SCERT AP 6th Class Social Study Material Pdf 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Social Solutions 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం
6th Class Social 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
అడవుల నుండి లభించే ఉత్పత్తులను పేర్కొనుము.
జవాబు:
అడవుల నుండి మనకు వివిధ రకాలైన ఉత్పత్తులు లభిస్తున్నాయి. అవి :
- వివిధ రకాల పళ్ళు ఉదా : సీతాఫలం, జామ, పనస, వెలగ మొ||నవి.
- వివిధ రకాల దుంపలు. ఉదా : చిలకడదుంప, వెదురు, దుంప మొ||నవి.
- వివిధ రకాల గింజలు, కాయలు. ఉదా : కుంకుళ్ళు, షీకాయ, బాదాము మొ||నవి.
- తేనె, టేకు, సాల్, వెదురు మొ|| కలప, చింతపండు.
- విస్తరాకులు, ఆయుర్వేద ఔషధ వనమూలికలు.
- వంటచెరకు మొదలైనవి.
ప్రశ్న 2.
సంచార జీవనం అనగా నేమి?
జవాబు:
ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. వారు గుహలలో, చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని ‘సంచార జీవులు’ అని అంటారు. వీరు సాగించిన జీవనాన్ని సంచార జీవనం అంటారు.
ప్రశ్న 3.
నేడు మనం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నాం?
జవాబు:
నేడు మనము నిప్పును క్రింది విధంగా ఉపయోగిస్తున్నాము.
- ఆహారాన్ని వండుకుని తినుటకు
- వెచ్చదనం పొందటానికి, నీటిని వేడి చేయటానికి.
- మతానికి సంబంధించిన క్రతువులలో, కర్మకాండలలో
- కొన్ని రకాల పంటల ప్రాసెసింగ్ లో (ఉదా : పొగాకును కాల్చుట)
- వివిధ రకాల పరిశ్రమలలో (ఉదా : ఇనుము – ఉక్కు పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలలో)
- వెల్డింగ్ పనుల్లో
- బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయుటకు
- బంగారం, వెండి మొదలైన లోహాలను కరిగించడానికి, నాణెలు, బొమ్మలుగా చేయుట కొరకు.
- చల్లని రాత్రులలో వెచ్చదనం కోసం.
ప్రశ్న 4.
నేటి మానవులు, ఆది మానవులు తిన్న ఆహార పదార్థాల జాబితాను తయారు చేసి, దానిలో మీరు గమనించిన పోలికలను, భేదాలను రాయండి.
జవాబు:
నేటి మానవులు మరియు ఆదిమానవుల ఆహార అలవాట్లలోని భేదాలు :
- ఆదిమానవులు ఆహారాన్ని వండుకుని తినలేదు నేటి మానవులు శుభ్రం చేసుకుని, వండుకుని తింటున్నారు.
- ఆదిమానవులు పచ్చిమాంసాన్ని భుజించగా నేటి మానవులు వండుకుని వివిధ రుచులలో భుజిస్తున్నారు.
- ఆదిమానవులు ఆహారాన్ని సేకరించేవారు. నేటి మానవులు, ఆహారాన్ని ఉత్పత్తి (పండిస్తున్నారు) చేస్తున్నారు.
- ఆదిమానవులు వేటాడి జంతు మాంసాన్ని పొందుతున్నారు. నేటి మానవులు జంతువులను మచ్చిక చేసుకుని పాలు, మాంసం పొందుతున్నారు.
- ఆదిమానవులు ఆహారాన్ని నిల్వ ఉంచలేదు. నేటి మానవులు ఆహారాన్ని నిల్వ ఉంచుతున్నారు, అనేకరకాలైన ధాన్యాలు పండిస్తున్నారు.
- ఆదిమానవులు ఆహారాన్ని భుజించడానికి ఎటువంటి పాత్రలు, పరికరాలు వాడలేదు. నేటిమానవులు అనేక రకాల వంట పాత్రలు వాడుతున్నారు మరియు చపాతి, అన్నం, పప్పు, కూరలు మొ||నవి ఆహారంలో భాగంగా ఉన్నాయి.
పోలికలు:
- ఆదిమానవులు, నవీన (నేటి) మానవులు శక్తి కోసం ఆహారాన్ని భుజించేవారు. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం.
- ఆదిమ మానవుల్లో మాంసాహారులు కలరు అలాగే నవీన మానవుల్లో కూడా మాంసాహారులు కలరు.
- ఆదిమానవులు ఫలాలు, దుంపలు, వేర్లు మొ||నవి ఆహారంగా తీసుకునేవారు. నేటి మానవులు కూడా ఆహారంలో, అవి స్వీకరిస్తున్నారు.
ప్రశ్న 5.
“జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయ అయింది” దీనితో నీవు ఏకీభవిస్తావా? మీ జవాబును సమర్థించండి.
జవాబు:
- జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం ద్వారా ఆది మానవుల జీవనం సుఖమయం అయిందనుటలో సందేహం లేదు, నేను దీనితో ఏకీభవిస్తున్నాను.
- జంతువులను మచ్చిక చేసుకొనడం వల్ల వారికి పాలు,మాంసం, జంతుచర్మం మొ||నవి లభించేవి.
- మొక్కలు పెంచడం వల్ల వారికి కావలసిన ఆహార ధాన్యాలు (గింజలు) కూరగాయలు మరియు జంతువులకు అవసరమైన గడ్డి లభించేవి, గృహ (ఇళ్ళు) నిర్మాణానికి అవసరమైన కలప, ఆకులు మొ||నవి లభించేవి.
- ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయటానికి ఉపయోగించుకుని తమ కష్టాన్ని తగ్గించుకున్నారు. ఈ విధంగా వారి జీవనం సుఖమయం అయింది.
ప్రశ్న 6.
వంటకు రుబ్బురోలు లేనట్లయితే మనం తినే ఆహారపు అలవాట్లపై ఎటువంటి ప్రభావం కలుగుతుంది?
జవాబు:
- వంటకు రుబ్బురోలు లేనట్లయితే కాయలను పచ్చడి చేయలేము. ముక్కలు గానే తినవలసి వస్తుంది. అలాగే ఇడ్లీ, అట్టు, గారె లాంటి పిండ్లు వేయటానికి కుదరదు.
- కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటం కష్టం కావచ్చు. కొన్ని రకాల ధాన్యాలను గింజలుగానే తినవలసి వస్తుంది.
- ఇలా రోలు వాడకం లేనట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకొనుట కూడా కష్టం కావచ్చు.
ప్రశ్న 7.
పండ్లు కోయటానికి మీరు ఎటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నారు? అవి వేటితో తయారు చేస్తారు?
జవాబు:
- మేము పండ్లు కోయటానికి కత్తి (knife), కోత కత్తి (cutter), చాకు, చెంచా, ముళ్ళ చెంచా (fork), కొడవలి మొదలైన పనిముట్లను ఉపయోగిస్తున్నాము.
- ఇవి అన్నీ దాదాపు స్టెయిన్లెస్ స్టీల్, ఇనుముతో తయారు చేయబడినవే.
ప్రశ్న 8.
ఆది మానవులు ధాన్యాన్ని వేటిలో నిల్వ చేసేవారు?
జవాబు:
ఆది మానవులు ఆహార నిల్వ కొరకు మట్టి పాత్రలు, గంపలు / బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించేవారు.
ప్రశ్న 9.
నవీన శిలాయుగ వ్యవసాయదారుల, పశుపోషకులకు, ప్రస్తుత ఆధునిక యుగ వ్యవసాయదారుల, పశు పోషకులకు మధ్య తేడాలను రాయండి.
జవాబు:
నవీన శిలాయుగ వ్యవసాయదారు/ పశుపోషకులు | ఆధునిక వ్యవసాయదారు/ పశుపోషకులు |
1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లను వినియోగించలేదు. (రాతినాగలి) | 1. వీరు వ్యవసాయానికి సరైన పనిముట్లు వినియోగిస్తున్నారు. (ఇనుపనాగలి) |
2. వీరు పొలం దున్నటానికి జంతువులపై ఆధారపడినారు. (ఉదా : ఎద్దు) | 2. వీరు ఆధునిక వాహనాలపై పొలం దున్నుతున్నారు. (ఉదా : ట్రాక్టర్) |
3. వీరికి సస్యరక్షణ చర్యలు అంతగా తెలియవు. | 3. వీరు-సస్యరక్షణకు పురుగుమందులు వాడుతున్నారు. |
4. వీరు నీరు అందుబాటులో ఉన్నచోటనే పంటలు పండించారు. | 4. నీరు అందుబాటులో లేకపోయినా కాల్వల ద్వారా, బావుల ద్వారా పంటలు పండిస్తున్నారు. |
5. జంతువులను పాలు, మాంసం, చర్మాల కోసం పోషించారు. | 5. జంతువులను వినోదం కోసం, పందేలకోసం కూడా పోషిస్తున్నారు. |
6. వీరి వ్యవసాయ లేదా పశువుల ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేక పోయారు. | 6. వ్యవసాయ, జంతు సంబంధ ఉత్పత్తులను చాలాకాలం నిల్వ ఉంచుతున్నారు. (ఉదా : కోల్డ్ స్టోరేజి) |
ప్రశ్న 10.
నవీన శిలాయుగ వ్యవసాయ పశుపోషకులకు, జీవన విధానం, నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారి తీసింది?
జవాబు:
- నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమయిన పనిముట్లను తయారు చేసుకొన్నారు.
- కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ, పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు.
- సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, సింధూలోయ (భారతదేశం) మరియు చైనాలలో వర్ధిల్లాయి.
ప్రశ్న 11.
కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
A. చింతకుంట
B. ఆదోని
C. కావలి
D. నాయుడు పల్లి
E. వేల్పు మడుగు
F. శ్రీకాళహస్తి
జవాబు:
6th Class Social Studies 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం InText Questions and Answers
6th Class Social Textbook Page No.54
ప్రశ్న 1.
పై చిత్రాలను పరిశీలించి ఆది మానవులు చేస్తున్న పనుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
- జింకను వేటాడి, పట్టుకుని తీసుకు వచ్చుచున్నారు.
- స్త్రీలు, పిల్లలు (దుంపలను, కాయలను) ఆహారాన్ని సేకరిస్తున్నారు.
- జంతు చర్మాన్ని శుభ్రం చేయుచున్నారు.
- రాతిపనిముట్లను తయారు చేస్తున్నారు.
- నిప్పుపై మాంసాన్ని కాల్చుచున్నారు.
6th Class Social Textbook Page No.55
ప్రశ్న 2.
మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
జవాబు:
మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :
- తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
- దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
- వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
- చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి.
ప్రశ్న 3.
ఆది మానవులు నిప్పును ఎలా కనిపెట్టి ఉంటారో మీ ఉపాధ్యాయుల సహాయంతో చర్చించి రాయండి.
జవాబు:
- సహజసిద్ధంగా ఏర్పడిన మెరుపు అడవిలోని చెట్లను తాకినపుడు ఏర్పడిన మంట ఆది మానవులను ఆశ్చర్యానికి గురిచేసింది.
- గాలి బలంగా వీచినపుడు రెండు చెట్ల రాపిడి వలన ఏర్పడిన నిప్పు (మంట) ఆది మానవుడిలో ఆలోచనలను కలగజేసింది.
- కాలక్రమేణ ఆది మానవుడు కర్ర మరియు చెకుముకిలను ఉపయోగించి మొదటగా నిప్పును ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నారని పరిణామవాదులు సిద్ధాంతీకరించారు.
6th Class Social Textbook Page No.57
ప్రశ్న 4.
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయులు, స్నేహితులతో చర్చించి సమాధానం వ్రాయండి.
జవాబు:
వాతావరణ మార్పులు ప్రస్తుతం మానవుల జీవితాలను క్రింది విధంగా ప్రభావితం చేస్తున్నాయి
- వాతావరణంలో మార్పులు మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చును. వాతావరణంలో మార్పులు వలన మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా వ్యవసాయం, పచ్చదనం విస్తరించింది.
- గడ్డితినే జంతువులయిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది, జంతువులను మచ్చిక చేసుకోవటం, పశుపోషణ పెరిగింది.
- వ్యవసాయంలో (పంటల దిగుబడిలో) గుర్తించదగిన అభివృద్ధి సాధించటం జరిగింది.
- అయితే వాతావరణంలో నేడు అనేక కాలుష్య పదార్థాలు చేరి, వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తూ, అతివృష్టి, – అనావృష్టి మొదలైన ప్రకృతి భీభత్సాలకు ఏర్పడుతున్నాయి.
6th Class Social Textbook Page No.58
ప్రశ్న 5.
ఆది మానవులు పశుపోషకులుగా ఎలా మారారు?
జవాబు:
- మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి.
వారు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. - ఎంపిక చేసుకొన్న జంతువులతోనే పశోత్పత్తి గావించేవారు.
- ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి.
- ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులు కూర మృగాల నుండి కాపాడేవారు.
- ఈ విధంగా మానవులు వ్యవసాయ, పశుపోషకులుగా మార్పు చెందారు.
ప్రశ్న 6.
‘పశుపోషణ’ ఆది మానవుల స్థిర జీవనానికి నాంది పలికిందని నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:
- మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకొంటే అవి అనతికాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
- ఇవి మాంసం, పాలు, పాల పదార్థాలు అందిస్తాయి.
- ఈ ‘కారణాల వల్ల ఆది మానవులు చాలాకాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం (స్థిర జీవనం) ఉండటం ప్రారంభించారు.
6th Class Social Textbook Page No.59
ప్రశ్న 7.
ఆధునిక రైతుల జీవన విధానాన్ని, నాటి వ్యవసాయ, పశుపోషకుల జీవన విధానాలతో పోల్చండి.
జవాబు:
- ఆధునిక రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు. కాని నాటి వ్యవసాయ, పశుపోషకులు కరుకురాతి పరికరాలను ఉపయోగించారు.
- నేటి రైతులు వివిధ రకాల పంటలను పండిస్తూ, పెద్ద పెద్ద భవనాలలో (రాతి కట్టడాలు) ఉంటూ, జంతువులను , మంచి షెడులలో పెంచుతూ వాణిజ్య తరహా పాడి, పంటలను పండిస్తున్నారు. కాని నాడు పరిమిత పంటలను పండిస్తూ తాటాకు (పూరి) గుడిసెల్లో నివసిస్తూ సాధారణ జీవనం గడిపేవారు.
- ఈనాటి ఆధునిక రైతులు మంచి ఎరువులను పురుగు మందులను ఉపయోగిస్తూ వాణిజ్య / నగదు పంటలను లాభాలకై పండిస్తున్నారు. నాటి వ్యవసాయ పశుపోషకులు ఆహారం కొరకు జీవనాధారా వ్యవసాయం చేసినారు.
- ఆధునిక రైతు అన్ని విధాల (నీటి సౌకర్యం, యాంత్రీకరణ, మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగి సౌకర్యం మొ||నవి) అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. నాడు ఈ సౌకర్యలేవి లేవు, ఆహారం కొరకు మాత్రమే పంటలు పండించేవారు
ప్రశ్న 8.
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే ఏమవుతుంది?
జవాబు:
ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోకపోతే :
- భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది.
- తర్వాత పంటకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉండవు.
- కరవు, కాటకాలు లాంటివి ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది.
- ఆహార కొరత సమయంలో వ్యాపారులు (నల్ల బజారు) బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది.
- ఆహార కొరత సమయంలో ఆకలి చావులు ఏర్పడే ప్రమాదం ఉంది.
6th Class Social Textbook Page No.60
ప్రశ్న 9.
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు ఏవి?
జవాబు:
జంతువుల నుండి ఆహారం కాకుండా, మనం పొందే ఇతర వస్తువులు:
- జంతుచర్మాలు, జంతు కొమ్ములు, దంతాలు, గోళ్ళు.
- జంతు క్రొవ్వు, జంతు శ్రమ (ఎద్దు, గాడిదలను బరువు మోయటానికి ఉపయోగిస్తాం.)
- జంతువుల వెంట్రుకలు (బొచ్చు)
ప్రశ్న 10.
మీ ప్రాంతంలో పెంచుకొనే జంతువులు, పక్షుల జాబితాను తయారు చేయండి.
జవాబు:
జంతువులు | పక్షులు |
గొర్రె, మేక, గేదెలు, దున్న, ఆవు గాడిద, కుక్క పందులు, పిల్లులు ఒంటెలు, గుర్రాలు మొ||నవి. | కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు నెమలి, పాలపిట్ట, హంస, ఆస్ట్రిచ్ మొ||నవి. |
ప్రశ్న 11.
పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ ఉంచుకొనేవారని మీరు భావిస్తున్నారు.
జవాబు:
ఈ పురాతన కుండలో ధాన్యం నిల్వ ఉంచుకొనేవారని భావిస్తున్నాను. అలాగే వంటకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.
6th Class Social Textbook Page No.61
ప్రశ్న 12.
వంట చేయడానికి, ధాన్యం నిల్వ చేయడానికి ఆధునిక కాలంలో వాడుతున్న పరికరాలను పేర్కొనండి.
జవాబు:
వంట చేయడానికి | ధాన్యం నిల్వ చేయడానికి |
• గ్యాస్టవ్, ఇండక్షన్ స్టవ్ | • గాలి, వేడి, తేమ ధాన్యంకు హాని కల్గించే అంశాలు వీటి నుండి రక్షణకై గ్లాసు, ప్లాస్టిక్, స్టీల్ అల్యూమినియం కంటైనర్స్ వాడతారు. |
• ఎలక్ట్రిక్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్ | |
• ప్యాన్, స్టీల్ పాత్రలు | |
• ఓవెన్, టోస్టర్ | • రిఫ్రిజిరేటర్ |
• గ్రిల్ (ఎలక్ట్రిక్) | • జాడీలు |
• స్టీల్ డబ్బాలు | |
• కోల్డ్ స్టోరేజీలు (శీతల గిడ్డంగులు) |