SCERT AP 6th Class Social Study Material Pdf 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Social Solutions 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
6th Class Social 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
భూ స్వరూపం అనగా నేమి?
జవాబు:
మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. కొన్నిచోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాల మైదానాలు నుండి లోయల వరకు ఈ అంతరాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటినే భూస్వరూపాలని పిలుస్తారు.
ప్రశ్న 2.
భూ స్వరూపాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చును?
జవాబు:
భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఈ భూస్వరూపాల ఎత్తు సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు.
ప్రశ్న 3.
డెల్టా ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
నది సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్యభాగంలో ఇసుక, మెత్తటి మట్టి (ఒండ్రు) మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ‘A’ త్రిభుజాకారం (డెల్టా)లో ఉంటాయి. ఇవి చాలా సారవంతంగా ఉంటాయి.
ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలలో ఎందువలన జనసాంద్రత అధికంగా ఉంటుంది?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :
- మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
- భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
- మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
- ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
- వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
- మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
- మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
ఉదా : సింధూ నాగరికత.
ప్రశ్న 5.
విభిన్న భూస్వరూపాలలోని వివిధ రకాల నేలలను పోలండి.
జవాబు:
మైదానాల నేలలు | పీఠభూముల నేలలు | పర్వత (కొండ) ప్రాంత నేలలు |
ఇవి సారవంతమైన ఒండ్రు, నల్లరేగడి నేలలు. | ఇవి తక్కువ సారవంతమైన నేలలు. ఎర్ర, లాటరైట్, నల్లరేగడి నేలలు. | రాతి పొరలతో కూడిన ఎర్ర నేలలు. |
ఇవి తేమను ఎక్కువ నిలువ చేసుకుంటాయి. | ఇవి తేమను తక్కువ నిలువ చేసుకుంటాయి. | ఇవి తేమను నిల్వ చేసుకోవు. |
ఇవి నదీతీరాలలో ఉంటాయి. | ఇవి కొండల పాదాల దగ్గరగాని లేదా కొండలతో నిండిగాని ఉంటాయి. | కొండ ఉపరితలంపై ఉంటాయి. |
ఇవి సం||రానికి మూడు పంటలకు అనుకూలం. | ఇవి సం||రానికి ఒక పంటకి కూడా అనుకూలం అని చెప్పలేము. | పానీయపు పంటలకు అనుకూలం పోడు వ్యవసాయం చేస్తారు. |
ప్రశ్న 6.
ప్రభుత్వం కొన్ని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా ఎందుకు గుర్తిస్తుంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం. వర్షం తక్కువ’ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు. కరవు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరవుకి గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది.
ప్రశ్న 7.
“భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలను నిర్ధారిస్తాయి”. వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని ఈ భూస్వరూపాల కింద విస్తరించియున్న వివిధ ప్రాంతాలలో విభిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణస్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాలలోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందులు పెంపకం, కోళ్ళ ఫారాలు, రైసు మిల్లులలో పనిచేయడం మైదాన ప్రాంతాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాలలో చేపడతారు.
పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, తేనె, జిగురు వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలులు కాఫీ, టీ మొదలగు పంటల సాగుకి అనుకూలమైన శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోనెలు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఇలా భూస్వరూపాలలో వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని వృత్తులు, ఆహార పద్ధతులు, సహజ జీవజాలంపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని శీతోష్ణస్థితులపై అక్కడి వృక్ష, జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్తితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.
ప్రశ్న 8.
మీగ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవేనా? మీ జవాబు అవును, కాదు ఏదైనా తగిన కారణాలు రాయండి.
జవాబు:
మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (అవును)
కారణం:
- మా గ్రామం మైదాన ప్రాంతంలో ఉంది.
- ఇక్కడి నేలలన్నీ సారవంతమైనవి.
- కొంత పల్లపు (మాగాణి), కొంత మెరక (మెట్ట) భూములున్నాయి.
- దాదాపు అన్ని భూములకు నీటి సౌకర్యం (కాలువలు, బోరుబావులు) కలదు.
మా గ్రామంలో ఉండే అన్ని ప్రాంతాలు వ్యవసాయక దిగుబడిని ఇచ్చేవి (కాదు)
కారణం:
- మా గ్రామంలో కొంత ప్రాంతం గుట్టలు, మిట్లతో (కొండలతో) కూడి ఉంది.
- ఇక్కడి నేలలన్ని వ్యవసాయంకు అనుకూలంగా ఉండవు.
- నీటి సౌకర్యం కూడా అంతగా లేదు. కొన్ని భూములకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది.
- ఎక్కువగా వర్షపాతం మీద ఆధారపడటం.
ప్రశ్న 9.
గిరిజనుల జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా నీవు భావిస్తున్నావా?
జవాబు:
గిరిజనులు జీవనవిధానాన్ని పరిరక్షించడం ఎంతో ముఖ్యం, అవసరం కూడా అని నేను భావిస్తున్నాను.
- గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు.
- వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహనని కలిగి ఉంటారు, కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వారు ఇష్టపడతారు.
- వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న ఈ సమూహాల జీవన విధానాన్ని పరిరక్షించాల్సిందే. వీరి సంస్కృతి మరియు నాగరికత ప్రాచీన గిరిజనుల చరిత్రకు నిదర్శనం.
- పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వీరు జీవనాన్ని సాగిస్తారు. అందువల్ల వీరి జీవన విధానాన్ని పరిరక్షించడం ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.
ప్రశ్న 10.
గిరిజనుల పెరటితోట ఎందువలన ముఖ్యమైనది?
జవాబు:
అటవీ ప్రాంతాలలో ఉండే గుడిసెలకి వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మిస్తారు. పెరటితోట కొరకు ఈ భూమిని చదును చేసిన సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారుచేస్తారు. ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలను ఇక్కడ పండిస్తారు. కావున గిరిజనుల పెరటితోట ముఖ్యమైనది.
ప్రశ్న 11.
మైదాన ప్రాంతంలో వ్యవసాయం ఎందుకు లాభదాయకమైన వృత్తి వివరించండి.
జవాబు:
- ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
- లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
- అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
- పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్యం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
- వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.
12. తూర్పు కనుమలలో ఎత్తయిన శిఖరం ………….. (అరోమ కొండ (జిందగడ)
13. …….. లో చాలాభాగం దక్కన్ పీఠభూమిలో కలదు. (రాయలసీమ)
14. మైదాన ప్రాంతాలలో ………… పంట ఎక్కువగా పండించబడుతుంది. (వరి)
15. తూర్పు కనుమలలోని కొండలు ………….. చే ఏర్పడినవి. (ఖాండలైట్, చార్నో కైట్)
16. కొండ ప్రాంతాలలోని ప్రజలు …………. నుంచి నీరు తెచ్చుకుంటారు. (చిన్నవాగులు, నీటి ఊటల)
17. …………. నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి. (చౌడు)
18. మైదాన ప్రాంతాలు ……………. కురిసే నేలలు. (ఋతుపవన వర్షాలు)
19. పీఠభూములు వీటికి ప్రసిద్ధి
అ) కూరగాయలు
ఆ) ఖనిజాలు
ఇ) జనాభా
ఈ) పంటలు
జవాబు:
ఆ) ఖనిజాలు
20. నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి?
అ) పత్తి
ఆ) చిరుధాన్యాలు
ఇ) కూరగాయలు
ఈ) గోధుమ
జవాబు:
అ) పత్తి
21. కోస్తా ఆంధ్రాలో జిల్లాలు కలవు.
అ) 6
ఆ) 4
ఇ) 9
ఈ) 5
జవాబు:
ఇ) 9
22. ఈ కింది పట్టికను సరైన సమాచారంతో నింపండి.
జవాబు:
6th Class Social Studies 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు InText Questions and Answers
6th Class Social Textbook Page No.41
ప్రశ్న 1.
పై చిత్రం చూసి భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
పర్వతాలు (కొండలు), పీఠభూములు, మైదానం.
ప్రశ్న 2.
మీ గ్రామం/పట్టణం పరిసరాలలో ఉన్న భూస్వరూపాల పేర్లు వ్రాయండి.
జవాబు:
మా గ్రామం పరిసరాలలో మైదానం, కొండలు ఉన్నాయి.
ప్రశ్న 3.
‘మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం’ కారణం చెప్పండి.
జవాబు:
మైదాన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం సులభం కారణం:
- ఇవి సమతలంగా ఉంటాయి, రోడ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి.
- మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంకు ఖర్చు తక్కువవుతంది..
- రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.
6th Class Social Textbook Page No.42
ప్రశ్న 4.
మైదాన ప్రాంతాలు ఎందువలన ఎక్కువ జనసాంద్రతను కలిగి ఉంటాయి?
జవాబు:
మైదాన ప్రాంతాలలో జనసాంద్రత అధికంగా ఉండటానికి గల కారణాలు :
- మైదాన ప్రాంతాల్లోని నేలలు సారవంతంగా ఉండి మంచి పంటల దిగుబడినిస్తాయి.
- భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అనేక రకాల పంటలు పండించడానికి అనుకూలమైన నేలలున్నాయి.
- మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన నగరాలకు ఆలవాలంగా ఉన్నాయి.
- ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, చెందుతున్నాయి.
- వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
- మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన “సాగు నీరు, త్రాగునీరు” వసతులు కల్గి ఉండి ఇండ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండి జననివాస యోగ్యంగా ఉన్నాయి.
- మైదాన ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి మానవ ఆవాసాలకు నిలయం.
ఉదా : సింధూ నాగరికత.
ప్రశ్న 5.
సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి, జీవన ప్రమాణం కలిగి ఉంటాయి? ఎందువలన?
జవాబు:
మైదాన ప్రాంతాలలో ఉండే గ్రామాలు మంచి ఉపాధి జీవన ప్రమాణం కల్గి ఉండటానికి కారణం :
- ఈ ప్రాంతాల్లో సారవంతమైన నేలలు ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
- వ్యవసాయదారులు మిగులు సొమ్మును పెట్టుబడిగా మార్చి పరిశ్రమల స్థాపనకు దోహదం చేయటం వలన వృత్తి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.
ఉదా : రైసుమిల్లులు, చక్కెర కర్మాగారాలు మొ||నవి. - మెరుగైన రవాణా సౌకర్యాలుండటం వలన (ఎగుమతులు, దిగుమతులు) వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి .. చెంది ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
- అనేక రకాల ఇతర వృత్తులు కూడా అధికంగా వృద్ధి చెంది ఉండటం.
ప్రశ్న 6.
ఏరకమైన నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం?
జవాబు:
మైదాన ప్రాంతంలోని ఒండ్రు (డెల్టా), నల్లరేగడి నేలలు వ్యవసాయానికి ఎక్కువ అనుకూలం. నేలలతోపాటు నీటిసౌకర్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రశ్న 7.
పైన ఉన్న పర్వతాలు, పీఠభూమి, మైదానాలు చిత్రాలను చూసి మీ ప్రాంతం దేనిని పోలి ఉందో గుర్తించండి.
జవాబు:
మా ప్రాంతం మైదాన ప్రాంతాన్ని పోలి ఉంది. (నోట్ : విద్యార్థులు, మీ ప్రాంతాలను బట్టి జవాబు రాయగలరు.)
6th Class Social Textbook Page No.43 & 44
ప్రశ్న 8.
పటం పరిశీలించి క్రింది ఖాళీలను పూరించండి.
A. ఉత్తరం నుండి దక్షిణం వరకు కోస్తా జిల్లాల పేర్లు.
జవాబు:
- శ్రీకాకుళం
- విజయనగరం
- విశాఖపట్నం
- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- కృష్ణా
- గుంటూరు
- ప్రకాశం
- PSR నెల్లూరు
B. రాయలసీమ జిల్లాల పేర్లు
జవాబు:
- కర్నూలు
- అనంతపురం
- YSR కడప
- చిత్తూరు
C. మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : ……………
మండలం : ……………
జిల్లా : ……………
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : …………………….
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : ……………
జవాబు:
మీ గ్రామం / పట్టణం / నగరం పేరు : రాయపూడి
మండలం : తుళ్ళూరు
జిల్లా : గుంటూరు
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న జిల్లాలు : కృష్ణా, ప్రకాశం
మీ జిల్లాకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు : తెలంగాణ
6th Class Social Textbook Page No.46
ప్రశ్న 9.
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి ఎందువలన అనుకూలం? మీ స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో చర్చించి రాయండి.
జవాబు:
కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి అనుకూలం ఎందువలన అంటే,
- కొండ ప్రాంతాలలో నేలలు వాలుగానూ, ఎగుడు దిగుడుగాను ఉంటాయి.
- ఇవి ఎత్తులో ఉండటం వలన నీరు నిలబడకుండా కిందకి జారిపోవడం జరుగుతుంది.
- తేయాకు మొక్కలకు వెచ్చని, ఆర్ధ శీతోష్ణస్థితితోపాటు, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
- కొండ (వాలు) ప్రాంతాలలో సహజంగా కాంటూర్ వ్యవసాయం చేస్తారు. ఇక్కడి నేలల్లో మిగతా పంటలు అంతగా దిగుబడినీయవు.
- కొండప్రాంతాలు వాలుగా ఉండి వర్షపు నీరు మొక్కల మొదళ్ళల్లో నిలబడకుండా చక్కగా పారతాయి. ఇలాంటి సౌకర్యమే ఈ పానీయపు పంటలకు కావాలి అంటే వర్షపాతం సంవత్సరం అంతా అవసరం, అలాగే ఎక్కువ నీరు మొక్కల మొదళ్లల్లో చేరకూడదు.
ప్రశ్న 10.
కొన్ని అటవీ ఉత్పత్తుల పేర్లు రాయుము.
జవాబు:
అటవీ ఉత్పత్తులు :
- వివిధ రకాల పళ్లు (సీతాఫలం, జామ, పనస మొ||నవి)
- వివిధ రకాల దుంపలు (వెదురు, చిలకడదుంప మొ||నవి)
- వివిధ రకాల గింజలు (కుంకుళ్లు, బాదము, షీకాయి మొ||నవి)
- తేనె
- వెదురు, టేకు, సాల్ మొదలైన కలప
- చింతపండు
- విస్తరాకులు
- వంట చెరకు
- ఇతర ఔషధాలు, వనమూలికలు.
ప్రశ్న 11.
నీవెప్పుడైనా అడవికి వెళ్ళావా? వెళ్తే మీ అనుభవాన్ని రాయండి.
జవాబు:
నేను ‘తిరుపతి’ వెళ్ళినప్పుడు, తిరుమల కొండకు నడకదారిన అడవుల్లో నుంచి వెళ్ళాను.
- మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, పర్యావరణం ప్రశాంతంగా ఉంది.
- కోతులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు మొ||న జంతు పక్షులను చూడగలిగాను.
- రకరకాల వృక్ష జాతులను, ఔషధ మొక్కలను పరిశీలించాము.
- కొన్ని ప్రాంతాలలో అడవి దట్టంగా ఉండి కొంచెం భయపడ్డాము.
- కొన్నిచోట్ల ఎక్కువ వాలు ఉండి, కొన్నిచోట్ల పల్లంగా ఉంది.
(నోట్ : విద్యార్థులు ఇలా తమ అనుభవాన్ని స్వంతంగా రాయండి)
6th Class Social Textbook Page No.48
ప్రశ్న 12.
ఈ ప్రాంతంలో (పీఠభూమి) వ్యవసాయ పద్ధతులలో ప్రధానంగా వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకి బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తారు. భూసారం పెంచడానికి, తెగుళ్లను అరికట్టడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు సపోటా, బత్తాయి, మామిడి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలసాయాన్ని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్నచోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్లతోటలను కూడా పెంచుతున్నారు.
ప్రశ్న 13.
భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో బోరుబావులను తవ్వడం వలన మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చును? Page No. 48
జవాబు:
ఎక్కువ సంఖ్యలో బోరు బావులను తవ్వడం వలన ఏర్పడే సమస్యలు :
- బోరు బావులను వాణిజ్య పంటలకు అధికంగా ఉపయోగించడం మూలంగా భూగర్భ జలవనరులు తగ్గిపోతున్నాయి. త్వరలో అంతరించిపోవచ్చు కూడా.
- ఈ ప్రాంతం ఎడారిగా మారిపోవచ్చు, నీటికొరత ఎక్కువ అవ్వవచ్చును.
- నీరు ఇంకే స్వభావాన్ని నేలలు కోల్పోవచ్చు, భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది.
ప్రశ్న 14.
కోస్తా మైదానం మరియు పీఠభూమి ప్రాంతంలోని గ్రామాలలో వర్షపాతం స్థితిని పోల్చండి. Page No. 48
జవాబు:
వర్షపాత పరిస్థితి | |
కోస్తా మైదానము | పీఠభూమి |
1) జూన్ నుండి అక్టోబరు వరకు నైఋతి ఋతుపవన కాలంలో వర్షాన్ని పొందుతుంది. | 1) జూన్ నుండి నవంబరు వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. |
2) నవంబరు నుండి మే వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. | 2) ఈ కాలంలో వర్షపతం ఉండదు. కాబట్టి తరుచూ కరవుకూ గురవుతుంటాయి. |
6th Class Social Textbook Page No.49
ప్రశ్న 15.
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులేవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు.
- గోదావరి
- కృష్ణా
- పెన్నా
ప్రశ్న 16.
కృష్ణా, గోదావరి డెల్టాలలో ఏ జిల్లాలున్నాయో గుర్తించండి.
జవాబు:
- కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణా జిల్లాలు కలవు.
- గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవు.
ప్రశ్న 17.
డెల్టాలు ప్రారంభమయ్యే ప్రాంతంలో గల రెండు ముఖ్య నగరాల పేర్లు రాయండి. కృష్ణానదిలో కలిసే రెండు నదులను గుర్తించండి.
జవాబు:
- విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాలు.
- తుంగభద్ర, మూసి, బుడమేరు, నాగులేరు, భీమ, గుండ్లకమ్మ.
ప్రశ్న 18.
పంట విధానాలలో మార్పులు రావడానికి కారణమేమిటి?
జవాబు:
మైదాన ప్రాంతాల్లో పంట విధానాలలో మార్పు రావడానికి కారణాలు :
- ఆహార పంటల నుండి నగదు/వ్యాపార పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
- పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇవి లాభదాయకంగా ఉంటున్నాయి.
- వీటికి మార్కెటింగ్ సౌకర్యం బాగా ఉంది.
- కాలువలు, బోరుబావుల ద్వారా నీటి సౌకర్యము అందుబాటులో ఉంటుంది.
- యాంత్రీకరణ పెరగటం.
ప్రశ్న 19.
కోస్తా మైదానాలు ఎందువలన మిక్కిలి సారవంతమైనవి?
జవాబు:
కోస్తా (డెల్టా) మైదానాలు మిక్కిలి సారవంతమైనవి ఎందుకంటే :
- ఇక్కడ నదులు అవక్షేపాల వల్ల మిక్కిలి ఒండ్రునేలలు ఉండడం చేత.
- లోతైన, సారవంతమైన, చదునైన నేలలు ఉండటం వలన.
- ఈ మైదాన ప్రాంతాలలో భూగర్భ జలవనరుల లభ్యత కూడా అధికంగా ఉంటుంది.
- ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి, వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.
ప్రశ్న 20.
వ్యవసాయం మైదాన ప్రాంతాలలో ఎందువలన ప్రధాన వృత్తిగా ఉన్నది?
జవాబు:
- ఇక్కడ అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
- లోతైన, సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంటసాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది.
- అంతేగాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములుగా కూడా ఉపకరిస్తాయి.
- పంటల దిగుబడికి అవసరమైన మెరుగైన నీటి సౌకర్వం ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది
- వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల సౌకర్యం, రవాణా సౌకర్యాలు కల్గి ఉంటాయి.