Practice the AP 9th Class Social Bits with Answers 2nd Lesson భూమి – ఆవరణములు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 2nd Lesson భూమి – ఆవరణములు

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్లో వ్రాయండి.

1. భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
C) 4

2. లితోస్ఫియర్ అనగా
A) శిలావరణం
B) జలావరణం
C) వాతావరణం
D) జీవావరణం
జవాబు:
A) శిలావరణం

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

3. లితో అంటే గ్రీకు. భాషలో
A) రాయి
B) నీరు
C) వాయువు
D) జీవం
జవాబు:
A) రాయి

4. హ్యడర్ అనగా గ్రీకు భాషలో
A) రాయి
B) నీరు
C) వాయువులు
D) జీవం
జవాబు:
B) నీరు

5. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా
A) శిలావరణం
B) జలావరణం
C) వాతావరణం
D) జీవావరణం
జవాబు:
C) వాతావరణం

6. వాతావరణంలోని ప్రధాన వాయువులు
A) ప్రాణవాయువు
B) నత్రజని
C) బొగ్గుపులుసు వాయువు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

7. బయోస్ అనగా
A) రాయి
B) వాయువు
C) జీవం
D) నీరు
జవాబు:
C) జీవం

8. మొదటి శ్రేణి భూస్వరూపానికి ఉదాహరణ.
A) మహాసముద్రాలు
B) ఖండాలు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

9. రెండవ శ్రేణి భూస్వరూపాలకు ఉదా :
A) మైదానాలు
B) పీఠభూములు
C) కొండలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

10. యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్ల ఏర్పడిన పర్వతాలు
A) హిమాలయాలు
B) రాకీపర్వతాలు
C) ఆండీస్ పర్వతాలు
D) ఏదీకాదు
జవాబు:
A) హిమాలయాలు

11. సిసిలీలోని అగ్నిపర్వతం
A) స్ట్రాంబోలి
B) మౌంట్ పీలే
C) మౌంట్ వెసూవియస్
D) ఫూజియామా
జవాబు:
A) స్ట్రాంబోలి

12. ఫ్యూజియామా అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు.
A) సిసిలి
B) వెండీస్
C) ఇటలీ
D) జపాన్
జవాబు:
D) జపాన్

13. ఇటలీలో అగ్నిపర్వతం
A) స్ట్రాంబోలి
B) మౌంట్ పీలే
C) వెసూవియస్
D) ఫూజియామా
జవాబు:
C) వెసూవియస్

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

14. భారతదేశం నందలి అగ్ని పర్వతాలు
A) ఏంజెల్
B) గ్రాండ్ కాన్యన్
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

15. నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూ శాస్త్రవేత్తలు ఈ విధంగా వర్గీకరించారు.
A) ప్రథమశ్రేణి
B) ద్వితీయశ్రేణి
C) తృతీయ శ్రేణి
D) ఏదీకాదు
జవాబు:
C) తృతీయ శ్రేణి

16. కింద సన్నగా, పైన వెడల్పుగా ఉండే లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు.
A) V ఆకారపు లోయ
B) L ఆకారపు లోయ పిలుస్తారు.
C) D ఆకారపు లోయ
D) ఏదీకాదు
జవాబు:
A) V ఆకారపు లోయ

17. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని కోస్తూ ఏర్పరచిన సన్నటి లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు.
A) గార్జెస్
B) లోయస్
C) వల్కనోస్
D) V ఆకారపు లోయ
జవాబు:
A) గార్జెస్

18. కర్ణాటక రాష్ట్రంలోని శరావతి నదిపై గల జలపాతం
A) జోగ్
B) కుంతల
C) ఎంజెల్
D) నయాగరా
జవాబు:
A) జోగ్

19. గంగానది జన్మస్థానం –
A) మహాబలేశ్వర్
B) నాసికాత్రయంబక్
C) గంగ్రోతి
D) మానససరోవర్
జవాబు:
C) గంగ్రోతి

20. ప్రపంచంలో ఎత్తైన జలపాతం
A) ఎంజెల్
B) నయాగరా
C) కుంతల
D) జోగ్
జవాబు:
A) ఎంజెల్

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

21. భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పైపొర
A) శిలావరణము
B) జీవావరణము
C) వాతావరణము
D) జలావరణము
జవాబు:
A) శిలావరణము

22. స్పెయిరా అనగా
A) త్రిభుజము
B) గోళం (బంతి)
C) శంఖువు
D) దీర్ఘచతురస్రము
జవాబు:
B) గోళం (బంతి)

23. ‘అట్మాస్’ అన్న గ్రీకు పదానికి అర్థం ……
A) పవనం
B) నీరు
C) ఆవిరి
D) శిల
జవాబు:
C) ఆవిరి

24. ఫలకాల కదలికను …… అంటారు.
A) ఖండాలు
B) అంగారా
C) గోండ్వానా
D) ఫలక చలనాలు
జవాబు:
D) ఫలక చలనాలు

25. ప్రపంచ అతి పెద్ద అగాధదరి ………
A) బారెన్
B) నార్కొండం
C) గెరసొప్ప
D) మధ్యధరా
జవాబు:
B) నార్కొండం

26. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం
A) అంటార్కిటికా
B) నింబస్
C) ఏంజెల్
D) జోగ్
జవాబు:
D) జోగ్

27. జోగ్ జలపాతం …… నదిపై కలదు.
A) శరావతి
B) మహేంద్ర
C) మహానది
D) కృష్ణా
జవాబు:
A) శరావతి

28. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ……
A) గోమతి
B) సుందర్బన్
C) శరావతి
D) గోదావరి
జవాబు:
B) సుందర్బన్

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

29. రంగ బహపత నదులు బంగాళాఖాతంలో కలిసేచోట ఏర్పడిన డెల్టా
A) సింధూ
B) గంగా
C) సుందర్బన్
D) పద్మానది
జవాబు:
C) సుందర్బన్

30. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం జోగ్ లేదా జెరొసొప్పా ……. రాష్ట్రంలో ఉంది.
A) తమిళనాడు
B) ఆంధ్రప్రదేశ్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక
జవాబు:
D) కర్ణాటక

31. వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపు తిరిగి మేట వేసి ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు.
A) ఆక్స్-బౌ సరస్సు
B) స్నేక్ లోయలు
C) పీస్ లోయ
D) సీన్ లోయ
జవాబు:
A) ఆక్స్-బౌ సరస్సు

32. హిమానీనదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని ఇలా పిలుస్తారు.
A) మోరైన్లు
B) సబ్ మెరైన్లు
C) దిబ్బలు
D) లోయలు
జవాబు:
A) మోరైన్లు

33. గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన అగాధదరి
A) వల్కనొ
B) బైసన్ గార్జ్
C) అగాధాలు
D) లోయలు
జవాబు:
B) బైసన్ గార్జ్

34. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్ళి వేరే భూముల మీద వేయును. ఆ నేలను ఈ పేరుతో పిలుస్తారు. ……
A) బైసన్ గార్జ్
B) అగాధాలు
C) లోయస్ మైదానాలు
D) సముద్రతీర ప్రాంతాలు
జవాబు:
C) లోయస్ మైదానాలు

35. మూడవ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ
A) పీఠభూమి
B) అగ్నిపర్వతాలు
C) పర్వతాలు
D) లోయలు
జవాబు:
D) లోయలు

36. భూగర్భం నుండి బయటికి వచ్చిన శిలాద్రవం, ఒక శంఖాకార పర్వతం వలె ఏర్పడిన దానిని ………… అంటారు.
A) శిలాశైథిల్యం
B) అగ్నిపర్వతం
C) కఠినశిల
D) పీఠభూమి
జవాబు:
B) అగ్నిపర్వతం

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

37. కరిగిన శిలాద్రవం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడిన ………. అంటారు.
A) కొండలు
B) లోయలు
C) అగ్నిశిలలు
D) పీఠభూములు
జవాబు:
C) అగ్నిశిలలు

38. ఫిలిప్పైన్స్ లోని అగ్నిపర్వతం పేరు ………
A) మౌంట్ లీ
B) ఆక్స్-బౌ
C) వెసూవియస్
D) మాయన్
జవాబు:
D) మాయన్

39. రెండువైపులా నిటారుగా రాళ్ళు ఉండి, ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతము
A) గార్జెస్
B) లోయ
C) కఠినశిల
D) మైదానము
జవాబు:
A) గార్జెస్

40. ‘గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి …… ప్రాంతానికి వీచును.
A) లోయలు
B) అల్పపీడనం
C) భూమధ్యరేఖ
D) పీఠభూములు
జవాబు:
B) అల్పపీడనం

41. ఈ నాగరికత శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం
A) మెసొపొటోమియా
B) హరప్పా
C) గ్రీకు
D) సింధు
జవాబు:
C) గ్రీకు

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

42. గ్రీకు అక్షరం (∆) దీనిని ఇలా పిలుస్తారు.
A) లోయ
B) పీఠభూమి
C) మైదానం
D) డెల్టా పేరు
జవాబు:
D) డెల్టా పేరు

43. సాధారణంగా భూకంపాలు సంభవించడానికి గల కారణం …….
A) ఫలక చలనాలు
B) క్రమక్షయం
C) అల్పపీడనం
D) అధికపీడనం
జవాబు:
A) ఫలక చలనాలు

44. భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు ………
A) మైదానం
B) అగ్నిపర్వత లావా
C) సారవంతమైనవి
D) శిలాద్రవం
జవాబు:
B) అగ్నిపర్వత లావా

45. భూమి లోపలికి పోయేకొలది ప్రతి ………. మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
A) 1000
B) 50
C) 32
D) 100
జవాబు:
C) 32

46. భూమి క్రమక్షయం ప్రధానంగా వీటి వలన జరుగుతుంది.
A) పీఠభూములు
B) అగ్నిపర్వతాలు
C) ఫలకల కదలికలు
D) గాలి, నీరు
జవాబు:
D) గాలి, నీరు

47. సముద్రఅలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల …… ఏర్పడతాయి.
A) బీట్లు
B) మైదానాలు
C) లోయలు
D) ఓడరేవులు
జవాబు:
A) బీట్లు

48, గ్రీకు పదం ‘ఓరెస్’ అనగా
A) వర్షపాతం
B) కొండ
C) ఆర్థత
D) పవనము
జవాబు:
B) కొండ

49. క్రింది పటంలో ‘ఖండతీరపు అంచు’ను సూచించు సంఖ్యను గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు 1
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1

50. క్రియాశీల అగ్నిపర్వతాలు ఎక్కువగా ఎక్కడ వుంటాయి?
A) పెద్ద నది సముద్రంలో ప్రవేశించే ప్రాంతంలో
B) ‘టెక్టానిక్’ ఫలక సరిహద్దుల వద్ద
C) మహాసముద్రాలు భూభాగాన్ని కలిసే ప్రాంతం దగ్గర
D) పర్వతశ్రేణులు మరియు ఉన్నత భూముల మధ్య
జవాబు:
B) ‘టెక్టానిక్’ ఫలక సరిహద్దుల వద్ద

51. ఏ రెండు భూ ఫలకాలు నెట్టుకోవటం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి?
A) ఇండో – ఆస్ట్రేలియా ఫలకం
B) ఇండో – ఆఫ్రికన్ ఫలకం
C) ఇండో – అరేబియన్ ఫలకం
D) ఇండో – యురేషియా ఫలకం
జవాబు:
D) ఇండో – యురేషియా ఫలకం

52. దక్కన్ పీఠభూమిలో ఆంధ్రప్రదేశ్ కలదు. దక్కన్ పీఠభూమి ఏర్పడడానికి కారణం
A) నదులచే శిలలు శైథిల్యం చెందుట వలన
B) గాలిచే ఇసుక రేణువులు మేటవేయుట వలన
C) అగ్నిపర్వత విస్ఫోటనంతో వెలువడిన లావా వలన
D) భూకంపాలచే కొండచరియలు విరిగి పడడం వలన
జవాబు:
C) అగ్నిపర్వత విస్ఫోటనంతో వెలువడిన లావా వలన

53. పుట్టగొడుగు రాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఏర్పడతాయి?
AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు 3
A) ఎడారి
B) సముద్ర
C) హిమానీనదాలు
D) నదీలోయలు
జవాబు:
A) ఎడారి

54. గాలి, నీటి ప్రభావంచే ఏర్పడే భూస్వరూపాలను ‘మూడవ శ్రేణి భూస్వరూపాలంటారు’.
కింది జతలలో మూడవ శ్రేణి భూస్వరూపాలకి సంబం ధించినది ఏది?
A) ఖండములు, సముద్రములు
B) ఖండములు, పర్వతములు
C) పీఠభూములు, జలపాతాలు
D) డెల్టా, లోయెస్ మైదానం
జవాబు:
D) డెల్టా, లోయెస్ మైదానం

55-56 ప్రశ్నలకు పటం ఆధారంగా సమాధానం గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు 2

55. పసిఫిక్ అగ్నివలయంతో సంబంధం లేని దేశం ( ) గల ప్రాంతం దగ్గర
A) దక్షిణ అమెరికా
B) ఆసియా
C) ఆఫ్రికా
D) ఆస్ట్రేలియా
జవాబు:
C) ఆఫ్రికా

56. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువ క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉండడానికి కారణం
A) ఇది నదీ పరివాహక ప్రాంతం
B) భూ ఫలకల సరిహద్దులు ఉండడం
C) లోతైన సముద్రం
D) నీరు, భూమి కలిసే ప్రాంతం
జవాబు:
B) భూ ఫలకల సరిహద్దులు ఉండడం

57. ప్రత్యేకంగా పారిశ్రామిక విప్లవం తరువాత భూ ఉపరితలాన్ని మార్చివేయడంలో మానవులు ప్రధాన పాత్రను కలిగి ఉన్నారు. ఈ స్టేట్ మెంట్ ను సమర్థించని మానవ కార్యకలాపము
A) ఇటుకలు, సిమెంటుతో నగరాలు నిర్మించుకోవడము
B) వ్యవసాయం చేయడము
C) చేపలు పట్టడము
D) గనులు తవ్వడము
జవాబు:
C) చేపలు పట్టడము

58. క్రింది చిత్రాన్ని పరిశీలించండి.
AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు 4
చిత్రంలో చూపబడిన ‘V’ ఆకారపు భూస్వరూపం ఏ ప్రభావం వల్ల ఏర్పడుతుంది?
A) నీటి ప్రభావం వల్ల
B) గాలి ప్రభావం వల్ల
C) శిలా ప్రభావం వల్ల
D) మానవుల ప్రభావం వల్ల
జవాబు:
A) నీటి ప్రభావం వల్ల

59. మనందరం భూమి మీద నివసిస్తున్నాం. భూమికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యం
A) భూమి మూడు ప్రధానమైన పొరలుగా ఉన్నది.
B) భూమి చరిత్రలో సగం కాలం నిర్జీవంగా గడిచింది.
C) భూమి అనేక దశలలో మార్పు చెంది. ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది.
D) ప్రస్తుతం ఎటువంటి మార్పులకూ లోనుకాని స్థిర దశకు చేరుకుంది.
జవాబు:
D) ప్రస్తుతం ఎటువంటి మార్పులకూ లోనుకాని స్థిర దశకు చేరుకుంది.

60. సరియైన వరుస క్రమాన్ని గుర్తించండి.
A) ఖండభాగం చీలికలు కావడం, సముద్రం ఏర్పడడం, పగులులోయ ఏర్పడటం.
B) పగులులోయ ఏర్పడటం, ఖండభాగం చీలికలు కావడం, సముద్రం ఏర్పడడం.
C) ఖండభాగం చీలికలు కావడం, పగులులోయ ఏర్పడటం, సముద్రం ఏర్పడడం.
D) సముద్రం ఏర్పడడం, పగులులోయ ఏర్పడటం, ఖండభాగం చీలికలు కావడం.
జవాబు:
C) ఖండభాగం చీలికలు కావడం, పగులులోయ ఏర్పడటం, సముద్రం ఏర్పడడం.

61. భూమి మీద అత్యంత తాజాగా ఏర్పడిన పై పొరను క్రింది వానిలో ఏది కలిగి ఉంటుంది?
A) సముద్ర గర్భము
B) మహాసముద్రాల మధ్య ప్రాంతంలోని మిట్టలు
C) అత్యున్నత పర్వతాల పై భాగము
D) డెల్టాలు
జవాబు:
B) మహాసముద్రాల మధ్య ప్రాంతంలోని మిట్టలు

62. భూగర్భ శాస్త్రవేత్తలు హిమాలయాలలో సముద్రజీవుల శిలాజాలను కనుగొన్నారు. ఈ శిలాజాలు హిమాలయా లలో ఉండటానికి కారణం
A) ఆ శిలాజాలు హిమాలయాలలోనే ఏర్పడటం.
B) హిమాలయాలు సముద్రం నుంచి ఏర్పడటం.
C) ఇటువంటి కొన్ని శిలాజాలను ఇళ్ళలో ‘సాలగ్రామాలు’గా పూజించడం.
D) హిమాలయాలు అత్యున్నత పర్వతాలు కావడం.
జవాబు:
B) హిమాలయాలు సముద్రం నుంచి ఏర్పడటం.

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

63. ఫలకాలు నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. పర్వత శ్రేణులు ఏర్పడటం ఈ విధమైన కదలికల ఫలితమే. హిమాలయ పర్వతశ్రేణులు ఈ క్రింది ఏ కదలిక వలన ఏర్పడాయి?
A) అరేబియా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టడం వల్ల
B) యూరేసియా ఫలకాన్ని అరేబియా ఫలకం నెట్టడం వల్ల
C) ఇండియా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టడం వల్ల
D) ఇండియా ఫలకాన్ని అరేబియా ఫలకం నెట్టడం వల్ల
E) యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల
జవాబు:
E) యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల

64. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్ని పర్వతాలలో ప్రతి నాల్గింట మూడు పసిఫిక్ మహాసముద్రం అంచునే ఉన్నాయి. దీనికి కారణం.
A) పసిఫిక్ మహాసముద్ర అంచుకు పసిఫిక్ అగ్ని వలయం అనే పేరు ఉండటం.
B) పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా అగ్ని శిలలు ఉండటం.
C) పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉండటం.
D) పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా భూకంపాలు సంభవించడం.
జవాబు:
C) పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉండటం.

65. మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి క్రింది వానిని జతపరచండి.

1) లోయలు a. వాతావరణ ప్రభావం
2) చెక్కబడిన కొండలు b. మేట వేయడం
3) డెల్టాలు c. రేణువుల రవాణా
4) ఇసుక పర్వతాలు d. నేలకోత

A) 1-a; 2-b; 3-C; 4-d
B) 1-b; 2-C; 3-d; 4 – a
C) 1-d; 2-a, 3-b; 4-C
D) 1-a; 2 – b; 3-d; 4 – a
జవాబు:
C) 1-d; 2-a, 3-b; 4-C

66. ఉష్ణమండల ఎడారులు ఖండాల యొక్క పడమర అంచులలోనే ఏర్పడుటకు కారణం
A) తూర్పున వర్షించిన వాణిజ్య పవనాలు తేమలేని స్థితిలో పశ్చిమానికి చేరడం వల్ల
B) తూర్పున వర్షించిన పశ్చిమ పవనాలు తేమలేని స్థితిలో పశ్చిమానికి చేరడం వల్ల
C) ఖండాల పశ్చిమ అంచులలో అల్పపీడన ప్రాంతాలు ఉన్నందున
D) ఖండాల మీద కంటే సముద్రాల మీద ఎక్కువ వర్షాలు పడుతున్నందు వలన
జవాబు:
C) ఖండాల పశ్చిమ అంచులలో అల్పపీడన ప్రాంతాలు ఉన్నందున

67. ప్రవహిస్తున్న నీటి శక్తికి సంబంధించి క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
A) నేలను కోతకు గురి చేయగలదు.
B) రాళ్ళను నిదానంగా కరిగించగలదు.
C) కొండను నిలువునా కోతకు గురి చేయగలదు.
D) పై వాక్యాలన్నీ సరైనవే. తప్పు వాక్యమేది లేదు.
జవాబు:
D) పై వాక్యాలన్నీ సరైనవే. తప్పు వాక్యమేది లేదు.

68. ఈ కింది వానిలో రెండవ శ్రేణి భూస్వరూపానికి చెందినది
A) ఖండాలు
B) సముద్రాలు
C) పర్వతాలు
D) ఇసుకదిబ్బలు
జవాబు:
C) పర్వతాలు

69. ‘ఫ్యూజియామా’ అగ్నిపర్వతం ఈ దేశంలో కలదు
A) ఫ్రాన్స్
B) ఇటలీ
C) జపాన్
D) భారతదేశం
జవాబు:
C) జపాన్

70. “ఇండస్ గార్జ్” ఈ రాష్ట్రంలో కలదు
A) పశ్చిమ బెంగాల్
B) పంజాబ్
C) హిమాచల్ ప్రదేశ్
D) జమ్మూ & కాశ్మీర్
జవాబు:
D) జమ్మూ & కాశ్మీర్

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

71. హిమానీనదాల వల్ల ఏర్పడే భూస్వరూపం
A) గార్జ్
B) జలపాతం
C) ‘U’ ఆకారపు లోయ
D) ఏదీకాదు
జవాబు:
C) ‘U’ ఆకారపు లోయ

72. జతపరచండి.

1. నది ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపం A. లోయస్ మైదానాలు
2. గాలిచర్యల వల్ల ఏర్పడే భూస్వరూపం B. డెల్టా
3. అలల వల్ల ఏర్పడే భూస్వరూపం C. సముద్రపు తోరణాలు

A) 1 – B, 2 – A, 3-C
B) 1 – A, 2 – C, 3 – B
C) 1 – C, 2 – B, 3-A
D) 1 – B, 2 – C, 3-A
జవాబు:
A) 1 – B, 2 – A, 3-C

II. జతపరచుము :

i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. లితో A) గోళం
2. హ్యడర్ B) జీవం
3. అట్మాస్ C) రాయి
4. బయోస్ D) నీరు
5. స్పేయిరా E) వాయువు

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. లితో C) రాయి
2. హ్యడర్ D) నీరు
3. అట్మాస్ E) వాయువు
4. బయోస్ B) జీవం
5. స్పేయిరా A) గోళం

AP 9th Class Social Bits Chapter 2 భూమి – ఆవరణములు

ii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ప్రపంచంలో అతి పెద్ద అగాధదరి A) స్ట్రాంబోలి
2. పసిఫిక్ అగ్నివలయం B) మౌంట్ వెసూవియస్
3. సిసిలీ C) అగ్నిపర్వతాలు
4. వెండీస్ D) మౌంట్ పీలే
5. ఇటలీ E) గ్రాండ్ కాన్యన్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ప్రపంచంలో అతి పెద్ద అగాధదరి E) గ్రాండ్ కాన్యన్
2. పసిఫిక్ అగ్నివలయం C) అగ్నిపర్వతాలు
3. సిసిలీ A) స్ట్రాంబోలి
4. వెండీస్ D) మౌంట్ పీలే
5. ఇటలీ B) మౌంట్ వెసూవియస్

iii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. జపాన్ A) కిలిమంజారో
2. ఈక్వెడార్ B) బారెన్, నార్కొండం
3. ఫిలిప్పీన్స్ C) మాయన్
4. భారతదేశం D) కోటోపాక్సీ
5. టాంజానియా E. ఫ్యూజియామా

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. జపాన్ E. ఫ్యూజియామా
2. ఈక్వెడార్ D) కోటోపాక్సీ
3. ఫిలిప్పీన్స్ C) మాయన్
4. భారతదేశం B) బారెన్, నార్కొండం
5. టాంజానియా A) కిలిమంజారో