SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 1st Lesson పూర్ణ సంఖ్యలు Exercise 1.2

ప్రశ్న 1.
క్రింది వాటిని లెక్కించండి..
(i) (- 96) ÷ 16
సాధన.
(-96) ÷ 16 = – 6

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2

(ii) 98 ÷ (- 49)
సాధన.
98 ÷ (- 49) = – 2

(iii) (- 51) ÷ 17.
సాధన.
(- 51) ÷ 17 = – 3

(iv) 38 ÷ (- 19)
సాధన.
38 ÷ (- 19) = – 2

(v) (- 80) ÷ 20
సాధన.
(- 80) ÷ 20 = – 4.

(vi) (- 150) ÷ (- 25)
సాధన.
(- 150) ÷ (- 25) = 6

(vii) (- 600) ÷ 60
సాధన.
(- 600) ÷ 60 = – 10

(viii) (- 54) ÷9
సాధన.
(- 54) ÷ 9 = – 6

(ix) 130 ÷ 65
సాధన.
130 ÷ 65 = 2

(x) (- 315) ÷ (- 315)
సాధన.
(- 315) ÷ (- 315) = 1

ప్రశ్న 2.
రెండు పూర్ణ సంఖ్యల లబ్దము – 165. అందులో ఒక సంఖ్య -15 అయిన రెండవ సంఖ్య కనుగొనుము.
సాధన.
రెండు పూర్ణ సంఖ్యల లబ్దము = -165
అందులో ఒక సంఖ్య = -15
రెండవ సంఖ్య = (-165) + (-15)
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2 1
∴ రెండవ సంఖ్య = 11

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2

ప్రశ్న 3.
2020 సం||లో కోవిడ్-19 వలన ఒక కంపెనీ 6 నెలలు లాక్ డౌన్ లో వుండినది మరియు ₹ 1,32,000 నష్టపోయినది. నెలసరి సరాసరి నష్టమును కనుగొనుము.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2 2
సాధన.
6 నెలల లాక్ డౌన్ సమయంలో వచ్చిన నష్టము = ₹(- 1,32,000)
నెలసరి సరాసరి నష్టము = – 1,32,000 ÷ 6
= \(\frac{-1,32,000}{6}\) = ₹ – 22,000
∴ ప్రతినెల సరాసరి ₹ 22,000 నష్టం వచ్చినది.

ప్రశ్న 4.
మధ్యాహ్నం 12 గంటలకు ఉష్ణోగ్రత 0° పైన 10°C అని గుర్తించబడినది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2°C చొప్పున అర్ధరాత్రి వరకు తగ్గుతుంది. ఏ సమయానికి 0° కన్నా 8°C తక్కువగా ఉంటుంది ? అర్ధరాత్రి ఉష్ణోగ్రత ఎంత ?
సాధన.
మధ్యాహ్నం 12 గంటలకు ఉష్ణోగ్రత = + 10°C
ప్రతి గంటకు తగ్గుతున్న ఉష్ణోగ్రత = – 2°C
0° కన్నా 8°C తక్కువగా ఉండుటకు (- 8°C) అవుటకు తగ్గవలసిన ఉష్ణోగ్రత = (-8) – (10) = – 18°C
– 18°C ఉష్ణోగ్రత తగ్గుటకు పట్టుకాలము = -18 + (-2) = 9 గంటలు
∴ రాత్రి 9 గంటలకు 0° కన్నా 8°C తక్కువగా ఉంటుంది.
∴ అర్ధరాత్రి ఉష్ణోగ్రత = (- 8°C) + (- 2°C × 3 గంటలు) = (- 8°C + – 6°C) = – 14°C

ప్రశ్న 5.
ఒక కూరగాయల వ్యాపారి ఒక కి.గ్రా. టమోటాపై ₹7 లాభముతో, ఒక కి.గ్రా. వంకాయలపై ₹ 4 నష్టముతో అమ్మాడు. అతను సోమవారము 68 కి.గ్రా.ల టమోటాలు అమ్మినా లాభము కానీ నష్టము కానీ రాలేదు. అయిన అతను ఆ రోజు ఎన్ని కి.గ్రా.ల వంకాయలు అమ్మాడు?
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2 3
సాధన.
కూరగాయల వ్యాపారికి ఒక కి.గ్రా. టమోటాపై వచ్చు లాభము = ₹7
1 కి.గ్రా. వంకాయలపై వచ్చు నష్టము = ₹(4)
వ్యాపారి అమ్మిన టమోటాలు = 68 కి.గ్రా.
టమోటా కిలోల సంఖ్య = x కి.గ్రా. అనుకొనుము
వంకాయలు కిలోల సంఖ్య = y కి.గ్రా. అనుకొనుము
7x – 4y = 0
⇒ 7 × 68 – 4y = 0
⇒ – 4y = – 7 × 68
⇒ y = \(\frac{-7 \times 68}{-4}\)
∴ ఆ రోజు వ్యాపారి అమ్మవలసిన వంకాయలు
= + 7 × 17 = + 119 కిలోలు.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.2

ప్రశ్న 6.
ఒక పరీక్షలో, ప్రతి సరైన సమాధానానికి + 3 మార్కులు మరియు ప్రతి తప్పుకు -1 మార్కులు ఇవ్వబడతాయి. సోనా అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగా, అందులో 10 సరియైనవి మరియు ఆమె 20 మార్కులు పొందినది.
(i) ఆమె రాసిన తప్పు సమాధానాలు ఎన్ని ?
సాధన.
ప్రతి సరైన సమాధానానికి మార్కులు = + 3 .
కావున, 10 సరైన సమాధానాలకు మార్కులు = 10 × 3 = 30
ఇవ్వబడిన లెక్క ప్రకారం, సోనాకు వచ్చిన మార్కులు = 20
తప్పు సమాధానాలకు మార్కులు = 20 – 30 = – 10
ప్రతి తప్పు సమాధానానికి మార్కులు = – 1
∴ తప్పు సమాధానాలు రాసిన ప్రశ్నల సంఖ్య = (- 10) ÷ (- 1) = 10

(ii) పరీక్షలో ఇవ్వబడిన మొత్తం ప్రశ్నలు ఎన్ని ?
సాధన.
పరీక్షలోని మొత్తం ప్రశ్నల సంఖ్య = సరైన సమాధానాలు రాసిన ప్రశ్నలు + తప్పు సమాధానం రాసిన ప్రశ్నలు
= 10 + 10 = 20

ప్రశ్న 7.
a ÷ b = – 4 అగునట్లు 5 పూర్ణ సంఖ్యల జత (a, b) లు వ్రాయుము.
(ఉదా: (12, – 3) ఎందుకనగా 12 ÷ (- 3) = – 4).
సాధన.
(i) (16, – 4)
(ii) (- 48, 12)
(iii) (40, – 10)
(iv) (- 64, 16)