Practice the AP 9th Class Social Bits with Answers 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్లో రాయండి.
1. పాఠ్యాంశంలో సరోజిని ఒక
A) వైద్యురాలు
B) కిరాణా వ్యాపారి
C) అకౌంటెంట్
D) వ్యాపారి
జవాబు:
A) వైద్యురాలు
2. ఉత్పత్తులను వినియోగదారులకు అందజేసే సేవ
A) వైద్యం
B) విద్య
C) అకౌంటెంట్
D) వ్యాపారి
జవాబు:
D) వ్యాపారి
3. ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను, రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూసే సేవ
A) వైద్యం
B) అకౌంటెంట్
C) విద్య
D) డ్రైవర్
జవాబు:
B) అకౌంటెంట్
4. చేసిన పని స్వభావాన్ని తెలిపేది
A) వరి
B) వస్త్రం
C) సేవ
D) గోధుమ
జవాబు:
C) సేవ
5. త్రివిధ దళాలకు చెందిన సైనిక, నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి.
A) విద్య
B) ఆరోగ్య వైద్య సేవలు
C) ప్రభుత్వరంగం
D) రక్షణరంగం
జవాబు:
D) రక్షణరంగం
6. విత్త కార్యకలాపాలకు సంబంధించినవి
A) బ్యాంకులు
B) వర్తకం
C) రక్షణ రంగం
D) ఆరోగ్య వైద్య సేవలు
జవాబు:
A) బ్యాంకులు
7. వీరు వ్యక్తిగత సేవలకు చెందినవారు
A) ఇళ్ళలో పనిచేయువారు
B) బట్టలు ఉతుకువారు
C) శుభ్రపరిచేవారు
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ
8. భారతదేశంలో ఉద్యోగాలు చేసేవారిలో ఎన్నవ వంతు సేవా కార్యకలాపాలు కలిగిఉన్నారు?
A) 1/4 వంతు
B) 1/5 వంతు
C) 1/6 వంతు
D) 1/7 వంతు
జవాబు:
A) 1/4 వంతు
9. 1990 ల ప్రథమార్ధంలో ఈ పరిజ్ఞానంలో బృహత్తరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
A) సమాచార
B) సాంకేతిక పరిజ్ఞానం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
10. లండన్‌లోని బ్యాంక్ డిపాజిట్ల సమాచారాన్ని తెలుసుకొనుటకు ఉపయోగపడు సెంటర్
A) కాల్ సెంటర్
B) టెలిఫోన్ సెంటర్
C) పోస్టాఫీసు
D) ఏదీకాదు
జవాబు:
A) కాల్ సెంటర్
11. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, పారిశ్రామిక రంగంలో ఉన్న గట్టి పోటీవల్ల చాలా పరిశ్రమలు తమ కార్యకలాపాలలో అధిక భాగాన్ని ఈ రంగంవైపు మళ్ళించాయి.
A) సేవారంగం
B) వ్యవసాయరంగం
C) పారిశ్రామిక రంగం
D) పైవన్నీ
జవాబు:
A) సేవారంగం
12. ఈ ఉద్యోగం నా జీవితాన్ని కచ్చితంగా సౌకర్యవంతం చేసింది అని ఏ ఇంజనీర్ అభిప్రాయం?
A) హార్డ్ వేర్
B) సాఫ్ట్ వేర్
C) స్థానిక
D) సివిల్
జవాబు:
B) సాఫ్ట్ వేర్
13. ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి.
A) 2011
B) 2012
C) 2013
D) 2014
జవాబు:
B) 2012
14. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో ఎంత శాతం వృథా అవుతున్నాయి?
A) 20 – 30%
B) 20 – 40%
C) 20 – 50%
D) 30 – 60%
జవాబు:
B) 20 – 40%
15. ఆరోగ్య రంగంలో భారతదేశం ఎన్ని లక్షల వృత్తి సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది?
A) 64 లక్షలు
B) 65 లక్షలు
C) 66 లక్షలు
D) 68 లక్షలు
జవాబు:
A) 64 లక్షలు
16. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్య
A) 4 గురు
B) 5 గురు
C) 6 గురు
D) 7 గురు
జవాబు:
C) 6 గురు
17. వైద్య పరీక్షల నిపుణులలో ఎంతమంది కొరత ఉంది అనగా
A) 60 వేలు
B) 62 వేలు
C) 63 వేలు
D) 64 వేలు
జవాబు:
B) 62 వేలు
18. భారతదేశ నూతన ఆర్థిక విధానాలు కూడా ఈ కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.
A) సేవా
B) వ్యవసాయం
C) పారిశ్రామిక
D) ఏదీకాదు
జవాబు:
A) సేవా
19. సేవా కార్యకలాపాలలో ఇవి ఒక పెద్ద భాగస్వామ్యముగా చెప్పవచ్చు
A) వాణిజ్య కార్యకలాపాలు
B) పరిశ్రమలు
C) ప్రభుత్వాలు
D) ప్రజలు
జవాబు:
A) వాణిజ్య కార్యకలాపాలు
20. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఇతర రకాల టెలికమ్యూనికేషన్ లాంటివి ఏ రంగము?
A) సేవల రంగం
B) ఉత్పత్తి రంగం
C) పారిశ్రామిక రంగం
D) ప్రభుత్వ రంగం
జవాబు:
A) సేవల రంగం
21. గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లాంటివి ఏ కోవకు చెందినది?
A) సేవల రంగం
B) పరిశ్రమల రంగం
C) ప్రజల రంగం
D) రాజకీయ రంగం
జవాబు:
A) సేవల రంగం
22. సేవారంగాన్ని ముందుకు నడిపించేది
A) సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు
B) వ్యవసాయరంగంలో నిరంతర మార్పు.
C) పరిశ్రమలలో నిరంతర మార్పు
D) ప్రభుత్వాలలో నిరంతర మార్పు
జవాబు:
A) సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు
23. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి ….. వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
A) వినియోగ
B) ఆర్జిత
C) పొదుపు
D) అధిక
జవాబు:
A) వినియోగ
24. వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలను విజయవంతం చేయటానికి అవసరమైనవి.
A) సేవా కార్యక్రమాలు
B) కార్మిక కార్యక్రమాలు
C) ప్రజా కార్యక్రమాలు
D) ప్రభుత్వం
జవాబు:
A) సేవా కార్యక్రమాలు
25. భారతదేశంలోని ప్రజలు వ్యవసాయం నుండి ……. రంగంలోనికి మారాల్సిన అవసరం ఉంది.
A) పరిశ్రమలు
B) సేవలు
C) ప్రాథమిక
D) A మరియు B
జవాబు:
B) సేవలు
26. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను ….. యువతకు కల్పిస్తోంది.
A) నిరుద్యోగ
B) ఉద్యోగ
C) కార్మిక
D) ప్రభుత్వ శాఖల
జవాబు:
A) నిరుద్యోగ
27. బహుళజాతి కంపెనీలు అనగా
A) విదేశాలలో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలు
B) స్వదేశీ కంపెనీలు
C) స్వదేశీ సహాయంతో ఏర్పాటు చేసే కంపెనీలు
D) పెట్టుబడి లేకుండా పెట్టే కంపెనీలు
జవాబు:
A) విదేశాలలో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలు
28. వినియోగదారులకు నేరుగా వస్తువులను విక్రయించే వర్తకాన్ని …… అంటారు.
A) చిల్లర వర్తకం
B) టోకు వర్తకం
C) ఇంటింటి అమ్మకం
D) కొనుగోలు
జవాబు:
A) చిల్లర వర్తకం
29. ఉత్పత్తి జరగాలంటే వీటి అవసరము ప్రధానంగా ఉంది.
A) సేవా కార్యకలాపాలు
B) స్వదేశీ కంపెనీల కార్యకలాపాలు
C) ప్రభుత్వ పరిశ్రమలు
D) విదేశీ కంపెనీలు
జవాబు:
A) సేవా కార్యకలాపాలు
30. పారామెడి లని ఎవరిని అంటారు?
A) అనుబంధ వైద్య వృత్తి నిపుణులు
B) శిక్షణ వైద్య నిపుణులు
C) ప్రభుత్వ వైద్య నిపుణులు
D) ప్రైవేటు వైద్య నిపుణులు
జవాబు:
A) అనుబంధ వైద్య వృత్తి నిపుణులు
31. భారత్ లో పునరావాస వృత్తి సంబంధిత వృత్తి నిపుణులలో ఇంతమంది కొరత ఉంది.
A) 18 లక్షల మంది
B) 12 లక్షల మంది
C) 20 లక్షల మంది
D) 50 లక్షల మంది
జవాబు:
A) 18 లక్షల మంది
32. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు అత్యధిక ఉద్యోగితను కల్పించిన సంవత్సరము
A) 2010
B) 2004
C) 2006
D) 2014
జవాబు:
A) 2010
33. ఒక సంస్థకు అవసరమైన సేవలను తక్కువ ఖర్చుతో బయటి నుండి పొందటాన్ని ఇలా పిలుస్తారు.
A) పొరుగు సేవలు
B) ప్రభుత్వ సేవలు
C) ప్రైవేటు సేవలు
D) ప్రజల సేవలు
జవాబు:
A) పొరుగు సేవలు
34. పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా ……. ఉత్పత్తి పెరుగుతుంది.
A) వ్యవసాయ
B) పరిశ్రమలు
C) సేవల
D) చేనేత
జవాబు:
A) వ్యవసాయ
35. భారతదేశంలో డాక్టరు, జనాభా నిష్పత్తి ఇలా ఉంది.
A) 0.5 : 1000
B) 0.3 : 1000
C) 0.4 : 1000
D) 1.6 : 1000
జవాబు:
A) 0.5 : 1000
36. భారత్ లో వృత్తి సేవా (ఆరోగ్య) సంబంధ నిపుణుల కొరత అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో ఎంత ఉంది?
A) 10 లక్షలు
B) 20 లక్షలు
C) 30 లక్షలు
D) 64 లక్షలు
జవాబు:
A) 10 లక్షలు
37. ఒక దేశంలోని సమాచారాన్ని మరో దేశంలో ఉండి తెలుసుకోవటానికి అవకాశం ఉన్న ఇంటర్నెట్ తో అనుసంధానం చేయబడి, ఉన్న కార్యాలయాలను ఈ పేరుతో పిలుస్తారు.
A) కాల్ సెంటర్లు
B) పెన్ సెంటర్లు
C) టెలిగ్రాఫ్ సెంటర్లు
D) మనీ సెంటర్లు
జవాబు:
A) కాల్ సెంటర్లు
38. భారతదేశ జాతీయ ఆదాయంలో సేవల రంగం ఎంత వాటాను కలిగి ఉన్నది?
A) 59%
B) 69%
C) 72%
D) 40%
జవాబు:
A) 59%
39. అమెరికాలో డాక్టరు, జనాభా నిష్పత్తి ఇలా ఉంది.
A) 5.5 : 1000
B) 4.5 : 1000
C) 2.4 : 1000
D) 4.2 : 1000
జవాబు:
A) 5.5 : 1000
40. బ్యూటీపార్లర్ నడపడం అనేది ఈ కోవకు చెందినది.
A) వ్యక్తిగత సేవలు
B) పారిశ్రామిక సేవలు
C) విత్త సేవలు
D) విలాస సేవలు
జవాబు:
A) వ్యక్తిగత సేవలు
41. భారతదేశంలో పునరావాస వృత్తి సంబంధిత వృత్తి నిపుణులలో ఎంత కొరత ఉంది?
A) 9 లక్షలు
B) 18 లక్షలు
C) 20 లక్షలు
D) 10 లక్షలు
జవాబు:
B) 18 లక్షలు
42. భారతదేశంలో ఆపరేషన్, మత్తుమందుకు సంబంధించిన నిపుణులలో ఇంత కొరత ఉంది.
A) 9 లక్షలు
B) 10 లక్షలు
C) 5 లక్షలు
D) 2 లక్షలు
జవాబు:
A) 9 లక్షలు
43. భారతదేశంలో దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో ఇంత మంది నిపుణుల కొరత ఉంది.
A) 2 లక్షలు
B) 5 లక్షలు
C) 20 లక్షలు
D) 10 లక్షలు
జవాబు:
C) 20 లక్షలు
44. “వాణిజ్య ప్రకటన” అనేది ఈ రంగానికి చెందినది
A) వ్యవసాయ రంగం
B) పరిశ్రమల రంగం
C) ప్రాథమిక రంగం
D) సేవల రంగం
జవాబు:
D) సేవల రంగం
45. బహుళజాతి కంపెనీల (MNC) వలన ఈ క్రింది లాభం చేకూరును
A) వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగును.
B) చేతివృత్తులకు గిరాకీ పెరుగును.
C) స్థలాలకు గిరాకీ పెరుగును.
D) ఉద్యోగాలకు గిరాకీ పెరుగును.
జవాబు:
A) వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగును.
46. వ్యవసాయ ఉత్పత్తులను ఈ ప్రాంతంలో నిల్వ ఉంచుతారు
A) గిడ్డంగులు
B) బిల్డింగులు
C) మార్కెట్లు
D) వ్యాపారస్తులు
జవాబు:
A) గిడ్డంగులు
47. భారత్ లో కంటికి సంబంధించిన నిపుణుల కొరత ఇంత ఉంది
A) 2.5 లక్షలు
B) 1.3 లక్షలు
C) 5.2 లక్షలు
D) 10 లక్షలు
జవాబు:
B) 1.3 లక్షలు
48. ఉత్పాదక సామర్థ్యం ఉన్నచోట ఈ రంగం సుస్థిరమైన ప్రగతి సాధిస్తుంది
A) సేవలు
B) పెట్టుబడులు
C) ప్రభుత్వం
D) నైపుణ్యం
జవాబు:
A) సేవలు
49. ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది
A) సేవ
B) వినియోగము
C) వినిమయము
D) పంపిణి
జవాబు:
A) సేవ
50. బహుళజాతి కంపెనీల (MNC) వల్ల ఇవి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది
A) వాణిజ్య ప్రకటనలు
B) మార్కెట్లు
C) సేవలు
D) పంపిణి
జవాబు:
B) మార్కెట్లు
51. కింది వాటిలో ప్రాథమిక రంగానికి సంబంధించిన కార్యకలాపం ఏది?
A) కుండల తయారీ
B) గనుల త్రవ్వకం
C) బుట్టల తయారీ
D) విద్య
జవాబు:
B) గనుల త్రవ్వకం
పైన ఇవ్వబడిన పటాన్ని పరిశీలించి 52 నుండి 55 ప్రశ్నలకు జవాబులు రాయండి.
52. గుజరాత్ లో సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్ గల నగరం
A) పూనె
B) జైపూర్
C) గాంధీనగర్
D) భువనేశ్వర్
జవాబు:
C) గాంధీనగర్
53. సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్ లేని రాష్ట్రం ఏది?
A) రాజస్థాన్
B) గుజరాత్
C) ఛత్తీస్ గఢ్
D) ఉత్తరప్రదేశ్
జవాబు:
C) ఛత్తీస్ గఢ్
54. ఆంధ్రప్రదేశ్ లో ఈ నగరంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్
A) రాజమండ్రి
B) అమరావతి
C) తిరుపతి
D) విశాఖపట్నం
జవాబు:
B) అమరావతి
55. ఈశాన్య భారతదేశంలోని సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఇచట ఉంది
A) కోల్‌కతా
B) భువనేశ్వర్
C) గువహతి
D) ఇండోర్
జవాబు:
C) గువహతి
56. భారతదేశపు ఎలక్ట్రానిక్స్ రాజధాని అని పిలువబడే నగరం
A) హైదరాబాద్
B) బెంగళూరు
C) ఢిల్లీ
D) చెన్నై
జవాబు:
B) బెంగళూరు
57. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం
A) వ్యవసాయరంగం
B) పారిశ్రామిక రంగం
C) సేవారంగం
D) సమాచార సాంకేతిక రంగం
జవాబు:
A) వ్యవసాయరంగం
II. జతపరచుము:
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేది | A) అకౌంటెంట్ |
2. వ్యాపారాన్ని నిర్వహించేది | B) డ్రైవర్ |
3. ఖాతాలను, బిల్లులను సరిచూసేది | C) డాక్టర్ |
4. రవాణా చేసేది | D) వ్యాపారి |
5. విత్తకార్యకలాపం | E) బ్యాంకు |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేది | C) డాక్టర్ |
2. వ్యాపారాన్ని నిర్వహించేది | D) వ్యాపారి |
3. ఖాతాలను, బిల్లులను సరిచూసేది | A) అకౌంటెంట్ |
4. రవాణా చేసేది | B) డ్రైవర్ |
5. విత్తకార్యకలాపం | E) బ్యాంకు |
ii)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. రక్షణ రంగం | A) సేవారంగం |
2. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ | B) త్రివిధదళాలు |
3. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు | C) 2012 |
4. వృత్తి సేవా నిపుణుల కొరత | D) 64 లక్షలు |
5. వైద్య పరీక్షల నిపుణుల కొరత | E) 62 వేలు |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. రక్షణ రంగం | B) త్రివిధదళాలు |
2. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ | A) సేవారంగం |
3. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు | C) 2012 |
4. వృత్తి సేవా నిపుణుల కొరత | D) 64 లక్షలు |
5. వైద్య పరీక్షల నిపుణుల కొరత | E) 62 వేలు |