SCERT AP 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 6th Lesson ప్రాథమిక అంకగణితం Unit Exercise

ప్రశ్న 1.
4 భుజాల సంవృతపటంను గీసి, దానిని కొన్ని సమాన భాగాలు చేయండి. రంగు వేసిన, వేయని భాగాల నిష్పత్తి 1 : 3 అయ్యేటట్లు రంగు వేయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 1
రంగు వేసిన, వేయని భాగాల నిష్పత్తి = 1 : 3

ప్రశ్న 2.
రాము తన వద్ద ఉన్న సొమ్ములో \(\frac {2}{5}\)వ భాగంతో కథల పుస్తకాన్ని కొన్నాడు. తను తెచ్చుకున్న వానిలో ఎంత శాతం కథల పుస్తకానికి ఖర్చు చేశాడు?
సాధన.
రాము తన వద్ద ఉన్న సొమ్ములో కథల పుస్తకాలను కొన్న భాగం = \(\frac {2}{5}\)
రాము తన వద్ద ఉన్న సొమ్ములో కథల పుస్తకాలను కొనుటకు ఖర్చు చేసిన సొమ్ము శాతం
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 2

ప్రశ్న 3.
₹72,000 లను కేశవ్, డేవిలకు 5 : 4 నిష్పత్తిలో పంచండి.
సాధన.
కేశవ్, డేవిడ్లు పంచుకొనవలసిన సొమ్ము = ₹ 72,000
పంచుకొనవలసిన నిష్పత్తి = 5 : 4
కేశవ్ వాటాను సూచించు భిన్నం = \(\frac {5}{9}\)
డేవిడ్ వాటాను సూచించు భిన్నం = \(\frac {4}{9}\)
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 3

AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise

ప్రశ్న 4.
3 నెలలలో కుమార్ ₹15,000 లు సంపాదిస్తున్నాడు. ప్రతి నెల సంపాదన సమానమైన
అ) 5 నెలలలో అతను ఎంత సంపాదిస్తున్నాడు?
ఆ) ఎన్ని నెలలలో అతను ₹ 95,000 సంపాదించగలడు?
సాధన.
3 నెలలలో కుమార్ సంపాదన = ₹ 15,000
15,000 1 నెలలో కుమార్ సంపాదన = \(\frac {15,000}{3}\) = ₹ 5,000
అ) 5 నెలలలో కుమార్ సంపాదించే సొమ్ము = ₹ 5000 × 5 = ₹ 25,000
ఆ) ₹95000 సంపాదించుటకు కుమారు అవసరమగు నెలలు =
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 4
= 19 నెలలు = 1 సం॥ 7 నెలలు

ప్రశ్న 5.
16 కుర్చీల ధర ₹4,800 అయిన ₹ 6,600 లకు ఎన్ని కుర్చీలు కొనవచ్చును ?
సాధన.
16 కుర్చీల ధర = ₹4,800
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 5

ప్రశ్న 6.
1 నుండి 30 సంఖ్యలలో ఒకట్ల స్థానంలో 1 లేదా 9 ఉండే సంఖ్యల శాతమెంత ?
సాధన.
1 నుండి 30 గల మొత్తం సంఖ్యల సంఖ్య = 30
దీనిలో ఒకట్ల స్థానంలో 1 లేదా 9 గల సంఖ్యలు = 1, 9, 11, 19, 21, 29
దీని సంఖ్య = 6
∴ 1 నుండి 30 వరకు గల సంఖ్యలలో 1 లేదా 9 ఒకట్ల స్థానంలో గల సంఖ్యలను సూచించు భిన్నం = \(\frac {6}{30}\) = \(\frac {1}{5}\)
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 6

ప్రశ్న 7.
M = z లో y% మరియు N = yలో z% అయిన కింది వానిలో ఏది సత్యం?
అ) M అనునది N కన్నా తక్కువ
ఆ) M అనునది N కన్నా ఎక్కువ
ఇ) M = N
ఈ) M, Nల మధ్య సంబంధం తెలియపరచలేం
సాధన.
M = z లో y% = z × \(\frac{y}{100}=\frac{y z}{100}\)
N = y లో z% = y × \(\frac{z}{100}=\frac{y z}{100}\)
∴ M = N

AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise

ప్రశ్న 8.
ఒక కళాశాలలో 65% మంది విద్యార్థులు 20 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ గలవారు. 20 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 20 సంవత్సరాల వయస్సు గల్గిన 42 మందిలో \(\frac {2}{3}\) వ భాగం అయిన కళాశాలలో ఉన్న మొత్తం విద్యార్థులు ఎందరు?
సాధన.
కళాశాలలో 20 సంవత్సరాల వయస్సు గలవారు = 42
కళాశాలలో 20 సం॥ వయస్సు పైబడినవారు = 20 సం॥ వయస్సు కల్గిన 42 మందిలో \(\frac {2}{3}\) వ భాగం
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 7
∴ 20 సం॥ మరియు 20 సం॥ పైబడిన వయస్సుగల విద్యార్థులు = 42 + 28 = 70
20 సం॥ కన్నా తక్కువ వయస్సు గలవారు = 65%
కావున 20 సం॥ మరియు 20 సం॥ పైబడిన వారి శాతం = 100 – 65 = 35%
మొత్తం విద్యార్థులు x అనుకొంటే
x లో 35% = 70
x × \(\frac {35}{100}\) = 70
AP Board 6th Class Maths Solutions Chapter 6 ప్రాథమిక అంకగణితం Unit Exercise 8
∴ కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య = 200