Practice the AP 9th Class Social Bits with Answers 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో రాయండి.
1. ఈ సంవత్సరం తరవాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు.
A) 1940
B) 1945
C) 1947
D) 1950
జవాబు:
C) 1947
2. యంత్రాలు నడపటానికి కావలసిన ఇంధన వనరు
A) పెట్రోలు
B) డీజిల్
C) విద్యుత్
D) ఏదీకాదు
జవాబు:
C) విద్యుత్
3. మౌలిక సౌకర్యాలు అని వీటిని అంటాం.
A) యంత్రాలు
B) విద్యుత్
C) ఖనిజాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
4. పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతం కావడాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) పారిశ్రామిక వ్యవస్థలు
B) బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు
C) పై రెండూ
D) ఏదీ కాదు
జవాబు:
B) బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు
5. మన దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా
A) 10%
B) 12%
C) 14%
D) 16%
జవాబు:
C) 14%
6. విదేశీ పరక ద్రవ్య ఆదాయంలో వస్త్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆయ శాతం
A) 24 %
B) 24.6%
C) 27%
D) 28%
జవాబు:
B) 24.6%
7. ప్రస్తుత మన దేశంలో నూలు మిల్లుల సంఖ్య
A) 100
B) 1600
C) 1700
D) 1800
జవాబు:
B) 1600
8. గుజరాత్, మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలు నెలకొని ఉండటానికి కారణం
A) ముడిపదార్థాలు దొరకటం
B) మార్కెటు, రేవు సౌకర్యాలుండటం
C) కార్మికులు, తేమ వాతావరణం ఉండటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
9. నూలు వడకటం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉంది.
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) తమిళనాడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
10. భారతదేశం ఈ దేశానికి నూలు ఎగుమతి చేస్తున్నది.
A) జపాన్
B) జర్మనీ
C) ఇటలీ
D) అమెరికా
జవాబు:
A) జపాన్
11. జనపనార వస్తువులు ఉత్పత్తిలో ఈ దేశానిది మొదటి స్థానం
A) బంగ్లాదేశ్
B) బర్మా
C) భారత్
D) ఇటలీ
జవాబు:
C) భారత్
12. మొదటి జనపనార మిల్లు స్థాపించబడిన ప్రదేశం
A) కాన్పూర్
B) రిష్రా
C) ముంబయి
D) ఢిల్లీ
జవాబు:
B) రిష్రా
13. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2
14. ఖనిజ ఆధారిత పరిశ్రమలు వీటిపై ఆధారపడి పనిచేస్తాయి.
A) ఖనిజాలు
B) లోహాలు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
15. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిదారు లలో భారతదేశం యొక్క స్థానం
A) 8
B) 9
C) 10
D) 11
జవాబు:
B) 9
16. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య
A) 5
B) 6
C) 7
D) 8
జవాబు:
D) 8
17. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
C) 3
18. సహకార రంగంలో నిర్మించిన ఎరువుల కర్మాగారం ఇచ్చట కలదు.
A) గుజరాత్ లోని హజీరా
B) మహారాష్ట్రలోని ముంబయి
C) ఢిల్లీ
D) హైదరాబాద్
జవాబు:
A) గుజరాత్ లోని హజీరా
19. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైలో నిర్మించిన సంవత్సరం
A) 1900
B) 1902
C) 1904
D) 1906
జవాబు:
C) 1904
20. 2005 మార్చి 31 నాటికి ఐటి పరిశ్రమలో ఉపాధి పొందిన వారి సంఖ్య సుమారుగా
A) 10 లక్షలు
B) 12 లక్షలు
C) 14 లక్షలు
D) 16 లక్షలు
జవాబు:
A) 10 లక్షలు
21. భారత్ లో జనపనార పరిశ్రమ ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తున్న కార్మికుల సంఖ్య
A) 2.61 లక్షలు
B) 6.26 లక్షలు
C) 16.2 లక్షలు
D) 6.36 లక్షలు
జవాబు:
A) 2.61 లక్షలు
22. అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో ఉపయోగించే బాక్సైట్ ఈ రంగులో ఉంటుంది.
A) ముదురు ఎరుపు
B) నీలం
C) ఎరుపు
D) గోధుమ
జవాబు:
A) ముదురు ఎరుపు
23. భారతదేశంలో ఈ నగరాన్ని ఎలక్ట్రానిక్స్ రాజధాని అని పిలుస్తారు.
A) చెన్నై
B) బెంగళూరు
C) ముంబై
D) ఢిల్లీ
జవాబు:
B) బెంగళూరు
24. నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించిన సంవత్సరము …..
A) 1950
B) 1952
C) 1991
D) 1947
జవాబు:
C) 1991
25. గుజరాత్ లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఉన్న పరిశ్రమ
A) వ్యవసాయ పరిశ్రమ
B) ఎరువుల పరిశ్రమ
C) రంగుల పరిశ్రమ
D) చేనేత పరిశ్రమ
జవాబు:
B) ఎరువుల పరిశ్రమ
26. భారతీయ రసాయనిక పరిశ్రమలు ఆసియాలో ఎన్నో స్థానం ఆక్రమించినవి?
A) 4వ
B) 3వ
C) 2వ
D) 1వ
జవాబు:
B) 3వ
27. భారతీయ రసాయనిక పరిశ్రమలు ప్రపంచంలో ఎన్నో స్థానం ఆక్రమించినవి?
A) 21 వ
B) 12 వ
C) 4 వ
D) 5 వ
జవాబు:
B) 12 వ
28. భారత్ లో ప్రస్తుతం 128 పెద్ద, 332 చిన్న కర్మాగారాలు గల పరిశ్రమ
A) సిమెంటు
B) చేనేత
C) ఔళి
D) పేపరు
జవాబు:
A) సిమెంటు
29. భారతదేశంలో సుమారుగా జనపనార మిల్లులు ఇన్ని కలవు
A) 70
B) 90
C) 100
D) 200
జవాబు:
A) 70
30. జనపనార పరిశ్రమలు ఎక్కువగా భారత్ లో ఈ నదీతీరంలో కేంద్రీకృతమై ఉన్నాయి
A) హుగ్లీ నదీ తీరం
B) కృష్ణానదీ తీరం
C) గోదావరినదీ తీరం
D) గంగానదీ తీరంలో
జవాబు:
A) హుగ్లీ నదీ తీరం
31. “జాతీయ జనపనార విధానాన్ని” భారత్ లో ప్రవేశపెట్టిన ఈ సంవత్సరము
A) 2005
B) 2010
C) 1947
D) 1950
జవాబు:
A) 2005
32. భారత్ లో వ్యవసాయం తరవాత అత్యంత అధిక ఉపాధి కల్పించే పరిశ్రమ
A) సిమెంట్
B) వస్త్ర
C) పేపరు
D) ఎరువులు
జవాబు:
B) వస్త్ర
33. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఎన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది?
A) 3.5 కోట్లు
B) 2.5 కోట్లు
C) 4.5 కోట్లు
D) 7 కోట్లు
జవాబు:
A) 3.5 కోట్లు
34. సైకిళ్ళ తయారీకి దీనిని ఉపయోగిస్తారు
A) ముడిలోహం
B) ఉక్కు
C) ప్లాస్టిక్
D) గ్రీజు
జవాబు:
B) ఉక్కు
35. బట్టను తయారుచేసే ఆధునిక పరిశ్రమకు చేతి మగ్గం కాకుండా దీనితో నడిచే మరమగ్గాలు కావాలి
A) విద్యుత్తు
B) కార్మికులు
C) గాలి
D) పైవేవీకావు
జవాబు:
A) విద్యుత్తు
36. కొబ్బరిపీచు పరిశ్రమ ఈ క్రింది పరిశ్రమని పిలుస్తారు?
A) సహకార పరిశ్రమ
B) చిన్న పరిశ్రమ
C) పెద్ద పరిశ్రమ
D) మౌలిక పరిశ్రమ
జవాబు:
A) సహకార పరిశ్రమ
37. వస్త్ర పరిశ్రమ నుంచి భారతదేశనాకి స్థూల జాతీయోత్పత్తి (G.D.P) లో ఎంత శాతం వస్తుంది?
A) 4%
B) 5%
C) 6%
D) 7%
జవాబు:
A) 4%
38. భారత్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ ని ఒకప్పుడు ఇలా పిలిచేవారు.
A) తూర్పు పాకిస్తాన్
B) సువర్ణభూమి
C) అంగరాజ్యం
D) హిమాలయ రాజ్యం
జవాబు:
A) తూర్పు పాకిస్తాన్
39. 1947 నాటికి భారత్ లో జనపనార ఉత్పత్తిలో నాల్గింట మూడువంతుల ప్రాంతం దీనిలో ఉండిపోయింది.
A) బంగ్లాదేశ్
B) పాకిస్తాన్
C) బర్మా
D) శ్రీలంక
జవాబు:
A) బంగ్లాదేశ్
40. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది
A) తేయాకు తయారి
B) పంచదార
C) ఇనుము – ఉక్కు
D) చేనేత
జవాబు:
C) ఇనుము – ఉక్కు
41. దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చేవి
A) ఎగుమతులు
B) దిగుమతులు
C) కార్మికులు
D) పరిశ్రమలు
జవాబు:
A) ఎగుమతులు
42. భారత్ లో ఈ నిల్వలు లేనందున మొత్తంగా దిగుమతి చేసుకుంటున్న ఎరువులు
A) పొటాష్
B) నత్రజని
C) అమ్మోనియ సల్ఫేట్
D) బాక్సైట్
జవాబు:
A) పొటాష్
43. ఈ క్రింది వాటిలో ఒక వస్తువు ఎలక్ట్రానిక్ పరికరము.
A) చరవాణి
B) సైకిల్
C) ఫాస్ఫేటు
D) అద్దకం రంగు
జవాబు:
A) చరవాణి
44. ఇతర లోహాలతో కలిసినపుడు బాగా దృఢంగా అయ్యే లోహం
A) అల్యూమినియం
B) జింక్
C) నత్రజని
D) ఫాస్ఫరస్
జవాబు:
A) అల్యూమినియం
45. ఈ దేశాల మార్కెట్ కి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు నెలకొని ఉన్నాయి.
A) మాంగనీసు
B) క్రోమియం
C) అల్యూమినియం
D) ఫాస్ఫేటు
జవాబు:
A) మాంగనీసు
46. పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ‘పెరగటంతో భారత్ లోని ఈ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.
A) జనపనార
B) వస్త్ర
C) సిమెంట్
D) రంగులు
జవాబు:
A) జనపనార
47. పంచదార పరిశ్రమలో ముడిసరుకు (చెరుకుగడలు) రవాణా చేయడం ద్వారా. చెరకులోని ఇది తగ్గుతుంది.
A) సుక్రోజ్
B) కాల్షియం
C) ఫాస్ఫేటు
D) మొలాసిస్
జవాబు:
A) సుక్రోజ్
48. 2004లో భారత్ లో అల్యూమినియం ఉత్పత్తి ….. పైగా చేసింది.
A) 600 మి. టన్నులు
B) 900 మి. టన్నులు
C) 1000 మి. టన్నులు
D) 2 వేల మి. టన్నులు
జవాబు:
A) 600 మి. టన్నులు
49. N.P.K అంటే ……. ఎరువులు.
A) నత్రజని, పొటాష్, భాస్వరం
B) నత్రికామ్లం, ఫాస్ఫరస్, కాల్షియం
C) నైట్రోజన్, ఫిలిస్పేర్, కాల్షియం
D) పొటాష్, నత్రజని, భాస్వరం
జవాబు:
A) నత్రజని, పొటాష్, భాస్వరం
50. దీనిలో భారతదేశానికి ప్రపంచస్థాయి నాణ్యత ఉంది.
A) నూలు వడకటం
B) రంగుల అద్దకం
C) చేనేత పరిశ్రమలు
D) కాగితపు పరిశ్రమ
జవాబు:
A) నూలు వడకటం
51. కింది లక్షణాలను ఆధారంగా చేసుకొని సరైన పరిశ్రమను గుర్తించండి.
1) భారతదేశ లోహ పరిశ్రమలలో ఇది రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
2) ఇది తేలికగా ఉంటుంది మరియు తుప్పుపట్టదు.
3) దీనిని విమానాల తయారీలో ఉపయోగిస్తారు.
A) ఇనుము, ఉక్కు కర్మాగారం
B) సిమెంటు పరిశ్రమ
C) రాగి శుద్ధి కర్మాగారం
D) అల్యూమినియం శుద్ధి కర్మాగారం
జవాబు:
D) అల్యూమినియం శుద్ధి కర్మాగారం
52. తేలికగా వుంటుంది, తుప్పు పట్టదు, వేడి బాగా ప్రసరిస్తుంది. దీనిని విమానాలు, పాత్రలు, తీగల తయారీకి ఉపయోగిస్తారు.
పై విషయాలు ఏ లోహం గురించి తెలియజేస్తున్నాయి?
A) గల్ఫ్
B) యూరప్
C) అమెరికా
D) ఇంగ్లాండ్
జవాబు:
C) అమెరికా
53. భారతదేశపు ఎలక్ట్రానిక్స్ రాజధానిగా ఎదిగిన నగరం :
A) చెన్నై
B) పూనే
C) హైదరాబాదు
D) బెంగళూరు
జవాబు:
D) బెంగళూరు
54. బెల్లం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం
A) బంగ్లాదేశ్
B) భారతదేశం
C) చైనా
D) పాకిస్తాన్
జవాబు:
B) భారతదేశం
55. జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో గల దేశం
A) భారతదేశం
B) శ్రీలంక
C) బంగ్లాదేశ్
D) ఇంగ్లాండ్
జవాబు:
B) శ్రీలంక
56. పారిశ్రామికీకరణ సందర్భంలో పెరిగిపోతున్న పెద్ద సమస్య?
A) పెట్టుబడి కొరత
B) సాంకేతికత లోపం
C) పర్యావరణ కాలుష్యము
D) ఉపాధికల్పన
జవాబు:
C) పర్యావరణ కాలుష్యము
57. 9వ తరగతి గదిలో ఒక అంశంపై చర్చ జరుగుతుంది.
రాజు : ‘పరిశ్రమలు దేశాభివృద్ధికి చాలా అవసరం, ఉపాధికల్పనకు, వస్తూత్పత్తికి కీలకం పరిశ్రమలే’ అన్నాడు.
సావిత్రి : ‘పరిశ్రమలు అవసరమేకాని, వాటివల్ల కాలుష్యం పెరిగిపోతున్నది. వనరులు త్వరగా అంతరించి పోతున్నాయి. అది పెట్టుబడిదారీ విధానానికి దారితీస్తుంది.” అన్నది. ఈ వాదనల ఆధారంగా వారు చర్చిస్తున్న ప్రధాన అంశం ఏమై ఉంటుంది?
A) అంతరించిపోతున్న వనరులు
B) పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు
C) పర్యావరణ కాలుష్యం
D) సమయం – ప్రాముఖ్యత
జవాబు:
B) పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు
58. “మనమందరమూ సింథటిక్ ఉత్పత్తులకు బదులుగా జనుము ఉత్పత్తులనే వాడాలి.”
A) లేదు, ఇది సరికాదు.
B) అవును, జనుము ఉత్పత్తులు పర్యావరణహితమైనవి కనుక మనం జనుము ఉత్పత్తులనే వాడాలి.
C) అవును, జనుము పండించే రైతులకోసం మనం జనుము ఉత్పత్తులనే వాడాలి.
D) సింథటిక్ ఉత్పత్తులు చవకైనవి కనుక . మనం సింథటిక్ ఉత్పత్తులను మాత్రమే వాడాలి.
జవాబు:
B) అవును, జనుము ఉత్పత్తులు పర్యావరణహితమైనవి కనుక మనం జనుము ఉత్పత్తులనే వాడాలి.
59. “పరిశుభ్రమైన భారతదేశం, స్వచ్ఛ భారత్ గురించి భావితరంగా మనం చేయగలిగిందేమిటో మనం ఆలోచించాలి.”
A) అవును, అత్యంత శుభ్రమైన దేశమే మన లక్ష్యం కావాలి.
B) మనం ఇప్పుడు మన చదువు, మన మార్కులు తప్ప మరేమీ పట్టించుకోకూడదు.
C) ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయడం, మొక్కలు పెంచడం, టాయిలెట్లను వాడటం వంటివి అలవరచుకోవాలి.
D) మనం కేవలం విద్యార్థులం కనుక ఈ విషయంలో మనం చేయగలిగిందేమీ ఉండదు.
జవాబు:
C) ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయడం, మొక్కలు పెంచడం, టాయిలెట్లను వాడటం వంటివి అలవరచుకోవాలి.
60. భారతదేశ మొదటి సిమెంట్ కర్మాగార నిర్మాణం
A) 1905 – ముంబాయి
B) 1906 – చెన్నై
C) 1904 – చెన్నై
D) 1906 – ముంబాయి
జవాబు:
C) 1904 – చెన్నై
61. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం
A) నాల్గవ
B) మూడవ
C) రెండవ
D) ఆరవ
జవాబు:
C) రెండవ
62. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది
A) తేయాకు తయారీ
B) ఇనుము – ఉక్కు పరిశ్రమ
C) పంచదార పరిశ్రమ
D) జనపనార పరిశ్రమ
జవాబు:
B) ఇనుము – ఉక్కు పరిశ్రమ
63. అల్యూమినియం శుద్ధి కర్మాగారంలో ఉపయోగించే ముడిఖనిజం
A) రాగి
B) జింకు
C) బాక్సైట్
D) సీసం
జవాబు:
C) బాక్సైట్
64. జనపనార పరిశ్రమ పశ్చిమబెంగాల్ లో కేంద్రీకృతం కావటానికి కారణం
A) నీటి మీద తక్కువ ఖర్చుతో రవాణా
B) జనపనార ఉత్పత్తి ప్రాంతాలు దగ్గరగా ఉండడం
C) రేవు సౌకర్యాలు
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
65. భారతదేశంలో పంచదార అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం
A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తరప్రదేశ్
C) గుజరాత్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
B) ఉత్తరప్రదేశ్
66. క్రింది వానిలో పర్యావరణ హితమైనది.
A) నైలాన్
B) పాలిస్టర్
C) రేయాన్
D) జనుము
జవాబు:
D) జనుము
II. జతపరచుము:
i)
గ్రూపు -ఎ | గ్రూపు -బి |
1. దేశ అభివృద్ధి | A) యంత్రాలు, విద్యుత్ |
2. పారిశ్రామిక ప్రగతి | B) వ్యవసాయ ఆధారిత పరిశ్రమ |
3. మౌలిక సౌకర్యాలు | C) ఖనిజాధార పరిశ్రమ |
4. వస్త్ర పరిశ్రమ | D) 1947 తరువాత |
5. ఇనుము – ఉక్కు కర్మాగారం | E) పరిశ్రమ |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు -బి |
1. దేశ అభివృద్ధి | E) పరిశ్రమ |
2. పారిశ్రామిక ప్రగతి | D) 1947 తరువాత |
3. మౌలిక సౌకర్యాలు | A) యంత్రాలు, విద్యుత్ |
4. వస్త్ర పరిశ్రమ | B) వ్యవసాయ ఆధారిత పరిశ్రమ |
5. ఇనుము – ఉక్కు కర్మాగారం | C) ఖనిజాధార పరిశ్రమ |
ii)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. నూలు మిల్లులు | A) 1907 |
2. మొదటి నూలు మిల్లు | B) 1904 |
3. మొదటి జనపనార పరిశ్రమ | C) 1859 |
4. మొదటి సిమెంట్ మిల్లు | D) 1854 |
5. మొదటి ఇనుము – ఉక్కు పరిశ్రమ | E) 1600 |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. నూలు మిల్లులు | E) 1600 |
2. మొదటి నూలు మిల్లు | D) 1854 |
3. మొదటి జనపనార పరిశ్రమ | C) 1859 |
4. మొదటి సిమెంట్ మిల్లు | B) 1904 |
5. మొదటి ఇనుము – ఉక్కు పరిశ్రమ | A) 1907 |
iii)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ఎలక్ట్రానిక్స్ రాజథాని | A) పంచదార పరిశ్రమ |
2. ప్రభుత్వ ఎరువుల కర్మాగారాలు | B) బెంగళూరు |
3. నూతన పారిశ్రామిక విధానం | C) 10 |
4. రసాయనిక పరిశ్రమలు | D) 1991 |
5. పంటపండే ప్రదేశంలో నెలకొల్పబడే పరిశ్రమ | E) ఆసియాలో 3వ స్థానం |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ఎలక్ట్రానిక్స్ రాజథాని | B) బెంగళూరు |
2. ప్రభుత్వ ఎరువుల కర్మాగారాలు | C) 10 |
3. నూతన పారిశ్రామిక విధానం | D) 1991 |
4. రసాయనిక పరిశ్రమలు | E) ఆసియాలో 3వ స్థానం |
5. పంటపండే ప్రదేశంలో నెలకొల్పబడే పరిశ్రమ | A) పంచదార పరిశ్రమ |