Practice the AP 9th Class Social Bits with Answers 5th Lesson జీవావరణం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 5th Lesson జీవావరణం

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం
A) భూమి
B) శుక్రుడు
C) బుధుడు
D) కుజుడు
జవాబు:
A) భూమి

2. భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనిని …………. అంటారు.
A) శిలావరణం
B) జీవావరణం
C) జలావరణం
D) వాతావరణం
జవాబు:
B) జీవావరణం

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

3. ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం అవుతుంది. దీనిని ………….. అంటారు.
A) ఆహారపు గొలుసు
B) అధిపత్యం
C) పెత్తందారీతనం
D) బలవంతునిదే రాజ్యం
జవాబు:
A) ఆహారపు గొలుసు

4. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు
A) మొక్కలు
B) జంతువులు
C) మానవులు
D) ఎవరూకాదు
జవాబు:
A) మొక్కలు

5. శాకాహార జంతువులకు ఉదాహరణ
A) కుక్క
B) పిల్లి
C) డేగ
D) జింక
జవాబు:
D) జింక

6. మాంసాహార జంతువులకు ఉదాహరణ
A) జింక
B) ఆవు
C) మేక
D) కుక్క
జవాబు:
D) కుక్క

7. నాచు, లిచెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను ఈ వృక్షజాలం అంటారు.
A) టండ్రా
B) టైగా
C) సతత హరిత
D) ఉష్ణమండల
జవాబు:
A) టండ్రా

8. భూమధ్యరేఖా ప్రాంతంలో పెరిగే అడవులు
A) టండ్రా
B) టైగా
C) ఉష్ణమండల సతత హరిత
D) ఋతుపవనారణ్యాలు
జవాబు:
C) ఉష్ణమండల సతత హరిత

9. భారతదేశంలో అధిక భాగంలో పెరిగే అడవులు
A) ఉష్ణమండల ఆకురాల్చు
B) సమశీతోష్ణు సతతహరిత
C) సమశీతోష్ణ ఆకురాల్చు
D) ఉష్ణమండల సతత హరిత
జవాబు:
A) ఉష్ణమండల ఆకురాల్చు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

10. ఈశాన్య ప్రాంతంలో పెరిగే అడవులు
A) ఉష్ణమండల ఆకురాల్చు
B) సమశీతోష్ణ ఆకురాల్చు
C) సమశీతోష్ణ సతత హరిత
D) ఉష్ణమండల సతత హరిత
జవాబు:
B) సమశీతోష్ణ ఆకురాల్చు

11. మైనం పూత వంటి ఆకులు గల అడవులు ఇచ్చట కలవు.
A) మధ్యధరా వృక్షజాలం
B) శృంగాకార అడవులు
C) సమశీతోష్ణ సతత హరిత
D) ఉష్ణమండల సతత హరిత
జవాబు:
A) మధ్యధరా వృక్షజాలం

12. మెత్తటి కలప ఈ అడవుల నుండి లభిస్తుంది.
A) మధ్యధరా వృక్షజాలం
B) శృంగాకారపు అడవులు
C) ఉష్ణమండల సతత హరిత
D) సమశీతోష్ణ సతత హరిత
జవాబు:
B) శృంగాకారపు అడవులు

13. మధ్య అక్షాంశాల వద్ద, ఖండాల లోపలి భాగాలలో కనిపించే గడ్డిభూములను ఈ విధంగా పిలుస్తాము.
A) ప్రయరీలు
B) పంపాలు
C) స్టెప్పీలు
D) వెల్లులు
జవాబు:
C) స్టెప్పీలు

14. భూమిని మార్చే ప్రక్రియ వేగవంతం కావడానికి ప్రధాన కారణం
A) పారిశ్రామిక విప్లవం
B) వలసప్రాంతాలను ఆక్రమించటం
C) పై రెండు
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండు

15. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం జరిగిన సంవత్సరం
A) 1997
B) 2000
C) 2004
D) 2008
జవాబు:
A) 1997

16. పశువుల వ్యర్థ పదార్థాలు కుళ్ళుగా ఏర్పడిన దానిని ……. అంటారు.
A) సేంద్రీయ మూలకాలు
B) కృత్రిమ ఎరువులు
C) పోషకాలు
D) ఏదీకాదు
జవాబు:
A) సేంద్రీయ మూలకాలు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

17. మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని ……….. అని పిలుస్తారు.
A) మాంసాహారులు
B) శాఖాహారం
C) ఎరువులు
D) ప్రాథమిక ఆహారం
జవాబు:
B) శాఖాహారం

18. మానవులు ఉపయోగించిన మొట్టమొదటి శక్తి వనరు …..
A) మాంసము
B) ఆహారము
C) నిప్పు
D) చక్రము
జవాబు:
C) నిప్పు

19. మెత్తని కలపతో ….. తయారుచేస్తారు.
A) అగ్గిపుల్లలు
B) అట్టపెట్టెలు
C) చెక్కలు
D) కొయ్యలు
జవాబు:
A) అగ్గిపుల్లలు

20. ఉత్తరార్ధగోళంలో 500 నుంచి 70° అక్షాంశాల మధ్య అద్భుతమైన ……. అడవులు కనబడతాయి.
A) సతత
B) శృంగాకారపు
C) ఆకురాల్చు
D) మధ్యధరా
జవాబు:
B) శృంగాకారపు

21. భారతదేశంలో అధిక భాగంలో ………….. అడవులు ఉంటాయి.
A) ఉష్ణమండల ఆకురాల్చు
B) ముళ్ళపొదలు
C) శృంగాకారపు
D) టండ్రా
జవాబు:
A) ఉష్ణమండల ఆకురాల్చు

22. చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ
A) వెదురు
B) రోజ్ వుడ్
C) నాచు, లిచెన్
D) ముళ్ళపొదలు
జవాబు:
C) నాచు, లిచెన్

23. లక్షల సంవత్సరాల క్రితం అడవులు భూమి లోపలికి తిరగబడటం వల్ల …… ఏర్పడ్డాయి.
A) బొగ్గు, చమురులు
B) చెట్లు
C) జంతువులు
D) సరీసృపాలు
జవాబు:
A) బొగ్గు, చమురులు

24. బొగ్గు, చమురులకు మరొక పేరు …….
A) సహజవనరులు
B) శిలాజ ఇంధనాలు
C) రాళ్ళపొరలు
D) ఏదీకాదు
జవాబు:
B) శిలాజ ఇంధనాలు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

25. శృంగాకారపు అడవులకు మరొక పేరు ……..
A) ముళ్ళపొదలు
B) సెల్వాలు
C) టైగా
D) ఆకురాల్చు
జవాబు:
C) టైగా

26. గడ్డి కురచగా ఉండే సమశీతోష్ణ మండల గడ్డి భూములను …… అంటారు.
A) స్టెప్పీలు
B) ఆకురాల్చు
C) ముళ్ళపొదలు
D) సతత హరిత
జవాబు:
A) స్టెప్పీలు

27. శిలాజ ఇంధనాలు ఉపయోగించుట వలన ప్రధానంగా ఈ వాయువు విడుదల అవుతుంది.
A) పొగ
B) బొగ్గుపులుసు
C) మంటలు
D) నైట్రోజన్
జవాబు:
B) బొగ్గుపులుసు

28. శిలాజ ఇంధనాలలో భాగంగా గంధక, కర్బన, నత్రిత ఆమ్లాలు విడుదలై ……. కురుస్తాయి.
A) కార్బన్ డై ఆక్సైడ్
B) నిప్పులు
C) ఆమ్ల వర్షాలు
D) వడగండ్లు
జవాబు:
C) ఆమ్ల వర్షాలు

29. ఆధునిక పరిశ్రమలు ………… రూపాలలో వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తున్నాయి.
A) ఆక్సిజన్
B) ఆమ్ల
C) కర్బన
D) ఘన, ద్రవ, వాయు
జవాబు:
D) ఘన, ద్రవ, వాయు

30. పశువుల చికిత్సలో …….. మందును వాడుతున్నారు.
A) అమ్మోనియా
B) డైక్లోఫెనాక్
C) సల్ఫర్
D) కార్బన్
జవాబు:
B) డైక్లోఫెనాక్

31. సమశీతోష్ణ సతత హరిత అడవులు భారతదేశంలో …… ప్రాంతంలో కలవు.
A) ఉత్తర భారతం
B) పర్వత ప్రాంతాలు
C) నీలగిరి
D) హిమాలయ
జవాబు:
C) నీలగిరి

32. నారింజ, నిమ్మ, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలు ……. వృక్షజాలంలో పండిస్తున్నారు.
A) ముళ్ళపొదలు
B) ఆకురాల్చు
C) సతత హరిత
D) మధ్యధరా
జవాబు:
D) మధ్యధరా

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

33. ఎండాకాలంలో నీటిని పొదుపు చేయడానికి ఈ అడవులు తమ ఆకులను రాలుస్తాయి.
A) ఉష్ణమండల ఆకురాల్చు
B) సతత హరిత
C) ముళ్ళపొదలు
D) శృంగాకారపు
జవాబు:
A) ఉష్ణమండల ఆకురాల్చు

34. చలికాలంలో చలిని, ఎండాకాలంలో ఎండను తట్టుకునే వృక్షజాలం
A) సతత హరిత
B) మధ్యధరా
C) సైబీరియా
D) ఆకురాల్చు
జవాబు:
B) మధ్యధరా

35. మధ్యధరా వృక్షజాలంలో మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వలన కలిగే లాభము …..
A) చెట్లు ఎక్కువ కాలం బ్రతుకును
B) విపరీతంగా పెరుగుతాయి
C) బాష్పోత్సేకం తక్కువ
D) తీవ్ర వర్షాన్ని తట్టుకోగలవు
జవాబు:
C) బాష్పోత్సేకం తక్కువ

36. చెట్లకు మందపాటి ఆకులుండి, బాష్పోత్సేకం తక్కువగా ‘ఉన్నాయి. ఉంటే ……….
A) ఆ చెట్లు తీవ్ర వేసవిని తట్టుకొనును
B) వర్షాన్ని తట్టుకొనును
C) బలంగా ఉండును
D) ఏదీకాదు
జవాబు:
A) ఆ చెట్లు తీవ్ర వేసవిని తట్టుకొనును

37. ఋతువులననుసరించి ……….. అడవులు ఉంటాయి.
A) సతత హరిత
B) ఉష్ణమండల ఆకురాల్చు
C) మధ్యధరా
D) ముళ్ళపొదలు
జవాబు:
B) ఉష్ణమండల ఆకురాల్చు

38. పర్యావరణం వేడెక్కడానికి ప్రధాన కారణం ……
A) కాలుష్యం
B) గాలి
C) ఉష్ణోగ్రత
D) భూమి
జవాబు:
A) కాలుష్యం

39. అడవి జంతువులు లేని ఏకైక వృక్షజాలం ……..
A) సమశీతోష్ణ
B) మధ్యధరా
C) ఎడారి
D) శృంగాకారపు
జవాబు:
B) మధ్యధరా

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

40. ధృవపు ఎలుగుబంటి …… అడవులలో ఎక్కువగా ఉంటాయి
A) ముళ్ళపొదలు
B) ఆకురాల్చు
C) శృంగాకారపు
D) మధ్యధరా
జవాబు:
C) శృంగాకారపు

41. పులులు, సింహాలు ……….. అరణ్యాలలో ఎక్కువగా ఉంటాయి.
A) ఉష్ణమండల ఆకురాల్చు
B) ముళ్ళపొదలు
C) శృంగాకారపు
D) మధ్యధరా
జవాబు:
A) ఉష్ణమండల ఆకురాల్చు

42. మొక్కలు ప్రధానంగా …… మీద ఆధారపడి ఉన్నవి.
A) పరిస్థితులు
B) గాలి, నీరు
C) వేడి
D) ఉష్ణోగ్రత
జవాబు:
B) గాలి, నీరు

43. మొక్కలు నేలలో బ్యా క్టీరియా స్థిరీకరించిన …….. పై కూడా ఇవి ఆధారపడతాయి.
A) నత్రజని
B) ఆక్సిజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) ఏదీకాదు
జవాబు:
C) కార్బన్ డై ఆక్సైడ్

44. ఈ క్రింది వాటిలో ఔషధ గుణాలు గల మొక్క ……
A) మామిడి
B) వేప
C) సపోటా
D) చింత
జవాబు:
B) వేప

45. ఈ క్రింది వాటిలో ఏ చెట్టును కాగితం తయారీకి ఉపయోగిస్తారు?…….
A) వేప
B) చిన్
C) మర్రి
D) జామ
జవాబు:
B) చిన్

46. హిమాలయాలలో ఈ రకపు అడవులు అధికంగా
A) టైగా
B) మధ్యధరా
C) ఆకురాల్చు
D) సతత హరిత
జవాబు:
A) టైగా

47. మీరు ‘సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవప్రాంత ఎలుగుబంటి వంటి జంతువులను వాటి సహజావరణంలో చూడదలచు కొంటే, కింది వానిలో ఏ అడవి అనువైనది?
A) ఉష్ణమండల గడ్డిభూములు
B) శృంగాకారపు అడవులు
C) సతతహరిత అడవులు
D) ఆకురాల్చే అడవులు
జవాబు:
B) శృంగాకారపు అడవులు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

48. కింది వాటిలో మధ్యధరా శీతోష్ణస్థితి మరియు వృక్షజాలం మొక్క లక్షణం కానిది
A) ఈ ప్రాంతంలోని వృక్షాలు మందపాటి బెరడు, మైనం పూత ఆకులు కలిగి ఉంటాయి.
B) ఈ ప్రాంతంలోని వృక్షాలు ఎండాకాలంలో ఆకులు రాలుస్తాయి.
C) ఈ ప్రాంతం వేసవిలో తీవ్ర ఎండలు, శీతాకాలంలో వానలు పడతాయి.
D) నారింజ వంటి నిమ్మజాతి చెట్లు; అంజూర, ఆలివ్ మరియు ద్రాక్ష వంటి పంటలను పండిస్తారు.
జవాబు:
B) ఈ ప్రాంతంలోని వృక్షాలు ఎండాకాలంలో ఆకులు రాలుస్తాయి.

49. చలి నుండి రక్షించుకోవడానికి కొన్ని జంతువులు మంద పాటి చర్మం, ఒత్తైన బొచ్చు కలిగి ఉంటాయి. ఈ రకమైన జంతువులను సామాన్యంగా ఏ వృక్షజాలం గల ప్రాంతా లలో మీరు చూడగలరు?
A) మధ్యధరా వృక్షజాలం
B) సతత హరితారణ్యాలు
C) టండ్రా
D) సవన్నా గడ్డిభూములు
జవాబు:
C) టండ్రా

50. ఉష్ణమండల ఆకురాల్చే అడవుల్లో చెట్లు ఎండాకాలంలోనే ఎందుకు ఆకులు రాలుస్తాయి?
A) ఎరువును పొందుటకు
B) నీటిని పొదుపు చేసుకొనుటకు
C) మరిన్ని కొమ్మలను పెంచుకొనుటకు
D) వాటి వేర్లను పెంచుకోనుటకు
జవాబు:
B) నీటిని పొదుపు చేసుకొనుటకు

51. కింది వాక్యాలను చదవండి.
1) ఉత్తరార్ధ గోళంలో ఉన్నత అక్షాంశాల వద్ద, ఎత్తైన ప్రాంతాలలో కన్పిస్తాయి.
2) పొడవైన మెత్తటి కలపనిచ్చే చెట్లు – ఈ కలప కలప గుజ్జు, అగ్గిపెట్టెలు, ప్యాకేజింగ్ పెట్టెల తయారీకి ఉపయోగిస్తారు.
3) చిర్, పైన్, సెడార్ ఈ ప్రాంతంలో పెరిగే చెట్లు పై వాక్యాలలో ఏ అడవుల గురించి చెప్పబడింది?
A) మధ్యధరా
B) టండ్రాలు
C) శృంగాకార అడవులు
D) సతత హరిత అడవులు
జవాబు:
C) శృంగాకార అడవులు

52. ఉష్ణమండల సతత హరిత అడవులలో చెట్లన్నీ ఒకేసారి ఆకులు రాల్చడం ఉండదు. దీనికి కారణం
A) అవి ఉన్నత అక్షాంశాల వద్ద నెలకొని ఉండటం
B) పగటిపూట కూడా అక్కడ సూర్యకాంతి పడకపోవడం.
C) అక్కడ పొడిగా ఉండే కాలం లేకపోవడం.
D) ఆ చెట్లు గట్టి కలపనిచ్చేవి కావడం.
జవాబు:
B) పగటిపూట కూడా అక్కడ సూర్యకాంతి పడకపోవడం.

53. సమశీతోష్ణ మండలం : స్టెప్పీలు : : ఉష్ణమండలం : ?
A) ప్రయరీలు
B) సవన్నాలు
C) పంపాలు
D) డౌనులు
జవాబు:
B) సవన్నాలు

54. చిర్, పైన్, సెడార్ : శృంగాకారపు అడవులు :: రోజ్ వుడ్, ఎబొని, మహాగని : ?
A) సతత హరిత అడవులు
B) ఆకురాల్చే అడవులు
C) మధ్యధరా అడవులు
D) టండ్రా అడవులు
జవాబు:
A) సతత హరిత అడవులు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

55. భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు
A) మొక్కలు
B) పక్షులు
C) మానవులు
D) జంతువులు
జవాబు:
A) మొక్కలు

56. మెత్తని కలపకు ప్రసిద్ది చెందిన అడవులు
A) టండ్రా వృక్షజాలం
B) శృంగాకార అడవులు
C) మధ్యధరా వృక్షజాలం
D) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
జవాబు:
B) శృంగాకార అడవులు

57. చనిపోయిన మొక్కలు, జంతువులు వాటి వ్యర్థ పదార్థాలపై పనిచేసి సేంద్రీయ మూలకాలుగా విచ్ఛిన్నం చేసేవి
A) బ్యాక్టీరియా
B) శిలీంధ్రాలు
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B

58. భారతదేశంలో అత్యధిక భాగంలో ఏ రకమైన అడవులు కలవు?
A) అయనరేఖా సతతహరిత అరణ్యాలు
B) ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు
C) సమశీతోష్ణ మండల సతత హరిత అరణ్యాలు
D) సమశీతోష్ణ మండల ఆకురాల్చు అరణ్యాలు
జవాబు:
B) ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు

AP 9th Class Social Bits Chapter 5 జీవావరణం

59. భూగోళంపై అత్యధిక జీవం ఇక్కడ ఉంది
A) భూమి ఉపరితలంపై
B) గాలిలో
C) నీటిలో
D) అంతరిక్షంలో
జవాబు:
C) నీటిలో

II. జతపరచుము :
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. జీవం A) ఉష్ణమండల సతత హరితారణ్యాలు
2. ఆహారపు గొలుసు B) శాకాహార జంతువులను తినడం
3. శాకాహారులు C) భూమి
4. మాంసాహారులు D) ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం
5. భూమధ్యరేఖా ప్రాంతం E మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని తినడం

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. జీవం C) భూమి
2. ఆహారపు గొలుసు D) ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం
3. శాకాహారులు E మొక్కలు తయారుచేసిన ఆహారాన్ని తినడం
4. మాంసాహారులు B) శాకాహార జంతువులను తినడం
5. భూమధ్యరేఖా ప్రాంతం A) ఉష్ణమండల సతత హరితారణ్యాలు

ii)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. భారతదేశం A) సమశీతోష్ణ సతత హరిత అడవులు
2. వాయవ్య అమెరికా B) సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు
3. చైనా C) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
4. మధ్యధరా సముద్రం చుట్టూ D) శృంగాకారపు అడవులు
5. ఉత్తరార్ధగోళంలోని 50 నుంచి 70 అక్షాంశాలు E) మధ్యధరా వృక్షజాలం

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. భారతదేశం C) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
2. వాయవ్య అమెరికా A) సమశీతోష్ణ సతత హరిత అడవులు
3. చైనా B) సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు
4. మధ్యధరా సముద్రం చుట్టూ E) మధ్యధరా వృక్షజాలం
5. ఉత్తరార్ధగోళంలోని 50 నుంచి 70 అక్షాంశాలు D) శృంగాకారపు అడవులు

iii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. క్యోటో ప్రోటోకాల్ A) ఎడారిప్రాంతాలు
2. గ్లోబల్ వార్మింగ్ B) 1997
3. టండ్రా వృక్షజాలం C) భూమి వేడెక్కడం
4. స్టెప్పీలు D) నాచు, లిచెన్
5. ముళ్లపొదలు E) గడ్డిభూములు

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. క్యోటో ప్రోటోకాల్ B) 1997
2. గ్లోబల్ వార్మింగ్ C) భూమి వేడెక్కడం
3. టండ్రా వృక్షజాలం D) నాచు, లిచెన్
4. స్టెప్పీలు E) గడ్డిభూములు
5. ముళ్లపొదలు A) ఎడారిప్రాంతాలు