These AP 9th Class Social Important Questions 1st Lesson భూమి – మనం will help students prepare well for the exams.
AP Board 9th Class Social 1st Lesson Important Questions and Answers భూమి – మనం
9th Class Social 1st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కక్ష్య అనగానేమి?
జవాబు:
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ‘కక్ష్య’ అంటారు. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్ష్య తలం అంటారు.
ప్రశ్న 2.
‘సంవత్సరం’ అనగానేమి?
జవాబు:
ఈ వేగంతో సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయటానికి 365¼ రోజులు పడుతుంది. దీనిని మనం ‘సంవత్సరం’ అంటాం.
ప్రశ్న 3.
సంస్కృతంలో భూమికి గల పేర్లు ఏవి?
జవాబు:
సంస్కృతంలో భూమి, పృథ్వి, ధరణి, అవని, పుడమి వంటి పేర్లు భూమికి ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే.
ప్రశ్న 4.
భూమిని ఎన్ని పొరలుగా విభజింపవచ్చును?
జవాబు:
భూమిని ప్రధానంగా భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం అని మూడు పొరలుగా విభజించవచ్చును.
ప్రశ్న 5.
భూపటలం అని దేనినంటారు?
జవాబు:
మనం భూమి బయటిపొర మీద నివసిస్తున్నాం, దీనిని భూపటలం అంటాం. భూపటలం 30 – 100 కిలోమీటర్ల మందం ఉంది.
ప్రశ్న 6.
భూప్రావారం గురించి రాయండి.
జవాబు:
భూప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుంచి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
ప్రశ్న 7.
భూకేంద్రమండలం ఎక్కడ వరకు ఉంటుంది? దీనిలో ఏమి ఉన్నాయి?
జవాబు:
భూ కేంద్ర మండలం 2,900 కి.మీ. నుండి 6,376 కి.మీ. వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి.
ప్రశ్న 8.
ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు, ఎందుకు ప్రతిపాదించారు?
జవాబు:
ఖండాలు, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించటానికి 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన ఉల్కాపాత భూ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ప్రశ్న 9.
వెజినర్ పాంజియాను గురించి ఏమి చెప్పాడు?
జవాబు:
పాంజియా అనే ఈ మహాఖండం లారెన్షియా (ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యూరేసియా మొత్తం) గోండ్వానా భూమి (ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేసియా, తూర్పుఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా) అనే రెండు భాగాలుగా విడిపోయిందని వెజిగ్ ప్రతిపాదించాడు.
ప్రశ్న 10.
గ్రిడ్ అనగానేమి?
జవాబు:
గ్లోబు మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు, అడ్డ గీతలతో గళ్లు ఏర్పడతాయి. దీనిని ‘గ్రిడ్’ అంటారు.
ప్రశ్న 11.
భూమధ్యరేఖ అని దేనినంటారు?
జవాబు:
భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమ దూరాలలో ఉంటుంది. ఇది భూమిని రెండు సమ భాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అంటారు. దీనిని 0° అక్షాంశంగా గుర్తిస్తారు.
ప్రశ్న 12.
అక్షాంశాలను ఎలా సూచిస్తారు?
జవాబు:
రేఖాశాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు (ి)నిమిషాలు (‘) సెకండ్ల (‘) లో సూచిస్తారు. 13. లాటిట్యూడ్ అంటే ఏమిటి ? జ. ఇంగ్లీషులో ‘లాటిట్యుడ్’ అనే పదం ‘వెడల్పు’ అనే అర్థం సూచించే లాటిన్ పదం అయిన ‘లాటిట్యుడో’ నుంచి వచ్చింది.
ప్రశ్న 14.
ఉత్తరార్ధ గోళం, దక్షిణార్ధ గోళం అని వేటిని అంటారు?
జవాబు:
భూమధ్యరేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్యరేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.
ప్రశ్న 15.
వివిధ అక్షాంశాల పేర్లు రాయండి.
జవాబు:
23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అని, 23½° దక్షిణ అక్షాంశాన్ని మకరరేఖ అని, 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అని, 66½° దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు.
ప్రశ్న 16.
లాంగిట్యూడ్ అంటే ఏమిటి?
జవాబు:
రేఖాంశాన్ని ఇంగ్లీషులో లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం ‘పొడవు’ అనే అర్థం ఉన్న ‘లాంగిట్యుడో’ అన్న లాటిన్ పదం. రేఖాంశం పటం పొడవును లేదా ఎత్తును సూచిస్తుంది.
ప్రశ్న 17.
ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండ్ లోని ‘గ్రీన్ విజ్’లోని నక్షత్రశాల గుండాపోయే రేఖాంశాన్ని 0° మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.
ప్రశ్న 18.
మెరిడియన్ అంటే ఏమిటి?
జవాబు:
మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియాసిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. రేఖాంశాలను మధ్యాహ్నరేఖలని కూడా అంటారు.
ప్రశ్న 19.
ప్రామాణిక సమయం అనగానేమి?
జవాబు:
కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికీ వర్తింపచేస్తారు, దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు.
ప్రశ్న 20.
IST అనగానేమి?
జవాబు:
IST అనగా భారతదేశ ప్రామాణిక సమయం (Indian Standard Time).
ప్రశ్న 21.
యాంటీ మెరీడియన్ అనగానేమి?
జవాబు:
0° రేఖాంశమునకు వ్యతిరేక దిశలో 180° లలో ఉన్న రేఖాంశమును యాంటీ మెరీడియన్ అని పిలుస్తారు. అవి 180° తూర్పు రేఖాంశము మరియు 180° లలో ఉన్న పశ్చిమ రేఖాంశములు.
9th Class Social 1st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు, మరియు రేఖాంశాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? అది ఏవిధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
- ఒక ప్రాంతం గూర్చి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఆ ప్రాంతం యొక్క అక్షాంశ రేఖాంశాల గూర్చి తెలుసుకోవాలి.
- అక్షాంశాల సహాయంతో ఆ ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చును.
- మరియు ఆ ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని కూడా తెలుసుకోవచ్చు.
- రేఖాంశాల సహాయంతో ఆ ప్రాంతంలో సమయాన్ని తెలుసుకోవచ్చును.
ప్రశ్న 2.
జినర్ మహాఖండమైన పాంజియా రెండు ఖండాలుగా విడిపోయిందని ప్రతిపాదించాడు –
అవి 1) లారెన్షియా
2) గోండ్వానా భూమి మీద ఉన్న ప్రస్తుతం ఉన్న రూపం, స్థానంలోకి రావడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది.
1) లారెన్షియా :
ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం.
2) గోండ్వానా :
దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా
పైన ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) గోండ్వానా నుండి ఏర్పడి, ప్రస్తుతం ఆసియా ఖండంలో భాగంగా ఉన్న ఏవైనా రెండు భూభాగాలను పేర్కొనుము.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ ఏ భాగం నుండి ఏర్పడింది?
జవాబు:
ఎ) భారతదేశం, అరేబియా, మలేషియా మొ||వి.
బి) ప్రస్తుతం ఉన్న యూరప్ లారెన్షియా భాగం నుండి ఏర్పడింది.
ప్రశ్న 3.
గ్లోబు చిత్రమును గీచి, దానిమీద ప్రత్యేక పేర్లు కలిగిన అన్ని అక్షాంశములను గుర్తించుము.
జవాబు:
9th Class Social 1st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
భూమి అంతర్నిర్మాణం గూర్చి వివరించండి (లేదా) భూమి అంతర్గత నిర్మాణమును వర్ణించుము.
జవాబు:
భూమి అంతః మరియు బాహ్య భాగాన్ని కలిపి 3 పొరలుగా విభజించడం జరిగింది.
అవి :
- భూ పటలం
- భూ ప్రావారం
- భూ కేంద్ర మండలం.
1) భూ పటలం :
భూమి యొక్క బాహ్య పొర అయిన భూపటలం మీద మనం నివసిస్తున్నాం. ఈ భూపటలం యొక మందం 30-100 కిలోమీటర్లు. ఈ భూ పటలం వివిధ రకాల శిలలతో నిర్మితమైనది.
2) భూ ప్రావారం :
భూ ప్రావారం భూమి లోపల 100 కి.మీ. నుండి 2,900 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో – సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి.
3) భూ కేంద్ర మండలం :
భూ కేంద్ర మండలం రెండు భాగాలుగా విభజింపబడింది. 1) బాహ్య కేంద్రం, 2) అంతః కేంద్రం.
బాహ్య కేంద్రం :
2,900 నుండి 5, 100 కి.మీ. వరకు ఉంటుంది. దీనిలో నికెల్ మరియు ఐరన్ ఉన్నాయి.
అంతః కేంద్రం :
5,100 నుండి 6,376 కి. మీ. వరకు ఉంటుంది. ఇక్కడ ఇనుము మరియు బంగారం ఎక్కువగా ఉంటుంది.