రిక్ షాక్) ఎప్పుడు సంభవిస్తుంది? దాని నుండి రక్షణ పొందటానికి తక్షణమే ఏమి చేయాలి?
జవాబు:
వ్యక్తి విద్యుత్ జనకాన్ని తాకినప్పుడు విద్యుత్ ఘాతము సంభవిస్తుంది. విద్యుత్ వ్యక్తి శరీరంలోని ఏదైనా శరీర భాగం గుండా ప్రసరించడం వలన విద్యుత్ ఘాతం కలుగుతుంది. ఒక్కోసారి విద్యుత్ ఘాతము వ్యక్తికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది, వ్యక్తి మరణించడానికి దారి తీయవచ్చు.

ఎలక్ట్రిక్ షాక్ సంభవించు సందర్భాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • తడి చేతులతో స్విను వేయడం.
  • ప్లగ్ పిన్నులను స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు తొలగించడం.
  • విద్యుత్ బంధకము లేకుండా తీగలతో పనిచేయడం.
  • స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు బల్బును మార్చడం మొదలైనవి.
  • ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించుటకు తక్షణమే ఏం చేయాలి?
  • ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వెంటనే మొదట విద్యుత్ సరఫరాను ఆపాలి.
  • అది సాధ్యం కానప్పుడు ఎండిన కర్రతో దూరంగా నెట్టాలి. ఒకవేళ విద్యుద్ఘాతము తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నోటితో కృత్రిమ శ్వాసను అందించాలి.
  • హృదయ స్పందనలు ఆగినపుడు ఆ వ్యక్తి గుండె పై చేతులు క్రిందికి నొక్కుతూ మరియు వదులుతూ హృదయం స్పందించే వరకు చేయాలి. దీనిని కార్డియో పల్మనరీ రిసుస్టేషన్ (CPR) అంటారు. తరువాత వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలి.

ఆలోచించండి – ప్రతిస్పందించండి

7th Class Science Textbook Page No. 183

ప్రశ్న 1.
ఎక్కువ సంఖ్యలో ఘటాలను శ్రేణి పద్ధతిలో కలిపితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఎక్కువ సంఖ్యలో ఘటాలను శ్రేణిలో కలపటం వలన ఫలిత విద్యుత్ పెరుగుతుంది.

ప్రశ్న 2.
ఒక బల్చుకు కలిపే ఘటముల సంఖ్య పరిమితంగా ఉంటుందా?
జవాబు:
అవును. లేకుంటే అధిక విద్యుత్ కు బల్బు పాడైపోతుంది.

7th Class Science Textbook Page No. 189

ప్రశ్న 3.
అన్ని రకములైన గృహోపకరణాలు విద్యుత్ ప్రసరించినపుడు ఉష్ణమును జనింప చేస్తాయా?
జవాబు:
లేదు. అన్ని గృహూపకరణాలు విద్యుత్ వలన ఉష్ణము జనింప చేయలేవు.

ప్రాజెక్ట్ పనులు

7th Class Science Textbook Page Page No. 201

ప్రశ్న 1.
ఏదైనా విద్యుత్ ఉపకరణం యొక్క మాన్యువల్ ను సేకరించండి. అందులో గల సమాచారమును విపులంగా చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
ఎ) ఈ ఉపకరణం ఎందుకు తయారు చేయబడినది అది ఎంతకాలం ఖచ్చితంగా పనిచేస్తుంది?
జవాబు:
నేను సేకరించిన మాన్యువల్ ఇస్త్రీ పెట్టెకు సంబంధించినది. ఇది బట్టలను ఇస్త్రీ చేయుటకు తయారు చేయబడినది.

బి) దీనికి ఎన్ని సార్లు ఇవ్వబడినవి?
జవాబు:
దీనికి నాలుగు స్టార్లు ఉన్నాయి.

సి) ఉపకరణము విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితము మరియు అయస్కాంత ఫలితములలో దీనిపై ఆధారపడి పనిచేస్తుంది?
జవాబు:
ఇది విద్యుత్ ఉష్ణ ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది.

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

ప్రశ్న 2.
మీ ఇంట్లోనే విద్యుత్ మీటర్లు రీడింగులను మూడు నెలలపాటు పరిశీలించండి. విద్యుత్ బిల్లు తగ్గించడానికి ప్రణాళికను తయారుచేయండి.
జవాబు:
మా ఇంటిలో వరుసగా మూడు నెలల విద్యుత్ రీడింగ్ నమోదు చేశాను.
జనవరి – 1632 ;
ఫిబ్రవరి – 1680 ;
మార్చి – 1740

విద్యుత్ బిల్లు తగ్గించటానికి ప్రణాళిక :

  1. అవసరం లేనప్పుడు గదిలోని లైట్స్, ఫ్యాన్లు ఆపివేయాలి.
  2. కిటికీలు తెరిచి ఉంచటం వలన గాలి, వెలుతురు బాగా వస్తాయి.
  3. కిటికీలకు ఉన్న కర్టెన్స్ తొలగించాలి.
  4. ఇంట్లో సాధారణ బల్బుల స్థానంలో LED బల్బులు వాడాలి.
  5. విద్యుత్ ఉపకరణాలు 5 స్టార్ రేటింగ్ ఉన్నవి వాడాలి.
  6. గీజర్, ఏ.సి. వాడకం తగ్గించాలి.
  7. అనవసరంగా వెలుగుతున్న లైట్లను ఆర్పాలి.
  8. ఊర్లకు వెళుతున్నప్పుడు మెయిన్ స్విచ్ ఆపాలి.
  9. పాత విద్యుత్ తీగలు, స్విచ్ లను మార్చాలి..
  10. మోటారును వినియోగ రద్దీ తక్కువగా ఉండే సమయంలో వాడాలి.

ప్రశ్న 3.
“విద్యుత్ను ఆదా చేయండి, వృథా చేయవద్దు” అనే దానిపై ఒక కరపత్రాన్ని తయారుచేయండి. పాఠశాల గోడ పత్రికలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యుత్ ను ఆదాచేయండి – వృథా చేయవద్దు

నేడు మన దైనందిన జీవితం విద్యుత్ వాడకంతో ముడిపడి ఉంది. ఒక గంట విద్యుత్ లేకపోతే ఏమి చేయలేని పరిస్థితికి మనం వచ్చేశాం. ఇంత విలువైన విద్యుత్ వాడకంలో ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కావున విద్యుత్ ఆదా చేయటం మనం తెలుసుకోవాలి. వృథాను అరికట్టటం అంటే – కొత్తగా ఉత్పత్తి చేసినట్టే.

వేసవి మనకు ఎంతో దూరం లేదు. వేసవి వచ్చిందంటే అందరం కరెంట్ కోతతో సతమతమౌతుంటాము. జలాశయంలో నీరు లేక ఉత్పత్తి కుంటు పడుతుంది. వేసవి కావటం వలన అటు ఫ్యాన్లు, కూలర్లు, ఏ.సి.ల వాడకం పెరిగి విద్యుత్ వినియోగంపై ఒత్తిడి పెరుగుతుంది.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరికి విద్యుత్ వినియోగంపై అవగాహన ఉండాలి. విద్యుత్ ను ఆదా చేయటం తమ కర్తవ్యంగా భావించాలి. కావున మీరందరూ, విద్యుత్ ఆదాకు నేడే నడుం బిగించండి. విద్యుత్ కొరతను సమర్థవంతంగా ఎదుర్కోండి.

మనం ఏం చేయాలి :

  1. మొక్కలు పెంచి పరిసరాలను చల్లదనంగా ఉంచుకోవాలి.
  2. ఇంటి కిటికీలు తెరిచి వెలుతురు, గాలి వచ్చే విధంగా చూడాలి.
  3. అనవసరమైన విద్యుత్ పరికరాలను ఆపు చేయాలి.
    అందరము కలుద్దాం – విద్యుత్ వృథాను నివారిద్దాం.

ప్రశ్న 4.
మీ మిత్రులు, ఇరుగు, పొరుగు వాళ్ళ ఇళ్ళకు సంబంధించిన గత నెల విద్యుత్ బిల్లులను సేకరించి సమాచారాన్ని నమోదు చేసుకోండి. వారిని సాధారణ బల్బులకు బదులుగా CFL బల్బులు వాడమని సూచించండి. మరల మరుసటి నెల వారి విద్యుత్ బిల్లును సేకరించి రెండు విద్యుత్ బిల్లుల మధ్య భేదాన్ని పరిశీలించండి. మీ పరిశీలనలను మీ మిత్రులతో చర్చించి మంచి బల్బు ఏదో సూచించండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 6
సాధారణ బిల్లుల కంటే CFL బల్బులు విద్యుత్ను బాగా ఆదా చేస్తాయి. కావున నెల నెల అధిక విద్యుత్ బిల్లు చెల్లించే బదులు, CFL బల్బులు వాడి మన బిల్లును తగ్గించుకోవటంతో పాటు, విద్యుతను ఆదా చేయటం తెలివైన నిర్ణయం.

ప్రశ్న 5.
మీ చుట్టుపక్కల ఎవరికైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు అయితే వారి నుండి ఆ సమయంలో వారు పొందిన – అనుభూతితో సహా సమాచారాన్ని రాబట్టండి. సిపిఆర్ గురించి సమాచారాన్ని సేకరించండి. మీ పరిశీలనలు నోటబులో నమోదు చేసి స్నేహితులతో చర్చించండి.
జవాబు:
విద్యుత్ షాక్ తిన్నవారి అనుభవాలు భయంకరంగా ఉన్నాయి.

  1. వారు చాలా భయపడిపోయారు.
  2. కొందరు చిన్న ప్రమాదాలతో బయటపడితే, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
  3. ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
  4. అందరూ విద్యుత్ ఘాతం తీవ్రమైనదని హెచ్చరించారు.

సి.పి.ఆర్ : దీనినే కార్డియో పల్మనరీ రిసుస్టేషన్ అంటారు.

  1. ఏదైనా తీవ్ర ప్రమాదాలలో గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది.
  2. అటువంటి సమయంలో వ్యక్తిని పడుకోబెట్టాలి.
  3. అతని ఛాతి మీద రెండు చేతులు ఉంచి వత్తుతూ ఉండాలి.
  4. దాని ద్వారా గుండె తిరిగి కొట్టుకోవటం ప్రారంభిస్తుంది.
  5. ఇది మనిషికి పునఃజన్మను ప్రసాదించినట్టు.
  6. చిన్నపాటి తర్ఫీదు వలన ఎవరైన CPR ను నిర్వహించవచ్చు.
  7. అవసరమైన సందర్భాలలో కృత్రిమ శ్వాస అందించాలి.

కృత్యాలు

కృత్యం – 1

ప్రశ్న 1.
టార్చ్ లైట్ లో వినియోగించిన సెల్ ను తీసుకొని మీ ఉపాధ్యాయుని సహాయంతో పగలగొట్టండి. ఘటం లోపల ఏమి గమనించారు?
(లేదా)
విద్యుత్ ఘటము యొక్క నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:

  1. ఘటం జింకుతో తయారైన ఒక లోహపు పాత్రను కలిగి ఉంటుంది.
  2. జింకు పాత్ర ఋణధృవంగా పని చేస్తుంది.
  3. లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డీ ధనధృవంగా పనిచేస్తుంది.
  4. ధన మరియు ఋణ ధృవాలను ఎలక్ట్రోడ్లు అంటారు.
  5. కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి మరియు అమ్మోనియం క్లోరైడ్ల రసాయన మిశ్రమం ఉంటుంది.
  6. ఈ మిశ్రమం విద్యుత్ విశ్లేష్యంగా పనిచేస్తుంది. ఈ పదార్థాలన్ని జింక్ పాత్రలో సీలుచేసి ఉంటాయి.
  7. ఇలాంటి ఘటం వలయంలో కొంతకాలంపాటు విద్యుత్ ప్రవాహాన్ని అందిస్తుంది. తరువాత దీనిలోని రసాయనాలు పనికిరాకుండా పోతాయి. ఆ తరువాత ఆ ఘటం ఎంత మాత్రం పని చేయదు.
  8. ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, అనేక విద్యుత్ ఘటాలను ఒకదానితో ఒకటి కలిపినప్పుడు బ్యాటరీ ఏర్పడుతుంది.

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 7

కృత్యం – 2

ప్రశ్న 2.
మన స్వంత ఘటమును తయారు చేద్దాం.
(లేదా)
నీ చుట్టూ దొరికే పరికరాలతో నీ స్వంత ఘటాన్ని ఎలా తయారు చేసుకుంటావు?
జవాబు:
కావలసిన పరికరాలు : జింక్ పలక, రాగి పలక, ఒక చిన్న బల్బు లేదా ఎల్ ఇడి, వైర్లు, తాజా పండ్లు (నిమ్మ, నారింజ), క్రోకడైల్ క్లిప్స్ -4.

తయారుచేయు విధానం :
ఒక తాజా నిమ్మ పండును తీసుకొని జింక్ పలక మరియు రాగి పలకలను పండు నందు పటంలో చూపిన విధంగా అమర్చండి.

పలకలు ఎలక్ట్రోడులగాను, పండులోని రసం విద్యుత్ విశ్లేష్యంగాను ఉపయోగపడతాయి. బల్బు యొక్క చివరలను జింక్ పలకకూ మరియు రెండవ చివరను రాగి పలకలకు రెండు వేరు వేరు వైర్లతో కలపండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 8

ఏమి గమనించారు?
జవాబు:
నిమ్మ, నారింజ పండ్లలోని రసాయన శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ బల్బు వెలిగింది.

కృత్యం – 3

3. సందర్భం -1
జవాబు:
కావలసిన పరికరాలు :
డ్రై సెల్ 1, బల్బ్ 1, టార్చ్ లైట్ బల్బు లేదా ఎల్ ఈడి, స్విచ్ మరియు రాగి తీగలు.

విధానము :
ఒక డ్రై సెల్, బల్బు మరియు స్విచ్లు తీసుకొని పటములో చూపినట్లు కలపండి. స్విచ్ ను మూసి (ఆన్ చేసి) బల్బ్ వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 4

సందర్భం-2 (ఘటాలను శ్రేణిలో కలుపుట)
కావలసిన పరికరాలు : డ్రై సెల్ 2, బల్బు 1, స్విచ్ మరియు తీగలు

విధానము :
రెండు ఘటాలు, చిన్న బల్బు లేదా ఎల్ ఈడి మరియు స్విచ్లను తీసుకోండి. వాటిని పటములో చూపినట్లు తీగల సహాయంతో కలుపుము. స్విచ్ ఆన్ చేసి బల్బు వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 9
స్విచ్ ఆన్ చేసి బల్బు వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి.
జవాబు:
వలయంలో ఘటాలను శ్రేణి పద్ధతిలో కలిపారు.

వలయంలో ఘటాలు ఏవిధంగా కలుపబడినవి?
జవాబు:
స్విచ్ ఆన్ చేసినపుడు బల్బు ప్రకాశవంతంగా వెలిగింది.

సందర్భం-3 (ఫటాలను సమాంతర పద్దతిలో కలుపుట)
కావలసిన పరికరాలు :
డ్రై సెల్- 2, బల్బు లేదా ఎల్ ఈడి 1 స్విచ్ మరియు తీగలు.

విధానము :
రెండు ఘటాలను, చిన్న బల్బు లేదా ఎల్ఈడి మరియు స్విలను తీసుకోండి. వాటిని తీగల సహాయంతో పటంలో చూపినట్టుగా కలపండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 10
వలయంలో ఘటాలను ఏవిధంగా కలిపారు?
జవాబు:
వలయంలో ఘటాలను సమాంతరంగా కలిపారు.

వలయంలో గల ఉమ్మడి ధృవాలు ఎన్ని?
జవాబు:
వలయంలో గల ఉమ్మడి ధృవాలు రెండు.

స్విచ్ ఆన్ చేసినపుడు బల్బు వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి.
జవాబు:
బల్పు సాధారణంగా వెలిగింది.

ఒక ఘటాన్ని తొలగించి బల్బు వెలుగుతున్న తీవ్రత ఎలా ఉంది?
జవాబు:
ఒక ఘటాన్ని తొలగించినా బల్బు వెలుగులో మార్పు రాలేదు. సాధారణంగానే వెలిగింది.

పై మూడు సందర్భాలలో మీ పరిశీలనలు నమోదు చేయండి.

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 15AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 12

కృత్యం – 4

4. సందర్భం -1
కావలసిన పరికరాలు :
డ్రై సెల్ 1, బల్బ్ 1, టార్చ్ లైట్ బల్బు లేదా ఎల్ ఈడి, స్విచ్ మరియు రాగి తీగలు.

విధానము :
ఒక డై సెల్, బల్బులు మరియు స్విట్లు తీసుకొని పటములో చూపినట్లు కలపండి. స్విచ్ ను మూసి (ఆన్ చేసి) బల్బ్ వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 4

సందర్భం-2 (బల్బులను శ్రేణిలో కలుపుట)
కావలసిన పరికరాలు :
విద్యుత్ ఘటము 1, బల్బులు లేదా ఎల్ ఈడి లు 2, స్విచ్ మరియు కలుపుటకు రాగి తీగలు.

విధానము :
రెండు బల్బులు లేదా ఎల్ ఈడిలు, విద్యుత్ ఘటము మరియు స్విన్లు తీసుకొని పటములో చూపినట్లు కలపండి. స్విచ్ ను మూసి (ఆన్ చేసి) బల్బు వెలుగుతున్న తీవ్రతను పరిశీలించండి. ఒక బల్బును తొలగించి రెండో బల్బును పరిశీలించండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 13

సందర్భం-3 (బల్బులను సమాంతరంగా కలుపుట)
కావలసిన వస్తువులు :
విద్యుత్ ఘటము 1, బల్బులు లేదా ఎల్ ఈడిలు 2, స్వి న్లు మరియు రాగి తీగలు.

విధానము :
రెండు బల్బులు లేదా .ఎల్ ఈడిలు, .విద్యుత్ ఘటము మరియు స్విచ్లను తీసుకోండి. వాటిని పటంలో చూపిన విధంగా రాగి తీగలతో కలపండి. స్విచ్ ను ఆన్ చేసి బల్బులు వెలిగే తీవ్రతను పరిశీలించండి. ఒక బల్బును తొలగించి రెండో బల్బును పరిశీలించండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 14

మీ పరిశీలనలను కింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 11
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 16

AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్

కృత్యం – 5

ప్రశ్న 5.
విద్యుత్ ఉష్ణ ఫలితాలను ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం : విద్యుత్ ఉష్ణ ఫలితాన్ని నిరూపించుట,

కావలసిన వస్తువులు :
విద్యుత్ ఘటం, స్విచ్, ఇనుప సీలలు 2, చెక్క బోర్డు, వలయమును కలుపుటకు వైర్లు, 10 సెంటీమీటర్ల పొడవు గల నిక్రోము తీగ.

విధానము :
పటంలో చూపిన విధంగా విద్యుత్ ఘటం, స్విచ్ మరియు ఇనుప సీలలు వైర్లతో శ్రేణి పద్దతిలో కలిపి వలయాన్ని ఏర్పరచండి. స్విచ్ ను తెరిచి (ఆఫ్) ఉంచండి. నిక్రోమ్ లేక రాగి తీగను రెండు సీలల మధ్య పటంలో చూపిన విధంగా కట్టవలెను.

పరిశీలన :
రాగి లేదా నిక్రోమ్ తీగను చేతితో తాకినపుడు వేడిగా ఉంది.

నిర్ధారణ :
నిక్రోమ్ తీగ ద్వారా విద్యుత్ ప్రవహించడం వలన ఉష్ణము ఏర్పడింది. దీనినే విద్యుత్ ఉష్ణ ఫలితం అంటారు.
AP Board 7th Class Science Solutions Chapter 6 విద్యుత్ 17

పరిశీలనలు :
రాగి /నిక్రోమ్ తీగను తాకండి. మీకు ఎలాంటి అనుభూతి కలిగింది?
జవాబు:
ఇప్పుడు ఒక నిమిషం పాటు స్విచ్ ఆన్లో ఉంచి, ఆఫ్ చెయ్యండి. ఇప్పుడు రాగి నిక్రోమ్ తీగను తాకండి. (నిక్రోమ్ తీగను ఎక్కువ సమయం పట్టుకోవద్దు.)

మీకు ఎలాంటి అనుభూతి కలిగింది?
జవాబు:
విద్యుత్ ప్రవహించగానే రాగి నిక్రోం తీగ వేడెక్కడం గమనిస్తారు. తీగగుండా విద్యుత్ ప్రవహించడం కారణంగా ఉష్ణం జనించటాన్ని విద్యుత్ వలన కలిగే ఉష్ణ ఫలితము అంటారు.