Practice the AP 9th Class Social Bits with Answers 3rd Lesson జలావరణం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 3rd Lesson జలావరణం
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. నీళ్లు పునరావృతమయ్యే
A) వనరు
B) ఉపాధి
C) వినియోగం
D) ఏదీకాదు
జవాబు:
A) వనరు
2. ద్రవరూపంలోని నీరు వాయురూపంలోకి మారే ప్రక్రియ
A) బాష్పీభవనం
B) రవాణా
C) ద్రవీభవనం
D) అవపాతం
జవాబు:
A) బాష్పీభవనం
3. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం
A) బాష్పీభవనం
B) అవపాతం
C) రవాణా
D) ద్రవీభవనం
జవాబు:
C) రవాణా
4. మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా శాతం
A) 90.25%
B) 97.25%
C) 98.00%
D) 96.05%
జవాబు:
B) 97.25%
5. మొదటిశ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ.
A) ఖండాలు
B) మహాసముద్రాలు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
6. అమెరికా నుంచి ఆసియా, ఓషియానాలను వేరుచేస్తున్న మహాసముద్రం
A) పసిఫిక్ మహాసముద్రం
B) అట్లాంటిక్ మహాసముద్రం
C) హిందూ మహాసముద్రం
D) ఆర్కిటిక్ మహాసముద్రం
జవాబు:
A) పసిఫిక్ మహాసముద్రం
7. అమెరికా నుంచి యూరపు, ఆఫ్రికాలను వేరుచేస్తున్న సముద్రం
A) పసిఫిక్ మహాసముద్రం
B) అట్లాంటిక్ మహాసముద్రం
C) హిందూ మహాసముద్రం
D) ఆర్కిటిక్ మహాసముద్రం
జవాబు:
B) అట్లాంటిక్ మహాసముద్రం
8. ఖండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది?
A) 200 నుంచి 3000
B) 300 నుంచి 4000
C) 400 నుంచి 5000
D) 500 నుంచి 6000
జవాబు:
A) 200 నుంచి 3000
9. ప్రతి 1000 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది?
A) 30
B) 35
C) 40
D) 45
జవాబు:
B) 35
10. అత్యధిక లవణీయతను కలిగియున్న సరస్సు
A) వాన్
B) మృత
C) మహాలవణ
D) ఏదీకాదు
జవాబు:
A) వాన్
11. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు
A) ఐసోహలైన్స్
B) ఐసోబార్స్
C) ఐసోహైట్స్
D) ఏదీకాదు
జవాబు:
A) ఐసోహలైన్స్
12. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత –
A) 3°C నుంచి 30°C
B) 2°C నుంచి 29°C
C) 4°C నుంచి 40°C
D) 4°C నుంచి 25°C
జవాబు:
B) 2°C నుంచి 29°C
13. అవపాతం అత్యధికంగా ఈ ప్రాంతం వద్ద ఉంటుంది.
A) భూమధ్యరేఖా ప్రాంతం
B) ధృవ ప్రాంతం
C) ఉప ధృవ ప్రాంతం
D) సమశీతల ప్రాంతం
జవాబు:
A) భూమధ్యరేఖా ప్రాంతం
14. అత్యధిక ఉష్ణోగ్రతను కలిగియున్న సముద్రం
A) ఎర్ర సముద్రం
B) నల్ల సముద్రం
C) ఆర్కిటిక్ సముద్రం
D) అంటార్కిటిక్ సముద్రం
జవాబు:
A) ఎర్ర సముద్రం
15. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తున్నది ………
A) హిందూ మహాసముద్రం
B) అట్లాంటిక్ మహాసముద్రం
C) దక్షిణ మహాసముద్రం
D) పసిఫిక్ మహాసముద్రం.
జవాబు:
A) హిందూ మహాసముద్రం
16. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ……..
A) నత్రజని
B) ఉప్పు
C) పొటాషియం
D) కార్బెడ్
జవాబు:
B) ఉప్పు
17. 1000 గ్రాముల సముద్రనీటిలో లవణీయత శాతం ………….
A) 20%
B) 30%
C) 35%
D) 100%
జవాబు:
C) 35%
18. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ………….. ల వల్ల భారతదేశములోని నైరుతి ఋతుపవనాలు ప్రభావితమవుతాయి.
A) పవనాలు
B) వ్యాపార పవనాలు
C) స్థానిక పవనాలు
D) ఎల్ నినో, లా నినో
జవాబు:
D) ఎల్ నినో, లా నినో
19. మహాసముద్రాలు వేగంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను …….. అంటారు.
A) స్ట్రీమ్
B) సైక్లోన్స్
C) భూకంపాలు
D) స్థానిక పవనాలు
జవాబు:
A) స్ట్రీమ్
20. మహాసముద్రాలు నిదానంగా ప్రవహిస్తే ఆ ప్రవాహాలను ……. అంటారు.
A) వ్యాపార పవనాలు
B) డ్రిప్ట్స్
C) సైక్లోన్స్
D) భూకేంద్రకాలు
జవాబు:
B) డ్రిప్ట్స్
21. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు …… నుంచి వెలికితీస్తున్నారు.
A) లోయలు
B) నదులు
C) మహాసముద్రాలు
D) గనులు
జవాబు:
C) మహాసముద్రాలు
22. సముద్రగర్భం నుంచి వెలికి తీసి ……
A) మంచినీరు
B) చేపలు
C) ఓడలు
D) చమురు
జవాబు:
D) చమురు
23. భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం …… సెంటీమీటర్లు ఎక్కువగా
A) 8
B) 10
C) 150
D) 100
జవాబు:
A) 8
24. ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టి వచ్చిన నౌక ……..
A) జలసింది
B) ఛాలెంజర్
C) పృథ్వి
D) అక్బర్
జవాబు:
B) ఛాలెంజర్
25. కోట్లాది సంవత్సరాల క్రితం ఉన్న ఒకే ఒక్క మహాసముద్రము ……….
A) గోండ్వానా
B) పాంజియో
C) పాంథాల్సా
D) అంగారా
జవాబు:
C) పాంథాల్సా
26. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు.
A) ఐసోబార్స్
B) మెసోబార్స్
C) అక్షాంశాలు
D) రేఖాంశాలు
జవాబు:
A) ఐసోబార్స్
27. మృత సముద్రం లవణీయత శాతం ……..
A) 250%
B) 238%
C) 35%
D) 45%
జవాబు:
B) 238%
28. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ………. ఉంటాయి.
A) హిమానీనదాలు
B) ప్రవాహాలు
C) ఖనిజాలు
D) లవణాలు
జవాబు:
C) ఖనిజాలు
29. ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని ….. అంటారు.
A) హిమానీనదాలు
B) టైఫూన్స్
C) సైక్లోన్స్
D) సముద్రప్రవాహాలు
జవాబు:
D) సముద్రప్రవాహాలు
30. నీటి ఆవిరి నీరుగా మారటాన్ని ….. అంటారు.
A) ద్రవీభవనము
B) ఆర్థత
C) అవపాతం
D) అభిసరణ
జవాబు:
A) ద్రవీభవనము
31. బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండడానికి గల కారణం
A) తీరపువాలు
B) నీరు తక్కువగా ఆవిరి అవుతుంది
C) ప్రవాహాలు
D) గాలి
జవాబు:
B) నీరు తక్కువగా ఆవిరి అవుతుంది
32. నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ……. అంటారు.
A) ఆర్థత
B) అవపాతము
C) నీటి చక్రం
D) ద్రవీభవనం
జవాబు:
C) నీటి చక్రం
33. జలయుత గ్రహమని దీనిని అంటారు.
A) చంద్రుడు
B) అంగార గ్రహం
C) బుధగ్రహం
D) భూమి
జవాబు:
D) భూమి
34. అత్యధిక లవణీయత ఉన్న వాన్ సరస్సు …… ఈ దేశంలో ఉంది.
A) టర్కీ
B) చైనా
C) ఫ్రాన్స్
D) ఇంగ్లాండ్
జవాబు:
A) టర్కీ
35. మొక్కల నుండి నీరు ఈ ప్రక్రియ ద్వారా వాతావరణం లోకి ప్రవేశిస్తూ ఉంటుంది.
A) పీడనం
B) బాష్పోత్సేకం
C) అభిసరణ
D) పవన వాలు
జవాబు:
B) బాష్పోత్సేకం
36. సముద్ర అలలతో ….. ను ఉత్పత్తి చేస్తున్నారు.
A) త్రాగునీరు
B) వనరు
C) విద్యుత్
D) మత్స్యసంపద
జవాబు:
C) విద్యుత్
37. శతాబ్దాలుగా సముద్రతీరాలలో …… వెల్లివిరిశాయి.
A) ఓడలు
B) ప్రయాణాలు
C) ఖనిజాలు
D) నాగరికతలు
జవాబు:
D) నాగరికతలు
38. హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఈ మహా సముద్రాన్ని పేర్కొంటారు.
A) అంటార్కిటిక్ మహాసముద్రం
B) ఆర్కిటిక్ మహాసముద్రం
C) పసిఫిక్ మహాసముద్రం
D) హిందూ మహాసముద్రం
జవాబు:
A) అంటార్కిటిక్ మహాసముద్రం
39. ఈ మహాసముద్రాన్ని ఒక్కోసారి అట్లాంటిక్ మహా సముద్రంలో భాగంగా పరిగణిస్తారు.
A) ఆర్కిటిక్ మహాసముద్రం
B) హిందూ మహాసముద్రం
C) పసిఫిక్ మహాసముద్రం
D) అంటార్కిటిక్ మహాసముద్రం
జవాబు:
A) ఆర్కిటిక్ మహాసముద్రం
40. ……… వంటివి పునరుద్ధరింపబడే ఇంధన వనరులు.
A) వానలు
B) అలలు, కెరటాలు
C) ఖనిజాలు
D) చమురు
జవాబు:
B) అలలు, కెరటాలు
41. మృత సముద్రం ఈ దేశంలో ఉంది.
A) దుబాయ్
B) మస్కట్
C) ఇజ్రాయెల్
D) ఇరాన్
జవాబు:
C) ఇజ్రాయెల్
42. ……. కారణంగా భూమధ్యరేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది.
A) గురుత్వాకర్షణ
B) పవనాలు
C) భూపరిభ్రమణం
D) భూభ్రమణము
జవాబు:
D) భూభ్రమణము
43. అపకేంద్ర శక్తిలో తేడా కారణంగా భూమధ్యరేఖా ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్ళు ……….. వైపు ప్రవహిస్తాయి.
A) ధృవాల
B) భూమధ్యరేఖ
C) అక్షాంశాల
D) రేఖాంశాల
జవాబు:
A) ధృవాల
44. గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు ……… మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి.
A) 0.50
B) 0.75
C) 50
D) 100
జవాబు:
B) 0.75
45. భూమధ్యరేఖా ప్రాంతం వద్ద అత్యధిక … ఉంటుంది.
A) ఉష్ణము
B) ఆర్ధత
C) అవపాతం
D) జలపాతం
జవాబు:
C) అవపాతం
46. భూమధ్యరేఖ వద్ద అధిక అవపాతం కారణంగా సముద్రపు నీరు ఇలా ప్రవహిస్తుంది.
A) వేగం
B) నెమ్మదిగా
C) స్థిరంగా
D) ఉత్తర, దక్షిణాలుగా
జవాబు:
D) ఉత్తర, దక్షిణాలుగా
47. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్ళు …… చెందుతాయి.
A) వ్యాకోచం
B) సంకోచం
C) పీడనం
D) అల్పపీడనం
జవాబు:
A) వ్యాకోచం
48. మహాసముద్రాల లోపల ఇవి ఉంటాయి.
A) కాలువలు
B) టెర్రాస్
C) చెరువులు
D) అల్పపీడనాలు
జవాబు:
B) టెర్రాస్
49. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ సముద్రంలోని ………. అంచులో ఉంది.
A) మధ్యధరా
B) ఇటలీ
C) సైబీరియా
D) టర్కీ
జవాబు:
C) సైబీరియా
50. ఖండతీరపు అంచులలో ….. నిర్మించవచ్చు.
A) పరిశ్రమలు
B) పట్టణాలు
C) నివాసాలు
D) ఓడరేవులు
జవాబు:
D) ఓడరేవులు
51. కింద జల చక్రంలోని ప్రక్రియలను ఇవ్వడమైనది.
1) సముద్రాల నుంచి ఆవిరి కావడం
2) అవపాతం
3) రవాణా
4) ద్రవీభవనం
5) ఉపరితలంపై ప్రవాహం
కింది వాటిలో బాష్పీభవనం మొదలుగా జలచక్ర ప్రక్రియల సరైన వరుస
A) 1, 2, 3, 4, 5
B) 1, 5, 3, 2, 4
C) 1, 3, 4, 2, 5
D) 1, 3, 2, 5, 4
జవాబు:
C) 1, 3, 4, 2, 5
52. కింది వాక్యాలను పరిశీలించండి.
1) భూగోళం మొత్తం సముద్ర జలాల ఉష్ణోగ్రత ఒకే రకంగా వుంటుంది.
2) పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతా మార్పు ప్రభావం భారత నైరుతి ఋతుపవనాలపై వుంటుంది.
3) పవనాలు మరియు సముద్ర ప్రవాహాలు, సముద్ర జలాల ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తున్నాయి.
పై వాక్యా లలో సరైనవి / సరైనది ఏది?
A) 1 & 2
B) 2 & 3
C) 1 మాత్రమే
D) 2 మాత్రమే
జవాబు:
B) 2 & 3
53. ‘భూమి మీద గల మంచినీటిలో అధికభాగం కింది ఏ రూపంలో ఉంది?
A) నదులు మరియు సరస్సులు
B) మంచు గడ్డలు మరియు మంచు
C) భూగర్భ జలం
D) తేమ
జవాబు:
B) మంచు గడ్డలు మరియు మంచు
54. సుజాత ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన గింజలు, కూరగాయల ముక్కలమీద ఉప్పు చల్లుకొని తిన్నారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం, చేపలకూర తిన్నారు. కింది ఏ యే సందర్భాల్లో సుజాత సముద్ర ఉత్పత్తులను వాడారు?
A) అల్పాహారంలో
B) మధ్యాహ్న భోజనంలో
C) అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో
D) అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో, ప్రయాణంలో
జవాబు:
C) అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో
55. ప్రపంచపు అతి పెద్ద ఖండతీరపు అంచు ఎక్కడ ఉంది?
A) పసిఫిక్ మహాసముద్రంలో
B) అట్లాంటిక్ మహాసముద్రంలో
C) హిందూ మహాసముద్రంలో
D) ఆర్కిటిక్ మహాసముద్రంలో
జవాబు:
D) ఆర్కిటిక్ మహాసముద్రంలో
క్రింది సమాచారం ఆధారంగా 56 నుండి 61 వరకు గల ప్రశ్నలకు జవాబులు రాయండి.
56. పసిఫిక్ మహాసముద్రాన్ని తాకని ఖండము / ఖండాలు
A) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా
B) ఐరోపా, ఆఫ్రికా
C) ఆసియా, ఆస్ట్రేలియా
D) అంటార్కిటికా మాత్రమే
జవాబు:
B) ఐరోపా, ఆఫ్రికా
57. అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి సరైన వాక్యం\
A. ఉత్తర అమెరికా యొక్క తూర్పు సరిహద్దు
B. ఐరోపా యొక్క పశ్చిమ సరిహద్దు
A) A మాత్రమే
B) B మాత్రమే
C) A మరియు B
D) A కాదు మరియు B కూడా కాదు
జవాబు:
C) A మరియు B
58. దక్షిణ మహాసముద్రంగా పిలువబడేది
A) అంటార్కిటిక్ మహాసముద్రము
B) హిందూ మహాసముద్రము
C) అట్లాంటిక్ మహాసముద్రము
D) పసిఫిక్ మహాసముద్రము
జవాబు:
A) అంటార్కిటిక్ మహాసముద్రము
59. అందమైన సూర్యోదయం చూడాలని ధరణి కన్యాకుమారి వెళ్ళింది. అక్కడ ఆమె ఏ మహాసముద్రం మీది సూర్యోదయాన్ని చూస్తుంది?
A) పసిఫిక్ మహాసముద్రం
B) అట్లాంటిక్ మహాసముద్రం
C) హిందూ మహాసముద్రం
D) ఆర్కిటిక్ మహాసముద్రం
జవాబు:
C) హిందూ మహాసముద్రం
60. క్రింది వానిలో ‘ఓషియానాకు చెందని దేశాన్ని గుర్తించండి.
A) ఆస్ట్రేలియా
B) ఫిలిప్పైన్స్
C) పపువా, న్యూగినియా
D) న్యూజిలాండ్
జవాబు:
B) ఫిలిప్పైన్స్
61. అన్ని మహాసముద్రాలను వాటి పరిమాణాన్ని బట్టి వరుస క్రమంలో పేర్చినపుడు చివరి స్థానమునకు వచ్చే మహాసముద్రం
A) ఆర్కిటిక్ మహాసముద్రం
B) హిందూ మహాసముద్రం
C) అట్లాంటిక్ మహాసముద్రం
D) పసిఫిక్ మహాసముద్రం
జవాబు:
A) ఆర్కిటిక్ మహాసముద్రం
62. “ఈనాడు మనం సముద్రాలను సైతం మన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలకు డంపింగ్ యార్డులుగా మార్చివేస్తున్నాము.”
A) ఇది కేవలం ఒక అతిశయోక్తి
B) అవును, ఇది నిజం. మానవులు సముద్రాలను కూడా వదలడం లేదు. ప్రతిదానినీ కలుషితం చేసేస్తున్నారు.
C) సముద్రాలు చాలా పెద్దవి, అవి కలుషితం కావు.
D) ఏమైనా మనం సముద్రాలలో ఏమీ జీవించట్లేదు కనుక మనం బాధ పడాల్సిందేమీ లేదు.
జవాబు:
B) అవును, ఇది నిజం. మానవులు సముద్రాలను కూడా వదలడం లేదు. ప్రతిదానినీ కలుషితం చేసేస్తున్నారు.
63. మహాసముద్రాల నీటి సగటు లవణీయత శాతం
A) 30%
B) 25%
C) 35%
D) 45%
జవాబు:
C) 35%
64. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని ఏమంటారు?
A) అవపాతం
B) భూగర్భజలం
C) అలలు
D) ఏదీకాదు
జవాబు:
A) అవపాతం
65. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను, ఐరోపా ఆఫ్రికా ఖండాల నుండి వేరు చేస్తున్న మహాసముద్రం
A) హిందూ మహాసముద్రం
B) పసిఫిక్ మహాసముద్రం
C) ఆర్కిటిక్ మహాసముద్రం
D) అట్లాంటిక్ మహాసముద్రం
జవాబు:
D) అట్లాంటిక్ మహాసముద్రం
66. సముద్ర ప్రవాహాలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సత్యము?
A) శీతల మరియు ఉష్ణప్రవాహాలు ధృవాల వైపు ప్రవహిస్తాయి.
B) శీతల మరియు ఉష్ణ ప్రవాహాలు భూమధ్యరేఖ వైపునకు ప్రవహిస్తాయి.
C) ఉష్ణప్రవాహాలు ధృవాల వైపునకు, శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ వైపునకు ప్రవహిస్తాయి.
D) ఉష్ణ ప్రవాహాలు భూమధ్యరేఖ వైపునకు, శీతల ప్రవాహాలు ధృవాల వైపునకు ప్రవహిస్తాయి.
జవాబు:
C) ఉష్ణప్రవాహాలు ధృవాల వైపునకు, శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ వైపునకు ప్రవహిస్తాయి.
67. ప్రపంచంలో ఎత్తైన జలపాతం
A) జోగ్
B) ఏంజెల్
C) నయాగరా
D) విక్టోరియా
జవాబు:
B) ఏంజెల్
68. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి.
A) బాష్పీభవనము
B) ద్రవీభవనము
C) లవణీయత
D) అవపాతము
జవాబు:
C) లవణీయత
69. ఎల్ నినో, లానినో లకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యము
ఎ) ఇవి నైఋతి ఋతుపవనాలను ప్రభావితం చేస్తున్నాయి.
బి) భారతదేశ వ్యవసాయము వీటి ప్రభావమునకు గురవుతున్నది.
సి) ఇవి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను కల్పిస్తున్నాయి.
డి) ఇవి హిందూ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడుతున్నాయి.
A) (ఎ), (బి)
B) (సి), (డి)
C) (సి)
D) (డి)
జవాబు:
D) (డి)
II. జతపరచుము :
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అవపాతం | A) లోపలికి ఇంకిన నీరు |
2. భూగర్భజలం | B) ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టి వచ్చిన నౌక |
3. ఛాలెంజర్ | C) కోట్లాది సం||రాల క్రితం ఉన్న ఒకే ఒక్క మహాసముద్రం |
4. పాంథాల్సా | D) భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం |
5. ఖండతీరపు అంచు | E) వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అవపాతం | E) వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరటం |
2. భూగర్భజలం | A) లోపలికి ఇంకిన నీరు |
3. ఛాలెంజర్ | B) ప్రపంచాన్ని విజయవంతంగా చుట్టి వచ్చిన నౌక |
4. పాంథాల్సా | C) కోట్లాది సం||రాల క్రితం ఉన్న ఒకే ఒక్క మహాసముద్రం |
5. ఖండతీరపు అంచు | D) భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం |
ii)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ఖండతీరపు వాలు | A) ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు |
2. మహాసముద్ర మైదానాలు | B) 35% |
3. మహాసముద్ర అగాధాలు | C) సన్నగా లోతుగా 6000 మీటర్లు వరకు ఉంటాయి. |
4. సముద్ర లవణీయత | D) తక్కువ వాలుతో ఉంటాయి. |
5. ఐసోబార్స్ | E) 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ఖండతీరపు వాలు | E) 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. |
2. మహాసముద్ర మైదానాలు | D) తక్కువ వాలుతో ఉంటాయి. |
3. మహాసముద్ర అగాధాలు | C) సన్నగా లోతుగా 6000 మీటర్లు వరకు ఉంటాయి. |
4. సముద్ర లవణీయత | B) 35% |
5. ఐసోబార్స్ | A) ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు |
iii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. వాన్ సరస్సు లవణీయత | A) 220% |
2. మృత సరస్సు లవణీయత | B) 15% |
3. మహాలవణ సరస్సు లవణీయత | C) 5% |
4. బాల్టిక్ సముద్ర లవణీయత | D) 330% |
5. హడ్సన్ అఖాతం లవణీయత | E) 238% |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. వాన్ సరస్సు లవణీయత | D) 330% |
2. మృత సరస్సు లవణీయత | E) 238% |
3. మహాలవణ సరస్సు లవణీయత | A) 220% |
4. బాల్టిక్ సముద్ర లవణీయత | B) 15% |
5. హడ్సన్ అఖాతం లవణీయత | C) 5% |