These AP 9th Class Social Important Questions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు will help students prepare well for the exams.
AP Board 9th Class Social 16th Lesson Important Questions and Answers సామాజిక నిరసనోద్యమాలు
9th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కంచె వేయటం అనే ప్రక్రియ వలన ఏం జరిగింది?
జవాబు:
‘కంచె వేయటం’ అనే ప్రక్రియ ద్వారా 1770లో వందలాది చిన్న రైతులు భూములను శక్తిమంతులైన భూస్వాముల పెద్ద కమతాలతో కలిపివేశారు.
ప్రశ్న 2.
లుద్దిజం అంటే ఏమిటి?
జవాబు:
‘జనరల్ నె లుడ్జ్’ అన్న జనాకర్షక నాయకుడి నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది. ఈ ఉద్యమాన్ని ‘లుద్దిజం’ (1811 – 17) అంటారు.
ప్రశ్న 3.
సామ్యవాదం ఏం ఖండిస్తుంది?
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి, అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్ నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది.
ప్రశ్న 4.
బాబెఫ్ వాదన ఏమిటి?
జవాబు:
‘విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని’ సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు.
ప్రశ్న 5.
సామ్యవాదం మద్దతుదారులు ఎవరు?
జవాబు:
ఎం.ఎన్. రాయ్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ వంటి అనేక మంది నాయకులు సామ్యవాదం మద్దతుదారులు అయ్యారు.
ప్రశ్న 6.
వర్జీనియా ఉల్ఫ్ ఏమి రాశాడు?
జవాబు:
మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి ‘వర్జీనియా ఉల్ఫ్’ వంటి రచయిత్రులు రాయసాగారు.
9th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
“సామ్యవాదం అనే భావన ఎందుకు అభినందనీయము?” మీ అభిప్రాయం వ్రాయండి.
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.
- సామ్యవాదంలో ఉత్పత్తి విషయంలో ప్రభుత్వ బాధ్యత ఉంటుంది.
- పరిశ్రమలను జాతీయం చేయడం వలన ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వప్రజలకు సమానంగా చెందు అవకాశం కలదు.
- దీని వలన ఆర్థిక అసమానతలు తొలగి, ప్రజలందరి జీవితాలు మెరుగుపడటమే కాకుండా వాళ్ళకు ఎన్నో అవకాశాలను, శక్తులను ఇస్తుంది. దీనిలో చిన్నా, పెద్దా తేడాలు ఏమీ ఉండవు.
పై అన్ని అంశాల వలన సామ్యవాదం అభినందనీయం.
ప్రశ్న 2.
సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించి రెండు అంశాలు రాయండి.
జవాబు:
- విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలి.
- నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.
ప్రశ్న 3.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు, శ్రామికులు, మహిళలు ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు స్వతంత్ర జీవనాధారంలేని వేలాది మంది కార్మికులు, కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసెను. కార్మికులు, యజమానులు ఇచ్చే స్వల్ప వేతనమునకే తప్పనిసరి పరిస్థితులలో పని చేయవలసి వచ్చెను. స్త్రీలకు, చిన్న పిల్లలకు తక్కువ కూలి ఇచ్చేవారు. యజమానులు వారి చేత నిర్దాక్షిణ్యంగా, కఠినంగా ప్రమాదకరమైన పనులు చేయించిరి. దినమునకు 15 నుండి 18 గంటల వరకు పని చేయవలసి వచ్చేది. కార్మికులు, శ్రామికులు నివసించే ప్రాంతాలు అనారోగ్యకరంగా ఉండి, అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.
ప్రశ్న 4.
సామ్యవాదం అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమి?
జవాబు:
ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనే సిద్ధాంతమే సామ్యవాదం.
- సామ్యవాద పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు. ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.
- ఉత్పత్తికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించును.
- పరిశ్రమలు జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
- దీనివల్ల ఆర్థిక అసమానతలను తగ్గించును.
9th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
“పారిశ్రామికీకరణ వల్ల కళాకారులు, మేధావులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రజాజీవనం, వ్యవసాయోత్పత్తి లేదా చేతివృత్తి పనులతో ముడిపడి ఉన్న మానవ విలువలు అంతరించిపోయాయి.”
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు మానవ విలువలను ప్రభావితం చేస్తున్న అంశంపై వ్యాఖ్యానించుము.
జవాబు:
భావాలు ఉద్వేగాల కంటే హేతువు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ అచ్చెరువు గొలిపే ప్రభావంతో పాటు శ్రామిక ప్రజల దారిద్ర్యం, దుర్భర జీవనాలు, మేధావుల పైన గాఢ ముద్రను వేశాయి.
పారిశ్రామికీకరణ వలన కొత్త సామాజిక బృందాలు కూడా ఏర్పడ్డాయి. సమాజంలో ముఖ్యపాత్ర పోషించడానికి ఇవి. తహతహలాడసాగాయి. పారిశ్రామికీకరణ పారిశ్రామిక పెట్టుబడిదారులకు, బడా భూస్వాములకు, అధికారం, ప్రాబల్యంతో పాటు, సంఘటిత కార్మికవర్గ ఉద్యమాలకు దారితీసింది. తాము సమైక్యంగా ఉన్నప్పుడు మొత్తం ఆర్థిక జీవనాన్ని స్తంభింప చేయడం ద్వారా తమ శక్తిని శ్రామికులు గుర్తించారు. అదే విధంగా అప్పటివరకు ఇళ్ళకు పరిమితమైన మహిళలు బయటకు వచ్చి సమాజంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సమాన భూమికను కోరసాగారు. తమ కోర్కెలు నెరవేర్చు కోవడానికి తరచుగా వారు సోషలిజం, ప్రజాస్వామిక జాతీయ వాదం వంటి సామాజిక ఉద్యమాలలో చేతులు కలిపారు.