SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ Unit Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ Unit Exercise
ప్రశ్న 1.
3 మ్యాచ్ లో కోహ్లి మరియు రోహిత్ లు చేసిన పరుగులు క్రింద ఇవ్వబడ్డాయి.
కోహ్లి: 49, 98, 72
రోహిత్: 64, 45, 83.
కోహ్లి మరియు రోహిళ్లు చేసిన పరుగుల సగటు కనుగొనుము. ఎవరి సగటు ఎక్కువ ?
సాధన.
3 మ్యాచ్ లో కోహ్లి చేసిన పరుగులు = 49, 98, 72.
3 మ్యాచ్ లలో కోహ్లి చేసిన సగటు పరుగులు = \(\frac{49+98+72}{3}\) = \(\frac{219}{3}\) = 73
3 మ్యాచ్ లో రోహిత్ చేసిన పరుగులు = 64, 45, 83.
64+45+83 1924 3 మ్యాచ్ లో రోహిత్ చేసిన సగటు పరుగులు = \(\frac{64+45+83}{3}\) = \(\frac{192}{3}\) = 64
∴ కోహ్లి సగటు, రోహిత్ సగటు కన్నా ఎక్కువ.
ప్రశ్న 2.
38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38 మరియు 47 ల బాహుళకము కనుగొనుము. ఇది ఏక బాహుళక దత్తాంశమా లేక ద్విబాహుళక దత్తాంశమా ?
సాధన.
ఇచ్చిన దత్తాంశము 38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38, 47.
ఇచ్చిన రాశులను క్రమ పద్ధతిలో అమర్చగా,
32, 35, 36, 37, 38, 38, 38, 40, 42, 43, 43, 43, 45, 47, 50.
ఇచ్చిన దత్తాంశంలో మిగిలిన వాటికన్నా 38 మరియు 43 లు ఎక్కువ సార్లు (3సార్లు) పునరావృతం కావడం జరిగినది.
∴ బాహుళకం = 38 మరియు 43.
ఇది ద్విబాహుళక దత్తాంశము.
ప్రశ్న 3.
విభిన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 0, -5, 7, 10, 13, -1 మరియు 41 డిగ్రీ సెల్సియస్ (°C) లలో గలవు. అయిన ఇచ్చిన రాశుల మధ్యగతము కనుగొనుము. ఇచ్చిన దత్తాంశమునకు మరియొక రాశి ‘4°C’ ని చేర్చగా మధ్యగత విలువ మారుతుందా? వివరించండి.
సాధన.
ఇచ్చిన దత్తాంశము 0, – 5, 7, 10, 13, – 1, 41.
విభిన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలను ఆరోహణా క్రమంలో అమర్చగా
రాశుల సంఖ్య:
n = 7 (బేసి సంఖ్య)
= \(\frac{7+1}{2}\) = \(\frac{8}{2}\) = 4
4వ రాశి మధ్యగతం
∴ మధ్యగతం = 7
ఇచ్చిన దత్తాంశము 0, – 5, 7, 10, 13, – 1 మరియు 41 లకు మరొక రాశి 4 ను చేర్చితే మధ్యగతం మారుతుంది.
కొత్త దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో అమర్చగా
మధ్యగతం \(\frac{4+7}{2}\) = \(\frac{11}{2}\)
∴ 4 ను చేర్చగా మధ్యగతం 7 నుండి 5.5 కు మారినది.
n = 8 (సరి సంఖ్య)
= \(\frac{8}{2}\) = 4, 4 + 1 = 5
4, 5 రాశుల సరాసరి మధ్యగతం
ప్రశ్న 4.
7x, 5x, 3x, 2x, x (x > 0) రాశుల వ్యాప్తి 12 అయిన ‘x’ విలువ కనుగొనుము. ఇచ్చిన రాశులను సంఖ్యా రూపంలో వ్యక్తపరుచుము.
సాధన.
7x, 5x, 3x, 2x, x (x > 0) ; రాశుల వ్యాప్తి = 12. .
వ్యాప్తి = గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ = 12
⇒ 7x – x = 12
⇒ 6x = 12
∴ ఇచ్చిన రాశుల సంఖ్యా రూపం 7(2), 5(2), 3(2), 2(2), 2 = 14, 10, 6, 4, 2
ప్రశ్న 5.
2015 లో వివిధ రాష్ట్రాల జనన, మరణ రేటు (సుమారుగా) ఇవ్వబడినది. కింది సమాచారానికి రెండు వరుసల కమ్మీ చిత్రాన్ని గీయండి.
సాధన.
ప్రశ్న 6.
క్రింద పట్టికలో ఇంటి నిర్మాణము ఖర్చుకు సంబంధించిన వివరాలు ఇవ్వబడ్డాయి.
పైన ఇవ్వబడిన సమాచారాన్ని ఉపయోగించి పై – చిత్రాన్ని గీయండి.
సాధన.
నిర్మాణ సోపానాలు:
- ఏదేని వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి, దాని కేంద్రాన్ని ‘O’ గా గుర్తించండి.
- వృత్త పరిధిపై ఏదైనా ఒక బిందువును ‘A’ గా గుర్తించండి. OA ను కలపండి.
- సిమెంట్ సెక్టారును సూచించునట్లు ∠AOB = 108°ని నిర్మించండి.
- స్టీల్ సెక్టారును సూచించునట్లు ∠BOC = 36°ని నిర్మించండి.
- ఇటుకలు సెక్టారును సూచించునట్లు ∠COD = 36°ని నిర్మించండి.
- ఇంటి కలప సెక్టారును సూచించునట్లు ∠DOE = 54°ని నిర్మించండి.
- కూలి సెక్టారును సూచించునట్లు ∠EOF = 72°ని నిర్మించండి.
- ∠FOA = 54° అనే సెక్టారు కోణం ఇతరములను సూచిస్తుంది.