SCERT AP 7th Class Science Study Material Pdf 2nd Lesson పదార్థాల స్వభావం Textbook Questions and Answers.
AP State Syllabus 7th Class Science 2nd Lesson Questions and Answers పదార్థాల స్వభావం
7th Class Science 2nd Lesson పదార్థాల స్వభావం Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరింపుము.
1. ఆమ్లం యొక్క రుచి. ………. (పులుపు)
2. ఒక పదార్థం pH విలువ 0. అయిన ఆ పదార్థం ……….. స్వభావాన్ని కలిగియుంటుంది. (క్షార)
3. చింతపండు రసంలో నీలి లిట్మస్ ………….. రంగులోకి మారును. (వరుపు)
4. ఆంటాసిడ్ ………………… స్వభావాన్ని కలిగియుంటాయి. (క్షార)
5. ఆమ్లము + క్షారము → …………….. + …….. (లవణము, నీరు)
II. సరైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. ‘ఆమ్లాలలో పసుపు సూచిక రంగు
A) నీలం
B) ఎరుపు
C) ఊదా
D) రంగు మారదు
జవాబు:
D) రంగు మారదు
2. ఆమ్లానికి ఒక ఉదాహరణ
A) వెనిగర్
B) వంట సోడా
C) తినే సోడా
D) ఏదీకాదు
జవాబు:
A) వెనిగర్
3. సబ్బులోని ముఖ్యమైన అనుఘటకం ఏది?
A) ఆమ్లము
B) క్షారం
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) క్షారం
4. నిమ్మరసానికి వంట సోడా కలిపితే ………. వాయువు విడుదలవుతుంది.
A) హైడ్రోజన్
B) ఆక్సీజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) సల్ఫర్ డై ఆక్సైడ్
జవాబు:
A) హైడ్రోజన్
5. ఆమ్ల స్వభావం అధికంగా గల పొలానికి రైతులు ………. ని కలుపుతారు.
A) నిమ్మరసం
B) కాల్షియం ఆక్సైడ్
C) సోడియం క్లోరైడ్
D) సల్ఫర్
జవాబు:
B) కాల్షియం ఆక్సైడ్
III. జతపరచండి.
గ్రూపు – A | గ్రూపు – B |
A) బ్యాటరీ | 1) పదార్థాల నిల్వ |
B) సబ్బు | 2) కాల్షియం కార్బొనేట్ |
C) ఎసిటిక్ ఆమ్లం | 3) సల్ఫ్యూరిక్ ఆమ్లం |
D) మందారపువ్వు | 4) కృత్రిమ సూచిక |
E) గుడ్డు పెంకు | 5) సోడియం హైడ్రాక్సైడ్ |
6) సహజ సూచిక |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
A) బ్యాటరీ | 3) సల్ఫ్యూరిక్ ఆమ్లం |
B) సబ్బు | 5) సోడియం హైడ్రాక్సైడ్ |
C) ఎసిటిక్ ఆమ్లం | 1) పదార్థాల నిల్వ |
D) మందారపువ్వు | 6) సహజ సూచిక |
E) గుడ్డు పెంకు | 2) కాల్షియం కార్బొనేట్ |
IV. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఆమ్లాలు మరియు క్షారాల మధ్య తేడాలు రాయండి.
జవాబు:
ఆమ్లం | క్షారము |
1) ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. | 1) క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. |
2) జారుడు స్వభావం కల్గి ఉండవు. | 2) జారుడు స్వభావం కల్గి ఉంటాయి. |
3) నీలి లిట్మస్ ను ఎర్రగా మార్చుతాయి. | 3) ఎర్ర లిట్మసు నీలిగా మార్చుతాయి. |
4) మిథైల్ ఆరంజ్ సూచికలో పసుపురంగుకు మారతాయి. | 4) మిథైల్ ఆరంజ్ సూచికలో ఎరుపురంగుకు మారతాయి. |
5) ఫినాఫ్తలిన్ సూచికను గులాబిరంగుకు మార్చుతాయి. | 5) ఫినాఫ్తలిన్ సూచికలో రంగు మారదు. |
6) మందార సూచికను గులాబిరంగుగా మార్చును. | 6) మందార సూచికను ఆకుపచ్చగా మార్చును |
7) వీటి pH విలువ 7 కన్నా తక్కువ. | 7) వీటి pH విలువ 7 కన్న ఎక్కువ. |
8) లోహాలతో చర్యపొంది H2 ను విడుదల చేయును. | 8) క్షారాలు లోహాలతో చర్యపొంది హైడ్రోజన్ తో పాటు లవణాలను ఏర్పర్చుతాయి. |
ప్రశ్న 2.
వివిధ రకాల ఆమ్ల క్షార సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఆమ్ల క్షారాలను గుర్తించటంలో సహాయపడే పదార్థాలను సూచికలు అంటారు. సూచికలు ప్రధానంగా నాలుగు రకాలు. అవి :
1) సహజ సూచికలు :
ప్రకృతిలో సహజంగా లభించే సూచికలను సహజ సూచికలు అంటారు. ఉదా : పసుపు, మందార.
2) కృత్రిమ సూచికలు :
ఖనిజ లవణాల నుండి తయారు చేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు.
ఉదా : ఫినాఫ్తలీన్, మిథైల్ ఆరంజ్
3) ఋణ సూచికలు :
ఆమ్ల లేదా క్షార పదార్థాలతో కలిసినపుడు కొన్ని సూచికలు వాసనను కల్గిస్తాయి.
ఉదా : ఉల్లిరసం, లవంగ నూనె
4) సార్వత్రిక సూచికలు : ఇవి వివిధ సూచికల మిశ్రమం వివిధ పదార్థాలతో వేరు వేరు రంగులను ఇస్తాయి.
ఉదా : బ్రోమో మిథైల్ బ్లూ, మిథైల్ రెడ్.
ప్రశ్న 3.
ఒక పదార్థం జారుగా మరియు చేదు రుచిని కలిగియుంది. ఇంకొక పదార్థం పులుపు రుచిని కలిగియుంది. ఆ రెండు పదార్ధాలను కలిపినప్పుడు ఏఏ పదార్థాలు ఏర్పడుతాయి?
జవాబు:
- జారుగా చేదు రుచిని కలిగిన పదార్థం క్షారము.
- రుచికి పుల్లగా ఉన్న పదార్థం ఆమ్లం.
- ఆమ్లము మరియు క్షారము కలిసినపుడు తటస్థీకరణ చర్య జరుగును.
- తటస్థీకరణ చర్యతో లవణము మరియు నీరు ఏర్పడతాయి.
ఆమ్లము + క్షారము → లవణము + నీరు
ప్రశ్న 4.
సూచికలు లేకుండా అసిటిక్ ఆమ్లాన్ని నీవు ఎలా పరీక్షించగలవో ఊహించు.
జవాబు:
- ఎసిటిక్ ఆమ్లం వెనిగర్ వాసనను కల్గి ఉండి రుచికి పుల్లగా ఉంటుంది. ఇది రంగులేని . ద్రవం.
- పుల్లదనం కోసం దీనిని వంటకాలలో వాడతారు.
- వాసనను మరియు రుచిని బట్టి ఎసిటిక్ ఆమ్లాన్ని గుర్తించవచ్చు.
ప్రశ్న 5.
అనిత వాళ్ళ అమ్మ మామిడి పచ్చడిని పింగాణి పాత్రలో నింపి, భద్రపరిచింది. ఇది చూసిన అనితకి చాలా సందేహాలు కలిగాయి. ఆ సందేహాలు ఏమై వుంటాయో రాయండి.
జవాబు:
- పచ్చళ్ళను పింగాణి పాత్రలలోనే ఎందుకు నిల్వ చేస్తారు?
- పింగాణి పాత్రలు దేనితో తయారుచేస్తారు?
- పచ్చళ్ళను లోహపు పాత్రలో నిల్వ చేస్తే ఏమౌతుంది?
- కొన్నిసార్లు పచ్చళ్ళు త్వరగా పాడౌతాయి ఎందుకు?
- అన్ని పచ్చళ్ళలో నూనె ఉంటుందా?
- పచ్చళ్ళకు అల్యూమినియం గరిట వాడవద్దు అంటారు ఎందుకు?
ప్రశ్న 6.
ఆమ్లం, క్షారం మరియు తటస్థ పదార్థములు చూపు pH స్కేలు పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 7.
ఆమ్లము లోహములతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడునని నిరూపించు ప్రయోగ పరికరాల ఏర్పాట్ల పటము గీయండి.
జవాబు:
ప్రశ్న 8.
ఎసిడిటీతో బాధపడుతున్న వారికి క్షారాలు చేయు సహాయాన్ని నీవెలా అభినందిస్తావు?
జవాబు:
- జీర్ణాశయంలో అధిక ఆమ్లం వలన ఎసిడిటీ వస్తుంది.
- దీనివలన పొట్టలో మంట, నొప్పి ఏర్పడతాయి.
- క్షార పదార్ధమైన యాంటాసిడ్, ఈ ఆమ్లాన్ని తటస్థీకరణం చేస్తుంది.
- యాంటాసిడ్లు ఉపశమనం కల్గిస్తాయి.
- అజీర్తి, కడుపుమంటను నివారించటంలో యాంటాసిడ్లు అద్భుతంగా పనిచేస్తాయి.
- యాంటాసిడ్ తీసుకొన్న తరువాత మంట తగ్గి ఎంతో హాయిగా అనిపిస్తుంది.
- వైద్యశాస్త్రానికి, సైన్సుకు ధన్యవాదాలు తెలుపుకోవాలి.
చిటికెడు క్షారం కడుపు మంట మాయం చేసింది తటసీకరణం కలిగించింది ఉపశమనం |
యాంటాసిడ్ అంటే ఆమ్ల కోపానికి కళ్ళెం పేరుకు క్షారమైనా తటస్థంతో పంచు ఆనందం |
ప్రశ్న 9.
ఆమ్ల వర్షాల నివారణకు నీవు ఎటువంటి చర్యలను పాటిస్తావు?
జవాబు:
ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణం వాయుకాలుష్యం. వాయుకాలుష్యం నివారించటం వలన ఆమ్ల వర్షాలను నివారించవచ్చు. వాయుకాలుష్య నివారణకు చర్యలు :
- వాహనాల రద్దీ తగ్గించాలి.
- శిలాజ ఇంధనాల వాడకాలు ఆపాలి.
- ప్రత్యమ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి.
- బ్యాటరీ వాహనాలు పెంచాలి.
- సౌరశక్తి వినియోగం పెంచాలి.
- పరిశ్రమల పొగను శుభ్రపర్చాలి.
- అడవులు పెంచాలి.
- పరిసరాలలో పచ్చదనం పెంచాలి.
7th Class Science 2nd Lesson పదార్థాల స్వభావం InText Questions and Answers
7th Class Science Textbook Page No. 39
ప్రశ్న 1.
చింతపండు, నిమ్మరసం ఎందుకు పుల్లని రుచిని కల్గి ఉంటాయి?
జవాబు:
చింతపండు, నిమ్మరసం ఆమ్లాలను కల్గి ఉంటాయి. అందుచేత రుచికి పుల్లగా ఉంటాయి.
7th Class Science Textbook Page No. 55
ప్రశ్న 2.
క్షారాలలో లోహాలను వేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో చర్యపొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
ప్రశ్న 3.
పచ్చళ్ళను అల్యూమినియం రాగి, స్టీలు మొదలగు పాత్రలలో నిల్వ చేయరు. ఎందుకు?
జవాబు:
- పచ్చళ్ళలో ఆమ్లాలు ఉంటాయి.
- ఈ ఆమ్లాలు లోహపు పాత్రలలో చర్య జరిపి విషపదార్థాలను ఏర్పర్చుతాయి.
- ఈ విష పదార్థాలు పచ్చళ్ళను పాడు చేయటమేగాక ఆరోగ్యానికి హానికరం.
- అందుచేత పచ్చళ్ళను పింగాణి లేదా. గాజు పాత్రలలో నిల్వ చేస్తారు.
ప్రాజెక్ట్ పనులు
7th Class Science Textbook Page No. 69
ప్రశ్న 1.
వివిధ రకాల సూచికలను ఉపయోగించి వివిధ రకాల గ్రీటింగ్ కార్డులను తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 2.
బీట్ రూట్ తో సూచికను తయారుచేసి, కొన్ని ఆమ్లాలను, క్షారాలను దానితో పరీక్షించి నివేదిక రాయండి.
జవాబు:
- మంచి రంగు ఉన్న బీట్ రూట్ ను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బీట్ రూట్ రసం తీసాను.
- దీనిని జాగ్రత్తగా వడకట్టి పరీక్ష నాళికలోనికి తీసుకొన్నాను.
- దీనిని వేరు వేరు ఆమ్లాలకు కలిపి పరీక్షించగా ఎటువంటి రంగుమార్పు కనపడలేదు.
- బీట్ రూట్ సూచికను క్షార ద్రవాలకు కలిపి పరీక్షించినపుడు అవి ముదురు ఎరుపు రంగు నుండి పసుపు రంగుకు మారటం గమనించాను.
- దీనిని బట్టి బీట్ రూట్ సూచిక క్షార ద్రవాలను గుర్తించటానికి తోడ్పడుతుందని నిర్ధారణ చేశాను.
ప్రశ్న 3.
వివిధ పంటపొలాలు సందర్శించి మట్టిని సేకరించి మట్టి పరీక్షలు నిర్వహించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
- నేను నా మిత్రులతో బృందముగా ఏర్పడి మా ఊరి పరిసర ప్రాంతాల నుండి పొలాలకు వెళ్ళి మట్టి నమూనాను సేకరించాము.
- ప్రతి మట్టి నమూనా ఏ రైతు పొలం నుండి సేకరించబడినదో గమనించి నమోదు చేశాము.
- ఆ పై మట్టిని నీటిలో నానబెట్టి లిట్మస్ పరీక్ష నిర్వహించాము.
- దీని ద్వారా మట్టి రసాయన తత్వం తెలుసుకొని ఆ వివరాలను రైతులకు అందజేయటం జరిగింది.
- క్షార స్వభావం ఉన్న నేలకు ఏ ఎరువులు వాడాలి. ఆమ్ల స్వభావం ఉన్న నేలకు ఏ ఎరువులు వాడాలో సూచించాము.
- ప్రాజెక్టు వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి భద్రపర్చాము.
రైతు పేరు | పొలం స్వభావము | సూచనలు |
1. రామయ్య | ఆమ్ల స్వభావం | పొడిసున్నం చల్లాలి |
2. వెంకటేశ్వర్లు | తేలికపాటి ఆమ్ల స్వభావం | నీటి నిల్వను పెంచాలి |
3. శ్రీనివాసరావు | క్షారవంతం | పశువుల ఎరువు వాడాలి |
4. కోటేశ్వరరావు | తేలికపాటి క్షారయుతం | కంపోస్ట్ ఎరువు వేయాలి |
కృత్యాలు
కృత్యం -1
ప్రశ్న 1.
మీ వంటగదిలో వినియోగించే ఆహారపదార్థాల రుచి ఆధారంగా ఈ క్రింది పట్టిక నింపండి.
జవాబు:
పదార్థం | రుచి | ఆమ్లం/ఆమ్లం కాదు |
1. టమాటా రసం | పులుపు | ఆమ్లం |
2. పంచదార | తీపి | ఆమ్లం కాదు |
3. పెరుగు | పులుపు | ఆమ్లం |
4. పచ్చి మామిడి కాయ | పులుపు | ఆమ్లం |
5. ఉప్పు | ఉప్పగా | ఆమ్లం కాదు |
6. ఉసిరికాయ | పులుపు | ఆమ్లం |
7. కమలా రసం | పులుపు | ఆమ్లం |
కృత్యం -2
ప్రశ్న 2.
మీ అరచేతిలోకి సబ్బును తీసుకొని, కొద్దిగా నీటితో తడపండి. ఇప్పుడు మరొక అరచేతితో రుద్దండి.
రుద్దుతున్నప్పుడు ఎలా అనిపించింది?
జవాబు:
సబ్బు జారుడు స్వభావం తెలుస్తుంది.
ఇప్పుడు టూత్ పేస్ట్ తో ఈ కృత్యాన్ని చేయండి. మీకెలా అనిపిస్తుందో పరిశీలించండి.
టూత్ పేస్ట్ కూడా జారుడు స్వభావాన్ని కలిగి వుంటుంది.
ఈ పదార్థాలు జారుడు గుణం కలిగియుండే రసాయన పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ రసాయనాలను క్షారాలు అంటారు. క్షారాలు జారుడు స్వభావాన్ని మరియు చేదు రుచిని కలిగి వుంటాయి.
కృత్యం – 3
ప్రశ్న 3.
ఎ) ఒక పాత్రలో ఒక చెంచా పసుపు పొడిని తీసుకోండి. దానికి కొద్దిగా నీటిని కలిపి ముద్దగా చేయండి. బ్లాటింగ్ కాగితాన్ని తీసుకుని, దానికి రెండువైపులా పసుపు ముద్దను పూయండి. (వడపోత కాగితం లేదా తెల్ల కాగితాన్ని కూడా ఉపయోగించవచ్చును) దానిని కొద్దిసేపు ఆరబెట్టండి. పూర్తిగా ఆరిన తర్వాత ఆ పసుపు కాగితాన్ని పట్టీలుగా కత్తిరించండి. ఇప్పుడు పసుపు కాగితపు పట్టీలు వినియోగించుటకు సిద్ధంగా యున్నవి.
ఈ పట్టీల రంగు ఏమిటి?
జవాబు:
ఇవి పసుపురంగులో ఉంటాయి.
పసుపు సూచికతో పరీక్ష
- ఒక ప్లేటులో సబ్బు ద్రావణాన్ని తీసుకోండి. దానిలో ఒక పసుపు కాగితం పట్టీను ముంచండి. బయటకు తీసి పట్టీ రంగును పరిశీలించండి.
- ఇదే కృత్యమును సున్నపు నీరు మరియు నిమ్మరసంతో కూడా చేయండి.
పట్టీల రంగులలో ఏవైనా మార్పులను పరిశీలించారా?
జవాబు:
మీ పరిశీలనలను కింది పట్టికలో నమోదు చేయండి.క్ర.సంఖ్య పదార్థం
పదార్థం | పరిశీలించిన రంగు మార్పు |
1. సబ్బు ద్రావణం | |
2. సున్నపు నీరు | |
3. నిమ్మరసం |
జవాబు:
పదార్థం | పరిశీలించిన రంగు మార్పు |
1. సబ్బు ద్రావణం | ఎరుపు గోధుమ రంగు |
2. సున్నపు నీరు | ఎరుపు గోధుమ రంగు |
3. నిమ్మరసం | — |
బి) మందార సూచికతో పరీక్ష
పరీక్ష నాళికలలో నిమ్మరసం, సోడా నీరు, సున్నపు ద్రావణం, గ్లూకోజ్ ద్రావణం, పంచదార ద్రావణం, సబ్బునీరు మొదలగు వాటిని తీసుకోండి. ప్రతి పరీక్ష నాళికలో తయారుచేసిన కొన్ని చుక్కల మందార సూచికను వేయండి. పదార్థాల రంగులలో మార్పులను పరిశీలించి పట్టికలో నమోదు చేయండి.
పదార్థం | పరిశీలించిన రంగు మార్పు |
1. నిమ్మరసం | |
2. సోడానీరు | |
3. సున్నపు ద్రావణం | |
4. గ్లూకోజ్ ద్రావణం | |
5. పంచదార ద్రావణం | |
6. సబ్బు నీరు |
జవాబు:
పదార్థం | పరిశీలించిన రంగు మార్పు |
1. నిమ్మరసం | గులాబిరంగు |
2. సోడానీరు | ఆకుపచ్చ |
3. సున్నపు ద్రావణం | ఆకుపచ్చ |
4. గ్లూకోజ్ ద్రావణం | —- |
5. పంచదార ద్రావణం | —- |
6. సబ్బు నీరు | ఆకుపచ్చ |
ప్రయోగశాల కృత్యం -1
ప్రశ్న 4.
ఇవ్వబడిన ద్రావణాలు వివిధ సూచికలలో ఏ విధంగా మార్పు చెందుతాయో పరిశీలించండి.
కింది ద్రావణాలను పరీక్ష నాళికలలో తీసుకోండి. వీటిని సూచికలతో పరిశీలించండి. 1) ఎర్ర లిట్మస్ 2) నీలి లిట్మస్ 3) మిథైల్ ఆరెంజ్ 4) ఫినాఫ్తలీన్
జవాబు:
నీలి లిట్మస్ ఆమ్లాలలో ఎరుపు రంగులోకి మారుతుంది. ఎర్ర లిట్మస్ క్షారాలలో నీలిరంగులోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలో ఎరుపు రంగులోకి, క్షారాలలో పసుపు రంగులోకి మారుతంది.
ఫినాఫ్తలీన్ సూచిక క్షారాలలో గులాబీ(పింక్) రంగులోకి మారుతుంది. ఆమ్లాలలో ఫినాఫ్తలీన్ రంగులో మార్పురాదు.
స్వచ్ఛమైన నీటిలో పై ఏ సూచిక రంగులోనూ మార్పురాదు. ఎందుకంటే నీరు తటస్థ పదార్థం.
కృత్యం – 4
ప్రశ్న 5.
సజల హైడ్రోక్లోరికామ్లం, వెనిగర్, నీరు, సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ లను పరీక్ష నాళికలలో తీసుకోండి. ప్రతి పరీక్ష నాళికలో రెండు చుక్కల సార్వత్రిక సూచికను కలుపండి.
పరీక్ష నాళికలలోని అన్ని ద్రావణాలు వివిధ రంగులలోకి మారడాన్ని మీరు పరిశీలించవచ్చును. ఇప్పుడు సార్వత్రిక సూచిక సీసాపై ఇవ్వబడిన రంగుల పట్టీతో ఈ ద్రావణాల రంగులను పోల్చండి.
ఆమ్లాలు మరియు క్షారాల బలాలను అవి చూపిన రంగుల ఆధారంగా వర్గీకరించి, పట్టికలో రాయుము.
జవాబు:
ప్రయోగశాల కృత్యం-2
ప్రశ్న 6.
ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి అని ఎలా నిరూపిస్తావు?
(లేదా)
ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువు తయారీ విధానం తెలపండి.
జవాబు:
ఉద్దేశ్యం : ఆమ్లం లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.
ఏమి కావాలి :
శంభాకార గాజు పాత్ర (కోనికల్ ఫ్లాస్క్), హైడ్రోక్లోరిక్ ఆమ్లం, జింకుముక్కలు, మండుతున్న పుల్ల.
ఎలా చేయాలి :
ఒక శంఖాకార గాజు పాత్రను తీసుకొని, దానిలో 5 గ్రా. జింకు ముక్కలను వేయండి. దానిలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పోయండి. ఏమి జరుగుతుందో గమనించండి.
ఒక మండుతున్న పుల్లని ప్లాస్క్ మూతి వద్ద ఉంచండి. పుల్ల నున్న మంట టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. ఇది హైడ్రోజన్ వాయువును నిర్ధారించు పరీక్ష, హైడ్రోక్లోరిక్ ఆమ్లం జింకుతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ చర్యను క్రింది విధంగా పద సమీకరణంలో రాయ వచ్చును.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం + జింకు – జింక్ క్లోరైడ్ + హైడ్రోజన్
నేర్చుకున్నది ఏమిటి :
కావున, ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయని నిర్ధారించవచ్చును.
కృత్యం – 5
ప్రశ్న 7.
ప్రయోగశాల కృత్యం – 2ను ఈసారి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి బదులు సోడియం హైడ్రాక్సైడు ఉపయోగించండి. వెలువడిన వాయువును మండుతున్న పుల్లతో పరీక్షించండి.
ఏ వాయువు వెలువడింది?
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్ లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. కానీ, అన్ని క్షారాలు అన్ని లోహాలతో చర్య జరపవు.
కృత్యం – 6
ప్రశ్న 8.
కొన్ని గుడ్డు పెంకు ముక్కలను ఒక పరీక్ష నాళికలో తీసుకోండి. దానిలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లమును గుడ్డు పెంకును మునిగేంత వరకు పోయండి. పరీక్ష నాళికలో జరిగే మార్పులను పరిశీలించండి. గుడ్డు పెంకు కాల్షియం కార్బొనేట్ తో నిర్మితమవుతుంది.
మీరు ఏమైన వాయువులు విడుదలవ్వడం పరిశీలించారా?
జవాబు:
పరీక్ష నాళిక మూతి వద్దకు ఒక మండుతున్న పుల్లను తీసుకురండి.
ఏమి జరిగినది?
జవాబు:
మండుతున్న పుల్ల ఆరిపోతుంది. కాబట్టి ఆ వాయువు కార్బన్ డై ఆక్సైడ్. ఆమ్లము కాల్షియం కార్బొనేట్ తో చర్య జరపడం వలన ఇది ఉత్పన్నమైనది.
కృత్యం – 7
ప్రశ్న 9.
తటస్థీకరణ చర్యను ప్రయోగశాలలో ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఉద్దేశం : తటస్థీకరణ చర్యను నిరూపించుట
పరికరాలు : కోనికల్ ఫ్లాస్క్, డ్రాపర్
రసాయనాలు : సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఫినాఫ్తలీన్
విధానం :
- ఒక కోనికల్ ఫ్లాలో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తీసుకొని దానికి కొన్ని చుక్కలు ఫినాఫ్తలీన్ ‘ కలపాలి. అప్పుడు అది గులాబీరంగుకు మారుతుంది.
- దీనికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని చుక్కలుగా కలుపుతూ డ్రాపి కలియబెట్టండి.
పరిశీలన :
కాసేపటికి ఫ్లాలోని ద్రవం గులాబీరంగును కోల్పోతుంది.
వివరణ :
దీనికి కారణం సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య పొంది తటస్థీకరణం చేయటమే.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం + సోడియం హైడ్రాక్సైడ్ → నీరు + సోడియం క్లోరైడ్
ఆమ్లం క్షారంతో చర్యపొంది లవణము, నీటిని ఏర్పర్చే ఈ ప్రక్రియను తటస్థీకరణ అంటారు.
కృత్యం – 8
ప్రశ్న 10.
పంట పొలం యొక్క మట్టి స్వభావాన్ని ఎలా పరీక్షిస్తారు?
జవాబు:
మీ దగ్గరలో గల పంటపొలాన్ని సందర్శించండి. పొలం నుండి మట్టి నమూనాను సేకరించండి. ఒక బీకరులో గాలిలో ఆరిన 10 గ్రా. సేకరించిన మట్టిని వేయండి. దానికి అరలీటరు నీటిని కలిపి బాగా కలియబెట్టండి. ద్రావణాన్ని వడకట్టండి. ఇప్పుడు వడకట్టిన ద్రావణాన్ని యూనివర్సల్ సూచిక లేదా pH పేపరుతో పరీక్షించండి. ఈ పరీక్ష ద్వారా మట్టి స్వభావం తెలుస్తుంది.