SCERT AP 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు Exercise 1.4

ప్రశ్న 1.
పెద్ద సంఖ్యలను ఉపయోగించే కొన్ని నిత్య జీవిత సందర్భాలను రాయండి.
సాధన.
i) సముద్రంలో కలిసిపోయిన వరదనీరు లీటర్లలో
ii) సూర్యునికి, భూమికి మధ్య గల దూరము మీటర్లలో
iii) కరోనా సమయంలో భారత ప్రభుత్వం ఖర్చుచేసిన డబ్బు
iv) ఆంధ్రప్రదేశ్ 2020 బడ్జెట్.

ప్రశ్న 2.
ఒక పెట్టెలో 15 గ్రాముల బరువున్న 3,00,000 ల మందు బిళ్ళలు కలవు. అయిన పెట్టెలోని మందుబిళ్ళల మొత్తం బరువును గ్రాములు, కిలోగ్రాములలో చెప్పండి.
సాధన.
పెట్టెలోని మొత్తం మందు బిళ్ళలు = 3,00,000
ఒక్కొక్క మందు బిళ్ళ బరువు : 15 గ్రా.
పెట్టెలోని మందు బిళ్ళల మొత్తం బరువు = 3,00,000 × 15 గ్రా.
= 45,00,000 గ్రా.
1000 గ్రా. = 1 కి.గ్రా. అని మనకు తెలుసు.
1 గ్రా. \(\frac {1}{1000}\) కి.గ్రా.,
∴ 45,00,000 గ్రా. = 45,00,000 × \(\frac {1}{1000}\) కి.గ్రా. = 4,500 కి.గ్రా.

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4

ప్రశ్న 3.
దామోదర్ కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డలు కొనాలనుకున్నాడు. ప్రతి ఉల్లిగడ్డ సంచి బరువు 45 కి.గ్రా. అతను ఒక్కొక్కటి 45 కి.గ్రా. ల బరువు గల 326 సంచులను లారీలో నింపాడు. అయిన ఉల్లిగడ్డల మొత్తము బరువును కిలోగ్రాములలో మరియు క్వింటాళ్లలో కనుగొనండి.
సాధన.
దామోదర్ లారీలో నింపిన ఉల్లిగడ్డల సంచుల సంఖ్య = 326
ఒక్కొక్క ఉల్లిగడ్డల సంచి బరువు = 45 కి.గ్రా.
∴ ఉల్లిగడ్డల మొత్తం బరువు = 326 × 45 = 14,670 కి.గ్రా.
100 కి.గ్రా. = 1 క్వింటాల్ అని మనకు తెలుసు.
1 కి.గ్రా. \(\frac {1}{100}\) క్వింటాల్
∴ 14,670 కి.గ్రా. = \(\frac {14,670}{100}\) క్వింటాళ్ళు = 146.7 క్వింటాళ్ళు

ప్రశ్న 4.
2011 జనాభా లెక్కల ప్రకారము నాలుగు దక్షిణ భారత రాష్ట్రాల జనాభా:
ఆంధ్రప్రదేశ్ : 8,46,65,533, కర్ణాటక : 6,11,30,704, తమిళనాడు : 7,21,38,958 మరియు కేరళ : 3,33,87,677. అయిన దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా ఎంత?
సాధన.
2011 జనాభా లెక్కల ప్రకారం,
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4 1

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4

ప్రశ్న 5.
ఒక ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు అంతర్జాతీయ మ్యాచ్ లో ఇంతవరకు 28,754 పరుగులు చేశారు. అతని కెరీర్లో 50,000 పరుగులు పూర్తి చేయాలనుకున్నాడు. దానికి అతను ఇంకా ఎన్ని పరుగులు చేయాలి?
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4 2

ప్రశ్న 6.
ఒక ఎన్నికలో విజేతకు 1,32,356 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 42,246 ఓట్లు వచ్చాయి. విజేత మెజారిటీని కనుగొనండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4 3

ప్రశ్న 7.
6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటితో ఏర్పడే 6-అంకెల అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యలను రాసి, వాటి మొత్తం మరియు తేడాలను కనుగొనండి.
సాధన.
6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటితో ఏర్పడే 6-అంకెల
అతి పెద్ద సంఖ్య = 9,87,640
అతిచిన్న సంఖ్య = 4,06,789
మొత్తం = 9,87,640 + 4,06,789 = 13,94,429
భేదం = 9,87,640 – 4,06,789 = 5,80,851

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.4

ప్రశ్న 8.
హరిత దగ్గర ₹ 1,00,000 లున్నవి. ఆమె ఒక్కొక్కటి ₹ 726 ల ఖరీదు కలిగిన 124 సీలింగ్ ఫ్యాన్లు కొనటానికి డబ్బులు చెల్లించిన ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత?
సాధన.
హరిత దగ్గర గల సొమ్మ = ₹ 1,00,000
హరిత కొన్న సీలింగ్ ఫ్యాన్స్ సంఖ్య = 124
ఒక్కొక్క సీలింగ్ ఫ్యాన్ ఖరీదు = ₹ 726
సీలింగ్ ఫ్యాన్లు కొనటానికి హరిత చెల్లించిన సొమ్ము = 124 × 726 = ₹ 90,024
హరిత దగ్గర మిగిలిన సొమ్ము = ₹ 1,00,000 – 90,024 = ₹ 9,976