SCERT AP 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 2nd Lesson పూర్ణాంకాలు Exercise 2.2

ప్రశ్న 1.
తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి.
అ) 238 + 695 + 162
ఆ) 154 + 197 + 46 + 203
సాధన.
అ) 238 + 695 + 162 = 238 + 162 + 695 (స్థిత్యంతర ధర్మం )
= (238 + 162) + 695 (సహచర ధర్మం )
= 400 + 695 = 1095

ఆ) 154 + 197 + 46 + 203 = 154 + 46 + 197 + 203 (స్థిత్యంతర ధర్మం )
= (154 + 46) + (197 + 203) (సహచర ధర్మం)
= 200 + 400 = 600

ప్రశ్న 2.
తగిన విధంగా సంఖ్యల స్థానాలు మార్చుకొని లబ్దాన్ని కనుగొనండి.
అ) 25 × 1963 × 4
ఆ) 20 × 255 × 50 × 6
సాధన.
అ) 25 × 1963 × 4 = 25 × (4 × 1963) (స్థిత్యంతర ధర్మం)
= (25 × 4) × 1963 (సహచర ధర్మం)
= 100 × 1963 = 196300

ఆ) 20 × 255 × 50 × 6 = 20 × 50 × 255 × 6 (స్థిత్యంతర ధర్మం )
= (20 × 50) × (255 × 6) (సహచర ధర్మం)
= 1000 × 1530 = 15,30,000

AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.2

ప్రశ్న 3.
తగిన ధర్మాలనుపయోగించి కింది లబ్దాలను కనుగొనండి.
అ) 205 × 1989
ఆ) 1991 × 1005
సాధన.
అ) 205 × 1989 = (200 + 5) × 1989
= (200 × 1989) + (5 × 1989) (విభాగన్యా యము)
= 397800 + 9945 = 407745

ఆ) 1991 × 1005 = 1991 × (1000 + 5)
= (1991 × 1000) + (1991 × 5) (విభాగ న్యాయము)
= 1991000 + 9955 = 2000955

ప్రశ్న 4.
ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్ల పాలను, సాయంత్రం 44 లీటర్ల పాలను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు. ఒక లీటరు పాల ధర ₹50 అయితే, అతనికి ఒక రోజుకు ఎంత డబ్బు వస్తుంది?
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.2 1
ఒక లీటరు పాల ధర = ₹50
∴ ఒక రోజుకు వచ్చు డబ్బు = 100 × 50 = ₹ 5000
(లేదా)
పాలవ్యాపారి ఉదయం సరఫరా చేసే పాలు = 56 లీ.
ఒక లీటరు పాలధర = ₹50
ఉదయం సరఫరా చేసే పాలకు వచ్చు డబ్బు = 56 × 50 ప
ాల వ్యాపారి సాయంత్రం సరఫరా చేసే పాలు = 44 లీ.
సాయంత్రం సరఫరా చేసే పాలకు వచ్చు డబ్బు = ₹ 44 × 50
∴ ఒక రోజుకు వచ్చు డబ్బు = 56 × 50 + 44 × 50
= (56 + 44) × 50
= 100 × 50
= ₹ 5000