These AP 9th Class Social Important Questions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు will help students prepare well for the exams.
AP Board 9th Class Social 21st Lesson Important Questions and Answers మానవహక్కులు, ప్రాథమిక హక్కులు
9th Class Social 21st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు అనగానేమి?
జవాబు:
వ్యక్తికి మౌలికమైన కొన్ని హక్కులు ఉన్నాయి, వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులంటారు.
ప్రశ్న 2.
రిట్ అనగానేమి?
జవాబు:
రాజ్యాంగ హక్కులను కాపాడటానికి, అమలు అయ్యేలా చూడటానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసే అధికారాన్ని ‘రిట్’ అంటారు. ఇది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు.
ప్రశ్న 3.
సమన్యాయపాలన అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించగూడదు అని రాజ్యాంగం పేర్కొంటోంది. దీనిని ‘సమన్యాయపాలన’ అంటారు.
ప్రశ్న 4.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రయోజనాలు ఏవి?
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ : దీనివల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.
ప్రశ్న 5.
“బాల కార్మికుల నిర్మూలన” పై రెండు నినాదాలు రాయండి.
జవాబు:
- విద్య బాలల భవిష్యత్తు – వారిని చదువుకోనివ్వండి.
- బాలకార్మిక విధానం ప్రకృతి విరుద్ధం.
9th Class Social 21st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కింది సందర్భాలను పరిశీలించండి. ప్రతి సందర్భంలో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది మరియు ఏవిధంగా భంగం కలిగిందో వివరించండి.
అ) ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తున్న ఒక దర్శకున్ని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.
ఆ) ఒక 10 సం||రాల బాలున్ని బడికి వెళ్ళనివ్వడం లేదు మరియు బలవంతంగా టపాసుల తయారీ పరిశ్రమలో పని చేయడానికి పంపిస్తున్నారు.
జవాబు:
అ) మొదటి కేసులో ప్రాథమిక హక్కైన ‘వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ’ ఉల్లంఘించబడింది. ఎందువలన అనగా ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. పౌరులు సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం, వంటి వివిధ రూపాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అందువలన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ డాక్యుమెంటరీ తీయడం తప్పు కాదు. కానీ ఈ స్వేచ్చపై పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రభుత్వం చట్ట ప్రకారం శిక్ష విధిస్తుంది.)
ఆ) రెండవ కేసులో ప్రాథమిక హక్కు అయిన ‘పీడనాన్ని నిరోధించే హక్కు’ (కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవడం నిషేధం) ఉల్లంఘించబడింది. “14 సంవత్సరాల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం” అని రాజ్యాంగం పేర్కొంటోంది. అందువలన ఆ .10 సంవత్సరాల బాలుడు కర్మాగారానికి కాక స్కూల్ కి పంపబడాలి.
ప్రశ్న 2.
ఇచ్చిన అంశాలను సంబంధిత ప్రాథమిక హక్కుల కింది పట్టికలో పొందుపరచండి.
• కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవటం నిషేధం.
• అల్పసంఖ్యాక వర్గాలు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి, నిర్వహించుకునే హక్కు
• బిరుదులు రద్దు
• జీవించే హక్కు
జవాబు:
9th Class Social 21st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రాథమిక హక్కులు ఏవి? మెరుగైన జీవనం కొరకు ఇవి మనకు ఏ విధంగా సాయపడుతున్నాయి?
జవాబు:
1) ప్రాథమిక హక్కులు ఆరు :
- సమానత్వపు హక్కు,
- స్వాతంత్ర్యపు హక్కు,
- మత స్వాతంత్ర్యపు హక్కు,
- పీడనాన్ని నిరోధించే హక్కు,
- సాంస్కృతిక విద్యా విషయపు హక్కు,
- రాజ్యాంగ పరిహారపు హక్కు,
2) ఈ పైన తెలుపబడిన హక్కులలో మొదటిది అయిన సమానత్వపు హక్కు ప్రజలందరూ సమానులే అని తెలియజేయడంతో పాటు మన అభివృద్ధికి దోహదపడుతుంది.
3) రెండవ హక్కు ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమకు నచ్చిన విధంగా జీవనాన్ని గడపటానికి అవకాశం ఇచ్చింది.
4) మూడవ హక్కు ప్రజలు వారికి నచ్చిన మతాన్ని అనుసరించే విధంగా అవకాశం కల్పించింది.
5) నాల్గవ హక్కు ఎవరూ ఇంకొకరి చేత బలవంతంగా పనిచేయించటం గాని, పని పేరిట హింసించరాదని తెలియచేస్తుంది.
6) ఐదవ హక్కు అల్పసంఖ్యాక వర్గాల వారు కూడా వారి భాష, మతం ఆధారంగా విద్యా సంస్థలను ఏర్పాటుచేసుకుని అభివృద్ధి చెందటానికి అవకాశం కల్పించింది.
7) చివరి హక్కు పై హక్కులలో ఏది ఉల్లంఘనకు గురి అయినా ప్రజలకు కోర్టుల నుండి రక్షణ కల్పించి మరల వారు
హక్కులను పొందేలాగా చేస్తుంది.
ప్రశ్న 2.
ప్రాథమిక విధులేవి?
జవాబు:
హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి.
ప్రతి ఒక్క భారత పౌరుని విధులు :
- రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కాని, జాతీయ జెండాను కాని అవమానించకూడదు.
- స్వాతంత్ర్యానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి, అనుసరించాలి.
- భారతదేశ సార్వభౌముకత, సమగ్రతలను కాపాడాలి.
- దేశ రక్షణకు బాధ్యత వహించాలి.
- వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించరాదు.
- దేశ పర్యావరణ క్షీణతను నివారించి, మెరుగుపరచాలి.
- మనదేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత, వారసత్వ సంపదను గౌరవించి, కాపాడాలి.
- శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, అన్వేషణ, సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
- ప్రజా ఆస్తులను కాపాడాలి.
- అన్ని రంగాలలో అత్యున్నత శ్రేణిని అందుకోటానికి కృషి చేయాలి.
- పిల్లలను విద్యావంతులుగా చేయాలి.