SCERT AP 10th Class Social Study Material Pdf 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 10th Lesson ప్రపంచీకరణ

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు ఏమిటి ? ఈ అవరోధాలను తొలగించాలని అది ఎందుకు అనుకుంది? (AS1)
జవాబు:
దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించాలని నిర్ణయించింది.

ప్రశ్న 2.
కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఏ విధంగా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీకి కార్మీకుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. దీని మూలంగా కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాలవ్యవధికి నియమించుకొనే అవకాశం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 3.
ఉత్పత్తిని చేపట్టటానికి, దానిని నియంత్రించటానికి, లేదా ఇతర దేశాలలో స్థిరపడటానికి బహుళజాతి సంస్థలు అవలంబించే విధానాలు ఏమిటి? (AS1)
జవాబు:
బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ప్రక్రియను చిన్న భాగాలుగా చేసి ప్రపంచంలో పలుచోట్ల చేబడతాయి. వాటిని చౌకగా ఉత్పత్తి చేయగల ప్రాంతాన్ని దీనికై ఎన్నుకుంటాయి. మార్కెటింగ్ కు సమీపంలోని దేశాలను ఎంపిక చేసుకొని అచ్చట అసెంబ్లింగ్ యూనిట్లనేర్పాటు చేస్తారు. ఇంగ్లీషు మాట్లాడగలిగే జనాభా గల భారతదేశం లాంటి దేశాలలో కస్టమర్ కేర్ సేవలనేర్పాటు చేస్తాయి. వీరు ఆయా దేశాలలోని కొన్ని కంపెనీలతో కలసి తమ సంస్థలనేర్పాటు చేయడం ద్వారా ఆయా దేశాలలో నిలదొక్కుకుంటాయి.

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? దీనికి ప్రతిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ షరతులను కోరాలి? (AS4)
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకొంటాయి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు అధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి మరియు ముడి సరుకులు, మార్కెట్లు గల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాలంటే ఆ దేశాలు సరళీకృత విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా న్యాయపూరిత విధానాలు అవలంబించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు షరతులు విధించాలి.

ప్రశ్న 5.
“ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” ఈ వాక్యాన్ని వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తోంది. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించటం వల్ల ప్రపంచీకరణ ప్రక్రియకు మేలు ఎలా జరిగింది? (AS1)
జవాబు:
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించడం వలన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో విస్తరించి ప్రపంచీకరణకు దోహదం చేసాయి. టెలికమ్యూనికేషన్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వాయిస్ మెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ తో నామమాత్రపు ఖర్చుతో సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో చేరవేయవచ్చు.

ప్రశ్న 7.
దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానానికి విదేశీ వాణిజ్యం ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొత్త ఉదాహరణలతో దీనిని వివరించండి. (AS1)
జవాబు:
దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశం ప్రాచీన కాలం నుండి నూలు వస్త్రాలను అనేక దేశాలకు ఎగుమతి చేసింది. చైనా పట్టు వస్త్రాలను ఆసియా ఖండంలోని అనేక దేశాలకు ఎగుమతి చేసేది. భారతదేశం, ఇండోనేషియాలు సుగంధ ద్రవ్యాలతో వాణిజ్యం చేసినట్లు ఆధారాలున్నాయి.

ప్రశ్న 8.
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇప్పటి నుంచి ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. మీ ఊహలకు కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. 20 సంవత్సరాల తరువాత దేశీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలను తట్టుకోలేక మూతపడవచ్చు. ప్రజలు సేవలు, వస్తువులనే దృష్టిలో పెట్టుకొని స్వదేశీ వస్తువులపై మోజును పూర్తిగా కోల్పోతారు. వైద్యం, విద్యా రంగాలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రాచుర్యం పొందుతాయి. భారతీయ రైల్వేలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రవేశిస్తాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతిపై కూడా వీటి ప్రభావం పడుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

ప్రశ్న 9.
ఇద్దరు వ్యక్తులు వాదించుకోవటం మీరు వింటున్నారు : ఒకరు ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరిచిందని అంటున్నారు. మరొకరు భారతదేశం అభివృద్ధి చెందటానికి ప్రపంచీకరణ సహాయపడుతోందని అంటున్నారు. ఈ వాదనలకు మీరు ఎలా స్పందిస్తారు? (AS2)
జవాబు:
ఇరువురి వాదనలలో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవటం ముఖ్యం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
ఖాళీలను పూరించండి : (AS1)
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. …………………. ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో …………………… పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు ……………………………., ……………………… కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ………………., వల్ల ఉత్పత్తిదారుల మధ్య ………………………. తీవ్రతరం అయ్యింది.
జవాబు:
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు సరళీకృత ఆర్థిక విధానాలు, సెట్ల ఏర్పాటు కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ కొత్త సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీ తీవ్రతరం అయ్యింది.

ప్రశ్న 11.
క్రింది వాటిని జతపరచండి.

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి. (అ) వాహనాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు. (ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు. (ఇ) కాల్ సెంటర్లు
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది. (ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి. (ఉ) వాణిజ్య అవరోధాలు

జవాబు:

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి. (ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు. (ఉ) వాణిజ్య అవరోధాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు. (ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది. (ఇ) కాల్ సెంటర్లు
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి. (అ) వాహనాలు

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ InText Questions and Answers

10th Class Social Textbook Page No.133

ప్రశ్న 1.
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ. ఫోర్డ్ మోటర్స్ అనేక దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది. అందుచే ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి ? ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది?
జవాబు:
ఒక దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టి కంపెనీలు నిర్వహించడాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో 1700 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టింది.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 3.
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టటం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలలో ఎటువంటి అనుసంధానం జరుగుతోంది?
జవాబు:
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టడం వలన ఉత్పత్తి కార్యక్రమాలలో స్థానిక కంపెనీలతో అనుసంధానం చేసుకోవటం, ఇతర దేశాలలో మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

10th Class Social Textbook Page No.136

ప్రశ్న 4.
ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి?
జవాబు:
బహుళ జాతి కంపెనీల పెట్టుబడి ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రవాహం వలన సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడి ప్రపంచీకరణకు దారితీసింది.

ప్రశ్న 5.
దేశాలను అనుసంధానపరిచే వివిధ మార్గాలేవి?
జవాబు:
అధిక దేశీయ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వలన వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగి ఈ దేశాల మధ్య అనుసంధానం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల
అ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని తగ్గిస్తుంది.
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.
ఇ) ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు.
జవాబు:
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు, సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి మధ్యగల సంబంధం ఏమిటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమై ఉండేదా?
జవాబు:
సమాచార పరిజ్ఞానం విస్తరించడంవలననే ప్రపంచీకరణ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమయ్యేది కాదు.

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 8.
విదేశీ వాణిజ్య సరళీకరణ అంటే ఏమి అర్థం చేసుకున్నారు?
జవాబు:
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు గల అవరోధాలను తొలగించటం, విదేశీ కంపెనీలు మనదేశంలో కార్యాలయాలు,కంపెనీలు స్థాపించుటకు అనుమతించడం వంటి చర్యలను విదేశీ వాణిజ్య సరళీకరణ అంటాం.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 9.
దేశాల మధ్య వాణిజ్యం మరింత న్యాయపూరితంగా ఉండటానికి ఏం చేయవచ్చు?
జవాబు:
అన్ని దేశాలు అవరోధాలు తొలగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు దీనికి మినహాయింపు కారాదు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 10.
పెరుగుతున్న పోటీవల్ల రవి చిన్న ఉత్పత్తి కేంద్రం ఏ విధంగా ప్రభావితం అయ్యింది?
జవాబు:
పెరుగుతున్న పోటీవల రవి చిన్న ఉత్పత్తి కేంద్రంలో నేడు ఉత్పత్తి సగం పడిపోయింది. 35 శాతం మంది కార్మికులకు మాత్రమే నేడు పని కల్పించగలుగుతున్నాడు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 11.
ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వ పాత్ర ఉందనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. ఈ రంగాలలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

10th Class Social Textbook Page No.130

ప్రశ్న 12.
మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెదవాళ్లతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
సెల్ ఫోన్లు ఉదాహరణగా తీసుకుంటే జపాన్ దేశానికి చెందిన నోకియా వంటి కంపెనీలు భారతదేశ మార్కెట్ను పాలిస్తున్నాయి. జపాన్ మాత్రమే కాక అనేక బహుళజాతి కంపెనీలు వివిధ వస్తువులను భారతీయ మార్కెట్లో అమ్ముతున్నారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రధానమంత్రి వంటి ప్రముఖుల వద్దనే ఇలాంటి బ్రాండ్లు ఉండేవి. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు చేతి గడియారాలను భారతదేశంలో మార్కెట్ చేశాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 13.
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను నెలకొల్పటం వల్ల ఇటువంటి దేశాలు అందించే పెద్ద మార్కెట్టునే కాకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చు వల్ల కూడా లాభపడతాయి. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో తమ కంపెనీలు నెలకొల్పడం ద్వారా అత్యధిక జనాభా గల ఈ దేశంలో తమ మార్కెట్ ను సులభంగా విస్తరించగలుగుతారు. అదే సమయంలో భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి యిస్తున్న వివిధ రాయితీలు, సరళీకృత ఆర్థిక విధానాలు ద్వారా సులభంగా అనుమతులను పొందడం, శ్రమ , శక్తి, నైపుణ్యం గల కార్మికులు చౌకగా లభించడం వంటి అనుకూల అంశాలతో ఉత్పత్తి ఖర్చు కూడా వీరికి తగ్గుతుంది.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 14.
ప్రపంచవ్యాప్త కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చెయ్యాలని కంపెనీ ఎందుకు అనుకుంటోంది? కింది అంశాలను చర్చించండి.
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చు.
ఆ) ఫోర్డ్ మోటరకు వివిధ విడి భాగాలను అందించే పలు స్థానిక ఉత్పత్తిదారులు ఉండటం,
ఇ) భారతదేశం, చైనాలలోని అధిక సంఖ్యాక కొనుగోలుదారులకు దగ్గరగా ఉండటం.
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తుంది.
దీనికి కారణం :
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చులు తక్కువగా ఉండుట.
ఆ) ఫోర్డ్ మోటరు వివిధ విడి భాగాలను ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు అందుబాటులోకి తేవాలనుకుంటుంది.
ఇ) భారతదేశం, చైనా వేగంగా ప్రపంచంలోని ముఖ్య మార్కెట్లకు విస్తరించడం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 15.
నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి కంపెనీలు దాదాపుగా అమెరికా, జపాను, లేదా ఐరోపా దేశాలకు చెందినవే. ఎందుకో ఊహించగలరా?
జవాబు:
అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందంజలో ఉండటం, సరళీకృత ఆర్థిక విధానాలు పెట్టుబడిదారి వ్యవస్థ చాలాకాలం నుండి అమలులో ఉండటం వలన నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి సంస్థలు ఈ దేశాలలోనే ఉద్భవించాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 16.
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి? గతానికి, ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి?
జవాబు:
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం వాణిజ్యం . ప్రస్తుతం కూడా పరిస్థితులు ఏమంతగా మారలేదు. గతంలో యూరోపియన్ దేశాలు భారతదేశంతోను, ఇతర దక్షిణాసియా దేశాలతోను సముద్ర మార్గాలు ద్వారా వాణిజ్యం నిర్వహించేవారు. ప్రజలు స్థానికంగా తయారయిన వస్తువుల కంటే స్థానికేతర వస్తువుల పట్లనే ఆసక్తి కనబరచేవారు. కాని ప్రస్తుతం మన భారతీయ కంపెనీలు చౌక ధరలకే అవే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి మరియు ఆ వస్తువులు స్థానిక మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి. మన దేశ వాణిజ్యంలో బహుళజాతి సంస్థల ఆగమనం కూడా మరొక అంశం.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 17.
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:

విదేశీ వాణిజ్యం విదేశీ పెట్టుబడి
1) ఒక కంపెనీ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్యం. 1) ఇది బహుళజాతి సంస్థలు భూములు, భవనాలు, యంత్రాలు మరియు ఇతర సామగ్రి కొనేందుకు ఖర్చు చేసే ధనం.
2) వస్తువుల ఉత్పత్తి ఒక దేశంలో జరుగుతుంది మరియు అవి ఇతర దేశాలలో విక్రయించబడతాయి. 2) ఒక దేశంలో ఇతర దేశాల వ్యాపారులు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మరియు వస్తువులు అధిక ధరలకు ఎగుమతి అవుతాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 18.
చైనాలోకి భారత ఉక్కును దిగుమతి చేసుకోవటం వల్ల రెండు దేశాల ఉక్కు మార్కెట్లు ఎలా అనుసంధానమౌతాయి?
జవాబు:
చైనాకు భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఉక్కు మరియు ఇతర ముడి సరకుల ఆవశ్యకత చాలా ఉంది. భారతదేశం నుండి కొనుగోలు చేసిన ఉక్కు మరియు ఇతర ముడి సరుకుల సహాయంతో చైనా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తోంది మరియు భారతదేశానికి వాటిని ఎగుమతి చేస్తోంది. ఇది ఈ రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధాన్ని ఏర్పరచింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 19.
ఈ ఉదాహరణలో ఉత్పత్తిలో సాంకేతిక విజ్ఞాన ఉపయోగాన్ని తెలియజేసే పదాల కింద గీత గీయండి.
జవాబు:
2వ లైన్ డిజైన్
3వ లైన్ ఇంటర్నెట్
4వ లైన్ టెలికమ్యూనికేషన్
5వ లైన్ డిజైన్
6వ లైన్ డిజైనింగ్
7వ లైన్ కంప్యూటర్, ముద్రించిన
8వ లైన్ డిజైనింగ్
9వ లైన్ ముద్రణకు
10వ లైన్ ఇంటర్నెట్ (e- Banking)

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 20.
దిగుమతులపై పన్ను వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని కోటాలు అంటారు. చైనా బొమ్మల ఉదాహరణలో కోటాలను ఉపయోగించి వాణిజ్య అవరోధాన్ని ఎలా విధించవచ్చో వివరించండి. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలా? చర్చించండి.
జవాబు:
భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరొకసారి వద్దాం – బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాం. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సివస్తుంది. అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరీ అంత చవకగా ఉండవు, దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 21.
ఖాళీలను పూరించండి.
…………. దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం ………. . ప్రపంచ వాణిజ్య సంస్థ ………….. కు సంబంధించి నియమాలు రూపొందించి ……….. చూస్తుంది. అయితే, ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం ………… లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ………… . కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పాటు. ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించి నియమాలు రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది. అయితే ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం న్యాయపూరితంగా లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అవరోధాలను కలిగిస్తున్నాయి. కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 22.
పై ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం ఉత్పత్తి చెయ్యటానికి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుందని చూశాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్ని రకాల వస్తువుల, ఉదాహరణకు పర్యావరణ అనుకూలమైన వాటి ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. ఇది న్యాయమైనదో కాదో చర్చించండి.
జవాబు:
ఈ ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం పంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు యిచ్చినంతవరకు ఎవరికీ అభ్యంతరముండదు. తద్వారా వారు ఆహార ఉత్పత్తులను పెంచుకోవచ్చు. కానీ వాటిని చౌకగా విదేశాలలో అమ్మటం న్యాయసముచితం కాదు. దీనిమూలంగా యితర దేశాల రైతులు యిబ్బంది పడుతున్నారు. పర్యావరణమైన అనుకూల ఉత్పత్తికి మద్దతు యివ్వడం న్యాయసమ్మతమైనదే. మనదేశంలో కూడా వంట చెఱకు కోసం అడవులను నరకకుండా ఉండేందుకు గ్యాస్ వినియోగం ప్రోత్సహించటానికి గ్యాస్ కు సబ్సిడీలు యిస్తున్నాం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 23.
భారతదేశ ప్రజలు పోటీవల్ల ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
భారతదేశ అతి పెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీవల్ల ప్రయోజనం పొందాయి. వాళ్లు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతులలోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచెయ్యటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 24.
మరిన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదగాలా ? దేశంలోని ప్రజలకు దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా ‘బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటర్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (IT), రానాలాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాసెనర్స్ (నటులు, బోల్టులు) వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 25.
మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి?
జవాబు:
పన్నుల రూపంలో ప్రభుత్వాదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలనందజేయవచ్చు.
భారతీయులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తద్వారా తలసరి, జాతీయాదాయాలు పెరుగుతాయి.
దేశ, విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించవచ్చు.

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 26.
ఇతర దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి రవిలాంటి వాళ్ళు ఉత్పత్తిని నిలిపివెయ్యాలా? మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువేమీ కాదు. అయితే బహుళజాతి సంస్థలు అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మనం స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న యూనిట్లలో ఉత్పత్తి చేస్తే ప్రామాణికం గానీ, ధరలోగానీ పోటీపడలేం. ఈ వాస్తవాన్ని రవిలాంటివారు గుర్తించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 27.
వీటిల్లో పెట్టుబడులు పెట్టటానికి బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తాయా? ఎందుకు?
జవాబు:
ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా మార్గాల ఏర్పాటు వంటి అంశాలలో బహుళ జాతి సంస్థలు తమ పరిశ్రమల వరకు మాత్రమే పరిమితమవుతాయి. విద్యుత్, రవాణా మార్గాలు వంటివి ప్రఖ్యాత రంగంలో ఉన్నాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 28.
ఇతర కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

కంపెనీలు బహుళ జాతి సంస్థలు
1. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి. 1. 20వ శతాబ్దం రెండో అర్ధభాగం నుండి జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.
2. మనదేశంలో పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తి చేసేవారు. 2. ఒకటి కంటే ఎక్కువ దేశాలలో కంపెనీలు స్థాపించి ఉత్పత్తి చేయటం.
3. విడిభాగాల తయారీ నుండి ఉత్పత్తి తుదిరూపం వరకు ఒకే చోట జరిగేది. 3. విడిభాగాలు ఒక దేశంలో, అసెంబ్లింగ్ మరో దేశంలో, మార్కెటింగ్ వేరు వేరు దేశాలలో నిర్వహిస్తున్నారు.
4. శ్రామికులు నుండి సమ్మెలు, ఆందోళనలు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు. 4. అవసరమైతే సమస్యాత్మక ప్రాంతంలో యూనిట్ మూసివేసి ఈ వేరే ప్రాంతానికి తరలిస్తారు.
5. మార్కెట్ పరిధి తక్కువ. 5. మార్కెట్ కు పరిధిలేదు. విశ్వవ్యాప్తం.
6. ఉద్యోగావకాశాలు తక్కువ. 6. బహువిధ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 29.
ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి చైనా ఉక్కును దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి :
అ) చైనాలోని ఉక్కు కర్మాగారాలు,
ఆ) భారతదేశంలోని ఉక్కు కర్మాగారాలు,
ఇ) చైనాలో ఇతర పారిశ్రామిక వస్తువులు తయారుచేయటానికి ఉక్కును కొనుగోలు చేసే పరిశ్రమలు
జవాబు:
భారతదేశ ఉక్కు తయారీదారులు చైనాకు, ఉక్కు మరియు ముడి సరకులను ఎగుమతి చేయడం ప్రారంభించారు. చైనాలోని కొనుగోలుదారులు ఇప్పుడు చైనా ఉక్కు మరియు భారతదేశ ఉక్కులలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చింది. చౌకధరల కారణంగా భారతదేశ ఉక్కు చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. అందువలన చైనా ఉక్కు -స్థానంలో భారతదేశ ఉక్కును వాడటం జరుగుతోంది. ఇది భారతీయ ఉక్కు తయారీదారులకు తమ వాణిజ్యం విస్తరింపచేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అయితే చైనా ఉక్కు తయారీదారులు అందుకు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. పోటీ కారణంగా కొందరు ఉక్కు తయారీదారులు సృజనాత్మకతతో అభివృద్ధి సాధించగా మరికొందరు చతికిలపడ్డారు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 30.
ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇదివరకే చదివాం. ఆర్థిక మండళ్లను నెలకొల్పటాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెల్పండి.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలుల ఏర్పాటును అనేక వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు.

కారణాలు:

  1. ఇది పెట్టుబడి వ్యవస్థను సమర్ధిస్తుంది. అందుచే సామ్యవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
  2. దేశీయ కంపెనీలను దెబ్బతీస్తుంది. కాబట్టి స్థానిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
  3. విదేశీ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. అందుచే సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
  4. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. అందుచే కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
  5. స్థానికులకు ఉద్యోగావకాశాలు నామమాత్రం. అందుచే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
  6. వీటికి కేటాయించి భూములు సాధారణ రైతులు, బడుగువర్గాలకు చెందినవి కావటంతో ఈ వర్గాలు భూమిలేని వారై కూలీలుగా మారిపోతున్నారు. అందుచే వీరు వ్యతిరేకిస్తున్నారు.
  7. ప్రధానంగా వీరు పెట్టే పరిశ్రమలు పర్యావరణ నాశనం చేస్తున్నాయి. అందుచే ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 31.
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే మూడు అవసరాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి :
అ) మెరుగైన రోడ్లు, విద్యుత్తు, నీళ్లు, ముడిసరుకులు, మార్కెటింగ్, ఇన్ఫమేషన్ నెట్వర్క్
ఆ) సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునికీకరణ,
ఇ) తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు. ఈ మూడు అంశాలు భారతీయ ఉత్పత్తిదారులకు ఎలా సహాయపడతాయో వివరించండి.
జవాబు:
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే వారికి కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలి. ముడి సరుకులు వినియోగానికి గల అవరోధాలను తొలగించి అందుబాటులోకి తేవాలి. వీటిని తమ పరిశ్రమలోకి తేవడానికి, ఉత్పత్తులను సమీప ప్రధాన నగరాలు, ఓడరేవులు, రైల్వేస్టేషన్లకు చేర్చడానికి రోడ్డు మార్గాలను విస్తరించాలి. ఉత్పత్తికి కావలసిన నిరంతర నీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి. మార్కెటింగ్ చేయడానికి కావలసిన ప్రోత్సాహకాలు అందజేయాలి. అన్ని రంగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, ఇవి తమ పరిశ్రమ ఆధునికీకరణకు ఏ విధంగా తోడ్పడగలవో సూచననివ్వగల సాంకేతిక నిపుణుల సహకారం అందివ్వాలి. బహుళ జాతి సంస్థల పోటీని తట్టుకొనే విధంగా పరిశ్రమలను ఆధునికీకరించే వీలుగా తక్కువ వడ్డీకి సకాలంలో రుణాలను అందజేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 32.
ప్రభుత్వం తీసుకోగల ఇతర చర్యల గురించి ఆలోచించండి. తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరుపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ‘కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.