SCERT AP 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు Exercise 1.2

ప్రశ్న 1.
కింది ప్రతి దానిని సంఖ్యారూపంలో రాయండి.
అ) అరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంబై రెండు వేల ఐదు వందల రెండు.
సాధన.
60, 75, 92, 502

ఆ) తొమ్మిది వందల నలభైనాలుగు కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు.
సాధన.
944, 06, 55, 486

ఇ) పదికోట్ల పదివేల పది.
సాధన.
10,00,10,010

ప్రశ్న 2.
కింది సంఖ్యల సరైన స్థానాలలో కామాలు ఉంచి, గ్రూపులుగా వేరు చేసి, అక్షరాలలో రాయండి.
అ) 57657560
అ) 70560762
ఇ) 97256775613
సాధన.
అ) 5,76,57,560 : ఐదుకోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై.
ఆ) 7,05,60,762 : ఏడుకోట్ల ఐదు లక్షల అరవై వేల ఏడు వందల అరవై రెండు.
ఇ) 9725,67,75,613 : తొమ్మిదివేల ఏడు వందల ఇరవై ఐదుకోట్ల అరవైఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఆరువందల పదమూడు.

AP Board 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.2

ప్రశ్న 3.
కింది వాటిని విస్తరణ రూపంలో రాయండి.
అ) 756723
ఆ) 60567234
ఇ) 8500756762
సాధన.
అ) 756723 = 7,56,723
విస్తరణ రూపం : 7 × 1,00,000 + 5 × 10,000 + 6 × 1,000 + 7 × 100 + 2 × 10 + 3 × 1
: 7 లక్షలు + 5 పదివేలు + 6 వేలు + 7 వందలు + 2 పదులు + 3 ఒకట్లు

ఆ) 60567234 = 6,05,67,234
విస్తరణ రూపం : 6 × 1,00,00,000 + 5 × 1,00,000 + 6 × 10,000 + 7 × 1,000 + 2 × 100 + 3 × 10 + 4 × 1
: 6 కోట్లు + 5 లక్షలు + 6 పదివేలు + 7 వేలు + 2 వందలు + 3 పదులు + 4 ఒకట్లు

ఇ) 8500756762 = 8,50,07,56,762
విస్తరణ రూపం : 8 × 1,00,00,00,000 + 5 × 10,00,00,000 + 7 × 1,00,000 + 5 × 10,000 + 6 × 1000 + 7 × 100 + 6 × 10 + 2 × 1
: 8 వందకోట్లు + 5 పది కోట్లు + 7 లక్షలు + 5 పదివేలు + 6 వేలు + 7 వందలు + 6 పదులు + 2 ఒకట్లు

ప్రశ్న 4.
86456792 సంఖ్యలో 6 స్థానవిలువ, సహజ విలువల భేదాన్ని కనుక్కోండి.
సాధన.
ఇచ్చిన సంఖ్యలో కామాలుంచి గ్రూపులుగా వేరుచేసి రాయగా 8,64,56,792.
i) వేల స్థానంలో గల 6 యొక్క స్థాన విలువ = 6 × 1000 = 6,000
6 యొక్క సహజవిలువ = 6.
భేదం = 6,000 – 6 = 5,994

ii) పది లక్షల స్థానంలో గల 6 యొక్క స్థాన విలువ = 6 × 10,00,000 = 60,00,000
6 యొక్క సహజవిలువ = 6
భేదం = 60,00,000 – 6 = 59,99,994