SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 1 పూర్ణ సంఖ్యలు Ex 1.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 1st Lesson పూర్ణ సంఖ్యలు Exercise 1.1
ప్రశ్న 1.
కింది వాటిని గుణించండి.
(i) 5 × 7
సాధన.
5 × 7 = 35
(ii) (-9) × (6)
సాధన.
(-9) × 6 = – 54
(iii) (9) × (- 4)
సాధన.
9 × (4) = – 36
(iv) (8) × (-7)
సాధన.
8 × (-7) = – 56
(v) (-124) × (-1)
సాధన.
(-124) × (-1) = + 124
(vi) (-12) × (-7)
సాధన.
(-12) × (-7) = + 84
(vii) (- 63) × 7,
సాధన.
(- 63) × 7 = – 441
(viii) 7 × (- 15)
సాధన.
7 × (- 15) = – 105
ప్రశ్న 2.
కింది వాటిలో పెద్దది ఏది ?
(i) 2 × (- 5) లేదా 3 × (-4)
సాధన.
2 × (- 5) లేదా 3 × (4)
– (2 × 5) = – 10, – (3 × 4) = – 12
– 10 > – 12
∴ 2 × (-5) పెద్దది
(ii) (- 6) × (- 7) లేదా (-8) × 5
సాధన.
(- 6) × (- 7) లేదా (-8) × 5
+ (6 × 7) = 42, – (8 × 5) = – 40
42 > – 40
∴ (- 6) × (- 7) పెద్దది
(iii) (- 6) × 10 లేదా (-3) × (- 21)
సాధన.
(- 6) × 10 లేదా (-3) × (-21).
– (6 × 10) = – 60, + (3 × 21) = 63
63 > – 60
∴ (- 3) × (- 21) పెద్దది
(iv) 9 × (- 11) లేదా 6 × (- 16)
సాధన.
9 × (-11) లేదా 6 × (-16)
– (9 × 11) = – 99, – (6 × 16) = – 96
– 96 > – 99
∴ 6 × (-16) పెద్దది
(v) (- 8) × (- 5) లేదా (-9) × (-4)
సాధన.
(- 8) × (- 5) లేదా (-9) × (4)
+ (8 × 5) = 40, + (9 × 4) = 36
40 > 36
∴ (- 8) × (-5) పెద్దది
ప్రశ్న 3.
రెండు పూర్ణసంఖ్యల లబ్దము i) ఒక ధన పూర్ణ సంఖ్య ii) ఒక రుణ పూర్ణ సంఖ్య iii) సున్నా అగునట్లు పూర్ణ సంఖ్యలను వ్రాయుము.
సాధన.
లబ్దము (i) ఒక ధన పూర్ణ సంఖ్య:
(i) 4 × 3
(ii) (+ 4) × (- 3)
(iii) (- 10) × (- 5)
లబ్దము (ii) ఒక రుణ పూర్ణ సంఖ్య:
(i) (4) × 3
(ii) 4 × (-3)
(iii) (- 10) × 5
లబ్దము (iii) సున్న:
(i) 0 × 5
(ii) (- 5) × 0
(iii) 0 × 0
ప్రశ్న 4.
ఒక కప్ప నిముషానికి 3 మీటర్ల వంతున బావి పై ఉపరితలం నుండి లోపలికి జారుతున్నది. కప్ప 5 నిముషాల తరువాత బావిలో ఏ స్థానములో ఉంటుంది?
సాధన.
కప్ప నిముషానికి బావి లోపలికి జారుతున్న లోతు = -3 మీటర్లు
5 నిముషాలలో కప్ప జారు లోతు = 5 × (-3) = -15 మీటర్లు
∴ 5 నిమిషాల తరువాత కప్ప బావి ఉపరితలం నుండి 15 మీటర్ల లోతులో ఉంటుంది.
ప్రశ్న 5.
వేసవిలో ఒక కొలనులో నీటిమట్టము బాష్పీభవనం వలన ఒక వారానికి 5 అంగుళాల చొప్పున తగ్గుతున్నది. నీటి స్థాయి స్థిర పరిమాణములో తగ్గుచున్నచో, 6 వారాల తరువాత కొలనులో నీటి మట్టములో మార్పు ఎంత ఉండును?
సాధన.
బాష్పీభవనం వలన ఒక వారానికి తగ్గు నీటి మట్టము = – 5 అంగుళాలు
6 వారాల తరువాత కొలనులో నీటి మట్టంలో మార్పు = 6 × (- 5) = -30 అంగుళాలు
∴ 6 వారాల తరువాత నీటి మట్టం 30 అంగుళాలు తగ్గుతుంది.
ప్రశ్న 6.
ఒక దుకాణదారుడు ఒక్కొక్క పుస్తకం అమ్మడం వలన ₹5లు లాభాన్ని మరియు ఒక్కొక్క పెన్ను అమ్మడం వలన ₹3లు నష్టము పొందును. జూలై నెలలో అతను 1500 పుస్తకాలు మరియు 1500 పెన్నులు అమ్మిన అతనికి వచ్చిన లాభము లేదా నష్టమును కనుగొనుము.
సాధన.
ఒక్కొక్క పుస్తకం అమ్మడం వలన దుకాణదారునకు వచ్చు లాభము = ₹5
1500 పుస్తకాలు అమ్మడం వలన వచ్చు లాభం = 1500 × 5 = ₹7500
ఒక్కొక్క పెన్ను అమ్మడం వలన దుకాణదారునకు వచ్చు నష్టం = ₹(-3)
1500 పెన్నులు అమ్మడం వలన వచ్చు నష్టం = 1500 × (-3) = ₹ – 4500
1500 పుస్తకాలు, 1500 పెన్నులు అమ్మడం వలన వచ్చు లాభము లేదా నష్టము = 7500 + (- 4500) = ₹3000
ఫలితం ధన సంఖ్య కావున ₹ 3000 లాభం వస్తుంది.
ప్రశ్న 7.
ఒక సిమెంటు కంపెనీ ఒక్కొక్క తెలుపు రంగు బస్తా సిమెంటుపై ₹8 లాభం మరియు బూడిద రంగు బస్తా సిమెంటుపై ₹6 నష్టముతో అమ్మింది. ఒక నెలలో 2,000 బస్తాల తెలుపు రంగు సిమెంటు, 3,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిన దానికి వచ్చినది లాభమా లేదా నష్టమా ఏమిటో కనుగొనండి.
సాధన.
సిమెంటు కంపెనీకి ఒక్కొక్క తెలుపు రంగు సిమెంటు బస్తాపై వచ్చు లాభము = ₹8
2000 తెలుపు రంగు సిమెంటు బస్తాలపై వచ్చు లాభము = 2000 × 8 = ₹ 16,000
సిమెంటు కంపెనీకి ఒక్కొక్క బూడిదరంగు సిమెంటు బస్తాపై వచ్చు నష్టము = ₹ (- 6)
3,000 బూడిద రంగు సిమెంటు బస్తాలపై వచ్చు నష్టము = 3000 × (- 6) = ₹ – 18000
2,000 బస్తాల తెలుపు రంగు సిమెంట్, 3000 బస్తాల బూడిద రంగు సిమెంట్ అమ్మడం వలన వచ్చు లాభం లేదా నష్టము = (16000) + (-18000) = ₹ – 2000
∴ ఫలితం రుణసంఖ్య కావున ₹ 2000 నష్టం వస్తుంది.
ప్రశ్న 8.
ప్రవచనం సరియగునట్లు కింది ఖాళీలను సరైన పూర్ణ సంఖ్యచే పూరించుము.
(i) (-4) ×________ = – 20
సాధన.
(- 4) × 5 = – 20
(ii) ________ × 5 = – 35
సాధన.
(- 7) × 5 = – 35
(iii) (-6) × ________ = 48
సాధన.
(- 6) × (-8) = 48
(iv) ________ × (-9) = 45
సాధన.
(5) × (-9) = 45
(v) ________ × 1 = – 42
సాధన.
(-6) × 7 = – 42
(vi) 8 × ________ = – 8
సాధన.
8 × (- 1) = – 8