Practice the AP 9th Class Social Bits with Answers 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో
1. వ్యక్తులు వీరి నుండి డబ్బును అప్పుగా తీసుకుంటారు.
A) మిత్రులు
B) బంధువులు
C) వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
2. డబ్బు యొక్క ఆధునిక రూపాలు
A) కరెన్సీ నోట్లు
B) నాణాలు
C) బ్యాంకు జమలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
3. బ్యాంకులు డబ్బును జమచేసుకొని చెల్లించేది
A) వడ్డీ
B) మూలధనం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) వడ్డీ
4. డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపసు తీసుకునే సౌలభ్యం ఉన్న డిపాజిట్లు
A) డిమాండ్
B) పిక్స్‌డ్
C) లోపాయికారి
D) ఏదీకాదు
జవాబు:
A) డిమాండ్
5. మొత్తం ద్రవ్య వ్యవస్థను పర్యవేక్షించే సంస్థ
A) ఎస్.బి.ఐ
B) ఆర్.బి.ఐ
C) కార్పొరేషన్
D) నాబార్డ్
జవాబు:
B) ఆర్.బి.ఐ
6. దేశంలో ఉన్న బ్యాంకులు ఈ రోజుల్లో జమ అయిన నగదులో ఎంత శాతం మాత్రమే తమ దగ్గర ఉంచు కొంటాయి?
A) 10%
B) 15%
C) 20%
D) 25%
జవాబు:
B) 15%
7. ప్రజలకు రుణాలు ఎందుకు అవసరం అనగా
A) విత్తనాలు కొనుగోలుకు
B) ఎరువులు కొనుగోలుకు
C) క్రిమిసంహారక మందుల కొనుగోలుకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. పాఠ్యాంశంలో అలీషా ఎవరు?
A) రైతు
B) చెప్పుల తయారీదారు
C) ఉద్యోగి
D) పారిశ్రామికవేత్త
జవాబు:
B) చెప్పుల తయారీదారు
9. పాఠ్యాంశంలో స్వప్న ఎవరు?
A) చిన్నరైతు
B) భూస్వామి
C) వ్యాపారవేత్త
D) పారిశ్రామిక వేత్త
జవాబు:
A) చిన్నరైతు
10. పాఠ్యాంశంలో స్వప్న వడ్డీకి తీసుకున్న పైకం తిరిగి చెల్లించలేకపోవడానికి కారణం
A) పంట నాశనం కావడం
B) ఆరోగ్యం సరిగా లేకపోవడం
C) అయోమయ పరిస్థితి నెలకొనడం
D) వ్యాపారం దివాళా తీయడం
జవాబు:
A) పంట నాశనం కావడం
11. ప్రతి రుణదాత రుణగ్రహీత నుండి కోరేది
A) పూచీకత్తు
B) డిపాజిట్
C) పశుసంపద
D) బహుమతులు
జవాబు:
A) పూచీకత్తు
12. పాఠ్యాంశంలో శివకామి ఎవరు?
A) ఉద్యోగి
B) ఉపాధ్యాయురాలు
C) వ్యాపారవేత్త
D) రైతు
జవాబు:
B) ఉపాధ్యాయురాలు
13. పాఠ్యాంశంలో రమ తాను పనిచేసే భూస్వామిపై ఆధారపడి ఉండటానికి కారణం
A) రమకు భూస్వామి రుణాన్ని ఇవ్వడం
B) రమ భూస్వామి పొలంను కౌలుకు తీసుకోపడం
C) రమ పేదరికంలో ఉండటం
D) పైవన్నీ
జవాబు:
A) రమకు భూస్వామి రుణాన్ని ఇవ్వడం
14. నియత రుణాలు అనగా
A) బ్యాంకులు ఇచ్చేవి
B) సహకార సంస్థలు ఇచ్చేవి
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
15. అనియత రుణాలు అనగా వీరు ఇచ్చేవి.
A) వడ్డీ వ్యాపారులు
B) వర్తకులు
C) బంధువులు, స్నేహితులు
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ
16. నాబార్డ్ (NABARD) అనగా
A) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్
B) నేషనల్ అండ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్
C) నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్
D) పైవన్నీ
జవాబు:
A) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్
17. 2011 నాటికి భారతదేశంలోని రైతుల సంఖ్య
A) 10 కోట్లు
B) 11 కోట్లు
C) 14 కోట్లు
D) 16 కోట్లు
జవాబు:
C) 14 కోట్లు
18. ప్రస్తుతం ప్రభుత్వం అందరికి యు.ఐ.డి సంఖ్య ఈ కార్డు ద్వారా అందజేస్తున్నది
A) ఆధార్
B) పౌరసరఫరా
C) గ్యా స్
D) ఏదీకాదు
జవాబు:
A) ఆధార్
19. ఈ రంగంలో రుణ కార్యకలాపాలను, వడ్డీ వ్యాపారులను నియంత్రించే సంస్థ లేదు.
A) నియత
B) అనియత
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) అనియత
20. నియత రుణాలు విస్తరించబడటం వలన ఈ రంగాలను విస్తరించవచ్చును.
A) పంటలు పండించగలగటం
B) వ్యాపారం చేయడం
C) చిన్నతరహా పరిశ్రమలను స్థాపించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
21. ప్రతి స్వయం సహాయక బృందం నందు ఎంత మంది సభ్యులు ఉంటారు?
A) 10 నుంచి 15
B) 15 నుంచి 20
C) 20 నుంచి 25
D) 25 నుంచి 30
జవాబు:
B) 15 నుంచి 20
22. స్వయం సహాయక బృందాలు సమష్టిగా వ్యవహరించడం వలన
A) ఆర్థికంగా నిలదొక్కుకుంటారు
B) సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటారు
C) పెట్టుబడులను సంపాదిస్తారు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
23. ప్రస్తుతం మన బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండనవసరం లేని విధంగా ఏర్పాటు చేసిన ఎకౌంట్ పేరు
A) బ్యాంకులు
B) సహకార సంస్థలు
C) వడ్డీ వ్యాపారులు
D) ఏదీకాదు
జవాబు:
A) బ్యాంకులు
24. ప్రతి బ్యాంక్ తన డిపాజిట్లను ప్రభుత్వం ద్వారా ఇది చేస్తుంది.
A) కరెంట్
B) బీమా
C) షేర్
D) ఏదీకాదు
జవాబు:
B) బీమా
25. ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున దీనికి ఇన్సూరెన్స్ చేస్తుంది.
A) డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్
B) డిపాజిట్ స్కీం
C) సేవింగ్ స్కీం
D) కరెంట్ డిపాజిట్ స్కీం
జవాబు:
A) డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్
26. గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వీటి నుండి వస్తాయి.
A) కెనరా బ్యాంకు
B) వాణిజ్య బ్యాంకు
C) రిజర్వుబ్యాంకు
D) ప్రజల ద్వారా
జవాబు:
B) వాణిజ్య బ్యాంకు
27. సహకార సంస్థల నినాదం
A) అందరికి రుణం
B) అందరికోసం ఒకరు – ఒకరి కోసం అందరూ
C) ఖాతాదారుల క్షేమం
D) రుణ వృద్ధి
జవాబు:
B) అందరికోసం ఒకరు – ఒకరి కోసం అందరూ
28. ప్రజల దగ్గర నుండి డిపాజిట్లను సేకరించి వాటిని విభిన్న పెట్టుబడులుగా మార్చే బ్యాంకులను ఈ విధంగా పిలుస్తారు.
A) సహకార బ్యాంకులు
B) ఇండియన్ బ్యాంకు
C) వాణిజ్య బ్యాంకులు
D) భారత జాతీయ బ్యాంకు
జవాబు:
C) వాణిజ్య బ్యాంకులు
29. బ్యాంకులు, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు
A) డిమాండ్ డిపాజిట్లు
B) డిపాజిట్లు
C) నియత రుణాలు
D) అనియత రుణాలు
జవాబు:
C) నియత రుణాలు
30. వ్యవసాయ కూలీలు ………….. నుండి డబ్బును ఎక్కువగా అప్పుగా తీసుకుంటారు.
A) బ్యాంకుల
B) వ్యాపారస్తుల
C) పోస్టాఫీసు
D) వారి యజమానుల
జవాబు:
D) వారి యజమానుల
31. జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి ……. వినియోగిస్తాయి.
A) బ్యాంకులు
B) వడ్డీ వ్యాపారస్తులు
C) సహకార సంస్థలు
D) ఏదీకాదు
జవాబు:
A) బ్యాంకులు
32. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలు
A) నియత రుణాలు
B) అనియత రుణాలు
C) బ్యాంకు డిపాజిట్లు
D) వడ్డీ వ్యాపారస్తులు
జవాబు:
B) అనియత రుణాలు
33. భారతదేశంలో అనియత రుణ వనరులలో ………. ప్రముఖ భాగంగా ఉన్నారు.
A) నోఫిల్స్ ఎకౌంట్స్
B) నోమని అకౌంట్స్
C) మినిమం అకౌంట్స్
D) నో అకౌంట్స్
జవాబు:
C) మినిమం అకౌంట్స్
34. వడ్డీ వ్యాపారులు, వర్తకులపై అనియత రుణాలపై ఆధారపడిన రైతులు భారతదేశంలో ………. మంది ఉన్నారు.
A) 9 కోట్లు
B) 100 కోట్లు
C) 50 కోట్లు
D) 10 కోట్లు
జవాబు:
A) 9 కోట్లు
35. అప్పును తిరిగి రాబట్టడానికి చట్ట వ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపట్టేవారు …….. .
A) నియత రుణదాతలు
B) అనియత రుణదాతలు
C) బ్యాంకులు
D) పబ్లిక్ సంస్థలు
జవాబు:
B) అనియత రుణదాతలు
36. నియత రుణ సంస్థలతో పోలిస్తే ….. రుణదాతలు అనేక మొత్తాలను వసూలు చేస్తున్నారు.
A) పేదవారు
B) నియత రుణదాతలు
C) అనియత
D) వడ్డీ వ్యాపారస్తులు
జవాబు:
C) అనియత
37. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో ………. రుణాలను పొందుతున్నారు.
A) సహకార రుణాలు
B) ఉమ్మడి రుణాలు
C) బ్యాంకు డిపాజిట్లు
D) అనియత రుణాలు
జవాబు:
D) అనియత రుణాలు
38. వడ్డీ వ్యాపారులు లావాదేవీలను తెలియజేయకుండా అధిక వడ్డీని వసూలు చేస్తూ …. హింసిస్తారు.
A) పేదవారిని
B) వ్యాపారస్తులను
C) సహకార సంఘాలను
D) డ్వా క్రా మహిళా సంఘాలను
జవాబు:
A) పేదవారిని
39. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ ………. కేంద్రంగా పనిచేస్తాయి.
A) ధనిక ప్రజలకు
B) పేద ప్రజలకు
C) వ్యాపారస్తులకు
D) విద్యార్థులకు
జవాబు:
B) పేద ప్రజలకు
40. ప్రతి రుణ ఒప్పందం రుణగ్రహీత రుణదాతకు అసలుతో పాటు చెల్లించాల్సిన ……… తెల్పుతుంది.
A) అప్పును
B) డిపాజిట్ ను
C) ఎకౌంట్ ను
D) వడ్డీరేటును
జవాబు:
D) వడ్డీరేటును
41. డిమాండ్ డిపాజిట్లు ఈ క్రింది వానిని సూచిస్తాయి
A) నగదు బదిలీ
B) పొదుపు
C) ఫిక్స్ డిపాజిట్లు
D) ఏదీకాదు
జవాబు:
A) నగదు బదిలీ
42. స్వయం సహాయక బృందాలు క్రమం తప్పకుండా ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత ఈ వస్తుంది?
A) 5 సం||లు
B) 1 సం|| లేదా 2 సం||లు
C) 3 లేదా 4 సం||లు
D) 6 నెలలు
జవాబు:
B) 1 సం|| లేదా 2 సం||లు
43. బ్యాంకులపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించడానికి ఈ వ్యవస్థకు కావల్సిన మార్గదర్శకాలను ……….. రూపొందిస్తుంది.
A) బ్యాంకులు
B) సహకారసంస్థలు
C) రిజర్వ్ బ్యాంకు
D) నాబార్డు
జవాబు:
C) రిజర్వ్ బ్యాంకు
44. వివిధ కారణాల వల్ల పూర్వంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రజల రుణ అవసరాలు ఈ విధంగా ఉన్నాయి
A) స్థిరంగా
B) తక్కువగా
C) రుణభారంగా
D) పెరిగాయి
జవాబు:
D) పెరిగాయి
45. రుణం తీసుకొని వ్యాపారం చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం ……..
A) చెల్లించాల్సిన వడ్డీ కన్నా అధిక మొత్తాన్ని సంపాదించడం
B) ఎక్కువ వడ్డీ సంపాదించుట
C) అధిక లాభాలు సంపాదించుట
D) అధిక నష్టాలు భరించుట
జవాబు:
A) చెల్లించాల్సిన వడ్డీ కన్నా అధిక మొత్తాన్ని సంపాదించడం
46. బ్యాంకులు ప్రధానంగా ప్రజలకు ఇది కల్గించాలి.
A) వడ్డీని
B) నమ్మకాన్ని
C) అప్పును
D) రుణాన్ని
జవాబు:
B) నమ్మకాన్ని
47. స్వయం సహాయక బృందం (SHG) ఉండే సభ్యుల
A) 15 నుండి 20 మంది
B) 100 నుండి 150 మంది
C) 1000 మంది వరకు
D) ఎంతమందైననూ ఉండవచ్చును
జవాబు:
A) 15 నుండి 20 మంది
48. బ్యాంకు రుణం పొందే నిమిత్తం చూపించే పూచీకత్తుకు ఉదాహరణ
A) నమ్మకం
B) అభ్యర్థన లేఖ
C) సొంత ఇల్లు
D) ఏదీకాదు
జవాబు:
C) సొంత ఇల్లు
49. 2011 సం||నాటికి భారతదేశంలోని …. కోట్ల మందికి మాత్రమే రుణఖాతాలున్నాయి.
A) 14
B) 15
C) 50
D) 5.3
జవాబు:
D) 5.3
50. నియత రుణ సంస్థలు, ప్రభుత్వం ….. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఆ నిబంధనలను పాటింప చేస్తారు.
A) రిజర్వ్ బ్యాంకు
B) సహకార సంస్థలు
C) పొదుపు సంఘాలు
D) వాణిజ్య బ్యాంకులు
జవాబు:
A) రిజర్వ్ బ్యాంకు
51. కింది వానిలో భారత రిజర్వుబ్యాంకు విధి కానిదిది
A) సాధారణ ప్రజల నుంచి నగదు జమ చేయించుకోవడం
B) కరెన్సీ నోట్లను ముద్రించడం మరియు జారీ చేయడం
C) ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహా సంఘంగా వ్యవహరించడం
D) దేశంలో విదేశీ మారక నిల్వల సంరక్షణ కర్తగా వ్యవహరించడం
జవాబు:
A) సాధారణ ప్రజల నుంచి నగదు జమ చేయించుకోవడం
52. శేఖర్‌కు 5% సంవత్సర వడ్డీతో ఒక బ్యాంకు నందు పొదుపు ఖాతా కలదు. ఒకవేళ 7% చొప్పున ద్రవ్యోల్బణం పెరిగితే అది అతను పొదుపు చేసిన డబ్బు యొక్క కొనుగోలు శక్తి పై ప్రభావం ఎలా చూపుతుంది?
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) అలాగే స్థిరంగా వుంటుంది
D) ఏమీ చెప్పలేం, ఎందుకంటే శేఖర్ ఖాతాలో వాస్తవంగా ఉన్న డబ్బులు ఎంతో చెప్పలేదు.
జవాబు:
B) తగ్గుతుంది
53. ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరు
A) అమ్మకాలు
B) రుణాలు
C) పన్నులు
D) అద్దెలు
జవాబు:
C) పన్నులు
II. జతపరచుము:
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. డిమాండ్ డిపాజిట్లు | A) ఆర్.బి.ఐ |
2. ప్రభుత్వ సంస్థ | B) బ్యాంక్ లో డబ్బుదాచిన వారు |
3. డిపాజిట్ దారులు | C) అప్పు తీసుకున్నవారు |
4. రుణగ్రహీతలు | D) నగదు బదిలీ |
5. రుణదాతలు | E) అప్పు ఇచ్చినవారు |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. డిమాండ్ డిపాజిట్లు | D) నగదు బదిలీ |
2. ప్రభుత్వ సంస్థ | A) ఆర్.బి.ఐ |
3. డిపాజిట్ దారులు | B) బ్యాంక్ లో డబ్బుదాచిన వారు |
4. రుణగ్రహీతలు | C) అప్పు తీసుకున్నవారు |
5. రుణదాతలు | E) అప్పు ఇచ్చినవారు |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. నియత వనరులు | A) సామాజిక సమస్యలు |
2. అనియత వనరులు | B) వ్యవసాయ బ్యాంకు |
3. యం.ఐ.డీ సంఖ్య | C) బ్యాంకులు |
4. నాబార్డ్ | D) వడ్డీ వ్యాపారస్థులు |
5. స్వయం సహాయక బృందాలు | D) ఆధార్ కార్డు |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. నియత వనరులు | C) బ్యాంకులు |
2. అనియత వనరులు | D) వడ్డీ వ్యాపారస్థులు |
3. యం.ఐ.డీ సంఖ్య | D) ఆధార్ కార్డు |
4. నాబార్డ్ | B) వ్యవసాయ బ్యాంకు |
5. స్వయం సహాయక బృందాలు | A) సామాజిక సమస్యలు |