SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.4 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 6.4
ప్రశ్న 1.
ప్రక్క రెండు వరుసల కమ్మీ చిత్రంలో వివిధ విద్యా సంవత్సరాలలో పాఠశాలలోని ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఇవ్వబడినది. ఈ రెండు వరుసల కమ్మీ చిత్రంలోని దత్తాంశము ఉపయోగించి క్రింది వాటికి సమాధానాలు రాయండి.
(i) ఏ విద్యా సంవత్సరంలో పాఠశాలలో బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్య అధికముగా కలదు?
సాధన.
2016-17 విద్యా సంవత్సరంలో బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్య అధికము.
(ii) ఏ విద్యా సంవత్సరంలో పాఠశాలలో బాలుర సంఖ్య, బాలికల సంఖ్యకు సమానము ?
సాధన.
2015-16 విద్యా సంవత్సరంలో బాలుర సంఖ్య, బాలికల సంఖ్యకు సమానము.
(iii) 2013-14 విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ?
సాధన.
2013-14 లో బాలుర సంఖ్య = 70
బాలికల సంఖ్య = 50
2013-14 విద్యా సంవత్సరంలో పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య = 120
ప్రశ్న 2.
7వ తరగతిలోని ఐదుగురు విద్యార్థులు గణితం మరియు సామాన్యశాస్త్రంలో సాధించిన మార్కులు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి. ఇచ్చిన సమాచారాన్ని వినియోగించి రెండు వరుసల కమ్మీ చిత్రం గీయండి.
సాధన.
ప్రశ్న 3.
ఒక కుటుంబము, నెలలో వివిధ అంశాలపై చేసిన ఖర్చుల వివరాలు ప్రక్కన ఇవ్వబడిన పై చిత్రంలో ఇవ్వబడినవి. పటంలో ప్రతీ సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణం ఇవ్వబడినది అయిన కింది ప్రశ్నలకు సమాధానములు రాయండి.
(i) అద్దె కొరకు పెట్టిన ఖర్చు రూ. 3000, అయిన ఆ నెలలో పొదుపు ఎంత?
సాధన.
అద్దె కొరకు పెట్టిన ఖర్చు = ₹ 3000
అద్దెను సూచించు సెక్టారు కోణం = 90°
కుటుంబము ఒక నెలలో చేసిన మొత్తం ఖర్చు = ₹ x అనుకొందాం.
90° = \(\frac{3000}{x}\) × 360°
90x = 3000 × 360 (x ను పక్షాంతరం చేయగా)
x = 12000.
కుటుంబం యొక్క ఒక నెల మొత్తం ఖర్చు x = ₹ 12000
పొదుపును సూచించు సెక్టారు కోణం = 90°
∴ ఆ నెలలో పొదుపు = ₹ 3000
(లేదా )
పొదుపును సూచించు సెక్టారు కోణం మరియు అద్దెను సూచించు సెక్టారు కోణం సమానం.
కావున, అద్దెకు చేసిన ఖర్చు = పొదుపు
∴ పొదుపు = ₹ 3000
(ii) తక్కువ ఖర్చు చేయబడిన అంశం ఏది ?
సాధన.
తక్కువ ఖర్చు చేసిన అంశం చదువు.
(iii) అధిక ఖర్చు చేయబడిన అంశం ఏది ?
సాధన.
అధిక ఖర్చు చేయబడిన అంశం ఆహారం.
ప్రశ్న 4.
ఒక కళాశాలలో విభిన్న సబ్జెక్టులు ఎంచుకున్న విద్యార్థుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పైన ఇవ్వబడిన సమాచారాన్ని ఉపయోగించి, పై చిత్రాన్ని నిర్మించండి.
సాధన.
నిర్మాణ సోపానాలు:
- ఏదేని వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి, దాని కేంద్రాన్ని ‘O’ గా గుర్తించండి.
- వృత్త పరిధిపై ఏదైనా ఒక బిందువును ‘A’ గా గుర్తించండి. OA ను కలపండి.
- బోటనీ సబ్జెక్ట్ సెక్టారును సూచించునట్లు ∠AOB = 90°ని నిర్మించండి.
- గణితం సబ్జెక్ట్ సెక్టారును సూచించునట్లు ∠BOC = 120ిని నిర్మించండి. FA
- ఫిజిక్స్ సబ్జెక్ట్ సెక్టారును సూచించునట్లు ∠COD = 40°ని నిర్మించండి.
- కెమిస్ట్రీ సబ్జెక్ట్ సెక్టారును సూచించునట్లు ∠DOE = 60°ని నిర్మించండి.
- ఎకనామిక్స్ సబ్జెక్ట్ సెక్టారును సూచించునట్లు ∠EOF = 20° ని నిర్మించండి.
- ∠FOA = 30° అనే సెక్టారు కోణం కామర్స్ సబ్జెక్ట్ ను సూచిస్తుంది.