Practice the AP 9th Class Social Bits with Answers 24th Lesson రోడ్డు భద్రతా విద్య on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 24th Lesson రోడ్డు భద్రతా విద్య

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో రాయండి.

1. వాహనాల రద్దీ పెరగడానికి ప్రధాన కారణం
A) జనాభా పెరుగుదల
B) పారిశ్రామికీకరణ
C) నగరీకరణ, గ్లోబలైజేషన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. రోడ్డును ఉపయోగించే వారందరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడం
A) క్రమబద్దీకరణ
B) పారిశ్రామికీకరణ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) క్రమబద్దీకరణ

AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య

3. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేవాటిని ఈ విధంగా పిలుస్తారు.
A) ట్రాఫిక్
B) సరుకులు
C) నియంత్రణ
D) ఏదీకాదు
జవాబు:
A) ట్రాఫిక్

4. ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా, స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) ట్రాఫిక్
B) ట్రాఫిక్ విద్య
C) ట్రిఫిక్ నియమాలు
D) ట్రాఫిక్ నిబంధనలు
జవాబు:
B) ట్రాఫిక్ విద్య

5. ఈ వయస్సు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురౌతున్నారు.
A) 20 – 25
B) 25 – 30
C) 30 – 35
D) 35 – 40
జవాబు:
B) 25 – 30

6. ఏమి లేకుండా వాహనాలను నడపరాదు?
A) డ్రైవింగ్ లైసెన్స్
B) హెల్మెట్
C) రేషన్ కార్డు
D) ఆధార్‌కార్డు
జవాబు:
A) డ్రైవింగ్ లైసెన్స్

7. 50 సి.సి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు
A) 18 సం||లు
B) 19 సం||లు
C) 20 సం||లు
D) 21 సం||లు
జవాబు:
A) 18 సం||లు

8. వస్తువుల, మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయస్సు :
A) 20 సం||లు
B) 21 సం||లు
C) 25 సం||లు
D) 30 సం||లు
జవాబు:
C) 25 సం||లు

9. లైసెన్స్ పొందటానికి ఈ పరీక్షలకు గురి కావలసి ఉంటుంది.
A) లెర్నర్ టెస్ట్
B) వర్ణ అంధత్వ పరీక్ష
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

10. వాహనాలను నడిపేవారు పోలీసులు అడిగినపుడు చూపించవలసిన ధ్రువపత్రాలు ఏవి?
A) ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్
B) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
C) డ్రైవింగ్ లైసెన్స్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

11. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ధ్రువపత్రాలు ఏవి?
A) అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధ్రువపత్రం
B) రోడ్డుపై నడపటానికి వీలైనది అని ధ్రువీకరణ పత్రం
C) వాహన బీమా ధ్రువపత్రం, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

12. రోడ్డుపై పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం
A) ఫుట్ పాత్
B) డివైడర్
C) జీబ్రా క్రాసింగ్
D) ఏదీకాదు
జవాబు:
C) జీబ్రా క్రాసింగ్

AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య

13. గీతకు ముందు ఆగాలని సూచించే గుర్తు
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) ఏదీకాదు
జవాబు:
A) ఎరుపు

14. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించే గుర్తు
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) నీలం
జవాబు:
B) ఆరెంజ్

15. వాహనాన్ని కదిలించమని సూచించే గుర్తు ….
A) ఎరుపు
B) ఆరెంజ్
C) ఆకుపచ్చ
D) పసుపు
జవాబు:
C) ఆకుపచ్చ

16. తాగి వాహనం నడిపే వారి వాహనాలను అధికారులు ….. చేయవచ్చు.
A) సీజ్
B) జప్తు
C) లైసెన్స్ కాన్సిల్
D) కౌన్సిలింగ్
జవాబు:
A) సీజ్

17. తాత్కాలికమైన డ్రైవింగ్ లైసెను ….. అంటారు.
A) ట్రయల్
B) లెర్నర్ లైసెన్స్
C) ప్రీ లెర్నర్
D) కౌన్సిలింగ్ లైసెన్స్
జవాబు:
B) లెర్నర్ లైసెన్స్

18. లెర్నర్ లైసెన్స్ పొందిన తరువాత …. నుంచి ……. రోజులలోపుగా శాశ్వత లైసెన్స్ ఇస్తారు.
A) 20 – 50
B) 30 – 60
C) 30 – 180
D) 100 – 200
జవాబు:
C) 30 – 180

19. ….. లేకుండా ఏ వాహనాన్ని నడపరాదు.
A) లైసెన్స్
B) పెట్రోలు
C) చెకింగ్
D) రిజిస్ట్రేషన్
జవాబు:
D) రిజిస్ట్రేషన్

20. రోడ్డును రెండు సమభాగాలుగా విభజించేది ………..
A) డివైడర్
B) జీబ్రా క్రాసింగ్
C) ఆకుపచ్చ
D) Y జంక్షన్
జవాబు:
A) డివైడర్

21. భారతదేశం ప్రపంచంలో ……. అతి పెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం.
A) ప్రథమ
B) రెండవ
C) మూడవ
D) పదవ
జవాబు:
B) రెండవ

22. రాత్రి వేళల్లో నడిచేటప్పుడు పాదచారులు విధిగా దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు
A) సిగ్నల్
B) కౌన్సిలింగ్
C) టార్చిలైటు
D) కర్ర
జవాబు:
C) టార్చిలైటు

23. రోడ్డుపై నడుచునపుడు, రోడ్డును దాటుతున్నపుడు ……. నుపయోగించరాదు.
A) లగేజి
B) వస్తువులు
C) కర్ర
D) మొబైల్ ఫోన్
జవాబు:
D) మొబైల్ ఫోన్

AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య

24. ……… చేయించుకుని మాత్రమే వాహనాన్ని రోడ్డుపై నడపాలి.
A) బీమా
B) రంగులు
C) నంబర్ ప్లేట్
D) పూజ
జవాబు:
A) బీమా

25. ద్విచక్ర వాహనదారులు ……. విధిగా ధరించి వాహనాలు నడపాలని ప్రభుత్వ సూచన.
A) డ్రస్సు
B) హెల్మెట్
C) సిగ్నల్
D) కళ్ళజోడు
జవాబు:
B) హెల్మెట్

26. ఆ గుర్తు దీనిని తెలియజేస్తుంది …..
A) దారిలేదు
B) మళ్ళించుట
C) నేరుగా వెళ్ళుట
D) దారి కలదు
జవాబు:
C) నేరుగా వెళ్ళుట

27. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే వాటిని …… అంటాం.
A) కౌన్సిలింగ్
B) వాహనాలు
C) రవాణా
D) ట్రాఫిక్
జవాబు:
D) ట్రాఫిక్

28. పాదచారులు నడిచే దారి సుమారు …….. వెడల్పు ఉంటుంది.
A) 2 మీ.
B) 4 మీ.
C) 5 మీ.
D) 10 మీ.
జవాబు:
A) 2 మీ.

29. వాహన చోదకులు ఖచ్చితంగా ఇది తమ వద్ద ఉంచుకోవాలి.
A) డబ్బులు
B) డ్రైవింగ్ లైసెన్స్
C) పెట్రోలు
D) కళ్ళజోడు
జవాబు:
B) డ్రైవింగ్ లైసెన్స్

30. ప్రతి డ్రైవర్ విధిగా ఇలాంటి వాహనాన్ని ఉపయోగించాలి.
A) నెమ్మదిగా వెళ్ళే వాహనం
B) వేగంగా వెళ్ళే వాహనం
C) తక్కువ కార్బన్ మొనాక్సైడ్ వదిలే వాహనాలు
D) ఎక్కువ కార్బన్ మొనాక్సైడ్ వదిలే వాహనాలు
జవాబు:
C) తక్కువ కార్బన్ మొనాక్సైడ్ వదిలే వాహనాలు

31. రోడ్డు దాటేటప్పుడు ఎవరూ సహాయం లేనప్పుడు విధిగా వీరి సహాయం కావాలి
A) పిల్లల
B) పెద్దల
C) యువకుల
D) ట్రాఫిక్ పోలీసు
జవాబు:
D) ట్రాఫిక్ పోలీసు

32. వీటిలో ఏవి సమాచార గుర్తులు …..
A) నీలంరంగు దీర్ఘచతురస్రం
B) ఎరుపురంగు
C) ఆకుపచ్చ
D) గోధుమరంగు
జవాబు:
A) నీలంరంగు దీర్ఘచతురస్రం

33. జాగ్రత్త పరిచే గుర్తులు అనగా ….. గుర్తులు.
A) చతురస్రాకారపు
B) ముక్కోణంలో ఉన్న గుర్తులు
C) ప్రమాదపు
D) అనుమానపు
జవాబు:
B) ముక్కోణంలో ఉన్న గుర్తులు

34. ఎర్ర వృత్తాలు ….. తెలియజేస్తాయి.
A) పనిష్మెంట్
B) ప్రమాదము
C) తప్పనిసరిగా పాటించేవి
D) పాటించకూడనివి
జవాబు:
C) తప్పనిసరిగా పాటించేవి

AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య

35. ద్విచక్ర వాహనదారులు …… డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
A) జిరాక్స్
B) ట్రాఫిక్
C) ఏజెంట్
D) గడువు తీరని
జవాబు:
D) గడువు తీరని

36. హెల్మెట్ …… ని సూచిస్తుంది.
A) రక్షిత ప్రయాణం
B) ఆగాలని
C) వెళ్ళాలని
D) వాహనం కదిలించమని
జవాబు:
A) రక్షిత ప్రయాణం

37. త్రాగి డ్రైవింగ్ చేసినవారు …. లో జరిమానా చెల్లించాలి.
A) పోలీస్ స్టేషన్
B) కోర్టులో
C) RTA ఆఫీస్ లో
D) రోడ్డులో
జవాబు:
B) కోర్టులో

38. ఆల్కాహాల్ త్రాగి మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ తో పాటు …. ఆనవాలు ఉంటుంది.
A) శ్రమ
B) వినోదం
C) ఆల్కహాల్
D) ఆనందం
జవాబు:
C) ఆల్కహాల్

39. శ్రీ గుర్తు దీనిని తెలియజేస్తుంది ……
A) ముందుకు వెళ్ళు
B) వెనక్కి వెళ్ళు
C) దారిలేదు
D) రెండువైపులా వాహనాలు నిషేధం
జవాబు:
D) రెండువైపులా వాహనాలు నిషేధం

40. రాత్రివేళ బయట రోడ్డుపై నడిచేటపుడు ….. దుస్తులు
A) ప్రతిబింబించే
B) నలుపు
C) తెలుపు
D) ఎరువు
జవాబు:
A) ప్రతిబింబించే

41. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ……….. పరీక్షలు అవసరము.
A) దుస్తులు
B) కళ్ళజోడు
C) నిర్ణీత చోదక పరీక్షలు
D) లంచము
జవాబు:
C) నిర్ణీత చోదక పరీక్షలు

42. రవాణా సులభతరం కావడానికి ….. అవసరం.
A) వాహనాలు
B) క్రమబద్ధీకరణ
C) ప్రజలు
D) ఆఫీసర్లు
జవాబు:
B) క్రమబద్ధీకరణ

43. ట్రాఫిక్ జామ్ కు కారణం ప్రధానంగా ….
A) జంతువులు
B) పక్షులు
C) నిబంధనలు పాటించకపోవుట
D) నిరక్షరాస్యులు
జవాబు:
C) నిబంధనలు పాటించకపోవుట

AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య

44. హైదరాబాదు నగరంలో 2012 సంవత్సరానికి మొత్తం ప్రమాదాల సంఖ్య ……
A) 2000
B) 3000
C) 4000
D) 2577
జవాబు:
D) 2577

45. రోడ్డు భద్రత నినాదాలలో ఇది ఒకటి. ….
A) పరిమిత కుటంబం – చింతలేని కుటుంబం
B) ఇల్లాలే ఇంటికి వెలుగు
C) జీవించు – జీవించనివ్వు
D) అక్షరం ఆయుధం
జవాబు:
C) జీవించు – జీవించనివ్వు

46. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు చెల్లించాల్సిన జరిమానా …….
A) 10 వేలు
B) 5 వేలు
C) 2 వేలు
D) 200
జవాబు:
C) 2 వేలు

47. లెర్నర్ లైసెన్స్ ….. కాల పరిమితితో జారీ చేస్తారు.
A) 1 సం||
B) 1 నెల
C) 2 నెలలు
D) 6 నెలలు
జవాబు:
D) 6 నెలలు

48. రిజిస్ట్రేషన్ పత్రాలు లేనివారు ట్రాఫిక్ అధికారులు చెకింగ్ చేయునపుడు చెల్లించవలసిన జరిమానా
A) 1000
B) 2 వేలు
C) 3 వేలు
D) 4 వేలు
జవాబు:
A) 1000

49. రోడ్డు నియమాలు పాటించని వారు చెల్లించవలసిన జరిమానా
A) రూ. 200
B) రూ. 100
C) రూ. 300
D) రూ. 500
జవాబు:
B) రూ. 100

50. “నిలుపుటకు వీలులేదు” చోట వాహనాలు నిలుపుట వలన ….. ఏర్పడును.
A) తగాదాలు
B) కేసులు ధరించాలి.
C) ట్రాఫిక్ జాం
D) పోలీసులు
జవాబు:
C) ట్రాఫిక్ జాం

51. కింది వాటిలో ఏ ట్రాఫిక్ గుర్తు రెండు వైపులా వాహనాలు వెళ్ళుట నిషేధాన్ని తెలియచేస్తున్నది?
AP 9th Class Social Bits Chapter 24 రోడ్డు భద్రతా విద్య 3
జవాబు:
B

52. ట్రాఫిక్ గుర్తులలో “ఆరంజ్ రంగు” దీనిని సూచిస్తుంది?
A) వాహనాలు ఆగడం
B) వాహనాలు వెళ్లడానికి సిద్ధంగా ఉండడం
C) వాహనాలు కదలడం
D) వాహనాల రవాణా నిలిపివేయడం
జవాబు:
B) వాహనాలు వెళ్లడానికి సిద్ధంగా ఉండడం

53. ని చూపబడిన ట్రాఫిక్ గుర్తు
A) కుడి చేయి మలుపు
B) కుడివైపు తలపిన్ను మలుపు
C) ఎడమవైపు తలపిన్ను మలుపు
D) కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు
జవాబు:
D) కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు

II. జతపరచుము :
i)

గ్రూపు -ఎగ్రూపు – బి
1. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడంA) 18 సంవత్సరాలు
2. రోడ్డు ప్రమాదాలుB) వాహనం నడిపేవారికి ఉండవలసినది.
3. పాదచారులుC) కాలిబాట
4. డ్రైవింగ్ లైసెన్స్D) యుక్త వయస్సు
5. 50 సి.సి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలుE) ట్రాఫిక్

జవాబు:

గ్రూపు -ఎగ్రూపు – బి
1. ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడంE) ట్రాఫిక్
2. రోడ్డు ప్రమాదాలుD) యుక్త వయస్సు
3. పాదచారులుC) కాలిబాట
4. డ్రైవింగ్ లైసెన్స్B) వాహనం నడిపేవారికి ఉండవలసినది.
5. 50 సి.సి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలుA) 18 సంవత్సరాలు

ii)

గ్రూపు – ఎగ్రూపు – బి
1. హెల్మెట్A) పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం
2. జీబ్రా క్రాసింగ్B) ఆగాలని సూచిస్తుంది
3. ఎరుపు రంగుC) రక్షిత ప్రయాణం
4. ఆరెంజ్ రంగుD) వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని
5. ఆకుపచ్చ రంగుE) వాహనాన్ని కదిలించమని

జవాబు:

గ్రూపు – ఎగ్రూపు – బి
1. హెల్మెట్C) రక్షిత ప్రయాణం
2. జీబ్రా క్రాసింగ్A) పాదచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం
3. ఎరుపు రంగుB) ఆగాలని సూచిస్తుంది
4. ఆరెంజ్ రంగుD) వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని
5. ఆకుపచ్చ రంగుE) వాహనాన్ని కదిలించమని