SCERT AP 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise

ప్రశ్న 1.
కింది వాటిని అంకెలలో రాయండి.
అ) వంద కోట్ల, వంద వేలు మరియు వంద.
సాధన.
100,01,00,100

ఆ) 20 బిలియన్ల నాలుగు వందల తొంభై ఏడు మిలియన్ల తొంభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు.
సాధన.
20,497,096,472

ప్రశ్న 2.
కింది సంఖ్యలను హిందూ సంఖ్యామానంలో మరియు అంతర్జాతీయ సంఖ్యామానంలోనూ అక్షరాలలో రాయండి.
అ) 8275678960
ఆ) 5724500327
ఇ) 1234567890
సాధన.
అ) 8275678960
హిందూ సంఖ్యామానం : 827,56,78,960
ఎనిమిది వందల ఇరవైఏడు కోట్ల యాభై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై.
అంతర్జాతీయ సంఖ్యామానం : 8,275,678,960
ఎనిమిది బిలియన్ల రెండు వందల డెబ్బై ఐదు మిలియన్ల ఆరు వందల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై.

ఆ) 5724500327
హిందూ సంఖ్యామానం : 572,45,00,327
ఐదు వందల డెబ్బై రెండు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వందల ఇరవై ఏడు.
అంతర్జాతీయ సంఖ్యామానం : 5,724,500,327
ఐదు బిలియన్ల ఏడు వందల ఇరవై నాలుగు మిలియన్ల ఐదు వందల వేల మూడు వందల ఇరవై ఏడు.

ఇ) 1234567890
హిందూ సంఖ్యామానం : 123,45,67,890
నూట ఇరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై.
అంతర్జాతీయ సంఖ్యామానం : 1,234,567,890
ఒక బిలియన్ రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ల ఐదు వందల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై.

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise

ప్రశ్న 3.
98978056 సంఖ్యలో 8 ల స్థాన విలువల భేదాన్ని కనుగొనండి.
సాధన.
హిందూ సంఖ్యామానం :
ఇచ్చిన సంఖ్య = 9,89,78,056
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise 1

అంతర్జాతీయ సంఖ్యామానం :
ఇచ్చిన సంఖ్య = 98,978,056
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise 2

ప్రశ్న 4.
ఆరు అంకెల సంఖ్యలెన్ని ఉన్నాయి?
సాధన.
ఆరు అంకెల పెద్ద సంఖ్య = 9,99,999
ఆరు అంకెల చిన్న సంఖ్య = 1,00,000
ఆరు అంకెలు కలిగిన మొత్తం సంఖ్యల సంఖ్య = 9,99,999 – 1,00,000 + 1 = 9,00,000

ప్రశ్న 5.
ఎన్ని వేలయితే ఒక మిలియన్ అవుతుంది?
సాధన.
1 మిలియన్ = 1,000,000 = 1000 వేలు
1 మిలియన్ = 1,000 వేలు

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise

ప్రశ్న 6.
‘5’ మొబైల్ నంబర్లను సేకరించి వాటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమాలలో రాయండి.
సాధన.
ఏవైనా 5 మొబైల్ నంబర్లు : 9247568320, 9849197602, 8125646682, 6305481954, 7702177046
ఆరోహణక్రమం : 6305481954, 7702177046, 8125646682, 9247568320, 9849197602
అవరోహణక్రమం : 9849197602, 9247568320, 8125646682, 7702177046, 6305481954

ప్రశ్న 7.
ప్రవళికి ఒక సోదరి మరియు ఒక సోదరుడు ఉన్నారు. ప్రవళి తండ్రిగారు 1 మిలియన్‌ రూపాయలను సంపాదించి వారికి సమానంగా పంచదలచారు. ప్రతి ఒక్కరూ పొందే సొమ్మును (సుమారు) లక్షలలో అంచనావేసి, భాగహారం చేసి సరిచూడండి.
సాధన.
ఒక మిలియన్ = 10,00,000 = 10 లక్షలు
ప్రవళి తండ్రిగారు 1 మిలియన్ (10 లక్షలు) రూపాయలను ముగ్గురు పిల్లలకి సమానంగా పంచదలిచారు.
ఒక్కొక్కరికి పంచిన సొమ్ము = 10 లక్షలు + 3 = ₹ 3,33,333
= ₹3,00,000 (సుమారుగా)
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise 3

ప్రశ్న 8.
బ్యాంకు ప్రతి రైతుకు ₹ 13,500 ఋణం ఇవ్వాలనుకుంది. ఒక జిల్లాలో 2,27,856 రైతులున్నారు. అయిన బ్యాంకు, ఆ జిల్లాలోని రైతులందరికి ఋణం ఇవ్వడానికి అవసరమైన సొమ్మును అంచనా వేయండి. లెక్కించండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise 4

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Unit Exercise

ప్రశ్న 9.
క్యూసిక్, టి.యం.సి., మెట్రిక్ టన్ను, కిలోమీటరు పదాలను వివరించండి.
సాధన.
i) క్యూసెక్ : ఒక్క సెకను కాలంలో ఎన్ని ఘనపుటడుగులు ప్రవాహం ద్వారా ప్రయాణిస్తున్నాయో ఆ సంఖ్యను క్యూసెక్ (cubic feet per second) అంటారు.
1 క్యూసెక్ = 0.028316 ఘనపుటడుగులు (ఒక సెకను కాలం)
= 28.316 లీటర్లు (సెకనుకి)
ద్రవాల ఘనపరిమాణాన్ని బ్రిటిష్ కొలమానమైన fps (foot-pound-second) ప్రమాణాలలో ఘనపుటడుగు (cubic foot) లలో కొలుస్తారు.

ii) టి.యం.సి. : వేయి మిలియన్ల ఘనపుటడుగులు లేదా టి.యం.సి. అనే పదాన్ని సాధారణంగా జలాశయం లేదా నది ప్రవాహంలో నీటి పరిమాణాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు.
1 టి.యం.సి. = 0.28316000000 లీటర్లు
= 28.316 బిలియన్ లీటర్లు
= 2831.6 కోట్ల లీటర్లు

iii) మెట్రిక్ టన్ను : బరువులను కొలవడానికి మెట్రిక్ టన్నును ప్రమాణంగా వాడతారు.
మెట్రిక్ టన్ను = 1000 కి.గ్రా. = 10 క్వింటాళ్ళు
వరి, పప్పులు కొలవటానికి మెట్రిక్ టన్నును ప్రమాణంగా వాడతారు.

iv) కిలోమీటరు : పొడవులను కొలవడానికి కిలోమీటరును ప్రమాణంగా వాడతారు.
1 కిలోమీటరు = 1000 మీ.
పల్లెలు, గ్రామాలు, పట్టణాల మధ్య దూరాలను కొలవడానికి దీనిని వాడతారు.